ఘనంగా లింగోద్భవపూజ
కాళేశ్వరం: మహాశివరాత్రి సందర్భంగా కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో ఆదివారం అర్ధరాత్రి వేదపండితులు లింగోద్భవ పూజా కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యేక అభిషేకాలు, రుద్రపఠనాలతో ఆలయం మారుమోగింది. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివార్లను దర్శించుకుని మారెడు దళాలు సమర్పించారు. అనంతరం చండీహోమం, కాళరాత్రి హోమాలు నిర్వహించారు. ఈఓ మహేష్, సర్పంచ్ మోహన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
పూజలో పాల్గొన్న మంత్రి..
శివరాత్రి సందర్భంగా లింగోద్భవ పూజలో రాష్ట్ర ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పాల్గొని విశేష అభిషేక, అర్చనలు చేశారు. ఆయనకు రాజగోపురం వద్ద మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. అనంతరం గర్భగుడిలో (కాళేశ్వర ముక్తీశ్వరులు) ద్విలింగాలకు మారెడు దళాలు సమర్పించారు. అనంతరం ఆలయంలో ఆయనను అర్చకులు శేషవస్త్రాలతో సన్మానించారు. అర్చకులు తీర్థప్రసాదం అందజేశారు. ఆయన వెంట నాయకులు ఉన్నారు. పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
చలివేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి
మహదేవపూర్ మండల కేంద్రంలో చలివేంద్రాన్ని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆదివారం రాత్రి ప్రారంభించారు. కాళేశ్వరం వస్తున్న సందర్భంగా మహదేవపూర్‌లో వేసవి దృష్ట్యా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రారంభించారు. ఆయన వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, సర్పంచ్ హసీనభాను, నాయకులు కటకం అశోక్ తదితరులు ఉన్నారు.
పాల్గొన్న ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
ఘనంగా లింగోద్భవపూజ


