న్యూస్‌రీల్
జిల్లాలో 97,570 ఎకరాల్లో వరిసాగు
గురువారం శ్రీ 2 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
భూపాలపల్లి రూరల్: జిల్లాలో యాసంగి వరి సాగు చివరి దశకు చేరుకోవడంతో జిల్లా యంత్రాంగం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. ఎప్పటిలాగే ఐకేపీ, సహకార సంఘాల ఆధ్వర్యంలో కొనుగోళ్లు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ప్రస్తుత యాసంగిలో 97,570 ఎకరాల్లో వరి సాగైంది. మరో 15 రోజుల్లో వరికోతలు ప్రారంభం కానుండటంతో కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు.
దిగుబడి అంచనా..
జిల్లాలో యాసంగి సీజన్‌లో 1.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. అందులో 80 శాతం దొడ్డు ధాన్యం, 20 శాతం సన్నధాన్యం రానున్నట్లు అధికారులు అంచనా వేశారు,
పెరగనున్న కొనుగోలు కేంద్రాలు
యాసంగి సీజన్‌లో దిగుబడి అధికంగా వస్తున్నందున దానికి అనుగుణంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. గత సంవత్సరం 160 కొనుగోలు కేంద్రాల వరకు ఏర్పాటు చేయగా ఈసారి 185 వరకు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అవసరాన్ని బట్టి ఎక్కడైతే ధాన్యం అధికంగా వస్తుందో అక్కడ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశాల మేరకు రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన ప్రధాన శాఖల అధికారులు, మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. యాసంగి కొనుగోళ్లలో ఎక్కడ ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టేలా ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు
బ్లాక్ లిస్టులో ఉన్న మిల్లులకు ధాన్యం లేదు..
జిల్లాలో మూడు మిల్లులు బ్లాక్ లిస్టులో ఉన్నందున ఆ మిల్లులకు పోయే ధాన్యాన్ని ఇతర మిల్లులకు మళ్లించి కొనుగోళ్లు చేపట్టనున్నారు. ధాన్యం రవాణా విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా మిల్లుల ఎంపిక, లారీల ఏర్పాటుపై అధికారులు దృష్టి సారించనున్నారు. తూకం యంత్రాలతో పాటు టార్పాలిన్లు, గన్నీబ్యాగులు, టెంట్లు, ఇతర పరికరాలను సమకూర్చుతున్నారు. జిల్లాకు 3 లక్షల వరకు వరకు గన్నీ బ్యాగులు అవసరం ఉంటాయని అంచనా వేశారు. అందులో ఇప్పటికే జిల్లాలో 20 లక్షల వరకు గన్నీ బ్యాగులు సిద్ధంగా ఉన్నా యి. మిగతా వాటిని సమకూర్చుకునే కార్యాచరణపై అధికారులు నివేదికలు సిద్ధం చేశారు.
185 కొనుగోలు కేంద్రాల
ఏర్పాటుకు చర్యలు
1.60 లక్షలు మెట్రిక్ టన్నుల
ధాన్యం సేకరణ లక్ష్యం
ఏర్పాట్లలో నిమగ్నమైన
అధికార యంత్రాంగం


