‘ఉపాధి’ పనుల తనిఖీ | - | Sakshi
Sakshi News home page

‘ఉపాధి’ పనుల తనిఖీ

Feb 12 2026 7:36 AM | Updated on Feb 12 2026 7:36 AM

‘ఉపాధ

‘ఉపాధి’ పనుల తనిఖీ

అంతర్జాతీయ సదస్సుకు డీవైఎస్‌ఓ నకిలీ ఎలక్ట్రికల్‌ వైర్లు పట్టివేత

భూపాలపల్లి రూరల్‌: భూపాలపల్లి మండలం పెద్దాపూర్‌, సుబ్బక్కపల్లి, రామ్‌నాయక్‌ తండాలతో పాటు గుర్రంపేట గ్రామంలోని పొట్టి కుంటలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను డీఆర్డీఓ బాలకిషన్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధి పనులు చేస్తున్న కూలీలు కొలతల ప్రకారం పని చేసి రోజువారి గరిష్ట కూలి రూ.307లు పొందాలన్నారు. పని ప్రదేశంలో ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌, నీడ కోసం టెంట్‌, తాగునీరు కల్పించాలని ఫీల్డ్‌ అసిస్టెంట్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో గుర్రంపేట సర్పంచ్‌ కోడూరు రమేష్‌, వార్డు మెంబర్‌ అరవింద్‌, అధికారులు, ఏపీఓ రావుల కిరణ్‌, పీఓ, టెక్నికల్‌ అసిస్టెంట్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్‌, ఉపాధి కూలీలు తదితరులు పాల్గొన్నారు.

రామప్పలో

విదేశీయుల సందడి

వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని బుధవారం సింగపూర్‌, అమెరికా, జపాన్‌ దేశాలకు చెందిన మేరి, జాన్‌ బోమెన్‌, యోహీ మోబర్ల్‌ సందర్శించారు. రామలింగేశ్వరస్వామిని వారు దర్శించుకోగా పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్‌ విజయ్‌కుమార్‌ వివరించగా రామప్ప శిల్ప కళ సంపద బాగుందని కొనియాడారు.

వరంగల్‌ స్పోర్ట్స్‌: ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు గోవాలో నిర్వహించనున్న ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పోర్ట్స్‌ సైన్స్‌ అంతర్జాతీయ సదస్సుకు హనుమకొండ జిల్లా యువజన, క్రీడాభివృద్ధి అధికారి గుగులోతు అశోక్‌కుమార్‌ ఎంపికయ్యారు. కాకతీయ యూనివర్సిటీ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ చైర్మన్‌, ఎన్‌ఐటీ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ రవికుమార్‌ వద్ద ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌లో పీహెచ్‌డీ చేస్తున్న అశోక్‌కుమార్‌ సదస్సులో శ్రీది లైఫ్‌ అండ్‌ అచీవ్‌మెంట్‌ ఆఫ్‌ ఠాకూర్‌ దేవ్‌ సింగ్‌శ్రీ అంశంపై పేపర్‌ ప్రజెంటేషన్‌ చేయనున్నారు. ఈసందర్భంగా అశోక్‌కుమార్‌ను గైడ్‌ రవికుమార్‌, ఒలింపిక్స్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు అజీజ్‌ఖాన్‌, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు, పీడీలు, పీఈటీలు, కోచ్‌లు తదితరులు అభినందించారు.

వరంగల్‌ క్రైం: అడ్డదారిలో డబ్బులు సంపాదించాలని భవన నిర్మాణ రంగంలో వాడే బ్రాండెడ్‌ కంపెనీ అయిన గోల్డ్‌ మెడల్‌ కంపెనీని పోలిన నకిలీ వైర్లు విక్రయిస్తున్నాడో వ్యాపారి. పక్కా సమాచారంతో డబ్బాల సమీపంలోని అర్భుద ఎలక్ట్రికల్స్‌ అండ్‌ శానిటరీలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు, హనుమకొండ పోలీసులు బుధవారం సంయుక్తంగా దాడులు నిర్వహించారు. రూ.3.59 లక్షల నకిలీ వైర్లను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ మధుసూదన్‌ తెలిపారు. షాప్‌ యజమాని కంతి లాల్‌ అరెస్ట్‌ చేసి తదుపరి విచారణ నిమిత్తం హనుమకొండ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. ఈదాడుల్లో టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.రాజు, ఎస్సై భానుప్రకాశ్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

‘ఉపాధి’ పనుల తనిఖీ1
1/3

‘ఉపాధి’ పనుల తనిఖీ

‘ఉపాధి’ పనుల తనిఖీ2
2/3

‘ఉపాధి’ పనుల తనిఖీ

‘ఉపాధి’ పనుల తనిఖీ3
3/3

‘ఉపాధి’ పనుల తనిఖీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement