రీసెంట్ టైంలో సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివిటీ కనిపిస్తుంది. ఎంతలా అంటే తెలుగు హీరోలు ఎవరినీ వదట్లేదు. అసభ్యకర కామెంట్స్ కావొచ్చు, దారుణమైన ట్రోల్స్ చేయడం లాంటివి కనిపిస్తూనే ఉన్నాయి. దీంతో చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ తదితరులు తమ వ్యక్తిగత హక్కుల పరిరక్షణ కోసం ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు. ఆంధ్ర, తెలంగాణలోనూ హైకోర్టులు ఉన్నప్పటికీ ఢిల్లీ ఎందుకు వెళ్లారు? కారణమేంటి?
అయితే వ్యక్తిగత హక్కుల రక్షణ కోసం ఢిల్లీ హైకోర్టుని సెలబ్రిటీలు ప్రధానంగా ఎంపిక చేసుకోవడం వెనక పెద్ద కారణమే ఉంది. ఈ విషయంలో ఇక్కడైతే వీలైనంత త్వరగా ఆదేశాలు వస్తాయి. ఇలాంటి చాలా పిటిషన్లని గతంలో ఇక్కడ విచారించడం కూడా కారణమని చెప్పొచ్చు. అలానే అక్కడ తీర్పు వస్తే దేశవ్యాప్తంగా అందరికీ తెలియడానికి అవకాశముంది.
(ఇదీ చదవండి: ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించిన పవన్ కల్యాణ్)
సోషల్ మీడియాలో ప్రధానంగా ఉపయోగించే ఫ్లాట్‌ఫామ్స్, కంపెనీలు హెడ్ ఆఫీస్‌లు దాదాపుగా ఢిల్లీలోనే ఉన్నాయి. ఒకవేళ తీర్పు వచ్చిన తర్వాత సమాచారం వాళ్లకు తెలియడం కూడా సులభం అవుతుంది. అలానే వ్యక్తిగత హక్కుల్ని డీల్ చేసే చాలా ఏజెన్సీలు అక్కడే ఉండటం కూడా దీనికి ఓ కారణం. ఇందువల్లే సెలబ్రిటీలు ఢిల్లీ హైకోర్టుని ఎంచుకుంటున్నారు.
గత కొన్నాళ్లుగా చూసుకుంటే చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ లాంటి స్టార్స్.. హైకోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకుంటున్నారు. రాబోయే రోజుల్లో మిగతా పేరున్న నటీనటులు కూడా ఇలానే వ్యక్తిగత హక్కుల రక్షణకు సంబంధించి ఏర్పాట్లు చేసుకుంటారు. కాబట్టి యువత.. ఇకపై సోషల్ మీడియాలో ఏ నటుడు లేదా నటి గురించి ఏదైనా కామెంట్ చేసేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేయండి. లేదంటే కోర్ట్ ఆర్డర్స్ వల్ల కటకటాలపాలయ్యే అవకాశముంది. కాబట్టి బీ కేర్ ఫుల్!
(ఇదీ చదవండి: 'అఖండ 2'కి హైదరాబాద్‌లోనే 3 కోట్ల టికెట్స్ సేల్.. ఇదెక్కడి అతి!?)


