అగ్గితో బుగ్గి! | - | Sakshi
Sakshi News home page

అగ్గితో బుగ్గి!

Apr 3 2026 7:38 AM | Updated on Apr 3 2026 7:38 AM

అగ్గితో బుగ్గి! అప్రమత్తంగా ఉండాలి అభివృద్ధిలో భాగస్వాములు కావాలి

న్యూస్‌రీల్‌

ఖాళీలు ఇలా..

అధికారుల సూచనలు..

శుక్రవారం శ్రీ 3 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026
ఫైర్‌స్టేషన్లలో వేధిస్తున్న సిబ్బంది కొరత

ఆరుగురు విద్యార్థుల

గైర్హాజరు

భూపాలపల్లి అర్బన్‌: పదో తరగతి వార్షిక పరీక్షల్లో భాగంగా గురువారం నిర్వహించిన భౌతిక శాస్త్ర పరీక్షకు ఆరుగురు విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇన్‌చార్జ్‌ విద్యాశాఖ అధికారి రాజేందర్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 3,544 మంది విద్యార్థులకు 3538 మంది హాజరైనట్లు తెలిపారు.

సమస్యలు

పరిష్కరించేదెప్పుడో..

భూపాలపల్లి అర్బన్‌: సింగరేణి కార్మికుల సమస్యలకు ఎప్పుడు పరిష్కారం దొరుకుతుందని సింగరేణి కాలరీస్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సీఐటీయూ) బ్రాంచ్‌ కార్యదర్శి కంపేటి రాజయ్య విమర్శించారు. ఈ మేరకు గురువారం ఏరియాలోని కేటీకే 6వ గనిలో కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ.. మున్సిపాలిటీ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి ఇచ్చిన మెడికల్‌ బోర్డు నిర్వహణ హామీ ఇప్పటికీ అమలు కాలేదని అన్నారు. అసెంబ్లీ వేదికగా సింగరేణి కార్మికుల దీర్ఘకాలిక సమస్యలు అయిన అలవెన్సులు, ఆదాయపన్ను మాఫీ, సొంత ఇంటికల, మారుపేర్ల, ఇతర అంశాలకు పరిష్కారం దొరుకుతుందని భావించిన కార్మికుల ఆశలు నెరవేరలేదన్నారు. వేజ్‌బోర్డులో చేసుకున్న ఒప్పందాలు కూడా ఇప్పటివరకు అమలు కాలేదని, గెలిచిన సంఘాలు వాటిని అమలు చేయించడంలో విఫలమయ్యాయని విమర్శించారు. గుర్తింపు సంఘమైన ఏఐటీయూసీ యాజమాన్యంపై ఒత్తిడి తీసుకురాలేకపోయిందన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి కాలరీస్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర కమిటీ సభ్యులు కుమ్మరి శ్రీనివాస్‌, శ్రీకాంత్‌, తోట రమేష్‌, బాబురావు పాల్గొన్నారు.

‘విస్తారాకులతో

ఆరోగ్యానికి మేలు’

ఎస్‌ఎస్‌తాడ్వాయి: అడవుల్లో సహజంగా లభించే ఆకులతో తయారు చేసిన విస్తరాలతో ఆరోగ్యానికి ఎంతో మేలని ప్రపంచ పర్యావరణ సంస్థ జిల్లా అధ్యక్షుడు బొల్లు నగేంద్రకుమార్‌ అన్నారు. మండల పరిధిలోని కామారంలోని సమ్మక్క–సారలమ్మ ఆర్గానిక్‌ విస్తరాకుల తయారు సంఘం భవనాన్ని గురువారం సందర్శించి మాట్లాడారు. పాలిథిన్‌ కవర్లతో ఉన్న పేపర్‌ పేట్ల వినియోగాన్ని మానుకుని పర్యావరణానికి మేలు చేసే సహజ విస్తరాలను వినియోగించాలని సూచించారు. విస్తరాకులు తయారు చేస్తూ ఉపాధి పొందుతున్న సంఘం సభ్యులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షురాలు కొర్నెబెల్లి కవిత, సభ్యులు రేగ అనూష, కోరం ఇందు, పూర్ణ, సోలం అన్నపూర్ణ, రేగ సరళ, శ్రీదేవి నాగమణి, రేగ స్వాతి పాల్గొన్నారు.

తాత్కాలిక అంతరాయం

ములుగు: సర్వర్‌ నిర్వహణ పనుల నేపథ్యంలో నేటి(శుక్రవారం) రాత్రి 10 గంటల నుంచి ఏప్రిల్‌ 5 ఉదయం 8 గంటల వరకు మీ సేవ ఆన్‌లైన్‌ సేవలకు తాత్కాలిక అంతరాయం ఏర్పడుతుందని కలెక్టర్‌ టీఎస్‌.దివాకర గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సర్వర్‌ పనితీరు మెరుగుదల, భద్రత వ్యవస్థల సాంకేతిక సమస్యల నివారణకు సర్వర్‌ పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

కాళేశ్వరం: వేసవి కావడంతో ఎండలు దంచికొడుతున్నాయి. ఏమరపాటున ఉంటే విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌, అగ్గిరవ్వలతో ప్రమాదం పొంచి ఉంది. చిన్న పొరపాట్లు పెద్ద ఆస్తి నష్టానికి, ప్రాణాల మీదకు దారి తీస్తాయి. ప్రజలను, ఆస్తులను అగ్నికి ఆహుతి కాకుండా కాపాడే ఫైర్‌స్టేషన్‌లో సిబ్బంది కొరత వేధిస్తుంది. భూపాలపల్లి, మహదేవపూర్‌ ఫైర్‌ స్టేషన్‌లలో సిబ్బంది కొరత వెక్కిరిస్తుంది. భూపాలపల్లిలో ఫైర్‌ స్టేషన్‌ మున్సిపల్‌ కార్యాలయంలో నిర్వహిస్తుండగా, అదే చోట మహదేవపూర్‌కు కేటాయించిన కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. దీంతో రెండు ఫైర్‌స్టేషన్‌లను పక్కా భవనాలు లేక ఒకే చోట నిర్వహిస్తున్నారు. భూపాలపల్లిలో రేగొండ, కొత్తపల్లిగోరి, చిట్యాల, మొగుళ్లపల్లి, టేకుమట్ల, కాటారం డివిజన్‌లోని మహదేవపూర్‌ ఫైర్‌స్టేషన్‌ కాటారం, మహాముత్తారం, పలిమెల, మల్హర్‌ మండలాలకు సేవలందించాలి. కానీ దూరభారం కావడంతో ఫైరింజన్‌ వచ్చే వరకు బూడిదవుతుందని విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో గతేడాది నుంచి ఈ ఏడాది వరకు 52 ప్రమాదాలు జరిగాయి. ఇందులో రూ.10కోట్ల వరకు ఆస్తినష్టం జరిగింది. ఇందులో ఫైర్‌ సిబ్బంది రూ.20కోట్లకుపైగా ఆస్తిని కాపాడారు. ఎలాంటి ప్రాణనష్టమూ జరుగలేదు.

101కాల్‌ వస్తే ఆలస్యమే..

అరకొర సౌకర్యాలు, సిబ్బంది కొరత తీవ్రంగా ఉండడంతో అక్కడ ప్రత్యేక భవనాలు లేకపోవడంతో అన్ని కార్యకలాపాలు భూపాలపల్లి నుంచే నిర్వహిస్తున్నారు. 101కు అత్యవసర సమయాల్లో స్పందించడం ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రజల ప్రాణ భద్రతకు కీలకమైన ఫైర్‌ సర్వీసులే ఇలాంటి సమస్యలతో నడవడం వల్ల ప్రజలకు ఆందోళన కలుగుతుంది. అధికారులు తక్షణమే భవనాల నిర్మాణాన్ని పూర్తి చేసి, ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది. ఉన్నతాధికారులు దృష్టిసారించాలని పలువురు కోరుతున్నారు.

భూపాలపల్లి, మహదేవపూర్‌ ఫైర్‌ స్టేషన్‌లు ఒకే చోట సేవలందిస్తున్నాయి. ప్రజలకు అందుబాటులో ఉన్నాం. 101కు కాల్‌ చేస్తే నిమిషాల వ్యవధిలో ప్రమాదం జరిగిన చోటుకు చేరుతాం. ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండాలి. విద్యుత్‌ కనెక్షన్‌ కెపాసిటీని పెంచుకోవాలి. సిబ్బంది కొరత ఉన్నా ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం.

– శ్రీనివాస్‌, భూపాలపల్లి ఫైర్‌స్టేషన్‌ ఆఫీసర్‌

రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క

ములుగు/వెంకటాపురం(ఎం)/ గోవిందరావుపేట: గ్రామాల అభివృద్ధిలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. ములుగు మున్సిపాలిటీలోని 6వ వార్డులో ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ చింతనిప్పుల చంద్రకళ అధ్యక్షతన గురువారం నిర్వహించిన వార్డు సభకు సీతక్క హాజరై మాట్లాడారు. రెండేళ్లలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల లబ్ధిని వివరించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పనిచేస్తామని తెలిపారు. నూతనంగా ఏర్పడిన ములుగు మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించడానికి రూ.1.25కోట్లతో ప్రత్యేక వాహనాలను కొనుగోలు చేయడమే కాకుండా రూ.50 కోట్లతో సీసీ రోడ్లు, సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టం పనులను ఈనెల 15 నుంచి ప్రారంభించనున్నట్లు వివరించారు. జిల్లా వ్యాప్తంగా మహిళా సంఘాల సభ్యులకు రూ.57 వేల కోట్ల రూపాయల వడ్డీలేని రుణాలను అందించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ సంపత్‌ రావు, జిల్లా గ్రంథాలయం చైర్మన్‌ రవిచందర్‌, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ కల్యాణి తదితరులు పాల్గొన్నారు.

సర్వాయి పాపన్న చిత్ర పటానికి పూలమాల వేస్తున్న ఎమ్మెల్యే సత్యనారాయణరావు

భూపాలపల్లి: బహుజన వీరుడు సర్ధార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ అని, ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన సర్వాయి పాపన్న గౌడ్‌ వర్ధంతి వేడుకలకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని సర్వాయి పాపన్నగౌడ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహుజన వీరుడు పాపన్న గౌడ్‌ గొప్ప స్వాతంత్య్ర సమర యోధుడని కొనియాడారు. కుల, మత, జాతి విభేదాలు లేకుండా సమసమాజ నిర్మాణ స్థాపన కోసం పోరాటం చేసిన పోరాట యోధుడు పాపన్నగౌడ్‌ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ విజయలక్ష్మి, బీసీ సంక్షేమ అధికారి ఇందిర, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజబాబు, వివిధ కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఏమరపాటున ఉంటే

అంతా బూడిదే

భూపాలపల్లి,

మహదేవపూర్‌లో

భవనాల లేమి

వేసవిలో

ప్రతియేటా

రూ.కోట్ల

ఆస్తి నష్టం

సూచనలు

పాటించా

లంటున్న

అధికారులు

భూపాపల్లి ఫైర్‌స్టేషన్‌లో 17 పోస్టులకు, 4 ఖాళీలు, మహదేవపూర్‌లో 18 పోస్టు మంజూరు కాగా 14 ఖాళీలు ఉన్నాయి. కాటారం డివిజన్‌లో ఏడాదిన్నరగా మహదేవపూర్‌ ఫైర్‌స్టేషన్‌ మంజూరైనా సేవలు మాత్రం భూపాలపల్లి నుంచి కొనసాగుతున్నాయి. కనీసం ప్రభుత్వ భవనం లేక మహదేవపూర్‌ ప్రాంతానికి ఫైర్‌ సేవలు అందడం లేదు.

కాల్చిన అగ్గిపుల్లలు, సిగరెట్లు, బీడీలను ఆర్పేసిన తరువాత పారేయాలి. చెత్త, గడ్డి, పూరిగుడిసెల వద్ద పారేయరాదు.

ఇంట్లో ఎక్కువ రోజులు ఉండని పక్షంలో విద్యుత్‌ మెయిన్‌ ఆఫ్‌ చేయాలి.

వంట గదిలో గాలి, వెలుతురు ఉండేలా చూసుకోవాలి.

ఇళ్లకు గడ్డి వాములు సుమారు 60 అడుగుల దూరంలో పెట్టుకోవాలి.

పూరింట్లో నివసించే వారు వంట పూర్తయిన వెంటనే పొయ్యిలో నిప్పును ఆర్పేయాలి.

వేసవిలో ఉదయం 8గంటల లోపు, సాయంత్రం ఆరు గంటల తరువాత కట్టెలపొయ్యిని ఉపయోగించవద్దు.

గ్యాస్‌ సిలిండర్ల దగ్గర పెట్రోల్‌, డిజీల్‌, కిరోసిన్‌ వంటి మండే లిక్విడ్‌లు ఉంచరావు.

వంట పూర్తయితే వెంటనే రెగ్యులేటర్‌ ఆఫ్‌ చేయాలి.

అపార్ట్‌మెంట్లు, కర్మాగారాలు, గోదాములు, గిడ్డంగుల్లో అగ్నిమాపక సూచనలు విధిగా పాటిస్తే ప్రమాదాలు నివారించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement