హారర్ థ్రిల్లర్ ‘జిన్’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌! | Jinn Movie Release Date Out | Sakshi
Sakshi News home page

హారర్ థ్రిల్లర్ ‘జిన్’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌!

Dec 12 2025 4:07 PM | Updated on Dec 12 2025 4:36 PM

Jinn Movie Release Date Out

ఈ రోజుల్లో వైవిధ్యభరితమైన కథలు ఏ రేంజ్ రెస్పాన్స్ అందుకుంటున్నాయో చూస్తూనే ఉన్నాం. కథలో స్టఫ్ ఉండాలే గానీ, కొత్త నటీనటులైనా సరే సినిమా సూపర్ సక్సెస్ అవుతోంది. సరిగ్గా అదే ఫార్ములాను తీసుకొని ఓ డిఫరెంట్ జానర్ లో "జిన్" అనే ఓ సరికొత్త సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ మూవీని రూపొందిస్తున్నారు డైరెక్టర్ చిన్మయ్ రామ్. ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తీసుకొని దాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించారు. ఈ సినిమాలో అమిత్ రావ్ హీరోగా నటిస్తుండగా.. సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై నిఖిల్ ఎమ్ గౌడ నిర్మిస్తున్నారు. వరదరాజ్ చిక్కబళ్లాపుర డైలాగ్స్ అందిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి బయటకొచ్చిన పోస్టర్స్, వీడియోస్ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకోవడమే గాక అంచనాలు నెలకొల్పాయి. ఈ నేపథ్యంలో మంచి హైప్ నడుమ ఈ చిత్రాన్ని తెలుగులో డిసెంబర్ 19న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ చిత్రంలో పర్వీజ్ సింబా, ప్రకాష్ తుంబినాడు, రవి భట్, సంగీత, బాల్రాజ్ వాడి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అలెక్స్ సంగీతం అందిస్తున్నారు. 

ఈ సినిమాకు జిన్ అనే టైటిల్ ప్లస్ పాయింట్. కథనే కాదు టైటిల్ లో కూడా వైవిద్యం ఉండటంతో ఈ సినిమా సులువుగా ప్రేక్షకులకు రీచ్ అయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ సహా కథకు యాప్ట్ అయ్యే పలు లొకేషన్స్ లో ఈ సినిమా షూటింగ్ చేశారు. ఖర్చుకు నిర్మాతలు ఎక్కడా వెనక్కి తగ్గలేదట. స్ట్రాంగ్ కంటెంట్, దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం చాలా బాగుందని, ఈ మూవీ థియేటర్స్ సూపర్ సక్సెస్ కావడం పక్కా అని చిత్రయూనిట్ ఎంతో నమ్మకంగా చెబుతోంది. సస్పెన్స్ థ్రిల్లర్ హారర్ మూవీస్ ఎన్నో చూసి ఉంటాం కానీ ఇది అన్నింటిలో డిఫరెంట్ అవుతుందని అంటున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement