వాల్‌పోస్టర్ ఆవిష్కరణ
రేగొండ: మండలంలోని కోటంచలో నిర్వహించనున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ పున:ప్రతిష్ట మహోత్సవం, స్వామి వారి బ్రహ్మోత్సవాల వాల్‌పోస్టర్‌ను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవాలయాలు ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలకు కేంద్ర బిందువుగా నిలుస్తున్నాయన్నారు. స్వామి వారి ఆలయ పునఃప్రతిష్ట మహోత్సవం, బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో ప్రజలు హాజరు కావాలని కోరారు. అనంతరం గడిపల్లి శివాలయంలో నిర్వహించిన శివరాత్రి వేడుకలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నాయినేని సంపత్‌రావు, నాయకులు ఉమేష్ గౌడ్, భిక్షపతి, రవీందర్ రావు, శ్రీనివాస్, సాంబయ్య పాల్గొన్నారు.


