ధురంధర్‌ 2 ఛాన్స్‌ వస్తే వదిలేసుకున్నా: నటుడు | Anil Kapoor Explains Why He Rejected Role In Aditya Dhar Dhurandhar 2, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

ధురంధర్‌ 2లో నటించే ఆఫర్‌.. రిజెక్ట్‌ చేసిన ప్రముఖ నటుడు

Mar 14 2026 9:00 AM | Updated on Mar 14 2026 10:14 AM

Anil Kapoor Says he Rejected Dhurandhar 2 cameo

గతేడాది చివర్లో వచ్చిన ధురంధర్‌ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సృష్టించింది. ఆదిత్య ధర్‌ డైరెక్టర్‌ చేసిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. రణ్‌వీర్‌ సింగ్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో సారా అర్జున్‌ కథానాయిక. ఆర్‌ మాధవన్‌, సంజయ్‌ దత్‌, అక్షయ్‌ ఖన్నా, అర్జున్‌ రాంపాల్‌ కీలక పాత్రలు పోషించారు.

ధురంధర్‌: రివేంజ్‌లో ఛాన్స్‌
అయితే మూడు నెలలు కూడా తిరగకముందే ధురంధర్‌ పార్ట్‌ 2 వచ్చేస్తోంది. మార్చి 19న 'ధురంధర్‌: రివేంజ్‌' రిలీజ్‌ కానుంది. మొదటి భాగం బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ కాబట్టి ఎవరైనా సరే సీక్వెల్‌లో ఛాన్స్‌ వస్తే ఎగిరి గంతేస్తారు. కానీ ఈ బాలీవుడ్‌ నటుడు మాత్రం తనకు ఛాన్స్‌ వచ్చినా రిజెక్ట్‌ చేశాడట!

డేట్స్‌ లేవని..
ఆయన మరెవరో కాదు, అనిల్‌ కపూర్‌. తాజాగా ఆయన ఓ ఈవెంట్‌లో మాట్లాడుతూ.. ధురంధర్‌ 2 సినిమాలో యాక్ట్‌ చేయమని దర్శకుడు ఆదిత్య నన్ను సంప్రదించాడు. అతిథి పాత్ర ఉంది, చేస్తావా? అని అడిగాడు. కానీ అప్పటికే నా డేట్స్‌ ఖాళీగా లేవు. వేరే సినిమాలతో బిజీగా ఉన్నాను. నీ సినిమాలో చేయాలనుంది, కానీ నేను ఖాళీగా లేను అని చెప్పి తిరస్కరించాను. ఆ మూవీ కోసం అప్పటికే ఒప్పుకున్న ప్రాజెక్టులను నేను పక్కనపెట్టలేను. 

కుదర్లేదు
ఆ నిబద్ధత వల్లే నేను ఇంతకాలం ఇండస్ట్రీలో ఉన్నాను. కేవలం టాలెంట్‌ ఒక్కటే మన స్థాయిని నిర్ణయించదు. కాకపోతే ధురంధర్‌ మూవీ అనేది మంచి ఆఫర్‌.. కానీ, ఏం చేద్దాం.. చేయడం కుదర్లేదు. భవిష్యత్తులో ఆదిత్యతో కలిసి పని చేస్తాననుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు. అనిల్‌ కపూర్‌ చివరగా 'సుబేదార్‌' సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో అందుబాటులో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement