విజయ్‌- రష్మికల పెళ్లికి వెళ్తున్న స్టార్స్‌ వీళ్లే.. | Vijay Deverakonda And Rashmika Wedding attend Guest list revealed | Sakshi
Sakshi News home page

విజయ్‌- రష్మికల పెళ్లికి వెళ్తున్న స్టార్స్‌ వీళ్లే..

Feb 17 2026 8:01 AM | Updated on Feb 17 2026 8:13 AM

Vijay Deverakonda And Rashmika Wedding attend Guest list revealed

విజయ్‌ దేవరకొండ- రష్మిక మందన్న వివాహం ఈ నెల 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో  జరగనుంది. ఈ వేడుకలో ఇరు కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు పాల్గొననున్నారు. అయితే, మార్చి 4వ తేదీన హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో రిసెప్షన్ జరగనుంది. ఆ సమయంలో భారీగా టాలీవుడ్‌తో పాటు ఇతర ఇండస్ట్రీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు.

విజయ్‌, రష్మికల వివాహానికి ఉదయ్‌పూర్‌ వెళ్లే అతిధుల జాబితా నెట్టింట వైరల్‌ అవుతుంది. ఈ వేడుకలో  సినీ పరిశ్రమ నుండి ఎంపిక చేసిన ప్రముఖులతో పాటు వారి సన్నిహితులు మాత్రమే పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీలో వస్తున్న సమాచారం ప్రకారం, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, అల్లు అర్జున్, సుకుమార్, వర్ష బొల్లమ్మ, సల్మాన్ ఖాన్, విక్కీ కౌశల్, కరణ్ జోహార్, కృతి సనన్, దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ వంటి ప్రముఖులు వివాహ వేడుకకు హాజరవుతారని భావిస్తున్నారు.

అయితే, హైదరాబాద్‌లో మార్చి 4న జరిగే రిసెప్షన్ కార్యక్రమాన్ని చాలా గ్రాండ్‌గా నిర్వహించాలని ప్లాన్‌ చేశారు. ఆ సమయంలో చిరంజీవి, బాలకృష్ణ వంటి ప్రముఖ తెలుగు స్టార్స్‌తో పాటు యువ నటీనటులు హజరుకానున్నారు. ఆపై  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు బీఆర్‌ఎస్‌ నుండి కొంతమంది కీలక రాజకీయ నాయకులు కూడా విజయ్‌ పెళ్లిలో పాల్గొంటారని సమాచారం. ఈ జాబితా గురించి విజయ్‌ జోడీ నుండి అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది.

విజయ్-రష్మిక తొలిసారి జంటగా 'గీతగోవిందం' సినిమా చేశారు. అది సూపర్ హిట్. తర్వాత 'డియర్ కామ్రేడ్' మూవీ చేశారు. ఇది బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైంది. తర్వాత చాన్నాళ్ల పాటు కలిసి పనిచేయలేదు. ప్రస్తుతం విజయ్ 'రణబాలి' అనే చిత్రం చేస్తున్నాడు. ఇందులో రష్మికనే హీరోయిన్. ఇది దసరాకు రిలీజ్ కానుందని కొన్నిరోజుల క్రితమే ప్రకటించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement