వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యంగ్ సెన్సేషన్ తిరువీర్, నటి ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘ఓ.. సుకుమారి’ .
గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వరరెడ్డి మూలి నిర్మిస్తున్న ఈ రూరల్ రొమాంటిక్ కామెడీ చిత్రంతో భరత్ దర్శన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు.


