క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి | - | Sakshi
Sakshi News home page

క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి

May 3 2026 7:35 AM | Updated on May 3 2026 7:35 AM

కేయూ క్యాంపస్‌: విద్యార్థులు చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని కేయూ రిజిస్ట్రార్‌ వి.రామచంద్రం అన్నారు. కేయూ స్టూడెంట్స్‌ అఫైర్స్‌ డీన్‌ విభాగం ఆధ్వర్యంలో కేయూ యువజన క్రీడోత్సవాలు ఇటీవల నిర్వహించగా.. శనివారం వర్సిటీలోని పరిపాలనా భవనంలోని సెనేట్‌హాల్‌లో విజేతలకు రిజిస్ట్రార్‌ రామచంద్రం, స్టూడెంట్స్‌ అఫైర్స్‌ డీన్‌ మామిడాల ఇస్తారి ఇతర అతిథులు బహుమతులు అందించారు. కార్యక్రమంలో కేయూ స్పోర్ట్స్‌ బోర్డ్‌ సెక్రటరీ వై.వెంకయ్య, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి.భాస్కర్‌, యూత్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రాధిక, ఆర్ట్స్‌అండ్‌ సైన్స్‌ కళాశాల ఫిజికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎటిబిటి ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement