జస్ట్‌ తాళి కడుతుండగా షాకింగ్‌ న్యూస్‌, వరుడు మాత్రం ! | Minutes before wedding bride Pallavi suddenly stopped In Karnataka | Sakshi
Sakshi News home page

జస్ట్‌ తాళి కడుతుండగా షాకింగ్‌ న్యూస్‌, వరుడు మాత్రం !

Apr 3 2026 5:48 PM | Updated on Apr 3 2026 6:25 PM

Minutes before wedding bride Pallavi suddenly stopped In Karnataka

కర్ణాటకలోని హాసన్ జిల్లాలో ఒక వివాహ వేడుకలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సరిగ్గా తాళి కట్టే సమయానికి  కొన్ని నిమిషాల ముందు, వధువు పల్లవి అకస్మాత్తుగా పెళ్లిని ఆపేసింది. దీంతో  పెళ్లి కొడుకుతోపాటు, అందరూ షాకయ్యారు. వధువు  ఎందుకలా చేసింది?  చివరికి ఏమైంది? ఇలాంటి మీ అనుమానాలకు, సందేహాలకు సమాధానం దొరకాలంటే..ఈ కథనాన్ని చదివేయండి మరి.

బంధువుమిత్రులు, బాజా భజంత్రీల మధ్య వరుడు వేణుగోపాల్‌ తాళి కట్టడానికి రెడీ అయ్యాడు. ఇంతలో సినిమా ఫక్కిలో నాకీ పెళ్లి ఇష్టం లేదంటూ భయపడుతూనే ధైర్యం చేసి మెల్లగా చెప్పింది వధువు పల్లవి. దీంతో అందరూ ఒకింత దిగ్భ్రాంతికి, మరింత గందర గోళానికి గురయ్యారు.

అసలు ఏం జరిగింది? 
అపుడు అసలు విషయం తాపీగా చెప్పింది. తాను వేరొకరిని ప్రేమిస్తున్నానని,  అయితే ప్రేమించిన వ్యక్తి వేరే కులానికి చెందినవాడని, అందుకే ఈ విషయాన్ని ముందుగా తన కుటుంబానికి చెప్పలేకపోయానని కళ్ళనీళ్లతో చెప్పింది. ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని, వరుడికి,  ఆమె తన కుటుంబ సభ్యులకు చెప్పింది. అయినా ఆమె తల్లిదండ్రులు, బంధువులు ఆమెను ఒప్పించడానికి ప్రయత్నించారు, కానీ ఆమె తన మనసు మార్చుకోలేదు.

వరుడు  ఏం చేశాడు?
అయితే  వరుడి స్పందన మరింత విశేషంగా నిలిచింది.  వధువు మానసకి పరిస్థితిని అర్థం చేసుకున్న వరుణ వేణుగోపాల్‌ ఆమె పట్ల  సానుకూలంగా స్పందించాడు. తాను ప్రేమించని వారిని పెళ్లి చేసుకోమని ఎవరినీ బలవంతం చేయనని  ​స్పష్టం చేశాడు. ఈ స్టోరీని ఒక ఎక్స్‌యూజర్‌ వరుడికి హ్యాట్యాఫ్‌ అంటూ పోస్ట్‌ చేశారు. దీంతో నెటిజనులనుంచి కూడా సానుకూల స్పందన లభించింది. 

నెటిజన్లు స్పందన
ఈ క్రెడిట్‌కు పల్లవికి కూడా దక్కుతుంది.  ఎలాగైతేనేం ధైర్యం చేసి  తన ప్రేమకోసం ధైర్యంగా నిలబడింది. అలాగే వరుడు కూడా ఎలాంటి డ్రామా  క్రియేట్‌ చేయకుండా పరిస్థితిని అర్థం చేసుక్నాడని ఒకరు, వావ్, ఇద్దరికీ అభినందనలు! తన ప్రేమ కోసం నిలబడిన పల్లవికి, పరిస్థితిని అర్థం చేసుకున్న వేణుగోపాలకు. ఇదే నిజమైన పరిణితి, గౌరవం అంటూ ఒకరు కమెంట్‌ చేశారు.  అంతేకాదు ఇంతదాగా ఎందుకు లాగాలని కొందరంటే.. ఒకే బెటర్‌ నెవర్‌ దేన్‌ లేట్‌,  అబ్బాయ్‌ సేఫ్‌.. బతికిపోయాడు బిడ్డ ఇలాంటి ఫన్నీ కామెంట్లు వెల్లువెత్తడం గమనార్హం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement