అభివృద్ధి పనుల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పనుల పరిశీలన

Apr 2 2026 8:28 AM | Updated on Apr 2 2026 8:28 AM

పలిమెల: మండలంలోని చేపట్టిన అభివృద్ధి పనులను అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) విజయలక్ష్మి బుధవారం పరిశీలించారు. పలిమెల గ్రామంలో నిర్మాణంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి జూన్‌ 2వ తేదీలోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం గ్రామ పంచాయతీ నర్సరీని సందర్శించి పలు సూచనలు చేశారు. పలిమెల పల్లె దవాఖానాను సందర్శించి ప్రారంభోత్సవానికి 99 రోజుల ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. అలాగే నీలంపల్లి గ్రామ పంచాయతీలోని సబ్‌ సెంటర్‌ నిర్మాణం ప్రారంభించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ మధుసూదన్‌, పంచాయతీరాజ్‌ ఈఈ వెంకటేశ్వర్లు, డీఈ సాయిలు, ఎంపీడీఓ రవీంద్రనాథ్‌, మెడికల్‌ ఆఫీసర్లు కల్యాణి, రఘురాం, ఏపీఎం రాజలింగం తదితరులు పాల్గొన్నారు.

పీహెచ్‌సీ తనిఖీ

కాళేశ్వరం: మహదేవపూర్‌ మండలం అంబట్‌పల్లి లోని పీహెచ్‌సీని అడిషనల్‌ కలెక్టర్‌ విజయలక్ష్మి ఆకస్మికంగా తనిఖీ చేశారు. బుధవారం పీహెచ్‌సీలోని వైద్యులు, సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. సమయపాలన పాటించాలని, రోగులకు అందుబాటులో ఉండాలన్నారు. ఆమె వెంట జిల్లా వైద్యాధికారి మధుసూదన్‌, డాక్టర్‌ కల్యాణి, జగదీష్‌ కన్నా త దితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement