ప్రభాస్ -మారుతి డైరెక్షన్‌లో వస్తోన్న రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రం ది రాజా సాబ్. ఈ సినిమా కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్దీ కుమార్ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో హైదరాబాద్‌లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్.
ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన డైరెక్టర్ మారుతి ఫుల్ ఎమోషనల్ అయ్యారు. ప్రభాస్‌ను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. మూడేళ్లుగా ది రాజాసాబ్ కోసం పడ్డ కష్టాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. రెబల్ స్టార్‌ను తీసుకొచ్చిన ఆయన రేంజ్‌కు తగినట్లుగానే ఈ సినిమాను తీసుకొస్తున్నామని తెలిపారు. ఈ సినిమా కోసం ప్రభాస్ తన లైఫ్ పెట్టేశారని కొనియాడారు. సినిమాతోనే ఏకమైపోయిన తీరును మాటల్లో చెప్పలేనన్నారు. ఆ ప్రతి రూపమే ఈ రోజు మన ఎదురుగా కూర్చుందని డైరెక్టర్ ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా కోసం ప్రాణం పెట్టిన ప్రభాస్‌ను చూస్తుంటే నా కన్నీళ్లు ఆగడం లేదంటూ వేదికపైనే ఏడ్చేశారు. ఈ సందర్భంగా వేదికపైనే చిన్నపిల్లాడిలా దర్శకుడు మారుతి ఏడ్చిన తీరు ఆడియన్స్‌ను సైతం కన్నీళ్లు పెట్టించింది.
మారుతి కూతురు ఎమోషనల్
ఈ వీడియో చూసిన ఆయన కూతురు ఈవెంట్‌లోనే కన్నీళ్లు పెట్టుకుంది. తండ్రి కష్టాన్ని చూసిన కూతురు కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. తండ్రి కంటే ఎక్కువగా ఎమోషనలైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ ఒక తండ్రి కష్టం విలువ.. కుమార్తెకే తెలుస్తుందని కామెంట్స్ చేస్తున్నారు.
.@DirectorMaruthi Emotional avvadam tho valla Daughter of kuda challa Emotional ayindhi 🥲❤️#TheRajaSaab pic.twitter.com/ZkGVGBp4bU
— Rebel Star (@Pranay___Varma) December 28, 2025


