breaking news
Jayashankar District Latest News
-
టీ–పోల్ యాప్‌లో ఎన్నికల సమాచారం
భూపాలపల్లి అర్బన్: గ్రామ పంచాయతీ ఎన్నిక సమాచారం టీ–పోల్ మొబైల్‌యాప్‌లో అందుబాటులో ఉన్నట్లు కలెక్టర్ రాహుల్‌శర్మ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టీ–పోల్ యాప్ ద్వారా ఓటర్ల పోలింగ్ కేంద్ర వివరాలు, ఓటర్ స్లిప్పుల నమోదు సమాచారం సులభంగా తెలుసుకోవచ్చని తెలిపారు. ప్రతి ఓటర్ ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని వినియోగించుకోవాలన్నారు. జిల్లాలో ఓటరు అవగాహన, ప్రజలు ప్రలోబాలకు గురికాకుండా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. సైన్స్‌పై ఆసక్తిని పెంపొందించుకోవాలి విద్యార్థులలో సైన్స్‌పై ఆసక్తిని పెంపొందించడంతో పాటు నాణ్యమైన విజ్ఞాన విద్యను అందించేందుకు ప్రథమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్టెమ్ ఎడ్యుకేషన్ ఫర్ ఇన్నివేషన్ కార్యక్రమాన్ని అన్ని పాఠశాలల్లో అమలు చేయనున్నట్లు కలెక్టర్ రాహుల్‌శర్మ తెలిపారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో గురువారం కలెక్టర్ చాంబర్లో ప్రథమ్ ఫౌండేషన్ బృందంతో కలిసి, జిల్లాలోని పాఠశాలల్లో సైన్స్ బలోపేతానికి చేపట్టనున్న కార్యక్రమాలపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు సైన్స్ అంశాలపై అవగాహన పెంచేలా ఆన్లైన్ వీడియోలు, టీచర్లకు ప్రత్యేక గైడెన్స్, స్టెమ్ ఆధారిత బోధన విధానాలు అమలు చేయనున్నట్లు వివరించారు. ప్రథమ్ ఫౌండేషన్ ద్వారా అందించే స్టెమ్ ప్రోగ్రామ్‌ను జిల్లాలోని ప్రతి పాఠశాలలో సమర్థవంతంగా అమలు చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఫౌండేషన్ అందించే బోధన సామగ్రి (మెటీరియల్) అన్ని పాఠశాలలకు చేరే విధంగా జిల్లా విద్యాశాఖ చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్, జిల్లా సైన్స్ అధికారి స్వామి, ఏఎంఓ విజయపాల్‌రెడ్డి, ప్లానింగ్ ఆఫీసర్ రాజగోపాల్, సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టుల రిసోర్స్ పర్సన్స్, ప్రథమ్ ఫౌండేషన్ బృంద సభ్యులు పాల్గొన్నారు. -
అయ్యయ్యో.. ‘చే’జారిందే!
సాక్షిప్రతినిధి, వరంగల్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుల ఎంపికపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. కొందరు నేతలు తమ పేర్లు సిఫారసు చేయకపోవడం వల్లే చాన్స్ చేజారిందని ఆశావహులు వాపోతుతుండగా, దరఖాస్తు చేసుకున్నా అవకాశం దక్కని సీనియర్లు అధిష్టానం తమపై చిన్నచూపు చూసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల ప్రకటన వెలువడిన నాలుగైదు రోజులకు చాపకింది నీరులా అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఉమ్మడి వరంగల్ పరిధిలోని ఆరు జిల్లాలకు గాను ఇద్దరు షెడ్యూల్ కులాలు, ఒక మైనారిటీ, ఒక బీసీ, ఒక జనరల్, ఒక షెడ్యూల్ తెగలకు చెందిన నాయకులకు జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించారు. ఈ విషయంలో సామాజిక, సమన్యాయం పాటించినట్లు పార్టీ అధిష్టానం, సీనియర్లు చెబుతుండగా, సిఫారసులు ఫలించని, అవకాశం దక్కని నేతలు మాత్రం అసంతృప్తిగా ఉన్నట్లు అనుచరవర్గాలు చెప్తున్నాయి. వరంగల్‌పై పోటాపోటీ సిఫారసులు.. వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మైనార్టీ వర్గానికి చెందిన మహ్మద్ అయూబ్‌కు అనూహ్యంగా అవకాశం దక్కిందని చెప్పొచ్చు. తూర్పు నియోజకవర్గంలో రెండు వర్గాలుగా పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారు. మంత్రి కొండా సురేఖ దంపతులు ఒక వర్గంగా, మిగిలిన నాయకులు మరో వర్గంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కొండా దంపతులు మినహా మిగిలిన వారంతా డీసీసీ అధ్యక్షురాలిగా మాజీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణను ప్రతిపాదించారు. వర్ధన్నపేట, పరకాల ఎమ్మెల్యేలతోపాటు ఆ నియోజకవర్గాలకు చెందిన నాయకులు కూడా స్వర్ణను ప్రతిపాదించారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వర్ధన్నపేట నియోజకవర్గం ఏనుగల్లుకు చెందిన బొంపెల్లి దేవేందర్‌రావుకు డీసీసీ పదవీ ఇవ్వాలంటూ ఒత్తిడి తీసుకువచ్చినట్లు తెలిసింది. కొండా దంపతులు గోపాల నవీన్రాజుకు గానీ, లేని పక్షంలో మీసాల ప్రకాశ్‌కు ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. కాగా, మైనార్టీ వర్గానికి చెందిన మహ్మద్ అయూబ్ పేరును డీసీసీ అధ్యక్షుడిగా ఎవరు ప్రతిపాదించలేదు. సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్‌లకు సన్నిహితంగా, ఛత్తీస్‌గఢ్‌కు పార్టీ పరిశీలకుడిగా వెళ్లడంతో మీనాక్షి నటరాజన్ దృష్టిలో పడడం, మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఆ కోటాలో ఆయూబ్ పేరును చేర్చినట్లు తెలిసింది. మాజీలకు ఇవ్వొద్దని, కనీసం ఐదేళ్ల నుంచి పార్టీలో కొనసాగుతుండాలన్న నిబంధనలను పరిగణనలోకి తీసుకోవడంతో స్వర్ణ, నవీన్రాజులు అనర్హులయ్యారు. దీంతో మంత్రి కొండా సురేఖ దంపతులు, వారి అనుచరులు అసంతృప్తిగా ఉన్నట్లు చెబుతున్నారు. మహబూబాబాద్‌లో ఎంపీ వర్గం.. జనగామలో ‘కొమ్మూరి’ వర్గం కినుక జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళి నాయక్ భార్య ఉమకు కేటాయించడం పట్ల కొందరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పదవి ఆశించిన మరికొందరు అసంతప్తిగా ఉన్నారు. మాజీ డీసీసీ అధ్యక్షుడు భరత్చందర్ రెడ్డి వర్గానికి దక్కడం పట్ల ఆయన వర్గం సంతోషంగా ఉంది. కానీ, ఎంపీ బలరాం నాయక్ వర్గానికి చెందిన నునావత్ రాధకు ఇవ్వకపోవడం పట్ల ఆయన అసంతప్తిగా ఉన్నట్లు అనుచరవర్గంలో చర్చ జరుగుతోంది. మొదటినుంచీ డీసీసీ అధ్యక్షుడు పదవి వస్తుందని భావించిన పీసీసీ సభ్యుడు వెన్నం శ్రీకాంత్ రెడ్డి కూడా అసంతృప్తిగానే ఉన్నారు. సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి అనుచరుడిగా ఉన్న గణపురం అంజయ్య కూడా అధ్యక్ష పదవి వస్తుందని ప్రచారం చేసుకున్నారు. అందరిని సమన్వయం చేసుకునేందుకు మురళి నాయక్ దంపతులు ప్రయత్నాలు చేస్తున్నారు. జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్ పర్సన్‌గా పనిచేసిన లకావత్ ధన్వంతి లక్ష్మీనారాయణ నాయక్‌ను నియమించగా, మాజీ ఎమ్మెల్యే, మాజీ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి, ఆయన అనుచరులు అసంతృప్తిలో ఉన్నట్లు పార్టీవర్గాల సమాచారం. పార్టీ స్థాపించిన నాటినుంచి నేటివరకు ఒకే పార్టీలో ఉండడం లకావత్ ధన్వంతికి తగిన గుర్తింపు ఇచ్చిందన్న చర్చ జరుగుతుండగా, ఎస్టీ సామాజిక వర్గం, మహిళ కావడంతో గొడవలకు ఫుల్స్టాప్ పెట్టవచ్చని ఉద్దేశంతో ఆమెను జిల్లా అధ్యక్షురాలిగా ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, యశస్వినిరెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, పలువురు కూడా బలపరిచినట్లు ప్రచారం జరుగుతోంది. ములుగు డీసీసీ అధ్యక్షుడిగా మళ్లీ పైడాకుల అశోక్‌కే చాన్స్ దక్కింది. ఈ విషయంలో మంత్రి సీతక్క సిఫారసు మేరకు ఆయనకు మరోసారి అవకాశం దక్కిందన్న చర్చ పార్టీలో ఉంది. పార్టీలోని ఒక్కరిద్దరు సీనియర్లు అసంతృప్తికి గురైనట్లు వారి అనుచరులు చెబుతున్నారు. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, జయశంకర్ భూపాలపల్లి అధ్యక్షుడిగా బట్టు కరుణాకర్లను నియమించడంలో ఎమ్మెల్యేల మాట చెల్లుబాటయ్యింది. భూపాలపల్లి నుంచి మాజీ మావోయిస్టు నేత గాదర్ల అశోక్ అలియాస్ ఐతు ప్రయత్నించినా ఆయనకు చాన్స్ రాలేదు. హనుమకొండ నుంచి సుమారు 20మందికిపైగా ఆశించినా సీనియర్ నేత వెంకట్రాంరెడ్డికే అధిష్టానం పార్టీ పగ్గాలు అప్పగించింది. ఉమ్మడి జిల్లాలో డీసీసీ అధ్యక్షుల ఎంపికపై మోదం, ఖేదం పార్టీ సీనియర్లనుంచీ భిన్న స్వరాలు.. వరంగల్‌పై మంత్రి సురేఖ శిబిరంలో అసంతృప్తి? మంత్రి సీతక్క అనుచరుడికే మళ్లీ ములుగు పగ్గాలు.. హనుమకొండ, భూపాలపల్లిల్లో ఎమ్మెల్యేల మాటే చెల్లుబాటు మహబూబాబాద్ డీసీసీపై ఎంపీ వర్గం కినుక.. -
అమల్లోకి పోలీస్‌యాక్ట్
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీస్ యాక్ట్–1861 నిబంధనలు అమల్లో ఉంటాయని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్‌లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా డీజే సౌండ్ సిస్టమ్ వినియోగించవద్దని, శాంతిభద్రతలకు భంగం కలిగించే, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే చట్ట వ్యతిరేక చర్యలు చేపట్టరాదన్నారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు నిరంతరం శ్రమిస్తున్న నేపథ్యంలో, ప్రజలు పోలీసులకు సంపూర్ణ సహకారం అందించాలన్నారు. హత్య కేసులో శిక్ష జిల్లాకేంద్రంలోని రాజీవ్‌నగర్‌కాలనీలో మద్యం మత్తులో భార్య, కుమారుడిని హత్య చేయడానికి ప్రయత్నించిన మార్త రాజేష్‌కు భూపాలపల్లి అసిస్టెంట్ సెషన్స్ జడ్జి నాగరాజు గురువారం శిక్ష విధించినట్లు ఎస్పీ సంకీర్త్ తెలిపారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. 2023 మార్చి 13వ తేదీన మద్యం మత్తులో ఇంటికి వచ్చిన రాజేష్‌ను తాగవద్దని మందలిస్తున్న భార్య రమ, కుమారుడు ఉదయ్‌కుమార్‌పై గొడ్డలితో రాత్రి 11గంటలకు దాడి చేసి గాయపర్చినట్లు తెలిపారు. నేరం నిరూపితం కావడంతో నిందితుడికి 10 సంవత్సరాల జైలు శిక్ష, రూ.5వేల జరిమాన విధించినట్లు తెలిపారు. ఈ కేసులో నిందితుడికి శిక్ష పడే విధంగా లోతైన, సమగ్ర దర్యాప్తు నిర్వహించిన పోలీసు అధికారులను, కోర్టు కానిస్టేబుల్, సంబంధిత సిబ్బందిని అభినందించారు. ఎస్పీని కలిసిన జీఎం ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌ను గురువారం ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందించారు. ఈ సందర్భంగా ఏరియాలో సింగరేణి స్థితిగతులు, భద్రత ఏర్పాట్లను ఎస్పీతో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎస్టేట్ అధికారి కార్తీక్, సెక్యూరిటీ అధికారి మురళీమోహన్, వెల్ఫేర్ అధికారి సాయికృష్ణ పాల్గొన్నారు. -
పోలీసులపై ఆకతాయిల జులుం
టేకుమట్ల: పోలీస్‌స్టేషన్ సమీపంలో పోలీసులపైనే ఆకతాయిలు జులుం ప్రదర్శించిన ఘటన చోటుచేసుకుంది. వైన్‌షాప్ సమీపంలో కొంతమంది యువకులు గురువారం టేకుమట్ల–ఆశిరెడ్డిపల్లి ప్రధాన రోడ్డుపక్కన మద్యం సేవిస్తున్నారు. విధుల్లో ఉన్న పోలీసులు అక్కడకు చేరుకుని ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది.. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పారు. మద్యం మత్తులో కొంతమంది యువకులు పోలీసులపై ఎదురు తిరిగారు. ‘మా ఇష్టం’ అంటూ జులుం ప్రదర్శించారు. అంతటితో ఆగకుండా పోలీ సులే ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని వీడియోను సైతం ఓ యువకుడు తన సెల్ఫోన్లో తీశాడు. అంతటితో ఆగని యువకులు హెడ్ కానిస్టేబుల్ ద్విచక్రవాహనాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేయడంతో స్వల్పంగా దెబ్బతిన్నది. దాంతో పోలీసులు యువకుడి సెల్‌ఫోన్ తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిపోయారు. అనంతరం యువకుడు అల్లకొండ రమేశ్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై దాసరి సుదాకర్ తెలిపారు. యువకుడిపై కేసు నమోదు పోలీస్‌స్టేషన్ సమీపంలోనే ఘటన -
కలెక్టర్‌ను కలిసిన ఎన్నికల పరిశీలకులు
గ్రామ పంచాయతీ ఎన్నికల సాధారణ పరిశీలకులు, టీజీఎంఎస్ఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్ ఫణింద్రరెడ్డి గురువారం కలెక్టర్ రాహుల్‌శర్మను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జిల్లాలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు, పోలింగ్ నిర్వహణకు తీసుకుంటున్న ముందస్తు చర్యలపై చర్చించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపడుతున్నామని తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో లోపాలు లేకుండా సక్రమంగా నిర్వహిస్తామన్నారు. కలెక్టర్‌ను కలిసి పూలమొక్క అందజేస్తున్న ఎన్నికల సాధారణ పరిశీలకులు ఫణింద్రరెడ్డి -
తడిసి మోపెడు!
ఖర్చులకు భయపడుతున్న ఆశావహులు● గ్రామాల్లో ఎన్నికల సందడి మొదలు ● గ్రామాల్లో దావత్‌లు, మందు పార్టీల జోరు ● చివరి విడత ఆశావహులకు తలకుమించిన భారం ● మొదటి విడత నామినేషన్ల స్వీకరణ షురూకాళేశ్వరం: పల్లెల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి జోరందుకుంది. ఆశావహులు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి దావత్‌లు, మందు పార్టీల కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఆశావహులు ఖర్చు చేస్తున్నప్పటికీ వారికి డబ్బుల టెన్షన్ పట్టుకుంది. మూడు విడతల్లో సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడత జరిగే ఎన్నికల అభ్యర్థులకు ఖర్చులు కలిసి వచ్చే అంశం కాగా చివరి విడత వారు అదనపు భారం మోయాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి నుంచి 20 రోజుల పాటు ఎన్నికల ప్రచారంతో పాటు క్యాడర్‌ను కాపాడుకునేందుకు వారి కోరికలు తీర్చడం లాంటి ఖర్చులు భరించాల్సి ఉంటుంది. ఓటర్లను ప్రభావితం చేసే పెద్దలను, కుల, మహిళా సంఘాలు, యూత్ లీడర్లను మచ్చిక చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల ఖర్చుల అంచనా లెక్కలు చూసి ఆశావహులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎంత ఖర్చయినా మంచిదే అంటూ డబ్బులు.. దారబోస్తే గెలువకపోతే ఎలా అనే భయం మరో వైపు కనబడుతోంది. గెలుపు గుర్రాలపై ప్రధాన పార్టీలు ఆరా తీయడంతో పాటు డబ్బులు ఖర్చు చేసే వారిని సంప్రదిస్తున్నారు. దసరా పండగ సమయంలో వేసిన స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌తో కూడా కొంత మంది ఆశావహుకులు డబ్బులు ఖర్చుచేసి రద్దు కావడంతో చేసేదేమీ లేక క్యాడర్‌ను కాపాడుతున్నారని తెలిసింది. పరిమితికి మించి.. స్థానిక సంస్థల ఎన్నికల ఖర్చులకు ఎన్నికల కమిషన్ వ్యయపరిమితిని విధించింది. ఐదు వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీల్లో రూ.2.50 లక్షలు, వార్డు సభ్యుడికి రూ.50 వేలు, ఐదు వేల కంటే తక్కువ జనాభా ఉన్న జీపీల్లో సర్పంచులు రూ.1.50 లక్షలు, వార్డు సభ్యుడు 30 వేలు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఎన్నికల అనంతరం ఖర్చులన్నింటినీ ఆధారాలతో సహా ఈసీకి సమర్పించాలి. అభ్యర్థుల ఎన్నికల ఖర్చులపై అధికారుల నిఘా ప్రతినిత్యం ఉంటుంది. ఎన్నికల వ్యయానికి ఈసీ విధించిన పరిమితులకు మించి ఎనిమిది నుంచి పది రేట్ల వరకు ఖర్చులు ఉంటాయనేది బహిరంగ రహస్యమే అంటున్నారు. జిల్లాలో ఇలా... జిల్లాలో 12 మండలాల్లో 248 గ్రామ పంచాయతీలు, 2,102 వార్డులు ఉన్నాయి. మొత్తం 3,02,147 మంది ఓటర్లు ఉన్నారు. ఒకటో విడత డిసెంబరు 11న గణపురం, రేగొండ, కొత్తపల్లిగోరి, మొగుళ్లపల్లి, రెండో విడత డిసెంబరు 14న చిట్యాల, టేకుమట్ల, భూపాలపల్లి, పలిమెల మండలాలు, మూడో విడత డిసెంబరు 17న మంథని నియోజకవర్గంలోని మల్హర్, మహదేవపూర్, మహాముత్తారం, కాటారం మండలాల్లో జరుగుతాయి. గురువారం నుంచి మొదటి విడత నామినేషన్ల స్వీకరణ మొదలైంది.ఆశావహుకులు ఖర్చులు కూడా మొదలు పెట్టారు. రిజర్వేషన్.. స్థానాన్ని బట్టి ఖర్చులు గ్రామ పంచాయతీ రిజర్వేషన్లను బట్టి ఎన్నికల ఖర్చులు మారనున్నాయి. జనరల్, బీసీ స్థానాల్లో ఖర్చు ఎక్కువ ఉండనుండగా, ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో ఒకింత తక్కువ ఖర్చు ఉండనుంది. ఈ సారి జనరల్ స్థానాలే ఎక్కువ ఉండటంతో ఆర్థికంగా బలంగా ఉన్నవారు పోటీ పడేందుకు సిద్ధపడుతున్నారు. ఇప్పటికే పదవులు చేపట్టిన వారితో పాటు కొత్త వారు సైతం పోటీకి సై అంటున్నారు. గత ఎన్నికల్లోనే సర్పంచులుగా గెలిచేందుకు లక్షల్లో ఖర్చు చేయగా మళ్లీ ఈ ఎన్నికల్లో ఖర్చులు పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మూడో విడత ఎన్నికలు కాటారం, మహదేవపూర్, మల్హర్, మహాముత్తారం మండలాల్లో జరగనున్నాయి. మూడో విడతలో ఉన్న మండలాల జీపీల్లో ఆశావహులు ఇప్పటి నుంచి 20 రోజులకు పైగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. మొదటి విడత వారితో పోల్చుకుంటే వారి ఖర్చులు రెట్టింపు కానున్నాయని ఆశావహులు ఆందోళన పడుతున్నారు. ఇప్పటికే కొంత మంది పోటీలో ఉన్నామని బయటపడగా మరి కొంత మంది ఖర్చులకు భయపడి బయటకు రావడం లేదు. ఇప్పటికే ఆశవాహులు యూత్లీడర్లు, వార్డు లీడర్లకు పార్టీలకతీతంగా దావత్‌లు, పార్టీల్లో ముంచుతున్నారు. దీంతో ఖర్చులు తడిసిమోపడవుతున్నాయని తలలు పట్టుకుంటున్నారు. -
రాజ్యాంగం దేశ పాలనా వ్యవస్థకు దిక్సూచి
కాటారం: మన రాజ్యాంగం పవిత్రమైన గ్రంథం అని దేశ పరిపాలన వ్యవస్థకు దిక్సూచిలా రాజ్యాంగం వ్యవహరిస్తుందని గురుకులం భూపాలపల్లి, ములుగు జిల్లాల రిజినల్ కోఆర్డినేటర్(ఆర్సీఓ) హరిసింగ్ అన్నారు. మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలుర కళాశాలలో బుధవారం రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాజ్యాంగం ఆవశ్యకత, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గొప్పతనం గురించి విద్యార్థులకు వివరించారు. పలువురు విద్యార్థులు రాజ్యాంగం, అంబేడ్కర్ విశిష్టతను తెలియజేసేలా ఉపన్యాసాలు ఇచ్చి పాటలు పాడారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రాజేందర్, వైస్ ప్రిన్సిపాల్ మాధవి, వెంకటయ్య, బలరాములు, రాజబాబు, కృష్ణమాచారి, నీలిమ, స్వప్న, గోపాలకృష్ణ, శ్రవణ్, నరసింహ, సర్దార్‌సింగ్, పీడీ మహేందర్, పీఈటీ శ్రీనివాస్, కోచ్ వెంకటేశ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
నిబంధనల మేరకు ధాన్యం కొనుగోలు చేయాలి
గణపురం: రైతులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా ఏఫ్ఏక్యూ ప్రమాణాల మేరకే ధాన్యం కొనుగోలు చేయాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అ ధికారి కిరణ్‌కుమార్ అన్నారు. గాంధీనగర్, బుద్దా రం, గణపురంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను సీఎస్సీ రాములు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధా న్యం కొనుగోలు చేసిన వెంటనే సంబంధిత మిల్లులకు తరలించేలా చర్యలు చేపట్టాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం, బిల్లింగ్, రవాణా ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా బాధ్యతాయుతంగా పని చేయాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందిలేకుండా చూడాలన్నారు. -
ముగిసిన తేనెటీగల పెంపకంపై శిక్షణ
కాటారం: జాతీయ మొక్కల ఆరోగ్య నిర్వహణ సంస్థ(ఎన్ఐపీహెచ్ఎం) ఆధ్వర్యంలో భారత ప్రభుత్వ వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, జాతీయ తేనెటీగల బోర్డు సారథ్యంలో కాటారం వ్యవసాయ మార్కెట్లో వారం రోజులపాటు నిర్వహించిన తేనెటీగల పెంపకం ఉచిత శిక్షణ కార్యక్రమం బుధవారం ముగిసింది. జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన 25 మంది రైతులకు తేనెటీగల పెంపకంపై అవగాహన కల్పించారు. శ్రీ నేచురల్ హనీ వ్యవస్థాపకురాలు తాళ్లపెల్లి సంజన–రఘుతోపాటు వివిధ ప్రైవేట్ సంస్థల నిపుణులు శిక్షణలో రైతులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. తేనెటీగల వర్గీకరణ, తేనెటీగ పెట్టె, ఉపకరణాల గుర్తింపు, కాలనీ నిర్వహణ, కాలానుగుణంగా నిర్వహణ, తేనె సంగ్రహణ, వ్యాధి, తెగుళ్ల నిర్వహణ వంటి అంశాలపై సైద్ధాంతిక, ఆచరణాత్మక శిక్షణ అందించారు. రైతులు తేనెటీగల పెంపకంతో అదనపు ఆదాయం పొందవచ్చని పలువురు సూచించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్ పర్సన్ పంతకాని తిరుమల, మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య, ఆత్మకూరి కుమార్‌యాదవ్, పంతకాని మల్లికార్జున్, బొమ్మన భాస్కర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
మున్సిపల్ కమిషనర్‌గా గ్రూప్–1 అధికారి
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి మున్సిపల్ కమిషనర్‌గా గ్రూప్–1 అధికారి కొయ్యడ ఉదయ్‌కుమార్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు బుధవారం కలెక్టర్ రాహుల్‌శర్మను మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందించారు. మున్సిపాలిటీకి ప్రప్రథమంగా గ్రూప్–1 అధికారిని కేటాయించారు. కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామి ఆలయ అనుబంధ దేవాలయంలో శ్రీసుబ్రహ్మణ్యషష్ఠి సందర్భంగా శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో విశేష అభిషేక పూజలను ఉపప్రధాన అర్చకులు పనకంటి ఫణీంద్రశర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బుధవారం ఉదయం శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామికి పూజలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులు తీర్ధప్రసాదం వితరణ చేశారు.ఈకార్యక్రమంలో ఈఓ మహేష్, జిల్లా గ్రంథాలసంస్ధ చైర్మన్ కోట రాజబాబు, పీఏసీఎస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, భక్తులు పాల్గొన్నారు. గణపురం: ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రాజ్యాంగాలను అధ్యయనం చేసిన తర్వాత భారత రాజ్యాంగాన్ని రూపకల్పన చేశారని, దీనికి లోబడి దేశంలోని ప్రతీ వ్యవస్థ పని చేయాలని సీనియర్ సివిల్ జడ్జి న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాజ్ సూచించారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం గాంధీనగర్‌లోని మహాత్మా జ్యోతిబాపూలే బాలికల పాఠశాలలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరైన మాట్లాడారు. రాజ్యాంగం ప్రకారం చట్టం ముందు అందరూ సమానమేనని అన్నారు. చదవు అనేది మనిషిని విజ్ఞానవంతుడిగా చేస్తుందని చదువు రాజ్యాంగం కల్పించిన హక్కు అన్నారు. కార్యక్రమంలో గవర్నమెంట్ ఫ్లీడర్ బొట్ల సుధాకర్, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస చారి, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పుప్పాల శ్రీనివాస్, స్పెషల్ పీపీ విష్ణువర్ధన్ రావు, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రవణ్ రావు తదితరులు పాల్గొన్నారు. జేఏసీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష భూపాలపల్లి అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నంబర్ 46కు వ్యతిరేకంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్లో నిరసన దీక్ష చేపట్టి రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్బంగా జేఏసీ జిల్లా కోఆర్డినేటర్ కొత్తూరి రవీందర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం వాటా ప్రకటించి, కోర్టు ఆదేశాలతో నిలిపివేసిందన్నారు. రాజ్యాంగ నియామకాలకు లోబడి పొరపాటు లేకుండా చట్టాలను రూపోందించాల్సి ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై కోర్టు తీర్పు వాయిదా పడడంతో రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓసీలకు అధికంగా సీట్లు కేటాయించే విధంగా బీసీలకు అన్యాయం చేసిందన్నారు. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు రమేష్, రవికుమార్, భాస్కరచారి, శ్రీనివాస్, మల్లన్న, మహేష్, హరీష్, రాజేందర్లు పాల్గొన్నారు. -
ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధంగా ఉన్నట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎన్నికల కోడ్ అమలు, ఎన్నికలు నిర్వహణ, శాంతిభద్రతలు తదితర అంశాలపై ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌తో కలిసి కలెక్టర్ వివరాలు వెల్లడించారు. జి ల్లాలో 12 మండలాల్లో మూడు దశలుగా ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 248 గ్రామపంచా యతీలో 2,012 వార్డులు ఉన్నాయని, మూడు దశల్లో నామినేషన్ ప్రక్రియ స్వీకరణకు 77 క్లస్టర్లు ఏ ర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తం 3,02,147లక్ష ల మంది ఓటర్లున్నారని, పురుషులు 1,47,388 మంది, మహిళలు 1,54,744 మంది, ఇతరులు 15 మంది ఉన్నట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు కలెక్టరేట్లో 90306 32608 హెల్ప్డెస్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం ఎస్పీ సంకీర్త్ మాట్లాడుతూ.. మండలాల్లో బందోబస్తు పర్యవేక్షణకు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేశామన్నారు. 70 రూట్లుగా విభజించి పటిష్ట పోలీస్ బందోబస్తు మధ్య పోలింగ్ మెటీరియల్ తరలించనున్నట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు సెన్సిటివ్, క్రిటికల్, నార్మల్ పోలింగ్ కేంద్రాలుగా విభజించి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాజకీయ పార్టీలు, ప్రజ లు.. నిబంధనలు పాటించాలని, ప్రచారాలకు అనుమతి తీసుకోవాలని సూచించారు. ఏదైనా ఉల్లంఘన జరిగితే 24 గంటలు పని చేసేలా ఏర్పాటు చేసిన పోలీస్ కంట్రోల్ రూమ్ 87126 58178 నెంబర్‌కు కాల్ చేయాలని అన్నారు. ఏర్పాట్లు పూర్తి చేయాలి జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్‌శర్మ తెలిపారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్‌హాల్‌లో బుధవారం మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నేడు(గురువారం) ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించి గ్రామ పంచాయతీ కార్యాలయం, గ్రామపంచాయతీ ప్రధాన కూడళ్లలో ప్రదర్శింపచేయాలన్నారు. నామినేషన్ల ప్రక్రియ ఉదయం 10:30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుందని, 29వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించాలని, 30న నామినేషన్ల పరిశీలన, డిసెంబర్ 1వ తేదీన అప్పీళ్లు, 2న డిస్పోజల్, 3వ తేదీన ఉపసంహరణ ఉంటుందని తెలిపారు. నామినేషన్ల స్వీకరణకు 25 మంది రిటర్నింగ్ అధికారులను నియమించామని తెలిపారు. ఒక వ్యక్తి గరిష్టంగా నాలుగు నామినేషన్ సెట్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉందని, మొదటి విడతలో 4 మండలాల్లోని 82 గ్రామపంచాయతీల పరిధిలోని 712 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నోడల్ అధికారుల నియామకం పంచాయతీ ఎన్నికల నిర్వహణకు వివిధ విభాగా లకు చెందిన జిల్లా స్థాయి అధికారులను నోడల్ అధికారులుగా నియమిస్తూ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాహుల్‌శర్మ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల సమయంలో అవసరమైన మాన వ వనరులు, రవాణా, బ్యాలెట్ బాక్సులు, శిక్షణ, మీడియా కమ్యూనికేషన్, ఫిర్యాదుల పరిష్కారం, వ్యయ పర్యవేక్షణ మొదలైన అంశాల్లో సమన్వయంతో విధులు నిర్వర్తించేలా ఈ నియామకాలు చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. పోస్టర్ ఆవిష్కరణ అంతర్జాతీయ సీ్త్ర హింస వ్యతిరేక దినాన్ని పురస్కరించుకొని ‘స్టాప్ వైలెన్స్ ఎగైనెస్ట్ ఉమెన్’ పోస్టర్‌ను బుధవారం కలెక్టర్ రాహుల్‌శర్మ ఆవిష్కరించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 16 రోజుల అవగాహన కార్యక్రమం నవంబర్ 25 నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్పీ సంకీర్త్, అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డిప్యూటీ ట్రైనీ కలెక్టర్ నవీన్‌రెడ్డి, జిల్లా మహిళా సంక్షేమ శాఖ అధి కారి మల్లీశ్వరి, జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఇన్చార్జ్ కోఆర్డినేటర్ కృష్ణ, సురేష్ పాల్గొన్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ -
ప్రతీ ఒక్కరు ఎన్నికల కోడ్ పాటించాలి
కాళేశ్వరం: స్థానిక ఎన్నికల నియమావళిని ప్రతీ ఒక్కరు పాటించాలని, ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. బుధవారం ఆయన మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వరముక్తీశ్వరున్ని దర్శించుకున్నారు. జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టి మొదటిసారిగా ఆలయానికి వచ్చిన ఆయనకు అర్చకులు, అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈసందర్భంగా ఎస్పీ.. స్వామివారికి అభిషేక పూజలు చేశారు. శ్రీశుభానందదేవి, శ్రీసరస్వతి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈఓ మహేష్ ఎస్పీని సన్మానించగా, అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఎస్పీ విలేకరులతో మాట్లాడారు. రానున్న స్థానిక ఎన్నికలను శాంతియుతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో పలు సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించినట్లు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక పోలీస్ బలగాలను నియమించి నిఘా మరింత బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. స్థానిక ఎన్నికలు సజావుగా జరిగేలా సహకరించాలని కోరారు. ఆయన వెంట మహదేవపూర్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై తమాషారెడ్డి, పోలీసు సిబ్బంది తదితరులు ఉన్నారు. నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు ఓటర్లు ప్రలోభాలకు లొంగకుండా ఓటుహక్కును వినియోగించుకోవాలి ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ కాళేశ్వరాలయంలో పూజలు -
నువ్వా.. నేనా..?
భూపాలపల్లి: పల్లెల్లో నువ్వా.. నేనా.. అన్న రీతిలో పోరు సాగబోతుంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో గ్రామాల్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. తొలిదశ ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కా నుండడంతో ‘స్థానికం’లో గెలుపు కోసం ప్రధాన రాజకీయ పార్టీలు ప్రయత్నాలు ప్రారంభించాయి. బుజ్జగింపులు షురూ... జిల్లాలో తొలి విడతలో భాగంగా భూపాలపల్లి నియోజకవర్గంలోని గణపురం, కొత్తపల్లిగోరి, రేగొండ, మొగుళ్లపల్లి మండలాల్లోని 82 సర్పంచ్, 712 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. నేటి నుంచి నామినేషన్లు స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో గ్రామాల్లో సర్పంచ్ స్థానాలకు దక్కించుకునేందుకు ఇప్పటి నుంచే బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. పోటీదారులు బరిలో నిలువకుండా ఉండేందుకు పలువురు శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాక కుల, యువజన సంఘాలను మచ్చిక చేసుకొని విందులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా యువత, రైతులను ఆకర్షించుకునేందుకు ఆశావహులు పడరాని పాట్లు పడుతున్నారు. మరోవైపు 500 ఓట్ల వరకు ఉన్న చిన్నచిన్న గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవం చేసుకునేందుకు కొందరు యత్నిస్తున్నారు. ఇందుకోసం గ్రామంలో నెలకొన్న సమస్యల పరి ష్కారం కోసం సొంతగా డబ్బులు వెచ్చిస్తామని హా మీ ఇస్తున్నారు. అయినప్పటికీ పోటీదారులు అంగీ కరించకపోవడంతో సమరానికి సిద్ధమవుతున్నారు. మొదటిసారి కుర్చీలో కూర్చునేదెవరో.. గత పంచాయతీ ఎన్నికల్లో జిల్లాలోని 241 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగగా, ఈసారి కొత్తగా ఏడు జీపీలు ఏర్పడ్డాయి. భూపాలపల్లి మండలంలోని గొర్లవీడు తండా, కొంపెల్లి తండా, కొత్తగా ఏర్పడిన కొత్తపల్లి గోరి మండలంలో కొత్తపల్లి(కె), బాలయ్యపల్లి, మొగుళ్లపల్లిలో బద్ధంపల్లి, చిట్యాలలో రామచంద్రాపురం, టేకుమట్ల మండలంలో కలికోట గ్రామాలు.. పంచాయతీలుగా ఏర్పడ్డాయి. ఈ జీపీల్లో తొలి సర్పంచ్ స్థానంలో కూర్చునేది ఎవరనే దానిపై ఆసక్తి నెలకొంది. పంచాయతీ ఎన్నికలపై ప్రధాన రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో గ్రామీణ ఓట్లు కీలకం కానుండటంతో, తమ పార్టీ మద్దతుదారులు సర్పంచ్, వార్డు స్థానాలను కైవసం చేసుకునేలా వ్యూహాలు రచిస్తున్నారు. ఆయా పార్టీల నేతలు.. గెలుపు గుర్రాలను ఎంపిక చేసుకొని, వారికి మద్దతుగా ప్రచారం నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు బుధవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో సమావేశాలు నిర్వహించడం గమనార్హం. మొదటిదశలో ఎన్నికలు జరగనున్న పంచాయతీలకు సంబంధించిన పార్టీల నాయకులు, కార్యకర్తలతో మాట్లాడి దిశా నిర్దేశం చేశారు. నామినేషన్లు వేసిన అనంతరం ప్రజా మద్దతు ఉన్న వారిని గుర్తించి వారికి మాత్రమే మద్దతుగా నిలవనున్నట్లు తెలుస్తోంది. పల్లెల్లో మొదలైన విందులు.. ఆకర్షణలు మొదటి దశకు నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ‘స్థానికం’లో గెలుపు కోసం ప్రధాన పార్టీల యత్నాలు -
కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ ప్రకటన
హన్మకొండ/గీసుకొండ: దీక్షా దివస్ స్ఫూర్తితో ప్రభుత్వంపై వరంగల్ నుంచి ప్రతిఘటన మొదలవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేసీఆర్ దీక్షతో తెలంగాణ ప్రకటన వచ్చిందని స్పష్టం చేశారు. వరంగల్, హనుమకొండ జిల్లాల పర్యటనకు వచ్చిన కేటీఆర్‌కు బుధవారం పలువురు నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. వరంగల్ జిల్లా సంగెం మండలంలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు చేరుకుని కై టెక్స్ కంపెనీతో పాటు పార్కును సందర్శించారు. అక్కడి నుంచి హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయానికి చేరుకున్నారు. రాజ్యాంగ దివస్‌లో భాగంగా అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దీక్షా దివస్ సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. మడికొండలోని రెడ్డి కన్వెన్షన్‌లో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బీరవెల్లి భరత్ కుమార్‌రెడ్డి కుమార్తె భార్గవిరెడ్డి, ఉదయ్‌రెడ్డి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయా కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి తెలంగాణ సమాజాన్ని కదిలించిన రోజు నవంబర్ 29 అని, దీక్షా దివస్‌ను విజయవంతం చేయాలని కోరారు. 42 శాతం రిజర్వేషన్ల కోసం రేవంత్ సర్కారు రూ.160 కోట్లు ఖర్చుపెట్టిందని, బిహార్‌లో రాహుల్ గాంధీ డబ్బా కొట్టినా ఫలితం లేదని తూర్పారబట్టారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన 24 శాతాన్ని 17 శాతానికి తగ్గించి బీసీలకు రేవంత్ ద్రోహం చేశారని ధ్వజమెత్తారు. తడిగుడ్డతో గొంతు కోసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బీసీలకు క్షమాపణ చెప్పాలి.. కామారెడ్డి డిక్లరేషన్‌తో బీసీలతో ఓట్లు వేయించుకుని సీఎం రేవంత్‌రెడ్డి మోసం చేశారని కేటీఆర్ ఆరోపించారు. రిజర్వేషన్లు పెంచకుండానే పంచాయతీ ఎన్నికలకు వెళ్తున్నారని విమర్శించారు. చెంపలేసుకుని సీఎం బీసీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఓడిపోయామనే బాధ లేదు.. అప్పుడప్పుడు ఇలా జరిగితేనే మంచిదని రాష్ట్రంలో అధికారం కోల్పోవడంపై కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఓడిపోయామనే బాధ అవసరం లేదని, ప్రభుత్వం పోయిందని నిరుత్సాహపడాల్సింది లేదని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కేసీఆర్ సీఎం కావాలని బలంగా కోరుకుంటున్నారన్నారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, నన్నపునేని నరేందర్, దాస్యం వినయ్‌భాస్కర్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, శంకర్‌నాయక్, గండ్ర వెంకటరమణారెడ్డి, తాటికొండ రాజయ్య, మాజీ మంత్రులు డీఎస్ రెడ్యానాయక్, సత్యవతిరాథోడ్, జెడ్పీ మాజీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింతం సదానందం,నాయకులు నాగుర్ల వెంకటేశ్వర్లు, సాంబారి సమ్మారావు, ఎల్లావుల లలితాయాదవ్, రాకేశ్‌రెడ్డి, శ్రీనివాస్‌యాదవ్, రాకేశ్‌రెడ్డి పాల్గొన్నారు.దీక్షా దివస్ స్ఫూర్తితో వరంగల్ నుంచి ప్రతిఘటన ఓట్లు వేయించుకుని బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పర్యటనకాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు (కేఎంటీపీ) పూర్తయితే సుమారు 30 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేటీఆర్ అన్నారు. గతంలో ఆజంజాహి మిల్లు మూతబడి వైభవాన్ని కోల్పోయిన వరంగల్‌కు కేఎంటీపీ మళ్లీ పూర్వ వైభవం తెచ్చిందన్నారు. నేత కార్మికులు వలసలు వెళ్లకుండా ఉండేందుకు 2017 అక్టోబర్ 22న పార్కు పనులకు అప్పటి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం గణేశా, యంగ్వన్, కై టెక్స్ కంపెనీల్లో ఉత్పత్తి జరుగుతోందని పేర్కొన్నారు. కేఎంటీపీని కేంద్రం పీఎం మిత్ర కింద ఎంపిక చేసిందన్నారు. -
ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యసేవలు
భూపాలపల్లి అర్బన్: ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించేలా జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో సీటీ స్కాన్ యంత్రం ఏర్పాటు చేసినట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రూ.3.40 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన అధునాతన సీటీ స్కాన్ యంత్రాన్ని మంగళవారం కలెక్టర్ రాహుల్‌శర్మతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జిల్లాతో పాటు పొరుగున ఉన్న సిరోంచ ప్రాంతం నుంచి ప్రజలు వైద్య సేవల కోసం ఇక్కడికి వస్తున్నారని, ఏదేని ప్రమాదం జరిగితే ప్రజలు వైద్య సేవలకు సుదూర ప్రాంతాలకు సీటీ స్కాన్ సేవలకు వెళ్లాల్సి వచ్చేదని తెలిపారు. జిల్లా ఆస్పత్రిలోనే కార్పొరేట్ స్థాయి వైద్యసేవలు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ఆస్పత్రిలో ఇప్పటికే వెంటిలేటర్లు, సీటీ స్కాన్ యంత్రం ఏర్పాటు చేశామని తెలిపారు. త్వరలో ఎంఆర్ఐ యంత్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆస్పత్రికి 203 పోస్టులు మంజూరు చేయించామని, అవసరమైన వైద్య సిబ్బంది నియామకానికి కూడా కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్రప్రసాద్, వైద్యులు, డీసీసీ అధ్యక్షుడు బట్టు కర్ణాకర్, నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు -
కొనట్లే..
● రోజుల తరబడి కేంద్రాల వద్ద రైతుల పడిగాపులు ● తేమ, తాలు పేరిట జాప్యం ● కొనుగోలు చేసింది 239 మెట్రిక్ టన్నులు మాత్రమే.. ● ప్రైవేట్ వైపు మొగ్గు చూపుతున్న అన్నదాతలుకాటారం: జిల్లావ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసినప్పటికీ కాంటాలు మాత్రం కావడం లేదు. రైతులు రోజుల తరబడి తమ ధాన్యంతో కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. నిర్వాహకులు మాత్రం తేమ, తాలు పేరుతో కొనుగోలు చేయడానికి జాప్యం చేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా 239 టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. పలువురు రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించి మద్దతు ధరతో సంబంధం లేకుండా తమ ధాన్యాన్ని విక్రయించి నష్టపోతున్నారు. జిల్లామొత్తం అదే పరిస్థితి.. భూపాలపల్లి జిల్లావ్యాప్తంగా వరి కోతలు నెలరోజుల క్రితమే ప్రారంభకాగా.. ధాన్యం రైతుల చేతికి వచ్చింది. గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల స్థలంలో రైతులు తమ ధాన్యాన్ని నిల్వ చేసి ఆరబెట్టారు. కొనుగోలు కేంద్రాలు ఆరబోసిన ధాన్యంతో కిక్కిరిసి పోతున్నాయి. నిర్వాహకులు తేమ, తాలు పేరిట కొనుగోళ్లలో జాప్యం చేస్తున్నారు. తేమ శాతం 17 ఉంటే అభ్యంతరం లేకుండా కొనుగోలు చేయాలని కలెక్టర్, ఉన్నతాధికారులు ఆదేశించినప్పటికీ నిర్వాహకులు మాత్రం తేమశాతం 14 ఉంటేనే కొనుగోలు చేస్తామని తేల్చిచెపుతున్నారు. కాటారం మండలంలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. దీంతో రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకోవడానికి 10 రోజులకు పైగా కేంద్రాల వద్ద ఉండాల్సి వస్తుంది. రైతుల సమయం వృథా కావడంతో పాటు ఆర్థిక భారం పెరుగుతుంది. ఇవన్నీ కారణాలతో కొనుగోళ్లు ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. ప్రైవేట్ వైపు మొగ్గు.. ప్రభుత్వం నుంచి సన్నరకం ధాన్యానికి మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2389, బోనస్ రూ.500, దొడ్డు రకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ. 2369 అందుతుంది. ప్రైవేట్ వ్యాపారులు, మిల్లర్లు రైతు నుంచి సన్నరకం ధాన్యం రూ.2300, దొడ్డు రకం ధాన్యం రూ.2100 చొప్పున క్వింటాల్‌కు 2 నుంచి 3 కిలోల తరుగుతో కొనుగోలు చేస్తుండటం రైతులు అధికశాతం ప్రైవేట్ వైపు అమ్మడానికే ఆసక్తి చూపుతున్నారు. సన్నరకం ధాన్యం పండించిన రైతులు బోనస్ రూ.500 నష్టపోతున్నప్పటికీ తప్పనిసరి సరిస్థితుల్లో ప్రైవేట్‌కు విక్రయించక తప్పడం లేదని చెప్పుకొస్తున్నారు.వరి సాగు 1,11,230 ఎకరాలు కొనుగోలు కేంద్రాలు 204 ప్రారంభమైనవి 180 ధాన్యం దిగుమతి 2లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరణ లక్ష్యం 1.52 లక్షల మెట్రిక్ టన్నులుఇప్పటి వరకు సేకరించిన ధాన్యం 239 మెట్రిక్ టన్నులు -
టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి
భూపాలపల్లి అర్బన్: ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నక్క తిరుపతి, కొత్త కుమారస్వామి కోరారు. ఈ మేరకు మంగళవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఈ మెయిల్ ద్వారా ఉత్తరాలు పంపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ నెలాఖరులోగా లోక్‌సభ, రాజ్యసభ సభ్యులను కలిసి వినతి పత్రాలు అందజేస్తామన్నారు సుప్రీంకోర్టు తీర్పు వచ్చి రెండు నెలలు గడుస్తున్నా తీర్పుపై సమీక్ష కోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోలేదన్నారు. డీఎస్సీ పరీక్ష రాసి ఉపాధ్యాయులుగా ఎంపికై న వారిని ఇప్పుడు అర్హత పరీక్ష రాయాలి అనడం హాస్యాస్పదమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంపత్, సుకుమార్, రాజుకుమార్, కన్నయ్య, సురేష్, హరిప్రసాద్, తిరుపతి, కుమారస్వామి పాల్గొన్నారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన భూపాలపల్లి అర్బన్: కేంద్రం ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఏరియాలోని సింగరేణి గనుల్లో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య మాట్లాడుతూ.. కేంద్ర న్రభుత్వం 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లు మార్చి కార్మికులను కార్పొరేట్లకు కట్టు బానిసలుగా మార్చిందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు జనార్దన్, నర్సయ్య, ప్రసాద్‌రెడ్డి, శంకర్, శ్రీనివాస్, పవన్, మల్లేష్, సాజిత్ పాల్గొన్నారు. ఆలయ నిర్మాణానికి కృషి చిట్యాల: మండలంలోని నైన్పాక గ్రామంలోని నాపాక ఆలయాన్ని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా హైదరాబాద్ సర్కిల్ ఆధికారిని రోహిణి మంగళవారం సందర్శించి ఆలయ నిర్మాణానికి కృషి చేస్తానని అన్నారు. అనంతరం ఆలయ విశిష్టతను తెలుసుకున్నారు. ఒకే శిలకు నాలుగు దేవతామూర్తులు కలిగిన ఆలయం ఉండడం దేశంలో ఎక్కడా చూడలేదన్నారు. అనంతరం ఆలయం చుట్టు, ప్రాంగణం కొలతలు తీసుకున్నారు. ఆలయ అభివృద్ధి కోసం, పర్యాటకులకు కావాల్సిన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడుతామని పేర్కొన్నారు. ఆమె వెంట ఆలయ పూజారి పెండ్యాల ప్రభాకరాచార్యులు, ఆలయ చైర్మన్ యాదండ్ల రాజయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గూట్ల తిరుపతి, గ్రామస్తులు ఉన్నారు. బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలి భూపాలపలి అర్బన్: విధులు నిర్వర్తిస్తూ మృతిచెందిన మున్సిపల్ కార్మికుడు బొల్లి రాజయ్య కుటుంబానికి ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికులు చేపడుతున్న దీక్షలు మంగళవారం రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలను గండ్ర వెంకటరమణారెడ్డి సందర్శించి సంఘీభావం తెలిపి మాట్లాడారు. బొల్లి రాజయ్య విధి నిర్వహణలో మృతిచెందితే అధికారులు వారిపై చూపే నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు, బీఆర్ఎస్ నాయకులు సదానందం, వెంకన్న, బాబు, రాజన్న, బద్రి, రవీందర్ పాల్గొన్నారు. -
అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి
● కేవీఐబీ రిటైర్డ్ డైరెక్టర్ అశోక్‌కుమార్ కాటారం: నిరుద్యోగ యువత ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఆర్థిక అభివృద్ధి దిశగా ముందుకెళ్లాలని కేవీఐబీ రిటైర్డ్ డైరెక్టర్ అశోక్‌కుమార్ అన్నారు. జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఎంఎస్ఎంఈపై మంగళవారం కాటారం ఎంపీడీఓ కార్యాలయంలో అవగాహన కల్పించారు. ఎంటర్ప్రినర్ డెవలప్మెంట్ సెల్ ద్వారా మండలాల్లోని సదుపాయాలను ప్రతి ఒక్కరికీ చేర్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పారిశ్రామికవేత్తలు మండలాల్లో తయారీ రంగాలు, సేవా రంగాల్లో యువతను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాస్థాయిలో వనరులను వినియోగించి ఇండస్ట్రీ పెట్టడానికి ఉన్న సదుపాయాలను ఇండస్ట్రీ సెట్ అప్ తెలియజేయడానికి అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా లేట్ బ్యాంక్ మేనేజర్ తిరుపతి, ఈడీసీ మేనేజర్ వెన్నెల, అసిస్టెంట్ మేనేజర్ నరేందర్, ఎంపీడీఓ బాబు, రాజశేఖర్ పాల్గొన్నారు. -
రిజర్వాయర్ పనుల అడ్డగింత
కాటారం: చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా కాటారం మండల కేంద్రంలోని గారెపల్లి రిజర్వాయర్ వద్ద కొనసాగుతున్న పనులను మంగళవారం నిర్వాసిత రైతులు అడ్డుకున్నారు. పరిహారం తేల్చకుండా పనులు చేపట్టవద్దని జేసీబీ ఎదుట కూర్చొని పనులను నిలిపేశారు. తాము భూములు కోల్పోయి ఏళ్లు గడుస్తున్నప్పటికీ పరిహారం అందించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. భూములు కోల్పోయి, పరిహారం అందక తాము రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరిగేషన్ అధికారులు, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ రైతులు వినలేదు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఆందోళనలో రైతులు విష్ణు, రాజయ్య, ఆశయ్య, మల్లక్క, వెంకటమ్మ ఉన్నారు. -
ఆర్టిజన్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలి
గణపురం: విద్యుత్ రంగ సంస్థలలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులను వెంటనే రెగ్యులరైజేషన్ చేయాలని విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) చైర్మన్ సుంకు సతీష్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం గణపురం మండలం చెల్పూరు కేటీపీపీ ప్రధాన గేట్ ఎదుట గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సతీష్‌రెడ్డి మాట్లాడుతూ 23 వేల మంది కార్మికులను రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా ఏపీ ఎస్సీబీ రూల్స్(కన్వర్షన్) ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో డిసెంబర్ మొదటివారంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. సమ్మెకు సైతం సిద్ధంగా ఉన్నామని తెలిపారు. -
పల్లెపోరుకు సై..
భూపాలపల్లి: పల్లెపోరుకు అంతా సిద్ధమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం రాత్రి గ్రామ పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ తెలిపి షెడ్యూల్ విడుదల చేసింది. మూడు విడతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈసీ ప్రకటనతో ఓవైపు జిల్లా అధికారులు ఎన్నికల నిర్వహణ పనుల్లో నిమగ్నమవగా, గ్రామాల్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. రెండు డివిజన్లు.. మూడు విడతలు.. జిల్లాలోని భూపాలపల్లి, కాటారం రెవెన్యూ డివిజన్లలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి. 12 మండలాల్లో 248 గ్రామ పంచాయతీలు, 2,102 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మొదటి దశ ఎన్నికలకు సంబంధించి రేపటి(గురువారం) నుంచి నామినేషన్లు స్వీకరించనుండగా, డిసెంబర్ 11వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తారు. రెండవ విడత ఎన్నికలు డిసెంబర్ 14, మూడవ విడత 17వ తేదీన జరుగనున్నాయి. ఎన్నికల సంఘం షెడ్యుల్‌ను విడుదల చేయడంతో జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అధికారులు సిద్ధం.. ఎన్నికలను పకడ్భందీగా నిర్వహించేందుకు జిల్లా అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఆర్ఓలు, ఏఆర్ఓలు, పీఓ, ఓపీఓల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. పోలింగ్ సెంటర్లు, సీసీ కెమెరాల ఏర్పాటు, ఫ్లయింగ్ స్క్వాడ్, మోడల్ కోడ్ పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్భందీగా నిర్వహించేందుకు కలెక్టర్ రాహుల్ శర్మ ముందు నుంచే సన్నద్ధంగా ఉన్నారు. పల్లెల్లో పోటాపోటీ.. గతంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగా రిజర్వేషన్ల వివాదం కోర్టుకెక్కి ఎన్నికలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈసారి నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం.. పంచాయతీ ఎన్నికలకు వెళ్తుండటంతో అవాంతరాలు తలెత్తే అవకాశం లేదు. దీంతో సర్పంచ్, వార్డుస్థానాలకు బరిలో నిలిచే అభ్యర్థులు ముందుకు వస్తున్నారు. ఓవైపు తమ పార్టీ మద్ధతు కోసం నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ, మరోవైపు పల్లె ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇప్పటి నుంచే పడరాని పాట్లు పడుతున్నారు. ఇదిలా ఉండగా స్థానికంలో పాగా వేసేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. గెలుపు గుర్రాలకు టికెట్లు ఇవ్వడమేకాక స్థానికంగా పట్టు సాధించేందుకు తీవ్రంగా యత్నిస్తున్నాయి. టేకుమట్ల మండలం సోమనపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం మూడు విడతల్లో డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో ఎన్నికలు అమల్లోకి వచ్చిన కోడ్ జిల్లాలో 248 జీపీలు, 2,102 వార్డులు పల్లెల్లో మొదలైన రాజకీయ వేడి -
రిజర్వేషన్లను పునఃపరిశీలించాలి
భూపాలపల్లి రూరల్: మహాముత్తారం, పలిమెల మండలాల్లో గ్రామపంచాయతీల రిజర్వేషన్లలో ఉన్న లోపాలపై పునఃపరిశీలించి సవరణ చేయాలని బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో సోమవారం అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్‌కు వినతి ఇచ్చారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. మహాముత్తారం, పలిమెల మండలాల్లో బీసీలకు కేటాయించలేదన్నారు. వార్డుల్లోనూ బీసీలకు ప్రాధాన్యం కల్పించలేదని చెప్పారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో జేఏసీ నాయకులు పైడిపెల్లి రమేష్, క్యాతరాజు సాంబమూర్తి, గట్ల రాజన్న తదితరులు ఉన్నారు. దేశభక్తిని పెంపొందించుకోవాలి చిట్యాల: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలలో భాగంగా యువత దేశభక్తిని పెంపొందించుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఏడునూతల నిశిధర్‌రెడ్డి అన్నారు. వందేమాతరం జాతీయ గేయం 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం మండలకేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు బుర్ర వెంకటేష్‌గౌడ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిశిధర్‌రెడ్డి హాజరై మాట్లాడారు. వందేమాతరం గేయం భారత స్వాతంత్య్ర సమరంలో ప్రజలకు స్ఫూర్తి దాయకంగా మారి దేశవ్యాప్త ఉద్యమాలకు ప్రేరణ ఇచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు. అక్రమ రవాణాను అరికట్టేందుకు చెక్‌పోస్టు కాళేశ్వరం: మహారాష్ట్ర మీదుగా ధాన్యం అక్రమ రవాణాకు చెక్‌పెట్టేందుకు ఖరీఫ్ సీజన్లో చెక్‌పోస్టును ఏర్పాటు చేసినట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి (డీసీఎస్ఓ) కిరణ్‌కుమార్ అన్నారు. సోమవారం మహాదేవపూర్ మండలం కాళేశ్వరం సమీపంలోని కన్నెపల్లి వద్ద అంతర్రాష్ట్ర సరిహద్దు తనిఖీ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహారాష్ట్ర నుంచి ధాన్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీస్, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారి బృందాలు రెండు షిఫ్టులుగా 24/7 విధుల్లో ఉంటూ ఈ తనిఖీ కేంద్రం ద్వారా పర్యవేక్షణ చేపట్టనున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మహదేవపూర్ రామారావు, మండల వ్యవసాయ అధికారి సుప్రజ్యోతి, సివిల్ సప్లై విభాగం డీఎం రాములు, కాళేశ్వరం ఎస్సై జి.తమాషారెడ్డి, ఆర్ఐ సురేందర్‌రెడ్డి, రఘు, జీపీఓ శ్యామ్ పాల్గొన్నారు. ఆపరేటర్ల సమస్యలు పరిష్కరించాలి భూపాలపల్లి అర్బన్: మీసేవ ఆపరేటర్లు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించి, నూతన మీ సేవల ఏర్పాట్లను విరమించుకోవాలని తెలంగాణ మీసేవ ఆపరేటర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొత్త కిరణ్‌కుమార్ కోరారు. వాట్సప్ ద్వారా మీసేవ సర్వీసులను రద్దు చేయాలని, నూతన మీ సేవ కేంద్రాల ఏర్పాటును విరమించుకోవాలని కోరుతూ సోమవారం జిల్లా వ్యాప్తంగా మీ సేవల బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ అశోక్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం కిరణ్‌కుమార్ మాట్లాడుతూ.. పది సంవత్సరాల క్రితం నుంచి ఉన్న కమిషన్ విధానమే నేటికీ కొనసాగుతుందని కమిషన్ పెంచాలని కోరారు. కొద్దిపాటి కమిషన్‌తోనే మీ సేవలో నడిపిస్తున్నామని, పెరిగిన ఖర్చులతో ఇబ్బందికరంగా మారిందన్నారు. గతంలో తొలగించిన సర్వీసులు తిరిగి పునరుద్ధరించాలని, జీవనోపాధి భద్రత దృష్ట్యా భరోసా కల్పించే విధంగా ఉత్తర్వులు అందించాలన్నారు. -
పోస్టర్ ఆవిష్కరణ
భూపాలపల్లి అర్బన్: ఈ నెల 28న టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ భవన్లో నిర్వహించనున్న ఉద్యోగుల సమస్యల పరిష్కార సభ వాల్ పోస్టర్‌ను సోమవారం జిల్లా కేంద్రంలో ఆవిష్కరించారు. కలెక్టరేట్లో ఆవిష్కరించిన ఈ కార్యక్రమానికి టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు బూరుగు రవి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఉద్యోగుల సమస్యలు చాలా కాలం నుంచి పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. 2023 సంవత్సరం నుంచి ఉద్యోగులకు రావాల్సిన పీఆర్సీ, పెండింగ్ డీఏలు విడుదల చేయాలన్నారు. ఓపీఎస్ అమలు చేయాలని కోరారు. పంచాయతీ కార్యదర్శుల, కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల, అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి దశరథ రామారావు, వరంగల్ జిల్లా కా ర్యదర్శి గాజే వేణుగోపాల్, రాష్ట్ర బాధ్యులు రామునాయక్, బింగి సురేష్, లక్ష్మి ప్రసాద్ పాల్గొన్నారు. -
మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం
రేగొండ(కొత్తపల్లిగోరి): కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకుపోతున్నట్లు రాష్ట్ర సీ్త్ర, శిశు, సంక్షేమ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. సోమవారం కొత్తపల్లిగోరి మండల కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నదే ప్రజా ప్రభుత్వ సంకల్పమన్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలకు 27వేల కోట్ల వడ్డీలేని రుణాలు అందించామని తెలిపారు. మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇండ్లకు ఆరు కోట్ల రుణాలు అందించినట్లు తెలిపారు. మహిళలు ఆకాశంలో సగమని, పురుషులతో సమానంగా అభివృద్ధి సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఆర్డీఓ బాలకృష్ణ, భూపాలపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ కిష్టయ్య, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్వరరావు, తహసీల్దార్ రాజయ్య, ఇన్చార్జ్ ఎంపీడీఓ రాంప్రసాద రావు, ఏపీఎం ప్రేమ్‌రాజ్, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.సీ్త్ర, శిశు సంక్షేమ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క -
మహిళల ఆర్థిక బలోపేతమే లక్ష్యం
భూపాలపల్లి: జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం ద్వారా వడ్డీలేని రుణాలు మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. వడ్డీ లేని రుణాలు పంపిణీపై సోమవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సూచనలు, సలహాలు అందించారు. అనంతరం కలెక్టర్ రాహుల్ శర్మ వివిధ శాఖల జిల్లా అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. 2024 ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు జిల్లాలో మొత్తం 6,037 స్వయం సహాయక సంఘాలకు రూ. 221.73 కోట్ల వడ్డీలేని రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మహిళా సంఘాలకు భారీ స్థాయిలో ఆర్థిక సహకారం అందించినట్లు చెప్పారు. ప్రభుత్వం తాజాగా మంజూరు చేసిన వడ్డీలేని రుణాల పంపిణీ కార్యక్రమం మంగళవారం మొగుళ్లపల్లి మండలకేంద్రంలోని ఫంక్షన్ హాలులో ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి.. ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ తెలిపారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో 61 దరఖాస్తులు వచ్చాయని అదనపు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రవి, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ నవీన్‌రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలి రేగొండ(కొత్తపల్లిగోరి) : విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని కలెక్టర్ రాహుల్‌శర్మ పేర్కొన్నారు. కొత్తపల్లిగోరి మండలకేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతుల్లో డిజిటల్ బోధన వినియోగిస్తున్న విధానాలపై ఉపాధ్యాయలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో పాఠాలు చదివించి అభినందించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ లక్ష్మీ రాజయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్ శర్మ -
గర్భిణుల నరకయాతన
నిరుపయోగంగా ఉన్న ఆపరేషన్ థియేటర్ ● గైనకాలజిస్టు లేక ఇబ్బందులు ● సేవలకు జిల్లాకేంద్రమే దిక్కు.. ● పట్టించుకోని పాలకులు, అధికారులుచిట్యాల: ఒకప్పుడు రాష్ట్రస్థాయిలో మంచి గుర్తింపు పొందిన చిట్యాల సివిల్ ఆస్పత్రి ఇప్పుడు గైనకాలజిస్ట్ లేక గర్భిణులు, బాలింతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సేవలకు జిల్లాకేంద్రంలోని వంద పడకల ఆస్పత్రికి వెళ్తూ ప్రయాణంలో నరకయాతన పడుతున్నారు. గైనకాలజిస్ట్ లేక నెలలు గడుస్తున్నప్పటికీ పాలకులు, అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. సమీక్షలకే పరిమితం.. సివిల్ ఆస్పత్రిలో ఆస్పత్రి వైద్య బృందం, సిబ్బందితో మే 12న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సమీక్ష నిర్వహించి సమస్యల పరిష్కారానికి, వైద్యుల నియామకానికి కృషి చేస్తానని చెప్పారు. సమీక్ష నిర్వహించి ఏడు నెలలు అవుతున్నా ఇప్పటి వరకు ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారానికి నోచుకోలేదు. ఇప్పటికై నా ఆస్పత్రి సమస్యలను పరిష్కరిస్తే పేద ప్రజలకు స్థానికంగా వైద్యం అందే అవకాశం ఉంటుంది. ప్రతిపక్షమూ పట్టించుకోవట్లే.. జూలైలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆస్పత్రిని సందర్శించి వైద్యసేవలను పూర్తి స్థాయిలో రోగులకు అందించాలని.. గైనకాలజిస్టుని నియమించకుంటే బీఆర్ఎస్ నాయకులతో కలిసి దీక్ష చేస్తామని చెప్పారు. చెప్పి ఐదు నెలలైనా ఇప్పటి వరకు మరోసారి ఆస్పత్రి కోసం మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి రాలేదు. నాయకులు రాజకీయాల కోసం ఆస్పత్రి సమస్యలను వాడుకుంటున్నారే తప్ప నిజంగా ఆస్పత్రి అభివృద్ధి కోసం కాదని పలువురు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. ఆస్పత్రిలో గైనకాలజిస్ట్‌ను నియమించాలని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన. సానుకూలంగా స్పందించారు. వారం రోజుల్లో డాక్టర్‌ను నియమించే అవకాశం ఉంది. గతంలో వలే నాణ్యమైన వైద్యసేవలను పేదలకు అందిస్తాం. – డాక్టర్ శ్రీకాంత్, చిట్యాల సివిల్ ఆస్పత్రి సూపరింటెండెంట్నా కోడలుకు ఆరు రోజుల కిత్రం పురుటి నొప్పులు రావడంతో భూపాలపల్లి ఆస్పత్రికి తీసుకెళ్లాము. అక్కడికి వెళ్లేందుకు సుమారు రెండున్నర గంటల సమయం పట్టింది. డెలివరీ అయి తిరిగి వస్తున్నప్పుడు తల్లీబిడ్డలతో ప్రయాణంలో ఇబ్బంది పడుతూ వచ్చాం. చిట్యాలలో డాక్టర్ ఉంటే బాగుండు. ఇప్పటికై నా ఏర్పాటుచేస్తే గర్భిణులకు ఉపయోగం ఉంటుంది. – కొలిపాక శారద, పెద్దంపల్లి, టేకుమట్ల●చిట్యాల సివిల్ ఆస్పత్రికి రాష్ట్రస్థాయిలో గుర్తింపు రావడానికి అప్పటి వైద్యాధికారి రవిప్రవీన్‌రెడ్డి, గైనకాలజిస్టు డాక్టర్ స్నిగ్ధసంస్కృతి ప్రత్యేక కృషి చేశారు. ప్రస్తుతం సివిల్ ఆస్పత్రిలో సీ్త్రల వైద్య నిపుణులు లేక టేకుమట్ల మండలంలోని వెలిశాల, ఒడితల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని గ్రామాల గర్భిణులు, బాలింతలను 102లో జిల్లా కేంద్రానికి తరలిస్తున్నారు. పేరుకే పెద్దాస్పత్రి కానీ డాక్టర్ లేరని, నిత్యం వందల మందికి వైద్య సేవలను అందించే ఆస్పత్రిలో పరికరాలు సైతం మూలాన పడడంతో అత్యవసర సమయంలో వచ్చిన రోగులను వరంగల్ ఎంజీఎం, భూపాలపల్లి 100పడకల ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఆపరేషన్ థియేటర్ సైతం నిరుపయోగంగా మారింది. -
బడులకు క్రీడానిధులు
భూపాలపల్లి అర్బన్: క్రీడలు విద్యార్థుల్లో శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందిస్తాయి. ఆత్మవిశ్వాసం, మానసిక చురుకుదనానికి దోహదం చేస్తాయి. ఈ మేరకు పాఠశాల స్థాయిలోనే విద్యార్థులు క్రీడల్లో రాణించేలా ప్రభుత్వం ఫోకస్ పెంచింది. ఇందులో భాగంగా 2025–26 విద్యా సంవత్సరానికి తెలంగాణ సమగ్ర శిక్ష ద్వారా సర్కారు బడులకు 50 శాతం క్రీడా నిధులు మంజూరు చేసింది. ఆటలపై శిక్షణతో పాటు క్రీడా సామగ్రికి వీటిని వెచ్చించనున్నారు.రెండు విడతల్లో.. పాఠశాల స్థాయిలో క్రీడలకు అవసరమైన నిధులు మొదటి విడతలో 50 శాతం విడుదల చేశారు. ప్రాథమిక పాఠశాలలకు రూ.5 వేలు, ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ.10 వేలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు రూ.25 వేల చొప్పున చెల్లించనున్నారు. షాట్‌ఫుట్, డిస్కస్‌త్రో, స్కిప్పింగ్, సాఫ్ట్‌బాల్, టెన్నిస్‌బాల్, వాలీబాల్, హ్యాండ్ బాల్, త్రోబాల్ తదితర ఆటవస్తువులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. పాఠశాలలకు కేటాయించిన స్పోర్ట్స్ గ్రాంట్‌ను గైడ్‌లైన్స్ ప్రకారం ఖర్చుచేయాల్సి ఉంటుంది. నిధులతో ఆట స్థలాలు చదును వంటి పనులు చేయించరాదనే ఆదేశాలు ఉన్నాయి. ఆటవస్తువులు కొనుగోలు చేసి ఫొటో తీయాలనే నిబంధనలు విధించారు. గ్రాంట్ సద్వినియోగం చేసుకుని విద్యార్థులను క్రీడాపోటీల్లో ప్రోత్సహించాలని అధికారులు ఆదేశించారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పాఠశాల స్థాయి క్రీడలను ప్రోత్సహిస్తోంది. విద్యార్థులకు కావాల్సిన ఆటల పరికరాలు లేకపోవడంతో క్రీడల్లో వెనుకబడి పోతున్నారు. ప్రస్తు తం విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా నిధులు కేటా యించడం శుభ పరిణామం. ఈ విధంగా పాఠశాల క్రీడలకు నిధులు కేటాయించినట్లయితే గ్రామీణ క్రీడాకారులు ప్రతిభ కనబరుస్తారు. – ఎల్.జయపాల్, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శిప్రభుత్వం నుంచి పాఠశాలల అభివృద్ధికి, విద్యార్థులకు కావాల్సిన నిధులు వస్తున్నాయి. వాటిని సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలి. క్రీడా పరికరాల కొనుగోలు కోసం వచ్చిన నిధులతో నిబంధనల ప్రకారం కొనుగోలు చేయాల్సి ఉంటుంది. విద్యార్థులను ఆటల్లో ప్రోత్సహించాలి. – రాజేందర్, జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారిప్రైమరీ, యూపీఎస్, ఉన్నత పాఠశాలలకు ఇలా.. జిల్లాలోని ప్రభుత్వం పాఠశాలల్లో విధ్యార్థులతో సంబంధం లేకుండా ప్రతి పాఠశాలకు ప్రభుత్వం నిధులు కేటాయించింది. జిల్లాలో 317 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఉండగా పాఠశాలకు రూ.5వేల చొప్పున రూ.15.85 లక్షలు, 44 ప్రాథమికోన్నత పా ఠశాలలకు రూ.10వేల చొప్పున రూ.4.40 లక్షలు, 70 జిల్లా పరిషత్ పాఠశాలలకు రూ.25వేల చొప్పున రూ.17.50 లక్షలు మంజూరయ్యాయి. మొదటి విడత 50 శాతం మంజూరు శిక్షణతో పాటు క్రీడాసామగ్రి కొనుగోలు -
రాష్ట్రస్థాయి పోటీలకు గురుకుల విద్యార్థి..
కాటారం: కాటారం మండలకేంద్రంలోని గిరిజన గురుకుల సంక్షేమ బాలుర పాఠశాలకు చెందిన నిఖిల్ అనే విద్యార్థి రాష్ట్ర స్థాయి అండర్ 17 విభాగం ఖోఖో పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 25న యాదాద్రి భువనగిరిలో జరగనున్న రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో వరంగల్ జట్టు తరఫున నిఖిల్ పాల్గొననున్నట్లు ఎస్జీఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జైపాల్, ప్రిన్సిపాల్ రాజేందర్ తెలిపారు. ఈ మేరక వైస్ ప్రిన్సిపాల్ మాధవి, జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ వెంకటయ్య, పీడీ మహేందర్, పీఈటీ మంథెన శ్రీనివాస్, కోచ్ వెంకటేశ్, ఉపాధ్యాయులు విద్యార్థిని అభినందించారు. -
నత్తనడకన పనులు
● మేడారం మహాజాతరకు సమీపిస్తున్న గడువు ● మిగిలింది ఇంకా 65రోజులే.. ● కొనసాగుతున్న అభివృద్ధి పనులు ● డిసెంబర్ 20 కల్లా పనులు పూర్తిచేయాలని మంత్రుల ఆదేశం ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మల మహాజాతర వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు జరగనుంది. ఈ మహాజాతరకు ఇంకా 65 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న అభివృద్ధి పనులు ఇంకా సాగుతూనే ఉన్నాయి. డిసెంబర్ 20 కల్లా ప నులన్నీ పూర్తి చేయాలని మంత్రులు ఆయా శాఖల అధికారులను ఆదేశించినా డెడ్‌లైన్ నాటికి పనులు పూర్తయ్యేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. హడావుడిగా రోడ్డు విస్తరణ పనులు మేడారం కాలనీ నుంచి ఊరట్టం స్తూపం వరకు 3 కిలోమీటర్ల వరకు రూ. 27 కోట్లతో ఆర్‌అండ్‌బీశాఖ ఆధ్వర్యంలో రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. 3 కిలో మీటర్ల మేర పనులు చేపట్టగా ప్రస్తుతం 1.2 కిలో మీటర్ల వరకు సీసీ రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు. మిగిలిన పనులు సాగుతున్నాయి. ఇటీవల నిర్వహించిన సమీక్షలో మంత్రులు డెడ్‌లైన్ విధించడంతో పనుల్లో పురోగతి కోసం హడావుడిగా చేపడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. డిసెంబర్ నెలాఖరు వరకు పనులు పూర్తి చేస్తామని ఈఈ శ్యామ్సింగ్ తెలిపారు. ఆర్డబ్ల్యూఎస్ పనులు అక్కడే.. మేడారంలో ఆర్డబ్ల్యూఎస్ శాఖ ఆధ్వర్యంలో మేడారంలో ఓహెచ్‌ఆర్ వాటర్ ట్యాంక్ నిర్మాణం పనులు మాత్రమే సాగుతున్నాయి. తాత్కాలిక జీఐ షీట్స్ మరుగుదొడ్లు, తాగునీటి పైపులైన్ పనులు మొదలు కాలేదు. మేడారంలో తాగునీటి కోసం 65 బోర్లు, 120 చేతి పంపులు ప్లషింగ్ పనులు చేస్తున్నారు. జంపన్నవాగు పరిసరాల్లో మిని వాటర్ ట్యాంకుల మరమ్మతుల పనులతో పాటు జీఐ షీట్స్ మరుగుదొడ్ల నిర్మాణాలకు తాడ్వాయి గోదాం నుంచి కాంట్రాక్టర్లకు మెటీరియల్‌ను అప్పగించారు. వరి కోతల కారణంగా టాయిలెట్లు, తాగునీటి పనులు మొదలు కాలేదని అధికారులు చెబుతున్నారు. ప్రహరీ పనులు అంతంతే.. అమ్మవార్ల గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం పనులు అంతంత మాత్రంగానే కొనసాగుతున్నాయి. సా లహారం(ప్రహరీ) నిర్మాణం పనుల్లో భాగంగా గద్దెల చుట్టూ బీమ్ నిర్మాణం పనులు పూర్తవ్వగా ఆ ర్చీల నిర్మాణానికి ఇంకా కొంత మేరకు సీసీ పనులు నడుస్తున్నాయి. ప్రస్తుతం పూర్తయిన బీమ్‌లపై రా తి పిల్లర్లను ఏర్పాటు చేస్తున్నారు. పగిడిద్దరాజు, గో విందరాజు నూతన గద్దెల నిర్మాణానికి స్టోన్స్ ఏ ర్పాటు చేస్తున్నారు. గద్దెలప్రాంగణం పునర్నిర్మా ణం సమయానికి పూర్తయ్యేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నా లక్ష్యం నాటికి పనులు పూర్తి చేస్తామని అధికారులు దీమా వ్యక్తం చేస్తున్నారు. 12 బావుల్లో పూడికతీత పూర్తి.. ఇరిగేషన్‌శాఖ ఆధ్వర్యంలో జంపన్నవాగులో 22 ఇన్‌ఫిల్టరేషన్ బావుల్లో పూడికతీత పనులు చేయాల్సి ఉండగా ప్రస్తుతం 12బావుల్లో పూడిక పనులు పూర్తయాయి. ఇంకా ఇసుక లెవంలింగ్ పనులు మొదలు పెట్టాల్సి ఉంది. వాగులో ఇసుక వరదకు కొట్టుకపోవడంతో బయట నుంచి లెవలింగ్ కోసం ఇసుక తీసుకొచ్చి పోయాల్సి వస్తుందని డీఈఈ సదయ్య తెలిపారు. త్వరలో స్నానఘట్టాల పై భక్తుల జల్లు స్నానాల కోసం బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ ఏర్పాటుకు మెటీరియల్ తీసుకొస్తామని వివరించారు. డ్రెయినేజీ పనులు అస్తవ్యస్తం పీఆర్‌శాఖ ఆధ్వర్యంలో మేడారంలో 7 కిలోమీటర్ల డ్రెయినేజీ పనులు సాగుతున్నాయి. రెడ్డిగూడెంలో కిలోమీటన్నర డ్రెయినేజీ పనులు ఇప్పుడిప్పుడే మొదలు పెట్టారు. కొన్నిచోట్ల సైడ్‌వాల్ నిర్మాణం పనులు సమానంగా ఉండకుండా అడందిడ్డం చేస్తున్న విషయం అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. ఈ పనులపై అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. నిబంధనల మేరకు పనులు చేయాలని కార్మికులను మందలించారు. డ్రెయినేజీల నుంచి నీటి సరఫరా సాఫీగా వెళ్లేలా సమాంతరంగా సరిచేయాలని ఆదేశించారు. -
మహిళలందరికీ ఇందిరమ్మ చీరలు
● మంత్రి శ్రీధర్‌బాబు ● భూపాలపల్లి, కాటారంలో ఇందిరమ్మ చీరల పంపిణీభూపాలపల్లి రూరల్/కాటారం: కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. ఆదివారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఏఎస్ఆర్ గార్డెన్, కాటారం మండల కేంద్రంలోని బీఎల్ఎం గార్డెన్లో మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. భూపాలపల్లిలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ అధ్యక్షతన స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశ్యంలో వడ్డీలేని రుణాలు అందిస్తున్నామని, మహిళల పేర్ల మీదనే ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ అందిస్తున్నాని స్పష్టంచేశారు. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందన్నారు. మహిళా సంఘాలకు పాడి పరిశ్రమలకు కృషి చేస్తామని, భూపాలపల్లి, మంథని నియోజకవర్గాలకు ఒకటి చొప్పున పెట్రోల్ బంకుల ఏర్పాటుకు స్థల సేకరణ జరుపుతున్నామన్నారు. కుందూరుపల్లి వద్ద మహిళల కోసం వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని, అక్కడి నుంచి ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామన్నారు ప్రత్యేక అధికారుల నియామకం జిల్లాలో ఇందిరమ్మ చీరల పంపిణీకి ప్రత్యేక అధికారులను నియమించినట్లు కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. జిల్లాలో చీరలు పంపిణీ వైభవంగా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం మార్గదర్శకాలు మేరకు మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులతో పాటు 18 సంవత్సరాలు నిండిన ప్రతీ మహిళకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సంకీర్త్, ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ఐతా ప్రకాష్ రెడ్డి, అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, డీఆర్డీఓ బాలకృష్ణ, ఉపాధి హామీ పథకం రాష్ట్ర సభ్యులు రమేష్, మహిళా సమాఖ్య సంఘాల అధ్యక్ష కార్యదర్శులు సరిత, సుమలత, కోట రాజబాబు, ఏఎంసీ చైర్పర్సన్ పంతకాని తిరుమల, దండ్రు రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎస్పీగా బాధ్యతల స్వీకరణ
భూపాలపల్లి: జిల్లా ఎస్పీగా సిరిసెట్టి సంకీర్త్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. 2020 బ్యాచ్‌కు చెందిన ఈయన రాష్ట్ర గవర్నర్‌కు ఏడీసీగా పని చేస్తున్నారు. ఐపీఎస్ బదిలీల్లో భాగంగా ఎస్పీగా ఉన్న కిరణ్ ఖరేను హైదరాబాద్ సౌత్‌జోన్ డీసీపీగా, సంకీర్త్‌ను భూపాలపల్లి ఎస్పీగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సంకీర్త్ ఆదివారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చి ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. కొత్తగా వచ్చిన ఎస్పీని జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, పోలీసు అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. -
సేవ, ధర్మ మార్గం అనుసరించాలి
భూపాలపల్లి అర్బన్: సత్యసాయిబాబా చూపిన సేవ, ధర్మ మార్గం అనుసరణీయమని జిల్లా యువజన సర్వీసులు క్రీడల శాఖ అధికారి (డీవైఎస్ఓ) సీహెచ్ రఘు తెలిపారు. కలెక్టరేట్లో ఆదివారం సత్యసాయిబాబా శత జయంతి కార్యక్రమం నిర్వహించారు. జిల్లా యువజన క్రీడలశాఖ ఆధ్వర్యంలో జరిగిన జయంతి వేడుకల్లో సత్యసాయిబాబా చిత్ర పటానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ సేవే పరమావధిగా సేవా కార్యక్రమాలు చేపట్టి విశిష్ట స్థానం సంపాదించారన్నారు. ప్రేమ, ఆధ్యాత్మిక బోధనలతో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో యువజన సర్వీసులు శాఖ, సంక్షేమ శాఖల సిబ్బంది రఘు, కృష్ణ, సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా ఎన్ఎంఎంఎస్ ప్రవేశ పరీక్ష
భూపాలపల్లి అర్బన్: జిల్లావ్యాప్తంగా రెండు పరీక్ష కేంద్రాల్లో ఆదివారం నిర్వహించిన నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 245 మంది విద్యార్థులకు 240 మంది, కాటారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 136 మందికి 130 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. పరీక్షాకేంద్రాల్లో పటిష్టమైన పోలీసు బందోబస్తు, 144 సెక్షన్ విధించి, వైద్య శిబి రాలు ఏర్పాటు మౌలిక సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద సిట్టింగ్ స్వ్కాడ్, రెండు ప్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. టెక్నికల్ కోర్సుల పరీక్ష ఫీజు చెల్లించాలి భూపాలపల్లి అర్బన్: టెక్నికల్ కోర్సు సర్టిఫికెట్ డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ పరీక్ష ఫీజును చెల్లించాలని జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ ఆదివారం ప్రకటనలో పేర్కొన్నారు. 2026 ఫిబ్రవరి మాసంలో పరీక్షలు ఉంటాయని, ఆసక్తి గల విద్యార్థులు ఏడో తరగతి ఉత్తీర్ణులైతే లోయర్ గ్రేడ్ పరీక్షకు, లోయర్ గ్రేడ్ ఉత్తీర్ణులైనవారు హయ్యర్ గ్రేడ్ పరీక్షకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నా రు. ఎటువంటి అపరాధం రుసుం లేకుండా డి సెంబర్ 5వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించాలని సూచించారు. రూ.50 అపరాధ రుసుంతో డి సెంబర్ 12వ, రూ.75 అపరాధ రుసుంతో డి సెంబర్ 19వ తేదీ వరకు బ్యాంకు డీడీ ద్వారా పరీక్ష ఫీజు చెల్లించాలని సూచించారు. యాదవ సంఘం జిల్లా కమిటీభూపాలపల్లి రూరల్: జిల్లా యాదవ హక్కుల సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నట్లు కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు కొక్కు దేవేందర్ యాదవ్ తెలిపారు. జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో ఆదివారం జిల్లా అధ్యక్షుడు పంచిక మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో కమిటీ ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా అక్కల బాపుయాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి తోట్ల శ్రీశైలం, జిల్లా యూత్ ప్రెసిడెంట్ బియ్యాని పూర్ణచందర్, జిల్లా సోషల్ మీడియా ఇన్చార్జ్ కాడవేన రాకేష్, టేకుమట్ల మండల అధ్యక్షుడు భాషవేన రాజేందర్, కమిటీ సభ్యులు ఆరబోయిన వెంకటేష్, శేషగిరి యాదవ్‌లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పంచిక కుమార్ స్వామి యాదవ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దొంగల రాజేందర్, మాదం మధు, ఆవుల సంతోష్, రామచంద్ర, తదితరులు పాల్గొన్నారు. వేయిస్తంభాల ఆలయంలో క్లీనింగ్ డ్రైవ్ హన్మకొండ కల్చరల్: వరల్డ్ హెరిటేజ్ వీక్ పురస్కరించుకుని స్వచ్ఛత అభియాన్ క్లీనింగ్ డ్రైవ్‌లో భాగంగా వేయిస్తంభాల ఆలయంలో ఆది వారం స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించా రు. దేవాలయ పురావస్తుశాఖ జిల్లా అధికారి అజిత్, కో–ఆర్డినేటర్ నిరంజన్, ఈఓ అనిల్‌కుమార్, ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, పు రావస్తుశాఖ, దేవాదాయశాఖ సిబ్బంది, స్వ చ్ఛందంగా తరలివచ్చిన విద్యార్థులు పాల్గొని చీపురుకట్టలతో, పారలతో దేవాలయ ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. అధికారి అజిత్ విద్యార్థులతో, పురావస్తుశాఖ సిబ్బందితో ప్రమాణ ప త్రం చదివించి ప్రమాణం చేయించారు. -
రిజర్వేషన్లు ఖరారు
భూపాలపల్లి: పల్లెపోరుకు అంతా సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రిజర్వేషన్లను 50 శాతానికి మించకుండా ఎన్నికలను నిర్వహించేందుకు అధికారులు రెడీ అయ్యారు. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కాగా ఈ నెల 26, 27 తేదీల్లో నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉండటంతో గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది. గెలుపు గుర్రాల కోసం పార్టీలు అన్వేషిస్తుండగా ఆశావహులు ఇప్పటి నుంచే పార్టీ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తొలుత ప్రకటించింది. ఈమేరకు ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమై, సెప్టెంబర్ 27న రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసింది. కాగా రిజర్వేషన్లు 50 శాతం కంటే మించరాదని కోర్టు ఆదేశాలు ఇవ్వడం, గవర్నర్ వద్ద రిజర్వేషన్ల బిల్లు పెండింగ్‌లో ఉండటంతో చేసేది లేక పాత రిజర్వేషన్ పద్ధతిలోనే ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు సర్పంచ్, వార్డు స్థానాలకు ఆదివారం రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మొదలైన ఎన్నికల సందడి ఎట్టకేలకు ఎన్నికల నిర్వహణకు గ్రీన్‌సిగ్నల్ రావడంతో పల్లెల్లో ఎన్నికల సందడి మొదలైంది. సర్పంచ్, వార్డు స్థానాలకు బరిలో నిలిచేందుకు ఆశావహులు సిద్ధమవుతున్నారు. గత ప్రభుత్వంలో వివిధ ప్రభుత్వ పథకాల నిర్వహణకు లక్షలాది రూపాయలు వెచ్చించి బిల్లులు రాక సర్పంచ్‌లు తీవ్ర ఆర్థిక ఇబ్బంది ఎదుర్కొన్నారు. దీంతో గతంలో సర్పంచ్ గిరి చేసిన వారిలో కొందరు మాత్రమే ఈ ఎన్నికల్లో బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపుతుండగా కొత్తవారు, యువత ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో పోటీలో నిలబడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు ఆయా పార్టీల నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కాగా పార్టీల నేతలు మాత్రం గెలుపు గుర్రాల కోసం గ్రామాల్లో అంతర్గత సర్వేలు నిర్వహిస్తున్నారు. మొత్తంగా ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు నుంచే గ్రామాల్లో ఎన్నికల వాతావరణం నెలకొంది. జిల్లాలో 248 సర్పంచ్ 2,102 వార్డు స్థానాలు సర్పంచ్, వార్డు స్థానాలకు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి పార్టీ నేతల చుట్టూ ఆశావహుల ప్రదక్షిణలు అభ్యర్థుల ఎంపికపై పార్టీల నజర్ గ్రామాల్లో వేడెక్కిన రాజకీయంమండలాల వారీగా సర్పంచ్ రిజర్వేషన్లు మండలం జీపీలు ఎస్టీ జీపీలు ఎస్టీ ఎస్సీ బీసీ జనరల్ భూపాలపల్లి 26 2 3 4 5 12 చిట్యాల 26 2 1 5 6 12 గణపురం 17 0 1 3 4 9 కాటారం 24 0 2 8 2 12 కొత్తపల్లిగోరి 16 1 0 3 4 8 మహదేవపూర్ 18 0 2 4 3 9 మహాముత్తారం 24 0 8 4 0 12 మల్హర్ 15 1 1 3 3 7 మొగుళ్లపల్లి 26 0 0 6 7 13 పలిమెల 8 1 2 1 0 4 రేగొండ 23 0 1 4 6 12 టేకుమట్ల 25 0 0 6 6 13 మొత్తం 248 7 21 51 46 123మండలాలు: 12 గ్రామ పంచాయతీలు : 248 వార్డు స్థానాలు : 2,102 పురుష ఓటర్లు : 1,47,388 మహిళ ఓటర్లు : 1,54,744 ఇతరులు : 15 మొత్తం ఓటర్లు : 3,02,147జిల్లా వివరాలు.. -
అడవిని విడిచిన ఆజాద్
సాక్షిప్రతినిధి, వరంగల్ : మావోయిస్టు పార్టీ నేత కొయ్యడ సాంబయ్య అలియాస్ గోపన్న, ఆజాద్ అడవిబాట విడిచారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం మొద్దులగూడెం గ్రామానికి చెందిన ఆయన బీకే–ఏఎస్ఆర్ డివిజనల్ కమిటీ కార్యదర్శి, రాష్ట్ర కమిటీ సభ్యుడిగా వ్యవహరించగా, శనివారం 37మంది సహచరులతో కలిసి రాష్ట్ర డీజీపీ ఎదుట లొంగిపోయాడు. మూడు దశాబ్దాలపాటు మావోయిస్టు పార్టీలో వివిధ కేడర్లలో పనిచేసిన ఆయన చివరకు జనజీవన స్రవంతిలో కలవడం చర్చనీయాంశంగా మారింది. ఆజాద్‌పై కొద్ది రోజులుగా లొంగుబాటు ప్రచారం... ఇటీవల మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ మెంబర్లు మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న ఆయుధాలతో సహా తమ టీమ్‌తో లొంగిపోవడంతో.. ఆజాద్ కూడా లొంగిపోవడానికి ప్రయత్నించినట్టు తెలి సింది. ఈ నెల 15న ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఈయనను స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు కూడా ప్రచారం జరిగింది. ఒక దశలో 16నే ఆయన పోలీ సులకు లొంగిపోయారన్నది కూడా వైరల్ అయ్యింది. వీటిపై స్పందించిన ఆజాద్ తండ్రి సమ్మయ్య తన కుమారుడికి ఎలాంటి హానీ తలపెట్టవద్దని, అరెస్టు చేసి అప్పగించాలని కోరారు. ఈ నేపథ్యంలో ఆజాద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారా? లేక ఆయన లొంగిపోయారా? అన్న చర్చ జరుగుతుండగా.. డీజీపీ శివధర్‌రెడ్డి సమక్షంలో లొంగిపోయారన్న ప్రకటనతో సస్పెన్స్‌కు తెరపడింది. ఇదిలా ఉండగా ఉమ్మడి వరంగల్‌కు చెందిన పలువురు ఎన్కౌంటర్లలో మృతిచెందగా, కొందరు లొంగిపోయారు. ప్రస్తుతం బడే దామోదర్ అలియాస్ చొక్కారావుతో పాటు మరో 16 మందికి పైగా అజ్ఞాతంలో ఉన్నట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. డీజీపీ ఎదుట లొంగిపోయిన కొయ్యడ సాంబయ్య దళసభ్యుడి నుంచి స్టేట్ కమిటీ సభ్యుడి వరకు ప్రస్థానం మూడు దశాబ్దాలుగా అజ్ఞాతవాసం.. డీకేఎస్జడ్సీలో కీలకం ఆయన స్వస్థలం గోవిందరావుపేట మండలంలోని మొద్దులగూడెం అజ్ఞాతంలో మరో 16 మంది ఉమ్మడిజిల్లా వాసులు..? 20 ఏళ్ల వయసులో పీపుల్స్‌వార్ గ్రూపులో చేరిన కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్ మూడు దశాబ్దాలపాటు అజ్ఞాతంలో గడిపారు. దళసభ్యుడి నుంచి తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, బీకే ఏఎస్ఆర్ డివిజనల్ కమిటీ కార్యదర్శిగా ఎదిగారు. దండకారణ్యం స్పెషల్ జోన్లో కీలకంగా వ్యవహరించిన ఈయనపై 50కి పైగా కేసులు ఉన్నాయి. తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దు, ఏఓబీలోనూ పని చేసినట్లు పోలీసు రికార్డులోకెక్కగా, ఎన్ఐఏ హిట్‌లిస్టులో కూడా ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ– ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో దాడులు చేయడానికి కేడర్‌కు శిక్షణ, ఆయుధాల సరఫరా వంటి పనులు చేయడంతోపాటు కొత్త రిక్రూట్మెంట్ బాధ్యతలు నిర్వహించారన్న పేరుంది. ఈ క్రమంలో దండకారణ్యంలో ఎన్కౌంటర్లు జరిగినప్పుడల్లా ఈయన పేరు వినిపించింది. -
కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర
కాటారం/మల్హర్: ఽవరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు మద్దతు ధర లభిస్తుందని ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్‌రెడ్డి అన్నారు. కాటారం మండలం రేగులగూడెం, మల్హర్ మండలం కొయ్యూరు, వల్లెకుంట, ఎడ్లపల్లి, కొండపేట గ్రామాల్లో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలను ఆయన శనివారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆరుగాలం శ్రమించి పంట పండించిన రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. రైతుకు సంబంధించిన చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు చర్యలు చేపట్టాలని సూచించారు. నిబంధనలకు అనుగుణంగా కొనుగోళ్లు సాగించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్పర్సన్ పంతకాని తిరుమల, పీఏసీఎస్ చైర్మన్ తోటపల్లి ప్రశాంత్, ఇప్ప మొండయ్య, మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య, పీఏసీఎస్ వైస్ చైర్మన్ దబ్బెట స్వామి, మల్హర్ మండల వ్యవసాయ అధికారి శ్రీజ, ఏఈఓ అనూష తదితరులు పాల్గొన్నారు. శాసీ్త్రయ పద్ధతిలో తేనెటీగల పెంపకం ఉత్తమం శాసీ్త్రయ పద్ధతిలో తేనెటీగల పెంపకం చేపట్టడం ద్వారా ఉత్తమ ఆదాయ మార్గాలు పొందవచ్చని అయిత ప్రకాశ్‌రెడ్డి అన్నారు. కాటారం ఏఎంసీ చైర్పర్సన్ పంతకాని తిరుమల ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ఏఎంసీలో నిర్వహిస్తున్న తేనెటీగల పెంపకం ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని శనివారం పరిశీలించారు. ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ప్రకాశ్‌రెడ్డి -
డీసీసీ అధ్యక్షుడిగా బట్టు కర్ణాకర్
భూపాలపల్లి: భూపాలపల్లి పట్టణానికి చెందిన బట్టు కర్ణాకర్‌ను కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పార్టీ అధిష్టానం శనివారం నియమించింది. జిల్లాలోని 12 మండలాల నుంచి సుమారు 20 మందికి పైగా డీసీసీ పీఠం కోసం దరఖాస్తు చేసుకోగా కర్ణాకర్‌కు ఈ పదవి దక్కింది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఈయన 2009 నుంచి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. 2011–2016 వరకు ఎన్ఎస్యూఐ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, 2016–2023 వరకు ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా పని చేస్తున్నాడు. విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్ పార్టీలో పని చేస్తున్నందుకు గాను కర్ణాకర్‌కు డీసీసీ పదవి అప్పగించినట్లు తెలిసింది. -
రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపిక
కాళేశ్వరం: మహదేవపూర్ జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాల తొమ్మిదవ తరగతి విద్యార్థి పెద్ది స్నేహ రాష్ట్రస్థాయి హెచ్జీఎఫ్ ఖోఖో పోటీలకు ఎంపికై నట్లు పీఈటీ గుర్సింగ పూర్ణిమ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల హనుమకొండ ప్రాక్టీసింగ్ హైస్కూల్లో 18న ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయి ఖోఖో పోటీలు నిర్వహించగా.. అండర్ 17 ఖోఖో విభాగంలో భూపాలపల్లి జిల్లా తరఫున అత్యంత ప్రతిభ కనపరిచినట్లు తెలిపారు. ఈనెల 23 నుంచి 25 వరకు భువనగిరిలో జరగబోయే రాష్ట్రస్థాయి హెచ్జీఎఫ్ పోటీలలో పాల్గొననున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా హెచ్ఎం జి.శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ స్నేహ రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయికి ఎంపిక కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పి.సరిత, మధు, సుధారాణి, సరితా దేవి, వలిపాషా, శ్రీనివాస్, వసుదప్రియ, వీరేశం, సమ్మయ్య, లీలారాణి, రజిత, షాహెదాబేగం, ప్రసూన, దీపిక, ఆంజనేయులు, అంజద్ పాషా పాల్గొన్నారు. -
నేడు మంత్రి దుద్దిళ్ల పర్యటన
కాటారం: కాటారం, పలిమెల మండలాల్లో నేడు(ఆదివారం) రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పర్యటించనున్నారు. కాటారం మండలకేంద్రంలోని బీఎల్ఎం గార్డెన్స్‌లో నిర్వహించనున్న కాటారం సబ్ డివిజన్ పరిధిలోని మండలాల ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీతో పాటు కాటారం, మహాముత్తారం, మహదేవపూర్, పలిమెల మండలాలకు సంబంధించిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొననున్నారు. అనంతరం పలిమెల మండల కేంద్రంలో రూ.1.50 కోట్లతో నిర్మించనున్న మండల పరిషత్ కార్యాలయ భవనానికి, లెంకలగడ్డ, దమ్మూరులో నూతనంగా నిర్మించనున్న జీపీ భవనానికి శంకుస్థాపన, పలిమెలలో నిర్మించిన జీపీ భవనం ప్రారంభోత్సవం, పలిమెల మండల కేంద్రంలో ఎమ్మార్సీ భవనం, అంగన్వాడీ కేంద్రాలను మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించనున్నారు. నల్ల చట్టాలను రద్దుచేయాలి భూపాలపల్లి అర్బన్: కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన బ్రిటీష్ కాలం నాటి నల్లచట్టాలను రద్దు చేయాలని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య కోరారు. ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ కార్పొరేట్ అనుకూల విధానాలను అనుసరిస్తూ పాత లేబర్ చట్టాలను నాలుగు లేబర్ కోడ్స్లు తీసుకువచ్చిందన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన 29 చట్టాలను యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. వీటికి వ్యతిరేకంగా ఐక్యంగా ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నాయకులు దాసరి జనార్దన్, శ్రీనివాస్, ప్రసాద్‌రెడ్డి, బాపు, జయశంకర్, సాజిత్, నరసింహరెడ్డి, సలీం, మనోజ్ పాల్గొన్నారు. పూజలకు భక్తుల రద్దీ కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయ అనుబంధ దేవాలయంలో శని, కాలసర్ప నివారణ పూజలకు శనివారం భక్తుల రద్దీ నెలకొంది. ఉదయం నుంచి ఆలయంలో శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో కాలసర్ప, నవగ్రహాల వద్ద శనిపూజలను భక్తులు అధికంగా నిర్వహించారు. అనంతరం స్వామివారి గర్బగుడిలో అభిషేక పూజలు చేశారు. దీంతో ఆలయంలో భక్తుల సందడి కనిపించింది. భగవద్గీత శ్లోకాల కంఠస్థ పోటీలు భూపాలపల్లి రూరల్: గీతా జయంతి పురష్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం–హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శనివారం రాధాకృష్ణ గీతా మందిరంలో భగవద్గీత కంఠస్థ పోటీలు నిర్వహించారు. అనంతరం విజేతలకు టీటీడీ కార్యక్రమ నిర్వాహకులు రామిరెడ్డి కృష్ణమూర్తి బహుమతులు అందించారు. పోటీలకు జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి సుమారు 100 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం కన్వీనర్ గూడూరు నరేందర్‌రెడ్డి, ఈలపంటి రాఘవేంద్ర రాజు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలు కేటాయించాలి భూపాలపల్లి రూరల్: బెస్తగూండ్ల గంగపుత్రులకు సంక్షేమ పథకాలు కేటాయించాలని ఆ సంఘం నాయకులు నాగుల అరవింద్ కలెక్టరేట్లో వినతిపత్రం అందజేశారు. మత్స్యశాఖ నుంచి వెలువడుతున్న నిధులను సైతం కేటాయించాలని కోరారు. మత్స్యకారులకు సంబంధించిన కార్యక్రమాల్లో గంగపుత్రుల ప్రతినిధులకు భాగస్వామ్యం చేయాలని కోరారు. -
టెన్త్‌లో ఉత్తమ ఫలితాలు సాధించాలి
● కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి: పదో తరగతిలో ఉత్తమ ఫలితాల సాధనకు మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానో పాధ్యాయులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. శనివారం ఐడీఓసీ సమావేశ మందిరంలో టెన్త్ ఫలితాలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల ముఖ గుర్తింపు హాజరు నమోదు, యుడైస్, ఆధార్, అపార్ జారీ, పాఠశాలల్లో సౌకర్యాల కల్పన తదితర అంశాలపై మండల విద్యాశాఖ అధికారులు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, హెచ్ఎంలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గత సంవత్సరం పదో తరగతి ఫలితాల్లో జిల్లా నుంచి 93.55 శాతం ఫలితాలు సాధించామని, ఈ సంవత్సరం నూరు శాతం ఫలితాలు సాధించేలా కృషి చేయాలన్నారు. ఉపాధ్యాయుల ముఖ గుర్తింపు హాజరు ప్రస్తుతం 68.30 శాతం మాత్రమే ఉండటం బాధాకరమన్నారు. ఉపాధ్యాయుల హాజరు తక్కువగా ఉంటే విద్యార్థుల హాజరు ఎలా పెరుగుతుందని ప్రశ్నించారు. గత నెల జరిగిన సమావేశంలో 32 పాఠశాలల్లో జీరో ఎన్రోల్మెంట్ ఉందని, ప్రస్తుతం వాటికి అదనంగా 7 పెరిగి 39 అయ్యాయని పేర్కొంటూ తగ్గాల్సిన సంఖ్య పెరగడం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, డీఈఓ రాజేందర్, ఎంఈఓలు తదితరులు పాల్గొన్నారు. ‘చిన్న కాళేశ్వరం’పై సమీక్ష.. చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పంట కాలువలకు భూసేకరణ, ఎంజాయ్మెంట్ సర్వే ప్రగతిపై శనివారం కలెక్టర్ రాహుల్ శర్మ ఐడీఓసీ కార్యాలయంలో రెవెన్యూ, ఇరిగేషన్, మెగా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... పంట కాలువల నిర్మాణానికి ఎంత భూమి అవసరం ఉంది.. ఎంత మంది రైతుల భూములు కోల్పోతున్నారు.. ఎన్ని ఎకరాలు అవసరం అవుతుందనే అంశాలపై సమగ్రంగా వివరించారు. పంట కాలువల నిర్మాణానికి ఆటంకాలు లేకుండా వేగంగా సాగేందుకు అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, ఎస్డీసీ రమేష్, ఇరిగేషన్ అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు. -
అందని అల్పాహారం..
కాటారం: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పాఠశాలల్లో అమల్లోకి తీసుకొచ్చిన సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీం నిధుల లేమితో అర్ధాంతరంగా నిలిచిపోయింది. ప్రస్తుతం టెన్త్ విద్యార్థులకు స్టడీ అవర్స్ ప్రారంభం కావడంతో బ్రేక్ ఫాస్ట్ స్కీం ఉంటే ఉపయోగకరంగా ఉండేది. పథకం తీరు ఇలా.. జిల్లాలోని 432 ప్రభుత్వ పాఠశాలల్లో 2023 దసరా కానుకగా సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీంను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించింది. దసరా సెలవుల అనంతరం ప్రభుత్వ పాఠశాలల్లో ఈ పథకం పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చింది. పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు 45 నిమిషాల ముందుగా అల్పాహారం అందించే వారు. సోమవారం ఇడ్లీ సాంబారు లేదా గోధుమ రవ్వ ఉప్మా, చట్నీ, మంగళవారం పూరీ, ఆలూ కూర్మా లేదా టమాట బాత్, సాంబారు, బుధవారం ఉప్మా, సాంబార్ లేదా బియ్యం రవ్వ కిచిడి, చట్నీ, గురువారం చిరుధాన్యాల ఇడ్లీ, సాంబార్ లేదా పొంగల్, సాంబర్, శుక్రవారం ఉగ్గని, అటుకులు, చిరుధాన్యాల ఇడ్లీ, చట్నీ లేదా బియ్యం రవ్వ కిచిడి, చట్నీ, శనివారం పొంగల్, సాంబారు లేదా కూరగాయల పలావ్, పెరుగు చట్నీ, ఆలుకుర్మా అందించాలని మెనూలో పొందుపర్చారు. 2024 ఆగస్టు వరకు సక్రమంగా సాగిన అల్పాహారం స్కీంకు ప్రభుత్వం స్వస్తి పలికింది. నిర్వహణ భారంతో నిలిచిన పథకం.. అల్పాహార పథకం నిర్వహణపై ప్రభుత్వం పెద్దగా దృష్టి సారించలేదనే అభిప్రాయాలు ఉన్నాయి. పథకం నిర్వహణకు సంబంధించిన బిల్లుల చెల్లింపుల్లో ప్రభుత్వం తీవ్ర అలసత్వం వహించడంతో నిర్వాహకులకు భారంగా మారి వారు చేతులెత్తేశారు. పథకం ప్రారంభంలో రెండు నెలల బిల్లులు సక్రమంగా విడుదలైనప్పటికీ గత అసెంబ్లీ ఎన్నికల కోడ్ కారణంగా బిల్లులు నిలిచిపోయాయి. అధికారులు, పాఠశాల ఉపాధ్యాయుల ఒత్తిడితో నిర్వాహకులు ఆర్థిక భారం భరిస్తూ విద్యార్థులకు కొన్ని నెలల పాటు అల్పాహారం అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అల్పాహారం బిల్లుల చెల్లింపు జరగలేదు. దీంతో నిర్వాహకులు ఆర్థిక భారం మోయలేక అల్పాహారం పెట్టడం మానేశారు. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ప్రస్తుతం అల్పాహారం పథకం క్రమంగా కనుమరుగైపోయింది. ప్రభుత్వ పాఠశాలల్లో నిలిచిన సీఎం బ్రేక్‌ఫాస్ట్ స్కీం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పథకానికి శ్రీకారం నిధులు లేక నిలిచిన పథకం మొదలైన టెన్త్ ప్రత్యేక తరగతులుఅయోమయంలో టెన్త్ విద్యార్థులు.. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ప్రారంభమయ్యాయి. దీంతో ఉదయం పాఠశాలకు ముందుగానే వస్తున్నారు. సాయంత్రం ఆలస్యంగా ఇంటికి వెళ్తున్నారు. బ్రేక్‌ఫాస్ట్ సంగతి పక్కన పెడితే.. సాయంత్రం స్నాక్స్ కూడా అందించే పరిస్థితి కనబడటం లేదు. ఆకలితో విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నారు. గతంలో ప్రత్యేక తరగతులకు విద్యాశాఖ ప్రత్యేక నిధులు కేటాయించి స్నాక్స్ అందించింది. ప్రస్తుతం పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నప్పటికీ స్నాక్స్ అందజేతపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. దీంతో విద్యార్థులు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. -
ఆదివారం శ్రీ 23 శ్రీ నవంబర్ శ్రీ 2025
సాక్షిప్రతినిధి, వరంగల్: గ్రామ పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ఈ మేరకు రిజర్వేషన్లకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలతో ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఇందులో సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లపై విధివిధానాలు సూచించారు. ఇప్పటికే కలెక్టర్లతో ఎన్నికల అధికారులు కాన్ఫరెన్స్‌ల ద్వారా ఆదేశాలిచ్చారు. ఈ మేరకు గ్రామ పంచాయతీ ఎన్నికలపై అధికారులు శనివారం నుంచి కసరత్తు ముమ్మరం చేశారు. కలెక్టర్ల పర్యవేక్షణలో గ్రామ పంచాయతీ రిజర్వేషన్లు ఆర్డీఓలు, వార్డుల రిజర్వేషన్లపై ఎంపీడీఓలు ఖరారు చేయనున్నారు. రెండు రోజుల్లోపే రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసేలా అధికారులు దూకుడు పెంచగా.. ఉమ్మడి వరంగల్‌లో 1,705 జీపీలు, 15,006 వార్డులకు త్వరలో రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. మార్గదర్శకాల మేరకు రిజర్వేషన్లు ఈ నెల 26 లేదా 27న గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని భావిస్తున్న నేపథ్యంలో రిజర్వేషన్ల ప్రక్రియ వేగం పుంజుకున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. షెడ్యూల్ విడుదలైన వెంటనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రానున్నందున.. అంతకు ముందే కేబినెట్ భేటీలో పంచాయతీ ఎన్నికలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇదే సమయంలో రిజర్వేషన్ల ఖరారు, ఎన్నికల తేదీలను నిర్ణయించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ)కు తెలియజేస్తారంటున్నారు. ఈలోగా రిజర్వేషన్ల ప్రక్రియ ముగించేందుకు జీఓ విడుదల కావడంతో అధికారులు తొందరపడుతున్నట్లు చెబుతున్నారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా రిజర్వేషన్లు 50 శాతం మించరాదని జీఓలో పేర్కొన్నారు. కులగణన ఆధారంగా వార్డు సభ్యుల ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు, కులగణన ఆధారంగానే బీసీలకు సర్పంచ్ పదవుల్లో రిజర్వేషన్లు కల్పించాల్సి ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు సర్పంచ్ రిజర్వేషన్లు కల్పించనున్నారు. రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో లాటరీ ద్వారా మహిళ రిజర్వేషన్లు ఖరారు చేసేలా కసరత్తు చేస్తున్నట్లు అధికారవర్గాల సమాచారం. 2019లో రిజర్వేషన్లు ఇలా.. 2019 పంచాయతీ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్‌లో 1,708 గ్రామ పంచాయతీలకు 1,664 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. 1,664 సర్పంచ్ స్థానాల్లో 1,198 స్థానాల కోసం 2011 జనాభా ప్రకారం కేటాయించారు. 223 షెడ్యూల్డ్ గ్రామ పంచాయతీలు కాగా, వంద శాతం ఎస్టీ జనాభా ఉండడంతో 239 స్థానాలను వారికే కేటాయించారు. మహబూబాబాద్ జిల్లాలో 115, జనగామలో 37, జేఎస్ భూపాలపల్లి/ములుగులో 6, వరంగల్‌లో 77, హనుమకొండలో 4 గిరిజన పంచాయతీలు ఉన్నాయి. 2019లో బీసీలకు 24 శాతం కోటా కింద 223 స్థానాలు రిజర్వ్ చేశారు. అదే విధంగా అన్ రిజర్వుడ్(యు.ఆర్) 48 శాతం కింద 582 స్థానాలను ఆ కోటాలో కేటాయించారు. ఈసారి నిర్వహించే ఎన్నికల్లో కూడా ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి రిజర్వేషన్లు ఖరారు చేస్తుండగా.. ఈ నెల 24వ తేదీ వరకు ఫైనల్ అయ్యే అవకాశం ఉందని అధికారవర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో రిజర్వేషన్లపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతుండగా.. ఏ గ్రామ పంచాయతీ ఎవరికి కేటాయిస్తారో? అనే చర్చ పల్లెలను కుదిపేస్తోంది. ఉమ్మడి వరంగల్‌లో ఇలా..జిల్లా సర్పంచ్ పంచాయతీ పోలింగ్ స్థానాలు వార్డులు కేంద్రాలు హనుమకొండ 210 1,986 1,986 వరంగల్ 317 2,754 2,754 జేఎస్ భూపాలపల్లి 248 2,102 2,102 మహబూబాబాద్ 482 4,110 4,110 ములుగు 171 1,520 1,535 జనగామ 280 2,534 2,534 -
పర్యాటక అభివృద్ధికి కృషి
● జిల్లా అటవీ అధికారి నవీన్ రెడ్డి రేగొండ: పాండవుల గుట్టలను పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి కృషి చేయాలని జిల్లా అటవీ అధికారి నవీన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని రావులపల్లి శివారు పాండవుల గుట్టలను అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాండవుల గుట్టలను సందర్శించే పర్యాటకుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్డీఓ అప్పలకొండ, ఎఫ్ఆర్వోలు నరేష్, చంద్రమౌళి, ఎఫ్ఎస్ఓ గౌతమి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
నేడు డయల్ యువర్ సింగరేణి సీఎండీ
భూపాలపల్లి అర్బన్: నేడు (శనివారం) డయల్ యువర్ సింగరేణి సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సింగరేణి సంస్థలో ఉత్పత్తి, ఉత్పాదకత పెంపుదల, రక్షణ, వైద్య సేవల వంటి అంశాలపై సింగరేణి సంస్థ చైర్మన్ బలరామ్ శనివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు ‘డయల్ యువర్ సీఎండీ కార్యక్రమం’ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియాల కార్మికులు పాల్గొని, సింగరేణి సంస్థ ఉత్పత్తి, ఉత్పాదకత పెంపుదల, రక్షణ, వైద్య సేవల పెంపుదలకు నిర్మాణాత్మక సూచనలు, సలహాలు ఫోన్ ద్వారా తెలియజేయవచ్చు. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు 040–23311338 నంబర్‌కు కాల్చేయాల్సి ఉంటుంది. డీఈఓ అభినందనలు భూపాలపల్లి అర్బన్: భూటాన్‌లో జరిగిన అంతర్జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్ హ్యామర్ త్రో ఆటల పోటీల్లో తెలంగాణ తరఫున పాల్గొని బంగారు పతకం సాధించిన టేకుమట్ల మండలం పంగిడిపల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు వంతడుపుల రఘును జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ శుక్రవారం అభినందించారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులతో కలిసి సన్మానించారు. పంగిడిపల్లి పాఠశాలలో ఎంఈఓ చిదిరాల సుధాకర్ ఆధ్వర్యంలో సన్మానించారు. ఘనంగా ముదిరాజ్ మహాసభ భూపాలపల్లి రూరల్: ముదిరాజ్ మహాసభ 11వ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం జిల్లాకేంద్రంలో ఘనంగా నిర్వహించారు. జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్లో ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు జోరుక సదయ్య జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ముదిరాజ్ మహాసభ ఏర్పడి 11 సంవత్సరాలు పూర్తయినందున ప్రపంచ ముదిరాజ్ దినోత్సవంతో పాటు ముదిరాజ్ మహాసభ వేడుకలు గ్రామ గ్రామాన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో స్థానిక ఎన్నికల్లో ఏపార్టీ నుంచైనా ముదిరాజ్ బిడ్డలు పోటీ చేస్తే పార్టీలకతీతంగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి వేముల రాజమౌళి పాల్గొన్నారు. 27వరకు వేసెక్టమీ క్యాంపులు భూపాలపల్లి అర్బన్: ఈనెల 27వ తేదీ వరకు జిల్లాలో నిర్వహించనున్న వేసెక్టమీ క్యాంపులను విజయవంతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ తెలిపారు. జిల్లాలోని వైద్యాధికారులు, సిబ్బందితో శుక్రవారం డీఎంహెచ్ఓ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ.. జిల్లాలో ఉన్న ప్రతి ఆరోగ్య ఉపకేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఆరోగ్య కార్యకర్తలు వేసెక్టమీ క్యాంపునకు అధిక సంఖ్యలో తీసుకువచ్చేందుకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ప్రతిరోజు మగవారికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ప్రోగ్రాం అధికారులు డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ ఉమాదేవి డాక్టర్ సందీప్, వైద్యాధికారులు పాల్గొన్నారు. కేయూలో పలు విభాగాల్లో తనిఖీ కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని మైక్రోబయోలజీ బయోటెక్నాలజీ విభాగాలను శుక్రవారం ప్రిన్సిపాల్ టి.మనోహర్‌తో కలిసి వీసీ కె.ప్రతాప్‌రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మైక్రోబయాలజీ విద్యార్థులతో తరగతులు ఎలా జరగుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. బయోటెక్నాలజీ విభాగంలో విద్యార్థులతో మాట్లాడారు. కేయూలో ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటవుతున్నదని, దీనిని సైన్స్, బయోటెక్నాలజీ విద్యార్థులు వినియోగించుకోవాలని సూచించారు. -
పేరుకే గ్రంథాలయాలు
● భూపాలపల్లి, మల్హర్ మినహా జిల్లావ్యాప్తంగా సమస్యలే.. ● అద్దె భవనాలు, ఫర్నిచర్ కొరత ● రెగ్యులర్ సిబ్బంది లేక ఇబ్బందులు భూపాలపల్లి అర్బన్: జిల్లా వ్యాప్తంగా గ్రంథాలయాలలో సమస్యలు కొట్టుమిట్టాడుతున్నాయి. పాలకుల పట్టింపులేనితనం, అధికారుల నిర్లక్ష్యంతో ఏళ్ల తరబడి గ్రంథాలయాలలో మార్పు రావడం లేదు. సొంత భవనాలు, సౌకర్యాలు లేకపోవడంతో పాఠకులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రంలో జిల్లా గ్రంథాలయం, శాఖ గ్రంథాలయాలు తొమ్మిది, గ్రామ గ్రంథాలయం ఒకటి ఉంది. ఒకటి రెండు మినహా మిగతా అన్ని గ్రంథాలయాలు వార్త పత్రికలకు మాత్రమే పరిమితమవుతున్నాయి. సౌకర్యాలు, సదుపాయాలు లేకపోవడంతో పాఠకులు ఇబ్బందులు పడుతున్నారు. అద్దె భవనాలు.. అరకొర సౌకర్యాలు జిల్లాలో భూపాలపల్లి, తాడిచర్ల, కాటారం, మహదేవపూర్, చెల్పూరు, గణపురం, రేగొండ, చల్లగరిగ, చిట్యాల, మొగుళ్లపల్లి, చిన్నకొడెపాకలలో గ్రంథాలయాలు ఉన్నాయి. వీటిలో కాటారం, మహదేవపూర్, రేగొండ, చిట్యాల, మొగుళ్లపల్లి గ్రంథాలయాలకు సొంత భవనాలు లేకపోవడంతో అద్దె భవనాలు గ్రామపంచాయతీలోని ఇరుకు గదులలో నడిపిస్తున్నారు. భూపాలపల్లి, తాడిచర్ల గ్రంథాలయాలకు మాత్రమే సరిపడా ఫర్నిచర్, విశాలమైన గదులు కావాల్సిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. మిగతా తొమ్మిది గ్రంథాలయాలకు సౌకర్యాలు కరువయ్యాయి. కూర్చోడానికి కుర్చీలు, బల్లలు లేకపోవడంతో పాఠకులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి గ్రంథాలయంలో 30మంది పాఠకులు కూర్చునే విధంగా సౌకర్యాలు కల్పించాల్సి ఉండగా అధికారులు, ప్రజాప్రతినిధులు ఏ మాత్రమూ గ్రంథాలయాలను పట్టించుకోవడం లేదు. వార్తాపత్రికలకే పరిమితం పాఠకులకు కావలసిన పుస్తకాలు లేకపోవడంతో గ్రంథాలయాలు నిరాదరణకు గురవుతున్నాయి. గ్రంథాలయాలు కేవలం వార్త పత్రికలకు మాత్రమే పరిమితమవుతున్నాయి. పోటీ పరీక్షలకు కావలసిన పుస్తకాలను అందుబాటులో ఉంచడం లేదు. చాలా సంవత్సరాల క్రితం కొనుగోలు చేసిన పుస్తకాలు మాత్రమే అక్కడక్కడ దర్శనమిస్తున్నాయి. సెస్ చెల్లించని గ్రామపంచాయతీలు గ్రామపంచాయతీ అధికారులు ప్రతి ఏడాది గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి ఆస్తి పన్నుతో పాటు గ్రంథాలయ సెస్ ఎనిమిది శాతం పన్నును కూడా వసూలు చేస్తారు. గ్రామపంచాయతీ సిబ్బంది వసూలు చేసిన సెస్ చార్జీలను గ్రంథాలయాలకు చెల్లించాల్సి ఉంటుంది. భూపాలపల్లి మున్సిపాలిటీ మినహా గ్రామపంచాయతీలు సెస్ చెల్లించడం లేదు. గ్రంథాలయాలకు సెస్ చార్జీల ద్వారానే ఆదాయం వస్తుంది. ఈ ఆదాయంతోనే గ్రంథాలయాలు అభివృద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. జిల్లాలో గ్రామ పంచాయతీల నుంచి రావాల్సిన సుమారు కోటి రూపాయలపైన సెస్ చార్జీలు పెండింగ్‌లో ఉన్నాయి. సిబ్బంది లేకుండా నిర్వహణ ఎలా.. జిల్లాలో 11 గ్రంథాలయాలు సిబ్బంది కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రతి గ్రంథాలయానికి గ్రంథ పాలకుడు, ఒక స్వీపర్ ఉండాలి. జిల్లా కేంద్రంలో మాత్రమే సరిపడా రెగ్యులర్ సిబ్బంది ఉన్నప్పటికీ ఐదు గ్రంథాలయాలలో అవుట్ సోర్సింగ్ లైబ్రేరియన్లు ఉండగా, మరో ఐదు గ్రంథాలయాల్లో పార్ట్ టైం స్వీపర్లు మాత్రమే పనిచేస్తున్నారు. పక్కా భవనం నిర్మించాలి..మండలకేంద్రంలో గ్రంథాలయం అద్దె గదిలో నిర్వహిస్తున్నారు. ఈ గదిలో కూర్చోడానికి కుర్చీలు, బల్లలు కూడా లేవు. పోటీ పరీక్షలకు, విద్యార్థులకు సంబంధించిన పుస్తకాలు ఏర్పాటు చేయడం లేదు. గ్రామ పంచాయతీ నుంచి రావాల్సిన నిధులను వసూలు చేసి గ్రంథాలయం అభివృద్ధి చేయాలి. అధునాతన భవనాన్ని నిర్మించి అన్ని రకాల పుస్తకాలను అందుబాటులో ఉంచాలి. – సురేందర్, మొగుళ్లపల్లికొత్తపల్లిగోరి మండలం చిన్నకొడేపాక గ్రామంలో గ్రామ గ్రంథాలయం పురాతన కాలం నుంచి పెంకుటిల్లులో కొనసాగుతోంది. గ్రంథాలయం అభివృద్ధి చేయాలని పాఠకులు ఏళ్ల తరబడి కోరుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. పాలకులు, ప్రజాప్రతినిధులు మారుతున్నా అభివృద్ధి చేయడం లేదు. కనీస సౌకర్యాలు, పుస్తకాలు లేకపోవడంతో పాఠకులు ఇబ్బందులు పడుతున్నారు.పై ఫొటోలో కనిపిస్తున్నది మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని గ్రంథాలయం. సొంత భవనం లేక అద్దె గదిలో నిర్వహిస్తున్నారు. ఏళ్ల తరబడి అద్దె భవనంలో నిర్వహిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు, ఇతర పుస్తకాలు చదువుకునేందుకు లేకపోవడంతో వార్తాపత్రికలకే పరిమితమైంది. -
బడే దామోదర్ ఎక్కడ..!?
సాక్షిప్రతినిధి, వరంగల్ : మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి, ఉమ్మడి వరంగల్‌కు చెందిన బడే దామోదర్ అలియాస్ చొక్కారావు ఎక్కడ? ఇటీవల సాగుతున్న వరుస లొంగుబాట్లు, ఎన్కౌంటర్ల నేపథ్యంలో ఆయన వ్యూహం ఏమిటీ? ఓ వైపు ఛత్తీస్‌గఢ్ – తెలంగాణ సరిహద్దుల్లో ఉన్నాడంటుండగా.. మరోవైపు లొంగుబాటు ప్రయత్నం చేస్తున్నాడని వైరల్ అవుతోంది? ఈ నేపథ్యంలో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, సౌత్‌బస్తర్, ఏఓబీలలో కీలకమైన బడే దామోదర్ ఎక్కడున్నాడు? ఏం జరుగుతోంది? అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. ఇటీవల ములుగు జిల్లాకు చెందిన కొందరు రాజకీయ నాయకులు, వ్యాపారులకు ఆయన పేరి ట ఫోన్ కాల్స్ రావడం, ఓ రాజకీయ నేతను కలవాలని సూచించడం కూడా కలకలం రేపుతోంది. దామోదర్ వ్యూహం ఏమిటో... ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం కాల్వపల్లికి చెందిన బడే దామోదర్‌ది సీపీఐ (మావోయిస్టు) పార్టీ ఉద్యమ చరిత్రలో ఓ అధ్యాయం. రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ 2021 జూన్ 21న కోవిడ్ బారిన పడి మృతిచెందగా.. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన బాధ్యతలను దామోదర్‌కు పార్టీ అప్పగించింది. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో కీలకంగా మారిన ఈయన ఈ ఏడాది జనవరిలో పూజారి కాంకేర్ ఏరియాలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందినట్లు సోషల్ మీడియాలో వైరలైంది. ఐదారు రోజుల వ్యవధిలో దామోదర్ బతికే ఉన్నట్లు మావోయిస్టు పార్టీ నాయకత్వం ప్రకటించింది. ఈ 11 మాసాల వ్యవధిలో మావోయిస్టు పార్టీ నాయకత్వం ఎన్నో ఉత్థానపతనాలను చూసింది. అగ్రనేతలు ఎన్కౌంటర్లకు గురికావడం.. కేంద్ర కమిటీ స్థాయి నాయకులు, పెద్ద సంఖ్యలో దళసభ్యులు ఆయుధాలతో లొంగిపోవడం లాంటి సంఘటనలు జరిగాయి. ఇదే క్రమంలో ఏఓబీ సరిహద్దు మారేడుమిల్లి ఏరియాలో జరిగిన రెండు ఎన్కౌంటర్లలో హిడ్మా సహా 13మంది మృతిచెందడం... పదుల సంఖ్యలో ముఖ్యనేతలను విజయవాడలో అరెస్టు చేసినట్లు పోలీసులు ప్రకటించడం ఆ పార్టీ మనుగడకు సవాల్‌గా పరిణమించింది. ఇదే సమయంలో బడే దామోదర్ అలియాస్ చొక్కారావు, కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్, కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేశ్ తదితరులు సైతం లొంగిపోతున్నారన్న ప్రచారం జరిగింది. కానీ ఇప్పటివరకు అధికారికంగా ప్రకటన వెలువడలేదు. వరుస లొంగుబాట్లు, ఎన్కౌంటర్ల నేపథ్యంలో చర్చ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న దామోదర్ ఆయన స్వస్థలం ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి లొంగుబాటు ప్రయత్నాలపైనా సోషల్ మీడియాలో వైరల్ ఆయన పేరిట నాయకులు, వ్యాపారులకు ఫోన్ కాల్స్?దామోదర్ పేరుతో ఫోన్ చేస్తున్నదెవరు..? బడే దామోదర్ పేరిట కొందరు రాజకీయ నాయకులు, వ్యాపారులకు ఫోన్‌కాల్స్ వస్తుండటం కలకలంగా మారింది. తాను దామోదర్‌ను అంటూ ఫోన్ చేస్తున్న సదరు వ్యక్తి.. జిల్లా అటవీ ప్రాంతానికి చెందిన ఓ నాయకుడిని కలిసి డబ్బులు ఇవ్వాలని సూచించడం వివాదాస్పదమవుతోంది. ఇటీవల ఇద్దరు అధికార పార్టీ నాయకులు, ముగ్గురు ఇసుక వ్యాపారులకు దామోదర్ పేరిట ఫోన్లు రావడం.. ఆ ఫోన్లో మాట్లాడిన పలు విషయాలను బహిరంగంగానే మాట్లాడుకుంటుండటం గమనార్హం. నిత్యనిర్బంధం మధ్య దామోదర్ ఎక్కడున్నాడు.. ఎలా ఉన్నాడు.. అన్న చర్చ జరుగుతున్న తరుణంలో దామోదర్ వాయిస్‌తో ఫోన్లో చేస్తున్నదెవరు? ఒకవేళ దామోదరే అయితే ఎవరిని కలవమన్నారు? అనే అంశాలు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి. -
ఐపీఎస్ అధికారుల బదిలీ
సాక్షిప్రతినిధి, వరంగల్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ ఎస్పీలను మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. జయశంకర్ భూపాలపల్లి ఎస్పీగా ఉన్న కిరణ్ ఖరే (ఐపీఎస్–2017 బ్యాచ్) హైదరాబాద్ సిటీ సౌత్ జోన్ డీసీపీగా బదిలీ కాగా.. ఆయన స్థానంలో ఏడీసీ టు గవర్నర్‌గా ఉన్న సిరిసెట్టి సంకీర్త్ (ఐపీఎస్–2020) ఎస్పీగా నియమితులయ్యారు. మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్‌ను ములుగు ఎస్పీగా బదిలీ చేశారు. అక్కడున్న డాక్టర్ శబరీష్‌ను మహబూబాబాద్ ఎస్పీగా నియమించారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం అడిషనల్ ఎస్పీగా ఉన్న శివం ఉపాధ్యాయ (ఐపీఎస్–2021) ములుగు జిల్లా ఓఎస్డీగా నియమించారు. కొంతకాలంగా ములుగు ఓఎస్డీ పోస్ట్ ఖాళీ ఉంది. ఆయన స్థానంలో గ్రేహౌండ్స్ ఏఎస్పీగా ఉన్న మనన్ భట్ (ఐపీఎస్ – 2023)కు ఏటూరునాగారం ఏఎస్పీ/ఎస్డీపీఓగా పోస్టింగ్ ఇచ్చారు. మేడారం – 2026 మహాజాతర వచ్చే ఏడాది జనవరి 28నుంచి 31 తేదీల్లో జరగనున్న నేపథ్యంలో ముందుగానే ఐపీఎస్ అధికారుల బదిలీలు, నియామకాలు జరగడం చర్చనీయాంశంగా మారింది. భూపాలపల్లి ఎస్పీగా సంకీర్త్.. ములుగు ఎస్పీగా సుధీర్ రాంనాథ్ కేకన్.. ములుగు ఎస్పీ శబరీష్ మహబూబాబాద్‌కు ఓఎస్డీగా శివం ఉపాధ్యాయ మేడారం జాతర నేపథ్యంలో ముందుగానే బదిలీలు.. నియామకాలు -
ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి
భూపాలపల్లి అర్బన్: సింగరేణి సంస్థ రక్షణకు సింగరేణి కార్మిక సంఘాలు ఐక్య పోరాటాలు చేసేందుకు సిద్ధం కావాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నంద నరసింహారావు కోరారు. ఏరియాలోని కేటీకే 5వ గనిలో శుక్రవారం ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. రికార్డు స్థాయిలో లాభాలు గడిస్తూ, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు పొందుతూ, నవరత్నం లాంటి సింగరేణి కంపెనీని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సింగరేణిని భవిష్యత్ లేకుండా చేస్తున్నాయని ఆరోపించారు. సింగరేణి సంస్థను కాపాడేందుకు కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కార్మిక సంఘాలు ఐక్య పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ కార్యదర్శి కంపేటి రాజయ్య, నాయకులు తోట రమేష్, బాబురావు, సాయికిరణ్, ప్రసాద్, శివకుమార్‌రెడ్డి పాల్గొన్నారు. -
కలెక్టర్ వస్తున్నారని తెరిచారు..
సరస్వతినది పుష్కరాల సమయంలో ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో కాళేశ్వరం దేవస్థానం పరిధి వీఐపీఘాట్ వద్ద శాశ్వతంగా మరుగుదొడ్లు నిర్మించారు. ఆర్‌డబ్ల్యూస్ డీఈఈ సెప్టెంబర్ 19న పనులు పూర్తి చేసి దేవస్థానం అధికారులకు అప్పగించారు. వీఐపీ ఘాటులో నిత్యం స్నానాలు చేసే భక్తులతో రద్దీ నెలకొంటుంది. ఇన్ని రోజులు అధికారులు మరుగుదొడ్లకు తాళం వేసి ఉంచారు. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శుక్రవారం కలెక్టర్ వస్తున్నారని తెలుసుకుని తాళాలు తీశారు. – కాళేశ్వరం -
పారదర్శకంగా ధాన్యం కొనుగోళ్లు
● అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ భూపాలపల్లి రూరల్/కాటారం(మహాముత్తారం): కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా చేపట్టాలని అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ సెంటర్ల నిర్వాహకులు, పీఏసీఎస్ అధికారులకు సూచించారు. శుక్రవారం భూపాలపల్లి మండలంలోని ఆజాంనగర్, నాగారం, మహాముత్తారం మండలం మీనాజీపేట, బోర్లగూడెంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. కొనుగోలు ప్రక్రియ, సౌకర్యాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు సమయంలో ఎఫ్ఏక్యూ ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలన్నారు. అనంతరం మహాముత్తారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేశారు. మెనూ అమలు చేయకపోవడంపై ప్రిన్సిపాల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కూరగాయలు సక్రమంగా సరఫరా చేయని నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదనపు కలెక్టర్ వెంట జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కిరణ్‌కుమార్, సహకార అధికారి వాలియానాయక్, పౌర సరఫరాల శాఖ ఆర్ ఐ సురేందర్ రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్ ఉన్నారు. -
విద్యార్థుల సంక్షేమంపై దృష్టి సారించాలి
● కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి: రెసిడెన్షియల్, సంక్షేమ వసతి గృహాల విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ రాహుల్‌శర్మ సూచించారు. శుక్రవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో జిల్లాలోని అన్ని రెసిడెన్షియల్, వసతి గృహాల ప్రిన్సిపాల్స్, హెచ్ఎంలు, ఎస్ఓలు, హెచ్‌డబ్ల్యూఓలు, పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. డైట్, కాస్మొటెక్ చార్జీలు పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. ప్రతి శుక్రవారం ఫుడ్ విత్ చిల్డ్రన్ కార్యక్రమం తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు. విద్యార్థులకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలన్నారు. బాలికల వసతి గృహాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. విద్యార్థులకు పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారం ఇవ్వాలని ఆదేశించారు. వారంలో మూడు రోజులు తనిఖీ చేయడంతో పాటు విద్యార్థులతో కలిసి భోజనం చేసి నాణ్యత పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, బీసీ, ఎస్సీ సంక్షేమ అధికారి ఇందిర, కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ నవీన్‌రెడ్డి, వసతి గృహాల పర్యవేక్షణ ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు పాల్గొన్నారు. అంత్యపుష్కరాలకు ప్రతిపాదనలు చేయండి కాళేశ్వరం: వచ్చే ఏడాది మే 21 నుంచి జరుగు సరస్వతినది అంత్యపుష్కరాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ రాహుల్‌శర్మ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన కాళేశ్వరం దేవస్థానం ఈఓ కార్యాలయంలో కాటారం సబ్‌కలెక్టర్ మయాంక్‌సింగ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబుతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన శాఖల వారీగా చేపట్టాల్సిన పనులపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. కాళేశ్వరంలో శాశ్వత హెలిపాడ్ నిర్మాణం చేపట్టాలన్నారు. నంతరం సరస్వతి ఘాటును కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కల్యాణ కట్ట భవన నిర్మాణంలో జాప్యం జరుగుతుందని త్వరగా పూర్తి చేయాలన్నారు. సరస్వతి మాత విగ్రహం పై కప్పు, ప్లాట్‌ఫామ్ పనులను డిసెంబర్ వరకు పూర్తి చేయాలని దేవాదాయ శాఖ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, ఈఓ మహేష్, పీఏసీఎస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, ఆర్అండ్బీ ఈఈ రమేష్, పీఆర్ ఈఈ వెంకటేశ్వర్లు, విద్యుత్‌శాఖ డీఈ పాపిరెడ్డి, డివిజనల్ పంచాయతీ అధికారి మల్లికార్జున్‌రెడ్డి, తహసీల్దార్ రామారావు, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై తమాషారెడ్డి, ఇరిగేషన్ డీఈ ప్రకాశ్ పాల్గొన్నారు. మీసేవకు దరఖాస్తుల స్వీకరణ భూపాలపల్లి రూరల్: జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసే మీసేవలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ శర్మ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కనపర్తి (రేగొండ), గాంధీనగర్ (గణపురం), గర్మిళ్లపల్లి (టేకుమట్ల), అందుకుతండా, గిద్దెముత్తారం (చిట్యాల), జంగేడు, గొర్లవీడు, గొల్లబుద్దారం (భూపాలపల్లి), మహదేవపూర్, దామెరకుంట (కాటారం) ప్రాంతాల్లో కొత్తగా మీసేవ కేంద్రాలు ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 24వ తేదీ నుంచి డిసెంబర్ 1 వరకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. -
బాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
కాటారం: బాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరు బాధ్యతగా భావించాలని కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్ అన్నారు. కాటారం మండలకేంద్రంలోని తిమోతి బాయ్స్ హోంలో జిల్లా సంక్షేమ అధికారి మల్లీశ్వరి ఆధ్వర్యంలో బాలల హక్కుల వారోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మయాంక్‌సింగ్ మాట్లాడారు. బాలల హక్కులను కాపాడడానికి ప్రత్యేకంగా జిల్లా స్థాయిలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఉందన్నారు. అదనపు కలెక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ సమాజంలో బాలలను కాపాడటానికి, బాల కార్మిక వ్యవస్థ, అక్రమ శిశువుల దత్తత, బాలల తదితర సమస్యలను నియంత్రించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పేర్కొన్నారు. అనంతరం పిల్లలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించి అభినందించారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ రాధిక, సూపర్వైజర్ శివరాణి, సోషల్ వర్కర్ కుమార్, హోం డైరెక్టర్ డేవిడ్ మార్క్, హృదయానంద్, అశోక్, బాలబాలికలు పాల్గొన్నారు.కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్ -
నాటు కోడిగుడ్లకు డిమాండ్
నేను మిర్చి పంటను ప్రతి ఏడాది వేస్తాను. కానీ వ్యవసాయంతో పాటు పాడిపరిశ్రమపై మక్కువ ఉంది. సహజ సిద్ధమైన దానతో పాటు స్వేచ్ఛగా తిరిగేందు కు ఎకరం భూమిలో కోళ్లు పెంచుతున్నా. నాటు కోళ్ల పెంపకంపై దృష్టిపెట్టాను. నా వద్ద నాటు, పందెం కోళ్లు, సోన లాంటి రకాలు ఉన్నాయి. కోళ్లతో నాటు కోడి గుడ్లు విక్రయిస్తున్నాను. త్వరలో కోడి గుడ్లు డెలివరీ కూడా పెడుతున్నాను. కోడిగుడ్లకు డిమాండ్ బాగా ఉంది. ప్రస్తుతం లాభాలు ఆర్జిస్తున్నాను. మూడు రకాల వ్యాక్సిన్లు మాత్రం వాడుతున్నా. – శ్రీపతి బాపు, రైతు, మహదేవపూర్ జీరో డే నుంచి మూడు వ్యాక్సిన్లు మాత్రం తప్పనిసరిగా వేయాలి. వ్యాధులు రాకుండా ఉంటుంది. వ్యాక్సిన్లు లసోట(ఎన్డీ), ఐబీడీ(బూస్టర్), లసోట(ఐఎన్డీ)లు వేయాలి. కోళ్ల ఎదుగుదల కూడా బాగుంటుంది. నాటుకోళ్లకు సహజ సిద్ధమైన ఆహారం దానా రూపంలో అందిస్తే ధృడంగా ఉంటుంది. బ్రాయిలర్, లేయర్లకు అయితే ఆ కంపెనీలను బట్టి వివిధ రకాల ఇంజక్షన్లు వాడుతారు. – బుర్ర రాజబాబు, పశువైద్యాధికారి, మహదేవపూర్● -
రైతులకు గన్నీ సంచులు అందించాలి
చిట్యాల: రైతులు పండించిన వరి ధాన్యానికి తేమ శాతం 17 వచ్చిన వెంటనే పీపీసీ ఇన్‌చార్జ్‌లు గన్నీ బ్యాగులు అందించాలని అదనపు కలెక్టర్ ఆశోక్‌కుమార్ అన్నారు. గురువారం మండలంలోని అందుకుతండా గ్రామంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పీపీసీ ఇన్‌చార్జ్‌లు తప్పనిసరిగా నాణ్యమైన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయాలని అన్నారు. రైతులు తెచ్చే వరిధాన్యాన్ని ప్రతి రోజు ఖచ్చితంగా పరిశీలించాలని చెప్పారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పౌరసరాఫరాల అధికారి కిరణ్‌కుమార్, డీఎం రాములు, జిల్లా కోఆపరేటివ్ అధికారి, మండల స్పెషల్ ఆఫీసర్ వాల్యునాయక్, తహసీల్దార్ షేక్ ఇమామ్‌బాబా, పీపీసీ సిబ్బంది పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రం పరిశీలన మొగుళ్లపల్లి: మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ ఆకస్మిక తనిఖీచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీపీసీ ఇన్‌చార్జ్‌లు తప్పనిసరిగా నాణ్యమైన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయాలన్నారు. రైతులు తెచ్చే ధాన్యంలో తేమశాతాన్ని ప్రతిరోజూ ఖచ్చితంగా పరిశీలించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల అధికారి కిరణ్‌కుమార్, డీఎం రాములు, తహసీల్దార్ సునీత, సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ ఆశోక్ కుమార్ -
విద్యార్థులు జీవిత లక్ష్యాన్ని చేరుకోవాలి
భూపాలపల్లి అర్బన్: విద్యార్థులు గ్రంఽథాలయాలను సద్వినియోగం చేసుకుంటూ జీవిత లక్ష్యానికి చేరుకోవాలని అదనపు కలెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు అధ్యక్షతన గురువారం జిల్లా గ్రంథాలయ సంస్థ ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థులు తమ జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలన్నారు. లక్ష్యాలను చేరుకోవాలంటే తరగతి పుస్తకాలతో పాటు గ్రంథాలయంలో పుస్తకాలు చదివి విజ్ఞానం సంపాదించుకోవాలని సూచించారు. గ్రంథాలయాలు విద్యార్థులకు, పోటీ పరీక్షలకు సిద్ధపడే వారికి ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈఓ రాజేందర్, ఉపాధ్యాయులు తిరుపతి, స్రవంతి, శ్రీకాంత్, గ్రంథాలయ సిబ్బంది చంద్రమౌళి, శారద, రజిత, భాగ్యలక్ష్మి, రాణి, శ్రీనివాస్, ప్రభాకర్, రమేష్, మంజుల, పాఠకులు పాల్గొన్నారు. కేజీబీవీ తనిఖీ.. కాటారం: కాటారం మండల కేంద్రంలోని కేజీబీవీని గురువారం అదనపు కలెక్టర్ విజయలక్ష్మి తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలు, తరగతి గదులు, సౌకర్యాలు, వంటగదిని పరిశీలించారు. ఉపాధ్యాయుల, విద్యార్థుల హాజరుపట్టిక, రికార్డులను తనిఖీ చేసి విద్యాబోధన, మెనూపై ఆరా తీశారు. విద్యార్థులలో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అదనపు కలెక్టర్ వెంట ఎంపీడీఓ బాబు, ఎంపీఓ వీరస్వామి, ఎస్ఓ చల్ల సునీత, పంచాయతీ కార్యదర్శి షగీర్‌ఖాన్ ఉన్నారు. పోషకాహారం అందించాలి కాళేశ్వరం: విద్యార్థులకు మెనూ ప్రకారం పోషకాహారం అందించాలని అదనపు కలెక్టర్ విజయలక్ష్మి ఆదేశించారు. గురువారం మహదేవపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర హాస్టల్‌ని తనిఖీ చేశారు. కోడిగుడ్ల నాణ్యత పరిశీలించారు. హాస్టల్ ఆవరణను కలియతిరిగి పరిశుభ్రతను తనిఖీ చేశారు. విద్యార్థులకు పోషకాహారం అందించాలని, నాణ్యమైన గుడ్లు అందించాలని వార్డెన్‌ను ఆదేశించారు. వారి వెంట మహదేవపూర్ ఎంపీడీఓ ఎ.రవీంద్రనాథ్ ఉన్నారు. అదనపు కలెక్టర్ విజయలక్ష్మి -
షెడ్యూల్ సిద్ధం చేయాలి
భూపాలపల్లి: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు మండలాల వారీగా పూర్తి షెడ్యూల్‌ను సిద్ధం చేయాలని కలెక్టర్ రాహుల్‌శర్మ తెలిపారు. సర్పంచ్ ఎన్నికల నిర్వహణ, ఓటరు జాబితా, అభ్యంతరాలు, పోలింగ్ కేంద్రాలు, రిజర్వేషన్ల ప్రక్రియ, శాంతిభద్రల అంశాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణికుముదిని గురువారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్, ఎస్పీలు, పంచాయతీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు స్థానిక సంస్థలకు ఎన్నికలు మూడు దశల్లో నిర్వహించాల్సి ఉంటుందన్నారు. అందుకు అనుగుణంగా మండలాల వారిగా పూర్తి షెడ్యూల్‌ను తయారు చేయాలని ఆదేశించారు. ఎన్నికల నిర్వహణలో శాంతిభద్రతలు, సిబ్బంది కేటాయింపు అంశాలపై ముందస్తు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎస్పీ కిరణ్‌ఖరే, అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, డీపీఓ శ్రీలత, డీఆర్డీఓ బాలకృష్ణ పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్‌శర్మ -
తేనెటీగల పెంపకంతో ఆదాయం
కాటారం: తేనెటీగల పెంపకంతో రైతులు అదనపు ఆదాయం పొందవచ్చని కాటారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పంతకాని తిరుమల అన్నారు. కాటారం ఏఎంసీ ఆధ్వర్యంలో రైతులకు శాసీ్త్రయ పద్ధతిలో తేనెటీగల పెంపకంపై రైతులకు ఏడు రోజలు ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని చైర్పర్సన్ తిరుమల ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ రైతులు వ్యవసాయంతో పాటు తేనెటీగల పెంపకం చేపడితే ఆర్థిక వనరుగా ఉంటుందన్నారు. పెంపకానికి అయ్యే ఖర్చు ఎన్బీబీ ద్వారా సబ్సిడీ పొందే అవకాశం ఉంటుందన్నారు. ఉచిత శిక్షణ శిబిరం ఏడు రోజుల పాటు రైతులకు భోజన వసతి కల్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య, బొక్కల పోశిరెడ్డి, బొమ్మన భాస్కర్‌రెడ్డి, కుమ్మరి వెంకన్న, మల్లారెడ్డి, ఆత్మకూరి కుమార్‌యాదవ్, పంతకాని మల్లిఖార్జున్ పాల్గొన్నారు.నేడు డయల్ యువర్ డీఎంభూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఆర్టీసీ డిపో పరిధిలో ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి నేడు (శుక్రవారం) డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజన్ ఇందూ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు డయల్ యువర్ డిపో మేనేజర్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికులు, ప్రజలు, వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థులు 99592 26707 నంబర్‌కు ఫోన్ చేసి ఆర్టీసీ అభివృద్ధికి సలహాలు, సూచనలు అందించాలని కోరారు.నూతన గనులు కేటాయించాలిభూపాలపల్లి అర్బన్: కేంద్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు నూతన బొగ్గు గనులను కేటాయించాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్(సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నర్సింహరావు కోరారు. ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి సంస్థ 20 సంవత్సరాల నుంచి లాభాలు సాధిస్తూ అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు సాధించినట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.80వేల కోట్లు వివిధ రకాల పన్నులు చెల్లించినట్లు చెప్పారు. సింగరేణి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.48వేల కోట్ల బకాయిలు ఉన్నట్లు తెలిపారు. ఈ బకాయిలు వసూలు చేయడంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ప్రైవేట్‌సంస్థలకు కేటాయించిన కోయగుడ, సత్తపల్లి బొగ్గు బ్లాక్‌లలో ఇప్పటివరకు బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించలేదని తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు కంపేటి రాజయ్య, రమేష్ పాల్గొన్నారు.అనుమానితులు వస్తే సమాచారం ఇవ్వండిపలిమెల: అనుమానితులు గ్రామాల్లోకి వస్తే సమాచారం ఇవ్వాలని కాటారం డీఎస్పీ సూర్యనారాయణ సూచించారు. గురువారం మండలంలోని పంకెనలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామస్తులతో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ సూర్యనారాయణ మాట్లాడారు. రోడ్డు నిబంధనలు పాటించాలని, సైబర్ నేరాలు, మత్తు పదార్థాలతో కలిగే నష్టాలను వివరించారు. యువత మత్తుకు దూరంగా ఉండి చదువులవైపు వెళ్లాలని కోరారు. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడంతో మావోయిస్టులు వచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు నిత్యం అప్రమత్తంగా ఉన్నారని, గ్రామస్తులు కూడా కొత్త వ్యక్తులు వస్తే సమాచారం ఇవ్వాలన్నారు. అనుమానిత వ్యక్తులను అశ్రయం కల్పించొద్దని హెచ్చరించారు. ఈ సందర్భంగా అక్రమంగా నిల్వ ఉంచిన 10 లీటర్ల గుడుంబాను సీజ్ చేసి ఒకరిపై కేసు నమోదు చేశారు. నంబర్ ప్లేట్ లేని పది వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహాదేవ్‌పూర్ సీఐ వెంకటేశ్వర్లు, పలిమెల, మహదేవ్పూర్, కాళేశ్వరం ఎస్సైలు రమేష్, పవన్, శశాంక్, తమాషారెడ్డి, సివిల్, టీజీఎస్పీ సిబ్బంది పాల్గొన్నారు. -
నాణ్యమైన విత్తనాలు అందించడమే లక్ష్యం
రేగొండ: రైతులకు గిట్టుబాటు ధరల్లో నాణ్యమైన విత్తనాలను అందించడమే విత్తనాల ముసాయిదా బిల్లు 2025 లక్ష్యమని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కో ఆర్డినేటర్ విజయభాస్కర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముసాయిదా బిల్లుపైన, బిల్లులోని అంశాలపైన గురువారం మండలకేంద్రంలోని రైతువేదికలో మండల వ్యవసాయాధికారి వాసుదేవారెడ్డి ఆధ్వర్యంలో సలహాలు, సూచనలను రైతులను కోరారు. ఈ సందర్భంగా బిల్లులోని అంశాలను రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి, ములుగు జిల్లాల ఏడీఏలు రమేష్, అవినాష్, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం వరంగల్ శాస్త్రవేత్తలు డాక్టర్ వెంకటరాజ్‌కుమార్, డాక్టర్ విశ్వతేజ, డాక్టర్ ప్రశాంత్, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు. -
ఎన్కౌంటర్లపై న్యాయవిచారణ జరపాలి
భూపాలపల్లి అర్బన్: ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం జరుపుతున్న మావోయిస్టుల ఎన్కౌంటర్లపై న్యాయ విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో గురువారం పార్టీ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేని శంకర్‌తో కలిసి శ్రీనివాసరావు మాట్లాడారు. కగార్ ఎన్కౌంటర్లపై అనేక అనుమానాలు ఉన్నాయని, మావోయిస్టుల ఎన్కౌంటర్లపై స్వయంగా సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మావోయిస్టులను కోర్టుకు సరెండర్ చేయకుండా టెర్రరిస్టుల మాదిరిగా చంపడం సరికాదన్నారు. మావోయిస్టులు కూడా పునరాలోచన చేయాలని, తమ పంథా మార్చుకోవాలని కోరారు. తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం సాధ్యం కాదని.. ఇప్పటికే కొందరు బయటికి వచ్చారని, మిగిలిన వారు కూడా తమ పంథా మార్చుకొని కమ్యూనిస్టులతో కలిసి రావాలని కోరారు. ఈ సమావేశంలో డీహెచ్‌పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్‌కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠరెడ్డి, నాయకులు మోటపలుకుల రమేష్, జిల్లా సహాయ కార్యదర్శి సుధాకర్‌రెడ్డి, సోత్కు ప్రవీణ్‌కుమార్, మాతంగి రామచందర్, కొరిమి సుగుణ, నూకల చంద్రమౌళి, నేరెళ్ల జోసెఫ్, వేముల శ్రీకాంత్, గోలి లావణ్య, పొన్నగంటి లావణ్య పాల్గొన్నారు.సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు -
నాటు కోళ్లు.. డిమాండ్ బాగు!
మహదేవపూర్‌లోని కోళ్లఫారం వద్ద నాటుకోళ్లుకాళేశ్వరం: తనకు ఇష్టమైన వ్యవసాయంతో పాటు పాడి పెంపకంపై దృష్టి సారించి సహజసిద్ధంగా నాటు కోళ్ల పెంపకంతో మహదేవపూర్ మండల కేంద్రానికి చెందిన రైతు లాభాలు పొందుతున్నాడు. డిమాండ్ బాగా ఉండడంతో అటువైపు దృష్టిసారించాడు. నాటు కోళ్ల మాంసంతో పాటు నాటు కోడిగుడ్ల విక్రయాలు చేసి కోళ్ల పెంపకంపై మక్కువ చాటుతున్నాడు మహదేవపూర్ రైతు. మొదట కొన్ని కోళ్లతో.. మహదేవపూర్ మండల కేంద్రంలో శ్రీపతి బాపు అనే రైతు ఎకరం భూమి కౌలుకు తీసుకొని నాటు కోళ్లు పెంచుతున్నాడు. ఖర్చు తగ్గించడానికి తడకలతో పందిరి వేసి అందులో చుట్టూర (నెట్) వల, ఫెన్సింగ్ సాయంతో కుక్కలు, కోతులు, పిల్లులు, ముంగీస లాంటివి కోళ్లకు హాని చేసే జంతువులు, క్రిమికీటకాలు దూరకుండా ఫారం రెడీ చేశాడు. విద్యుత్ లైట్లు, నీటిసౌకర్యం ఉంది. అంతకు ముందు తన ఇంటినే కోళ్ల ఫారంగా మలిచి అక్కడ స్థలం సరిపోకపోవడంతో వేరేచోట ఎకరం భూమి లీజుకు తీసుకొని వ్యాపారం సాగిస్తున్నాడు. మొదట కొంచెం నష్టాలు వచ్చినా ఆ తరువాత పుంజుకున్నాడు. దీంతో నిత్యం ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఫారంలోని కోళ్లపై ప్రత్యేక దృష్టిసారించాడు. ఆ రైతు మొదట కొన్ని నాటు కోళ్లతో ప్రారంభించిన వ్యాపారాన్ని రోజురోజు అభివృద్ధి చేస్తూ ప్రస్తుతం 1500లకు పైగా కోళ్లతో వ్యాపారం పెంపొందించాడు. సహజమైన దాన.. నాటు కోడిగుడ్లను ఇంక్యుబెటర్‌లో 36 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే విధంగా 21 రోజుల్లో కోళ్లు పొదుగు వేస్తారు. గుడ్డు నుంచి పిల్ల బయటకు వచ్చిన నాటి నుంచి సహజమైన దాన వేస్తూ..వృద్ధి చేస్తున్నాడు. సజ్జలు, జొన్నలు, మొక్కజొన్న, పొట్టు తదితర దానగడ్డిని వేస్తారు. దీంతో సైడ్ ఎఫెక్ట్ లేకుండా త్వరగా పెరిగి దృఢంగా ఉంటాయి. గుడ్డు నుంచి బయటకు వచ్చిన కోడి పిల్లకు మాత్రం మొదట ఇంజక్షన్లు వాడుతారు. ఆ తరువాత దానపైనే ధృడంగా ఉంటుంది. నెట్, బోనులో ఉంచకుండా స్వేచ్ఛ వాతావరణంలో తిరిగే విధంగా కోళ్లకు అనుకూలంగా ఉంది. దీంతో త్వరగా వృద్ధి, బలంగా ఉంటున్నాయి. నీరు, ఆహారం లభించడంతో కోళ్లు త్వరగా ఎదుగుతున్నాయి. రూ.10కు నాటు కోడి గుడ్డు.. మహదేవపూర్ కోళ్ల ఫారం వద్ద రూ.10కి నాటు కోడి గుడ్డు విక్రయిస్తున్నారు. అదే ఇతర ప్రాంతాల్లో అయితే రూ.15కి ఇస్తున్నారు. డెలివరీ కూడా త్వరలో ప్రారంభించనున్నారు. నాటుకోడి మాసం కేజీకి చొప్పున రూ.300 నుంచి 350కి ఫారం వద్ద విక్రయిస్తున్నాడు. సహజ ఆహారంతో స్వేచ్ఛగా తిరిగే కోళ్లు పెట్టే దేశీ గుడ్లు, సాధారణ గుడ్ల కంటే ఆరోగ్యకరమైనవి. వాటిలో అధిక ప్రొటీన్, ఒమేగా–3, విటమిన్లు ఏ, ఈ, బీ 12 ఉంటాయి. నాటుకోడి గుడ్లు బాగా రుచి, దృఢమైన ఆకృతిని అందిస్తాయి. కానీ ఖరీదైనవి తక్కువ అందుబాటులో ఉంటాయి. మాంసం, గుడ్లు పాలు వంటి జంతు ప్రోటీన్లు పూర్తి ప్రోటీన్లు, అంటే అవి మన శరీరానికి అవసరమైన అన్ని ముఖ్యమైన అమైనో ఆమ్లాలను అందిస్తాయి. జంతు ఉత్పత్తులు అత్యున్నత నాణ్యత ప్రొటీన్ వనరులను అందిస్తాయి. చిన్నారులకు గుడ్లు తినిపిస్తే బలంగా తయారు అవుతారు. పందెం కోళ్లతో పాటు సోనా ఇతర ఫారం ఏర్పాటు రూ.10నుంచి రూ.15లకు నాటు కోడిగుడ్ల విక్రయాలు మాంసంతో పోషకాలు, గుడ్లతో పిల్లల ఎదుగుదలకు తోడ్పాటు ఎకరం భూమిలో కోళ్ల ఫారం భవిష్యత్‌లో నాటుకోడిగుడ్ల డెలివరీకి శ్రీకారం -
అనర్హులను తొలగించాలని ధర్నా
భూపాలపల్లి అర్బన్: డబుల్‌బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారుల నుంచి అనర్హులను తొలగించాలని డిమాండ్ చేస్తూ బాధితులు గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిరుపేద ప్రజలను మోసం చేసిందన్నారు. ధనవంతులకు, ఇళ్లు ఉన్న వారికి ఇళ్లు కేటాయించినట్లు ఆరోపించారు. కలెక్టర్ స్పందించి తక్షణమే విచారణ చేపట్టి అనర్హులను తొలగించాలని డిమాండ్ చేశారు. బాధితుల ధర్నాకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ, ధర్మసమాజ్ పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులు మద్దతు తెలిపి మాట్లాడారు. -
బంతిపూల సోయగం
మహదేవపూర్ మండలకేంద్రంలోని ఎల్ఎన్టీరోడ్డులో ఓ రైతు సుమారు 20 ఎకరాల్లో బంతిపూలు సాగు చేస్తున్నాడు. ప్రస్తుతం బంతిపూలు విరబూసి కనుచూపు మేరలో ఆ దారి వెంట వెళ్తున్న చూపరులను కనువిందు చేస్తున్నాయి. బంతిపూల సోయగం మనస్సును ఆకర్షిస్తుంది. బంతిపూలను ఇక్కడి నుంచి వరంగల్, హైదరాబాద్ పట్టణాలకు ఎగుమతి చేసి విక్రయిస్తున్నారు. – కాళేశ్వరంతుపాన్ ప్రభావంతో ఇటీవల కురిసిన వర్షాలకు మల్హర్ మండలంలోని చెరువులు జలకళలాడుతూ నిండుకుండలా దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం వానాకాలం సీజన్‌కు సంబందించి పొలాలు కోశారు. ధాన్యాన్ని కల్లాలకు తరలిస్తున్నారు. యాసంగిలో చెరువుల కింద సాగుచేసే రైతులు ఆనందంతో సీజన్‌కు సిద్ధమవుతున్నారు. – మల్హర్చిట్యాల మండలం చల్లగరిగ గ్రామ శివారులో ఓ రైతు మిర్చి పంట వేశాడు. పంట బాగా వచ్చింది. దీంతో రోడ్డు వెంట వెళ్లే ప్రతి ఒక్కరూ అటువైపే చూస్తున్నారు. గమనించిన రైతు పంటకు కనుదిష్టి తగలవద్దని పంట కనపడకుండా చీరలను కట్టాడు. పంటకు రక్షణ కూడా ఉంటుందని అంటున్నాడు. – చిట్యాల -
కమ్యూనిస్టులు కలిసి ఉద్యమించాలి
భూపాలపల్లి రూరల్: దేశంలో 100 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన పార్టీ సీపీఐ అని, దేశంలో కమ్యూనిస్టులంతా ఒకే వేదికపై పోరాడి మతతత్వ బీజేపీని గద్దె దించాలని ఆ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. సీపీఐ 100 సంవత్సరాల ముగింపు ఉత్సవాల సందర్భంగా సీపీఐ బస్సు జాతాను జోడే ఘాటులో ప్రారంభమై జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్‌కు చేరుకుంది. అంబేడ్కర్ సెంటర్లో ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో ఆటపాటలతో అలరించారు. అంతకుముందు మంజూరునగర్లో బైక్ ర్యాలీకి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో శ్రీనివాసరావు మాట్లాడుతూ 100 సంవత్సరాలు ప్రజల పక్షాన నిరంతరం పోరాటాలు చేసిందన్నారు. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై కమ్యూనిస్టులంతా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేణి శంకర్, వివి ధ సంఘాల నాయకులు మారుపాక అనిల్ కుమార్, మణికంఠ రెడ్డి, కుమార్, గురిజేపల్లి సుధాకర్ రెడ్డి, పైళ్ల శాంతికుమార్, మోట పలుకుల రమేష్, సతీష్, ప్రవీణ్, సుగుణ, శ్రీనివాస్ పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు ఘనంగా సీపీఐ 100 సంవత్సరాల బస్సు జాతా -
బొగ్గు అన్వేషణకు డ్రిల్లింగ్
మల్హర్: మండలంలోని తాడిచర్ల–పెద్దతూండ్ల గ్రామ శివారు వ్యవసాయ భూముల్లో తాడిచర్ల ఓపెన్‌కాస్ట్–2 ప్రాజెక్ట్ ఏర్పాటునకు సింగరేణి అధికారులు బొగ్గు అన్వేషణకు డ్రిల్లింగ్ చేస్తున్నారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో శినోమిక్ ఇండియా ప్రైవేట్ లిమి టెడ్ కంపెనీ ప్రతినిధులు ఈ డ్రిల్లింగ్ పనులను చేపడుతున్నారు. 450 మీటర్ల లోతులో డ్రిల్లింగ్ చేస్తే బొగ్గు నాణ్యతను గుర్తించ వచ్చని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. ఇప్పటికే పెద్దతూండ్ల కిషన్రావుపల్లిలో డ్రిల్లింగ్ వేశామని, మరో డ్రిల్లింగ్ మల్లారం కస్తూర్భా పాఠశాల ఆవరణలో వేయనున్నట్లు పేర్కొన్నారు. -
రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
భూపాలపల్లి రూరల్: రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. బుధవారం మండలంలోని కొంపల్లి, గుడాడుపల్లి, నేరేడుపల్లి, గొర్లవీడు గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి శ్రమించి పండించిన ప్రతీ ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలన్నారు. అనంతరం గొర్లవీడు గ్రామంలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ టాయిలెట్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమాలో మండల అధ్యక్షుడు సుంకరి రాంచంద్రయ్య, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం -
నేటితో కార్తీకమాసం ముగింపు
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరాలయంలో అక్టోబర్ 22 నుంచి కార్తీకమాసం నెల ప్రారంభం కావడంతో రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. (నేడు) గురువారం అమావాస్యతో కార్తీకమాసం నెల ముగియనుండడంతో కాళేశ్వర ముక్తీశ్వరున్ని బుధవారం భారీసంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. గతేడాది ఆలయానికి వివిధ పూజలు, లడ్డూ ప్రసాదాల ద్వారా నెలరోజులకు గాను రూ.ఒక కోటి వరకు ఆదాయం సమకూరింది. ప్రస్తుతం బుధవారం వరకు రూ. 1.06కోట్ల ఆదాయం సమకూరినట్లు ఆలయ వర్గాల ద్వారా తెలిసింది. ఆర్టీసీ బస్సుల్లో మహాలక్ష్మీపథకంతో మహిళలు అధికంగా దర్శించుకున్నారు. గోదావరి, జ్వాలతోరణం, సామూహిక సత్యనారాయణ వ్రతాలు, నందీశ్వరుడికి అభిషేకం, గోదావరికి హారతి, ఇతర పూజల్లోనూ భక్తులు పాల్గొన్నారు. ఒక్కో రోజు సుమారుగా 30–40 వేల మంది భక్తులు త్రివేణి సంగమ గోదావరిలో పుణ్యస్నానాలు చేసి, గర్భగుడిలో దర్శనం చేసుకున్నారు. గతేడాది కంటే ప్రస్తుత మాసంలో రూ.6లక్షల వరకు ఆదాయం ఎక్కువగా వచ్చి కాస్త ఊరటనిచ్చినట్లు ఆలయవర్గాలు తెలిపాయి. -
సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలి
భూపాలపల్లి రూరల్: సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ పింగిళి విజయపాల్ రెడ్డి అన్నారు. విద్యార్థులకు సాంకేతిక రంగంలో విద్యాపరంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో శ్రీఎ బుక్ ఆన్ డిజిటల్ లెర్నింగ్శ్రీ అనే పాఠ్యాంశంపై జిల్లాలో పనిచేస్తున్న గణితం, భౌతిక శాస్త్ర స్కూల్ అసిస్టెంట్లకు జిల్లా కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా విజయపాల్ రెడ్డి మాట్లాడుతూ విద్యాపరంగా సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యాబోధన, బోధన వ్యూహాలు ఉండాలన్నారు. సాంకేతికత శిక్షణ తరగతి గదిలో ఎలా అమలు చేయాలో తెలుసుకోవడానికి ఈ శిక్షణ తోడ్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు లక్ష్మీప్రసన్న, సతీష్ కుమార్, ఉపాధ్యాయులు, రిసోర్స్ పర్సన్లు తదితరులు పాల్గొన్నారు. -
మొక్కజొన్న సాగుకు సన్నద్ధం!
రేగొండ: ఈ ఏడాది పత్తిని నమ్ముకుని సాగు చేసిన రైతులకు నిరాశే ఎదురైంది. తుపాను ప్రభావంతో దిగుబడి రాక పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు. దీంతో రైతులు యాసంగిలో మొక్కజొన్న పంటను సాగు చేసేందుకు సమాయత్తమవుతున్నారు. జిల్లాలో ప్రధాన పంటగా పత్తిని సాగు చేస్తున్నారు. ఈ ఖరీఫ్‌లో అధిక వర్షపాతం నమోదు కావడంతో వర్షం నీరు అధికమై పత్తి పూర్తిగా దెబ్బతింది. సుమారు 50 శాతానికి పైగా దిగుబడి తగ్గిపోయింది. ప్రతీ సంవత్సరం దసరా పండుగ వరకు పత్తి పంట మార్కెట్లోకి వచ్చేది. కానీ ఈసారి దీపావళికి కూడా రాలేదు. దీంతో దిగుబడి ఏమేరకు తగ్గిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఒక్కో ఎకరానికి రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు పెట్టుబడి పెట్టిన అన్నదాతకు రూ.10 వేలు కూడా చేతికందే పరిస్థితిలేదు. జిల్లాలోని అనేక మంది రైతులు ప్రస్తుతం పత్తి పంటను తీసేసి మొక్కజొన్న పంట సాగు చేస్తున్నారు. ఇప్పటికే సుమారు 30 శాతం మంది రైతులు పత్తి పంట తొలగించారు. జిల్లాలో యాసంగిలో సుమారు 70వేల ఎకరాల్లో సాగు చేయవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. పత్తి పంటను తొలగిస్తున్న రైతులు జిల్లాలో 70వేల ఎకరాల్లో సాగు అంచనా -
‘డబుల్’ లొల్లి
గురువారం శ్రీ 20 శ్రీ నవంబర్ శ్రీ 2025భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఇళ్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే సంకల్పంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2019 సంవత్సరంలో భాస్కర్‌గడ్డ సమీపంలో 408 డబుల్‌బెడ్ ఇళ్ల సముదాయ నిర్మాణ పనులు ప్రారంభించి 2023లో పూర్తి చేసింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు లబ్ధిదారుల జాబితాను రూపొందించి డ్రా పద్ధతిలో ఇళ్లను కేటాయించారు. ఎన్నిక కోడ్ అమలోకి రావడంతో ఇంటి పత్రాలను అందించలేదు. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అప్పటి లబ్ధిదారుల జాబితాను రద్దు చేసింది. తమకు కేటాయించిన ఇళ్ల పత్రాలు ఇవ్వాలని పలుమార్లు లబ్ధిదారులు ఆందోళనలు, వినూత్న నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మరోసారి సర్వే చేసి ఇళ్లు కేటాయిస్తామని అధికారులు, ప్రజాప్రతినిధులు సమాధానమిస్తూ రెండు సంవత్సరాల పాటు కాలయాపన చేసి చివరి పాత జాబితాను పూర్తిగా రద్దు చేసి నూతన జాబితా ప్రకారం బుధవారం డ్రా పద్ధతిలో ఇళ్లు కేటాయించి ధృవపత్రం అందించారు. డబుల్బెడ్రూమ్ కోసం దరఖాస్తు చేసుకున్న నిరుపేద కుటుంబాలకు అన్యాయం జరిగిందని బాధితులు ఆరోపించారు. కూలీ, ఇతర చిన్న చిన్న పనులు చేసుకుంటూ అద్దె ఇంటిలో నివాసముంటున్నవారికి ఇళ్లు రాకపోవడంతో కంగుతిన్నారు. 2023 సంవత్సరంలో చేపట్టిన సర్వేలో అర్హులుగా గుర్తించి.. ప్రస్తుతం కేటాయించిన జాబితాలో వారి పేర్లు గల్లంతయ్యాయి. ఇప్పటికే సొంత ఇళ్లు, సింగరేణి ఉద్యోగం ఉన్నవారితో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సైతం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అధికారులు కేటాయించారు. జవహర్‌నగర్ కాలనీ, రాంనగర్, సుభాష్‌కాలనీ, పూల్లూరిరామయ్యపల్లి, బీసీ కాలనీ, హన్మాన్నగర్లో అధికంగా ఇళ్లు ఉన్న వారికి మళ్లీ ఇళ్లను కేటాయించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో డబుల్‌బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీలో అక్రమాలు జరిగిన అర్హులకు అందలేదని ప్రస్తుత ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అప్పటి జాబితాను రద్దు చేయించారు. అధికారులు పకడ్బందీగా అక్రమాలకు తావు లేకుండా ఇళ్ల కేటాయింపు జరగాలని ఆదేశించారు. అయినప్పటికీ గతంలో మాదిరిగానే అనర్హులకు ఇళ్లు కేటాయించినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. డబుల్‌బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు సర్వే, జాబితా ఎంపికపై కలెక్టర్ దృష్టి సారించలేదని జిల్లా కేంద్రంలో ప్రచారం జరుగుతోంది. ఓ ఇన్చార్జ్ జిల్లా ఉన్నతాధికారి అన్నీతానై వ్యవహారించినట్లు చర్చించుకుంటున్నారు. ఈ డబుల్‌బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు కోసం రెండు సంవత్సరాల పాటు దరఖాస్తుదారుల వద్దకు వెళ్లి నాలుగైదు సార్లు సర్వే చేశారు. సర్వేల పేరుతో కాలయాపన చేసి అర్హులకు న్యాయం చేయలేదు. పట్టణానికి చెందిన ఓ అధికార పార్టీ నాయకుడితో సదరు అధికారి జాబితాలో కొంత మంది అనర్హుల పేర్లను చేర్చినట్లు తెలిసింది. స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్లు లబ్ధిదారుల జాబితాపై రహస్య విచారణ చేపడితే అక్రమాలు బయటపడే అవకాశాలు ఉన్నాయని బాధితులు వేడుకుంటున్నారు. అనర్హులకు ఇళ్లు కేటాయించారని ఆరోపిస్తూ డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్న బాధితులు బుధవారం మంజూర్‌నగర్ ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. కక్ష్య పూరితంగానే కొంత మంది నాయకులు వారికి అనుకూలమైన వ్యక్తులకు ఇళ్లు ఇప్పిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇళ్లు కేటాయించగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తమ పేర్లను తొలగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిరసన కార్యక్రమం చేపడుతున్న బాధితులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన 408 ఇళ్లు ఇల్లు ఉన్న వారికే కేటాయించారని ఆరోపణ రహస్యంగా ఇళ్ల కేటాయింపునకు డ్రా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎదుట ఆందోళన అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలింపు -
సంప్రదాయాలను కాపాడాలి
భూపాలపల్లి అర్బన్: సంప్రదాయాలు, విలువలను కాపాడినప్పుడే కుటుంబాలు బాగుంటాయని ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్.ఆర్ దిలీప్‌కుమార్‌నాయక్ తెలిపారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సబ్ కోర్టు ఆవరణలో బుధవారం న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. వయోవృద్ధుల సంరక్షణ చట్టం, వారి సంక్షేమం అనే అంశంపై జరిగిన కార్యక్రమంలో జడ్జి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తల్లిదండ్రులను వేదించేవారికి ఆస్తులపై హక్కు ఉండదన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ పుప్పాల శ్రీనివాస్, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ అక్షయ, సిబ్బంది, వయోవృద్ధుల సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు. భూసేకరణకు సహకరించాలికాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో వీఐపీ ఘాటు నుంచి మెయిన్‌ఘాటు వరకు, ఇప్పలబోరు నుంచి వీఐపీ ఘాటు లింకురోడ్డు, ఇతర అభివృద్ధి పనులు చేసేందుకు రైతులు సహకరించాలని కాటారం సబ్‌కలెక్టర్ మయాంక్‌సింగ్ తెలిపారు. బుధవారం కాళేశ్వరం పంచాయతీలో రైతులతో స మావేశం నిర్వహించారు. పట్టా, లావణి పట్టా రైతులను రెండు విభాగాలుగా చేశారు. గతంలో సర్వే చేసినప్పటికీ మళ్లీ రైతులకు నోటీసులు అందజేసి రీ సర్వే చేయాలన్నారు. రైతులకు ఏమైన అభ్యంతరాలు ఉంటే లిఖిత పూర్వకంగా అందించాలన్నారు. అనంతరం కాళేశ్వరం జెడ్పీహెచ్ఎస్లో మధ్యాహ్న భోజన తయారీని పరిశీలించారు. వారి వెంట కాళేశ్వరం దేవస్థానం ఈఓ మహేష్, తహసీల్దార్ రామారావు, డిప్యూటీ తహసీల్దార్ కృష్ణ, కార్యదర్శి సత్యనారాయణ తదితరులు ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో తనిఖీలుచిట్యాల: పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పాఠశాల పరిశుభ్రత 5.0 కార్యక్రమ రాష్ట్ర పరిశీలకుడు, వరంగల్ డైట్ ప్రిన్సిపాల్ అబ్దుల్ హై తెలిపారు. బుధవారం మండలంలోని జూకల్ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించి పాఠశాల పరిశుభ్రతను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాఠశాలలో పరిశుభ్రత– భద్రత చర్యల అమలుపై పలు సూచనలు చేశారు. జిల్లా సీఎంఓ రమేష్, ప్రధానోపాధ్యాయుడు గిరగాని కృష్ణ, తదితరులు ఉన్నారు. గణపురం: గణపురం మండలకేంద్రంలోని మోడల్ పాఠశాలను రాష్ట్ర స్థాయి పరిశీలకుడు ఎండీ అబ్దుల్ హై, సీఎంఓ రమేశ్, ఎంఈఓ ఎండీ అప్రోజ్ బృందం బుధవారం తనిఖీ చేశారు. పాఠశాలలోని తాగునీరు, మరుగుదొడ్లు, తరగతి గదులు, రికార్డుల నిర్వాహణ, మధ్యాహ్న భోజనం, పరిసరాల పరిశుభ్రతలను పరిశీలించారు. బాల్యవివాహాల నిర్మూలనపై కళాజాతా కాళేశ్వరం: మహదేవపూర్, అంబట్పల్లి, సూరారం జెడ్పీహెచ్ఎస్ పాఠశాలల్లో కలెక్టర్, డీపీఆర్ఓల ఆదేశాల మేరకు మహిళా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాల్యవివాహాల నిర్మూల నపై తెలంగాణ సాంస్కృతిక సారథి సెగ్గం శిరీ ష కళా బృందం అవగాహన కల్పించారు. బా ల్యవివాహాలతో కలిగే అనర్థాలను వివరించా రు. ఈ కార్యక్రమంలో కళాకారులు సెగ్గం శిరీషజా డి, సుమలత, పులి రాధిక, ఆత్మకూరు, మ హేందర్, సోదారి సురేందర్, గడ్డం నాగమణి, కాస స్వాతి, ఓనపాకల కుమార్, చిలుముల మధుబాబు తదితరులు పాల్గొన్నారు. -
డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం
భూపాలపల్లి అర్బన్: డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి విద్యార్థులు భాగస్వామ్యం కావాలని తెలంగాణ నార్కోటిక్ బ్యూరో డీఎస్పీ రమేష్‌కుమార్, ఇన్స్పెక్టర్ శ్రీకాంత్‌లు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో నార్కోటిక్ బ్యూరో డీఎస్పీ, ఇన్స్పెక్టర్లు మాట్లాడుతూ విద్యార్థులు, సిబ్బంది మాదకద్రవ్యాల దుష్పభ్రావాలు, నేర నియంత్రణ, న్యాయ ప్రక్రియపై అవగాహన ఉండాలన్నారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. అంతకుముందు డ్రగ్స్ నియంత్రణపై రూపొందించిన వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటేశ్వర్లు, వైస్ ప్రిన్సిపాళ్లు డాక్టర్ రాజేష్, డాక్టర్ శ్రీధర్‌రావు, అసిస్టెంట్ డైరెక్టర్ వేణుగోపాల్, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. -
పారదర్శకంగా ఇళ్ల పంపిణీ
● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అర్హులైన నిరుపేదలకు పారదర్శకంగా ఇందిరమ్మ డబుల్‌బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ జరిగిందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఇల్లందు క్లబ్లో భాస్కరగడ్డ వద్ద నిర్మించిన 416 డబుల్బెడ్రూం ఇళ్లకు 409 లబ్ధిదారుల ఎంపికను కలెక్టర్ రాహుల్‌శర్మతో కలిసి డ్రా నిర్వహించి కేటాయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఒత్తిడిలకు లొంగకుండా ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్లను అందించడం జరిగిందన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు అర్హులైన పేదలను గుర్తించి ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, గృహ నిర్మాణ శాఖ పీడీ లోకిలాల్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌లు పాల్గొన్నారు. -
విజయవంతం చేయాలి
చీరల పంపిణీని భూపాలపల్లి అర్బన్: ఇందిరమ్మ చీరల పంపిణీని విజయవంతం చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి జిల్లా కలెక్టర్, అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చీరలు పంపిణీ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి పకడ్బందీగా మండల వారీగా షెడ్యూల్ తయారు చేయాలన్నారు. కాటారం, భూపాలపల్లి డివిజన్లో పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగేందుకు ప్రత్యేక అధికారులను నియమించనున్నట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులకు ముందస్తు సమాచారం ఇచ్చి ఆహ్వానించాలని, ఎలాంటి ప్రోటోకాల్ సమస్య రావొద్దన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ బాలకృష్ణ, డీపీఓ శ్రీలత మహిళా సంఘాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్లోని మహిళా శిశు వయోవృద్ధులు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్‌శర్మలు హాజరై మాట్లాడారు. వృద్ధులు సమాజానికి మార్గదర్శకులన్నారు. అనంతరం వయోవృద్ధులను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో శిక్షణా డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, మహిళా, శిశు, వయో వృద్ధుల సంక్షేమ అధికారి మల్లేశ్వరి, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రామచంద్రమూర్తి, రామచందర్, ఎన్జీఓ శ్యాం తదితరులు పాల్గొన్నారు. పటేల్ కృషితోనే దేశంలో ఐక్యత భూపాలపల్లి రూరల్: సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశం కోసం జీవితాన్ని త్యాగం చేశారని, ఆయన కృషితోనే దేశం నేటికీ ఐక్యతతో ఉందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. బుధవారం డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ క్రీడా ప్రాంగణంలో కేంద్ర యువజన సర్వీసులు క్రీడ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు మై భారత్, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ సంస్థల ఆధ్వర్యంలో సర్దార్ 150 ఐక్యత పాదయాత్రను కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడారు. పటేల్ స్ఫూర్తితో ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తుందన్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ దేశంలో ఎన్ని భాషలు మాట్లాడినా, ఎన్ని ప్రాంతాలు ఉన్నా అందరం ఒకటేనని చాటి చెప్పారన్నారు. అనంతరం డ్రగ్స్ రహిత దేశంగా తీర్చిదిద్దడానికి కేంద్రప్రభుత్వం చేపట్టిన నషా ముక్తి భారత్ అభియాన్ ప్రతిజ్ఞను చేయించారు. ఈ కార్యక్రమంలో మేరా యువభారత్ వరంగల్ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ చింతల అన్వేష్, సూపరింటెండెంట్ బానోతు దేవిలాల్, అడిషనల్ ఎస్పీ నరేష్ కుమార్, యువజన క్రీడల శాఖ అధికారి చిర్రా రఘు, సంక్షేమ అధికారి మల్లేశ్వరి, ఉపాధ్యాయులు కృష్ణ మోహన్, నాయకులు కన్నం యుగదీశ్వర్, తాటికొండ రవి కిరణ్, గాలిఫ్, వలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ -
పథకాలపై నిరంతర పర్యవేక్షణ
భూపాలపల్లి రూరల్: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని వరంగల్ పార్లమెంటు సభ్యురాలు, దిశా కమిటీ చైర్పర్సన్ డాక్టర్ కడియం కావ్య తెలిపారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశపు హాలులో గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఎంపీ కావ్య అధ్యక్షతన దిశా కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు శాఖల అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో కలిసి సమీక్ష నిర్వహించారు. పలు అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ కావ్య మాట్లాడుతూ.. జిల్లాలో వనరులు పుష్కలంగా ఉన్నాయని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి సాధించాలని అధికారులకు సూచించారు. జిల్లా విద్యా హబ్‌గా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. విద్య, వైద్య సౌకర్యాలపై దృష్టి సారించాలని సూచించారు. రైల్వే లైన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామని, బొగ్గు రవాణా వల్ల రహదారులు పాడవుతున్నాయని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పెట్టామని తెలిపారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ.. సింగరేణి సీఎస్ఆర్, డీఎంఎఫ్టీ నిధులు ప్రాథమిక పనులకు ఇవ్వడం లేదని.. కేంద్ర ప్రభుత్వ రూల్స్ ప్రకారం ఇవ్వాలని స్పష్టం చేశారు. కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. సమావేశంలో చర్చించిన అంశాలపై సమగ్ర నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రాజబాబు, డీఆర్డీఓ బాలకృష్ణ, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నవీన్‌రెడ్డి, కెటీపీపీ సీఈ ప్రకాశ్, సింగరేణి జీఎం రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.దిశా కమిటీ సమావేశంలో ఎంపీ కడియం కావ్య -
మొర ఆలకించరా..!
మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని సీఎస్ఐ కాలనీ చర్చి వెనుకాల ఇళ్ల మధ్యలో పాడు బడిన బావి ఉంది. వర్షం నీరు, చెత్త చెదారంతో బావిలో వ్యర్ధాలు పేరుకుపోయాయి. దీంతో దుర్గంధం, దోమలతో చుట్టు పక్కల ఇళ్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీటి రంగు మారి దోమల బెడద పెరగడంతో రోగాల బారిన పడుతున్నారు. బావిని పూడ్చాలని పలుమార్లు పాలకులకు, అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికై నా సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. – మొగుళ్లపల్లి -
రేవంత్ మాటలు ఘనం.. చేతలు శూన్యం
వరంగల్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటినుంచి ఆయన చెప్పే మాటలు ఘనంగా ఉంటున్నాయని, చేతలు మాత్రం శూన్యమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌ను సందర్శించారు. మక్కలు, పత్తి యార్డుల్లోని రైతులతో మాట్లాడారు. వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేశంలో రైతుల పక్షపాతి ఒక్క కేసీఆర్ మాత్రమే అని, ఆయన మొట్టమొదటిసారిగా రైతుబంధు తెచ్చి రైతులను ఆదుకున్నారని అన్నారు. రాష్ట్రంలో పత్తి రైతులు తీవ్రమైన మనోవేదనకు గురవుతునాని ఆవేదన వ్యక్తంచేశారు. సీసీఐ అడ్డమైన ఆంక్షలు పెట్టి ఆగమాగం చేస్తున్నా రేవంత్‌రెడ్డి లేఖలు రాస్తూ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. పంటలకు బోనస్ ఇస్తామని అనడమే కానీ, ఇచ్చింది లేదని తెలిపారు. ఎల్1, ఎల్2, కపాస్ యాప్, తేమశాతం లాంటి తుగ్లక్ నిర్ణయాలతో రైతులు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలవడానికి విచ్చలవిడిగా డబ్బులు పంచిన రేవంత్‌రెడ్డి పత్తి రైతులకు మద్దతు ధర అందించలేకపోతున్నారన్నారు. మక్క రైతులతో మాటామంతి.. అంతకుముందు అపరాల యార్డుకు వెళ్లిన హరీశ్‌రావు మక్కలను పరిశీలించారు. అమ్మడానికి వచ్చిన ములుగు జిల్లాకు చెందిన రైతులు వెంకటేశ్వర్లు, లక్ష్మయ్యలతో ముచ్చటించారు. మక్కలను ఎంతకు అమ్మారు అని ప్రశ్నించగా రూ.1,825లకు అని సమాధానం చెప్పారు. మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2,400లు ఉంది కదా అని అంటే.. వారు ట్రేడర్‌కు అమ్మామని, ఆయన వెంటనే డబ్బులు ఇవ్వడమే కాకుండా పంట వేసేందుకు ముందుగా పెట్టుబడి పెడుతున్నందున విక్రయించామని చెప్పారు. కేంద్రాల్లో కొనుగోలు చేసిన మక్కలకు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం వల్ల మార్క్‌ఫెడ్ రైతులకు డబ్బులు చెల్లించలేక పోతోందని హరీశ్‌రావు అన్నారు. అందువల్ల క్వింటాల్‌కు రైతులు రూ.575లు నష్టపోతున్నా ట్రేడర్లకే అమ్ముకుంటున్నారని వాపోయారు. కార్యక్రమంలో శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్సీ టి.రవీందర్రావు, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోతు కవిత, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, తాటికొండ రాజయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, ఒడితల సతీష్‌కుమార్, నన్నపునేని నరేందర్, సరోగసి కమిటీ మాజీ సభ్యురాలు డాక్టర్ హరి రమాదేవి, ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కా కులమర్రి లక్ష్మణ్‌బాబు, నాయకులు పాల్గొన్నారు. కేసముద్రం వ్యవసాయ మార్కెట్ సందర్శన కేసముద్రం: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌ను తన్నీరు హరీశ్‌రావు సందర్శించి, రైతులతో మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక, బోనస్ రాక, మరోవైపు యూరియా, రైతుబంధు,రైతు బీమా అందకపోవడంతో గోసపడుతున్న రైతులంతా రాష్ట్ర ప్రభుత్వంపై, సీఎం రేవంత్‌రెడ్డిపై శాపనార్దాలు పెడుతున్నారని విమర్శించారు. కేసముద్రం మార్కెట్లో కనీస సౌకర్యాలు లేవని, పందులు, మేకలు తిరుగుతుండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాంగ్రెస్ పాలనలో కరెంటు నుంచి కాంటా దాకా సమస్యలే మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు వరంగల్ ఏనుమాముల మార్కెట్ సందర్శన.. రైతులతో ముచ్చటించి సమస్యలు తెలుసుకున్న మాజీ మంత్రి -
పొగమంచులో ప్రయాణాలొద్దు
భూపాలపల్లి: వాతావరణంలో పొగమంచు తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో రాత్రి, తెల్లవారుజామున అవసరం ఉంటే తప్ప ప్రయాణాలు చేయొద్దని ఎస్పీ కిరణ్ ఖరే ప్రజలకు సూచించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ఇటీవల పొగమంచు కారణంగా జరిగిన రోడ్డు ప్రమాదాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. పొగమంచు కారణంగా రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు, పాదచారులను గమనించే సామర్థ్యం గణనీయంగా తగ్గిపోతుందన్నారు. అల్ప నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని తెలిపారు. అత్యవసర పరిస్థితులు తప్ప ఈ సమయాల్లో ప్రయాణాలు నివారించాలని ప్రజలకు ఎస్పీ విజ్ఞప్తి చేశారు. పొగమంచు ఎక్కువగా ఉన్న సమయంలో వాహనాలు నడిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఎస్పీ వివరించారు. వాహనాలను వేగంగా నడప కూడదని, శ్రద్ధగా, నిదానంగా ప్రయాణించాలన్నారు. తక్కువ దూరం మాత్రమే కనిపించే పరిస్థితుల్లో హెడ్లైట్లను లో బీమ్‌లో ఉంచి, ఫాగ్ లైట్లను తప్పనిసరిగా ఉపయోగించాలని సూచించారు. అత్యవసరంగా ప్రయాణం తప్పనిసరి అయినప్పుడు బ్రేకులు, లైట్లు, టైర్లు వంటి వాహన భాగాలను తప్పకుండా ముందుగానే తనిఖీ చేసుకోవాలని సూచించారు. డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం, అకస్మాత్తు ఓవర్‌టేక్‌లు, ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనలు ప్రమాదకర చర్యలు పూర్తిగా నివారించాలని హెచ్చరించారు. పోలీసుల సూచనలు, ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించడం ద్వారా వాహనదారులు తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకోవడమే లక్ష్యమని వివరించారు.ఎస్పీ కిరణ్ ఖరే -
కోతుల గుంపుతో గుబులు!
రేగొండ: మండల కేంద్రం నుంచి జాకారం వెళ్లే మార్గంలో కోతులు స్వైరవిహారం చేస్తున్నాయి. ఈ మార్గంలో వెళ్లే వాహనదారులు, ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు. గుంపులుగా రహదారిపై తిష్టవేసిన కోతులు ద్విచక్ర వాహనాలు, ఆటోలు, పాదాచారుల వెంట పడి వారి వద్ద ఉండే సరుకుల కవర్లను లాక్కుంటున్నాయి. ఒక్కసారిగా మీదకు వస్తున్న కోతులతో భయాందోళన చెందుతున్నారు. కొందరు ద్విచక్ర వాహనదారులు అదుపు తప్పి కింద పడి గాయపడిన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధాన రహదారిపై నెలకొన్న సమస్యలపై అధికారులు దృష్టిపెట్టాలని వాహనదారులు కోరుతున్నారు, -
ధాన్యం ఆరేదెలా..
కాటారం: ఆరుగాలం శ్రమించి పంట సాగుచేసిన రైతులకు అడుగడుగునా ఏదో ఒక అడ్డంకి ఎదురవుతోంది. వరి పంట పండించడం ఒక ఎత్తయితే చేతికి వచ్చిన వరి ధాన్యం విక్రయించే తరుణంలో ఆరబెట్టడం రైతులకు ఇబ్బందిగా మారుతోంది. ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తేమ 17 శాతం ఉంటేనే కొనుగోలు చేయాలనే నిబంధన ఉంది. దీంతో రైతులు తమ ధాన్యాన్ని రోజుల తరబడి తేమ శాతం అదుపులోకి వచ్చే వరకు ఆరబెట్టాల్సి వస్తుంది. ధాన్యం ఆరబెట్టడానికి సరైన ప్రదేశాలు లేక రైతులు రోడ్లపై లేదా ఖాళీ ప్రదేశాల్లో తమ ధాన్యాన్ని ఆరబెట్టుకుంటున్నారు. తేమ కష్టాలు..రైతుల ఇక్కట్లు.. జిల్లాలో వరి, పత్తి పంటలు రైతుల చేతికి వస్తున్నాయి. వాతావరణంలో మార్పులతో ఏ పంటలోనూ ప్రభుత్వం నిర్ణయించిన తేమశాతం రావడం లేదు. సేకరించిన పంట ఉత్పత్తులను రహదారులు, ఖాళీ ప్రదేశాల్లో టార్ఫాలిన్లపై పోసి ఆరబెడుతూ ఇబ్బందులు పడుతున్నారు. పంటలను రహదారులపై ఆరబోయడం వలన చీకటివేళలో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. పంట కల్లాలు నిర్మించుకుంటే ఈ ఇక్కట్లు ఉండేవి కాదు. సిమెంట్ కాంక్రీట్‌తో నిర్మించిన కల్లాలపై ఆరబెడితే తేమ శాతం త్వరగా తగ్గి ప్రభుత్వ మద్దతు ధర లభించనుంది. కష్టాలు తొలిగించేందుకు.. రైతులు తమ పంట దిగుబడులను ఆరబెట్టుకునేందుకు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారు. అలాంటి ఇబ్బందులను తీర్చాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం పంట కల్లాల నిర్మాణాలకు చర్యలు తీసుకుంది. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వీటి నిర్మాణం చేపట్టారు. సొంత భూమి కలిగిన రైతులకు ఉపాధి హామీ ద్వారా ఇవి నిర్మించుకునే అవకాశం కల్పించారు. అప్పట్లో అధికారులు రైతులకు సరిగా అవగాహన కల్పించకపోవడం బిల్లులు అందడం లేదనే కారణంతో రైతులు ముందుకు రాకపోవడంతో జిల్లాలో కొంత మంది రైతులు మాత్రమే కల్లాలు నిర్మించుకున్నారు. జిల్లాలో 1309 డ్రైయింగ్ ఫ్లాట్‌ఫాంలు మంజూరు కాగా కేవలం 340 మాత్రమే పూర్తయినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. వాహనదారులకు ఇబ్బందులు.. సరైన కల్లాల నిర్మాణం లేకపోవడంతో పలు మండలాల్లో ప్రధాన రహదారులపై రైతులు ధాన్యం ఆరబోసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ద్విచక్ర వాహనదారులు రోడ్డుపై ఉన్న ధాన్యం కుప్పలను గమనించక ప్రమాదాల భారిన ఘటనలు లేకపోలేదు.మండలాలు 12 గ్రామాలు 241 వరి సాగు 1,11,230 ఎకరాలు పత్తి సాగు 98,780 ఎకరాలు రైతులు 98,560రైతుల ఆరబోత కష్టాలను తొలగించేందుకు గత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధిహామీ పథకంలో భాగంగా రైతుల పొలాల్లో కల్లాల (డ్రై యింగ్ ఫ్లాట్‌ఫాం) నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. మూడు సంవత్సరాలుగా కల్లాల నిర్మాణానికి బ్రేక్‌పడింది. రైతులు ఆసక్తి చూపడం లేదని అధికారులు కారణాలు చెప్పడంతో ప్రభుత్వాలు ఆ పథకాన్ని నిలిపేశాయి. అనంతరం అనేక మంది రైతులు కల్లాల నిర్మాణం ప్రాముఖ్యత తెలుసుకొని దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కల్లాల నిర్మాణం కోసం తిరిగి అవకాశం కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. రోడ్లు, ఖాళీ ప్రదేశాలే దిక్కు.. ధాన్యం ఆరబెట్టడానికి అష్టకష్టాలు ఏళ్ల తరబడి అన్నదాతల అరిగోస -
ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
చిట్యాల: ‘కొనుగోళ్లు ప్రారంభమెప్పుడో’ అని ఈ నెల 16న సాక్షిలో ప్రచురితమైన కథనానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు స్పందించారు. మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. చిట్యాల: జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుకు వీసీకే యూత్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అంబాల అనిల్‌కుమార్ మంగళవారం మండలకేంద్రంలో వినతిపత్రం అందజేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుకునే విద్యార్థులు మధ్యాహ్న భోజనం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే విద్యార్థుల సమస్యలను త్వరలోనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు కనకం ఇతేష్, కృష్ణతేజ, తోట అభినయ్, శివ, హరికుమార్ పాల్గొన్నారు. కాటారం: యువజన క్రీడా ఉత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన జిల్లాస్థాయి సాంస్కృతిక పోటీల్లో మండలకేంద్రంలోని కేజీబీవీ, కాటారం జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. బృంద గీతంలో కేజీబీవీకి చెందిన పరిమళ బృందం ఉత్తమ ప్రదర్శన ఇచ్చి ప్రథమ స్థానంలో నిలవగా.. బృందనృత్య విభాగంలో సౌమ్య బృందం రెండో స్థానంలో, కాటారం జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన విజ్ఞా బంజార బృందం డప్పు నృత్యంలో ప్రతిభ కనబరిచింది. పరిమళ బృందం, విజ్ఞా బంజార బృందంను రాష్ట్రస్థాయి యువజన పోటీలకు ఎంపిక చేసినట్లు కేజీబీవీ ప్రిన్సిపాల్ చల్ల సునీత, జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం సోమలింగం తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థులను ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించారు. వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని సీఆర్పీఎఫ్ హైదరాబాద్ రేంజ్ డీఐజీ అనిల్ మింగే, కమాండెంట్ ప్రశాంత్ కేఆర్ శ్రీవాత్సవ మంగళవారం సందర్శించారు. -
ప్రత్యేక అలంకరణలో గణపేశ్వరుడు
గణపురం: కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా మండలకేంద్రంలోని కాకతీయుల కళా క్షేత్రం (గణపేశ్వరాలయం) కోటగుళ్లలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి భక్తులు తెల్లవారు జాము నుంచే పెద్దఎత్తున పోటెత్తారు. ఉదయం నుంచే స్వామి వారికి అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామి వారిని నాగభరణం, పట్టు వస్త్రాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణంలో మహిళలు దీపారాధనలు చేశారు. ఆలయ గోశాలలో గో మాతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ఆలయ అర్చకులు నాగరాజు తీర్థ ప్రసాదాలు అందచేశారు.కోటగుళ్లలో పూజలు నిర్వహిస్తున్న భక్తులు -
నందీశ్వరా.. నమస్తుభ్యం
కాశీ నుంచి నందీశ్వరుని పూజకు.. నందీశ్వరుడి అభిషేక పూజ కోసం ఉత్తరప్రదేశ్‌లోని కాశీ నుంచి తేజశ్విని అనే మహిళ వచ్చింది. బహుళ త్రయోదశి సందర్భంగా నందీశ్వరుడికి అభిషేక పూజలు చేస్తున్న విషయం తెలుసుకొని పాల్గొన్నట్లు పేర్కొన్నారు.పూలతో నందీశ్వరుడిని ముస్తాబు చేస్తున్న ఆలయ ఉపప్రధాన అర్చకుడు పనకంటి ఫణీంద్రశర్మ, నందీశ్వరుడికి సుగంధ ద్రవ్యాలతో అభిషేక పూజలు చేస్తున్న అర్చకుడు, పూజ తంతును తిలకిస్తున్న భక్తులు కాళేశ్వరం: కార్తీకమాసం చివరి సోమవారం బహుళ త్రయోదశి సందర్భంగా తూర్పు దిక్కున నందీశ్వరుడికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో రుద్రాభిషేకం, విశేష పూజలను శాస్త్రోక్తంగా పండితులు వైభవంగా నిర్వహించారు. సోమవారం ప్రదోషకాల సమయంలో దేవస్థానం ఉప ప్రధాన అర్చకుడు పనకంటి ఫణీంద్రశర్మ ఆధ్వర్యంలో పండితులు అభిషేక పూజల తంతును నిర్వహించారు. సాయంత్రం 7 గంటల నుంచి 8.30 గంటల వరకు అర్చకులు పూజలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఆలయంలో మొదటిసారిగా నిర్వహిస్తుండడంతో తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఎంతో భక్తితో భక్తులు గంటన్నరపాటు పూజతంతును తిలకించి భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. అన ంతరం భక్తులకు దర్శనం కల్పించారు. ప్రసాద వితరణ చేశారు. భక్తులు భారీగా తరలిరావడంతో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఏకాదశ రుద్రుడే నందీశ్వరుడు.. ఏకాదశ రుద్రుడే నందీశ్వరుడని డాక్టర్ బాచంపల్లి సంతోష్‌కుమార్‌శాస్త్రి భక్తులకు ప్రవచనాలు వినిపించారు. మహాశివుడికి ప్రియభక్తుడు నందీశ్వరుడని తెలిపారు. కార్తీకమాసం బహుళ త్రయోదశి సందర్భంగా నందీశ్వరుడిని కొలిస్తే మహాశివుడు సంతృప్తి చెందుతాడన్నారు. నందీశ్వరుడికి అభిషేకం చేస్తే పాహరణం జరుగుతుందని చెప్పారు. అరుణాచలంలో నందీశ్వరుడికి అభిషేక పూజలు చేస్తారని, ఇప్పుడు కాళేశ్వరంలో నందీశ్వరుడికి అభిషేకం నిర్వహించడం ఎంతో శుభపరిణామం అన్నారు. ఈ సందర్భంగా దేవస్థానం ఈఓ మహేష్, అర్చక బృందాన్ని అభినందించారు.● పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం ● శాస్త్రోక్తంగా గంటపాటు భక్తుల విశేష పూజలు -
మెడికల్ షాపుల్లో ఆకస్మిక తనిఖీ
భూపాలపల్లి అర్బన్: జిల్లా కేంద్రంలోని మెడికల్ షాపులలో జిల్లా డ్రగ్స్ కంట్రోల్ అధికారి పావని సోమవారం తనిఖీలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన పలు షాపులకు నోటీసులు జారీచేశారు. అనంతరం పావని మాట్లాడుతూ.. గర్భస్రావానికి సంబంధించిన, మత్తు అలవాటు కలిగించే మందులను, యాంటిబయోటిక్స్‌ను అర్హత గల వైద్యుడి ప్రిస్కిప్షన్ లేకుండా అమ్మితే కఠిన చర్యలు ఉంటాయన్నారు. సేల్ బిల్ తప్పకుండా ఇవ్వాలని సూచించారు. ఎవరైనా అధిక ధరలకు మందులను విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కొత్త జీఎస్టీ ధరల ప్రకారం అమ్మకపు బిల్లు ఇవ్వాలని సూచించారు. -
ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు
భూపాలపల్లి అర్బన్: పదో తరగతి వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఈనెల 21వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రూ.50 అపరాధ రుసుముతో డిసెంబర్ 1వ తేది వరకు, రూ.200 అపరాధ రుసుముతో డిసెంబర్ 12వ తేది వరకు, రూ.500 అపరాధ రుసుముతో డిసెంబరు 30వ తేదీలోపు చెల్లించాలన్నారు. కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి దేవస్థానం పాలకమండలికి దేవాదాయశాఖ రీ నోటిఫికేషన్ వేసినట్లు ఈఓ మహేష్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గతంలో పలుమార్లు పాలకమండలికి నోటిఫికేషన్ వేయగా అనివార్య కారణాలతో వాయిదా పడింది. దీంతో మరోసారి 14మంది డెరెక్టర్లు, ఒక ఎక్స్అఫీషియో సభ్యులకు (అర్చక) నోటిఫికేషన్‌ను ఆ శాఖ కమిషనర్ ఆదేశాలతో వేశారు. ఈ నోటిఫికేషన్ వెలుబడిన 20 రోజుల్లో ఆశావహులు వరంగల్ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. ఈ సారైనా పాలకమండలి నియామకం జరుగుతుందా లేదా అని ఆశావహులు చర్చించుకుంటున్నారు. భూపాలపల్లి అర్బన్: ఈనెల 23న జిల్లాలో నేషనల్ మెయిన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నట్లు జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భూపాలపల్లి, కాటారం మండల కేంద్రాల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షకు విద్యార్థులు ఒక గంట ముందు హాజరుకావాలని సూచించారు. క్యాలిక్యులేటర్లు, సెల్ ఫోన్లు తీసుకురాకూడదని చెప్పారు. కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి, ప్రవేశ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని సంబంధిత చీఫ్ సూపరింటెండెంట్లను ఆదేశించారు. భూపాలపల్లి రూరల్: ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ఈనెల 21న జిల్లా కేంద్రంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ 11వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు జోరుక సదయ్య, ప్రధాన కార్యదర్శి వేముల రాజమౌళి తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలో కర పత్రాలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మత్స్య పారిశ్రామిక జిల్లా చైర్మన్ చిలుకల పాణి, సంఘం నాయకులు సాదా మల్లయ్య, చాడ కిష్ట స్వామి, సాంబయ్య, మారబోయిన ధనుంజయ, పిట్టల కేశవులు, మండలాల అధ్యక్షులు బోయిని సాంబయ్య, బంటు రమేష్, మొగిలి, కుమార్, సమ్మయ్య పాల్గొన్నారు. కాటారం: జాతీయ స్థాయి అండర్ 17 విభాగం హ్యాండ్‌బాల్ పోటీలకు మండలకేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థి ఎంపికయ్యారు. ఈ నెల 7నుంచి 9వరకు మహబూబ్‌నగర్‌లో జరిగిన రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ పోటీల్లో గురుకుల పాఠశాలకు చెందిన క్రీడాకారుడు అజయ్ ఉమ్మడి వరంగల్ జిల్లా జట్టు తరఫున పాల్గొని అత్యంత ప్రతిభ కనబర్చి గోల్డ్‌మెడల్ సాధించాడు. దీంతో నిర్వాహకులు జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఈ నెల 27నుంచి 30వరకు కర్ణాటక రాష్ట్రంలోని తుమకూరు జిల్లాలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో అజయ్ పాల్గొననున్నారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికవడం పట్ల ఎస్జీఎఫ్ఐ కార్యదర్శి జైపాల్, కళాశాల ప్రిన్సిపాల్ రాజేందర్, వైస్ ప్రిన్సిపాల్ మాధవి, జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ వెంకటయ్య, పీడి మహేందర్, పీఈటీ శ్రీనివాస్, కోచ్ వెంకటేశ్, హర్షం వ్యక్తం చేశారు. -
కుంటలు, చెరువులెన్ని..
భూపాలపల్లి రూరల్: జిల్లాలోని చిన్న నీటి వనరుల లెక్కింపునకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ప్రతి ఐదేళ్లకోసారి నీటి వనరులను లెక్కిస్తారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ప్రభుత్వం ఇప్పటికే ఖరారు చేసింది. జిల్లాలో వారంరోజుల్లో సర్వే మొదలు కానుంది. జలశక్తి కార్యక్రమంలో భాగంగా జల గణన చేపడుతున్నారు. మ్యానువల్ పద్ధతిలో నీటి వనరులను లెక్కపెట్టి ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లో నమోదు చేస్తారు. సిబ్బందికి శిక్షణ జిల్లాలో చిన్న నీటి వనరుల గణన కోసం సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. సీపీఓ అధికారులే కాకుండా రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు సైతం ఈ గణన ప్రక్రియను పర్యవేక్షించేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ చైర్మన్‌గా, సీపీఓ కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. గ్రామ పరిపాలన అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఫీల్డ్ టెక్నీషియన్లు చిన్న నీటి వనరుల గణనను చేపట్టనున్నారు. వీరిని సమన్వయం చేసే బాధ్యతను మండలాల వారీగా తహసీల్దార్లకు అప్పగించనున్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది నిర్వహించే నీటి వనరుల గణన వివరాలను ప్రతీ రోజు ఆన్లైన్లో నమోదు చేస్తారు. అనంతరం వాటిని ఉన్నతాధికారులకు అందించనున్నారు. కబ్జాకు గురైన చెరువులు వెలుగులోకి రానున్నాయా? చాలాగ్రామాల్లో పూర్వం నుంచి ఉన్న చెరువుల శిఖం భూములు కబ్జాలకు గురయ్యాయి. చెరువుల లెక్కింపుతో పాటు, చెరువుల శిఖం భూములను లెక్కిస్తే కబ్జాలకు గురైన చెరువులు కూడా వెలుగులోకి రానున్నాయి. కబ్జాలకు గురైన శిఖం భూములను గుర్తించి చెరువులను విస్తరణ చేస్తే చెరువులకు, కుంటలకు పూర్వవైభవం రానుంది. జలశక్తి కార్యక్రమంలో భాగంగా ఐదేళ్లకు ఒకసారి చిన్న నీటి వనరులను లెక్కిస్తారు. 2017–18 సంవత్సరంలో నీటి వనరుల గణన నిర్వహించారు. ప్రస్తుతం మళ్లీ చేపట్టేందుకు సీపీఓ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా గొట్టపు బావులు, ఓపెన్ బావులు, చెరువులు, చిన్న పాటి కుంటలు, రెండు వేల హెక్టార్లలోపు భూమికి సాగునీరు అందించే మినీ ప్రాజెక్టులను లెక్కించనున్నారు. అధికారులు వీటన్నింటి వివరాలను నమోదు చేసి ప్రభుత్వానికి అందించనున్నారు. ఈ గణన ద్వారా ఏయే గ్రామంలో ఎన్ని నీటి వనరులు ఉన్నాయనే విషయంతో పాటు గ్రామాల్లో నీటి లభ్యత ఎలా ఉందనే అంశం వెలుగులోకి రానుంది. గణన వివరాలను కేంద్ర జలశక్తి శాఖకు అందించనున్నారు. అధికారులు అందించిన నివేదిక ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం భవిష్యత్‌లో రాష్ట్ర నీటి వనరుల రంగానికి వివిధ స్కీంల కింద ఆర్థిక సహకారం అందించనుంది. రేపటి నుంచి చిన్న నీటి వనరుల లెక్కింపు నెలరోజుల పాటు కొనసాగనున్న కార్యక్రమం సర్వేకు షెడ్యూల్ ఖరారు చేసిన ప్రభుత్వంచిన్న నీటి వనరుల గణన వారంరోజుల్లో జిల్లాలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాం. ఇందుకు సంబంధించి మూడు రోజుల పాటు సిబ్బందికి శిక్షణ అందిస్తున్నాం. నెల రోజుల్లో నీటి వనరుల గణన పూర్తిచేసి ప్రభుత్వానికి నివేదిక అందిస్తాం. – బాబురావు, సీపీఓ -
నాణ్యమైన వైద్యసేవలు అందించాలి
భూపాలపల్లి: జిల్లాలో వైద్యసేవలు నాణ్యతగా, పారదర్శకంగా అందించడానికి ఆరోగ్య సంస్థ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ నిబంధనలు పాటించాలని కలెక్టర్ రాహుల్‌శర్మ సూచించారు. ఐడీఓసీ కార్యాలయంలోని తన చాంబర్లో సోమవారం జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లు, స్కానింగ్ కేంద్రాలు, క్లినిక్స్ నమోదు ప్రక్రియలను సమీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. రోగుల భద్రత, వైద్య నైతిక విలువలు, అవసరమైన సిబ్బంది, పరికరాలు సంబంధిత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించాలని సూచించారు. రిజిస్ట్రేషన్ లేకుండా నడుస్తున్న ఆస్పత్రులు లేదా వైద్య సదుపాయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఏఎస్పీ నరేష్కుమార్, డీఎంహెచ్ఓ డాక్టర్ మధుసూదన్, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ కిరణ్ పాల్గొన్నారు. మెరుగైన సేవలు అందించాలి.. ప్రజలకు మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందించాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. మంజూరునగర్లో ఇండియా బ్యాంక్ నూతన శాఖను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకర్లు పాల్గొన్నారు. బయోమెట్రిక్ తప్పనిసరి.. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది బయోమెట్రిక్ హాజరు విధానాన్ని తప్పనిసరిగా నమోదు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. బయోమెట్రిక్ హాజరు నమోదుపై ఐడీఓసీ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బయోమెట్రిక్ హాజరు పరిశీలన ఆధారంగా మాత్రమే వేతనాలు చెల్లించే విధానం అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. సమస్యలు పరిష్కరించాలి... ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి తమ సమస్యల పరిష్కారానికి దరఖాస్తులు సమర్పిస్తున్నారని.. ఆ దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా సత్వర పరిష్కారం కల్పించేందుకు సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. ఐడీఓసీ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. చిట్యాల మండలం ఏఆర్ పల్లి గ్రామానికి చెందిన ఐలమ్మ లోకోమోటర్ వ్యాధితో బాధపడుతూ నడవలేకపోతున్నానని, తనకు వీల్‌చైర్ ఇప్పించాలని ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. వెంటనే స్పందించిన కలెక్టర్ సదరు మహిళకు వీల్‌చైర్ మంజూరు చేయాలని మహిళా సంక్షేమ అధికారిని ఆదేశించారు. మెరుగైన బ్యాంకింగ్ సేవలు ఇవ్వాలి కలెక్టర్ రాహుల్ శర్మ జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ కార్యాలయంలో నేటి ఉదయం 10 గంటలకు దిశా కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు డీఆర్డీఓ బాలకృష్ణ తెలిపారు. ఈ సమావేశానికి వరంగల్ ఎంపీ కడియం కావ్య, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు హాజరవుతారని పేర్కొన్నారు. -
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
భూపాలపల్లి: ఆకర్షణీయమైన ప్రకటనలకు మోసపోకుండా సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ కిరణ్ ఖరే సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల నకిలీ ఆన్లైన్ ట్రేడింగ్ యాప్‌లు, వెబ్సైట్ల పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలు అధికంగా నమోదవుతున్నాయన్నారు. వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఈమెయిల్ వంటి వేదికల ద్వారా ఆకర్షణీయమైన లింకులు పంపడం, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు, త్వరిత రిటన్స్ వంటి వాగ్దానాలతో పెట్టుబడిదారులను నమ్మబలికి మోసం చేస్తారన్నారు. ఏవైనా అనుమానాస్పద లావాదేవీలు గమనించిన వెంటనే పోలీసులకు లేదా 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని ఎస్పీ కిరణ్ ఖరే సూచించారు.ఎస్పీ కిరణ్ ఖరే -
చలి చంపేస్తోంది..
వారం రోజులుగా గోదావరి తీర ప్రాంతాల్లో చలి పంజా విసురుతోంది. చలికి మనుషులతో పాటు ఏ జీవరాశి కూడా తట్టుకోవడం లేదు. పగటిపూట ఉష్ణోగ్రతలు తగ్గుతూ..రాత్రికి 13–14 డిగ్రీలకు చేరుతుంది. దీంతో మహదేవపూర్ మండలంలో నిర్మించిన అన్నారం(సరస్వతి బ్యారేజీ) వద్ద శనివారం రాత్రి చలికి వణికిపోతూ వానరాల గుంపు దర్శనమిచ్చింది. అడవిలో ఉండాల్సిన వానరాలు బ్యారేజీ వంతెనపై రాత్రిపూట చలికి గజగజ వణికిపోతూ తన పిల్లలను ఒడిలో హత్తుకుపెట్టుకొని బతుకు జీవుడా అంటూ ప్రయాణికులకు కనిపించాయి. అయ్యో! మాకు కూడా చలేస్తుంది అన్నట్లుగా వానరాలు వణుకుతూ అటుగా వెళ్తున్న చూపరుల మనస్సు చలించుకుపోయేలా కనిపించాయి. – కాళేశ్వరంఅన్నారం బ్యారేజీపైన రాత్రి చలికి వణికిపోతూ తన పిల్లలను ఒడిలో పెట్టుకున్న వానరాలు -
జాతరలోపు పనులు పూర్తిచేయాలి
గణపురం: గాంధీనగర్ నుంచి జంగాలపల్లి వరకు నిర్మిస్తున్న నాలుగు లైన్ల రోడ్డు విస్తరణ పనులు మేడారం జాతరలోపు పూర్తిచేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆదేశించారు. ఆదివారం గణపురం మండలం గాంధీనగర్ గ్రామంలో రూ.25 కోట్లతో గాంధీనగర్ నుంచి జంగాలపల్లి వరకు నిర్మించనున్న నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే జనవరి మాసంలో జరిగే మేడారం మహా జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థ్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృషితో కోట్ల రుపాయల నిధులు మంజూరు చేశారన్నారు. అందులో భాగంగా గాంధీనగర్ నుంచి జంగాలపల్లి వరకు రూ.25 కోట్ల రూపాయలతో నాలుగు లైన్ల రోడ్డు విస్తరణ పనులు ముందస్తుగా ప్రారంభించినట్లు చెప్పారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
సాగులో నాలుగేళ్లుగా మార్పులు
సాగు వివరాలు (ఎకరాల్లో..)వరి మిర్చి 1,13,3761,10,899 24,360 19,63617,377 9,521 1,05,00098,600● వర్షాలు, తెగుళ్ల కారణంగా మిరపపై రైతుల అనాసక్తి ● నీటి వనరులు పెరగడంతో వరి వైపు మొగ్గుసంవత్సరం 2022 2023 2024 2025 భూపాలపల్లి రూరల్: జిల్లాలో నాలుగేళ్లుగా వరిసాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. అంతకు ముందు వరితో పాటు మిర్చి సాగు ఎక్కువగా ఉండేది. నాలుగేళ్లుగా మిర్చి పంట సాగుపై రైతులు ఆసక్తి చూపడం లేదు. అకాల వర్షాలు, తెగుళ్లు, ఇతర కారణాలతో గిట్టుబాటు రాక నష్టాలు చవిచూసిన రైతులు.. ఇప్పుడు వరి సాగుపై మక్కువ చూపుతున్నారు. నీటి వనరులు పెరగడం, వరికి క్వింటాల్‌కు మద్దతు ధర రూ.2300 వరకు ఉండడం, రూ.500 బోనస్ చెల్లించడం, కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేస్తుండడంతో రైతులు వరి సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. ధాన్యం కూడా ఎకరాకు 24 నుంచి 26 క్వింటాళ్ల దిగుబడి వస్తూ రైతులకు సిరులు కురిపిస్తోంది. నీటి వనరులు పెరగడమే కారణం.. జిల్లా వ్యాప్తంగా నాలుగేళ్లుగా నీటి వనరులు పెరిగాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా భూగర్భ జలాలు వృద్ధి చెంది బోరు బావుల్లో నీటి మట్టాలు పెరిగి నీటి వనరులు పెరిగాయి. సాగునీటి సమస్య లేకుండా పోయింది. దానికి తోడు వానాకాలం సీజన్లో అనువైన వర్షాలు కురుస్తున్నాయి. ధాన్యం అమ్మకం కోసం కూడా రైతులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని జిల్లాలో రైతులు వరి సాగును ఏటేటా పెంచుతూ వస్తున్నారు. సన్నాల సాగుపై మక్కువ.. జిల్లాలో రైతులు సన్నాల సాగుపై దృష్టి సారిస్తున్నారు. రెండు, మూడేళ్లుగా సన్నాలైన చిట్టిపొట్టి, బీపీటీ, చింట్లు తదితర సన్నరకాలను సాగు చేయడంపై ఆసక్తి చూపుతున్నారు. సన్నాలను తేమ శాతం ఎక్కువ ఉన్నా మిల్లర్లే మద్దతు ధర కంటే ఎక్కువ ధర చెల్లించి కొనుగోలు చేస్తుండడంతో.. జిల్లాలో రైతులు సాగు చేస్తున్న వరిలో 60 శాతం వరకు సన్నాలే ఉండడం గమనార్హం. ప్రభుత్వం సన్నాలకు మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించడంతో సన్నాల సాగు గణనీయంగా పెరిగింది. -
సీసీ రోడ్డు పనులు ప్రారంభం
కాటారం: మండలకేంద్రంలోని ఇప్పలగూడెంలో అంతర్గత సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఆదివారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, కాటారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పంతకాని తిరుమల ప్రారంభించారు. రూ.10 లక్షల సీఆర్ఆర్ నిధుల ద్వారా పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. గ్రామాల్లోని ప్రతి కాలనీలో సీసీ రోడ్డు ఉండాలనే లక్ష్యంతో మంత్రి శ్రీధర్‌బాబు అంతర్గత రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామాల్లో వైద్య, విద్య, తాగునీరు, రవాణా అందించడమే ధ్యేయంగా మంత్రి శ్రీధర్‌బాబు ముందుకెళ్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వేమునూరి ప్రభాకర్‌రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ చినాల బ్రహ్మారెడ్డి, మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య, మాజీ ఎంపీటీసీ జాడి మహేశ్వరి, నాయకులు చీమల రాజు, ఆత్మకూరి కుమార్‌యాదవ్, జాడి రమేశ్ పాల్గొన్నారు. గంజాయి విక్రయిస్తున్న యువకుల అరెస్ట్ రేగొండ: గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు యువకులను కొత్తపల్లిగోరి పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. గణపురం సీఐ కరుణాకర్ రావు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ములుగు జిల్లా అబ్బాపూర్ గ్రామపంచాయతీ శివారులోని ఓ మిల్లులో బిహార్‌కు చెందిన చోటు కుమార్, కుందన్ కుమార్, సంతోష్ కుమార్ హమాలీలుగా పని చేస్తున్నారు. వీరంతా కలిసి కొత్తపల్లిగోరి మండలం కొత్తపల్లి (కె) లోని కెనాల్ వద్దకు గంజాయి తీసుకువచ్చారు. పక్కా సమాచారం మేరకు ఎస్సై దివ్య ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేసి వారిని అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారి నుంచి 2.3 కిలోల గంజాయి, 53 గంజాయి చాక్లెట్లు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. కిక్కిరిసిన భక్తజనం మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయం ఆదివారం వేలాది మంది భక్తజనంతో కిక్కిరిసిపోయింది. రాష్ట్రంలోని సుదూర ప్రాంతాల నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. పవిత్ర చింతామణి జలపాతం వద్ద స్నానాలు ఆచరించి ఆలయంలోని స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్నారు. -
ఘనంగా ప్రతిష్ఠాపన వేడుకలు
ఆలయ గోపురంపై శతకుంభాభిషేకంగణపురం: మండలకేంద్రంలోని శ్రీ పట్టాభి సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఆదివారం శ్రీ గణపతి, శివలింగ, నవగ్రహ అష్టబలి పీఠ శతకుంబాభిషేకం మహోత్సవం ఘనంగా జరిగింది. మూడు రోజుల పాటు జరిగిన ప్రతిష్ఠాపన కార్యక్రమాలలో భాగంగా ఆదివారం ఉదయం మహా పూర్ణహోమంతో పూజలు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరయ్యారు. గణపతి, నాగలింగేశ్వర, శివలింగ, నందీశ్వర, అష్టబలపీరాలను ప్రతిష్ఠాపన చేశారు. అనంతరం పట్టాభిసీతారామ చంద్ర స్వామి ఆలయానికి శత కుంభాషేకం నిర్వహించారు. వేదపండితులు శ్రీనివాస చార్య పరాచర బట్టర్, అరుణాచారి బట్టర్, ఆలయ అర్చకులు నరేష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగగా భక్తులు వేలాదిగా తరలి వచ్చారు. -
మళ్లీ కసరత్తు !
డీసీసీ అధ్యక్షుల ఎంపికపై టీపీసీసీ తుది అభిప్రాయ సేకరణసాక్షిప్రతినిధి, వరంగల్: అర్ధంతరంగా ఆగిపోయిన డీసీసీ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియపై టీపీసీసీ మళ్లీ దృష్టి సారించింది. త్వరలోనే డీసీసీ రథసారథులను ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఒక్కో జిల్లా నుంచి ఎమ్మెల్యేలు, సీనియర్ల నుంచి తుది అభిప్రాయ సేకరణ చేస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. వాస్తవానికి ఈ నెల మొదటి వారంలోనే ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు అక్టోబర్‌లో కార్యాచరణ చేపట్టారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ మార్గదర్శకాల మేరకు అక్టోబర్ 11 నుంచి 18 వరకు ఏఐసీసీ, టీపీసీసీ పరిశీలకులు జిల్లాల్లో పర్యటించి ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఉమ్మడి వరంగల్‌లో ఆరు జిల్లాల నుంచి 161 మంది డీసీసీ అధ్యక్ష పదవుల కోసం పోటీ పడ్డారు. ఏఐసీసీ, టీపీసీసీ మార్గదర్శకాల మేరకు ఒక్కో జిల్లా నుంచి నాలుగు పేర్లను తీసుకుని సీఎం, టీపీసీసీ చీఫ్‌కు అందజేశారు. ఇదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటికేషన్ రావడం, హైకోర్టు స్టేతో రద్దు కావడం, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కారణంగా డీసీసీల ఎంపిక ప్రక్రియ ఆగిపోయింది. జూబ్లీహిల్స్ ఎన్నిక ముగియగా.. స్థానిక సంస్థల ఎన్నికలకు సైతం సిద్ధం కావాలని పార్టీ భావిస్తోంది. ఈనేపథ్యంలోనే డీసీసీలను పూర్తి చేయాలని పార్టీ అధిష్టానం భావించి మళ్లీ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. పోటాపోటీగా దరఖాస్తులు.. పార్టీ హైకమాండ్ కార్యాచరణతో డీసీసీ ఎన్నికల కసరత్తుకు రంగంలోకి దిగిన పరిశీలకులకు పోటీపోటీగా ఆశావహుల నుంచి దరఖాస్తులు అందాయి. ఇప్పుడున్న డీసీసీ అధ్యక్షుల మార్పు తథ్యమన్న ప్రచారం నేపథ్యంలో.. కొత్తగా హనుమకొండ జిల్లా నుంచి ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, జంగా రాఘవరెడ్డి, ఈవీ శ్రీనివాస్‌రావు, బట్టి శ్రీనివాస్, పింగిళి వెంకట్రాం నర్సింహారెడ్డి, బొమ్మనపల్లి అశోక్‌రెడ్డి, కట్ల శ్రీనివాస్‌తో పాటు పలువురు దరఖాస్తు చేసుకున్నారు. వరంగల్ నుంచి ప్రస్తుత డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, నమిండ్ల శ్రీనివాస్, ఎంపీ ఆనంద్, బొంపెల్లి దేవేందర్‌రావు, గోపాల నవీన్‌రాజ్, నల్గొండ రమేశ్, నర్సంపేట మాజీ ఎంపీపీ టి.రవీందర్రావు, పిన్నింటి అనిల్‌రావు తదితరులు పోటీపడ్డారు. జయశంకర్ భూపాలపల్లి డీసీసీ కోసం మాజీ మావోయిస్టు నేత గాజర్ల అశోక్, చల్లూరి మధుతో పాటు 18 మంది దరఖాస్తు చేసుకున్నట్లు పరిశీలకులు ప్రకటించారు. జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి స్థానంలో హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, సింగపురం ఇందిర, మొగుళ్ల రాజిరెడ్డి, బండ శంకర్, లకావత్ ధన్వంతి, కొమ్మూరి ప్రశాంత్‌రెడ్డి, మాసాన్‌పల్లి లింగాజీ తదితరులు రేసులో ఉన్నారు. ములుగు జిల్లాకు పైడాకుల అశోక్, కుంజ సూర్య, మల్లాడి రాంరెడ్డి, గొల్లపల్లి రాజేందర్‌గౌడ్, బాదం ప్రవీణ్ తదితరులు దరఖాస్తు చేసుకున్నట్లు పార్టీవర్గాల సమాచారం. మహబూబాబాద్ నుంచి జె.భరత్‌చంద్రారెడ్డి, వెన్నం శ్రీకాంత్‌రెడ్డి, అంజయ్యతో పాటు 20 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ప్రచారం ఉంది. అయితే మొత్తంగా ఉమ్మడి జిల్లా నుంచి ఆరు డీసీసీల కోసం 161 దరఖాస్తులు రాగా.. ఒక్కో జిల్లా నుంచి నాలుగు పేర్ల చొప్పున 24 మంది పేర్లను ఏఐసీసీ, టీపీసీసీ పరిశీలనకు పంపారు. ఇందులో నుంచి ఎంపిక చేసేందుకు తాజాగా టీపీసీసీ ముఖ్యనేతల నుంచి తుది అభిప్రాయ సేకరణ చేస్తుండడం చర్చనీయాంశమవుతోంది. ‘పారామీటర్’లు పక్కానా? ఎంతవరకీ ని‘బంధనాలు’.. కాంగ్రెస్ దాదాపు పదేళ్లు అధికారంలో లేదు.. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతోంది. అధిష్టానం సంస్థాగత పదవులను కీలకంగా చూస్తోంది. వారికి తగిన ప్రాధాన్యం ఇస్తామని కూడా చెప్తోంది. దీంతో డీసీసీ అధ్యక్షుడు జిల్లాస్థాయిలో కీలకం కానున్నారన్న ప్రచారం ఉంది. ఈనేపథ్యంలో ఇటీవల దరఖాస్తుల స్వీకరణ సందర్భంగా ఆశావహులు పోటీపడ్డారు. పార్టీ నిబంధనల ప్రకారం.. డీసీసీ అధ్యక్షులుగా దరఖాస్తు చేసుకునేవారు కనీసం ఐదేళ్లపాటు క్రమశిక్షణతో, నిరంతరం పార్టీ కోసం పనిచేసిన వారై ఉండాలి. అలా... లేని దరఖాస్తులు ఏఐసీసీ పరిశీలకులు తొలగిస్తారని స్పష్టం చేశారు. ప్రస్తుతం డీసీసీ అధ్యక్షులుగా పని చేస్తున్న వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ రెండోసారి అవకాశం ఉండబోదన్నారు. పార్టీ నుంచి ప్రజాప్రతినిధిగా ఎంపికై న వారిని డీసీసీ పీఠానికి పరిగణనలోకి తీసుకోరని, అలాగే పార్టీ ప్రజాప్రతినిధుల దగ్గరి బంధువులకు కూడా అవకాశం కల్పించడం లేదని తేల్చిచెప్పారు. డీసీసీ అధ్యక్ష నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా నాయకులకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఏఐసీసీ సూచించిన ఈ పారామీటర్లను పరిగణనలోకి తీసుకుంటే చాలా జిల్లాల్లో డీసీసీ పదవులకు సమర్థులను ఎంపిక చేయడం కష్టమేనన్న అభిప్రాయం పరిశీలకుల్లో వచ్చింది. ఐదేళ్లుగా పార్టీ కోసం పనిచేసిన నాయకులు చాలామందే దరఖాస్తుదారుల్లో ఉన్నా.. అందులో నుంచి ఎంపికై న వారు పార్టీని సమర్థంగా నడిపించగలరా? అనేది ప్రశ్నగా ఉంది. దీంతో ఏఐసీసీ మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకుంటారా? లేక జిల్లా ఇన్చార్జ్ మంత్రి, ఎమ్మెల్యేల అభిప్రాయాల మేరకు డీసీసీలను ఎంపిక చేస్తారా? ఏఐసీసీ గైడ్‌లైన్స్ సడలించి స్థానిక అవసరాలు, ప్రాథమ్యాలను గమనించి నియమిస్తారా? అసలేం జరగనుంది? అన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ.. ఒక్కో జిల్లా నుంచి పరిశీలనలో నాలుగు పేర్లు ‘స్థానిక’, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో తాత్కాలికంగా బ్రేక్ నియామకంపై నేటి కేబినెట్లో చర్చించే అవకాశం -
కార్తీక శోభ
కాళేశ్వరం: కార్తీకమాసం ఆదివారం సెలవురోజు సందర్భంగా కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వరస్వామి ఆలయంలో భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి వివిధ ప్రాంతాల గుండా భక్తులు భారీగా తరలివచ్చారు. త్రివేణి సంగమ గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించారు. గోదావరి మాతను మొక్కులు చెల్లించి అరటి దొప్పల్లో దీపాలు వదిలారు. సైకత లింగాలు చేసి పసుపు, కుంకుమతో కొబ్బరికాయలు కొట్టి పూజించారు. అనంతరం స్వామివారి గర్భగుడిలో విశేష అభిషేక పూజలు నిర్వహించారు. శ్రీ సుభానందదేవి అమ్మవారి ఆలయంలో మహిళలు కుంకుమార్చన పూజలు చేశారు. అభిషేక మండపంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. ప్రాకార దేవతలను దర్శించుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు లైన్లో భక్తులు బారులుదీరారు. ఉసిరి చెట్టు వద్ద మహిళలు ప్రదక్షిణలు చేసి దీపారాధనలు చేశారు. లక్ష ముగ్గులు వేసి, లక్ష వత్తులు వెలిగించారు. సుమారుగా 30వేల మంది వరకు భక్తులు దర్శనాలు చేసుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. ఈ సందర్భంగా వివిధ పూజలు, లడ్డు ప్రసాదాల ద్వారా ఆలయానికి రూ.4.40 లక్షలు ఆదాయం సమకూరినట్లు ఆలయవర్గాలు తెలిపారు. సాయంత్రం త్రివేణి సంగమం వద్ద గోదావరికి హారతి కార్యక్రమాన్ని అర్చకులు ఘనంగా నిర్వహించారు. ● సెలవురోజు కావడంతో ఆదివారం పోటెత్తిన భక్తులు● సుమారు 30వేల మంది దర్శనం -
– హన్మకొండ/ఖిలావరంగల్/హసన్‌పర్తి/ మహబూబాబాద్ అర్బన్
కదిలే ప్రతీ జీవికి ఈ భూమ్మీద జీవించే హక్కు ఉంది. అవన్నీ మనగలిగితేనే మానవాళి ముందుకు సాగుతుంది. ఆ విషయాన్ని గుర్తించిన కొందరు తమ వంతుగా వాటికి సాయం చేస్తున్నారు. పిచ్చుక గూళ్లను పంపిణీ చేస్తూ పంటల రక్షణకు తోడ్పడుతున్నారు. పక్షులకు ఆహారం అందిస్తూ పర్యావరణ సమతుల్యతను కాపాడుతున్నారు. చీమలకు ఆహారమందిస్తూ మట్టిని సారవంతం చేసేందుకు ఉపయోగపడుతున్నారు. కుక్కలను పెంచుతూ ఆనందం, ఆహ్లాదాన్ని పొందుతున్నారు. జీవ వైవిధ్యంలో తమవంతు పాత్ర పోషిస్తున్న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జీవచరాల బంధువులపై ‘సాక్షి’ సండే స్పెషల్ కథనం. ‘చీమా.. చీమా ఎక్కడున్నావమ్మా’ అంటూ వెతికి మరీ వాటి కడుపు నింపుతున్నారు వాకర్స్. హనుమకొండకు చెందిన శివకుమార్, గోయల్ వాకింగ్ కోసం ప్రతీ రోజు పబ్లిక్ గార్డెన్‌కు వస్తుంటారు. నడక మొదలు పెట్టే ముందే.. చీమలు ఎక్కడున్నాయా.. అని వెతికి మరీ వెంట తెచ్చుకున్న గోధుమ పిండి, చక్కెర చల్లుతారు. సనాతన ధర్మం, రుగ్వేదంలో జీవుల పట్ల దయ కలిగి ఉండాలని, ఆహారాన్ని వృథా చేయకుండా ప్రాణులకు అందించాలని ఉందని వారు చెబుతున్నారు. కాగా, నిత్యం చపాతీలు చేసిన అనంతరం కింద పడిన, మిగిలిన పిండిలో చక్కెర కలిపి చీమలకు వేస్తున్నట్లు చెబుతున్నారు.హనుమకొండ పబ్లిక్ గార్డెన్లో చీమలకు చక్కెర కలిపిన పిండిని ఆహారంగా వేస్తున్న శివకుమార్హనుమకొండ పబ్లిక్ గార్డెన్లో చీమలకు ఆహారం వేస్తున్న గోయల్హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం చింతగట్టులోని మహర్షి గోశాల ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా పిచ్చుక గూళ్లు, వరికంకులు పంపిణీ చేస్తున్నారు. ఎస్ఆర్ఎం ఫౌండేషన్ సహకారంతో ‘జీవులపై దయ చూపి జీవ వైవిధ్యం కాపాడుదాం’ నినాదంతో ఈ కార్యక్రమం చేపడుతున్నారు. మహర్షి గోశాల ట్రస్ట్ ఆధ్వర్యంలో తమిళనాడు నుంచి పక్షి గూళ్లను కొనుగోలు చేసి ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. వరి కంకులను ఇక్కడే అల్లుతున్నారు. ఇప్పటి వరకు ఆరునెలల్లో 2 వేలకుపైగా పిచ్చుక గూళ్లు పంపిణీ చేసినట్లు మహర్షి గోశాల ట్రస్ట్ నిర్వాహకుడు డాక్టర్ ఎస్.రమేశ్ తెలిపారు. జీవవైవిధ్యానికి తోడ్పడుతున్న ఉమ్మడి వరంగల్‌వాసులు వాటి ఆకలిదప్పికలు తీరుస్తూ ఆదర్శం సొంత డబ్బులతో ప్రకృతి సేవ పర్యావరణ సమతుల్యతకు దోహదం -
కాళేశ్వరంలో భక్తుల సందడి
కాళేశ్వరం: కార్తీకమాసం శనివారం ఏకాదశి సందర్భంగా శనివారం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. త్రివేణి సంగమ గోదావరిలో పుణ్యా స్నానాలు ఆచరించారు. గోదావరి మాతను దర్శించుకొని దీపాలు వదిలారు. అనంతరం స్వామివారి గర్భగుడిలో విశేష అభిషేక పూజలు నిర్వహించారు. శ్రీ సుభానందదేవి అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన పూజలు చేశారు. ప్రత్యేక మండపంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. ప్రాకార దేవతలకు మొక్కులు చెల్లించారు. ఉసిరి చెట్టు వద్ద ప్రదక్షిణలు చేసి దీపారాధనలు చేశారు. లక్ష ముగ్గులు వేసి లక్ష వత్తులు వెలిగించారు. ఈ సందర్భంగా వివిధ పూజలు, లడ్డు ప్రసాదాల ద్వారా ఆలయానికి రూ. 4.50 లక్షలు ఆదాయం సమకూరినట్లు ఈఓ మహేష్ తెలిపారు. -
వామ్మో కూరగాయలు
● మోంథా తుపాను ప్రభావంతో పెరిగిన ధరలు ● బెంబేలెత్తుతున్న సామాన్యులు ● పేద, మధ్య తరగతిపై అదనపు భారంకాటారం: మోంథా తుపాను వ్యవసాయరంగానికి తీరని నష్టాన్ని తెచ్చిపెట్టింది. వాణిజ్య పంటలతో పాటు కూరగాయల సాగుపై సైతం ఎనలేని ఎఫెక్ట్ పడింది. మోంథా తుపానుతో పాటు కార్తీకమాసం ప్రభావంతో కూరగాయల ధరలు కొండెక్కాయి. జిల్లాలో కురిసిన వర్షాల కారణంగా కూరగాయలు, ఆకుకూరల తోటలు పెద్దఎత్తున దెబ్బతిన్నాయి. దీంతో కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఏ కూరగాయ కొందామన్న కిలో రూ.100 చేరువలో ఉండటంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. పది రోజుల్లోనే కూరగాయలు, ఆకుకూరల ధరలు రెట్టింపు కావడంతో ఆర్థిక భారం పడుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పది రోజుల్లో రెండింతలు కూరగాయలు, ఆకుకూరల ధరలు పది రోజుల్లో రెట్టింపు అయ్యాయి. ప్రస్తుతం మార్కెట్లో ఏ కూరగాయ కొన్నా కిలో రూ.100 చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజల బడ్జెట్ తారుమారవుతోంది. కొన్ని రోజుల క్రితం రూ.20కే కిలో అమ్మిన టమాట, ఆలుగడ్డలు నేడు రూ.50 నుంచి రూ.60కి అమ్ముతున్నారు. పచ్చిమిర్చి, సోరకాయ, వంకాయ, బీర వంటివి కిలో రూ.100కు చేరువలో ఉన్నాయి. ఇక బీన్స్, చిక్కుడు, మునగ వంటివి కిలో వంద దాటి పోయాయి. దీంతో పేదలు కూరగాయల కొనుగోలు తగ్గించేశారు. రోజుకు రెండు కూరలు వండే వారు ఒక దానితోనే సరిపెట్టుకుంటున్నారు. మిగతా పూటలు పచ్చడి, పప్పుచారుతో ఒడ్డెక్కిస్తున్నారు. భారీ వర్షాల కారణంగానే.. జిల్లాలో ప్రజల అవసరాలకు అనుగుణంగా కూరగాయల సాగు లేదు. దీంతో నిత్యం ఇతర ప్రాంతాల నుంచి కూరగాయలను దిగుమతి చేసుకుంటున్నారు. మోంథా తుపాను, భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో సాగుచేస్తున్న కూరగాయలు, ఆకుకూరల పంటలు పూర్తిస్థాయిలో పాడైపోవడంతో దిగుబడి తగ్గి ధర పెరిగిందని వ్యాపారులు చెప్పుకొస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి సరఫరా అంతంతమాత్రంగానే జరుగుతుండటంతో కూరగాయలు సరిపోక ధరలు ఒక్కసారిగా పెరిగాయని పేర్కొంటున్నారు. స్థానికంగా కూరగాయలకు అధిక డిమాండ్ ఉండటంతో వ్యాపారులు ధరలు పెంచి అమ్ముతున్నారని ప్రజలు వాపోతున్నారు. కార్తీకమాసం ఎఫెక్ట్.. కూరగాయల ధరలు పెరగడానికి మోంథా తుపాన్ ఓ కారణంగా కాగా కార్తీక మాసం ఎఫెక్ట్ సైతం అదే స్థాయిలో ఉంది. గత నెల 22 నుంచి కార్తీకమాసం ప్రారంభమైంది. ప్రతి ఇంట్లో పూజలు, వ్రతాలు ఆచరిస్తూ పూర్తిగా కూరగాయలు, ఆకుకూరలతో కూడిన భోజనాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అయ్యప్ప, భవానీ, ఆంజనేయ స్వామి మాలాధారణలకు కూడా సమయం కావడంతో అధిక శాతం ప్రజలు వెజిటేరియన్ భోజనం చేస్తున్నారు. దీంతో కూరగాయలు, ఆకుకూరలకు మార్కెట్లో డిమాండ్ పెరిగి ధరలు మండుతున్నాయి. ఏది కొనాలన్న కిలో రూ.100కు చేరువలో ఉండటంతో మార్కెట్‌కు రూ.500 తీసుకెళ్లినా సంచి నిండటం లేదని మధ్యతరగతి ప్రజలు తలపట్టుకుంటున్నారు. కొనలేకపోతున్నాం..ప్రస్తుతం మార్కెట్లో కూరగాయల ధరలు చూస్తే కొనుగోలు చేసే పరిస్థితి లేకుండా పోయింది. పది రోజులుగా కూరగాయలు, ఆకుకూరల ధరలు అమాంతం పెరిగిపోయాయి. కూరగాయలకు రెట్టింపు ధరలు చెల్లించాల్సి వస్తోంది. వారంలో నా లుగు రోజులు పప్పులతో వెల్లదీయాల్సి వస్తోంది. – శాంత, గృహిణి, టేకుమట్ల -
మానవత్వం చాటుకున్న మంత్రి శ్రీధర్‌బాబు
కాటారం: బైక్‌ను లారీ ఢీ కొట్టిన ఘటనలో ఓ వ్యక్తి తీవ్రగాయాలపాలైన ఘటన కాటారం మండల కేంద్రానికి సమీపంలో నూతన పెట్రోల్ పంపు వద్ద చోటు చేసుకుంది. సంజీవ్ అనే రైతు ధన్వాడ వైపు ఉన్న తన పత్తి చేను వద్దకు వెళ్లి బైక్‌పై వస్తున్నాడు. పెట్రోల్‌పంపు సమీపంలోకి రాగానే మంథని వైపుగా వెళ్తున్న లారీ ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. సంజీవ్‌కు తీవ్రగాయాలయ్యాడు. ఆ మార్గంలో వెళ్తున్న మంత్రి శ్రీధర్‌బాబు రోడ్డు ప్రమాదాన్ని గమనించి వెంటనే తన కాన్వాయి నిలిపేశారు. మంత్రి దగ్గర ఉండి పోలీస్ వాహనంలో చికిత్స నిమిత్తం క్షతగాత్రుడిని తరలించారు. పుస్తక పఠనంతో విజ్ఞానం రేగొండ: పుస్తక పఠనంతో విజ్ఞానం పెరుగుతుందని, జ్ఞాన సముపార్ఙనకు పుస్తకాలు ఎంతో దోహదపడుతాయని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. శనివారం కొత్తపల్లిగోరి మండలకేంద్రంలో తాత్కాలిక భవనంలో ఏర్పాటుచేసిన గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజాబాబుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పుస్తకం సమాజాన్ని మారుస్తుందన్నారు. పుస్తకాలు చదవడం వలన ఎందరో గొప్పవారయ్యారని తెలి పారు. పిల్లలు పుస్తకాలు చదివేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ కిష్టయ్య, కోటంచ ఆలయ చైర్మన్ భిక్షపతి, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. నేటినుంచి తరగతులు ప్రారంభం భూపాలపల్లి అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులకు నేటినుంచి (ఆదివారం) దూరవిద్య తరగతులు ప్రారంభిస్తున్నట్లు స్టడీ సెంటర్ కో ఆర్డినేటర్ డాక్టర్ రుక్సానా మహమ్మద్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థులకు 1 సెమిస్టర్, 3 సెమిస్టర్, 5వ సెమిస్టర్ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు తరగతులకు హాజరు కావాలని కోరారు. రేపటినుంచి కొనుగోళ్లు బంద్ భూపాలపల్లి రూరల్/చిట్యాల: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పత్తి జిన్నింగ్ మిల్లుల విషయంలో విధించిన నిబంధనలను సడలించే వరకు ఈనెల 17 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు బంద్ చేస్తున్నట్లు జిల్లా మార్కెంగ్ అధికారి ప్రవీణ్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మండలంలోని రైతులు గమనించి సోమవారం నుంచి సీసీఐ కొనుగోలు కేంద్రాలకు పత్తిని తీసుకురావద్దని చెప్పారు. కొనుగోళ్ల విషయంలో మళ్లీ ఆదేశాలు వచ్చే వరకు రైతులు ఓపికగా ఉండాలని కోరారు. జాతర ట్రస్టుబోర్డు కమిటీని నియమించాలి ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ జాతర ట్రస్టుబోర్డు కమిటీని నియమించాలని తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు పాయం కోటేశ్వర్రావు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో జాతర ట్రస్టుబోర్డు కమిటీని నియమించకుండా తాత్కాలిక ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసి ప్రభుత్వాలు చేతులు దులుపుకుంటున్నాయని మండిపడ్డారు. ఈ సారి జాతరకై నా ప్రభుత్వం స్పందించి ట్రస్టుబోర్డు కమిటీని నియమించాలని డిమాండ్ చేశారు. జాతరలో అమ్మవార్లకు భక్తులు కానుకల రూపంలో సమర్పించే ఆదాయాన్ని దేవాదాయశాఖ తీసుకుని ఆదివాసీ ప్రజలను, పూజారులను విస్మరిస్తుందన్నారు. ఈ సమావేశంలో గిరిజన అభ్యుదయ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముద్దబోయిన రవి, నాయకులు పూర్ణ, నియోజకవర్గ అధ్యక్షుడు కొప్పుల జగన్నాధరావు, మహిళ జాక్ చైర్మన్ శమంతకమణి, మాల్కం రాధిక, మండల అధ్యక్షులు మోకాళ్ల వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
రాజీమార్గం ద్వారా కేసులు పరిష్కరించుకోవాలి
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమేశ్‌బాబు భూపాలపల్లి అర్బన్: రాజీమార్గం ద్వారా కేసులను పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ సీహెచ్.రమేశ్‌బాబు తెలిపారు. కోర్టు ప్రాంగణాల్లో శనివారం స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశానికి ప్రధాన న్యాయమూర్తి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాజీమార్గాన్ని ఎంచుకోవడం ద్వారా కక్షిదారుల విలువైన సమయం, డబ్బు వృథా కాకుండా ఉంటుందని అన్నారు. పంతాలు పట్టింపులకు పోయి పగలు కేసుల్లో ఇరుక్కుని కోర్టుల చుట్టూ తిరిగితే నష్టమే తప్ప లాభం ఉండదన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాజు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్ఆర్ దిలీప్ కుమార్ నాయక్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల, అడిషనల్ ఎస్పీ నరేష్ కుమార్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, గవర్నమెంట్ ప్లీడర్ బొట్ల సుధాకర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసచారి, సీఐ నరేష్ కుమార్, పోలీసు అధికారులు, న్యాయవాదులు, కక్షిదారులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. -
పక్షులకు ఆవాసం.. ప్రకృతితో సహవాసం
హనుమకొండ ప్రకాశ్‌రెడ్డి పేటకు చెందిన ప్రైవేట్ విద్యాసంస్థల బస్సుల ఓనర్స్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గాదె స్వరూప్రెడ్డికి పక్షులంటే అమితమైన ప్రేమ. ఇంటి ఆవరణలో ప్రత్యేక షెడ్డు వేసి పక్షులను పెంచుతున్నారు. అంతేకాకుండా నిత్యం పిచ్చుకలు, రామ చిలుకలు, పలు జాతులకు చెందిన పక్షులు ఇక్కడికి వచ్చి ఆహారం తిని వెళ్తుంటాయి. వాటి కోసం డబ్బాలను ఏర్పాటు చేసి ధాన్యం గింజలు పోస్తున్నారు. ధాన్యపు గుత్తులు వేలాడదీస్తున్నారు. గిన్నెల్లో నీళ్లు పోసి వాటి దప్పిక తీరుస్తున్నారు. కొంత సమయం పక్షుల మధ్య గడిపితే ఆ రోజంతా మనసు ఉల్లాసంగా ఉంటుందని స్వరూప్‌రెడ్డి చెబుతున్నారు. -
బాల్య వివాహాల నిర్మూలనకు కృషి
● జిల్లా సంక్షేమ అధికారి మల్లీశ్వరి కాటారం: బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతీ ఒక్కరు కృషి చేసి బాలికలకు ఉజ్వల భవిష్యత్ అందించాలని జిల్లా సంక్షేమ అధికారి మల్లీశ్వరి అన్నారు. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా కాటారం మండలం మేడిపల్లి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో శనివారం బాల్య వివాహాల నిర్మూలన కార్యక్రమం నిర్వహించారు. బాల్య వివాహాలు, బాలికల రక్షణ తదితర అంశాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మల్లీశ్వరి మాట్లాడుతూ బాలికలు ఉన్నత చదువులు చదివి జీవితంతో రాణించాలని సూచించారు. బాల్య వివాహాలు, చెడు మార్గాలకు దూరంగా ఉండి చదువుపై శ్రద్ధ చూపాలని తెలిపారు. బాలికలు, యువతులు, మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు అనేక చట్టాలను అమల్లోకి తీసుకువచ్చాయన్నారు. అత్యవసర సమయాల్లో వాటిని వినియోగించుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడీపీఓ రాధిక, సీహెచ్ఎల్ కోఆర్డినేటర్ గుర్రం తిరుపతి, అనూష, పాఠశాల హెచ్ఎం చంద్రశేఖర్‌రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
కుక్కపిల్లలంటే ఆమెకు ప్రాణం
మానుకోట మున్సిపాలిటీ పరిధి ఈదులపూసలపల్లికి చెందిన మ్యారేజ్ ఈవెంట్స్ ఆర్గనైజర్ పింగిలి దీపికకు కుక్కపిల్లలంటే ప్రాణం. దీపిక బాల్యంలో ఆమె నాన్న చిన్న కుక్క పిల్లను ఇంటికి తీసుకొచ్చాడు. ఆ కుక్కపిల్లను ఆమె అల్లారుముద్దుగా చూసుకునేవారు. అప్పటి నుంచే ఆమెకు కుక్కపిల్లలపై ప్రేమ పెరిగింది. కుక్కలకు సొంత డబ్బుతో వైద్యం, నాన్న పెన్షన్ డబ్బులతో స్నాక్స్, భోజనం అందిస్తున్నారు. ఆమె పెంచుతున్న వీధి కుక్కల్లో చాలావరకు గుండె, లివర్, క్యాన్సర్, ఫిట్స్ వంటి రోగాల బారిన పడి ఉన్నాయి. వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఆస్పత్రికి కారులో తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటి వరకు ఆమె 3 వేల కుక్కలను దత్తత ఇచ్చారు. అదేవిధంగా ఆమె ఇంటి వద్ద ప్రస్తుతం 36 కుక్కలు ఉన్నాయి. అంతేకాకుండా ప్రత్యేకంగా కుక్కల కోసం యూట్యూబ్ చానల్ ప్రారంభించారు. కుక్కలను ఎవరైనా దత్తత తీసుకోవాలంటే 73962 82837 నంబర్లో సంప్రదించాలని దీపిక కోరుతున్నారు. -
‘మార్చి’ ముహూర్తం కుదిరేనా?
సాక్షి, వరంగల్: గత అసెంబ్లీ ఎన్నికలకు ముందే వరంగల్‌లోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని అందుబాటులోకి తెస్తామని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పినా.. పనుల్లో వేగం లేకపోవడంతో 2024 మార్చిలో ప్రారంభిస్తామని చెప్పింది. ఆ తర్వాత ఎన్నికలు జరగడం, కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆస్పత్రి డిజైన్ మార్పు, వ్యయం అంచనాపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణతో కొద్దిరోజులు పనులకు బ్రేక్ పడింది. ఆ తర్వాత మళ్లీ పనులు ప్రారంభమైనా ఈ ఏడాది డిసెంబర్లో ప్రారంభిస్తామని రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పలు దఫాలుగా సమీక్ష సమావేశాల్లో చెప్పినా.. కార్యరూపం దాల్చలేదు. తాజాగా రాష్ట్ర వైద్యవిద్యా సంచాలకుడు డాక్టర్ నరేంద్రకుమార్ మార్చిలో వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి సేవలు ప్రారంభిస్తామని చెప్పారు. ఇలా పలు దఫాలుగా వాయిదా పడుతున్న ఈ ఆస్పత్రి ప్రారంభ ముహూర్తం మార్చిలోనైనా కుదురుతుందా లేదా మళ్లీ యథాలాపంగా వాయిదా పడుతుందా? అన్న చర్చ వరంగల్వాసుల్లో జరుగుతోంది. నాలుగేళ్లుగా నాన్చుతూ... వరంగల్‌లోని సెంట్రల్ జైలు స్థానంలోని 56 ఎకరాల్లో 16.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 24 అంతస్తుల భవనంలో 34 విభాగాల స్పెషాలిటీ మెడికల్ సర్వీసులతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు 2021జూన్‌లో ప్రారంభమయ్యాయి. మొదట పనులు వేగిరంగానే జరిగినా, 2022లో డిజైన్ మార్చి అంచనా వ్యయం పెంచి పనులు తిరిగి మొదలు పెట్టడంలో జాప్యం చేశారు. 2024 మార్చికి అందుబాటులోకి వస్తుందనుకున్న సమయంలో ప్రభుత్వం మారడంతో మరింత ఆలస్యమైంది. డిజైన్ల మార్పు, అంచనాల పెంపు, దానిపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ, తదితర కారణాలతో ఆగుతూ.. సాగుతున్నాయి. గతేడాది డిసెంబర్లో వరంగల్‌కు వచ్చిన సమయంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు మాట్లాడుతూ.. తమ ప్రభుత్వ హయాంలో నిర్మాణం 84 శాతం పూర్తయ్యిందని, 16 శాతం పూర్తి చేసేందుకు ఇంకెన్ని నెలల సమయం పడుతుందని ప్రశ్నించారు. ఇటీవల వరంగల్‌లో పర్యటన సమయంలో తెలంగాణ జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలు కల్వ కుంట్ల కవిత.. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ అంచనా వ్యయం ఎందుకు పెంచాల్సి వచ్చిందని, అవకతవకలు జరిగాయనడంతో ఈ ఆస్పత్రి మరోసారి తెరమీదకు వచ్చింది. కొద్దినెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల సమావేశంలోనే ఈ ఏడాది డిసెంబర్ వరకు నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించినా.. ఇప్పుడు ఆ గడువు వచ్చే ఏడాది మార్చి వరకు మారింది. మరో నాలుగు నెలల్లోనైనా ఈ ఆస్పత్రి సేవలు ప్రారంభిస్తే పేదలకు వరంగా మారనుంది. ఈ ఎంజీఎంలోని 1500 పడకల ఆస్పత్రి అక్కడికి తరలడం ద్వారా, అక్కడా మరో 500 పడకలు (కార్డియాలాజీ, న్యూరాలజీ, పిడియాట్రిక్ సర్జరీ, గ్యాస్ట్రో ఎంట్రాలాజీ, కార్డియోథెరపీ, నెఫ్రాలజీ, యూరాలజీ) ఏర్పాటు వల్ల 2వేల పడకల సామర్థ్యంతో వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. దీనిద్వారా హైదరాబాద్‌కు రెఫరల్ వైద్యం తగ్గి, ఇక్కడే అన్ని వైద్య సేవలు అందే అవకాశముంది. అవయవ మార్పిడికి సంబంధించిన శస్త్రచికిత్సలు కూడా హైదరాబాద్‌కు వెళ్లనవసరం లేకుండా ఇక్కడే జరగనున్నాయి. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి సేవలు అందుబాటులోకి వస్తే ఆస్పత్రిని అక్కడికి తరలిస్తారన్న ఉద్దేశంతో ఎంజీఎంలో సివిల్వర్క్లు చేయడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా కొన్ని వైద్యపరికరాలను కూడా సమకూర్చడం లేదని సమాచారం. దీనికితోడు పాలన అస్తవ్యస్తంగా మారి, కుంభకోణాలకు నెలవుగా మారింది. రోగులకు అవసరమైన సౌకర్యాలు సమకూర్చడంలో అధికారులు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఓ వివాదంలో పాత సూపరింటెండెంట్ మారి కొత్తగా డాక్టర్ హరిశ్చంద్రారెడ్డి వచ్చారు. ఈయన వచ్చాక ఎంజీఎంలో జరిగిన గోల్‌మాల్‌పై విచారణలు జరుగుతున్నాయి. ఇంకోవైపు రోగులకు మెరుగైన వైద్యసేవలు అందిద్దామనుకున్నా సరైన వనరులు అందుబాటులో లేక ఇబ్బందులు తప్పడం లేదు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని సాధ్యమైనంతమేర వరంగల్ సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి తీసుకువస్తే కార్పొరేట్ వైద్యం పేదలకు అందే అవకాశముంది. నాలుగు నెలల్లో అందుబాటులోకి తీసుకువస్తామని డీఎంఈ ప్రకటన క్షేత్రస్థాయిలో ఆశించని మేరకు సాగని పనులు నాలుగున్నరేళ్లుగా ఊరిస్తున్న వైద్యసేవలు అందుబాటులోకి వస్తే ప్రయోజనమే ఎంజీఎంను తరలిస్తారన్న సమాచారంతో ఇక్కడా నిర్లక్ష్యం సివిల్ వర్క్‌లు చేయకుండా తాత్సారంతో రోగుల ఇబ్బందులు -
ఏసీబీ తనిఖీలు
భూపాలపల్లి: రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన దాడుల్లో భాగంగా ఏసీబీ అధికారులు జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తన టీంతో కలిసి శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఆకస్మికంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి చేరుకొని తనిఖీలు ప్రారంభించారు. కంప్యూటర్లో పొందుపరిచిన పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం డీఎస్పీ సాంబయ్య విలేకరులతో మాట్లాడుతూ.. భూమి రిజిస్ట్రేషన్ చేయించుకునే వారు నేరుగా వచ్చి సబ్ రిజిస్ట్రార్ వద్ద హాజరు కావాలన్నారు. ఇక్కడి సబ్ రిజిస్ట్రార్ ఇందుకు భిన్నంగా ప్రైవేట్ వ్యక్తులు, డాక్యుమెంట్ రైటర్లను లోపలికి అనుమతిస్తున్నట్లు గుర్తించామన్నారు. రిజిస్ట్రేషన్ అయిన తరువాత డాక్యుమెంట్లను సంబంధిత భూ యజమానికి మాత్రమే అప్పగించాల్సి ఉండగా, డాక్యుమెంట్ రైటర్లే సంతకాలు చేసి తీసుకుంటున్నట్లుగా గుర్తించినట్లు చెప్పారు. ఈ విచారణలో వెల్లడైన పూర్తి అంశాలను నివేదిక రూపంలో ఉన్నతాధికారులకు అందిస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగితే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు తెలియజేయాలని డీఎస్పీ సాంబయ్య సూచించారు. ఈ తనిఖీల్లో ఏసీబీ అధికారులు ఎల్ రాజు, ఎస్ రాజు, సిబ్బంది పాల్గొన్నారు. -
నాటారు.. నరికేశారు
శనివారం శ్రీ 15 శ్రీ నవంబర్ శ్రీ 2025కొత్తపల్లిగోరి మండలం జగ్గయ్యపేట–సుల్తాన్పూర్ గ్రామాల మధ్య హరితహారం కార్యక్రమంలో భాగంగా గతంలో జగ్గయ్యపేట పంచాయతీ ఆధ్వర్యంలో రోడ్డు పక్కన విద్యుత్ తీగల కింద మొక్కలు నాటారు. మొక్కలు ఏపుగా ఎదిగి చెట్లుగా మారడంతో విద్యుత్ లైన్‌కు తాకుతున్నాయి. దీంతో విద్యుత్ తీగలకు చెట్లు అడ్డుగా ఉన్నాయని విద్యుత్ శాఖ సిబ్బంది నరికేశారు. ముందు చూపు లేకుండా అధికారులు ఇష్టారాజ్యంగా మొక్కలు నాటడంతో ప్రభుత్వ సొమ్ము వృథా అవుతుందని ప్రజలు అంటున్నారు. – రేగొండ -
16 నుంచి మేడారానికి ప్రత్యేక బస్సులు
● ఆర్టీసీ వరంగల్ ఆర్ఎం డి.విజయభాను హన్మకొండ: సమ్మక్క–సారలమ్మ జాతరను పురస్కరించుకుని ఈనెల 16 నుంచి మేడారానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయభాను ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2026 జనవరి 28 నుంచి ఫిబ్రవరి ఒకటి వరకు జాతర జరుగుతుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో ముందుగా వనదేవతలను దర్శించుకునే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. హనుమకొండ బస్టాండ్ నుంచి మేడారానికి ప్రతిరోజు ఉదయం 6.10, 7.00, 8.00, 9.00, మధ్యాహ్నం 12.10, 1.00, 1.40, 14.30; రాత్రి 8.20 గంటలకు బస్సులు బయలుదేరుతాయని వివరించారు. అదేవిధంగా మేడారం నుంచి హనుమకొండకు ఉదయం 5.45, 9.45, 10.15, 11.15, మధ్యాహ్నం 1.10, సాయంత్రం 4.00, 5.00, 5.30, 6.00 గంటలకు బస్సులు బయలుదేరుతాయని చెప్పారు. పల్లెవెలుగు బస్సు చార్జీలు పెద్దలకు రూ.130, పిల్లలకు రూ.80, ఎక్స్‌ప్రెస్ బస్సు చార్జీలు పెద్దలకు రూ.180, పిల్లలకు రూ.110గా నిర్ణయించినట్లు తెలిపారు. భక్తులు ఆర్టీసీ బస్సుల్లో సురక్షితంగా, సుఖవంతంగా ప్రయాణించి వనదేవతలను దర్శించుకోవాలని ఆర్ఎం విజయభాను కోరారు. -
గ్రంథాలయాలు విజ్ఞాన నిలయాలు
● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు భూపాలపల్లి రూరల్: గ్రంథాలయాలు విజ్ఞానానికి నిలయాలని.. విద్య వికాసానికి మూలమని అందుకే ప్రతీ ఒక్కరు గ్రంథాలయాలకు వచ్చి విజ్ఞానం పొందాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన 58వ గ్రంథాలయాల వారోత్సవాల వేడుకలకు అదనపు కలెక్టర్ విజయలక్ష్మితో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రెగ్యులర్‌గా గ్రంథాలయానికి వస్తున్న విద్యార్థులను అభినందించి సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ.. విద్య ప్రగతికి దోహదం చేస్తుందని, ప్రతీ ఒక్కరు విద్యను అభ్యసించాలని సూచించారు. జిల్లా గ్రంథాలయ సంస్థకు అదనపు కొత్త భవన నిర్మాణానికి రూ.కోటి మంజూరు చేస్తానని, అందులో అన్ని సౌకర్యాలతో పాటు అన్ని రకాల పుస్తకాల కోసం రూ.10 లక్షల రూపాయలు తన నిధుల నుంచి ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గూటోజు కిష్టయ్య, మాజీ కౌన్సిలర్ దాట్ల శ్రీనివాస్, పార్టీ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ పిప్పాల రాజేందర్ పాల్గొన్నారు శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయం ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ ప్రభుత్వం ధ్యేయమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. జిల్లాకేంద్రంలోని కాశీంపల్లిలో జరిగిన నూతన సీసీ కెమెరాల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. భూపాలపల్లి పట్టణంలో నేరాలు, ప్రమాదాలు, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు ఆధునిక సీసీ కెమెరాల వ్యవస్థ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కాశీంపల్లి ప్రాంతంలో పోలీసుల సూచన మేరకు ఏర్పాటుచేసిన 16 నూతన కెమెరాలు పోలీసులు నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయనున్నాయి. ప్రతి వీధి మూలలో భద్రతా వలయం ఏర్పడి ప్రజలు నిశ్చింతగా జీవించేందుకు ఇవి తోడ్పడుతాయన్నారు. భవిష్యత్‌లో కూడా పట్టణ అభివృద్ధికి, భద్రతా ప్రమాణాల పెంపునకు మరిన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రజల సహకారం ఉంటే భూపాలపల్లిని పూర్తిగా స్మార్ట్ అండ్ సెక్యూర్ టౌన్‌గా అభివృద్ధి చేయడం తమ లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట భూపాలపల్లి సీఐ నరేష్, భూపాలపల్లి ఎస్సై సాంబమూర్తి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
హెచ్‌ఆర్‌ఎండీఎస్‌లో బాలల దినోత్సవం
భూపాలపల్లి రూరల్: జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో భూపాలపల్లి పట్టణంలోని హెచ్ఎంఆర్డీఎస్ దివ్యాంగుల పాఠశాలలో బాలల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీహెచ్ రమేశ్‌బాబు ముఖ్యఅతిథిగా హాజరై పిల్లలకు స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం న్యాయమూర్తి మాట్లాడుతూ దివ్యాంగ బాల బాలికలతో కలిసి బాలల దినోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాజు, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి దిలీప్ కుమార్ నాయక్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల, గవర్నమెంట్ ప్లీడర్ బొట్ల సుధాకర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసాచారి, హెచ్ఎంఆర్డీఎస్ సంస్థ నిర్వాహకురాలు రజిత పాల్గొన్నారు. నేటి బాలలే రేపటి పౌరులు గణపురం: నేటి బాలలే రేపటి పౌరులుగా నవ సమాజ నిర్మాణానికి నాంది పలుకాలని జిల్లా మహిళా సంక్షేమ శాఖ అధికారి మల్లేశ్వరి అన్నారు. శుక్రవారం గణపురం మండలం గాంధీనగర్‌లోని హోమ్ ఆఫ్ లవ్ ఆశ్రమ పాఠశాలలో పాఠశాల ప్రిన్సిపాల్ అన్నాజాన్తో కలిసి బాలల దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. విద్యార్థులతో కేక్ కట్ చేయించి వారికి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పిల్లలు భారంతో కూడిన విద్యను చదువకుండా ఆటపాటలతో విద్యను అభ్యసించాలన్నారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ హెల్ప్ లైన్ కో ఆర్డినేటర్ గుర్రం తిరుపతితో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. ఘనంగా బాలల దినోత్సవం భూపాలపల్లి అర్బన్: జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. పాఠశాల విద్యార్థులకు క్రీడా పోటీలు, నాటికలు, నృత్యాలు, పాటలు, వకృత్వ వికాస పోటీలు, వ్యాసరచన, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రత్యేక ఆకర్షణీయంగా చిన్నారులు తమ భవిష్యత్ కలలను ప్రతిభింబించే విధంగా వివిధ వేషాధారణలో హాజరయ్యారు. సైన్స్ ఎగ్జిబిట్ల సందర్శన భూపాలపల్లి అర్బన్: సింగరేణి పాఠశాలలో శుక్రవారం ఏర్పాటుచేసిన విద్యార్థుల సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిట్లను ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి సందర్శించారు. బాలల దినోత్సవం పురస్కరించుకొని పాఠశాలలో సైన్స్ ఫెయిర్ నిర్వహించడం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. విద్యార్థులు సింగరేణి సంబంధించిన వివిధ ఎగ్జిబిట్లను ఉపరితల గనులను సందర్శించాలని కోరారు. విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి విద్య అభ్యసించాలని సూచించారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ మారుతి, ప్రధానోపాధ్యాయురాలు పాల్గొన్నారు. -
అసంపూర్తి.. నిరుపయోగం
కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయం పరిధి దుకాణాల సముదాయం వెనుకభాగంలో రూ.16 లక్షలతో నిర్మించిన మరుగుదొడ్ల పనులు అసంపూర్తిగా మిగిలాయి. మేలో నిర్వహించిన సరస్వతినది పుష్కరాలకే ఉపయోగంలోకి తీసుకువస్తామని దేవాదాయశాఖ అధికారులు చెప్పారు. కానీ నేటికీ పనులు పూర్తికాలేదు. దీంతో మల, మూత్ర విసర్జన చేసేందుకు భక్తులు, దేవస్థానం సిబ్బంది, దుకాణాల నిర్వాహకులు ఇబ్బంది పడుతున్నారు. దేవాదాయశాఖ అధికారులు స్పందించి త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు. – కాళేశ్వరం -
రైతులను ఇబ్బంది పెడితే చర్యలు
● కలెక్టర్ రాహుల్ శర్మచిట్యాల: మిల్లు యాజమాన్యం, సీసీఐ అధికారులు పత్తి రైతులను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తప్పవని కలెక్టర్ రాహుల్ శర్మ హెచ్చరించారు. శుక్రవారం శాంతినగర్ శివారులోని సీసీఐ కొనుగోలు కేంద్రాలు శ్రీఆంజనేయ, కై లాపూర్ శివారులోని బాలమురగన్ కాటన్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేశారు. పత్తి తేమ ఽశాతం, తూకం కాంటాలను, నమోదు వివరాలు, కపాస్ కిసాన్ యాప్‌లో నమోదు వంటి అంశాలను క్షుణంగా పరిశీలించారు. రైతులను ఇబ్బందులకు గురిచేయవద్దని తెలిపారు. నిబంధనలు ఉల్లంగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం అక్కడే ఉన్న రైతులతో మాట్లాడారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ కొనుగోలు కేంద్రాలను త్వరితగతిన సాగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, తహసీల్దార్ షేక్ ఇమామ్‌బాబా, సీసీఐ ఇన్చార్జ్ పట్టాభిరామయ్య పాల్గొన్నారు. -
నష్టం 481 ఎకరాలేనట!
● వేలాది ఎకరాలను ముంచిన మోంథా తుపాను ● పూర్తిస్థాయిలో పరిశీలించని అధికారులు ● ఆందోళనలో అన్నదాతలు భూపాలపల్లి: మోంథా తుపాను కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులు ఆందోళన చెందుతున్నారు. వేలాది ఎకరాల్లో వరి, పత్తి పంటలు నీట మునగగా వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే చేయలేదు. నామమాత్రంగా అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించారు. ఫలితంగా పంటలు నీట మునిగిన రైతులు కనీస ప్రభుత్వ సహాయాన్ని అందుకోలేకపోతున్నారు. ప్రాథమిక అంచనా 3,704 ఎకరాలు.. తుపాను కారణంగా జిల్లాలో గత నెల 29, 30వ తేదీల్లో వర్షాలు కురిసి పత్తిపంటలు దెబ్బతిన్నగా.. వరి నీట మునిగింది. దీంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ అధికారులు పంటనష్టం అంచనా వేశారు. జిల్లాలోని ఆరు మండలాల్లో 2,524 మంది రైతులకు చెందిన 3,704 ఎకరాల పత్తి, మిర్చి పంటలు దెబ్బతిన్నట్లుగా అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. అనంతరం నామమాత్రపు సర్వే, క్షేత్రస్థాయి పరిశీలన లేకుండానే కేవలం 481 ఎకరాల్లోనే పంటనష్టం జరిగినట్లుగా ఇటీవల ప్రభుత్వానికి నివేదించారు. పత్తి, మిర్చి ఊసే లేదు.. రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు 33 శాతం కంటే ఎక్కువ దెబ్బతిన్న వరి పంటలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో నష్టం భారీగా తగ్గినట్లుగా సమాచారం. వర్షాలకు దెబ్బతిన్న పత్తి, మిర్చి పంటలను సర్వే చేయకపోగా, నష్టం నమోదు చేయలేదని ఓ మండల వ్యవసాయాధికారి తెలిపారు. ఉద్యాన పంటల నష్టం కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదని సమాచారం. పంటలు నష్టపోయిన రైతులు నేటికీ రైతు వేదికల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పంటలను పరిశీలించి తమ పేర్లు సర్కారుకు పంపాలని కోరుతున్నారు. దీంతో ఏం చేయాలో పాలుపోక ఏఈఓలు తలలు పట్టుకుంటున్నారు. నివేదిక పంపించాం.. మోంథా తుపాను వలన జిల్లావ్యాప్తంగా 481 ఎకరాల్లో పంటనష్టం జరిగినట్లుగా అంచనా వేశాం. ఈ మేరకు కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదిక పంపించాం. – బాబురావు, జిల్లా వ్యవసాయ అధికారి -
సమన్యాయం కోసం పాటుపడాలి
కాటారం (మహాముత్తారం): దేశంలోని ప్రతి ఒక్కరికీ సమానత్వం, సమన్యాయం కల్పించడానికి ప్రతీ ఒక్కరు పాటుపడాలని శాతవాహన యూనివర్సిటీ ప్రిన్సిపల్, రాష్ట్ర విద్యా కమిషన్ సలహాదారు ప్రొఫెసర్ సూరెపల్లి సుజాత అన్నారు. మహాముత్తారం మండలం యామన్‌పల్లి ప్రభుత్వ పాఠశాలలో ఏక్ భారత్ శ్రేష్ట భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ సుజాత మాట్లాడుతూ దేశంలో ఒకే రకమైన సంస్కృతి, ఒకే రకమైన విలువలతో కూడిన విద్యను అందించాలని కోరారు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన మనలాంటి దేశంలో సమానత్వం కోసం ప్రతిఒక్కరు కృషి చేయాలన్నారు. వెనుకబడిన ప్రాంతంలోని దళితులు, ఆదివాసీలు, మైనార్టీలు పేదరికంలో ఉన్న వారికి కూడు, గుడ్డ నివాసం లాంటివి అందరికీ ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సురేందర్, ఏఏపీసీ చైర్మన్ అంజలి, హెచ్ఎం రమేశ్, ఉపాధ్యాయులు తిరుపతి, విజయ్‌కుమార్, భాగ్యలక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు. -
నేటి నుంచి గ్రంథాలయ వారోత్సవాలు
భూపాలపల్లి రూరల్: 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకొని నేటి (శుక్రవారం) నుంచి జిల్లా గ్రంథాలయంలో వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శ్రీలత గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా కళాశాల/పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖనం, రంగోళి, పాటలు తదితర పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వారోత్సవాల్లో జిల్లాలోని ప్రజలు, విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. భూపాలపల్లి అర్బన్: సింగరేణి ఉద్యోగులు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సింగరేణి కార్పొరేట్ ఐటీ డిపార్ట్మెంట్ డీజీఎం శ్రీనివాస్ సూచించారు. సింగరేణి వ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన సదస్సు గురువారం జీఎం ఆఫీస్‌లో కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్‌రెడ్డి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కార్పొరేట్ ఐటీ డిపార్ట్మెంట్ డీజీఎం శ్రీనివాస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతీ వ్యక్తి సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. అపరిచిత వ్యక్తులకు బ్యాంక్ వివరాలు, పిన్ కోడ్, ఓటీపీలు చెప్పకూడదన్నారు. కార్యక్రమంలో ఎస్ఓటు జీఎం కవీంద్ర, అధికారులు ఎర్రన్న, జోతి, రవికుమార్, అన్ని గనుల అధికారులు పాల్గొన్నారు. భూపాలపల్లి అర్బన్: గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నేబోయిన తిరుపతి కోరారు. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయుల, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. మూడు దశల ఆందోళన పోరాట కార్యక్రమాలలో భాగంగా గురువారం జిల్లాకేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ.. ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న పండిట్, పీఈటీ పోస్టులను అప్ గ్రేడ్ చేసి వెంటనే పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. అరకొర వేతనాలతో వెట్టిచాకిరికి గురవుతున్న కాంట్రాక్టు రెసిడెంట్ టీచర్లను రెగ్యులరైజ్ చేసి, టైం స్కేల్ వర్తింపజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బానోత్ సేవ నాయక్, జగపతిరావు, భాస్కర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు రాజరత్నం, సుశీల, శ్రీహరి, సంతోష్, కరణ్ సింగ్, లక్ష్మినారాయణ, పాల్తీయ, కిషన్ పాల్గొన్నారు. కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలోని నందీశ్వరుడికి అభిషేక పూజలను ఈనెల 17న సోమవారం సాయంత్రం (ప్రదోశకాలం) కార్తీకమాసం సందర్భంగా నిర్వహించడానికి దేవాదాయశాఖ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈఓ శనిగెల మహేష్ గురువారం తెలిపారు. నందీశ్వరుడికి అభిషేక పూజ చేసినవారికి జాతకం వలన పట్టి పీడిస్తున్న బాధలు తొలిగిపోతాయని ఆలయ ఉపప్రధాన అర్చకులు పనకంటి ఫణీంద్రశర్మ పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. మంత్రికి ఆహ్వానం.. నందీశ్వర అభిషేకం కార్యక్రమానికి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును దేవస్థానం ఈఓ మహేష్, ఆలయ ఉపప్రధాన అర్చకులు ఫణీంద్రశర్మ ఆహ్వానించారు. గురువారం కాటారం మండలం ధన్వాడలో మంత్రిని వారి ఇంటి వద్ద కలిశారు. ఆలయంలో మొదటిసారిగా నిర్వహిస్తున్న నందీశ్వర అభిషేక పూజలకు రావాలని ఆహ్వానం అందజేశారు. ములుగు రూరల్: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మధ్యాహ్న భోజన కార్మికులు గురువారం మంత్రి సీతక్కకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ మాట్లాడుతూ.. వంట కార్మికులను తొలగించి హరేరామా హరే కృష్ణ ఫౌండేషన్‌కు అప్పగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అన్నారు. దీనివల్ల వేలాది మంది వంట కార్మికులు రోడ్డున పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. -
రిజర్వేషన్లు భిక్ష కాదు.. హక్కు
భూపాలపల్లి రూరల్: రిజర్వేషన్లు ఎవరిచ్చే భిక్ష కాదని.. తమ హక్కు అని బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ పైడిపల్లి రమేశ్ అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోసం జిల్లాకేంద్రంలో ఒకరోజు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడుతూ.. బీసీ ప్రతి రంగంలో వెనుకబడి ఉన్నారన్నారు. రానున్న రోజుల్లో బీసీ ఉద్యమాన్ని గ్రామగ్రామాన బలోపేతం చేస్తూ రిజర్వేషన్లు సాధించేంత వరకు మొక్కవోని దీక్షతో కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ అధికార ప్రతినిధి గాజర్ల అశోక్, బీసీ జేఏసీ జిల్లా కమిటీ కో కన్వీనర్లు బర్ల గట్టయ్య పటేల్, గుమ్మడి ప్రదీప్ పటేల్, అమృత అశోక్ కురుమ, శేఖర్ నాని, బీసీ జేఏసీ మహిళా చైర్పర్సన్ మేకల రజిత, జాతీయ బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు తాటికంటి రవి కుమార్, బీసీ అజాది ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు క్యాతం మహేందర్ పాల్గొన్నారు. దీక్షకు పలువురి మద్దతు దీక్షకు బీసీ, ఎస్సీ, ఎస్టీ జిల్లా కో ఆర్డినేటర్ కొత్తూరి రవీందర్, బీసీ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు కౌటం రవి పటేల్, సమతా సైనిక్ దళ్ రాష్ట్ర కార్యదర్శి ముద్దమల్ల భార్గవ్, బీజేపీ రాష్ట్ర నాయకులు దొంగల రాజేందర్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు గీసా సంపత్ మద్దతు తెలిపారు. -
మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించిన ట్రెయినీ ఐఏఎస్‌లు
● సిటిజన్ గ్రీవెన్పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ భూపాలపల్లి: స్టడీ టూర్లో భాగంగా జిల్లాకు వచ్చిన 12 మంది ట్రెయినీ ఐఏఎస్ అధికారులు గురువారం భూపాలపల్లి మున్సిపాలిటీ కార్యాలయాన్ని సందర్శించారు. మున్సిపల్ అధికారులు వారికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సిటిజన్ గ్రీవెన్స్ గురించి వివరించి సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో రికార్డుల నిర్వహణ, చేపడుతున్న పనుల రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సునిల్, ఏఈ రజనీకర్, టెక్నికల్ ఆఫీసర్ బి.మానస, సిస్టం మేనేజర్ విష్ణు పాల్గొన్నారు. -
వామ్మో.. చలి!
కాళేశ్వరం వద్ద చలికి తట్టుకోలేక మంటలు కాగుతున్న భక్తులు కాళేశ్వరం: జిల్లాలో రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు తగ్గుతుండడంతో చలి తీవ్రత పెరుగుతుంది. గతేడాదితో పోల్చి చూస్తే చలి తీవ్రత పెరిగింది. దీంతో అటవీ ప్రాంత గ్రామాలు చలిదెబ్బకు గజగజ వణికిపోతున్నాయి. భూపాలపల్లి, కాటారం సబ్ డివిజన్ అటవీ ప్రాంతాల్లో చలి తీవ్రత పెరగడంతో ఉదయం పదిన్నర గంటలైనా జనం రోడ్డెక్కని పరిస్థితి నెలకొన్నది. అటవీ గ్రామాల్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతున్నాయి. గడిచిన ఐదు రోజుల వ్యవధిలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. మధ్యలో తుపాన్ ప్రభావంతో కొన్ని రోజులు కాస్త చలి తీవ్రత తగ్గినప్పటికీ నాలుగైదు రోజుల్లో ఒక్కసారిగా చలితీవ్రత పెరిగింది. నాలుగు రోజులుగా 14 నుంచి 16 డిగ్రీ మధ్య అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో జనం రోడ్లపై తిరగడం లేదు. గ్రామాల్లో ఇలా.. జిల్లాలోని 12 మండలాల పరిధిలోని మారుమూల గ్రామాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. రైతులు, రైతు కూలీలు రోజు వారి పనులు చేసుకునేందుకు కూడా బయటకు రాలేని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా టేకుమట్ల, రేగొండ, పలిమెల, మహాముత్తారం, కాటారం, మల్హర్, మహదేవపూర్ వంటి మండలాల్లో ఉష్ణోగ్రతలు మరింత తక్కువ నమోదవుతున్నాయి. పొగ మంచు కూడా విపరీతంగా కురుస్తుండడంతో చర్మ సంబంధ వ్యాధుల బారిన పడి చికాకులు ఎదుర్కొంటున్నారు. ఉదయం వేళల్లో పనులకు వెళ్లే రైతులు, రైతు కూలీలకు గాలిలో తేమ కారణంగా శ్వాస సంబంధమైన వ్యాధులు కూడా ఎక్కువగానే నమోదవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా పత్తి తీసే సీజన్ కావడంతో రైతు కూలీలు పనులకు వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. సాధారణంగా కూలీలు వ్యవసాయ క్షేత్రాలకు ఉదయం తొమ్మిది గంటలకు వెళ్లి సాయంత్రం అయిదు గంటల వరకు పనిచేస్తారు. తాజా పరిస్థితులతో పది, పదిన్నర గంటలు దాటితే తప్ప కూలీలు చేలకు రాకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఉదయం, రాత్రి వేళల్లో దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు కూడా చలిదెబ్బకు తమ ప్రయాణాలను పగటి వేళలకు మార్చుకుంటున్నారు. ఉదయం తొమ్మిది, పది గంటలు దాటితే తప్పా కూరగాయల మార్కెట్లలో ప్రజలు కనిపించడం లేదు. దాంతో చిరు వ్యాపారులు గిరాకీలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చలితో పాటు చల్లటి గాలుల ప్రభావం గజగజ వణుకుతున్న జనం వృద్ధులు, చిన్న పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ప్రత్యామ్నాయాలపై దృష్టిసారించిన ప్రజలు రైతులకు తప్పని తిప్పలువ్యాధులతో అప్రమత్తం.. ఓ వైపు చలితో పాటు మరో వైపు చల్లటి గాలులు వీస్తుండడంతో ప్రజలు దగ్గు, దమ్ము, జలుబు, జ్వరాల బారిన పడుతున్నారు. వాతావరణంలో మార్పుల కారణంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో దగ్గు, దమ్ము, ఆస్తమా వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతున్నట్లు తెలిసింది. వృద్ధులు, చిన్నారులు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. ప్రత్యమ్నాయాలపై దృష్టి సారించారు. వారం రోజులుగా అధికంగా దగ్గు, జలుబు బారిన పడుతున్నారు. ఉపశమనం కోసం కొన్నిచోట్ల మంటలు కాగుతున్నారు. వెచ్చని పానియాలు, వేడి ఆహార పదార్థాలు తింటున్నారు. రగ్గులు, స్వెటర్లు, ఉన్ని దుస్తులకు డిమాండ్ పెరిగింది. -
గుట్టుగా ‘గుట్కా’ దందా..!
సాక్షిప్రతినిధి, వరంగల్ ● హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నేలు గ్రామంలో గుట్కాలు విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు పది రోజుల క్రితం పోలీసులు దాడులు నిర్వహించారు. 43 ప్యాకెట్ల అంబర్, గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు శ్రీకాంత్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ● వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు జూలై మాసంలో పిన్నవారివీధిలోని ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన రూ.4.50 లక్షలు విలువైన ఆర్ఆర్ గుట్కా 860 ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. రాజ్పురోహిత భవాని సింగ్‌ను అరెస్టు చేసిన పోలీసులు.. మరో వ్యక్తి రాజ్పురోహిత జబ్బార్సింగ్ పరారైనట్లు ప్రకటించారు. ● జనగామ జిల్లా పాలకుర్తి మండలకేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో మూడు రోజుల కిందట (11 తేదీన) పెద్ద మొత్తంలో నిషేధిత అంబర్, గుట్కా ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. పాలకుర్తి నుంచి వరంగల్‌కు కారులో తరలిస్తున్నారన్న సమాచారం మేరకు అలర్టయిన పోలీసులు రూ.6.70 లక్షల విలువైన 13 బస్తాల అంబర్, గుట్కా ప్యాట్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. నామమాత్రపు పెట్టుబడి.. పది రెట్ల లాభాలు.. అవసరమైతే ముడుపులు.. రకరకాల పేర్లు.. ఆకర్షణీయ ప్యాకింగులు... అమ్మకాల్లో ఇష్టారాజ్యం.. పల్లె పట్టణం ప్రాంతమేదైనా చాపకింద నీరులా నిషేధిత గుట్కాల వ్యాపారం జోరు నానాటికీ పెరుగుతోంది. ఇటీవల ఉమ్మడి జిల్లాలో తరచూ పట్టుబడుతున్న వ్యాపారులు సహా పెరుగుతున్న కేసుల తీవ్రత గుట్కా దందా సాగుతున్న తీరుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. రూ.4లది రూ.12–రూ.15లకు అమ్మేస్తున్నారు.. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా నగరాలు, పట్టణాలు కాకుండా గ్రామాల్లోని చిన్నదుకాణాల్లో సైతం గుట్కాలను అమ్ముతున్నారు. ఒక్కో ప్యాకెట్‌ను రూ.4లకు కొనుగోలు చేసిన దుకాణదారు రూ.12–15 వరకు ఆయా బ్రాండ్ వారీగా విక్రయిస్తున్నాడు. ఇలా రోజు మొత్తంలో 20 ప్యాకెట్లను అమ్మితే సుమారు రూ.150–200 వరకు ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు. ఇందులో రాటుదేలిన వ్యాపారులకు ఈ అక్రమదందా వల్ల ఒక్క రోజులోనే లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్న సందర్భాలున్నాయి. హోల్‌సేల్‌గా 20 ప్యాకెట్లు, 80 ప్యాకెట్లు ఉన్న గుట్కాలను స్థానిక వ్యాపారులకు ఒక్కసారిగా పెద్దమొత్తంలో అందిస్తుండటం వల్ల గంటల వ్యవధిలోనే పెద్ద వ్యాపారులు జేబుల్లో ఊహించని సొమ్మును నింపుకుంటున్నారు. పట్టుబడటం, కేసులు పెట్టుకోవడం షరామామూలే..! అనేలా కొందరు వ్యాపారుల తీరు మారిపోయింది. హైదరాబాద్ బేగంబజార్‌కు చెందిన ఓ వ్యాపారి వరంగల్ నగరంతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని ఈ దందా సాగిస్తున్నట్లు పోలీసు వర్గాల సమాచారం. వరంగల్ నుంచి మంచిర్యాల, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్ ప్రాంతాలకు కూడా తరలిస్తున్నట్లు తెలిసింది. మహబూబాబాద్‌కు చెందిన ఓ డీలర్ ఆర్ఆర్ ఖైనితోపాటు చాక్లెట్లు విక్రయిస్తున్నట్లు పోలీసులు ఇటీవల ఆరా తీశారు. బెల్లం, గుడుంబా తయారీపై 50కి పైగా కేసులున్న మరొకరు గుట్కా దందా సాగిస్తున్నట్లు తెలిసింది. భూపాలపల్లిలో నిషేధానికి ముందు అంబర్, ఆర్ఆర్ అనార్లు విక్రయించే ఓ వ్యాపారి ఇప్పుడు గుట్కా దందా సాగించడం, కేసులు పెట్టినా లైట్‌గా తీసుకుంటుండడంపై చర్చ జరుగుతోంది. ఇదే వ్యాపారి మరొకరితో కలిసి ఛత్తీస్‌గఢ్ నుంచి గుట్కాలు తెప్పించి విక్రయిస్తున్నారు. జనగామ, పరకాల, నర్సంపేట, హుజూరాబాద్, ఎల్కతుర్తి, వర్ధన్నపేటలపై పూర్తి ఆధిపత్యం సాధించిన వరంగల్ పిన్నవారి వీధికి చెందిన ఓ వ్యాపారి పెద్ద ఎత్తున ప్రభుత్వ నిషేధిత పొగాకు ఉత్పత్తులను సరఫరా చేస్తున్నారు. గతంలో కేసులు కూడా అయ్యాయి. ఇలా చాలామంది వరంగల్‌ను కేంద్రంగా చేసుకుని ఇక్కడ వ్యాపారం చేయడంతోపాటు ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తూ రూ.కోట్లు గడిస్తున్నారు. నిషేధం.. నిబంధనలు హుష్‌కాకి జడలు విప్పిన ‘మాఫియా’.. పట్టుబడుతున్నా ఆపడం లేదు రూ.లక్షల్లో లావాదేవీలు.. నామమాత్రంగా కేసులు వరంగల్ కేంద్రంగా ఇతర ప్రాంతాలకు సరఫరా -
క్రీడలతో నూతన ఉత్సాహం
మణుగూరుటౌన్: నిత్యం విధుల్లో తలమునకలయ్యే సింగరేణి కార్మికులు క్రీడలు, యోగా వైపు దృష్టి సారిస్తే ఆరోగ్యానికి శ్రేయస్కరమేకాక నూతన ఉత్సాహం లభిస్తుందని మణుగూరు ఏరియా ఇన్చార్జ్ జీఎం ఎం.రమేశ్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో డబ్ల్యూపీఎస్ అండ్ జీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన కంపెనీ స్థాయి హాకీ టోర్నమెంట్ ముగింపు సమావేశంలో ఆయన బహుమతులు అందజేసి మాట్లాడారు. ఉద్యోగ క్రీడాకారులు కోల్ ఇండియా స్థాయిలో విజయపతాక ఎగురవేయాలని ఆకాంక్షించారు. ఈ పోటీల్లో ఆర్జీ–3, భూపాలపల్లి జట్లు విజేతగా నిలవగా, ఆర్జీ–1, ఆర్జీ–2 జట్లు రన్నరప్‌గా నిలిచాయి. -
నాణ్యమైన బొగ్గును అందించాలి
భూపాలపల్లి అర్బన్: ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యుత్ సంస్థలకు నాణ్యమైన బొగ్గును అందించాలని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. బొగ్గు నాణ్యత వారోత్సవాల్లో భాగంగా గురువారం ఏరియాలోని జీఎం కార్యాలయంలో నాణ్యతకు సంబంధించిన జెండా ఆవిష్కరణ చేపట్టారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ 135 సంవత్సరాలుగా దేశ విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు నాణ్యమైన బొగ్గు సరఫరా చేస్తూ అగ్రగామిగా ఉందన్నారు. ప్రస్తుత పోటీ మార్కెట్లో విద్యుత్ సంస్థల పురోగతి సింగరేణి సరఫరా చేసే బొగ్గు నాణ్యతపై ఆధారపడి ఉందని తెలిపారు. వినియోగదారుడి మనుగడపైనే మన మనుగడ ఆధారపడి ఉందిశ్రీ అనే సూత్రంతో ప్రతి సింగరేణీయుడు నాణ్యత పెంపుదలలో కృషి చేయాలని సూచించారు ఇతర ప్రైవేట్ కంపెనీలు తక్కువ ధరలకు బొగ్గు విక్రయిస్తున్న నేపథ్యంలో, సింగరేణి తన బొగ్గు నాణ్యత ప్రమాణాలను మరింత బలోపేతం చేయాలని, నాణ్యమైన బొగ్గు సరఫరా ద్వారా వినియోగదారుల విశ్వాసం పెరగడంతో పాటు తక్కువ ధరకే విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జీఎం కవీంద్ర, క్వాలిటీ ఇన్చార్జ్ కృష్ణ ప్రసాద్, ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్యామ్ సుందర్, మేనేజర్ రామకంఠ్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.బొగ్గు నాణ్యత వారోత్సవాలు -
రైతులను మోసంచేస్తే కఠిన చర్యలు
భూపాలపల్లి: వరిధాన్యం కొనే సమయంలో రైతులను మోసం చేయాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హెచ్చరించారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా పౌర సరఫరాల శాఖ, సంస్థ ఆధ్వర్యంలో వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, డీఆర్డీఓ, రవాణా తదితర శాఖల అధికారులతో 2025–26 వానాకాలం ధాన్యం కొనుగోలుపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. ధాన్యం కొనుగోలు జరిగిన వెంటనే రైతులకు ట్రక్ షీట్ ఇవ్వాలన్నారు. తాలు, తరుగు పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టర్ రాహుల్‌శర్మ మా ట్లాడుతూ.. అకాల వర్షాలు వస్తే ధాన్యం తడవకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలన్నారు. కేంద్రాలు ఎత్తు ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలని చె ప్పారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. పరిష్కారంలో ప్రగతి ఉండాలి... భూ భారతి, రెవెన్యూ సదస్సులు, సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారంలో ప్రగతి రాకుంటే చార్జెస్ ఫ్రేమ్ చేస్తామని కలెక్టర్ రాహుల్ శర్మ గురువారం తహసీల్దార్లను హెచ్చరించారు. ఆయా దరఖాస్తుల పరిష్కారంపై ఐడీఓసీ కార్యాలయంలో తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రెవెన్యూ సదస్సులు నిర్వహించి ఆరు నెలలు గడిచినా దరఖాస్తుల పరిష్కారంలో ఆశించిన స్థాయిలో ప్రగతి కనబడకపోవడంప్లై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమీక్షలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, ఆర్డీఓ రవి, అన్ని మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు. బ్యాంకు హామీలు సమర్పించాలి... వానాకాలం ధాన్యం కొనుగోలు కార్యక్రమం సజావుగా సాగేందుకు మిల్లర్లు తక్షణమే బ్యాంకు హామీలు సమర్పించాలని అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ సూచించారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలో జిల్లాలోని రైస్‌మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ధాన్యం రవాణా, ఎండబెట్టడం, తూకం ప్రక్రియల్లో ఆటంకం రాకుండా మిల్ పాయింట్ల వద్ద తగిన కార్మికులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో రైస్‌మిల్లర్లు, సివిల్ సప్లై అధికారులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు రానివ్వొద్దు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
జాతర పనుల నిర్లక్ష్యంపై గరంగరం
సాలహారం రాయి గురించి మంత్రులు పొంగులేటి, సీతక్క, సురేఖ, లక్ష్మణ్‌లకు వివరిస్తున్న అధికారిమేడారం మహాజాతర అభివృద్ధి పనులను బుధవారం రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, ధనసరి సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరిశీలించారు. అనంతరం మేడారం హరిత హోటల్లో సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లతో కలిసి సమీక్షించారు. ముఖ్యంగా ఆర్అండ్బీ, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్ శాఖల పనుల్లో నిర్లక్ష్యం జరుగుతోందని గరంగరమయ్యారు. – ములుగు/ఎస్‌ఎస్‌తాడ్వాయి● అధికారులకు చురకలంటించిన మంత్రి పొంగులేటి ● మేడారంలో మహాజాతర అభివృద్ధి పనులపై సమీక్ష -
కార్పొరేట్ స్థాయిలో విద్యాభివృద్ధి
కాళేశ్వరం: మారుమూల పల్లెల్లో కార్పొరేట్ స్థాయి విద్యాభివృద్ధికి సౌకర్యాలను అందించేందుకు మంత్రి శ్రీధర్‌బాబు ప్రత్యేక శ్రద్ధతో విద్యార్థులకు డ్యు యల్ డెస్క్‌లు పంపిణీ చేస్తున్నామని కలెక్టర్ రాహుల్‌శర్మ తెలిపారు. బుధవారం మహాదేవపూర్ మండలం జెడ్పీపాఠశాల విద్యార్థులకు డ్యుయల్ డెస్క్ లు, ఆదివాసీ గిరిజన భవనంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు వయాట్రీస్ సంస్థ సీఎస్ఆర్ నిధులతో కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. కాటారం డివిజన్ పరిధిలోని 26 పాఠశాలలకు మొదటి విడతలో 226, రెండో విడతలో 56 డ్యుయల్ డెస్క్‌లు అందించినట్లు తెలిపారు. అనంతరం ఆదివాసీ గిరి జన భవనంలో మహిళా గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో జరిగిన కుట్టుమిషన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ మహిళల ఆర్థిక పురోగతికి ప్రభుత్వం ఇందిర మహిళా శక్తి పథకాన్ని అమలు చేస్తుందన్నారు. కుట్టుమిషన్లు పొందిన మహిళలు ఆర్థికంగా ఎదగాలని సూచించారు. సీఎస్ఆర్ నిధులతో డ్యూయల్ డెస్క్‌లు, కుట్టు మిషన్లు అందించిన వయాట్రీస్ ప్రతినిధి హనీష్‌ను అభినందించి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఈఓ రాజేందర్, డీఆర్డీఓ బాలకృష్ణ, ఎంపీడీవో రవీంద్రనాథ్, సీడీపీఓ రాధిక, వయాట్రీస్, సింగిల్ విండో చైర్మన్ తిరుపతిరెడ్డి,రాణిబాయి, అరుణ, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. సాదాబైనామా దరఖాస్తుల్లో వేగం పెంచాలి భూ భారతి, సాదాబైనామా దరఖాస్తుల పరిశీలనలో వేగం పెంచాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. బుధవారం మహదేవపూర్ తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి భూ భారతి, సాదాబైనామా దరఖాస్తుల పరిశీలనపై సమీక్షించారు. ప్రతీ దరఖాస్తుపై స్పష్టమైన పరిశీలన నివేదిక ఉండాలని, తిరస్కరణ జరిగితే తగిన కారణాలు నమోదు చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఆయన వెంట కాటారం సబ్‌కలెక్టర్ మయాంక్‌సింగ్, తహసీల్దార్ రామారావు, నాయబ్ తహసీల్దార్ కృష్ణ, తదితరులు ఉన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలి కలెక్టర్ రాహుల్ శర్మ -
సందడిగా వైట్‌కోట్ ఉత్సవం
భూపాలపల్లి అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 2025–26 సంవత్సరానికి ఎంబీబీఎస్‌లో కొత్తగా చేరిన విద్యార్థులకు వైట్‌కోట్ ఉ త్సవం నిర్వహించారు. బుధవారం కళాశాల ప్రిన్సి పాల్ వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో వరంగల్ ఎంపీ కడియం కావ్వ, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్‌శర్మ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. నూతన విద్యార్థులకు వైట్‌కోట్ (యునిఫాం) తొడిగి వైద్య వృత్తి ప్రా ధాన్యాన్ని, సేవా దృక్పథం, నైతిక విలువల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ రాజేంద్రప్రసాద్, జీఎం రాజేశ్వర్‌రెడ్డి, కేటీపీపీ సీఈ ప్రకాష్, వైద్యవిద్య విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
నాణ్యమైన విత్తనాలు ఎంచుకోవాలి
భూపాలపల్లి రూరల్/ కాటారం/రేగొండ: రైతులు అధిక దిగుబడిని ఇచ్చే నాణ్యమైన విత్తనాలు ఎంపిక చేసుకోవాలని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ వరంగల్ శాస్త్రవేత్తలు హరి, వెంకటరాజుకుమార్, ఓంప్రకాశ్, ప్రశాంత్ అన్నారు. నాణ్యమైన విత్తనం–రైతన్నకు నేస్తం కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని జంగేడు గ్రా మం, రేగొండ, కొత్తపల్లిగోరి, కాటారం మండలా ల్లో బుధవారం శాస్త్రవేత్తల బృందం వ్యవసాయ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో వరి పంటలను సందర్శించారు. రిరకం వరి రకం డబ్ల్యూజీఎల్–96 2 గుణ, గణాలు, ఇతర విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఓలు స తీష్, పూర్ణిమ, వాసుదేవరెడ్డి, సారయ్య, ఏఈఓ రా జన్న, సోని, ప్రణయ్, రైతులు పాల్గొన్నారు. -
ఆరోగ్యంపై అవగాహన ఉండాలి
గణపురం: బాలికలు, మహిళలకు వారి ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉండాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. బుధవారం మైలారం మహాత్మాజ్యోతిబాపూలే పాఠశాలలో గివ్ ఫర్ సొసైటీ సంస్థ ఆధ్వర్యంలో బాలికలకు ఉచిత నాప్ కిన్స్ పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, కలెక్టర్ రాహుల్‌శర్మతో కలిసి పాల్గొని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీఒక్కరిపై ఉందన్నారు. నాప్కిన్స్ను ఉచితంగా పంపిణీ చేసిన ఫర్ గివ్ సంస్థ సత్యను అభినందించారు.ఎమ్మల్యే గండ్ర సత్యనారయణ రావు మాట్లాడుతూ నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామన్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచి రుతు స్రావ సమస్యను ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మీ, మహిళా సంక్షేమాధికారి మల్లేశ్వరి, ప్రిన్సిపాల్ స్వప్న తదితరులు పాల్గొన్నారు.ఎంపీ కడియం కావ్య -
దళారుల దందా!
పంబపూర్‌లో పత్తి కొనుగోలు చేస్తున్న ప్రైవేట్ వ్యాపారి (ఫైల్)భూపాలపల్లి రూరల్: గ్రామాల్లో దళారుల దందా జోరుగా కొనసాగుతోంది. ప్రభుత్వం పత్తికి కనీస మద్దతు ధర ప్రకటించినప్పటికీ అది కొంతమంది రైతులకు మాత్రమే లభించగా మిగతా వారంతా తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఆరుగాలం కష్టపడి పంట పండించిన పత్తి రైతులకు చివరికి కన్నీళ్లే మిగులుతున్నాయి. ఏటా ఏదోవిధంగా నష్టపోతూనే ఉన్నారు. సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) తేమ పేరిట కొర్రీలు పెట్టడంతో గత్యంతరం లేక ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. పంట ఏరేందుకు కూలీల ఖర్చు, సాగుకు తెచ్చిన అప్పులు చెల్లించాల్సి ఉండటంతో పత్తిని ఇంట్లో నిల్వ చేసుకోలేక ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. దీంతో వారు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. తగ్గిన దిగుబడి సాగు పెట్టుబడి ఎకరాకు రూ.40వేల వరకు ఖర్చు అయినట్లు రైతులు చెబుతున్నారు. ఎకరాకు 10 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి రావాల్సిన ఉండగా వర్షాలతో పంట దెబ్బతినడంతో ఎకరాకు 8 క్వింటాళ్లు కూడా దిగుబడి రావడంలేదని, పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఉందని వాపోతున్నారు. సాగుకు తెచ్చిన అప్పులు తీరే పరిస్థితి లేదని చెబుతున్నారు. మరోవైపు కూలీలకు డబ్బులు చెల్లించాల్సి ఉండడంతో చేతికొచ్చిన పంట దిగుబడిని అగ్గువకు అమ్ముకోవాల్సి వస్తుందని రైతులు అంటున్నారు. సీసీఐ అధికారులు 8 నుంచి 12 శాతం తేమ ఉంటేనే మార్కెట్లో పత్తి కొనుగోలు చేస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని ప్రైవేట్ వ్యాపారులు రైతుల నుంచి అందినకాడికి దండుకునే విధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో చిట్యాల మండలంలో 2, కాటారంలో 2, భూపాలపల్లిలో 1 సీసీఐ కొనుగోలు కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. మద్దతు ధర రూ.7,521 ఉండగా, ప్రైవేట్ వ్యాపారులు తేమ పేరిట కోత విధించడంతో క్వింటాకు రూ.6,500 నుంచి రూ.7,000లకు కొనుగోలు చేస్తున్నారు గతనెల చివరి వారంలో పత్తి కొనుగోళ్లు ప్రారంభించారు. సీసీఐ ఇప్పటి వరకు 552 మంది రైతుల నుంచి 9,169 క్వింటాళ్లు కొనుగోలు చేయగా, ప్రైవేట్ వ్యాపారులు 466 మంది రైతుల నుంచి 4,539 క్వింటాళ్ల కొనుగోలు చేసినట్లు అధికారుల లెక్కలు ఉన్నాయి. రైతులకు అవగాహన లేక కొంత మంది తేమ శాతం 8 ఉన్నప్పటికీ ట్రాక్టర్ అద్దె, తదితర ఖర్చులు లెక్కలు వేసుకొని గ్రామాల్లో ప్రైవేట్ వ్యాపారులకు విక్రయించుకుంటున్నారు. గ్రామాల్లో విచ్చలవిడిగా ‘ప్రైవేట్’ పత్తి కొనుగోళ్లు తేమ పేరిట సీసీఐ కొర్రీలు కొందరికే అందుతున్న ‘మద్దతు’ చిత్తవుతున్న పత్తి రైతులు జిల్లాలో 5 సీసీఐ కొనుగోలు కేంద్రాలుగ్రామాల్లో ప్రైవేట్ వ్యాపారులు విచ్చలవిడిగా పత్తి కొనుగోళ్లు చేపడుతున్నారు. అధికారులు గుర్తించి దళారుల దందాను అరికట్టాలి. వర్షాల కారణంగా పత్తి దిగుబడి, నాణ్యత తగ్గింది. ప్రభుత్వం సీసీఐ నిబంధనలను సడలించి ఎలాంటి కర్రీలు లేకుండా మద్దతు ధరకు కొనుగోలు చేయాలి. – కార్నటకపు సమ్మయ్య, రైతు స్వరాజ్యవేదిక జిల్లా కన్వీనర్ నిబంధనల మేరకు సీసీఐ కి పత్తిని ఆరబెట్టి తీసుకొస్తే మద్దతు ధర లభి స్తుంది. గ్రామాల్లో ప్రైవేట్ వ్యాపారులకు విక్రయించి నష్టపోవద్దు. గ్రామాల్లోనే రైతులు పత్తిని ఆరబెట్టుకుని తీసుకురావాలి. – ప్రవీణ్‌రెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారి -
అభివృద్ధి పనుల పరిశీలన
భూపాలపల్లి అర్బన్: స్టడీటూర్‌లో భాగంగా నూతన ట్రైనీ ఐఏఎస్ అధికారులు బుధవారం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులను పరిశీలించి ఇతర కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. పురపాలక సంఘ కార్యాలయ పరిధిలోని డ్రై రిసోర్సెస్ సెంటర్ (డీఆర్సీసీ), వెస్ట్ కంపోస్ట్ షెడ్డు, డంప్ యార్డులను పరిశీలించి అక్కడ జరిగే పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మెప్మా ఆధ్వర్యంలో సీఆర్సీ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జంగేడు కేజీబీవీలోని పాఠశాల, జూనియర్ కళాశాలలను పరిశీలించి విద్యార్థులతో కలిసి శ్రమదానంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు సునీల్‌కుమార్, మానస, అశోక్‌కుమార్, జిల్లా మిషన్ కోఆర్డినేటర్ బి. రాజేశ్వరి, నవీన్, సిబ్బంది పాల్గొన్నారు. ముగిసిన ట్రైనీ ఐఏఎస్ అధికారుల పర్యటన కాటారం(మహాముత్తారం): మహాముత్తారం మండలం ములుగుపల్లిలో మూడురోజులుగా కొనసాగుతున్న కేంద్ర సివిల్ సర్వీసెస్ ఉద్యోగుల పర్యటన బుధవారం ముగిసింది. చివరి రోజులో భాగంగా బృందం సభ్యులు స్థానిక జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను పరిశీలించి ఉపాధ్యాయుల సంఖ్య, బోధన, వసతులు, పాఠశాల నిర్వాహణపై ఆరా తీశారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతీ విద్యార్థి పట్టుదలతో చదివి ఉన్నత స్థానాలను అధిరోహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నిశాంత్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంఈఓ రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు. కాళేశ్వరాలయంలో పూజలు కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వరముక్తీశ్వరున్ని ట్రైనీ ఐఏఎస్‌ల బృందం దర్శించుకున్నారు. బుధవారం ఆలయానికి రాగా అర్చకులు, అధికారులు మర్యాదపూర్వక స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి గర్భగుడిలో అభిషేక పూజలు చేశారు. కల్యాణ మండపం వద్ద వారిని అర్చకులు స్వామివారి కండువాతో సన్మానించి తీర్థప్రసాదాలు అందించారు. -
ఐటీడీఏను తరలిస్తే ఊరుకోం..
● తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు మహేష్ ఏటూరునాగారం: ఐటీడీఏను తరలిస్తే ఊరుకునేది లేదని నిరసనగా ఐటీడీఏను ఈ నెల 24న ముట్టడిస్తామని తుడుందెబ్బ ములుగు జిల్లా అధ్యక్షుడు చందా మహేశ్ అన్నారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయం ఎదుట తుడుందెబ్బ నాయకులు బుధవారం నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఐటీడీఏ భవనం నిర్మాణం పేరుతో మరో చోటుకు తరలించాలని చూడడం సరికాదన్నారు. అలా చేస్తే కార్యాలయం నిర్వీర్యం చేయాలని చూస్తున్నారన్నారు. ఏజెన్సీ ప్రాంతమైన ఆకులవారిఘనపురంలో ఆదివాసీల ఉనికి కనుమరుగు చెసే ప్రయత్నం జరుగుతుందన్నారు. అందులో భాగంగానే ఐటీడీఏ భవనం కొమురం భీమ్ మినీ స్టేడియంలో నిర్మించాలని చూస్తున్నారన్నారు. ఏజెన్సీలో ఉన్న ఏకై క క్రీడాప్రాంగణం భవన నిర్మాణంకు ఉపయోగిస్తే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు క్రీడలు దూరం చేయడమే అవుతుందన్నారు. ప్రభుత్వం వెంటనే ఐటీడీఏ తరలింపును ఆలోచన విరమించుకోవాలన్నారు. ప్రస్తుతం ఐటీడీఏ ఉన్న స్థలంలోనే భవనం నూతనంగా నిర్మించాలన్నారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి కబ్బాక శ్రావణ్, సమ్మయ్య, నర్సింహులు, రాజు పాల్గొన్నారు. -
వృథా వస్తువులను వినియోగిస్తే ప్రయోజనం
ఎన్జీసీ రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ విద్యాసాగర్ కాటారం: వృథాగా మారిన, పనికిరాని వస్తువులను సక్రమంగా వినియోగిస్తే పర్యావరణ పరిరక్షణతో పాటు ఆదాయం సమకూర్చుకోవచ్చని ఎన్జీసీ రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ విద్యాసాగర్ అన్నారు. కాటారం జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో మంగళవారం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల డివిజన్ స్థాయి వేస్ట్ టూ వెల్త్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. కాటారం, మహదేవపూర్, మహాముత్తారం, మల్హర్, పలిమెల మండలాల నుంచి సుమారు 23 పాఠశాలల విద్యార్థులు వేస్ట్ పదార్థాలతో పనికి వచ్చే వస్తువులు, అలంకరణ కోసం ఉపయోగపడే వస్తువులను తయారు చేసి ప్రదర్శించారు. పలు పాఠశాలల విద్యార్థులు తయారు చేసిన వస్తువులను ప్రాజెక్ట్ డైరెక్టర్ పరిశీలించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాల్లో, ఇంట్లో ఏర్పడే చెత్త, ఈ వేస్ట్ నుంచి ఉపయోగకరమైన వస్తువులను తయారు చేసి పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు. వేస్టేజీ నిర్వహణతో పర్యావరణ పరిరక్షణతో పాటు ఆదాయం సంపాదించే మార్గాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎగ్జిబిషన్లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చి ప్రథమ స్థానంలో నిలిచిన మహదేవపూర్ జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాల విద్యార్థినులు రూ.3వేలు, కాటారం ఆదర్శ హై స్కూల్ విద్యార్థులు ద్వితీయ స్థానంలో నిలిచి రూ.2 వేలు, గుడ్ మార్నింగ్ పాఠశాల విద్యార్థులు తృతీయ స్థానంలో నిలిచి రూ.వెయ్యి నగదు, బహుమతులు గెలుచుకున్నారు. కాటారం మాంటిస్సోరి పాఠశాల, చింతకాని జెడ్పీహెచ్ఎస్ పాఠశాల, కాటారం జెడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులు కన్సోలేషన్ బహుమతులు పొందారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి స్వామి, ఎంఈఓ శ్రీదేవి, హెచ్ఎంలు సోమలింగం, ఎఫ్‌పీఎస్‌టీ జనరల్ సెక్రటరీ గండు రాజబాబు పాల్గొన్నారు. -
ఇవే ప్రధాన అడ్డాలు..
భూపాలపల్లి కోల్‌బెల్ట్ ప్రాంతం కావడంతో మాంసం దుకాణాలు అధికంగా ఉన్నాయి. అంబేడ్కర్ సెంటర్, గణేష్‌చౌక్, మంజూర్నగర్లలో ప్రధాన రహదారిపై చికెన్, మటన్ దుకాణాల ఎదుట వీధి కుక్కలు అధికంగా సంచరిస్తున్నాయి. వ్యక్తులను కరవడమే కాకుండా ద్విచక్ర వాహనాలకు అడ్డు వస్తున్నాయి. దీంతో పలువురు ద్విచక్ర వాహనాలు ప్రమాదాలకు గురై ఆస్పత్రుల పాలవుతున్నారు. మున్సిపల్ శాఖ అధికారులు, సిబ్బంది కళ్లముందే కుక్కలు సంచరిస్తున్నా వారి కళ్లకు కనిపించనట్లు వ్యవహరిస్తున్నారు. కృష్ణకాలనీలో కుక్కలు తీవ్రంగా ఉన్నాయి. రోడ్డుపై వెళ్తున్న పలువురు చిన్నారులను కరుస్తున్నాయి. మున్సిపల్ కార్యాలయం ఎదుట పలుమార్లు ధర్నా చేసినా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా కుక్కలు విపరీతంగా పెరిగిపోయాయి. చిన్న పిల్లలు ఇంటి నుంచి బయటికి వస్తే ఎక్కడ కుక్కలు పీకుతాయేననే భయం ఉంది. – గోలి లావణ్య, కృష్ణకాలనీ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మున్సిపల్ శాఖ అధికారులు తక్షణమే స్పందించి కుక్కల నియంత్రణకు చర్యలు ప్రారంభించారు. కుక్కల నియంత్రణ లేకపోతే కుక్కకాట్లు పెరిగి రేబిస్ వ్యాధి పెరిగే ప్రమాదం ఉంది. ఇప్పటికే ప్రమాదానికి గురైనవారు అనేక మంది ఉన్నారు. కుక్కలు కరవడంతో పాటు ద్విచక్ర వాహనాలకు అడ్డువస్తున్నాయి. – ఎండీ యాకూబ్‌పాషా, కారల్‌మార్క్స్‌కాలనీ -
పెండింగ్ పనులు చేయండి
కాళేశ్వరం: సరస్వతి పుష్కరాల పెండింగ్ పనులన్నీ సంక్రాంతిలోపు పూర్తిచేయాలని జెన్కో సీఎండీ, దేవాదాయశాఖ కమిషనర్ హరీశ్ అన్నారు. ఆయన మంగళవారం కలెక్టర్ రాహుల్‌శర్మతో కలిసి కాళేశ్వరంలో పర్యటించారు. ముందుగా వీఐపీఘాటు వద్ద చేపట్టిన పనులను పరిశీలించారు. పుష్కరాల సమయంలో కాళేశ్వరం గోదావరి మెయిన్ ఘాట్ వద్ద చేపట్టిన ఆర్చి నిర్మాణంలో జాప్యంపై దేవాదాయ శాఖ ఇంజినీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆలయ అభివృద్ధి పనుల్లో ఇంత అలసత్వమా.. చర్యలు తప్పవని హెచ్చరించారు. మళ్లీ డిసెంబర్లో వస్తానని అప్పటివరకు పనులు పూర్తి చేయకపోతే చర్యలు తీసుకుంటానన్నారు. దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై షెడ్యూల్ తయారు చేయాలని సూచించారు. సరస్వతి పుష్కరాల సందర్భంగా చేపట్టిన ఆర్చి నిర్మాణం ఇంతవరకు పూర్తి చేయలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆలయ అభివృద్ధి పనులు ప్రతిష్టాత్మకమైనవని, భక్తుల నమ్మకానికి భంగం కలగకుండా అత్యుత్తమ నాణ్యత పాటించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని గుర్తుచేశారు. పనుల్లో వేగం, పారదర్శకత తప్పనిసరి ఉండాలని నిర్లక్ష్యం చూపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ స్పష్టం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇతరశాఖలకు బదిలీ చేస్తానన్నారు. కాళేశ్వరాలయంలో పూజలు.. కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడిని రాష్ట్ర ఇంధనశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, దేవాదాయశాఖ కమిషనర్ హరీశ్, కలెక్టర్ రాహుల్ శర్మ, థర్మల్ డైరెక్టర్ రాజశేఖర్‌రెడ్డి దర్శించుకున్నారు. మంగళవారం వారికి ఆలయ అదికారులు, అర్చకులు వేదపండితుల మంత్రోచ్చరణలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారి గర్భగుడిలో ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. శ్రీశుభానందదేవి అమ్మవారికి విశేష పూజలు చేశారు. ఈఓ మహేష్ వారిని శాలువాతో సన్మానించారు. కల్యాణ మండపం వద్ద అర్చకులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ సంధ్యారాణి, ఏసీ సునీత, తహసీల్దార్ రామారావు, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ మల్చూర్‌నాయక్, ఏఈఈ శ్రీకాంత్, డీటీ కృష్ణ, ఇరిగేషన్ ఈఈ తిరుపతిరావు, డీఈఈ సూర్యప్రకాశ్, ఎంపీడీఓ రవీంద్రనాథ్, కార్యదర్శి సత్యనారాయణ, సీఐ ఎన్.వెంకటేశ్వర్లు, ఎస్సై తమాషారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పూర్తికాకపోతే ఇతర శాఖకు బదిలీ చేస్తా.. జెన్కో సీఎండీ, దేవాదాయశాఖ కమిషనర్ హరీశ్ దేవాదాయశాఖ ఇంజనీర్లపై ఆగ్రహం -
ఫేక్ నంబర్ ప్లేట్ వినియోగిస్తే చర్యలు
భూపాలపల్లి అర్బన్: వాహనాలకు ఫేక్ నంబర్ ప్లేట్లు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని భూపాలపల్లి సీఐ నరేష్కుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పెద్దపూర్ గ్రామానికి చెందిన గట్టు వినోద్ తన ద్విచక్ర వాహనానికి సంబంధించిన టీఎస్ 25 ఏ5921 నంబర్‌ను పట్టణంలోని కారల్మార్క్స్కాలనీకి చెందిన కలవేన మల్లేశ్ తన వాహనానికి పెట్టుకున్నాడు. గుర్తించిన పోలీసులు మల్లేశ్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కాళేశ్వరం: తెలంగాణ నేషనల్ గ్రీన్ కోరప్స్ ఆధ్వర్యంలో కాటారం సబ్ డివిజన్ స్థాయిలో నిర్వహించిన సబ్ డివిజన్ స్థాయి ‘వేస్ట్ టూ వెల్త్’ పోటీలో మహదేవపూర్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు అక్షిత్ సాయి, దత్త సాయి, అక్షీత్, హర్షిత్, అఖిల్ తయారు చేసిన ప్రాజెక్టు మొదటి బహుమతి సాధించింది. దీనికి గైడ్ టీచర్‌గా ఆంజనేయులు వ్యవహరించారు. మొదటి బహుమతి పొందిన విద్యార్థులను హెచ్ఎం శ్రీనివాస్‌రెడ్డి, ఉపాధ్యాయలు సరిత, మడక మధు, సుధారాణి, సరితా దేవి, ఓలిపాషా, రజిత, లీలారాణి, ప్రసూనా, సమ్మయ్య, వీరేశం, వసధ ప్రియా, దీపిక, పూర్ణిమ అభినందించారు. చిట్యాల: మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని ఏబీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు గోల్కొండ సురేష్ కోరారు. మంగళవారం మండలకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ షేక్ ఇమామ్బాబాకు వినతిపత్రం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. జిల్లా అధి కారులు స్పందించి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు రామ్, జశ్వంత్, చరణ్ తదితరులు పాల్గొన్నారు. కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో ఈ ఏడాది మే 15 నుంచి 26 వరకు రాష్ట్ర ప్రభుత్వం సరస్వతినది పుష్కరాలను వైభవంగా నిర్వహించింది. వచ్చే ఏడాది మే 21 నుంచి సరస్వతినదికి అంత్యపుష్కరాలను దేవాదాయశాఖ లాంఛనంగా నిర్వహించడానికి పలు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. మే 21నుంచి 12 రోజుల పాటు అంత్యపుష్కరాల నిర్వహణకు తగు ప్రణాళికలను ఆ శాఖ రూపొందిస్తున్నట్లు సమాచారం. దేవాదాయశాఖ ఆధ్వర్యంలో చేపట్టాల్సి పనులు, పెండింగు పనులపై దృష్టిసారిస్తున్నారు. కాటారం: కాటారం సబ్ డివిజన్‌ను రూ.500 కోట్ల నిధులతో అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తూ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఆత్కూరి శ్రీకాంత్ మండలకేంద్రంలో చేపట్టిన నిరవధిక దీక్షను మంగళవారం పోలీసులు భగ్నం చేశారు. దీక్ష చేపట్టిన సమాచారం అందుకున్న పోలీసులు దీక్ష శిబిరం వద్దకు చేరుకొని శ్రీకాంత్‌ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీక్ష భగ్నం చేసి అరెస్ట్ చేయడం అమానుషమని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పోలం రాజేందర్ అన్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్, రాజేందర్ మాట్లాడుతూ దీక్షకు కూర్చున్న మూడు గంటల్లోనే పోలీసులు భగ్నం చేశారని, శాంతియుతంగా న్యాయమైన డిమాండ్ల సాధన కోసం దీక్ష చేపడితే పోలీసులు అడ్డుకట్ట వేయడం సరికాదన్నారు. మంత్రి శ్రీధర్‌బాబు స్పందించి డిమాండ్లను పరిష్కరించకపోతే మంత్రి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వంగాల లక్ష్మి, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి భూక్య నవీన్, యంగ్ ఉమెన్స్ జిల్లా కన్వీనర్ బందు సుజాత, కోకన్వీనర్ స్వాతి, ఆత్కూరి శ్రీధర్ పాల్గొన్నారు. -
రెండో రోజు పర్యటన
కాటారం(మహాముత్తారం): కేంద్ర సివిల్ సర్వీసెస్ ఉద్యోగుల బృందం రెండో రోజు మంగళవారం మహాముత్తారం మండలం ములుగుపల్లిలో క్షేత్రస్థాయి పర్యటన కొనసాగింది. ఉద్యోగుల బృందం సభ్యులు గ్రామంలో శ్రమదానం నిర్వహించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి వసతులు, విద్యాబోధన, ఉపాధ్యాయుల పనితీరుపై ఆరాతీశారు. హెల్త్ సబ్సెంటర్లో సౌకర్యాలను చూసి సేవలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులతో ముచ్చటించి సంఘాల నిర్వహణ తీరు, రుణాల మంజూరు, స్వయం ఉపాధి గురించి చర్చించారు. సెగ్రిగేషన్ షెడ్‌ను పరిశీలించి తడి, పొడి చెత్త సేకరణ, కంపోస్టు ఎరువు తయారీ, గ్రామంలో కొనసాగుతున్న ఎఫ్‌పీఓ, సీఎస్సీ కేంద్రం నిర్వహణపై వివరాలు సేకరించారు. రైతులు, గ్రామస్తులతో మాట్లాడి వారి జీవనశైలి, విధివిధానాలు, ప్రధాన పంటల సాగుపై చర్చించారు. తెలంగాణ సంస్కృతిలో భాగంగా గ్రామస్తులతో కలిసి ఉద్యోగుల బృందం సభ్యులు బతుకమ్మ ఆడారు. బృందం వెంట ఎంపీడీఓ సుశాంత్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంఈఓ రవీందర్‌రెడ్డి ఉన్నారు. -
పోలీసులు నిష్పక్షపాతంగా ఉండాలి
● డీఎస్పీ సంపత్‌రావు చిట్యాల: పోలీసులు ప్రజలతో నిష్పక్షపాతంగా ఉండాలని భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు అన్నారు. మంగళవారం చిట్యాల పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. అనంతరం స్టేషన్ నిర్వహణ, రికార్డులను పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న, పరిష్కారమైన కేసుల పురోగతిని సమీక్షించారు. ప్రస్తుతం జరుగుతున్న నేరాల పద్ధతులు, వివరాలపై ఆరా తీశారు. లాకప్, ఆయుధాగారం, స్టేషన్ పరిసరాల శుభ్రతను పరిశీలించారు. విధి నిర్వహణలో ఎల్లప్పుడూ కచ్చితమైన క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేయాలని పోలీసులకు ఆదేశించారు. పోలీసులు ప్రజలతో మర్యాదపూర్వకంగా ఉండి ప్రతి ఫిర్యాదుదారుడి పట్ల సానుకూలంగా వ్వవహరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ మల్లేష్, ఎస్సైలు శ్రావన్‌కుమార్, హేమ, ఈశ్వరయ్య, పోలీస్ సిబ్బంది సురేందర్, చంద్రమౌళి, గిరి, సందీప్, అస్లాంజానీ, లాల్‌సింగ్, నాగరాజు, సందీప్, క్రాంతికుమార్, రంజిత్, శ్రీనివాస్, నాగమణి, శ్రావని, మమత, లలిత, పాల్గొన్నారు. -
భూ సేకరణ ప్రక్రియ పూర్తిచేయాలి
మల్హర్: మల్హర్ మండలం తాడిచర్ల బ్లాక్–1 ఓపెన్‌కాస్ట్ మైన్‌కు అవసరమైన భూ సేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జెన్కో సీఎండీ హరీశ్, కలెక్టర్ రాహుల్ శర్మ, థర్మల్, కోల్ డైరెక్టర్లతో కలిసి తాడిచర్ల–1 కోల్ బ్లాక్ ఓపెన్‌కాస్ట్ మైన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఓపెన్‌కాస్ట్ కార్యకలాపాలు, బొగ్గు ఉత్పత్తి ప్రక్రియ, భద్రతా ప్రమాణాలు, పర్యావరణ చర్యలు తదితర వాటిని ఆయన పరిశీలించారు. మైనింగ్ వ్యూపాయింట్ ద్వారా తాడిచర్ల గ్రామాన్ని, వాహన ప్రాంగణం, యంత్రాలను, ఫీడర్ బ్రేకర్ పరిశీలించారు. అనంతరం ఏఎమ్మార్ క్యాంపు కార్యాలయంలో అధికారులు సమీక్ష నిర్వహించారు. భూసేకరణ, పునరావాస చర్యలు న్యాయబద్ధంగా, పారదర్శకంగా, వేగంగా పూర్తిచేయాలని సూచించారు. కన్వేయర్ బెల్ట్ నిర్మాణంపై సమీక్ష తాడిచర్ల (కాపురం) నుంచి కేటీపీపీ వరకు కన్వేయర్ బెల్ట్ నిర్మాణం, రవాణామార్గం, దూరాబారాలపై జెన్కో సీఎండీ హరీశ్, కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు కన్వేయర్ బెల్ట్ నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ, రహదారి మార్గం, భద్రతా చర్యలు, నిర్వహణ ప్రక్రియపై వివరాలు నివేదికను సీఎండీకి అందించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ.. కన్వేయర్ బెల్ట్ నిర్మాణం పూర్తయితే రహదారి రవాణాపై భారం తగ్గి సమర్థవంతంగా బొగ్గు పంపిణీ జరుగుతుందని చెప్పారు. రానున్న రోజుల్లో నిరంతరాయ విద్యుత్ సరఫరా జరగాలని ఆయన సూచించారు. కేటీపీపీలో 28 మెగా వాట్ల సోలార్ ప్లాంట్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో థర్మల్ డైరెక్టర్ రాజశేఖర్‌రెడ్డి, కోల్ డైరెక్టర్ నాగ్యా, విద్యుత్ శాఖ ఈడీ లక్ష్మయ్య, కేటీపీపీ సీఈ ప్రకాశ్, ఎస్ఈ ముత్యాలరావు, అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, విద్యుత్ శాఖ ఎస్ఈ మల్చూర్‌నాయక్, ఏఎమ్మార్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.రాష్ట్ర ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ -
ఆజాద్ సేవలు చిరస్మరణీయం
భూపాలపల్లి రూరల్: మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు చిరస్మరణీయమని అదనపు కలెక్టర్ విజయలక్ష్మి అన్నారు. భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ 137వ జయంతిని జాతీయ విద్యా దినోత్సవంగా నిర్వహించుకుంటున్న నేపథ్యంలో మంగళవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశం హాలులో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ విజయలక్ష్మి ముఖ్యఅతిథిగా హాజరై ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుడిగా, కేంద్ర తొలి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ రాజేందర్, బీసీ సంక్షేమ అధికారి ఇందిర, ఆర్అండ్బీ ఈఈ రమేష్, ఏఓ మురళీధర్, పర్యవేక్షకులు అబ్బాస్ పాల్గొన్నారు. -
మాంసం దుకాణాలే అడ్డా
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి మున్సిపల్ పరిధిలో వీధి కుక్కలు విచ్చలవిడిగా సంచరిస్తున్నారు. పట్టణంతో పాటు విలీన గ్రామాల్లో ఏదో ఒక మూలన ప్రతీ రోజు కుక్క కాటుకు గురవుతున్నారు. కుక్కలకు వివిధ రకాల వ్యాధుల బారిన పడిన వాటిని పట్టించుకోవడం లేదు. రోడ్లుపైనే సంచరించడం వలన పట్టణ ప్రజలు జంకుతున్నారు. ఏండ్ల తరబడి కుక్కలు విపరీతంగా పెరిగి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని వాటిని నివారించాలని వినతులు అందించి, మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టినా అధికారులు పట్టించుకోవడం లేదు. కుక్కల సంచారాన్ని నివారించాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ మున్సిపల్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. భూపాలపల్లి మున్సిపల్ పరిధిలో 900 కుక్కలు సంచరిస్తున్నట్లు పశుసంవర్ధశాఖ అధికారులు గుర్తించారు. జిల్లా కేంద్రంలో గతేడాది ఒక మహిళ కుక్కకాటుకు గురై చికిత్స పొందుతూ మృతి చెందింది. మున్సిపల్ పరిధిలో ప్రతీ నెల 150 నుంచి 200 మందిని కుక్కలు కరుస్తున్నాయి. కుక్కల సంతతి పెరగకుండా నియంత్రించేందుకు చర్యలు ప్రారంభించాం. ఇప్పటికే టెండర్ నోటిఫికేషన్ జారీ చేశాం. అతి త్వరలోనే కుక్కలను పట్టుకొని ఇంజక్షన్లు ఇచ్చి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయిస్తాం. – శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ నివారణ చర్యల్లో మున్సిపల్ అధికారుల విఫలం ప్రతీ నెల 150 నుంచి 200 మందికి కుక్క కాటు -
ట్రైనీ ఐఏఎస్‌ల బృందం పర్యటన
– వివరాలు 9లోu● మద్యం దుకాణాలు పొందిన వారికి ‘సిండికేట్ల’ బంఫర్ ఆఫర్ ● రూ.30 లక్షల నుంచి రూ.కోటి వరకు డీల్ ● ‘మేడారం’, లోకల్ ఎన్నికలే కారణం ● డిసెంబర్ 1 నుంచి దుకాణాలు నడిపేలా ‘సిండికేట్’ల వ్యూహం ● ఉమ్మడి వరంగల్‌లో పడగవిప్పిన మద్యం మాఫియాపలిమెల: మండలంలోని లెంకలగడ్డలో ట్రైనీ ఐఏఎస్‌ల బృందం సోమవారం పర్యటించింది. తొలిరోజు సోమవారం లెంకలగడ్డలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల చేరుకున్న సభ్యులు మధ్యాహ్న భోజనం అనంతరం గ్రామంలోని వీధి వీధి తిరిగారు. గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించిన టైనీ ఐఏఎస్ అధికారులు పిల్లలు, బాలింతలు, గర్భిణులకు ఏ విధంగా పోషకాహారం అందిస్తున్నారని వివరాలు తెలుసుకున్నారు. ఏఎన్ఎం, ఆశకార్యకర్తలతో మాట్లాడారు. వాధ్యుల నివా రణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ఆరా తీశారు. అనంతరం పాఠశాల చేరుకొని గ్రామంలోని వసతులు, సమస్యలు, అందుతున్న సంక్షేమ పథకాలు, ప్రజలకు కల్పిస్తున్న అవగాహన కార్యక్రమాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నేడు, రేపు (మంగళవారం, బుధవారం) కూడా మండలంలోని లెంకలగడ్డ, పంకెన గ్రామాల్లో పర్యటన ఉండనున్నట్లు అధికారులు తెలిపారు. ములుగుపల్లిలో పర్యటన కాటారం(మహాముత్తారం): మహాముత్తారం మండలం ములుగుపల్లిలో సోమవారం ఆరుగురితో కూడిన కేంద్ర సివిల్ సర్వీసెస్ ఉద్యోగుల బృందం పర్యటించింది. అధికారుల బృందానికి అదనపు కలెక్టర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో మండల అధికారులు ఘన స్వాగతం పలికారు. గ్రామస్తులతో సమావేశం నిర్వహించి పలు అంశాలను తెలుసుకున్నారు. అనంతరం విలేజ్ మ్యాప్‌ను పరిశీలించి గ్రామంలోని పలు వీధులను కలియ తిరిగారు. రైతులు, గీత కార్మికులతో మాట్లాడి వారి వృత్తి నిర్వహణ, పంటల సాగుపై ఆరా తీశారు. గ్రామంలోని వాటర్ ట్యాంకులు, చెరువులు, బోర్లు, ఆయకట్టు సాగు, ఏఏ పంటలు సాగు చేస్తున్నారనే విషయాలను తెలుసుకున్నారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను సందర్శించి వసతులు, విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య, విద్యాబోధనపై ఆరా తీసి మధ్యాహ్న భోజనం చేశారు. అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన శ్రీమంతం కార్యక్రమంలో పాల్గొన్నారు. మిషన్ భగీరథ సంపును పరిశీలించి పథకం ఉపయోగం, పనితీరు, నీటి సరఫరా తదితర వివరాలను సేకరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నిశాంత్, తహశీల్దార్ శ్రీనివాస్, ఎంఈఓ రవీందర్‌రెడ్డి, ఏఓ అనూష పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా కవులు, కళాకారుల సంతాపం -
ఓరుగల్లు శోకసంద్రం
అందెశ్రీ అస్తమయం..ఉమ్మడి జిల్లాతో విడదీయలేని అనుబంధం‘జన జాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి. జంఝా మారుత జన నినాదమై జే గంటలు మోగించాలి. ఒకటే జననం.. ఓహోహో.. ఒకటే మరణం ఆహాహా.. జీవితమంతా ఓహోహో.. జనమే మననం.. ఆహాహా.. కష్టాల్ నష్టాల్ ఎన్నెదురైనా కార్యదీక్షతో తెలంగాణ.. జై బోలో తెలంగాణ.. గళ గర్జనల జడివాన’ అంటూ పాటల రూపంలో తెలంగాణ వాదాన్ని ఇంటింటికీ చేర్చిన అందెశ్రీ మరణ వార్తతో ఉమ్మడి వరంగల్ జిల్లా వాసులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ సందర్భంగా ఆయనతో ఓరుగల్లుకున్న విడదీయలేని అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. – జనగామ/కేయూ క్యాంపస్/మహబూబాబాద్ రూరల్పాత ఉమ్మడి వరంగల్ జిల్లా, ప్రస్తుత సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం రేబర్తి గ్రామంలో జన్మించిన అందెశ్రీ (అందె ఎల్ల య్య) చదువుకోలేకపోయినా జీవితానుభవాలే పాఠ్యగ్రంథాలుగా మార్చుకున్నారు. యువతలో ఆత్మవిశ్వాసాన్ని, కష్టజీవుల్లో పోరాటస్ఫూర్తిని రగిలించే పాటలతో ఆయన ప్రజాకవిగా వెలు గొందారు. 1985–90 మధ్యకాలంలో జనగామ అంబేడ్కర్ నగర్‌లోని అభ్యుదయకవి జి.వై.గిరి, మాజీ ఎమ్మెల్యే సీహెచ్ రాజారెడ్డితో సాహిత్య, సామాజిక చర్చలు సాగించిన అందెశ్రీ, జనగామ కవులు, కళాకారులతో ఎంతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నారు. కవులు, కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సాంబరాజు యాదగిరి రచించిన ‘స్వేచ్ఛా గీతం’ పుస్తకావిష్కరణకు ముఖ్య అతిథిగా హాజ రయ్యారు. ప్రకృతిలోని అనుభవమే ఆయన పాటలు.. అందెశ్రీ పాఠశా ల స్థాయి విద్య కూడా చదవలే దు. పల్లె ప్రకృతి తో గొర్రెల కాపరి గా బాల్యం గడిచింది. ప్రకృతిలోని అనుభవమే ఆయన పాటలు, కవిత్వం సహజసిద్ధమైన ఆశువు కవిత్వంగా మారింది. ఆయన కవిత్వా ప్రతిభను గుర్తించి కాకతీయ యూనివర్సిటీ 2008, జనవరి 31న నిర్వహించిన 18వ స్నాతకోత్సవంలో గౌరవ డాక్టరేట్‌ను అప్పటి వీసీ ఆచార్య ఎన్.లింగమూర్తి చేతులమీదుగా అందించింది. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కాకతీయ యూనివర్సిటీ కేంద్రబిందువుగా కొనసాగిన పోరాట సమయంలోనూ యూనివర్సిటీని సందర్శించారు. తెలుగు విభాగంలో నిర్వహించిన సెమినార్లో పాల్గొన్నారు. ఆయన చేసిన సాహిత్య కృషికి కాళోజీ ఫౌండేషన్,ప్రజాకవి కాళోజీ స్మారక పురస్కారాన్నిఅందించింది. అప్పట్లో కేంద్ర సాహిత్య అకాడమీ అవా ర్డు గ్రహీత అంపశయ్య నవీన్, నాగిళ్ల రామశాస్త్రి, పొట్లపెల్లి శ్రీనివాస్‌రావు తదితర రచయితల చేతులమీదుగా అందెశ్రీ అవార్డు అందుకున్నారు. మానుకోటకు రెండు సార్లు.. మహబూబాబాద్ జిల్లాకేంద్రంలో సమైక్య విద్యాసంస్థల్లో 2008, 2009 సంవత్సరాల్లో జరిగిన విద్యార్థుల స్వాగత, వీడ్కోలు వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మంచి భవిష్యత్ ఏర్పడే అంశాలపై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఆ సమయంలోనే కురవి శ్రీవీరభద్రస్వామిని దర్శించుకున్నారు. చిన్నగూడూరులోని దాశరథి కృష్ణమాచార్యుల విగ్రహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన స్వస్థలం పాత ఉమ్మడి జిల్లాలోని రేబర్తి.. తెలంగాణ యాసతో తన పాటలు విశ్వవ్యాప్తం గౌరవ డాక్టరేట్ అందించిన కాకతీయ యూనివర్సిటీ.. కాళోజీ స్మారక పురస్కారం అందుకున్న ప్రకృతి కవి ఓ సాహిత్య గ్రంథాన్ని కోల్పోయామని జిల్లావాసుల ఆవేదన తాపీమేసీ్త్ర నుంచి ప్రజాకవి వరకు జీవనోపాధి కోసం తాపీమేస్త్రీగా పని చేసిన అందెశ్రీ, భవన నిర్మాణ రంగంలో చెరగని ముద్ర వేశారు. బచ్చన్నపేట మండలంలో ఆయన నిర్మించిన ఇళ్లు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. భుజానికి సంచి, అందులో తాపీ దారం– అది ఆయన సాధారణ జీవనానికి ప్రతీక. కష్టాల మధ్యే కళను పుట్టించిన ఆ కవి, తన పాటలతో సమాజాన్ని మేల్కొలిపారు. చదువులేకపోయినా ఆయన నోటి నుంచి జాలువారిన పాటలు పల్లె నుంచి పట్టణం వరకు మార్మోగాయి. తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన ‘జై బోలో తెలంగాణ’ పాటతో ప్రజల గుండెల్లో స్థానం సంపాదించారు. ఆయన పాటల్లో కేవలం పదాలే కాదు ప్రజల బాధ, ఆశ, ఆత్మగౌరవం ప్రతిధ్వనించాయి.నిప్పుల వాగుతో విశిష్టత అందెశ్రీ సంపాదకత్వంలో వెలువడిన ‘నిప్పుల వాగు’ పాటల సంకలనంలో జనగామ కవుల రచనలకు విశిష్ట స్థానం కల్పించారు. ఆ పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా హైదరాబాద్‌లో జనగామ కవులు జి.కృష్ణ, అయిలా సోమనర్సింహాచారి, పెట్లోజు సోమేశ్వరాచారి, చిలుమోజు సాయికిరణ్ పాల్గొని ఆయనను ఘనంగా సన్మానించారు. బాణాపురం అయ్యప్ప దేవాలయంలో జరిగిన సాహిత్య కార్యక్రమానికి కూడా ఆయన హాజరయ్యారు. ప్రజా సాహిత్యం, సామాజిక మార్పుపై ఆయనకున్న తపన, జనగామ కళాకారుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. -
సమస్యల పరిష్కారానికి చర్యలు
● కలెక్టర్ రాహుల్‌శర్మ భూపాలపల్లి రూరల్: ప్రజావాణిలో ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్‌శర్మ ఆదేశించారు. సోమవారం 41 దరఖాస్తులను కలెక్టర్ స్వీకరించారు. ప్రతి ఫిర్యాదును జాగ్రత్తగా నమోదు చేసి, పరిష్కారం వరకు అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, ఆర్డీఓ రవి పాల్గొన్నారు. అవగాహన కలిగి ఉండాలి.. గ్రామస్థాయి పరిపాలనా విధానాలు, ప్రభుత్వ పథకాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారంపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ రాహుల్‌శర్మ తెలిపారు. శిక్షణ సివిల్ సర్వీసెస్ అధికారులతో ఐడీఓసీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సివిల్ సర్వీసెస్ శిక్షణ అధికారులకు గ్రామీణ ప్రాంతాల వాస్తవ పరిస్థితులపై ప్రత్యక్ష అనుభవం అవసరమన్నారు. పలిమెల, మహాముత్తారం మండలాల్లో అధికారులతో కలిసి ప్రాంతాలను సందర్శించి మహిళా సంఘాలు, రైతులు, యువతతో ఇంటరాక్షన్ కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఎంహెచ్ఓ మధుసూదన్, డీఈఓ రాజేందర్, డీఏఓ బాబూరావు, డీఆర్డీఓ బాలకృష్ణ, సీపీఓ బాబూరావు, సంక్షేమ అధికారి మల్లేశ్వరి పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ ధాన్యం, మొక్కజొన్న, పత్తి కొనుగోళ్లపై అన్ని కలెక్టర్లు, పౌర సరఫరాలు, వ్యవసాయ, సహకార, మార్కెట్, రవాణా శాఖలు, పౌర సరఫరాల సంస్థ అధికారులతో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీసీలో కలెక్టర్ రాహుల్‌శర్మ, అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, పౌరసరఫరాల అధికారి కిరణ్ కుమార్, డీఎం రాములు, సహకార అధికారి వాల్యనాయక్, జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు, జిల్లా రవాణాశాఖ అధికారి సంధాని పాల్గొన్నారు. -
కాళేశ్వరాలయంలో పూజలు
కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడిని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, మహదేవపూర్ పీఏసీఎస్ చైర్మన్ చల్ల తిరుపతిరెడ్డి దంపతులు సోమవారం దర్శించుకున్నారు. స్వామివారి ఆలయంలో అభిషేక పూజలు చేశారు. శ్రీశుభానందదేవి అమ్మవారి ఆలయంలో వారిని అర్చకులు సన్మానించి తీర్థప్రసాదం అందజేశారు. వారి వెంట మాజీ ఎంపీటీసీ మమత ఉన్నారు. భూపాలపల్లి అర్బన్: ఈనెల 18న జిల్లాస్థాయి యువజనోత్సవాలు నిర్వహించనున్నట్లు ఇన్చార్జ్ డీవైఎస్ఓ సీహెచ్.రఘు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో 29వ జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా జిల్లాస్థాయి యువజనోత్సవాలు, సాంస్కృతిక, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇన్నోవేషన్ అంశాలలో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మంజూర్‌నగర్‌లోని ఇల్లందు క్లబ్‌హౌస్‌లో ఈ పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. జిల్లాలోని 15నుంచి 29 సంవత్సరాలలోపు యువ కళాకారులు, యువతి, యువకులు పాల్గొనాలని సూచించారు. ఈ పోటీల్లో పాల్గొనే అంశానికి సంబంధించిన సామగ్రిని సంబంధిత కళాకారులు వెంట తీసుకురావాలన్నారు. ఈ పోటీలో పా ల్గొనేవారు బయోడేటా దరఖాస్తులను కలెక్టరేట్లోని డీవైఎస్ఓ కార్యాలయంలో అందించాలని చెప్పారు. వివరాలకు 96180 11096, 81251 13132 ఫోన్‌నంబర్లను సంప్రదించాలన్నారు. భూపాలపల్లి అర్బన్: 69వ ఎస్జీఎఫ్ ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి స్విమ్మింగ్ పోటీలను జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలోని సింగరేణి స్విమ్మింగ్ పూల్‌లో నిర్వహించినట్లు జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి జయపాల్ తెలిపారు. స్విమ్మింగ్ క్రీడా పోటీల ప్రారంభానికి సీఐ నరేష్కుమార్ హాజరయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆరు జిల్లాలకు చెందిన 150మంది విద్యార్థులు హాజరయ్యారు. ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు అండర్–14 విభాగం పెద్దపల్లి, అండర్–17 విభాగం హైదరాబాద్‌లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగరేణి స్పోర్ట్స్ సూపర్వైజర్ పర్స శ్రీనివాస్, పీడీలు రమేష్, రాజయ్య, వసంత, సురేష్, సాంబమూర్తి, శ్రీకోటి, అన్వర్‌పాషా పాల్గొన్నారు. భూపాలపల్లి అర్బన్: 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 16, 17వ తేదీల్లో జిల్లా కేంద్రంలో ఉమ్మడి జిల్లా స్థాయి క్రీడాపోటీలను నిర్వహించనున్నట్లు ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి ఎల్.జైపాల్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో అండర్–14, 17 బాల బాలికలకు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ క్రీడాపోటీలను నిర్వహించనున్లట్లు తెలిపారు. ఉమ్మడి వరంగల్ పరిధిలోని ఆరు జిల్లాల క్రీడాకారులు పాల్గొనున్నట్లు తెలిపారు. భూపాలపల్లి అర్బన్: జిల్లా స్థాయి (అస్మిత లీగ్) బాలికల అథ్లెటిక్ పోటీలను సోమవారం ఉత్సాహంగా నిర్వహించారు. జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహించిన ఈ పోటీలను ఎస్సై రవళి ప్రారంభించారు. జిల్లాస్థాయిలో ప్రతిభ కనబరిచిన వారికి పతకాలు, షీల్డ్‌లు, సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో డీవైఎస్ఓ రఽఘు, అథ్లెటిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పూతల సమ్మయ్య, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, పీడీ, పీఈటీ, సభ్యులు, కోచ్‌లు పాల్గొన్నారు. -
నిర్వహణ మరిచారు..
పార్క్‌లో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశారు. కానీ.. నిర్వహణ, సర్వీసింగ్ లేక పరికరాల్లో శబ్ధాలు వస్తున్నాయి. కొన్నింటి భాగాలు విడిపోయాయి. చిన్న పిల్లలకు అవసరమైన కొన్ని యంత్రాలను సమకూర్చాలి. అధికారులతో పాటు ప్రజలు కూడా ఓపెన్ జిమ్, పార్క్ నిర్వహణకు శ్రద్ధ చూపాలి. – తిరుపతిగౌడ్, వాకర్ భూపాలపల్లి పురపాలికలోని ఒక ఓపెన్ జిమ్‌లో యంత్రాల భాగాలు విరిగిపోవడం చూశాం. పట్టణంలో జిమ్‌లు ఎక్కడున్నాయో తెలుసుకొని వాటిని పరిశీలించి మరమ్మతుకు చర్యలు తీసుకుంటాం. అఽధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించి అవసరమైన మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తాం. నిర్వహణ మెరుగుపరిచేలా చూస్తాం. – శ్రీనివాస్, కమిషనర్ భూపాలపల్లి మున్సిపాలిటీ -
నిర్వహణ.. నిర్లక్ష్యం
జిల్లా కేంద్రంలో 2017 సంవత్సరంలో ఏర్పాటు చేసిన జయశంకర్ పార్క్‌లోని ఓపెన్ జిమ్ పూర్తిగా శిథిలావస్థకు చేరింది. అందులోని పరికరాలు పూర్తిగా విరిగిపోయి నిరుపయోగంగా మారాయి. నేలపై వేసిన మెత్తటి మ్యాట్లు ధ్వంసం కావడంతో తొలగించగా ప్రమాదకరంగా మారింది. పిల్లలు ఆడుకునే ఆటల పరికరాలు సైతం విరిగిపోవడంతో పక్కన పడేశారు. దీంతో పార్క్‌కు వచ్చే పిల్లలు ఆడుకోవడానికి పరికరాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. జయశంకర్ పార్క్‌లో విరిగిన జిమ్ వ్యాయామ పరికరాలు, పక్కన పడేసిన మెత్తటి మ్యాట్లుభూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి పట్టణంలోని ఓపెన్ జిమ్‌లలో పరికరాలు విరిగిపోవడంతో నిరుపయోగంగా మారాయి. ప్రహరీలు లేకపోవడం, ఇష్టారీతిన వాడడం, నిర్వహణ లేకపోవడంతో లక్షల రూపాయలు వెచ్చించినా పట్టణ ప్రజలకు ఉపయోగపడడం లేదు. పరికరాలకు మరమ్మతులు చేపట్టాలని ఎమ్మెల్యే, కలెక్టర్ ఆదేశించినా ఫలితం మాత్రం కనిపించడం లేదు. ఐదేళ్ల కిందట ఏర్పాటు.. భూపాలపల్లి పురపాలికలోని కాలనీలు, పార్కులు, విలీన గ్రామాలు, గ్రౌండ్లలో ఐదేళ్ల కిందట అప్పటి ప్రభుత్వం రూ.30 లక్షలు వెచ్చించి ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేసింది. ఉదయం, సాయంత్రం వేళల్లో బాలలు, వాకర్స్, మహిళలు వ్యాయామం చేసేందుకు అవసరమైన ఆధునిక పరికరాలను సమకూర్చినప్పటికీ ప్రస్తుతం నిర్వహణ, శిక్షకులు లేక మరమ్మతులకు గురయ్యాయి. పలు కాలనీలలోని జిమ్‌లకు ప్రహరీ లేకపోవడంతో పాటు ఇష్టానుసారంగా వాడటంతో కొన్ని పరికరాలు విరిగిపోయాయి. పరికరాలకు గ్రీస్ పెట్టకపోవడంతో శబ్ధం వస్తున్నాయని, విరిగిపోతున్నాయని జిమ్‌కు వచ్చే పట్టణవాసులు చెబుతున్నారు. చిన్నారులు వినియోగించే పరికరాలు లేకపోవడంతో వారు నచ్చిన రీతిలో వినియోగిస్తుండటంతో మరమ్మతులకు గురవుతున్నాయని తెలిపారు. రూ.లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసినప్పటికీ నిర్వహణ లేక శిక్షకులను నియమించకపోవడంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. వ్యాయామంపై అవగాహన ఉన్న కొందరు మాత్రం ఉన్న వాటిని సరైన రీతులలో వినియోగిస్తుండగా.. మరికొందరు తమకు వచ్చిన రీతిలో చేస్తూ మరమ్మతులకు గురిచేస్తున్నారు. ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయంటే.. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి దగ్గర పార్క్‌లోని ఓపెన్ జిమ్‌లో పలు పరికరాలు విరిగిపోయాయి. దీంతో వాటిని ఎక్కడపడితే అక్కడ పారేస్తున్నారు. కృష్ణకాలనీ, జంగేడు, కాశీంపల్లిలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌లలో నాసిరకం పరికరాలను బిగించడంతో కొద్ది రోజులకే మరమ్మతులకు గురయ్యాయి. మరమ్మతులు చేయాలని ఏడాది కింది నుంచే ఫిర్యాదులు వచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదు. పూర్తిస్థాయిలో వినియోగంలో లేక కొన్ని పరికరాల విడిభాగాలు అక్కడక్కడ పడి ఉన్నాయి. ఓపెన్ జిమ్‌ల నిర్వహణ మూన్నాళ్ల ముచ్చటగా మారడంతో పుర పాలకుల పనితీరుపై పట్టణ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని పరికరాలు అందుబాటులో ఉన్నప్పటికీ శిక్షకులు లేక అలంకారప్రాయంగా మారుతున్నాయి. ఆదేశాలు బేఖాతరు.. జయశంకర్ పార్క్‌లో పాడైన పరికరాలను బాగుచేసి వినియోగంలోకి తీసుకురావాలని కలెక్టర్ రాహుల్‌శర్మ, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పలుమార్లు పార్కును సందర్శించి మున్సిపల్ శాఖ అధికారులను ఆదేశించినప్పటికీ వారి ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. వారు ఆదేశించిన పనులు ఎంతమేరకు జరిగాయి.. ఏ స్థాయిలో ఉన్నాయో సమీక్ష చేయాల్సిన కలెక్టర్, ఎమ్మెల్యేలు సైతం మరిచిపోయినట్లు పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు. విరిగిపోతున్న పరికరాలు పట్టించుకోని అధికారులు రూ.లక్షలు వెచ్చించినా అందని సౌకర్యాలు ఎమ్మెల్యే, కలెక్టర్ ఆదేశించినా ఫలితం శూన్యం -
రాబట్టరు.. రాబందులు!
సాక్షిప్రతినిధి, వరంగల్: కీలక శాఖల్లో ఉన్నతాధికారులుగా పనిచేస్తున్న కొందరి కక్కుర్తి సర్కారు ఖజానాకు గండి పెడుతోంది. అవినీతికి మరిగిన కొందరు అధికారులు ప్రభుత్వ సొమ్మును అక్రమమార్గం పట్టిస్తున్నారు. అవినీతి నిరోధక శాఖ తరచూ దాడులు నిర్వహిస్తున్నా వారి వైఖరి మారడం లేదు. ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పౌరసరఫరాల శాఖలో పనిచేస్తున్న కొందరు ఉన్నతాధికారుల వైఖరి ప్రభుత్వ సొమ్మును వ్యాపారులకు ధారాదత్తం చేస్తోంది. రైతుల నుంచి సేకరించిన రూ.కోట్ల విలువ చేసే ధాన్యాన్ని రైస్‌మిల్లర్లకు కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కింద సరఫరా చేస్తూ.. తిరిగి రాబట్టుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా సర్కారు ధాన్యాన్ని బయట అమ్ముకుంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్న కొందరు మిల్లర్ల నుంచి ఏసీకే (290 క్వింటాళ్లకు ఒక ఏసీకే)కు రూ.25 వేల వరకు వసూలు చేస్తూ మిన్నకుంటున్నారు. ఇదే క్రమంలో ఇటీవలే కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో మూడు ఏసీకేల బియ్యం ఎగవేసిన ఓ వ్యాపారి నుంచి రూ.75 వేల లంచం తీసుకుంటూ సివిల్ సప్లయీస్ డీఎం జీవీ నర్సింహారావు ఏసీబీకి చిక్కడం కలకలం రేపుతోంది. ఏళ్లు గడుస్తున్నా ఉదాసీనతే.. ఏళ్లు గడుస్తున్నా సీఎంఆర్ రాబట్టడంలో కొందరు పౌరసరఫరాల శాఖ అధికారులు ‘మామూలు’గా తీసుకుంటున్నారు. సీఎంఆర్ దందాపై పత్రికల్లో వచ్చినప్పుడో.. లేదా ఉన్నతాధికారుల వరకు ఫిర్యాదులు వెళ్లినప్పుడో స్పందిస్తున్న పౌరసరఫరాల శాఖ నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటోంది. సీఎంఆర్ ఇవ్వని మిల్లుల్లో ఉండే ధాన్యానికి 2022–23లో టెండర్లు నిర్వహించారు. ఉమ్మడి వరంగల్‌లోని ఆరు జిల్లాల్లోని మిల్లుల్లో 2,92,585 మెట్రిక్ టన్నుల ధాన్యానికి టెండర్లు వేసిన వ్యాపారులు తెచ్చుకునేందుకు మిల్లులకు వెళ్లగా అక్కడ ఉండే ధాన్యం మాయమైంది. దీనిపై సుమారు ఏడాది పాటు ధాన్యం మాయమైన మిల్లుల యజమానులపై ఒత్తిడి తెచ్చిన అధికారులు 1,83,985 మెట్రిక్ టన్నులు రాబట్టారు. ఇంకా రూ.217 కోట్ల విలువ చేసే ధాన్యం 31మంది రైస్‌మిల్లర్ల వద్ద ఉందని పౌరసరఫరాలశాఖ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తేల్చినప్పటికీ రాబట్టడం లేదు. మిల్లర్లపై రెవెన్యూ రికవరీ, పీడీ యాక్టులు పెట్టి వసూలు చేసే అవకాశం ఉన్నప్పటికీ కేవలం 8 మిల్లులపై మొక్కుబడిగా 6ఏ కేసులతో సరిపెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. ఏసీకేల వారీగా వసూళ్లు.. 31 మంది రైస్‌మిల్లర్ల నుంచి రూ.217 కోట్ల సీఎంఆర్ ధాన్యం రాబట్టాల్సిన అధికారులు.. వాటి జోలికెళ్లడం లేదు. గత సీజన్లో అక్కడక్కడా ఆ డిఫాల్టర్లకే మళ్లీ సీఎంఆర్ ఇచ్చినట్లు ఫిర్యాదులున్నాయి. పౌరసరఫరాల శాఖ కమిషనర్, ఆయా జిల్లాల కలెక్టర్ల వరకూ వెళ్లినా విచారణ స్థాయి దాటలేదు. దీంతో సీఎంఆర్ పాత బకాయిల మాట పక్కన పెడితే.. కొత్తగా తీసుకునే వాళ్లు సైతం చాలా వరకు మొండికేస్తున్నారు. 2022–23లోని సీఎంఆర్ గడువు దాటినా.. హనుమకొండ, వరంగల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల నుంచి బియ్యం ప్రభుత్వానికి చేరలేదు. బకాయిదారుల నుంచి బియ్యం, ధాన్యం రాబట్టాల్సిన ఉన్నతాధికారులు.. ధాన్యం ఎగవేతదారులతో సంప్రదింపులు జరిపి ఏసీకేకు రూ.25 వేల చొప్పున కొందరి వద్ద ఇటీవల వసూలు చేసినట్లు తెలిసింది. వరంగల్‌కు చెందిన ఇద్దరు రైస్‌మిల్లర్ల లావాదేవీలు నిలిపివేసి పిలిపించిన పౌరసరఫరాల శాఖ అధికారి ఒకరు.. వారం రోజులకే మిల్లును తెరిపించినట్లు ఆరోపణలు ఉన్నాయి. హనుమకొండ జిల్లాలో మూడు రైసుమిల్లులకు నోటీసులు ఇచ్చి.. ఐదు రోజుల వ్యవధిలోనే లావాదేవీలకు అనుమతి ఇవ్వడం అప్పట్లో ఆ శాఖలోనే చర్చనీయాంశమైంది. ఈ సీఎంఆర్ దందాలో హస్తలాఘవం చూపుతున్న ఇద్దరు డీఎంలు, ముగ్గురు డీఎస్‌ఓలపై ఏసీబీ అడిషనల్ డీజీపీ, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌కు తాజాగా ఫిర్యాదులు వెళ్లడం కలకలం రేపుతోంది. సీఎంఆర్‌లో అక్రమాలపై ఓ వైపు ఏసీబీ మరో వైపు విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ రంగంలోకి దిగి ఆరా తీస్తుండడం ఆ శాఖ అధికారుల్లో చర్చనీయాంశమవుతోంది.పౌరసరఫరాల శాఖలో వివాదాస్పదంగా ఇద్దరు డీఎంలు, ఇద్దరు డీఎస్ఓల తీరు సీఎంఆర్ రాబట్టడంలో మీనమేషాలు.. మిల్లర్లను వెనకేసుకొస్తూ భారీగా నజరానాలు ఒక్కో ఏసీకేకు రూ.25 వేలకు పైనే.. మిల్లర్ల వద్దే 1.08 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వానికి చేరని కస్టమ్ మిల్లింగ్ రైస్.. నాలుగేళ్లుగా పెండింగ్ ఏసీబీ అడిషనల్ డీజీ వరకు ఫిర్యాదులు.. కమిషనర్ పేషీకి సీఎంఆర్ దందా -
కాళేశ్వరాలయంలో పూజలు
కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరస్వామిని ఆదిలాబాద్ జిల్లా జడ్జి కె.ప్రభాకర్‌రావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆదివారం ఆయన ఆలయానికి రాగా ఆలయ అర్చకులు రాజగోపురం వద్ద మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి గర్భగుడిలో అభిషేకం, అమ్మవారి ఆలయంలో దర్శనం చేశారు. ఆలయ అర్చకుడు శ్రావణ్కుమార్శర్మ స్వామివారి శేష వస్త్రాలతో సన్మానించారు. సినీనటుడు పూజలు సినీనటుడు మధునందన్ కుటుంబ సమేతంగా దర్శించుకుని అభిషేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీశుభానందదేవి అమ్మవారి ఆలయంలో పూజలు చేశారు. ఆశీర్వచన వేదిక వద్ద ఆయనను అర్చకుడు రాముశర్మ స్వామివారి శేషవస్త్రాలతో సన్మానించి తీర్థప్రసాదం అందజేశారు. -
కోటగుళ్ల శిల్పసంపద అద్భుతం
● ఐఏఎస్‌ల శిక్షణ బృందం ● కోటగుళ్ల సందర్శన, ప్రత్యేక పూజలుగణపురం: కోటగుళ్ల శిల్పసంపద ఎంతో అద్భుతంగా ఉందని ఐఏఎస్‌ల శిక్షణ బృందం సభ్యులు అన్నారు. ఆదివారం జిల్లా పర్యటనలో భాగంగా 12 మంది సభ్యులతో కూడిన వారి బృందం కోటగుళ్లను సందర్శించి ప్రత్యేక పూజలు చేసింది. ఆలయ అర్చకులు వారికి ఘన స్వాగతం పలికి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందచేశారు. ఆలయాన్ని సందర్శించిన వారిలో ఐఏఎస్‌ల బృందం సభ్యులు అనురాగ్ రంజన్, పటాస్ రాజ్, కృష్ణ ఝావిపశయన తన్వర్, కృష్ణసి, విశేష్ సింగ్, తుషార్ సింగ్, ఆదిత్య సింగ్, మయాంక్ ఖండేల్వాల్, మణిమాల, విశాల్ సింగ్, పవార్ అక్షయ్ విలాష్, రితాకా రాత్ ఉన్నారు. సుమారు గంట పాటు ఆలయ ప్రాంగణంలోనే గడిపి ఫొటోలు, వీడియోలు చిత్రీకరించుకున్నారు. రాతితో కట్టిన ఆలయం ఎంతో అద్భుతమని.. సందర్శించడం సంతోషంగా ఉందన్నారు. వారివెంట గణపురం ఎస్ఐ రేఖ అశోక్, మహాముత్తారం డీటీ సందీప్, గణపురం ఆర్ఐ చెక్క దేవేందర్ ఉన్నారు. -
పోటెత్తిన భక్తజనం
● కాళేశ్వరం ఆలయానికి రూ. 5.73 లక్షల ఆదాయంకాళేశ్వరం: కార్తీమాసం ఆదివారం సెలవురోజు కావడంతో కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో భక్తులు పోటెత్తారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలి వచ్చారు. తెల్లవారు జామునుంచి త్రివేణి సంగమ గోదావరిలో పుణ్యస్నానాలు, దంపతి స్నానాలు చేశారు. గోదావరి మాతకు పూజలు చేశారు. అరటి దొప్పల్లో దీపాలు వదిలి, సైకత లింగాలను పూజించారు. అనంతరం స్వామివారి ఆలయంలో అభిషేక పూజలు చేశారు. శ్రీశుభానందదేవి అమ్మవారి ఆలయంలో మహిళలు కుంకుమార్చన పూజలు చేశారు. శ్రీసరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళలు ఉసిరి చెట్టు వద్ద లక్షవత్తులు, దీపాలు వెలిగించారు. దీపారాధనలు చేసి బ్రాహ్మణోత్తములకు దీప దానం చేశారు. శ్రీసుబ్రహ్మణ్యస్వామివారి ఆలయంలో కాలసర్ప నివారణ, నవగ్రహాల వద్ద శనిపూజలను భక్తులు అధికంగా నిర్వహించారు. సాయంత్రం త్రివేణి సంగమం వద్ద గోదావరికి హారతి కార్యక్రమాన్ని అర్చకులు ఘనంగా నిర్వహించారు. సుమారుగా 30వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు అధికారుల అంచనా వేశారు. దీంతో గోదావరి తీరం, ఆలయ పరిసరాల్లో భక్తులు కిక్కిరిసి కనిపించారు. ప్రాకార ఆలయాలను దర్శించుకున్నారు. వివిధ పూజలు, లడ్డు, ప్రసాదాల ద్వార రూ. 5.73లక్షల ఆదాయం సమకూరినట్లు ఈఓ మహేష్ తెలిపారు. -
ఏర్పాట్ల పరిశీలన
పలిమెల: మండలంలోని లెంకలగడ్డ గ్రామంలో ట్రైనీ ఐఏఎస్‌ల బృందం పర్యటన నేపథ్యంలో ఆదివారం అదనపు కలెక్టర్ విజయలక్ష్మి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ట్రైనీ ఐఏఎస్ బృందం మూడురోజుల పాటు ఉండనున్న నేపథ్యంలో బృందానికి వసతుల కల్పనలో లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సాయి పవన్, ఎంపీఓ ప్రకాశ్‌రెడ్డి, ఎస్సై రమేష్ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. రెడ్డిగుడిని సందర్శించిన ‘సిరికొండ’ గణపురం: మండలకేంద్రంలోని ప్రసిద్ధ నాగలింగేశ్వర స్వామి ఆలయాన్ని (రెడ్డి గుడి) మాజీ స్పీకర్, శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ఆదివారం సందర్శించారు. కార్తీక మాస ఉత్సవాలలో భాగంగా నాగలింగేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం రాత్రి శివపార్వతుల కల్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ క్రమంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆయనను కల్యాణానికి ఆహ్వానించారు.ఆలయాన్ని సందర్శించిన ఆయనకు ఆలయ అర్చకులు భద్రయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో పురాతన ప్రసిద్ధి గాంచిన రెడ్డి గుడి అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానన్నారు. పెరిగిన చలి తీవ్రత భూపాలపల్లి అర్బన్: జిల్లా వ్యాప్తంగా మూడు రోజులుగా చలి తీవ్రత పెరిగింది. జిల్లాలో ఆదివారం ఉష్ణోగ్రతలు 20 డిగ్రీలకు పడిపోయాయి. దీంతో జిల్లాలో ఒక్కసారిగా చలి తీవ్రత పెరిగింది. ఉదయం తొమ్మిది గంటల లోపు.. సాయంత్రం ఆరు గంటల తర్వాత చలి పెరిగింది. చలి కారణంగా పట్టణ ప్రజలు సాయంత్రం కాగానే ఇళ్లకు చేరుకుంటున్నారు. చలి తీవ్రతను తట్టుకునేందుకు చలి మంటలు ప్రారంభించారు. హేమాచలుడి దర్శనానికి నిరీక్షణ మంగపేట: మంగపేట మండల పరిధిలోని మల్లూరు హేమాచల శ్రీ లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయం పోటెత్తింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం ఉదయం 8నుంచి సాయంత్రం 5గంటల వరకు భక్త జనంతో కిటకిటలాడింది. -
సర్కారు బడుల్లో కానరాని క్రీడా మైదానాలు
● క్రీడా సామగ్రి కరువు ● ఏడు పీఈటీ పోస్టులు ఖాళీకాటారం: ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడా మైదానాలు లేక విద్యార్థులు క్రీడలకు దూరమవుతున్నారు. విద్యతో పాటు క్రీడలకు సమాన ప్రాముఖ్యం కల్పించాల్సి ఉండగా.. ఆటలు ఆడుకొనే అవకాశం మాత్రం అందని ద్రాక్షగానే మారిపోయింది. మొక్కుబడిగా ఆటలు.. జిల్లాలో 428 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా సుమారు 40 పాఠశాలల్లో మినహా ఎక్కడా సరైన క్రీడా మైదానాలు లేవు. అవి కూడా అసంపూర్తి సౌకర్యాలతోనే నెలకొనడంతో ఆటలు ఆడటం విద్యార్థులకు ఇబ్బందిగా మారుతుంది. వర్షాలు కురిస్తే గ్రౌండ్లలో అడుగు పెట్టలేని దుస్థితి నెలకొంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు జనవరి 26 రిపబ్లిక్‌డే, ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురష్కరించుకొని విద్యార్థులకు మొక్కుబడిగా ఆటలు ఆడిస్తున్నారే తప్పా మెరుగైన క్రీడాకారులుగా తీర్చిదిద్దే ప్రయత్నం మాత్రం కానరావట్లేదు. ఆటవిడుపుగా అన్నట్లుగా ఏడాదికోమారు తూతూ మంత్రంగా మండల, డివిజన్, జిల్లా స్థాయిలో ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు. క్రీడా సామగ్రి కరువు.. కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలలకు స్పోర్ట్స్ ఫండ్ అందకపోవడంతో క్రీడా సామగ్రి, పరికరాలు కొనుగోలు చేయలేని పరిస్థితి ఏర్పడింది. గతంలో కొనుగోలు చేసిన క్రీడా పరికరాలను మరమ్మతు చేసుకొని విద్యార్థులు ఆటలు ఆడాల్సి వస్తుంది. ప్రధాన క్రీడలైన వాలీబాల్, క్రికెట్‌తో పాటు షాట్‌ఫుట్, జావెలిన్ త్రో, ఆర్చరీ, ఇతర అథ్లెటిక్ పరికరాలు ఏ పాఠశాలలో చూసినా కానరావడం లేదు. దీంతో విద్యార్థులు ఆటలపై మక్కువ కోల్పోతున్నారు. ఈ ఏడాది ప్రభుత్వం పీఎంశ్రీ కింద ఎంపికై న పాఠశాలలకు మినహా ఏ ప్రభుత్వ పాఠశాలకు స్పోర్ట్స్ ఫండ్ మంజూరు చేయలేదు. ఏడు పీఈటీ పోస్టులు ఖాళీ.. జిల్లాలో 37 పీఈటీ పోస్టులు ఉండగా 30 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. మరో ఏడు పీఈటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇటీవల పీఈటీలకు పీడీలుగా ప్రమోషన్ కల్పించి పలు పాఠశాలలకు నియమించగా జిల్లాలో అప్‌గ్రేడ్ పొందిన ఏడు పాఠశాలలకు వ్యాయామ ఉపాధ్యాయులు లేరు. దీంతో విద్యార్థులు క్రీడలకు దూరం కావాల్సిన పరిస్థితి నెలకొంటుంది. క్రీడలతో కూడిన బోధనజిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులతో విద్యతో పాటు క్రీడా బోధన జరిగేలా చర్యలు తీసుకుంటాం. పీఈటీలు ఆయా పాఠశాలల్లో ఉన్న సౌకర్యాల మేర విద్యార్థులకు ఆటలు ఆడిపిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడా నిర్వహణ, సామగ్రి కొనుగోలుకు త్వరలోనే స్పోర్ట్స్ ఫండ్ మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయి. – రాజేందర్, జిల్లా విద్యాశాఖ అధికారి -
కాళేశ్వరాలయంలో కార్తీక శోభ
● ఆలయానికి రూ.4.80లక్షల ఆదాయం కాళేశ్వరం: కార్తీమాసం సందర్భంగా కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో శనివారం భక్తుల సందడి నెలకొంది. త్రివేణి సంగమ గోదావరిలో పుణ్యస్నానాలు చేసి గోదావరి మాతకు పూజలు చేసి అరటి దొప్పల్లో దీపాలు వదిలారు. సైకత లింగాలు చేసి పూజించారు. అనంతరం స్వామివారి ఆలయంలో ప్రత్యేక అభిషేక పూజలు చేశారు. శ్రీశుభానందదేవి అమ్మవారి ఆలయంలో మహిళలు కుంకుమార్చన పూజలు చేశారు. ఉసిరి చెట్టు వద్ద లక్షవత్తులు, దీపాలు వెలిగించారు. దీపారాధనలు చేసి బ్రాహ్మణోత్తములకు దీప దానం చేశారు. సాయంత్రం త్రివేణి సంగమం వద్ద గోదావరికి హారతి కార్యక్రమం అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఆలయ అధికారులు భక్తులకు ఉచిత ప్రసాదం, తాగునీరు అందజేశారు. దీంతో ఆలయంలో భక్తుల సందడి కనిపించింది. సుమారుగా 20వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు అధికారుల అంచనా వేశారు. వివిధ పూజలు, లడ్డు, ప్రసాదాల ద్వారా రూ. 4.80లక్షల ఆదాయం సమకూరినట్లు ఈఓ మహేష్ తెలిపారు.


