రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వంలో తిరువీర్, టీనా శ్రావ్య జోడీగా మాస్టర్ రోహన్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’. సందీప్ అగరం, అస్మితా రెడ్డి బాసిని నిర్మించారు. కల్పనా రావు సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా శుక్రవారం విడుదలై హిట్ టాక్‌ని సంపాదించుకుంది. ఇటీవల కాలంలో వచ్చిన బెస్ట్ కామెడీ చిత్రమిదని సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. సోషల్ మీడియాలోనూ ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దీంతో ఈ సినిమాకు బుకింగ్స్ నెమ్మదిగా పెరుగుతున్నాయి. బుకింగ్స్ పెరగడం పట్ల హీరో తీర్‌వీర్ ఆనందం వ్యక్తం చేశాడు
‘‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ మూవీ కోసం మేం ఆర్థికంగా చాలా కష్టపడ్డాం. ఈ ప్రయాణంలో మీడియా మాకు అండగా నిలిచింది. మా సినిమాపై ఎక్కడా ఒక్క నెగెటివ్ కామెంట్ కనిపించలేదు. మా చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు, ప్రోత్సహిస్తున్న మీడియా, సోషల్ మీడియాకు ధన్యవాదాలు’’ అని తిరువీర్ చెప్పారు.


