భవానీ సహిత గణపేశ్వరుడి కల్యాణం | - | Sakshi
Sakshi News home page

భవానీ సహిత గణపేశ్వరుడి కల్యాణం

Feb 16 2026 7:23 AM | Updated on Feb 16 2026 7:23 AM

భవానీ సహిత గణపేశ్వరుడి కల్యాణం

భవానీ సహిత గణపేశ్వరుడి కల్యాణం

భవానీ సహిత గణపేశ్వరుడి కల్యాణం

గణపురంలోని గణపేశ్వరాలయం శివ నామస్మరణతో మారుమోగింది. ఆలయ అర్చకులు నాగరాజు ఆధ్వర్యంలో గణపేశ్వరస్వామికి రుద్రాభిషేకం నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి స్వామి వారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గణపేశ్వరుడిని ప్రత్యేకంగా అలంకరించారు. రాత్రి స్వామి వారి కల్యాణం ఆలయ ధర్మకర్త అట్లూరి పావన రాజ్యలక్ష్మీనరసింహారావు దంపతులతో అర్చకుల బృందం నేత్ర పర్వంగా నిర్వహించగా భక్తులు కన్నుల పండుగగా తిలకించారు. జాగరణకు వచ్చిన భక్తుల కోసం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అదనపు కలెక్టర్‌ విజయలక్ష్మి దంపతులు, డీఎస్పీ అవిరినేని సంపత్‌ రావు దంపతులు పూజల్లో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement