Jayashankar
-
విద్యార్థులు దేశ భవిష్యత్‌కు మార్గదర్శకులు
● డీఈఓ రాజేందర్ భూపాలపల్లి అర్బన్: నేటి విద్యార్థులే దేశ భవిష్యత్‌కు మార్గదర్శకులు అని జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ హాల్లో ఆదివారం నిర్వహించిన విద్యా విజయోత్సవం కార్యక్రమంలో డీఈఓ రాజేందర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు కేవలం చదువులోనే కాకుండా దేశ భవిష్యత్‌ను తీర్చిదిద్దే శక్తులుగా ఎదగాలని సూచించారు. నైతిక విలువలను పెంపొందించుకుంటూ సామాజిక సమస్యల పరిష్కారంలో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. దేశ నిర్మాణంలో విద్యార్థుల పాత్ర ఎంతో కీలకమని, నాయకత్వ లక్షణాలు, నూతన ఆవిష్కరణలు, సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం ద్వారా వ్యక్తిత్వ వికాసం సాధించాలని తెలిపారు. సమాజ పురోగతికి విద్యార్థులు తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం అవసరమన్నారు. ఈ సందర్భంగా పదవ తరగతి, ఇంటర్మీడియట్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన, క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రశంసాపత్రాలు, ఒక్కొక్కరికి రూ.10వేల నగదు బహుమతులతో సత్కరించారు. ఉల్లాస్ కార్యక్రమం ద్వారా నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చిన ముగ్గురు వాలంటీర్లను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పరీక్షల నియంత్రణ అధికారి సామల రమేష్, క్వాలిటీ కోఆర్డినేటర్ పింగిళి విజయపాల్‌రెడ్డి, ప్లానింగ్ కోఆర్డినేటర్ దుప్పటి రాజగోపాల్, జీసీడీఓ శైలజ, అసిస్టెంట్ స్టాటిస్టికల్ కోఆర్డినేటర్ రామకృష్ణ, సిబ్బంది కృష్ణమోహన్, కిషన్‌రెడ్డి, శ్రీకాంత్, హేమలత, మహేందర్‌రెడ్డి, మల్లికార్జున్, శారద, శ్రీవాణి పాల్గొన్నారు. వరేణ్య సుమహిత నృత్య విభాగంలో.. కాళేశ్వరం: విద్యావారోత్సవాల్లో భాగంగా టీజీఎంఎస్ గణపురంలో నిర్వహించిన ఆర్ట్ అండ్ కల్చర్ కార్యక్రమంలో కాళేశ్వరంలోని పీఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల చెందిన విద్యార్థిని మాడుగుల వరేణ్య సుమహిత నృత్య విభాగంలో ప్రథమ స్థానంలో సాధించింది. ఈ మేరకు డీఈఓ రాజేందర్ వరేణ్య సుమహితకు బహుమతి అందజేశారు. -
నేటి ప్రజావాణి రద్దు
భూపాలపల్లి రూరల్: నేడు (సోమవారం) కాళేశ్వరంలో నిర్వహించనున్న నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మాక్‌డ్రిల్, సరస్వతి అంత్య పుష్కరాల ఏర్పాట్ల కార్యక్రమాల్లో జిల్లా అధికారులు పాల్గొనాల్సి ఉన్నందున నేడు నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు కలెక్టర్ రాహుల్‌శర్మ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంబంధిత కార్యక్రమాల దృష్ట్యా అధికారులు అందుబాటులో ఉండరన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సోమవారం దరఖాస్తులు ఇచ్చేందుకు రావొద్దని ఆయన సూచించారు. పరుచుకున్న పచ్చదనం మహాముత్తారం: ఎండలు మండిపోతున్నాయి. చెట్లు కూడా ఎండిపోయి.. ఆకులు రాలిపోతున్నాయి. కానీ మహాముత్తారం మండలంలోని జీలపల్లి నుంచి పర్లపెల్లి వెళ్లే ఈ రహదారి వెంబడి ఉన్న చెట్లు మాత్రం పచ్చదనంతో కొమ్మలు అల్లుకొని పచ్చదనం పరుచుకుంది. బాటసారులు, వాహనదారులు ఆహా ఎంత పచ్చదనం అంటున్నారు. నేటినుంచి యువజన వారోత్సవాలు భూపాలపల్లి అర్బన్: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నేటినుంచి ఈ నెల 23 వరకు యువజన వారోత్సవాలు నిర్వహించనున్నట్లు డీవైఎస్ఓ చిర్ర రఘు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సోమవారం ‘ఫిట్ అండ్ ఆక్టివ్ తెలంగాణ మారథాన్ అండ్ ఫిజికల్ లిటరసీ’ కార్యక్రమాన్ని జిల్లా స్థాయి, మండల స్థాయిలో నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయి మారథాన్ హనుమాన్ టెంపుల్ నుంచి అంబేడ్కర్ స్టేడియం వరకు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమవుతుందన్నారు. ఈ కార్యక్రమాల్లో క్రీడాకారులు, క్రీడా సంఘాల ప్రతినిధులు, యువత అధిక సంఖ్య లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. యువత అన్ని రంగాల్లో రాణించాలి భూపాలపల్లి అర్బన్: ఆధునిక కాలంలో యువత విద్యతో పాటు అన్ని రంగాలలో రాణించాల్సిన అవసరం ఉందని భూపాలపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.రమణరావు తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏర్పాటు చేసిన విద్యా వారోత్సవాలలో చివరి రోజైన ఆదివారం ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న కళాశాల పూర్వ విద్యార్థులు, కళాశాల క్రీడాకారులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. విద్యార్థులు విద్యతోపాటు, క్రీడలు, కళలు వంటి అన్ని రంగాలలో ప్రావీణ్యం పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు పాల్గొన్నారు. ఎప్‌సెట్‌లో అంజన్నకు 1,661 ర్యాంకు పలిమెల: మండల కేంద్రానికి చెందిన జనగామ అంజన్న ఆదివారం విడుదలైన ఎప్‌సెట్ ఫలితాల్లో 1,661 ర్యాంక్ సాధించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. మొదటి నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదివిన అంజన్న పదవ తరగతిలో మంచి మార్కులు రావడంతో హైదరాబాద్‌లోని గౌలిదొడ్డి ప్రభుత్వ సీఓఈ కాలేజీలో సీటు సాధించాడు. ‘సువైభ’కు నగదు పురస్కారం కాళేశ్వరం: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన విద్యా వారోత్సవాల ముగింపు సందర్భంగా విజయోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియేట్ ఫలితాల్లో జిల్లా స్థాయిలో మహదేవపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని సువైభ బైపీసీ విభాగంలో 985 మార్కులు సాధించి అత్యుత్తమ ప్రతిభ కనబర్చగా జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్ రూ.10 వేల నగదు పురస్కారం, ప్రశంసా పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ సీహెచ్ ప్రసాద్, సంధ్య, తదితరులు పాల్గొన్నారు. -
గో బ్యాక్ టు ఛత్తీస్‌గఢ్?
ఏటూరునాగారం: మావోయిస్టులు, సల్వాజుడుం గొడవలతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న గొత్తికోయ గిరిజనులు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాన్ని వదిలి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతానికి 15 ఏళ్ల క్రితం వలసవచ్చారు. ఏటూరునాగారం దట్టమైన అటవీ ప్రాంతంలోని అడవులను శుభ్రం చేసుకుని ఆవాసాలను ఏర్పాటు చేసుకోవడంతో పాటు వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాలతో కాలం గడుపుతున్నారు. ఇక్కడే ఆధార్, రేషన్, ఉపాధిహామీ కార్డులను సై తం పొందారు. స్థానికంగా జీవనస్థితి బాగానే ఉన్నప్పటికీ ఇక్కడ సాగు చేసుకున్న భూములకు ఎలాంటి హక్కు పత్రాలు లేకపోవడం.. కేవలం సాగు ఫలాలు మాత్రమే అనుభవించాలని ఫారెస్టు, రెవె న్యూ అధికారులు గిరిజనులకు చెబుతూ వస్తున్నా రు. ఈ క్రమంలో ఇటీవల అటవీ భూముల్లో సైతం అటవీశాఖ అధికారులు గోతులు తవ్వడం, పోడు భూముల్లో మొక్కలను నాటే ప్రక్రియను మొదలు పెట్టారు. దీంతో ఈ భూములను ఎప్పటికై నా ప్రభుత్వం లాక్కుంటుందని గిరిజనులు చర్చించుకుంటున్నారు. ఇదే క్రమంలో ఛత్తీస్‌గఢ్‌లో సైతం మావో యిస్టుల ప్రభావం తగ్గిపోవడంతో తిరిగివెళ్లాలనే గొత్తికోయలు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. సల్వాజుడంతోనే వలసలు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులను ఎదుర్కొనేందుకు అక్కడి పోలీసులు అప్పటి దివంగత సీఎం మహేంద్రకర్మ గిరిజన యువకులతో సల్వాజుడు మిలటరీ ప్లాట్స్‌ను ఏర్పాటు చేయించారు. గిరిజనుల్లో సల్వాజుడుం పోలీసు బెటాలియన్ సభ్యులున్నారని భావించిన మావోయిస్టు పార్టీ యువకులను టార్గెట్ చేసుకొని గిరిజన కుటుంబాలపై దాడులు చేయడం మొదలు పెట్టింది. ఈ పోరాటాలను తట్టుకోలేక 2001 నుంచి 2022 వరకు ఏటూరునాగారం సమీపంలోని గోదావరి దాటి అడవుల్లోకి వలస వచ్చారు. క్రమక్రమంగా వారు మంగపేట, కన్నాయిగూడెం, ఎస్ఎస్ తాడ్వాయి, గోవిందరావుపేట, వాజేడు, వెంకటాపురం(కె) ప్రాంతాలకు విస్తరించారు. జిల్లాలో ఇప్పటి వరకు 6 మండలాల్లో 51 గూడేల్లో 3,945 జనాభా ఉంది. వీరంతా సమీప అడవిలో పోడు చేసుకొని వారికి తోచిన వ్యవసాయాన్ని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆపరేషన్ కగార్తో తగ్గిన మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్, ఒడిషా రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆపరేషన్ కగార్‌ను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. 2025–26లో వేలాది మంది మావోయిస్టులు అమరులయ్యారు. చాలా మంది కేంద్ర కమిటీ సభ్యులు సైతం లొంగిపోయారు. ఛత్తీస్‌గఢ్ పల్లెలు సైతం మావోయిస్టులు లేని పల్లెలుగా మారాయి. ఇటీవల కర్రెగుట్టల్లో సైతం సీఆర్పీఎఫ్ క్యాంప్‌ను ఏర్పాటు చేశారు. దీంతో మావోయిస్టులు లేని ప్రాంతాలుగా గిరిజన గ్రామాలు మారాయని భావించిన ఇక్కడున్న గొత్తికోయలు మళ్లీ అక్కడికి వెళ్లాలని చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక్కడ ఉన్న ప్రతీ గిరిజనుడికి ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో ఇళ్లు, పట్టా భూములు కలిగి ఉన్నారు. పట్టా భూములపై హక్కులు ఉండడంతో మళ్లీ అక్కడకు వెళ్లి వ్యవసాయం చేసుకొని స్వేచ్ఛగా జీవించవచునే భావనతో గొత్తికోయలు ఉన్నారు. 15 ఏళ్ల క్రితం ఏజెన్సీకి వలసొచ్చిన గొత్తికోయలు మావోయిస్టుల ప్రభావం తగ్గడంతో పునరాలోచన జిల్లాలో 51 గూడేల్లో.. 3,945 మంది నివాసం -
విద్యతోనే పేదరిక నిర్మూలన సాధ్యం
ములుగు/ములుగు రూరల్: సమాజంలో విద్యతోనే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని, అక్షరజ్ఞానం మనిషిని సమాజంలో ఉన్నతమైన వ్యక్తిగా నిలబెడుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా కలెక్టరేట్ హాల్లో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన విద్య విజయోత్సవ దినోత్సవ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం కార్పొరేట్ స్థాయికి మించిన మెరుగైన విద్యను ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు అందిస్తుందని తెలిపారు. విద్యారంగంలో జిల్లాకు ప్రత్యేకమైన విశిష్టత లభించిందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల చూపు జిల్లా వైపే ఉందని వెల్లడించారు. పదో తరగతి పరీక్ష ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో జిల్లా మొదటి స్థానంలో నిలవడం గర్వకారణంగా ఉందన్నారు. విద్యా రంగంలో జిల్లా సాధిస్తున్న పురోగతిని మంత్రి కొనియాడారు. ఫలితాల్లో బాలికలే ఎక్కువ సంఖ్యలో ఉండడం అభినందనీయమన్నారు. -
గోదావరిలో ప్రముఖులకు దారి
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో ఈనెల 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు జరుగు సరస్వతీనది అంత్య పుష్కరాలకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. వీవీఐపీల కోసం సరస్వతీఘాటు తీరం నుంచి త్రివేణి సంగమంలోని నీటి వరకు వెళ్లడానికి బారికేడ్లు ఏర్పాటు చేసి మధ్యలో మట్టిరోడ్డు వేశారు. దానిపైన మ్యాట్లు రానున్నాయి. అక్కడే కంటెయినర్లు ఏర్పాటు చేస్తున్నారు. బయోటయిలెట్లు ఏర్పాటు చేస్తున్నారు. జల్లు స్నానాలకు ఏర్పాటు చేస్తున్నారు. కుడి, ఎడమ వైపున సాధారణ భక్తులు స్నానాలకు వెళ్లేందుకు షామియానాలు, మ్యాట్లు వేయనున్నారు. తీరం నుంచి రెండు ద్వారాల ద్వారా భక్తులు తరలి వెళ్లేందుకు ఏర్పాట్లు చేపట్టారు. 15 చెక్‌పోస్టుల ఏర్పాటు సరస్వతీనది అంత్యపుష్కరాలకు పలు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తారనే అధికారుల అంచనాతో ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు వివిధ మార్గాల వద్ద 15 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. 21 నుంచి వన్‌వే అమలులోకి రావడంతో చెక్‌పోస్టుల వద్ద ట్రాఫిక్ ఆంక్షలు ప్రారంభం కానున్నాయి. శివ కల్యాణ మండపంలో హోమాలు ఈనెల 21నుంచి జూన్ 1వ తేదీ వరకు పన్నెండు రోజుల పాటు హోమాలు నిర్వహించడానికి దేవాదాయశాఖ శివ కల్యాణ మండపంలో ఏర్పా ట్లు చేస్తుంది. హోమాల కోసం భారీ మంచుకొండల మాదిరిగా డెకరేషన్ సెట్టింగులు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా అచలాపురానికి చెందిన వేదపండితులు హోమాది పూజలు నిర్వహించనున్నారు. చివరి మూడు రోజులు రుద్రయాగం నిర్వహించడానికి శృంగేరి పీఠం నుంచి వేదపండితుల ఆధ్వర్యంలో నిర్వహిస్తారని ఆలయ వర్గాలు తెలిపాయి. -
లారీల కోసం నిరీక్షణ!
కాళేశ్వరం: ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు నానాకష్టాలు పడుతున్నారు. కాంటా వేసేటప్పుడు తేమశాతం ఉందని కొర్రీలు పెడుతున్నారు. అదే ధాన్యం కాంటావేసి లారీలు లోడు తీసుకుపోయేందుకు రాక కల్లాల వద్దనే పడిగాపులు కాస్తున్నారు. రాత్రిపగలు ధాన్యం కేంద్రాల్లోనే బసచేస్తున్నారు. వాతావరణంలో మార్పులు వస్తుండడంతో వడగండ్ల వాన కురిస్తే ఇబ్బందులు తప్పేలా లేవని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో దళారులను కొంతమంది రైతులు ఆశ్రయించి నష్టపోతున్నారు. అధికారులు స్పందించాలని వేడుకుంటున్నారు. ధాన్యం సేకరణ ఇలా.. జిల్లాలో 185 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. యాసంగి లక్ష్యం 1.60లక్షల టన్నులు కాగా ఇప్పటివరకు 15వేల టన్నులకు పైగా మిల్లులకు వెళ్లినట్లు సమాచారం. రూ.32 కోట్లకు రూ.5కోట్ల వరకు రైతులకు చెల్లించారని తెలిసింది. అధికారుల నిర్లక్ష్యం.. రైతుల ఆవేదన రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తోంది. పక్షం రోజులుగా గన్నీ సంచుల్లో వడ్లు నింపి కొనుగోలు కేంద్రాల వద్ద కాపలా కాస్తున్నా లారీలు అందుబాటులోకి రావడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కేంద్రాల నిర్వాహకులు, లారీ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో ధాన్యం లోడింగ్ ప్రక్రియ పూర్తిగా నత్తనడకన సాగుతోందని వాపోతున్నారు. ఒకవైపు మండుతున్న ఎండల్లో రోజంతా వేచిచూడాల్సి వస్తుండగా, రాత్రులు కూడా కొనుగోలు కేంద్రాల వద్దే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో వాతావరణంలో మార్పులు కనిపిస్తుండటంతో ఎప్పుడు వర్షం పడుతుందోనన్న భయంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చేతికొచ్చిన పంట తడిసిపోతే తమ పరిస్థితి ఏంటని రైతులు కన్నీరుపెడుతున్నారు. దళారుల దందా.. లారీలు రావడం లేదని దళారులు గ్రామాల్లో వాలిపోతున్నారు. కొందరు దళారులు గ్రామాల్లో తిరుగుతూ రైతులను మోసం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్వింటాలుకు రూ.300 నుంచి రూ.400 వరకు తగ్గించి ధాన్యం కొనుగోలు చేస్తూ తమ కష్టార్జితాన్ని దోచుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది రైతులు చేసేదేమీ లేక ఎంతో కొంతకు దళారులకు విక్రయిస్తున్నట్లు తెలిసింది. మిల్లుల్లో ఆలస్యం.. కళ్లాల్లో ధాన్యం లోడ్ చేసుకుని మిల్లులకు వెళ్లిన లారీల్లో ధాన్యం సంచులు దించేందుకు హమాలీ ఎండ తీవ్రతకు సరిగ్గా రావడం లేదు. దీంతో మిల్లుల్లో నాలుగు రోజుల కాలవ్యవధి జరుగుతుండడంతో లారీలు తిరిగి రావడానికి ఆలస్యం అవుతుంది. లారీ కాంట్రాక్టర్లు కూడా కేంద్రాలకు రావడానికి వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం. ఎండ తీవ్రతను తట్టుకోలేక పలువురు లారీ డ్రైవర్లు పనికి రావడం లేదని తెలుస్తోంది. ఇకనైనా అధికారులు వెంటనే స్పందించి లారీల కొరతను తీర్చడంతో పాటు ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసి దళారుల నుంచి రైతులను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై సివిల్ సప్లయీస్ డీఎం రాములును వివరణ కోరడానికి సంప్రదించగా ఫోన్లో అందుబాటులోకి రాలేదు. కల్లాల్లోనే రైతుల పడిగాపులు ఎండ తీవ్రతతో లారీల్లో లోడు దించక ఆలస్యం దళారులను ఆశ్రయిస్తున్న రైతులు క్వింటాకు రూ.200–300 వరకు రైతుకు నష్టంమిల్లుల వద్ద ఆలస్యం కావడంతోనే..మిల్లులకు వెళ్లిన లారీలు మూడు, నాలుగు రోజుల వరకు హమాలీ దించడం లేదు. ఎండకు లారీ డ్రైవర్లు కూడా పనికి రావడం లేదు. దీంతో లారీలు కల్లాల వద్దకు రావడం లేదు. – శ్రీనివాస్‌రెడ్డి, సివిల్ సప్లయీస్ లారీ కాంట్రాక్టర్ -
బదిలీల భయం!
● ఎంజీఎంలో పాతుకుపోయిన ఉద్యోగులు ● స్థానచలనం తప్పదా? ● ఉన్నతాధికారి పోస్టుకు డిమాండ్ కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో ఉన్నతాధికారి నుంచి జూనియర్ అసిస్టెంట్ వరకు బదిలీల ఫీవర్ పట్టుకుంది. ప్రభుత్వం బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జాయినింగ్ పీరియడ్ లెక్కలు వేసుకుంటూ సర్వీస్ బుక్‌లతో కుస్తీ పడుతున్నారు. డీఎంఈ కార్యాలయంలో పలుకుబడి ఉపయోగించుకుంటూ బదీలీల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కొంతమంది యూనియన్ పేరు చెప్పుకుంటూ ఆఫీస్ బేరర్లుగా బదిలీల నుంచి మినహాయింపు, కోరుకున్న చోటకు వెళ్లేందుకు ఎవరికి వారే ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. నిబంధనల ప్రకారం.. 40 శాతం ఉద్యోగులకు బదిలీలకు అవకాశం ఉండడంతో నాలుగేళ్ల సర్వీస్ దాటిన వారందరికీ బదిలీల గండం ఏర్పడింది. ఇక్కడే తిష్ట.. ఎంజీఎంలో కొంతమంది ఉద్యోగులు బదిలీల నుంచి తప్పించుకుంటున్నారు. ప్రమోషన్లు సైతం వదులకుని ఇక్కడే తిష్ట వేస్తున్నట్లు తెలుస్తోంది. జూనియర్ అసిస్టెంట్ క్యాడర్లో ఉన్న ఉద్యోగులు అకౌంట్ టెస్ట్ పాస్ కాకపోవడం వల్ల ఎంజీఎంలోనే విధులు నిర్వహిస్తున్నారు. ఓ ఉద్యోగి అయితే జాయినింగ్ నుంచి ఇక్కడే విధులు నిర్వహిస్తున్నారు. దాదాపు మూడు దశాబ్దాల నుంచి పని చేస్తున్నా మళ్లీ బదిలీ నుంచి మినహాయింపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కాగా, మినిస్టీరియల్ విభాగం నుంచి ఐదుగురు ఉద్యోగులు బదిలీలకు సిద్ధంగా ఉన్నారు. ఇక పెద్దాస్పత్రి పెద్ద పోస్ట్ అయిన సూపరింటెండెంట్ పోస్ట్ కోసం ఎంజీఎంలో పనిచేసిన ఉన్నతాధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్‌లో ఎంజీఎం ఆస్పత్రిని 24 అంతస్తుల భవనంలోకి మార్చే అవకాశం ఉండడంతో పెద్ద పోస్టు కోసం భారీగా పైరవీలు చేస్తున్నట్లు సమాచారం. రావాలన్నా.. పోవాలన్నా భయమే! ఎంజీఎంలో పనిచేస్తున్నవారు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు జంకుతుండగా, ఇతర జిల్లాల్లోని అధికారుల్లో కొందరు ఎంజీఎం అంటే వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆస్పత్రిలో గతంలో జరిగిన అవకతవకలపై తరచూ పత్రికల్లో రావడంతో వామ్మో, ఎంజీఎం మాకొద్దు అంటూ ఇక్కడ ఉద్యోగం చేయడానికి జంకుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎంజీఎంలో సూపరింటెండెంట్‌గా పని చేస్తున్న డాక్టర్ హరీశ్చంద్రారెడ్డి మంచిర్యాలలో సూపరింటెండెంట్ పోస్టులో ఉండగా, ఎంజీఎంలో ఇన్చార్జ్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. డాక్టర్ హరీశ్చంద్రారెడ్డి బదిలీపై ఇతర ఆస్పత్రికి వెళ్లి, తిరిగి ఎంజీఎంలో ఇన్చార్జ్గా కొనసాగడానికి ప్రత్యేక ఆర్డర్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. అయితే.. ఈ పోస్టు కోసం ఎంజీఎంలోనే సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహించిన డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ గోపాల్‌రావు గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా కాకతీయ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్న డాక్టర్ సంధ్య కేఎంసీతో పాటు కాళోజీ యూనివర్సీటీలో కూడా పనిచేశారు. అయితే ఆమె బదిలీ కావడానికి అవకాశం ఉన్నప్పటికీ తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ నుంచి ఆఫీస్ బేరర్ లెటర్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈపోస్టు కోసం మహబూబాబాద్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న డాక్టర్ శ్రీనివాస్ కూడా తన వంతు ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. -
పశువుల అక్రమ రవాణాపై ఉక్కుపాదం
● ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ములుగు రూరల్/గోవిందరావుపేట: పశువుల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ సిబ్బందిని ఆదేశించారు. ఈ మేరకు ఆయన శనివారం మండల పరిధిలోని మల్లంపల్లితో పాటు గోవిందరావుపేట మండల పరిధిలోని పస్రాలోని సోమలగడ్డ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా నుంచి ఎట్టి పరిస్థితుల్లో పశువుల అక్రమ రవాణా జరగకూడదని, ఎవరైనా నిబంధనలకు ఉల్లంఘించి పశువుల అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చెక్ పోస్టుల వద్ద విధులు నిర్వహించే సిబ్బంది షిఫ్టుల వారీగా విధులు నిర్వహించాలన్నారు. విధుల్లో అలసత్వం వహించొద్దని హెచ్చరించారు. పశువులు రవాణా చేసే వ్యక్తుల వద్ద సరైన పత్రాలు ఉన్నాయా లేదా పూర్తి స్థాయిలో తనిఖీ చేయాలని ఆదేశించారు. -
జాగిలాలతో తనిఖీలు
భూపాలపల్లి అర్బన్: గంజాయి సరఫరా, వినియోగాన్ని అరికట్టడంపై జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆదేశాల మేరకు శనివారం ఆపరేషన్ ఆర్ఐ కాశీరాం ఆధ్వర్యంలో ఈగల్ టీం సిబ్బంది నార్కోటిక్ డాగ్ సహాయంతో పాన్‌షాప్‌లు, కిరాణా దుకాణాలు, బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వం నిషేధించిన మత్తు పదార్థాలను ఎవరైనా నిల్వ ఉంచినా లేదా విక్రయిస్తున్నట్లు సమాచారం తెలిసిన వెంటనే డయల్ 100 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని కోరారు. -
బంగారం కొనలేకపోతున్నాం..
ె పెరిగిన ధరల దృష్ట్యా సామాన్య, మధ్య తరగతి మహిళలం బంగారం కొనలేక పోతున్నాం. వివాహ సమయాల్లో పుట్టింటి కానుకగా అందించిన ఆభరణాలతో సరిపెట్టుకుంటున్నాం. ప్రధాని మోదీ హైదరాబాద్‌లో ప్రకటించిన విధంగా ఏడాది వరకు బంగారాన్ని కొనకుండా వేచిచూస్తాం. దీంతోనైనా దేశానికి మేలు కలగడంతోపాటు ధరలు దిగివస్తాయని ఆశిస్తున్నా. – గోనె లత, కరీమాబాద్ రోడ్డు వరంగల్ అవసరమైతేనే బైక్ తీస్తున్నా.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగాయి. సామాన్యులపై భారం పడింది. ఏ చిన్న పనికి కూడా వాహనంపై వెెళ్లడమే ప్రజలకు అలవాటుగా మారింది. పెరిగిన ధరలను చూస్తే చిన్న పనులకు బైక్, కారు రోడ్డు ఎక్కించడం సామాన్యులకు భారమే. అత్యవసరం అనుకుంటేనే కారు, బైక్ తీయాలని సూచిస్తున్నా. ఇంటి నుంచి ఎక్కడికై నా సైకిల్ మీద లేదా నడిచి వెళ్తున్నా. దీంతో నాకు ఆరోగ్యంతోపాటు డబ్బులు ఆదా అవుతున్నాయి. – మచ్చిక రాజు, వరంగల్ సేంద్రియ పద్ధతి పాటిస్తున్నాం.. సేంద్రియ సాగు విధానాన్ని పాటిస్తున్నాం. తప్పని పరిస్థితుల్లో యూరియాను పంటలకు వాడుతున్నాం. నూతన పద్ధతులు ఎన్ని పాటించినా ఎకరాకు ఒక బస్తా యూరియా వేస్తే పచ్చదనంతోపాటు పంట ఎదుగుదల కనిపిస్తుంది. అధికారులు ప్రత్యేక చొరవ చూపి ఖరీఫ్ సీజన్లో యూరియా కొరత లేకుండా చూడాలి. – పులి మంజుల, మహిళా రైతు, లింగగిరి -
పొదుపు.. భవిష్యత్ మదుపు!
ఖిలా వరంగల్: అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా దేశంలో విదేశీ మాదకద్రవ్య వినియోగం తగ్గించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. దిగుమతి చేసుకున్న బంగారం, ఎరువులు, ఇంధనం, వంట నూనె, ఇతర సరుకుల వాడకం విషయంలో పొదుపు పాటించాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ వీటి వినియోగం ఎక్కువగా పెరిగింది. ఇదేపరిస్థితి కొనసాగితే భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పేలా లేవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈనేపథ్యంలో ప్రధాని సూచనను మన ఇంటినుంచే ఆచరిద్దాం. దీనివల్ల వ్యక్తిగత ప్రయోజనంతో పాటు దేశానికి మేలు జరుగుతుంది. ఉమ్మడి జిల్లాలో ప్రధాన ఖర్చులు.. ఆదాపై ఈ ఆదివారం ‘సాక్షి’ సండే స్పెషల్.. నూనె వాడకమూ ఎక్కువే.. ఇళ్లలో వంటలకు వాడే నూనెకు భారీగా వెచ్చిస్తున్నారు. నలుగురు కుటుంబ సభ్యులున్న ఇంటిలో నెలకు నగటున ఐదు లీటర్లు వాడుతున్నారు. నెల రోజులకు ఇప్పటికీ చూస్తే ఒక్కో ప్యాకెట్‌కు రూ.25కు పైగా ధరలు పెరిగాయి. అతిగా వంట నూనె వాడితే శరీరానికి విటమిన్లు, మంచి కొవ్వు, కేలరీలు అందవు. హార్మోన్ల అసమతుల్యతతో ఎక్కువ మంది ఊబకాయం, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధుల బారినపడుతున్నా వినియోగం తగ్గించడం లేదు. ఉమ్మడి జిల్లాలో సుమారు 38.20 లక్షల కుటుంబాలు ఉండగా నెలకు 1.90 కోట్ల లీటర్ల నూనె వాడుతున్నట్లు అంచనా. ప్రధాని పిలుపు మేరకు అందులో 10 శాతం తగ్గించినా 19 లక్షల లీటర్లు ఆదా అవుతుందని నిపుణులు చెబుతున్నారు. బంగారం చూసుకుని కొందాం.. వివాహాలు, ఇతర శుభకార్యాలకు స్వర్ణాభరణాలు కొనడం అలవాటుగా మారింది. ఈ విషయంలో నియంత్రణ పాటిస్తే కచ్చితంగా ప్రయోజనం కలుగుతుంది. ప్రధానంగా వరంగల్ నగరంలో 210కుపైగా షాపులు, మిగిలిన జిల్లాల్లో మరో 200 షాపులు ఉన్నాయి. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా సగటున రోజుకు 6 కిలోల బంగారు నగల అమ్మకాలు సాగుతున్నట్లు వ్యాపారుల అంచనా. ఈ విషయంలో కొంత పొదుపు పాటించాల్సిన అవసరం ఉంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ధరలు పెరగడంతో 80 శాతం కొనుగోళ్లు తగ్గిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇంధనం ఆదా చేద్దామా.. పశ్చిమాసియా పరిణామాలు ఇంధన వినియోగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు తమ కాన్వాయిలో వాహనాలను తగ్గించుకునేలా తీసుకున్న నిర్ణయం స్ఫూర్తిగా నిలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో 7,82,314 వాహనాలు ఉన్నాయి. దీంతో సగటున నెలకు 19 లక్షల లీటర్ల పెట్రోల్, 7 లక్షల లీటర్ల డీజిల్ వినియోగమవుతోంది. ఒక ద్విచక్రవాహనం ఇంధనం కోసం సగటున నెలకు రూ.మూడు వేలు వెచ్చించాల్సి వస్తోంది. ఇది ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబం.. నెలవారీ నిత్యావసర సరుకుల కొనుగోలుకు సమానంగా ఉంటుంది. ఖరీదైన వాహనాలను విని యోగిస్తే ఇంధన వ్యయం ఎక్కువ. బైక్‌లపై వెళ్లడం కంటే కాలినడకన, సైకిళ్ల మీద వెళ్తే కొంత ఇంధనాన్ని ఆదా చేసినట్లే. ఎరువుల మోతాదు మించొద్దు.. పంటలకు మోతాదుకు మించి ఎరువులు వాడుతున్నారు. అధికారుల సిఫార్సు మేరకు ఎకరాకు మూడు దశల్లో 75 కిలోల యూరియా వినియోగించాల్సి ఉండగా.. జిల్లాలో 225 కిలోల కంటే ఎక్కువ ఉపయోగిస్తున్నట్లు వ్యవసాయ అధికారులే చెబుతున్నారు. దీంతో నేలసారం తగ్గడమే కాకుండా చీడ పీడలు వ్యాపించి సాగు వ్యయం గణనీయంగా పెరుగుతుంది. ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా 15 లక్షల ఎకరాల్లో పంటలు సాగువుతుండగా.. నిబంధనల ప్రకారం 41 వేల మెట్రిక్ టన్నుల యూరియా వేయాలి. ఈ ప్రకారం రసాయన ఎరువులు వేస్తే విదేశీమారక ద్రవ్యం వినియోగం తగ్గడంతో పాటు సాగుపరంగా ఎదురయ్యే ఇబ్బందులూ తీరుతాయి. ప్రధాని మోదీ సూచనను మన ఇంటి నుంచే ఆచరిద్దాం..విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయడానికి పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించాలి. ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తులకే ప్రాధాన్యం ఇవ్వాలి. – ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపు వంట నూనెల వాడకం తగ్గిస్తే.. ఇంటి ఖర్చులో అధిక ఆదా అవసరమైతేనే బైక్, కారు.. కాలినడక ఆరోగ్యానికి మంచిది దిగుమతి వస్తువుల వినియోగాన్ని తగ్గిస్తే మేలు -
తగ్గుతున్న అడ్మిషన్లు
● మూడు గురుకుల కళాశాలల్లో 50 మంది మాత్రమే చేరికఏటూరునాగారం: జిల్లాలోని గిరిజన గురుకుల కళాశాలల్లో అడ్మిషన్లు తగ్గుముఖం పడుతున్నాయి. ములుగు జిల్లాలోని ఇంచెర్ల, ఏటూరునాగారం, కాటారం బాయ్స్ కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరం చదివే విద్యార్థులు కేవలం 50 మంది మాత్రమే అడ్మిషన్లు పొందారు. సుమారు మూడు కళాశాలల్లో 300 వరకు సీట్లు భర్తీ చేయాల్సి ఉంది. కానీ కేవలం మూడు కళాశాలల్లో 50 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందడం గమనార్హం. గిరిజన గురుకుల కళాశాలల్లో నాణ్యమైన విద్య, భోజనం, వసతి లేదనే అనుమానాలు గిరిజన విద్యార్థుల్లో నెలకొంది. దీంతో కళాశాలల్లో చేరేందుకు గిరిజన విద్యార్థులు వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా, డివిజన్‌స్థాయి అధికారుల పర్యవేక్షణ గురుకులాలపై లేకపోవడంతో విద్యాబోధన సరిగా సాగడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఏటూరునాగారం బాలికల గురుకుల కళాశాలలో సైతం ఫుడ్ ఫాయిజన్ అయి కూడా చాలా మంది విద్యార్థినులు ఆస్పత్రుల పాలయ్యారు. దీంతో విద్యార్థులను గురుకులాల్లో చేర్చేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు సైతం సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఆర్సీఓ హరిసింగ్‌ను ఫోన్లో సంప్రదించగా స్పందన కరువైంది. -
ప్రవేశాలకు వేళాయె..
● జిల్లాలో ఇంటర్ అడ్మిషన్లు ప్రారంభం ● జూన్ 1 నుంచి కళాశాలలు పునఃప్రారంభంభూపాలపల్లి అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలు పెంచేందుకు అధికారులు కార్యాచరణ చేపట్టారు. జూన్ 1నుంచి ఇంటర్ తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో తొలి విడత ప్రవేశాలు చేపట్టాలని ప్రభుత్వం ప్రకటించింది. ప్రవేశాలు పెంచేందుకు ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. జిల్లావ్యాప్తంగా గతేడాది 3,778మంది విద్యను అభ్యసించారు. విద్యార్థులకు అవగాహన.. ప్రభుత్వ కళాశాలల్లో విద్యాబోధన, వసతులు, అధ్యాపకుల వివరాలు, ఫలితాలను వివరిస్తూ ప్రవేశాలు పెంచుకోవాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు దీనిపై దృష్టి సారించారు. గడిచిన విద్యా సంవత్సరంలో ఇంటర్ పరీక్షలు ముగిసిన నాటినుంచి కళాశాలల వారీగా వారి మండలాల పరిధిలో ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి టెన్త్ పూర్తిచేసిన విద్యార్థులకు అవగాహన కల్పించారు. వారం రోజులుగా ఊరూరా తిరుగుతూ పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ప్రత్యక్షంగా కలుస్తున్నారు. కళాశాలల్లో ఉన్న వసతులు, ప్రయోగశాలలు, అధ్యాపకులు తదితరలను వివరిస్తూ తమ కళాశాలల్లో ప్రవేశం పొందాలని అభ్యర్థిస్తున్నారు. గతేడాది కూడా ముందస్తు ప్రచారంతో కొంతమేరకు విద్యార్థుల సంఖ్య పెరిగి ప్రభుత్వ కళాశాలల్లో చేరారు. ఉచిత విద్య, వసతులు.. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ఉచిత పుస్తకాలు అందించడంతో పాటు నిష్ణాతులైన అధ్యాపకులతో విశాలమైన తరగతి గదులు, గ్రంథాలయాలు, ప్రయోగశాలలు, మైదానాలు వంటి సౌకర్యాలు ఉన్నాయి. వీటికి తోడు గురుకులాల్లో ఉచితంగా ఇంటర్ చదువుకునే అవకాశమున్నా ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. జిల్లాలోని మోడల్ స్కూల్, కేజీబీవీల్లో చదువుతున్న వారికి ప్రాధాన్యమిస్తూ మిగిలిన సీట్లను నిబంధనలకు అనుగుణంగా కొత్తవారికి ప్రవేశాలు కల్పిస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాలను ఈసారి ఎక్కువగా పెంచుకునేందుకు అధ్యాపకులు, ప్రిన్సిపాళ్లు ముందుకు సాగుతున్నారు. జిల్లా కేంద్రంలో హాస్టల్ సౌకర్యాలు జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పొందే బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి సౌకర్యాలు కూడా ఉన్నాయి. దూర ప్రాంతాల విద్యార్థులకు ప్రభుత్వం ఉచిత విద్యను అందించేందుకు బాలబాలికలకు వేర్వేరుగా ఎస్సీ, ఎస్టీ, బీసీల పోస్ట్‌మెట్రిక్ హాస్టల్ వసతులు అందుబాటులో ఉన్నాయి. హాస్టల్లో ప్రతీ రోజు టిఫిన్, రెండు పూటలా భోజన సౌకర్యాలు ఉంటాయని అధ్యాపకులు ప్రచారం చేస్తున్నారు. కళాశాలల్లో సైతం ఈ ఏడాది నుంచి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 5మోడల్ కళాశాలలు 6కేజీబీవీ కళాశాలలు 10బీసీ వెల్ఫేర్ కళాశాలలు 4ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలలు 2 సోషల్ వెల్ఫేర్ కళాశాలలు 2మైనారిటీ కళాశాల 1ప్రైవేట్ కళాశాలలు 4నాణ్యమైన విద్య.. ప్రవేశాలు పెంచేందుకు ప్రత్యేక దృష్టి సారించాం. ఈ ఏడాది జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచింది. ప్రిన్సిపాళ్లు, అధ్యాపకుల భాగస్వామ్యంతో విద్యార్థుల ఇళ్లకు వెళ్లి ప్రచారం చేపట్టి ప్రభుత్వ కళాశాలల్లో చేరేలా ప్రోత్సహిస్తున్నారు. కళాశాలల్లో వసతులు, ఫలితాల గురించి కరపత్రాల ద్వారా వివరిస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో ఉచిత నాణ్యమైన విద్య విద్యార్థులకు అందుతుంది. గతేడాది కంటే ఎక్కువ ప్రవేశాలు పొందేలా ముందుకు సాగుతున్నాం. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు కావాల్సిన పాఠ్య పుస్తకాలు కళాశాలలకు చేరుకున్నాయి. ప్రథమ సంవత్సరం విద్యార్థుల పాఠ్య పుస్తకాలు జూన్ రెండో వారంలోపు వచ్చే అవకాశం ఉంది. – వెంకన్న, జిల్లా ఇంటర్ విద్యా నోడల్ అధికారి -
అంత్య పుష్కరాలకు ఆహ్వానం
కాళేశ్వరం: కాళేశ్వరంలో ఈనెల 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు జరుగు సరస్వతీనది అంత్య పుష్కరాలకు రావాలని హైదరాబాద్‌లో పలువురు మంత్రులు, ప్రముఖులకు ఆహ్వాన పత్రికను శనివారం దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు, కలెక్టర్ రాహుల్‌శర్మ అందజేశారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్కకు ఆహ్వాన పత్రికను అందజేశారు. దేవాదాయ శాఖ ధార్మిక సలహాదారు గోవింద హరి, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్‌రెడ్డి, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ముఖ్యమంత్రి కార్యదర్శి వేముల శ్రీనివాస్‌లకు ఆహ్వాన పత్రికను అందజేశారు. వారివెంట ఆలయ ఈఓ మహేష్, ఉపప్రధాన అర్చకులు ఫణీంద్రశర్మ, వేదపారయనదార్ వైకుంఠ పాండాలు పాల్గొన్నారు. ప్రలోభాలకు లొంగొద్దు ● అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల భూపాలపల్లి రూరల్: మానవ అక్రమ రవాణా, లైంగిక వేధింపులకు గురికావద్దని, డబ్బులు, ఉద్యోగాల ఆశ చూపించి మహిళలను, చిన్నపిల్లలను లొంగదీసుకుంటారని ఎటువంటి ప్రలోభాలకు గురికావద్దని అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల సూచించారు,. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణా బాధితులు, లైంగిక దోపిడీ అనే అంశంపై శనివారం పట్ణణంలోని సఖి కేంద్రంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్జి అఖిల హాజరై ప్రసంగించారు. వెనుకబాటుతనాన్ని ఆసరాగా చేసుకొని నేరస్తులు మోసాలుచేసే అవకాశాలుంటాయని తెలిపారు. నేరాలు జరగకుండా కట్టడి చేయాలంటే ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ ప్లీడర్ బొట్ల సుధాకర్, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శ్రీనివాస్, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కంప అక్షయ, జిల్లా సంక్షేమ అధికారి మల్లీశ్వరి, సీడీపీఓ రాధిక, సఖి సెంటర్ అడ్మినిస్ట్రేటర్ గాయత్రి, లీగల్ సర్వీసెస్ అథారిటీ సీనియర్ అసిస్టెంట్ సురేందర్ పాల్గొన్నారు. డీజీపీని కలిసిన ఎస్పీ భూపాలపల్లి అర్బన్: డీజీపీ సీవీ ఆనంద్‌ను ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ శనివారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లాలో శాంతిభద్రతల పరిస్థితులు, కాళేశ్వరం పుష్కరాల బందోబస్తు ఏర్పాట్లు, ప్రజల భద్రత కోసం పోలీసు శాఖ చేపడుతున్న ప్రత్యేక చర్యలపై ఎస్పీ వివరించారు. జిల్లా పోలీసుల పనితీరును అభినందించిన డీజీపీ ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందిస్తూ శాంతిభద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. లారీ, కారు ఢీకొని ముగ్గురికి తీవ్రగాయాలు మల్హర్(కాటారం): లారీ–కారు ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలైన ఘటన కాటారం మండలం నస్తూరిపల్లి గ్రామ క్రాస్ సమీపంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మహదేవపూర్ వైపు నుంచి కాటారం వైపు వెళ్తున్న ఇసుక లారీ, కాళేశ్వరం వైపు వస్తున్న కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన సురేందర్‌రెడ్డి, కిరణ్‌రెడ్డి, రవీందర్‌రెడ్డిని వెంటనే అంబులెన్స్ ద్వారా మహదేవపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. గాయపడిన వారు రేగొండ మండలం కాకర్లపల్లి గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
అనాథ బాలికలకు ఉచిత ప్రవేశాలు
భూపాలపల్లి రూరల్: జిల్లాలోని అనాథ, పాక్షిక అనాథ బాలికలకు దుర్గాబాయి దేశ్‌ముఖ్ బాలికల పాలిటెక్నిక్ కళాశాలలో ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్టు కలెక్టర్ రాహుల్ శర్మ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పదవ తరగతి పూర్తిచేసిన అర్హత కలిగిన బాలికలు ఈ నెల 22లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు ఫారాన్ని జిల్లా బాలల పరిరక్షణ విభాగం, బాల రక్షా భవన్ కలెక్టరేట్లో అందజేయాలని సూచించారు. పూర్తి వివరాల కోసం 99481 52061 ఫోన్నంబర్లో సంప్రదించాలని తెలిపారు. మోటార్ బిగించారు మల్హర్: ఈనెల 14న సాక్షిలో ప్రచురితమైన పొలాల నుంచి తాగునీరు కథనానికి అధికారులు స్పందించారు. మండలంలోని అన్సాన్పల్లి గ్రామంలోని ఒకటో వార్డులో బోరు మోటార్ చెడిపోగా.. శుక్రవారం బోరు మోటరు బిగించారు. అధికారులు, పంచాయతీ పాలక వర్గం సభ్యులు స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించారు. ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ భూపాలపల్లి రూరల్: హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (రామంతాపూర్)లో ఒకటవ తరగతి ప్రవేశం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి అధికారి ఇందిరా శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాకు ఒక సీటు కేటాయించారని, దరఖాస్తు చేసుకునే విద్యార్థులు జూన్ 1నుంచి 2019 నుంచి మే 1, 2020 మధ్య జన్మించి ఉండాలని పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు ఈ నెల 29వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్‌కు.. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీం పథకం కింది 1వ తరగతి, 5వ తరగతిలో ప్రవేశం కోసం జూన్ 6వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ అధికారి ఇందిర శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో 1వ తరగతికి (41) సీట్లు, 5వ తరగతికి (43) సీట్లు కేటాయించినట్లు తెలిపారు. 31వరకు రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు భూపాలపల్లి అర్బన్: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ నెల 31వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు భూపాలపల్లి రెడ్‌క్రాస్ చైర్మన్ డాక్టర్ కాశిట్టి శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా మార్గదర్శకత్వంలో, రాష్ట్ర చైర్మన్ దాన కిషోర్ నాయకత్వంలో రెడ్ క్రాస్ సంస్థ సేవలు అందిస్తుందన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, కలెక్టర్ రాహుల్ శర్మ ఆధ్వర్యంలో జిల్లాలో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతీ భారతీయ పౌరుడు జీవిత, వైస్ ప్యాట్రన్, ప్యాట్రన్ సభ్యులుగా చేరవచ్చన్నారు. ఇప్పటికే సభ్యత్వం ఉన్న వారు తమ వ్యక్తిగత వివరాల్లో మార్పులు ఉంటే వెంటనే నవీకరించుకోవాలని సూచించారు. సభ్యత్వ నమోదు కోసం మోర శంకరమూర్తి 63051 78278, సంగెం రామకృష్ణ 99081 81339లను సంప్రదించాలని తెలిపారు. పశువుల అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు రేగొండ: పశువులను అక్రమ రవాణాచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ సంపత్‌రావు అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలో ఏర్పాటుచేసిన చెక్‌పోస్ట్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సరైన ధృవపత్రాలు లేకుండా పశువులను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వివిధ సంఘాల వ్యక్తులని వాహనాలను తనిఖీ చేయరాదని, చట్టాన్ని చేతులోకి తీసుకునే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విధుల్లో అప్రమత్తంగా ఉండాలని, అక్రమ రవాణాను అరికట్టడంలో నిర్లక్ష్యం వహించద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో గణపురం సీఐ కరుణాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. -
సంస్థను ముందుకు నడిపించాలి
భూపాలపల్లి అర్బన్: సింగరేణిలో సవాళ్లను అధిగమిస్తూ సంస్థను ముందుకు నడిపించాలని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి కోరారు. ఈ నెల 18నుంచి నిర్వహించనున్న మల్టీ డిపార్ట్మెంటల్ సమావేశాల సందర్భంగా శుక్రవారం ఏరియాలోని జీఎం తన కార్యాలయంలోని కాన్ఫరెన్స్హాల్లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింగరేణి అభివృద్ధిలో ప్రతీ ఉద్యోగి కీలకపాత్ర పోషించాలన్నారు. ఉద్యోగులు సమయపాలన పాటిస్తూ అంకితభావంతో విధులు నిర్వర్తించాలన్నారు. పని గంటలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వ్యక్తిగత అభివృద్ధితో పాటు సంస్థ అభివృద్ధికి తోడ్పడుతూ నాణ్యత, ఉత్పత్తి, ఉత్పాదకత పెంపునకు కృషిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జీఎం కవీంద్ర, అధికారులు జోతి, డాక్టర్ పద్మజ, భిక్షమయ్య, మాటూరి రవీందర్, రాజేశ్వర్, కృష్ణప్రసాద్, శైలేంద్రకుమార్, శ్యాంసుందర్, ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్, ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షుడు మధుకర్‌రెడ్డి పాల్గొన్నారు. -
మరో ఐదు రోజులే..
ఆలయంలో క్యూలైన్ పనులు చేస్తున్న కూలీలుశాఖ కేటాయింపు (రూ..) ఇరిగేషన్ 62.20 లక్షలు ఆర్అండ్బీ 51 లక్షలు పంచాయతీరాజ్ 34.8లక్షలు ఈఈ ఎంబీ ఇన్ఫ్రా 15 లక్షలు ఆర్టీసీ 17 లక్షలు డీపీఓ 97.42 లక్షలు ఎండోమెంట్ 67.74 లక్షలు డీఎఫ్ఓ 5.92 లక్షలు సబ్‌కలెక్టర్ 15 లక్షలు అటవీ శాఖ 30 లక్షలు ఎస్పీ 1.25 కోట్లు కలెక్టర్ 6 కోట్లు క్షేత్ర కన్సల్టెంట్ 17.70 లక్షలు కాళేశ్వరం: ఈ నెల 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు జరుగనున్న సరస్వతీనది అంత్య పుష్కరాలకు ప్రభుత్వం రూ.21.98కోట్ల నిధులు మంజూరు చేసి పనులు చేపట్టింది. కానీ క్షేత్రస్థాయిలో పనులు నెమ్మదిగా జరుగుతున్నాయి. వీఐపీ ఘాటు వద్ద ఈవెంట్ పనులు, పరిసరాల్లో మరుగుదొడ్లు, పార్కింగ్, తాగునీరు, బీటీ రోడ్డు, ఫార్మేషన్ రోడ్డు పనులు నిర్వహిస్తున్నారు. సమయం దగ్గర పడుతుండడంతో అధికారులు హడావిడి చేస్తున్నారు. దీంతో నాణ్యత, నాసిరకం పనులు చేసి కాంట్రాక్టర్లు మమా అనిపిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. ఇంకా ఐదు రోజుల్లో పనులు పూర్తి చేసేలా కనిపించడం లేదని భక్తులు ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణలేమి కొట్ట చ్చినట్లు కనిపిస్తుందని విమర్శలు ఉన్నాయి. గోదావరి వద్ద డ్రెస్‌లు మార్చుకునే గదుల నిర్మాణం జరగడం లేదు. ప్రధానఘాటు, సరస్వతీ ఘాటులో జల్లు స్నానాల పంపుల నిర్మాణం జరగడం లేదు. చలువపందిర్ల పనులు ఇంకా మొదలు కాలేదు. రోడ్డు మరమ్మతు పనులు జరగడం లేదు. అక్కడక్కడా సూచిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. ఆదిముక్తీశ్వర నుంచి వీఐపీఘాటు వరకు చిప్స్ వేసి ఉంచగా, బీటీ మొదలు కాలేదు. సరస్వతీఘాటు వద్ద కై ర్ మ్యాట్ వర్క్ మొదలు కాలేదు. తాగునీటి కోసం ట్యాంకులు శుభ్రం చేయడం లేదు. మరుగుదొడ్ల పనులు పూర్తికాలేదు. అసంపూర్తిగా నిర్మాణాలు ఉన్నాయి. రూ.1.20కోట్లతో మ్యూజియం పనులు నత్తనడకన సాగుతున్నాయి. పక్కనే అటవీశాఖ లాన్ పనులు సాగుతున్నాయి. అటవీశాఖ ఆధ్వర్యంలో కుదురుపల్లి– బీరసాగర్ రోడ్డు పనులు జరుగుతున్నాయి. 260 ఎకరాల్లో పలు ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలు చేపట్టారు. మద్దులపల్లి, సుద్ద వాగుల వద్ద శిథిలావస్థకు చేరిన కల్వర్టులకు రంగులు అద్ది మెరిపిస్తున్నారు. కాళేశ్వర పరిసరాల్లో సీసీ కెమెరాలు పనులు చేపట్టారు. టెంట్సిటి పనులు, డార్మెటరీ పనులు జరుగుతున్నాయి. ప్రముఖ సంస్థ సరస్వతీఘాటు వద్ద భారీ డెకరేషన్స్ చేపట్టింది. కాళేశ్వరం ఆలయంలో క్యూలైన్ పనులు జరగుతున్నాయి. శివ కల్యాణ మండపంలో భారీ సెట్టింగ్ పనులు జరుగుతున్నాయి. అక్కడే హోమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. 21నుంచి సరస్వతి అంత్య పుష్కరాలు రూ.21.98 కోట్లతో పనులు పనుల నాణ్యతపై విమర్శలు -
కోర్టు ఏర్పాటుకు భవనాల పరిశీలన
మల్హర్(కాటారం): మండలంలోని కాటారంలో జూనియర్ సివిల్ జడ్జి జ్యూడిషినల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు స్థాపనకు సంబంధించి జిల్లా ఇన్చార్జ్ ప్రధాన న్యాయమూర్తి సూర్య చంద్రకళ స్థానిక న్యాయవాదులతో కలిసి శుక్రవారం పలు భవనాలను సందర్శించారు. ఈ సందర్భంగా కోర్టు నిర్వహణకు అనుకూలమైన వసతులు, భద్రతా ఏర్పాట్లు, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా న్యాయవాదులు, కోర్టు సిబ్బందికి అవసరమైన సౌకర్యాలు వంటి అంశాలను జడ్డి పరిశీలించారు. త్వరలోనే కాటారంలో జూనియర్ సివిల్ కోర్టు ఏర్పాటుతో ప్రజలకు మరింత మెరుగైన న్యాయ సేవలు అందుతాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక న్యాయవాదులు రంజిత్ కుమార్, ఆరేళ్లి వెంకట స్వామి, రేపాల సంతోష్, ఇందారపు శివకుమార్, వల శ్రవణ్‌రావు, ఆకుల రాములు, మెషినేని శ్రీనివాస్‌రావు, అబ్దుల్ కలాం, సతీష్ పాల్గొన్నారు. -
ఓరుగల్లుకు స్వచ్ఛరక్ష
సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పట్టణాల్లో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 కింద చేపట్టనున్న మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టులో పరకాల, భూపాలపల్లి, జనగామ, వర్ధన్నపేట, నర్సంపేట మున్సిపాలిటీలకు ప్రాధాన్యం లభించింది. ఈ ఐదు పట్టణాల్లో మొత్తం ఆరు మురుగునీటి శుద్ధి ప్లాంట్లు (ఎస్టీపీలు) ఏర్పాటు చేయనున్నారు. వీటి మొత్తం సామర్థ్యం 22.80 ఎంఎల్డీలుగా ఉంటుంది. ఈ మేరకు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివద్ధి శాఖ కార్యదర్శి డా.టీకే శ్రీదేవి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. స్వచ్చ భారత్ మిషన్‌లో భాగంగా... స్వచ్ఛ భారత్ మిషన్ (ఎస్బీఎం) 2.0 కింద రాష్ట్రవ్యాప్తంగా 101 పురపాలక సంఘాల్లో మురుగునీటి నిర్వహణ పనులకు రూ.3,705.75 కోట్ల సవరించిన పరిపాలనా అనుమతులు జారీ చేశారు. అందులో వరంగల్ విభాగానికి కూడా ప్రాధాన్యం లభించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పట్టణ పారిశుద్ధ్యానికి ఊరటనిచ్చే ఈ భారీ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వరంగల్ విభాగంలో మొత్తం 6 మురుగునీటి శుద్ధి ప్లాంట్లు (ఎస్టీపీలు) ఏర్పాటు చేయనున్నారు. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్.. భూసేకరణకు ప్రత్యేక నిధులు.. పనులను వేగంగా పూర్తి చేయడానికి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మూడు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలవనుంది. ఎక్కువ కంపెనీలు టెండర్లలో పాల్గొనేలా చర్యలు తీసుకుంది. టెండర్లు పొందిన కాంట్రాక్టర్లు 24 నెలల్లో పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టును హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్) పద్ధతిలో అమలు చేయనున్నా రు. నిర్మాణ సమయంలో ప్రభుత్వం 50 శాతానికి పైగా వ్యయాన్ని చెల్లించగా, మిగిలిన మొత్తాన్ని విడతల వారీగా చెల్లించనుంది. నిర్మాణంతోపాటు ఐదేళ్లపాటు నిర్వహణ బాధ్యత కూడా కాంట్రాక్టు సంస్థలదే ఉంటుంది. భూసేకరణ కోసం ప్రత్యేక నిధులు కూడా కేటాయించారు. ఇదిలా ఉండగా పరకాల, భూపాలపల్లి, జనగామ, వర్ధన్నపేట, నర్సంపేట మున్సిపాలిటీల్లో ప్రస్తుతం మురుగునీరు నేరుగా కాలువలు, చెరువులు, వాగుల్లోకి చేరుతుండటంతో కాలుష్య సమస్య తీవ్రంగా ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే పట్టణాల్లో చెరువులు, వాగులు, భూగర్భజలాల్లో కాలుష్యం గణనీయంగా తగ్గి పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపడనున్నాయని అధికారులు చెబుతున్నారు. ‘గ్రేటర్’లో ఉన్నా లేనట్లే.. తాజాగా ప్రతిపాదనలు.. ఇక గ్రేటర్ వరంగల్ నగరంలో ఇప్పటికే స్మార్ట్‌సిటీ నిధులతో రెడ్డిపురం వద్ద 100 ఎంఎల్డీ, బంధంచెరువు వద్ద 15 ఎంఎల్డీ, ఉర్సుగుట్ట వద్ద 15 ఎంఎల్డీల సామర్థ్యంతో మూడు ఎస్టీపీల నిర్మాణాలు చేపట్టారు. కొన్ని అందుబాటులోకి రాకపోగా, వచ్చినవి ట్రైసిటీలో పెరుగుతున్న జనాభా, నగర విస్తరణకు సరిపోవడం లేదని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో 2057 విజన్‌కు అనుగుణంగా అదనపు ఎస్టీపీల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదే సమయంలో ప్రభుత్వం రూ.5,257 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ (యూజీడీ) ప్రాజెక్టును ప్రకటించిన నేపథ్యంలో 100 శాతం మురుగునీటి శుద్ధి లక్ష్యంగా ప్రణాళికలు సిద్దం చేసినట్లు అధికారులు తెలిపారు. ఐదు మున్సిపాలిటీల్లో ఆరు ఎస్టీపీలు... తీరనున్న కాలుష్యం బాధలు పరకాల నుంచి నర్సంపేట వరకు గ్రీన్‌సిగ్నల్ 22.80 ఎంఎల్డీ సామర్థ్యం మూడు ప్యాకేజీలలో టెండర్లు.. పూర్తి చేసేందుకు గడువు 24 మాసాలు రూ.3,705 కోట్ల ప్రాజెక్టులో వరంగల్‌కు ప్రాధాన్యం -
నష్టాలకు ప్రభుత్వ విధానాలే కారణం
భూపాలపల్లి అర్బన్: సింగరేణి ఆర్థిక నష్టాలకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాల విధానాలే కారణమని సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ (బీఎంఎస్) ప్రధాన కార్యదర్శి యతిపతి సారంగపాణి, కార్యనిర్వహక అధ్యక్షుడు అప్పాని శ్రీనివాసులు అన్నారు. ఏరియాలోని కేటీకే–5గనిలో శుక్రవారం నిర్వహించిన గేట్ మిటింగ్ అనంతరం బీఎంఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సింగరేణి కార్మికుల సమస్యలపై పోరాటం చేస్తున్నట్లు చెప్పి ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ సంఘాలు కార్మికులను మోసం చేశాయన్నారు. ట్రాన్స్‌కో, జెన్కో సంస్థలు సింగరేణికి చెల్లించాల్సిన రూ.51 వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. మెడికల్ బోర్డు నిర్వహణ, డిపెండెంట్ ఉద్యోగాలు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం, కార్మికుల గృహ కల అమలు వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు వెలబోయిన సుజేందర్, సత్కూరి శ్రీనివాస్, పునీత్ రావు, చిట్యాల ప్రవీణ్, రాజు నాయక్, దేవర సమ్మయ్య పాల్గొన్నారు. -
టైలరింగ్ కోర్సులో శిక్షణ
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో కార్యక్రమంలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్ల అందజేతసాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈనెల 22వ తేదీ నుంచి జూన్ 21వ తేదీ వరకు టైలరింగ్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు శిక్షణ ఇస్తారు. శిక్షణలో నేర్పించే అంశాలు మెథడ్ ఆఫ్ కట్టింగ్, మెథడ్ ఆఫ్ స్ట్రిచ్చింగ్, జుబ్బా, పెట్టికోట్, సారీ పెట్టికోట్, ప్లాజా, ఫ్రాక్, అంబ్రెల్లా ఫ్రాక్, వీ షేప్ ఫ్రాక్, స్లీవ్లేస్ ఫ్రాక్, అంబ్రెల్లా టాప్, క్రాస్ కట్ బ్లౌజ్, ఫిష్ అంబ్రెల్లా టాప్, కట్స్ టాప్, సాదా బ్లౌజ్, ప్రిన్స్కట్ బ్లౌజ్, కటోరి బ్లౌజ్, నార్మల్ బాటమ్, ఫ్రంట్ కుచ్చుల బాటమ్, సైడ్ కుచ్చుల బాటమ్.రిజిస్ట్రేషన్ ఫీజు : రూ.2,500/-వర్క్‌షాపు షెడ్యూల్ తేదీలు: 22–05–2026 నుంచి 21–06–2026 వరకు శిక్షణ సమయం : ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రిజిస్ట్రేషన్, శిక్షణ స్థలం వివరాలు : రేష్మా బోటిక్, ఇంటినంబర్: 10 –10– 34, మైసమ్మ వీధి, గిర్మాజీపేట, వరంగల్. ఫోన్ నంబర్ : 95330 12727, 95055 14424 -
త్వరలో మెడికల్ బోర్డు నిర్వహణ
భూపాలపల్లి అర్బన్: సింగరేణి కార్మికుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి యాజమాన్యం హామీ ఇచ్చిందని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ తెలిపారు. శుక్రవారం ఏరియాలోని కొమురయ్య భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి ఇటీవల యాజమాన్యంతో చర్చలు జరిగాయని, త్వరలో మెడికల్ బోర్డు నిర్వహించనున్నట్లు తెలిపారు. అండర్‌గ్రౌండ్ అలవెన్సుల కోతలు నిలిపివేయాలని, ఆస్పత్రి బిల్లుల పేరుతో వేతనాల నుంచి కోత విధించరాదని యాజమాన్యాన్ని కోరినట్లు చెప్పారు. పెండింగ్‌లో ఉన్న 337 మంది డిపెండెంట్లకు త్వరలో ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తారని తెలిపారు. డిస్మిస్ కార్మికుల సమస్యలు, మారుపేరు సమస్యలు, ఓవర్మెన్ల పెండింగ్ ప్రమోషన్ల పరిష్కారానికి కూడా యాజమాన్యం అంగీకరించిందన్నారు. ఆధార్ వివరాలు మారిన వారికి సెల్ఫ్ డిక్లరేషన్ ఆధారంగా ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తారన్నారు. ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా కార్మికుల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడుతుందన్నారు. రాబోయే రోజుల్లో ఉద్యమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు మోటపలుకుల రమేష్, మాతంగి రామచందర్, జి శ్రీనివాస్, ఆసిఫ్ పాషా, తాళ్ల పోషం పాల్గొన్నారు. -
మిషన్ కాకతీయకు భారీ ఊతం
సాక్షిప్రతినిధి, వరంగల్: జిల్లాలో సాగునీటి వనరుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మిషన్ కాకతీయ పనులకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసింది. గణపసముద్రం పెద్ద చెరువు కాలువల ఆధునికీకరణతో పాటు భీమ్‌ఘన్‌పూర్ చెరువు అభివృద్ధి పనులకు పరిపాలనా అనుమతులు జారీచేసింది. గణపసముద్రం చెరువు పరిధిలో కాలువల పునరుద్ధరణ, లైనింగ్, నిర్మాణ బలోపేతం పనులు చేపట్టనున్నారు. భీమ్‌ఘన్‌పూర్ చెరువులో నీటి నిల్వ సామర్థ్య పెంపు, కాలువల మరమ్మతులు, నీటి ప్రవాహం మెరుగుపరిచే పనులు నిర్వహించనున్నారు. రెండు పనులకు రూ.59 కోట్లు.. గణపసముద్రం పెద్ద చెరువు కాలువల ఆధునికీకరణకు రూ.30.95 కోట్లు, భూపాలపల్లి మండలంలోని భీమ్‌ఘన్‌పూర్ చెరువు అభివృద్ధి పనులకు రూ.28.02 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండు కలిపి సుమారు రూ.59 కోట్లతో ఈ పనులు చేపట్టనున్నారు. ప్రభుత్వం ఈ పనుల్లో నాణ్యతకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది. నల్లరేగడి, ఉబ్బే స్వభావం ఉన్న నేలల్లో తప్పనిసరిగా సీసీ లైనింగ్ ఏర్పాటు చేయాలని ఉత్తర్వులో ప్రభుత్వం ఆదేశించింది. దీంతో కాలువలు దెబ్బతినకుండా ఉండటంతో పాటు నీటి లీకేజీలు తగ్గి, సాగునీటి వినియోగ సామర్థ్యం పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. పనులకు ప్రధాన నిబంధనలు ఇవీ.. ములుగు సీఈకి పర్యవేక్షణ బాధ్యతలు.. ఇరిగేషన్, మిషన్ కాకతీయ విభాగం ఆధ్వర్యంలో అమలు చేయాలని, కాలువల హైడ్రాలిక్ డిజైన్లకు ముందస్తు సాంకేతిక అనుమతులు తప్పనిసరిగా పేర్కొంది. సీసీ లైనింగ్ కాలువలకు బలమైన రక్షణ ఉండేలా చూడాలని సూచించారు. పనుల పర్యవేక్షణ బాధ్యతను ములుగు చీఫ్ ఇంజనీర్‌కు అప్పగించిన ప్రభుత్వం.. డిజైన్లు, అంచనాలు సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని, అంచనాల్లో పేర్కొన్న వివరాల ఖచ్చితత్వానికి చీఫ్ ఇంజనీర్‌దే బాధ్యతని స్పష్టం చేశారు. చెరువులు, కాలువల ఆధునికీకరణ నిధులు రూ.59 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు గణపసముద్రం, భీమ్‌ఘన్‌పూర్ చెరువు, కాల్వలకు మహర్దశ -
రాజయ్య సంతాప సభను జయప్రదం చేయాలి
భూపాలపల్లి అర్బన్: జిల్లా కేంద్రంలో ఈ నెల 24న నిర్వహించునున్న సీపీఎం, సీఐటీయూ నాయకుడు కంపేటి రాజయ్య సంతాప సభను విజయవంతం చేయాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్(సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షుడు మంద నరసింహారావు, ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి పిలుపునిచ్చారు. ఈ సభకు సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సీఐటీయూ కార్యాయలంలో జిల్లా అధ్యక్షుడు సాయిలు అధ్యక్షతన నిర్వహించగా వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. కంపేటి రాజయ్య కార్మిక, ప్రజా సమస్యల పరిష్కారానికి జీవితాంతం పోరాడిన నాయకుడని కొనియాడారు. నాయకులు గుర్రం దేవేందర్, సిహెచ్ రవికుమార్, మేకల మహేందర్, కొండ లక్ష్మి, విజయలక్ష్మి, బండారి బాబు, తోట రమేష్ పాల్గొన్నారు. -
యువత క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలి
గోవిందరావుపేట: బహుమతులు అందజేస్తున్న ఎస్సై తాజుద్దీన్ వెంకటాపురం(ఎం)లో..గోవిందరావుపేట: యువత మద్యం మత్తు, చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని పస్రా ఎస్సై తాజుద్దీన్ అన్నారు. మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాల మైదానంలో ఎస్సై తాజుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి వాలీబాల్ క్రీడలు బుధవారం ముగిశాయి. పోటీల్లో రంగాపురం జట్టు ప్రథమ స్థానం సాధించగా, ఇప్పలగడ్డ జట్టు ద్వితీయ స్థానం దక్కించుకుంది. ఫ్రూట్ఫాం, గోవిందరావుపేట జట్లు కన్సోలేషన్ బహుమతులు పొందాయి. ఈ సందర్భంగా విజేత జట్లకు ఎస్సై తాజుద్దీన్ బహుమతులు, మెమెంటోలు అందజేశారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ.. మండల స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు జిల్లా స్థాయిలో రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. వెంకటాపురం(ఎం): మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో మూడు రోజులుగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ మండలస్థాయి క్రీడోత్సవాలు బుధవారం ముగిసినట్లు ఎస్సై చల్ల రాజు తెలిపారు. క్రీడోత్సవాలలో మండలంలోని వివిధ గ్రామాల నుంచి 14 జట్లు పాల్గొనగా బుర్గుపేటకు ప్రథమ బహుమతి, వెంకటాపూర్‌కు ద్వితీయ బహుమతి వచ్చినట్లు తెలిపారు. గెలుపొందిన జట్లకు షీల్డ్‌లతో పాటు మెమెంటోలు అందించినట్లు ఎస్సై వెల్లడించారు. -
‘పల్లా’కు పెరుగుతున్న ప్రాధాన్యం.. సీనియర్లు నియోజకవర్గాలకే..
బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం వద్ద జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ప్రాధాన్యం పెరిగింది. ఉమ్మడి వరంగల్ పార్టీ సమావేశాలు, సమీక్షలు, కేడర్ సమావేశాలు, వ్యూహాత్మక చర్చల్లో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల హనుమకొండలో కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరైన రైతు సంగ్రామ సదస్సుకు పల్లా రాజేశ్వర్‌రెడ్డి అధ్యక్షత వహించారు. తాజాగా మంగళవారం కేసీఆర్ భేటీ అనంతరం నియమించిన సభ్యత్వ నమోదు ఇన్‌చార్జ్‌ల నియామకంలోనూ ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించారు. మాజీ మంత్రి సత్యవతిరాథోడ్‌కు పాత ములుగు, జేఎస్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల బాధ్యతలు ఇవ్వగా.. గతంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇన్చార్జ్ గా ఉన్న జనగామ, వరంగల్, హనుమకొండ జిల్లాల బాధ్యతలను పల్లా రాజేశ్వర్‌రెడ్డికి అప్పగించారు. గతంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులుగా వ్యవహరించిన పలువురు సీనియర్లను సభ్యత్వ నమోదు విషయంలో నియోజకవర్గాలకే పరిమితం చేయడం పార్టీవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సాక్షిప్రతినిధి, వరంగల్ : అధికారంలోకి రావడమే లక్ష్యంగా ముందుకెళ్తున్న బీఆర్ఎస్ పార్టీ.. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమానికి కేంద్రబిందువుగా నిలిచిన ఉమ్మడి వరంగల్ జిల్లాపై పార్టీ ప్రత్యేక దృష్టి సారించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గ్రామస్థాయి నుంచి నగర, డివిజన్ల వరకు విస్తృతస్థాయిలో సభ్యత్వ నమోదు చేపట్టి మళ్లీ కేడర్‌ను కదిలించే దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రెండు రోజుల కిందట ఎర్రవెల్లి ఫామ్‌హౌజ్‌లో బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కీలక భేటీ నిర్వహించిన పార్టీ అధినేత కేసీఆర్ సభ్యత్వ సేకరణకు ఇన్చార్జ్ లను నియమించారు. సభ్యత్వ సేకరణకు రంగంలోకి ఇన్‌చార్జ్‌లు.. పార్టీ శ్రేణులను మళ్లీ యాక్టివ్ చేయడం, కార్యకర్తల్లో నమ్మకం పెంచడం, స్థానిక నాయకత్వాన్ని సమీకరించడం లక్ష్యంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్‌లో భారీ సంఖ్యలో సభ్యత్వాలు నమోదు చేసి రాష్ట్రానికి రాజకీయ సంకేతం ఇవ్వాలనే ఆలోచనతో పార్టీ ముందుకు సాగుతున్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే జిల్లాలకు ఇన్‌చార్జ్‌లను నియమించారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌కు గతంలోనూ ఇన్చార్జ్గా ఉన్న ములుగు, జేఎస్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల బాధ్యతలు అప్పగించారు. గతంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇన్చార్జ్గా ఉన్న జనగామ, వరంగల్, హనుమకొండ జిల్లాల బాధ్యతలు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి అప్పగించారు. ఎమ్మెల్సీలు తక్కళ్లపెల్లి రవిందర్రావుని ఖమ్మం, కొత్తగూడెం, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిని మేడ్చల్–మల్కాజిరి, యాదాద్రి, మెట్టు శ్రీనివాస్‌ను గద్వాల్, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాలకు ఇన్‌చార్జ్‌లుగా నియమించారు. గ్రామాల వారీగా లక్ష్యాలు.. సభ్యత్వ సేకరణకు ప్లాన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈసారి కేవలం పేరుకే కాకుండా డేటా ఆధారిత రాజకీయ వ్యూహంగా మలచాలని బీఆర్ఎస్ భావిస్తోంది. గత ఎన్నికల్లో పార్టీకి వచ్చిన ఓట్లు, బూత్‌వారీ బలం, స్థానిక నాయకత్వ ప్రభావం ఆధారంగా గ్రామాల వారీగా సభ్యత్వ లక్ష్యాలను ఖరారు చేస్తున్నట్లు సమాచారం. ప్రతీ మండలానికి ప్రత్యేక టార్గెట్లు ఇవ్వడంతోపాటు యువత, మహిళలు, రైతులు, విద్యార్థులు, పాత కార్యకర్తలపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. మాజీ ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల నేతలు, మండల స్థాయి నాయకులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించి కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇటీవల నిర్వహించిన రైతు సంగ్రామ సభకు వచ్చిన స్పందనతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా గ్రామస్థాయిలో మళ్లీ పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేసి, భవిష్యత్ ఎన్నికలకు సిద్ధం కావాలనే లక్ష్యంతో పార్టీ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్‌లో భారీ స్థాయిలో సభ్యత్వ నమోదు జరిగితే రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి కొత్త ఊపు వస్తుందనే భావన బీఆర్ఎస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. సత్యవతిరాథోడ్పల్లా రాజేశ్వర్‌రెడ్డి -
కలెక్టర్‌ను కలిసిన కాటారం ఆర్డీఓ
భూపాలపల్లి అర్బన్: కాటారం ఆర్డీఓగా బాధ్యతలు స్వీకరించిన డి.రవీందర్ బుధవారం కలెక్టర్ రాహుల్‌శర్మను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్‌శర్మ ఆర్డీఓ రవీందర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలులో సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. ప్రజలకు పారదర్శకంగా, సమర్థవంతంగా సేవలు అందించాలని సూచించారు. ఇద్దరు ఉద్యోగులపై చర్యలు మొగుళ్లపల్లి: పీఏసీఎస్ సీఈఓ అప్పం సాగర్‌ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ రాహుల్‌శర్మ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. కలెక్టర్ మంగళవారం మొగుళ్లపల్లి పీఏసీఎస్‌కు చెందిన మొట్లపల్లి ధాన్యం సేకరణ కేంద్రం(పీసీసీ)లో తనిఖీ చేసి ధాన్యం కొనుగోలుకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. రికార్డుల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండడంతో పాటు, ధాన్యం తూకం వేయకుండా సంబంధిత రైతులకు ధాన్యం కొనుగోలు రసీదులు జారీచేయకుండా ధాన్యం మిల్లులకు తరలించినట్లు తనిఖీలో నిర్ధారించారు. ఇతర అవకతవకలు వెలుగు చూశాయి. దీంతో మొట్లపల్లి పీసీసీ ఇన్చార్జ్ ప్రశాంత్‌ను విధుల నుంచి తొలగిస్తూ, సీఈఓ సాగర్‌పై కలెక్టర్ సస్పెన్షన్ వేటు వేశారు. మొగుళ్లపల్లి పీఏసీఎస్‌లో పనిచేస్తున్న ఎం. రమేశ్‌ను ఇన్చార్జ్ సీఈఓగా నియమిస్తూ, మొట్లపల్లి పీసీసీ సెంటర్లో రైతులకు ఇబ్బందులు కలుగకుండా సత్వరమే మరొకరిని నియమించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం మొక్కజొన్న, ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగాలని.. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆయా కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలు జరిగినా రైతులను ఇబ్బందులకు గురిచేసినా చర్యలు తప్పవన్నారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు టేకుమట్ల: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలైన ఘటన మండలంలోని వెంకట్రావుపల్లి శివారులో బుధవారం చోటుచేసుకుంది. వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన జనగాం కుమార్, హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల మండల కేంద్రానికి చెందిన రాజ్‌కుమార్ ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108కి సమాచారం అందించగా క్షతగాత్రులను చికిత్స నిమిత్తం చిట్యాల సివిల్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికి త్స నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. -
విద్యతోనే గ్రామాల ప్రగతి సాధ్యం
● సర్పంచ్ గురుసింగబాబు కాళేశ్వరం: గ్రామాల అభివృద్ధి, సమాజ ప్రగతి సాధించాలంటే విద్యే ప్రధాన మార్గమని చండ్రుపల్లి సర్పంచ్ గురుసింగబాబు అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మూడో రోజు బుధవారం మహదేవపూర్ మండలం కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ జన్ను విజయకుమార్ అధ్యక్షతన వివిధ గ్రామపంచాయతీల సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లకు విద్యార్థుల నమోదు ప్రక్రియ గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యా వ్యవస్థ పురోగతి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నత విద్య ప్రాధాన్యతపై చర్చించారు. అనంతరం సర్పంచ్ గురు సింగబాబు మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలోని సర్పంచ్‌లు తమ గ్రామాల విద్యార్థులను సమీపంలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో చేరేలా గ్రామ సభల్లో తీర్మానాలు చేసి ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. కళాశాల ప్రిన్సిపాల్ జన్ను విజయకుమార్ మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతాలకు చెందిన ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఉన్నత విద్య అందించాలనే లక్ష్యంతో మండల కేంద్రంలో 2008 సంవత్సరంలో ఈ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేశారని తెలిపారు. అన్నారం సర్పంచ్ నీర్ల ప్రభాకర్, మద్దులపల్లి సర్పంచ్ వేల్పుల సరిత, పలుగుల సర్పంచ్ విజయలక్ష్మి, మెట్పల్లి ఉప సర్పంచ్ రాజు, వివిధ గ్రామపంచాయతీల ప్రజాప్రతినిధులు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రభుత్వ కళాశాలలో చేరాలి మల్హర్: పదవ తరగతి పాస్ అయిన విద్యార్థులు మండలంలోని తాడిచర్ల ప్రభుత్వ కళాశాలలో చేరాలని సర్పంచ్ బండి స్వామి కోరారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాల్లో భాగంగా బుధవారం జూనియర్ కళాశాల అధ్యాపకులతో కలిసి సర్పంచ్ బండి స్వామి విద్యార్థులకు, వారి తల్లిద్రండులకు అవగాహన కల్పించారు. ఈ విద్యా సంవత్సరంలో ముఖ్యంగా విద్యార్థినుల తల్లిదండ్రులు అమ్మాయిలను తప్పకుండా పైచదువులు చదివించాలన్నారు. చదువు మానేయకుండా తల్లిదండ్రులు చూసుకోవాలని చెప్పారు. ఇంటర్ వార్షిక పరీక్షల్లో రాష్ట్రంలోనే ఉత్తమ ఫలితాలు పొందినందుకుగాను కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి విజయదేవిని, అధ్యాపకులను ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి చర్యలు
భూపాలపల్లి అర్బన్: ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్హాల్లో నిర్వహించిన ప్రత్యేక విద్యా వారోత్సవాల వర్క్‌షాప్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు సర్పంచులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. కలెక్టర్ రాహుల్‌శర్మ మాట్లాడుతూ.. విద్యావ్యవస్థ బలోపేతానికి వారోత్సవాల ద్వారా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఆర్ఓ వసంతకుమారి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, డీఈఓ రాజేందర్ పాల్గొన్నారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తాలు, తడక పేరుతో రైతులను దోపిడీ చేస్తే సహించబోమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు రైస్ మిల్లర్లను హెచ్చరించారు. కలెక్టరేట్లో ఽకలెక్టర్ రాహుల్‌శర్మతో కలిసి సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
పేగుబంధం వదులుకుంది..! వైద్యబంధం అల్లుకుంది..!!
ఆడశిశువుకు ‘అమ్మ’ ప్రేమను పంచిన జనగామ ఎంసీహెచ్తిక్కరపు పద్మ, నరేష్ దంపతులు జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం కళ్లెం గ్రామంలో ఓ వ్యక్తి వద్ద ఇటుక తయారీ పనులు చేస్తున్నారు. నలుగురు పిల్లలు ఉన్న వీరికి మార్చి 23న ఐదో సంతానంగా చంపక్‌హిల్స్ ఎంసీహెచ్‌లో ఆడపిల్ల జన్మించింది. పుట్టుక సమయంలో పాప బరువు 1.25 కిలోలు మాత్రమే. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా ఉండడంతో వైద్యులు తక్షణ చికిత్స ప్రారంభించారు. వారం రోజుల తర్వాత పద్మ కుట్లు విప్పిన వెంటనే పాప ఆడపిల్ల కావడంతో ‘మేము సాకలేం, మీరే చూసుకోండి’ అంటూ డాక్టర్లకు చెప్పి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. అసాధారణమైన ఈ ఘటనను గమనించిన డాక్టర్ మధుసూదన్‌రెడ్డి విషయం వెంటనే చైల్డ్ వెల్ఫేర్‌శాఖకు తెలియజేశారు. అధికారులు వచ్చి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వగా, పాపను తామే పెంచుకుంటామని వారినుంచి హామీ తీసుకున్నారు. అయితే తల్లిదండ్రులు రెండు రోజులు గడవకముందే ఎవరికీ చెప్పకుండా ఆస్పత్రిలోనే పాపను వదిలేసి వెళ్లిపోయారు. వెంటనే ఆస్పత్రి రికార్డులో ఉన్న ఫోన్‌నంబర్ ఆధారంగా నరేష్‌కు ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారు, మీ ఊరు ఏంటి అని అడిగారు. ఒకసారి రాయలసీమ, మరోసారి ఉత్తరాంధ్ర అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు డాక్టర్లు తెలిపారు. లింగాలఘణపురం మండలం కళ్లెం గ్రామానికి వెళ్లిచూడగా వారు అక్కడినుంచి వెళ్లిపోయినట్లు గుర్తించారు. జనగామ: నెలలు నిండకముందే 1.25 కిలోల బరువుతో పుట్టి చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న పాపతో రక్తబంధం వదిలేసుకున్నారు ఆ తల్లిదండ్రులు. కానీ, ఆ పసికందును ఈ లోకంలోకి తీసుకువచ్చిన వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది మాత్రం అక్కున చేర్చుకున్నారు. రోజంతా పర్యవేక్షణ, పాల ఫీడింగ్, ప్రేమతో కూడిన సంరక్షణతో ఆ శిశువులో నెమ్మదిగా మార్పు తీసుకువచ్చారు. తల్లి దూరమైన చోట మానవత్వం వెల్లివిరిసింది. నేడు పాప బరువు 2.3 కిలోలకు చేరి ఆరోగ్యంగా మారింది. జనగామ జిల్లా చంపక్ హిల్స్ ఎంసీహెచ్ ఆస్పత్రిలో 50 రోజుల క్రితం చోటుచేసుకున్న ఘటన ఇప్పటికీ అందరినీ కదిలిస్తోంది. పేగుబంధం వదిలి వెళ్లినా.. అక్కున చేర్చుకుని పునర్జన్మనిచ్చిన ఆస్పత్రి, శిశువు కథ ఇది. అమ్మగా మారిన ఎస్ఎన్సీయూ పాపను పేగుబంధం కాదనుకున్నా.. వైద్యులు అక్కున చేర్చుకున్నారు. డాక్టర్ మధుసూదన్‌రెడ్డి పర్యవేక్షణలో పాపకు ఎస్‌ఎన్‌సీయూలో మెరుగైన వైద్యం అందిస్తూ, కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఒక్కో అనారోగ్య సమస్యకు చికిత్స చేసుకుంటూ వచ్చారు. రోజూ పాల డబ్బాతో ఫీడింగ్, అమ్మ ప్రేమ, లాలన అందిస్తూ పసిబిడ్డకు మాతృమూర్తుల్లా డాక్టర్లు, నర్సులు సంరక్షిస్తున్నారు. ఎనిమిది రోజుల వయసులో తల్లి ప్రేమ కోల్పోయిన ఈ పాపకు, ఎస్ఎన్సీయూ సిబ్బందే దేవుడిచ్చిన అమ్మలు అయ్యారు. తక్కువ బరువు నుంచి సంపూర్ణ ఆరోగ్యం.. 50 రోజుల చికిత్సతో పాప స్థితి రోజురోజుకూ మెరుగైందని డాక్టర్లు తెలిపారు. పాప పుట్టిన సమయంలో కిలో 250 గ్రాములు ఉండగా, ప్రస్తుత బరువు 2.300 కిలోలతో పూర్తిగా కోలుకుంది. ఎటువంటి అనారోగ్య సమస్య లేదు. బరువు 2.5 కిలోలకు చేరగానే చైల్డ్ వెల్ఫేర్ శాఖ సమన్వయంతో హనుమకొండ శిశుగృహానికి పాపను తరలించనున్నట్లు ఎంసీహెచ్ వైద్యుడు మధుసూదన్‌రెడ్డి ‘సాక్షి’కి వివరించారు.శిశువుకు అమ్మ ప్రేమను పంచుతున్న డాక్టర్, సిబ్బంది నెలలు నిండక తక్కువ బరువు, అనారోగ్య సమస్యలతో శిశువు జననం సాకలేమని వదిలివెళ్లిన తల్లిదండ్రులు.. అక్కున చేర్చుకున్న ఆస్పత్రి రక్తబంధం వదిలినా.. తల్లి ప్రేమ పంచి అన్నీ తామై చూసుకున్న వైద్యులు, సిబ్బంది 50 రోజుల్లో అద్భుతం.. బరువు పెరగడంతోపాటు సంపూర్ణ ఆరోగ్యంగా శిశువు -
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం
భూపాలపల్లి అర్బన్: జిల్లాలోని నాలుగు పరీక్ష కేంద్రాల్లో బుధవారం ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. మొదటి రోజు ద్వితీయ భాష (సెకండ్ లాంగ్వేజ్) పేపర్–1 పరీక్షకు 437 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 413 మంది పరీక్ష రాసినట్లు డీఐఈఓ వెంకన్న తెలిపారు. పేపర్–1 పరీక్షకు 24 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. దూర ప్రాంతాలకు చెందిన విద్యార్థులు పరీక్ష సమయానికి అర గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. మధ్యాహ్నం నిర్వహించిన రెండో సంవత్సరం విద్యార్థులకు సెకండ్ లాంగ్వేజ్ పేపర్–2 పరీక్షకు మొత్తం 78 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 73 మంది పరీక్ష రాశారు. ఐదుగురు విద్యార్థులు గైర్హాజరయ్యారు. ప్రశాంతంగా పాలిసెట్ ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశం కోసం జిల్లా కేంద్రంలోని నాలుగు పరీక్ష కేంద్రాల్లో బుధవారం నిర్వహించిన పాలిసెట్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, సంఘమిత్ర డిగ్రీ కళాశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఇందులో మొత్తం 905 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 842 మంది పరీక్ష రాసినట్లు పాలిసెట్ జిల్లా సమన్వయకర్త, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.రమణారావు తెలిపారు. 63మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. వేసవి దృష్ట్యా విద్యార్థులు వారికి కేటాయించిన పరీక్ష కేంద్రాల వద్దకు పరీక్ష సమయానికి అరగంట ముందుగానే చేరుకున్నారు. దూరప్రాంతాలకు చెందిన పిల్లలను ద్విచక్రవాహనాలు, ఆటోల ద్వారా వారి తల్లితండ్రులు, కుటుంబసభ్యులు తీసుకొచ్చారు. పరీక్ష ముగిసే వరకు తల్లితండ్రులు పరీక్ష కేంద్రాలకు సమీపంలోనే పలు దుకాణాల ముందు, చెట్ల నీడకు వేచి చూశారు. -
గ్రామాభివృద్ధికి నిధులు కేటాయించాలి
రేగొండ: మండలంలోని పెద్దంపల్లి గ్రామాభివృద్ధికి నిధులు కేటాయించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ర్పడినప్పటి నుండి గ్రామాభివృద్ధికి ఎటువంటి ని ధులు కేటాయించలేదని ఆరోపించారు. గ్రామంలో జరిగిన అభివృద్ధి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరైనవేనని తెలిపారు. ఇప్పటికై నా గ్రామానికి ని ధులు మంజూరు చేసి గ్రామాభివృద్ధికి సహకరించా లని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సకినాల రవీందర్, బీఆర్ఎస్ మండల నాయకుడు ర త్నాకర్, వార్డుమెంబర్లు, తదితరులు పాల్గొన్నారు. -
అంత్య పుష్కరాలకు ఆహ్వానం
కాళేశ్వరం: కాళేశ్వరంలో ఈనెల 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు జరుగు సరస్వతీనది అంత్య పుష్కరాలకు ప్రముఖులను దేవాదాయశాఖ ప్రిన్సి పల్ సెక్రటరీ శైలజారామయ్యర్, కమిషనర్ హనుమంతరావు ఆహ్వాన పత్రికలు అందజేశారు. బుధవారం హైదరాబాద్‌లో రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావులకు ఆహ్వాన పత్రిక అందజేశారు. వారి వెంట కాళేశ్వరం దేవస్థానం చైర్మన్ మోహన్‌శర్మ, ఆర్జేసీ రామకృష్ణరావు, ఈఓ మహేష్, ఉపప్రధాన అర్చకుడు ఫణీంద్రశర్మ ఉన్నారు. -
పాలశీతలీకరణ కేంద్రం నిరుపయోగం
చిట్యాల: మండల కేంద్రంలో కొంతకాలం నుంచి పాలశీతలీకరణ కేంద్రం నిరుపయోగంగా ఉంది. దీంతో పాడి రైతులు అనేక అవస్థలు పడుతున్నారు. ఒకప్పుడు మండలంలోని గుంటురుపల్లి, నవాబుపేటతో పాటు పలు గ్రామాలలో పాడి రైతులు సుమారు వందల లీటర్ల పాలను తీసుకుని పరకాల, హనుమకొండ పట్టణాలకు తరలించి అమ్ముకునేవారు. ఈ క్రమంలో మండల కేంద్రంలో 2002 జనవరిలో పాలశీతలికరణ కేంద్రాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి పాడి రైతులు పాలశీతలికరణ కేంద్రానికి పాలను తీసుకవచ్చి విక్రయించి అబ్ధిపొందేవారు. ఈ విధంగా మూడు సంవత్సరాలు సాఫీగా కొనసాగింది. కాలక్రమేణ పాలశీతలికరణ కేంద్రంకు పాలు అనుకున్నట్లు రావడం లేదనే సాకుతో అప్పటి సంబంధిత అధికారులు ములుగుకు తరలించినట్లు రైతులు తెలిపారు. కాగా, రైతుల విజ్ఞప్తి మేరకు మరికొన్ని నెలలు నామామాత్రంగా పాలశీతలికరణ కేంద్రాన్ని నడిపించుకుంటూ ఓ వాహనంలో పాలసేకరణ చేపట్టి అధికారులు చేతులు దులుపుకున్నట్లు పేర్కొటున్నారు. దీంతో పాలశీతలికరణ కేంద్రంలో ఉన్న యంత్రాలు మూలన పడి తుప్పుపట్టి పోయాయి. ఆర్థికంగా నష్టపోతున్న పాడి రైతులు ప్రభుత్వాలు మహిళా సంఘాలకు పాడి రైతులకు రుణాలు అందజేసి వాటి ద్వారా పాడి గేదెలను కొనుగోలు చేయించేవి. దీంతో రైతులు, మహిళా సంఘాల సభ్యులు పాలను విక్రయిస్తూ బ్యాంకు రుణాలు పోను ఆర్థికంగా బలపడేవారు. మండల కేంద్రంలోని పాలశీతలికరణ కేంద్రం మూతపడడంతో పాలను విక్రయించేందుకు ఇబ్బందులు పడుతూ తక్కువ ధరకు పాలను అమ్ముతూ ఆర్థికంగా నష్టపోతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టిపెట్టి మండల కేంద్రంలో పాలశీతలికరణ కేంద్రాన్ని పునర్ప్రాంభించాలని పలు గ్రామాల పాడి రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఉపాధి కోల్పోతున్న పాడి రైతులు పట్టించుకోని అధికారులుపునర్ప్రారంభించాలిమండల కేంద్రంలో కొంత కాలం క్రితం మూతపడిన పాలశీతలికరణ కేంద్రాన్ని అధికారులు పునర్ప్రారంభించాలి. నేను ప్రతి రోజు పది లీటర్ల పాలను పట్టణాలకు పంపుతూ ఇబ్బందులు పడుతున్నా. మండల కేంద్రంలో పాలశీతలికరణ కేంద్రం ఉంటే ఏలాంటి ఇబ్బంది ఉండదు. అధికారులు, పాలకులు స్పందించి పాలకేంద్రాన్ని మళ్లీ ఏర్పాటు చేయాలి. – కసిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి. పాడిగేదెల రైతు, నవాబుపేట -
ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి
మల్హర్/మల్హర్(కాటారం): ఽజాప్యం లేకుండా ధాన్యం కొనుగోళ్లను వేగంగా చేపట్టాలని కలెక్టర్ రాహుల్‌శర్మ అధికారులను ఆదేశించారు. బుధవారం మల్హర్ మండలం కొయ్యూరు, కొండంపేట, కాటారం మండలంలోని కొత్తపల్లి, కాటారం వ్యవసాయ మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల వద్ద తార్ఫాలిన్లు అందుబాటులో ఉంచాలన్నారు. రవాణా సమస్య ఉంటే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని స్పష్టం చేశారు. రోజుకు రెండు లారీలు కొనుగోలు కేంద్రాలకు పంపాలని ఆదేశించారు. కచ్చితమైన రిజిస్టర్లు ఏర్పాటు చేసి వివరాలు నమోదు చేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని శుభ్రపరచాలని తాలు, రాళ్లు, మట్టి గుల్లలు లేని నాణ్యమైన ధాన్యాన్ని మిల్లులకు పంపించేందుకు రైతుల సహకరించాలన్నారు. ప్యాడీ క్లీనింగ్ పరికరాలు అందుబాటులో లేకపోతే మరొకచోట నుంచి తెప్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, డీఆర్ఓ వసంతకుమారి, పౌర సరఫరాల అధికారి కిరణ్‌కుమార్, డీఎం రాములు, సహకార అధికారి వాలియానాయక్, వ్యవసాయ అధికారి బాబూరావు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ -
తునికాకు సేకరణ
మహాముత్తారం: మండలంలోని జీలపల్లి, మాదారం, మహాముత్తారం, సింగారం, యామన్‌పల్లి గ్రామాల్లోని గిరిజనులు, గిరిజనేతరులు నాలుగు రోజులనుండి గ్రామసమీపంలోని అడవుల్లో తునికాకు సేకరణ చేపడుతున్నారు. ఉదయం సేకరించిన ఆకును కట్టలు కట్టి కల్లోకి చేరవేస్తున్నారు. కాగా, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే యూనిట్లు టెండరయ్యాయి. మరికొన్ని గ్రామాల్లో తునికాకు టెండర్లు కాకపోవడంతో ఆయా గ్రామాల్లోని ప్రజలు ఆదాయాన్ని కోల్పోతున్నారు. పరామర్శ మహాముత్తారం: మండలంలోని వజినేపల్లి గ్రామానికి చెందిన దుర్గం సమ్మయ్య అనారోగ్యంతో బాధపడుతున్నాడు. విషయం తెలుసుకున్నా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చందుపట్ల సునీల్‌రెడ్డి, చల్ల నారాయణరెడ్డి బుధవారం వజినేపల్లిలో వారి ఇంటికి వెళ్లి పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు పూర్ణచందర్, నాయకులు రఫీ, దుర్గం తిరుపతి తదితరులు ఉన్నారు. ఆర్డీఓకు సన్మానం మల్హర్(కాటారం): మండలంలోని కాటారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీఓగా బాధ్యతలు చేపట్టిన రవీందర్‌ను బుధవారం ఈజీఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్, కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆర్డీఓను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పంతకా ని సమ్మయ్య, కొండగొర్ల రాంనారాయణ, ఆ త్మకూరి కుమార్‌యాదవ్ పాల్గొన్నారు. టేకుమట్ల: మామపై దాడి చేసిన అల్లుడి అరెస్టు చేసిన సంఘటన మండలంలోని గుమ్మడవెల్లిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గుమ్మడవెల్లి గ్రామానికి చెందిన ఆకినపల్లి హరీశ్ తన మామ మొలుగూరి సదానందం మధ్య ఇటీవల వాగ్వాదం జరిగింది. తీవ్ర కోపోద్రిక్తుడైన హరీశ్ ఆయన మామ సదానందంను కర్రతో బలంగా కొట్టాడు. సదానందం కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని కోర్టులో హాజరు పరచగా జడ్జి పరకాల జైలుకు రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై అమూల్య తెలిపారు. మహాముత్తారం: మండలంలోని బోర్లగూడెం గ్రామంలో జీసీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బోర్లగూడెం సర్పంచ్ అజ్మీరా ధరమ్‌సింగ్ బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సెంటర్ ఇన్చార్జ్ సీతునాయక్ ,రైతులు పాల్గొన్నారు. -
వీఐపీ ఘాట్.. దుర్వాసన
కాళేశ్వరం: కాళేశ్వరంలోని వీఐపీ ఘాట్ వద్ద కార్మికులు తినిపారేసిన ఆహార కవర్లు, చెత్త పేరుకుపోవడంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. సరస్వతీనది అంత్య పుష్కరాల ఏర్పాట్లలో పనిచేస్తున్న కార్మికులకు సంబంధిత కాంట్రాక్టర్ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి పూట వారికి భోజనాన్ని కవర్లలో అందిస్తున్నప్పటికీ, వాటిని నిర్లక్ష్యంగా ఘాట్ పరిసరాల్లోనే పడేస్తున్నారు. దీంతో ఘాట్ ప్రాంతం అపరిశుభ్రంగా మారి భక్తులకు అసౌకర్యం కలుగుతోంది. దేవాదాయ, పంచాయతీ శాఖ అధికారులు వెంటనే స్పందించి పరిశుభ్రత చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. సరస్వతీఘాట్‌లో ముమ్మర ఏర్పాట్లు భక్తులు నడిచేందుకు వీలుగా సరస్వతీఘాట్ నుంచి గోదావరిలో నీటి వరకు మట్టి రోడ్డు నిర్మాణం చేపట్టారు. రోడ్డు పూర్తయిన తరువాత వెదురు చలువ పందిర్లు వేయనున్నారు. వీఐపీ ఘాటు వద్దనే భక్తుల కోసం డార్మెటరీ రూమ్‌లు, స్టాల్స్ ఏర్పాటు, టెంట్ సిటీ ఏసీ, నాన్ ఏసీ రూమ్‌ల నిర్మాణం చేపట్టారు. పార్కింగ్ స్థలాలు చేపట్టారు. ఈనెల 20 వరకు పూర్తయ్యేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
మల్హర్(కాటారం): నీట్–2026 పరీక్షలో జరిగిన పేపర్ లీకేజీతో విద్యార్థుల భవిష్యత్‌పై దాడి జరిగిందని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని టీపీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మండలంలోని కాటారంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కిరణ్ మాట్లాడారు. దేశంలో ఇప్పటికే నిరుద్యోగం, కార్పొరేట్ విద్యా వ్యవస్థ, కోచింగ్ మాఫియా భారంతో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులపై ఇది మరో మోసపూరిత దాడి అని ఆరోపించారు. పరీక్షకు ముందు ప్రశ్నాపత్రం బయటకు రావడం, అనేక ప్రశ్నలు అసలు పరీక్షతో సరిపోవడం, తదనంతరం పరీక్ష రద్దు వరకు వెళ్లడం దేశ పరీక్షా వ్యవస్థ పూర్తిగా వైఫల్యానికి గురైందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విద్యార్థుల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయాయన్నారు. నీట్ పేపర్ లీకేజీపై సిట్టింగ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ఫ్రంట్ జిల్లా నాయకులు అయిత బాపు, దాసరి రమేష్, దారకొండ సూర్యశంకర్, వెంకటేశ్వర్లు. తదితరులు పాల్గొన్నారు. టీపీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్ -
ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి
● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు రేగొండ: ప్రజలందరూ ఎల్లవేళలా సుఖసంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. బుధవారం మండలంలోని తిరుమలగిరి గ్రామంలో పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ దేవతల దీవెనలు ప్రజలపైన నిండుగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండేలా చూడాలని మొక్కులు చెల్లించుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుదర్శన్, ఉపసర్పంచ్ ఆకుతోట తిరుపతి, నాయకులు పన్నాటి శ్రీనివాస్, రొంటాల వెంకటస్వామి, తదితరులు పాల్గొన్నారు. -
ఊపందుకున్న ‘ఉపాధి’ పనులు
మల్హర్: ప్రజలకు అన్నికాలాల్లో ఉపాధి కల్పించి ఆర్థికంగా బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రస్తుతం మండలంలో ఉపాధి పనులు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం సీజన్ కావడం.. వ్యవసాయ పనులు పెద్దగా లేకపోవడంతో పనులకు వెళ్లేందుకు కూలీలు ఆసక్తి చూపుతున్నారు. ఉన్నతాధికారులు గ్రామల వారీగా లక్ష్యాన్ని విధించడంతో పని చేసి వారి సంఖ్య పెంచేందుకు ప్రత్యేక దృష్టి సారించారు. మండలంలో 8,495 జాబ్‌కార్డులు.. మండలంలోని 15 గ్రామ పంచాయతీల్లో 22 గ్రామాల్లో 8,495 జాబ్ కార్డులు ఉన్నాయి. వీటీలో కూలీల సంఖ్య 18,873 ఉండగా ఉన్నారు. మూడు రోజులుగా1600 పై చిలుకు కూలీలు ఉపాధిహామీ పనులకు హాజరవుతున్నారని అధికారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో కూలీల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఎండ తీవ్రత కారణంగా ప్రతి రోజు ఉదయం 5:30 గంటల నుంచి ఉదయం 10:30 గంటల వరకే కూలీలు పనులుకు వెళ్తున్నారు. వడదెబ్బకు గురికాకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేస్తున్నారు. కొద్దిరోజులగా ఉపాధి హామీ పనులకు కూలీలు సంఖ్య పెంచడానికి ఉపాధిహామీ ఏపీఓ హరీష్, టీఏలు నిత్యం గ్రామాల్లోకి వెళ్లి జాబ్ కార్డు కలిగిన ప్రతిఒక్కరూ పనులకు రావాలని అవగాహన కల్పించారు. దీంతో రోజురోజుకూ కూలీల సంఖ్య పెరుగుతుంది. పనికి వెళ్తున్న 1634 మంది కూలీలు అవగాహన కల్పిస్తున్న అధికారులు -
ధాన్యం లారీలకు జీపీఎస్
వాహనాల కదలికలపై నిత్యం పర్యవేక్షణ● మిల్లుల్లో అన్లోడింగ్ జాప్యానికి చెక్ ● నూతన పద్ధతిలోనే కేటాయింపులు ● రైతులకు త్వరగా డబ్బులు చెల్లించే అవకాశంభూపాలపల్లి రూరల్: మిల్లులకు సమానంగా ధాన్యం కేటాయింపులు, పంపిన ధాన్యాన్ని అన్లోడ్ చేయడంలో జాప్యాన్ని నియంత్రించేందుకు అధికా రులు జీపీఎస్ (గ్లోబల్ పోజిషనింగ్ సిస్టమ్) ట్రాకింగ్ ఏర్పాటు చేశారు. ఈ సీజన్లో ధాన్యం కొనుగోలులో ట్రక్ షీట్ జనరేట్తోపాటు ఆన్లైన్లోనే మిల్లులకు కేటాయింపులను ప్రారంభించారు. తరుగు పేరుతో దోపిడీని అరికట్టనున్నారు. డబ్బుల చెల్లింపులు వేగిరం చేయనున్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా, క్రమబద్ధంగా నిర్వహించేందుకు పౌరసరఫరాల శాఖ నూతన పద్ధతులను అమలు చేస్తుంది. జిల్లా వ్యాప్తంగా యాసంగిలో 95,590 ఎకరాల్లో వరి సాగు కాగా 1.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని జిల్లా వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 185 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు వేసి కొనుగోళ్లు ప్రారంభించారు. ఇప్పటివరకు 12 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.3 కోట్ల చెల్లింపులు చేశారు. అక్రమాలను అరికట్టేందుకే.. ధాన్యం రవాణాలో అక్రమాలను అరికట్టేందుకు జీపీఎస్ విధానాన్ని అమలు చేస్తున్నారు. తరుగు ఎక్కువగా తీయాలని మిల్లర్లు రోజుల తరబడి వాహనాల నుంచి ధాన్యం అన్లోడ్ చేయకుండా ఉంచేవారు. ధాన్యం తరుగును తీసేందుకు అంగీకరిస్తేనే దించుకునేవారు. జీపీఎస్ ఏర్పాటు చేయడంతో ఎంత సమయం వేచి ఉంది, ఎందుకు వేయిటింగ్ చేయించారనే వివరాలు తీసుకోనున్నారు. కావాలని ఆలస్యం చేస్తే మిల్లర్లపై చర్యలు తీసుకుంటారు. అక్రమాలను చెక్ పెట్టేందుకు లారీలు, డీసీఎం వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ పరికరాలు అమర్చడం తప్పనిసరి చేశారు. జీపీఎస్ సరిగా పనిచేస్తున్న వాహనాలకు మాత్రమే లోడింగ్ చేయనున్నారు. వాహనాల కదలికలను నిత్యం పర్యవేక్షించనున్నారు. ఇలా ఆన్లైన్లో ట్రక్ షీట్లు జనరేట్ చేయడం, వాహనాలకు జీపీఎస్ ఏర్పాటుతో రైతులకు మేలు జరగనుంది. తరుగు పేరుతో దోపిడీకి పాల్పడే అవకాశాలు తగ్గిపోనున్నాయి. రైతులకు 48 గంటల్లో ధాన్యం డబ్బులు జమకానున్నాయి.. ‘పలుకుబడి’కి ఇక చెల్లు ఇదివరకు సివిల్ సప్లయీస్ అధికారులు, స్థానిక అధికారులకు నచ్చిన మిల్లులకు, పలుకుబడి ఉన్న నేతల మిల్లులకు అధికంగా ధాన్యం కేటాయించేవారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో మిల్లుల యజమానుల నుంచి ఫిర్యాదులు, అధిక తరుగు, మిల్లుల వద్ద లారీలు పడిగాపులకు, అక్రమాలకు చెక్ పడనుంది. నాణ్యతలేదనే పేరుతో కోతలు, ట్రక్ షీట్లలో అవకతవకలకు పాల్పడే అవకాశాలు ఉండవు. కొనుగోలు కేంద్రాల్లో లారీ లోడ్ చేసిన వెంటనే ఆన్లైన్ ట్రక్ జనరేట్ చేసి, సంబంధిత మిల్లును ఆటోమేటిక్‌గా కేటాయించే విధానాన్ని అమలు చేస్తుంది. మాన్యువల్‌గా మిల్లుల కేటాయింపు విధానాన్ని నిలిపేసింది. కొత్త విధానంతో లారీ లోడ్ చేసే సమయానికి మిల్లు వివరాలు తెలియవు. ట్రక్ షీట్ ఆన్లైన్లో జనరేట్ రేట్ చేసిన తర్వాతనే ఆటోమేటిక్‌గా ఏ మిల్లుకు తరలించాలో సూచిస్తుంది. ట్రక్ షీట్లో పేర్కొన్న మిల్లుకే ధాన్యాన్ని తరలించాల్సి ఉంటుంది. పారదర్శకత కోసమే..మిల్లర్లకు ధాన్యం కేటాయింపుల్లో పారదర్శకత, త్వరగా రైతులకు డబ్బులు చెల్లింపులు జరగనున్నాయి. తరుగు పేరుతో ఇక మిల్లర్ల ఇబ్బందులు ఉండవు. వాహనాలకు సైతం జీపీఎస్ ఏర్పాటు చేశాం. దీంతో మిల్లర్లు అన్లోడింగ్ జాప్యం తగ్గనుంది. దీంతో రైతులకు మేలు జరగనుంది. అకాల వర్షానికి తడిచిన 612 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి నేరుగా మిల్లులకు తరలించాం. – రాములు, డీఎం సివిల్ సప్లయీస్ అధికారి -
కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి
● డీసీసీ అధ్యక్షుడు కరుణాకర్ భూపాలపల్లి అర్బన్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని పట్టణ కాంగ్రెస్ కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. బాలికపై అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడిపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పటికీ బీజేపీ నాయకత్వం స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. కేసు విచారణ పూర్తయ్యే వరకు ఆయన ఎంపీ, మంత్రి పదవులకు రాజీనామా చేసి విచారణకు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమరయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీను, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు భువనసుందర్, వెంకీయాదవ్, దేవన్, లక్ష్మి, పరమేశ్వరి, అజ్మీర జంపన్న, రమేష్, హఫీజ్, రాధా, ప్రేమ్‌కుమార్, నాగరాజు, కిషోర్, భిక్షపతి, పొనగంటి శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా హనుమాన్ జయంతి
సాక్షి నెట్వర్క్: జిల్లావ్యాప్తంగా మంగళవారం హనుమాన్ జయంతిని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అభయాంజనేయ స్వామి ఆలయాల్లో అర్చకులు స్వామివారికి చందనం, తైలాభిషేకం, పంచాంమృతాలతో అభిషేకాలు, తమలపాకులతో ప్రత్యేకంగా అలంకరించారు. వడపప్పు, బెల్లం పాయసం నైవేద్యాలుగా సమర్పించారు. కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ అనుబంధ దేవాలయమైన కట్ట మీద ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. సాయంత్రం హనుమాన్ భక్తులు ద్విచక్ర వాహన ర్యాలీ, శోభాయాత్ర నిర్వహించారు. -
ఇందిరమ్మ ఇళ్లను త్వరగా పూర్తి చేయాలి
● అదనపు కలెక్టర్ విజయలక్ష్మి చిట్యాల: ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులు త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ విజయలక్ష్మి అన్నారు. మండలంలోని నైన్పాక గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే జూన్ 2న ఇందిరమ్మ ఇళ్ల సామూహిక ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఉన్నందున పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. అనంతరం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నర్సరీని సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జయశ్రీ, హౌసింగ్ డీఈ శ్రీకాంత్, ఏఈ సౌమ్య, సర్పంచ్ నక్క భాస్కర్, పంచాయతీ కార్యదర్శి విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు. -
తప్పులు లేకుండా సర్వే పూర్తిచేయాలి
ములుగు: మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న ఇళ్ల గణనలో తప్పులు లేకుండా సర్వే పూర్తి చేయాలని ఎన్యుమరేటర్లకు రాష్ట్ర సెన్సెస్ ఆపరేషన్ జాయింట్ డైరెక్టర్ సుబ్బరాజు సూచించారు. ఈ మేరకు ఆయన మంగళవారం మున్సిపాలిటీలోని సూపర్వైజర్ సర్కిల్లో సర్వే చేస్తున్న ఎన్యుమరేటర్లు ఇంటి నంబర్లను ఎలా కేటాయిస్తున్నారో, పని సక్రమంగా జరుగుతుందో లేదో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రతీ ఇంటి నంబర్ ఎదురుగా శ్రీసీఎన్శ్రీ అని తప్పనిసరిగా రాయాలని సూచించారు. మ్యాపింగ్ ఎలా చేస్తున్నారో కూడా ఆయన ఆరా తీశారు. సర్వేలో వేగం పెంచాలని తెలిపారు. ఎన్యుమరేటర్లకు కేటాయించిన హౌస్ లిస్టింగ్ బ్లాక్ హెచ్ఎల్బీ పరిధిని స్పష్టంగా తెలియజేసేందుకు మున్సిపాలిటీ నుంచి మూడు రోజుల పాటు సిబ్బందిని వారి వెంట పంపించాలని ఆదేశించారు. జిల్లాలోని ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు బుధవారం సాయంత్రంలోపు తమకు కేటాయించిన ప్రతీ ఇంటికి ఇంటి నంబర్లు వేయడం పూర్తి చేయాలని సూచించారు. వచ్చే నెల 9వ తేదీ వరకు సర్వే ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు. రోజువారీ పనితీరుపై మానిటరింగ్ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెన్సెస్ ఇన్చార్జ్ వినయ్, ములుగు సీపీవో, జిల్లా సెన్సెస్ అధికారి ఎం.ప్రకాశ్, మున్సిపాలిటీ చార్జ్ ఆఫీసర్ కమిషనర్ సంపత్, స్టాటిస్టికల్ ఆఫీసర్ బి.లాల్నాయక్, ఫీల్డ్ ట్రైనర్లు, సూపర్వైజర్లు, ఎన్యుమరేటర్లు పాల్గొన్నారు. సీఎం చేతుల మీదుగా నగదు ప్రోత్సాహం మల్హర్: మండలకేంద్రంలోని ప్రభుత్వ జూని యర్ కళాశాలలో 2025–26 విద్యా సంవత్స రం ఇంటర్మీడియట్లో రాష్ట్రంలోనే ఉత్తమ ఫలి తాలు సాధించింది. ఈ మేరకు ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాల్లో భాగంగా సోమవారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా తాడిచర్ల జూనియర్ కళా శాల ప్రిన్సిపాల్ విజయదేవి రూ.1లక్ష చెక్కు ను అందుకున్నారు. ఈ మేరకు మంగళవారం ప్రిన్సిపాల్‌ను కళాశాల అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు వెంకటాపురం(కె): ఏజెన్సీలో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పొ అన్నారు. పీఓగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పీఓ తొలిసారిగా మంగళవారం మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మండల పరిధిలోని చిరుతపల్లి బాలికల ఆశ్రమ పాఠశాల 1, చిరుతపల్లి బాలికల ఆశ్రమ పాఠశాల 2ను తనిఖీ చేశారు. మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. పాఠశాల పునఃప్రారంభం నాటికి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేశారు. పరిసరాలను పరిశీలించి రోగులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని ఆదేశించారు. ఆస్తి కోసం వృద్ధురాలి హత్య..గణపురం : మండలంలోని గొల్లపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి, డబ్బు కోసం నానమ్మను మనువడు, అతడి భార్య హత్య చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గణపురం సీఐ కరుణాకర్ రావు కథనం ప్రకారం.. గొల్లపల్లి గ్రామానికి చెందిన పెండ్యాల ఐలమ్మ (60)ను ఆస్తి, రూ.40 వేల కోసం ఆమె మనువడు జాకేందర్, అతడి భార్య అమకృతి ఈనెల 09న ప్రణాళిక ప్రకారం కర్రతో దాడి చేసి హత్యకు పాల్పడ్డారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మంగళవారం నిందితులను అదుపులోకి తీసుకొని విచారించారు. ఇందులో తామే హత్య చేసినట్లు అంగీకరించారు. దీంతో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ కరుణాకర్‌రావు తెలిపారు. -
ఉమ్మడి వరంగల్ నుంచి చివరి లొంగుబాటు
కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్‌లో భాగంగా పలువురు మావోయిస్టు అగ్రనేతలు ఎన్కౌంటర్లలో మృతి చెందారు. దళాలకు దళాలే మృత్యువాత పడగా.. మరికొందరు అగ్రనేతలు, మావోయిస్టుల ఆయుధాలతో సహ లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చి 31 టార్గెట్‌గా చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ పూర్తయిన సందర్భంగా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్ట్ అగ్రనేతలు ముప్పాల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతి, పొలిట్‌బ్యూరో సభ్యుడు మిసిర్ బెస్రాతో పాటు పసునూరి నరహరి అలియాస్ సంతోశ్ పేరును కూడా కేంద్రం ప్రకటించింది. ఇటీవల కాలంలో పోలీస్ కూంబింగ్‌లు మరింత ఉధృతంగా సాగుతున్న తరుణంలో కేంద్ర కమిటీ సభ్యుడు, జార్ఖండ్ ఈస్ట్ రీజినల్ బ్యూరో టెక్నికల్ విభాగం ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్న పసునూరి నరహరి అలియాస్ విశ్వనాథ్, అలియాస్ సంతోశ్ మంగళవారం భార్యతో కలిసి తెలంగాణ పోలీసు ఉన్నతాధికారుల ఎదుట లొంగిపోయారు. కాగా, ఉమ్మడి వరంగల్ నుంచి ఇంకా ఐదారుగురు మావోయిస్ట్ ఉద్యమంలో ఉన్నట్లు ప్రచారం ఉన్నా.. పోలీసు రికార్డుల్లో మాత్రం లేరు. దీంతో ఉమ్మడి వరంగల్ నుంచి పోలీసు రికార్డుల్లో కీలక నేతగా ఉన్న పసునూరి నరహరి అలియాస్ విశ్వనాథ్, సంతోశ్ లొంగుబాటు చివరిదిగా చెబుతున్నారు. అజ్ఞాత మావోయిస్టుల జాబితాలో ఉన్న నరహరి జనజీవన స్రవంతిలో కలవడంతో నక్సల్స్ రహిత జిల్లాగా మారిందంటున్నారు. -
పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి పోలీస్‌స్టేషన్‌ను వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం ఎస్పీ సంకీర్త్ సందర్శించి సమగ్ర తనిఖీ నిర్వహించారు. జి ల్లాలో పోలీస్ వ్యవస్థ పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలపై ప్రత్యక్ష అవగాహన పొందడమే ఈ తనిఖీల ప్రధాన ఉద్దేశమన్నారు. ఈ సందర్భంగా వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన బ్యాడ్మింటన్ కోర్టును ప్రారంభించారు. స్టేషన్ పరిశుభ్రత, పరిసరాల నిర్వహణ, రికార్డుల నిర్వహణ విధానం, సిబ్బంది విధి నిర్వహణను ఎస్పీ పరిశీలించారు. స్టేషన్లో నమోదైన కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసుల పరిష్కారంపై అధికారులతో సమీక్ష ని ర్వహించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రజలకు స్నేహపూర్వక వాతావరణం కల్పిస్తూ, వారి సమస్యలను వేగవంతంగా, పారదర్శకంగా పరిష్కరించే వి ధంగా సేవలు అందించాలని సిబ్బందికి సూచించా రు. ఈ కార్యక్రమంలో డీఎస్సీ సంపత్‌రావు, సీఐ నరేష్కుమార్, ఎస్సై సాంబమూర్తి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
సజావుగా మక్కల కొనుగోళ్లు
మొగుళ్లపల్లి/రేగొండ: జిల్లాలో మొక్కజొన్న కొనుగోళ్లు సజావుగా సాగుతుందని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. మంగళవారం మొగుళ్లపల్లి, రేగొండ మండలకేంద్రాల్లోని మక్కల కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ కమిటీ గోదాములోని నిల్వ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 49,528 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారని, ప్రభుత్వం క్వింటాకు రూ.2,400 కనీస మద్దతు ధర ప్రకటించిందన్నారు. జిల్లాలో 12 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా ఇప్పటివరకు 26,000 మెట్రిక్ టన్నుల మక్కలు కొనుగోలు కేంద్రాలకు చేరుకోగా, అందులో 16,850 మెట్రిక్ టన్నులు పూర్తయ్యిందన్నారు. ఇంకా సుమారు 9,500 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాల్సి ఉందన్నారు. గోదాముల కొరత కారణంగా నిల్వ సమస్యలు ఉన్నాయని, హమాలీలకు చెల్లించే కూలి రేట్లు తక్కువగా ఉండటంతో కార్మికుల లభ్యతతో ఇబ్బందులు ఉన్నాయన్నారు. ప్రస్తుత పరిస్థితులు భిన్నంగా ఉన్నప్పటికీ రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు కార్యక్రమం సజావుగా నిర్వహించేందుకు చర్యలు కొనసాగుతున్నాయన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, సహకార అధికారి వాలియా నాయక్, వ్యవసాయ అధికారి బాబురావు, తహసీల్దార్ సునీత, ఎంపీడీఓ సురేందర్, అబ్దుల్ రజాక్, వాసుదేవారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతుల వివరాలను సక్రమంగా నమోదు చేయాలి ధాన్యం విక్రయించిన రైతుల వివరాలను సక్రమంగా నమోదు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. మంగళవారం మండలంలోని మొట్లపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి రిజిస్టర్లను పరిశీలించి నమోదు ప్రక్రియ నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలెక్టర్ రాహుల్శర్మమక్కలు నిల్వ చేసే గోదామును పరిశీలిస్తున్న కలెక్టర్ రాహుల్ శర్మ -
ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్
భూపాలపల్లి అర్బన్: ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహించే అధికారులపై సస్పెన్షన్ చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో మంత్రులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. జిల్లా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ రాహుల్‌శర్మ పాల్గొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు నిర్వహించాలని, హమాలీలు, గన్నీ సంచులు, రవాణా వాహనాల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లోనే నాణ్యత పరిశీలన చేసి రైతులకు వెంటనే రశీదులు ఇవ్వాలని సూచించారు. అనంతరం కలెక్టర్ రాహుల్ శర్మ రెవెన్యూ, పౌర సరఫరాలు సంస్థ, సహకార, వ్యవసాయ, ఆర్డీఓ అధికారులతో మాట్లాడుతూ.. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగేలా అధికారులు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం, మక్కలు జిల్లాకు రాకుండా చెక్‌పోస్టు వద్ద పర్యవేక్షించాలన్నారు. లారీల కొరత ఉన్నచోట ట్రాక్టర్లు వినియోగించుకోవాలని సూచించారు. హమాలీల కొరత ఉంటే స్థానికంగా అందుబాటులో ఉన్న హమాలీలను వినియోగించుకోవాలని సూచించారు. అధికారులందరూ సమన్వయంతో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ధాన్యం, మక్కలు కొనుగోలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, సహకార అధికారి వాలియా నాయక్, వ్యవసాయ అధికారి బాబురావు, పౌర సరఫరాల అధికారి కిరణ్‌కుమార్, డీఎం రాములు, డీఆర్డీఓ బాలకృష్ణ, అధికారులు పాల్గొన్నారు. వీసీలో సీఎం రేవంత్ రెడ్డి -
సింగరేణి క్వార్టర్స్‌లో చోరీ
● బంగారం, వెండి ఆభరణాలు అపహరణ గణపురం: మండలంలోని 1000 క్వార్టర్స్‌లో ఒకే రాత్రి 8 ఇళ్లలో చోరీ జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గణపురం మండలం 1000 క్వార్టర్స్‌లో సింగరేణి ఉద్యోగులు నివాసం ఉంటున్నారు. వేసవి సెలవులు కావడంతో వారి స్వగ్రామాలకు వెళ్లారు. ఇది గమనించిన దుండగులు పక్కా ప్రణాళికతో శనివారం రాత్రి 8 క్వార్టర్ల తాళాలు పగులగొట్టి చోరీకి యత్నించారు. ఆదివారం ఉదయం తోటి ఉద్యోగులు గమనించి బాధితులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి క్లూస్‌టీంతో మంగళవారం తనిఖీలు నిర్వహించారు. బ్లాక్ నంబర్ 34 రూం నంబర్ 128లో నివాసముంటున్న మల్లగాని సరస్వతికి చెందిన 3 తులాల బంగారం, 15 తులాల వెండి ఆభరణాలు, గాజుల వెంకటేశ్వర్లు 5 గ్రాముల బంగారు కమ్మలు, 4 గ్రాముల వెండి, రూ.6వేల నగదు, పాతరవేని రాజేష్‌కు చెందిన 2 గ్రాముల బంగారం, 4 తులాల వెండి, వేములపల్లి బాబురావు క్వార్టర్లో 10 తులాల వెండితో పాటు రూ. 1000 నగదు అపహరణకు గురైనట్లు గుర్తించారు. సింగరేణి సెక్యూరిటీ ఉండి, నిత్యం జనాభాతో ఉండే 1000 క్వార్టర్లలో చోరీ జరగడం సంచలనం సృష్టించింది. పోలీసులు క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు. -
నకిలీ విత్తనాల విక్రయంపై ఉక్కుపాదం
అవార్డుల ప్రదానంవిద్యావారోత్సవాల్లో భాగంగా సోమవారం హైదరాబాద్‌లో వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థిని అవునూరి సాయిశ్రీ, వరంగల్ కృష్ణా కాలనీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థి మహ్మద్ ముదాస్సిర్, హనుమకొండ పింగిళి కళాశాల విద్యార్థిని శ్రీహితకు అవార్డు చెక్కులు అందజేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పక్కన మంత్రులు పొంగులే టి , వివేక్, పొన్నం, అజాహ రుద్దీన్ , శ్రీధర్బాబుపక్క ఫొటోలోని మహిళ పేరు తోన్గర్ కమల. చిట్యాల మండలం చల్లగరిగ గ్రామం. డయాలసిస్‌తో ఇబ్బందులు పడుతుంది. వైద్యం కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేసినా ఫలితం లేదు. పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుంది. మూడుసార్లు ప్రజావాణిలో దరఖాస్తు చేసినా మంజూరు కాలేదు. డయాలసిస్‌తో ఏ పనీ చేయలేని స్థితిలో ఉంది. కుటుంబ పోషణ ఇబ్బందిగా మారిందని, పింఛన్ ఇప్పించాలని వేడుకుంటుంది. ● నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలి ● కలెక్టర్ రాహుల్ శర్మ -
మైనింగ్‌కు ఊతం!
సాక్షి ప్రతినిధి, వరంగల్: ప్రభుత్వం మైనర్ ఖనిజ బ్లాకుల వేలం విధానంలో కొత్త మార్గదర్శకాలకు శ్రీకారం చుట్టింది. ఖనిజాల తవ్వకాల్లో పారదర్శకత, ఆదాయం పెంపు లక్ష్యంగా హైబ్రిడ్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. పూర్తిగా ఆన్లైన్లోనే వేలం ప్రక్రియ ద్వారా ఖనిజాల లీజులు కేటాయించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి ఎన్.శ్రీధర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మైనింగ్ రంగానికి ఊతమివ్వనున్నాయి. ముఖ్యంగా గ్రానైట్, స్టోన్ మెటల్, బ్లాక్ గ్రానైట్, రోడ్ మెటల్, మట్టి, ఇసుక వంటి ఖనిజాల తవ్వకాల్లో కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే వందల సంఖ్యలో లీజులు.. ఉమ్మడి వరంగల్‌లో ఇప్పటికే వందల సంఖ్యలో లీజులు ఉన్నాయి. వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో అధికంగా క్వారీలు ఉన్నాయి. మైన్స్ అండ్ జియాలజీ శాఖ అంచనాల ప్రకారం ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాల పరిధిలో ప్రస్తుతం చిన్న, పెద్దవి కలిపి సుమారు 250కు పైగా మైనింగ్, క్వారీ లీజులు అమలులో ఉన్నట్లు తెలుస్తోంది. అధిక భాగం స్టోన్ మెటల్, రోడ్ మెటల్ యూనిట్లు, గ్రానైట్ తవ్వకాలు, బ్రిక్ ఎర్త్, మట్టి క్వారీలు, ఇసుక రీచ్‌లు ఉన్నా యి. భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో గ్రానైట్, స్టోన్ మెటల్ క్వారీల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. 40–60 కొత్త లీజులకు అవకాశం? పర్యావరణ, కాలుష్య నియంత్రణ అనుమతులు లేక వేలం జరగని అనేక ఖనిజ బ్లాకులు కొత్త ‘హైబ్రిడ్ విధానం’ ద్వారా వేలంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి వరంగల్‌లోనే మరో 40 నుంచి 60 వరకు కొత్త మైనింగ్ లీజులు, క్వారీ బ్లాకులు వేలానికి వచ్చే అవకాశాలు ఉన్నాయని మైనింగ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా మహబూబాబాద్‌లో బ్లాక్ గ్రానైట్, భూపాలపల్లిలో రోడ్ మెటల్, ములుగులో స్టోన్ క్వారీలు, వరంగల్, హనుమకొండ పరిసరాల్లో నిర్మాణ రంగానికి అవసరమైన మెటల్ క్వారీలు అధికం. జిల్లాల్లో కొత్త విధానంతో వేగంగా అనుమతులు పొందే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. పట్టాదారులకు తీపి కబురు మైనర్ ఖనిజాల వేలం మొత్తం ఆన్లైన్లోనే జరగనుంది. బిడ్డింగ్ నుంచి లీజు కేటాయింపు వరకు ప్రతీ దశ డిజిటల్ విధానంలో ఉండడంతో అక్రమాలు తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కనీసం ముగ్గురు బిడ్డర్లు తప్పనిసరి చేయడం ద్వారా పోటీ పెరిగి ప్రభుత్వానికి అధిక ఆదాయం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పట్టా భూముల్లో ఖనిజ తవ్వకాలకు అంగీకరించిన భూ యజమానులకు ప్రభుత్వం అదనపు సొమ్ము చెల్లించనుంది. గ్రానైట్, మార్బుల్ మినహా ఇతర ఖనిజాలకు సీనియరేజ్ ఫీజులో 10 శాతం, గ్రానైట్, మార్బుల్‌కు 5 శాతం పెంచనున్నారు. ఈ నిర్ణయంతో ప్రైవేట్ భూముల్లో కొత్త క్వారీలకు భూ యజమానులు ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా భావిస్తున్నారు. కొత్త వేలం విధానం అమలైతే ఉమ్మడి వరంగల్‌లో ఖనిజ ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం సుమారుగా ఏటా రూ.80 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు వస్తున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ప్రస్తుతం నిర్మాణ రంగం వేగంగా విస్తరిస్తుండడంతో రోడ్ మెటల్, స్టోన్ మెటల్, గ్రానైట్‌కు డిమాండ్ పెరుగుతోంది. కొత్త లీజులు మంజూరైతే ప్రభుత్వానికి రూ.25–30 కోట్ల అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని మైనింగ్ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మైనర్ ఖనిజాల వేలంలో భారీ మార్పులు హైబ్రిడ్ విధానానికి సర్కారు గ్రీన్‌సిగ్నల్ పూర్తిగా ఆన్లైన్లోనే వేలం ప్రక్రియ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొత్త లీజులు గ్రానైట్, స్టోన్ మెటల్, ఇసుక క్వారీలపై ఫోకస్ -
ఆసరా కోసం..
జయశంకర్ భూపాలపల్లిమంగళవారం శ్రీ 12 శ్రీ మే శ్రీ 20267పింఛన్ల మంజూరుకు ఎదురుచూపుభూపాలపల్లి రూరల్: ఆసరా పింఛన్ల కోసం అర్హులకు ఎదురుచూపు తప్పడం లేదు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఆన్లైన్ కూడా ప్రభుత్వం నాలుగేళ్లుగా బంద్ చేసింది. 2023లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఆసరా పింఛన్ల మొత్తాన్ని పెంచుతామని హామీ ఇచ్చింది. అర్హులైన వారికి కొత్తగా పింఛన్లు మంజూరు చేయకపోవడంతో వారంతా అందోళన చెందుతున్నారు. ఇటీవల ప్రభుత్వం ఈ ఏడాది జూన్ నాటికి కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించింది. దీంతో పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారిలో ఆశలు చిగురిస్తున్నాయి. 2022 ఆగస్టు నుంచి ఆగిన ‘ఆసరా’ రాష్ట్ర వ్యాప్తంగా 2022 ఆగస్టు నుంచి కొత్తగా అసరా పింఛన్ల మంజూరును అప్పటి ప్రభుత్వం నిలిపివేసింది. అప్పటికే జిల్లాలో చాలామంది దరఖాస్తు చేసుకున్నా వివిధ కారణాలతో వాటిని తిరస్కరించింది. పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే పోర్టల్ క్లోజ్ చేయడంతో కొత్తగా దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండాపోయింది. దీంతో నాలుగేళ్ల నుంచి దివ్యాంగులు, వితంతువులు, వృద్ధులు, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలు అధికారులకు నేరుగా దరఖాస్తులు ఇస్తున్నారు తప్ప మంజూరు కావడం లేదు. కలెక్టరేట్లో ప్రతీ సోమవారం ప్రజావాణిలోనూ కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. మండల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న వారు వేల సంఖ్యలో ఉన్నారు. అయినా ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడంతో అర్హులైన వారికి ఎదురుచూపు తప్పడం లేదు. ఎన్నికల హామీ నెరవేరుతుందా..! ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఎప్పుడు అమలు చేస్తుందా అని ఎదురు చూస్తున్నారు. అప్పుడప్పుడు ప్రభుత్వం ప్రకటనలు చేస్తున్నా ఇప్పటి వరకు అమలు కాలేదు. ఎన్నికల హామీలో భాగంగా పింఛన్ల పెంపును అమలు చేయడంతో పాటు కొత్తగా అర్హులైన వారికి పింఛన్లు అందిస్తారని కోటి ఆశలతో ఉన్నారు. ప్రభుత్వం తప్పకుండా పింఛన్లు మంజూరు చేయాలని కోరుతున్నారు. 2022 నుంచి నిలిచిన పెన్షన్ మంజూరు పోర్టల్‌ను పూర్తిగా మూసేసిన ప్రభుత్వం దరఖాస్తులను కూడా ఆన్లైన్ చేయలేని పరిస్థితి కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న అర్హులు జూన్‌లో ఇస్తామని ప్రభుత్వ ప్రకటనతో చిగురిస్తున్న ఆశలు -
విద్యా వారోత్సవాలు ప్రారంభం
భూపాలపల్లి అర్బన్: ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా విద్యా వారోత్సవాలను ప్రారంభించారు. ఈ నెల 17వ తేదీ వరకు విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలలను సిద్ధం చేయడమేకాక ప్రవేశాల పెంపునకు కార్యాచరణ రూపొందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లాకేంద్రంలోని కేజీబీవీలో సమ్మర్‌క్యాంపు ప్రాంరభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టాల్సిన మరమ్మతులు, నూతన నిర్మాణాలేకాక అమ్మ ఆదర్శ పాఠశాల ఆధ్వర్యాన చేపట్టే పనులను ప్రారంభించారు. నేడు (మంగళవారం) పదో తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం రెండు సమ్మర్ క్యాంపులను ప్రారంభించనున్నారు. ఇందుకోసం చెల్పూర్. టేకుమట్ల జెడ్పీహెచ్ఎస్లను ఎంపిక చేశారు. ఈ క్యాంపుల్లో పాల్గొనే విద్యార్థుల హాజరును ముఖ గుర్తింపు ద్వారా నమోదు చేయనున్నారు. మధ్యాహ్న భోజనం, స్టేషనరీ కింద రూ.వంద, రవాణా అలవెన్స్‌గా ప్రతీ విద్యార్థికి రూ.వేయి నగదు అందజేయనున్నారు. ఈ క్యాంపు నిర్వహణతో సప్లిమెంటరీ పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. బుధవారం (13వ తేదీ).. మండలస్థాయిలో సర్పంచ్‌లకు వర్క్‌షాప్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో బోధన, ఇతర విద్యా కార్యక్రమాలను వారికి వివరించనున్నారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంపునకు సహకరించాలని వివరిస్తారు. గురువారం (14వ తేదీ).. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట, మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల ఆధ్వర్యాన బడిబాట ద్వారా విద్యార్థుల నమోదు చేపడుతారు. వచ్చే విద్యా సంవత్సరం పాఠశాలల్లో అల్పాహారం అందించే అంశాన్ని వివరిస్తారు. డ్రాపవుట్ విద్యార్థులను తిరిగి చేర్పించడంతో పాటు సున్నా ప్రవేశాలు ఉన్న పాఠశాలల్లో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. శుక్రవారం (15వ తేదీ).. విద్యావారోత్సవాల్లో భాగంగా ఐదో రోజున లైబ్రరీ డేగా నిర్వహిస్తారు. ఈ మేరకు ప్రతీ పాఠశాలలో ఉన్న గ్రంథాలయ సదుపాయంపై తల్లిదండ్రులు, విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. అంతేకాక దాతల నుంచి పుస్తకాలు స్వీకరిస్తారు. శనివారం (16వ తేదీ): విద్యార్థులకు జిల్లాస్థాయి ఆర్ట్, క్రాఫ్ట్, సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తారు. మండలాల్లో విజేతలను ఆహ్వానించి జిల్లాస్థాయి పోటీలు నిర్వహించాక విజేతలకు బహుమతులు అందజేయనున్నారు. కార్యక్రమం గణపురం మోడల్స్కూల్లో జరగనుంది. ఆదివారం (17వ తేదీ).. వారోత్సవాల్లో ముగింపును చివరి రోజు ఘనంగా నిర్వహించాలని ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగా పదో తరగతిలో జిల్లాస్థాయి ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేసి అభినందిస్తారు. అందరూ పాలుపంచుకోవాలి.. జిల్లాలో ఈ నెల 17వ తేదీ వరకు విద్యా వారోత్సవాలను నిర్వహిస్తున్నాం. ఇప్పటికే ఎంఈఓలు, హెచ్ఎంలతో పాటు విద్యాశాఖ బాధ్యులతో సమీక్ష నిర్వహించి సూచనలు చేశాం. కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి సహకరించాలి. – రాజేందర్, జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి ఈ నెల 17వరకు నిర్వహణ రోజుకొక కార్యక్రమంతో షెడ్యూల్ ఖరారు -
ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారమే లక్ష్యం
భూపాలపల్లి అర్బన్: ప్రజలు అందించిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాదివస్ కార్యక్రమంలో ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వచ్చిన 20 ఫిర్యాదులను స్వీకరించిన ఎస్పీ, సమస్యలను శ్రద్ధగా విని వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు తక్షణ సూచనలు చేశారు. ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తూ సంబంధిత పోలీస్స్టేషన్ల సీఐలు, ఎస్ఐలతో నేరుగా మాట్లాడి అవసరమైన దిశానిర్దేశం చేశారు. ప్రజలు పైరవీలు, మూడో వ్యక్తుల ప్రమేయం లేకుండా నిర్భయంగా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. చట్టబద్ధమైన విధానంలోనే ప్రజలకు న్యాయం జరుగుతుందని, శాంతిభద్రతలను కాపాడుతూ ప్రజలకు మరింత చేరువగా ఉండడమే పోలీస్ శాఖ లక్ష్యమని తెలిపారు. ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజాదివస్ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించి, సంబంధిత అధికారుల సహకారంతో వాటిని పరిష్కరిస్తున్నామన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందన్నారు. పోలీసుల సంక్షేమానికి మరో ముందడుగు జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు సిబ్బంది సౌకర్యార్థం ఏర్పాటు చేసిన సెలూన్‌ను ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సోమవారం ప్రారంభించారు. విధి నిర్వహణలో ఎప్పుడూ బిజీగా ఉండే పోలీసులకు కార్యాలయ పరిసరాల్లోనే ఈ సౌకర్యం అందుబాటులో ఉండటం వల్ల సమయం ఆదా అవుతుందని ఎస్పీ తెలిపారు. పోలీసుల సంక్షేమం, వారి అవసరాలపై జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారిస్తుందన్నారు. భవిష్యత్‌లో కూడా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరేష్ కుమార్, వెల్ఫేర్ ఆర్ఐ సంతోష్ కుమార్, ఎంటీఓ ఆర్ఐ పూర్ణచందర్ పాల్గొన్నారు. ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ -
పాలిసెట్‌కు ఏర్పాట్లు పూర్తి
భూపాలపల్లి అర్బన్: పాలిసెట్ పరీక్షకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా సమన్వయ అధికారి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.రమణారావు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా నాలుగు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు, మొత్తం 905 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు వెల్లడించారు. ఈ నెల 13న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు ఉదయం 10 గంటలలోపు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, ఆలస్యంగా వచ్చిన వారికి అనుమతి ఉండదని స్పష్టం చేశారు. విద్యార్థులు తప్పనిసరిగా హాల్ టికెట్‌తో పాటు హెచ్‌బీ పెన్సిల్, బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తీసుకురావాలని సూచించారు. ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష హాల్లోకి అనుమతించబోమని తెలిపారు. ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం భూపాలపల్లి అర్బన్: ప్రభుత్వ ఐటీఐ/ఏటీసీలో 2026–27, 2027–28 విద్యా సంవత్సరాలకు వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ జుమ్లానాయక్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు ఐటీఐ తెలంగాణ వెబ్సైట్ ద్వారా జూన్ 8 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రవేశాలకు సంబంధించి 10వ తరగతి ఉత్తీర్ణత అర్హతగా నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ప్రవేశాల్లో ఫిట్టర్, మ్యానుఫాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మ్యానుఫాక్చరింగ్ టెక్నీషియన్, ఇంజనీరింగ్ డిజైన్ టెక్నీషియన్, వర్చువల్ అనాలిస్ట్ డిజైనర్–ఎఫ్ఈఎం, సీఎన్సీ మిషనింగ్ టెక్నీషియన్, మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పూర్తి వివరాలకు ఐటీఐ భూపాలపల్లి కార్యాలయం, సెల్ నంబర్ 85004 65034ను సంప్రదించాలని సూచించారు. డీఆర్వోను కలిసిన ట్రెస్మా ప్రతినిధులు భూపాలపల్లి రూరల్: జిల్లాకు నూతనంగా వచ్చిన జిల్లా రెవెన్యూ అధికారి వసంత కుమారిని సోమవారం ట్రెస్సా జిల్లా ప్రతినిధి బృందం మర్యాద పూర్వకంగా కలిసింది. కలిసిన వారిలో ట్రెస్సా జిల్లా అధ్యక్షుడు మార్క రామ్మోహన్, ప్రధాన కార్యదర్శి మహ్మద్ రజాక్, ట్రెజరర్ పకిడే రాజయ్య ఉన్నారు. మ్యూజియంలోకి పురాతన విగ్రహాలు కాళేశ్వరం: కాళేశ్వరంలో ఈనెల 21నుంచి జూన్1వ తేదీ వరకు జరుగనున్న సరస్వతీనది అంత్యపుష్కరాలకు ముందుగానే మ్యూజి యం ప్రారంభించాలనే ఉన్నతాధికారుల ఆదేశాలతో నిర్మాణం పూర్తికాక ముందే హడావుడిగా పురాతన విగ్రహాలను అమర్చుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం అధికారులు పురాతన విగ్రహాలను మ్యూజియంలో అమర్చారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు కాకతీయులు, చాళుక్యులనాటి ప్రాంతీయ చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ చర్యలు చేపడుతున్నప్పటికీ పూర్తిస్థాయి పనులు కాకముందే విగ్రహాల ఏర్పాటు చేపట్టడంపై స్థానికుల్లో చర్చ జరుగుతోంది. ఏరియా బీసీ, ఓబీసీ లైజనింగ్ ఆఫీసర్‌గా మురళీమోహన్ భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియా సింగరేణి బీసీ, ఓబీసీ లైజనింగ్ ఆఫీసర్‌గా ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ సిలివేరి మురళీమోహన్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా సోమవారం జీఎం కార్యాలయ చాంబర్లో సింగరేణి బీసీ ఓబీసీ జనరల్ సెక్రటరీ నల్లపురి రమేష్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ ఏరియాల లైజనింగ్ ఆఫీసర్లు, నాయకులు పాల్గొని భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఏరియా జనరల్ మేనేజర్ లైజనింగ్ ఆఫీసర్‌గా నియమితులైన మురళీమోహన్ను అభినందిస్తూ శాలువాతో సన్మానించారు. -
పదిలమా.. ప్రశ్నార్థకమా?
అనంతలక్ష్మి ఆయుర్వేద వైద్య కళాశాలలో బీఏఎంఎస్ సీట్ల భర్తీపై అయోమయం కాశిబుగ్గ: వరంగల్‌లోని అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలలో పేరుకుపోయిన సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ప్రతి సంవత్సరం యూజీ అడ్మిషన్ల సమయంలో బీఏఎంఎస్ సీట్ల భర్తీపై అయోమయం నెలకొంటుంది. సరిపడా సిబ్బంది, సౌకర్యాలు లేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. కళాశాలలోని సీట్లు పూర్తిస్థాయిలో భర్తీకి నోచుకోవడం గగనమవుతోంది. తాజాగా 2026–2027 విద్యాసంవత్సరానికి యూజీ అడ్మిషన్ల కోసం నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టం ఆఫ్ మెడిసిన్ (ఎన్సీఐఎస్ఎం) బృందం సభ్యులు రెండు రోజులు తనిఖీలు చేపట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని బనారస్ యూనివర్సిటీ నుంచి వచ్చిన ప్రొఫెసర్లు అంజనా సక్సేనా, లక్ష్మీప్రసాద్ అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, ఆయుర్వేద వైద్యకళాశాలలో తనిఖీలు చేశారు. కళాశాలలోని 50 సీట్లతోపాటు 13 ఈడబ్ల్యూఎస్ సీట్లు కలిపి మొత్తం 63 సీట్లకు సరిపడా ఫ్యాకల్టీ, టీచింగ్, నాన్‌టీచింగ్ స్టాఫ్, ఇతర సౌకర్యాలు తెలుసుకున్నారు. టీచింగ్, టీచింగ్ డైరీ మెయింటెనెన్స్, స్టూడెంట్ అటెండెన్స్ ల్యాండ్, ల్యాబ్, లైబ్రరీ, పలు మొక్కల గార్డెన్, పరికరాలు పరిశీలించారు. సమయానికి టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్, విద్యార్థులు వస్తున్నారా అని బయోమెట్రిక్ అటెండెన్స్, ఐరిస్ ద్వారా తెలుసుకున్నారు. తరగతి గదిలో విద్యార్థులతో మాట్లాడారు. బయోమెడికల్ వేస్టేజ్ నిర్వహణ, అంబులెన్స్, నర్సింగ్ స్టాఫ్ వివరాలపై ఆరా తీశారు. అలాగే, విద్యార్థులకు సంబంధించిన రెండు హాస్టళ్లను తనిఖీ చేశారు. కళాశాల అనుబంధ ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలను కూడా సందర్శించారు. ఇందులో కూడా టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్, ఓపీ, ఐపీ వివరాలను నమోదు చేసుకున్నారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, డైట్, మందులు, వివిధ రకాల చికిత్స గురించి తెలుసుకున్నారు. వంద పడకల ఆస్పత్రి స్థాయికి ఎలాంటి సౌకర్యాలు కల్పించారో తెలుసుకుని వివరాలను ఆన్లైన్ ద్వారా ఢిల్లీలోని స్పెషల్ అబ్జర్వర్‌కు అందజేశారు. హెడ్ ఆఫీస్ లింక్ ద్వారా ఆన్లైన్న్లో క్షుణ్ణంగా చూపించి రికార్డు చేయించారు. ఎన్సీఐఎస్ఎం నిబంధనలకు అనుకూలంగా.. ఎన్సీఐఎస్ఎం నిబంధనల ప్రకారం కళాశాలలో కొన్ని అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. బోధనపరంగా హయ్యర్, లోయర్‌లో 12 మంది టీచింగ్ ఫ్యాకల్టీ లేనట్లు తెలుస్తోంది. నాలుగు విభాగాల్లో అసలే ప్రొఫెసర్లు లేకపోవడంతో 12 సీట్లు కోల్పోయే అవకాశం ఉంది. హై ఫ్యాకల్టీ పరంగా మరో మూడు సీట్లు గల్లంతయ్యే అవకాశం ఉంది. నాన్‌టీచింగ్ పరంగా 71 మందికి 28 మంది, 87 మంది సిబ్బందికి 47 మంది, 23 మంది నర్సింగ్ సిబ్బంది అవసరం ఉండగా ఏడుగురు మాత్రమే ఉన్నట్లు సమాచారం. కళాశాలకు ప్రత్యేకంగా పరీక్ష హాల్, డిజిటల్ టైబ్రరీ, అంబులెన్స్ సదుపాయం లేదు. పదేళ్లుగా లైబ్రేరియన్ పోస్టు భర్తీ కావడం లేదు. దీంతో బీఏఎంస్ సీట్లు పదిలంగా ఉంటాయా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. గతేడాది పరిస్థితి రాకూడదు.. గతేడాది కూడా ఈ పరిస్థితులు ఉండటంతో 14 సీట్లు కోల్పోవాల్సి వచ్చింది. కళాశాల, వైద్యశాలలో ఉన్న లోపాలను సరిదిద్దుతామని ఎన్సీఐఎస్ఎం అధికారులకు హామీ ఇవ్వడం, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లేఖ రాయడంతో యథావిధిగా సీట్లకు అనుమతించారు. ఇలాంటి లోపాలు ఈ విద్యా సంవత్సరంలో కూడా పునరావృతం కావడంతో మళ్లీ ఆయుర్వేద సీట్లు గల్లంతయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. హైదరాబాద్ తర్వాత ఉన్న ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల ఉనికిని కాపాడాలని ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులను ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికే విద్యార్థులు నీట్ పరీక్ష ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. గతేడాది 14 సీట్లు రద్దు.. తిరిగి సాధించుకున్న అధికారులు ఈ విద్యాసంవత్సరంలో కూడా కొన్ని గల్లంతయ్యే అవకాశం సరిపడా సిబ్బంది, సౌకర్యాలు లేకపోవడమే కారణం తాజాగా ఎన్సీఐఎస్ఎం బృందం తనిఖీలు -
సరస్వతీఘాట్‌లో భారీ సెట్టింగ్
కాళేశ్వరం: కాళేశ్వరంలో ఈనెల 21నుంచి జూన్ 1వ తేదీ వరకు జరుగనున్న సరస్వతీనది అంత్యపుష్కరాలకు భారీ సెట్టింగులు వేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఘాటుపై సరస్వతీమాత విగ్రహం, ప్లాట్‌ఫారంపై నాలుగు దిక్కులా తోరణాలు ఏర్పాటు చేస్తున్నారు. మెట్ల కింద నుంచి ఇసుకలో నీటి వరకు వెదురు పందిర్లు సుమారుగా 900 మీటర్ల పొడవునా వేస్తున్నారు. వేసవి దృష్ట్యా అందులో నీటి తుంపర్లు నిత్యం పడేలా చల్లదనంతో కూడా నీడనిచ్చే విధంగా తయారు చేస్తున్నారు. భక్తులు స్నానాలకు వెళ్లి వచ్చే వరకు చల్లదనం అస్వాదించనున్నారు. హారతి వేదిక వద్ద ప్రముఖుల గ్యాలరీ, భక్తులకు గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నారు. 40 టెండ్సిటీ టెండ్లు, మాడ్రన్ లుక్‌తో వేస్తున్నారు. పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులు ఏర్పాటు చేస్తున్నారు. ఖాదీవస్త్రాలు, చేనేత వస్త్రాలు విక్రయించడానికి స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. -
హేమాచలక్షేత్రంలో కోలాహలం
మంగపేట: మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఈనెల 6వ తేదీతో ముగిసినప్పటికీ భక్తులు భారీగా తరలివస్తున్నారు. స్వయంభు స్వామివారిని దర్శించుకునేందుకు తరలి వచ్చిన భక్తులతో ఆలయం కోలాహలంగా మారింది. ఆదివారం సెలవు రోజు కావడం, బ్రహ్మోత్సవాలకు రాలేకపోయిన భక్తులతో పాటు ఆలయ ప్రాంగణంలో జరిగిన వివాహాలకు తరలివచ్చిన వారితో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయంలో సందడి నెలకొంది. ఆంజనేయస్వామి మాలధారుల మండలం, అర్ధ మండలం దీక్ష చేపట్టిన భక్తుల దీక్ష ముగియడంతో స్వామివారికి ఇరుముడి ఇచ్చి దీక్ష విరమించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి ఆలయానికి వెళ్లే భక్తులు మార్గమధ్యంలోని లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకుని వెళ్తున్నారు. అదే విధంగా తిరుగు ప్రయాణంలో సైతం భక్తులు ఆలయానికి స్వామివారిని దర్శించుకునేందుకు రావడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయ ప్రాంగణం భక్తజనంతో నిండిపోయింది. -
ప్రపంచ యవనికపై వరంగల్ ‘5ఎఫ్’
● పత్తి ఉత్పత్తి నుంచి అంతర్జాతీయ ఎగుమతులు ఒకే వేదికపై.. ● కేఎంటీపీకి పీఎం మిత్ర కింద రూ.200 కోట్లు, సీఐఎస్ కింద రూ.300 కోట్లు ● వర్చువల్‌గా హైదరాబాద్ నుంచి ప్రారంభించిన పీఎం నరేంద్రమోదీసాక్షి, వరంగల్/గీసుకొండ: కేంద్రం ఆలోచనలకు అనుగుణంగా 5ఎఫ్ (ఫామ్ టు ఫైబర్.. టు ఫ్యాక్టరీ.. టు ఫ్యాషన్...టు ఫారిన్) దృక్కోణంతో ఓరుగల్లు ఖ్యాతి ప్రపంచానికి తెలిసేలా మరో అడుగు ముందుకు పడింది. పత్తి ఉత్పత్తి నుంచి అంతర్జాతీయ ఎగుమతుల దాకా ఒకే వేదికపై పూర్తి విలువ వ్యవస్థను కల్పించేలా దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్‌తో పాటు తెలంగాణ నుంచి వరంగల్‌లోకి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును పీఎం మిత్ర (ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అపెరల్ పార్కు) పథకం కింద 2023లో ఎంపిక చేశారు. ఈ మేరకు రూ.200 కోట్లతో కూడిన అభివృద్ధి పనులను ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ వేదికగా ఆదివారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఇప్పటికే విడుదల చేసిన రూ.30 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టగా, మరో రూ.170 కోట్ల దఫాల వారీగా కేంద్రం రాష్ట్రానికి అందివ్వనుంది. ‘కాంపిటిటివ్ ఇన్సెంటివ్ సపోర్ట్’ కింద రూ.300 కోట్ల వరకు ప్రోత్సాహక మద్దతు ఇవ్వనుండడంతో దేశ, విదేశీ కంపెనీలు ఇక్కడికి క్యూ కట్టే అవకాశం ఉంది. గీసుకొండ, సంగెం మండలాల్లోని శాయంపేట హవేలీలో మొత్తం 1,327 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ పార్కులో మౌలిక వసతులు కల్పిస్తున్నారు. శూన్య ద్రవ వ్యర్థ సాంకేతికతతో నిర్మించిన సార్వత్రిక ద్రవ వ్యర్థాల శుద్ధి ప్లాంటు (సీఈటీపీ)కు సుస్థిర అభివృద్ధిని అందించనుంది. ఇప్పటివరకు ఈ పార్కులో 548 ఎకరాల్లో పరిశ్రమలు వస్తే పీఎం మిత్ర కింద కేఎంటీపీ ఎంపికై న తర్వాతనే 310 ఎకరాల్లో పరిశ్రమలు వచ్చాయని కేంద్ర జౌళి పరిశ్రమ మంత్రిత్వ విభాగాధికారులు అంటున్నారు. ఇందులో భాగంగానే ‘ఎవర్టాప్ టెక్స్టైల్ అండ్ అపెరెల్ కాంప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్’ వంటి సంస్థలు భారీ పెట్టుబడులతో ముందుకు రావడం దీనికి నిదర్శనమని చెబుతున్నారు. -
మేడారంలో భక్తుల సందడి
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు ఆదివారం వేల సంఖ్యలో తరలివచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివచ్చారు. జంపన్నవాగు స్నానఘట్టాల వద్ద షెవర్ కింద స్నానాలు ఆచరించారు. అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీరసారె, కానుకలు, ఎత్తు బంగారం, ఒడిబియ్యం, పూలు, పండ్లు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గోవిందరాజు, పగిడిద్దరాజులకు పూజలు చేశారు. మొక్కుల అనంతరం మేడారం పరిసరాల్లో చెట్ల కింద విడిది చేసి వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనాలు చేశారు. దేవాదాయశాఖ జూనియర్ అసిస్టెంట్లు జగదీశ్వర్, మధు, రామదేవి సేవలందించారు. -
అన్నదాతల్లో ఆందోళన
భూపాలపల్లి: ఆకాశంలో మబ్బులు ఉరుములు అన్నదాతలకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చి, కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో విక్రయానికి సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో అకాల వర్షాలు కురిస్తే పంటంతా నీటి పాలవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆశించిన స్థాయిలో దిగుబడి ఈ ఏడాది యాసంగిలో మొక్కజొన్న, వరిపంట ఆశించిన స్థాయిలో దిగుబడి వచ్చింది. జిల్లాలోని 12 మండలాల్లో 29వేలకు పైగా ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేయగా, 39,500 మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిందని అంచనా. 12 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోలు చేస్తున్నారు. వరి 95,590 ఎకరాల్లో సాగు చేయగా, సుమారు 1.60 లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడి వచ్చింది. జిల్లావ్యాప్తంగా 185 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావించి ఇప్పటి వరకు 165 కేంద్రాలను ప్రారంభించారు. జిల్లాకు వర్ష సూచనలు రైతులు పండించిన ధాన్యం ఇప్పటికే కొనుగోలు కేంద్రాలకు తరలించగా, మొక్కజొన్న సగానికి పైగా కేంద్రాలకు వచ్చింది. సుమారు 15వేల ఎకరాల మొక్కజొన్న పంట ఇంకా కల్లాల్లోనే ఉంది. కంకి ఇరవడం, యంత్రాలతో కంకి పట్టించడం తదితర పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే జిల్లాకు వర్ష సూచనలు ఉన్నాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నెల 6వ తేదీ బుధవారం రోజున భూపాలపల్లి, మల్హర్, మహదేవపూర్, మహాముత్తారం మండలాల్లో మోస్తారు వర్షం కురిసి కొనుగోలు కేంద్రాల్లోని వడ్లు తడిశాయి. కొత్తపల్లిగోరి మండలంలో చిరు జల్లులు కురవగా పంట నష్టం ఏమీ జరగలేదు. దీంతో అక్కడి రైతులు ఊపిరి పీల్చుకున్నారు. రెండు రోజులుగా సాయంత్రం వేళల్లో మబ్బులు ఉరుముతూ వర్ష సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంట చేతికొచ్చాక, అకాల వర్షం పడితే పంట తీవ్రంగా దెబ్బతింటుందని, కొనేవారే కరువవుతారని ఆవేదన చెందుతున్నారు. రైతులు ప్రతీరోజు రాత్రి కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్లి ధాన్యంపై పరదాలు కప్పి, తెల్లవారుజామున తొలగిస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు నత్తనడకన సాగుతుండటం మూలంగానే ఈ పరిస్థితి ఎదురవుతుందని రైతులు వాపోతున్నారు. మబ్బులను చూస్తే భయమేస్తోంది.. నాకున్న 8 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేసిన. వచ్చిన ధాన్యం మొత్తాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన. వారం రోజులైతాంది. ఇంకా కాంటా పెట్టలేదు. మబ్బులను చూస్తే భయమైతాంది. వర్షం కురిస్తే మాత్రం ధాన్యం మొత్తం దెబ్బతింటది. ప్రతీరోజు రాత్రి ధాన్యం మీద పరదాలు కప్పి పొద్దన తీసేస్తాన. వర్షం బాగా వస్తే పరదాలు కూడా పని చేయవు. జొన్నలు మొత్తం తడిసి ముద్దయితవి. – నీరటి నారాయణ, రైతు, చిట్యాల ఉరుముతున్న మబ్బులు, చిరు జల్లులు కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లోనే మొక్కజొన్న, ధాన్యం మోస్త్తరు వానలు ఉన్నాయంటున్న వాతావరణ శాఖ కురిస్తే మొక్కజొన్న, ధాన్యం నీటిపాలే..వ్యాపారులను ఆశ్రయిస్తున్న రైతులు.. ఓవైపు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు నత్తనడకన సాగడం, మరోవైపు ప్రతీరోజు వర్ష సూచనలు కనిపిస్తుండటంతో పంట నీటి పాలు కాకూడదనే ఉద్దేశంతో కొందరు రైతులు పరకాల, వరంగల్ పట్టణాలకు ధాన్యాన్ని తరలించి ప్రైవేట్ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఇదే అదనుగా భా వించిన వ్యాపారులు మొక్కజొన్నను క్వింటాలుకు రూ.1,900కు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం చెల్లిస్తున్న ధరతో పోలిస్తే రైతులు ఒక క్వింటాకు రూ. 500 చొప్పున నష్టపోవాల్సి వస్తుంది. -
డాక్టర్ శ్రీలతకు ఉత్తమ మహిళా సైకాలజిస్ట్ అవార్డు
కాళోజీ సెంటర్: తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ శ్రీలత అందేకు ప్రతిష్టాత్మకమైన ఉత్తమ మహిళా సైకాలజిస్ట్ అవార్డును అందుకున్నారు. టీపీఏ ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో జరిగి కార్యక్రమంలో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా ఈ అవార్డును స్వీకరించారు. డాక్టర్ శ్రీలత మనోవిజ్ఞాన శాస్త్ర రంగంలో అందించిన సేవలకు గుర్తింపుగా అవార్డు లభించగా టీపీఏ రాష్ట్ర అధ్యక్షుడు మోత్కూరి రామచందర్ ప్రత్యేక అతిథిగా పాల్గొని అభినందించారు. -
విభజన హామీలు నెరవేర్చాలి
భూపాలపల్లి అర్బన్: తెలంగాణ రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హమీలను అమలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి బందు సాయిలు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా జిల్లాలో అరెస్టు చేసిన సీపీఐ(ఎం) పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాల నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం ఏర్పడి పన్నెండేళ్లు గడుస్తున్నా అభివృద్ధి, ఉపాధి, సాగునీరు, పరిశ్రమలు, విద్య, సామాజిక న్యాయం వంటి రంగాల్లో తెలంగాణ ప్రజల ఆశలు నెరవేరలేదన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని, కులగణన చేపట్టకపోవడం బీసీల పట్ల వివక్షకు నిదర్శనమన్నారు. నిందితులను అరెస్ట్ చేయాలి భూపాలపల్లి అర్బన్: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడికి సంబంధించి వెలుగులోకి వచ్చిన మైనర్ బాలికపై అత్యాచార కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేయాలని డీవైఎఫ్ఐ జిల్లా గర్ల్స్ కన్వీనర్ అంబాల స్వర్ణలత ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మహిళలు, బాలికల భద్రతను కాపాడాల్సిన పరిస్థితిలో ఇలాంటి ఘటనలు సమాజాన్ని కలవరపెడుతున్నాయని అన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం, పోలీసు శాఖ వెంటనే స్పందించి పూర్తిస్థాయిలో విచారణ జరిపి నిజానిజాలు వెలికితీయాలని డిమాండ్ చేశారు. నిందితులు ఎవరైనా చట్టం ముందు సమానమేనని, రాజకీయ హోదాలు లేదా ప్రభావంతో కేసును నీరుగార్చే ప్రయత్నాలు చేయకూడదన్నారు. జ్యోతిర్లింగ దర్శనం కోసం.. కాళేశ్వరం: దేశంలోని జ్యోతిర్లింగ దర్శనం కోసం ఇద్దరు యువకులు సంవత్సర కాలంగా స్కేటింగ్‌తో ప్రయాణిస్తున్నారు. ఆ ప్రయాణం 20 వేల కిలోమీటర్లు కాగా ఇప్పటికి 7వేల కిలోమీటర్లు పూర్తి చేసినట్లు ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం గోరఖ్‌పూర్‌కు చెందిన మనీష్, శంబూసింగ్ తెలిపారు. దేశంలోని పలు పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడం గొప్పగా ఉందని పేర్కొన్నారు. వేసవికాలంలో ఉదయం, సాయంత్రం వేళల్లో ఎక్కువగా ప్రయాణిస్తున్నామని తెలిపారు. వారి యాత్ర ఆదివారం కాళేశ్వరం చేరింది. కాళేశ్వరం క్షేత్రం గురించి తెలుసుకొని యాత్ర చేస్తున్నట్లు వివరించారు. స్వామిని దర్శించుకొని వెళుతామన్నారు. రోడ్డుపై స్కేటింగ్‌తో వస్తుంటే జనం ఆసక్తిగా తిలకించారు. అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలి చిట్యాల: చిట్యాల మండల కేంద్రంలో అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సీపీఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపెల్లి మల్లేష్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ఉన్న అగ్నిమాపక కేంద్రం చిట్యాల, టేకుమట్ల , మొగుళ్లపల్లి మండలాలకు సుమారు 35 కిలోమీటర్లు ఉందని.. దీంతో అగ్రిమాపక శకటం వచ్చే సరికి భారీ నష్టం జరుగుతుందని అన్నారు. చిట్యాల మండల కేంద్రంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేస్తే ప్రమాదాలను అరికట్టవచ్చన్నారు. సమాచారం కోసం సంప్రదించాలి కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో ఈనెల 21 నుంచి జూన్ 1వరకు జరుగు సరస్వతీ నది అంత్య పుష్కరాలకు సంబంధించిన సమాచారం కోసం కాళేశ్వరం దేవస్థానంలో సంప్రదించాలని ఈఓ మహేష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వసతి సౌకర్యం కోసం 94910 18012, ఆర్జిత సేవలకు 94910 17012, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 94910 15252 నంబర్లలో సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు. ప్రతీ రోజు జరిగే హోమంలో పాల్గొనే భక్తులు రూ.2వేలు ఒక రోజుకు దంపతులకు మాత్రమే వర్తిస్తుందని తెలిపారు. దేవస్థానం నుంచి పూజాసామగ్రి అందజేస్తున్నట్లు తెలిపారు. భక్తులు గమనించాలని ఆయన తెలిపారు. నేటినుంచి ఎడ్యుకేషన్ వీక్ కాళేశ్వరం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా హైదరాబాద్ ఉన్నత విద్యాశాఖ ఆదేశాల మేరకు వారం రోజుల పాటు విద్య వారోత్సవాలను మే 11 నుంచి 17వ తేదీ వరకు ఎడ్యుకేషన్ వీక్‌లో మహదేవపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు ప్రినిపాల్ జున్ను విజయ్‌కుమార్ ఆదివారం తెలిపారు. కళాశాల హాజరు శాతం పెంచడం, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ కార్యక్రమం, సృజనాత్మక స్కిల్స్ పెంచడం, కళాశాల కోసం ఫండ్స్ సమకూర్చడం, అభివృద్ధి, వివిధ రకాల సదుపాయం కోసం నిర్వహణ జరుగుతుంది. (నేడు) సోమవారం కళాశాలలో ఉదయం 11 గంటలకు ప్రారంభోత్సవం జరుగుతుందని తెలిపారు. -
గడువులోగా పూర్తయ్యేనా!
● 21నుంచి సరస్వతీనది అంత్య పుష్కరాలు ● పనుల్లో నాణ్యత లోపిస్తుందని విమర్శలుకాళేశ్వరం: కాళేశ్వరంలో ఈనెల 21న సరస్వతీనది అంత్య పుష్కరాలకు ముహూర్తం ఖరారైంది. కాళేశ్వరంలో పురాతన విగ్రహాలు అమర్చడానికి రూ.1.20కోట్ల వ్యయంతో మ్యూజియం పనులు వేగిరంగా జరుగుతున్నాయి. ఈనెల 18 వరకు పూర్తి చేయాలని అఽధికారులు ఆదేశించారు. దీంతో వేగిరంగా పనులు చేస్తూ.. నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రూ.30లక్షల వ్యయంతో నాగదేవాలయం నిర్మాణం కూడా అదే స్థాయిలో జరుగుతుంది. ఈ రెండు పనులపై రిటైర్డు డీఈ, ఏఈఈలు పర్యవేక్షణకు ఉన్నప్పటికీ గడువులోగా పూర్తయ్యేలా లేదు. క్యూరింగ్ కూడా సరిగ్గా జరుగడం లేదు. రూ.2కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న రోడ్డు పనులు కూడా నెమ్మదిగా ఉన్నాయి. క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు పరీక్షలు జరుపాలని భక్తులు కోరుతున్నారు. ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో చూడకపోవడంతో నాణ్యత లోపిస్తుందనే విమర్శలు వస్తున్నాయి. పొలం గట్లు పొట్టు పొట్టు! పార్కింగ్ స్థలాల కోసం అధికారులు రైతుల పంట భూములను చదును చేయడం వివాదాస్పదమైంది. పడిదం చెరువు కింది ఆయకట్ట రైతుల సమాచారం ప్రకారం.. ముందస్తు సమాచారం లేకుండా డోజర్లతో గట్లు దున్ని భూములను చదును చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి పొలం గట్టు ఎక్కడ ఉందో కూడా గుర్తుపట్టలేని పరిస్థితి ఏర్పడిందని రైతులు చెబుతున్నారు. భూములు దెబ్బతిన్న రైతులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుకు సిద్ధమయ్యారు. నష్టపరిహారంగా ఎకరానికి రూ.20 వేల చొప్పున చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. -
నేడు మాతృదినోత్సవం
సాక్షి, మహబూబాబాద్: మాది ఉమ్మడి కుటుంబం. అమ్మాన్నాన్న లక్ష్మీ, నరసింహం. నాన్న వ్యవసాయం చేసేవారు. ఇంట్లో నేనే పెద్ద కొడుకును. చిన్నప్పటి నుంచి బాగా చదివి ఉద్యోగం సాధించాలని అమ్మ చెబుతుండేది. అమ్మ చెప్పినట్లుగానే ఉద్యోగం సంపాదించా. నన్ను చూసి మా అన్నదమ్ములు, అక్కా చెళ్లెళ్లు అందరూ బాగా చదివి మంచి పొజీషన్లో ఉన్నారు. నాన్న చనిపోయి పదేళ్లు దాటింది. అప్పటి నుంచి అమ్మ మాతోనే ఉంటోంది. ఇప్పటికీ అమ్మతో మంచీ చెడు అన్నీ పంచుకుంటాం. అమ్మ నింపిన ధైర్యమే నా ఉద్యోగం. – ఎన్.తిరుపతిరావు, డీఎస్పీ, మహబూబాబాద్ -
అనాథలకు అమ్మ
జఫర్‌గఢ్: వందలాది మంది అనాథ పిల్లలతో అమ్మ అని ఆప్యాయంగా పిలుపించుకుంటున్నారు ‘మా ఇల్లు ఆశ్రమ నిర్వాహకులు గాదె పుష్పరాణి. మండలంలోని రేగడితండా గ్రామ శివారు టీబీతండా వద్ద గాదె ఇన్నయ్య 20 ఏళ్ల క్రితం ‘మా ఇల్లు’ ప్రజాదరణ అనాథ ఆశ్రమాన్ని స్థాపించారు. 32 మంది పిల్లలతో ప్రారంభించిన ఈ ఆశ్రమంలో ఇప్పటి వరకు వందకు పైగా అనాథ పిల్లలు ఆశ్రయం పొందుతున్నారు. ఆశ్రమంలోని ఆడపిల్లల విషయంలో ఆమె ప్రత్యేక శ్రద్ధవహిస్తూ తల్లిదండ్రులు లేని లోటు తీరుస్తున్నారు. ఆశ్రమానికి చెందిన ముగ్గురు ఆడపిల్లలకు సొంత ఖర్చులతో వివాహాలు జరిపించారు. పుష్పరాణి కృషి ఫలితంగా ఆశ్రమానికి చెందిన పిల్లలు లాయర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, నర్సులు, ఉపాధ్యాయులు, కానిస్టేబుల్‌గా ఉద్యోగాలు సాధించారు. ఈ సందర్భంగా గాదె పుష్పరాణి మాట్లాడుతూ.. ఎంతో మంది అనాథ పిల్లలకు అమ్మలా సేవ చేయడం, వారితో అమ్మ అని పిలిపించుకోవడం తనకు ఎంతో సంతోషాన్నిస్తోందన్నారు. -
ఉచిత బాల్ బాడ్మింటన్ శిక్షణ
చిట్యాల: మండలంలోని నైన్పాక గ్రామంలో ఉచిత (సమ్మర్ క్యాంప్) బాల్ బ్యాడ్మింటన్ శిక్షణను ఏర్పాటు చేసినట్లు బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గూట్ల తిరుపతి, బాల్ బ్యాడ్మింటన్ కోచ్ ఉడుత మోహన్ శనివారం తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు క్రమశిక్షణతో పాటు క్రీడలు ఎంతో అవసరం అని అన్నారు. ప్రతీ రోజు ఉదయం 6 గంటల నుంచి 9.30 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 6.30 గంటల వరకు శిక్షణ ఉంటుందని అన్నారు. ఈ శిక్షణలో రన్నింగ్, వ్యాయాయంతో పాటు క్రీడలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చెరువులో చేపల మృత్యువాతచిట్యాల: చైన్పాక గ్రామ శివారులోని పెద్దమ్మకుంట చెరువులో గుర్తు తెలియని వ్యక్తులు విషం కలపడంతో 1.50 క్వింటాళ్ల చేపలు మృత్యువాత పడ్డాయి. ముదిరాజ్ సొసైటీ అధ్యక్షుడు బండి నర్సయ్య కథనం ప్రకారం.. చెరువులో చేపలు మృతి చెంది పైకి తేలడంతో గ్రామస్తులు ముదిరాజ్ సంఘం నాయకులకు సమాచారం అందించారని పేర్కొన్నారు. దీంతో శుక్రవారం ఉదయం గ్రామస్తులు, ముదిరాజ్ సంఘం నాయకులు వెళ్లి పరిశీలించారు. కాగా, అదే ప్రాంతంలో పురుగుల మందు వాసన రావడంతో గమనించిన ముదిరాజ్ నాయకులు శనివారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. చెరువులో విషం కలిపిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని నర్సయ్య కోరారు. సభను విజయవంతం చేయండి ములుగు రూరల్: నేడు (ఆదివారం) సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ ములుగు అర్బన్ అధ్యక్షుడు ఇమ్మడి రాకేష్ యాదవ్ అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాటాడుతూ మోదీ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు వాసుదేవరెడ్డి, రాకేష్, ప్రమోద్‌రెడ్డి, రవీందర్, ప్రవీణ్, కోటేశ్వర్ పాల్గొన్నారు.13న పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ములుగు రూరల్: ఈ నెల 13న పాలిసెట్ ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు పాలిసెట్ జిల్లా కోఆర్డినేటర్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కొప్పుల మల్లేశం శనివారం తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ములుగు, జాకారం బాలుర సోషల్ వెల్పేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీతో కలిపి రెండు సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రెండు సెంటర్లలో 675 మంది విద్యార్థులను కేటాయించినట్లు తెలిపారు. 13వ తేదీ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష ఉంటుందని తెలిపారు. విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. నిమిషం ఆలస్యం అయినా అనుమతించేది లేదని తెలిపారు. విద్యార్థులు ఇటీవల డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్‌తో రావాలని.. వారి వెంట హెచ్‌బీ పెన్సిల్, బాల్ పాయింట్ పెన్, ఎరేజర్, షార్ప్నర్లు తీసుకురావాలని తెలిపారు. వాహనం ఢీకొని గేదెలు మృతివెంకటాపురం(కె): గుర్తుతెలియని వాహనం ఢీకొని ఐదు గేదెలు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని పాత్రాపరం గామ శివారులో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్లోగూడెం గ్రామానికి చెందిన రాంబాబు తన గేదెలను శుక్రవారం ఉదయం పాలెం వాగు సమీపంలోకి మేతకు తీసుకెళ్లాడు. రాత్రి గేదెలు ఇంటికి రాలేదు. శనివారం ఉదయం గేదెల కోసం వెతుకుతుండగా పాత్రాపురం పాలెం వాగు సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెంది కనిపించాయి. పాత్రాపురం సర్పంచ్ బొగ్గుల పుష్పవతి సంఘటనా స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. -
ధాన్యాన్ని నిల్వ చేసుకునేందుకు సహకరించాలి
చిట్యాల: రైతుల పండించిన ధాన్యాన్ని మిల్లు యజమానులు గోదాములలో నిల్వ చేసుకునేందుకు సహకరించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కోరారు. శనివారం మండలకేంద్రంలోని బాలమురగన్ కాటన్ మిల్లు వద్ద ట్రాక్టర్లలో మొక్కజొన్న ధ్యాన్యంతో వేచి ఉన్న రైతులను గమనించి వారి వద్దకు వెళ్లి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మిల్లును సందర్శించి యజమానితో మాట్లాడారు. రైతులు పండించిన ధాన్యాన్ని మిల్లులో నిల్వలు చేసుకోవాలని కోరారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కర్ణాకర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గుమ్మడి శ్రీదేవి, మండల నాయకులు, రైతులు ఉన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
ఇంటర్ ప్రవేశాలపై సందిగ్ధత
భూపాలపల్లి అర్బన్: ఇంటర్ ప్రవేశాల షెడ్యూల్ జారీ చేసిన మరుసటి రోజునే ఆ ఉత్తర్వులను నిలుపుదల చేయడం ప్రభుత్వ కళాశాలల అధ్యాపకులను కలవరపెడుతోంది. ఇప్పటికే ప్రైవేట్ కళాశాలలు, కార్పొరేట్ విద్యాసంస్థలు జోరుగా ప్రచారం పెంచి ప్రవేశాలు చేస్తుండగా.. ప్రభుత్వ కళాశాలలు మూసి ఉండటంతో పేద విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఈ నెల 8వ తేదీ నుంచి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభించే అవకాశాలు ఉన్నా ఇప్పటి వరకు ఆదేశాలు జారీ కాలేదు. జిల్లాలో 34 కళాశాలలు.. జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఐదు, కస్తూర్బా బాలికల విద్యాలయాలు 10, ఆదర్శ పాఠశాలలు ఆరు, ఇతర కళాశాలలు 13 ఇంటర్ విద్యను అందిస్తున్నాయి. ఇటీవల పదోతరగతి ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో 3,483 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇందులో సగానికి పైగా విద్యార్థులు జెడ్పీఎస్ఎస్, కేజీబీవీ, ఆదర్శ పాఠశాల్లో చదివిన వారే కావడం గమనార్హం. విద్యార్థులు తమ ఆర్థిక స్థోమత దృష్ట్యా ప్రభుత్వ కళాశాలల్లో చేరేందుకు మొగ్గుచూపుతారు. తల్లిదండ్రుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు తక్కువ ఫీజుకే ప్రవేశం కల్పిస్తామని ఆ తర్వాత అదనపు రుసుములను వసూలు చేయడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాల ప్రక్రియను నిలిపివేయడం పేద విద్యార్థులకు నష్టం చేకూర్చేలా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 4న ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల కాగా.. పలు కళాశాలల అధ్యాపకులు ఉత్సాహంగా మరుసటి రోజున ప్రచారబాట పట్టాయి. అదే రోజు సాయంత్రం ఆ షెడ్యూల్‌ను రద్దు చేస్తున్నట్లు ఇంటర్‌బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్ ఉత్తర్వులు జారీచేశారు. జూన్ ఒకటో తేదీ నుంచి కళాశాలలను పునఃప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించగా.. ప్రైవేట్ సంస్థలు ప్రచార జోరు పెంచడం ప్రభుత్వ కళాశాలల అధ్యాపకులను అయోమయానికి గురిచేస్తోంది. పాఠశాలలో విలీనం..? రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యాసంవత్సరం నుంచి నూతన జాతీయ విద్యా విధానం అమలు చేయాలని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఇంటర్ విద్యను విలీనం చేయడానికి సిద్ధం చేసినట్లు సమాచారం. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు నూతనంగా ఏర్పాటు చేయనున్న తెలంగాణ పబ్లిక్ స్కూళ్లలో తరగతులు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ పాఠశాలల్లో సౌకర్యాలు, సామర్‌ాధ్యలను గుర్తించి టెన్ ప్లస్ టూ విధానం అమలు చేసేలా విద్యా కమిషన్ భావిస్తున్నట్లు తెలిసింది. అందులో భాగంగా ఇంటర్ ప్రవేశాల ప్రక్రియను నిలిపివేసినట్లు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చర్చ జరుగుతోంది. పాత వర్సెస్ కొత్త విధానం ఈసారి ఆన్లైన్ విధానంలో ఇంటర్మీడియట్లో ప్రవేశాలు ఉంటాయా? లేదా పాత పద్ధతిలోనేనా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇంటర్ విద్యను పాఠశాల వ్యవస్థలో విలీనం చేయడాన్ని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం వ్యతిరేకిస్తోంది, దీనివల్ల ఐఐటీ, నీట్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఇదీ పరిస్థితి.. జూనియర్ కళాశాలలు 34ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 5మోడల్ జూనియర్ కళాశాలలు 6ప్రైవేట్ జూనియర్ కళాశాలలు 4ట్రైబుల్ వెల్ఫేర్ కళాశాలలు 2కేజీబీవీ కళాశాలలు 10సోషల్ వెల్ఫేర్ 2మైనారిటీ 1బీసీ వెల్ఫేర్ 4 పాఠశాల విద్యలో బోర్డు విలీనం 12వ తరగతి వరకు పాఠశాల విద్య ప్రభుత్వ కళాశాలల్లో అయోమయం -
నేటితో స్వీయ జనగణన ముగింపు
● కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి: స్వీయ జనగణన నేటితో ముగుస్తుందని, ప్రతీ ఒక్కరు తప్పనిసరిగా తమ వివరాలను నమోదు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. 2027 జనగణనలో భాగంగా ఆన్లైన్ ద్వారా స్వీయ గణన చేసుకునేందుకు నేటివరకు మాత్రమే అవకాశం ఉందని తెలిపారు. ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకునే ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. వెబ్సైట్ ద్వారా ఇంటి వద్ద నుంచే సులభంగా స్వీయ గణన నమోదు చేసుకోవాలన్నారు. మొబైల్ ఫోన్ ద్వారానే ఈ ప్రక్రియ పూర్తి సులభతరమని, నచ్చిన భాషను ఎంచుకొని వివరాలు నమోదు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోళ్లు.. రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్నామని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. ధాన్యం కొనుగోలు, ఫార్మర్ రిజిస్ట్రీ, సెన్సస్, విద్యా వారోత్సవాలపై శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్ని జిల్లాల కలెక్టర్లు, పౌర సరఫరాలు, విద్యా, డీఆర్డీఓ తదితర శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. ఈ కాన్ఫరెన్స్‌కు భూపాలపల్లి ఐడీఓసీ నుంచి కలెక్టర్‌తో పాటు డీసీఎస్ఓ కిరణ్‌కుమార్, డీఎం రాములు, డీఈఓ రాజేందర్ పాల్గొన్నారు. -
భర్త లేకపోయినా.. బాధ్యత నెరవేర్చింది
బచ్చన్నపేట: జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం లింగంపల్లికి చెందిన గూడ లావణ్య – కీ.శే. భూపాల్‌రెడ్డి దంపతులకు ఇద్దరు సంతానం. కూతురు అపూర్వ, కుమారుడు అశ్విష్‌రెడ్డి. కూతురు బీటెక్ మూడో సంవత్సరం చదువుతుండగా, లావణ్య భర్త భూపాల్‌రెడ్డి ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌తో మృతి చెందాడు. అయినప్పటికీ, తల్లి లావణ్య మనోస్థైర్యంతో తన పిల్ల లను చదివించింది. అపూర్వ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ కష్టపడి చదివి ఎస్సై ఉద్యోగానికి ఎంపికై ంది. ప్రస్తుతం సిద్దిపేట జిల్లా చేర్యాల పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓగా పని చేస్తోంది. కష్టాలు, కన్నీళ్లు ఎన్ని ఎదురైనా మనోధైర్యం, గుండె నిబ్బరం వీడకుండా ముందుకు సాగాలని, తన తల్లే తనకు ఆదర్శమని ఎస్సై అపూర్వరెడ్డి చెబుతున్నారు. -
12 రోజులు ఆధ్మాత్మిక శోభ
కాళేశ్వరం: ఈనెల 21నుంచి జూన్ 1వ తేదీ వరకు కాళేశ్వరం ఆధ్యాత్మిక శోభతో మారుమోగనుంది. గతేడాది జరిగిన సరస్వతీనది ఆది పుష్కరాల మాదిరిగానే 12రోజుల పాటు అంత్య పుష్కరాలకు రోజుకొక్కరు చొప్పున పలువురు పీఠాధిపతులు రానున్నారు. పలువురు ప్రవచన కర్తలు తమ సందేశాన్ని భక్తులకు వినిపించనున్నారు. ప్రతీ రోజు తిఽథుల ప్రకారం హోమాలు నిర్వహిస్తారని ఆలయవర్గాలు తెలిపాయి. ప్రతీ రోజు కాశీపండితులతో గోదావరి హారతి, అనంతరం తెప్పోత్సవం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాల్లో ప్రతీ రోజు ప్రముఖులు పాల్గొంటారు. పీఠాధిపతులు వీరే.. సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా ప్రతీ రోజు పీఠాధిపతులు పుష్కర స్నానం చేసి శ్రీకాళేశ్వరముక్తీశ్వరుడిని దర్శించుకుంటారు. కంచి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామిగల్, నాసిక్ పీఠాధిపతి మహామండలేశ్వర ఆచార్య సంవిదానంద సరస్వతి మహారాజ్, శంకరాచార్య మహాసంస్థానం శ్రీ అద్వైతానంద భారతి, శ్రీ శ్రీ అవని శృంగేరి జగద్గురువులు రానున్నారు. ఆదిలాబాద్ పీఠం శ్రీ యోగానంద సరస్వతి స్వామీజీ,హంపీ పీఠాధిపతి శ్రీ విద్యారణ్య భారతి మహాస్వామి, శ్రీ దత్త గిరి మహారాజ్ ఆశ్రమం పీఠాధిపతి బర్దీపూర్ 1008 వైరాగ్య శిఖామణి అవధూత గిరి మహారాజ్ రానున్నారు. విజయనగరం, కర్ణాటకకు చెందిన చింతామణి మఠం శివానంద భారతి చింతామణి స్వామి, చింతామణి మఠం, విశాఖపట్టణం శారద పీఠం స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి, స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి, మెదక్ కోల్చారం మాధవానంద సరస్వతి రానున్నారు. ప్రవచన కర్తలు: 21 నుంచి 24 వరకు శృంగేరి శారదా పీఠ ఆస్థాన పౌరాణికులు, బాచంపల్లి సంతోష్ కుమార్ శాసీ్త్రతో పుష్కర వైభవ ప్రవచనం సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు నిర్వహిస్తారు. 23న మహాసహస్రావధాని గరికపాటి నరసింహరావు గారితో ఆధ్యాత్మిక ప్రవచనం చేస్తారు. జూన్ 1న బ్రహ్మశ్రీ ద్విసహస్రావధాని మాడుగుల నాగఫణి శర్మ ఆధ్యాత్మిక ప్రవచనం చెబుతారు. ఆయా రోజుల్లో సాయత్రం 5గంటల నుంచి 6గంటల వరకు నిర్వహిస్తారు. 12 రోజులు హోమాలు ప్రపంచ శాంతి కోసం మహారుద్ర జప అభిషేక సహిత కామ్యార్థ హోమాలను ఈనెల 21 నుంచి జూన్ 1 వరకు ఆలయ ఆవరణలో నిర్వహిస్తారు. 21న మహాగణపతి హోమం, 22న సుబ్రహ్మణ్య షాఢాక్షరి హోమం (సంతానప్రాప్తి, శతృబాధ నివారణార్ధం), 23న హయగ్రీవ హోమం (సకల విద్యా ప్రాచ్యర్గం), 24న నవగ్రహ హోమం (నవగ్రహ ప్రసాద సిద్యర్థం), 25న మహామృత్యుంజయ హోమం (అనమృత్యుదోష నివారణార్థం),26న దుర్గ సూక్త హోమం (సకల ఐశ్వర్య ప్రాస్యర్ధం),27న మహా సుదర్శన హోమం (సకల దృష్టి దోష నివారణార్థం),28న మేద దక్షిణామూర్తి హోమం (మేద ధారణ సిద్యర్ధం), 29న స్వయంవర పార్వతి హోమం (శీఘ్ర వివాహ ప్రాష్యర్ధం), 30న విశాఖ దన్వంతరి హోమం (ఆయుఆరోగ్య ప్రాష్యర్ధం), 31న మహారుద్ర హోమం (అష్ట ఆశ్వర్య ప్రాష్యర్థం),జూన్1న లఘు చండీ, మహా పూర్ణాహుతి (సకల పాపక్షయార్థం) నిర్వహించనున్నారు. నదీ హారతి, తెప్పోత్సవం.. ప్రతీ రోజు సాయంత్రం 6.30 గంటల నుంచి 7.30గంటల వరకు త్రివేణి సంగమం వద్ద కాశీ పండితులతో నది హారతి కార్యక్రమం, అనంతరం తెప్పోత్సవం నిర్వహిస్తారు. ప్రతీ రోజు సాయంత్రం 7.30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రసిద్ధ నృత్య కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దీంతో ఆధ్యాత్మిక శోభతో కాళేశ్వరం వెలుగులు విరజిమ్మనుంది. 21నుంచి సరస్వతీనది అంత్య పుష్కరాలు రోజుకో పీఠాధిపతి రాక రోజూ నదీహారతి, తెప్పోత్సవం నిర్వహణ -
స్వీయ జనగణనలో పాల్గొనాలి
భూపాలపల్లి: స్వీయ జనగణన కార్యక్రమంలో జిల్లా ప్రజలందరూ చురుకుగా పాల్గొనాలని కలెక్టర్ రాహుల్ శర్మ పిలుపునిచ్చారు. ఆన్లైన్ ద్వారా స్వీయ గణన చేసుకునేందుకు ఈ నెల 10వ తేదీ వరకు మాత్రమే అవకాశం ఉన్నందున, అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ప్రజలు స్వీయ జనగణన వెబ్సైట్ ద్వారా ఇంటి వద్ద నుంచే మొబైల్ ఫోన్ సహాయంతో సులభంగా స్వీయ గణన పూర్తి చేసుకోవచ్చని తెలిపారు. నచ్చిన భాషను ఎంపిక చేసుకునే అవకాశం కూడా ఉందన్నారు. గత నెల 26వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం ఈ నెల 10తో ముగుస్తుందన్నారు. అనంతరం ఈ నెల 11వ తేదీ నుంచి ఎన్యుమరేటర్లు ఇంటింటికి వెళ్లి హౌస్ లిస్టింగ్ నిర్వహిస్తారని వివరించారు. దేశ ప్రణాళిక, భవిష్యత్ అభివృద్ధి, వనరుల సమాన పంపిణీకి జనగణన కీలకమన్నారు. అద్దె ఇళ్లలో నివసిస్తున్న వారు కూడా తమ ప్రస్తుత నివాసం నుంచే వివరాలు నమోదు చేసుకోవచ్చన్నారు. కుటుంబ వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని, అవి కేవలం జనాభా లెక్కల కోసమే వినియోగించబడతాయని స్పష్టం చేశారు. ప్రతీ కుటుంబానికి ప్రత్యేక ఎన్యుమరేషన్ ఐడీ ఇవ్వబడుతుందని, దీని ద్వారా ఎన్యుమరేటర్లు ఇంటికి వచ్చినప్పుడు ప్రక్రియ వేగంగా పూర్తవుతుందని తెలిపారు. జిల్లా ప్రజలందరూ స్వీయ జనగణనలో పాల్గొని జిల్లా, దేశ అభివృద్ధికి సహకరించాలని ఆకాంక్షించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి రేగొండ: మక్కలు, ధాన్యం సేకరణలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ రాహుల్‌శర్మ అన్నారు. మండలంలోని లింగాల రైస్‌మిల్, రూపిరెడ్డిపల్లిలోని సహకార సంఘం భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని తరలించడానికి లారీలను అందుబాటులో ఉంచాలన్నారు. రైస్‌మిల్, సహకార సంఘం భవనంలో ధాన్యాన్ని నిల్వ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, డీఎం రాములు, సహకార జిల్లా అధికారి వాలియ నాయక్, తహసీల్దార్ శ్వేత, డిప్యూటీ తహసీల్దార్ అబ్దుల్ రజాక్ పాల్గొన్నారు. ధాన్యాన్ని మిల్లులకు తరలించాలి చిట్యాల: మండలంలోని వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యాన్ని త్వరితగతిన మిల్లులకు తరలించాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులకు ఆదేశించారు. మండలంలోని దూత్పల్లిలో వరి ధ్యానం కొనుగోలు కేంద్రాన్ని, మండలకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలోని మొక్కజొన్న, వరి ధాన్యాన్ని పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ తేమశాతం వచ్చిన ధాన్యన్ని వెంటవెంటనే లారీలపైన ఆధారపడకుండా ట్రాక్టర్ల ద్వారా కూడా మిల్లులకు తరలించాలని అధికారులకు ఆదేశించారు. మొగుళ్లపల్లి: మండల కేంద్రంలోని ఆధునిక వ్యవసాయ గిడ్డంగి ని కలెక్టర్ రాహుల్‌శర్మ పరిశీలించి నిల్వల వివరా లు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, డీఎస్ఓ కిరణకుమార్, డీసీఓ వాల్యానాయక్, జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు, మార్క్‌ఫెడ్ అధికారి శ్రీలత, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గుమ్మడి శ్రీదేవి పాల్గొన్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ -
వన్యప్రాణుల దాహం తీరేదెలా?
● అటవీలో నిరుపయోగంగా సాసర్ పిట్స్ ● వేసవిలో మూగజీవాలకు తాగునీటి కష్టాలుకన్నాయిగూడెం: మండే ఎండలకు వన్యప్రాణులు దాహంతో అల్లాడుతున్నాయి. అటవీశాఖ ఆధ్వర్యంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన నీటికుంటలు (సాసర్‌పిట్స్) నిరుపయోగంగా మారాయి. కేవలం పేరుకు మాత్రమే సాసర్ పిట్స్ ఏర్పాటు చేశారని, వాటిలో నీటిని నింపడంలో అధికారులు చొరప చూపడం లేదని వన్యప్రాణి ప్రేమికులు అంటున్నారు. దాహం తీర్చుకునేందుకు దూరంలో ఉన్న నీటి కుంటలు, చెరువులు, రైతు పొలాల వద్దకు వెళ్తున్నాయి. దీంతో అదను చూసి వేటగాళ్లు వన్యప్రాణులను అంతం చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఐలాపూర్, సర్వాయి అటవీ ప్రాంతంలో.. కన్నాయిగూడెం మండలం దాదాపు అటవీ ప్రాంతం కావడంతో వన్యప్రాణులు ఎక్కువగా ఉంటాయి. దీంతో అటవీశాఖ అధికారులు ఐలాపూర్, సర్వాయి, భూపతిపురం, చిట్యాల, తుపాకులగూడెం తదితర అటవీ గ్రామాల పరిధిలో సిమెంట్‌తో సాసర్‌పిట్స్ ఏర్పాటు చేశారు. వాటికి నీటి వసతి కోసం బోరు వేసి సోలార్ విద్యుత్‌తో మోటారు నడిచేలా ఏర్పాటు చేసి నీటి వసతి కల్పించారు. పనిచేయని సోలార్ పంపులు.. వన్యప్రాణుల దాహం తీర్చడానికి ఏర్పాటు చేసిన సాసర్‌పిట్స్ నీరులేక నిరుపయోగంగా మారాయి. అధికారుల నిర్లక్ష్యంతో సోలార్ విద్యుత్ పంపులు పనిచేయకపోవడంతో సాసర్‌పిట్స్ బీటలువారి ఎండిన ఆకులతో నీరు లేకుండా దర్శనమిస్తున్నాయి. ఇప్పటికై నా అటవీశాఖ అధికారులు, ఉన్నతాధికారులు చొరవ తీసుకుని సాసర్‌పిట్స్‌లో నీరు ఏర్పాటు చేయించాలని వన్యప్రాణి ప్రేమికులు కోరుతున్నారు. -
తాగునీటి వ్యధ
భూపాలపల్లి: వేసవి వచ్చిందంటే చాలు.. తాగునీరు, ఇతర అవసరాలకు భూపాలపల్లి పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. మిషన్ భగీరథ నల్లానీరు రోజు విడిచి రోజు వస్తుండటంతో బోర్లు లేని వారు గుక్కెడు నీళ్ల కోసం నల్లానీరు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. విలీన గ్రామాలనైతే పట్టించుకునే వారే కరువయ్యారు. మున్సిపాలిటీలో 30 వార్డులు ఉండగా సగానికి పైగా వార్డుల్లోని ప్రజలు తాగునీటి తిప్పలు పడుతున్నారు. అన్ని కాలనీలకు మిషన్ భగీరథ పైప్‌లైన్ ఉన్నప్పటికీ రోజు విడిచి రోజు నల్లానీరు వస్తుంది. ప్రధానంగా రాజీవ్‌నగర్, క్రిష్ణాకాలనీ, బాంబులగడ్డ, సీఆర్‌నగర్, మంజూర్నగర్తో పాటు విలీన గ్రామాలైన బెడ్డెలపల్లి, గడ్డిగానిపల్లి గ్రామాల వైపు రెండు రోజులకొకసారి మిషన్ భగీరథ నీరు సరఫరా చేస్తున్నారు. దీంతో ఆయా కాలనీల ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చేసేది లేక చేతి పంపులు, పవర్ బోర్లను ఆశ్రయిస్తున్నారు. పట్టణంలోని కాలనీల్లో సొంతంగా పవర్ బోర్లు లేని వారైతే నల్లానీటి కోసం పడిగాపులు కాస్తున్నారు. ఉన్న నీటిని సర్దుకుంటూ నల్లానీటి కోసం ఎదురుచూస్తున్నారు. అంతేకాక మిషన్ భగీరథ నీటిని రాత్రి వేళలు, తెల్లవారుజామున వదులుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే ఈ నెల చివరలో ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీకి సంబంధించిన వాటర్ ట్యాంకర్లు రెండు మాత్రమే ఉన్నాయి. అందులో ఒక ట్యాంకర్‌ను జిల్లా ప్రధాన ఆస్పత్రికి, మరో ట్యాంకర్‌ను జాతీయ రహదారి మధ్యలో నాటిన మొక్కలకు నీరందించేందుకు వినియోగిస్తున్నారు. గతంలో వేసవిలో మూడు, నాలుగు వాటర్ ట్యాంకర్లను అద్దెకు తీసుకొని నీటి ఎద్దడి ఉన్న కాలనీలకు తాగునీటిని సరఫరా చేసేవారు. మిషన్ భగీరథ పథకం వచ్చిందనే కారణంతో ట్యాంకర్లను అద్దెకు తీసుకోవడం లేదు. దీంతో పైప్‌లైన్ లీకేజీలు, విద్యుత్ సమస్య వచ్చినప్పుడు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వారం రోజుల క్రితం మహాముత్తారం మండలం కోనంపేట వద్ద చెట్లు కూలి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో భూపాలపల్లి పట్టణానికి రెండు రోజుల పాటు తాగునీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.బెడ్డెలపల్లిలో వ్యవసాయ బోరు నీటిని బాటిళ్లలో పడుతున్న లక్ష్మయ్య, బాంబులగడ్డలో నల్లానీరు రాకపోవడంతో బోరుకు పైప్‌లైన్ బిగిస్తున్న మహిళ వార్డులు 30 గృహాల సంఖ్య 17,220జనాభా (సుమారుగా) 80 వేలు వాటర్ ట్యాంకర్లు 2 చేతిపంపులు 25 పనిచేస్తున్నవి 24పవర్‌బోర్లు 109పనిచేస్తున్నవి 108 మిషన్ భగీరథ పైప్‌లైన్ 113 కిలోమీటర్లు మిషన్ భగీరథ నల్లా కనెక్షన్లు 13,400రోజుకు అవసరమైన తాగునీరు 11 మిలియన్ లీటర్లు సరఫరా చేస్తున్నది 10.5 మిలియన్ లీటర్లు గొంతు తడుపుకునేందుకు తప్పని ఇబ్బందులు బోర్లను ఆశ్రయిస్తున్న ప్రజలు పట్టించుకోని అధికారులు, పాలకవర్గం -
అభివృద్ధిలో అగ్రగామిగా నిలపాలి
ములుగు రూరల్: జిల్లా అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అధికారులు సమన్వయంతో జిల్లాను అభివృద్ధిలో అగ్రగామిగా నిలపాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం కలెక్టర్ సమావేశ మందిరంలో కలెక్టర్ హేమంత్ సహదేవరావు, డీఎఫ్ఓ వికాష మీనాతో కలిసి జిల్లా అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లా సమగ్ర అభివృద్ధి సాధించడంతో పాటు ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతుందన్నారు. ప్రజా దర్భార్ ద్వారా ప్రజల సమస్యలు నేరుగా పరిష్కరించేందుకు ఏర్పాట్లు చేశామని, అందులో వచ్చిన ఫిర్యాదుల స్థితిగతులపై పూర్తిస్థాయిలో ప్రత్యేక అధికారిని నియమిస్తామన్నారు. పెండింగ్‌లో ఉన్న ప్రజా సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేయాలని ఆదేశించారు. నూతన గ్రామ పంచాయతీ భవనాలకు అంచనాలు సిద్ధం చేసి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీరు, డ్రెయినేజీలు వంటి అత్యవసర పనులకే నిధుల ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. పాఠశాలలు, వసతి గృహాలు ప్రా రంభమయ్యే నాటికి వాటిలో సమస్యలను గుర్తించి పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మహేందర్, ఆర్డీఓ వెంకటేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, తదితరులు ఉన్నారు. చట్టాలపై అవగాహన ఉండాలి బాలల సంరక్షణ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని మంత్రి డాక్టర్ దనసరి సీతక్క అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ హేమంత్ సహదేవరావుతో కలిసి బాలల హక్కుల పరిరక్షణ చట్టాలపై వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతీఒక్కరూ పాటుపడాలన్నారు. ఆడపిల్లలను చదివించాలని, ప్రభుత్వం అందుకు అనుగుణంగా అవకాశాలు కల్పిస్తుందన్నారు. మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బాలల వివాహాలపై గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలలపై లైంగిక వేదింపులు, దత్తత విధానం, చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి ప్రేమలత, డీఎఫ్ఓ వికాస్ మీనా, అదనపు కలెక్టర్ మహేందర్‌జీ, ఆర్డీఓ వెంకటేశ్, అధికారులు పాల్గొన్నారు. ఒలింపిక్ స్థాయికి ఎదగాలి క్రీడాకారులు ఒలింపిక్ స్థాయికి ఎదగాలని మంత్రి సీతక్క అన్నారు. జగ్గన్నపేట ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసిన రెజ్లింగ్ కోచింగ్ సెంటర్‌ను కలెక్టర్ హేమంత్ సహదేవరావుప్రారంభించారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క -
అకాలవర్షంతో అపారనష్టం
ఏటూరునాగారం: రైతులకు ప్రకృతి అపార నష్టాన్ని మిగిల్చింది. గురువారం రాత్రి కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల వద్ద నిల్వ చేసిన ధాన్యం, ఆరబోసిన ధాన్యం వర్షానికి తడిసిపోవడంతో వాటిని ఆరబెట్టుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. ఆరబోసిన ధాన్యం కింద నుంచి వర్షపు నీరు ప్రవహించడంతో వాటిని బకెట్ల ద్వారా ఎత్తి పారబోస్తున్నారు. మండలంలోని గోగుపల్లి, శివాపురం, చెల్పాక తదితర గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ఒక్కో రైతు ఒక్కో కష్టంగా మారింది. సరైన గోదాంలు, టార్పాలిన్లు లేక ఇబ్బంది పడ్డారు. నిర్వాహకులు కాంటాలు నిర్వహించి మిల్లులకు తరలించాలని రైతులు కోరుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో తడుస్తున్న ధాన్యం ఇబ్బందులు పడుతున్న రైతులు -
ప్రమాణ స్వీకారంలో ఉద్రిక్తత
● వివాదంగా మారిన వేంకటేశ్వరస్వామి ఆలయ కమిటీభూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రం మంజూరునగర్ శ్రీ భూనీల వేంకటేశ్వరస్వామి ఆలయ కమిటీ ప్ర మాణ స్వీకార కార్యక్రమం శుక్రవారం ఉద్రిక్త వాతా వరణంలో జరిగింది. ఆలయ ఈవో మహేష్ ఆధ్వర్యంలో సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఉద యం నుంచే ఆలయ పరిసరాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ రాజకీయ నాయకుల రాకపోకలు పెరగడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయాన్ని రాజకీయాలకు వేదిక చేయొద్దు.. భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయన సతీమణి బీఆర్ఎస్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి పార్టీ నాయకులతో కలిసి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన గండ్ర ఆలయ నిర్మాణ పనులు పూర్తికాకముందే ఎండోమెంట్ కమిటీ నియామకం, ప్రమాణ స్వీకారం నిర్వహించడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఆలయాన్ని రాజకీయాలకు వేదిక చేయకుండా అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. బీఆర్ఎస్ నాయకుల ధర్నా, అరెస్ట్ ఆలయం వద్ద పరిస్థితులు ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని భావించిన పోలీసులు గండ్ర వెంకటరమణారెడ్డి, గండ్ర జ్యోతి సహా పలువురు నాయకులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో నాయకులు, పోలీసుల మధ్య కొద్దిసేపు వాగ్వివాదం, తోపులాట చోటుచేసుకుంది. అనంతరం వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనకు నిరసనగా బీఆర్ఎస్ నాయకులు అంబేడ్కర్ సెంటర్లో ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. గండ్ర జ్యోతి అస్వస్థతకు గురికావడంతో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. -
దళారులను ఆశ్రయించొద్దు
మల్హర్: రైతులు తమ ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దని రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం తాడిచర్ల ఆధ్వర్యంలో రుద్రారం, దుబ్బపేట గ్రామాలలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రకాశ్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల దళారులను ఆశ్రయించకుండా కొనుగోలు కేంద్రాల ద్వారా గిట్టుబాటు ధరను పొందాలన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ఇప్ప మొండి, సర్పంచ్‌లు చంద్రగిరి సంపత్, భుక్య రవీందర్, కొండ రాజమ్మ, పీఏసీఎస్ డైరెక్టర్ సంగెం రమేష్, మండల నాయకులు బడితల రాజయ్య, వేముల చంద్రమౌళి, చంద్రగిరి అశోక్, సమ్మయ్య, సీఈఓ సంతోష్, రైతులు, హమాలీలు, సిబ్బంది పాల్గొన్నారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి భూపాలపల్లి అర్బన్: సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి, రాష్ట్ర కార్యదర్శి రావుల రమేశ్ డిమాండ్ చేశారు. జిల్లాకేంద్రంలో సంఘం జిల్లా అధ్యక్షుడు బానోత్ సేవానాయక్ అధ్యక్షతన శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి, రమేశ్ మాట్లాడారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) ఉద్యోగుల భవిష్యత్ భద్రతకు ముప్పుగా మారిందన్నారు. ఎన్నికల హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సీపీఎస్‌ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ ఉద్యోగుల డీఏ బకాయిలను వెంటనే వారి ఖాతాల్లో జమ చేయాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర కౌన్సిలర్ ముత్యాల రఘుపతి, నాయకులు అన్నారెడ్డి, పెద్దన్న, అశోక్, మోహన్, శ్రీనివాసరావు, నరేష్ పాల్గొన్నారు. రేషన్ బియ్యం పట్టివేత రేగొండ: కొత్తపల్లిగోరి మండల కేంద్రంలో శుక్రవారం సివిల్ సప్లై అధికారులు, పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి 9 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కొత్తపల్లిగోరి గ్రామానికి చెందిన చాపతి రమ ప్రజల నుంచి కొనుగోలు చేసిన రేషన్ బియ్యాన్ని ఇంట్లో నిల్వ చేసింది. సివిల్ సప్లై అధికారులకు వచ్చిన సమాచారం మేరకు దాడి చేసి రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సివిల్ సప్లై రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాయి త్రిలోక్‌నాథ్ రెడ్డి తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ భూపాలపల్లి రూరల్: ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో చదువుతున్న ఎస్సీ విద్యార్థులు పెండింగ్ స్కాలర్‌షిప్‌ల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి అధికారి ఇందిర శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వడదెబ్బతో రైతు మృతి మొగుళ్లపల్లి: వడదెబ్బకు గురై రైతు మృతిచెందిన ఘటన మండలంలోని బద్దంపల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. బద్దంపల్లి గ్రామానికి చెందిన సామల రాజిరెడ్డి(65) తన పంట చేను వద్దకు వెళ్లి పనులు ముగించుకొని సాయంత్రం ఇంటి చేరుకున్నాడు. ఎండ తీవ్రతతో అస్వస్థతగా ఉందని కుటుంబ సభ్యులకు చెప్పి.. ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. గమనించిన కుటుంబ సభ్యులు 108కి సమాచారం ఇచ్చారు. అంబులెన్స్ చేరుకునేలోపే మృతి చెందాడు. మృతుడికి భార్య రాధ ఉంది. రోజంతా ఎండలో పని చేయడంతో వడదెబ్బతో అస్వస్థతకు గురై మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. నైపుణ్యాధారిత శిక్షణ కేయూ క్యాంపస్: విద్యార్థులకు నైపుణ్యాధారిత శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి అన్నారు. శుక్రవారం వర్సిటీలోని సెనేట్ హాల్లో అధ్యాపకులకు, డీన్లకు, యూనివర్సిటీ కళాశాలల ప్రిన్సిపాళ్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. -
రామప్ప భూముల వేలంలో పెరిగిన ఆదాయం
వెంకటాపురం(ఎం): శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం (రామప్ప దేవాలయం) ఆధ్వర్యంలో 2026–27 సంవత్సరానికి సంబంధించి దేవస్థానం తరి భూములను రెండు పంటల కౌలు హక్కుల కోసం శుక్రవారం ఆలయ ఈఓ ఇమ్మడి భాస్కర్ ఆధ్వర్యంలో బహిరంగ వేలం నిర్వహించారు. దేవస్థానం ప్రాంగణంలో ఉదయం 11 గంటలకు జరిగిన వేలంలో పలువురు రైతులు పాల్గొన్నారు. రామానుజపూర్ శివారు లక్ష్మీదేవిపేట పరిధిలోని 9–09 ఎకరాల భూమిని రూ.1.40లక్షలు, పాలంపేట గార్లగడ్డ పరిధిలోని 3–11 ఎకరాల భూమి రూ.1,10,000లకు, వెంకటాపూర్ శివారులోని 2–02 ఎకరాల భూమి రూ.32,500లకు కౌలు కుదిరినట్లు అధికారులు తెలిపారు. గోవిందరావుపేట, రామానుజపూర్, బుద్దారం గ్రామాలకు చెందిన కొన్ని భూములు వేలంపాటకు రైతులు హాజరుకాకపోవడంతో వాటిని వాయిదా వేసినట్లు ఈఓ భాస్కర్ తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే రూ.44,500 అదనపు ఆదాయం వచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పర్యవేక్షణ అధికారి బిల్లా శ్రీనివాస్, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. -
సౌర విద్యుత్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
భూపాలపల్లి రూరల్: ప్రభుత్వం అందిస్తున్న సౌర విద్యుత్ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజులలో భాగంగా భూపాలపల్లి మండలం కొంపల్లి రైతు వేదికలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు వ్యవసాయ వినియోగం కోసం సౌర విద్యుత్‌పై దృశ్య–శ్రవణ ప్రదర్శన, వ్యవసాయ క్షేత్రాలు, సౌర విద్యుత్ కేంద్రాలు వ్యవసాయ యాంత్రీకరణ, డ్రోన్లు, సౌర ఆధారిత సాగునీటి పద్ధతుల ఆవశ్యకతపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి సతీష్, కొంపల్లి సర్పంచ్ సడల శ్రీకాంత్, కొంపల్లి తండా సర్పంచ్ నిర్మల, గూడాడ్పల్లి సర్పంచ్ దారురి శారద, భూపాలపల్లి సహాయ వ్యవసాయ సంచాలకుడు రమేష్, విద్యుత్ శాఖ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు పాల్గొన్నారు. -
రైతును కాపాడుకునే బాధ్యత ప్రభుత్వానిదే
హన్మకొండ: రైతును కాపాడుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వందేనని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో మూడు రోజులపాటు జరిగిన రాష్ట్రస్థాయి మెగా రైతు మేళా గురువారం ముగిసింది. చివరి రోజు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతకుముందు మేళాలో ఏర్పాటుచేసిన స్టాళ్లను సందర్శించి వివిధ ఉత్పత్తులను పరిశీలించారు. అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ రైతాంగానికి కావాల్సిన అన్ని అవకాశాలు కళ్ల ముందుంచాలని, యాంత్రీకరణ, పురుగు మందులు, ఎరువులు, మార్కెటింగ్ వ్యవస్థ, భవిష్యత్‌లో రాష్ట్రంలో ఏ రకంగా ముందుకు పోవాలి తదితర అంశాలపై రైతులను అవగాహన కల్పించేందుకే హనుమకొండలో రైతుమేళా నిర్వహించామన్నారు. రైతుకు పాడి–పంట రెండూ అవసరమని, ఈ రెండింటి వైపు రైతును ప్రోత్సహించాలన్నారు. ఆయిల్‌పాం లాభదాయకమని, రైతులు దీని సాగుపై దృష్టి సారించాలన్నారు. సేంద్రియ, ప్రకృతి వ్యవసాయం వైపు వెళ్లాలన్నారు. రైతుబంధు పేరుతో యాంత్రీకరణ అపేసి నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను అష్టకష్టాల పాలు చేసిందని విమర్శించారు. రుణమాఫీ, రైతు భరోసా, యూరియా సరఫరాపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నాయకులకు లేదన్నారు. రైతులు దానం చేయాలని నాడు వైఎస్ చెప్పారు.. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ రైతులు దానం చేయాలని, యాచించకూడదని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చెప్పారని, ఈ మేరకు వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తూ ఉచిత విద్యుత్ అందించారని, ప్రాజెక్టులు నిర్మించారన్నారు. అదే బాటలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. కొనుగోళ్లు వేగంగా జరగడం లేదు.. స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ ధాన్యం, మక్కల కొనుగోళ్లు వేగంగా జరగక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, వర్షాలు రాకముందే కొనుగోళ్లు పూర్తి చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో చేతులెత్తేసిందని విమర్శించారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, కేఆర్ నాగరాజు, రైతులు గోపిరెడ్డి గోపాల్ రెడ్డి, లావణ్య రెడ్డి, భాగ్యలక్ష్మి మాట్లాడారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉద్యానశాఖ డైరెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు చాహత్ బాజ్‌పాయ్, సత్యశారద, అదనపు కలెక్టర్లు ఎన్.రవి, సంధ్యారాణి, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామ్రెడ్డి, ఎన్పీడీసీఎల్ అధికారులు, శాస్త్రవేత్తలు, అధికారులు పాల్గొన్నారు.ఆయిల్‌పాం సాగు లాభదాయకం సేంద్రియ పంటల వైపు రైతులు దృష్టి సారించాలి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ముగిసిన రాష్ట్రస్థాయి మెగా రైతుమేళా -
నిఘా నీడలో..
అంత్య పుష్కరాలకు భద్రత కట్టుదిట్టంకాళేశ్వరం: తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లోని కాళేశ్వరంలో సరస్వతినది అంత్య పుష్కరాలు నిర్వహించడానికి ప్రభుత్వం సమాయత్తమవుతుంది. గతేడాది మే 15నుంచి 26వరకు 12 రోజుల పాటు సరస్వతీనది ఆది పుష్కరాలు విజయవంతంగా నిర్వహించారు. ఈ నెల 21 నుంచి సరస్వతి నదికి అంత్య పుష్కరాలు నిర్వహించడానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. అవాంఛనీయ ఘటనలు, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పరిరక్షణకు నిఘాను తీవ్రతరం చేయడానికి పుష్కరాల్లో అడుగడుగునా సీసీ కెమెరాల ఏర్పాటుకు పోలీసుశాఖ సన్నద్ధమైంది. పుష్కరాల సందర్భంగా ప్రతీరోజు వీవీఐపీ, రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు, పీఠాధిపతులు రానున్నారు. వారికి భద్రత ఏర్పాట్లు చేపట్టనున్నారు. కాళేశ్వరం మూడు రాష్ట్రాల సరిహద్దులో ఉన్నందున పోలీసులు 12 రోజుల పాటు అవాంఛనీయ ఘటనలు, ఘర్షణలు, చోరీలు జరుగకుండా చర్యలు చేపట్టనున్నారు. ఒకవేళ ఏమైనా ఘటనలు జరిగితే క్షణాల్లో కేసును ఛేదించడానికి సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం మావోయిస్టుల ప్రభావం లేకపోయినప్పటికీ అనుమానితులను పసిగట్టడానికి వినియోగించనున్నారు. ప్రముఖుల రాకకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నా యి. అంత్య పుష్కరాల మొదటి రోజున సీఎం రేవంత్‌రెడ్డి, గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో పాటు కంచి పీఠాధిపతి రానున్నట్లు సమాచారం. దీంతో భారీఎత్తున పోలీసులు కెమెరాల ఏర్పాటుకు రంగం సిద్ధంచేస్తున్నారు. 12 రోజుల పాటు పది మందికిపైగా పీఠాధితులు పుష్కర స్నానాలు ఆచరించనున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు స్నానాలు చేస్తారని అధికారుల ద్వార తెలిసింది. వీరితో పాటు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, సినీ ఇండస్ట్రీ పెద్దలు కూడా స్నానాలు చేసేందుకు రానున్నారని వినికిడి. కాళేశ్వరంతో పాటు చుట్టుపక్కల శివారుల్లో సుమారు 250కుపైగా సీసీ కెమెరాలు పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. కాళేశ్వరం దేవస్థానానికి సంబంధించిన కెమెరాలు 60, ఇప్పటికే పోలీసులు ఏర్పాటు చేసినవి 12, ప్రధాన రహదారిలో 30కిపైగా ఉన్నాయి. దీంతో పాటు మొత్తం 25 లొకేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో లొకేషన్లో మూడు నుంచి నాలుగు వరకు కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం మజీదుపల్లి రోడ్డు, వీఐపీఘాటు, అక్కడే ఉన్న పార్కింగ్ స్థలాలు, ప్రధానఘాటు నుంచి వీఐపీ ఘాటు వరకు ఉన్న రోడ్డు, అక్కడే ఉన్న హెలిపాడ్ వద్ద, ప్రధానఘాటు, శ్రాద్ధ మండపాలు, గోదావరి నుంచి బస్టాండ్ వరకు, ఆలయం చుట్టు పరిసరాలు, మహారాష్ట్ర రోడ్డు అంతర్రాష్ట్ర వంతెన నుంచి కాళేశ్వరం బస్టాండ్ వరకు, అక్కడే ఉన్న పార్కింగ్, హరిత హోటల్ సమీపంలో, సబ్‌స్టేషన్ నుంచి పలుగుల బైపాస్ రోడ్డు వరకు, అక్కడే ఉన్న పార్కింగ్ స్థలం, ఆర్టీసీ బస్టాండ్ ఏర్పాటు స్థలం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో ‘కాళేశ్వరం’ 250పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్‌రూమ్ లక్షలాదిగా తరలిరానున్న భక్తజనంకాళేశ్వరం పోలీసుస్టేషన్లోనే కమాండ్ కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేస్తున్నారు. కాళేశ్వరంలో పుష్కరాల కోసం అమర్చిన సీసీ కెమెరాలను ఎప్పటికప్పుడు వీక్షించడానికి ప్రత్యేకంగా పోలీసు సిబ్బందిని ఠాణాలో ఏర్పాటు చేస్తున్నారు. దీంతో నేరనియంత్రణ చేయడానికి పోలీసులు పకడ్బందీగా ఏర్పాటు చేస్తున్నారు. 12 రోజులపాటు వీక్షిస్తూ భద్రత ఏర్పాట్లు పర్యవేక్షించనున్నారు. నేర నియంత్రణలో భాగంగా 200లకుపైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. అంతర్రాష్ట్ర వంతెన నుంచి సరస్వతిఘాటు (వీఐపీ), ప్రధాన ఆలయం, ఆలయ పరిసరాలు, రహదారుల వెంట లొకేషన్లలో 250 సీసీ కెమెరాలు ఏర్పాటుకు పనులు ప్రారంభించాం. కమాండ్ కంట్రోల్‌రూమ్ కాళేశ్వరంలో ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తాం. సుమారుగా 2వేలకు పైగా పోలీసులు బందోబస్తులో ఉంటారు. వాహనాలకు పార్కింగ్ స్థలాలు 250 ఎకరాల్లో సిద్ధం చేస్తున్నాం. -
గణన పకడ్బందీగా చేపట్టాలి
ములుగు:/ములుగు రూరల్: ఇళ్ల గణన కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ప్రధాన జనగణన అధికారి, సంచాలకులు భారతి హోళికేరి అన్నారు. ఈ మేరకు హైదరాబాద్ నుంచి గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా జిల్లా నుంచి కలెక్టర్ హేమంత్ సహదేవరావు, అదనపు కలెక్టర్ మహేందర్‌జీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 11 నుంచి జూన్ 9వ తేదీ వరకు నిర్వహించే ఇళ్ల గణన ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలన్నారు. అన్ని స్థాయిల్లో ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్ల శిక్షణ పూర్తి చేయాలని ఆదేశించారు. 10వ తేదీలోపు వారికి మెటీరియల్ కిట్లు, గుర్తింపు కార్డులు అందజేయాలని తెలిపారు. అనంతరం కలెక్టర్ హేమంత్ సహదేవరావు మాట్లాడుతూ జిల్లాలో 11వ తేదీ నుంచి ఇళ్ల గణనకు సంబంధించి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. విధులు నిర్వహించే సిబ్బందికి సైతం శిక్షణ పూర్తి అయిందని వివరించారు. స్వీయ గణనకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. వీసీలో రాష్ట్ర ప్రధాన జనగణన అధికారి, సంచాలకులు భారతి హోళికేరి -
నేడు హనుమకొండలో మెగా జాబ్‌మేళా
భూపాలపల్లి అర్బన్: టాస్క్, డీఈఎఫ్టీ సంయుక్తంగా హనుమకొండలో నేడు(శుక్రవారం) మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా యువజన క్రీడలశాఖ అధికారి రఘు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నిరుద్యోగ యువత అధిక సంఖ్యలో పాల్గొనాలని తెలిపారు. జిల్లాలోని ప్రముఖ పరిశ్రమలతో పాటు హైదరాబాద్‌కు చెందిన పలు ఐటీ కంపెనీలు, సేవారంగ సంస్థలు పాల్గొని అభ్యర్థులను ఎంపిక చేసుకోనున్నట్లు తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులకు ఎంపికై న వెంటనే నియామక పత్రాలు అందజేయనున్నట్లు వివరించారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుల పరిశీలన భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి పురపాలక సంఘ కార్యాలయ పరిధిలో ఎస్సీ కార్పొరేషన్ రుణ దరఖాస్తుదారుల పరిశీలన ప్రక్రియ గురువారం పూర్తి చేసినట్లు మున్సిపల్ కమిషనర్ ఉదయ్‌కుమార్ తెలిపారు. సంబంధిత బ్యాంకు అధికారుల ఆధ్వర్యంలో దరఖాస్తుదారుల పత్రాలను పరిశీలించారు. అర్బన్ పరిధిలో మొత్తం 114 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఉదయ్‌కుమార్, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఇందిరా, మెప్మా విభాగపు అధికారి రాజేశ్వరి పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాల సందర్శన చిట్యాల: మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో ఉన్న మొక్క జొన్న, వరి ధాన్యాన్ని డీసీఓ వాల్యూనాయక్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కొనుగోలు నిర్వాహకులు, రైతులతో మాట్లాడారు. రైతులు ఆందోళన చెందవద్దని ప్రతీ గింజను కొనుగోలు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మార్క్‌ఫైడ్ అధికారి శ్రీదేవి, చిట్యాల వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ గుమ్మడి శ్రీదేవి, అసిస్టెంట్ రిజిస్టర్ రాజు, చిట్యాల సీఈఓ మొగిలి, సెంటర్ ఇన్చార్జ్, రైతులు పాల్గొన్నారు. వన్యప్రాణులను రక్షించుకోవాలి మల్హర్(కాటారం): వన్యప్రాణుల రక్షణకు ప్రతీ ఒక్కరు బాధ్యత తీసుకోవాలని కాటారం రేంజ్ అధికారి స్వాతి అన్నారు. గురువారం మండలంలోని బొప్పారం, ప్రతాపగిరి గ్రామాల్లో రేంజర్ స్వాతి, సిబ్బందితో కలిసి వన్యప్రాణుల సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అటవీ ప్రాంతంలో వన్యప్రాణులను వేటాడినా, హాని కలిగించినా, హతమార్చేందుకు ఉచ్చులు బిగించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అడవువుల్లో అగ్ని ప్రమాదాలు జరకుండా చూసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓలు హెచ్.సురేందర్, జె.శ్రీనివాస్, ఎఫ్‌ఎస్‌ఓలు పి.చంద్రశేఖర్, బీట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అనుమానం వస్తే సమాచారం ఇవ్వండి కాళేశ్వరం: లాడ్జిల్లోకి అనుమానాస్పద వ్యక్తులు వచ్చినా, అనుమానం వచ్చిన వారి గురించి పోలీసులకు సమాచారం ఇవ్వాలని లాడ్జ్ నిర్వాహకులను కాటారం డీఎస్పీ సూర్యనారాయణ ఆదేశించారు. గురువారం కాళేశ్వరం పోలీస్‌స్టేషన్ పరిధిలోని లాడ్జ్ యజమానులతో డీఎస్పీ సమావేశం నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేశారు. నిర్వాహకులు కస్టమర్ల పూర్తి వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. ఏ పని నిమిత్తం వచ్చారో కూడా తెలుసుకోవాలని సూచించారు. లాడ్జ్‌లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అవి సక్రమంగా పనిచేసేలా చూసుకోవాలని.. రిజిస్టర్, సీసీ కెమెరా పుటేజీలను అవసరమైనప్పుడు పోలీసులకు అందుబాటులో ఉంచాలని తెలిపారు. నియమాలు పాటించని యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో మహదేవపూర్ సీఐ వెంకటేశ్వర్లు, కాళేశ్వరం ఎస్సై తమాషారెడ్డి పాల్గొన్నారు. -
భూసార పరీక్షలతో మేలు
ములుగు రూరల్: భూసారానికి అనుగుణంగా పంటలను సాగు చేయించి నాణ్యమైన అధిక దిగుబడులు సాధించాలనే లక్ష్యంలో ప్రభుత్వం సాగు భూముల్లో భూసార పరీక్షలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా రెవెన్యూ గ్రామాల వారీగా వలంటీర్లను నియమించారు. ములుగు జిల్లాలోని పది మండలాల్లో వలంటీర్లను ఎంపిక చేసి వ్యవసాయ శాస్త్రవేత్తలతో శిక్షణ ఇవ్వనున్నారు. అనంతరం భూసార పరీక్షల నిమిత్తం పంట పొలాల్లో మట్టి నమూనాలను సేకరించనున్నారు. మట్టి పరీక్షలతో పోషకాల అంచనా భూసార పరీక్షల ఆధారంగా భూముల్లో పోషకాల మోతుదు తెలుస్తుంది. పోషకాలు తక్కువ ఉన్న నేలలను గుర్తించి వ్యవసాయ శాఖ అధికారులు వాటిని పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించేందుకు వీలుగా ఉంటుంది. భూమిలో భాస్వరం, నత్రజని, పొటాషియం, ఐరన్, జింక్, బోరాన్, మెగ్నీషియం శాతాన్ని గుర్తిస్తారు. భూమిలోని పోషకాల ఆధారంగా సాగు చేసేందుకు అనువుగా ఉన్న పంటలను సూచిస్తారు. ఎరువుల వాడకంలో మోతాదు సిఫార్సు చేస్తారు. దీంతో ఎరువుల వినియోగం, అధిక ఖర్చులను తగ్గించుకోవచ్చు. సేద్యపు రంగంలో ఆధునిక పద్ధతులను అనుసరించి పెట్టుబడి ఖర్చు తగ్గించుకొని అధిక దిగుబడులు సాధించే దిశగా వ్యవసాయశాఖ అడుగులు వేస్తోంది. 10 మండలాలు.. 287 రెవెన్యూ గ్రామాలు జిల్లాలోని పది మండలాల్లో మొత్తం 287 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఇందులో ఒక్కో రెవెన్యూ గ్రామానికి ముగ్గురు చొప్పున వలంటీర్లు 861 మందిని ఎంపిక చేశారు. కానీ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రెవెన్యూ గ్రామానికి ఒక వలంటీర్‌కు మాత్రమే శిక్షణ అందించారు. మిగితా వారికి అందించనున్నారు. శిక్షణ ఇచ్చిన ఒక్కో వలంటీర్‌కు వ్యవసాయ క్షేత్రాల ఎంపిక, మట్టి నమూనా సేకరణ విధానం, పరీక్షల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వలంటీర్లకు అవగాహన కల్పించారు. వ్యవసాయ అధికారులతో కలిసి ఇప్పటి వరకు రెవెన్యూ గ్రామానికి 10 శాంపిళ్లను సేకరించారు. ఇప్పటి వరకు వలంటీర్లు మొత్తం 2,862 మట్టి శాంపిళ్లను సేకరించి 2,854 శాంపిళ్లను వరంగల్‌లోని ల్యాబ్‌లకు పంపించారు. జిల్లాలో రైతులు వరి 1,07,700 ఎకరాల్లో సాగు చేయగా పత్తి 28,600 ఎకరాలు, మొక్కజొన్న 11 వేల 32 ఎకరాలు, మిర్చి 25 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. రెవెన్యూ గ్రామాల వారీగా వలంటీర్లు వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో శిక్షణ క్షేత్రస్థాయిలో మట్టి నమూనాల సేకరణభూసార పరీక్షలతో రైతులు సాగు చేస్తున్న పంటలకు పెట్టుబడి ఖర్చులు తగ్గించుకొని భూమికి, పంటకు అవసరమయ్యే ఎరువులను మాత్రమే వాడొచ్చు. భూమి స్వభావాన్ని బట్టి పంటలు సాగు చేసుకోవాలి. మే నెల చివరి వరకు మట్టి నమూనాలను సేకరిస్తాం. పరీక్షల అనంతరం రైతులకు వారి భూమి తత్వాన్ని వివరించి సాగు చేసుకోవాల్సిన పంటలను, వినియోగించే ఎరువులను వివరిస్తాం, దీంతో నత్రజని ఎరువుల విని యోగం తగ్గించడానికి వీలుగా ఉంటుంది. – సురేశ్‌కుమార్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి -
సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు
భూపాలపల్లి అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనలు చేపడుతామని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ అన్నారు. గురువారం ఆయన ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులు, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు వివిధ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రవి పటేల్ మాట్లాడారు. జిల్లా పరిధిలోని మారుమూల గ్రామాల నుంచి పేద ప్రజలు మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి వస్తున్నప్పటికీ, సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఐదు రోజులుగా బాత్రూమ్లకు నీటి సరఫరా లేకపోవడం, తాగునీటి కొరత తీవ్రంగా ఉండడం, డాక్టర్లు సమయానికి రాకపోవడం వంటి అంశాలపై ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారని తెలిపారు. రెండు రోజులలో సమస్యలు పరిష్కరించకపోతే పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మామిడి శ్రీకాంత్, మడే సంతోష్, రంజిత్ పాల్గొన్నారు. -
నిర్మాణ పనులు గడువులోగా పూర్తిచేయాలి
● కలెక్టర్ హేమంత్ సహదేవరావు ములుగు రూరల్: కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను గడువులోగా పూర్తిచేయాలని కలెక్టర్ హేమంత్ సహదేవరావు ఆదేశించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను హేమంత్ సహదేవరావు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జాతీయ జెండా, సమావేశపు గది, స్టేట్ బోర్డు, చాంబర్ లిస్టు టాయిలెట్స్, గార్డెనింగ్ సుందరీకరణ పరిశీలించారు. అనంతరం అధికారులకు, కాంట్రాక్టర్‌కు పలు సూచనలు చేశారు. పనుల్లో వేగం పెంచి సకాలంలో పూర్తయ్యేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్అండ్బీ ఈఈ శ్యామ్సింగ్, ఏఈ తదితరులు పాల్గొన్నారు. -
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి
తడిసిన ధాన్యాన్ని మ్యాశ్చర్ లేకుండా కొనుగోలు చేయాలి. మూడెకరాలకు సంబంధించిన ధాన్యం రాత్రి కురిసిన వానకు తడిసింది. ఇది ఆరాలంటే చాలా సమయం పడుతుంది. అధికారులు మాశ్చర్ లేకుంగా ధాన్యాన్ని కొనుగోలు చేయించే విధంగా చర్యలు తీసుకుంటే రైతులకు ఉపయోగంగా ఉంటుంది. – లలిత రైతు, కమలాపూర్ 60 టన్నుల వరకు తడిసిందని అంచనా అకాల వర్షానికి సుమారుగా 60 టన్నుల ధాన్యం తడిసినట్లుగా ప్రాథమికంగా అంచనా వేశాం. రైతులు అధైర్య పడకుండా తడిసిన ధాన్యాన్ని ఆరబెడిలే కొనుగోలు చేస్తారు. కొనుగోళ్లు కూడా వేగవంతం చేస్తున్నాం. అన్ని చర్యలు చేపడుతున్నాం. – రాములు, జిల్లా మార్కెటింగ్ అధికారి -
కల్లాల కాడ రైతుల ఎదురు చూపులు
కాంగ్రెస్ వాళ్లకే యూరియా.. వ్యవసాయంలో వ్యత్యాసం చూపిస్తూ కాంగ్రెస్ పార్టీ వాళ్లకే ముందుగా యూరియా ఇస్తున్నారు. వాళ్ల పంటనే ముందుగా కొంటున్నారు. వర్షం వచ్చి వడ్లు తడుస్తున్నా.. పట్టించుకునే నాథుడే లేడు. అంతా అవినీతి, అక్రమాలకు నిలయంగా కాంగ్రెస్ పాలన నిలుస్తోంది. – సుబ్బారావు, రైతు, ఖానాపురం, వరంగల్ పండించిన పంటను ఎప్పుడు కొంటారు? పెట్టిన పెట్టుబడి ఎప్పుడు చేతికందుతుందని రైతులు కల్లాల కాడ.. మక్కల అమ్మకానికి నెల రోజులుగా ఎదురుచూస్తున్నారు. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన ఎవుసం ఎప్పుడూ అభివృద్ధి చెందదు. కేసీఆర్ పాలనలో రైతు బంధు ద్వారా ఎకరాకు రూ.5 వేలు ఇవ్వగా, ఇప్పుడు ఒక ఎకరానికి మాత్రమే రూ.6 వేలు వేస్తున్నారు. – ఊకంటి రవి, రైతు, దుగ్గొండిరైతుబంధు పడట్లేదు.. యాక్సిడెంట్లో కాలు కోల్పోయినా కూడా కేటీఆర్‌ను చూసేందుకు, బీఆర్ఎస్పై మక్కువతో ఒక్క కాలితో నేలపై అతి కష్టమ్మీద సదస్సుకు వచ్చా. నాకు మూడెకరాల భూమి ఉంటే రైతు బంధు ఇస్తలేరు. కేసీఆర్ సారే సీఎం కావాలి. ఈసారి ఓటు వృథా చేసుకోం – ఎండీ మక్బూల్, రైతు, కొత్తపేట, హనుమకొండ ● -
తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం
● కల్టెర్ రాహుల్‌శర్మ కాళేశ్వరం/భూపాలపల్లి రూరల్: తడిసిన ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తామని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. బుధవారం మహదేవపూర్ మండలం మహదేవపూర్, సూరారం గ్రామాలలో.. గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లి, భూపాలపల్లి మండలం మోరంచపల్లి గ్రామాల్లో పర్యటించి కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా స్వయంగా పరిశీలించి రైతులతో మాట్లాడారు. రైతులు ఆందోళన చెందొద్దని, తడిసిన ధాన్యాన్ని తక్షణమే కాటారంలోని అన్నపూర్ణ పారా బాయిల్ రైస్ మిల్ తరలించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, పౌర సరఫరాల అధికారి కిరణ్ కుమార్, ఎంపీడీఓ రవీందర్, పీఎసీఎస్ మాజీ చైర్మన్ తిరుపతి పాల్గొన్నారు. -
వర్షార్పణం
జిల్లాలో కొనుగోలు వివరాలు.. కొనుగోలు కేంద్రాలు 185 ఇప్పటివరకు ప్రారంభించినవి 125 కొనుగోలు లక్ష్యం 1.60లక్షల టన్నులు ఇప్పటి వరకు కొన్నది 5,967 టన్నులు వర్షంతో కల్లాల్లో తడిసిన ధాన్యం కుప్పలు కాపాడుకునేందుకు రైతుల ఇబ్బందులు ధాన్యాన్ని ఆరబెడుతున్న అన్నదాతలు ఎండనుంచి ప్రజలకు ఉపశమనం -
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
● కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి: తహసీల్దార్లు, రవాణా శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి ధాన్యం సేకరణలో రైతులకు ఇబ్బందులు కలగకుండా.. లారీలు సమయానికి అందుబాటులో ఉండేలా పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో పలు శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో లారీలు అందుబాటులో ఉండటం లేదని.. అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సహకార, డీఆర్డీఓలు పరిశీలించాల్సి ఉన్నా పర్యవేక్షణ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కొనుగోలుపై ప్రతి రోజు నివేదికలు ఇవ్వాలని డీఎంను ఆదేశించారు. ఈ సమావేశంలో పౌర సరఫరాల అధికారి కిరణ్‌కుమార్, డీఎం రాములు, రవాణా అధికారి సంధాని, సహకార అధికారి వాలియానాయక్, డీఆర్డీఓ బాలకృష్ణ, వ్యవసాయ అధికారి బాబూరావు, ఆర్డీఓ హరికృష్ణ, తహసీల్దార్లు, రైస్ మిల్లర్లు, ట్రాస్పోర్ట్ కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. భూ భారతి దరఖాస్తులను పరిష్కరించాలి పెండింగ్‌లో ఉన్న భూ భారతి దరఖాస్తులను పరిష్కరించాలని కలెక్టర్ రాహుల్ శర్మ తహసీల్దార్లను ఆదేశించారు. భూ భారతిలో అందిన ప్రతీ దరఖాస్తును సమగ్రంగా పరిశీలించి, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని సూచించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ బాలకృష్ణ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ ఏడీ కుసుమ కుమారి, తహసీల్దార్లు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయాలి పెండింగ్ ఉన్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగం పెంచేలా అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ ఉదయ్‌కుమార్, హౌసింగ్ ఏఈ శ్రీకాంత్, ఎంపీడీఓలు, హాసింగ్ ఏఈలు తదితరులు పాల్గొన్నారు. -
ఓరుగల్లునుంచే రైతుపోరు
సాక్షిప్రతినిధి, వరంగల్/కాజీపేట అర్బన్: ‘రైతుకు ఓపిక నశిస్తే భూకంపం పుడుతుందని పాలకులు గ్రహించాలి. భూమిని దున్నడం తెలిసిన రైతు నాగలి తిరగేసి కాంగ్రెస్‌ను బొంద పెడతారు.. వరంగల్ వేదికగా ఏ ఉద్యమం మొదలుపెట్టినా విజయవంతమవుతుంది. ఇప్పుడు జరిగిన ఈ రైతు సంగ్రామ సదస్సు ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతు పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం’ అని కేటీఆర్ స్పష్టం చేశారు. వరంగల్ హంటర్ రోడ్డులో బుధవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు సంగ్రామ సదస్సు నిర్వహించారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతుల మృతికి సంతాపంగా తొలుత ఒక నిమిషం మౌనం పాటించి, నివాళులర్పించి సదస్సును ప్రారంభించారు. జై కేసీఆర్ నినాదాలతో సదస్సు ప్రాంగణం మార్మోగింది. ‘కేసీఆర్ సారు మళ్లీ రావాలి. రైతు బంధు రాజ్యం రావాలి. రాబందుల పాల న పోవాలి’ అంటూ ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు నినదించారు. కాగా, కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ వైఫల్యాలు, ప్రభుత్వ తీరును కేటీఆర్ తన ప్రసంగంలో ఎండగట్టారు. రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డిపై ఘాటైన విమర్శలు చేశారు. సదస్సుకు హాజరైన పలువురు రైతులు, రైతు ప్రతినిధులు కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై తమ అభిప్రాయాల్లో అసంతృప్తిని వ్యక్తం చేశారు. సదస్సులో పలు తీర్మానాలు ప్రవేశపెట్టి హర్షధ్వానాల మధ్య ఆమోదించారు. రైతు సంగ్రామ సదస్సు బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపింది. సదస్సులో గాయకులు మధుప్రియ, మిట్టపల్లి సురేందర్, రసమయి బాలకిషన్ పాటలతో హోరెత్తించారు. ప్రత్యేక ఆకర్షణగా ఎడ్లబండి.. రైతు సంగ్రామ సదస్సు ప్రాంగణం ఎదుట ఏర్పాటు చేసిన కంకులతో రూపొందించిన పసుపు చీరను కట్టుకున్నట్లుగా ఎడ్లబండి, నాగలి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పలువురు ఎడ్ల బండి, నాగలి వద్ద సెల్ఫీలు దిగారు. వేసవి తాపానికి అంబలి.. దాహానికి మజ్జిగ, మంచినీళ్లు సదస్సుకు వచ్చిన రైతులకు వేసవి తాపాన్ని తగ్గించేందుకు మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు, బాటిళ్లను ఏర్పాటు చేశారు. సుమారు 10 వేల మంది రైతులకు తెలంగాణ వంటకాలను ఏర్పాటు చేశారు. సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అంబలి స్టాల్‌ను ఏర్పాటు చేసి దాహార్తి తీర్చారు.కాంగ్రెస్ ప్రభుత్వంపై మరింత ఉధృతం చేస్తామన్న కేటీఆర్ జై కేసీఆర్.. సారు మళ్లీ రావాలి నినాదాలతో మార్మోగిన రైతు సంగ్రామ సదస్సు పాటలతో హోరెత్తించిన మధుప్రియ, మిట్టపల్లి సురేందర్, రసమయి అభిప్రాయాలు, కష్టాలు పంచుకున్న రైతులు.. పలు రైతు తీర్మానాలకు ఆమోదం కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టిన నేతలు.. బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ -
సీఎంను గద్దె దించేందుకు పోరాటానికి సిద్ధం
రేవంత్‌రెడ్డిని గద్దె దించేందుకు పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. రైతులను గోస పెడుతూ 40 ఏళ్ల నాటి కాంగ్రెస్ పాలనను తిరిగి గుర్తు చేస్తున్నారు. కేసీఆర్ పాలనలో కల్లాల దగ్గరే పంట కొనుగోలు చేయగా, నేటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కల్లాల దగ్గర, కాంటాల దగ్గర ఎంత ఇస్తావంటూ అవినీతి రాజ్యమేలుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలకు నా చాలెంజ్.. రైతు మేళాను రైతుల మార్కెట్లో పెట్టండి.. ఉరికిచ్చి కొడతారు. – ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ మంత్రి కేసీఆర్ పాలన రైతులకు స్వర్ణయుగం పదేళ్ల కేసీఆర్ పాలన రైతులకు స్వర్ణయుగంలా ఉండగా, నేటి కాంగ్రెస్ పాలన రైతుల పాలిట రాబందుల పాలనగా మారింది. రైతులను గోస పెట్టుకుంటున్న రేవంత్ పాలన పోయి అన్నం పండించే రైతు మూడు పూటలా కడుపు నిండా భోజనం చేసే బీఆర్ఎస్ పాలన రావాలి. పడించిన పంటలో పావలా వంతు కూడా కొనకుండా రైతులను అరిగోస పెట్టుకుంటున్న ప్రభుత్వం చెర నుంచి రైతులకు విముక్తి రావాలి. – సత్యవతి రాథోడ్, మాజీ మంత్రి తెలంగాణ ఊపిరి మా సదస్సు పోరాటాలకు పుట్టినిల్లు వరంగల్‌లో బీఆర్ఎస్ రైతు సంగ్రామ సదస్సు పెట్టడానికి అనుమతి ఇవ్వలేదు. ఇక్కడి ఎమ్మెల్యే.. మీది ఏం సదస్సు, ఏం సభ అంటూ వెటకారంగా మాట్లాడారు. మాది తెలంగాణ ఊపిరి సదస్సు. రైతును రాజు చేయాలని, రైతు పక్షపాతి కేసీఆర్.. రైతుబంధు, రైతు భరోసా చరిత్రాత్మక నిర్ణయం తీసుకుని పథకాలు తీసుకొచ్చా రు. కానీ, కాంగ్రెస్ సర్కారు వాటిని తుంగలో తొక్కింది. – పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే, జనగామ -
హేమాచలక్షేత్రంలో ముగిసిన బ్రహ్మోత్సవాలు
● ఆనందోత్సాహాల నడుమ వసంతోత్సవం ● గజవాహనంపై లక్ష్మీనర్సింహస్వామి, అమ్మవార్ల ఊరేగింపుమంగపేట: మల్లూరు శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానంలో గతనెల 27న అంకురార్పణతో ప్రారంభమైన స్వామివారి బ్రహ్మోత్సవాలు(జాతర) బుధవారం వసంతోత్సవంతో ముగిశాయి. ఆలయ ఇన్చార్జ్ కార్యనిర్వహణ అధికారి ఎం.వీరస్వామి చీఫ్ ఫెస్టివల్ అధికారి శ్రావణం సత్యనారాయణ పర్యవేక్షణలో భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి దేవస్థాన ఆలయ ఉపప్రధానార్చకులు అమరవాది మురళీకృష్ణమాచార్యుల బృందం పది రోజుల పాటు బ్రహ్మోత్సవాల కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు కార్యక్రమంలో భాగంగా ఆలయంలోని స్వయంభు స్వామివారికి, యాగశాలలో ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నవదంపతులు లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను పట్టు వస్త్రాలతో అలంకరించారు. గజవాహనంపై ఆలయ ప్రాంగణంలోని కల్యాణ మండపం నుంచి దైత అమ్మవారు(వనదేవత) ప్రాంగణం వరకు మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా వసంతోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యాగ్నికులు, ఆలయ పూజారులు, సిబ్బంది ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ వసంతోత్సవ కార్యక్రమాన్ని ఆనందోత్సాహాల నడుమ జరుపుకున్నారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ సురేశ్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. -
ఫైరింగ్ ప్రాక్టీస్ నిర్వహణ
భూపాలపల్లి అర్బన్: జిల్లా పోలీసుల వార్షిక మొబిలైజేషన్ శిక్షణలో భాగంగా వరంగల్ జిల్లా అమ్మవారిపేట ఫైరింగ్ రేంజ్లో బుధవారం ఫైరింగ్ ప్రాక్టీస్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ హాజరై.. అధికారుల ఫైరింగ్‌ను పరిశీలించి సూచనలు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో సమర్థవంతంగా స్పందించేందుకు ఆయుధాలపై పూర్తి ప్రావీణ్యం అవసరమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. నేడు సమీక్ష కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో ఈనెల 21 నుంచి జూన్ 1 వరకు జరుగు సరస్వతీనది అంత్యపుష్కరాల పనుల పురోగతిపైన గురువారం ఉదయం ఈఓ కార్యాలయంలో 10.30 గంటలకు అన్నీ శాఖల అధికారులతో దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజారామయ్యర్ సమీక్ష నిర్వహించనున్నట్లు ఈఓ మహేష్ బుధవారం తెలిపారు. అధికారులు సకాలంలో హాజరు కావాలని ఆయన కోరారు. కోఆప్షన్ మెంబర్లకు అభినందన భూపాలపల్లి రూరల్: మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్లను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు బుధవారం మున్సిపల్ కార్యాలయంలో అభినందించి సన్మానించారు. కో ఆప్షన్ మెంబర్లుగా సజ్జనపు స్వామి, చల్లా రేణుక, ఎండీ అబ్దుల్ హఫీజ్, ఎండీ మిన్హాజ్ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులుపాల్గొన్నారు. 13నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు భూపాలపల్లి అర్బన్: ఈ నెల 13వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా ఇంటర్ విద్య నోడల్ అధికారి వెంకన్న బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 19వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 9గంటల నుంచి మఽధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సంవత్సరం విద్యార్థులకు, మధ్యాహ్నం 2గంటల నుంచి 5గంటల వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలి భూపాలపల్లి అర్బన్: పేద, మధ్యతరగతి ప్రజలపై కేంద్ర ప్రభుత్వం పెంచిన ఇంధన ధరలు తీవ్రమైన భారంగా మారాయని, వెంటనే తగ్గించాలని సీపీఐ పట్టణ కార్యదర్శి సొత్కు ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్లో సీపీఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా నాయకులు వేముల శ్రీకాంత్, నేరెళ్ల జోసెఫ్, బూడిద తిరుపతి, ఎండియాకు పాషా, గోలి లావణ్య, పల్లెల రజిత, పొనగంటి లావణ్య, గడ్డం స్వరూప, గంప రాజు పాల్గొన్నారు. రావి ఆకుపై హీరో విజయ్ చిత్రం ఏటూరునాగారం: తమిళనాడు హీరో విజయ్ సీఎంగా ఎన్నిక కాబోతున్న శుభ సందర్భంగా రావి ఆకుపై విజయ్ బొమ్మను మండల కేంద్రానికి చెందిన డ్రాయింగ్ మాస్టర్ రమేశ్ గీశారు. మండల పరిధిలోని చిన్నబోయినపల్లి ఆశ్రమ పాఠశాల డ్రాయింగ్ టీచర్ రమేశ్ వినూత్నంగా ఆలోచించారు. రావి ఆకుపై కాబోయే తమిళనాడు సీఎం విజయ్ చిత్రాన్ని అద్భుతంగా గీసి ప్రదర్శించారు. ఆయన ప్రతిభను స్థానికులు అభినందించారు. -
తడిసిన ధాన్యం
కాళేఽశ్వరం: మహదేవపూర్ మండలంలో మంగళవారం అర్ధరాత్రి అకాల వర్షం కురిసింది. దీంతో మహదేవపూర్, సూరారం, ఎలికేశ్వరం, బొమ్మాపూర్లోని వరిధాన్యం కొసుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసింది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం శ్రమించిన కష్టం వరద నీ టి పాలైందని విలపిస్తున్నారు. మహదేవపూర్ డిగ్రీ కాలేజీ గ్రౌండులో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో వర్షపు నీరు చేరింది. దీంతో రైతులు ధాన్యాన్ని కాపాడుకోవడానికి నానాతంటాలు పడ్డారు. సుమారుగా 1000 బస్తాలు తడిశాయి. వరద నీటితో అప్పుల పాలు యాసంగిలో అకాల వర్షం కురిసి అప్పుడు పంట నష్టపోయా. ఇప్పుడు మూడెకరాలు కౌలుకు తీసుకుని రూ.లక్ష వరకు అప్పు తెచ్చి పెట్టుబడులు పెట్టిన. మంగళవారం రాత్రి వర్షం దంచి కొట్టింది. కొనుగోలు కేంద్రంలో ఆరబెట్టిన ధాన్యం తడిసింది. అప్పులు ఎలా తీర్చాలి. ప్రభుత్వం ఆదుకోవాలి. – గోస్కుల బొందయ్య, మహదేవపూర్, కౌలు రైతు -
ఉద్యాన పంటలపై దృష్టి పెట్టాలి
చిట్యాల: రైతులు ఉద్యాన పంటల సాగు, ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణం పెంపు, ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సూచించారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా జూకల్ గ్రామంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి రైతు సదస్సును మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడుతూ రైతును రాజు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పంట మార్పిడి పద్ధతులను అవలంబించి ఉద్యావన పంటలపై రైతులు దృష్టి పెట్టాలన్నారు. కార్యక్రమంలో ఉద్యాన శాఖ జిల్లా అధికారి సునీల్ కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జాడి బాబురావు, డీసీఓ వాల్యూ నాయక్, భూపాలపల్లి ఏడీఏ రమేష్, ఏడు మండలాలకు చెందిన వ్యవసాయ శాఖ అధికారులు, ఏఈఓలు, హెచ్‌ఈఓలు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి, తహసీల్దార్ వసంతరావు, ఎంపీడీ ఓ జయశ్రీ, సర్పంచ్‌లు, నాయకులు పాల్గొన్నారు.కాటారం ఆర్డీఓగా రవీందర్ మల్హర్ (కాటారం): కాటారం రెవెన్యూ డివిజనల్ అధికారిగా (ఆర్డీఓ) రవీందర్‌ను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ పనిచేసిన సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ హైదరాబాద్‌కు ఇటీవల బదిలీ అయిన విషయం తెలిసిందే. కాగా, ఆయన స్థానంలో కాటారం ఆర్డీఓగా రవీందర్ వచ్చారు. ఆయిల్‌పామ్ సాగుతో అధిక లాభాలుములుగు: ఆయిల్‌పామ్ పంటసాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని ములుగు అదనపు కలెక్టర్ సంపత్‌రావు పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఉద్యానవన శాఖ అధికారి సంజీవరావు అధ్యక్షతన ములుగు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పంటలసాగుపై మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడుతూ ఉద్యానవన, ప్రత్యామ్నాయ పంటలపై రైతులు ఆసక్తి చూపాలని పిలుపునిచ్చారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయడం ద్వారా రైతులకు మెరుగైన ఆదాయం లభిస్తుందని తెలిపారు. ఆయిల్‌పామ్ సాగులో అంతర్గత పంటలను కూడా పండించవచ్చని తెలిపారు. దీంతో రైతులకు రెండు పంటల ద్వారా ఆదాయం లభించే అవకాశం ఉంటుందని వెల్లడించారు. ఒకసారి ఆయిల్‌పామ్ సాగుబడి చేస్తే 30 సంవత్సరాల వరకు నిరంతర పంట దిగుబడితో ఆదాయం వస్తుందని స్పష్టంచేశారు. అనంతరం ఉద్యానశాఖ అధికారి సంజీవరావు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 1,069 మంది రైతులు 3,562.40 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారని తెలిపారు. ఒక ఎకరాకు ప్రభుత్వం రూ.50 వేల వరకు సబ్సిడీ అందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ములుగు మున్సిపాలిటీ చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, ప్రాంతీయ డిప్యూటీ డైరెక్టర్ పద్మావతి, ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్ రెడ్డి, కిసాన్ సెల్ అధ్యక్షుడు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్, జిల్లా మత్స్యశాఖ అధికారి సాల్మన్ రాజు, డీసీఓ రామ్మోహన్, కేఎన్ బయోసైన్స్ కంపెనీ ఎండి సుధారెడ్డి పాల్గొన్నారు. వైభవంగా హేమాచలుడి నాగవెల్లి మంగపేట: మల్లూరులోని శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి దేవతామూర్తులకు నాగవెల్లి కార్యక్రమాన్ని బ్రహ్మోత్సవాల యాగ్నికులు మంగళవారం రాత్రి నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయంలో కొనసాగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ ఇన్చార్జ్ కార్యనిర్వాహణ అధికారి ఎం. వీరస్వామి, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ శ్రావణం సత్యనారాయణ పర్యవేక్షించారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఉప ప్రధానార్చకులు అమరవాది మురళీకష్ణమాచార్యుల బృందం, ఆలయ అర్చకులు ఉదయం స్వామివారికి నిత్యపూజ, సేవాకాలం, బాలభోగం నిత్యహోమం, చతుస్థానార్చన, ఉత్సవ మూర్తులకు నవకలశ అభిషేక పూజలు, మమానివేదన కార్యక్రమాలను నిర్వహించారు. -
ఆలకించండి!
జయశంకర్ భూపాలపల్లిబుధవారం శ్రీ 6 శ్రీ మే శ్రీ 2026పిల్లలకు పాఠశాలలు ముగిశాయి. వేసవి సెలవులంటే పిల్లలకు ఎంతో ఇష్టం. అమ్మమ్మ, నానమ్మ ఇంటికి వెళ్లడం, వారు చెప్పే నీతి కథలు, ఆటవిడుపుగా బొమ్మలు గీయడం, స్నేహితులతో ఈత నేర్చుకోవడం, ఆటపాటల్లో మునిగితేలుతుంటారు. ఇలాంటి అనుభవాలకు వేదికగా సాక్షి నిలుస్తోంది. సెలవుల్లో పిల్లల సందడిపై నేటినుంచి వేస‘వి’కాసం అందిస్తోంది.మంత్రివర్యా మీరైనాభూపాలపల్లి అర్బన్: ప్రాథమిక విద్య, ప్రాథమిక పాఠశాలల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పూర్వ ప్రాథమిక (ప్రీ ప్రైమరీ) తరగతులు ప్రారంభించేందుకు 2025 –26వ విద్యాసంవత్సరానికి గతేడాది జూలైలో ప్రీ ప్రైమరీ టీచర్ల నియామకానికి ఆదేశాలు ఇస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. ఇప్పటివరకూ జిల్లాలో ప్రభుత్వ ఆదేశాలు అమలు కాలేదు. అందుకు సంబంధించిన టీచర్లు, ఆయాలను నియమించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. విద్యా సంవత్సరం ముగిసినప్పటికీ వచ్చే విద్యా సంవత్సరంలోనైనా నియామకాలు చేపట్టి ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభిస్తారని పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు దృష్టి సారించాలని కోరుతున్నారు. గతేడాది జిల్లాలో 55 పాఠశాలల ఎంపిక జిల్లాలోని 12 మండలాల పరిధిలో 55 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను ఎంపిక చేసి ఆ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించాలని నిర్ణయించారు. చిన్నారులకు చదువు చెప్పేందుకు ఒక్కో పాఠశాలకు ఒక్కో టీచర్‌తో పాటు పిల్లల కనీస అవసరాలు తీర్చేందుకు ఆయాను నియమించాలని ప్రభుత్వం పేర్కొంది. మొత్తం 55 మంది టీచర్లు, 55 మంది ఆయాలను నియమించాలని ఉన్నతాధికారులు భావించారు. జిల్లాలో 55 పాఠశాలల్లో 2025 – 26వ విద్యా సంవత్సరానికి టీచర్లు, ఆయాలను తాత్కాలిక పద్ధతిలో నియమించేందుకు గతేడాది ఆగస్టు 22వ తేదీన దరఖాస్తుల స్వీకరణకు జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి నోటిఫికేషన్ జారీచేశారు. 28వ తేదీలోపు దరఖాస్తులను స్వీకరించారు. ఈసారి విద్యార్థుల ప్రవేశాలపై ప్రభావం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో చిన్నారుల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వ ఆదేశాలు జిల్లాలో గత విద్యా సంవత్సరంలో అమలుకాకపోవడంతో ఈవిద్యా సంవత్సరం విద్యార్థుల ప్రవేశాలపై ప్రభావం పడే అవకాశాలున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ లేకపోవడంతో నేరుగా అంగన్వాడీల నుంచి ప్రైవేట్ పాఠశాలలకు తమ పిల్లలను తల్లిదండ్రులు పంపిస్తున్నారు. గత విద్యాసంవత్సరంలో ప్రీ ప్రైమరీ ప్రారంభిస్తారని విద్యార్థుల ప్రవేశాలు చేపట్టి ప్రీప్రైమరీ ప్రారంభించకపోవడంతో నూతన అడ్మిషన్ల పెంపుపై ఈసారి ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉంది. ఇప్పటికై నా వేసవి సెలవులకు ముందే నియామకాల ప్రక్రియను ప్రారంభిస్తే ప్రతీ పాఠశాలలో కనీసం 10 నుంచి 20 మంది వరకు చిన్నారులు చేరే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు. రాజకీయ జోక్యం ప్రీప్రైమరీ టీచర్లు, ఆయాల ఎంపికకు విద్యార్హత, స్థానికత, వయస్సు సంబంధిత అర్హతలుగా నిర్ధారించారు. కాగా, ఆయా పాఠశాలల్లో తాము సిఫార్సు చేసిన వ్యక్తులను మాత్రమే నియమించాలని అధికార పార్టీకి చెందిన నాయకులు.. విద్యాశాఖ అధికారులకు సూచించినట్లు తెలిసింది. తమ వారికి, పార్టీకి చెందిన వారికే అవకాశాలు కల్పించాలని తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చినట్లు సమాచారం. దాంతో ఎంపిక ప్రక్రియపై ప్రభావం పడినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకుని నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రజలు కోరుతున్నారు. ప్రీ ప్రైమరీ టీచర్ల నియామకాలకు గతేడాది నోటిఫికేషన్ విడుదల జిల్లాలో నేటికీ చేపట్టని ఎంపిక ప్రక్రియ కలెక్టర్ వద్ద పెండింగ్‌లో ఫైల్? మరో నెలరోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభంఎవరిదీ నిర్లక్ష్యం? రాష్ట్రంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మినహా ఇతర జిల్లాల్లో గతేడాది నుంచే ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించారు. ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన వెంటనే పలు జిల్లాల్లో విద్యాశాఖ అధికారులు.. టీచర్లు, ఆయాల నియామకాల ప్రక్రియను చేట్టారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మాత్రం ఇప్పటివరకు పూర్తి చేయలేదు. విద్యాశాఖ అధికారులు తయారు చేసిన టీచర్లు, ఆయాల ఎంపిక జాబితా పారదర్శకంగా లేకపోవడంతో దాన్ని సవరించాలని ఆదేశించినట్లు తెలిసింది. రెండో జాబితాను తయారు చేసి కలెక్టర్ వద్దకు మళ్లీ పంపించినట్లు సమాచారం. జిల్లాలో నియామకాల జాబితా తయారీలో నిర్లక్ష్యంతో ప్రక్రియ ఆలస్యమవుతోందని పలువురు చర్చించుకుంటున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సైతం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. -
15లోపు పుష్కరాల పనులు పూర్తి చేయాలి
● కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి: ఈనెల 15వ తేదీలోపు సరస్వతి అంత్య పుష్కరాల పనులను పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. ఐడీఓసీ కార్యాలయంలో ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌తో కలిసి సరస్వతి అంత్య పుష్కరాల పనుల పురోగతిపై రెవెన్యూ, పోలీస్, అటవీ, రవాణా, వైద్య, ఇరిగేషన్, అగ్నిమాపక, విద్యుత్, మత్స్య, ఆర్టీసీ, మిషన్ భగీరథ, దేవాదాయ, పీఆర్, కేఎంకే, తదితర శాఖల అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శాఖల వారీగా చేపట్టిన పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ భక్తులకు చలువ పందిళ్లు, బట్టలు మార్చుకునే గదులు, దివ్యాంగుల కోసం బ్యాటరీ ఆపరేటెడ్ వాహనాలు ఏర్పాటు చేయాలన్నారు. హెలిప్యాడ్ నుంచి సరస్వతి ఘాట్ వరకు బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. పోలీస్, ఆర్అండ్బీ అధికారులు సంయుక్తంగా రహదారులను పరిశీలించి మరమ్మతులు చేపట్టాలన్నారు. తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని, సురక్షిత మంచినీరు సరఫరా చేయాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. వ్యర్థాల తరలింపునకు ట్రాక్టర్లు, బ్లీచింగ్ అందుబాటులో ఉంచాలని డీపీఓకు సూచించారు. బస్టాండ్ వద్ద విద్యుత్ సరఫరా, ప్రయాణికుల కోసం షెడ్లు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులకు చెప్పారు. హారతి, తెప్పోత్సవం కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని దేవాదాయ అధికారులను ఆదేశించారు. రెస్క్యూ టీములు, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో అటవీశాఖ అధికారి నవీన్ రెడ్డి, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, రవాణా శాఖ అధికారి సంథాని, డీఎంహెచ్ఓ డాక్టర్ మధుసూదన్, ఇరిగేషన్ ఈఈ తిరుపతి రావు, అగ్నిమాపక అధికారి సతీష్ కుమార్, డీపీఓ శ్రీలత, ఆర్టీసీ డీఎం ఇందు, ఆర్అండ్బీ ఈఈ రమేష్, మిషన్ భగీరథ ఈఈ శ్వేత, పీఆర్ ఈఈ వెంకటేశ్వర్లు, మత్స్యశాఖ అధికారి విజయ్ కుమార్, కాళేశ్వరం దేవస్థానం ఈఓ మహేష్, తదితరులు పాల్గొన్నారు.ఎండల తీవ్రత దృష్ట్యా ఆరోగ్యం జాగ్రత్త రోజురోజుకు పెరుగుతున్న ఎండల తీవ్రత దృష్ట్యా ఆరోగ్యపై జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. వేసవి కాలంలో వడదెబ్బ సోకే ప్రమాదముందని, ఈ క్రమంలో ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. ప్రత్యేకించి చిన్నారులు, వృద్ధులు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, గుండె సంబంధిత వ్యాధులున్న వారు, కూలీలు జాగ్రత్తలు పాటించాలన్నారు. -
హెవీ డ్రైవింగ్ ధ్రువపత్రాల అందజేత
భూపాలపల్లి అర్బన్: హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ పూర్తిచేసిన మహిళా ఉద్యోగులకు జీఎం కార్యాలయంలో భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి మంగళవారం ధ్రువపత్రాలను అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని టైడ్స్ సంస్థలో నిర్వహించిన 30రోజుల శిక్షణలో కంపెనీ వ్యాప్తంగా ఎంపికై న 13 మంది పాల్గొనగా, భూపాలపల్లి ఏరియా నుంచి రేణుక, రమ్యశ్రీ, భార్గవి, అనూష హాజరై విజయవంతంగా శిక్షణను పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జీఎం రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ మహిళలు సాంకేతిక రంగాల్లో రాణించడానికి ఇలాంటి శిక్షణలు దోహదపడతాయని తెలిపారు. శిక్షణ పొందిన వారికి భవిష్యత్‌లో డంపర్, మోటార్ ఆపరేటర్ వంటి ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కార్మిక సంఘ ప్రతినిధులు కవీంద్ర, రవీందర్, శ్యామ్‌సుందర్, మధుకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
ఓరుగల్లు వేదికగా రైతుపోరు!
సాక్షిప్రతినిధి, వరంగల్: రైతు సంగ్రామ సదస్సు కోసం ఓరుగల్లు ముస్తాబైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా బుధవారం హాజరవుతున్న ఈ సభ కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. సదస్సు ఏర్పాట్లను కేటీఆర్ డైరెక్షన్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, తదితర ముఖ్య నేతలు, సీనియర్లతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి సుమారు 10 వేల మంది రైతులు హాజరవుతారని అంచనా వేసిన నేతలు.. ఆ మేరకు సదస్సులో ఏర్పాట్లు చేశారు. వరంగల్ నుంచే రైతుపోరుకు శ్రీకారం చుట్టిన బీఆర్ఎస్.. ఈ సదస్సును ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసింది. విస్తృత ఏర్పాట్లు... రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వ చేసిన మోసాలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించనున్న సదస్సుకు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. గత నెల 26న హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు రైతు సంగ్రామ సదస్సుకు చకచకా ఏర్పాట్లు చేశారు. హనుమకొండ హంటర్ రోడ్డులోని సీఎస్ఆర్ గార్డెన్‌కు ఎదురుగా ఉన్న సుమారు ఐదెకరాల స్థలంలో సదస్సు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి సుమారు 10వేల మంది రైతు ప్రతినిధులు సదస్సుకు హాజరు కానున్న నేపథ్యంలో ఎండ వేడిని తట్టుకునేలా జర్మనీ టెంట్లు వేశారు. ఆ పక్కనే హాజరయ్యే రైతుల కోసం భోజనం ఏర్పాటు చేశారు. కాగా, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా సదస్సుకు హాజరయ్యే రైతుల వాహనాల పార్కింగ్ కోసం కూడా ప్రత్యేక ప్రాంతాలను సూచించారు. కొలంబో మెడికల్ కాలేజ్ గ్రౌండ్ ఎదురుగా ఉన్న ప్రైవేట్ స్థలంలో పాలకుర్తి, ములుగు, మహబూబాబాద్, నర్సంపేట, డోర్నకల్, వర్ధన్నపేట నియోజకవర్గాలకు చెందిన వాహనాలు, తేజస్వీ స్కూల్ గ్రౌండ్‌తో పాటు, భారత్ పెట్రోల్ బంక్‌కు ఎదురుగా ఉన్న స్థలంలో స్టేషన్‌ఘన్‌పుర్, పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాల వాహనాలు, పాపడమ్స్ ఎదురుగా ఉన్న పద్మాలయ ఫంక్షన్ హాల్లో జనగామ నియోజకవర్గంతో పాటు జనరల్ వాహనాల కోసం పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలు, గులాబీ తోరణాలు బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతు సంగ్రామ సదస్సు సందర్భంగా వరంగల్ నగరంలోని ప్రధాన రహదారులన్నీ గులాబీమయమయ్యాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ముఖ్య నేతల రాక సందర్భంగా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, బ్యానర్లు, గులాబీ తోరణాలు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా, బీఆర్ఎస్ నేతలు మంగళవారం ప్రెస్మీట్లో వెల్లడించిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం 9 గంటల వరకే రైతులు సదస్సుకు హాజరయ్యేలా కార్యాచరణ సిద్ధం చేశారు. సదస్సు ప్రారంభంలో మొదట రైతు ప్రతినిధుల నుంచి ప్రభుత్వం వైఖరి, పరిపాలన విధానాలపై అభిప్రాయ సేకరణ చేయనున్నారు. ఈసందర్భంగా పలువురు రైతు ప్రతినిధులను సదస్సులో మాట్లాడించనున్నారు. ఆతర్వాత మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు కూడా తమ ప్రసంగం ద్వారా అభిప్రాయాలు వెల్లడించనున్నారు. అనంతరం రైతు సదస్సు ద్వారా ప్రస్తుత ప్రభుత్వ విధానాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజలకు వివరించనున్నారు.నేడు బీఆర్ఎస్ రైతు సంగ్రామ సదస్సు హంటర్‌రోడ్డులో 10వేల మందికి ఏర్పాట్లు ఉదయం 9 గంటలకే వచ్చేలా సమీకరణ మొదట ప్రభుత్వ వైఖరిపై రైతుల అభిప్రాయాలు అనంతరం బీఆర్ఎస్ నేత కేటీఆర్ ప్రసంగం ప్రతీ పల్లె నుంచి హాజరుకానున్న రైతు ప్రతినిధులు గులాబీమయమైన వరంగల్ నగరం కాంగ్రెస్ మోసాలను ప్రజలకు వివరించేందుకే రైతు సదస్సు విలేకరులతో బీఆర్ఎస్ నేతలు -
మాది రైతు పక్షపాతి ప్రభుత్వం
హన్మకొండ: రైతును రాజును చేయడమే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ లక్ష్యమని, మాది రైతుపక్షపాతి సర్కార్ అని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో మూడు రోజులపాటు జరిగే రాష్ట్రస్థాయి మెగా రైతుమేళాను బుధవారం మంత్రులు కొండా సురేఖ, ధనసరి సీతక్క, ఎంపీ కావ్య, ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి పొంగులేటి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ప్రగతి ప్రణాళికలో భాగంగా 99రోజులు అధికారులను ప్రజల ముంగిటికి పంపిస్తున్నామన్నారు. ఈ క్రమంలోనే రైతు ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. 2022లో అద్భుతమైన రైతు డిక్లరేషన్ సభ నిర్వహించి ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత వెరవేరుస్తామని చెప్పి, సీఎం రేవంత్ నాయకత్వంలో రైతు పక్షపాతి ప్రభుత్వం ఏర్పాటు కాగానే అమలు చేస్తున్నామన్నారు. మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రిగా, రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదటిసారి రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమని గుర్తు చేశారు. రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతీ గింజను ప్రభుత్వం కొంటుందన్నారు. బీఆర్ఎస్ నాయకులు అధికారం పోయిందని కడుపునిండా విషం నింపుకుని మాట్లాడుతున్నారన్నారు. కల్లాల వద్దకు వెళ్లి సినిమాలో ఫోజులు ఇచ్చినట్లు ఇచ్చి పత్రికల్లో ఫొటోలు వేయించుకుంటున్నారన్నారు. ఎన్ని మీటింగ్‌లు పెట్టుకున్నా, నాలుగు సార్లు ముక్కు నేలకు రాసినా రైతులు పట్టించుకోరన్నారు. ఓర్వలేక బీఆర్ఎస్, బీజేపీ విమర్శలు.. రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి అన్ని వర్గాలకు న్యాయం చేస్తుంటే బీఆర్ఎస్, బీజేపీ ఓర్వలేక విమర్శలు చేస్తున్నాయని అన్నారు. ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్‌ను గెలిపించాలని, సీఎం రేవంత్‌కు అండగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ హామీలు నెరవేర్చకుండా ఇప్పుడు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా బీఆర్ఎస్ నాయకులు కళ్లుండి చూడలేని, చెవులు ఉండి వినలేని దద్దమ్మలని అన్నారు. ధాన్యం కొనుగోళ్లకు ఇబ్బంది పెడుతున్న కేంద్రం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు పండించిన ప్రతీ గింజను కొనుగోలు చేయాలని చూస్తుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొర్రీలు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. గత ప్రభుత్వం తడిసిన ధాన్యం కొనలేదని, తాము అన్నీ కొంటున్నామన్నారు. ఈ సందర్భంగా భూసార పరీక్షలు నిర్వహించుకున్న ఐదుగురు రైతులకు మంత్రుల చేతులమీదుగా పత్రాలు అందజేశారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కేఆర్.నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, ఉద్యాన శాఖ డైరెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు చాహత్ బాజ్‌పాయ్, డాక్టర్ సత్యశారద పాల్గొన్నారు. రైతును రాజును చేయడమే లక్ష్యం ప్రభుత్వం పోయిందని కడుపులో విషం నింపేసుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హనుమకొండలో రాష్ట్రస్థాయి మెగా రైతుమేళా ప్రారంభం వివిధ రకాల వ్యవసాయ ఉత్పత్తులు, యంత్ర పరికరాలతో ఆకట్టుకున్న స్టాళ్లు సందర్శించి వివరాలు తెలుసుకున్న అన్నదాతలు -
రైతులు సేంద్రియ సాగుకు మొగ్గుచూపాలి
మల్హర్(కాటారం): రైతులు భూసార పరీక్షలు నిర్వహించుకొని సేంద్రియ వ్యవసాయం సాగులో ముందుకెళ్లాలని కాటారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పంతకాని తిరుమల అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి నివేదిక రైతు వారోత్సవాల్లో భాగంగా సోమవారం మండలంలోని కాటారం రైతు వేదికలో ఏర్పాటు చేసిన రైతు సమావేశంలో తిరుమల మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులంతా అధునాతన సాగు మెలకువలు పాటిస్తూ పెట్టుబడి తగ్గించుకొని అధిక లాభాలు పొందేలా వినూత్న పద్ధతుల్లో వ్యవసాయం చేయాలని చెప్పారు. అనంతరం మండలంలో భూసార పరీక్షలు నిర్వహించుకున్న రైతులకు కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి పూర్ణిమ, తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ బాబు, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కిషన్‌నాయక్, కాటారం సర్పంచ్ సడవలి, ఏఈఓ, రైతులు పాల్గొన్నారు. -
వైభవంగా హేమాచలుడి తెప్పోత్సవం
ఎద్దు ముక్కు ఆంజనేయస్వామికి స్నపనంకొలనులో ఉత్సవమూర్తులకు తెప్పోత్సవం పూజలు నిర్వహిస్తున్న యాగ్నికులుమంగపేట: మల్లూరులోని హేమాచల క్షేత్రంలో లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు తెప్పోత్సవం కార్యక్రమాన్ని బ్రహ్మోత్సవాల యాగ్నికులు మరళీకృష్ణమాచార్యుల బృందం వేద మంత్రోచ్ఛరణతో సోమవారం రాత్రి శాస్త్రోక్తంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో 8వ రోజు కార్యక్రమంలో భాగంగా ఉదయం ఆలయంలోని మూలవిరాట్‌కు నిత్య పూజ, యాగశాలలో సేవాకాలం, బాలభోగం, చతుస్థానార్చన ఆలయ సమీపంలోని ఎద్దు ముక్కు వద్ద గల ఆంజనేయస్వామికి పంచామృతాలతో అభిషేకం (స్నపనం) మహానివేదన కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం 7 నుంచి 9గంటల వరకు చతుస్థానార్చన, తెప్పోత్సవం, దోపోత్సవం, శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణం, హవనం కార్యక్రమ క్రతువులను వేద పండితులు మంత్రోచ్ఛరణ నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. తెప్పోత్సవం కార్యక్రమంలో భాగంగా లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను నూతన పట్టు వస్త్రాలతో అలంకరించి ప్రత్యేక పల్లకి(సేవ)పై తీసుకొచ్చి ఆలయ ప్రాంగణంలోని కొలనులో రెండు గంటల పాటు తెప్పోత్సవం నిర్వహించారు. -
బస్‌స్టేషన్ నిర్మాణానికి చొరవ చూపాలి
మల్హర్(కాటారం): కాటారంలో కోట్లాది రూపాయల విలువైన ఆర్టీసీ బస్టాండ్ భూముల పరిరక్షణతో పాటు నూతన బస్ స్టేషన్ నిర్మాణానికి చొరవ చూపాలని వరంగల్ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ భవానిప్రసాద్‌ను డీసీసీ జిల్లా అధికార ప్రతినిధి పంతకాని సమ్మయ్య, కాంగ్రెస్ నాయకులు కోరారు. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆదేశాల మేరకు సోమవారం వరంగల్‌లో ఆర్ఎం, భూపాలపల్లి డీఎం సంబంధిత అధికారులకు కాటారం ప్రయాణ ప్రాంగణ స్థలం నిర్మాణంపై నాయకులు వినతి పత్రం అందించారు. కోర్టులో కేసు నడుస్తునందున రాష్ట్ర లీగల్ సెల్‌ను అప్రమత్తం చేసి క్లియరెన్స్ తెప్పిస్తే మంత్రి శ్రీధర్‌బాబు బస్‌స్టేషన్ నిర్మాణానికి నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు అధికారులకు వివరించారు. బస్‌స్టేషన్ నిర్మాణం, కాంపౌండ్ వాల్ ఏర్పాటుకు ఆర్టీసీ నాయకులు లీగల్ సెల్ ద్వారా క్లియరెన్స్ సర్టిఫికెట్స్, టెండర్ ప్రాసెస్ వెంటనే నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ధన్వాడ మాజీ ఎంపీటీసీ కుమ్మరి అశోక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆత్మకూరి కుమార్, పున్నం రమేష్ పాల్గొన్నారు. -
ప్రజావాణికి 11 దరఖాస్తులు
మల్హర్(కాటారం): కాటారం సబ్‌కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి డివిజన్ స్థాయిలోని కాటారం, మల్హర్, మహాముత్తారం, మహాదేవపూర్, పలిమెల మండలాల నుంచి వివిధ సమస్యలపై 11 దరఖాస్తులు వచ్చినట్లు ఇన్చార్జ్ సబ్ కలెక్టర్ హరికృష్ణ తెలిపారు. ప్రజావాణి ద్వారా అందిన ప్రతీ వినతిని ప్రాధాన్యంగా తీసుకోని నిర్ధిష్ట కాల పరిమితిలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సంబందిత అధికారులకు హరికృష్ణ సూచించారు. ఈ కార్యాక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. లాటరీ పద్ధతిలో సీట్ల కేటాయింపు భూపాలపల్లి అర్బన్: తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాలలో 5వ తరగతి ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకున్న నాన్–మైనారిటీ అభ్యర్థులకు లాటరీ పద్ధతిలో సీట్ల కేటాయింపు చేపట్టనున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ రవి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 6వ తేదీన జిల్లా మైనారిటీ అధికారి, ఉమ్మడి వరంగల్ మైనారిటీ పాఠశాలల కోఆర్డినేటర్ ఎదుట లాటరీ తీయనున్నట్లు తెలిపారు. ఉదయం 9:30 గంటలకు జిల్లా కేంద్రంలోని పాఠశాల ఆవరణలో, జిల్లా మైనారిటీ అధికారి, ఉమ్మడి వరంగల్ మైనారిటీ పాఠశాలల కోఆర్డినేటర్, పాఠశాల ప్రిన్సిపాల్ సమక్షంలో దరఖాస్తులను పరిశీలించి లాటరీ ద్వారా ఎంపిక ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందన్నారు. రేపు వెరిఫికేషన్ మొగుళ్లపల్లి: ఎస్సీ కార్పొరేషన్ 2025–26 రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు ఈనెల 6న బుధవారం సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ సురేందర్‌గౌడ్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు దరఖాస్తుదారులు తమ ఆధార్, కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు ఆన్లైన్లో అప్లోడ్ చేసిన అన్ని ప్రతులతో హాజరుకావాలని కోరారు. అర్హత గల వారందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. గంజాయి రవాణాదారుల అరెస్ట్ టేకుమట్ల: అక్రమంగా గంజాయిని రవాణా చేస్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని బోర్నపల్లికి చెందిన మీనుగు వంశీక్రిష్ణతో పాటు, పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలోని వెంకటేశ్వర్లపల్లి గ్రామానికి చెందిన పసుపులేటి సంతోష్, ఓడేడ్ గ్రామానికి చెందిన బీముని గణేష్ మహారాష్ట్ర చంద్రాపూర్ నుంచి గంజాయిని తీసుకువచ్చి జిల్లాలోని ఆయా మండలాల యువకులకు విక్రయిస్తున్నారు. సోమవారం ఉదయం టేకుమట్ల మండల కేంద్రానికి వస్తున్న క్రమంలో టేకుమట్ల రైతు వేదిక వద్ద వాహనాల తనిఖీలో వారి వద్ద 1.2కిలోల ఎండు గంజాయిని పోలీసులు గుర్తించారు. గంజాయిని స్వాధీనం చేసుకుని, ముగ్గురిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై గైకవాడ అమూల్య తెలిపారు. కాళేశ్వరాలయంలో టీపీసీసీ అధ్యక్షుడు పూజలు కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామిని టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్ దంపతులు సోమవారం దర్శించుకున్నారు. ముందుగా త్రివేణి సంగమం వద్ద సైకత లింగార్చన, షోడస సోమవార వ్రత ఉద్యాపన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ రాజగోపురం వద్దకు రాగా అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామివారి గర్భగుడిలో విశేష పూజలు చేశారు. శ్రీ శుభానందదేవి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనను స్వామి వారి శేష వస్త్రాలతో ఆలయ చైర్మన్ అవధాని మోహన్ శర్మ సన్మానించారు. ఆయన వెంట టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు, డీసీసీ అద్యక్షుడు బట్టు కర్ణాకర్ ఉన్నారు. శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో.. రేగొండ: రేగొండ మండలంలోని సుప్రసిద్ధ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మహేష్‌కుమార్‌గౌడ్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, ఆలయ కమిటీ చైర్మన్ నాయినేని సంపత్‌రావు శాలువాలతో ఘనంగా సన్మానించారు. -
రేపటి నుంచి అథ్లెటిక్ పోటీలు
భూపాలపల్లి రూరల్: ఈనెల 6వతేదీ బుధవారం నుంచి జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహించనున్న అథ్లెటిక్ పోటీల్లో జిల్లాలోని క్రీడాకారులు పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షుడు పంతకాని సమ్మయ్య సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. క్రీడల్లో పాల్గొనేవారు బుధవారం ఉదయం ఆరు గంటలకు జనన ధృవీకరణ పత్రాలతో హాజరుకావాలని సూచించారు. సబ్ జూనియర్, జూనియర్స్, సీ్త్రలు, పురుషుల విభాగాలలో క్రీడలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఈనెల 10వ తేదీన హనుమకొండలో జవహర్‌లాల్‌నెహ్రూ స్టేడియంలో జరగబోయే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పించినట్లు తెలిపారు. -
ముమ్మరంగా ధాన్యం కొనుగోళ్లు
భూపాలపల్లి: జిల్లాలో వరిధాన్యం కోతలు ముమ్మరంగా జరుగుతున్నాయని, ప్రస్తుతం పీక్ దశలో కొనసాగుతున్నందున అంతరాయాలు లేకుండా సమర్థవంతంగా ధాన్యం కొనుగోలు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులకు ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో పౌర సరఫరాలు శాఖ, సంస్థ, వ్యవసాయ, సహకార, డీఆర్డీఓ, మిల్లర్లు, ట్రాన్స్పోర్టర్లు, వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాట్లు, సౌకర్యాల పట్ల థర్డ్ పార్టీ పరిశీలనకు రెవెన్యూ, వ్యవసాయ అధికారులతో తనిఖీ నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో 185 కేంద్రాలు ఏర్పాటు లక్ష్యం కాగా ఇప్పటివరకు 130 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని, మిగిలినవి త్వరగా ప్రారంభించాలని ఆదేశించారు. ఐదు పారా బాయిల్డ్ రైస్ మిల్లులకు 25 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కేటాయించామని, ఇప్పటివరకు 108 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగినట్లు తెలిపారు. ఈ సీజన్లో మొత్తం 1.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, డీసీఎస్ఓ కిరణ్‌కుమార్, డీఎం రాములు, డీఏఓ బాబూరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి.. అకాల వర్షాల పట్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, రైతులకు నష్టం జరుగకుండా ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లు పూర్తిచేయాలని రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ సూచించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో మంత్రులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, సివిల్ సప్లయీస్ అధికారులు పాల్గొన్నారు. 10 వరకు స్వీయ నమోదు డిజిటల్ విధానంలో ప్రతీ ఒక్కరు జనగణన స్వీయ నమోదు నమోదు చేసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో జనగణన స్వీయ నమోదుపై అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో గత నెల 26వ తేదీ నుంచి జనగణన స్వీయ నమోదు ప్రారంభమైందని, మే 10వ తేదీ వరకు జరుగుతుందని తెలిపారు. దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు.. ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి 55 దరఖాస్తులు స్వీకరించారు. ఆ దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఆయా జిల్లా శాఖల అధికారులను ఆదేశించారు. డిజిటల్ విధానంలో స్వీయ నమోదు చేసుకోవాలి కలెక్టర్ రాహుల్ శర్మ -
మక్కలు కొనేదెప్పుడు?
భూపాలపల్లి: అన్నదాతలకు ప్రతీ ఏటా ప్రతీ సీజన్లో ధాన్యం విక్రయించే విషయంలో బాధలు తప్పడం లేదు. వానాకాలం సీజన్లో సమయానికి వర్షాలు కురవకపోవడం, పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలు కురవడంతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ నష్టాలను అధిగమించేందుకు యాసంగిలో మొక్కజొన్న సాగుచేస్తే కొనే వారు కరువయ్యారు. మక్కల కొనుగోలుకు నిరీక్షణ.. జిల్లాలోని 12 మండలాల్లోని రైతులు 29వేలకు పైగా ఎకరాల్లో ఈ యాసంగిలో మొక్కజొన్న పంటను సాగుచేశారు. జిల్లా మొత్తంగా సుమారు 39,500 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు 12 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని పేర్కొని.. ఇప్పటివరకు ఏడింటిని మాత్రమే ప్రారంభించారు. ప్రారంభించిన కొనుగోలు కేంద్రాల్లో సైతం జొన్నల కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదు. ప్రభుత్వం గన్నీ సంచులను అందించకపోవడమే కాకుండా రవాణా చేసే లారీల కొరత తీవ్రంగా ఉంది. దీంతో పక్షం రోజుల క్రితం కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన రైతులకు చెందిన మక్కలను సైతం నిర్వాహకులు కొనలేని పరిస్థితి నెలకొంది. గన్నీ సంచులు మీరే కొనుగోలు చేసుకోవాలని, తర్వాత బిల్లులు చెల్లిస్తామని నిర్వాహకులు చెబుతుండటంతో రైతులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. అకాల వర్షంతో రైతుల్లో ఆందోళన.. మూడు రోజుల పాటు జిల్లాలో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో మొక్కజొన్న రైతుల్లో ఆందోళన నెలకొంది. మూడు నెలల పాటు కంటికి రెప్పలా కాపాడుకున్న పంట ఇప్పుడు నీటి పాలైతే ఎలా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం రాత్రి జిల్లాలో ఈదురుగాలులు వీస్తూ, ఉరుముల శబ్ధం రావడంతో రైతులు ఆందోళన చెందారు. చేసేది లేక కొనుగోలు కేంద్రాల్లోని మొక్కజొన్న బస్తాలపై పరదాలు కప్పి అక్కడే పడిగాపులు కాస్తున్నారు. అకాల వర్షం కురిస్తే మాత్రం మక్కలు దెబ్బతింటాయని, అప్పుడు కొనేందుకు ప్రభుత్వం సైతం కొర్రీలు విధిస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా కొనుగోళ్లను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని రైతులు కోరుతున్నారు.గన్నీ సంచులు లేవు.. లారీలు రావు కొనుగోళ్ల కోసం రోజుల తరబడి నిరీక్షణ అకాలవర్షంతో ఆందోళనలో మొక్కజొన్న రైతులు -
ట్రాఫిక్ నియంత్రణకు వన్ వే
కాళేశ్వరం: సరస్వతీనది ఆది పుష్కరాల్లో జరిగిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని.. అంత్య పుష్కరాల్లో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణకు వన్‌వే రూట్ ప్లానింగ్ చేసినట్లు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. ఈనెల 21నుంచి జూన్ 1వ తేదీ వరకు జరుగు సరస్వతీనది అంత్య పుష్కరాల నేపథ్యంలో భక్తుల భద్రత, ట్రాఫిక్ నిర్వహణ, మౌలిక సదుపాయాలపై అడిషనల్ ఎస్పీ నరేష్‌కుమార్‌తో కలిసి కాళేశ్వరంలో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా వీఐపీఘాటు, సాధారణ ఘాటు వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఘాట్ల వద్ద భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని, 250కి పైగా సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షిస్తామన్నారు. పోలీసుస్టేషన్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను సమర్థవంతంగా నియంత్రించనున్నామని తెలిపారు. 12 రోజుల పాటు 2,500 మంది పోలీసు సిబ్బంది బందోబస్తులో పలు షిప్టుల్లో ఉంటారన్నారు. వాహనాల పార్కింగ్ కోసం సుమారు 250 ఎకరాల్లో పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వర్షం కురిస్తే వాహనాలు దిగబడకుండా ఎరుపు నేలలను కూడా గుర్తించినట్లు తెలిపారు. గంగారం ఎక్స్‌రోడ్డు నుంచి కాళేశ్వరం మంథని గుండా కాళేశ్వరం వచ్చే వాహనాలు గంగారం ఎక్స్‌రోడ్డు మీదుగా దామెరకుంట, అన్నారం, మద్దులపల్లి మీదుగా కాళేశ్వరం వస్తాయి. వరంగల్ నుంచి వచ్చే వాహనాలు బస్వాపూర్ నుంచి రుద్రారం మీదుగా కొయ్యూర్, గంగారం ఎక్స్‌రోడ్డు నుంచి దామెరకుంట, అన్నారం మీదుగా కాళేశ్వరం వస్తాయి. తిరిగి వెళ్లేటప్పుడు కాళేశ్వరం మీదుగా యధావిధిగా కాటారం గుండా వరంగల్, కరీంనగర్ వైపునకు వెళ్తాయి. ఆర్టీసీ బస్సులు, వీవీఐపీ వాహనాలకు వన్‌వే లేదు. ఎప్పటిలాగే వచ్చి వెళ్తాయి. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మంచిర్యాల గుండా వచ్చే వాహనాలు వంతెన వద్ద పార్కింగ్ స్థలాలకు చేరుకుంటాయి. అక్కడే పార్కింగ్ చేసిన తరువాత ఆటోలు, షెటిల్ బస్సులలో వెళ్లి స్నానాలు చేసి దర్శనం చేస్తారని తెలిపారు. భక్తులకు ఇబ్బంది కలగొద్దు వన్‌వే ద్వారా భక్తులకు సులభంగా రాకపోకలు జరిగేలా రహదారుల అభివృద్ధి, తాగునీటి సదుపాయాల కల్పన చేపడుతున్నామని, వారి భద్రత దృష్ట్యా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ సూర్యనారాయణ, సీఐ ఎన్.వెంకటేశ్వర్లు, ఎస్సై తమాషారెడ్డి పాల్గొన్నారు. అంత్య పుష్కరాలకు 2,500 మంది పోలీసులతో బందోబస్తు 250 ఎకరాల్లో పార్కింగ్ స్థలాలు భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ -
భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు
కాళేశ్వరం: ఈనెల 21 నుంచి జూన్ 1 వరకు జరుగు సరస్వతీనది అంత్య పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతున్నామని కాళేశ్వరం దేవస్థానం చైర్మన్ అవధాని మోహన్‌శర్మ, ఈఓ మహేష్ తెలిపారు. సోమవారం పాలకవర్గం మొదటి సమావేశాన్ని నిర్వహించారు. అంత్య పుష్కరాల నిర్వహణ కోసం పలు తీర్మానాలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. 12 రోజుల పాటు తాగునీరు, మౌలిక వసతులు ఏర్నాటు చేస్తామన్నారు. స్థానిక భక్తులకు ఉదయం నుంచి 10గంటలకు వరకు దర్శనాలకు అనుమతి ఇస్తామన్నారు. ఈఓ మాట్లాడుతూ..ఆలయంలో భక్తులకు సరిపడా లడ్డు ప్రసాదం తయారు చేస్తామన్నారు. ప్రతీ రోజు భక్తులకు అన్నదానం ఏర్పాటుచేస్తామని తెలిపారు. 12 రోజుల పాటు వీవీఐపీలు, పీఠాధిపతులు రానున్నారని తెలిపారు. హారతి కార్యక్రమానికి కాశీపండితులు వస్తున్నారని పేర్కొన్నారు. వారి వెంట ధర్మకర్తలు సీతారాం, సీతయ్య, సత్యనారాయణ, సత్తయ్య, పద్మ, నర్సయ్య, అశోక్, దుర్గయ్య, శ్రీధర్‌రావు, శ్యామ్దేవుడా పాల్గొన్నారు. -
మక్కలు కొనుగోలు చేయడంలో విఫలం
రేగొండ: మక్కలు కొనుగోలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మండలకేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆదివారం పరిశీలించారు. అనంతరం పరకాల–భూపాలపల్లి జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి సౌకర్యాలను విస్మరించారన్నారు. గన్నీ సంచులు అందించకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. మక్కలను మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. వరంగల్‌లో నిర్వహించే బీఆర్ఎస్ రైతు సదస్సు కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అంకం రాజేందర్, హమీద్, కానుగంటి శ్రీనివాస్, కడారి జనార్ధన్, పాపిరెడ్డి, రజినికాంత్, నగేష్, గౌస్‌పాషా పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి -
గాలివాన బీభత్సం.. నేలవాలిన వరిపంట
మంగపేట : మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఆదివారం గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతో పలుచోట్ల చిరు జల్లులు పడగా కొత్తూరుమొట్లగూడెంలో గాలిదుమారం భారీగా వచ్చింది. దీంతో పలుచోట్ల కోత దశకు వచ్చిన వరిపైరు నేలవాలింది. మేల్ఫిమేల్ వరిపైరు సైతం నేలవాలడంతో వడ్లు రాలిపోగా తీవ్రంగా నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు. గాలివాన దాటికి గుడిసెల పైకప్పులు ఎగిరిపోవడంతో ఇళ్లలోని బట్టలు, గృహోపకర వస్తువులు తడిసిపోయాయి. ఉన్నతాధికారులు పంటనష్టంపై పరిశీలించి ప్రభుత్వం ద్వారా పరిహారం అందేలా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. -
నేడు సమావేశం
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానం పాలకవర్గం(ట్రస్టుబోర్డు) నియామకం ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. సోమవారం(నేడు) ఉదయం 10 గంటలకు చైర్మన్ అవధాని మోహన్‌శర్మ అధ్యక్షతన మొదటి సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు జరుగు సరస్వతీనది అంత్యపుష్కరాల్లో చేయాల్సిన పనులు, భక్తులకు సౌకర్యాలు కల్పించుటపై చర్చించనున్నారు. పలు తీర్మానాలు చేయనున్నారని తెలిసింది. భద్రత ఏర్పాట్లపై.. కాళేశ్వరంలో ఈనెల 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు జరుగు సరస్వతీనది అంత్యపుష్కరాల భద్రత ఏర్పాట్లపై ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ పోలీసులతో సోమవారం(నేడు) సమావేశం నిర్వహించున్నారు. గతంలో ఇక్కడ పుష్కరాల్లో విధులు నిర్వర్తించిన పోలీసు అధికారులు, ప్రస్తుతం జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులతో సమీక్ష నిర్వహిస్తారని తెలిసింది. 8, 9న జాతర మహోత్సవాలు పలిమెల: మండలంలోని నీలంపల్లిలో కొలువైన శ్రీ సింహగిరి లక్ష్మీనరసింహస్వామి జాతర మహోత్సవాలు ఈనెల 8, 9 తేదీల్లో ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ సేవా సమితి బాధ్యులు ఆదివారం తెలిపారు. 8న రాత్రి జాగారాలు, జానపద నృత్యాలు, సోన్నాయి మేలాల ఆటపాటలు ఉంటాయన్నారు. 9న ఉదయం సుప్రభాత సేవ, భక్తుల నదీ స్నానాలు, స్వామివారికి విశేష శాంతి కల్యాణం, పూజలు, మధ్యాహ్నం మహా అన్నప్రసాద వితరణ, సాయంత్రం రథోత్సవం, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల నుంచి జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలుగకుండా తాగునీటి సౌకర్యం, వసతి, రవాణా ఏర్పాట్లు చేయనున్నట్లు వివరించారు. ఆలయ నిర్మాణానికి భూమి పూజ చిట్యాల: మండలంలోని వెంచరామి గ్రామ శివారు కుర్మపల్లి గ్రామంలో శ్రీ హనుమాన్ ఆలయ నిర్మాణానికి కమిటీ అధ్యక్షుడు మోరే ధర్మరాజు, సర్పంచ్ కాసు రమకుమార్ ఆధ్వర్యంలో ఆదివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ఆలయ నిర్మాణం మూలంగా ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతుందని పేర్కొన్నారు. కమిటీ సభ్యులు, గ్రామస్తుల సహకారంతో అతి తొందరలోనే ఆలయ నిర్మాణం పూర్తిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఉపాధ్యక్షుడు అందుగుల కుమార్, సట్ల స్వామి, కార్యదర్శి గుర్రం నరేందర్, కోశాధికారి జక్కే వెంకటేశం పాల్గొన్నారు. సంఘాల వైఫల్యంతోనే కష్టాలు భూపాలపల్లి అర్బన్: ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ సంఘాల వైఫల్యంతోనే సింగరేణికి కష్టాలు మొదలైనట్లు సింగరేణి కోల్‌మైన్ కార్మిక సంఘ్(బీఎంఎస్) కార్యదర్శి మాధవనాయక్ ఆరోపించారు. ఏరియాలోని బీఎంఎస్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి సంస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులకు గత ప్రభుత్వాల విధానాలు, గుర్తింపు సంఘాల వైఫల్యమే ప్రధాన కారణమని ఆరోపించారు. తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సంస్థలు చెల్లించాల్సిన సుమారు రూ.50వేల కోట్ల బకాయిలను వెంటనే వసూలు చేయడంలో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. రెండేళ్లుగా గుర్తింపు సంఘంగా ఉన్న ఏఐటీయూసీ కార్మిక సమస్యల పరిష్కారంలో, యాజమాన్యంపై ఒత్తిడి తీసుకురావడంలో విఫలమైందన్నారు. ఈ సమావేశంలో నాయకులు మండా రమాకాంత్, అప్పాని శ్రీనివాస్, వెలబోయిన సుజేందర్, సత్కూరి శ్రీనివాస్, శ్రీరాములు, ఓ లక్ష్మణ్, భాస్కర్, పని రమేష్, కటకం శ్రీనివాస్, మల్లేష్, రాజునాయక్, దేవర సమ్మయ్య, పునీత్ రావు, ప్రవీణ్, అడప రాజు, తదితరులు పాల్గొన్నారు. -
కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి
ములుగు రూరల్: మక్కల కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మల్లంపల్లి మండల కేంద్రంలో మక్కల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ కొనుగోలు కేంద్రంలో రైతులకు ఇబ్బందులు ఎదురైతే తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ కొండెం రవీందర్‌రెడ్డి, కిసాన్ సెల్ అధక్షుడు గోల్లపలి రాజేందర్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క -
అడ్మిషన్ల వేట!
ప్రవేశాల కోసం ‘కార్పొరేట్’ విద్యాసంస్థల ప్రయత్నాలుమీ అమ్మాయిని మా కాలేజీలో చేర్పించడానికి ఇప్పుడే సీట్ బుక్ చేసుకోండి. మరికొద్ది రోజులైతే ఫీజు ఎక్కువగా చెల్లించాల్సి వస్తుంది.. అంటూ గత కొద్ది రోజులుగా వచ్చే విద్యాసంవత్సరం ఇంటర్మీడియేట్ కాలేజీల్లో ప్రవేశాల కోసం కార్పొరేట్ విద్యాసంస్థలు అడ్మిషన్ల వేట సాగిస్తున్నాయి. జిల్లాలో విస్తృతంగా ప్రచారం చేస్తుండగా.. పదో తరగతి ఫలితాలు వెలువడడంతో తల్లిదండ్రులను కలిసి ప్రవేశాల ఎర వేస్తున్నాయి.భూపాలపల్లి అర్బన్: విద్యా వ్యాపారంలో పోటీ పెరగడంతో కార్పొరేట్ విద్యాసంస్థలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. తమ సంస్థల్లో విద్యార్థుల ప్రవేశాలే లక్ష్యంగా పోటీ పడుతున్నాయి. జిల్లాలో సింగరేణి పరిధి కార్మిక, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, వ్యాపారులు, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులను పలు రకాలుగా ఆకర్షిస్తున్నారు. తమ విద్యాసంస్థల్లో సౌకర్యాలను వివరిస్తూ ఇప్పుడే చేరిపోవాలంటూ కోరుతున్నారు. ఇప్పటికే కొందరు తల్లిదండ్రులు హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ తదితర ప్రాంతాల్లోని పలు కాలేజీలను సందర్శించి వచ్చారు. ఇంకా చాలామంది వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇంటర్‌తో పాటు ఐఐటీ, నీట్, సివిల్స్ ఇతర ఉన్నత విద్య ప్రవేశాల శిక్షణతో సహా ఇంటర్మీడియేట్ విద్యను అందిస్తామని హామీలు ఇస్తున్నారు. తమ విద్యాసంస్థల్లో అనేకమంది ఐఐటీ, ఎన్ఐటీ, నీట్ ర్యాంకులు సాధించారని చెబుతూ ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. తల్లిదండ్రులకు ఫోన్లు, మెసేజ్‌లు, వాట్సాప్‌లో ప్రచారం చేస్తున్నారు. ప్రవేశాలకు కమీషన్లు ఆయా సంస్థలు విద్యార్థుల అడ్మిషన్లను బట్టి కమీషన్లు ఇస్తున్నాయి. పీఆర్వోలను నియమించుకుని విద్యార్థుల ఇళ్లకు నేరుగా వెళ్తున్నారు. రూ.లక్షల్లో ఫీజులు చెబుతూ వాయిదాలు, ఫైనాన్స్ సౌకర్యం కూడా కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలు ఉన్నత విద్యాసంస్థల్లో చదివితే భవిష్యత్‌లో అవకాశాలు మెరుగు పడతాయనే ఆశతో ఫీజులు చెల్లించేందుకు ఒప్పుకుంటున్నారు. ఎక్కువగా హాస్టల్లో చేర్పించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పదో తరగతికి మార్కులు అధికంగా వచ్చిన విద్యార్థులను వేరే కేటగిరీలో చేర్చుతూ తల్లిదండ్రులను మెప్పిస్తున్నారు. పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులతోనూ ప్రచారం చేయిస్తున్నారు. జిల్లాలో పదో తరగతి విద్యార్థులు మూడు వేలకు పైగా ఉండగా, ఇంకా అనేక మంది ఇతర జిల్లాల్లోనూ చదివారు. ఎక్కువగా హైదరాబాద్, వరంగల్, కరీంనగర్‌తోపాటు ఇతర నగరాల్లో ఉన్న సంస్థలు అడ్మిషన్లు పొందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో స్థానికంగా ఉన్న చిన్న, మధ్య స్థాయి కాలేజీల పరిస్థితి భిన్నంగా మారింది. దీంతో ప్రభుత్వ విద్యాసంస్థలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ప్రైవేట్ సంస్థలతో పోటీ పడలేక ఏటేటా అడ్మిషన్ల సంఖ్య తగ్గిపోతోంది. మరోవైపు స్కూల్ విద్యార్థులను సైతం చేరికకు ప్రైవేట్ విద్యాసంస్థలు పోటీ పడుతున్నాయి. ప్రీ కిడ్స్ నుంచి మొదలు పది వరకు, ఎస్ఎస్సీ, సీబీఎస్ఈ, ఇంటర్నేషనల్ సిలబస్ అంటూ అనేక స్కూళ్ల యాజమాన్యాలు ప్రచారం మొదలుపెట్టాయి. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయి స్కూళ్లు మూతపడే పరిస్థితి వస్తోంది. సెలవులకు ముందు ప్రభుత్వ టీచర్లు అడ్మిషన్ల కోసం ప్రచారం చేసినప్పటికీ ప్రస్తుతం చేయడం లేదు. ఇదే సమయంలో ప్రైవేట్ సంస్థలు విస్తృతంగా ప్రచారం చేస్తూ విద్యార్థులను చేర్పించుకుంటున్నాయి. జిల్లా విద్యార్థులే లక్ష్యంగా ప్రచారం సీట్ల కోసం ముందస్తుగానే ఫీజు చెల్లింపులు -
కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు
దేవతామూర్తుల వేదాశీర్వచనం తీసుకుంటున్న బ్రహ్మోత్సవాల యాగ్నికులు వనదేవత(దైత) అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేస్తున్న యాగ్నికులుమంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు ఆదివారం రాత్రి సదస్యం(వేదాశీర్వచనం) కార్యక్రమాన్ని యాగ్నికులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారి బ్రహ్మోత్సవాల(జాతర) కార్యక్రమాల్లో భాగంగా ఏడోరోజు ఆలయ ఇన్చార్జ్ కార్యనిర్వహణ అధికారి ఎం. వీరస్వామి, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ శ్రావణం సత్యనారాయణ పర్యవేక్షణలో భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఉప ప్రధానార్చకులు అమరవాది మురళీ కృష్ణమాచార్యుల బృందం ఉదయం ఆలయంలో స్వయంభు స్వామివారి నిత్యారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. యాగశాలలో సేవాకాలం, బాలభోగం, చతుస్థానార్చన, ఆలయ ప్రాంగణంలోని వనదేవత(దైత) అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం(స్నపనం), మహానివేదన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాత్రి 7గంటల నుంచి 9 గంటల వరకు హయగ్రీవ స్తోత్ర పారాయణం, హవనం, చతుస్థానార్చన, బలిహరణ, స్వామివారి కల్యాణ మండపంలో లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి, అమ్మవార్లకు సదస్యం (వేదాశీర్వచనం) కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవకమిటీ చైర్మన్ సురేశ్, ఆలయ అర్చకులు ముక్కామల రాజశేఖర్ శర్మ, కారంపుడి పవన్‌కుమార్, ఏడునూతుల ఈశ్వర్‌చంద్, అనిపెద్ది రాజీవ్‌శర్మ, యాగ్నికులు పెరంబదూర్ మధనమోహనాచార్యులు, శ్రీకృష్ణ యజుర్వేదం పండితులు వరప్రసాధ్, శ్రీరంగం వెంకటాచార్యులు. బరద్వాజాచార్యులు, అమరవాది రామనర్సింహా చార్యులు, మణిదీపాచార్యులు, విరంచి, ఆలయ సీనియర్ అసిస్టెంట్ న్యాతని సీతారాములు తదితరులు పాల్గొన్నారు. ఏడోరోజు హేమాచలక్షేత్రంలో సదస్యం వనదేవత (దైత)అమ్మవారికి స్నపనం -
తూకంలో పారదర్శకత పాటించాలి
టేకుమట్ల: ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తూకంలో పారదర్శకత పాటించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఆదివారం మండలంలోని రాఘవారెడ్డి, వెల్లంపల్లి, టేకుమట్ల గ్రామాలలో పీఏసీఎస్, ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పంటకు మద్దతు ధర కొనుగోలు కేంద్రాలలోనే లభిస్తుందన్నారు. తూకంలో లోపాలు జరగకుండా ప్రతీ ఒక్కరు బాధ్యతగా వ్యవహరించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. పలు పనులకు శంకుస్థాపన బోర్నపల్లి గ్రామంలో గుట్టు మల్లన్న దేవాలయ నిర్మాణ పనులు, రామకృష్ణాపూర్ (వి)లో బీటీ రోడ్డు పనులు, వెలిశాల (కిష్టయ్యపల్లి) నుంచి రామకృష్టాపూర్(వి) వరకు సీసీ రోడ్డు నిర్మాణ పనులు, వెలిశాల నుంచి రాఘవాపూర్ గుట్ట వరకు రోడ్డు నిర్మాణ పనులు, పెద్దంపల్లి గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గుమ్మడి శ్రీదేవి, మాజీ జెడ్పీటీసీ పులి తిరుపతిరెడ్డి, సర్పంచ్‌లు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
నీట్ ప్రశాంతం
భూపాలపల్లి అర్బన్: జిల్లా కేంద్రంలో రెండు పరీక్ష కేంద్రాలలో నిర్వహించిన నీట్ ప్రవేశ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా నిర్వహించినట్లు సిటీ నీట్ కోఆర్డినేటర్ డాక్టర్ రమణారావు తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు పరీక్ష నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 134 మంది విద్యార్థులకు 132మంది విద్యార్థులు హాజరుకాగా ఇద్దరు గైర్హాజరయ్యారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 240 మంది విద్యార్థులకు గాను 232 మంది హాజరు కాగా ఎనిమిది మంది గైర్హాజరైనట్లు కోఆర్డినేటర్ తెలిపారు. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా పకడ్బందీగా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 11 గంటల నుంచి విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నట్లు తెలిపారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులను తనిఖీ చేసిన అనంతరం పరీక్ష హాల్లోని అనుమతించారు. ఆలస్యంగా వచ్చిన విద్యార్థి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పా టు చేసిన నీట్ పరీక్షకు సకాలంలో హాజరుకాని వి ద్యార్థినిని అధికారులు పరీక్షకు అనుమతించలేదు. మహదేవపూర్ మండలం కాళేశ్వరం గ్రామానికి చెందిన లావుడియా వీణ పరీక్షకు 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చింది. మధ్యాహ్నం 1.30గంటలకు పరీక్ష ప్రారంభం కాగా 1.40గంటలకు పరీక్ష కేంద్రానికి చేరుకుంది. పోలీసులు పరీక్ష కేంద్రానికి అనుమతించకపోవడంతో బోరున విలపిస్తూ ఇంటికి తిరిగి వెళ్లింది. పరీక్షకు అనుమతించాలని ఇప్పటివరకు చదివిన చదువు వృథా అవుతుందని అధికారులను వేడుకున్నా పరీక్షకు అనుమతించలేదు. -
నేడు ప్రజావాణి
మల్హర్(కాటారం): నేడు(సోమవారం) కాటారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో డివిజన్ స్థాయి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఇన్చార్జ్ సబ్ కలెక్టర్ హరికృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కలెక్టరేట్‌తో పాటు రెవెన్యూ డివిజనల్ స్థాయిలో ప్రజావాణి నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు నేడు సబ్‌కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజలు వారి సమస్యకు సంబంధించిన అంశంపై లిఖిత పూర్వక దరఖాస్తు ఇవ్వాలని ఆయన సూచించారు. యువత ఉద్యమించాలి భూపాలపల్లి అర్బన్: ప్రజా సమస్యలపై యువత ఉద్యమించాలని ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ (ఏఐవైఎఫ్) జిల్లా కార్యదర్శి వేముల శ్రీకాంత్ పిలుపునిచ్చారు. ఏఐవైఎఫ్ 67వ ఆవిర్భావ దినోత్సవం ఆదివారం జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొమురయ్య భవనంలో ఆయన పతాకాన్ని ఆవిష్కరించి, అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. 1959 మే 3న స్థాపించబడిన ఏఐవైఎఫ్ నాటి నుంచి నేటి వరకు యువత హక్కుల కోసం పోరాడుతోందని గుర్తు చేశారు. ప్రస్తుతం దేశం, రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా పెరిగిందని, చదువుకున్న యువతకు ఉపాధి కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. నోటిఫికేషన్ల పేరుతో కాలయాపన చేస్తూ నిరుద్యోగుల భవిష్యత్‌తో ఆడుకుంటున్న పాలకులకు యువత తగిన బుద్ధి చెబుతుందని హెచ్చరించారు. ‘అందరికీ పని–అందరికీ విద్య’ లక్ష్యం సాధించే వరకు ఏఐవైఎఫ్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. జిల్లాలో డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలు సులభంగా లభిస్తుండటంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధి లేక నిరాశలో ఉన్న యువతను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ మాఫియా విస్తరిస్తోందని అన్నారు. మత్తు అలవాట్లకు దూరంగా ఉండి యువత తమ భవిష్యత్‌ను కాపాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పట్టణ కార్యదర్శి సొతుకు ప్రవీణ్, సహాయ కార్యదర్శి కృష్ణ, ఏఐవైఎఫ్ మాజీ జిల్లా కార్యదర్శి క్యాతరాజు సతీష్ పాల్గొన్నారు. -
వేల దరఖాస్తులు ఎల్–1లోనే.. స్పాట్ వెరిఫికేషనే సమస్య
సాక్షి ప్రతినిధి, వరంగల్: లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) అమల్లో గ్రేటర్ వరంగల్‌తోపాటు ఉమ్మడి జిల్లాలో తీవ్ర జాప్యం నెలకొంది. 2020లో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించేందుకు ప్రభుత్వం 25శాతం రాయితీ ఇచ్చింది. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా వేల సంఖ్యలో ఎల్ఆర్ఎస్ కోసం ఫీజు చెల్లించారు. 2026 మార్చి నాటికి కూడా పూర్తిస్థాయి క్లియరెన్స్ లేకపోవడం దరఖాస్తుదారులను ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా ప్రభుత్వం మరోసారి లేఅవుట్ల క్రమబద్ధీకరణకు 25 శాతం రాయితీ ఇస్తూ జూలై 31వరకు గడువు ఇచ్చింది. ఈసారైన ఆశించిన స్థాయిలో ముందుకు వస్తారా? ఆ మేరకు ఫైళ్లు క్లియరెన్స్‌కు నోచుకుంటాయా? అన్న చర్చ జరుగుతోంది. స్పాట్ వెరిఫికేషన్ లేక ‘బ్లాక్’... ఐదేళ్లుగా అపరిష్కృతం... ఫీల్డ్ స్థాయిలో స్పాట్ వెరిఫికేషన్ జరగకపోవడంతో వేలాది ఫైళ్లు ముందుకు కదలడం లేదు. అధికారులు రేపు, మాపు అంటూ నెలల తరబడి వాయిదా వేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఫలితంగా ఐదేళ్లయినా పూర్తిస్థాయిలో ఫైళ్లు పరిష్కారానికి నోచుకోలేదన్న ఫిర్యాదులున్నాయి. ‘గ్రేటర్‘ మున్సి పల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ)తో పాటు ఉమ్మ డి జిల్లా వ్యాప్తంగా 1.58 లక్షల దరఖాస్తులు రాగా, ఇందులో 1.43 లక్షల మంది ఫీజు చెల్లించారు. ఇప్పటికీ కూడా 40శాతం ఫైళ్లు పెండింగ్‌లోనే ఉండగా.. రాయితీ ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోయిందంటున్నారు. ప్రభుత్వం 25శాతం రాయి తీ ప్రకటించి ప్రజలను ప్రోత్సహించినా, క్లియరెన్స్ లేకపోవడంతో ఆ ప్రయోజనం వృథా అవుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎల్–1లోనే ఎల్ఆర్ఎస్ లాక్... 2026లో మళ్లీ రాయితీ ప్రకటించినప్పటికీ, పాత దరఖాస్తులు క్లియర్ కాకపోవడం వల్ల కొత్త ప్రకటనపై ప్రజల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం రాయితీతో భారీగా రుసుములు వసూలు చేసినప్పటికీ, వాటిలో సుమారు 40 శాతం దరఖాస్తులు ఇప్పటికీ ఎల్–1 దశలోనే పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఎల్–1 నుంచి ఎల్–2, ఎల్–3 దశలకు ఫైళ్లు వెళ్లడంలో ఆలస్యం ప్రధాన సమస్యగా మారిందని అధికారులే చెబుతున్నారు. ప్రధానంగా మూడు శాఖల మధ్య కుదరని సమన్వయం కూడా దరఖాస్తుదారులకు శాపంగా మారుతుందంటున్నారు. అధికారులు మాత్రం నిబంధనల ప్రకారం దశల వారీగా క్లియరెన్స్ జరుగుతోందని, త్వరలో పరిష్కరిస్తామని చెబుతున్నారు.మొత్తం దరఖాస్తులు (2020): 1,58,265ఫీజు చెల్లించినవి: 1,43,121జీడబ్ల్యూఎంసీ పరిధిలో: 96,000పెండింగ్ దరఖాస్తులు: 40 శాతం పైగా క్లియరెన్స్ దశలు: ఎల్–1, ఎల్–2, ఎల్–3 పెండింగ్ స్టేజ్: ప్రధానంగా ఎల్–1 కీలక సమస్య: స్పాట్ వెరిఫికేషన్ ఆలస్యం మరోసారి రాయితీ.. 25% రిబేట్ ఇస్తూ ఉత్తర్వులు జూలై 31 వరకు గడువు... పాత దరఖాస్తుదారులకే చాన్స్ ఫైళ్ల పరిష్కారంపైనే అనుమానాలు.. గతంలో ఫీజు చెల్లించినవే అపరిష్కృతం ఇప్పటికీ పెండింగ్‌లో 40శాతం దరఖాస్తులు ఐదేళ్లు గడిచినా పూర్తిస్థాయి క్లియరెన్స్ జరగనప్పటికీ తాజాగా ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై 25శాతం రాయితీ మళ్లీ అమల్లోకి తెచ్చింది. ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ రాయితీ జూలై 31 వరకు ఉంటుంది. కొత్తగా అప్లై చేసే వారికి ఈ రాయితీ వర్తించదు. పాత దరఖాస్తుదారులకు మాత్రమే ప్రయోజనం. ఇదిలా ఉండగా గతంలో ఫీజు చెల్లించిన దరఖాస్తులే ఇంకా అపరిష్కృతంగా ఉండగా.. అందుకు అనేక కారణాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు. అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయకపోవడం, ఎఫ్టీఎల్(చెరువుల పరిధి), నిషేధిత భూముల వివాదాలు, పేర్లు, సర్వే నంబర్లలో పొరపాట్లు, ఫీల్డ్ వెరిఫికేషన్ ఆలస్యం తదితర కారణాలు చెబుతున్నారు. రాయితీ ఇవ్వడం కాదు.. స్పాట్ వెరిఫికేషన్‌కు ప్రత్యేక బందాలు ఏర్పాటు చేసి పెండింగ్ దరఖాస్తులను వేగంగా క్లియర్ చేయాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు. ఆన్లైన్ సమస్యలు పరిష్కరించి , పారదర్శకత పెంచాలన్న డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది. -
క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి
కేయూ క్యాంపస్: విద్యార్థులు చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం అన్నారు. కేయూ స్టూడెంట్స్ అఫైర్స్ డీన్ విభాగం ఆధ్వర్యంలో కేయూ యువజన క్రీడోత్సవాలు ఇటీవల నిర్వహించగా.. శనివారం వర్సిటీలోని పరిపాలనా భవనంలోని సెనేట్హాల్లో విజేతలకు రిజిస్ట్రార్ రామచంద్రం, స్టూడెంట్స్ అఫైర్స్ డీన్ మామిడాల ఇస్తారి ఇతర అతిథులు బహుమతులు అందించారు. కార్యక్రమంలో కేయూ స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ వై.వెంకయ్య, ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.భాస్కర్, యూత్ వెల్ఫేర్ ఆఫీసర్ డాక్టర్ రాధిక, ఆర్ట్స్అండ్ సైన్స్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ ఎటిబిటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
వ్యవసాయాన్ని పండుగ చేశాం
● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు భూపాలపల్లి: వ్యవసాయాన్ని పండుగ చేసి అన్నదాతలకు అండగా నిలుస్తున్నామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. శనివారం ఐడీఓసీ కార్యాలయ సమావేశపు హాలులో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యనారాయణరావు మాట్లాడుతూ.. జిల్లాలో 30వేల ఎకరాలకు భూమి హక్కులు లేక రైతుల ఇబ్బందులు పడుతున్నారని, సర్వే నిర్వహించి అర్హులైన ప్రతీ ఒక్కరికి భూ హక్కు పట్టాలిస్తామని తెలిపారు. సాదాబైనామా భూములకు కూడా పట్టాలు ఇస్తామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచాలని సూచించారు. కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం జిల్లాలో దిగ్విజయంగా జరుగుతుందని తెలిపారు. నేతన్న భద్రత బీమా కింద ఇద్దరికి రూ.10 లక్షల విలువైన చెక్కులు పంపిణీ చేశారు. దత్తత సహాయ కేంద్రం హెల్ప్‌డెస్క్ ప్రారంభించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఏఎస్పీ నరేష్కుమార్, ఆర్డీఓ హరికృష్ణ, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, భూపాలపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ కిష్టయ్య, జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు. -
పూర్తయ్యేదెప్పుడో?
● జిల్లా కేంద్రంలో తీవ్రమవుతున్న ట్రాఫిక్ సమస్య ● ఇష్టారాజ్యంగా పార్కింగ్ స్థలాలు, వాకింగ్ పాత్‌లు కబ్జా ● ఇబ్బందుల్లో పాదాచారులు, వాహనదారులు భూపాలపల్లి: రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న జిల్లా కేంద్రంలో రహదారుల విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. జంక్షన్ల అభివృద్ధి ఊసే లేకపోవడంతో ట్రాఫిక్ సమస్య తీవ్రతరం అవుతుంది. వ్యాపారులు రహదారులను సైతం కబ్జా చేస్తుండటంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డంతా మాదే.. పట్టణంలోని జాతీయ రహదారిలో ఉన్న వ్యాపారులు కబ్జాలకు పాల్పడుతుండటంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పట్టణంలోని హనుమాన్ దేవాలయం నుంచి జయశంకర్ చౌరస్తా వరకు ఉన్న షాపులకు చెందిన పలువురు యజమానులు తమ సామగ్రిని పార్కింగ్ స్థలాలు, ఫుట్‌పాత్‌లపై ఉంచి ప్రదర్శిస్తున్నారు. దీంతో ద్విచక్ర వాహనాలు సైతం పార్కింగ్ చేయలేని పరిస్థితి నెలకొంటుంది. మహిళలు, చిన్నారులు నడిచేందుకు స్థలం లేక జాతీయ రహదారిపై నడుస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. రోడ్డు పొడవునా ఇదే పరిస్థితి నెలకొని ఉన్నా మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నత్తనడకన సాగుతున్న పనులు భూపాలపల్లి పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా నుంచి సుభాష్‌కాలనీ రామాలయం వరకు బీటీ రోడ్డు, సెంట్రల్ లైటింగ్, ఇరువైపులా డ్రెయినేజీ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ పనులకు రూ.3.50 కోట్లు మున్సిపాలిటీ, రూ.4 కోట్లు ఆర్అండ్బీ నిధులు కేటాయించగా పనులు నత్తనడకన సాగుతున్నాయి. సుమారు రెండేళ్ల క్రితం ఈ అభివృద్ధి పనులు ప్రారంభం కాగా ఇప్పటి వరకు కొంతమేరకు మాత్రమే రోడ్డు నిర్మాణం, డ్రెయినేజీ పనులు పూర్తయ్యాయి. దీంతో పట్టణంలోని రెడ్డికాలనీ, ఎల్బీ నగర్, సుభాష్‌కాలనీ, గాంధీనగర్, రాంనగర్ కాలనీతో పాటు విలీన గ్రామాలైన కాశీంపల్లి, గడ్డిగానిపల్లి, సెగ్గంపల్లి, జంగేడు, వేశాలపల్లి తదితర గ్రామాల వైపు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డిగ్రీ కళాశాల ఆవరణ సమీపంలో ప్రతీ గురువారం వారసంత జరుగుతుండటంతో తీవ్ర ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. పలు షాపుల యాజమానుల అభ్యంతరాల మూలంగానే పనులు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. కబ్జాలపై చర్యలు తీసుకుంటాం.. పట్టణంలోని ప్రధాన రహదారి వెంట షాపుల ఎదుట సైడ్ కాలువలు, ఫుట్‌పాత్‌లు, పార్కింగ్ స్థలాలపై వ్యాపారులు ఏర్పాటు చేసిన సామగ్రిని తొలగిస్తాం. వ్యాపారులకు నోటీసులు జారీ చేసి పాదాచారులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటాం. జంక్షన్ల అభివృద్ధికి సంబంధించి టెండరు ప్రక్రియ కొనసాగుతోంది. – ఉదయ్‌కుమార్, భూపాలపల్లి మున్సిపల్ కమిషనర్ నత్తనడకన రహదారుల విస్తరణ పనులుఠాణా వైపు రోడ్డు విస్తరణ ఎప్పుడో.. పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా నుంచి క్రిష్ణాకాలనీ వైపు వెళ్లే రహదారి చాలా ఇరుకుగా ఉంది. ఆ రహదారిలో సింగరేణి జీఎం కార్యాలయం, జిల్లా పోలీసు కార్యాలయం, పోలీస్‌స్టేషన్, అంబేడ్కర్ క్రీడా మైదానం, కేటీకే 6వ గనితో పాటు పలు కాలనీలు ఉన్నాయి. దీంతో ఈ రోడ్డు మీదుగా ప్రతీరోజు వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. రహదారి విస్తరణ, డ్రెయినేజీ నిర్మాణ పనులు చేపడుతామని అధికారులు, ప్రజాప్రతినిధులు అనేకమార్లు ఏళ్ల తరబడి ప్రకటిస్తున్నారు. అయినా పనుల ప్రణాళిక కూడా రూపొందలేదు. దీంతో వాహనదారులు ట్రాఫిక్ సమస్యను ఎదుర్కోవడమే కాక, అటువైపుగా హోటళ్లు, చికెన్ సెంటర్ల యాజమానులు డ్రెయినేజీలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
దళారులకు విక్రయించి మోసపోవద్దు
మల్హర్: ఽరైతులు ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దని.. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలోనే విక్రయించి మద్దతు ధర పొందాలని జిల్లా సహకార అధికారి వాల్యనాయక్ అన్నారు. కాటారం మండలంలోని కాటారం, కొత్తపల్లి శంకరంపల్లి, ధన్వాడ సెంటర్లను కాటారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పంతకాని తిరుమల, సర్పంచ్‌లతో కలిసి వాల్యనాయక్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీఓ మాట్లాడుతూ.. చివరి గింజ వరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు. రైతులకు సెంటర్ల వద్ద మౌలిక వసతుల కల్పనతో పాటు నగదు జమ అయ్యేవరకు సంబంధిత వ్యవసాయ అధికార యంత్రాంగం పూర్తి బాధ్యత తీసుకుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పీఏసీఎస్ ప్రత్యేక అధికారి రాజు, సీఈఓ ఎడ్ల సతీష్ సర్పంచ్‌లు పంతకాని సడవలి, సర్పంచ్ అజ్మీర కిషన్‌నాయక్, మహేష్‌కుమార్, అరుణస్వామి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు ఘన సన్మానం భూపాలపల్లి అర్బన్: పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన మైనారిటీ గురుకుల పాఠశాల విద్యార్థులను శనివారం గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ రవి అభినందించి సన్మానించారు. ఈ సందర్భంగా సాయి చరణ్ 540, ఎండీ హఫీజ్ 534, ఎస్.హర్షవర్ధన్ 529, సాయి వరుణ్ 508, టి.అభిలాష్ 508, నవాజుద్దీన్ 502 ఉత్తమ ఫలితాలు సాధించగా కోఆర్డినేటర్ రాజశేఖర్, ఉపాధ్యాయ బృందం విద్యార్థులను శాలువాలు, మొమెంటోలతో ఘనంగా సన్మానించారు. 12న తెలంగాణ జనసమితి ప్లీనరీ భూపాలపల్లి రూరల్: ఈనెల 12న హైదరాబాద్ నెక్లెస్ రోడ్ జలవిహార్‌లో నిర్వహించనున్న తెలంగాణ జన సమితి నాలుగో రాష్ట్ర ప్లీనరీని విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రత్నం కిరణ్ పిలుపునిచ్చారు. శనివారం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం రత్నం కిరణ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకు తెలంగాణ జన సమితి నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య, పార్టీ నాయకులు దాసరి జనార్దన్, రాళ్లపల్లి బాపు, నామాల శ్రీనివాస్, కాసర్ల ప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు. మొక్కజొన్న పంట దగ్ధం చిట్యాల: చిట్యాల మండలం తిర్మలాపూర్ గ్రామానికి చెందిన గోపగాని చిన్న వెంకన్న, గోపగాని రవీందర్, ఆరెల్లి కృష్ణమూర్తి, గోపగాని ఆనందం, మేరుగు ప్రభాకర్‌కు చెందిన మొక్కజొన్న పంటలు శనివారం ప్రమాదవశాత్తు కాలిపోయాయి. సుమారు 14 ఎకరాల్లో వేసిన పంట అగ్నికి ఆహుతి అయినట్లు బాధిత రైతులు విలపించారు. 120 పైపులు పూర్తిగా కాలిపోయినట్లు వారు పేర్కొన్నారు. ఈప్రమాదంలో సుమారు రూ.15 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు రైతులు తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నారు. యువకుడి ఆత్మహత్య కాళేశ్వరం: తమ్మెట గుళికలు తిని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మహదేవపూర్‌లో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మహదేవపూర్ గ్రామం నేతకానివాడకు చెందిన చిలుమల శ్రీనివాస్ (35)కు భార్యతో మనస్పర్ధలు ఉన్నాయి. సంవత్సరం క్రితం భార్య పిల్లలతో పుట్టింటికి వెళ్లింది. దీంతో శ్రీనివాస్ మద్యానికి బానిసయ్యాడు. శుక్రవారం అర్ధరాత్రి మద్యం మత్తులో తుమ్మెట గుళికలు తిన్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే మహదేవపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శనివారం ఉదయం మృతిచెందాడు. మృతుడి సోదరుడు రామచంద్రం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఎరువుల భారం..
శనివారం శ్రీ 2 శ్రీ మే శ్రీ 2026● ఈ ఏడాది నాలుగుసార్లు పెంపు ● రైతన్నలపై అదనపు భారంకల్యాణం.. కమనీయం రేగొండ: కోటంచ శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. స్వామి వారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా ప్రతీ నెలలో కోటంచ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కల్యాణం నిర్వహిస్తారు. శుక్రవారం అభిషేకంతో ప్రారంభమై, సుదర్శన నారసింహ హోమం కొనసాగించారు. అనంతరం కల్యాణాన్ని నిర్వహించారు. ఆరగింపుతో కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో అర్చకులు బుచ్చమాచార్యులు, శ్రీనాధచార్యులు, ఆలయ సిబ్బంది శ్రావణ్, సుధాకర్, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తికి సన్మానం భూపాలపల్లి అర్బన్: 23 ఏండ్ల పాటు సుదీర్ఘ సేవలు అందించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీహెచ్ రమేశ్‌బాబు శుక్రవారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా భూపాలపల్లి బార్ అసోసియేషన్, కోర్టు సిబ్బంది ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి పలువురు న్యాయమూర్తులు హాజరై రమేశ్‌బాబు సేవలను, వారి ఆదర్శప్రాయ జీవితాన్ని కొనియాడారు. విశ్రాంత జీవితంలో కూడా సమాజ సేవ కొనసాగించాలని ఆకాంక్షించారు. అనంతరం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జడ్జి సతీమణి అనంతలక్ష్మి, ములుగు ప్రధాన న్యాయమూర్తి ఎస్వీపీ సూర్యచంద్ర, వరంగల్ ప్రధాన న్యాయమూర్తి వీబీ నిర్మల గీతాంబ, వరంగల్ మొదటి అదనపు జిల్లా జడ్జి జె.మైత్రేయి, విశ్రాంత న్యాయమూర్తులు, సీనియర్ సివిల్ జడ్జి టి.కన్హయ్యలాల్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్ఆర్ దిలీప్ కుమార్‌నాయక్, గవర్నమెంట్ ప్లీడర్ బొట్ల సుధాకర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కూనూరు సురేష్‌కుమార్, ప్రధాన కార్యదర్శి ఆకుల రాములు పాల్గొన్నారు. బుద్ధుడి బోధనలు ఆదర్శం మల్హర్(కాటారం): బుద్ధుడి బోధనలు ప్రపంచ మానవాళికి ఆదర్శమని టీపీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్ అన్నారు. గౌతమ బుద్ధుడి జయంతి సందర్భంగా శుక్రవారం మండలంలోని కాటారం గారేపల్లిలోని జై భీమ్ అంబేడ్కర్ కార్యాలయంలో బుద్ధుడు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా పీక కిరణ్ మాట్లాడుతూ.. గౌతమ బుద్ధుడు ధర్మాన్ని సత్యాన్ని న్యాయాన్ని ప్రేమను అందించి ఆచరించి ప్రపంచ మానవాళికి ఆదర్శనీయులయ్యారని చెప్పారు. ప్రతీఒక్కరు బుద్ధుడి బోధనల స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దళిత బంధు సాధన సమితి జిల్లా అధ్యక్షుడు సంపత్ మహారాజు. యువైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపు యాదవ్. కొండన్న. తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి భూపాలపల్లి అర్బన్: ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్‌శర్మకు వినతిపత్రం అందజేసినట్లు జేఏసీ జిల్లా చైర్మన్ బురుగు రవి తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించని పక్షంలో ఈ నెల 5న కలెక్టరేట్ ఎదుట సామూహిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ముందు ఉంచిన నాలుగు కీలక డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు, జిల్లా అధికారులు విజయలక్ష్మి, సుభాకర్‌రెడ్డి, కిరణ్‌కుమార్, సేవానాయక్, తిరుపతి, రామయ్య, శ్రీనివాసులు, దశరథం, సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు. భూపాలపల్లి రూరల్: ఆరుగాలం శ్రమించి పంటలు పండించి అందరి ఆకలి తీర్చే రైతన్నపై ఎరువుల ధరల పిడుగు ఏటా పడుతూనే ఉంది. ఈ ఏడాది కాంప్లెక్స్ ఎరువుల ధరలను ఆయా కంపెనీలు నాలుగు సార్లు పెంచడంతో వచ్చే వానాకాలంలో పంటల సాగు మరింత భారం కానుంది. గత వానాకాలం సీజన్లో బస్తాకు రూ.50.. ఈ యాసంగి సీజన్లో బస్తాకు రూ.50 చొప్పున రెండుసార్లు కలిపి రూ.100 పెంచారు. తాజాగా నాలుగోసారి బస్తాకు రూ.225 నుంచి రూ.300 పెంచడంతో రానున్న సీజన్లో రైతులపై ఎరువుల ధరల పెరుగుదల ప్రభావం పడనుంది. కాంప్లెక్స్ ఎరువులు జిల్లాలో సుమారుగా 96 మెట్రిక్ టన్నులు వినియోగిస్తారని వ్యవసాయ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. రైతులపై భారం.. గ్రామాలలో పశు సంపద తగ్గిపోవడం సేంద్రియ ఎరువులు లేకపోవడంతో పంటలకు పోషకాలను అందించేందుకు రసాయన ఎరువుల వాడకం తప్పనిసరి అవుతుంది. జిల్లాలో వానాకాలం సాధారణ సాగు 2లక్షల ఎకరాలు ఉండగా సుమారుగా 98వేల మంది వరకు రైతులు ఉన్నారు. జిల్లాలో ప్రధానంగా వరి, పత్తి, మిర్చి, జొన్న, ఉద్యాన పంటలను సాగుచేస్తున్నారు. రెండు సీజన్లకు కలిపి లక్షా 40వేల టన్నుల ఎరువులు ఉపయోగించనున్నారు. దీని ప్రకారం రైతులపై కోట్లలో భారం పడనుంది. పెరిగిన ధరలతో రైతులకు కష్టం.. పంటలకు పోషకాలను అందించేందుకు రసాయన ఎరువుల వాడకం తప్పనిసరి అవుతుంది. జిల్లాలో వానాకాలం సాధారణ సాగు రెండు లక్షల ఎకరాలు ఉండగా సుమారుగా 98వేల మంది రైతులు ఉన్నారు. జిల్లాలో ప్రధానంగా వరి, పత్తి, మిర్చి, జొన్న, ఉద్యాన పంటలను సాగుచేస్తున్నారు. ప్రస్తుతం కూరగాయలు, ఇతర పంటలు సాగుచేసే రైతులు కాంప్లెక్స్ ఎరువుల కోసం వెళ్తే పెరిగిన ధరల బస్తాలు మాత్రమే విక్రయిస్తుండటంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. కంపెనీలు డీఏపీ, యూరియా మినహా అన్ని రకాల కాంప్లెక్స్ ఎరువుల ధరలను పెంచడంతో ఈసారి కొనుగోలు చేయలేని పరిస్థితులు నెలకొన్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంపెనీలు కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెంచినట్లు సమాచారం ఉందని ఫర్టిలైజర్ షాపుల యాజమానులు చెబుతున్నారు. ఏటా పెరుగుతున్న కాంప్లెక్స్ ఎరువుల ధరలు రైతులపైనే భారం.. ధరలతో రైతులపై అదనపు భారం పడుతుంది. ఈ ఏడాది ఏకంగా నాలుగు సార్లు ధరలు పెంచారు. ప్రస్తుత పరిస్థితుల్లో వాతావరణ మార్పుల కారణంగా సరైన దిగుబడులు రాక పెట్టుబడులు మీద పడుతున్నాయి. ప్రభుత్వం కంపెనీలతో మాట్లాడి పెంచిన కాంప్లెక్స్ ఎరువుల ధరలు తగ్గించేందుకు కృషిచేయాలి. ధరలు అందుబాటులో ఉండేలా చొరవ చూపాలి. – రాపాల రాజయ్య , రైతు, కొత్తపల్లి (ఎస్ఎం), భూపాలపల్లి మద్దతు ధర పెంచాలి..ఎరువులు తయారు చేసే కంపెనీలు ఏదో సాకుతో ఇష్టానుసారంగా ధరలు పెంచుతూ రైతుల నడ్డి విరుస్తున్నాయి. కానీ రైతులు పండించిన పంటకు మాత్రం ధర అడిగే హక్కు లేదా? కంపెనీల జోలికి వెళ్లని ప్రభుత్వం రైతులపై ప్రతాపం చూపి వారు నిర్ణయించిన ధరలకే పంటను అమ్మి నిలువునా మోసపోతున్నాం. రైతులు పండించిన ధాన్యానికి కూడా మద్దతు ధర పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – ఎలవేని నర్సయ్య , రైతు, టేకుమట్లఘనంగా మేడే మేడే వేడుకలను జిల్లావ్యాప్తంగా శుక్రవారం కార్మికులు ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలో సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, ఐఎఫ్టీయూ, సీపీఐ, సీపీఎం, తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏరియాలోని యూనియన్ కార్యాలయాలు, బొగ్గు గనులు, ప్రధాన కూడళ్ల వద్ద సంఘాల నాయకులు జెండాలు ఎగరవేశారు. – భూపాలపల్లి అర్బన్ఎరువు పాత కొత్త పెంపు (50కిలోలు బస్తా) ధర ధర19–19–19 2.075 2,300 225 20–20–13 1,500 1,800 300 14–35–14 2,175 2,250 75 12–32–15 2.025 2,250 225 పొటాష్ 1.850 1.975 125 16–16–16 1,675 2,050 375 24–24–0 2,000 2,300 300 10–23–26 1,950 2,025 75 15–15–15–09 1,650 1,950 300 14–35–14 2,150 2,350 200 16–20–13 1,400 1,750 350 రేపు మధ్యాహ్నం 2నుంచి 5 గంటల వరకు నిర్వహణ ఉమ్మడి వరంగల్ జిల్లాలో 14 పరీక్ష కేంద్రాలు ఉదయం 11గంటల నుంచే సెంటర్లలోకి అనుమతి మధ్యాహ్నం 1–30గంటల తరువాత నో ఎంట్రీ హాజరుకానున్న 6,016మంది అభ్యర్థులు -
హేమాచలుడి తిరుకల్యాణం
● భారీగా తరలివచ్చిన భక్తులు ● పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి సీతక్క మంగపేట: రెండో యాదగిరి గుట్టగా ప్రసిద్ధి గాంచిన మల్లూరు శ్రీ హేమాచలక్షేత్రంలో లక్ష్మీనర్సింహాస్వామి వారి తిరుకల్యాణ మహోత్సవం శుక్రవారం వైభవంగా జరిగింది. ఆలయ కార్యనిర్వాహణ ఇన్చార్జ్ అధికారి ఎం.వీరస్వామి, చీఫ్ పెస్టివల్ ఆఫీసర్ శ్రావణం సత్యనారాయణ పర్యవేక్షణలో లక్ష్మీనర్సింహాస్వామి ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల కల్యాణ మహోత్సవాన్ని భద్రాచలం సీతారామ చంద్రస్వామి దేవస్థానం ఉప ప్రధానార్చకుడు అమరవాది మురళీ కృష్ణమాచార్యుల బృందం వేద మంత్రోశ్ఛరణ నడుమ శాస్త్రోక్తంగా జరిపించారు. ఉదయం 8 నుంచి 9.30 గంటల వరకు ప్రధానాలయంలోని స్వయంభు స్వామివారిని నూతన వస్త్రాలంకరణ చేసి నిత్యారాదన, తిరు కల్యాణ మహోత్సవాన్ని జరిపించారు. సుమారు రెండు గంటల పాటు స్వామివారి కల్యాణ మహోత్సవ క్రతువును నిర్వహించారు. 12.30 గంటలకు స్వామివారి కల్యాణ మహోత్సవం శాస్త్రోక్తంగా జరిపించారు. పట్టువస్త్రాలు అందించిన మంత్రి సీతక్క హేమాచల లక్ష్మీనర్సింహాస్వామి తిరుకల్యాణ మహోత్సవానికి మంత్రి ధనసరి సీతక్క, ములుగు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్‌తో కలిసి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను అందించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున ఆలయ ఈఓ వీరస్వామి, ఉత్సవకమిటీ చైర్మన్ యరంగారి సురేష్, పట్టు వస్త్రాలు, తలంబ్రాలను సమర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ దంపతులు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, ములుగు ఆర్డీఓ వెంకటేష్, ఏటూరునాగారం ఏఎస్పీ మనన్‌బట్, టీఎస్ ఈజీసీ డైరెక్టర్ గుమ్మడి సోమయ్య, ఆలయ పూజారులు ముక్కామల శేఖర్ శర్మ, కారంపుడి పవన్‌కుమార్, బ్రహ్మోత్సవాల యాగ్నికులు అనిపెదిద రాజీవ్‌శర్మ, ఏడునూతుల ఈశ్వర్‌చంద్ రామానుజం, సీతారాములు, గోనె లక్ష్మినారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. ఆలయాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తాం.. 2027లో జరిగే స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం నాటికి ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని మంత్రి ధనసరి సీతక్క తెలిపారు. 2027లో జాతరతో పాటు, గోదావరి పుష్కరాల నిర్వహణ ఉండటంతో పెద్దఎత్తున నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరామని, ఆయా నిధులతో రోడ్లు, పుష్కరఘాట్ల అభివృద్ధితో పాటు నూతనంగా గ్రానైట్‌తో శాశ్వత నిర్మాణం పనులు చేపట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటా మన్నారు. జాతరకు ఆర్టీసీ బస్సులు అవసరమైన మేరకు ఏర్పాటు చేయకపోవడంతో భక్తులు ఎర్రటి ఎండలో పార్కింగ్ స్థలాల నుంచి గుట్టపైకి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఏటూరునాగారం సీఐ శ్రీనివాస్ ఎస్సై టీవీఆర్ సూరీ విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో అదనపు బస్సులను ఏర్పాటు చేశారు. శ్రీచక్రానికి అవమానం హేమాచల క్షేత్రంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాల సాక్షిగా హిందూ తంత్రశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన శ్రీ చక్రం యంత్ర శిలకు అవమానం జరిగిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంవత్సరం క్రితం ఆలయంలో ప్రతిష్ఠించేందుకు తీసుకువచ్చిన చక్రాన్ని ఆలయ అధికారులు ప్రాంగణంలోని ఆర్చీ పక్కన పడేశారు. దాని పవిత్రతను తెలియని కొందరు అక్కడే పాదరక్షలు వదిలారు. ఇది చూసిన ఆంజనేయస్వామి భక్తులు అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
‘నీట్’కు పకడ్బందీ ఏర్పాట్లు
కేయూ క్యాంపస్: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకుగాను దేశవ్యాప్తంగా ఈ నెల 3న నిర్వహించనున్న నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్టు (నీట్)– 2026కు ఉమ్మడి జిల్లాలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తంగా 14 కేంద్రాల్లో కలిపి 6,016మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహించనున్నారు. అభ్యర్థులను ఉదయం 11గంటల నుంచే సెంటర్లోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం 1–30గంటలకు మెయిన్ గేట్లను మూసివేస్తారు. ఆ తరువాత వచ్చేవారికి అనుమతించబోరు. దివ్యాంగ అభ్యర్థులకు పరీక్ష రాసేందుకు అదనంగా గంట సమయం ఇస్తారు. ఆయా అభ్యర్థులకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్ష ఉంటుంది. హనుమకొండ, వరంగల్‌లోని పరీక్ష కేంద్రాల్లో ఐదుగురు స్క్రైబర్స్‌ను కూడా అందుబాటులో ఉంచుతున్నట్లు రెండు జిల్లాల నీట్ నోడల్ ఆఫీసర్ భిక్షపతి తెలిపారు. నిబంధనలు కఠినం.. ● అభ్యర్థులు అడ్మిట్ కార్డుతోపాటు రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, 4x6 సైజ్ ఫొటో ఒకటి, ఏదైనా గుర్తింపుకార్డు వెంట తీసుకుని రావాలి. ● పన్ను, పెన్సిల్ తీసుకురావొద్దు. వీటిని పరీక్ష కేంద్రాల్లోనే అందజేస్తారు. ● బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకుంటారు. ● ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, వాచ్‌లు తీసుకురావొద్దు, ● మహిళలు బంగారు నగలు పెట్టుకొని రాకూడదు. ఒకవేళ పెట్టుకుని వస్తే కేంద్రం వద్ద తీసివేయిస్తారు. ● కాళ్లకు షూస్ ధరించకూడదు. జీన్స్లాంటివి గాకుండా సాధారణ దుస్తులు ధరించి రావాలి. ● పారదర్శకంగా ఉండే వాటర్ బాటిల్స్‌ను తీసుకురావచ్చు. ● డయాబెటిక్ కలిగిన అభ్యర్థులుంటే వారు పండ్లు (అరటి, యాపిల్) తీసుకొని రావచ్చు. ● ప్రతి గదిలో, మెయిన్ గేట్‌వద్ద అందరికీ కనిపించేలా గడియారాలు ఏర్పాటు చేస్తారు. ఉమ్మడి జిల్లాలో పరీక్షకేంద్రాలు ఇలా.. ● వరంగల్ నిట్‌లో రెండు సెంటర్లు, హనుమకొండ కాకతీయ ప్రభుత్వ డిగ్రీకళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల (కో ఎడ్యుకేషన్), వరంగల్‌లో సీకేఎం కళాశాల, ఎల్బీ కళాశాల, కేంద్రీయ విద్యాలయం, యూనివర్సిటీ ఆర్ట్స్అండ్ సైన్స్ కళాశాల, యూనివర్సిటీ పీజీ కళాశాల ● జయశంకర్ భూపాలపల్లిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల (ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో), ప్రభుత్వ జూనియర్ కళాశాల ● జనగామ జిల్లా కేంద్రంలోని ఏవీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పెంబర్తిలోని మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల విద్యాలయం ● మహబూబాబాద్ జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోగల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల ● మహబూబాబాద్‌లో నీట్ నోడల్ ఆఫీసర్‌గా కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్ ముఖేశ్‌కుమార్ వ్యవహరించనున్నారు.జిల్లా సెంటర్లు అభ్యర్థులుహనుమకొండ, వరంగల్ 09 4,600 జయశంకర్ భూపాలపల్లి 02 374 జనగామ 02 566 మహబూబాబాద్ 01 476నిబంధనలు అమలు.. ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ భూపాలపల్లి: నీట్ నిర్వహణ సందర్భంగా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ నెల 3వ తేదీన(రేపు) జరుగనున్న నీట్ సందర్భంగా 163 బీఎన్ఎస్ఎస్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. పరీక్ష రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఈ నిబంధనలు అమల్లో ఉంటాయన్నారు. పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో ఐదుగురికి మించి గుంపులుగా నిలవడం నిషేధమని, సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు, ప్రచారాలు నిర్వహించరాదన్నారు. మైకులు, డీజేలు వినియోగించడం పూర్తిగా నిషేధమని, పరీక్ష సమయంలో ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ సెంటర్లు, స్టేషనరీ దుకాణాలు మూసివేయాలన్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వాచీలు తదితర ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావద్దని సూచించారు. జిల్లా కేంద్రంలోని రెండు పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు చర్యలు చేపడుతామని ఎస్పీ సంకీర్త్ అన్నారు. -
ఇబ్బందులు లేకుండా మొక్కజొన్న కొనుగోళ్లు
● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ● స్వీయ జనగణనలో ప్రతీ ఒక్కరు పాల్గొనాలి ● కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి: రైతులకు ఇబ్బందులు కలగకుండా మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధికారులకు సూచించారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో మార్క్‌ఫెడ్, మార్కెటింగ్, రవాణా, సహకార, పౌర సరఫరాలు, సంస్థ, వ్యవసాయ తదితర శాఖల అధికారులతో మొక్కజొన్న కొనుగోలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జిల్లాలో సుమారు 49,175 హెక్టార్లలో మొక్కజొన్న సాగు జరగగా.. ఇప్పటివరకు 3,274 క్వింటాళ్ల మొక్కజొన్న కొనుగోలు చేసినట్లు చెప్పారు. జిల్లాలో ఏర్పాటు చేసిన ఏడు కొనుగోలు కేంద్రాల్లో గోదాం, హమాలీ, రవాణా సమస్యలు రాకుండా చూసుకోవాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. స్వీయ జనగణనలో పాల్గొనాలి.. స్వీయ జనగణనలో ప్రతీ ఒక్కరు నమోదు చేసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. జిల్లాలో ఏప్రిల్ 26వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు జరుగనున్న స్వీయ జనగణన కార్యక్రమంపై శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, సీపీఓ జవహర్, ఆర్డీఓ హరిక్రిష్ణ, అధికారులు పాల్గొన్నారు. సమావేశానికి ఏర్పాట్లు చేయాలి.. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించనున్న నియోజకవర్గ స్థాయి సమావేశానికి అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంపై శుక్రవారం ఐడీఓసీ సమావేశం నిర్వహించారు. ఫార్మర్స్ వీక్ కార్యక్రమం విజయవంతం చేయాలి.. ఫార్మర్స్ వీక్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్‌రెడ్డి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావుతో కలిసి శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వంచారు. ఈ కాన్ఫరెన్స్‌కు జిల్లా నుంచి కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించాలి
మల్హర్(కాటారం): ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని ఈజీస్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ దండు రమేష్, కాటారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పంతకాని తిరుమల, రేగులాగూడెం సర్పంచ్ ఆమని సురేష్ అన్నారు. గురువారం మండలంలోని రేగులగూడెంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రైతాంగ సంక్షేమ అభివృద్ధికి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని పేర్కొన్నారు. రైతులకు రుణమాఫీతో పాటు సన్న వడ్లకు బోనస్, రైతు భరోసా, సబ్సిడీ యంత్రాల పంపిణీతో రైతును రాజు చేయాలనే ప్రధాన సంకల్పంతో ప్రజాపాలన ప్రభుత్వం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ పిల్లమరి రమేష్, పీఏసీఎస్ ప్రత్యేక అధికారి రాజు, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు ఆంగోతి సుగుణ, డీసీసీ జనరల్ సెక్రెటరీ కుంభ స్వప్నరెడ్డి, అధికార ప్రతినిధి పంత కాని సమ్మయ్య, నియోజకవర్గ యూత్ అధ్యక్షులు చీమల సందీప్ పాల్గొన్నారు. -
విద్యుత్ వినియోగం.. ప్రమాద రహితం!
● నేటి నుంచి విద్యుత్ భద్రతా వారోత్సవాలు హన్మకొండ: విద్యుత్ వినియోగంలో భద్రతపై అవగాహన పెంపొందించేందుకు మే 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు టీజీ ఎన్పీడీసీఎల్ పరిధి 18 సర్కిళ్లలో విద్యుత్ భద్రత వారోత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్‌రెడ్డి తెలిపారు. విద్యుత్ వారోత్సవాలను పురస్కరించుకుని ఆయన మాట్లాడుతూ.. 18 సర్కిళ్లకు నియమించిన నోడల్ అధికారులు వినియోగదారులకు, రైతులకు విద్యుత్ భద్రతపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతీ అధికారి క్షేత్ర స్థాయిలో పర్యటించి, సమావేశాలు నిర్వహించి విద్యుత్ భద్రతపై పూర్తిస్థాయి అవగాహన కల్పించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్ ప్రమాదాలను జీరో స్థాయికి తీసుకురావడమే ఈ కార్యక్రమాల ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. విద్యుత్ వినియోగంలో నిర్లక్ష్యం, అజాగ్రత్త, అలసత్వం కారణంగా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, వీటి నివారణకు స్వీయ నియంత్రణ ముఖ్యమని స్పష్టం చేశారు. ప్రధాన కారణాలివే.. ● నిర్లక్ష్యంగా విద్యుత్ పరికరాల వినియోగం, పాడైన, నాసిరకం, అతుకుల వైర్ల వినియోగం, ఎర్తింగ్ లేకపోవడం, తడిసిన చేతులతో విద్యుత్ పరికరాలను ముట్టుకోవడం. ● తెగిన విద్యుత్ తీగలను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకొద్దు. వెంటనే అధికారులకు సమాచారమివ్వాలి. ● తడి చేతులతో స్విచ్‌లు, పరికరాలు ఆపరేట్ చేయవద్దు. గృహాల్లో, వ్యవసాయ క్షేత్రాల్లో సరైన ఎర్తింగ్ వ్యవస్థ ఉండాలి. ● మీటర్లు, సర్వీస్ వైర్లు, స్విచ్ బోర్డులు మధ్యమధ్యలో తనిఖీ చేయించుకోవాలి. ● చిన్నపిల్లలను విద్యుత్ పరికరాలకు దూరంగా ఉంచాలి. విద్యుత్ భద్రతపై అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నాం. గ్రామాలు, పట్టణాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం. వాల్‌పోస్టర్లు, కరపత్రాల పంపిణీ ద్వారా ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నాం. విద్యుత్ శాఖ సిబ్బంది ప్రత్యేక డ్రైవ్ చేపట్టి ప్రమాదకర లైన్లు, వంగిన విద్యుత్ స్తంభాలు, పాత వైర్లను గుర్తించి వెంటనే మరమ్మతులు చేపడుతున్నాం. ప్రజలు జాగ్రత్తలు పాటించి, ఎలాంటి ప్రమాద సూచనలు గమనించిన వెంటనే విద్యుత్ శాఖకు సమాచారం ఇవ్వాలి. 24/7 పనిచేసే 1912 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి విద్యుత్ సమస్యలు పరిష్కరించుకోవాలి. – కర్నాటి వరుణ్ రెడ్డి, టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ మోటార్ స్టార్టర్ల వద్ద ఇన్సులేషన్ సరిగ్గా ఉండాలి. తడి నేలపై నిలబడి స్విచ్ ఆన్ చేయొద్దు. విద్యుత్ లైన్లకు సమీపంలో నీటి పైపులు, లోహ పరికరాలు ఉపయోగించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. -
గ్రాడ్యుయేషన్.. కొత్త భవిష్యత్‌కు నాంది
కాశిబుగ్గ: గ్రాడ్యుయేషన్ అనేది విద్యార్థుల ప్రయాణానికి ముగింపు కాదని, నూతన భవిష్యత్‌కు ఆరంభమని కాళోజీ యూనివర్సీటీ వైఎస్ ఛాన్స్లర్ డాక్టర్ రమే్శ్రెడ్డి అన్నారు. గురువారం రాత్రి హనుమకొండలోని కాకతీయ వైద్య కళాశాలలో 2020 బ్యాచ్‌కు చెందిన వైద్య విద్యార్థులు ఎంబీబీఎస్ కోర్సును విజయవంతంగా ముగించుకున్న సందర్భంగా కేఎంసీ మైదానంలో 62వ గ్రాడ్యుయేషన్ వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ రమేశ్‌రెడ్డి మాట్లాడుతూ రానున్న కాలంలో ఇంటెలిజెన్స్ (ఏఐ) వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుందని, వచ్చే ఐదేళ్లలో వ్యాధుల నిర్వహణ పూర్తిగా మారిపోతుందని తెలిపారు. ప్రతి వైద్యుడు నైతిక విలువలు. శాసీ్త్రయ ఆధారాలతో కూడిన వైద్య సేవలు అందించాలని సూచించారు. కేఎంసీ పూర్వ విద్యార్థిగా తాను ఎంతగానో గర్వపడుతున్నానని అంటూ ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుంకరనేని సంధ్య మాట్లాడుతూ కేఎంసీ వంటి పేరొందిన కళాశాల నుంచి తాను కూడా గ్రాడ్యుయేట్ కావడం ఎంతో గర్వంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ హరిశ్చంద్రారెడ్డి, డాక్టర్ రాంకుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భావోద్వేగానికి గురైన విద్యార్థుల తల్లిదండ్రులు ఈ సందర్భంగా 250 మంది వైద్య విద్యార్థులు పట్టాలు అందుకున్నారు. ఆ సమయంలో తల్లి దండ్రులు భావోద్వేగానికి గురయ్యారు. తెల్ల కోటు ధరించి వేదికపై పట్టాలు అందుకుంటున్న తమ పిల్లలను చూసి చప్పట్లు, కేరింతలతో తల్లిదండ్రులు ఆనందంలో మునిగారు. తమ పిల్లలు వైద్యులుగా ఎదిగి సమాజానికి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారని సంతోషపడ్డారు. కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ రమేశ్‌రెడ్డి కేఎంసీలో ఘనంగా గ్రాడ్యుయేషన్ వేడుకలు పట్టాలు అందుకున్న 2020 బ్యాచ్ వైద్య విద్యార్థులు -
మళ్లీ పుష్కర శోభ
21నుంచి సరస్వతీనది అంత్యపుష్కరాలుకాళేశ్వరం: కాళేశ్వరంలో ఆధ్యాత్మిక కాంతులతో మళ్లీ వెలుగులు విరజిమ్మనున్నాయి. సరస్వతీనది అంత్యపుష్కరాలు ఈనెల 21 నుంచి జూన్ 1 వరకు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. సుమారుగా 30లక్షల మంది భక్తులు వస్తారని ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. కంచి పీఠాధిపతి, గవర్నర్ ప్రతాప్శుక్లా, సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభపూజల్లో పాల్గొననున్నారని సమాచారం. దీంతో 12 రోజుల పాటు ఆధ్యాత్మిక శోభ నెలకొననుంది. సమన్వయంతో పనిచేస్తున్న శాఖలు రాష్ట్ర ప్రభుత్వం రూ.21.38 కోట్ల విడుదల చేయగా.. అధికార యంత్రాంగం తాత్కాలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లతో బిజీగా ఉంది. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. భక్తులకు తాగునీరు, వైద్యశిబిరాలు, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ నియంత్రణ వంటి ఏర్పాట్లు విస్తృతంగా చేపడుతున్నారు. ప్రస్తుతం రూ.1.20కోట్ల వ్యయంతో మ్యూజియం, వీఐపీఘాటు వద్ద ప్లాట్‌ఫామ్ పనులు, రూ.2కోట్ల వ్యయంతో నల్లగొండ పోచమ్మ గుడి నుంచి వీఐపీఘాటు వరకు రోడ్డు పనులు, ఆదిముక్తీశ్వరాలయం వద్ద సీసీ రోడ్డు, వీఐపీ ఘాటు నుంచి మెయిన్ ఘాటు వరకు రోడ్డు నిర్మాణం పనులు చేపట్టారు. 12 రోజులు హారతి కార్యక్రమాలు.. గతేడాది జరిగిన సరస్వతి ఆదిపుష్కరాల్లో నిర్వహించిన కాశీపండితులతో మళ్లీ అంత్య పుష్కరాలకు గోదావరివద్ద హారతి కార్యక్రమం నిర్వహించనున్నారు. 12 రోజుల పాటు ఎనిమిది మంది బృందంతో హారతి శోభతో వెలిగిపోనుంది. వారి రాక కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 12 రోజుల పాటు ఆలయంలో హోమాలు ప్రత్యేకంగా చేపడుతున్నారు. 12 రోజుల పాటు రుద్రాభిషేకం పూజలు నిర్వహిస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పీఠాధిపతులు.. ఆది పుష్కరాల మాదిరిగానే అంత్యపుష్కరాలకు పలువురు పీఠాధిపతులు రానున్నారు. గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిణి సరస్వతీనదిలో పుణ్యస్నానాలు చేసి శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడిని దర్శించుకుంటారు. వారి రాకకోసం దేవాదాయశాఖ ఏర్పాట్లు చేపట్టింది. 12 రోజుల పాటు రాష్ట్రంలోని మంత్రులు, ఎంపీలు, ఉన్నతాధికారులు పుణ్యస్నానాలు చేయనున్నారు. ఆలయంలో దర్శనాలు చేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు.. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు గోదావరి నదికి పుష్కరాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కాళేశ్వరంలో గొప్పగా నిర్వహించడానికి ఇప్పటికే రూ.198 కోట్ల వ్యయంతో రాతి కట్టడాలు నిర్మాణం చేయడానికి సీఎం రేవంత్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఇవి కాకుండా పుష్కరాలకు మరిన్ని నిధులు రానున్నాయి. దీంతో మరోమారు వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలకు వేదిక కానుంది. రూ.21.38కోట్ల నిధులు మంజూరు.. పనులు చేపట్టిన ప్రభుత్వం 12 రోజులు హారతి, హోమాలు, పీఠాధిపతుల రాక ఏర్పాట్లలో నిమగ్నమైన అధికార యంత్రాంగం లక్షలాదిగా తరలి రానున్న భక్తులురాష్ట్ర దేవాదాయశాఖ అధికారులతో పాటు స్థానిక అధికారులు ఏర్పాట్లు చేపట్టడంలో నిమగ్నమయ్యారు. బుధవారం మంత్రులు కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ అంత్యపుష్కరాల వాల్‌పోస్టర్, టీజర్ వీడియోను ఆవిష్కరించారు. దీంతో విస్తృతంగా పబ్లిసిటీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వీవీఐపీల కోసం హెలిప్యాడ్ సిద్ధం చేస్తున్నారు. 100 ఎకరాల్లో ట్రాఫిక్ నియంత్రణకు అంతర్రాష్ట్ర వంతెన, వీఐపీ ఘాటు సమీపం, ఎస్సీకాలనీ వద్ద పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేస్తున్నారు. సరస్వతీమాత విగ్రహం వద్ద డెకరేషన్ ఏర్పాట్లు చేపట్టనున్నారు. -
పోచమ్మ తల్లికి బోనాలు
భూపాలపల్లి: పట్టణంలోని సుభాష్‌కాలనీ పోచమ్మ దేవాలయంలో గురువారం ఘనంగా పూజలు నిర్వహించారు. ఆలయ పునఃప్రతిష్ఠాపన చేసి ఏడాదయిన సందర్భంగా బుధవారం సాయంత్రం అమ్మవారికి అభిషేకం, గురువారం ఉదయం హోమం, పోత లింగన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన చేశారు. సాయంత్రం సుభాష్‌కాలనీ, రాంనగర్ కాలనీ, మిలీనియం క్వార్టర్స్‌కు చెందిన మహిళలు పెద్దఎత్తున పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఆయా కార్యక్రమాల్లో 29, 17వ వార్డుల కౌన్సిలర్లు గండ్ర హరీశ్‌రెడ్డి, బీర్తి కమల, మాజీ జెడ్పీటీసీ లట్ట రాజబాబు, ఆలయ కమిటీ సభ్యులు రాజమౌళి, చిట్టిబాబు, ప్రసాద్, రాజేందర్ పాల్గొన్నారు. -
పోలీసు సిబ్బందికి ఆత్మీయ వీడ్కోలు
భూపాలపల్లి: ఏఆర్ ఎస్ఐ అల్లం వేణుగోపాల్, జిల్లా పోలీసు కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ బందెల కిష్టయ్యలను గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్, కిష్టయ్యలను అడిషనల్ ఎస్పీ నరేష్కుమార్ పూలమాల, శాలువాలతో సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ పోలీస్ శాఖలో 36 సంవత్సరాల పాటు నిబద్ధతతో, క్రమశిక్షణతో సేవలు అందించడం ప్రశంసనీయమని కొనియాడారు. వారి సేవలు శాఖకు ఆదర్శప్రాయమని తెలిపారు. పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆనందంగా, ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవితం గడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్ ఆర్ఐ రత్నం, ఎంటీఓ ఆర్ఐ పూర్ణచందర్, వెల్ఫేర్ ఆర్ఐ సంతోష్‌కుమార్, డీపీఓ ఏఓ ఫర్హాన, కుటుంబ సభ్యులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
శోభాయమానం.. పుష్పయాగం
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో శ్రీభద్రకాళిభద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాల్లో చివరిరోజు గురువారం ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి మూలమూర్తిని పూలమాలలతో శోభాయమానంగా అలంకరించారు. చూర్ణోత్సవం జరిపి చక్రతీర్థోత్సవం నిర్వహించి తిరిగి చక్రాన్ని అమ్మవారి సన్నిధికి చేర్చారు. అనంతరం పూర్ణాహుతి, బలిహరణ, ధ్వజావరోహణంతో ఉత్సవాలు సమాప్తం చేశారు. అమ్మవారికి పుష్పయాగం అమ్మవారికి శతఘటాభిషేకం జరిపి రాత్రి స్నపనమందిరంలో అమ్మవారికి వేదపండితులు మంత్రోచ్ఛరణ చేస్తుండగా రంగురంగుల గులాబీలు, మల్లెలు, లిల్లీలు, విరజాజులు, బంతులు, చామంతులు, కనకాంబరాలు తదితరపూలతో ఘనంగా పుష్పయాగం నిర్వహించారు. పుష్పయాగం నిర్వహించడం వల్ల బ్రహ్మోత్సవాల్లో జరిగిన దోషాలు తొలగిపోతాయని భద్రకాళి శేషు తెలిపారు. -
ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు
● సింగరేణి ఏరియా జీఎం రాజేశ్వర్‌రెడ్డి భూపాలపల్లి అర్బన్: ఏరియాలో ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం జనరల్ మేనేజర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన సేఫ్టీ రివ్యూ సమావేశంలో జీఎం పాల్గొని మాట్లాడారు. డైరెక్టర్ కోల్ మైన్స్ రెగ్యులేషన్స్–2026లో జరిగిన కీలక మార్పులు, ఈ ఏడాది భూపాలపల్లి ఏరియాలో నమోదైన ప్రమాదాలు, వాటి కారణాలు, నివారణ చర్యలపై సమావేశంలో సమగ్రంగా చర్చించారు. ఏరియా సేఫ్టీ ఆఫీసర్ మాటూరి రవీందర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అన్ని గనుల అధికారులు, ప్రాజెక్ట్ అధికారులు, ఇంజనీర్లు పాల్గొన్నారు. అనంతరం జీఎం మాట్లాడుతూ గత సమావేశ నిర్ణయాల అమలు స్థితిని సమీక్షించిన అధికారులు, కొత్తగా తీసుకొచ్చిన సేఫ్టీ సవరణలు గనుల భద్రతను మరింత బలోపేతం చేయడమే లక్ష్యమన్నారు. భద్రతా ప్రమాణాల అమలు విధానం, ఫీల్డ్ స్థాయిలో ఎదురయ్యే సవాళ్లపై విస్తృతంగా చర్చించారు. గతంలో జరిగిన ప్రమాదాలపై విశ్లేషణ చేస్తూ, మానవ తప్పిదాలు, యంత్రాంగ లోపాలు, భద్రతా నిబంధనల నిర్లక్ష్యం తదితర ప్రధాన కారణాలను గుర్తించారు. భవిష్యత్‌లో ప్రమాదాలు నివారించేందుకు సేఫ్టీ అవగాహన కార్యక్రమాలు, కార్మికులకు నిరంతర శిక్షణ, ఆధునిక సాంకేతికత వినియోగం వంటి చర్యలు చేపట్టాలన్నారు. భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని, ప్రతీ ఉద్యోగి నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు. సంస్థలో సేఫ్టీ సంస్కృతి బలపడాలని, జీరో ప్రమాద లక్ష్యంతో ముందుకు సాగాలని సూచించారు. ఈ సమావేశంలో ఓసీ త్రీ ప్రాజెక్ట్ ఆఫీసర్ భిక్షమయ్య, గనుల మేనేజర్లు, సేఫ్టీ ఆఫీసర్లు, ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు. -
సైబర్ క్రైమ్‌పై విద్యార్థులకు అవగాహన
మొగుళ్లపల్లి : మండలంలోని వివిధ గ్రామాల బాలికలకు ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం సైబర్ క్రైమ్, సోషల్ మీడియా వినియోగంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి జి.మల్లేశ్వరి హాజరై మాట్లాడారు. నేటి బాలలే రేపటి పౌరులన్నారు. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుని స్కిల్ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి అంశాలను అభ్యసించాలని, తల్లిదండ్రులకు, గ్రామానికి గర్వకారణంగా నిలిచేలా మంచి భవిష్యత్ నిర్మించుకోవాలని సూచించారు. అనంతరం వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సునీత, ఎంపీడీఓ సురేందర్, ఎస్సై సురేష్, ఏపీఎం రమాదేవి, మెడికల్ ఆఫీసర్ నవత, చైల్డ్ హెల్ప్‌లైన్ కోఆర్డి నేటర్ గుర్రం తిరుపతి, సఖి కౌన్సిల ర్ మాధవి, అనూష, మమత, కళావ తి, అంగన్వాడీ సూపర్వైజర్లు, టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు. -
బాల్య వివాహాల నిర్మూలనకు పాటుపడాలి
ఏటూరునాగారం: బాలల హక్కుల పరిరక్షణలో భాగంగా బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతిఒక్కరూ పాటుపడాలని డిప్యూటీ డైరెక్టర్ దబ్బగట్ల జనార్దన్ అన్నారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయం ఆవరణలో బుధవారం బాలల భద్రత, సంరక్షణ, డ్రగ్స్ నిర్మూలన వారోత్సవాల కార్యక్రమాన్ని జిల్లా బాలల పరిరక్షణ విభాగం ప్రొటెక్షన్ అధికారి హరికృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా డీడీ మాట్లాడుతూ పౌరులందరికీ హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయన్నారు. బాల్య వివాహాల నిర్మూలనలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. అనంతరం ఐటీడీఏ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ప్రతాప్ గంటా మాట్లాడుతూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అనేక చోట్ల డబ్బులు పోగొట్టుకుని ఇ బ్బంది పడుతున్న విషయాలు చూస్తున్నామన్నా రు. అలాంటి వాటికి దూరంగా ఉండాలన్నారు. బాలికలు చిన్న చిన్న విషయాలకు ఆకర్షణకు గురవుతుంటారని వివరించారు. తల్లిదండ్రులు వారిపట్ల బాధ్యతగా ప్రేమతో మెలగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఓ రాజ్‌కుమార్, ఎస్ఓ సురేశ్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
హక్కుల సాధనకు ఐక్య పోరాటాలు
భూపాలపల్లి అర్బన్: మేడే పోరాట స్ఫూర్తితో కార్మికుల హక్కుల పరిరక్షణకు ఐక్యంగా ఉద్యమాలు చేపట్టాలని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య పిలుపునిచ్చారు. 140వ మేడే సందర్భంగా బుధవారం స్థానిక యూనియన్ కార్యాలయంలో కరపత్రాల ఆవిష్కరణ చేపట్టారు. ఈ సందర్భంగా గట్టయ్య మాట్లాడుతూ ఓపెన్ టెండర్లను వ్యతిరేకిస్తూ సింగరేణి సంస్థను కాపాడుకోవాలని, నాలుగు లేబర్ కోడ్ల రద్దు కోసం పోరాటాలు మరింత బలపడాలన్నారు. ఉద్యోగ భద్రతకు కార్మిక వర్గం సంఘటితంగా ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. కార్మికులపై లేబర్ కోడ్లు అమలు చేసి పని గంటలను పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు దాసరి జనార్దన్, పిక కిరణ్, కాసర్ల ప్రసాద్‌రెడ్డి, రత్నం కిరణ్, నామాల శ్రీనివాస్, ఐత్య బాబు, రాళ్లబండి బాబు, జయశంకర్, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. ములుగు రూరల్: రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలోనే ధాన్యం విక్రయించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ అన్నారు. మండల పరిధిలోని పాల్సబ్పల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన బుధవారం ప్రారంభించి మాట్లాడారు. రైతులు కొనుగోలు కేంద్రంలోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కౌన్సిలర్లు పద్మదేవ్సింగ్, నల్లెల స్వాతి, భరత్ కుమార్, తిరుపతి రెడ్డి, తదితరలు పాల్గొన్నారు. -
‘షైన్’ విజయకేతనం..
హన్మకొండ : పదో తరగతి పరీక్ష ఫలితాల్లో షైన్ విద్యా సంస్థల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. తమ పాఠశాల విద్యార్థులు ఎ.అక్షర 588 మార్కులు, ఎల్.రేవంత్, ఎండి అఫ్రోజ్ 586, సమీరా నయీం 585, వెలుదండి సీమ, జి.సంహిత, కె.సుమిత్ 584, టి హాసిని, ఎ.ప్రశాంతి, ఎ.సుశాంత్, సీహెచ్.సిరి 583, వి.జాహ్నవి, మార్క శ్రీధన్ 582, ఎ.హరిణి 581, పి.యతిస్, పి.హర్షిత 580 మార్కులు సాధించారని షైన్ విద్యాసంస్థల అధినేత మూగల కుమార్ యాదవ్ వివరించారు. ఐఐటీ ఫౌండేషన్, నీట్‌తోపాటు పదో తరగతి పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతోనే ఈ ఫలితాలు సాధించామన్నారు. ఇటీవల వెలువడిన ఇంటర్ ఫలితాల్లో కూడా రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించారన్నారు. బుధవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పదో తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు, వారి ఉన్నతికి శ్రమించిన అధ్యాపకులను ఈ సందర్భంగా అభినందించారు. కార్యక్రమంలో కరెస్పాడెంట్ మూగల రమ, షైన్ పబ్లిక్ స్కూల్ ఎరగ్రట్టుగుట్ట బ్రాంచ్ సెక్రటరీ జక్కుల శ్రీనివాస్ యాదవ్, ఐఐటీ కోఆర్డినేటర్ మూగల రమేశ్ యాదవ్, ప్రిన్సిపాళ్లు పి.విశాల్, కె.దినేశ్, రాజ్ కుమార్, కవిత, ప్రగతిరెడ్డి, సబిత, మానస, కాలేజీ ప్రిన్సిపాళ్లు రాజుగౌడ్, పి.శ్రీనివాస్, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు. -
‘పది’ ఫలితాల్లో ‘ఎస్ఆర్’ విజయభేరి
విద్యారణ్యపురి: పదో తరగతి పరీక్షల ఫలితాల్లో ఎస్ఆర్ స్కూల్స్ విద్యార్థులు విజయభేరి మోగించారని ఆ విద్యా సంస్థల చైర్మన్ ఎ. వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి బుధవారం తెలి పారు. సి. సంస్కృతారెడ్డి 600 మార్కులకు 589, పిరంజి వంశీ 588, ఎస్.కీర్తన 587, అంకం సౌజన్య 587, ఎ. సంజయ్ 586, టి. వైష్ణవి 585, బాశెట్టి సాయిశ్రీ 584 మార్కులు సాధించారని వారు తెలి పారు. క్రమశిక్షణతో కూడిన విద్యనందిస్తున్నామని, పాఠ్యప్రణాళిక, అంకితభావం కలిగిన ఉపాధ్యాయ బృందం విద్యాబోధన చేశారని వారు పేర్కొన్నారు. తమ విద్యార్థులు పోటీ పరీక్షలను ఎదుర్కొనేలా ఐఐటీ అండ్ మెడికల్ ఫౌండేషన్‌లో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధం చేసేలా బృహత్తర పద్ధతిలో రాష్ట్రవ్యాప్తంగా ప్రైమ్స్కూళ్లను ప్రారంభించామని వారు వివరించారు. -
‘బాలయేసు’ విజయదుందుభి..
దేవరుప్పుల : జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలోని బాలయేసు ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ విద్యార్థులు బుధవారం వెలువడిన పదో తరగతి ఫలితాల్లో మరోసారి విజయదుందుభి మోగించారు. 582 మార్కులతో బాకి అభిజ్ఞాన్ దేవరుప్పుల మండలంలో ఫస్ట్ ర్యాంకు సాధించాడు. మహ్మద్ రైసున్నీసా 576, కున్సోతు స్వాతి 566 మార్కులు, మొత్తం 32 మంది విద్యార్థుల్లో 22 మంది 500కు పైగా మార్కులు సాధించారని, ఇది ఎంతో గర్వకారణమని పాఠశాల కరస్పాండెంట్ బ్రదర్ జేసురాజ్ అన్నారు. ఈ సందర్భంగా ప్రతీ విద్యార్థి, తల్లిదండ్రులు, ఉపాధ్యాయ బృందానికి అభినందనలు తెలిపారు. ఉపాధ్యాయులు మదన్ మోహన్, మహేశ్, కృష్ణ, పాషా, షబానా, సంధ్య.. విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. -
‘లా’ ఫలితాలు వెల్లడి..
● ఆలిండియా బార్ కౌన్సిల్ ఎగ్జామ్ దరఖాస్తుకు సుగమం ● నేటితో అఖరు కావడంతో అప్లయ్ చేసుకునేందుకు చాన్స్ ● ‘సాక్షి’కి విద్యార్థుల కృతజ్ఞతలు సాక్షి, వరంగల్ : కాకతీయ యూనివర్సిటీ ‘లా’ విద్యార్థులకు ఫలితాల వెల్లడి ఆలస్యమవుతుండడంతో ‘ఆలిండియా బార్ కౌన్సిల్ ఎగ్జామ్’కు దరఖాస్తు చేసుకునే అవకాశం కోల్పోతున్నారంటూ బుధవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘లా’ విద్యార్థులకు టెన్షన్’ అనే కథనంపై కదలిక వచ్చింది. ఏమాత్రం బ్యాక్‌లాగ్స్ లేని మూడేళ్ల కోర్సు చదువుతున్న విద్యార్థులకు ఐదో సెమిస్టర్ మెమో, ఐదేళ్ల కోర్సు చదువుతున్న విద్యార్థులకు తొమ్మిదో సెమిస్టర్ మెమో ఈ పరీక్షకు అవసరం ఉండడంతో ఆయా విద్యార్థుల్లో ఆందోళన నెలకొందంటూ వారి వెతలను వెలుగులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాకతీయ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ విభాగాధికారులు చాలెంజ్‌గా తీసుకుని రాత్రంతా శ్రమటోడ్చి బుధవారం సాయంత్రం ఫలితాలు ప్రకటించారు. కేయూఎగ్జామ్స్.ఆర్గ్‌లో ఫలితాలు అందుబాటులో ఉంచారు. దీనిపై పలువురు విద్యార్థులు ‘సాక్షి’కి ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపారు. అయితే ‘ఆలిండియా బార్ కౌన్సిల్ ఎగ్జామ్’కు దరఖాస్తు చేసుకునే గడువు నేటితో ముగియనుంది. వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని బుధవారం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కుటుంబ సమేతంగా సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి వారు పూజలు నిర్వహించగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ ఈఓ భాస్కర్ వారిని శాలువాతో సత్కరించారు. టూరిజం గైడ్ విజయ్‌కుమార్ ఆలయ విశిష్టత గురించి వివరించగా శిల్పకళ సంపద బాగుందని కొనియాడారు. -
‘ఏకశిల’ విద్యార్థుల ప్రతిభ..
హసన్‌పర్తి: టెన్త్ పరీక్ష ఫలితాల్లో ఏకశిల విద్యాసంస్థల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. వరుసగా 585,582,580,578 ,577,576,574,573,572,571,570 మార్కులతో రాష్ట్ర స్థాయిలో టాపర్‌గా నిలిచినట్లు ఏకశిల విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ గౌరు తిరుపతిరెడ్డి తెలిపారు. ఈసందర్భంగా హసన్‌పర్తి మండలం పెంబర్తిలోని ఏకశిల టెక్నో స్కూల్లో బుధవారం అభినందన సభ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏకశిల విద్యాసంస్థలో విద్య అంటే మార్కులు మాత్రమే కాదు.. భవిష్యత్‌ను నిర్మించే శక్తి అన్నారు. నాణ్యమైన విద్యతోపాటు నైతిక విలువలు, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, జీవిత నైపుణ్యాలను పెంపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఫలితాలతో ఏకశిల విద్యాసంస్థకు మరింత గౌరవం పెరిగిందన్నారు. అనంతరం అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో ఏకశిల విద్యాసంస్థల డైరెక్టర్లు బేతి కొండల్‌రెడ్డి, గౌరు సువిజారెడ్డి, ప్రిన్సిపాళ్లు బేతి శైలజారెడ్డి, ముచ్చ స్వప్నరెడ్డి, ఎం.డి. బాబా, కె.డి. స్వర్ణరాజ్, లవకుమార్, అడ్మినిస్ట్రేషన్ ఇన్చార్జ్ జి.రాంప్రసాద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
98.36 శాతం ఉత్తీర్ణత
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో పదో తరగతి ఫలితాల్లో 98.36 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గత ఫలితాల్లో వెనుకబడి ఉన్న జిల్లా ముందువరుసలో ఉండాలని కలెక్టర్ రాహుల్‌శర్మ ఆదేశాలతో జిల్లా విద్యాశాఖ అధికారి పర్యవేక్షణలో ఉపాధ్యాయులు పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించారు. నవంబర్ మాసం నుంచే ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేశారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ ఏడాది టెన్త్ పరీక్షల షెడ్యూల్ సీబీఎస్ఈ తరహాలో తయారు చేసి పరీక్షలు నెల రోజుల పాటు నిర్వహించారు. ఒక్కో పరీక్షకు మధ్య నాలుగైదు రోజుల వ్యవధి ఏర్పడింది. ఫలితంగా జిల్లా రాష్ట్ర స్థాయిలో 11వ స్థానంలో నిలించింది. సంవత్సరాల వారీగా ఫలితాలు ఇలా.. జిల్లా వ్యాప్తంగా 122 ప్రభుత్వ, ప్రైవేట్ ఉన్నత పాఠశాలల్లో మొత్తం 3,541 మంది విద్యార్థులకు గాను 3,483 మంది విద్యార్థులు హాజరయ్యారు. వారిలో 1,750 మంది బాలురు పరీక్షకు హాజరుకాగా 1,708 ఉత్తీర్ణత సాధించారు. అలాగే 1,791 బాలికలకు 1,775 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా 98.36 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా 58 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. ఫలించిన ప్రత్యేక తరగతులు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో 2025–26 విద్యా సంవత్సరానికి పదో తరగతి పరీక్ష ఫలితాలు 100 శాతం సాధించే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ అమలు చేశారు. ఇందులో భాగంగా 2025 నవంబర్ నుంచి పది విద్యార్థులకు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించారు. సెలవు రోజుల్లో కూడా విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడంతో పాటు నిర్ణయించిన వాటి కంటే అదనంగా టెస్టులు నిర్వహించారు. వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా అభ్యాసదీపిక పేరుతో ముఖ్యమైన ప్రశ్న, జవాబులతో కూడిన పుస్తకాలను అందజేశారు. ఉపాధ్యాయులు విద్యార్థులను దత్తత తీసుకోని ప్రతీరోజు ఉదయం 4 గంటల నుంచే విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి నిద్రలేపించడం, చదివించడం వంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. పెరుగుతూ.. తగ్గుతూ.. జిల్లాల పునర్విభజన తర్వాత 2016–17 సంవత్సరంలో నిర్వహించిన పదో తరగతి పరీక్షల్లో జిల్లా రాష్ట్రంలో 14 స్థానం, 2017–18లో 5వ స్థానం, 2018–19లో 7వ స్థానాల్లో నిలిచింది. 2019–20, 2019–21వ సంవత్సరానికి కోవిడ్ కారణంగా పరీక్షలు నిర్వహించలేదు. 2021–22లో 8, 2022–23లో 5వ స్థానం, 2023–24లో 16వ స్థానం, 2024–25 22వ స్థానంలో ఉండగా ఈ ఏడాది 11వ స్థానానికి పెరిగింది. ఈ ఏడాది 58 మంది విద్యార్థులు ఫెయిల్ కాగా వీరిలో ఎక్కువగా తెలుగు, గణితం సబ్జెక్టులో ఫెయిల్ అయినట్లు సమాచారం. గత కొన్ని సంవత్సరాల నుంచి టెన్త్ ఫలితాల్లో ఆశించిన స్థాయిలో ఉత్తీర్ణత లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పదో తరగతి ఫలితాల్లో గతేడాది కంటే ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం పెరిగింది. జిల్లా రాష్ట్రంలో 11వ స్థానంలో రావడం సంతోషకరం. వందశాతం ఫలితాల లక్ష్య సాధనకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాం. గతేడాదితో పోలిస్తే మెరుగైన ఫలితాలు సాధించాం. ఇదే ఉత్సాహంతో వచ్చే విద్యా సంవత్సరంలో ఇంకా మెరుగైన ఫలితాల సాధనకు కృషిచేస్తాం. – రాజేందర్, ఇన్చార్జ్ డీఈఓ గణపురం: మండలంలోని గాంధీనగర్ మహాత్మ జ్యోతిరావుపూలే బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులు ప్రతిభ కనబరిచారు. ఎస్.వేదిత 579 మార్కులు సాధించి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఎం. లక్ష్మిప్రసన్న 576, కే. అర్చన 573, బి.వైష్ణవి 570, సాయిప్రియ 569, ఏ.రోజా 568 మార్కులు సాధించారు. -
‘తేజస్వి’ విద్యార్థుల సత్తా..
నయీంనగర్ : పదో తరగతి ఫలితాల్లో తేజస్వి పాఠశాల విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. 591 మార్కులతో కందిక సాహిత్య ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఎం.అభివర్షిని 590, ఎం.శ్రీతిక 588, జి.సాయి శ్రేష్ఠ, ఆర్. తన్మయి, ఎ.హర్షిత్, ఎండి.సుమేర్ అహ్మద్, అమృత వర్షిణి 587, కె.హిమవర్షిత, కె.నాగస్వామి, మణి సాయి ప్రణవ్ 586, జి.సౌమ్య శ్రీ, ఎల్.కిరణ్ తేజ్, సిహెచ్.మహిన్వద, ఎం.దీప్తి, ఎన్.కార్తికేయ 585, పి.సాయిసాన్వి, పి.శ్రీపాద రెడ్డి 584, సి.హెచ్.శ్రేష్ఠ 583, జునైరియా నౌరిన్, ఎల్.వర్ష, ఎ.రేష్మిత, ఎ.వర్షిణిశ్రీ 582, ఎం.గీతిక, ఎం.మేద, బి.లాస్య, ఎ.నీలిమైథిలి, టి.శశిధర్ 581, జి.సింధు 580 మార్కులు సాధించింది. 570– 579 మధ్య 78 మంది విద్యార్థులు, 560– 569 మధ్య 67 మంది, 550–559 మధ్య 73 మంది, 540 – 549 మధ్య 48 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 539 కంటే తక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు 161 మందితో నయీంనగర్, పోచమ్మకుంట, ప్రశాంత్‌నగర్ బ్రాంచ్‌లలో జిల్లా స్థాయిలో అధిక మార్కులు సాధించడం తేజస్వి ఘనత. విజయ పరంపర కొనసాగించిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, తల్లిదండ్రులకు పాఠశాల చైర్మన్ రేవూరి జెన్నారెడ్డి, పిల్లలమర్రి చంద్రశేఖర్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలిపారు.


