విద్యాశాఖ అధికారులు తనిఖీ చేయాలి
జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. ఫీజులు చెల్లించాలని విద్యార్థులను వేధింపులకు గురి చేస్తున్నారు. నర్సరీ నుంచి పదో తరగతి వరకు ప్రతీ పరీక్షకు ముందు ఫీజుల పేరుతో వేధిస్తున్నారు. ఫీజు కోసం పొద్దంతా ఎండలో నిల్చోపెడుతూ, పరీక్ష రాయనీయడం లేదు. కొంత మందిని ఇంటి వద్ద వ్యాన్లు ఎక్కించుకోవడం లేదు. జిల్లా, మండల విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి నిబంధనలు పాటించని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి. – నేరెళ్ల జోసఫ్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి


