breaking news
Thiruveer
-
తండ్రైన టాలీవుడ్ హీరో.. సోషల్ మీడియాలో పోస్ట్
టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టిన తిరువీర్.. 'మసూద', 'పరేషాన్' చిత్రాలతో అభిమానులను మెప్పించాడు. అంతేకాకుండా జార్జ్ రెడ్డి, టక్ జగదీష్ సినిమాల్లో విలన్‌గా ఆకట్టుకున్నాడు. ఇటీవలే రిలీజైన 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' అనే చిత్రంతో అభిమానులను అలరించారు. టాలీవుడ్లో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.తాజాగా తిరువీర్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. తాను తండ్రైనట్లు సోషల్ మీడియా వేదికగా రివీల్ చేశారు. నాయినొచ్చిండు అంటూ ఆనందం వ్యక్తం చేస్తూ ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు తిరువీర్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు.తెలుగు సినిమాల్లో హీరోగా, సహాయ పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న తిరువీర్. తెలంగాణకు చెందిన తిరువీర్ 'మసూద' మూవీతో మంచి ఫేమ్ సొంతం చేసుకున్నాడు. 2016 నుంచి ఇండస్ట్రీలో ఉన్న ఇతను.. ఘాజీ, మల్లేశం, జార్జ్ రెడ్డి, పలాస, టక్ జగదీష్, పరేషాన్, మోక్షపటం చిత్రాల్లో నటించారు.గతేడాది కల్పన అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు తిరువీర్. ఈ ఏడాది మార్చిలో సొంతూరిలో కొత్త ఇంట్లోకి అడుగుపెట్టాడు. 'రెండు దశాబ్దాల కల, అమ్మ చివరి కోరిక' అని తన ఇంటి ఫొటోలని కూడా షేర్ చేశాడు. ఆగస్టులో తన తిరువీర్ భార్య కల్పన సీమంతం వేడుక చేశారు. అలా తిరువీర్ తండ్రి కాబోతున్న విషయం అందరికీ తెలిసింది. నాయినొచ్చిండు ❤️ pic.twitter.com/7IzM5OAE03— Thiruveer (@iamThiruveeR) December 12, 2025 -
ఓటీటీలోకి లేటెస్ట్ కామెడీ హిట్ సినిమా
అన్నిసార్లు పెద్ద సినిమాలే కాదు అప్పుడప్పుడు చిన్న మూవీస్ కూడా అద్భుతాలు చేస్తుంటాయి. ప్రేక్షకుల్ని మనసారా నవ్విస్తాయి. అలాంటి ఓ చిత్రమే 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో'. తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నటించిన ఈ సినిమాని ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ స్టోరీతో తెరకెక్కించారు. రాహుల్ శ్రీనివాస్ అనే కొత్త దర్శకుడు తీసినప్పటికీ తొలి ఆట నుంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడీ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయిపోయింది.ప్రీ వెడ్డింగ్ షూటింగ్ చేసిన మెమొరీ కార్డ్ పోతే.. ఓ ఫొటోగ్రాఫర్ ఎలాంటి తిప్పలు పడ్డాడు? దీని నుంచి వచ్చే కామెడీ అనే సింపుల్ పాయింట్‌తో తీసిన సినిమా ఇది. చెబుతుంటే స్టోరీ ఇంతేనా అనిపిస్తుంది గానీ చూస్తున్నప్పుడు మాత్రం మంచి కామెడీతో అలరిస్తుంది. నవంబరు 7న థియేటర్లలోకి రాగా పాజిటివ్ టాక్‌తో పాటు డీసెంట్ కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ చిత్రాన్ని డిసెంబరు 5 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. థియేటర్లో మిస్ అయినోళ్లు ఓటీటీలోకి వచ్చాక తప్పక చూడండి.(ఇదీ చదవండి: మళ్లీ వచ్చేశాడు.. 'ద ఫ్యామిలీ మ్యాన్ 3' రివ్యూ)'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' విషయానికొస్తే.. పల్లెటూరిలో ప్రీ వెడ్డింగ్ షూట్ చేయడంలో ఆరితేరిన ఫొటోగ్రాఫర్ రమేశ్ (తిరువీర్). స్టూడియోకి ఎదురుగా ఉండే పంచాయతీ ఆఫీస్‌లో పనిచేసే హేమ(టీనా శ్రావ్య)ని ఇష్టపడుతంటాడు. ఆమెకీ రమేశ్ అంటే ఇష్టమే. కట్ చేస్తే రమేశ్ దగ్గరకు ప్రీ వెడ్డింగ్ షూట్ కోసమని ఆనంద్(నరేంద్ర రవి) వస్తాడు. రాజకీయ కుటుంబానికి చెందిన యువకుడు ఆనంద్. షూట్ అంతా అయ్యాక మెమరీ కార్డ్ తన దగ్గర పనిచేసే సహాయకుడు రాము(మాస్టర్ రోహన్) చేతికి రమేశ్ ఇస్తాడు.ఆ కుర్రాడేమో మెమొరీ చిప్ ఎక్కడో పడేస్తాడు. అప్పటినుంచి రమేశ్‌కి కష్టాలు మొదలవుతాయి. చిప్ లేదనే సంగతి ఆనంద్కి తెలిస్తే ఏమవుతుందోననే భయం ఓవైపు రమేశ్‌ని వెంటాడుతూ ఉంటుంది. మరోవైపు ఈ గండం నుంచి బయటపడాలి. ఈ విషయంలో రమేశ్‌కి హేమ ఏం సాయం చేసింది? చివరకు మెమొరీ చిప్ దొరికిందా లేదా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: సారీ చెప్పిన 'రాజు వెడ్స్ రాంబాయి' డైరెక్టర్) -
నవ్వులే నవ్వులు
తిరువీర్, ఐశ్వర్యా రాజేశ్ జంటగా కొత్త సినిమా షురూ అయింది. ఈ చిత్రం ద్వారా భరత్ దర్శన్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. తొలి సినిమా ‘శివమ్ భజే’తో ప్రేక్షకులని అలరించిన గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తున్న ద్వితీయ చిత్రం ఇది.‘‘హిలేరియస్ ఎంటర్టైనర్గా రూపొందనున్న చిత్రమిది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాని ఒకేసారి రిలీజ్ చేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: సీహెచ్ కుషేందర్, సంగీతం: భరత్ మంచిరాజు. -
నవ్వుల బంతి భోజనంలా ‘ప్రీ వెడ్డింగ్ షో’.. తిర్వీర్ ఆనందం
రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వంలో తిరువీర్, టీనా శ్రావ్య జోడీగా మాస్టర్ రోహన్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’. సందీప్ అగరం, అస్మితా రెడ్డి బాసిని నిర్మించారు. కల్పనా రావు సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా శుక్రవారం విడుదలై హిట్ టాక్ని సంపాదించుకుంది. ఇటీవల కాలంలో వచ్చిన బెస్ట్ కామెడీ చిత్రమిదని సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. సోషల్ మీడియాలోనూ ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దీంతో ఈ సినిమాకు బుకింగ్స్ నెమ్మదిగా పెరుగుతున్నాయి. బుకింగ్స్ పెరగడం పట్ల హీరో తీర్వీర్ ఆనందం వ్యక్తం చేశాడు‘‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ మూవీ కోసం మేం ఆర్థికంగా చాలా కష్టపడ్డాం. ఈ ప్రయాణంలో మీడియా మాకు అండగా నిలిచింది. మా సినిమాపై ఎక్కడా ఒక్క నెగెటివ్ కామెంట్ కనిపించలేదు. మా చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు, ప్రోత్సహిస్తున్న మీడియా, సోషల్ మీడియాకు ధన్యవాదాలు’’ అని తిరువీర్ చెప్పారు. -
‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ మూవీ రివ్యూ
మూవీ: ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షోనటీనటులు: తిరువీర్, టీనా శ్రావ్య, నరేంద్ర రవి, యామిని నాగేశ్వర్, వాల్తేర్ విజయ్, ప్రభావతి, మాధవి, జోగారావు, బ్యాక్ భాషా తదితరులునిర్మాణ సంస్థ: 7పీఎం ప్రొడక్షన్, పప్పెట్ షో ప్రొడక్షన్నిర్మాత: అగరం సందీప్రచన, దర్శకత్వం: రాహుల్ శ్రీనివాస్సంగీతం: సురేష్ బొబ్బిలిసినిమాటోగ్రఫి: సోమశేఖర్ఎడిటర్: నరేష్ అడుపవిడుదల తేది: నవంబర్ 7, 2025కథేంటంటే.. విజయనగరం జిల్లాకు చెందిన రమేశ్(తీరువీర్) ఓ ఫోటోగ్రాఫర్. ఊర్లోనే ఓ ఫోటో స్టూడియో పెట్టుకొని పెళ్లిళ్లతో పాటు ఇతర కార్యక్రమాల ఫోటోలు తీస్తుంటాడు. అతని అసిస్టెంట్ రామ్(రోహన్ రాయ్)కి పనిమీద కంటే తిండిమీదే ధ్యాస ఎక్కువ. రామ్ చేసే చిన్న చిన్న తప్పులను పట్టించుకోకుండా..తన స్టూడియోకి ఎదురుగా ఉన్న పంజాయితీ ఆఫీస్‌లో పనిచేసే హేమ(టీనా శ్రావ్య)ను ప్రేమిస్తూ ఉంటాడు రమేశ్. హేమకు కూడా రమేశ్ అంటే ఇష్టమే కానీ..ఒకరికొకరు బయటకు చెప్పుకోకుండా చూపులతోనే ప్రేమించుకుంటూ జీవితాన్ని హాయిగా గడిపేస్తుంటారు. కట్ చేస్తే.. ఓ రోజు అదే ప్రాంతానికి చెందిన ఆనంద్(నరేంద్ర రవి) రమేశ్ స్టూడియో దగ్గరకు వచ్చి.. జిల్లాలోనే ది బెస్ట్ ప్రీవెడ్డింగ్ షూట్ చేయాలని అడ్వాన్స్ ఇచ్చివెళ్లిపోతారు. ఔట్‌డోర్‌లో షూటింగ్ అంటే..తనకు కాబోయే భార్య సౌందర్య(యామిని)తీసుకొని జిల్లాకు వెళ్తాడు. దాదాపు లక్షన్నర వరకు ఖర్చు చేయించి..షూట్ కంప్లీట్ చేస్తాడు. ఆ షూట్ ఫుటేజ్ చిప్‌ని తన అసిస్టెంట్ రామ్ కి ఇచ్చి..స్టూడియోలో పెట్టమని చెప్తాడు. పనిపై ఎక్కువ శ్రద్ధ పెట్టని రామ్.. ఆ చిప్‌ని ఎక్కడో పారేస్తాడు. ఈ విషయం ఆనంద్‌కు తెలిస్తే..ఎక్కడ చంపేస్తాడో అనే భయంతో రమేశ్ కీలక నిర్ణయం తీసుకుంటాడు. అదేంటి? తన నిర్ణయం తప్పని తెలిసిన తర్వాత రమేశ్ ఏం చేశాడు? ఆనంద్, సౌందర్యల పెళ్లి ఆగిపోవడానికి గల కారణం ఏంటి? రమేశ్ తీసుకున్న నిర్ణయం ఆయనతో పాటు ఆనంద్ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించింది? ఈ సమస్య నుంచి బయటపడేందుకు రమేశ్‌కు హేమ ఎలాంటి సహాయం చేసింది? చివరకు ఆనంద్, సౌందర్యల పెళ్లి జరిగిందా? లేదా? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలకు పెద్ద కథ అవరసరం లేదు. సింపుల్ స్టోరీ అయినా సరే.. చెప్పాలనుకునే పాయింట్‌ని సిన్సియర్‌గా తెరపై చూపిస్తే చాలు.. ఆ సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారు. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమా కూడా ఆ కోవకు చెందిన చిత్రమే. దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ చాలా సింపుల్ కథను ఎంచుకొని.. కమర్షియల్ ఎలిమెంట్స్, ఎలివేషన్స్ జోలికి పోకుండా.. లీనియర్ స్క్రీన్ ప్లేతో ఎక్కడ బోర్ కొట్టించకుండా కథనాన్ని నడిపించాడు. నటీనటుల ఎంపిక విషయంలోనూ ఆయన సక్సెస్ అయ్యాడు. స్టార్స్‌ని కాకుండా కంటెంట్‌ని నమ్ముకొని ఈ సినిమాను తెరకెక్కించాడు. ఒక్క సంఘటన మనిషి జీవితాన్ని ఎలా మారుస్తుంది? సందర్భాన్ని బట్టి మనిషి స్వభావం ఎలా మారుతుందనే విషయాన్ని కామెడీ వేలో చక్కగా చూపించారు. ఈ సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు వినోదాత్మకంగానే సాగుతుంది. ఎమోషనల్ సన్నివేశాలు తక్కువే ఉన్నప్పటికీ.. అవి అలా గుర్తిండిపోతాయి. ఫస్టాఫ్ మొత్తం వినోదాత్మకంగా సాగుతుంది. ఆనంద్, సౌందర్యల ప్రీ వెడ్డింగ్ షూట్.. చిప్ పోవడం.. ఆ విషయాన్ని కప్పిపుచ్చేందుకు హీరో చేసే ప్రయత్నాలు...ఇవన్నీ నవ్వులు పూయిస్తాయి. పెళ్లి చెడగొట్టేందుకు హీరో చేసే ప్రయత్నాలు..కొంతవరకు సాగదీతగా అనిపిస్తాయి. సెకండాఫ్‌లో కథనాన్ని పరుగులు పెట్టించాడు. కామెడీతో పాటు ఎమోషనల్ సీన్లను కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. ఆనంద్, సౌందర్యలు విడిపోవడానికి గల కారణం నవ్విస్తూనే..ఆలోచింపజేస్తూంది. ఆటో సీన్‌తో అందరిని ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్‌లో హీరో చెప్పే డైలాగ్స్ భావోద్వేగానికి గురి చేస్తాయి. సినిమాలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ.. అవేవి పట్టించుకోకుండా చూస్తే.. అందరికీ నచ్చేస్తుంది. కామెడీ పేరుతో వల్గారిటీని చూపిస్తున్న ఈ రోజుల్లో.. ఎలాంటి వల్గారిటీ లేకుండా ఫ్యామిలీ మొత్తం కలిసి చూసేలా ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు. ఈ విషయంలో ఆయనను అభినందించాల్సిందే. ఎవరెలా చేశారంటే.. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథలను ఎంచుకోవడంలో తీరువీర్ దిట్ట. ఈ సారి కూడా అలాంటి కథతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఫోటోగ్రాఫర్ రమేశ్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. తెరపై అమాయకత్వంగా కనిపిస్తూనే..హీరోయిజాన్ని పండించాడు. ఇక ఈ సినిమాలో బాగా పండిన పాత్ర నరేంద్ర రవిది. పెళ్లికొడుకు ఆనంద్ పాత్రలో ఆయన జీవించేశాడు. నవ్విస్తూనే కొన్ని చోట్ల భావోధ్వేగానికి గురి చేస్తాడు. హేమా పాత్రకు టీనా శ్రావ్య న్యాయం చేసింది. చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్ రాయ్ మరోసారి తనదైన నటనతో నవ్వులు పూయించాడు. యామిని నాగేశ్వర్, వాల్తేర్ విజయ్, ప్రభావతి, మాధవి, జోగారావుతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక నిపుణులకొస్తే సురేశ్ బొబ్బిలి సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన నేపథ్య సంగీతంతో సినిమా స్థాయిని పెంచేశాడు. పాటలు బాగున్నాయి. సోమశేఖర్ సినిమాటోగ్రఫీ చక్కగా ఉంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
ప్రీ వెడ్డింగ్ షూటింగ్ చేసిన మెమొరీ కార్డ్ పోతే?
ఒకప్పుడు పెళ్లంటే పెళ్లి మాత్రమే. ఇప్పుడు పెళ్లి అంటే అంతకంటే ముందు చాలా ఉంటాయి. అందులో ప్రీ వెడ్డింగ్ షూట్ ఒకటి. ఇప్పుడు ఈ కాన్సెప్ట్‌పై తెలుగులో ఓ కామెడీ సినిమా తీశారు. అదే 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో'. మసూద మూవీ ఫేమ్ తిరువీర్ హీరోగా నటిస్తున్నాడు. టీనా శ్రావ్య హీరోయిన్. రాహుల్ శ్రీనివాస్ దర్శకుడు. నవంబర్ 7న మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా తాజాగా ట్రైలర్ లాంచ్ చేశారు. ఇది బాగానే నవ్విస్తోంది.(ఇదీ చదవండి: మహేశ్ ఫ్యామిలీ నుంచి 'ఏడుగురు' వారసులు)ట్రైలర్ బట్టి చూస్తే.. పల్లెటూరిలో ఉండే హీరో ఓ ఫొటోగ్రాఫర్. ఓసారి ఓ జంటకు ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తాడు. అనుకుని పరిస్థితుల్లో షూట్ చేసిన ఫుటేజీ ఉన్న మెమొరీ కార్డ్ పోతుంది. తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఈ గండం నుంచి హీరో ఎలా బయటపడ్డాడనేదే స్టోరీలా అనిపిస్తుంది. ట్రైలర్ అయితే నవ్విస్తోంది. కామెడీ కూడా సహజంగా కుదిరింది. మరి మూవీ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి?నవంబర్ 7న రష్మిక 'ద గర్ల్ ఫ్రెండ్', సుధీర్ బాబు 'జటాధర' చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. వీటితోపాటు ఈ సినిమా కూడా రానుంది. మరి మూడింటిలో ఏది ప్రేక్షకుల్ని అలరిస్తుందో చూడాలి. ఇదే తేదీన తమిళ డబ్బింగ్ బొమ్మ 'ఆర్యన్' కూడా తెలుగులో విడుదల కానుంది.(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా) -
‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ (ఫొటోలు)
-
తల్లి చనిపోయిన విషయం దాచి షూటింగ్ చేశాడు.. తిరువీర్‌పై దర్శకుడు ప్రశంసలు!
తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నటించిన తాజా చిత్రం ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’(The Great Pre Wedding Show ). సందీప్ అగరం, అశ్మితా రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 7న ఈ మూవీని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ మేరకు నిర్వహించిన ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కి దర్శకులు కరుణ కుమార్, యదు వంశీ, ఆదిత్య హాసన్, రామ్ అబ్బరాజు, సన్నీ, దుశ్యంత్, ఉదయ్ గుర్రాల, రూపక్, తేజ, నంద కిషోర్ వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.ఈ సందర్భంగా దర్శకుడు కరుణ కుమార్ మాట్లాడుతూ .. ‘తిరువీర్‌ను నేను ఓ నాటకంలో చూశాను. నేను మూవీ తీస్తే తిరువీర్‌కి పాత్ర ఇవ్వాలని ఫిక్స్ అయ్యాను. ‘పలాస’లో మూడు పాత్రలు అనుకున్నప్పుడు అందులో తిరువీర్ ఉండాలని అనుకున్నాను. ‘పలాస’ కోసం మేం ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాం. తల్లి చనిపోయినా కూడా తిరువీర్ ఆ విషయాన్ని మాకు చెప్పకుండా షూటింగ్లో సీన్ చేశాడు. అలా తిరువీర్ మాకు ఎంతో సహకరించారు. డెబ్యూగా సినిమాలు తీసేటప్పుడు మేకర్లకు ఉండే కష్టాలు మా అందరికీ తెలుసు. ఈ చిత్రం వంద శాతం బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. రూటెడ్ కథల్నే ఆడియెన్స్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు. నవంబర్ 7న ఈ చిత్రం రాబోతోంది. అందరూ తప్పకుండా చూడండి’ అని అన్నారు.హీరో తిరువీర్ మాట్లాడుతూ .. దర్శకుడు రాహుల్ ఈ కథ చెప్పినప్పుడు కంటిన్యూగా నవ్వుతూనే ఉన్నాను. ఎంతో సరదాగా షూటింగ్ చేశాం. ఫ్యామిలీ అంతా కలిసి టూర్‌కు వెళ్లినట్టుగా షూటింగ్ చేశాం. మంచి కంటెంట్‌తో మా ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ నవంబర్ 7న రాబోతోంది. మా చిత్రం అందరికీ నచ్చుతుంది. మా సినిమాను ఆడియెన్స్ ఆదరిస్తారని ఆశిస్తున్నాను. మాకు అండగా నిలిచిన జీ సంస్థకు థాంక్స్. ’ అని అన్నారు.చిత్ర దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ మాట్లాడుతూ .. ‘‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ సినిమాకి ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్‌లో హీరో తిరువీర్. మా ట్రైలర్ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. ట్రైలర్‌కు వంద రెట్లు అనేట్టుగా సినిమా ఉంటుంది. అందరినీ ఎంటర్టైన్ చేసేలా మా చిత్రం ఉంటుంది. నవంబర్ 7న మా సినిమాను అందరూ చూడండి’ అని అన్నారు.అనగనగా దర్శకుడు సన్నీ మాట్లాడుతూ .. ‘‘పరేషాన్’లో తిరువీర్ యాక్టింగ్ నాకు చాలా ఇష్టం. అన్ని రకాల ఎమోషన్స్‌ను తిరు అద్భుతంగా పలికిస్తారు. తనకంటూ ఓ మార్క్‌ను తిరు క్రియేట్ చేసుకున్నారు. అందరికీ కనెక్ట్ అయ్యే కథతో తీసిన ఈ ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు. ‘దర్శకుడు రాహుల్ ఈ మూవీని అద్భుతంగా తీశారు. నవంబర్ 7న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని చిత్ర నిర్మాత సందీప్ అగరం అన్నారు. -
'సలార్' కాటేరమ్మ ఫైట్‌లో నేనే చేయాలి.. కానీ
పాన్ ఇండియా ట్రెండ్ పెరిగిన తర్వాత ప్రభాస్ నుంచి వరస సినిమాలు వస్తూనే ఉన్నాయి. అయితే ఈయన చేసిన సలార్, ఫౌజీ చిత్రాల్లో తనకు అవకాశాలొచ్చినా కొన్ని కారణాల వల్ల మిస్ అయ్యాయని తెలుగు యంగ్ హీరో తిరువీరు చెబుతున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాల్ని పంచుకున్నాడు.(ఇదీ చదవండి: అఫీషియల్.. ఎట్టకేలకు ఓటీటీలోకి 'ఫ్యామిలీ మ్యాన్ 3')'ప్రభాస్ 'సలార్' కాటేరమ్మ ఫైట్‌లో విలన్‌గా నేనే చేయాలి. కానీ డేట్స్ సమస్య కారణంగా అది మిస్ అయింది. అలానే 'ఫౌజీ'లోనూ మంచి ఆఫర్ వచ్చింది. కానీ వేరే సినిమాలు, లుక్ కంటిన్యూటీ కారణంగా వాటిని వదులుకోవాల్సి వచ్చింది' అని తిరువీర్ చెప్పుకొచ్చాడు.టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టిన తిరువీర్.. 'మసూద', 'పరేషాన్' చిత్రాలతో లీడ్ రోల్స్ చేశాడు. జార్జ్ రెడ్డి, టక్ జగదీష్ సినిమాల్లో విలన్‌గా ఆకట్టుకున్నాడు. త్వరలో 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' అనే మూవీతో రాబోతున్నాడు. దీని ప్రమోషన్లలో భాగంగానే మాట్లాడుతూ తను చేస్తున్న సినిమాలు వల్ల ప్రభాస్ సలార్, ఫౌజీలో అవకాశాలు మిస్ అయ్యాయని చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: టాలీవుడ్‌పై 'మోంథా' ప్రభావం ఎంతవరకు?) -
Pre Wedding Show: ఆకట్టుకుంటున్న‘వయ్యారి వయ్యారి’ సాంగ్
తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నటించిన చిత్రం ‘ప్రీ వెడ్డింగ్ షో’. రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ’. బై 7PM , పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్లపై సంయుక్తంగా సందీప్ అగరం, అశ్మితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నవంబర్ 7న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి వయ్యారి వయ్యారి’ అంటూ సాగే ఓ క్యాచీ లవ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. సనారే సాహిత్యం అందరికీ అర్థమయ్యేలా, ఆకట్టుకునేలా ఉంది. ఇక యశ్వంత్ నాగ్, సింధూజ శ్రీనివాసన్ గాత్రం ఈ పాటకు మరింత ప్రత్యేకతను చేకూర్చింది. సురేష్ బొబ్బిలి బాణీ శ్రోతల్ని ఇట్టే ఆకట్టుకునేలా ఉంది. ‘వయ్యారి వయ్యారి’ అంటూ సాగే ఈ పాటకు సంబంధించిన లిరికల్ వీడియో చూస్తుంటే హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, లవ్ ట్రాక్ సినిమాలో హైలెట్ అయ్యేలా కనిపిస్తోంది.ఈ చిత్రానికి కెమెరామెన్‌గా కె. సోమ శేఖర్, ఎడిటర్‌గా నరేష్ అడుప, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ప్రజ్ఞయ్ కొణిగారి పని చేశారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న మేకర్లు.. త్వరలోనే రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. -
‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ మూవీ టీజర్ విడుదల (ఫొటోలు)
-
'పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్'.. ఫుల్ ఎంటర్టైనింగ్గా టీజర్
మసూద ఫేమ్ తిరువీర్ నటించిన తాజా చిత్రం ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో(The Great Pre Wedding Show). ఈ చిత్రాన్ని ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీకి రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదల చేశారు మేకర్స్.ఈ సినిమా టీజర్‌ను రౌడీ హీరో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా విడుదల చేశారు. తాజాగా రిలీజైన టీజర్ చూస్తే ఫుల్‌గా ఎంటర్టైన్ చేసేలా ఉంది. ఈ చిత్రంలో తిరువీర్ ఫోటోగ్రాఫర్ పాత్రలో కనిపించారు. పెళ్లిళ్లు, ఫంక్షన్స్‌కు ఫోటోలు, వీడియోలు తీస్తూ నవ్వులు పూయించారు. ఈ రోజుల్లో ప్రీ వెడ్డింగ్ షూట్స్‌పై ఫన్నీగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది.ఈ చిత్రంలో టీనా శ్రావ్య, మాస్టర్ రోహన్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీని 70ఎం ప్రొడక్షన్స్ బ్యానర్లో సందీప్ అగరం, అశ్మితా రెడ్డి బసాని నిర్మించారు. ఈ సినిమాకు సురేష్ బొబిల్లి సంగీతమందించారు. ఈ సినిమా నవంబరు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.I have known @iamThiruveeR from before the world knew me :) and I am so happy to see him live his dreams!Here is the teaser of #TheGreatPreWeddingShowA very interesting and relatable premise which Looks like a breezy ride! Best wishes to Thiruveer and the entire team 🤗 pic.twitter.com/oJQiPj8wbe— Vijay Deverakonda (@TheDeverakonda) September 16, 2025 -
తండ్రి కాబోతున్న తెలుగు హీరో.. భార్యకు సీమంతం
మరో తెలుగు హీరో తండ్రి కాబోతున్నాడు. అయితే అతడు ఈ విషయాన్ని బయటపెట్టలేదు. 'బలగం' ఫేమ్ కావ్య కల్యాణ్ రామ్.. ఈ శుభకార్యానికి వెళ్లింది. కాబోయే తల్లిదండ్రులకు విషెస్ చెబుతూ పోస్ట్ పెట్టింది. అలా ఈ గుడ్ న్యూస్ అందరికీ తెలిసింది. దీంతో సదరు హీరోకి నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు)తెలుగు సినిమాల్లో హీరోగా, సహాయ పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న నటుడు తిరువీర్. తెలంగాణకు చెందిన ఈ కుర్రాడు.. 'మసూద' మూవీతో మంచి ఫేమ్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఒకటి రెండు చిత్రాల్లో హీరోగా చేస్తున్నాడు. 2016 నుంచి ఇండస్ట్రీలో ఉన్న ఇతడు.. ఘాజీ, మల్లేశం, జార్జ్ రెడ్డి, పలాస, టక్ జగదీష్, మసూద, పరేషాన్, మోక్షపటం సినిమాలు చేశాడు. పర్లేదనిపించేలా గుర్తింపు తెచ్చుకున్నాడు.వ్యక్తిగత విషయానికొస్తే గతేడాది కల్పన అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ ఏడాది మార్చిలో సొంతూరిలో కొత్త ఇంట్లోకి అడుగుపెట్టాడు. 'రెండు దశాబ్దాల కల, అమ్మ చివరి కోరిక' అని తన ఇంటి ఫొటోలని కూడా షేర్ చేశాడు. ఇప్పుడు తిరువీర్ భార్య కల్పన ప్రెగ్నెన్సీతో ఉంది. సోమవారం నాడు సీమంతం వేడుక చేశారు. ఈ ఫొటోలని కావ్య కల్యాణ్ రామ్ షేర్ చేసింది. అలా తిరువీర్ తండ్రి కాబోతున్న విషయం అందరికీ తెలిసింది.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న 'కోర్ట్' దర్శకుడు.. అమ్మాయి ఎవరంటే?) -
కొత్తింట్లో అడుగుపెట్టిన 'మసూద' హీరో (ఫోటోలు)
-
అమ్మ చివరి కోరిక.. కొత్త ఇంట్లోకి తెలుగు యంగ్ హీరో
తెలుగులో పలు సినిమాల్లో సహాయ పాత్రలు, మరికొన్ని చిత్రాల్లో హీరోగా నటించి గుర్తింపు తెచ్చుకున్న నటుడు తిరువీర్. తెలంగాణకు చెందిన ఈ కుర్రాడు.. రీసెంట్ టైంలో 'మసూద' మూవీతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఒకటి రెండు చిత్రాల్లో హీరోగా నటిస్తున్నాడు. అలాంటిది తల్లి చివరి కోరిక తీర్చానని చెప్పి ఆసక్తికర పోస్ట్ పెట్టాడు.(ఇదీ చదవండి: బెట్టింగ్ ప్రమోషన్స్: ఒక్కో వీడియోకు ఎంత రెమ్యునరేషన్..?)2016 నుంచి నటుడిగా అడపాదడపా సినిమాలు చేస్తున్న తిరువీర్.. ఇన్నాళ్లకు సొంతూరిలో ఇల్లు కట్టుకున్నాడు. తాజాగా తన భార్యతో కలిసి గృహప్రవేశం చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలని తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. 'రెండు దశాబ్దాల కల, అమ్మ చివరి కోరిక' అని తన ఇంటి ఫొటోలు షేర్ చేసుకుని మురిసిపోయాడు. పరేషాన్, టక్ జగదీష్, పలాస్ 1978, జార్జ్ రెడ్డి తదితర చిత్రాల్లోనూ తిరువీర్ నటించాడు. సిన్, మెట్రో కథలు, కుమారి శ్రీమతి తదితర వెబ్ సిరీసుల్లోనూ కనిపించాడు. గతేడాది కల్పన అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు సొంతిల్లు కట్టుకుని తల్లి చివరి కోరికని నెరవేర్చాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సుకుమార్ కూతురి సినిమా) -
నా కోసం కథలు రాయడం ఆనందంగా ఉంది: తిరువీర్
జార్జ్ రెడ్డి, పలాస 1978 వంటి చిత్రాలలో తన దైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు తిరువీర్. ఆ తరువాత మసూద, పరేషన్ వంటి చిత్రాలలో ప్రధాన పాత్రలో ప్రేక్షకులను మరింతగా మెప్పించారు. ఇక తిరువీర్ కెరీర్లో మసూద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం తిరువీర్ పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం తిరువీర్ 'ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో' అనే చిత్రంలో ఫోటోగ్రాఫర్ పాత్రలో కనిపించనున్నారు. రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్గా ఉండబోతోంది.తిరువీర్ తన కొత్త చిత్రం గురించి మాట్లాడుతూ.. “వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ పాత్రను పోషించడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మొబైల్‌తో చాలాసార్లు ఫోటోలు తీశాను. కానీ ఇలా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్‌గా నటించడం చాలా కొత్తగా, ఛాలెంజింగ్‌గా అనిపిస్తోంది. స్టిల్స్ ఎలా పెట్టించాలి, కెమెరాను ఎలా పట్టుకోవాలి ఇలా చాలా విషయాల్ని నేర్చుకున్నాను. అందరినీ ఎంటర్టైన్ చేసేలా ఈ చిత్రం ఉంటుంద’ని అన్నారు.రీసెంట్గా ఈ మూవీ షూటింగ్ అరకులో జరిగింది. అక్కడి చలి తీవ్రతను తట్టుకుని మరి టీం అంతా ఎంతో కష్టపడి సినిమాను షూట్ చేశారు. ఈ సినిమాతో పాటుగా తిరువీర్ ‘భగవంతుడు’ అనే మరో ప్రాజెక్ట్‌ని కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలకు సంబంధించిన షూటింగ్‌తో తిరువీర్ ప్రస్తుతం బిజీగా ఉన్నారు.తిరువీర్ తన కొత్త సినిమాల గురించి మాట్లాడుతూ..‘మసూద తర్వాత చాలా సెలెక్టివ్‌గా సినిమాల్ని, కథల్ని ఎంచుకుంటున్నాను. నాకు సరిపోయే కథల్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నాను. నేను స్టేజ్ ఆర్టిస్ట్‌ని కావడంతో ఆయా పాత్రలకు న్యాయం చేయగలుగుతున్నాను. దర్శకనిర్మాతలు నా కోసం పాత్రలు, కథలు రాస్తుండటం ఆనందంగా ఉంది. ఇదే ఓ నటుడికి గొప్ప విజయం’ అని అన్నారు. -
సంక్రాంతి స్పెషల్.. పండుగ రోజే ఓటీటీకి వచ్చేసిన కొత్త సినిమా!
సంక్రాంతి పండుగ అంటే కేవలం పిండి వంటలే కాదు.. మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి. కోడి పందేలతో పాటు సినిమాలు కూడా ఎంజాయ్ చేయాలి. ఇప్పటికే థియేటర్లలో గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు సందడి చేస్తున్నాయి. స్టార్ హీరోల ఫ్యాన్స్ అంతా ఇప్పటికే థియేటర్లకు క్యూ కడుతున్నారు.మరి ఫ్యామిలీతో ఎంచక్కా ఇంట్లోనే సినిమాలు వీక్షించాలనుకునే వారికి ఓటీటీలు రెడీ బోలెడు ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాయి. ఇటీవల విడుదలైన సినిమాలతో పాటు మీకిష్టమైన చిత్రాలు చూసేయొచ్చు. అలాంటి వారికోసమే సంక్రాంతి పండుగ సందర్భంగా ఓటీటీకి వచ్చేసింది తెలుగు సినిమా. అదేంటో మీరు ఓ లుక్కేయండి.సంక్రాంతి పండుగ రోజున ఓ తెలుగు చిత్రం డైరెక్ట్‌గా ఓటీటీలోకి అడుగుపెట్టేస్తోంది. యంగ్ హీరో తిరువీర్ నటించిన చిత్రం మోక్ష పటం. ఈ సినిమా ఇప్పటి వరకు థియేటర్లలో రిలీజ్ కాలేదు. ఈ సంక్రాంతి ఫెస్టివల్ స్పెషల్ నేరుగా ఓటీటీలోనే అడుగుపెట్టింది. ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఈ రోజు నుంచే ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా.. ఈ చిత్రానికి రాహుల్ వనజ రాజేశ్వర్ దర్శకత్వం వహించారు.ఈ చిత్రంలో పూజా కిరణ్, తరుణ్ పొనుగోటి, జెన్నిఫర్ ఇమ్మూన్యుయేల్, శాంతి రావ్ కీలక పాత్రలు పోషించారు. కామెడీ అండ్ క్రైమ్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని దర్శకుడు రాజేశ్వర్ తెరకెక్కించారు. ఈ చిత్రానికి రవి గోలీ, లక్ష్మణా, రాహుల్ కథను అందించారు. నేస్తమా మూవీ మేకర్స్ పతాకంపై ప్రవీణ్ గడ్డం, సాయి, తారపరెడ్డి నిర్మించారు. ఈ సినిమాకు కమ్రాన్ సంగీతమందించారు. A mysterious bag changes Gayatri's life forever. Will it bring fortune or trouble? Watch #Mokshapatam now!▶️https://t.co/xnqpEPAm3H#MokshapatamOnAha #Trailer #Comedy #Crime @iamThiruveeR @ShantiRaoDqd @pooja_kiran @JeniferEmmanu11 @hithisistarun @ursguruofficial @syedkamran… pic.twitter.com/LBiE7fjgqx— ahavideoin (@ahavideoIN) January 14, 2025 -
Thiruveer Marriage: పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరో తిరువీర్ (ఫొటోలు)
-
రెండు ప్రపంచాలు
‘జార్జిరెడ్డి’, ‘పలాస’, ‘మసూద’ వంటి చిత్రాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన నటుడు తిరువీర్ మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ద్రిష్టి తల్వార్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించనున్నారు. డార్క్ కామెడీ జానర్లో ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమాకు రాజ్ విరాట్ దర్శకత్వం వహించనున్నారు. ఏ మూన్ షైన్ పిక్చర్స్‌పై సాయి మహేష్ చందు, సాయి శశాంక్ నిర్మించనున్న ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది. ‘‘రెండు వేర్వేరు ప్రపంచాల కలయికగా, యూనిక్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా ఉంటుంది. వినోదాత్మక చిత్రంగా ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: లియోన్ జేమ్స్. -
ప్రతి సినిమాకు అదే అసలైన బలం : విశ్వక్ సేన్
‘చరిత్ర సృష్టించే సినిమాలకు బడ్జెట్ ఇంత ఉండాలనే అవసరం లేదని ‘పెళ్ళి చూపులు, అర్జున్ రెడ్డి, బలగం, మసూద, ఫలక్‌నుమా దాస్’ వంటి ఎన్నో చిత్రాలు నిరూపించాయి. సినిమాకు ఎంత బడ్జెట్ పెట్టామనేది చూస్తుంటారు చాలామంది. కానీ ఆ చిత్రంలో పనిచేస్తున్న వాళ్లు ఎంత ప్రతిభావంతులు అనేది చూస్తే అదే సినిమాకు అసలైన బలం. ‘రామన్న యూత్’ చిత్రానికి అలాంటి మ్యాజిక్ జరగాలి.ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది’’ అని హీరో విశ్వక్ సేన్ అన్నారు. అభయ్ నవీన్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘రామన్న యూత్’. అమూల్య రెడ్డి హీరోయిన్గా చేశారు. ఫైర్ ఫ్లై ఆర్ట్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న విడుదలవుతోంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడకకి విశ్వక్ సేన్, నటులు ప్రియదర్శి, తిరువీర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో తిర్వీర్ మాట్లాడుతూ.. ‘ఒకప్పుడు నాతో కలిసి ఆటోలో తిరిగిన అభయ్ నవీన్ ఇప్పుడు ఇలా సినిమా చేశాడని అంటే ఆనందంగా ఉంది. డబ్ స్మాష్ ద్వారా చాలా వీడియోలు చేసేవాడు. కలిసి సినిమాలో నటించాం. అవకాశాల కోసం ఆడిషన్స్ ఇచ్చిన అభయ్..ఇప్పుడు డైరెక్టర్ అయి మా ఫ్రెండ్స్ కు అవకాశాలు ఇవ్వడం సంతోషంగా ఉంది’ అన్నారు. ‘నేను సినిమా చూశాను. చాలా ఫన్ ఫీలయ్యా, అలాగే కొన్ని చోట్ల సర్ ప్రైజ్ అయ్యాను. రామన్న యూత్ సినిమాలో ఒక జీవితం ఉంటుంది’ అని హీరో ప్రియదర్శి అన్నారు. ‘‘ప్రేక్షకులకు చిన్న సినిమానా? పెద్ద సినిమానా? అనేది తెలియదు. మంచి కథ ఉంటే ఆ చిత్రాన్ని తప్పకుండా చూస్తారు. ‘రామన్న యూత్’ని థియేటర్ లో చూసి ప్రోత్సహించాలి’’ అన్నారు అభయ్ నవీన్. -
ఆ ఇద్దరూ కలియుగంలోకి వస్తే?
నవీన్ బేతిగంటి, అన్వేష్ మైఖేల్, పవన్ రమేష్, దయానంద్ రెడ్డి, కుశాలిని, రోహిణి ప్రధాన పాత్రల్లో శ్రీమాన్ కీర్తి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘రాక్షస కావ్యం’. దాము రెడ్డి, శింగనమల కల్యాణ్ నిర్మాతలు. ఈ సినిమా టీజర్‌ని ‘బలగం’ దర్శకుడు వేణు యెల్దండి, హీరో తిరువీర్ విడుదల చేసి, సినిమా మంచి హిట్టవ్వాలన్నారు. శ్రీమాన్ కీర్తి మాట్లాడుతూ– ‘‘పురాణాల్లోని జయ విజయలు ఒక్కో యుగంలో ఒక్కో రాక్షసుల్లా పుట్టారు. వాళ్లు ఇప్పుడు కలియుగంలోకి వస్తే ఎలా ఉంటుంది? అనే కాల్పనిక కథతో ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు. ‘‘మా చిత్రంలో మంచి భావోద్వేగాలున్నాయి’’ అన్నారు దాము రెడ్డి. ‘‘టీజర్ ఎంత బాగుందో సినిమా అంతకంటే బాగుంటుంది’’ అన్నారు నవీన్ బేతిగంటి.. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: ఉమేష్ చిక్కు, సహనిర్మాతలు: నవీన్ రెడ్డి, వసుంధరా దేవి. -
తిరువీర్ బర్త్ డే.. 'మిషన్ తషాఫి' టీమ్ విషెస్
తెలుగు సినిమాల్లో డిఫరెంట్ పాత్రలు చేస్తూ యువ నటుడు తిరువీర్ గుర్తింపు తెచ్చుకున్నాడు. మూవీస్ చేస్తూనే ఓటీటీల్లోనూ అలరిస్తున్నాడు. ప్రస్తుతం 'మిషన్ తషాఫి' వెబ్ సిరీస్‌లో ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. దానికి సంబంధించి అనౌన్స్మెంట్ ఇప్పుడు ఇచ్చారు. తిరువీర్ బర్త్ డే సందర్భంగా పోస్టర్‌తో విషెస్ చెప్పుకొచ్చారు. (ఇదీ చదవండి: కిడ్నీ ఫెయిల్, చచ్చిపోతాననుకున్నా: హీరోయిన్) ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్ సిరీస్‌ని ప్రణతి రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తిరువీర్ బర్త్ డే సందర్బంగా 'మిషన్ తషాఫి' టీమ్ పోస్టర్ రిలీజ్ చేసింది. ప్రవీణ్ సత్తారు లాంటి డైరెక్టర్‌తో కలిసి పనిచేయటంపై తిరువీర్ సైతం ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఇండియాలో భారీ విధ్వంసాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్న ఒక విదేశీ తీవ్రవాద సంస్థకి, ఇండియన్ రా (RAW) ఏజెంట్స్‌కి మధ్య నడిచే హై ఇన్టెన్స్ యాక్షన్ స్పై థ్రిల్లర్ ఇది. 8 ఎపిసోడ్స్‌గా తీస్తున్న 'మిషన్ తషాఫి' త్వరలో జీ5లో విడుదల కానుంది. ఈ సిరీస్ లో సిమ్రాన్ చౌదరి, శ్రీకాంత్ అయ్యంగర్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. Thank you @ZEE5Telugu #thefilmrepublic ❤️ https://t.co/wsmPbxYb02 — Thiruveer (@iamThiruveeR) July 23, 2023 (ఇదీ చదవండి: ఒకానొక సమయంలో చనిపోదామనుకున్న వర్ష, త్వరలో బిగ్‌బాస్‌లోకి!) -
పరేషాన్‌తో అలాంటి అనుభూతి కలిగింది
‘‘కేరాఫ్ కంచరపాలెం, సినిమా బండి, బలగం..’ చిత్రాలు చూసినప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో.. ‘పరేషాన్’ మూవీ చూసినప్పుడు కూడా అలాంటి అనుభూతి కలిగింది. సినిమా చూస్తున్నప్పుడు మనల్ని మనం మర్చిపోతే అదే మ్యాజిక్. అలాంటి మ్యాజిక్ ‘పరేషాన్’ లో జరిగింది’’ అని డైరెక్టర్ తరుణ్ భాస్కర్ అన్నారు. తిరువీర్, పావని కరణం జంటగా రూపక్ రోనాల్డ్సన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘పరేషాన్. రానా దగ్గుబాటి సమర్పణలో సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ సినిమా జూన్ 2న విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన ‘పరేషాన్’ సక్సెస్ మీట్‌కి ముఖ్య అతిథిగా తరుణ్ భాస్కర్ హాజరయ్యారు. ‘‘లగాన్’ లాంటి టీం కలిసి చేసిన సినిమా ఇది. గెలవాలంటే లాస్ట్ బాల్కి సిక్స్ కొట్టాలి.. రానాగారు వచ్చి మాతో సిక్స్ కొట్టించారు’’ అన్నారు తిరువీర్. ‘‘పరేషాన్’ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు పావని కరణం. ‘‘పరేషాన్’కి నైజాంలో మరో 75 థియేటర్స్ పెంచుతున్నాం’’ అన్నారు రూపక్ రోనాల్డ్సన్. -
‘పరేషాన్’ మూవీ రివ్యూ
టైటిల్: పరేషాన్ నటీనటులు: తిరువీర్, పావని కరణం, బన్నీ అభిరన్, సాయి ప్రసన్న, అర్జున్ కృష్ణ, మురళీధర్ గౌడ్ తదితరులు నిర్మాత : సిద్ధార్థ్ రాళ్లపల్లి సమర్పణ: రానా దగ్గుబాటి దర్శకత్వం : రూపక్ రోనాల్డ్సన్ సంగీతం: యశ్వంత్ నాగ్ సినిమాటోగ్రఫీ: వాసు పెండమ్ ఎడిటర్ : హరిశంకర్ విడుదల తేది : జూన్ 2, 2023 ‘పరేషాన్’ కథేంటంటే.. క్రైస్తవ మతానికి చెందిన సమర్పణ్(మురళీధర్ గౌడ్) ఓ సింగరేణి ఉద్యోగి. అతని కొడుకు ఐజాక్ (తిరువీర్) తిరుగుబోతు. ఐటీఐ కూడా పాసవ్వక ఊర్లో ఆవారాగా తిరుగుతుంటాడు. కొడుకును దారిలో పెట్టేందుకు తన ఉద్యోగాన్ని అతనికి అప్పజెప్పాలనుకుంటాడు. దాని కోసం పై అధికారికి రెండు లక్షల రూపాయలు లంచంగా ఇవ్వాల్సి వస్తోంది. భార్య చేతిపై ఉన్న బంగారు గాజులు అమ్మి రెండు లక్షలను జమ చేస్తాడు. ఆ డబ్బును మధ్యవర్తికి అప్పజెప్పి రమ్మని ఐజాక్ని పంపిస్తే.. అందులో కొత ఆపదలో ఉన్న తన స్నేహితుడు పాషా(బన్నీ అభిరామ్)కు ఇస్తాడు. మిగిలిన డబ్బు మరో స్నేహితుడు ఆగమ్ సత్తి(అర్జున్ కృష్ణ)కు ఇస్తాడు. తన తండ్రికి తెలియకముందే ఆ డబ్బును మధ్యవర్తికి ఇవ్వాలని ఐజాక్ తీవ్రంగా ప్రయత్నిస్తాడు. మరోవైపు ఐజాక్ ప్రేయసి శిరీష(పావని కరణం)తో శారీరకంగా దగ్గర అవుతాడు. ఆమెకు ప్రెగ్నెన్సీ వచ్చిందనే భయంతో పట్నం వెళ్లి పరీక్షలు చేయించాలకుంటాడు. డబ్బులు జమ చేస్కోని ఫ్రెండ్ పెళ్లికి వెళ్తే.. డబ్బులు కొట్టేస్తారు. అసలు ఆ డబ్బు ఎవరు కొట్టేశారు? లంచం కోసం ఇచ్చిన డబ్బుని కొడుకు తన స్నేహితులకు ఇచ్చాడని తెలిశాక సమర్పణ్ రియాక్షన్ ఏంటి? స్నేహితులకు ఇచ్చిన డబ్బులు రాక, అదే సమయంలో ప్రేయసి ప్రెగ్నెన్సీ టెన్షన్.. వీటిని ఐజాక్ ఎలా డీల్ చేశాడు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ఈ మధ్య కాలంలో సినిమాల్లో తెలంగాణ యాస, కల్చర్‌ని ఎక్కువగా కనిపిస్తోంది. ఆ నేపథ్యంలో తెరకెక్కే చిత్రాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. పరేషాన్ మూవీ కూడా ఆ కోవలోకే వస్తుంది. మంచిర్యాలకు చెందిన ఐదుగురు సింగరేణి పోరగాళ్ల కథ ఇది. తెలంగాణ నేటివీటీతో చాలా సహజంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు రూపక్ రొనాల్డ్సన్. సినిమా టైటిల్స్ నుంచి ఎండింగ్ వరకు ప్రతీది తెలంగాణ యాస, భాషని బేస్ చేసుకొని చాలా వినోదాత్మకంగా తెరకెక్కించారు. అయితే కథలో మాత్రం కొత్తదనం లేదు. పనీపాట లేకుండా ఆవారాగా తిరిగే కొడుకు, తిట్టే తండ్రి, ఓ లవ్‌స్టోరి, చివర్లో హ్యాపీ ఎండింగ్.. ఈ తరహా నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. అయితే పరేషాన్ కూడా అలాంటి కథే.కానీ తెలంగాణ నేటివిటీని జోడించి చాలా వినోదాత్మకంగా చూపించారు. క్రైస్తవ మత ప్రార్థనలతో వినోదాత్మకంగా సినిమా ప్రారంభం అవుతుంది. ఐజాక్ స్నేహితుల నేపథ్యం, పాషా చేసే ఓ పనికి పోలీసు స్టేషన్‌దాకా అందరు వెళ్లడం, అక్కడ జరిగే కామెడీ నవ్వులు పూయిస్తుంది. ఇక స్నేహితులకు డబ్బులు ఇచ్చాక ఐజాక్ పడే పరేషాన్.. శిరీషతో ప్రేమాయణంతో ఫస్టాఫ్ కామెడీగా సాగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ పర్వాలేదు. ఇక సెకండాఫ్‌లో కథ సింపుల్‌గా, ఎలాంటి ట్విస్టులు లేకుండా సాగుతుంది. సత్తి కోసం వెతికే సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. తాగుడుకు సంబంధించిన సీన్స్ ప్రతిసారి చూపించడం ఇబ్బందిగా అనిపిస్తాయి. ఇక సత్తి వేలు తెగిన సీన్, ఐజాక్ బ్యాండ్ డ్రెస్ సీన్ థియేటర్స్‌లో నవ్వులు పూయిస్తాయి. ఎమోషనల్ సీన్స్ అంతగా వర్కౌట్ కాలేదు. ప్యూర్ తెలంగాణ నెటివిటీ, యాస కారణంగా తెలంగాణేతర ప్రేక్షకులను ఈ సినిమా అంతగా అలరించకపోవచ్చు. కానీ ఎలాంటి అంచానాలు లేకుండా థియేటర్స్‌కు వస్తే మాత్రం ‘పరేషాన్’ నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. తిరువీర్ మంచి నటుడు. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోతుంటాడు. పరేషాన్లో కూడా అంతే. ఐజాక్ పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. శిరీష పాత్రలో పావని కరణం చక్కగా నటించింది. ఆగమ్ సత్తిగా అర్జున్ కృష్ణ కొన్ని సన్నివేశాల్లో అద్భుతంగా నటించాడు. ఐజాక్ స్నేహితులు ఆర్జీవీగా రవి, మైదాన్గా, పాషాగా బన్ని అభిరామ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. యశ్వంత్ నాగ్ సంగీతం బాగుంది. సౌ సారా, ముసి ముసి నవ్వుల మంజుల పాటలు అలరిస్తాయి. నేపథ్య సంగీతం కూడా సినిమా స్థాయిని పెంచింది. వాసు పెండమ్ సినిమాటోగ్రఫి బాగుంది. తెలంగాణ పల్లె అందాలను తెరపై చక్కగా చూపించాడు. ఎడిటర్ పనితీరు పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. -
సింగరేణి పోరగాళ్ల కథే ‘పరేషాన్’: తిరువీర్
‘సింగరేణి పోరగాళ్ల కథే ‘పరేషాన్’. మంచిర్యాల ఊరుని ఒక బయోపిక్‌లా తీస్తే మా సినిమా అవుతుంది. కామెడీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో సహజమైన వినోదం ఉంటుంది’’ అని హీరో తిరువీర్ అన్నారు. రూపక్ రోనాల్డ్సన్ దర్శకత్వంలో ‘మసూద’ ఫేమ్ తిరువీర్ హీరోగా నటించిన చిత్రం ‘పరేషాన్’. రానా దగ్గుబాటి సమర్పణలో సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ సినిమా జూన్ 2న విడుదల కానుంది. (చదవండి: త్వరలో భోళా మానియా) ఈ సందర్భంగా తిరువీర్ మాట్లాడుతూ– ‘‘నేను ఎలాంటి సినిమాలు చేయాలనుకున్నానో అనుకోకుండా ఘాజీ, మల్లేశం, పలాస.. అలాంటివే కుదిరాయి. ‘మసూద’ తర్వాత ఒక స్వేచ్ఛ దొరకడంతో ఇప్పుడు ప్లాన్ చేసుకుంటున్నాను. ఎలాగైనా ‘పరేషాన్’ని జనాల్లోకి తీసుకెళ్దామని రానాగారు ముందుకు రావడంతో మా సినిమాకి బలం వచ్చింది. ప్రస్తుతం శివం సెల్యులాయిడ్ నిర్మాణంలో ఓ సినిమా, ‘బటర్ ఫ్లై’ ఫేం సతీష్‌గారితో ఓ సినిమా చేస్తున్నాను’’ అన్నారు. -
పరేషాన్ హిట్ కావాలి
‘‘యంగ్ టీమ్ అంతా ప్రేమించి ప్యూర్ ఎనర్జీతో ‘పరేషాన్’ సినిమా తీశారు. ఈ చిత్రంలో నేనూ భాగమైనందుకు గౌరవంగా భావిస్తున్నాను. ఈ చిత్రం మంచి హిట్ కావాలి. అలాగే నా తమ్ముడు అభిరామ్ నటించిన ‘అహింస’ కూడా జూన్ 2న రిలీజ్ అవుతోంది. అన్ని సినిమాలు బాగా ఆడాలి’’ అని హీరో రానా దగ్గుబాటి అన్నారు. ‘మసూద’ ఫేమ్ తిరువీర్ హీరోగా, పావని కరణం హీరోయిన్గా రూపక్ రోనాల్డ్సన్ దర్శకత్వంలో తెర కెక్కిన చిత్రం ‘పరేషాన్’. రానా దగ్గుబాటి సమర్పణలో వాల్తేర్ ప్రొడక్షన్స్‌పై విశ్వతేజ్ రాచకొండ, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించారు. ఈ చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా జూన్ 2న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఈ మూవీ ట్రైలర్‌ను రానా దగ్గుబాటి విడుదల చేశారు. ‘‘వినోదాత్మకంగా రూపొందిన చిత్రమిది’’ అన్నారు తిరువీర్. ‘‘పరేషాన్’ అందర్నీ నవ్విస్తుంది’’ అన్నారు విశ్వతేజ్ రాచకొండ, సిద్ధార్థ్ రాళ్ళపల్లి. ‘‘కుటుంబంతో కలిసి మా సినిమాకి రండి’’ అన్నారు రూపక్ రోనాల్డ్సన్. ఈ కార్యక్రమంలో పావని కరణం, సంగీత దర్శకుడు యశ్వంత్ నాగ్, సినిమాటోగ్రాఫర్ వాసు, నటుడు మురళి, గీత రచయిత చంద్రమౌళి పాల్గొన్నారు. -
వినోదాల పరేషాన్
‘మసూద’ ఫేమ్ తిరువీర్ హీరోగా నటించిన చిత్రం ‘పరేషాన్’. రూపక్ రోనాల్డ్సన్ దర్శకత్వం వహించారు. హీరో రానా దగ్గుబాటి సమర్పణలో వాల్తేర్ ప్రొడక్షన్స్‌పై సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ సినిమాని జూన్ 2న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ‘‘తెలంగాణలోని ఒక పల్లెటూరి నేపథ్యంలో సాగే చిత్రం ‘పరేషాన్’. పూర్తి వినోదాత్మకంగా ఉంటుంది. ఇప్పటికే విడుదలైన మా సినిమా టీజర్‌కు మంచి స్పందన వచ్చింది’’ అని దర్శక–నిర్మాతలు అన్నారు.పావని కరణం, బన్నీ అభిరన్, సాయి ప్రసన్న, అర్జున్ కృష్ణ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: వాసు పెండమ్, సంగీతం: యశ్వంత్ నాగ్, లైన్ ప్రొడ్యూసర్: ప్రవీణ్ విన్సెంట్, అసోసియేట్ ప్రొడ్యూసర్స్: విశ్వదేవ్ రాచకొండ, హేమ రాళ్లపల్లి. -
పీరియాడిక్ యాక్షన్ డ్రామాతో వస్తున్న 'మసూదా' హీరో
‘మసూద’ వంటి హిట్ చిత్రంతో ప్రేక్షకుల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న తిరువీర్ హీరోగా కొత్త సినిమా ప్రకటన వచ్చింది. ఈ చిత్రం ద్వారా జీజీ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఏషియన్ ఫిల్మ్స్ నారాయణ దాస్ నారంగ్ సమర్పణలో రవి పనస ఫిలిం కార్పొరేషన్ బ్యానర్‌పై వ్యాపారవేత్త రవి కుమార్ పనస నిర్మిస్తున్నారు. ‘‘పీరియడ్ యాక్షన్ డ్రామా జానర్ చిత్రమిది. గతంలో ఎప్పుడూ చూడని విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా రూపొందనుంది. ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. టైటిల్, ఇతర వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం’’ అన్నారు రవి కుమార్ పనస. -
పల్లెటూర్లో పరేషాన్
తిరువీర్, పావని కరణం జంటగా రూపక్ రోనాల్డ్సన్ దర్శకత్వంలో సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన చిత్రం ‘పరేషాన్’. తెలంగాణలోని ఓ పల్లెటూరు నేపథ్యంలో సాగే ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా జరిగిన ఈ సినిమా టీజర్ రిలీజ్ కార్యక్రమంలో తీరువీర్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా చాలా సహజంగా వుంటుంది’’ అన్నారు. ‘‘అందరం ప్రాణం పెట్టి ఈ సినిమా చేశాం’’ అన్నారు రూపక్ రోనాల్డ్సన్. ఇదొక ప్రత్యేకమైన సినిమా’’ అన్నారు సిద్ధార్థ్. -
కంటెంట్ ఉన్న సినిమాలకు సీజన్ అవసరం లేదు: దిల్ రాజు
‘మంచి సినిమాలకు సీజన్ అంటూ ఏమి ఉండదు. కంటెంట్ ఉన్న సినిమాను ఎప్పుడు విడుదల చేసిన ప్రేక్షకులు ఆదరిస్తారని ‘మసూద’ మరోసారి నిరూపించింది’ అని ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నారు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ‘మళ్ళీ రావా’, థ్రిల్లర్ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విభిన్న కథలతో బ్లాక్‌బస్టర్ విజయాలను అందుకున్న స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో రూపుదిద్దుకున్న మూడో చిత్రం ‘మసూద’. సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, బాంధవి శ్రీధర్, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాశ్, సత్యం రాజేష్ తదిరులు ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రం నవంబర్ 18న విడుదలై మంచి టాక్ని సంపాదించుకుంది. ఈ సంద్భంగా తాజాగా చిత్ర యూనిట్ థాంక్యూ మీట్‌ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో దిల్ రాజు మాట్లాడుతూ.. ఒక నిర్మాత ప్రేక్షకుల టేస్ట్ కు తగ్గట్టు సినిమా తియ్యాలి అనుకుని, మంచి సంకల్పం తో సినిమాకు ప్రాణం పెట్టి తీస్తే హిట్ రిజల్ట్ వస్తుందని ఈ జనరేషన్ లో రాహుల్ ప్రూవ్ చేశాడు. తన హోమ్ బ్యానర్( స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్) లో వరుసగా మూడు సినిమాలు( మళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస్, మసూద) హిట్ సాధించిన రాహుల్ కు & టీం కు కంగ్రాట్స్. నవంబర్ 18 న మసూద ఆ తరువాత "లవ్ టుడే", "హిట్ 2" ఇలా వరుసగా మూడు సినిమాలు హిట్ సాధించడం చూస్తుంటే ఇండస్ట్రీ కి మంచి రోజులు వచ్చాయి అనిపిస్తుంది’ అన్నారు. నిర్మాత రాహుల్ యాదవ్ మాట్లాడుతూ.. ‘మళ్ళీ రావా, ఏజెంట్ ఆత్రేయ సినిమాలు బిగ్ హిట్ అయిన తరువాత నెక్స్ట్ ఏం చేయాలి అనుకున్న టైమ్ లో మసూద లాంటి స్క్రిప్ట్ ఇచ్చిన సాయికి బిగ్ థాంక్స్. ఈ స్క్రిప్ట్ పూర్తిగా చదివిన తరువాత ఈ కథకు నిర్మాతగా న్యాయం చేయగలుగుతానా లేదా, చివరి వరకు ఈ సినిమాను తీసుకెళ్ల గలిగే ఓపిక ఉందా లేదా అనుకున్నాను. అయితే నాకు సాయి ఫుల్ సపోర్ట్ చేశారు. మసూద కోసం టీమ్ అంతా కష్టపడి పని చేశారు. అందుకే ఇలాంటి విజయం వచ్చింది’ అని అన్నారు. హీరో సుమంత్ మాట్లాడుతూ.. ‘రాహుల్ తో గత ఆరేళ్లుగా జర్నీ చేస్తున్నాను. తన బ్యానర్ లో మెదటి సినిమా "మళ్ళీ రావా" చేశాను. ఆ సినిమా నాకు మంచి పేరు తీసుకువచ్చింది. చాలా రోజుల తర్వాత మసూదతో రియలిస్టిక్ హారర్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి హ్యాట్రిక్ హిట్ సాధించాడు. ఇంత పెద్ద హిట్ సాధించిన మసూద టీం సభ్యులందరికీ అల్ ద బెస్ట్ ’అన్నారు ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మంచి కథను సెలెక్ట్ చేసుకొని సినిమా తియ్యడమే కాకుండా ఎంతో దైర్యంగా సినిమాను రిలీజ్ చేసి విజయం సాధించిన రాహుల్ టీమ్‌కు అభినందనలు. మసూద సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు థ్రిల్ కు గురవుతాడు’అని నిర్మాత బెక్కం వేణుగోపాల్ అన్నారు. ‘నాకు హరర్ సినిమాలు అంటే భయం. కానీ ఈ సినిమాను రాహుల్ తో కలసి మెదటి రోజు చూశాను చాలా బాగా నచ్చింది. ఇప్పుడు నాకు అలాంటి సినిమా తియ్యాలని ఉంది’ అని నిర్మాత లగడపాటి శ్రీధర్ అన్నారు.


