భూపాలపల్లి అర్బన్: కేంద్ర ప్రభుత్వం అమలు చేసే నాలుగు లేబర్ కోడ్స్ విధానాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ (ిసీఐటీయూ) ఆధ్వర్యంలో బుధవారం ఏరియాలోని కేటీకే–5 గనిలో నల్లబ్యాడ్జీలు, నల్లజెండాలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ బ్రాంచ్ కార్యదర్శి కంపేటి రాజయ్య మాట్లాడుతూ నూతనంగా కేంద్రం తీసుకువచ్చిన లేబర్ కోడ్‌ల అమలుతో కార్మికులకు, కార్మిక సంఘాలకు ఎటువంటి చట్టపరమైన హక్కులు లేకుండా పోతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం లేబర్ కోడ్‌ల అమలుపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్, బాబురావు, రమేష్‌లు పాల్గొన్నారు.
ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో..
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లేబర్ కోడ్స్‌ను రద్దు చేసి పాత కార్మిక చట్టాలను కొనసాగించాలని గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం (ఐఎఫ్‌టీయూ) డిమాండ్ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం ఏరియాలోని ఓపెన్‌కాస్ట్–2, 1వ గనుల్లో కార్మికులకు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. అనంతరం గనుల మేనేజర్లకు వినతి పత్రాలు అందించారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణ, డివిజన్ అధ్యక్షుడు సమ్మయ్య, కార్యదర్శి నర్సింగ్, నాయకులు నవీన్, దుర్గం సమ్మయ్య, అర్జున్‌లాల్ తదితరులు పాల్గొన్నారు.


