Orissa
-
‘అత్యాచారాలు అరికట్టాలి’
జయపురం: రాష్ట్రంలో మహిళల భద్రత, రక్షణ, సమాజంలో సమానత, 33 శాతం రిజర్వేషన్లు తదితర డిమాండ్లతో ఆదివారం జయపురంలో బీజేడీ మహిళా విభాగం వారు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి రబినారాయణ నందో సతీమణి కొరాపుట్ కేంద్ర సహకార బ్యాంక్ మాజీ అధ్యక్షురాలు ఇందిర నందో నేతృత్వంలో వందలాది మంది మహిళా కార్యకర్తలు పార్టీ శ్రేణులు పాల్గొన్న మహిళా అధికార్ అభిజాన్ ర్యాలీ రాజనగర్ కూడలి నుంచి బయలు దేరి పట్టణంలో పలు వీధుల్లో మీదుగా పంచానన మందిర ప్రాంతానికి చేరుకుంది. అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో పలువురు మహిళా నేతలు జిల్లా మహిళా బీజేడీ అధ్యక్షురాలు పార్వతీ మస్తి, ఉపాధ్యక్షురాలు లిలి బురుడితోపాటు మాజీ మంత్రి రబినారాయణ నందో, కొరాపుట్ జిల్లా బీజేడీ కార్యనిర్వాహక అధ్యక్షులు దుర్గా ప్రసాద్ మిశ్ర, కొరాపుట్ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు రాధా బినోద్ సామంతరాయ్, జిల్లా బీజేడీ ఉపాధ్యక్షులు నాగరాజు దొర తదితరులు పాల్గొన్నారు. -
నిఖిల్ హత్య కేసులో 9 మంది అరెస్టు
● పథకం ప్రకారమే హత్య: ఎస్పీరాయగడ: స్థానిక రెల్లివీధికి చెందిన హడప నిఖిల్ (17) అనే యువకుడి హత్య కేసుకు సంబంధించి పోలీసులు 9 మంది నిందితులను అరెస్టు చేశారు. అంతర్రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన ప్రత్యేక మాన్ హంట్‌లో 9 మంది నిందితులను అరెస్టు చేశామని మరో 12 మందిని అరెస్టు చేసే ప్రక్రియలో దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఎస్పీ స్వాతి ఎస్ కుమార్ తెలియజేశారు. ఆదివారం స్థానిక డీపీఓ కార్యాలయం సమావేశంలో హత్య కేసుకు సంబంధించి నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆమె పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి అరెస్టయిన వారిలో ప్రధాన నిందితుడు స్థానిక రైతుల కాలనీకి చెందిన 8 వ లైన్లో నివసిస్తున్న ఉమేష్ చంద్ర హియల్, దొరాగుడ పోలీస్ స్టేషన్ పరిధిలొని కంపర గ్రామానికి చెందిన విల్సన్ సిమిలి అలాయాస్ రాజ్ సిమిలి, స్థానిక స్వీపర్ కాలనీలో నివాసముంటున్న అక్షయ సామల్ అలియాస్ టింకులు, తుంబిగుడ ప్రాంతానికి చెందిన రాజా హుయిక, కళాశాల సమీపంలో గల ఎస్ఆర్ టవర్ ప్రాంతానికి చెందిన సుమిత్ జైన్, దొభివీధికి చెందిన వై.శ్యామసుందర్, కొంధొపిట్ల వీధికి చెందిన వి.లొకేష్ కుమార్, హౌసింగ్ బొర్డుకు చెందిన బి.పవన్‌కుమార్, సాయిప్రియ నగర్ కు చెందిన ఎస్.ప్రేమ్ కుమార్ లు ఉన్నట్లు వెల్లడించారు. నిందితుల్లో ఉమేష్, విల్సన్, అక్షయ్లను బీహార్ రాష్ట్రంలో గల ఔరంగబాద్‌లో అరెస్టు చేసినట్లు ఎస్పీ వివరించారు. అరెస్టయిన నిందితుల నుంచి స్కార్పియో, మహేంద్ర బొలేరొ వాహనాలతొ పాటు ఒక తుపాకీ, 11 మొబైల్ ఫోన్లు, క్రెడిట్, డెబిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. పథకం ప్రకారమే హత్య మే తొమ్మిదో తేదీ ఉదయం స్థానికంగా గల ఒక హోటల్లో నిందితులు సమావేశమయ్యారు. ఎలా హత్య చేయాలని అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి ప్రధాన నిందితుడు ఉమేష్ వ్యూహత్మకంగా అందరికి తెలియజేశాడు. పథకం అనుకున్న పథకం ప్రకారం తొమ్మిదో తేదీ రాత్రి సుమారు పదిన్నర గంటల ప్రాంతంలో స్థానిక ఇందిరా నగర్ మూడు లైన్లో ఏదొ పనిమీద ఉన్న నిఖిల్ హడపను నిందితులు గుర్తించారు. అనంతరం అతనిని హత్య చేసేందుకు వెంబడించారు. ఈ క్రమంలో రెండు రౌండ్ల ను నిఖిల్ పై కాల్పులు జరిపారు. అయితే అప్పటికే తనను వెంటాడుతున్నాడన్న విషయం తెలుసుకున్న నిఖిల్ వారి బారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఇందిరా నగర్లో ఒకరి ఇంటిలోకి వెళ్లాడు. అప్పటికే నిందితులు అది గమనించి నిఖిల్ ను పట్టుకుని తమ వెంట తీసుకువచ్చిన బొలేరొలొ తీసుకువెళ్లారు. మరుసటి రొజు స్థానిక నాగావళి నది వద్ద నిఖిల్ మృతదేహం గుర్తించారు. అయితే నిందితులు నిఖిల్‌ను తుపాకీ సహాయంతొ హత్య చేశారని, మృతదేహం నుండి రెండు తుపాకీ గుళ్లను గుర్తించినట్లు ఎస్పీ వెల్లడించారు. పాత వైరమే హత్యకు దారి తీసింది నిఖిల్ హత్య కు పాత కక్షలే కారణమని పోలీసులు వెల్లడించారు. కొరాపుట్ జిల్లా అలమండ ప్రాంతంలో జరిగిన జూదం కేసుకు సంబంధించి విభేదాలే ఈ హత్యకు కారణంగా ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని ఎస్పీ వివరించారు. ఈ సందర్భంగా ఎస్పీ స్వాతి మాట్లాడుతూ ఐపీఎస్ ప్రత్యక్ష పర్యవేక్షనలొ ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదనపు ఎస్పీ రామేంద్ర ప్రసాద్ సాంకేతిక నిఘా, అదనపు ఎస్పీ మనోజ్ పూజారి మానవ నిఘా విభాగాల సహాయంతొ రాష్ట్రంలొని పలు ప్రాంతాలతొ పాటు ఇతర రాష్ట్రాల్లొ ఈ బృందాలు మోహరించి నిందితుల కొసం గాలింపు చేపట్టామని ఎస్పీ వివరించారు. ఇదిలాఉండగా నిందితులకు సహకరించిన వారిపై కూడా చర్యలు ప్రారంభించినట్లు ఎస్పీ తెలిపారు. నిందితులను ఆశ్రయించడం, డబ్బులు పంపడం, ఆధారాలు ధ్వంసం చేయడం వంటి ఆంశాలపై విచారణ కొనసాగుతుందని త్వరలో హత్య కేసులో ఉన్న మిగతా వారిని కూడా త్వరలో పట్టుకుంటామని అన్నారు. సమావేశంలో ఏఎస్పీ మనొజ్ పూజారి, ఏఎస్పీ రామేంద్ర కుమార్, ఎస్డీపీఓ గౌరహరి సాహు, సదరు పోలీస్ స్టేషన్ ఐఐసి ప్రశన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
505 లీటర్ల డీజిల్ స్వాధీనం
భువనేశ్వర్: రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌పై రాష్ట్ర ప్రభుత్వం దాడులు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా భువనేశ్వర్ శివార్లలోని పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ బృందాలు అక్రమంగా నిల్వ ఉంచిన 505 లీటర్ల డీజిల్‌ను స్వాధీనం చేసుకున్నాయి. అనధికార ఇంధన వ్యాపారంపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు ఖుర్ధా జిల్లా కలెక్టర్ అమృత్ రుతురాజ్ ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. అధికారుల కథనం ప్రకారం డీజిల్, పెట్రోల్‌ను నిల్వ ఉంచుతున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న అనేక పెట్రోల్ పంపులు, అక్రమ నిల్వ కేంద్రాలపై జిల్లా పౌర సరఫరాల అధికారి, భువనేశ్వర్ సహాయ పౌర సరఫరాల అధికారి, బలియంత పౌర సరఫరాల ఇన్స్పెక్టర్, బలిపట్న పౌర సరఫరాల ఇన్స్పెక్టర్లతో కూడిన ఒక ప్రత్యేక బృందం దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో నిరంజన్ నాయక్, బుల్లూ ప్రధాన్, పూరణ్ ప్రధాన్, సుశాంత్ కుమార్ చౌదరి, తపన్ కుమార్ సాహు, మరో 5 మంది నుంచి 505 లీటర్ల అక్రమ నిల్వ డీజిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ ఇంధన వ్యాపారంలో ఉపయోగించే కొలత పాత్రలు, ఇతర పరికరాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల వద్ద పంపిణీ లైసెన్సులు గానీ, అగ్నిమాపక సేవల శాఖ నుంచి తప్పనిసరి క్లియరెన్స్ సర్టిఫికెట్లు లేవని అధికారులు తెలిపారు. వారు అక్రమ లాభాలు ఆర్జించే ఉద్దేశంతో జనసాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో లీటరు డీజిల్‌ను రూ. 140 చొప్పున విక్రయిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఖుర్దా జిల్లా పౌర సరఫరాల అధికారి జ్ఞానేంద్ర మిశ్రా, సహాయ పౌర సరఫరాల అధికారి సునీతా బెహరా, బలియంత పౌర సరఫరాల ఇనస్పెక్టర్ అలకా రాణి మల్లిక్, బలిపట్న పౌర సరఫరాల ఇన్స్పెక్టర్ నేత్రానంద బెహరాల సమక్షంలో ఈ దాడులు జరిగాయి. -
కాంగ్రెస్ దివిటీల ర్యాలీ
జయపురం: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాలనను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ దివిటీలతో ర్యాలీ నిర్వహించింది. జయపురం సబ్‌డివిజన్ కొట్‌పాడ్ పట్టణంలో శనివారం సాయంత్రం నిర్వహించిన ర్యాలీలో ప్రధాన మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్లమెంట్లో మహిళలకు సంబంధించిన 33 శాతం రిజర్వేషన్ బిల్లు ఓటమిపై ప్రతిపక్షాలను నిందిస్తున్న బీజేపీ పాలకులు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మహిళలను మోసగిస్తున్నారని, ఆ బిల్లు 2023 లోనే లోక్ సభలో పాసైనా ఎందుకు అమలు చేయటం లేదని ప్రశ్నించారు. ఇది మహిళలను మోసం చేయటం కాదా అని ప్రశ్నించారు. బీజేపీ పాలనలో బీజేపీ నేతలే అత్యాచారాలు చేస్తున్నారని, అయినా ప్రధాని స్పందించడం లేదని, నీట్ ప్రశ్న పత్రం లీకై ందని అయినా నోరు విప్పడం లేదని అన్నారు. కొట్‌పాడ్ కాంగ్రెస్ కార్యాలయం నుంచి బయల్దేరి మహాత్మా గాంధీ విగ్రహం వద్దకు చేరి అక్కడ బహిరంగ సభ నిర్వహించారు. అనామ్ దియాన్, కొట్‌పాడ్ నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్(ఎన్.ఎ.సి) చైర్మన్ ఎమ్.శంకర రావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత న్యాయవాది సంఘ అధ్యక్షుడు మణి ప్రసాద్ పట్నాయిక్, కాంగ్రెస్ నేతలు మనోహర బిశాయి,శంకర పండ, రహెమాన్ ఖాన్,యూసఫ్ ఆలీ, నవీణ బిశాయి, జితేంధ్ర మహాపాత్రో తదితరులు పాల్గొన్నారు. జయపురంలో జనాక్రోశ్ ర్యాలీ జయపురం: జయపురం సమితి డొంగరచించి గ్రామంలో బీజేపీ మహిళా మోర్చ ఆదివారం జనాక్రోస్ ర్యాలీ నిర్వహించింది. కొరాపుట్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు ప్రభారి సుదాంశు శేఖర జెన పర్యవేక్షణలో బీజేపీ మండల అధ్యక్షులు ధీనబందు ప్రధాన్ నేతృత్వంలో ర్యాలీ జరిగింది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ శాశ్వత సభ్యులు గౌతమ సామంత రాయ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళల రిజర్వేషన్ బిల్లు విపక్షాలు వ్యతిరేకించడం ద్రోహమని అన్నారు. కార్యక్రమంలో జిల్లా బీజేపీ మహిళ మోర్చా అధ్యక్షురాలు స్వాతీ హొత, ఉపాధ్యక్షురాలు సీమా కరణొ, సభ్యులు సుకల్ దేయి గదబ, రామ గదబ, భవానీ రెడ్డి, సునీత గదబ, మొతీ చపాడీ, రాధా రాణ, గాయిత్రీ నాయిక్, హీరామణి హరిజన్ తదితరులు పాల్గొన్నారు. -
వెంటాడుతున్న ఇంధన కొరత!
జయపురం: రాష్ట్రంలో పెట్రోలు, డీజల్‌కు కొరత లేదని అధికారులు చెబుతున్నారు. అయితే పరిస్థితి మాత్రం అందుకుభిన్నంగా ఉంది. ఏ పెట్రోలు పంపు వద్ద చూసిన వాహనదారులు బారులుదీరుతున్నారు. దీనిపై జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడ సమితి ప్రజలు మండిపడుతున్నారు. అనేక పెట్రోలు బంక్‌లలో ఇంధనం లభించటం లేదని, పలుచోట్ల నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. బొరిగుమ్మ పెట్రోలు బంక్‌లో పరిస్థితి మరింత దారుణంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. ఆయిల్ కోసం వెళ్తున్న వాహనదారులు, డ్రైవర్లు ఆయిల్ లభించక నిరాశతో బంకుల నుంచి వెనుదిరుగుతున్నారు. అయితే బంకుల్లో లభించని పెట్రోలు, డీజిల్ బయట మార్కెట్లో అధిక ధరకు లభిస్తుందని ఆరోపిస్తున్నారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నా సివిల్ సప్లై అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. అధికారులు ప్రత్యేక దృష్టిసారించి పరిస్థితిని చక్కదిద్దాలని వినియోదారులు కోరుతున్నారు.పోలీస్–మేజిస్ట్రేట్ సంయుక్త సమన్వయ సమావేశం మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లాలో భద్రతా చర్యలు కట్టుదిట్టం కావాలని కలెక్టర్ ప్రథమేశ్ అర్వింద్ పిలుపునిచ్చారు. శాంతిభద్రతలు అదుపు చేయడానికి ఎస్పీ వినోద్ పటేల్ శనివారం పోలీసు–మేజిస్ట్రేట్ సంయుక్త సమన్వయ సమావేశం నిర్వహించారు. సమావేశంలో అంతర్గత భద్రతపై చర్చించారు. ప్రభుత్వ లేదా ప్రైవేట్ భూముల సర్వే సమయంలో తహసీల్దార్‌కు పూర్తిస్థాయి బలగాలు అందించాలన్నారు. బాలల అక్రమ రవాణా భువనేశ్వర్: రైల్వే పోలీసులు బాలాసోర్ జిల్లా సొరొ రైల్వే స్టేషన్లో బాలల అక్రమ రవాణా కలకలం రేపుతోంది. అంగుల్ వెళ్లే రైలు కోసం సొరో స్టేషన్లో గుమి గూడి వేచి ఉన్న బాలల్ని ప్రశ్నించిన రైల్వే పోలీసులు వీరి రవాణా పట్ల అనుమానం వ్యక్తం చేశారు. సాధారణ తనిఖీలో భాగంగా విధులు నిర్వహిస్తుండగా అనుమానంతో రైల్వే పోలీసులు బాలల్ని ప్రశ్నించారు. మతపరమైన ప్రసంగాలు, ప్రార్థనలు వినడానికి ఒక సమావేశానికి తమను తీసుకువెళ్తున్నారని పిల్లలు వెల్లడించారు. ఈ నేపథ్యంలో 27 మంది బాలలను సంరక్షించి బాలాసోర్ చైల్డ్ లైన్‌కు అప్పగించారు. వారిలో 9 నుంచి 15 ఏళ్ల వయస్సు గల 19 మంది బాలికలు, 8 మంది బాలురు ఉన్నారు. వీరంతా మయూర్భంజ్ జిల్లా కప్తీపడా పోలీస్ ఠాణా పరిధిలోని తులుగడియా, ఔపొడా, మరియు ఢెంకనాల్ సహా వివిధ ప్రాంతాలకు చెందినవారు. మూడు రోజుల మతపరమైన సమావేశంలో పాల్గొనేందుకు వారిని అంగుల్‌కు తీసుకువెళ్తున్నట్లు ప్రాథమిక సమాచారం. వారిని తీసుకు వస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. -
ఆదివాసీ కుటుంబాలకు నిత్యావసరాల పంపిణీ
రాయగడ: స్థానిక శక్తి సంస్థ ఆధ్వర్యంలో పలు ఆదివాసీ కుటుంబాలకు నిత్యావసరాలను శనివారం పంపిణీ చేశారు. స్థానిక కొత్తపేటలోని సంస్థ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో రాయగడ సమితి పరిధిలోని కూలిగుడ, తర్లాబడి గ్రామాలకు చెందిన 50 మంది ఆదివాసీ కుటుంబాలు పాల్గొన్నాయి. రాయగడ ఎంఎల్ఏ అప్పల స్వామి కడ్రక హాజరై వీరికి ఆహార ధాన్యాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శక్తి సంస్థ చేపడుతున్న ప్రజాహిత కార్యక్రమాలు ఆదివాసీ కుటుంబాల అభ్యున్నతికి ఎంతో దోహదపడుతున్నాయన్నారు. సంస్థ డైరెక్టర్ రమేష్ చంద్ర నాయక్ మాట్లాడుతూ.. రాయగడ, రామనగుడ సమితుల్లో ప్రీ స్యూల్ విద్యలో భాగంగా 200 మంది చిన్నారులు ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందుతున్నారని వివరించారు. చిన్నారులకు రోజూ పాలు, బిస్కెట్లు, అందించడంతొ పాటు శీతాకాల దుస్తులు, సంవత్సరానికి మూడు జతల దుస్తులు పంపిణీ చేస్తున్నామన్నారు. అలాగే ప్రతీ కుటుంబానికి ఏడాదికి రెండు సార్లు బియ్యం, పప్పుదినుసులు అందిస్తూ పిల్లలకు ప్రాధమిక విద్యను అందిస్తున్నట్టు తెలియజేశారు. -
బిల్లులు అదుపు!
విద్యుత్ పొదుపు.. ● ఎండలు నేపథ్యంలో భారీగా పెరుగుతున్న బిల్లులు ● పొదుపు చర్యలు పాటించాలంటున్న అధికారులు హిరమండలం: వేసవి ఎండలు ఠారెత్తిస్తున్న ప్రస్తుత తరుణంలో ఫ్యాన్లు, ఏసీల వినియోగం బాగా పెరిగింది. దీంతో విద్యుత్ బిల్లుల మోత మోగిపోతోంది. ఈ నేపథ్యంలో వేసవిలో విద్యుత్‌ను ఆదా చేసేందుకు ఉన్న అన్ని రకాల అవకాశాలను వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. ప్రస్తుతం అన్నివర్గాల వారు తమ స్థాయిని బట్టి వేడి నుంచి ఉపశమనం పొందే విద్యుత్ పరికరాల వాడకం పెంచారు. వాస్తవానికి వేసవిలో విద్యుత్ వాడకం అధికంగానే ఉంటుంది. గతంలో పోల్చుకుంటే కూటమి ప్రభుత్వంలో ట్రూఆప్ చార్జీల పేరిట విద్యుత్ బిల్లుల మోత మోగుతోంది. ఈ తరుణంలో బిల్లుల భారం నుంచి కొంత మేర ఉపశమనం పొందేందుకు పొదుపు ఒక్కటే సరైన మార్గమని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఎల్ఈడీలు మేలు.. వీలైంతవరకు పగటి పూట విద్యుత్ బల్బులు వాడకాన్ని తగ్గించుకోవాలి. సహజ వెలుగులో భాగంగా సూర్యరశ్మి ఇళ్లల్లోకి వచ్చేలా ఏర్పాటు చేసుకోవడం మేలు. దీని వల్ల మిటమిన్–డీ తో పాటు స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించవచ్చు. ఫిల్మెంట్ బల్బులకు బదులు 8 రెట్లు అధిక సామర్థ్యంతో పనిచేసే ఎల్ఈడీలను వినియోగించాలి. ట్యూబులైట్లకు ఎలక్ట్రానిక్ చోక్ అమర్చుకోవడం వల్ల విద్యుత్‌ను ఆదాచేయవచ్చు. ఫ్యాన్లు వాడేటప్పుడు రెగ్యులేటర్లను ఏర్పాటు చేసుకోవాలి. ఫ్రిజ్‌లు.. రిఫ్రిజిరేటర్ల వాడకంతో అధిక విద్యుత్ ఖర్చయ్యే అవకాశముంది. దీనిని నివారించేందుకు ఫ్రిజ్ తలుపులు అధికంగా తెరవకూడదు. ఫ్రిజ్ థర్మో స్టార్ట్ మధ్యస్తంగా ఉంచుకోవాలి. ఫ్రిజ్‌లను వేడి అధికంగా ఉండే ప్రదేశాల్లో కాకుండా నీడ ప్రదేశంలో ఉంచడం వల్ల త్వరితగతంగా చల్లబడి విద్యుత్ ఆదా అవుతోంది. గోడలకు ఫ్రిజ్‌ను ఆనించి ఉంచరాదని నిపుణులు సూచిస్తున్నారు. ఏసీలు.. సామాన్యమైన చల్లదనానికి 26 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద ఎయిర్ కండీషనర్ వాడకంతో విద్యుత్ ఆదా అవుతుంది. ఒక్కో సెంటీగ్రేడ్ తగ్గించుకోవడం వల్ల 8 శాతం విద్యుత్ ఆదా అవుతుంది. ఏసీ ఫిల్టర్లను నెలకోసారి శుభ్రం చేసుకోవడం వల్ల కూడా విద్యుత్ ఖర్చు తగ్గించుకోవచ్చు. వాషింగ్ మెషీన్లు, గీజర్లు.. వాషింగ్ మెషీన్లు వాడకం వల్ల కూడా అధిక విద్యుత్ బిల్లులు వచ్చే అవకాశం ఉంది. దీనిని తగ్గించుకునేందుకు మెషీన్ టైమర్లను సక్రమంగా అనుసరించడం, ఎలక్ట్రిక్ డ్రైయింగ్ ద్వారా కాకుండా దుస్తులను ఉతికిన తరువాత వాటిని తీసి ఆరుబయట ఎండలో ఆరవేసుకోవడం మేలు. సాయంత్రం 6 నుంచి 10 గంటల సమయంలో వాషింగ్ మెషీన్ల వాడకం తగ్గించుకోవాలి. గీజర్లు విషయంలో అవసరమున్నప్పుడు మాత్రమే వాడటం మంచిది. దీనికి కూడా థర్మోస్టాట్ 35 నుంచి 45 డిగ్రీల మధ్యలో ఉంచాలి. విద్యుత్‌ను ఆదా చేయడమంటే ఉత్పత్తి చేయడంగా భావించాలి. వేసవిలో విద్యుత్ పొదుపుగా వాడటం మంచిది. ఇలా చేయడం వల్ల ఆర్థికంగా లాభపడవచ్చు. ఇప్పటికే మా సిబ్బంది విద్యుత్ పొదుపుపై అవగాహన కల్పిస్తున్నారు. పొదుపు,జాగ్రత్తల వల్ల మాత్రమే విద్యుత్ ఆదా సాధ్యమవుతంది. – జి.ప్రసాదరావు, విద్యుత్ శాఖ డీఈ, పాతపట్నం -
పశువుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లాలోని చిత్రకొండ, కలిమెల ప్రాంతాల్లోని ఆవులను కొంతమంది వ్యాపారులు కొనుగోలు చేసి పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రా, తెలంగాణలోని కబేళాలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. శనివారం రాత్రి 2 గంటల సమయంలో పశువులను అక్రమంగా తరలిసున్నారనే సమాచారం తెలుకున్న మల్కన్‌గిరి సనాతనీ గ్రూప్, భజరంగ్ దళానికి చెందిన కొంతమంది యువకులు కలిమెల పంచాయతీ పరిధిలో గల అలసిగూడ గ్రామ సమీపంలోని పునిమేట్ల ప్రాంతం నుంచి హైదరాబాద్ వైపు తరలిస్తున్న 15 ఆవులను అడ్డుకున్నారు. ఆవులను నడిపిస్తూ తీసుకెళ్తున్న కాలిగూడ గ్రామానికి చెందిన కరా ముక్త, మందాపల్లి గ్రామానికి చెందిన యోగ హల్బా అనే ఇద్దరు యువకులను పట్టుకున్నారు. ఈ విషయాన్ని కలిమెల పోలీసు స్టేషన్లో ఆదివారం ఉదయం ఫిర్యాదు చేశారు. ఎస్ఐ విజయ్ కుమార్ మాఝి సంఘటనా స్థలానికి చేరుకొని ఆవులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరేస్టు చేసి కేసు నమోదు చేశారు. పూర్తి విచారణ అనంతరం కోర్టుకు తరలిస్తామని తెలిపారు. -
ప్రతిరోజు ప్రాక్టీస్..
మా తల్లిదండ్రులు సాలిన కిషోర్. వాణి. నాన్న రవాణాశాఖలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. మాది ఇచ్ఛాపురం. శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ బీకాం ఫస్టియర్ చదువుతున్నాను. సీనియర్స్ విభాగంలో ఆడాను. ఏసీఏ స్టేట్ ప్రాబబుల్స్‌కు ఎంపికయ్యాను. విజయనగరంలో అండర్–19 జోనల్ మ్యాచ్‌లు ఆడాను. ఇకెట్ కీపర్ కమ్ బ్యాటర్ కావడంతో అవకాశాలు వస్తున్నాయి. – సాలిన జాహ్నవి, డిగ్రీ ఫస్టియర్, ఇచ్ఛాపురం ● -
ఉన్నత చదువులకు అవకాశం
అనాథ విద్యార్థుల.. పర్లాకిమిడి: గజపతి జిల్లా శిశు సురక్షా సమితి ఆధ్వర్యంలో కరోనా సమయంలో తల్లిదండ్రులు లేని అనాధలను చేరదీసి వారికి వివిధ ఉన్నత పాఠశాలల్లో చదివించి ఇటీవల పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన 36 మందికి అధికారులు అభినందనలు తెలిపారు. గజపతి జిల్లా కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ముఖ్యఅతిథిగా ఏడీఎం ఫల్గుణి మఝి, జిల్లా అత్యవసర అధికారి బినాయక్ రౌళో, శిశు సంక్షేమశాఖ అధికారి అమియ త్రిపాఠి, జిల్లా సాంస్కృతిక శాఖ అధికారి అర్చనా మంగరాజ్, జిల్లా ఉపాధి అధికారి సౌభాగ్య స్మృతి రంజన్ త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని కాశీనగర్, గుమ్మా, పర్లాకమిడి, గుసాని, నువాగడ సమితిల నుంచి 85 మంది టెన్త్ పాసైన అనాధ విద్యార్థులు పాల్గొన్నారు. అనాధ విద్యార్థుల భవిష్యత్‌కు పునాదులు వేయడానికి భువనేశ్వర్ నుంచి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మ్యానేజిమెంట్ (ఐ.హెచ్.యం.), క్యాటరింగ్ టెక్నాలజీ, అప్లైడ్ న్యూట్రిషన్, ప్రతినిధి అవినాష్ దాస్, గుమ్మ ఐ.టి.ఐ, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ తదితరులు టెన్త్ పాసైన విద్యార్థులకు వారి కళాశాలలో సీట్లు ఇవ్వడానికి ముందుకువచ్చారు. వారికి ఐ.టి.ఐ. పాలిటెక్నిక్ కళాశాలలో సీట్లు ఇవ్వడానికి అంగీకరించేందుకు జిల్లా యంత్రాంగం ధన్యవాదాలు తెలిపింది. -
రాయగడలో జనాగ్రహ ర్యాలీ
● తరలివచ్చిన బీజేపీ మహిళా శ్రేణులురాయగడ: మహిళల వ్యతిరేక విధానాలకు నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో మహిళా జనాగ్రహయాత్రను రాయగడలో ఆదివారం నిర్వహించారు. మహిళల హక్కులు, సంక్షేమం, సాధికారత అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ర్యాలీ చేశారు. రాయగడ నగర బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో అధికసంఖ్యలో మహిళలు భాగస్వాములయ్యారు. స్థానిక జ్యోతిమహాల్ కూడలి నుంచి కపిలాస్ కూడలి వరకు భారీ ర్యాలీ, పాదయాత్రను చేపట్టారు. మహిళల ప్రయోజనాలకు విరుద్ధంగా కాంగ్రెస్, బీజేడీ, ఇతర పార్టీలు వ్యవహరిస్తున్నాయని నినాదాలు చేశారు. కార్యకరమంలో జిల్లా అధ్యక్షుడు టి.గొపిఆనంద్, పట్టణ అధ్యక్షుడు రాజేష్ కుమార్ పాణిగ్రహి, నగర మహిళా మోర్చా అధ్యక్షురాలు రచన సాహు, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు రజిత కొరడ పాల్గొన్నారు. -
మహిళా కోచ్‌లు..
వేసవి క్రీడా శిక్షణా శిబిరాల్లో సాధన కోసం నెలరోజులపాటు ఇక్కడ ఉంటున్నాం. మహిళా క్రికెట్ కోచ్‌లు కూడా ఉన్నారు. ఫిట్నెస్తోపాటు క్రికెట్లో మెలకువలు నేర్పిస్తున్నారు. మాది స్వస్థలం రణస్థలం దగ్గర కేశవరావునిపాలెం గ్రామం. ఇంటర్ చదువుతున్నాను. మా తల్లిదండ్రులు రామారావు, శ్రావణి. రెండేళ్లగా జోనల్‌స్థాయి వరకు ఆడుతున్నాను. – చేబోలు నిధి, ఇంటర్ విద్యార్థిని, కేశవరావునిపాలెం, రణస్థలం,● -
జయపురం వరకు పొడిగించాలని డిమాండ్
పూరీ–కొరాపుట్ రైలును..జయపురం: కేంద్ర ప్రభుత్వం శ్రీక్షేత్రం పూరీ నుంచి శబరిశ్రీ క్షేత్రం కొరాపుట్ వరకు రైలును నడిపేందుకు నిర్ణయించిన విషయం విదితమే. అందుకు హర్షం వ్యక్తం చేసిన జయపురం సబ్‌డివిజన్ ప్రజలు పూరీ నుంచి కొరాపుట్ వరకే కాకుండా అవిభక్త కొరాపుట్‌లో ప్రధాన పట్టణం జయపురం వరకు ఆ రైలు నడపాలని పట్టణ ప్రజలు, పలు సంస్థల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ విభాగానికి పలు సంస్థలు ప్రముఖులు లేఖలు రాశారు. తమ డిమాండ్‌ను పరిగణలోనికి తీసుకొని జయపురం వరకు పూరీ–కొరాపుట్ రైలు పొడిగించాలని డిమాండ్ చేశారు. ఉత్తర ఒడిశాతో కొరాపుట్– జయపురంను రైలు అనుసంధానం కోసం ఒడిశా ప్రభుత్వం అవసరమైన సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పూరీ– కొరాపుట్ రైలు కేవలం కొరాపుట్ వరకే నడుస్తుందని, దానిని జయపురం వరకు పొడిగిస్తే జయపురం సబ్‌డివిజన్, మల్కనగిరి, నవరంగపూర్ జిల్లాల ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. జయపురం పట్టణం పర్యాటక, వ్యాపార, వాణిజ్య రంగాలకు కేంద్రంగా ఉండటం వలన అనేక ప్రాంతాల నుంచి ప్రజలు వస్తుంటారన్నారు. వైద్య, విద్యా, తదితర పనులపై నవరంగపూర్, మల్కన్‌గిరి జిల్లాల నుంచి అనేక మంది ప్రజలు వస్తుంటారన్నారు. నవరంగపూర్, మల్కన్‌గిరి ప్రజలు రైలు ప్రయాణం కోసం జయపురంపైనే ఆధారపడుతున్నారన్నారు. ఆర్థికంగా వెనకబడి ఉన్న ఈ ప్రాంత ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు ఉత్తర ఒడిశా ప్రాంతాలకు వెళ్లాలంటే రైలు ప్రయాణం చౌకగా ఉంటుందన్నారు. కేంద్ర రైల్వే విభాగం వారు జయపురం– మల్కనగిరి, జయపురం నవరంగపూర్ రైలు మార్గాలు ఆమోదించిందని, ఈ రెండు రైలు మార్గాల పనులు చురుగ్గా సాగుతున్నాయని, అందుచేత జయపురం ఒక ప్రధాన రైల్వే జంక్షన్ కాగలదని తెలుపుతూ, భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని పూరీ– కొరాపుట్ రైలును జయపురం వరకు పొడిగిస్తే కొరాపుట్‌లో ప్రయాణికుల రద్దీ తగ్గుతుందన్నారు. -
తుది దశకు చేరిన ఫిడే రేటింగ్ చెస్ టోర్నీ
శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం వేదికగా జరుగుతున్న చెస్ పోటీలు తుది దశకు చేరుకున్నాయి. జిల్లా చెస్ అసోసియేషన్ సారథ్యంలో సీఎస్ఎన్ ట్రస్ట్, గీతా చెస్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీకాకుళంలోని గ్రాండ్ కన్వెన్షన్ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్ చెస్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చెస్ క్రీడాకారులు ముందంజలో ఉన్నారు. వీరికి తెలంగాణ, ఒడిస్సా, కర్ణాటక క్రీడాకారులు గట్టిపోటీనిస్తున్నారు. నాలుగో రోజు ఆదివారం ఆమదాలవలస ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ పోటీలను ప్రారంభించారు. క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ చెస్ క్రీడాకారుల మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుందని, మంచి చిర్ణయాలు తీసుకోవడంలో ముందుంటారని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో ఇంత పెద్ద చెస్ టోర్నమెంట్ నిర్వహించడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో టీడీపీ ఎన్ఆర్ఐ వింగ్ మహిళా అధ్యక్షురాలు సారూప్య(అమెరికా), ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ సుధీర్, టోర్నమెంట్ కన్వీనర్ హెచ్.ఉపేంద్ర సీఐ, జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు బగాది కిషోర్, కెవీ జ్వాలాముఖి, సీఎన్ ట్రస్ట్ ట్రస్టీ తాండ్ర సునీల్, టోర్నమెంట్ డైరెక్టర్ సనపల భీమారావు తదితరులు పాల్గొన్నారు. -
అరసవల్లిలో జ్యేష్ఠమాస సందడి
అరసవల్లి: ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఆదివారం జ్యేష్ట మాస సందడి కనిపించింది. స్థానికులతో పాటు ఇతర జిల్లాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చి ఆదిత్యునికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా సూర్యనమస్కారాల పూజలు చేయించుకున్నారు. మరికొందరు తలనీలాలను సమర్పించారు. ఇంద్రపుష్కరిణి ఒడ్డున గ్రామీణ ప్రాంత మహిళలు సంప్రదాయ పూజలు చేశారు. రావిచెట్టు వద్ద దీపాలను పెట్టుకుని పెసలు, మొలకలు, మామిడి పళ్లు వంటి ప్రసాదాలను స్వామికి నివేదించారు. ఆలయ ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్ ఆధ్వర్యంలో భక్తులకు ఎండ నుంచి రక్షణ చర్యలు చేపట్టారు. ఆలయంలో రూ.300 టికెట్‌తో అంతరాలయ దర్శనం కల్పించారు. ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో భక్తులకు గోత్రనామలతో పూజలు జరిపించారు. -
మేముసైతం!
మహిళా క్రికెట్లో.. శ్రీకాకుళం న్యూకాలనీ: సిక్కోలు జిల్లా గ్రామీణ క్రీడలకు పెట్టింది పేరు. ఇప్పుడు ఆ కోవలో అనేక క్రీడలతోపాటు క్రికెట్ కూడా వచ్చి చేరింది. రంజీతోపాటు ఐపీఎల్‌కు కూడా ఎంపికై న క్రీడాకారులు ఉన్నారు. జిల్లా క్రికెట్ సంఘం ప్రోత్సాహంతో క్రీడాకారులు రెట్టించిన ఉత్సాహంతో రాణిస్తున్నారు. భారత మహిళా క్రికెట్ జట్టు స్ఫూర్తితో జిల్లాలో మహిళా క్రికెట్‌పై మక్కువ పెంచుకుంటున్నారు బాలికలు. గత మూడేళ్లగా జిల్లాలో మహిళా క్రికెట్ క్రీడాకారిణులు రాణిస్తున్నారు. ‘సమ్మర్ క్యాంప్’లో సాధన.. ఈ కొత్త సీజన్లో ప్రతి ఒక్కరూ లక్ష్యాలను ఏర్పరచుకున్నారు. అందుకు వేసవి క్రీడా శిక్షణా శిబిరాలను వేదికగా ఎంచుకున్నారు. మహిళా క్రికెటర్ల సాధన కోసం శ్రీకాకుళంలోని ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో ఇటీవల ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ఏర్పాటు చేసిన క్రికెట్ అకాడమీ కమ్ నెట్స్‌లో ఉదయం, సాయంత్రం కఠోర సాధన చేస్తున్నారు. బౌలింగ్, బ్యాటింగ్‌తోపాటు ఫీల్డింగ్‌లో మహిళా క్రికెట్ కోచ్‌లు మెలకువలు నేర్పిస్తున్నారు. ఫిట్‌నెస్‌పై కూడా ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నారు. జిల్లా క్రికెట్ సంఘం మెంటార్, సీనియర్ వెటరన్ ప్లేయర్ ఇలియాస్ మహ్మద్ ప్రతి ఆదివారం ప్రాక్టీస్ సెషన్‌కు హాజరవుతూ క్రీడాకారిణులను ప్రోత్సహిస్తున్నారు. వారు మరింత మెరుగుపడేలా సీనియర్ కోచ్‌లను తెప్పిస్తున్నారు. ప్రైమరీ పాఠశాలల్లో చదువుతున్న చదువుతున్న చిన్నారులు సైతం ప్రాక్టీసులకు హాజరవుతుండటం విశేషం. -
నిత్యాన్నదాన పథకానికి రూ.లక్ష విరాళం
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో అమలవుతున్న నిత్యాన్నదాన ప్రసాద ట్రస్ట్‌కు విశాఖపట్నంకు చెందిన ఎంజీకే.కుమారి పేరిట ఆమె కుమారుడు రాజభూషణ్ రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. ఈమేరకు ఆదివారం ఆలయ ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్‌కు విరాళ చెక్కును అందించారు. అనంతరం దాతలకు ప్రత్యేకంగా ఆదిత్యున్ని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించేలా చర్యలు చేపట్టారు. దాతల విరాళాలతో వచ్చిన వడ్డీలతో అన్నదాన ప్రసాదాలను నిత్యం అందజేస్తున్నామని..ఇటీవల కాలంలో ఈ సంఖ్య పెరుగుతూ వస్తుందన్నారు. స్విమ్మింగ్‌లో దరహాస్‌కు రజతం శ్రీకాకుళం న్యూకాలనీ : స్విమ్మింగ్ పోటీల్లో జిల్లాకు చెందిన స్టార్ స్విమ్మర్ వేమకోటి ధనుష్య దరహాస్ మరోసారి సత్తాచాటాడు. ఆదివారం విజయవాడలోని ఎలైట్ స్విమ్మింగ్ పూల్ వేదికగా జరిగిన ఏపీ రాష్ట్రస్థాయి మోడరన్ పెంటథ్లాన్ పోటీలలో బైయాతలాన్ విభాగంలో దరహాస్ మెరిశాడు. జూనియర్ విభాగంలో రిలే కేటగిరీలో రజత పతకం సాధించి శభాష్ అనిపించాడు. దరహాస్ పతకం సాధించడం పట్ల తల్లిదండ్రులతోపాటు స్విమ్మింగ్ సంఘ జిల్లా అధ్యక్షుడు హారిక ప్రసాద్, ప్రధాన కార్యదర్శి ఎ.ఝాన్సీ, కోచ్ మురళీధర్, అంతర్జాతీయ వెటరన్ స్విమ్మర్ ఎస్.కాంతారావు, సూర్యారావు, డీఎస్డీఓ ఎ.మహేష్‌బాబు తదితరులు అభినందించారు. కిడ్నీ వ్యాధితో మాజీ సర్పంచ్ మృతి కవిటి : రాజపురం పంచాయతీ తాజా మాజీ సర్పంచ్ సనపల జానకిరావు(64) ఆదివారం మధ్యాహ్నం మృతిచెందారు. కిడ్నీవ్యాధితో కొన్నిరోజులుగా బాధపడుతున్న ఆయన డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఆరో గ్యం ఒక్కసారిగా క్షీణించడంతో ఆదివారం మధ్యాహ్నం మరణించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్తసాడి శ్యాంప్రసాద్‌రెడ్డి రాజపురం వెళ్లి జానకిరావు పాడె మోశారు. కవిటి మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ కడియాల ప్రకాష్, నర్తు నరేంద్రయాదవ్, సల్ల దేవరాజు తదితరులు సైతం నివాళులు అర్పించారు. బ్యాగ్ అప్పగింత శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని ఓ ఆటోలో మూడు రోజుల క్రితం బ్యాగు చేజార్చుకున్న పలాసకు చెందిన కుంచాడ కుమారికి ట్రాఫిక్ పోలీసులు బ్యాగును కనుగొని ఆదివారం అప్పగించారు. ఆర్టీసీ కాంప్లెక్సు నుంచి సూర్యమహల్ వరకు ప్రయాణించిన ఆటోలో కుమారి బ్యాగు మరిచిపోయారని, సీసీ ఫుటేజీ ఆధారంగా కర్ణపు వీధికి చెందిన దూగాన కృష్ణ ఆటోలో గుర్తించామని ట్రాఫిక్ సీఐ రామారావు పేర్కొన్నారు. రోటరీనగర్‌లో చోరీ పలాస: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలోని రోటరీనగర్ మూడో వీధిలో శనివారం రాత్రి ఓ ఇంట్లో చోరీ జరిగింది. ఆర్‌డబ్ల్యూఎస్‌లో డీఈగా పనిచేస్తున్న పి.దుర్యోధన కుటుంబంతో కలిసి స్వగ్రామానికి వెవెళ్లాడు. ఇదే అదునుగా దొంగలు ఇంటి తలుపు తాళాలు పగలుగొట్టి లోపలికి చొరబడి రూ.4,500 నగదు, కొన్ని వెండి ఆభరణాలను అపహరించుకుపోయారు. విషయం తెలిసిన వెంటనే కాశీబుగ్గ ఎస్ఐ నర్సింహమూర్తి, సీఐ రామకృష్ణ అక్కడకు వెళ్లి పరిశీలించారు. -
సారాతో ఇద్దరి అరెస్టు
కంచిలి: గొల్లకంచిలి వద్ద 100 ప్యాకెట్ల సారాతో ఇద్దరు వ్యక్తులను సోంపేట ఎకై ్సజ్ సీఐ జి.వి. రమణ శనివారం అరెస్టు చేశారు. వీరి నుంచి సరకుతోపాటు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. గతంలో ముద్దాయిలుగా ఉన్న బురదపాడు గ్రామానికి చెందిన గేదెల మోహనరావు, గొల్లకంచిలికి చెందిన దుబ్బ ధర్మారావులపై నిఘా ఉంచారు. ఈ క్రమంలో వీరు నాటుసారా ప్యాకెట్లను ద్విచక్ర వాహనంపై తీసుకొస్తుండగా ఎకై ్సజ్ పోలీసులకు పట్టుబడ్డారు. వీరిపై గతంలో కూడా పలు కేసులు ఉండటంతో, సోంపేట కోర్టులో మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు సీఐ తెలిపారు. ఈ దాడుల్లో ఎస్ఐ జగన్నాథ్, సిబ్బంది భానుప్రసాద్, ఉమాపతి, మార్కారావు పాల్గొన్నారు. బొలెరో వ్యాన్ బోల్తా ఎచ్చెర్ల: ఫరీదుపేట పంచాయతీ పరిధిలోని కోయిరాళ్ల జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై శనివారం ఉదయం బొలెరో వ్యాన్ బోల్తాపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వైపు వాటర్ బాటిళ్లతో వస్తున్న వ్యాన్ కొయిరాళ్ల జంక్షన్ వద్దకు వచ్చేసరికి టైరు పేలి బోల్తాపడింది. ఆ సమయంలో అటుగా ఎటువంటి వాహనాలు రాకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. వ్యాన్ డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పెట్రోలింగ్ పోలీసులు, ఎన్హెచ్ఎఐ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని జాతీయ రహదారిపై వాహనాలు మళ్లించి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేశారు. ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
న్యూఢిల్లీకి రెండు వేసవి రైళ్లు
కొరాపుట్: వేసవి రద్దీ నియంత్రించడానికి కేంద్ర రైల్వే శాఖ కొరాపుట్ మీదుగా న్యూఢిల్లీకి రెండు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. ఒక రైలు 08519 నంబర్‌తో ఈనెల 21వ తేదీన ఉదయం 11 గంటలకు జగదల్పూర్లో బయల్దేరుతుంది. కొరాపుట్, రాయ్‌పూర్, నాగ్‌పూర్, ఆగ్రాల మీదుగా హజ్రత్ నిజాముద్దీన్‌కి చేరుతుంది. తిరిగి 25వ తేదీన 08520 నంబర్‌తో తిరుగు ప్రయాణం చేస్తుంది. మరోవైపు 21వ తేదీన విశాఖపట్నంలో ఉదయం 4.15 గంటలకి 08515 నంబర్‌తో బయల్దేరి అరుకు, కొరాపుట్, రాయ్‌పూర్, ఆగ్రాల మీదుగా ఫరిదాబాద్ చేరుతుంది. తిరిగి 25వ తేదీన బయల్దేరి తిరుగు ప్రయాణం చేయనుంది. తొలిసారిగా కొరాపుట్ నుంచి న్యూఢిల్లీకి ప్రత్యేక రైళ్లు ఏర్పాటు కావడంపై ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. హడప నిఖిల్ హత్య కేసులో ముగ్గురు అరెస్టు రాయగడ: స్థానిక ఇందిరానగర్ మూడోలైన్‌లో ఈనెల 9వ తేదీ రాత్రి రెల్లివీధికి చెందిన హడప నిఖిల్ హత్య, కాల్పుల కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో ప్రధాన నిందితులను పట్టుకునేందుకు ఎస్పీ స్వాతి ఎస్.కుమార్ ఆధ్వర్యంలో ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సాంకేతిక బృందానికి అదనపు ఎస్పీ రామేంద్ర ప్రసాద్ నాయకత్వం వహించారు. నిందితులు పలుమార్లు పోలీసులను తప్పించుకుంటూ అరెస్టుకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించినప్పటికీ నిరంతర నిఘా, ప్రత్యేక బృందం కృషితో ప్రధాన నిందితులు ఉమేష్ హియాల్, రాజ్సిమ్లీ, అక్షయ్ సామల్ అలియాస్ టింకులను బీహార్ రాష్ట్రంలోని ఔరంగబాద్ జిల్లా మదన్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో అరెస్టు చేశారు. ప్రస్తుతం నిందితులను అన్ని చట్టపరమైన ప్రక్రియలు పూర్తి చేసి ట్రాన్సిట్ రిమాండ్‌పై రాయగడకు తరలిస్తున్నట్లు డీపీవో కార్యాలయం శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కేసులో మరికొంతమంది నిందితులను అరెస్టు చేసేందుకు ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. కేసుకు సంబంధించి మరిన్ని వివరాలను ప్రస్తుతం వెల్లడించడం సాధ్యం కాదని, పూర్తి సమాచారం అనంతరం తెలియజేస్తామని ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్థిక సాయం అందజేతజయపురం: ఈనెల 11వ తేదీన గుండె జబ్బుతో మరణించిన పైపు మేసీ్త్ర(పంబర్) సన్యాసి దొర కుటుంబానికి పంబర్ వర్కర్స్ యూనియన్ శుక్రవారం ఆర్థిక సాయం చేసింది. పైపు మేసీ్త్ర మృతికి జయపురంలో సంతాప సభ నిర్వహించి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు రూ.15 వేలు అందజేశారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు త్రిలోచన బురుడి, సంఘ సభ్యులు సుదాం హియాల్, కలియ, వికాశ పాత్రో, మంగులు మసాది, త్రినాథ్ నాయిక్ తదితరులు పాల్గొన్నారు. -
డెంగీ నివారణకు అవగాహన ర్యాలీ
అరసవల్లి: జాతీయ డెంగీ నివారణా దినోత్స వం సందర్భంగా శనివారం జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయం నుంచి అధికార సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక కార్యాలయం నుంచి ఏడు రోడ్ల కూడలి వరకు వెళ్లి డెంగీ నివారణ అవగాహనకు నినాదాలు చేశారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్ అనిత, జిల్లా మలేరియా అధికారి పి.వి.సత్యనారాయణ, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. సమన్వయంతో పనిచేయాలి ఎచ్చెర్ల : ట్రిపుల్ఐటీ కళాశాల అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆర్జీయూకేటీ వీసీ మద్దాలి లక్ష్మీనారాయణ సూచించారు. శనివారం శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీలో పనిచేస్తున్న నాన్‌టీచింగ్ సిబ్బంది వీసీని మర్యాదపూర్వకరంగా కలిశారు. ఈ సందర్భంగా వీసీ పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో పరిపాలనాధికారి ముని రామకృష్ణ, డీన్ శివరామకృష్ణ, ఫైనాన్స్ అధికారి వాసు తదితరులు పాల్గొన్నారు. ‘ఆ భూమి వారసత్వ ఆస్తి’ కంచిలి: కేసరపడ కాలనీకి ఆనుకొని సర్వే నంబర్:468/2, 468/3 లలో ఉన్న 19 సెంట్ల స్థలం తన భర్త సల్ల షణ్ముఖరావుకు వారసత్వంగా వచ్చిన ఆస్తి అని భార్య సల్ల సావిత్రి తెలిపారు. ఈ భూవివాదాన్ని పరిష్కరించాలంటూ కొందరు కాలనీవాసులు పాత్రికేయ సమావేశంలో శుక్రవారం కోరిన మేరకు భర్త ఉపాధి కోసం బయట రాష్ట్రంలో ఉండటంతో ఆయన తరఫున వివరణ ఇచ్చారు. తన భర్తకు ఉమ్మడి కుటుంబం నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తి అని, తమ వద్ద ఉన్న పట్టాదారు పాస్ పుస్తకం తదితర ఆధారాల జెరాక్స్ కాపీలను విలేకర్లకు అందజేశారు. దీన్ని ప్రభుత్వ పోరంబోకు భూమిగా కొందరు స్థానికులు చిత్రీకరించడం సరికాదన్నారు. తమకు చెందిన స్థలంలో ఇప్పటికే ఓవర్‌హెడ్ ట్యాంకు, కాలనీ ఇళ్లు నిర్మించారని, ఇటీవల దౌర్జన్యంగా సిమెంటు రోడ్డు ప్రభుత్వ నిధులతో నిర్మించారని వాపోయారు. తమకు చెందిన జిరాయితీ భూమిలో ఎటువంటి పరిహారం ఇవ్వకుండా నిర్మాణాలు చేపట్టడం తగదన్నారు. ఈశాన్య ప్రాంత ప్రత్యేక సెల్ ఏర్పాటు శ్రీకాకుళం పాతబస్టాండ్: ఈశాన్య ప్రాంత ప్రజల కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసినట్టు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వృత్తి, చదువు నిమిత్తం ఈశాన్య ప్రాంతాల నుంచి శ్రీకాకుళం జిల్లాకు వలస వచ్చిన ప్రజల కోసం జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసిందన్నారు. వీరికి ఉచితంగా న్యాయ సేవలు అందిస్తామని చెప్పారు. ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన న్యాయవాదులు, పారా లీగల్ వలంటీర్లను నియమిస్తామన్నారు. కారు ఢీకొని వ్యక్తికి గాయాలు హిరమండలం: ఎల్‌ఎన్‌పేట మండల కేంద్రం సమీపంలో కోవిలాం కాలనీ వద్ద అలికాం–బత్తిలి ప్రధాన రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రావిచంద్రి గ్రామానికి చెందిన శ్రీనివాసరావు గాయపడ్డాడు. రావిచంద్రి నుంచి ఎల్‌ఎన్‌పేట మండలకేంద్రానికి బైక్‌పై వస్తుండగా హిరమండలం వైపు నుంచి ఆమదాలవలస వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో గాయపడిన శ్రీనివాసరావును చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. ప్రైవేటు టీచర్లకు అడ్మిషన్ తిప్పలు హిరమండలం : ప్రైవేటు టీచర్లకు అడ్మిషన్ల ఆగచాట్లు తప్పడం లేదు. అసలే మండే ఎండలకు తోడు ఉక్కపోతతో అల్లాడుతుంటే అడ్మిషన్ల టార్గెట్ వారిని మరింత కలవరపాటుకు గురిచేస్తోంది. కొన్ని ప్రైవేటు యాజమాన్యాలు టార్గెట్ పెట్టి వీధుల్లో పరుగెత్తిస్తుంటే ..మరికొన్ని పాఠశాలల యాజమాన్యాలు బస్సుల్లో టీచర్లను పల్లెలకు తీసుకువెళ్లి కరపత్రాల ద్వారా ప్రచారం చేయడంతో పాటు అడ్మిషన్లు చేయించేలా ఒత్తిళ్లు పెడుతున్నారు. లేకపోతే ఈ ఏడాది జూన్‌లో ప్రారంభమయ్యే కొత్త విద్యాసంవత్సరానికి సంబంధించి ఉపాధ్యాయ పోస్టుకు రెన్యువల్ ఉండదని భయపెడుతున్నారు. సాధారణంగా వేసవి సెలవుల్లో విహారయాత్రలకు కుటుంబసభ్యులతో వెళ్లాల్సిన సమయంలో పల్లెలు, పట్టణాల్లో తిరగాల్సి వస్తోందని ప్రైవేటు టీచర్లు వాపోతున్నారు. జిల్లాలో దాదాపు 600 మందికి పైగా ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. ఇందులో కొన్ని ప్రైవేటు యాజమాన్యాలు ఉపాధ్యాయులపై టార్గెట్ విధిస్తున్నారు. ఒక్కో ఉపాధ్యాయుడికి 10 అడ్మిషన్లు చేయించాలని తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నారు. తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుదే. అలాంటి ఉపాధ్యాయులను అడ్మిషన్ల కోసం ఇబ్బందులు పెట్టడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ప్రైవేటు పాఠశాలల మధ్య పోటీతత్వం పెరగడంతో విద్యార్థుల సంఖ్యను పెంచుకునేందుకు ఎవరికి వారు తాపత్రయపడుతున్నారు. -
రాయగడలో మంత్రి నిత్యానంద పర్యటన
రాయగడ: రాష్ట్ర విద్యా, వెనుకబడిన వర్గాల సంక్షేమ, సామాజిక భద్రత శాఖల మంత్రి నిత్యానంద గొండో రాయగడలో శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లాలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. అభివృద్ధి పనుల పురోగతిని తెలుసుకున్న మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా సమగ్రాభివృద్ధి చెందాలంటే అధికారులు, ప్రజాప్రతినిధులు సహకారం అందించాలని ఆకాంక్షించారు. విద్య, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, తాగునీరు, ఆరోగ్యం తదితర శాఖల పనితీరుపై సమీక్షించారు. కార్యక్రమంలో ప్రత్యేక అభివృద్ధి మండలి చైర్మన్ విద్యాధర్ సబర్, వైస్ చైర్మన్ మంజుల మినియాక, కలెక్టర్ అశుతోష్ కులకర్ణి తదితరులు పాల్గొన్నారు.డెంగీపై అవగాహన రాయగడ: సదరు సమితి పితామహాల్‌లోని సెంచూరియన్ విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో స్థానిక జిల్లా కేంద్రాస్పత్రి (డీహెచ్‌హెచ్)లో జాతీయ డెంగీ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని డెంగీపై శనివారం అవగాహన కల్పించారు. కలిసి పనిచేద్దాం – డెంగీని దూ రం చేద్దాం అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నర్సింగ్ అధ్యాపకులు, విద్యార్థులు డెంగీ అవగాహన దూతలుగా పాల్గొని రోగులకు అవగాహన కల్పించారు.ఎల్ఐసీ కార్యాలయంలో అగ్ని ప్రమాదం భువనేశ్వర్: కటక్ మచ్ఛొకొరొ బజార్లో ఉన్న ఎల్ఐసీ మండల కార్యాలయంలో శుక్రవారం రాత్రి పూట గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో కంప్యూటర్ తదితర సామగ్రితో పాటు కాగిత పత్రాలు కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది 2 వాహనాల్లో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను నివారించారు. రైతుల సమస్యలపై దృష్టి సారించాలి జయపురం: తమ సమస్యలపై అధికారులు దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు. ఈ మేరకు కొరాపుట్ కలెక్టర్ మనోజ్ సత్యబాన్ మహాజన్‌ను ఉద్దేశించి వినతిపత్రం సబ్ కలెక్టర్‌కు శుక్రవారం అందజేశారు. ధాన్యం అమ్ముకునేందుకు రైతులందరి పేర్లు నమోదు చేయాలన్నారు. ఆర్ఎంసీ, ప్రొక్యూర్మెంట్ సంస్థల బాధ్యతలు, విధులను ప్రతీ మండీ వద్ద సమాచార బోర్డుల ద్వారా, లేక పోస్టర్ల ద్వారా డిస్ప్లే చేయాలని కోరారు. -
అమ్రాపల్లి మామిడి ఎగుమతి
రాయగడ: స్థానిక రైతులకు మెరుగైన మార్కెట్ అవకాశాలు కల్పించడం, సామూహిక వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలను ప్రోత్సహించడం లక్ష్యంగా చేపట్టిన చర్యలు రాయగడ జిల్లాలో విశేష ఫలితాలను అందిస్తున్నాయి. ఒడిశా గ్రామీణాభివృద్ధి, మార్కెటింగ్ సొసైటీ, రైతు ఉత్తత్తిదారుల సంస్థలు సంయుక్తంగా చేపట్టిన ప్రయత్నాలు మరో విజయాన్ని నమోదు చేశాయి. ఒర్మాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక మార్కెటింగ్ కార్యక్రమం ద్వారా 2.5 మెట్రిక్ టన్నుల అమ్రాపల్లి రకం మామిడి పండ్లను విజయవంతంగా న్యూఢిల్లీకి తరలించారు. మునిగుడ సమితికి చెందిన రైతుల నుంచి కేఏపీసీఎల్ నుంచి ఈ మామిడి పండ్లను సేకరించారు. న్యూఢిల్లీలోని ప్రముఖ మదర్ డెయిరీ సంస్థకు ఈ మామిడి పండ్లను సరఫరా చేయడానికి ఏర్పాటు చేసిన రవాణా వాహనాన్ని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి అక్షయ కుమార్ ఖెముండొ శనివారం లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు. రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడడానికి ఇటువంటి తరహా చర్యలు కీలకమని ఆయన పేర్కొన్నారు. -
పోలీసుల పట్ల కనికరమేదీ ?
● ముఖ్యమంత్రి పర్యటనలో భారీ బందోబస్తు ● దాదాపు 10 గంటలు ఎండలో నిల్చునే విధులు శ్రీకాకుళం క్రైమ్ : నెలలో కనీసంగా 5 నుంచి 10 వరకు బందోబస్తు విధులు.. జిల్లాలోనే కాదు జిల్లాను దాటి కూడా వెళ్లాల్సిందే. అందులో కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ప్రతి చిన్న విషయానికీ భారీ సమావేశాలు, ముఖ్య నేతల పర్యటనలు, అధికారులతో రివ్యూలు, దేవాలయాల్లో ఉత్సవాలు, రాష్ట్ర పండగల పేరిట పోలీసుల బందోబస్తు.. ఏమాత్రం నిర్వహణలో తేడాలొచ్చినా, శాంతిభద్రతల్లో విఘాతమేర్పడినా అప్పటివరకు అంతా తామే అన్న రీతిలో వ్యవహరించే నేతలంతా తప్పుకొని పోలీసుల మీదే తప్పులను నెట్టేస్తారు. గత కొంతకాలంగా ఇదే తంతు జిల్లాలో నడుస్తోంది. శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాలోని నరసన్నపేటలో స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర పేరుతో పర్యటనకొచ్చారు. దీనిలో భాగంగా హోంగార్డు నుంచి ఎస్పీ వరకు దాదాపు 1500 మందికి పైగా పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో రెండురోజులు ముందుగానే విధుల్లో అంతా చేరారు. శనివారం ఉదయం 7 నుంచి చంద్రబాబు తిరుగుపయనమైన సాయంత్రం 5 గంటల వరకు ఎండలో నిల్చునే విధుల్లో పాల్గొన్నారు. పొదుపు ఒట్టిమాటే..! ప్రధాని మోదీ పిలుపు మేరకు ఇంధనాన్ని పొదుపుగా వాడండి.. వాహనాలను కుదించుకోండి.. సమావేశాల్లో బందోబస్తు తగినంత మాత్రమే పెట్టుకోండన్న మాటలు చంద్రబాబు పర్యటనకు వర్తించవా అన్నది స్థానికులు చర్చించుకుంటున్నారు. కొందరు పోలీసులైతే ఇవేం బందోబస్తులండీ.. వెళ్తే అన్ని ఖర్చులూమావే.. ఇలాంటి వాటికి టీఏలు ఏమీ ఇవ్వరు.. గడిచిన మూడు బందోబస్తుల్లో ఇదే పరిస్థితి అని వాపోయారు. వాస్తవానికి పీసీ, హెచ్‌సీ, ఏఎస్ఐల వరకు నెలకు రూ.2,200లు టీఏ ఇవ్వాలి, ఎస్ఐ, సీఐలకు రూ. 3,500లు, డీఎస్పీ ఆపై స్థాయి అధికారులకు రూ. 5 వేలు ఇవ్వాలి. గడిచిన 6 నెలలుగా ఇవి రావడం లేదని, నాయకుల సమావేశాలకు తాము పడుతున్న పాట్లు ఎవరూ పట్టించుకోవడంలేదంటూ పోలీసులు చర్చించుకోవడం గమనార్హం. ఇక పోలీసు వాహనాల్లో డీజిల్ ఖర్చు కూడా ఇలాంటి సమావేశాలకు, బందోబస్తులకు ఎంతవుతుందో ప్రభుత్వ పెద్దలే గ్రహించాలని వాపోతున్నారు. -
గోడకూలి కార్మికుడి మృతి
భువనేశ్వర్: గోడ అకస్మాత్తుగా కూలిపోవడంతో కార్మికుడు శిథిలాల కింద కూరుకుపోయి మృతి చెందాడు. కార్మికులు నిర్మాణ సంబంధిత పనుల్లో నిమగ్నమై ఉన్న సమయంలో ఈ దుర్ఘటన జరిగిందని సమాచారం. శనివారం పూరీ చక్రతీర్థ రోడ్డు సమీపంలోని దుర్గా లాడ్జి వద్ద ఈ దురదృష్టకర ఘటన చోటు చేసుకుంది. దీంతో సమీపంలో ఉన్న స్థానికులు, తోటి కార్మికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరి శిథిలాల కింద చిక్కుకున్న కార్మికుని వెలికితీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. సహాయక బృందం కూలిపోయిన కట్టడం కింద నుంచి కార్మికుడిని వెలికితీసి ఆస్పత్రికి తరలించగా అతడు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఆ ప్రదేశంలో ఉన్న మరో కార్మికుడు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. అతడు సకాలంలో ప్రాణాలతో బయటపడటంతో ఈ విషాద ఘటనలో మరిన్ని ప్రాణనష్టాలు నివారించబడ్డాయని భావిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం మృతి చెందిన కార్మికుడు జగత్సింగ్పూర్ జిల్లా తిర్తోల్ ప్రాంతానికి చెందిన పప్పూగా భావిస్తున్నారు. అధికారులు అతని గుర్తింపు, ఇతర వివరాలను ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు. కూలిపోవడానికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర దర్యాప్తు జరపాలని స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు డిమాండ్ చేశారు. నిర్లక్ష్యం, నాసిరకం నిర్మాణ పద్ధతులు, తగిన భద్రతా ఏర్పాట్లు లేకపోవడం వంటివి ఈ ఘోర ప్రమాదానికి దోహదపడ్డాయా అనే విషయాలపై అధికారులు విచారణ జరపాలని కోరారు. ఈ విచారకర ఘటనకు దారి తీసిన పరిస్థితులను నిర్ధారించేందుకు మైరెన్ ఠాణా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
పోరాటాలతోనే హక్కులు సాధించగలం
జయపురం: సమష్టి పోరాటాలతోనే హక్కులను సాధించగలమని ఒడిశా వనవాసీ కల్యాణ ఆశ్రమం ప్రాంతీయ కో–ఆర్డినేటర్ రతీకాంత సాహు అన్నారు. స్థానిక అఖిల భారతీయ ఆదివాసీ భొత్ర వికాస పరిషత్ భవనంలో కొరాపుట్ జిల్లా జనజాతి సురక్షా మంచ్, ఒడిశా వనజాతి కల్యాణ ఆశ్రమంలు సంయుక్తంగా శనివారం నిర్వహించిన చలో ఢిల్లీ నిర్వహణ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భారతీయ ఆదివాసీ భొత్ర వికాస పరిషత్ కొరాపుట్ జిల్లా మాజీ అధ్యక్షుడు నీలకంఠ చలాన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రతీకాంత సాహు మాట్లాడారు. పాలకులు ఆదివాసీ ప్రజల హక్కులను కాలరాస్తూ ఖనిజ సంపదను కార్పొ రేట్ సంస్థలకు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. దీనివలన గిరిజనుల మనుగడకే ముప్పు ఏర్పడిందన్నారు. అందువలన జనజాతి, వనజాతి ఆదివాసీ ప్రజల హక్కుల సాధనకు అఖిల భారత సమ్మిళినీ ఈనెల 24వ తేదీన చలో ఢిల్లీకి పిలుపునిచ్చిందని వెల్లడించించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం ఒడిశా వనవాసీ కల్యాణ ఆశ్రమం ప్రాంతీయ సహాయ కో–ఆర్డినేటర్ లక్ష్మీకాంత మిశ్ర పర్యవేక్షణలో కోట్పాడ్ పట్టణ జనజాతి సురక్షా సమితి కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ అధ్యక్షునిగా భీమ మఝి, ఉపాధ్యక్షునిగా అనామ్ అమనాత్య, కార్యదర్శిగా కేశవ పూజారి, సహాయ కార్యదర్శిగా హరిబందు మఝి, కోశాధిపతిగా ధనపతి చలాన్, సభ్యులుగా ఎస్.మఝి, పరబ పూజారి, కిశోర్ చంద్ర భూమియలను నియమించారు. -
బెట్టింగ్ జోరు!
● ప్లేఆఫ్స్ సమీపిస్తున్న వేళ రూ.లక్షల్లో అర్జన ● కోల్‌కతాలో విశాఖ బెట్టింగ్ ముఠా అరెస్టు ● జిల్లాలో ముఠా కదలికలపై ప్రత్యేక బృందాల నిఘా ఐపీఎల్ పోరు..శ్రీకాకుళం క్రైమ్ : ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ దేశవ్యాప్తంగా మంచి జోరు మీద సాగుతోంది.. ఇటీవలే విశాఖ పోలీసులు కోల్‌కతాలో అతిపెద్ద బెట్టింగ్ ముఠాలోని 8 మంది బుకీలను అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 234 బ్యాంకు అకౌంట్లు (మ్యూల్‌ఖాతాలు) గుర్తించి రూ.500 కోట్ల లావాదేవీలు జరిగినట్లు నిర్ధారించారు. విస్తరించిన బెట్టింగ్ సామ్రాజ్యంలోని మరికొంతమంది రూ.1500 కోట్ల వరకు లావాదేవీలు జరిపివుంటారని అంచనా వేశారు. ఐపీఎల్ ప్లేఆఫ్స్ సమీపిస్తున్న వేళ ఈ బెట్టింగ్ జోరు మరింత ఊపందుకున్నట్లు సమాచారం. ‘జిల్లాలో ఎటువంటి బెట్టింగ్ ముఠాలు లేవు.. ఎటువంటి డెన్లు లేవు.. వారి ఆటలు ఇక్కడ సాగడం లేదు..’ అంటూ పోలీసులు బయటకు చెబుతున్నా చాపకింద నీరులా ఇక్కడో ‘డాన్ బుకీ’ తన సామ్రాజ్యాన్ని విస్తరింపజేస్తుండటంతో ఆధారాలతో సహా పట్టుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. నేతల అండదండలతో.. ఒకప్పుడు చిన్నా చితకా క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతూ, కేసులను ఎదుర్కొంటూ పోలీసుల నుంచి తప్పించుకుని బెట్టింగ్‌నే ఇంటిపేరుగా మార్చుకున్న ఓ వ్యక్తి ఇప్పుడు రూ.కోట్లకు పడగలెత్తి నాయకుల అండదండలతో బెట్టింగ్ మాఫియాలో ‘కీ’రన్నర్‌గా ఉన్నాడన్న ప్రచారం జరుగుతోంది. మరో కీలక బుకీతో కలసి గోవా కేంద్రంగా మన జిల్లాలోని 10 మంది నిర్వాహకులతో కలసి బెట్టింగ్ నడుపుతున్నట్లు ప్రచారంలో ఉంది. కోల్‌కతా కేంద్రంగా మరో కీలక వ్యక్తి మరో 9 మందితో కలసి బెట్టింగ్ నడుపుతున్నట్లు సమాచారం. తానేం చేయడంలేదని పోలీసుల వద్ద నమ్మబలుకుతూనే కీప్యాడ్ మొబైళ్లను నిర్వాహకులకిచ్చి అంతా మేనేజ్ చేస్తున్నట్లు భోగట్టా. ప్రత్యేక యాప్‌ల ద్వారా.. విదేశాల్లో లభ్యమయ్యే ప్రత్యేక బెట్టింగ్ యాప్‌లలో ఓ యాప్‌ను కొనుగోలు చేసిన మన బుకీడాన్ కూడా విశాఖలో పట్టుబడిన గబ్బర్ మాదిరిగానే గోవా కేంద్రంగా చేసుకుని మరికొన్ని రాష్ట్రాల వ్యక్తులతో కలసి సిండికేట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. బుకీడాన్ ఇచ్చిన కీప్యాడ్ మొబైల్ నుంచి వచ్చే రిసీవ్కాల్ ద్వారా నిర్వాహకులు ఇక్కడ బెట్టింగ్‌పై ఆసక్తి ఉండే యువకులను ముఖ్యంగా వ్యాపార వర్గాల వారిని ఎంచుకున్న ప్రదేశానికి పంపించడం.. లేదంటే ఆట కొనసాగేటప్పుడు వారికి లింక్‌పంపించి మొబైల్లో యాప్‌ను డౌన్లోడ్ చేసేలా ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. దీనిలో ప్రధానంగా బోత్90 గేమ్ నడుస్తోంది. అంటే గేమింగ్‌లో బాల్ టు బాల్ (బాల్‌కు సిక్స్ వస్తుందని, వికెట్ వస్తుందని, బౌండరీ వస్తుందని ఇలా.. ), ఓవర్ టు ఓవర్ (ఓవర్లో ఎక్కువ రన్లు కొడతారని, ఎక్కువ వికెట్లు తీస్తారని), మ్యాచ్ టూ మ్యాచ్ (ఇండియా గెలుస్తుందని, లేదా వేరే దేశం గెలుస్తుందని) ఆటగాడు సెంచరీ కొడతాడని, కొట్టడని మొత్తంపైన ఎస్ ఆర్ నో ఉంటుంది. మనం బెట్టింగ్‌లో రూ. లక్ష పెడితే గెలిస్తే రూ. 90 వేలు అదనంగా వస్తుంది. ఓడితే రూ.లక్ష పోతుంది. అంటే నిర్వాహకులకు వెళ్లేది 10 శాతం కమీషన్.. ఆ వివరాలిస్తే అంతే.. విశాఖ మారికివలసకు చెందిన రవిశంకర్ తన ప్రమేయం లేకుండా డబ్బులొస్తాయనే ఆశతో బెట్టింగ్ మాఫియాకు చెందిన త్రినాథ్, జగదీష్‌లకు 60 మ్యూల్‌ఖాతాలు (తనకు తెలిసినవారి వద్ద అవసరం లేకపోయినా బ్యాంకు ఖాతాలు రూ.5 వేలకు ఆశపడి) తెరిపించి బుక్కయ్యాడు. అవే ఖాతాల్లో వారు రూ.లక్షల్లో బెట్టింగ్ లావాదేవీలు జరిపినట్లు తెలుసుకుని సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అందుకే ప్రతీ ఖాతాదారుడు తన ప్రమేయం లేకుండా ఎవరికీ బ్యాంకు అకౌంట్లు, ఏటీఎం కార్డులు, పిన్‌నెంబర్లు, ఓటీపీ నెంబర్లు ఇవ్వవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. యువత కూడా ఎటువంటి బెట్టింగ్ యాప్‌ల జోలికి పోవొద్దని, అప్రమత్తంగా ఉండాలని హితవు పలుకుతున్నారు. -
కిన్నెరని వివాహం చేసుకున్న యువకుడు
కొరాపుట్: ప్రేమ ముందు ఎటువంటి తారతమ్యాలు ఉండవని మరోసారి నిరూపితమైంది. కిన్నెర (హిజ్రా)ని ఒక యువకుడు ప్రేమ వివాహం చేసుకున్నాడు. జగత్సింగ్పూర్ జిల్లా టర్టోల్కి చెందిన సత్యజిత్ ఆచార్య అనే యవకుడుకి కలహండి జిల్లాకి చెందిన శివాని సాహు అనే కిన్నెరతో ఇన్‌స్ర్ట్రాగాంలో పరిచయం ఏర్పడింది. రెండేళ్లుగా వీరిద్దరి స్నేహం ప్రేమగా మారింది. వీరిద్దరి ప్రేమ కొనసాగుతుండగా ఏడాది క్రితం పూరీలో కలుసుకున్నారు. అయితే వీరి ప్రేమకు మొదట్లో పెద్దలు నిరాకరించారు. కొన్నాళ్లకి వీరి ప్రేమని అర్థం చేసుకొని పెళ్లికి అంగీకరించారు. దీంతో శనివారం నబరంగ్‌పూర్ జిల్లా ఉమ్మర్‌కోట్ పట్టణంలో పండితులు వీరిద్దరి గాంధర్వ వివాహం జరిపించారు. ఒకరు పురుషుడు కాగా.. మరొకరు కిన్నెర కావడంతో గాంధర్వ వివాహం చేయాలని పండితులు సూచించారు. ఇరు కుటుంబాల పెద్దలు హాజరై వీరిద్దరిని ఆశీర్వదించారు.చలివేంద్రం ఏర్పాటు పర్లాకిమిడి: స్థానిక రాజవీధి ఉమారామలింగేశ్వర ఆలయం (పొడుగు కోవెల) వద్ద లలితా దేవి మందిరం సంఘం ఆధ్వర్యంలో శనివారం చలివేంద్రం ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా బాటసారులకు చల్లని సబ్జా నీటిని లలితా దేవి సంఘం సభ్యులు అందజేశారు. కార్యక్రమంలో విశాలాక్షి అయ్యర్, మోనింగి రవి, శోభారాణి, పోల్నూరు కృష్ణ కుమారి తదితరులు పాల్గొన్నారు. -
పశువైద్య శిబిరం
రాయగడ: జిల్లాలోని కాసీపూర్ సమితి నకిటిగుడ గ్రామంలో ఆదిత్యా అలూమిన కర్మాగారం ఆధ్వర్యంలో శుక్రవారం పశువైద్య శిబిరం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లోని వివిధ ప్రాంతాల నుంచి అనారోగ్యానికి గురైన పశువులను తీసుకొచ్చి ఇక్కడ చికిత్స చేయించారు. పశు సంపదను కాపాడుకోవడం, అదేవిధంగా వాటికి సకాలంలో వైద్యం అందించడం వలన పరిపూర్ణమైన ఆరోగ్యంగా ఉంటాయని వైద్యులు సూచించారు. పశువులను రోడ్లపై విడిచిపెడుతుండడంతో అవి ప్లాస్టిక్ వంటి పదార్థాలను తిని అనారోగ్యాలకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల పశువులను పెంచడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతలను కూడా తీసుకోవాలని వివరించారు. వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 560 మేకలు, 457 పశువులకు చికిత్స అందించారు. అదేవిధంగా అనారోగ్యంగా ఉన్న పశువులకు సంబంధించి ఉచితంగా వాటి యజమానులకు మందులను పంపిణీ చేశారు. -
ఫైబర్ నెట్ సేవలకు అంతరాయం
రణస్థలం: ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న ఏపీ ఫైబర్‌నెట్ (ఏపీఎస్ఎఫ్ఎల్) సేవలు నిలిచిపోయాయి. 72 గంటలుగా టీవీలు మూగబోయాయి. ఆరుమాసాలగా ప్రతిరోజు అక్కడక్కడా సమస్యలు ఉత్ఫన్నంగా కాగా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. దీంతో వినియోగదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వేసవి సెలవులు కావడంతో పిల్లలతో కలిసి ఇంట్లో ఆనందంగా గడుపుదామని వినియోగదారులు ఫైబర్ నెట్‌కు నెలవారీ ప్యాకేజీలు రూ.350, రూ.450, రూ.600 చొప్పున కట్టారు. ప్రస్తుతం నెట్ పని చేస్తున్నా టీవీ చానల్స్‌కు పూర్తి అంతరాయం ఏర్పడింది. జిల్లా వ్యాప్తంగా 30వేలకు మంది వినియో దారులు ఆందోళన చెందుతున్నారు. చేతులెత్తేసిన ఆపరేటర్లు వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆపరేటర్ల నుంచి సరైన సమాధానం లేకుండాపోయింది. ఒకటికి పది సార్లు ఫోన్లు చేసినా, ఆఫీస్‌కు వచ్చి నేరుగా ఫిర్యాదు చేసిన ఏం చెప్పాలో పాలుపోని పరిస్థితిలో ఆపరేటర్లు ఉన్నారు. వెండర్ సమస్య.. క్షేత్రస్థాయిలో వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యను గుర్తిస్తున్నామని ఏపీఎస్ఎఫ్ఎల్ నుంచి కష్టమర్లకు సమాచారం వచ్చింది. ఈ సమస్య అంతా వెండర్ సృష్టిస్తున్న సాంకేతిక పరమైన సమస్యల వల్ల కలిగిందని వివరణ ఇచ్చారు. నిత్యావరసర సేవలను అత్యంత వేగంగా పునరుద్ధరించడానికి షోకాజ్ నోటీసులు, ఉన్నత స్థాయి చర్చలతో సహా అన్ని చట్టపరమైన, పరిపాలనాపరమైన చర్యలను చేపడుతున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న ఏపీ ఫైబర్ నెట్ సేవలపై తరుచూ ఫిర్యాదులు అందుతున్నా కూట మి ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. -
మా శ్యామకాళీ ఊరేగింపు
పర్లాకిమిడి: వైశాఖ మాసంలో మాసంత సంక్రాంతి శుక్రవారం నాడు పట్టణంలో మాశ్యామకాళీని పురవీధుల్లో ఊరేగించారు. కొన్ని మందిరాల్లో సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక పూజలు జరిపి అన్నదానం చేశారు. మల్కన్‌గిరి: జిల్లాలోని కలిమెల సమితి చిత్రంగపల్లి పంచాయతీ యంపీవీ 8 గ్రామానికి చెందిన విద్యార్థిని చాందిని బాక్చీ 10వ తరగతిలో 91 శాతం మార్కులతో ఉత్తీర్ణసాధించి. అయితే పెదరికంతో పైచదువులు ఎలా సాగించాచాలో అర్థంకాక నిస్సాహాయస్థితిలో ఉండిపోయింది. ఈ విషయం తెలసుకున్న జిల్లా ఉత్కళ జర్నలిస్టుల సంఘం సభ్యులు స్పందించారు. చాందిని బాక్చీని ఆదుకోవడం కోసం విరాళల సేకరణ చేపట్టారు. ఇలా వచ్చిన 15 వేల రూపాయలు సేకరించారు. ఈ మొత్తాన్ని బాధిత కుటుంబ సభ్యులకు శుక్రవారం అందజేశారు. జిల్లా ఉత్కళ జర్నలిస్టు సంఘం అధ్యక్షుడు ఆశోక్మిశ్రో, సంఘం సభ్యులు ఉన్నారు. అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో క్షేత్రపాలకులైన భువనేశ్వరి రామలింగేశ్వర స్వామి వారికి సహస్ర మహాలింగా ర్చన కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. మాసశివరాత్రి సందర్భంగా ప్రధానార్చకు లు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో అర్చకులు ఇప్పిలి సాందీప్‌శర్మ అనివెట్టి మండపంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. మరోవైపు, మాససంక్రమణం సందర్భంగా గర్భాలయంలో సూ ర్యనారాయణ స్వామి మూలవిరాట్టుకు పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం నిజరూపంతో పాటు ప్రత్యేక అలంకరణతో భక్తులకు సర్వదర్శనాలకు అనుమతించారు. శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేషన్, శ్రీకాకుళం జిల్లా సెపక్తక్రా సంఘం చైర్మన్ ఎమ్మెస్సార్ కృష్ణమూర్తి ఆదేశా ల మేరకు ఆదివారం నుంచి వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు నెలరోజులపాటు జరగనున్నాయని కోచ్ జి.అర్జున్‌రావురెడ్డి శుక్రవారం తెలిపారు. శ్రీకాకుళం ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో బాస్కెట్‌బాల్, సెపక్‌తక్ర క్రీడల కు సంబంధించి అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం 7 గంటలకు శిబిరాలు మొదలవుతాయని పేర్కొన్నారు. వాస్తవానికి ఈ నెల ఒకటో తేదీ నుంచే శాప్ ఆదేశాల మేర కు జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో శిక్షణా శిబిరాలు జరుగుతున్నప్పటికీ.. అసోసి యేషన్ల తరఫున క్రీడాకారులకు అనేక సదుపాయాలను కల్పిస్తూ శిక్షణ నిర్వహించాలని ఎమ్మెస్సార్ తలచారని చెప్పారు. ఎనిమిదేళ్లు దాటిన బాలబాలికలు క్యాంపులో పాల్గొనవచ్చన్నారు. ప్రతిరోజు ఉదయం 6 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు ఫ్లడ్‌లైట్ల వెలుతురులో శిక్షణ ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు 99492 91288 నంబర్‌ను సంప్రదించాలన్నారు. శ్రీకాకుళం: విజ్ఞాన శాస్త్రంలో కృత్యాధార బోధ న విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని జిల్లా విద్యాశాఖాధికారి ఏ.రవిబాబు అన్నారు. శ్రీకాకుళం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయులకు విద్యుదయస్కాంతత్వంపై వర్క్ షాపు శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ప్రయోగ సంబంధిత కిట్‌ను ఫిజిక్స్ ఫారమ్‌ను ఎస్.సాయి శ్రీనివాస్ రూపొందించడం అభినందనియమన్నారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించాలన్నారు. పాఠశాలలో వినియోగించి రిన్ని కృత్యాలు విద్యార్థులు స్వయంగా చేసేలా ప్రోత్సహించాలన్నారు. అనంతరం రిసోర్స్ పర్సన్ బి.వెంకటరావును డీఈఓతో కలిసి ఉపాధ్యాయులు సన్మానించారు. ఫిజిక్స్ ఫారమ్ జిల్లా అధ్యక్షుడు జి.లక్ష్మణరావు, విశాఖ జిల్లా ఏపీసీ, ఐఏపీటీ రాష్ట్ర అధ్యక్షుడు జి.చంద్రశేఖర్, డీసీఈబీ సెక్రటరీ సంజీవరావు, ఇన్చార్జి హెచ్ఎం సీతన్నాయుడు, ప్రధాన కార్యదర్శి పి.రవికుమార్, కిరణ్, కామేశ్వరరావు, రామకృష్ణ, కృష్ణారావు, వేణుగోపాల్, రాజశేఖర్, శ్రీకాంత్, రమణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చోరీ కేసులో నిందితుడికి జైలు శిక్ష సారవకోట: బుడితిలో 2024లో జరిగిన చోరీ కేసులో అదే గ్రామానికి చెందిన వర్ల శివ అలియాస్ మున్నాకు 8 నెలల 10 రోజుల జైలు శిక్ష, రూ.100 జరిమానా విధిస్తూ పాతపట్నం జూనియర్ సివిల్ జడ్జి రోషిణి శుక్రవారం తీర్పునిచ్చారు. ఈ మేరకు ఎస్ఐ అనిల్‌కుమార్ విలేకరులకు తెలిపారు. -
పోగొట్టుకున్న 43 మొబైళ్ల అందజేత
పర్లాకిమిడి: గజపతి జిల్లా ఆర్.ఉదయగిరి, మోహ న, అడవ ప్రాంతాల్లో సెల్ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు సబ్ డివిజనల్ పోలీసు అధికారి రాకేష్ కుమార్ సాహు శుక్రవారం ఉదయం ప్రత్యేక మొబై ల్ మేళాలో అందజేశారు. మొబైల్స్ పోగొట్టుకున్న బాధితులు తమ ఫోన్లు తిరిగి దొరికినందుకు సంతో షపడ్డారు. ఎవరివైనా మొబైల్స్పోగొట్టుకున్న వారు వెంటనే సమీప పోలీసు స్టేషన్లో ఫిర్యాదుచేస్తే ట్రా క్ చేసి పట్టుకుంటామని ఎస్డీపీఓ రాకేష్ కుమార్ సాహు అన్నారు. ఆర్.ఉదయగిరి పోలీసు ష్టేషన్లో మొత్తం 43 మొబైళ్లను ట్రాక్‌చేసి పట్టుకుని బాధితులకు అందజేశారు. ఈ మొబైల్ మేళాలో ఆర్.ఉదయగిరి పోలీసుష్టేషన్ ఐఐసి కల్పలతా ప్రధాన్, అడవ పోలీసు స్టేషన్ అధికారి సంతోష్‌కుమార్ బిశోయి, మోహాన పి.యస్. ఐఐసి ఓంప్రకాష్ పా త్రో, రామగిరి స్టేషన్ ఐఐసి రావు పాల్గోన్నారు. -
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు
● కరువు భత్యం 2 శాతం పెంపు భువనేశ్వర్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఫింఛన్‌దారులకు ముఖ్యమంత్రి తీపి కబురు అందజేశారు. ఉద్యోగులకు కరువు భత్యం 2 శాతం పెంచినట్లు ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ శుక్రవారం ప్రకటించారు. దీని ఫలితంగా ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యం 58 శాతం నుంచి 60 శాతానికి పెరిగింది. ఈ పెరుగుదల ఈ ఏడాది జనవరి 1 నుంచి వర్తిస్తుంది. ఇదే రీతిలో రాష్ట్ర ప్రభుత్వ ఫించనుదారుల టీఐ 2 శాతం పెంచినట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. పెరిగిన లెక్క ప్రకారం మొత్తం మే నెల జీతంలో నగదు రూపంలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీని వల్ల రాష్ట్రంలోని సుమారు 8 లక్షల 50 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఫించనుదారులు లబ్ధి పొందుతారు. దివ్యాంగురాలికి ఆర్థిక సహాయం రాయగడ: జిల్లాలోని కళ్యాణసింగుపూర్ సమితి బొలదియా గ్రామానికి చెందిన దివ్యాంగురాలు ప్రస్కాకుమారి కుటుంబం ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈ విషయం తెలుసుకున్న రుషి మహిమా సేవా సంస్థ ఆ కుటుంబానికి అండగా నిలిచారు. నిత్యావసర సరుకులు, కొంతమేర ఆర్థిక సహాయాన్ని అందించారు. సమాజసేవకుడు టి.చంద్రశేఖర్, వార్డు సభ్యులు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఏసీఏ భవన విస్తరణకు భూమి పూజ
భువనేశ్వర్: స్థానిక ఆంధ్ర సంస్కృతి సమితి భవన సముదాయం విస్తరణ పనులకు భూమి పూజ నిర్వహించారు. ఈ పనుల కోసం భువవనేశ్వర్ లోక్ సభ సభ్యురాలు అపరాజిత షడంగి ఎంపీ లాడ్ నుంచి నిధులను కేటాయించడంతో ఈ పనులు ప్రారంభించనున్నట్లు అధ్యక్షుడు గన్నవరపు ఆనంద్ రావు తెలిపారు. ఈ సందర్భంగా నిర్మాణ పనుల ప్రాంగణంలో శుక్రవారం నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో సమితి కార్యదర్శి రాయప్రోలు సత్య సాయి పాల్గొన్నారు. కార్యవర్గం ఆహ్వానం మేరకు ఎంపీ అపరాజిత షడంగి ప్రత్యక్షంగా సందర్శించి భవన సముదాయం విస్తరణకు నిధులు కేటాయించినట్లు ఏసీఏ కార్యవర్గ సభ్యురాలు డి.విజయ లక్ష్మి తెలిపారు. -
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు సర్వం సిద్ధం: సీఈఓ
భువనేశ్వర్: జాతీయ ఎన్నికల సంఘం రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ ప్రకటన ప్రకారం ప్రత్యేక ఓటర్ల జాబితా విస్తృత సవరణ (ఎస్ఐఆర్) కోసం ఈ ఏడాది జూలై 1 అర్హత తేదీగా నిర్ణయించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ఆర్.ఎస్. గోపాలన్ తెలిపారు. ఈ నెల 20 నుంచి 29 వరకు ముద్రణ, తయారీ, శిక్షణ పనులు పూర్తి చేసేందుకు కార్యక్రమం ఖరారు చేసినట్లు విలేకర్ల సమావేశంలో తెలిపారు. ఈ నెల 30 నుంచి జూన్ 28 వరకు బీఎల్ఓలు ఇంటింటి పర్యటనలు నిర్వహిస్తారు. జూన్ 28 నాటికి పోలింగ్ కేంద్రాల పునర్వ్యవస్థీకరణ పూర్తి చేస్తారు. జూలై 5న కాగితపు ఓటర్ల జాబితా ప్రచురితం అవుతుంది. అది మొదలుకొని ఆగస్టు 4 వరకు అభియోగాలు, అభ్యంతరాలను దాఖలు చేయడానికి గడువు కల్పించారు. సెప్టెంబర్ 2 వరకు వీటిని పరిశీలించి ఓటర్ల తుది జాబితా సెప్టెంబర్ 6న వెల్లడిస్తారు. రాజకీయ పార్టీల ముందస్తు భాగస్వామ్యంతో పూర్తి పారదర్శకతతో ప్రత్యేక ఎన్నికల సవరణను అమలు లక్ష్యంగా సీఈఓ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి పోలింగ్ కేంద్రానికి బూత్ స్థాయి ఏజెంట్లను (బీఎల్ఏ) నియమించాలని అన్ని రాజకీయ పార్టీలను కోరారు. ఇప్పటివరకు రాష్ట్రంలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు మొత్తం 27,723 మందిని నియమించాయి. ఎస్ఐఆర్ తయారీ తొలి దశలో 2002 నాటి ఓటర్ల జాబితాలో 94.61 శాతం 3,16,03,323 మంది ఓటర్లను గుర్తించారు. 45,255 బూత్ స్థాయి అధికారులు ఓటర్ల ఇళ్లను సందర్శించి లెక్కింపు ఫారాలను పంపిణీ చేసి పూర్తి వివరాలు సేకరిస్తారు. పత్రికా సమావేశంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆర్. ఎస్. గోపాలన్, అదనపు సీఈఓ సుశాంత్ కుమార్ మిశ్రా, సంయుక్త సీఈఓ గోపీనాథ్ కువాన్, ఆర్థిక సలహాదారు సంజయ్ కుమార్ లుగున్, డిప్యూటీ సీఈఓ డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ సాహు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణంరాయగడ: సదరు సమితి కుటిలి సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు దుర్మరణం పాలయ్యాడు. మృతుడు మీనాపాయి గ్రామానికి చెందిన సునీల్ మినియాక (24)గా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ద్విచక్ర వాహనంపై మీనాపాయి నుంచి వెళ్తున్న సునీల్‌ను ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొంది. ఈ ఘటనలో తీవ్రగాయాలకు గురైన సునీల్ సంఘటన స్థలం వద్దే మృతి చెందాడు. ఆటో డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో మృతుని కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించాలని గ్రామస్తులు ఆందోళన చేశారు. దీంతో కొరాపుట్–రాయగడ మీదుగా రాకపోకలు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. శుక్రవారం ఉదయం పోలీసు అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులను బుజ్జగించారు. నష్ట పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
బగాగుడలో నీటి ఎద్దడి
రాయగడ: జిల్లాలోని కల్యాణ సింగుపూర్ సమితి ధమునిపొంగ పంచాయతీ బగాగుడ గ్రామంలో తాగునీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చింది. పలుమార్లు అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినప్పటికీ ఎటువంటి ఫలితం లేకపోవడంతో గ్రామ మహిళలు గురువారం ఆందోళన చేపట్టారు. రహదారి వద్ద ఖాళీ బిందెలను పట్టుకుని నిరసనకు దిగారు. గ్రామంలో 11 కుటుంబాలకు చెందిన 100 మందికిపైగా నివసిస్తున్నారు. ఉన్నవారందరి తాగునీటి సౌకర్యార్థం కేవలం ఒకే గొట్టపు బావి ఉంది. ఉన్న గొట్టపు బావి కూడా సరిగ్గా పనిచేయకపోవడంతో తాగునీటికి కటకటలాడుతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. కల్యాణ సింగుపూర్, కలహండి మార్గంలో మహిళలు ఆందోళనకు దిగడంతో ఆయా మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో గ్రామ పంచాయతీ అధికారి శ్వేతాంబర్ ప్రధాన్ సంఘటన స్థలానికి వెళ్లి సమస్యను తెలుసుకున్నారు. గొట్టపు బావి మరమ్మతులు చేసేంతవరకు తాగునీటి నిమిత్తం ట్యాంక్‌ల ద్వారా నీటిని సరఫరా చేస్తామని హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన విరమించారు. -
రిమ్స్ ఆస్పత్రికి ఫిజియోథెరపీ పరికరాలు
శ్రీకాకుళం: రిమ్స్ వైద్య కళాశాలకు అనుబంధంగా ఉన్న ఆస్పత్రికి శుక్రవారం కొత్త ఫిజియోథెరపీ పరికరాలు వచ్చాయి. ప్రిన్సిపాల్ డాక్టర్ అప్పలనాయుడు, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రసన్నకుమార్, జాయింట్ డైరెక్టర్ రాజశేఖరరెడ్డి ఈ పరికరాలను ప్రారంభించి రిమ్స్ ఫిజియోథెరపీ విభాగం ఇన్చార్జికి అప్పగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అత్యాధునిక పరికరాలతో రోగులకు మంచి సేవలు అందించాలని సూచించారు. ఇన్ పేషెంట్లు, అవుట్ పేషెంట్లకు అవసరమైన ఫిజియోథెరపీ పరికరాలు అందుబాటులోనికి వచ్చాయని, ఎలక్ట్రో థెరపీ, వ్యాయామ చికిత్స తదితర 16 రకాలు ఇందులో ఉన్నాయని వివరించారు. వెన్నెముక, మోకాళ్ల నొప్పులు, భుజాల నొప్పులు, పక్షవాతం, క్యాన్సర్, గుండె సంబంధిత రోగాలతో బాధపడుతున్న వారికి ఇవి అవసరమన్నారు. పుట్టుకతో నడవలేని పిల్లలకు కూడా ప్రస్తుతం అందుబాటులోనికి వచ్చిన పరికరాలు ఎంతో ఉపయోగకరమన్నారు. రోగులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్థోపెడిక్ విభాగం ఇన్చార్జి హెచ్ఓడీ డాక్టర్ పార్థసారథి, డాక్టర్ సుభాషిని, ఫిజియోథెరపీ వైద్యులు రవి, బాబ్జీ, విష్ణుప్రియ, ప్రశాంతి, కోరాడ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. -
రైలు నుంచి జారిపడి వ్యక్తికి గాయాలు
పలాస: పలాస మండలం సుమ్మాదేవి రైల్వేస్టేషన్ సమీపంలో శుక్రవారం ఉదయం రైలు నుంచి గుర్తు తెలియని వ్యక్తి ప్రమాదవశాత్తు జారిపడి తీవ్ర గాయాల పాలయ్యాడు. సుమారు 40 ఏళ్ల వయస్సు గల వ్యక్తి గాయాలతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా స్థానికులు గమనించి 108కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. వారు హుటాహుటిని వచ్చి పలాస ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. జి.ఆర్.పి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థులకు ప్రపంచ స్థాయి సాంకేతిక విద్య ఎచ్చెర్ల : గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రపంచస్థాయి నాణ్యమైన సాంకేతిక విద్యను, ఆధునిక పరిజ్ఞాణాన్ని అందించడమే లక్ష్యమని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం నూతన ఉప కులపతి మద్దాలి లక్ష్మీనారాయణరావు స్పష్టం చేశారు. వీసీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి శుక్రవారం శ్రీకాకుళం జిల్లా క్యాంపస్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ గిరిధర్, నూజివీడు డైరెక్టర్ గోపాలరాజు, పరిపాలనాధికారి ముని రామకృష్ణ, డీన్ శివరామకృష్ణ, ఫైనాన్స్ అధికారి వాసు, సిబ్బంది ఘనస్వాగతం పలికారు. అనంతరం క్యాంపస్‌లోని వసతులు, విద్యా విధానాన్ని పరిశీలించిన వీసీ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఆర్జీయూకేటీని దేశంలోనే అత్యుత్తమ సాంకేతిక విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు.పరిశోధనలకు, విద్యార్థుల సమగ్ర వికాసానికి పెద్దపీట వేస్తామన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ సండ్ర అమరేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
జేకేపేపర్ మిల్లుకు జాతీయ స్థాయి అవార్డు
రాయగడ: జిల్లాలోని జేకేపూర్ ఉన్న జేకే పేపర్ మిల్స్ సంస్థకు కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యక్రమాల్లో విశిష్ట సేవలకు గ్రీన్‌టెక్ సీఎస్ఆర్ ఇండియా గోల్డ్ అవార్డు–2026 లభించింది. దివ్యాంగుల సంక్షేమం విభాగంలో ఈ ప్రతిష్టాత్మక అవార్డును న్యూఢిల్లీలో ఈ నెల 13వ తేదీన నిర్వహించిన గ్రీన్‌టెక్ సీఎస్ఆర్ ఇండియా అవార్డు–2026 కార్యక్రమంలో ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారిత శాఖ సహాయ మంత్రి రామ్ దాస అథేవాలి ముఖ్యఅతిథిగా హాజరవ్వగా సంస్థ తరఫున స్మృతిరేఖ కర్ అవార్డును అందుకున్నారు. దివ్యాంగల సంక్షేమం కోసం సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా అవార్డు లభించడం విశేషం. జిల్లాలోని కాలనారలో జేకేపేపర్ మిల్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నూతన్న జ్ఞాన్ వర్ధిని ప్రత్యేక పాఠశాలలో మానసిక పిల్లలకు విద్య, ఫిజియోథెరఫీతో పాటు వ్యక్తిత్వ వివాస శిక్షణ అందిస్తున్నారు. ప్రస్తుతం సుమారు 50 మంది విద్యార్థులు ఈ సేవలను పొందుతున్నారు. ఈ ప్రాజెక్టును జిల్లా సామాజిక సంక్షేమ శాఖ సహకారంతో నిర్వహిస్తున్నారు. అలాగే దివ్యాంగ యువతలో క్రీడా ప్రతిభను ప్రోత్సాహించేందుకు కూడా సంస్థ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా పారా క్రీడాకారుడు ఎల్.రమేష్ కుమార్‌కు నిరంత ఆర్థిక సహాయం అందిస్తోంది. కరాటే, కుంగ్‌ఫూ, తైక్వాండో పోటీల్లో జపాన్, మలేషియా, శ్రీలంక వంటి దేశాల్లో పాల్గొన్న రమేష్ కుమార్ బ్లాక్ బెల్ట్ బెల్ట్ సాధించి అంతర్జాతీయ స్థాయిలో పలు బంగారు వెండి, కాంస్య పతకాలు గెలుచుకొని రాయగడకు గుర్తింపు తీసుకువచ్చారు. ఇటువంటి తరహా సీఎస్ఆర్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నందుకు గుర్తించి ఈ అవార్డు జేకేపేపర్ మిల్ సంస్థకు దక్కడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జేకేపేపర్ మిల్ యూనిట్ ఎగ్జిక్యూగివ్ వైస్ ప్రెసిడెంట్ (వర్క్స్) వినయ్ ద్వివేది, సంస్థ పీఆర్, సీఎస్ఆర్ బందాల కృషిని అభినందిస్తు భవిష్యత్‌లో కూడా సామాజికాభివృద్ధికి కట్టుబడి పనిచేయాలని ఆకాంక్షించారు. -
వివాదాస్పద స్థలంపై విచారణ చేపట్టాలి
కంచిలి: కేసరపడ కాలనీలో పూర్వం నుంచి ఉన్న ప్రభుత్వ పోరంబోకు స్థలం హఠాత్తుగా జిరాయితీ స్థలంగా మారడంపై గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 30 ఏళ్లు క్రితం ఇక్కడ కాలనీ మంజూరు చేసిన తర్వాత అంతటా పక్కా ఇళ్లు నిర్మించుకొని కుటుంబాలతో జీవిస్తుండటం, అందులోనే రక్షిత మంచినీటి పథకం ఓవర్‌హెడ్ ట్యాంకు వినియోగంలో ఉండటం, తాజాగా ప్రభుత్వ నిధులతో సిమెంటు రోడ్డు నిర్మాణం చేపట్టడం వంటివి సాక్ష్యాలుగా ఉన్నాయని గ్రామస్తులు పేర్కొంటున్నారు. కాలనీలో సర్వే నంబర్:468/2లో 16 సెంట్లు, 468/3లో 3 సెంట్లు మొత్తంగా 19 సెంట్లు స్థలం వివాదంగా మారింది. ఇందులో కాలనీ ఇళ్లు మంజూరవ్వడంతో మూడు ఇళ్లు కూడా నిర్మించుకొని దశాబ్దాలుగా నివాసం ఉంటున్నారు. మిగతాది ఖాళీ స్థలంగా ఉంది. పూర్వం నుంచి ఇది ప్రభుత్వ పోరంబోకు భూమిగా గ్రామస్తులు వ్యవహరిస్తూ, అక్కడ కొంత భాగంలో గ్రామ అవసరాల కోసం సామాజిక మండపం నిర్మించతలపెట్టారు. దీనికోసం విరాళాలు కూడా పోగుచేసుకొని, లోతుగా ఉన్న ఈ స్థలంలో మట్టితో నింపారు. ఇంతలో ఇది జిరాయితీ స్థలం అని గ్రామానికి చెందిన ఒక వ్యక్తి పేర్కొంటూ, అప్పగించాలంటూ రెవెన్యూ సిబ్బంది ద్వారా అక్కడ ఇళ్లు నిర్మించుకొన్న వారిని విచారణ చేపట్టడంతో గందరగోళం నెలకొంది. దీంతో అక్కడ కాలనీ ఇళ్లు నిర్మించుకొన్న మాలి మోహిని మహాపాత్రో, పిలక గంగమ్మ, సల్ల గంగమ్మలు ఆందోళన చెందుతున్నారు. బాధితుల తరపున విచారణ చేపట్టి, ప్రభుత్వ పోరంబోకు స్థలాన్ని గ్రామానికి అప్పగించాలని అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై గ్రామంలో సమావేశమై విలేకరులకు తమ గోడును తెలియజేశారు. సమావేశంలో మల్లార్పు దుదిష్టి, కొరికాన కృష్ణమూర్తి, నెయ్యిల గంగాధర్, కొరికాన చంద్రముణి, మాలి అజిత్, రంగాల గోవింద్, పిలక కామరాజు, మల్లార్పు ప్రేమ్‌కుమార్, కడియం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
పరిశ్రమ బస్సును ఢీకొట్టిన ఆటో
రణస్థలం: శ్రీకాకుళం వైపు నుంచి పైడిభీమవరం వైపు డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ పరిశ్రమ బస్సును బుడుమూరు వద్ద వెనుకనే వస్తున్న ఆటో బలంగా ఢీకొట్టింది. స్థానికులు, లావేరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పరిశ్రమ చెందిన ఉద్యోగులను ఎక్కించుకునేందుకు బుడుమూరు వద్ద రెడ్డీస్‌కు చెందిన బస్సు శుక్రవారం ఉదయం 5.50గంటల సమయంలో ఆగింది. ఈ సమయంలో వెనుకనే వస్తున్న ఆటో బస్సును ఢీకొట్టింది. ఆటో డ్రైవర్‌కు బలమైన గాయాలు కావడంతో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆటోలో ఉన్న టమోటాలు, కూరగాయలు చెల్లాచెదురుగా పడిపోయాయి. -
‘మహిళా భద్రతకు చర్యలు చేపట్టాలి’
జయపురం: రాష్ట్రంలో డబల్ ఇంజిన్ సర్కార్ వచ్చి న మహిళలపై అత్యాచారాలు, వేధింపులు ఎక్కువ అయ్యాయని మాజీ మంత్రి రబినారాయణ నందో అన్నారు. జయపురం సబ్‌డివిజన్ కొట్పాడ్లో బీజేడీ నిర్వహించిన నారీ అధికార్ అభిజాన్క్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. వందలాది మంది బీజేడీ మహిళా కార్యకర్తలు, పార్టీ కార్యకర్త లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేక నినాదాలు గల ప్లకార్డులు, బీజేడీ పతాకాలతో మాజీ మంత్రి పద్మిణీ దియాన్ నేతృత్వంలో భారీ ర్యలీ నిర్వహించారు. అనంతరం కొట్‌పాడ్ బిజూపట్నాయక్ రీడింగ్ కేంద్రంలో మాజీ మంత్రి పద్మిణీ దాయాన్ అధ్యక్షతన జరిగిన సభలో మాజీ మంత్రి రబినారాయణ నందో ప్రసంగించారు. బీజేడీ పాలనపై నిప్పులు చెరిగారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయటంలో బీజేపీ పాలకులు పూర్తిగా విఫలమయ్యారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ పాలనలో ధరలు చుక్కలనంటుతున్నాయని, సామాన్య ప్రజల జీవణం దుర్భరమైందని అన్నా రు. రైతులకు గిట్టుబాటు ధర లభించటం లేదని ఆరోపించారు. మహిళల సమస్యలతో పాటు, రైతు ల, ప్రజల సమస్యలపై బీజేడీ పోరాటం చేస్తాదని రబినారాయణ నందో హెచ్చరించారు. మాజీ మంత్రి ఛపద్మిణీ దియాన్, మాజీ ఎమ్మెల్యే చంధ్ర శేఖర మఝి, కొరాపుట్ జిల్లా మహిళా బీజేడీ అధ్యక్షురా లు పార్వతీ మస్తి, జిల్లా పరిషత్ సభ్యులు గీత మ ఝి, కొట్‌పాడ్ సమితి ఉపాధ్యక్షులు తపన్ కుమార్ పాణిగ్రహి, కొరాపుట్ కేంధ్ర సహకార బ్యాంక్ ఉపాధ్యక్షులు డి.భొత్ర, జిల్లా నాణి పంచాయతీ అధ్యక్షు లు భీరెన్ బిశాయ్, మహమ్మద్ సాలిమ్, శ్రీకాంత పండ, ప్రశాంత పట్నాయక్ పాల్గొన్నారు. -
రౌర్కెలాలో కేన్సర్ ఆస్పత్రి ప్రారంభం
భువనేశ్వర్: రాష్ట్రంలో వైద్య సేవా రంగంలో హై టె క్ మరో ముందడుగు వేసింది. పశ్చిమ ఒడిశా ప్రాంతీయులకు కేన్సర్ చికిత్స, వైద్య సేవలను చేరువ చేసింది. హైటెక్ వైద్య బోధన ఆస్పత్రి రౌర్కెలా శా ఖ సముదాయంలో బినోదిని కేన్సర్ ఆస్పత్రిని ప్రారంభించారు. రాజ్యసభ ఎంపీ దిలీప్ రే ఈ ఆస్పత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు వైద్య సేవా రంగంలో హై టెక్ సేవల్ని ఆయన కొనియాడారు. అత్యాధునిక పరిక రాలు, అనుభవజ్ఞులైన వైద్యులతో క్యాన్సర్ నిర్ధార ణ, చికిత్స సౌకర్యాలను అందించే బినోదిని ఆస్పత్రిని రౌర్కెలాలో స్థాపించడం ఆనందంగా ఉందన్నారు. దీనివల్ల పశ్చిమ ఒడిశాతో పాటు పొరుగు రాష్ట్రాల రోగులకు కూడా ప్రయోజనం చేకూరుతుంది. రూ. 150 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ అత్యాధునిక ఆస్పత్రిలో ప్రపంచ స్థాయి పరికరా లు, శస్త్ర చికిత్స సదుపాయాలు ఉన్నాయి. 250 పడకల సామర్థ్యం గల ఈ ఆస్పత్రిలో సీనియర్, అనుభవజ్ఞులైన క్యాన్సర్ వైద్యుల నియామకం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా హైటెక్ వ్యవస్థా పక అధ్యక్షుడు డాక్టరు తిరుపతి పాణిగ్రాహి మాట్లాడుతూ పశ్చిమ ఒడిశా ప్రాంతంలో క్యాన్సర్ రోగులకు సమీపంలోనే తక్కువ ఖర్చుతో నాణ్యమైన చికిత్స కల్పించడం లక్ష్యంగా పేర్కొన్నారు. పశ్చిమ ఒడిశా రోగులతో పాటు పొరుగు రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌కు చెందిన రోగులు ఈ క్యాన్సర్ ఆస్పత్రిలో నాణ్యమైన చికిత్స ప్రయోజనాలను పొందుతారని పేర్కొన్నారు. ఈ ఆస్పత్రిలో వ్యాధి నిర్ధారణతో పాటు రోగులకు నిరంతర సంరక్షణను అందించనున్నట్లు హైటెక్ గ్రూప్ సీఈఓ, మేనేజింగ్ ట్రస్టీ సురేష్ పాణిగ్రాహి తెలిపారు. కార్యక్రమానికి ట్రస్టీ పుష్పాంజలి పాణిగ్రాహి, పర్లాఖిముండి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, రౌర్కెలా హై టెక్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ రాకేష్ పాణిగ్రాహి, మెడికల్ కాలేజ్ సీఈఓ డాక్టర్ సుశాంత్‌కుమార్ ఆచార్య, మెడికల్ కాలేజ్ చైర్మన్, వైద్యులు, అధికారులు హాజరయ్యారు. -
మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుకు కాంగ్రెస్ ర్యాలీ
కొరాపుట్: మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ కాగాడాల ప్రదర్శన చేసింది. కొరాపుట్ జిల్లా లక్ష్మీపూర్‌లో మహిళా కాంగ్రెస్ నాయకులు శుక్రవారం ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీకి చెందిన ఎంఎల్ఏ పవిత్ర శాంత పాల్గొన్నారు. మరో వైపు నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహిళలు ర్యాలీ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలులో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నాటకాలు ఆడుతోందని ఎద్దేశా చేశారు. ఆందోళనలో డీసీసీ అధ్యక్షురాలు డాక్టర్ లిఫికా మజ్జి, నాయకులు మున్నా త్రిపాఠీ తదితరులు పాల్గొన్నారు. -
రెండో రోజూ..అదే జోరు
● ఉత్సాహంగా సాగుతున్న ఇంటర్నేషనల్ చెస్ పోరు ● ఆంధ్రప్రదేశ్ రేటింగ్ క్రీడాకారులు హవా శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్ చెస్ చాంపియన్‌షిప్ పోటీలు ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగుతున్నాయి. సీఎస్ఎన్ ట్రస్ట్, గీతా చెస్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీకాకుళం గ్రాండ్ కన్వెన్షన్‌లో జరుగుతున్న ఈ పోటీలు నువ్వా–నేనా అన్నట్టుగా ఉత్కంఠను తలపిస్తున్నాయి. ఐదురోజుల మెగా టోర్నీలో భాగంగా రెండో రోజు శుక్రవారం మూడో రౌండ్ పోటీలను కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి పోటీలను ప్రారంభించారు. బాలబాలికల ఎత్తుకు పై ఎత్తులను వీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రీకాకుళంలో అంతర్జాతీయ స్థాయి చెస్ పోటీలు నిర్వహించడం గర్వకారణంగా ఉందన్నారు. ఇంతటి భారీస్థాయిలో చెస్ టోర్నీని నిర్వహిస్తున్న కమిటీ ప్రతినిధులను అభినందించారు. దేశ నలుమూలల నుండి విచ్చేసిన క్రీడాకారులకు.. శ్రీకాకుళం విశిష్టతను, గొప్పతనాన్ని ప్రాచీన కట్టడాలను గురించి వివరించారు. కార్యక్రమంలో పోటీల ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ సుధీర్, జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు బాగాది కిషోర్, జయరాజ్, వసంతరావు, వివిధ జిల్లాలకు చెందిన అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇప్పటివరకు జరిగిన నాలుగు రౌండ్లలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు రేటింగ్ ప్లేయర్లు తమ హవా కొనసాగిస్తున్నారు. వీరికి తమిళనాడు, ఒడిశా, అమెరికాకు చెందిన క్రీడాకారులు గట్టిపోటీనిస్తున్నా రని డైరెక్టర్ సనపల భీమారావు తెలిపారు. -
● ఇంధనానికి కొరత!
● పెట్రోల్ బంకులను తనిఖీ చేసిన అధికారులుకొరాపుట్: కొరాపుట్, నబరంగ్‌పూర్ జిల్లాల్లో తీవ్రమైన ఇంధన కొరత శుక్రవారం తలెత్తింది. అనేక పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకుంది. ఈ విషయం సామాజిక మాధ్యమాలలో విమర్శలు రావడంతో అధికార యంత్రాంగం ఉలిక్కి పడింది. నబరంగ్‌పూర్ జిల్లాలో జిల్లాస్థాయి ఉన్నతాధికారులు, పౌర సరఫరాల శాఖా అధికారులు సంయుక్తంగా బంకులు తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతం ఉన్న స్టాక్, వస్తున్న స్టాక్ వివరాలు పరిశీలించారు. జిల్లాలో ద్విచక్ర వాహనదారులకు రూ. 200 విలువైన పెట్రోల్ మాత్రమే ఇస్తున్నారు. మరో వైపు కొరాపుట్ జిల్లాలో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఎక్కడికక్కడ నోస్టాక్ బోర్డులు వెలిశాయి. పెద్ద వాహనాలకు పెట్రోల్ ఇవ్వలేక అవిరాకుండా మార్గాలు మూసి వేశారు. ఉన్నతస్థాయి వ్యక్తులు వాహనాలు తగ్గి పర్యటిస్తున్న వార్తలు టీవీలలో చూసి పెట్రోల్ సంక్షోభం ఏర్పడుతుందనే వదంతులు తీవ్రంగా వ్యాపిస్తున్నాయి. దాంతో బంకుల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
హత్య కేసులో నిందితుడు అరెస్టు
మల్కన్‌గిరి: కలిమెల సమితి ఎంవీ 79 పోలీస్‌స్టేషన్ పరిధి ఎంపీవీ 65 గ్రామ శ్మాశనం సమీపంలో కార్తమి దులా(50) అనే వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గురువారం గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. కార్తమి దులా సొంత గ్రామం మారివషాఢ. అయితే బుధవారం రాత్రి తన పొలంలో పనులు చూసుకొని అక్కడే పడుకుంటానని వెళ్లాడు. గురువారం ఉదయం స్థానికులు అతడి మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే గ్రామస్తులు కొందరు పాత కక్షలతో మాల మాడీ హత్య చేసుంటాడని ఆరోపించారు. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు. నిందితుడిని పూర్తి విచారణ తర్వాత కోర్టుకు తరలిస్తామని పోలీసులు తెలిపారు. అండర్ 14 సీఎం ఫుట్‌బాల్ ట్రోఫీ విజేత జీబ క్లబ్ పర్లాకిమిడి: గత రెండు రోజులుగా జరుగుతున్న అండర్ 14 సీఎం ఫుట్‌బాల్ ట్రోఫీ 2.0 జిల్లా స్థాయి పోటీలు గురువారం ఉదయంతో ముగిశాయి. మొత్తం బాలురు 6, బాలికల జట్లు 5 పాల్గొన్నారు. వారిలో చివరకు ఫైనల్లో జీబ క్లబ్ వెర్సస్ జాజిపూర్ క్లబ్‌లు తలపడగా జీబ క్లబ్ 5 పాయింట్లతో ట్రోఫీని గెలుచుకుంది. జిల్లా క్రీడాధికారి త్రినాథ సాహు జీబ క్లబ్‌కు సీఎం ఫుట్‌బాల్ ట్రోఫీని అందజేశారు. రన్నర్స్‌గా జాజిపూర్ క్లబ్‌కు కప్పును అందజేశారు. మజ్జిగ వితరణ రాయగడ: జిల్లాలోని కొత్తపేట కళింగ వైశ్య సంఘం ఆధ్వర్యంలో గురువారం మజ్జిగ వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఎండలు మండుతున్న నేపథ్యంలో రోడ్డుపై వెళ్లే బాటసారులకు కాస్త ఉపశమనం కలిగించేలా సంఘం సభ్యులు మజ్జిగ వితరణ చేపట్టారు. సరాసరి వాహనదారుల వద్దకు వెళ్లి మజ్జిగ అందించారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు కొత్తకోట శ్రీధర్, కార్యదర్శి పెద్దిన నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట రాయగడ: జిల్లాలో యథేచ్ఛగా జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాకు అధికారులు అడ్డుకట్ట వేశారు. కలెక్టర్ అశుతోష్ కులకర్ణి ఆదేశాల మేరకు రెవెన్యూ విభాగాధికారులు గురువారం ఆకస్మిక దాడులను నిర్వహించారు. ఈ దాడుల్లో ఇసుకతో వెళ్తున్న 12 ట్రాక్టర్లను పట్టుకున్నారు. తహసీల్దార్ ప్రియదర్శిని స్వయి నేతృత్వంలో రెండు ప్రత్యేక బృందాలుగా విభజించి మల్లిగాం, పితామహాల్, జిమడిపేట ప్రాంతాల్లో దాడులు చేపట్టారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను అడ్డుకున్నారు. పట్టుబడిన వాహనాల్లో నాలుగు ట్రాక్టర్లు రాయగడ తహసీల్దార్ కార్యాలయానికి అధికారులు తరలించగా.. మరో రెండు ట్రాక్టర్లను శేశఖాల్ పోలీస్‌స్టేషన్‌కు అప్పగించారు. రెండు ట్రాక్టర్లకు ఇసుక రవాణాకు సంబంధించి ఎటువంటి అనుమతులు లేవని గుర్తించిన అధికారులు రూ.2,700ల జరిమానా విధించారు. మిగతా పట్టుబడ్డ ట్రాక్టర్లను తనిఖీలు చేసి జరిమానా విధించే ప్రక్రియలో అధికారులు ఓఎంసీ అధికారులకు అప్పగించారు. -
కళలు మన సంస్కృతికి ప్రతీకలు
జయపురం: మన ప్రాచీన కళలు, సంస్కృతిలు మన గుర్తింపుకు ప్రతీకలని చత్తీస్‌గఢ్ రాష్ట్ర బస్తర్ పార్లమెంట్ సభ్యులు మహేష్ కాశ్యప్ అన్నారు. నేడు శ్రీశబరి శ్రీక్షేత్ర కళాసంస్కృతి కొట్‌పాడ్ సమితి కొట్పాడ్లో నిర్వహించిన జిల్లా స్థాయి ఆర్ట్, కల్చరల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మన కళలు, సంస్కృతులు మన గుర్తింపుకు కవచాలని, వాటిని పరిరక్షించటంతో పాటు అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కొట్‌పాడ్ ప్రాంత రిచ్ ట్రెడిషనల్ ఆర్ట్‌ను జానపద సంప్రదాయం ఆదివాసీ హెరిటేజ్ మరింతగా బలోపేతం చేసేందుకు ఈ కార్యక్రమం నిర్వహించటం జరిగిందని శ్రీశబరి శ్రీక్షేత్ర కళా సంస్కృతి నిర్వాహకులు వెల్లడించారు. భవిష్యత్‌లో ఆర్ట్ కల్చరల్ సమావేశాలు విస్తృతంగా నిర్వహించి ప్రాచీన కళా సంస్కృతిను సాంప్రదాయాలను బలోపేతం చేయాలని కోట్పాడ్ ఎమ్మెల్యే రూపు భోత్ర విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కొట్పాటడ్ సమితి అనేక గ్రామాల నుంచి ఆదివాసీ ప్రజలు తమ సంప్రదాయ కళలతో పాల్గొన్నారు. -
ప్లస్ 2లో సెంచూరియన్ విద్యార్థుల ప్రతిభ
పర్లాకిమిడి: సీబీఎస్ఈ ప్లస్ 2లో స్థానిక సెంచూరియన్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు ముగ్గురు టాపర్‌గా నిలిచారు. వందనా రవుతో (91.24శాతం), అనితా రాజు 91.2 శాతం, అభిలాష పాత్రో 90 శాతం మార్కులు సాధించారు. వీరే కాక 12 మంది విద్యార్థులు 80శాతం, 26 మంది విద్యార్థులు 70 శాతం మార్కులు సాధించినట్టు ప్రిన్సిపల్ సునీతా పాణిగ్రాహి తెలిపారు. సెంచూరియన్ పబ్లిక్ స్కూల్ 12వ తరగతి విద్యార్థులకు అధ్యక్షులు డాక్టర్ ముక్తీ కాంత మిశ్రా, ఉపాధ్యక్షులు ఆచార్య డి.ఎన్.రావు, ప్రాంతీయ డైరక్టర్ (అడ్మిన్)సంబిత్ పాత్రో, వైస్ ప్రిన్సిపల్ జేకే నాయక్, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి వెంకటపాలెం పంచాయతీ మాంగిపల్లి గ్రామంలో మతమార్పడులపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. 250 కుటుంబాలు ఉన్న ఊరిలో వెయ్యి మంది వరకు మరో మతాన్ని స్వీకరించారు. గ్రామంలోని పూజలు, కట్టుబాట్లలో వారి జోక్యం పెరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. బయట ప్రాంతాలు, ఇతర భాషలకు చెందిన వారు మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెబుతున్నారు. దీన్ని అరికట్టాలని గురువారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో అర్జీ అందజేశారు. -
ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కొనేందుకు సిద్ధం
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొవడానికి ముందస్తుగా సైక్లోన్, వరద ప్రభావిత ప్రాంతాల్లో షెల్టర్లు, ఆహారం, చెట్లు నరికే యంత్రాలను సిద్ధం చేయాలని బరంపురం ఎంపీ ప్రదీప్ కుమార్ పాణిగ్రాహి అన్నారు. స్థానిక కలెక్టరేట్లో గురువారం జరిగిన వివిధ ప్రభుత్వశాఖల అధికారులతో జరిపిన డిజాస్టర్ మేనేజ్మెంట్, జిల్లా స్థాయి ప్రకృతి వైపరీత్యాల కమిటీ సమావేశానికి ఎంపీ ప్రదీప్ పాణిగ్రాహి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ అక్షయ సునీల్ అగర్వాల్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. మోహనా, పర్లాకిమిడి ఎమ్మెల్యేలు దాశరథి గోమాంగో, రూపేష్ పాణిగ్రాహి, జిల్లా ఎస్పీ (ఇన్చార్జి) సునీల్ కుమార్ మహంతి, డీఎఫ్ఓ కె.నాగరాజు, అత్యవసర విభాగం అధికారి నిరోద్ చంద్ర నాయక్ ముఖ్యవక్తలు హాజరయ్యారు. గజపతి జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ తుపాన్ షెల్లర్లు ఉన్నాయని, కాశీనగర్ సమితిలోని వరద ప్రాంతంలో 3 షెల్టర్లు ఉన్నాయని అత్యవసర విభాగం అధికారి అన్నారు. వాయుగుండం, తుపాన్ సమయంలో జిల్లాలో విపత్తులు ఎదుర్కొవడానికి పునరావాస కేంద్రాలు, కొండచరియలు విరిగిపడే ప్రాంతాలను అధికారులు గుర్తించాలని ఎంపీ సూచించారు. జిల్లా వ్యాప్తంగా తుపాన్లను ఎదుర్కొవడానికి 1007 ప్రాథమిక పాఠశాలలు, 838 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయని, 4020 ఉపాధ్యాయులు అందుబాటులో ఉంటారని జిల్లా ముఖ్యశిక్షాధికారి మయాధార్ సాహు అన్నారు. జిల్లాలో ప్రకృతి విపత్తులు ఎదుర్కొవడానికి గ్రామీణ రోడ్లు డివిజన్, ప్రజాపనుల శాఖ, అగ్నిమాపక దళం సిబ్బంది అందుబాటులో ఉండేలా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఎంపీ అన్నారు. పది పబ్లిక్ పరీక్షల్లో గజపతి జిల్లా రెండో సారి పాస్ శాతంలో ప్రథమం రావడంతో డీఈఓకు ఎంపీ అభినందనలు తెలిపారు. గోపాల్పూర్– తెరువల్లి రైల్వే మార్గాన్ని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆమోదం తెలుపడం పట్ల ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. -
రాష్ట్రంలో చమురు సంక్షోభం
భువనేశ్వర్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పెట్రోల్, డీజిల్ కొరత నెలకొంది. పెట్రోల్ పంపుల వద్ద వినియోగదారులు బారులు తీరుతున్నారు. బంకు వర్గాలు పెట్రోలు, డీజిల్ పరిమితంగా విక్రయిస్తున్నారు. అవసరమైనంత పెట్రోల్ లభించడం లేదని ఉభయ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని కొన్ని ట్యాంకుల్లో పెట్రోల్, డీజిలు అడుగంటిపోయినట్లు సమాచారం. కెంజొహర్, భద్రక్, తెల్కోయ్, బొలంగీర్, జాజ్‌పూర్, భంజనగర్, రూర్కెలా, నీలగిరి, పారాదీప్ ప్రాంతాలలో పెట్రోల్ కొరత ఉంది. ఈ పెట్రోల్ సంక్షోభంపై రాష్ట్ర ప్రైవేట్ బస్సు యజమానుల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ఇదే పరిస్థితి కొనసాగితే మరో 6, 7 రోజుల్లో స్థానిక బస్సు సేవలు నిలిచిపోతాయని రాష్ట్ర ప్రైవేట్ బస్సు యజమానుల సంఘం కార్యదర్శి దేవేంద్ర సాహు తెలిపారు. దీనిపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని ఆయన కోరారు. ప్రజా రవాణాపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అభ్యర్థించారు. ప్రజా రవాణాకు కార్డులు ఏర్పాటు చేసి డీజిల్ అందించాలని కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 14 వేల ప్రైవేటు బస్సులు నడుస్తున్నాయి. పెట్రోల్ లభించకపోవడంతో సుమారు 2000 బస్సు సేవలు నిలిచి పోయాయి. ఇంధనం కొరత కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో బస్సులు అందుబాటులో లేని పరిస్థితి తాండవిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 2,850 పెట్రోల్ అవుట్లెట్లలో 20 నుంచి 22 పంపుల వద్ద తాత్కాలిక అంతరాయం ఏర్పడింది. రాష్ట్రంలో ఇంధన నిల్వలు సరిపడా ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం అభయం ఇస్తుంది. 1 శాతం కంటే తక్కువ పెట్రోల్ పంపులలో కొరత ఉందని ప్రభుత్వ వర్గాల సమాచారం. కలెక్టర్ల ఆధ్వర్యంలో రాష్ట్ర, జిల్లా సంక్షోభ నిర్వహణ బృందాల ద్వారా సరఫరాను తక్షణమే పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ సింగ్ తెలిపారు. లీటరుకు రూ. 130 నుంచి 140 వసూలు చేస్తున్న రిటైలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రజలు భయాందోళనలతో అవాంఛనీయ ఇంధనం కొనుగోలు చేయవద్దని కోరారు. -
మహేంద్రగిరి వివాదంపై కలెక్టరేట్లో సమావేశం
పర్లాకిమిడి: మహేంద్రగిరి పర్వతంపై జూన్ 2 నుంచి జరగనున్న మహేంద్రగిరి మేళాను బిశ్వబసు సవర సంస్కృతి సురక్షా మంచ్ వ్యతిరేకిస్తూ బుధవారం మహేంద్రం వద్ద ఆందోళన జరిపారు. దీనిపై గురువారం జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో మహేంద్రగిరి సవర సంస్కృతి సురక్షా మంచ్ అధ్యక్షులు నిరో భుయ్యాన్, సర్పంచులు, ఇతర ప్రతినిధులుతో సమావేశమయ్యారు. మహేంద్రగరి పర్వతంపై మేళా పేరుతో పర్యావరణం నాశనం చేస్తున్నారని, ఈ మేళాకు బారోఘోరో, మహేంద్రగిరి సురాక్ష మంచ్ ప్రతినిధులను చేర్చలేదని తెలిపారు. సుదీర్ఘంగా గంటసేపు ఆదివాసీ, బిశ్వబజు సవర సంస్కృతి మంచ్ అధినేతలతో కలెక్టరేట్లో చర్చలు జరిపినా చర్చలు ఫలప్రదం కాలేదని మంచ్ అధ్యక్షులు నీరో భుయ్యాన్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయం హాలులో ఆర్.ఉదయగిరి, రామగిరి పోలీసు అధికారులు, జిల్లా పరిషత్ సీడీఓ దయామయ పాఢి ఇతర అధికారులు పాల్గొనగా విలేకరులను అనుమతించ లేదు. దీనిపై కలెక్టర్ అక్షయ సునీల్ అగర్వాల్ సమావేశం అనంతరం బయటకు వచ్చి విలేకరులతో మాట్లాడారు. బిశ్వబసు సవర సంస్కృతి సురక్షా మంచ్ సభ్యుల డిమాండ్లు అసంబద్ధంగా ఉన్నాయని, వారిని కలుపుకుని మహేంద్రమేళా జరపాలన్న డిమాండ్‌ను స్వాగతిస్తామని అన్నారు. మహేంద్రగిరి పర్యావరణం ముప్పు జరుగకుండా జిల్లా యంత్రాంగం ఎప్పుడూ కృషి చేస్తుందని కలెక్టర్ అన్నారు. -
కొరాపుట్ టు పూరీ
కొరాపుట్: శబరి శ్రీ క్షేత్రం కొలువు తీరిన కొరాపుట్ నుంచి జగన్నాథుడు కొలువు తీరిన శ్రీ క్షేత్రానికి రైలు ప్రారంభం కానుంది. అందుకు తగ్గ ఆదేశాలు కేంద్ర రైల్వే శాఖ విడుదల చేసింది. ఈ రైలు ఉదయం 5 గంటలకు కొరాపుట్‌లో బయలు దేరి రాయగడ, కెసింగా, సంబల్పూర్, భువనేశ్వర్, ఖుర్డా రోడ్డు మీదుగా రాత్రి 10.20 కి పూరి చేరనుంది. అలాగే ఉదయం 7 గంటలకు పూరి నుంచి బయల్దేరి 11.30 కి కొరాపుట్ చేరుతుంది. పగటి పూట రాజధానికి రైలు, పూరికి నేరుగా రైలు కావాలని చాలా కాలంగా డిమాండ్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొత్త రైలు ఏర్పాటుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కొరాపుట్‌లో మంగళ వారం, శుక్రవారం, ఆది వారం, పూరిలో సోమ వారం, గురు వారం, శని వారం నడవనుంది. ఈ రైలు ఏర్పాటుపై రాష్ట్ర ముఖ్యమంత్రి మెహన్ చరణ్ మఝి ఎక్స్ వేదిక హర్షం వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు ప్రకటించారు. మరో వైపు కాంగ్రేస్ పార్టీ కి చెందిన కొరాపుట్ ఎంపీ సప్తగిరి ఉల్క తాను అనేక సార్లు పార్లమెంట్ లో ఈ రైలు కోసం డిమాండ్ చేసిన విషయం గుర్తు చేశారు. బీజేపీకి చెందిన కొరాపుట్ ఎంఎల్ఎ రఘురాం మచ్చో మాట్లాడుతూ తాను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని శ్రీ వైష్టవ్ ప్రత్యేకం గా కలసి విజ్ఞప్తి చేయడం తో ఈ రైలు సాధ్యమైందని ప్రకటించారు. -
విజయోత్సవం..
పర్లాకిమిడి: గజపతి జిల్లా రాష్ట్ర స్థాయిలో వార్షిక మాధ్యమిక బోర్డు పరీక్షల్లో 99.3 శాతం ఉత్తీర్ణత సాధించిందినందుకు జిల్లా విద్యావిభాగం, జిల్లా యంత్రాగం తరఫున విద్యార్థులకు స్థానిక గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం హల్లో ఎంపీ ప్రదీప్ కుమార్ పాణిగ్రాహి చేతుల మీదుగా ప్రశంసపత్రాలు, మెమొంటోలు అందజేశారు. గజపతి జిల్లాలో ఉపాధ్యాయులు ‘సూపర్ 30’ మంచి ఫలితాలు ఇచ్చాయని, ఈ విజయం ఇకముందు కూడా కొనసాగిస్తామని ఈ సందర్భంగా డీఈఓ మయాధర్ సాహు అన్నారు. ఈ విజయోత్సవానికి మోహనా ఎమ్మెల్యే దాశరథి గోమాంగో, పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, పురపాలక సంఘం చైర్మన్ నిర్మలా శెఠి, కలెక్టర్ అక్షయసునీల్ అగర్వాల్, జిల్లా సంక్షేమశాఖ అధికారి సల్మన్ రైక, జిల్లా పరిషత్తు సీడీఓ దయామయ పాడీ, ఎస్.డి.సి చెర్మన్ కామదేవ్ బడనాయక్, తదితరులు పాల్గొన్నారు. ఏడు మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఆరుగురు విద్యార్థులు ఏ1గా నిలవగా, మరో ముగ్గురు 90 శాతం మార్కులు సాధించిన వారిని, డీఈఓను ఎంపీ ఘనంగా సన్మానించారు. -
మహిళా రిజర్వేషన్ బిల్లు తక్షణమే అమలు చేయాలి
రాయగడ: దేశవ్యాప్తంగా మహిళలకు లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించే మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలని బీజేడీ డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం ఆ పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు అనసూయ మాఝి నేతృత్వంలో స్థానిక గజపతి కూడలి నుంచి ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 2023లో పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లుకు బీజేడీ నిస్వార్థంగా మద్దతు తెలిపిందన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం వివిధ కుంటి సాకులు చెబుతూ ఇప్పటివరకు ఆ బిల్లును అమలు చేయలేదని మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్ పేరుతో నియోజకవర్గాల పునర్విభజన బిల్లును ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. దేశంలో మహిళలకు రాజకీయంగా సముచిత ప్రాతినిధ్యం కల్పించేందుకు 33 శాతం రిజర్వేషన్ బిల్లును తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఒడిశా రాష్ట్రంలో పెరుగుతున్న మహిళలపై దాడులు, వేధింపులు అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జగన్నాథ సరక, కార్య నిర్వాహక అధ్యక్షుడు పట్నాన గౌరీ శంకర్, సుధీర్ దాస్, జగదీష్ పాత్రో తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఏడీఎం నవీన్ చంద్ర నాయక్‌కు వినతిపత్రం అందజేశారు. -
లారీని ఢీకొన్న బొలెరో వ్యాన్
నందిగాం: కొండతెంబూరు గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై గురువారం వేకువజామున 3 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒడిశా రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొరాపుట్ జిల్లా సెమిలిగూడ పంచాయతీ గోపబంధునగర్‌కు చెందిన నిరంజన్ దొలయ్ (67) కూరగాయల వ్యాపారం చేస్తుంటాడు. ఈ క్రమంలో కొరాపుట్ నుంచి బరంపురం పట్టణానికి కూరగాయలను గంజాం జిల్లా కరాచులీకు చెందిన ఆరతానాయక్ బొలెరా వ్యాన్‌లో తీసుకువెళ్తుండగా గురువారం వేకువజామున నందిగాం మండలం కొండతెంబూరు వద్దకు వచ్చే సరికి వ్యాన్ అదుపు తప్పింది. డివైడర్‌ను దాటి పలాస నుంచి టెక్కలి వైపు వస్తున్న లారీని బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో వ్యాన్ నుజ్జయిపోవడంతో డ్రైవర్ ఆరతానాయక్ అక్కడికక్కడే మృతి చెందాడు. పక్కన ఉన్న నిరంజన్దొలయ్ తీవ్ర గాయాలతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. సమాచారం అందుకున్న నందిగాం ఎస్సై షేక్ మహమ్మద్ ఆలీ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని నిరంజన్ దొలయ్ను టెక్కలి జిల్లా కేంద్ర ఆసుసత్రికి తరలించగా అక్కడ ఆయన మృతి చెందాడు. మృతుల వివరాలను బంధువులకు తెలియజేశారు. వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బీజేపీ భారీ ర్యాలీ
రాయగడ: పార్లమెంట్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించే నారీ శక్తి వందన్ అభియాన్‌కు మద్దతుగా బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో సదరు సమితి పరిధిలోని జిమిడిపేటలో గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మహిళలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. మహిళా సాధికారతకు తమ మద్దతు ప్రకటించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకిస్తున్న ప్రతిపక్ష పార్టీల వైఖరిని తీవ్రంగా ఖండించారు. కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు రజిత కొరాడ, ఆ పార్టీ నాయకురాలు అశ్విని కొంచాడ, ఎస్డీసీ వైస్ చైర్మన్ మంజుల మినియాక, జిల్లా ఎస్సీ, ఎస్టీ మోర్చా ఉపాధ్యాక్షుడు బసంత కుమార్ ఉలక, కెరడ సర్పంచ్ విజయలక్ష్మి, ప్రతాప్ పువ్వల పాల్గొన్నారు. -
క్రికెట్ పోటీలు ప్రారంభం
రాయగడ: క్రీడలు, యువజన సేవల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సీఎం ట్రోఫీ–2026 ఒడిశా క్రీడా మహాకుంభం అంతర జిల్లా స్థాయి క్రీడా పోటీలు గురువారం ప్రారంభమయ్యాయి. స్థానిక గోవింద చంద్ర దేవ్ ఉన్నత పాఠశాల మైదానంలో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాయగడ ఎమ్మెల్యే అప్పల స్వామి కడ్రక హాజరయ్యారు. ప్రతిభలు అనేకం–లక్ష్యం ఒక్కటే అనే నినాదంతో ప్రారంభమైన ఈ కార్యక్రమం విజయవంతమవ్వాలని ఆకాంక్షించారు. క్రీడా రంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న శ్రద్ధను ప్రశంసించారు. క్రీడాకారులను ప్రోత్సాహించాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ప్రత్యేక అభివృద్ధి మండలి (ఎస్డిసి) చైర్మన్ విద్యాధర్ సబర్, వైస్ చైర్పర్సన్ మంజుల మినియాక, జిల్లా అదనపు కలక్టర్ నవీన్ చంద్ర నాయక్, తదితరులు పాల్గొన్నారు. జిల్లా క్రీడాశాఖ అధికారి షేక్ ఆలీనూర్ మాట్లాడుతూ.. ఈ నెల 14 నుంచి ప్రారంభమైన ఈ పోటీలు 20వ తేదీ వరకు కొనసాగుతాయన్నారు. -
ఎక్స్‌ప్రెస్ రైల్ సేవలకు ఆమోదం
రాయగడ: రాష్ట్రంలో రైల్వే కనెక్టివిటీ అభివృద్ధిలో భాగంగా రైల్వే మంత్రిత్వశాఖ పూరి–కొరాపుట్ మధ్య కొత్త త్రై సప్తాహిక ఎక్స్‌ప్రెస్ రైల్ సేవకు ఆమోదం తెలిపింది. పూరి–కొరాపుట్–పూరి ఎక్స్‌ప్రెస్ రైతుల తీర ప్రాంతం, పశ్చిమ, దక్షిణ ఒడిశా ప్రాంతాల మధ్య రవాణా సౌకర్యాలను మరింత బలొపేతం చేయనుంది. ఈ రైలు ఖుర్దా రోడ్ , భువనేశ్వర్, డెంఖానాల్, తాల్చేర్ రోడ్డు, అనుగూల్, బొయిండా, రెఢాకాల్, సంబల్పూర్, బరఘడ్ రోడ్డు, బలంగీర్, టిట్లాఘడ్, కేసింగా, మునిగుడ, రాయగడ, టికిరి, లక్ష్మీపూర్ రోడ్డు, కక్కిరిగుమ్మ, ధమన్జొడివంటి ముఖ్య స్టేషన్లలో ఆగుతుంది. ఈ కొత్త సేవ ద్వారా పూరి, భువనేశ్వర్ వంటి ప్రధాన నగరాలకు దక్షిణ ఒడిశాలోని ఆదివాసీ ప్రాబల్యం ఉన్న జిల్లాల మధ్య నేరుగా రైలు కనెక్టివిటీ ఏర్పడనుంది. దీనివల్ల విద్య, వైద్యం, ఉపాధి, వ్యాపార, పర్యాటక రంగాల్లో గణనీయ అభివృద్ధి చోటు చేసుకోనుంది. ప్రత్యేకంగా కేబీకే ప్రాంత జిల్లాలైన కొరాపుట్, రాయగడ, కలహండి ప్రాంతాలకు అనుసంధానించే విధంగా సహకరిస్తుంది. శ్రీజగన్నాథ ఆలయ దర్శనానికి వెళ్లే భక్తులకు, కొరాపుట్ రాయగడ ప్రాంతాల ప్రకృతి సౌందర్యాలను, ఆదివాసీ సంస్కృతిని చూడాలనుకునే పర్యాటకులకు ఈ రైలు సేవలు ఎంతో ఉపాయోగపడుతుంది. ఎప్పటి నుంచో ఈ ప్రాంత వాసులు ఉదయం పూట పూరి, భువనేశ్వర్ వంటి ప్రాంతాలకు రైలు సౌకర్యం కల్పించాలని చేస్తున్న డిమాండ్ నెరవేరనుంది. నందపూర్‌లో పెట్రోల్ కొరత కొరాపుట్: కొరాపుట్ జిల్లా నందపూర్‌లో పెట్రోల్ కొరత ఏర్పడింది. గురువారం స్థానిక పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టారు. పెట్రోల్ దొరకదనే వదంతుల నేపథ్యంలో ఈ పరిస్థితి ఏర్పడింది. సమీప ఆంధ్రలోని అల్లూరి సీతారామరాజు జిల్లా సరిహద్దు నుంచి పెద్ద ఎత్తున వాహనదారులు రావడంతో ఈ పరిస్థితి నెలకొంది. -
పరిహారం చెల్లించాలని బాధితుల డిమాండ్
జయపురం: జయపురం–మల్కన్‌గిరి రైల్వేలైన్ కోసం తమ భూములు తీసుకున్న ప్రభుత్వం నేటి వరకు తగిన పరిహారం చెల్లించలేదని బాధిత రైతులు నేడు బొయిపరిగుడ తహసీల్దార్ కార్యాలయాన్ని ఘెరావ్ చేశారు. భూములు కోల్పోయిన బాధితుల సంఘం నేతృత్వంలో బాదితులు ఆందోళన జరిపారు. జయపురం–మల్కన్‌గిరి రైలు మార్గం కోసం తమ భూములు తీసుకున్నారని, అయితే భూములకు నష్ట పరిహారం చెల్లించలేదని వారు ఆరోపించారు. అందు చేత తాము తహసీల్దార్ కార్యాలయాన్ని ఘొరావ్ చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా వారు తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న అదనపు తహసీల్దార్ ఝడేశ్వర షొడంగికి మెమోరాండం సమర్పించారు. జయపురం–మల్కనగిరి కొత్త రైల్వే లైన్ కోసం సర్వే జరిపే ముందు అనేక మంది రైతులు తాము భూములు కోల్పోతామని భావించారని, అందుకు భూములు ఇచ్చేందుకు నిరాకరించినా అధికారులు బలవంతంగా భూములు తీసుకున్నారని వారు ఆరోపించారు. అయితే భూములు కోల్పోయిన బాధితులకు ఉచిత ధర చెల్లించకుండా ఎండు చేపల మార్కెట్లా తమ ఇష్టం వచ్చిన ధర ఇచ్చేందుకు అధికారులు నిర్ణయించటంతో భూములు కోల్పోయిన బాదిత రైతుల సంఘం తహసీల్దార్‌ను కలసి భూములకు మార్కెట్ ధర చెల్లించాలని కోరటం జరిగిందని వెల్లడించారు. ఆ మేరకు తహసీల్దార్‌కు మెమొరాండం సమర్పించినట్లు వెల్లడించారు. ప్రస్తుత భూమి ధర ప్రకారం జయపురం నుంచి మల్కన్‌గిరి వరకు సేకరించిన భూముల రైతులకు పరిహారం చెల్లించాలని బాధిత రైతుల సంఘం డిమాండ్ చేసింది. భూములు కోల్పోయిన రైతుల కుటుంబాల్లో చదుకున్న వారి చదువులను బట్టి వారి అర్హత మేరకు రైల్వే విభాగంలో ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేసినట్లు వెల్లడించారు. భూములు కోల్పోయిన వారికి ప్రభుత్వం పంట భూములు, ఇళ్ల స్థలాలు సమకూర్చి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు వెల్లడించారు. -
వ్యక్తి ఆత్మహత్య
గార: రామచంద్రాపురం పంచాయతీ సెగిడిపేట గ్రామానికి చెందిన కర్రి త్రినాథరావు (45) గురువా రం గ్రామ సమీపంలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరా ల ప్రకారం.. త్రినాథరావు ఒప్పంగిలోని మిల్లులో కలాసీగా పనిచేస్తున్నాడు. మూడు రోజులుగా పనికి వెళ్లకుండా రోజూ మద్యం తాగుతున్నాడు. తాగవద్ద ని భార్య మందలించడంతో గురువారం సాయంత్రం మళ్లీ మద్యం తాగి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం శ్రీకాకు ళం రిమ్స్‌కు తరలించారు. భార్య రాంబాయి ఫిర్యా దు మేరకు హెచ్‌సీ రవిబాబు కేసు నమోదు చేశారు. త్రినాథరావుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నార -
నిందితులను అరెస్టు చేయండి
రాయగడ: ఈనెల 9వ తేదీ రాత్రి స్థానిక అంబేడ్కర్ నగర్ రెల్లివీధికి చెందిన హడప నిఖిల్ అనే యువకుడు హత్యకు గురయ్యాడు. అయితే హత్య జరిగి ఆరు రోజులు పూర్తవుతున్నా నిందితులను పట్టుకోవడంలో పోలీసులు ఎటువంటి పురోగతిని సాధించలేదని నిరసిస్తూ మృతుని కుటుంబీకులు, బంధువులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఎస్పీ స్వాతి ఎస్.కుమార్, కలెక్టర్ అశుతోష్ కులకర్ణిలను గురువారం కలిసి వినతిపత్రం అందజేశారు. మరో 15 రోజుల్లో హత్యకు కారకులైన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఇటువంటి దుశ్చర్య ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తుందని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఇప్పటికై నా నిందితులను అరెస్టు చేసి, తగిన శిక్ష వేయాలని కోరారు. -
భవనం పైనుంచి పడి తాపీమేసీ్త్ర మృతి
పీఎం పాలెం (విశాఖ): భవన నిర్మాణ పనుల కోసం విశాఖ నగరానికి వచ్చిన ఓ తాపీ మేసీ్త్ర ప్రమాదవశాత్తు పై అంతస్తు నుంచి కింద పడి మృతి చెందిన విషాద ఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పీఎం పాలెం సీఐ జి.బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. గార మండలం శ్రీకూర్మానికి చెందిన ఉంకుల రాము (47) క్రికెట్ స్టేడియం సమీపంలోని ఒక నిర్మాణంలో ఉన్న భవనంలో తాపీ మేసీ్త్రగా పనిచేస్తున్నాడు. పగలు పని ముగించుకుని రాత్రి అదే భవనం నాలుగో అంతస్తులో తోటి కార్మికులతో కలిసి నిద్రించాడు. తెల్లవారుజామున రాము కనిపించకపోవడంతో తోటి వారు వెతకగా, భవనం ప్రహరీ అవతల శవమై కనిపించాడు. రాత్రి సమయంలో నిద్రమత్తులో భవనం అంచుకు వెళ్లినప్పుడు రక్షణ గోడ లేకపోవడంతో ప్రమాదవశాత్తు కింద పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. రాముకు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. కుమారుడు యుగంధర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. -
విపక్షాలపై బీజేపీ వర్గీయుల మండిపాటు
జయపురం:పార్లమెంట్లో ప్రవేశ పెట్టిన మహిళా శక్తి బిల్లును ప్రతి పక్షాలు వ్యతిరేకించటాన్ని నిరసిస్తూ బీజేపీ మహిళా మోర్చా జయపురంలో ఆగ్రహ సభ, పాదయాత్ర నిర్వహించారు. నేడు జయపురంలో బీజేపీ వర్గాలు విపక్షాల చర్యకు నిరసన తెలుపుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేటి సాయంత్రం స్థానిక రఘునాథ్ మందిర కూడలి నుంచి శోభాజాత్రగా బయలు దేరి పట్టణంలో వీధిలలో తిరిగారు. ఈ సందర్బంగా వారు కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ, ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయిక్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శోభా జాత్ర జయపురం 26 వ జాతీయ రహదారి కూడలి వద్దకు వచ్చి అక్కడ బహిరంగ సభ నిర్వహించారు. -
‘మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేయాలి’
జయపురం: మహిళా రిజర్వేషన్ బిల్లు వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ దివిటీలు, కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించింది. జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడలో బుధవారం సాయంత్రం యూత్ కాంగ్రెస్ నేతృత్వంలో కార్యక్రమం జరిగింది. బొయిపరిగుడ సమితి అధ్యక్షుడు రామ ఖిలో నేతృత్వంలో నిర్వహించిన ర్యాలీ బీరకంభ పీఠం నుంచి సహిద్ లక్ష్మణ నాయిక్ జంక్షన్ వరకు సాగింది. ర్యాలీలో కొరాపుట్ ఎంపీ సప్తగిరి శంకర ఉల్క ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళల సంరక్షణ బిల్లు 2023 పార్లమెంట్లో పాసైందని వెల్లడించారు. 33 శాతం రిజర్వేషన్‌తో పాసయిన బిల్లును కేంద్రం వెంటనే అమలు చేయాలన్నారు. బీజేపీ ప్రభుత్వం మరోసారి కొత్త బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టి దేశ మహిళలను పక్క దారి పట్టిస్తున్నారని నిందించారు. కార్యక్రమంలో కొరాపుట్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రూపక్ తురుక్, కొట్‌పాడ్ విధాన సభ కాంగ్రెస్ అభ్యర్థి అనమా దియాన్ తదితరులు పాల్గొన్నారు. -
18న అరసవల్లి ఆలయ హుండీ కానుకల లెక్కింపు
శ్రీకాకుళం : జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో ఈ నెల 18న హుండీ కానుకల లెక్కింపు నిర్వహించనున్నట్లు ఆలయ ఉప కమిషనర్, కార్యనిర్వహణాధికారి కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపా రు. దేవాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో ఉదయం 8 గంటల నుంచి ప్రక్రియ ప్రారంభం కానుందని పేర్కొన్నారు. అనువంశిక ధర్మకర్తలు, అర్చకులు, భక్తులు, గ్రామపెద్దల సమక్షంలో హుండీలను తెరిచి కానుకలను లెక్కిస్తామని తెలిపారు. రణస్థలం : లావేరు మండలం రావివలస జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై గురువారం ఉదయం 5 గంటల సమయంలో శ్రీకాకుళం వైపు నుంచి విశాఖపట్నం వైపు బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 13 పశువులను లావేరు పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై కె.అప్పలసూరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాకుళం క్రైమ్ : ఇచ్ఛాపురం, టెక్కలి, కోట బొమ్మాళి ఎకై ్సజ్ స్టేషన్ల పరిధిలో 15 కేసుల్లో పట్టుబడిన 261 కిలోల గంజాయిని విశాఖ జిల్లా భీమునిపట్నం కాపులుప్పాడ గ్రామంలో జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ కంపెనీ సమీపంలో ధ్వంసం చేసినట్లు జిల్లా ఎకై ్సజ్ అధికారి తిరుపతినాయుడు తెలిపారు. ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్, డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ డి.శ్రీకాంత్‌రెడ్డి సమక్షంలో ధ్వంసం చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ పి.రామచంద్రరావు, పి.రామచంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆమదాలవలస : గాజులకొల్లివలస గ్రామానికి చెందిన వెలమరెడ్డి రాకేష్ (25) అనే యువకుడు బుధవారం రాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై సనపల బాలరాజు తెలిపిన వివరాల మేరకు.. తండ్రి లేని రాకేష్ తన తల్లి మంగమ్మతో కలిసి గాజులకొల్లివలసలో నివాసం ఉంటున్నాడు. బుధవారం రాత్రి తల్లితో ఇంటి విషయంలో గొడవ జరిగింది. దీంతో మనస్థాపానికి గురై ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే వెంటనే కిందకు దించి జొన్నవలస సీహెచ్‌సీకి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి మేనమామ కంచర్ల శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవపంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. ఆమదాలవలస: మండలంలోని తోటాడ గ్రామానికి చెందిన యువ పరిశోధకుడు తమ్మినేని సంతోష్ కుమార్ అరుదైన ఘనత సాధించి గ్రామానికి, జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. ఇటీవల విడుదలైన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎపీపీఎస్సీ) డిగ్రీ లెక్చరర్ పరీక్షా ఫలితాలలో కామర్స్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంక్ సాధించి తన ప్రతిభను చాటుకున్నారు. ఈ విషయాన్ని గురువారం వెల్లడించారు. సాధారణ గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన సంతోష్ కుమార్ కష్టపడి చదువుతూ ఉన్నత లక్ష్యాలను సాధించి యువతకు ఆదర్శంగా నిలిచారు. ఇటీవలే ఆంధ్ర యూనివర్సిటీలో పీహెచ్డీ పరిశోధనను సమర్పించారు. అకడమిక్ రంగంలోను పోటీ పరీక్షల్లోనూ ఒకేసారి ప్రతిభ కనబరిచిన ఆయన విజయంపై గ్రామ ప్రజలు అధ్యాపకులు మిత్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన సాధించిన ఈ ఘనతతో తోటాడ గ్రామంలో ఆనంద వాతావరణం నెలకొంది. -
ధాన్యం మండీ ఏర్పాటు చేయాలి
జయపురం: జయపురం సబ్ డివిజన్ కొట్‌పాడ్ పంచాయతీ సమితి చందిలి గ్రామ పంచాయతీ దేవుడ మౌజాలో ధాన్యం మండీ ఏర్పాటు చేయాలని స్థానిక రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం రైతు నాయకుడు పద్మనాభ బిశాయి ఆధ్వర్యంలో జయపురం సబ్‌కలెక్టర్ జాదు మణినాయిక్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ప్రాంతంలో ధాన్యం మండీ ఏర్పాటు చేసేందుకు స్థలం గుర్తించినా నేటికీ నిర్మించలేదని పేర్కొన్నారు. ఓ దళారీ పిప్లహండి గ్రామంలో మండీ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని, ఆ స్థలం రైతులకు ఉపయోగకరం కాదన్నారు. కార్యవర్గం ఏర్పాటు రాయగడ: కళింగ వైశ్య సంఘం కొత్తపేట శాఖకు నూతన కార్యవర్గం బుధవారం ఏర్పాటైంది. సంఘం అధ్యక్షుడిగా కొత్తకొట శ్రీధర్, ఉపాధ్యక్షుడిగా కొరపాన శ్రీనివాస్‌రావు, కార్యదర్శిగా పెద్దీన నాగేశ్వరరావు, సహాకార్యదర్శిగా మద్ది సురేష్ కుమార్, కోశాధికారిగా ఊళ్ల కాంతారావు ఏకగ్రీవంగా నియమితులయ్యారు. ఈ మేరకు కొత్తపేటలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమానికి రాయగడ కళింగ వైశ్య సంఘానికి చెందిన ప్రతినిధులు నరేష్ కుముందాన్, కింతలి శ్యామసుందర్ రావు, తదితరులు కొత్తగా ఏర్పాటైన కార్యవర్గ సభ్యులను అభినందించారు. సీబీఎస్ఈ ఫలితాల్లో విద్యార్థుల ప్రతిభ రాయగడ: సీబీఎస్ఈ ఇంటర్మీడియెట్ ప్లస్–2 పరీక్ష ఫలితాల్లో స్థానిక సెంచూరియన్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఐసారాణి దాస్ 90.2 శాతం మార్కులతో మొదటి స్థానం సాధించగా సుజయ్ మండల్, వర్షాపాడిలు 88 శాతం మార్కులతో రెంతో స్థానాన్ని దక్కించుకున్నారు. పబ్లిక్ స్కూల్ నుంచి మొత్తం 122 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవ్వగా.. వారిలో 53 మంది డిస్టింక్షన్ సాధించారు. మిగతా విద్యార్థులంతా ఫస్ట్ క్లాస్‌ల్లో ఉత్తీర్ణులయ్యారు. తమ పిల్లల విజయంపై తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సెంచూరియన్ విశ్వవిద్యాలయం రీజనల్ డైరెక్టర్ డాక్టర్ రాజేష్ కుమార్ పాఢి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. ప్రజారవాణాకు ప్రాధాన్యమివ్వండి భువనేశ్వర్: మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న సంఘర్షణల ప్రభావంతో ప్రపంచ చమురు సంక్షోభం తలెత్తింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ బుధవారం రాష్ట్ర ప్రజలకు సలహా జారీ చేశారు. చమురు దిగుమతులు గతం కంటే తగ్గుముఖం పట్టిన పరిస్థితుల్లో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రజలు ప్రైవేట్ వాహనాల వాడకాన్ని తగ్గించి ప్రజా రవాణాను ఎక్కువగా ఉపయోగించుకోవాలని కోరారు. దీనివల్ల ఖర్చులు ఆదా అయి చమురు సంక్షోభాన్ని కొంతమేరకై నా ఎదుర్కోవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. అత్యవసరం అయితేనే వాహనాలను ఉపయోగించాలని, అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలన్నారు. అనవసరంగా బంగారం కొనుగోలు నివారించాలని, అత్యవసరం కాని విదేశీ పర్యటనలను వాయిదా వేసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి తన సొంత వాహనాల సంఖ్యను కూడా తగ్గించుకున్నట్లు ప్రకటించారు. -
ఐదు కేజీల గంజాయితో ఒకరు అరెస్టు
ఇచ్ఛాపురం: గంజాయి అక్రమ రవాణాకు ప్రయత్నించిన ఝార్ఖండ్ రాష్ట్రానికి యువకుడిని స్థానిక రైల్వేస్టేషన్ వద్ద అరెస్ట్ చేసినట్లు సీఐ మీసాల చిన్నంనాయుడు తెలిపారు. ఈ మేరకు పోలీస్ సర్కిల్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. స్థానిక రైల్వేస్టేషన్ రెండో నంబర్ ప్లాట్‌ఫాం వెనుక వైపునున్న రోడ్డు కూడలిలో పట్టణ పోలీసులు బుధవారం తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఝార్ఖండ్ రాష్ట్రంలోని పశ్చిమ సింగభూమ్ జిల్లా తుంటకట గ్రామానికి చెందిన రాజ్అభిషేక్ రాజ్ఞ సింకు 5 కేజీల గంజాయి కలిగిన సూట్ కేస్‌తో వస్తుండగా పట్టుబడినట్లు వెల్లడించారు. నిందితుడిని విచారించగా అతని ఆర్థిక పరిస్థితి బాగులేకపోవడంతో గంజాయి వ్యాపారం చేసే తన దగ్గరి బంధువు అయినటుంటి ఝార్ఖండ్‌లోని నయాగామ్ గ్రామానికి చెందిన అనురాగ్పట్ సింగ్విని కలిసి పని కల్పించాలని కోరాడు. దీంతో అతను ఒడిశా నుంచి గంజాయి తీసుకొచ్చే సమయంలో సాయం చేస్తే రూ.10 వేలు ఇస్తానని చెప్పడంతో అంగీకరించాడన్నారు. ఈ క్రమంలో ఒడిశా రాష్ట్రంలోని కందమాల్ జిల్లా నుంచి పలుదపాలుగా గంజాయిని తరలించినట్లు అంగీకరించాడు. ఇదేవిధంగా కందమాల్‌లోని కరణ్‌నాయక్ అలియాస్ దేబదాస్నాయక్ వద్ద నుంచి మంగళవారం 5 కేజీల గంజాయిని కొనుగోలు చేసి గంజాం జిల్లా చీకటి మీదుగా ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్‌కి చేరుకొని, అక్కడి నుంచి భువనేశ్వర్ చేరుకొని అటుగా ఝార్ఖండ్కి వెళ్లిపోవడానికి సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో రైల్వేస్టేషన్ రెండో నంబర్ ప్లాట్‌ఫాం వద్దకు వస్తుండగా పోలీసులకు పట్టుబడ్డాడు. అతని వద్దనుంచి గంజాయితో పాటు సెల్‌ఫోన్‌ని స్వాధీనం చేసుకొని పోలీసులు అరెస్టు చేశారు. కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ ఎం.ముకుందరావు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
హోమ్ డెలివరీ సదుపాయం ప్రారంభం
పొందూరు: స్థానిక పోస్టాఫీసులో పార్శిల్ ప్యాకింగ్ యూనిట్(పీపీయూ) ద్వారా హోమ్ డెలివరీ సదుపాయాన్ని జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ వి.హరిబాబు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కస్టమర్లకు పోస్టల్ డిపార్టమెంటల్ లోగోతో పార్శిల్స్ సురక్షితంగా చేరుకుంటాయని చెప్పారు. సోంపేట, పాలకొండ, కాశీబుగ్గ, టెక్కలి, ఆమదాలవలస, శ్రీకాకుళం హెచ్‌వో, రాజాం పోస్టాఫీసుల్లోనూ పీపీయూ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రైవేట్ కొరియర్ల కంటే మెరుగైన, సురక్షితమైన, సౌకర్యవంతమైన సేవలను పోస్టాఫీసుల్లో అందజేస్తామని పేర్కొన్నారు. 4 రకాల పార్శిల్స్ బుకింగ్ సదుపాయం అందుబాటులో ఉందని చెప్పారు. రూ.22ల నుంచి రూ.185ల వరకు పార్శిల్ ధరలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉచిత ఆధార్, బయోమెట్రిక్ సేవలు పోస్టాఫీసుల్లో 15 ఏళ్లలోపు పిల్లలకు ఉచితంగా ఆధార్, బయోమెట్రిక్ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. నూతన ఆధార్ కార్డుల సేవలతో పాటు ఆధార్, బయోమెట్రిక్ సేవల్లో సాంకేతిక సమస్యలను తీర్చడానికి, నిరంతరం సేవలు అందించేందుకు పోస్టాఫీసుల్లో ప్రభుత్వం ఆధార్ కేంద్రాలను తెరిచిందన్నారు. 15 ఏళ్లలోపు పిల్లల ఆధార్, బయోమెట్రిక్ అప్డేట్ చేసుకునేందుకు విధిగా తల్లిదండ్రులతో మాత్రమే పోస్టాఫీసులకు రావాలని సూచించారు. ఆయనతో పాటు సబ్ పోస్టు మాస్టర్ ఎం.ఆనంద్, సిబ్బంది పాల్గొన్నారు. -
ఉత్సాహంగా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
జయపురం: జయపురం ఓరియన్ క్రికెట్ క్లబ్బు ఆధ్వర్యంలో మూడో ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ఉతాహంగా బుధవారం ప్రారంభమైంది. జయపురం దసరా మైదానం (జయపురం విక్రమ క్రీడా మైదానం)లో నిర్వహిస్తున్న టోర్నమెంటు ప్రారభంభానికి జయపురం సమితి బీడీవో శక్తి మహాపాత్రో ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జయపురంలో ఓరియన్ క్రికెట్ క్లబ్బు మూడేళ్లుగా జేసీఎల్–3వ లీగ్ క్రికెట్ పోటీలు నిర్వహిస్తూ యువ క్రీడాకారులను ప్రోత్సహిస్తుండడం అభినందనీయమన్నారు. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌కు మంచి గుర్తింపు ఉందన్నారు. కొరాపుట్ జిల్లా క్రికెట్ క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలలో జిల్లాకు పేరు తేవాలని పిలుపు నిచ్చారు. జయపురం సబ్‌డివిజన్ అథ్లటిక్ అసోసియేషన్ కార్యదర్శి రబి నాయిక్, బీజేడీ సీనియర్ నేత, క్రీడాభిమాని బాలా రాయ్, ప్రముఖ వ్యాపారులు సూర్యపట్నాయక్, క్రీడాకారుడు, సమాజ సేవకుడు సుభాష్ రౌత్, ఓరియన్ క్రికెట్ క్లబ్బు అధ్యక్షులు బాబులరౌత్లు వేదికను అలంకరించారు. బాబుల్ రౌత్ మాట్లాడుతూ.. గత మూడేళ్లుగా తాము ప్రీమియర్ క్రికెట్ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఏడాది ఈ నెల 13 నుంచి 20వ తేదీ వరకు టోర్నమెంట్ జరుగుతోందని వెల్లడించారు. ఈసారి ఛతీస్‌గఢ్ రాష్ట్రం నుంచి కూడా క్రికెట్ జట్లు పోటీల్లో పాల్గొంటున్నాయన్నారు. వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల నుంచి కూడా క్రికెట్ జట్లను ఆహ్వానించి జీపీఎల్ పోటీలకు జాతీయస్థాయి గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. -
గొంతు కోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
సారవకోట: మండలంలోని కురిడింగి గ్రామానికి చెందిన నంబూరి భాస్కరరావు(57) బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. భాస్కరరావు కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. దీంతో భార్య నీలమ్మ ఉపాధి పనులకు వెళ్లగా, చిన్న కుమార్తె బయట ఉన్న సమయంలో ఇంట్లో ఉన్న బ్లేడుతో గొంతు కోసుకున్నాడు. దీనిని గమనించిన కుమార్తె కేకలు వేయడంతో స్థానికులు 108 వాహనంలో శ్రీకాకుళం సర్వజన ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతున్నాడు. ఆస్పత్రి వర్గాల నుంచి వచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా జట్టు ఎంపిక టెక్కలి రూరల్: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో బుధవారం శ్రీకాకుళం జిల్లా రగ్బీ అసోసియేషన్ సెలక్షన్స్ నిర్వహించారు. సీనియర్ అండర్–18 బాయ్స్ అండ్ గర్ల్స్ ఛాంపియన్ షిప్ కోసం రగ్బీ ఎంపికలను జిల్లా అధ్యక్షుడు డొంకన రామకృష్ణ ప్రారంభించారు. దీనిలో భాగంగా మొత్తం 24 మంది క్రీడాకారులను (12 మంది బాయ్స్, 12 గర్ల్స్) ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపికై న క్రీడాకారులను ఉద్దేశించి రామకృష్ణ మాట్లాడుతూ.. జిల్లాస్థాయికి ఎంపికై న క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. రాష్ట్రస్థాయి పోటీలు పల్నాడు జిల్లా నందిగామ జిల్లా పరిషత్ హైస్కూల్లో జరుగుతాయని తెలిపారు. ఈ ఎంపికల్లో జిల్లా రగ్బీ ప్రధాన కార్యదర్శి పొన్నాడ పార్వతీశం, ఆర్గనైజేషన్ సెక్రటరీ బాడాన నారాయణరావు, ట్రెజరర్ కాపుల రఘునాధరావు, ఎస్.లక్ష్మణ్ రాజా తదితరులు పాల్గొన్నారు. గుర్తు తెలియని వ్యక్తి మృతి వజ్రపుకొత్తూరు: మండలంలోని పూండి రైల్వేస్టేషన్‌కు సమీపంలో బుధవారం 45 ఏళ్లు వయస్సు ఉన్న గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు పలాస జీఆర్పీ ఎస్ఐ ఎ.కోటేశ్వరరావు తెలిపారు. పూండి నుంచి నౌపడ వైపు వెళ్లే అవుట్ కట్స్ వద్ద ప్రమాదం జరిగిందని తెలిపారు. మృతుడు చామన చాయ రంగులో ఉన్నాడని, కుడి చేతిపై సాయిరాం అని పచ్చ బొట్టు ఉన్నట్లు తెలిపారు. అలాగే తెలుపు రంగు ఫుల్ హాండ్స్ షర్టు, తెల్లటి గీతలున్న సర్ప్ కలర్ లుంగీ ధరించినట్లు పేర్కొన్నారు. శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆస్పత్రికి మృతదేహం తరలించి ఉంచినట్లు వివరించారు. ఎవరైనా గుర్తిస్తే 92475 85743, 94922 50069 నంబర్లను సంప్రదించాలని కోరారు. నేత్రదానం శ్రీకాకుళం కల్చరల్: శ్రీకాకుళం నగరంలోని చిన్న బరాటం వీధికి చెందిన పాలిశెట్టి జగన్నాథ (69) బుధవారం మరణించారు. దీంతో అతని నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. నేత్ర సేకరణలో భాగంగా మగటపల్లి కల్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం ఐ టెక్నీషియన్ పూతి సుజాత, నంది ఉమశంకర్ల ద్వారా అతని కార్నియాలు సేకరించి, విశాఖపట్నంలోని ఎల్వీ ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారు. నేత్రదానం చేయాలనుకునేవారు 78426 99321 నంబర్‌ను సంప్రదించాలని కోరారు. ఘనంగా శ్రీముఖలింగేశ్వరుడి తిరువీధి జలుమూరు: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగంలో మధుకేశ్వరుడికి వైశాఖ మాసం బహుళ ఏకాదశి సందర్భంగా బుధవారం తిరువీధి ఉత్సవం నిర్వహించారు. స్వామివారికి ఏకవార అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు చేపట్టారు. పార్వతీపరమేశ్వరుల ఉత్సవ మూర్తులను అలంకరించి పల్లకీలో ఆశీనులుగా చేశారు. అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. -
భానుడి భగభగ
భువనేశ్వర్: రాష్ట్రంలో బుధవా రం తీవ్ర వేసవి తాపం కొనసాగింది. పశ్చిమ, ఉత్తర ఒడిశా ప్రాంతాల్లోని పలుచోట్ల ఉష్ణోగ్ర త 40 డిగ్రీల సెల్సియస్ దాటింది. భారత వాతావరణ శాఖ సమాచారం ప్రకారం 40.5 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రతతో టిట్లాగఢ్ అత్యధిక వేడిమి ప్రదేశంగా నిలిచింది. బొలంగీర్‌లో 40.2, సంబల్పూర్లో 40.1, భవానీపట్నలో 40, ఝార్సుగుడలో 39.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లో 37.3 డిగ్రీల సెల్సియస్, కటక్‌లో 36 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇది లా ఉండగా.. మెరుపులు, బలమైన గాలులు, ఆకస్మిక వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. తీరప్రాంత, ఉత్తర జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాల వల్ల కొంత ఉపశమనం లభించిన పశ్చిమ ఒడిశాలో వేడి కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ సమాచారం. పసుపు హెచ్చరిక.. పలు చోట్ల గురువారం మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పసుపు హెచ్చరిక జారీ చేసింది. బాలాసోర్, భద్రక్, జాజ్‌పూర్, కెంజొహర్, మయూర్భంజ్, కేంద్రాపడా, అంగుల్, ఢెంకనాల్, కటక్, పూరీ, జగత్సింగ్పూర్, ఖుర్దా, నయాగఢ్, గంజాం, గజపతి జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది. ఆయా ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. -
మందకొడిగా..!
శ్రీకాకుళం: ప్రపంచాన్ని కలవరపెడుతున్న అతిపెద్ద అనారోగ్య సమస్య క్యాన్సర్. క్యాన్సర్‌లో ఎన్నో రకాలు ఉన్నప్పటికీ.. మహిళలను తీవ్రంగా వేధిస్తున్నది గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్. క్యాన్సర్ నివారణకు గతంలో ఎటువంటి వైద్యం గానీ, టీకాలు కానీ ఉండేవి కాదు. ఇటీవల కాలంలో ఆధునిక టెక్నాలజీతో కూడిన వైద్య సేవలు అందుబాటులోకి రాగా, తాజాగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు హెచ్‌పీవీ పేరిట వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. ఈ వ్యాక్సిన్‌ను తీసుకోవడం వలన గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను నివారించవచ్చు. 14 ఏళ్లు నిండిన బాలికలకు ఈ టీకాను ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఈ టీకాను వైద్య ఆరోగ్య శాఖ ద్వారా యువతులకు అందుబాటులోనికి తీసుకొచ్చింది. ఈ టీకా వల్ల క్యాన్సర్ మాత్రమే కాకుండా లైంగికంగా సంక్రమించే తొమ్మిది రకాల వైరస్‌లను అరికట్టవచ్చు. అలాగే వైజెనల్ క్యాన్సర్, పల్వర్ క్యాన్సర్‌ను కూడా నివారించవచ్చు. ఈ టీకా ఖరీదు బయట మార్కెట్లో రూ.7,000ల నుంచి రూ.9,000ల వరకు ఉంది. రెండు డోసులు కలిగిన టీకా తొమ్మిది రకాల వైరస్‌లను, మూడు డోసులు కలిగిన టీకా ఏడు రకాల వైరస్‌ను అరికడుతుంది. అయితే బాలికలు, వారి తల్లిదండ్రులకు సరైన అవగాహన లేకపోవడం, కొందరికి టీకా వలన ఏదో జరుగుతుందన్న అపోహ ఉండడం వల్ల జిల్లాలో స్పందన అంతంతమాత్రంగానే ఉంది. ఈ టీకా కొత్తగా తీసుకొచ్చింది కాదు. 2008 నుంచి అందుబాటులో ఉన్నప్పటికీ.. ఖరీదు కాస్త ఎక్కువగా ఉండడం వల్ల ధనిక వర్గాలు సైతం ఈ వ్యాక్సిన్ తీసుకోకుండా వచ్చారు. అయితే ప్రస్తుతం క్యాన్సర్ కేసులు ఎక్కువ అవుతుండడంతో కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఈ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇదీ పరిస్థితి... శ్రీకాకుళం జిల్లాలో వైద్యారోగ్య శాఖ ద్వారా అన్ని పీహెచ్‌సీల్లో హెచ్‌పీవీ వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొచ్చినప్పటికీ మందకొడిగా వ్యాక్సినేషన్ జరుగుతోంది. జిల్లాలో 14,036 మంది బాలికలకు వ్యాక్సిన్ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా, గడిచిన రెండు నెలల్లో 6,000 మందికి మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వగలిగారు. వైద్యారోగ్య శాఖ ప్రచారం కూడా అంతంత మాత్రమే ఉండడం, బాలికలు తల్లిదండ్రుల్లో అనేక అపోహలు ఉండడం వల్ల ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. వైద్యారోగ్య శాఖ అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం, బాలికలు.. వారి తల్లిదండ్రుల్లో అపోహలు తొలగించేలా ప్రచారం చేస్తే ప్రభుత్వ లక్ష్యం నెరవేరే అవకాశం ఉంటుంది. హెచ్‌పీవీ వ్యాక్సిన్ బాలికలకు ఎంత అవసరమో.. 17 ఏళ్ల దాటిన యువకులకూ అంతే అవసరం. యువకులు కూడా వ్యాక్సిన్ తీసుకుంటే వారు తొమ్మిది రకాల వైరస్ల నుంచి రక్షణ పొందడంతో పాటు, వారి జీవిత భాగస్వామికి క్యాన్సర్ వంటి మహమ్మారిని అంటించకుండా ఉండేందుకు దోహదపడుతుంది. దీనిపై అపోహల తొలగించేందుకు గానూ ఇప్పటివరకు డాక్టర్ దానేటి చారిటబుల్ ట్రస్టు ద్వారా 135 మందికి ఉచితంగా వ్యాక్సినేషన్ జరిపాను. కేంద్ర ప్రభుత్వం ఇటువంటి మంచి కార్యక్రమాన్ని తీసుకురావడం అభినందనీయం. దీనిని యువతులు సద్వినియోగం చేసుకోవాలి. – డాక్టర్ దానేటి శ్రీధర్, సీ్త్ర వైద్య నిపుణులు -
అంతా దగా..!
నిగనిగ..● అత్యాశకు పోతున్న కొందరు వ్యాపారులు ● మామిడి పండ్లను మగ్గబెట్టేందుకు రసాయనాల వినియోగం ● ఆరోగ్య సమస్యలు తప్పవని వైద్యుల హెచ్చరిక హిరమండలం: వేసవి కాలం అంటే మామిడి పండ్ల సీజన్. చూడగానే నోరూరుంచే మామిడి పండ్లను ఇష్టపడని వారంటూ ఉండరు. పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ వీటి రుచికి ఫిదా అవుతుంటారు. ఈ కాలంలో చాలామందికి మామిడి పండ్ల విక్రయాలే జీవనాధారం. రోడ్ల పక్కన, షాపుల్లో, తోపుడు బండ్లపై విక్రయాలు జరుగుతూ ఉంటాయి. అయితే లేత పసుపు రంగులో మెరిసిపోతూ కనిపించే మామిడి పండ్ల వెనుక అనారోగ్యం కూడా దాగుంది. కొందరు వ్యాపారులు అత్యాశతో రసాయనాలతో పండ్లను మాగబెట్టి విక్రయిస్తున్నారు. దీనివల్ల రంగు చాలా బాగా కనిపిస్తుంది. చూడగానే ప్రజలు వాటిని కనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కానీ వాటిని తింటే మాత్రం అనారోగ్యాల బారినపడే ప్రమాదం ఉంది. కొన్నిచోట్ల ఎలాంటి లైసెన్సులు లేకుండా పండ్లను మగ్గబెట్టే కేంద్రాలను నిర్వహిస్తు్ాన్న.. అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. నిబంధనలు ప్రకారం వ్యాపారులు అనుమతులు తీసుకోవాల్సి ఉంది. వీటిని పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో మామిడి కాయలు తీసుకొచ్చి రసాయనాలతో పండిస్తూ యథేచ్ఛగా వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. రోగాలు వచ్చే ప్రమాదం కార్బైడ్‌తో మాగబెట్టిన పండ్లను తింటే అల్సర్, నాడి, కాలేయం, చర్మం సంబంధిత వ్యాధులు వస్తాయని ప్రభుత్వ వైద్యాధికారులు చెబుతున్నారు. చిన్నారులకు అనారోగ్యం కలుగుతుందన్నారు. గర్భిణులు ఈ పండ్లు తింటే పుట్టబోయే శిశువులకు జన్యుపరమైన లోపాలు, అనారోగ్యం, ఫిట్స్, జ్ఞాపక శక్తి తగ్గడం, చర్మంపై దద్దురులు రావడం, నల్ల బడడం, శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. కృతిమంగా పండించిన పండు అంతా ఒకే రంగు కలిగి ఉంటుంది. కోసినప్పుడు లోపలి కొంతభాగం పక్వంగాను, మిగతా సగం అపరిపక్వంగా ఉండి సరైన రుచి లేకుండా ఉంటుంది. అందువలన పండ్లను నీటితో బాగా శుభ్రం చేసి తొక్కను తీసితింటే కొంతవరకు రసాయనాల ప్రభావం తగ్గుతుంది. – పి.సాయికుమార్, వైద్యాధికారి, పీహెచ్సీ హిరమండలం -
మూడు మందిరాల్లో చోరీ
రాయగడ: సదరు సమితి పరిధిలోని కొట్లాగుడ సమీపంలో గల సిరికొన వద్ద గల మూడు మందిరాల్లో సోమవారం రాత్రి దొంగతనాలు జరిగాయి. శైలేశ్వర్ మందిరం ప్రాంగణంలో గల మా సరళ, విశ్వకర్మ, హనుమాన్ మందిరాల్లో గుర్తు తెలియని దుండగులు హుండీలను విరగొట్టి నగదును చోరీ చేశారు. సరళా మందిరంలో గల అమ్మవారి విగ్రహానికి గల వెండి కళ్లను తస్కరించారు. మందిరంలో గల సామగ్రీని దోచుకున్నారు. ఎప్పటిలాగే మంగళవారం ఉదయం మందిరం తలుపులు తెరిచేందుకు పూజారి ఎ.భాస్కర్ వెళ్లారు. అప్పటికే తులుపులు తెరిచి ఉండటం గమనించి దొంగతనం జరిగినట్లు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
త్రుటిలో తప్పిన ప్రమాదం
రణస్థలం: లావేరు మండలంలోని రావివలస సమీపంలో జాతీయ రహదారిపై విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వైపు వస్తున్న టాటా మ్యాజిక్ వ్యాన్ వృద్ధురాలిని బుధవారం సాయంత్రం ఢీకొంది. అయితే డ్రైవర్ ఆ వృద్ధురాలిని తప్పించే క్రమంలో వ్యాన్ డివైడర్ పైకి ఎక్కి ఆగింది. డ్రైవర్ చాకచక్యంగా వాహనాన్ని అదుపు చేయడంతో అటు వృద్ధురాలు, ఇటు వ్యాన్‌లో ఉన్న ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వృద్ధురాలిని 108 వాహనంలో శ్రీకాకుళం తరలించి చికిత్స అందిస్తున్నారు. లావేరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేశారు. -
పరారీలో ఉన్న ఇంజినీర్‌పై ఫిర్యాదు
పర్లాకిమిడి: గుమ్మసమితి జుంబాడ పంచాయతీ సీసీరోడ్డు నిర్మాణంలో కూలీలు, గ్రామసభ కమిటీకి బిల్లు డబ్బులు ఇవ్వకుండా ఎగనామం పెట్టి పరారైన బ్లాక్ జూనియర్ ఇంజినీరు మహేష్ మరాండిపై ఏడీఎంఫల్గునీ మఝికి కలెక్టరేట్లో గ్రామస్తులు బుధవారం ఫిర్యాదు అందజేశారు. గ్రామసభ కమిటీ నిర్ణయం మేరకు జుంబాడ గ్రామపంచాయితీకి సీసీరోడ్డు పనులు సుమారు రూ. 14,28,000 ఖర్చుఅయ్యాయి. అయితే నాలుగు నెలలుగా పనిచేసిన కూలీలకు దినసరి కూలీ డబ్బులు అందలేదని అన్నారు. జేఈ మహేష్ మరాండి బ్లాక్‌లో విధులు కూడా నిర్వహించకుండా పరారైనట్టు జుంబాడ గ్రామస్తులు విలేకరులకు తెలియజేశారు. సీసీ రోడ్డు పనికి జుంబాడ గ్రామస్తులే సిమెంటు, ఇనుప రాడ్లు పర్లాకిమిడి నుంచి అరువుతెచ్చి పనులు జరిపించగా.. జేఈ మరాండి డిపార్ట్మెంట్ వర్క్ అని తన పేరుమీద బిల్లు పెట్టుకుని పరారైనట్టు గ్రామస్తులు చెబుతున్నారు. దీనిపై గుమ్మా బ్లాక్ బీడీవో దులారాం మరాండికి, కలెక్టర్‌కు గ్రీవెన్సులో ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని అన్నారు. దీనిపై సమగ్రంగా జిల్లా కలెక్టర్ అక్షయసునీల్ అగర్వాల్ దర్యాప్తుచేసి తమకు న్యాయం చేయాలని జుంబాడ గ్రామస్తులు కోరారు. ఏడీఎం మఝిని కలిసిన వారిలో జుంబాడ సర్పంచు డినాన్ గోమాంగో, లిసాన్ గోమంగో, బిర్సింగ్ దోయిబెడా తదితరులు ఉన్నారు. -
అభివృద్ధికి మూలం
విద్యా రంగంలో పెట్టుబడులు..● విద్యా సదస్సులో గవర్నర్ హరిబాబుభువనేశ్వర్: నాణ్యమైన విద్య, ఆవిష్కరణలు, నైపుణ్య మానవ వనరుల సాధికారత, విజ్ఞాన ఆధారిత సమాజం ద్వారా మాత్రమే వికసిత్ ఒడిశా, వికసిత్ భారత్ దార్శనికతను సాకారం చేసుకోగలమని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి అన్నారు. విజ్ఞాన ఆవిష్కరణలో అత్యంత కీలక పాత్ర పోషించే విద్యారంగంలో అధిక పెట్టుబడుల ఆవశ్యకతను గుర్తించాలని గవర్నర్ పిలుపునిచ్చారు. నగరంలో బుధవారం నిర్వహించిన ఎడ్యుకేషన్ ఎమినెన్స్ కాన్క్లేవ్–2026లో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా విద్యను దేశ నిర్మాణానికి పునాదిగా అభివర్ణించారు. బలమైన విజ్ఞాన వ్యవస్థ, సృజనాత్మకత, మానవ మేధస్సు ఆధునిక యుగంలోని సాధికార సమాజానికి ప్రామాణికలుగా పేర్కొన్నారు. విద్య అనేది ఆవిష్కరణలు, ప్రజాస్వామ్య విలువలు, సామాజిక సామరస్యాన్ని ప్రోత్సహిస్తూ వ్యక్తులను విజ్ఞానవంతులుగా, బాధ్యతాయుతంగా, ఉత్పాదక పౌరులుగా తీర్చిదిద్దుతుందని గవర్నర్ అన్నారు. పేదరికం నిర్మూలించి సమాజంలో అసమానతలను తొలగించడంలో విద్య సహాయపడి యువతలో విమర్శనాత్మక ఆలోచనా విధానం, సృజనాత్మకత, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ జాతీయ విద్యా విధానం –2020ని సమగ్రంగా అమలు చేస్తున్నందుకు గవర్నర్ ప్రశంసించారు. మాతృభాష ఆధారిత అభ్యసనం, డిజిటల్ సాధికారత, బహుళ రంగాల విద్య, నైపుణ్యాభివృద్ధి ప్రాధాన్యత, భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే తరాన్ని తయారుచేయడంలో ఒక దార్శనిక విధానాన్ని ప్రతిబింబిస్తోందన్నారు. వరల్డ్ స్కిల్ సెంటర్ వంటి సంస్థలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోని వర్ధమాన రంగాలలో నాయకత్వం కోసం యువతను సిద్ధం చేస్తున్నాయని ఆయన తెలిపారు. ఆవిష్కరణలను ప్రోత్సహించి పరిశోధనలను వెలుగులోకి తెచ్చే అభ్యసనాన్ని సామాజిక అవసరాలతో అనుసంధానించే ఒక వ్యవస్థను ఆవిష్కరించేందుకు విశ్వవిద్యాలయాలు, పాఠశాలలు, పరిశోధనా సంస్థలు, విధాన రూపకర్తలు కలిసి పనిచేయాలని గవర్నర్ కోరారు. కార్యక్రమంలో నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక విద్యాశాఖ మంత్రి సంపద్ చంద్ర స్వంయి, రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ మనోజ్ కుమార్ త్రిపాఠి, న్యూస్ – 18 ఒడియా ఎడిటర్ నరేంద్రనాథ్ జెనా తదితరులు పాల్గొన్నారు. -
కౌన్సిలర్ల గరం.. గరం
● పారిశుద్ధ్యం, అభివృద్ధి పనుల్లో అక్రమాలు జరిగాయంటూ నిరసన ర్యాలీజయపురం: జయపురం మున్సిపాలిటీలో పారిశుద్ధ్య నిర్వహణ, అభివృద్ధి పనులలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ బీజేడీ పార్టీకి చెందిన కౌన్సిలర్లు స్థానిక మునిపల్ కార్యనిర్వాహక అధికారి పూజ రౌత్‌ను ఘెరావ్ చేశారు. అనంతరం కార్యాలయం వద్ద ధర్నా జరిపారు. కౌన్సిలర్లతో పాటు ఆ పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్లు, బీజేడీ శ్రేణులు ఆందోళనలో పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ను అడ్రాస్ చేస్తూ వినతి పత్రాన్ని కార్యనిర్వాహక అధికారికి అందజేశారు. పారిశుద్ధ టెండర్లలో అక్రమాలు జరిగాయని, కౌన్సిల్ ఆమోదం లేకుండా నిర్మాణాలు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలకు కొందరు పాల్పడుతున్నారన్నారు. ఆక్రమణలపై మున్సిపల్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవటంలేదని ఆరోపించారు. తక్షణమే దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. అలాగే అక్రమాలపై చర్య తీసుకొనేంత వరకు పారిశుద్ధ్య పనుల కంట్రాక్ట్ కోసం ఎటువంటి కొత్త అనుమతులు ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు. అలాగే మున్సిపాలిటీలో పారదర్శకత పెంచాలని, ప్రజల ఫిర్యాదులపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరారు. పారిశుద్ధ్య టెండర్ ప్రక్రియను రద్దు చేయాలన్నారు. ధర్నా సందర్భంగా కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకుంది. ఆందోళనకారులతో మున్సిపల్ కార్యనిర్వాహక అధికారి చర్చలు జరిపి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే మూడు రోజుల్లో కౌన్సిల్ సమావేశం నిర్వహించి అన్ని అంశాలపై చర్చిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ధర్నాలో మున్సిపల్ వైస్ చైర్మన్ బి.సునీత, కౌన్సిలర్లు దేవేంద్రచౌదరి, పార్ధశారది మల్లిక్, ఎస్పాల్ సింగ్, సింహాచల బిశాయి, విష్ణు వర్ధన రెడ్డి, ఎన్.లక్ష్మీనారాయణ, సుస్మ మహాపాత్రో, ఎ.భద్రవేణి, శశిరేఖ పొరజ, అజిత్ బెహర, అర్పిత షొడంగి, అనిత రాయ్, ఉర్మిళ మహంకుడొ పాల్గొన్నారు. -
సందడిగా నర్సింగ్ దినోత్సవం
భువనేశ్వర్: స్థానిక హైటెక్ వైద్య బోధన ఆస్పత్రిలో ప్రపంచ నర్సింగ్ దినోత్సవాన్ని అత్యంత ఉత్సాహంగా రెండు రోజుల పాటు నిర్వహించారు. నర్సింగ్ సిబ్బంది, విద్యార్థులు కార్యక్రమాల్లో చురుకగా పాలుపంచుకున్నారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏటా మే 12న ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే నర్సింగ్ దినోత్సవం సేవ, త్యాగాలకు ప్రతీక. ఈ వేడుక నర్సుల పని సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు సహాయపడుతుందని కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు పేర్కొన్నారు. ముఖ్యఅతిథిగా హాజరైన నర్సింగ్ డైరెక్టర్ డాక్టర్ శక్తి ప్రసాద్ మిశ్రా మాట్లాడుతూ.. నర్సులు లేకుండా ఆస్పత్రులలో చికిత్స, రోగి నిర్వహణ పూర్తిగా అసాధ్యమని అన్నారు. హై టెక్ వైద్య కళాశాల చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ దేబానంద మహాపాత్రో మాట్లాడుతూ.. హౌస్ సర్జరీ సమయం నుంచి ఆపరేషన్ థియేటర్ (ఓటీ) వరకు నర్సులే వైద్యులకు అన్ని వేళలా తొలి గురువులుగా ఉంటారని కొనియాడారు. డాక్టర్ రాకేష్ పణిగ్రాహి, డీన్, డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ రాధామాధవ్ త్రిపాఠి, చీఫ్ అడ్మినిస్ట్రేటర్ మల్కిన్ బెహరా, హైటెక్ నర్సింగ్ స్కూల్ అండ్ కాలేజ్ డీన్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆశిష్వాలా మహా పాత్రొ, చైర్పర్సన్ ప్రొఫెసర్ రీటా లెంకా, చీఫ్ నర్సింగ్ సూపరింటెండెంట్ సిసిల్ జేవియర్, జా యింట్ డీఎమ్ఈటీ డాక్టర్ రోమా రతన్, ప్రొఫెసర్ సరోజ్ నళిని ప్రధాన్ అతిథులుగా హాజరయ్యారు. -
మాజీ ఎమ్మెల్యే ఆయూబ్ ఖాన్ మృతి
భువనేశ్వర్: బొలంగీర్ జిల్లా కంటాబంజి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఆయూబ్ ఖాన్ మృతి చెందారు. ఆయన రాష్ట్ర శాసన సభకు తొలుత స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నిక అయ్యారు. 2004 నుంచి 2009 వరకు స్వతంత్ర ఎమ్మెల్యేగా కొనసాగారు. ఆ తర్వాత బిజూ జనతా దళ్‌లో చేరి 2014 నుంచి 2019 వరకు ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. ఆయన మృతిపై రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి, విపక్ష నేత నవీన పట్నాయక్, ఉప ముఖ్యమంత్రి కనక వర్ధన్ సింగ్‌దేవ్ తదితర ప్రముఖులు, రాజకీయ వేత్తలు సంతాపం ప్రకటించారు. -
● అడుగంటినది
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు గత నాలుగు రోజులుగా (రోహిణి కార్తెలతో) నమోదవుతున్నాయి. పర్లాకిమిడి, పాతపట్నం సరిహద్దులో ఉన్న మహేంద్రతనయ నది ఎండలకు నీరు అడుగంటిపోయింది. ఎండలకు పట్టణంలో రోజూ టాటా పవర్ డిస్ట్రీబ్యూషన్ కంపెనీ 114 నిమిషాలు, ఉదయం సాయంత్రం పూట పవర్ కట్ చేస్తుంది. ఉదయం 11 గంటలకు 36 డిగ్రీలు, మధ్యాహ్నం 1 గంటకు 40 డిగ్రీల సెంటీ గ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో మార్కెట్‌కు అతి తక్కువ మంది సరుకులు కోనడానికి వస్తున్నారు. వృద్ధులు, పిల్లలు ఉక్కపోతతో అవతస్థలు పడుతున్నారు. మే 15 నుంచి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. -
జయపురం అభివృద్ధికి కృషి
జయపురం: కొరాపుట్ పార్లమెంట్ సభ్యుడు సప్తగిరి శంకర ఉల్క జిల్లా అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి చేస్తున్న కృషికి కొరాపుట్ జిల్లా న్యాయవాదుల సంఘం మంగళవారం సన్మాణించింది. ఈ సందర్భంగా న్యాయ వాదుల సంఘ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర న్యాయవాదుల మండలి సభ్యుడు పిట్టా రమేష్ పాత్రో, జిల్లా అధ్యక్షుడు బిజయ రాయ్ జనాదేవ్, ఉపాధ్యక్షుడు శరత్ మఝి, కార్యదర్శి సహదేవ్ పట్నాయక్, కోశాధికారి వి.రామానుజ ప్రసాద్, తదితరులు ఎంపీ సప్తగిరి ఉల్క, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రూపక్ తురుక్ను స్వాగతం పలికి సన్మానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయవాదుల మండలి సభ్యుడు రమేష్ పాత్రో మాట్లాడుతూ.. గతంలో జయపురంలో హైకోర్ట్ బెంచ్ ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమంలో ఎంపీ నిర్వహించిన భూమికను గుర్తు చేశారు. ఇక ముందు కూడా న్యాయవాదుల ప్రయోజనాల కోసం లోక్ సభలో గళం విప్పాలని కోరారు. జిల్లా న్యాయవాదుల సంఘ నూతన భవన ఉన్నతికి ఎంపీ ల్యాడ్స్ నుంచి కొంత మొత్తం సమకూర్చాలని జిల్లా న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు జనాదేవ్ విజ్ఞప్తి చేశారు. ఎంపీ ఉల్క మాట్లాడుతూ జయపురం అభివృద్ధికి కోసం తాను అన్ని వేళలా ముందుంటానని వెల్లడించారు. జయపురం నుంచి భువనేశ్వర్‌కు పగటి పూట రైలు నడపాలని లోక్ సభలో పదే, పదే తాను డిమాండ్ చేస్తున్నానని తెలిపారు. భువనేశ్వర్–విశాఖపట్నం వందే భారత్ రైల్‌ను అరుకు మీదుగా కొరాపుట్ వరకు పొడిగించాలని పార్లమెంట్లో తాను డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో జయపురం విమానాశ్రయం విస్తరణ, జయపురం నుంచి – మల్కనగిరి, జయపురం నుంచి నవరంగపూర్ రైల్వే లైన్లు త్వరతిగతిన పూర్తిచేసేందుకు కృషి చేస్తానన్నారు. జయపురం పట్టణం ఉన్నతికి తాను కట్టుబడి ఉంటానని, న్యాయవాదుల సంఘం ఏ ప్రతిపాదన చేసినా అమలు చేసేందుకు కట్టుబడి ఉంటానని హామీ ఇచ్చారు. అనంతరం న్యాయవాదుల సంఘం నూతన భవనాన్ని సందర్శించారు. భవనాన్ని మరింతగా అభివృద్ధి పరచే విషయంపై తాను జిల్లా కలెక్టర్‌తో చర్చిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘ సహాయ కార్యదర్శి భోళా పట్నాయక్, సభ్యులు తరణి పాణిగ్రహి, దాశరథి పట్నాయక్, సుభాష్ పండా, లాల్ మోహన్ షడంగి, రాజేంద్ర కుమార్ గౌడ, అరుణ పండా, నళినీ రథ్, రేఖా భాయ్, సురేష్ పట్నాయక్, బిభూతి పట్నాయక్, శిశిర మిశ్ర, ఆరతి మహంతి, తదతరులు పాల్గొన్నారు. -
ముగిసిన నర్సెస్ వీక్ ఉత్సవాలు
రాయగడ: స్థానిక పితామహాల్ వద్ద గల సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో స్కూల్ ఆఫ్ నర్శింగ్ ఆధ్వర్యంలొ ఈ నెల ఆరో తేదీ నుంచి జరుగుతున్న నర్సెస్ వీక్ వేడుకలు మంగళవారంతో ముగిశాయి. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వారం రోజులు నిర్వహించిన కార్యక్రమంలో నర్సింగ్ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్కూల్ ఆఫ్ నర్సింగ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఉర్మిళ కాటూరు పర్యవేక్షణలో జరిగిన వేడుకల్లో విద్యార్థుల మధ్య వివిధ పోటీలు, సాహిత్య, సృజనాత్మక కార్యక్రమాలు నిర్వహించి విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విశ్వవిద్యాలయం రీజనల్ డైరెక్టర్ డాక్టర్ రాజేష్ కుమార్ పాఢి, గౌరవ అతిథిగా డాక్టర్ చంద్రశేఖర్ పాత్రోలు హాజరయ్యారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అతిథులు కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ పాఢి మాట్లాడుతూ.. ఆరోగ్య సేవల్లో నర్సుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. నిరంతర విద్యాభ్యాసం, మానవతా సేవల పట్ల అంకితభావం అవసరమని అన్నారు. విద్యార్థులు భవిష్యత్‌లో నిబద్ధతతో సేవలను అందించాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందించారు. -
మజ్జిగౌరీ మందిరం అభివృద్ధిపై సమీక్ష
రాయగడ: ఉత్కళాంధ్రుల ఆరాధ్య దైవంగా పూజలందుకుంటున్న మజ్జిగౌరీ మందిరం అభివృద్ధి పనులపై జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి ఆధికారులతో మంగళవారం సమీక్షించారు. మందిరం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు బీజేడీ ప్రభుత్వ హయాంలో 26 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయి. అందుకు సంబంధించి గత ఏడాది ఆగస్టు 29వ తేదిన అభివృద్ధి పనులకు భూమి పూజ జరిగింది. బరంపురానికి చెందిన ఒక కాంట్రాక్ట్ కంపెనీకి టెండర్ లభించింది. రెండేళ్లలో నిర్మాణం పనులు పూర్తి చేయాలన్నది షరతు. అయితే భూమి పూజ ప్రారంభించి ఆరు నెలలు గడిచినప్పటికీ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టలేదు. అయితే గత నాలుగు నెలలుగా అభివృద్ధి పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కొనసాగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించి ప్రజా పనుల శాఖ అధికారులతో మజ్జిగౌరీ మందిరం ప్రాంగణంలో సమీక్షించారు. త్వరలో పనులు పూర్తి చేయాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశించారు. అదేవిధంగా మందిరం ప్రవేశద్వారం నామమాత్రంగా కాకుండా అందరినీ ఆకర్షించే విధంగా ప్రత్యేకంగా రూపొందించాలని సూచించారు. దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అన్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్, డార్మిటరీ, ప్రసాద సేవన గృహం పనులు జూన్ చివరి నాటికి పూర్తి చేసేలా కృషి చేస్తామని అధికారులు వివరించారు. -
సాగుకు సమాయత్తం
● ప్రారంభమైన ఖరీఫ్ పనులు ● పొలం దుక్కులు, విత్తన మడులు సిద్ధం చేస్తున్న రైతులు ● జిల్లా 4.20 లక్షల ఎకరాల్లో వరి సాగు ● 32 వేల క్వింటాళ్ల విత్తనాలకు ఇండెంట్ పెట్టిన అధికారులు జలుమూరు: రబీ పనులు దాదాపు పూర్తయ్యాయి. అపరాలు, మొక్కజొన్న, రాగులు, పొద్దు తిరుగుడు తదితర పంటలు చివరి దశకు చేరుకున్నాయి. దీంతో ఖరీఫ్ సీజన్ కోసం రైతులు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే పొలాలను చదునుచేసి వేసవి దుక్కులు, విత్తన మడులను సిద్ధం చేసి విత్తనాలు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ పనులన్నీ ఒక ఎత్తు అయితే విత్తన ఎంపిక మరో ఎత్తు అని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో 4.20 లక్షల ఎకరాలు వరి సాగు అయ్యే అవకాశం ఉంది. ఇందు కోసం వ్యవసాయ శాఖ 32 వేల క్వింటాళ్ల విత్తనాలకు ప్రతిపాదనలు పంపింది. ఇప్పటికే పచ్చిరొట్టకు సంబంధించి అన్ని మండల వ్యవసాయ శాఖ కార్యాలయాలలో విత్తనాలు సిద్ధం చేసింది. రైతులు తక్కువ ఖర్చుతోపాటు మంచి దిగబడులు సాధిచేందుకు తీసుకోవాల్సిన చర్యలను నరసన్నపేట వ్యవసాయ శాఖ సహాయ సంచాలకుడు ఎల్.వి.మధు ‘సాక్షి’కి ప్రత్యేకంగా వివరించారు. వరుస పద్ధతి మేలు.. ●వరి అధిక దిగుబడి సాధించాలంటే నాట్లు పద్ధతిలో వరి సాగుచేయాలి. పచ్చిరొట్ట విత్తనాలు వేసి సుమారు 40 రోజుల్లోపే దమ్ము చేస్తే కలుపు నివారణతోపాటు నాణ్యమైన ఉత్పత్తులు చేయగలం. ● డ్రమ్ సీడర్ పద్ధతిలో విత్తనాలు వేయడం వల్ల నారుతీయడం, నాట్లు వేయడం చేయకుండా కూలీలు ఖర్చు ఎకరాకు సుమారు రూ.ఏడు వేలు వరకూ తగ్గించుకోవచ్చు. ఈ పద్ధతి వల్ల నాట్లు వరుస పద్ధతిలో పడతాయి. కాలిబాటలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ● వరి నారుమడిలో యూజమాన్య పద్ధతులు పాటిస్తే తక్కువ పెట్టుబడితో అధిక దిగుడులు సాధించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవచ్చు. ఇందులో మంచి రకాలు ఎంపిక, విత్తన శుద్ధి, ఎరువులు, కలుపు నివారణ, పురుగు మందులు వాడకంలో వ్యవసాయ శాఖ సూచనలు తప్పనిసరి. ● సాధారణ పరిస్థితిలో నాటడానికి ఎంటీయూ(7029) స్వర్ణ, దీనికి ప్రత్యామ్నాయంగా రూపొందించిన ఎంటీయూ–1318 రకం అన్ని భూములకు అనువైనవి. సన్నరకం సాంబకు ప్రత్యామ్నాయంగా 1282 సాగు చేసుకోవచ్చు. ● విత్తనం ద్వారా వ్యాప్తి చెందే కొన్న రకాల తెగుళ్లను నివారించేందుకు విత్తన శుద్ధి ప్రధానం. దీని కోసం సుడోమోనస్, కార్బండిజమ్ మందులను వినియోగించుకోవచ్చు. ● నాటే పద్ధతిలో ఎకరానికి 25 నుంచి 30 కేజీల విత్తనాలు సరిపోతాయి. డ్రమ్‌సీడర్ ద్వారా ఎనిమిది నుంచి పది కేజీలు, వెద పద్ధతిలో 20 కేజీలు చాలు. ● దృఢమైన, ఆరోగ్యవంతమైన నారు పొందాలంటే 12 రోజుల ముందే దమ్ముచేయాలి. చిన్నమడులుగా విభజించి అవసరమైన నీరు పెట్టడానికి, తొలగించడానికి పిల్లకాలువలు ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి సెంటు భూమిలో ఐదు కేజీల విత్తనాలు చల్లుకోవాలి. విత్తనం ఎక్కువైతే నారు బలహీనంగా తయారై తెగులు సోకే ప్రమాదముంది. ఎక్కువ విత్తనాలు చల్లుకున్నా వేరు తెగి పిలకలు పెట్టేందుకు వీలుండదు. దీని వల్ల పంట దిగుబడిపై ప్రభావం చూపుతుంది. మొలక కట్టిన విత్తనం చల్లుకోవడం మంచిది. రెండుమూడు ఆకులు తొడిగేవరకూ తడి అందించాలి. తర్వాత పలుచగా నీరు పెట్టాలి. ● దమ్ములో ప్రతి ఐదు సెంట్లు నారుమడికి రెండు కిలోల యూరియా, ఏడు కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్, రెండు కిల్లో మ్యారేటి ఆఫ్ పొటాష్ చల్లుకోవాలి. విత్తిన రెండు వారాలు తర్వాత మళ్లీ రెండు కిలోల యూరియా వేసుకొని అవసరమైన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. -
మాజీ మంత్రి రఘునాథ్ పట్నాయక్‌కు ఘననివాళులు
జయపురం: రాష్ట్ర ఆర్థిక, న్యాయ శాఖల మాజీ మంత్రి, ప్రముఖ రాజకీయవేత్త స్వర్గీయ రఘునాథ్ పట్నాయిక్ 10వ వర్ధంతి సందర్బంగా జయపురం లో ప్రముఖులు, కాంగ్రెస్ శ్రేణులు ఘన నివాళులు అర్పించారు. స్థానిక రఘునాథ్ పట్నాయక్ కూడలి వద్ద ఏర్పాటు చేయబడిన నిలువెత్తు స్వర్గీయ పట్నాయక్ విగ్రహానికి పూల మాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన పెద్ద కుమారుడు కాంగ్రెస్ నాయకుడు బిరెన్ మోహణ పట్నాయక్, చిన్న కుమారుడు ప్రముఖ సంగీత కళాకారుడు ధిరెన్ మోహణ పట్నాయక్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, పుర ప్రముఖులు నివాళులు అర్పించారు. అలాగనే కొరాపుట్ జిల్లా కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు రూపక్ తురుక్ పిలుపు మేరకు స్థానిక జిల్లా కాంగ్రేస్ భవణంలో నిర్వహించిన స్వర్గీయ రఘునాథ్ పట్నాయిక్ వర్ధంతిని నిర్వహించారు.ఈ సందర్బంగా కాంగ్రేస్ పార్టీ జిల్లా కార్యదర్శి రూపక్ తురుక్ అవిభక్త కొరాపుట్ జిల్లాకు, రాష్ట్రానికి స్వర్గీయ పట్నాయిక్ మంత్రిగా అందించిన సేవలు, వివరించారు.అవిభక్త కొరాపుట్ జిల్లాలో పలు పరిశ్రమలు న్యాయ, మహిళా కళాశాలల ఏర్పాటులో ఆయన పాత్ర చిరస్మరణీయమని అన్నారు. ఆయన పార్టీకి అందించిన సేవల స్పూర్తితో పార్టీ శ్రేణులు ముందుకు సాగాలని పిలుపు నిచ్చారు.అలాగనే స్థానిక యాదవ భవణంలో కొరాపుట్ జిల్లా ఉత్కళ సమ్మిలినీ స్వర్గీయ రఘునాథ్ పట్నాయిక్ వర్దంతి సభను నిర్వహించి నివాళులు అర్పించారు. ఘనంగా నర్సింగ్ దినోత్సవం మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కేంద్రంలో సత్యనారాయణ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్‌లో మంగళవారం 52వ అంతర్జాతీయ నర్సింగ్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యక్షురాలు హాజరై నర్సింగ్ విద్య స్థాపకురాలు ఫోరెసీ నిగితిన్గేలా సేవాభావం క్రమశిక్షణ, అంకితభావాన్ని విద్యార్థులకు వివరించారు. ఆమె త్యాగం నిస్వార్ధ సేవా భావం ద్వారా ప్రేరణ పొందుతూ దేశానికి, సత్యనారాయణ్ నర్సింగ్ సంస్థకు పేరు.. గౌరవం తీసకురావాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో కళాశాల అధ్యక్షురాలు సుశ్రీ సుమరిన్ సుమన్ కార్తిక్, తనుశ్రీ దేవనాధ్, సిబ్బంది పాల్గున్నారు . ఆటో బోల్తా.. నలుగురికి గాయాలు రణస్థలం: లావేరు మండలం బుడుమూరు జాతీయ రహదారి పక్కన సర్వీస్ రోడ్డులో ముందు వెళుతున్న ఆటోను వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో ఆటో బోల్తా పడటంతో డ్రైవర్ కిల్లి వెంకటరావు, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని లావేరు ఎస్సై కె.అప్పలసూరి పరిశీలించి వివరాలు సేకరించారు. లారీ ఢీకొని రిటైర్డ్ ఎంఈఓ మృతి ఎచ్చెర్ల: అల్లినగరం జంక్షన్ వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో లావేరు మండలం చిన్నమురపాక గ్రామానికి చెందిన రిటైర్డ్ ఎంఈవో ఆకుల సన్యాసినాయుడు (80) మృతి చెందారు. ఈయన విశాఖపట్నం నుంచి స్వగ్రామం వచ్చేందుకు అల్లినగరం జంక్షన్ వద్ద బస్సు దిగి జాతీయ రహదారిని దాటుతుండగా విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వైపు వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. తలకు బలమైన గాయాలు తగలటంతో అక్కడికక్కడే మృతి చెందారు. సన్యాసినాయుడుకు భార్య సీతారత్నం, కుమారుడు నాయుడుబాబు, కుమార్తె ఉమ ఉన్నారు. ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఫుట్‌బాల్ పోటీలు ప్రారంభం
పర్లాకిమిడి: గజపతి స్టేడియంలో సీఎం ఫుట్‌బాల్ ట్రోఫీ చాంపియన్‌షిప్ పోటీలను అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఫల్గుణి మఝి సాయంత్రం ప్రారంభించారు. ఈ అంతర్జిల్లా చాంపియన్ షిప్ పోటీలకు 14 ఏళ్ల లోపు బాలుర జట్లు 6, బాలికలు 5 జట్లు పాల్గొన్నాయి. పర్లాకిమిడి, గుసాని బ్లాక్‌లో ఉప్పలాడ ఠాగోర్ మెమోరియల్ ఉన్నత పాఠశాల విద్యార్థులు, చంద్రగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఆర్.ఉదయగిరి, నువాగడ, బాగుసల (గుసాని), కాశీనగర్ జట్లు తొలిరోజు పాల్గొన్నారు. తొలుత చంద్రగిరి, గుసాని సమితి బాగుసల పాఠశాల విద్యార్థులు తలపడ్డారు. వీరిలో చంద్రగిరి ఉన్నత పాఠశాల విద్యార్థులు పైచేయి సాధించారు. ఈ సందర్భంగా ఏడీఎం మఝి మాట్లాడుతూ, అండర్ 14 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ప్రభుత్వం సీఎం ట్రోఫీను అందజేస్తుందని, అందుకోసం ఈనెల 14 వరకూ స్టేడియంలో ఫుట్‌బాల్ పోటీలు జరుపుతామని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా క్రీడాధికారి త్రినాథ సాహు, ఉన్నత పాఠశాలల క్రీడాధికారి సురేంద్ర పాత్రో, ఎస్ఎస్డీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడాధికారి సంతోష్ప్రసాద్ పండా, ఉప్పలాడ ప్రభుత్వ ఠాగోర్ ఉన్నత పాఠశాల పీఈటీ రేఖారాణి దేవ్ తదతరులు పాల్గొన్నారు. -
చిరు తగాదాతో మహిళ దారుణ హత్య
● సైకిల్‌పై మృతదేహంతో నిరసన భువనేశ్వర్: పొరుగు వారితో జరిగిన చిరు తగాదాతో పట్ట పగలు మహిళ దారుణ హత్యకు గురైంది. బాలాసోర్ జిల్లాలో ఈ విషాదం చోటు చేసుకుంది. 45 ఏళ్ల మహిళ మృతి చెందింది. కుటుంబ సభ్యులు, నిందితులను పట్టుకోవడంలో జరుగుతున్న జాప్యానికి నిరసనగా మంగళ వారం ఉదయం ఆమె మృతదేహాన్ని సైకిల్‌పై దాదాపు 15 కిలో మీటర్ల దూరం ఖొయిరా పోలీస్ ఠాణా వరకు తీసుకు వెళ్లారు. హరిపూర్ గ్రామంలో ఆదివారం నాడు వారి పొరుగువాడు గొడ్డలితో దాడి చేయడంతో కమలా సెఠి మరణించింది. ఆమె వదిన తీవ్రంగా గాయపడింది. పోస్టు మార్టం తర్వాత మృత దేహాన్ని తమకు అప్పగించడంతో కుటుంబ సభ్యులు దాన్ని సైకిల్‌పై ఎక్కించుకుని పోలీస్ ఠాణా వైపు కవాతు చేశారు. దారి పొడవునా పట్టపగలు ఆమెను ఎలా నరికి చంపారో వారు ప్రజలకు వివరించారు. నడి రోడ్డు మీద కొనసాగుతున్న నిరసన సమాచారం అందడంతో ఖొయిరా ఠాణా పోలీసులు ప్రత్యక్షంగా రంగంలోకి దిగారు. మృతదేహాన్ని తరలించడానికి పోలీసులు ఏర్పాటు చేసిన అంబులెన్స్‌ను నిరసనకారులు నిరాకరించారు. మృత దేహాన్ని రోడ్డుపై ఉంచి పోలీస్ ఠాణా సమీపంలో ప్రదర్శన నిర్వహించారు. కమలా సెఠి ఇంట్లో పైకప్పు నిర్మాణానికి సెంటరింగ్ పనులు జరుగుతుండగా ఎండు కట్టెలు, వెదురు కరల్రు, ఖాళీ ప్లాస్టిక్ సంచులు వంటి నిర్మాణ సామగ్రి పొరబాటున జారి పొరుగున ఉన్న మానస్ జెనా ఇంటి ఆవరణలో పడటంతో ఈ వివాదం చెలరేగింది. సెంటరింగ్ పనులు పూర్తయ్యాక నిర్మాణ సామగ్రిని తొలగిస్తామని కమల, శకుంతల అభ్యర్థించిన మానస్ జెనా వారితో తీవ్ర వాగ్వాదానికి తలపడ్డాడు. తీవ్ర ఆగ్రహ ఆవేశంతో అతడు గొడ్డలిని తీసుకుని కమల, శకుంతలపై దాడి చేసినట్లు ఆరోపణ. దాడిలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు మహిళలను ఖొయిరా కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. వారి పరిస్థితి విషమించడంతో తొలుత భద్రక్ జిల్లా ప్రధాన ఆస్పత్రికి, ఆ తర్వాత కటక్‌లోని ఎస్సీబీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు తరలించారు. ఆదివారం రాత్రి గాయాలతో చికిత్స పొందుతూ కమలా సెఠి తుది శ్వాస విడిచింది. దాడిలో ప్రమేయం ఉందనే ఆరోపణలపై ఖొయిరా ఠాణా పోలీసులు కేసు నమోదు చేసి భారతి జెనాని అరెస్టు చేశారు. మానస్ తన తండ్రి భరత్ జెనాతో కలిసి పరారీలో ఉన్నాడు, వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని బాలాసోర్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ప్రత్యూష్ దివాకర్ తెలిపారు. -
సకాలంలో ఎరువులు అందించాలి
జయపురం: రైతులకు సకాలంలో ఎరువులు అందించాలని, మండీలకు తీసుకువచ్చిన ధాన్యం కొనుగోలుపై దృష్టి కేంద్రీకరించాలని కొట్‌పాడ్ ఎమ్మెల్యే రూపు భొత్ర అన్నారు. లేంప్స్ల ప్రధాన లక్ష్యం.. వ్యవసాయం ఉన్నతి, రైతుల ఆర్థిక ప్రగతే కావాలన్నారు. మంగళవారం జయపురం సబ్‌డివిజన్ కొట్‌పాడ్ సమితి బొతాసన గ్రామంలో నిర్వహించిన కొట్‌పాడ్ లేంప్స్ స్వతంత్ర వార్షిక సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కొట్‌పాడ్ లేంప్స్ పరిచాలన డైరెక్టర్ రాజేంఽద్ర నాయక్ అధ్యక్షత వహించారు. కొరాపుట్‌లో 2025–26 రబీ సీజన్ ధాన్యం సేకరణ కమిటీ సమావేశంలో చర్చించిన విషయాలను డైరెక్టర్ రాజేంద్ర నాయక్ వివరించారు. సమావేశంలో 2024–25 ఆర్థిక సంవత్సరంలో లేంప్స్కు రూ.52,07,872 లాభం వచ్చిందని, లాభాన్ని కొరాపుట్ కేంద్ర సహకార బ్యాంక్‌లో రైతుల ఖాతాల్లో జమ చేయటం జరుగుతుందన్నా. ఏ రైతులైతే రుణాలు తీసుకున్నారో కేసీసీ బ్యాంక్‌లో వేసిన లాభంతో రుణం తీరుతుందన్నారు. రైతు నేత ప్రఫుల్ల కుమార్ బిశాయి రైతుల సమస్యలపై మాట్లాడుతూ.. సునారిబలి నువాగాంలో గల లేంప్స్ శిథిలావస్థలో ఉందని, దీనిని పునర్ నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఎంపీ ప్రతినిధి రామేశ్వర జేనా, డీఎల్‌పీసీ సభ్యుడు గణేష్ చంద్ర పండా, ఘుమర సర్పంచ్ కమల పూజారి, కొట్‌పాడ్ మాజీ ఎమ్మెల్యే చంద్ర శేఖర మఝి, తదితరులు పాల్గొన్నారు. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ జయపురం: ఆదివాసీ కోంద్ సంప్రదాయ యువతిని వివాహం చేసుకుంటానని ప్రలోబపరుచుకుని, ఆ తరువాత మోసం చేసిన నిందితునిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆదివాసీ యువతికి న్యాయం చేయాలని కమ్యూనిస్టు పార్టీ కొరాపుట్శాఖ నేతలు డిమాండ్ చేశారు. జయపురం సబ్‌డివిజన్ పోలీసు అధికారి అర్చిత మిత్తల్‌ను కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రమోద్ కుమార్ మహంతి, జిల్లా మాజీ కార్యదర్శి జుధిష్టర్ రౌళో, తదితరులు మంగళవారం కలిసి వినతిపత్రం అందించారు. జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడ సమితిలో కోంద్ ఆదివాసీ యువతిని కందులిగుడ గ్రామానికి చెందిన యువకుడు వివాహం చేసుకుంటానని ప్రలోబపరచి, ఆమెతో శారీరిక సంబంధం నెలకొల్పాడని, ఆ తరువాత ఆమెను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడని వినతిపత్రంలో పేర్కొన్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన విషయాన్ని బాధితురాలు, ఆమె తల్లిదండ్రులు బొయిపరిగుడ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారన్నారు. దీనిపై బొయిపరిగుడ పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు వెంటనే చేపట్టాలన్నారు. ఏసీఏలో హనుమాన్ జయంతి భువనేశ్వర్: హనుమాన్ జయంతి పురస్కరించుకుని స్థానిక ఆంధ్ర సంస్కృతి సమితి ఏసీఏ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం నిర్వహించింది. కార్యవర్గ సభ్యుల ప్రత్యక్ష పర్యవేక్షణలో సమితి సభ్యులు భక్తి శ్రద్ధలతో సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఏసీఏ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం అలముకుంది. -
జాంత్రీని ఆదర్శ పంచాయతీగా మార్చాలి
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ సమితి స్వాభిమాన్ ఏరియా జాంత్రీ పంచాయతీని ఆదర్శ పంచాయతీగా తీర్చి దిద్దాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. కలెక్టర్ ప్రథమేశ్ అర్వింద్ ఆదేశాలతో జిల్లా సబ్ కలెక్టర్ దూర్యోధన్ బోయి ఈ రోజు మంగళవారం జంత్రీ పంచాయతీలో ఉన్న ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో భీమభోయి దివ్యాంగ సామర్థ్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమం ద్వారా ప్రతి అర్హత గల లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందించాలన్నారు. మొత్తం 154 మంది లబ్ధిదారులు పాల్గొన్నారు. వీరిలో 83 మందికి పెన్షన్లు మంజూరు చేశారు. 24 మంది దివ్యాంగులు, 13 మంది మానసిక వికలాంగులు, 12 మంది దృష్టిలోపం ఉన్న వారు 22 మంది చెవిటి, మూగ దివ్యాంగులను గుర్తించి వారికి అవసరమైన సహాయాన్ని అందజేశారు. కార్యక్రమంలో జిల్లా భద్రతాధికారి నిర్మల్ ధారువా, డీఎంఓ డాక్టర్ నిహర్ రంజాన్ ప్రహరాజ్, చిత్రకొండ బీడీఓ ప్రీత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పోలీసు కాల్పుల్లో ఇద్దరికి గాయాలు
రాయగడ: ఝార్సుగుడ జిల్లాలో మంగళవారం ఉదయం పోలీసులకు, ఒక హత్య కేసులో నిందితుల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు గాయాలపాలయ్యారు. ఈ ఘటన జిల్లాలోని సాగువాన్ అటవీ ప్రాంతంలోని కార్లాఖమన్ ప్రభుత్వ పాఠశాల సమీపంలో చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో గాయపడిన నిందితులు సునీల మహానంద అలియాస్ టాబు, చంద్ బంచోర్లుగా పోలీసులు గుర్తించారు. వీరు సోమవారం ఝార్సుగుడ జిల్లాలోని బెల్పహార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక యువకుని హత్య కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నారు. పోలీసుల సమాచారం ప్రకారం కారులొ ప్రయాణిస్తున్న వ్యక్తులు అదే రహదాలో బైకుపై వెళుతున్న ఇద్దరి మధ్య జరిగిన వాగ్వాదం హత్యకు దారి తీసింది. చినికిచినికి గాలివానలా మారిన ఈ వాగ్వాదంలో రాహుల్ మహత, అతని స్నేహితుడు ఆకాష్ సాహుపై కత్తితో కారులో వస్తున్న వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో రాహుల్ మహాత మృతి చెందగా ఆకాష్ సాహు తీవ్రగాయాలతో ఝార్సుగుడ హస్పటల్లొ చికిత్స పొందుతున్నాడు. ఘటన అనంతరం పోలీసులు కార్ డ్రైవర్‌తో సహా ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. అయితే సునీల మహానంద, చంద్ బంచొర్ పరారీలొ ఉన్నారు. ఎస్పీ గుండాల రెడ్డి రాఘవేంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. పరారీలో ఉన్న ఇద్దరు నిందితులు కార్లాఖమాన్ గ్రామసమీపంలొ దాక్కున్నారనే సమాచారం మేరకు పోలీసులు అక్కడికి వెళ్లారు. పోలీసుల రాకను పసిగట్టిన నిందితులు దొరికిపోతామన్న భయంతో పోలీసులపై కాల్పులు జరిపారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు తప్పనిసరి పరిస్థితిలో ఎదురు కాల్పులు జరపగా ఇద్దరు నిందితుల కాళ్లకు బుల్లెట్ గాయాలయ్యాయని ఎస్పీ రాఘవేంద్ర తెలియజేశారు. ఈ సంఘటనలో నిందితులు మొత్తం ఆరు రౌండ్ల కాల్పులు జరపగా, పోలీసులు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపినట్లు వివరించారు. గాయపడిన నిందితులను మొదట లక్ష్మన్పూర్ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్సను చేయించడంతో పాటు మెరుగైన చికిత్స కొసం వారిని వెంటనే ఝార్సుగుడ ఆస్పత్రికి తరలించామని చెప్పారు. ఇందులో ఒకరి పరిస్ధితి ఆందోళనకరంగా ఉండటంతో బుర్లా మెడికల్ కళాశాలకు తరలించారు. -
కొరాపుట్ జిల్లాలో ముగ్గురు వలస కార్మికులు మృతి
కొరాపుట్: పొట్టకూటి కోసం వెళ్లిన ముగ్గురు వలస కార్మికులు అనారోగ్యంతో మృతి చెందారు. కొరాపుట్ జిల్లా లక్ష్మీపూర్ సమితి కక్కిరిగుమ్మ పోలీస్ స్టేషన్ పరిధిలో పంచాడా గ్రామానికి చెందిన తంగు జానీ (30), మెఘా జానీ (27) మృతి చెందారు. దిబా జానీ (29) విశాఖపట్నంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో మృతి చెందాడు. ఈ గ్రామానికి చెందిన సుమారు 10 మంది యువకులు మూడేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌లోని ధన్య శ్రీ కేష్ గ్రానైట్ పరిశ్రమలో పని చేయడానికి వెళ్లారు. అక్కడ ధూళి, కాలుష్యం వల్ల వీరంతా అనారోగ్యం పాలయ్యారు. దాంతో వీరంతా ఇంటి బాట పట్టారు. అనారోగ్యం పాలైన వారిలో జిత్తు జాని అనే యువకుడు ప్రస్తుతం కొరాపుట్ జిల్లా కేంద్రంలోని సాహిద్ లక్ష్మణ్ నాయక్ ప్రభుత్వ వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్నాడు. గతంలో మరో ఇద్దరు యువకులు కూడా పరిశ్రమ నుంచి వచ్చిన తర్వాత అనారోగ్యంతో మృతి చెందారన్నారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు లోనికి రావడంతో జిల్లా అధికారులు ఆ గ్రామానికి తరలి వెళ్లారు. బాధిత కుటుంబాల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఈ మరణాలకు కారణమైన పరిశ్రమపై చర్యలు తీసుకోవడానికి వివిధ శాఖల మద్య సమన్వయం జరుగుతుంది. ఈ సంఘటన తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన కొరాపుట్ పార్లమెంట్ సభ్యుడు సప్తగిరి ఉల్క బాదిత గ్రామాన్ని సందర్శించారు. బాధిత కుటుంబాలు వెల్లడించిన వివరాలు నమోదు చేసుకున్నారు. చట్టపరంగా బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మరో వైపు స్థానిక ఎమ్మెల్యే పవిత్ర శాంత బాధిత గ్రామానికి వెళ్లారు. ఈ సమస్యపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తామన్నారు. అనారోగ్యం పాలైన దిబాకర్ జానీ విశాఖ పట్నంలో మృతి చెందాడన్నారు. అతని మృతదేహం విడుదల చేయడానికి డబ్బులు బాకీ ఉన్నాడని చెప్పి ఆస్పత్రి సిబ్బంది అడ్డుకున్నారన్నారు. వెంటనే తాను రు.85 వేలు ఫోన్ పే చేయగా విడుదల చేశారన్నారు. తాను పంపిన ఫోన్ ఫే వివరాలు మీడియాకి చూపించారు. రాష్ట్రంలో గిరిజన గ్రామాల్లో యువతకి ఉపాధి లేకుండా పోయిందన్నారు. దాంతో ఈ మరణాలు జరుగుతున్నాయన్నారు. తక్షణం ప్రభుత్వం బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. -
తుఫాన్‌పై సన్నద్ధత
భువనేశ్వర్: ప్రభుత్వ ప్రముఖ కార్యదర్శి అనూ గర్గ్ అధ్యక్షతన మంగళ వారం తుఫాను సన్నద్ధతా ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అనూ గర్గ్ మాట్లాడుతూ విపత్తు నిర్వహణలో రాష్ట్ర ఖ్యాతిని నిలబెట్టుకోవాలన్నారు. అన్ని శాఖలు పూర్తి అప్రమత్తంగా ఉంటూ అత్యవసర పరిస్థితుల్లో సమాచారాన్ని శర వేగంగా ప్రసారం చేయడం జరగాలని సూచించారు. పటిష్టమైన సన్నద్ధత, మెరుగైన సమన్వయం, ముందస్తు హెచ్చరికలను సకాలంలో అందించడం ద్వారా జీరో క్యాజువాలిటీ మిషన్‌కు కట్టుబడి ఉండాలని పునరుద్ఘాటించారు. తుఫాను, వరద ఆశ్రయాలు పూర్తిగా సిద్ధంగా ఉండేలా చూడాలని, నియంత్రణ గదులను తక్షణమే క్రియాశీలం చేయాలని, మరియు ప్రామాణిక కార్యాచరణ విధానాలను (ఎస్ఓపీ) ఖచ్చితంగా పాటించాలని సంబంధిత శాఖలను ఆదేశించారు. ముఖ్యంగా మత్స్యకారులకు తుఫాను హెచ్చరికలను సకాలంలో తెలియజేయడం, సమర్థమైన విపత్తు ప్రతిస్పందన కోసం శాఖల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. గాలింపు, సహాయక చర్యల కోసం 30 ఒడీఆర్‌ఏఎఫ్ బృందాలు తక్షణమే రంగంలోకి దిగేందుకు సన్నద్ధంగా ఉన్నాయని అదనపు డైరెక్టర్ జనరల్ (శాంతి భద్రతలు) తెలిపారు. ప్రస్తుతం ఒడిశా తీరంలో తుఫాను వచ్చే అవకాశం లేదని స్థానిక వాతావరణ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ మనోరమ మహంతి తెలియజేశారు. అయినప్పటికీ రాష్ట్రం అన్ని స్థాయిలలో పూర్తి సన్నద్ధతను కొనసాగించాలని ఆమె సూచించారు. సమావేశానికి అభివృద్ధి కమిషనర్ కమ్ అదనపు ప్రధాన కార్యదర్శి డీకే సింగ్, అగ్నిమాపక సేవల డైరెక్టరు జనలర్ డాక్టర్ ఎస్. షడంగి, ప్రత్యేక సహాయ కమిషనర్, భారత వాతావరణ శాఖ, ఓడీఆర్ఏఎఫ్ ఉన్నతాధికారులు, సంబంధిత అన్ని శాఖల కార్యదర్శులు హాజరయ్యారు. -
సీఈఓతో బీజేడీ ప్రతినిధి బృందం భేటీ
● 2 ఓట్లు రద్దు చేయాలి ● పారదర్శకత నిరూపనకు అభ్యర్థన భువనేశ్వర్: ఈ ఏడాది ఆరంభంలో ముగిసిన రాజ్య సభ ఎన్నికల సందర్భంగా ఇద్దరు భారతీయ జన తా పార్టీ శాసన సభ్యులకు రెండవ బ్యాలెట్ పత్రాలను అక్రమంగా జారీ చేశారని బిజూ జనతా దళ్ ఆరోపించింది. ఈ నేపథ్యంలో బీజేడీ శాసన సభ పక్ష ఉప నాయకుడు డాక్టరు ప్రసన్న ఆచార్య ఆధ్వర్యంలో ప్రతిపక్ష బిజూ జనతా దళ్ ప్రతినిధి బృందం సోమ వారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ఆర్ఎస్ గోపాలన్‌ను కలిసింది. ఇటీవల ముగిసిన రాజ్య సభ ఎన్నికల్లో బ్రహ్మగిరి నియోజక వర్గం ఎమ్మెల్యే ఉపాసన మహా పాత్రో, ఖల్లికోట నియోజక వర్గం ఎమ్మెల్యే పూర్ణ చంద్ర సెఠికి జారీ చేసిన తొలి బ్యాలెట్ పత్రాలపై ఓటు ముద్ర పెట్టినప్పటికీ వారికి రెండవ బ్యాలెట్ పత్రాలను తప్పుగా జారీ చేశారని ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ)కి సమర్పించిన ఒక వినతి పత్రంలో బీజేడీ ఆరోపించింది. దీని పట్ల తమ పోలింగ్, లెక్కింపు ఏజెంట్లు పదేపదే అభ్యంతరాలు లేవనెత్తిన పెడ చెవిన పెట్టి చెల్ల ని బ్యాలెట్ పత్రాలకు సంబంధించిన 1961 ఎన్నికల నిర్వహణ నియమావళి 41వ నియమం కింద నిర్దేశించిన షరతులను ఉల్లంఘించి ఎన్నికల అధికారులు రెండవ బ్యాలెట్ పత్రాలను జారీ చేయడానికి అనుమతించారని విపక్ష బిజూ జనతా దళ్ ఆరోపించింది. బిజూ జనతా దళ్ ప్రకారం ఎన్నికల సంఘం పరిశీలకుడు తొలుత రెండో బ్యాలెట్ పత్రాల జారీకి అనుమతి నిరాకరించారు. ఆ తర్వా త వాటిని అనుమతించడంతో ఈ నిర్ణయం యొక్క చట్టబద్ధత మరియు శాసన నిబంధనల నిబద్ధత పట్ల తీవ్ర ఆందోళనలు తలెత్తాయి. పోలింగ్ ఏజెంట్లు, ఎన్నికల ఏజెంట్లు, అధీకృత ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లు, అభ్యర్థులు, పార్లమెంటరీ ప్రతినిధులు నిరంతరం, పలు స్థాయిలలో ఈ అంశాన్ని ఎన్నికల పవిత్రతను ప్రభావితం చేసే ఒక తీవ్రమైన చట్టబద్ధమైన ఉల్లంఘనగా పరిగణించాలని అభ్యర్థించారు. రాజ్య సభ ఓటింగ్ ప్రక్రియలో తప్పిదంపై బీజేడీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు నవీన్ పట్నాయక్ బహిరంగంగా స్పందించారు. అనంతరం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ ఈ ఏడాది మార్చి 18న నవీన్ పట్నాయక్ ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు లేఖ రాశారు. ఆ తర్వాత ఏప్రిల్ 28న రాజ్య సభ ఎంపీ డాక్టరు సస్మిత్ పాత్రో తక్షణ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారత ఎన్నికల సంఘానికి ఒక వివరణాత్మక వినతిపత్రాన్ని సమర్పించారు. ఆ విజ్ఞప్తి నేపథ్యంలో బీజేడీ ప్రతినిధి బృందం సమస్యలను వినాల్సింది గా ఎన్నికల సంఘం రాష్ట్ర సీఈఓను ఆదేశించినట్లు సమాచారం. రాజ్యసభ అభ్యర్థి దిలీప్ రేకు అనుకూలంగా ఉపాసన మహా పాత్రో, పూర్ణ చంద్ర సెఠి వేసిన ఓట్లను తిరస్కరించాలని బీజేడీ తన వినతిపత్రంలో డిమాండ్ చేసింది. ఆ 2 ఓట్లను అనుమతించకపోతే తమ పార్టీ మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థి డాక్టర్ దత్తేశ్వర్ హొత్తాకు ఎక్కువ తొలి ప్రాధాన్యత ఓట్లు వస్తాయి. అందువల్ల ఆయనను ఎన్నికై నట్లు గా ప్రకటించాలని సవివరంగా విశ్లేషించి అభ్యర్థించారు. ఈ ఏడాది మార్చి 16 మరియు 18 తేదీలలో తాము చేసిన మునుపటి ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను వెల్లడించాలని బిజూ జనతా దళ్ కోరింది. దీంతో బాటు రద్దు చేసన బ్యాలెట్ పత్రాలు, పరిశీలకుల నివేదికలు, పోలింగ్, లెక్కింపు రికార్డు లు, సీసీటీవీ ఫుటేజ్, వీడియోగ్రఫీ, ఫోటోగ్రాఫ్‌లు మరియు ఇతర అధికారిక ఎన్నికల సామగ్రితో సహా ఈ వివాదానికి సంబంధించిన అన్ని రికార్డుల ను భద్రపరచి, పరిశీలించాలని సీఈఓను బీజేడీ ప్రతినిధి బృందం కోరింది. రెండవ బ్యాలెట్ పత్రాలను ఏ పరిస్థితులలో జారీ చేశారనే దానిపై స్వతంత్ర, పారదర్శక విచారణ జరిపి 1961 ఎన్నికల నిర్వహణ నియమావళి 41వ నియమం ఉల్లంఘించబడిందా లేదా అనే దానిపై నిర్ధారణ చేయాలని బీజేడీ డిమాండ్ చేసింది. -
రైతుల ఆందోళనకు జయపూర్ ఎమ్మెల్యే మద్దతు
కొరాపుట్: కొక్సర రైతుల ఆందోళనకు కాంగ్రెస్ పా ర్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జయపూర్ ఎమ్మెల్యే తారా ప్రసాద్ బాహీనీపతి మద్దతు పలికారు. సోమవారం కలహండి జిల్లా కొక్సర ప్రాంత రైతు ఆందోళన శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఈ ప్రాంతంలో 15 వేల మంది రైతుల పేర్లు ప్రభుత్వ వెబ్సైట్లో నమోదు కాలేదన్నారు. దాంతో వారు స్ధానికి ఎంఎల్ఏతో కలసి సీఎంతో పాటు అన్ని పార్టీల నాయకులను కలిశారన్నారు. కానీ ఫలితం లేకపోయిందన్నారు. రాష్ట్రంలో అనేక జిల్లాలలో రైతుల పేర్లు నమోదు కాలేదన్నారు. రాష్ట్రంలో 80 శాతం ప్రజలు వ్యవసాయం మీద జీవిస్తున్నారన్నారు. ఈ సమస్య పై రానున్న అసెంబ్లీ సమావేశాలలో పోరాటం చేస్తామని బాహీని పతి ప్రకటించారు. -
సరిహద్దులో ‘షో’
● ఒడిశాలో జోరుగా పేకాట శిబిరాలు ● పాతపట్నం నియోజకవర్గానికి కూతవేటు దూరంలోనే ● అక్కడి పోలీసులు పట్టించుకోరు.. మన పోలీసులు వెళ్లలేరు ● మూల్యం చెల్లించుకుంటున్న జిల్లావాసులు జూదం నిషేధం.. జూదం, జూద శిబిరాలు నిషేధం. అలాంటివి ఎక్కడైనా నిర్వహిస్తే పోలీసులకు సమాచారం అందించాలి. సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతాం. జూదం ఆటలో పట్టుబడితే కేసులు నమోదు చేస్తాం. అటువంటివి నిషేధం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. – చింతాడ ప్రసాద రావు, సీఐ, కొత్తూరు హిరమండలం: జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో జూదం శిబిరాలు కొనసాగుతున్నాయి. పాతపట్నం నియోజకవర్గం చెంతనే ఒడిశా భూభాగంలోని కొండ ప్రాంతాల్లో డెన్లు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. లక్షలు దాటి కోట్లాది రూపాయల ‘ఆట’ కొనసాగుతున్నట్టు సమాచారం. అటువైపు ఏపీ పోలీసులు వెళ్లరు.. ఒడిశా పోలీసులు పట్టించుకోరు అన్నట్టు ఉంది పరిస్థితి. ఈ జూదం మాటున అసాంఘిక కార్యకలా పాలు కూడా కొనసాగుతున్నట్టు సమాచారం. మూడు నాలుగు రోజుల కిందట జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి ఒడిశా జూదం డెన్‌కు వెళ్లిన వారికి అనుకొని ఘటన ఎదురైనట్టు తెలుస్తోంది. ఓ ముఠా ఆయుధాలతో బెదిరించి రూ.36 లక్షలు తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో జూదంరాయుళ్లు కట్టుబట్టలతో స్వస్థలాలకు చేరుకున్నట్టు సమాచారం. గారబంద, గొసాని, ఏడో మైలురాయి, లావణ్యకోట వంటి ప్రాంతాలు పాతపట్నం నియోజకవర్గానికి చెంతనే ఉంటాయి. మహేంద్రగిరులు సైతం దగ్గరే ఉంటాయి. ఈ ప్రాంతాల్లోనే ఎక్కువగా జూదం డెన్లు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. అక్కడ ప్రవేశానికి కొంత రుసుం ఉంటుంది. సకల సౌకర్యాలు కూడా లభిస్తాయి. డెన్లు కూడా ఎప్పటికప్పుడు మార్చేస్తుంటారు. అక్కడకు వెళ్లేవారికి రెండంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది. అంతా ప్రైవేటు వ్యక్తుల పహారాలో ఉంటుంది. జూదం శిబిరానికి వచ్చేవారి వాహనాలను రెండు కిలోమీటర్ల దూరంలో అడ్డుకుంటారు. అక్కడి నుంచి వారిని తమ సొంత వాహనాల్లో స్థావరాలకు తెస్తారు. మన జిల్లాకు సంబంధించి శ్రీకాకుళం నగరంతో పాటు పలాస, టెక్కలి, నరసన్నపేట ప్రాంతాల నుంచి ఎక్కువ మంది వెళ్తుంటారు. మెళియాపుట్టితో పాటు పలాస మార్గాల నుంచి నిత్యం ఖరీదైన వాహనాలు వెళుతుంటాయి. అందు లో ఎక్కువగా జూదం డెన్లకే వెళుతుంటాయన్నది స్థానికుల మాట. అయితే ఒడిశాకు చెందినే వారే ఈ జూదం డెన్ల నిర్వాహకులు. అటువైపు అక్కడి పోలీసులు చూడరు. ఏపీ పోలీసులు చూసేటంత సాహసం చేయరు. ఎందుకంటే ఈ జూదం డెన్లన్నీ మారుమూల అటవీ, కొండ ప్రాంతాల్లోనే నిర్వహిస్తున్నారు. చుట్టూ భారీ బౌన్సర్ల వలయం ఉంటుంది. ఒక వేళ పోలీ సులు దాడిచేసినా నగదు దొరకకుండా అ న్ని జాగ్రత్తలు తీసుకుంటారు. టోకెన్ల సిస్టమ్ ఉంటుంది. జూదంకు వచ్చేవారు రూ.1500 ఇచ్చి ఎంట్రీ టోకెన్ తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత రూ.5 వేల నుంచి రూ.3 లక్షల వరకూ టోకెన్లు అందుబాటులో ఉంటాయి. ఆట గెలిచిన వారు చివరిలో టోకెన్లు సెక్యూరిటీ సిబ్బందికి ఇస్తే వారు నగదు అందిస్తారు. మరోవైపు జూదం డెన్‌లో ప్రామిసరీ నోట్లు సైతం అందుబాటులో ఉంటాయి. ఎవరైనా డబ్బు లు అవసరమైతే వారి ఆధార్, ఇతర ధ్రువీకరణతో అప్పు ఇస్తారు. వారితో ప్రామిసరీ నోటు రాయించుకుంటారు. డెన్లోనే భోజనం, మందు, ఇతరత్రా స్నాక్స్, టీ, బిస్కెట్ వంటివి అందుబాటులో ఉంటా యి. అయితే జూదంతో నష్టం ఎక్కువగా జూదరులకు జరుగుతుండగా.. నిర్వాహకులు మాత్రం కో ట్లు కొల్లగొడుతున్నారు. అయితే బాధితుల్లో ఎక్కువ మంది మన జిల్లావాసులే. ఇప్పటికై నా జిల్లా పోలీస్ యంత్రాంగం, ఒడిశా అధికారులతో సంయుక్తంగా ఉక్కుపాదం మోపాలని స్థానికులు కోరుతున్నారు. -
ప్రజల విశ్వసనీయత ప్రధానం
భువనేశ్వర్: స్థానిక డీజీపీ క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ యోగేష్ బహదూర్ ఖురానియా అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి, నేరాల నియంత్రణ, ప్రజలతో పోలీసుల సమన్వయం, పోలీసింగ్ వ్యవస్థ సమర్థత, ప్రజోపయోగంగా చేరువ కావడం వంటి అంశాలపై సమీక్షించారు. రానున్న 15 రోజుల్లో పోలీసుల సానుకూల పని తీరు, తక్షణ చర్యలు, ప్రజా సేవల పట్ల సామాన్య ప్రజలకు అవగాహన కల్పించాలని డీజీపీ ఆదేశించారు. నేరాల నియంత్రణలో ప్రజల విశ్వసనీయత చూరగొని ముందుకు సాగడం అత్యంత ప్రయోజనకర సోపానంగా పేర్కొన్నారు. ప్రజలతో సమన్వయం బలోపేతం చేసేందుకు నిర్దిష్టమైన, సమర్థమైన చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల పోలీసు సూపరింటెండెంట్లు, రేంజ్ ఐజీలు, డీఐజీలను డీజీపీ ఆదేశించారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ వెహికల్స్ (ఈఆర్వీ)లో పని చేసే సిబ్బంది అందరికీ వృత్తిపరమైన, ఆచరణాత్మక శిక్షణ కల్పించాలన్నారు. సమయోచిత శిక్షణ, క్లిష్టమైన, అత్యవసర పరిస్థితులలో సత్వర ప్రతిస్పందనకు పదును పెడుతుందని డీజీపీ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బ్రీఫింగ్ పరేడ్ రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ప్రతి రోజూ ఉదయం 9 గంటలలోపు క్రమం తప్పకుండా బ్రీఫింగ్ పరేడ్ నిర్వహించాలని డీజీపీ ఆదేశించారు. దీన్ని సక్రమంగా అమలు జరిగేలా చూడాలని, క్రమం తప్పకుండా పర్యవేక్షించాలన్నారు. బ్రీఫింగ్ పరేడ్ అనంతరం, సంబంధిత పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతిభద్రతల పరిస్థితి, నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలు, నేరస్థుల కదలికలు, కొనసాగుతున్న దర్యాప్తులపై సమీక్షించి, చర్చించాలని సూచించారు. పోలీస్ ఠాణా స్థాయిలో సమన్వయం, అప్రమత్తత, త్వరితగతిన స్పందించే సామర్థ్యం మరింత బలపడతాయని ఆయన అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పటిష్టతకు వివిధ కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ ఆదేశించారు. ముఖ్యంగా కొనసాగుతున్న నాన్ బెయిలబుల్ వారెంట్ల (ఎన్బీడబ్ల్యూ)ను వేగంగా అమలు చేయడం, జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద కరడుగట్టిన, నిత్య నేరస్థులపై కఠిన చర్యలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపడంపై దృష్టి సారించాలన్నారు. అన్ని పోలీస్ ఠాణాల్లో బీట్ పెట్రోలింగ్, జాతీయ రహదారులపై సాధారణ పెట్రోలింగ్ విస్తరణ, దుష్ప్రవర్తన, నేర సంబంధిత ఘటనలను నివారించడానికి ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను చేపట్టాలని తెలిపారు. హత్య వంటి తీవ్రమైన కేసులను సీనియర్ పోలీస్ అధికారులు క్రమం తప్పకుండా పర్యవేక్షించి నిందితులను త్వరగా అరెస్టు చేయడం, సమగ్ర దర్యాప్తుతో చట్ట ప్రకారం శిక్ష పడేలా సమర్థమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ ఆదేశించారు. సమావేశంలో డీజీపీ (క్రైం శాఖ) బినయ్తోష్ మిశ్రా, ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ ఆర్పీ కోచే, అదనపు పోలీసు డైరెక్టర్ జనరల్ (శాంతి భద్రతలు) సంజయ్ కుమార్ ప్రముఖంగా పాల్గొన్నారు. డీజీపీ యోగేష్ బహదూర్ ఖురానియా భువనేశ్వర్ కమిషనరేట్ పోలీస్ పరిధిలోని శాంతిభద్రతల పరిస్థితి, నేరాల నియంత్రణపై చర్యలు, సున్నితమైన కేసుల తక్షణ, నిష్పక్షపాత దర్యాప్తు, సామాన్య ప్రజలతో పోలీసుల సానుకూల మమేకత్వం, ట్రాఫిక్ వ్యవస్థ సులభతర నిర్వహణ వంటి అంశాలపై వివరంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన పోలీసు వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దాలని పోలీసు అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో కటక్, భువనేశ్వర్ జంట నగరాల పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎస్. దేవ దత్త సింగ్, అదనపు పోలీస్ కమిషనర్ నరసింగ్ భోలా పాల్గొన్నారు. -
గుండెపోటుతో సీఆర్పీఎఫ్ జవాన్ మృతి
కొరాపుట్: విధి నిర్వహణలో సీఆర్పీఎఫ్ జవా ను మృతి చెందాడు. సోమవారం నబరంగ్‌పూర్ జిల్లా నందాహండి సమితికి చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ రంజన్ హరిజన్ (27) పంజాబ్ రాష్ట్రంలోని పఠాన్ కోట్లో విధి నిర్వహ ణలో ఉండగా గుండెపోటు రావడంతో మృతి చెందాడు. 2003లో కాశ్మీర్లో విధుల్లో చేరిన రంజన్ అనేక ప్రాంతాల్లో పనిచేశాడు. మృత దేహం స్వస్థలానికి చేరడంతో స్థానిక ప్రజలు, పోలీసు ఉన్నతాధికారులు నివాళులర్పించారు. జయపురం: ఆర్ట్ ఆఫ్ లివింగ్ పూజ్య గురుదేవ్ జన్మదినం సందర్భంగా సోమవారం కొట్‌పాడ్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ కుటుంబ సభ్యులు రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ నెల 10వ తేదీ నుంచి 25వ తేదీ వరకు గురుదేవ్ జన్మదిన ఉత్సవా లు దేశ వ్యాన్తంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకు లు వెల్లడించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 10వ తేదీన బెంగుళూరులో గల గురుదేవ్ ఆశ్రమానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారని వెల్లడించారు. సోమవారం కొట్‌పాడ్ శ్రీరామ మందిర సమీపంలో గల గోపబందుపాఠాఘర్లో రక్తదాన శిబిరం నిర్వహించామని, 40 యూనిట్ల రక్తం సేకరించినట్లు తెలిపా రు. గురుదేవ్ గత 45 ఏళ్లుగా యోగా, ధ్యానంలో శిక్షణ ఇస్తున్నారన్నారు. యోగా శిక్షణ ఇచ్చా మని వెల్లడించారు. ఈ కార్యక్రమాల్లో గౌర చంద్ర రథ్, సూర్య కాంత పాడీ, విశ్వజిత్ మల్లిక్, బెనర్జీ రావు, తపన మహాపాత్రో, కిశోర్ మిశ్ర, ప్రదీప్ ప్రధాన్, కెల్ల గోపి, అశోక్ మిశ్ర, ఆర్ట్ ఆఫ్ లివింగ్ పరివార సభ్యులు పాల్గొన్నారు. మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీగా భాస్కర్‌రెడ్డి శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని మహిళా పోలీస్‌స్టేషన్‌కు డీఎస్పీగా ఎన్.భాస్కర్‌రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరి డీజీపీ కార్యాలయంలో వీఆర్ఎస్లో ఉన్న ఈయన నేరుగా పోస్టింగ్‌పై శ్రీకాకుళం వచ్చారు. 1995 బ్యాచ్‌కు చెందిన ఈయన అనంతపురంలో ఎస్ఐ, సీఐగా పనిచేశారు. కాగా, కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇదే స్టేషన్‌కు డీఎస్పీగా బి.రాజశేఖర్ వచ్చినప్పటికీ కొన్ని నెలలు పనిచేసి వెళ్లిపోయారు. దాదాపు ఏడాదిన్నర పోస్టు ఖాళీగా ఉండటంతో సీఐలతోనే స్టేషన్ నెట్టుకువచ్చారు. గతంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, పోక్సో వంటి కీలక కేసులను ఎక్కువగా మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీకే తమ విచక్షణాధికారాన్ని బట్టి ఉన్నతాధికారి అప్పజెప్పేవారు. ఇక్కడ డీఎస్పీ పోస్టింగ్‌లో జాప్యం రావడంతో ఇతర డివిజన్ల అధికారులకు అదనంగా బాధ్యతలు పడ్డాయి. బీచ్ కబడ్డీలో సిక్కోలు అ‘ద్వితీయం’ శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం కబడ్డీ జట్లు మరోసారి సత్తాచాటాయి. ఏపీ రాష్ట్రస్థాయి సీనియర్స్ బీచ్ కబడ్డీ చాంపియన్‌షిప్ పోటీల్లో జిల్లా మహిళా జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఈ పోటీలు ఈ నెల 7 నుంచి 10 వరకు నెల్లూరు జిల్లా దువ్వూరు వేదికగా జరిగాయి. పురుషుల జట్టు సెమీస్‌లో నిష్క్రమించగా..మహిళల జట్టు తుది వరకు పోరాడింది. వీరి రాణింపు పట్ల జిల్లా కబడ్డీ సంఘ చైర్మన్, ఎమ్మెల్యే గొండు శంకర్, జిల్లా అధ్యక్షుడు నక్క రామకృష్ణ, కార్యదర్శి సాదు ముసలినాయుడు, సాదు శ్రీనివాస్, సంఘ ప్రతినిధులు హర్షం వ్యక్తంచేశారు. రణస్థలం: పైడిభీమవరం పారిశ్రామికవాడలో ని ఆంధ్రా ఆర్గానిక్స్ ప్రైవేటు లిమిటెడ్ పరిశ్ర మ కార్మికులు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ విధులు బహిష్కరించి పరిశ్రమ ఎదుట సోమవారం నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికు ల పేరుతో అతి తక్కువ వేతనాలు ఇచ్చి శ్రమదోపిడీకి పాల్పడటం తగదన్నారు. ధరలు విపరీతంగా పెరిగాయని, వాటికి అనుగుణంగా వేతనాలు పెంచకపోతే కుటుంబ పోషణ ఎలా అని ప్రశ్నించారు. అధిక సమయం పనిచేయించి సింగిల్ ఓటీ మాత్రమే ఇస్తున్నారని, మిగతా పరిశ్రమల్లో డబల్ ఓటీ ఇస్తారని చెప్పారు. నెల వేతనం బోనస్‌గా ఇవ్వాలని, అతి తక్కువ బోనస్ మాత్రమే ఇస్తున్నారని తెలిపారు, చట్టబద్ధంగా వీడీఏ అమలు చేయా లని డిమాండ్ చేశారు. -
నకిలీ డీఈఎఫ్ తయారీ ముఠా గుట్టురట్టు
రాయగడ: ఝార్సుగుడ జిల్లాలో నకిలీ డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్యూయిడ్ (డీఈఎఫ్) తయారీ వ్యవహారంలో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఆపరేషన్ నేత్రలో భాగంగా జిల్లా ఎస్పీ జి.ఆర్.రాఘవేంద్ర ఆదేశాల మేరకు సదరు పోలీస్ స్టేషన్ పరిధిలోని సిరియాబగిచా ప్రాంతంలో నడుస్తున్న అక్రమ డీఈఎఫ్ తయారీ యూనిట్‌ను ఇటీవల పోలీసులు గుర్తించి భారీ ఎత్తున సామగ్రిని స్వాఽధీనం చేసుకున్నారు. ఈ కేసులో భాగంగా రాజస్థాన్‌లోని తంగగజి జిల్లా అల్వార్ ప్రాంతానికి చెందిన ముఖేష్ చాంద్, ఝార్సుగుడ జిల్లాలోని ఒరియంట్ పోలీస్ స్టేషన్ పరిధి లమిటిబహాల్ ప్రాంతానికి చెందిన అమన్ కుమార్ సింగ్, సిరియాబగిచ ప్రాంతానికి చెందిన రాజ్ కుమార్ హెంబ్రమ్, బ్రిజిభూషన్ సింగ్, ఛత్తీస్‌గఢ్ జిల్లాలోని దులుదులా పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన జియల్ అన్సారి, బరగడ జిల్లాకు చెందిన ఆకాష్ అగ్రవాల్, ఝార్సుగుడ జిల్లాలోని పార్ధశారధి మిశ్రాలను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 422 లీటర్ల సామర్ధ్యం గల ఖాళీ బకెట్లు, రెండు వాహనాలు, తదితరమైన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీస్థాయి అధికారుల నేతృత్వంలో ప్రత్యేక బృందం రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్‌కు వెళ్లి ఈ కేసులో ప్రధాన సూత్రధారి అనూజ్ అగ్రవాల్‌ను అరెస్టు చేసి ఝార్సుగుడకు తీసుకువచ్చారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. ఈ మేరకు ఎస్పీ రాఘవేంద్ర తెలియజేసిన వివరాల మేరకు.. రైతులకు సరఫారా చేయాల్సిన సబ్సిడీ యూరియాను నీటితో కలిపి డీఈఎఫ్గా తయారీ చేసి టాటా, అశోక్టైలాండ్ మహేంద్ర వంటి ప్రముఖ కంపెనీల పేర్లతో నకిలీ బ్రాండింగ్ చేసి ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చిందని వివరించారు. దీనిని అనుసరించి దర్యాప్తు చేయగా పూర్తి వివరాలు బయటపడ్డాయని అన్నారు. ఈ నకిలీ తయారీ వెనుక ఉన్న పూర్తి నెట్వర్క్, ముడిసరుకుల సరఫరా, సబ్సిడీ యూరియా మళ్లింపు ఇతర సంబంధిత వ్యక్తుల పాత్రపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
సెల్ టవర్ ఎక్కి మందుబాబు హల్చల్
రాయగడ: మొబైల్ టవర్ ఎక్కిన మందుబాబు హల్చల్ చేశాడు. జిల్లాలోని కళ్యాణసింగుపూర్‌లో సొమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు అగ్నిమాపక సిబ్బంది గంటల తరబడి శ్రమించి యువకుడిని కిందకు దింపారు. వివరాల్లోకి వెళితే.. కళ్యాణసింగుపూర్‌లోని కుంబారి వీధికి చెందిన త్రిలోచన్ కాశీ పూటుగా తాగి సమీపంలో గల సెల్ టవర్ పైకి ఎక్కాడు. కిందకు దిగాలని స్థానికులు పలుమార్లు వారించినప్పటికీ పట్టించుకోకుండా తాను టవర్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానిని బెదిరించాడు. దీంతో కాసేపు అక్కడ హైడ్రామా నెలకొంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సుమారు రెండు గంటలపాటు మందుబాబుని బుజ్జగించి కిందకు దించారు. అనంతరం పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. -
మాత్తిలి గ్రీవెన్స్‌లో 57 వినతులు స్వీకరణ
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా మాత్తిలి సమితి దుంగియాపూట పంచాయతీ కార్యాలయంలో కలెక్టర్ ప్రధమేశ్ ఆదేశాల మేరకు జిల్లా అదనపు కలెక్టర్ సోమనాథ్ ప్రధన్ సోమవారం గ్రీవెన్స్‌సెల్ నిర్వహించి 57 వినతులు స్వీకరించారు. వీటిలో 22 వ్యక్తిగత ఫిర్యాదులు కాగా 35 గ్రామస్థాయి సమస్యలు ఉన్నాయి. అలాగే వివిధ శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక సహాయ శిబిరాలు నిర్వహించారు. మాత్తిలి బీడీఓ ప్రమోద్ బెహరా అధ్యక్షతన పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. జిల్లా అభివృద్ధి శాఖ అధికారి దశరాథి సరాబు, జిల్లా వైద్యాధికారి డోలామణి ప్రధన్, జిల్లా అదనపు ఎస్పీ రశ్మిరంజన్ సేనాపతి పాల్గొన్నారు. అలాగే జిల్లా కలెక్టర్ ప్రధమే శ్ అర్వింద్ రాజశిర్కే కలిమెల సమితిలో బాడిగేటా, మల్కన్‌గిరి సమితిలో ఝూరపల్లి, చిత్రకొండ సమితిలో బడపోఢ పంచాయతీ, ఖోయిర్‌పూట్ సమితి లో గోవిందపల్లి, కోరుకొండ సమితిలో మారివా డా, పోడియా సమితిలో బాపన్‌పల్లి పంచాయతీలో గ్రీవెన్స్‌ను నిర్వహించి వినతులు స్వీకరించారు. ఆర్.ఉదయగిరిలో.. పర్లాకిమిడి: గజపతి జిల్లా ఆర్.ఉదయగిరి సమితి కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రామ సభకు మంచి స్పందన లభించింది. జిల్లా కలెక్టర్ అక్షయసునీల్ అగర్వాల్, ఆర్.ఉదయగిరి, సబ్ డివి జనల్ పోలీసు అధికారి రాజేష్‌కుమార్ సాహు, జిల్లా పరిషత్తు సీఈవో దయామయ పాఢి, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అంశుమాన్ మహాపాత్రో, సబ్ కలెక్టర్ అనుప్ పండా హాజరయ్యారు. 25 వినతు లు రాగా అందులో వ్యక్తిగతం 9, గ్రామ సమస్యల కు సంబంధించి 16 ఉన్నాయి. సీఎంఆర్ఎఫ్ క్రింద ఎటువంటి సహాయం అందలేదు. ముఖ్యంగా వృద్ధాప్య పింఛన్లు, రోడ్డు సౌకర్యం, మంచినీటి సమస్యలపై ఎక్కువు వినతులు అందాయి. ఆర్.ఉదయగిరి తహసీల్దార్, బీడీవో హాజరయ్యారు. -
వ్యక్తికి దేహశుద్ధి!
మల్కన్‌గిరి: పిల్లలను అపహరించడానికి వచ్చినట్టు భావించిన వ్యక్తిని స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేశారు. ఈ సంఘటన మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి మోటు పోలీసు స్టేషన్ పరిధిలోలోని ఎంవీ 114 గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. పిల్లలను అపహరించడానికి వచ్చిన వ్యక్తిని స్థానికులు పట్టుకొని విద్యుత్ స్తంభానికి కట్టేసి తీవ్రంగా కొట్టారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. ఎం.వి.60 గ్రామానికి చెందిన సుబ్రత్ మండాల్ ఎంవీ 114 గ్రామానికి చెందిన మహిళను ప్రేమించేవాడు. ఆ మహిళ తో కలిసి ఇద్దరు ఆంధ్రప్రదేశ్‌లో పని చేస్తున్న సమయంలో పరిచయం ఏర్పడి ప్రేమించుకున్నారు. అయితే ఆ మహిళ కొద్దీరోజుల క్రితమే అక్కడ నుంచి సొంతఊరుకి వచ్చి ఉంటుంది. అయితే ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి సుబ్రత్‌తో కలవలేదు.. మాట్లాడలేదు. దానితో సుబ్రత్ మాహిళను కలవాలని భావించాడు. బిడ్డను అపహరిస్తే ఆమె తన వద్దకు వస్తుందని భావించాడు. సోమవారం తెల్లవారు జామునవచ్చి ఉదయం ఆరు గంటల మహిళ పిల్లవాడు అనుకొని పొరపాటున పక్కింటి పాపను అపహరించాడు. ఈ విషయం తెలిసిన గ్రామస్థులు వెంటనే పట్టుకొని విద్యుత్ స్తంభానికి కట్టేసి కొట్టారు. అనంతరం మోటు పోలీసులకు సమాచారం ఇచ్చి నిందితున్ని అరెస్టు చేశారు. ముందుగా పోలీసులు కలిమెల ఆరోగ్యకేంద్రంలో ్ చికిత్స ఇప్పించి అనంతరం కేసు నమోదు చేసి పూర్తి విచారణ అనంతరం కోర్టుకు తరలిస్తామని పోలీసులు తెలిపారు. -
ఎలుగుబంటిని బంధించిన అటవీ సిబ్బంది
కొరాపుట్: అటవీ శాఖ సిబ్బంది ఎలుగు బంటిని బంధించారు. సోమవారం నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రం నుంచి దెవులా–కొసాగుమ్డ మార్గంలో ఎలుగుబంటి సంచిరిస్తుండదాన్ని స్థానికులు గమనించారు. జన సంచారం ప్రాంతంలో ఎలుగు సంచరిస్తుండంతో భయాందోళన చెందారు. వెంటనే అటవీశాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఎండ వేడిమితో ఎలుగు బంటి ప్రధానమార్గంలో కల్వర్టు కింద సేద తీరుతుంది. ఇదే సమయంలో అటవీసిబ్బంది కల్వర్టుకి ఒక వైపు బోను పెట్టి మరో వైపు మూసి వేశారు. దాంతో ఎలుగు బోను లోనికి వెళ్లి చిక్కుకుంది. వెంటనే దానిని నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయానికి తరలించారు. వైద్య పరీక్షలు అనంతరం సురక్షితంగా అడవిలో విడిచి పెడతామని అటవీ శాఖ అధికారులు చెప్పారు. -
జనావాసాల్లోకి జింక పిల్ల
రాయగడ: జిల్లాలోని బిసంకటక్ సమితి పరిధి చాటికొన పంచాయతీ రాణిబంధ గ్రామంలోకి సోమవారం ఉదయం జింక పిల్ల ప్రవేశించింది. సమీప అటవీ ప్రాంతం నుంచి దారి తప్పి గ్రామంలోకి చేరుకుందని భావిస్తున్నారు. జింకపిల్లను చూసిన గ్రామస్తులు దానికి ఎలాంటి హాని తలపెట్టకుండా అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ గార్డులు చేరుకుని జింకపిల్లను రక్షించారు. అయితే అది అస్వస్థతతో పడి ఉండటం గమనించి తమ వెంట తీసుకువెళ్లి చికిత్స జరిపిన అనంతరం తిరిగి అడవుల్లో విడిచిపెట్టేస్తామని చెప్పారు. పద్మపూర్‌లో వినతుల స్వీకరణ రాయగడ: జిల్లాలోని పద్మపూర్‌లోని సమితి కార్యాలయం సమావేశం హాల్లో సోమవారం వినతుల స్వీకరణ కార్యక్రమం జరిగింది. జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలొ వివిధ ప్రాంతాల నుంచి 29 వినతులు అందాయి. వీటిలో 26 వ్యక్తిగత సమస్యలుగా గుర్తించగా మరో మూడు గ్రామ సమస్యలుగా గుర్తించారు. స్వీకరించిన వినతుల్లో గ్రామ సమస్యలను పరిశీలించి వాటిని సత్వరంగా పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలొ జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహక అధికారి అక్షయ కుమార్ ఖెముండో, గుణుపూర్ సబ్ కలెక్టర్ దుదూల్ అభిషేక్ దిల్లిప్, ఏఎస్పీ గోసొనొర్ బర్లా, ఐటీడీఏ గుణుపూర్ ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ అజయ్ కుమార్ ప్రధాన్ పాల్గొన్నారు. కార్మిక నేతకు వీడ్కోలు భువనేశ్వర్: తూర్పు కోస్తా రైల్వే ఖుర్దారోడ్ మండలం శ్రామిక కాంగ్రెస్ నేత సరోజ్ కుమార్ మంగరాజ్కు ఆత్మీయంగా వీడ్కోలు పలికారు. ప్రధాన టికెట్ తనిఖీ అధికారిగా ఉద్యోగ విరమణ సందర్భంగా శాఖ కార్యదర్శి లక్ష్మీధర మహంతి ఆధ్వర్యంలో ఏర్పాటైన కార్యక్రమంలో పలువురు కార్మిక నేతలు ప్రసంగించారు. రాయగడ: స్థానిక రెల్లివీధికి చెందిన నిఖిల్ అడప అనే యువకుని హత్య కేసుకు సంబంధించి దక్షిణాంచల్ డీఐజీ కన్వర్ విశాల్ సింహ్ ప్రత్యేక దర్యాప్తునకు రాయగడ చేరుకున్నారు. ఎస్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నిఖిల హత్య కేసు నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు మూడు పోలీస్ టీం లను ఏర్పాటు చేసామని అన్నారు. అనుమానితుల సంఖ్య పెరగడంతో మరో మూడు టీమ్‌లు వేశామని పేర్కొన్నారు. వీరంతా గాలిస్తున్నారని తెలిపారు. సైబర్, టెక్నికల్ వంటి బృందాలకు చెందిన వారి సహాయాన్ని తీసుకుంటున్నామని అన్నారు. నిందితులు తుపాకీలు వినియోగిస్తున్నారు, అవి వారికి ఎలా లభ్యమవుతున్నాయన్న విషయమై విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెబుతూ దానిపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నామని, మరో 15 రోజుల్లో పూర్తి వివరాలను వెల్లడించడంతో పాటు ఆయుధాల సరఫరా, రవాణాకు వినియోగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా బంధగూడ గ్రామం వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, ఆయన కారు డ్రైవర్‌కు గాయాలయ్యాయి.మాత్తిలి సమితి దుంగియాపూట్ పంచాయతీలో గ్రీవెన్స్‌కు హాజరవుతున్న సమయంలో భంజనగార్ నుంచి కలిమెల వస్తున్న ఒడిశా ఆర్టీసీ బస్సును కారు ఢీకొట్టింది. వ్యవసాయశాఖ జిల్లా అధికారి అనిల్‌కుమార్ ప్రహరాజ్కు స్వల్ప గాయాలు, డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే మల్కన్‌గిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య సేవలు పొందుతు న్నారు. -
అంత్యక్రియల్లో ఉద్రిక్తత
రాయగడ : స్థానిక రెల్లివీధికి చెందిన హడప నిఖిల్ (18) అనే యువకుడిని గుర్తు తెలియని దుండగులు శనివారం అపహరించి అనంతరం హత్య చేసి మృతదేహాన్ని సమీపంలో గల నాగావళి నది వద్ద పడేసిన ఘటనకు సంబంధించి సోమవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యువకుని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్న అనంతరం పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తర్వాత మృతదేహాన్ని ఆదివారం నాడు కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ క్రమంలో సోమవారం స్థానిక రెల్లి వీధి నుంచి వందల సంఖ్యలో బాధిత కుటుంబీకుల బంధువులు, వీధి ప్రజలు మృతదేహాన్ని అంత్యక్రియలు చేసేందుకు భారీ ర్యాలీగా వెళ్లారు. ఈ నేపథ్యంలొ సదరు పోలీస్ స్టేషన్ వద్ద మృతదేహాన్ని ఉంచి ఆందోళన చేస్తారన్న సమాచారం మేరకు సదరు పోలీస్ స్టేషన్ వద్ద భారీ పోలీస్ బందొబస్తును ఏర్పాటు చేసారు. ఎస్పీ స్వాతి ఎస్ కుమార్ స్వయంగా సదరు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని పర్యవేక్షించారు. ఎస్డీపీఓ గౌరహర సాహు నేతృత్వంలొ పోలీసులు పోలీస్ స్టేషన్ మెయిన్ గేటును మూసివేసి ఎదుట ఎలాంటి అల్లర్లు జరగకుండా కాపలాకాసారు. రెల్లివీధి నుంచి మృతదేహాన్ని రామాటాకీస్ మీదుగా తీసుకువస్తున్న సమయంలో పోలీసులు ఆర్కే నగర్ వైపు వెళ్లాలని పోలీస్ స్టేషన్ మీదుగా వెళ్లకూడదని అడ్డుకున్నారు. అయితే అందుకు ససేమిరా అంగీకరించని ఆందోళనకారులు పోలీసులతొ కాసేపు వాగ్వాదానికి దిగారు. పోలీసులు వారిస్తున్నప్పటికీ వారిని తోసుకుంటూ పోలీస్ స్టేషన్ మీదుగా మృతదేహాన్ని తీసుకువెళ్లారు. ఈ పరిస్థితిలో ఆందోళనకారులతో వాగ్వాదానికి దిగితే అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకునే ప్రయత్నం ఉన్న కారణంగా పోలీసులు కాస్త వెనక్కి తగ్గక తప్పలేదు. అక్కడ నుంచి ఆందోళనకారులు మృతదేహాన్ని తీసుకువెళ్లిపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. శనివారం నాడు స్థానిక ఇందిరానగర్ మూడో లైన్లో గుర్తు తెలియని దుండగులు కొంతమంది తన కొడుకును తుపాకీతో బెదిరించి అపహరించి తీసుకువెళ్లిన విషయాన్ని అదే రోజు రాత్రి 12 గంటల ప్రాంతంలో సదరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, అప్పుడే పోలీసులు అప్రమత్తమై స్పందించి ఉంటే తన కొడుకు హత్యకు గురయ్యేవాడు కాదని మృతుడు నిఖిల్ తండ్రి హడప శివ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం నాడు తన కొడుకు అంత్యక్రియల్లో భాగంగా కొత్తబస్టాండు వద్ద విలేకర్లతో ఆయన మాట్లాడారు. తన కొడుకు మృతికి కారణం పోలీసుల నిర్లక్ష్యమేనని బహిరంగంగా ఆరొపించారు. తన కొడుకు హత్యకు కారణమైన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దాదాపు 14 మంది కలిపి ఈ హత్యకు వల పన్నినట్లుగా అనుమానం వ్యక్తం చేశారు. అనంతరం నిఖిల్ (మృతుడు) వినియోగిస్తున్న బైకును కొత్తబస్టాండు వద్ద గల ప్రధాన రహదారి వద్ద ఆందోళనకారులు పెట్రోల్ పోసి తగుల బెట్టారు. -
ఆక్రమణదారులకు నోటీసులు జారీ
రాయగడ: జిల్లాలోని గుణుపూర్ మున్సిపాలిటీ పరిధిలో గల మరాఠీగుడ కపిలపూర్ సమీపంలో మున్సిపాలిటీ స్థలాలను అక్రమించుకుని ఇళ్లను నిర్మించుకున్న వారికి సంబంధిత శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేసిన 48 గంటల గడువులో స్థలాలను ఖాళీ చేయాలని, లేనిపక్షంలో ఇళ్లను కూల్చివేస్తామని హెచ్చరించారు. ఇలా 35 కుటుంబాలు మున్సిపాలిటీ స్థలాలను అక్రమించుకున్నట్లు గుర్తించిన మున్సిపాలిటీ అధికారులు ఈ మేరకు వారికి శనివారం నోటీసులు జారీ చేశారు. ఇంటింటికీ సంబంధిత శాఖ అధికారులు వెళ్లి నోటీసులు ఇచ్చారు. మున్సిపాలిటీ పరిధిలో సుమారు 42 మంది స్థలాలను ఆక్రమించుకున్నట్లు తమ సర్వేలో తేలిందని మున్సిపాలిటీ కార్యనిర్వాహక అధికారి సంగతోష్ కుమార్ నాయక్ తెలిపారు. మొదటి విడతలో 35 మంది కుటుంబాలకు ఈ నోటీసులు జారీ చేశామన్నారు. అనంతరం మిగతా వారిపైనా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
ధాన్యం కొనుగోలుకు మోక్షమెప్పుడో?
సారవకోట: కూటమి ప్రభుత్వంలో రైతులకు కష్టాలు వీడటం లేదు. సారవకోట మండలంలోని పలు గ్రామాలలో రైతులు రబీ సీజన్లో పండించిన ధాన్యం నేటికీ కొనుగోలు కాలేదు. సారవకోట, జగ్గయ్యపేట, బురుజువాడ, కొత్తూరు, అగదల తదితర గ్రామాల రైతులకు పంట త్వరగా చేతికి రావడంతో ధాన్యాన్ని వ్యాపారులకు ఎంతోకొంత ధరకు విక్రయించుకున్నారు. ప్రస్తుతం తొగిరి, అక్కివలస, బద్రి, అడ్డపనస గ్రామాల రైతులకు పంట ఆలస్యంగా చేతికి రావడంతో రోడ్లపై ఆరబెడుతున్నారు. ప్రభుత్వం రబీలో పండిన ధాన్యం కోసం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక పోవడంతో వారంతా వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. వ్యాపారులు సైతం సరైన ధర మార్కెట్లో లేదని, ఇప్పుడు తాము కొనుగోలు చేయలేమని చేతులెత్తేస్తున్నారు. మరోవైపు ఈదుర గాలులతో కూడిన వర్షాలు కురుస్తుండటంతో ధాన్యం భద్రపర్చుకునేందుకు అవకాశం లేక రైతులు అవస్థలు పడుతున్నారు. మరికొన్ని రోజులలో తుఫాన్ కారణంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో కలవరపడుతున్నారు. మరోవైపు మొక్క జొన్న సాగు చేసిన రైతులు సైతం మద్దతు ధర లేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
ఏయూఈఈటీకి 330 మంది హాజరు
ఎచ్చెర్ల: ఆంధ్రా యూనివర్సిటీలో ఆరేళ్ల డ్యూయల్ ఇంజినీరింగ్ (బీటెక్, ఎంటెక్) కోర్సుల్లో ప్రవేశానికి ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విశ్వ విద్యాలయం కేంద్రంగా ఆదివారం నిర్వహించిన ఏయూఈఈటీ– 2026కు 330 మంది హాజరయ్యారు. ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు జరిగిన ఈ పరీక్షకు 374 మందికి హల్‌టికెట్లు జారీ చేయగా 44 మంది గైర్హాజరయ్యారు. వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్ రాజశేఖరరావు పర్యవేక్షించారు. ఎచ్చెర్లతో పాటు రాష్ట్రంలో మరో ఏడు కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. ఈ నెల 14న ఫలితాలు విడుదల కానున్నాయి. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి సారవకోట: మండల కేంద్రం సారవకోటకు చెందిన బొల్లు తిరుపతిరావు(56) శనివారం ఉదయం కుటుంబ కలహాలతో కలుపు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు 108 వాహనంలో శ్రీకాకుళం సర్వజన ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడి భార్య మాలతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుపతిరావుకు వివాహితులైన కుమార్తె, కుమారుడు ఉన్నారు. శ్రీముఖలింగేశ్వరుని సన్నిధిలో మత్స్యశాఖ డైరెక్టర్ జలుమూరు: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగంలో వెలసిన మధుకేశ్వరున్ని మత్స్యశాఖ రాష్ట్ర డైరెక్టర్ ఎ.చంద్రశేఖర్ రెడ్డి కుటుంబసమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. స్వామివారికి ఏకవార అభిషేకాలు, అర్చనలు నిర్వహించి వారాహి అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు. అర్చకులు ఆల చరిత్ర వివరించి తీర్థ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటం, శేషవస్త్రాలు అందించారు. ఈయనతోపాటు డీడీ గోపికృష్ణ, సిబ్బంది, అర్చకులు నాయుడుగారి రాజశేఖర్ ఉన్నారు. పశువుల అక్రమ రవాణా అడ్డగింత నరసన్నపేట: వ్యాన్‌లో అక్రమంగా తరలిస్తున్న తొమ్మిది ఆవులను పట్టుకొని డ్రైవర్‌పై కేసు నమోదు చేశామని నరసన్నపేట ఎస్ఐ బి.గణేష్ ఆదివారం తెలిపారు. నారాయణవలస సంత వద్ద నుంచి అలమండ సంతకు ఎటువంటి అనుమతులు లేకుండా చిన్న వ్యాన్లోనే 9 ఆవులను ఎక్కించడంతో ప్రాణాపాయంగా కనిపించాయని చెప్పారు. తామరాపల్లి వద్ద వీటిని పట్టుకున్నామన్నారు. కేసు నమోదు చేసి ఆవులను గోశాలకు తరలించి వ్యాన్ సీజ్ చేశామని ఎస్ఐ తెలిపారు. నాటకరంగానికి చేయూతనివ్వాలి శ్రీకాకుళం కల్చరల్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫిల్మ్, టెలివిజన్, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా భరత్ భూషణ్ నియామకం పట్ల శ్రీకాకుళ రంగస్థల కళాకారుల సమాఖ్య(నెలవారీ సాంస్కృతిక విభాగం) ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సమాఖ్య అధ్యక్షుడు ఎల్.రామలింగస్వామి మాట్లాడుతూ ఒడిదుడుకుల్లో ఉన్న నాటకరంగానికి, పేద కళాకారులకు చేయూతనందించాలని కోరారు. సమాఖ్య కార్యనిర్వాహక అధ్యక్షుడు పన్నాల నరసింహమూర్తి, కార్యదర్శి బి.రామచంద్ర దేవ్, న్యాయ సలహాదారు కంచరాన అప్పారావు, కార్యవర్గ సభ్యులు చైర్మన్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. -
అధికారులూ.. ఇదేం తీరు..!
● కార్పొరేట్ పాఠశాలలకు రాష్ట్ర అధికారుల పరోక్ష దన్ను ● అడ్మిషన్లపై చిన్న ప్రైవేటు స్కూళ్లపైనే దృష్టి పెట్టాలని ఆదేశం! శ్రీకాకుళం : రాష్ట్ర విద్యాశాఖ అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు కార్పొరేట్ విద్యాసంస్థలకు పరోక్షంగా దన్నునిచ్చేలా కనిపిస్తున్నాయి. ఇటీవల అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులతో వెబ్ సమావేశం నిర్వహించారు. పాఠశాలల్లో అడ్మిషన్లకు సంబంధించిన చర్చలో చిన్న చిన్న ప్రైవేట్ పాఠశాలలపైనే దృష్టి పెట్టాలని, కార్పొరేట్ విద్యాసంస్థల జోలికి వెళ్లవద్దని మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు విద్యాశాఖలోనే చర్చ జరుగుతోంది. దీనిపై ఉపాధ్యాయవర్గాలు మండిపడుతున్నాయి. అలాగే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల సంఘ నాయకులు దీనిని తప్పుపడుతున్నారు. మరోవైపు, ప్రభుత్వ బడుల్లో చేరాలనుకుంటున్న విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలలు టీసీలు ఇవ్వకుంటే ఎంఈఓలకు తెలియజేయాలని, వారే యూడైస్‌లో పేర్లను తొలగించి టీసీలు మంజూరు చేస్తారని చెప్పడంపైనా ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది సరైన విధానం కాదని, ఇటువంటి విధానాలకు పాల్పడితే ఆందోళన బాట పట్టక తప్పదని హెచ్చరిస్తున్నారు. కార్పొరేట్ పాఠశాలల పట్ల ఉదాసీనత ఎందుకు ప్రదర్శిస్తున్నారో అర్థం కావడం లేదని అంటున్నారు. ఇటువంటి విధానాలకు స్వస్తిపలికి అందరినీ ఒకేలా చూడాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై డీఈవో రవిబాబు వద్ద ప్రస్తావించగా తాము ఎటువంటి ఆదేశాలూ జారీ చేయలేదన్నారు. బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో చేయాలని ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులను సంప్రదించి వారు సమ్మతిస్తే ప్రభుత్వ పాఠశాలలకు తరలించాలని మాత్రమే చెప్పారని, ఎంఈఓలు టీసీలు ఇస్తారనడంలో కూడా వాస్తవం లేదని పేర్కొన్నారు. -
చందన యాత్రలో సంప్రదాయ నృత్యం
భువనేశ్వర్: శ్రీ క్షేత్రం శ్రీ జగన్నాథుని వెలుపలి చందన యాత్ర బొడొ దండొ మార్గాన్ని కళా వేదికగా మలిచింది. శ్రీ మందిరం నుంచి నరేంద్ర సరోవరం తీరం వరకు దారి పొడవునా సాగే స్వామి పల్లకి ఊరేగింపులో హై టెక్ విద్యా సంస్థలో ఒడియా భాషా సాహిత్య విభాగం సీనియర్ ప్రొఫెసర్, అంతర్జాతీయ ఒడిస్సీ నర్తకుడు అయి న డాక్టర్ చిత్తరంజన్ సహాణి శాసీ్త్రయ నృత్య ప్రదర్శన సందర్శకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గత మూడు దశాబ్దాలుగా శ్రీ క్షేత్రం శ్రీమందిరంలో జరిగే చందన యాత్ర, స్నానోత్సవం, రథ యాత్ర, బహుడా, నీలాద్రి విజే, డోలా యాత్ర వంటి వివిధ ఉత్సవాలలో మహాప్రభువుకు నృత్య సేవలను అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. -
పోర్టు నిర్వాసితులకు తప్పని పాట్లు
సంతబొమ్మాళి: మూలపేట పోర్టు నిర్వాసితులు సమస్యలతో సావాసం చేస్తున్నారు. నౌపడలో కేటాయించిన పునరావాస కాలనీలో కనీస వసతులు లేకపోవడంతో మూలపేట గ్రామానికి చెందిన నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారు. నీరు, రోడ్లు లేకపోవడం, డ్రైనేజీలు అరకొరగా ఉండడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇళ్ల నిర్మాణానికి మెటీరియల్స్‌తో వస్తున్న ట్రాక్టర్, టిప్పర్లు తరచూ బురదలో కూరుకుపోతున్నాయి. ఆదివారం కూడా ఇదే సమస్య పునరావృతం కావడంతో అవస్థలు పడ్డారు. తమ భూములు, గ్రామాన్ని పోర్టుకు ఇస్తే త్యాగాలను గుర్తించకుండా సమస్యలు పరిష్కరించకుండా అధికారులు ముఖం చాటేస్తున్నారని నిర్వాసితులు మండిపడుతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు. -
32 ఏళ్ల తర్వాత..
దూసి జిల్లా పరిషత్ హైస్కూల్లో 1994 పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. దాదాపు 32 ఏళ్ల తర్వాత ఒకేచోట కలుసుకున్న పూర్వ విద్యార్థులు ఆనందోత్సాహాలతో గడిపారు. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కేరింతలు కొడుతూ తమ చిన్ననాటి అనుభూతులను ఒకరితో ఒకరు పంచుకున్నారు. మాతృదినోత్సవం రోజున ఈ ఆత్మీయ సమావేశం జరగడం ఎంతో ప్రత్యేకంగా నిలిచిందని పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సత్కరించి వారి ఆశీస్సులు అందుకున్నారు. – ఆమదాలవలస -
● నాగావళి నది సమీపంలో మృతదేహాన్ని పడేసిన దుండగులు ● పోలీస్ స్టేషన్ ఎదుగ బాధిత కుటుంబీకుల ఆందోళన
రాయగడ: స్థానిక రెల్లివీధికి చెందిన హడిప నిఖిల్ (18) అనే యువకుడు శనివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు అతడిని మొదట అపహరించి అనంతరం అత్యంత కిరాతకంగా హత్య చేసి మృతదేహాన్ని సమీపంలో గల నాగావళి నది వద్ద పడేశారు. అటువైపుగా వెళ్లిన కొందరు యువకుని మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి ఎస్పీ స్వాతి ఎస్ కుమార్, ఎస్డీపీఓ గౌరహరి సా హు, పోలీస్ స్టేషన్ ఐఐసీ ప్రసన్న కుమార్ సైంటిఫిక్ టీమ్‌తో చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం కోసం మృతదేహా న్ని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శనివారం రాత్రి నుంచే పోలీసులు గాలింపు శనివారం రాత్రి పదిన్నర గంటలకు ఇందిరానగర్‌లో తుపాకీల గుళ్ల మోతతో కలకలం రేపడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేశారు. గుర్తు తెలియని దుండగులు తుపాకీతో ఫైరింగ్ చేసినట్లు కాలనీ వాళ్ల సమాచారం మేరకు ఆ దిశగా దుండగులను గాలించేందుకు ప్రయత్నించారు. ఆదివారం మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా మృతదేహం లభించిన స్థలానికి చేరుకున్న ఎస్పీ దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు విలేకర్లతొ ఘటనకు సంబంధించి వివరాలు వెల్లడించారు. పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన ఇదిలాఉండగా ఈ హత్యకు పాల్పడిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ మృతుని కుటుంబీకులు రెల్లివీధికి చెందిన మహిళలు సదరు పోలీస్ స్టేషన్ ఎదుట ఆదివారం ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో టైర్లను కాల్చి రాకపోకలను నిలిపివేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తుతో పోలీస్ స్టేషన్ ఎదుట పహారా కాశారు. నిందితులను గుర్తించాం శనివారం రాత్రి సుమారు సదరు పోలీస్ స్టేషన్లో నిఖిల్ అనే యువకుడి తల్లి తన కొడుకు కనిపించడం లేదని ఫిర్యాదు చేశారని ఎస్పీ స్వాతి తెలియజేశారు. ఈ మేరకు సదరు పోలీసులు కేసు నమోదు చేసి మూడు టీమ్‌లుగా విడిపోయి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఆదివారం ఉదయం కనిపించకుండాపోయిన నిఖిల్ అనే యువకుని మృతదేహం స్థానిక రింగ్ రోడ్డు సమీపంలొ గల నాగావళి నది వద్ద ఉందని సమాచారం అందిన వెంటనే సంఘటన స్థలానికి పోలీసు బలగాలతొ చేరుకున్నామని ఎస్పీ వివరించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే నిందితులను గుర్తించామని త్వరలో వారిని పట్టుకుంటామని అన్నారు. అయితే ఈ హత్యకు గల కారణాలు నిందితులను పట్టుకున్న తర్వాతే తెలుస్తుందని స్పష్టం చేశారు. అసలు ఏం జరిగిందంటే..? శనివారం రాత్రి పదిన్నర గంటల సమయంలో స్థానిక ఇందిరానగర్ మూడో లైన్ వద్ద గుర్తు తెలియని దుండగులు ఒక మోటార్ సైకిల్, మరో వాహనంలో చేరుకున్నారు. అక్కడ ఏదో పనిమీద ఉన్న హడిప నిఖిల్ ఉండటం ముందుగానే గమనించిన దుండగులు అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే వీరి రాకను గమనించిన నిఖిల్ అక్కడ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో దుండగులు తమ వెంట తీసుకువచ్చిన తుపాకీతొ రెండు రౌండ్లు పేల్చారు. దీంతో భయాందోళనకు గురైన నిఖిల్ ఇందిరానగర్ కాలనీలోని ఒకరి ఇంటిలోకి దూరిపోయాడు. వెంబడిస్తూ వెళ్లిన దుండగులు అతడిని పట్టుకుని తమ వెంట రింగ్ రోడ్డు వైపుగా తీసుకువెళ్లారు. అనంతరం అక్కడి అతడిని దారుణంగా హత్య చేసి రింగ్ రోడ్డు సమీపంలొ గల నాగావళి నదికి దగ్గరలో మృతదేహాన్ని పడేసి వెళ్లిపాయారు. ఆదివారం తెల్లవారున నిఖిల్ మృతదేహాన్ని చూసిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. -
జె.ఆర్.పురంలో చోరీ
రణస్థలం: మండల కేంద్రంలోని జె.ఆర్.పురం పంచాయతీ వేంకటేశ్వర కాలనీ నడిబొడ్డున ఉన్న ఇంట్లో శనివారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం.. రణస్థలం మండలం నారువ పంచాయతీ కార్యదర్శి పనిచేస్తున్న డి.మల్లేష్ వెంకటేశ్వర కాలనీలో సొంత ఇంట్లో నివాసం ఉంటున్నారు. శనివారం రాత్రి 7.30 గంటల సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి లావేరు మండలం నేతేరు లక్ష్మీపురం వెళ్లారు. ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో ఇంటి తలుపులు తీసి ఉండటాన్ని సమీపంలో ఉంటున్న బంధువులు గమనించారు. దగ్గరకు వెళ్లి చూడగా దొంగతనం జరిగిందని గుర్తించి వెంటనే మల్లేష్‌కు, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, క్లూస్ బృంద సభ్యులు వచ్చి వివరాలు సేకరించారు. ఐదు తులాల బంగారం, రూ.లక్షా ఇరవై వేలు నగదు పోయినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమీపంలోని ఇళ్ల వద్ద ఉన్న సీసీ కెమెరాలలో నమోదైన వివరాలు ప్రకారం.. ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు స్కూటీతో రాత్రి 11 గంటల సమయంలో వచ్చారు. అందులో ఓ వ్యక్తి ఇంట్లోకి వెళ్లాడు. 12.30 గంటల సమయంలో మిగతా ఇద్దరు స్కూటీతో రాగానే లోపలి వ్యక్తి బయటకు వచ్చి అందరూ పరారయ్యారు. జె.ఆర్.పురం ఎస్సై ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, అత్యంత రద్దీగా, ముఖ్య కూడలిలో ఉన్న ఇంట్లో చోరీ జరగడంతో కాలనీవాసులు ఉలిక్కిపడ్డారు. ఈ ప్రాంతంలో ఆకతాయిల ఆగడం ఎక్కువైందని, అర్ధరాత్రి వేళల్లో కూడా బైక్‌లతో తిరగడం, అసభ్యంగా ప్రవర్తించడం పరిపాటిగా మారిందని, ఇప్పటికై న ఇటువంటి వాటికి అడ్డుకట్ట వేయాలని కాలనీవాసులు కోరుతున్నారు. -
జూన్ 1 నుంచి మహేంద్ర మేళా
పర్లాకిమిడి: మహేంద్రగిరి పరశురాం క్షేత్ర పర్వతంపై జూన్ 1 నుంచి 9వ తేదీ వరకు మహేంద్రమేళాను నిర్వహిస్తున్నట్టు మహంత డాక్టర్ హరిహర దాస్ ఆదివారం తెలిపారు. ఈ మహేంద్రమేళాకు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి బిభూతీ జెన్నా ప్రారంభిస్తారని మాజీ ఎస్డీసీ చైర్మన్, బీజేపీ నాయకులు అంతర్యామి గోమాంగో అన్నారు. స్థానిక రాజవీధిలో శ్రీశైలం కల్యాణ మండపంలో విలేకరుల సమావేశం జరిగినది. ఈ సమావేశంలో బీజేపీ మాజీ అధ్యక్షుడు సిద్ధేశ్వర మిశ్రా, మహంత రామానంద దాస్, కాశీనగర్ బీజేపీ నాయకురాలు నళినీ పాత్రో పాల్గొన్నారు. మహేంద్రగిరి కుల పర్వతం ప్రాచుర్యం సంపాదించడానికి వివిధ హోమాలు, యజ్ఞాలు, పుష్కర స్నానాలు జరుపుతామన్నారు. తొలిరోజు కలశ యాత్ర, దీక్షాగ్రహణ, అంకురార్పణం, భాగవతం, రామచరిత మానస పఠిస్తామన్నారు. తొమ్మిది రోజులపాటు జరిగే పలు ఆథ్మాత్మిక కార్యక్రమాల్లో అనేకమంది సాధు సంతవులు ఇక్కడికి విచ్చేస్తారని సిద్ధేశ్వర మిశ్రా తెలియజేశారు. -
గుడ్ల గూబకు చికిత్స
రాయగడ: కాలు విరిగి ఎగరలేని స్థితిళక్ష ఉన్న ఒక గుడ్లగూబను అటవీ శాఖ సిబ్బంది చికిత్స చేయించి తమ మానవీయతను చాటుకున్నారు. జిల్లాలోని కల్యాణసింగుపూర్ సమితి సునాఖండిలో గల హనుమాన్ మందిరం వద్ద పడి ఉన్న గుడ్ల గూబను చూసి పూజారి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న సిబ్బంది గుడ్ల గూబను చికిత్స చేయించి తిరిగి కోలుకున్న తర్వాత దాన్ని విడిచిపెట్టారు. బిసంకటక్‌లో భల్లూకం హల్చల్ రాయగడ: బిసంకటక్‌లోని మార్కమ వీధిలో శనివారం రాత్రి ఎలుగుబంటి హల్చల్ చేసింది. సరాసరి వీధిలోకి ప్రవేశించిన ఎలుగు ఇళ్ల లోపలకు చొరబడేందుకు ప్రయత్నించింది. ఎలుగు అరుపులు రాకను గుర్తించిన వీధిలోని జనం ఒక్కసారిగా ఉలక్కిపడ్డారు. అనంతరం దానిని తరిమే ప్రయత్నం చేశారు. ఎప్పటికీ కదలకపోవడంతో భయాందోళనకు గురైన కాలనీ వాసులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అటవీ శాఖ అధికారులు అక్కడకు చేరుకుని ఎలుగును అక్కడ నుంచి సమీప అటవీ ప్రాంతంలోకి తరిమివేశారు. డాబుగాం ఐఐసీ సస్పెన్షన్ కొరాపుట్: నబరంగ్‌పూర్ జిల్లా డాబుగాం ఐఐసీ రఘునాఽథ్ మజ్జిని సస్పెండ్ చేస్తూ రాష్ట్ర డీజీపీ వైబీ ఖురానియా నిర్ణయించారు. దీనికి సంబంధించి ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. ఒక కేసు విచారణలో నిందితుడిని పోలీస్ స్టేషన్‌కి పోలీసులు తెచ్చారు. అయితే ఆ నిందితుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. దీంతో విధి నిర్వాహణలో నిర్లక్ష్యం వహించినందుకు ఐఐసీ రఘునాఽథ్ మజ్జిని సస్పెండ్ చేస్తూ ఆదేశించారు. ఈ కేసు విచారణ పూర్తయ్యేంత వరకు సదరన్ వెస్ట్రన్ రేంజ్ డిఐజీకి అందుబాటులో ఉండాలని ఆదేశించారు.66 సెల్ఫోన్లు స్వాధీనం రాయగడ: ఝార్సుగుడ జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్ల పరిధిలో మోబైల్ ఫోన్లను పోగొట్టుకొవడం, దొంగతనానికి గురైన ఫిర్యాదులను నమోదు చేసుకున్న పోలీసులు ఈ మేరకు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా 66 మోబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ గుండాల రెడ్డి రాఘవేంద్ర ఆధ్వర్యంలో ఝార్సుగుడ పోలీస్‌స్టేషన్‌లో 15, సదర్ పోలీస్ స్టేషన్లో 7, బ్రజరాజ్నగర్లో 6, బదమాల్లో 6, బెల్ఫహార్లో 5, బన్హార్పల్లిలో 4, లైకేరాలో 4, లఖన్‌పూర్‌లో 4, కొలాబిరాలో 4, రెంగాలిలో 3, ఎయిర్‌పోర్టులో మూడు.. మొత్తం 66 ఫోన్లను ట్రేస్ చేసి స్వాధీనం చేసుకున్న పోలీసులు.. వీటిని పొగొట్టుకున్న వారి వివరాలను సేకరించి వారికి ఆందజేశారు. రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు రాయగడ: జిల్లాలోని కాసీపూర్ సమితి మైకంచ్ గ్రామ సమీపంలో బొలేరో వాహనం ఢీకొని ముగ్గురు తీవ్రగాయాలకు గురయ్యారు. ఆది వారం జరిగిన ఈ ఘటనలో మైకంచ్ గ్రామానికి చెందిన లావణ్య జొడియా, పపున్ జొడియా, రామచంద్ర జొడియాలు గాయాలపాలయ్యారు. ఒకే బైకుపై వెళ్తున్న వీరిని గ్రామానికి సమీపంలోని కాలనీ వద్ద ఎదురుగా వచ్చిన బొలేరొ ఢీకొంది. దీంతో వీరంతా కిందపడిపోవడంతో గాయాలపాలయ్యారు. అయి తే ఢీకొట్టిమ వాహనం ఆగకుండానే వెళ్లిపోయింది. క్షతగాత్రులను కాసీపూర్ పీహెచ్‌సీకి చికిత్స కోసం తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి రిఫర్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని పట్టుకోవడానికి గాలింపు చర్యలు చేపట్టారు. -
ఉర్రూతలూగించిన గిరిజన ఉత్సవం
భువనేశ్వర్: ఒడియా భాష, సాహిత్యం, సంస్కృతి శాఖ ఆధ్వర్యంలో ఒడిశా సంగీత నాటక అకాడమీ, కలహండి జిల్లా సాంస్కృతిక మండలి, శుభం ఇన్స్టిట్యూట్ల సహకారంతో డొంగొరొ గిరిజన నృత్య, సంగీత ఉత్సవం ఉర్రూతలూగించింది. రెండు రోజుల పాటు భవానీపట్నం మహావీర్ కల్చరల్ ఇన్స్టిట్యూట్ రంగమంచ్‌లో జరిగిన ఈ సాంస్కృతిక ఉత్సవం ఆదివారంతో ముగిసింది. యువ కళాకారులు గిరిజన సమాజం నృత్య, సంగీత సంప్రదాయంలోని మౌలిక స్వభావం, విశిష్టతని ప్రతిబింబించారు. గిరిజన నృత్య, సంగీత ప్రదర్శనలకు ఉజ్వల భవిష్యత్ చేరువలో ఉందని ఈ వర్గం ఆశాభావం వ్యక్తం చేసింది. గిరిజన సంప్రదాయ నృత్య, సంగీత కళలను విస్తృతంగా ప్రచారం చేసి ప్రపంచానికి తెలియజేసేందుకు యువ కళాకారులు తమ నిరంతర కృషిని కొనసాగించాలని అతిథులు అభిప్రాయపడ్డారు. డొంగొరొ నృత్యోత్సవంలో కోయ, ఖడియా, కిసాన్, పొతొరొ సౌరా, లంజియా సౌరా, ఢెమ్సా, పంచరసి, గిరిజన నృత్యం, సింగారి నృత్యం ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. -
ఘోర రోడ్డు ప్రమాదం
● లారీని ఢీకొట్టిన కారు ● తండ్రీకొడుకుల దుర్మరణం ● మరో ముగ్గురు మహిళలకు తీవ్రగాయాలుమల్కన్గిరి: మల్కన్‌గిరి జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మాత్తిలి పోలీస్‌స్టేషన్ సమీపంలో లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో 11 నెలల బాబుతోపాటు తండ్రి దుర్మరణం చెందగా.. మరో ముగ్గురు మహిళలకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను మాత్తిలి ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వివరాల్లోకి వెళితే.. కొరాపూట్ నుంచి మల్కన్‌గిరికి శనివారం బంధువుల ఇంట జరిగిన ఓ ఫంక్షన్‌కు పొట్నూరు మణికాంతారావు తన కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. ఆ కార్యక్రమం ముగిసిన తరువాత ఆదివారం తిరిగి కారులో వెళ్తుండగా లారీని ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘోర ప్రమాదంలో మణికాంతారావు (25)తో పాటు అతని 11 నెలల కుమారుడు మృతి చెందారు. అయితే కారు లాక్ అయి ఉండడంతో స్థానికులు పోలీసులు, అగ్నిమాపిక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. క్షణాల్లో అక్కడకు చేరుకున్న సిబ్బంది కారు డోర్లను కట్టర్ల సాయంతో కోసి అందులో ఉన్న వారిని బయటకు తీశారు. అయితే తండ్రీకొడుకు మృతి చెందగా ముగ్గురు మహిళలు గాయపడ్డారు. తండ్రికొడుకుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మాత్తిలి ఆరోగ్య కేంద్రంకు తరలించారు. క్షతగాత్రులను చికిత్స కొసం తొలుత మాత్తిలి ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కొరాపుట్‌కు రిఫర్ చేశారు. మాత్తిలి ఐఐసీ దీపాంజలి ప్రధాన్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. -
బలియంత దాడిపై క్రైం శాఖ దర్యాప్తు
● నలుగురు పోలీసు అధికారులు సస్పెండ్ ● ఐఐసీ అనిల్ పరిడా బదిలీ భువనేశ్వర్: బలియంత మూక దాడి ఘటనపై క్రైం శాఖ దర్యాప్తు ప్రారంభం అయింది. ఈ నెల 7వ తేదీన గ్రామస్తుల మూక దాడిలో 32 ఏళ్ల ప్రభుత్వ రైల్వే పోలీసు (జీఆర్పీ) కానిస్టేబులు సౌమ్య రంజన్ స్వంయి మరణించాడు. ఈ సంఘటన తీవ్ర సంచలనం రేపింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి క్రైం శాఖ దర్యాప్తునకు ఆదేశించారు. పోలీసు సూపరింటెండెంట్ అనిరుధ్ రౌత్రాయ్ ఆధ్వర్యంలో క్రైమ్ శాఖ దర్యాప్తు బృందం ఆది వారం బలియంత పోలీస్ ఠాణాకు చేరింది. ఈ బృందం దర్యాప్తు అధికారి నుంచి కేసుకు సంబంధించిన పత్రాల ఆధారంగా దర్యాప్తుకు శ్రీకారం చుట్టింది. ఈ దర్యాప్తు పూర్తిగా వాస్తవాల ఆధారంగా సాక్ష్యాధారాలతోనే సాగుతుందని ఎస్పీ తెలిపారు. ఈ ఘటనపై క్రైమ్ శాఖ డీఐజీ బి. గంగాధర్ మాట్లాడుతూ 10 మంది అధికారులతో కూడిన రెండు ప్రత్యేక బృందాలు దర్యాప్తు కార్యకలాపాల్లో పాలుపంచుకుంటారని తెలిపారు. ఈ బృందాలలో శాసీ్త్రయ, సైబర్ విభాగాల నిపుణులతో పాటు డాగ్ స్క్వాడ్లు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలు, హత్యాయత్నం, పోలీసుల నిర్లక్ష్యం వంటి పలు అంశాలను ఈ దర్యాప్తులో క్షుణ్ణంగా పరిశీలిస్తారని వివరించారు. తొలి దశ దర్యాప్తు ఆధారంగా పోలీసు యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంది. ఘటన తీవ్రత దృష్ట్యా బలియంత పోలీస్ ఠాణా ఇనస్పెక్టర్ ఇన్ ఛార్జ్ (ఐఐసీ) అనిల్ పరిడాను భువనేశ్వర్‌లోని యూపీడీ ప్రధాన కార్యాలయానికి బదిలీ చేశారు. ఒక సబ్ ఇన్స్పెక్టర్, ఒక సహాయ సబ్ ఇన్స్పెక్టర్ (ఏఎస్ఐ), 1 ఒడిశా సాయుధ పోలీసు దళం (ఓఏపీఎఫ్) ఉద్యోగి మరియు ఒక కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. 2 మంది హోం గార్డులను విధుల నుండి తొలగించారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం, ఘటనా సమయంలో శాంతిభద్రతలను కాపాడటంలో వైఫల్యం కారణాలతో ఈ కఠిన చర్యలకు ఆదేశించారు. ఈ ఘటన తర్వాత ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసు యంత్రాంగం నిఘాను పెంచింది. దర్యాప్తు కొనసాగుతోంది మరియు రానున్న రోజుల్లో నిందితులపై మరింత కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. -
అరసవల్లిలో భక్తుల రద్దీ
అరసవల్లి: వైశాఖమాసం సందర్భంగా అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో సందడి కనిపించింది. చివరి ఆదివారం కావడంతో ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఆదిత్యున్ని దర్శించుకున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత మహిళలు సంప్రదాయక పూజలు నిర్వహించారు. పెసల మొలకలు, ధాన్యం, బెల్లం, వడపప్పు, మామిడి పండ్లు, టెంకాయలతో ప్రత్యేకంగా స్వామి వారికి నివేదించి తమకు ఆరోగ్యాన్ని ప్రసాదించు తండ్రీ అంటూ మొక్కుకున్నారు. పలువురు భక్తులు కేశఖండన శాలలో తలనీలాలను సమర్పించుకున్నారు. మధ్యాహ్న సమయంలో తీవ్ర ఉక్కబోత, ఎండతీవ్రత పెరిగిపోవడంతో భక్తులు అవస్థలు పడ్డారు. ఆలయ ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్ ఆధ్వర్యంలో పుష్కరిణి సమీపంలో టెంట్లు ఉన్నప్పటికీ ఏమాత్రం సరిపడకపోవడంతో ఇబ్బందులు తప్పలేదు. అన్నదాన ప్రసాదానికి భక్తులు బారులు తీరారు. పెందుర్తికి చెందిన భక్తులు ఆరిపాక సంధ్యారాణి, ఆమె కుమారుడు అయాన్ష్ నందన్‌లు తులాభారం మొక్కు చెల్లించుకుని 60 కేజీల బెల్లం చెక్కీలను ఈవో ప్రసాద్, సూపరింటెండెంట్ వెంకటరమణల సమక్షంలో ప్రసాదాల విభాగానికి సమర్పించారు. -
జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా నల్లాన
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా నరసన్నపేటకు చెందిన నల్లాన వెంకునాయుడు నియమితులయ్యారు. ఆదివారం హైదరాబాద్‌లోని సంఘ జాతీయ కార్యాలయంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య, రాష్ట్ర అధ్యక్షుడు వై.నాగేశ్వరరావు, రాష్ట్ర ఇన్చార్జి, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వై.నూకానమ్మ యాదవ్ నియామక పత్రాన్ని వెంకునాయుడుకు అందజేశారు. ఈ సందర్భంగా వెంకునాయుడు మాట్లాడుతూ బీసీల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేస్తానన్నారు. బీసీలకు దక్కాల్సిన రిజర్వేషన్లపై పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో ఉత్తరాంధ్ర అధికార ప్రతినిధి పిల్లా కన్నంనాయుడు తదితరులు పాల్గొన్నారు. సీసీ కెమెరాలతో చోరీలకు అడ్డుకట్ట పలాస: దొంగతనాలను అరికట్టేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ కోరారు. ఆదివారం స్థానిక జి.ఎం.ఈ కాలనీలో 16 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన సందర్భంగా స్థానికులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీలో ఇటీవల దొంగతనం జరిగిందని, సీసీ కెమెరాలు లేకపోవడంతో నిందితులను సకాలంలో పట్టుకోలేకపోతున్నామని చెప్పారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు. మున్సిపాలిటీ పరిధిలో ప్రతివీధిలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. అపరిచిత వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. -
రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యపై సమీక్ష
రాయగడ: జిల్లా సంక్షేమ శాఖ పరిధిలో గల రెసిడెన్సియల్ పాఠశాలల్లో విద్యానాణ్యత, హాస్టల్ నిర్వహణకు మెరుగు పరిచేందుకు కలెక్టర్ అశుతోష్ కులకర్ణి అధ్యక్షతన సమీక్ష సమావేశం ఆదివారం కలెక్టర్ సమావేశ భవనంలో జరిగింది. ఈ సమావేశానికి జిల్లాలో గల 149 రెసిడెన్సియల్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, హాస్టల్ సూపరింటెండెంట్లు, సంబంధిత శాఖ అధికారులు హాజరయ్యారు. విద్య శ్రేష్టత, విద్యార్థుల సంక్షేమంపై దృష్టిసారించి వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని కలెక్టర్ సూచించారు. అయితే రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఆశించినంత స్థాయిలో విద్యా నాణ్యత మెరుగుపడటం లేదని ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీనిపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం అందుకు కారణం ఉపాధ్యాయుల కొరతేనని, దీని వల్ల విద్యావిధానికి గండి పడుతుందని ఉపాధ్యాయులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. విద్యా బోధన గురించి నియమితులైన ఉపాధ్యాయులకు బోధనతో పాటు అదనపు బాధ్యతలను అప్పగించడంతో వారు ఆశించినంతగా విద్యార్థులకు బోధించలేకపోతున్నారని వివరించారు. దీని వల్ల విద్యా నాణ్యత పూర్తిగా లోపించిందన్నారు. రానున్న విద్యా సంవత్సరంలో ప్రతి పాఠశాలలొ పదో తరగతి పరీక్షల్లో కనీసం ఐదుగురు విద్యార్థులు ఎ–1 గ్రేడ్‌ను సాధించి ఉత్తీర్ణులయ్యేలా కార్యచరణ ప్రణాళికలను రూపొందించాలని కలెక్టర్ సూచించారు. -
హక్కులు హరించి సమావేశాలా?
● జెడ్పీ సమావేశం బహిష్కరించిన సభ్యులు కొరాపుట్ : ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికై న ప్రజా ప్రతినిధుల హక్కులు హరిస్తూ సమావేశాలు నిర్వహించడం ఎందుకని సభ్యులు మండిపడ్డారు. శుక్రవారం నబరంగ్‌పూర్ జిల్లా పరిషత్ 9వ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. జెడ్పీ సభ్యులు ఈ సమావేశాన్ని బహిష్కరించారు. జిల్లాలో 26 జెడ్పీ స్ధానాలలో అధికార బీజేపీకి సభ్యత్వం లేదని, కానీ ప్రతి చోట జెడ్పీ నిధులు వినియెగంలో స్థానిక జెడ్పీ సభ్యుల మాటకు విలువ లేకుండా బీజేపీ కార్యకర్తలే నిధులు వినియోగించుకుంటున్నారని ఆరోపించారు. అధికారం మాటున కార్యకర్తలు బరి తెగిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మర్‌కోట్‌లో ఏకపక్షంగా పాలన జరుగుతోందని ధ్వజమెత్తారు. అనంతరం జిల్లా పరిషత్ అధ్యక్షుడు మోతిరాంనాయక్ అధ్యక్షతన కాంగ్రెస్, బీజేడీలకు చెందిన జెడ్పీ సభ్యులు సమావేశాన్ని బహిష్కరించారు. కార్యక్రమంలో నబరంగ్‌పూర్ ప్లానింగ్ బోర్డు చైర్మన్ గౌరీశంకర్ మజ్జి, డాబుగాం ఎమ్మెల్యే మనోహర్ రంధారి తదితరులు పాల్గొన్నారు. -
జీడి.. ఇంటికి చేరిందండి
● ఇబ్బడి ముబ్బడిగా విదేశీ పిక్కలు ● దేశీయ పిక్కలపై ఆసక్తి చూపని వ్యాపారులు పలాస: ఉద్దానం ప్రాంతంలో ప్రజల జీవనాధారమైన జీడి పంట రైతుల ఇళ్లకు చేరింది. వాటిని అమ్ముకోవడానికి ఆశగా రైతులు ఎదురు చూస్తున్నారు. గత నెల ఏప్రిల్ మొదటి వారం నుంచి తోటల్లో జీడి పిక్కలు కాపునకు వచ్చాయి. వాటిని తోటల్లో సేకరించి ఎండబెట్టి గోనె సంచుల్లో నింపి భద్రపరిచారు. ప్రస్తుతం జీడి పంటలు ఆఖరి దశకు చేరుకున్నాయి. పలాస నియోజకవవర్గంలోని పలా స మందస, వజ్రపుకొత్తూరు మండలాల్లో గల జీడి తోటల్లో పిక్కలు ఇళ్ల వద్దకు చేరుకున్నాయి. అయితే గ్రామాల్లోకి వ్యాపారులు ఇంకా రావడం లేదు. ఇప్పటికే విదేశీ పిక్కలను దిగుమతి చేసుకున్న పలాస వ్యాపారులు ప్రస్తుతం వాటిపైనే ఆధార పడి తమ పరిశ్రమలను నడిపించుకుంటున్నారు. దీంతో వారంతా ధీమాగా ఉన్నారు. ఏటా ఇదే తంతు జరుగుతోందని రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు పలాస పప్పు అంటే ఉద్దానం జీడి పిక్కల వల్లనే వాటికి జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ఇప్పు డు ఉద్దానం పిక్కలను కొనుగోలు చేయడానికి వెనకా ముందు ఆలోచిస్తున్నారు. ఎలాగైనా ఎప్పు డో ఒకప్పుడు తమకే అమ్ముతారన్న ధీమా వారిలో నాటుకు పోయింది. అలాగే రైతులు కూడా చిరకాలంగా వస్తున్న ఆనవాయితీ ప్రకారం, వారితో ఉన్న అవినాభావ సంబంధాల మేరకు వారికే పిక్కలను విక్రయిస్తున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో ఇంకా పిక్కల ధరలు తేలలేదు. రైతు సంఘాల మాత్రం ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరుతున్నాయి. అయితే ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయడం లేదు. 80 కిలోల బస్తా పిక్కలను రూ.16వేలకు ప్రభుత్వం కొనుగోలు చేయాలన్న వారి డిమాండు ఏడాది ఎంత వరకు నెరువేరుతుందో వేచి చూడాలి. -
కన్నీటి చార ఆరక ముందే..
నరసన్నపేట: జమ్ము గ్రామంలో తీవ్ర విషాదం అలముకుంది. వారం వ్యవధిలో తండ్రీకుమారులు కోల లక్ష్మణరావు, కోల శివప్రసాద్‌లు మృతి చెందారు. దీంతో కుటుంబం అంతా శోకసంద్రమైంది. వారం కిందట కోల లక్ష్మణరావు కుమారుడు శివప్రసాద్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న శివప్రసాద్ ద్విచక్రవాహనం విజయనగరం వద్ద ప్రమాదానికి గురైంది. అక్కడికక్కడే ఆయన మృతి చెందారు. ఇంటిని పోషిస్తున్న కుమారుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. పుట్టెడు దుఖంతో తండ్రి లక్ష్మణరావు కుమారుడికి అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం అనారోగ్యానికి గురైన లక్ష్మణరావు జెమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. కుమారుడు మృతి నుంచి కుటుంబ సభ్యులు తేరుకోక ముందే తండ్రి కూడా మరణించడంతో ఈ కుటుంబం దిక్కులేనిదైంది. శివప్రసాద్ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇద్దరు సోదరీమణులకు వివాహాలు చేశాడు. ఇప్పుడు తండ్రీ కుమారులు ఇద్దరూ వారం వ్యవదిలో మరణించడంతో కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవరి వల్ల కావ డం లేదు. కోల లక్ష్మణరావుకు భార్య సీతమ్మ అంత్యక్రియలు నిర్వహించారు. -
కేసీసీ బ్యాంకు కేసులో మరిన్ని అరెస్టులు
మల్కన్‌గిరి : మల్కన్‌గిరి కేసీసీ బ్యాంక్‌లో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం ఘటనలో ఒడిశా విజిలెన్స్ పెద్ద విజయాన్ని సాధించింది. ఈ కేసులో బ్యాంకు శాఖ మేనేజర్ సుధాంశు ఖోరాను ముందుగానే అరెస్టు చేశారు. శుక్రవారం ఆయన సహచరులు సుశ్రీ నివేదిత, ఆమె ప్రియుడు నృసింహ ప్రసాద ఖమారిను అరెస్టు చేశారు. వీరి నుంచి 25 బ్యాంక్ ఖాతాలు, 33 మొబైల్ ఫోన్లు, డ్రోన్ కెమెరాలు, విలువైన బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. ఈ జంట భువనేశ్వర్ ఖుర్దాలో ఇలా అనేక చోట్ల వీరి మోసచరిత్ర ఉన్నట్లు విజిలెన్స్ దర్యాప్తులో తెలిసింది. -
సొమ్ము దోచేశాడు
గ్యాస్ ఓటీపీ అడిగాడు.. ● హిరమండలం మండలంలో వెలుగుచూసిన వైనం ● ఆన్లైన్లో వివరాలు చెబితే అంతే.. ● హెచ్చరిస్తున్న పోలీసులు హిరమండలం: హిరమండలం మండంలోని పిండ్రువాడ, రెల్లివలసలో గుర్తు తెలియ ని యువకుడు మోసాలకు గురిచేశా డు. గ్యాస్ పేరుతో ఫోన్లకు నకిలీ మెసేజ్‌లు పెట్టాడు. గ్యాస్ వచ్చిందని నమ్మబలికి ఒక్కొక్కరి దగ్గర రూ.1000 వసూలు చేసి ఉడాయించాడు. అయితే ఆ రెండు గ్రామాల్లోనే కాదు. పరిసర ప్రాంతాల్లో ఈ మోసాలు జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు గ్యాస్ పేరుతో ఇలా మోసాలు వెలుగుచూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల గ్యాస్ కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో గ్యాస్ కొరత ఏర్పడింది. దీంతో విధిగా 45 రోజుల తరువాత కొత్త గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు. అటు ఫోన్లకు వచ్చే ఓటీపీ చెబితే కానీ గ్యాస్ అందించడం లేదు. ఈ నేపథ్యంలో గ్యాస్ ఓటీపీ పేరుతో మోసాలు జరుగుతున్నాయి. దీనిపై పోలీస్ శాఖ అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. మరోవైపు జిల్లాలో జనగణన కూడా ప్రారంభమైంది. దీంతో ఎవరు ఎందుకు వస్తున్నారో? ఏ వివరాలు సేకరిస్తున్నారో తెలియని పరిస్థితి. అసలు జనగణన కోసం వచ్చేవారు ఏ వివరాలు తీసుకుంటారు? ప్రజలు ఏ వివరాలు ఇవ్వకూడదు? అనేదానిపై అధికారులు స్పష్టత ఇవ్వడంతో పాటు అవగాహన పెంచడం చాలా ముఖ్యం. ఆన్‌లైన్‌లోనూ వల గ్యాస్ పేరుతో ఆన్లైన్లో కూడా మోసాలు జరుగుతున్నాయి. కొరతను ఆసరాగా చేసుకొని నేరగాళ్లు కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. గ్యాస్ వినియోగదారుల ఫోన్లకు మెసేజ్‌లు పంపుతున్నారు. రెండు రోజుల్లో గ్యాస్ సరఫరా అంటూ వల పన్నుతున్నారు. వారు పంపిన లింక్‌లను క్లిక్ చేసిన మరుక్షణం వినియోగదారుల ఫోన్లు మోసగా ళ్ల ఆధీనంలోకి వెళ్లిపోతున్నాయి. బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు మాయమవుతున్నాయి. వినియోగదారుడు తెలుసుకునేలోగా మోసం జరిగిపోతోంది. వారి వలకు చిక్కకుండా ఉండేందుకు పోలీస్ శాఖ, గ్యాస్ డీలర్లు వినియోగదారులకు కీలక సూచనలు చేస్తున్నారు. అలాంటి వాటిని నమ్మవద్దని సూచిస్తున్నారు. గ్యాస్ వాహనాలు వచ్చి డెలివరీ బాయ్స్ సంప్రదించేవరకూ ఎవరూ స్పందించవద్దని కోరుతున్నారు. గ్యాస్ సరఫరాకు సంబంధించి ఆన్లైన్లో ఓటీపీలు అడగరన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. కేవలం గ్యాస్ వాహనంతో డెలివరీ బా య్స్ వచ్చి వివరాలు అడిగితేనే చెప్పాలని సూచిస్తున్నారు. గ్యాస్ పేరుతో అపరిచిత వ్యక్తులు వచ్చి ఓటీపీలు అడిగితే చెప్పొద్దు. గ్యాస్ వాహ నం రాకుండా ఇంటికి వచ్చి అడిగేవారు మోసం చేసేవారు అన్న విషయాన్ని ప్రజలు గమనించాలి. అదే సమయంలో ఆన్లైన్లో సైతం ఎలాంటి వివరాలు చెప్పకూడదు. చెబితే సైబర్ నేరగాళ్ల మాయలో పడినట్టే. అందుకే అప్రమత్తంగా ఉండాలి. – వై.మధుసూధనరావు, ఎస్ఐ, హిరమండలం -
యువత క్రీడలపై ఆసక్తి కనబరచాలి
రాయగడ: యువత క్రీడలపై ఆసక్తి కనబరిచి ప్రతిభ చాటుకోవాలని బీజేపీ జిల్లా కార్యదర్శి కొరాడ రజిత అన్నారు. జిల్లాలోని కళ్యాణసింగుపూర్ సమితి సింగారి పంచాయతీ సనొబామునగుడలో సనొబామునగుడ క్రికెట్ టోర్నీ ఫైనల్స్‌లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. గుండురిగుడ, హతిముండ జట్ల మధ్య జరిగిన ఫైనల్ పోరులో గుండురిగుడ జట్టు విజేతగా నిలిచింది. కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా మాజీ అధ్యక్షురాలు రంజనా ఉపాధ్యాయ, టుటు ఖడంగ, కొరప పంచాయతీ బీజేపీ అధ్యక్షుడు వంశీధర్ పాత్రొ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ ఆదాయానికి గండి
● వృథాగా డ్రైవర్ల సంఘం భవనం ● సచివాలయానికి అప్పగించాలని పూర్వపు అధ్యక్షుల డిమాండ్ శ్రీకాకుళం పీఎన్ కాలనీ: జిల్లా కేంద్రంలో ఉన్న డ్రైవర్ల సంఘం కార్యాలయ భవనం వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. ఈ భవనం ద్వా రా వస్తున్న ఆదాయం ఎవరికి వెళ్తోంది, ఎక్కడ ఖర్చవుతోంది అన్నది తెలియకుండా ఉందని డ్రైవ ర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ భవనాన్ని అనీల్‌చంద్ర పునేఠ కలెక్టర్‌గా ఉన్న సమయంలో డ్రైవర్ల కు అప్పగించారు. రౌతు సింహాచలం ఈ సంఘాని కి అధ్యక్షులుగా ఉన్న సమయంలో 2014లో రూ.14 లక్షలతో భవనానికి మరమ్మతులు నిర్వహించి పక్కా షాపులు నిర్మించారు. అనంతరం అద్దెల వసూలు మొదలుపెట్టారు. నెలకు సుమారు రూ.50వేలకు పైగా అద్దెలు వస్తున్నాయి. ఇన్నేళ్లలో దాదాపు లక్షల్లో అద్దె రూపంలో వచ్చిఉండాలని, కానీ ఆ డబ్బుకు లెక్కా పత్రం లేకుండా పోయిందని సంఘానికి చెందిన వారు ఆరోపిస్తు న్నారు. ఇప్పటికే డ్రైవర్లు కోసం కలెక్టర్ కార్యాలయం వద్ద ఓ రూమ్ ఉంది. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ వాహనాల డ్రైవర్లు సుమారు 320 మంది ఉండేవారు. వారంతా పదవీ విరమణ చేయడంతో కేవలం నలుగురు మాత్రమే ఉన్నారు. గతంలో వాచ్మెన్లను పెట్టి అన్ని రకాల క్లీనింగ్లు వంటివి చేసేవారు. కలెక్టరేట్లో డ్రైవర్‌గా ఉన్న ఓ వ్యక్తి ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు. ప్రస్తుతానికి ఆయనే పెత్తనమంతా చెలాయిస్తున్నట్లు ఆ సంఘ నాయకులే చెబుతున్నారు. భవనానికి వచ్చిన రాబ డి అంతా సొంత ఖర్చులకు వాడుకుంటున్నట్లు ఆరోపిస్తున్నారు. తాను కలెక్టరేట్ డ్రైవర్‌నని తనను ఎవరూ ఏమీ చేయలేరని డాంబికాలు పలుకుతున్నట్లు సమాచారం. ఓ ఇద్దరు వ్యక్తులే వచ్చిన కాడికి తినేస్తున్నట్లు ఆరోపణలు వినిస్తున్నాయి. అద్దెలు కలెక్షన్ చేస్తున్నారే తప్ప ఎలాంటి లెక్కలు చూపించడం లేదని, సంఘ భవనాన్ని అభివృద్ధి చేయడం లేదని విమర్శిస్తున్నారు. ఈ ఆదాయాన్ని ప్రభుత్వానికి మళ్లించగలిగితే బాగుంటుందని పూర్వపు అధ్యక్షులు, సంఘ నాయకులు కోరుతున్నారు. కనీసం సచివాలయాలకైనా ఇస్తే ఆ డబ్బులైనా మిగులుతాయని అంటున్నారు. -
శ్రీ జగన్నాథుని పేరుతో ప్రత్యేక చానెల్ యోచన
భువనేశ్వర్: రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ జగన్నాథుని సంస్కృతి విస్తృత ప్రసారానికి ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీ జగన్నాథుని పేరుతో ఒక ప్రత్యేక టీవీ చానెల్‌ను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు ఆరంభించారు. రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ అధ్యక్షతన లోక్ సేవా భవన్ న్యాయ శాఖ సమావేశం హాలులో చర్చా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రతిపాదిత కొత్త చానెల్ స్వరూపం, రోజువారీ కార్యక్రమాలు, జగన్నాథ సంస్కృతి వ్యాప్తి, భక్తుల మనసుల్లో జగన్నాథుని పట్ల భావాలను ప్రేరేపించే ప్రతిపాదిత ప్రసారాలపై చర్చించారు. చానెల్ ఏర్పాటుపై జరిగిన ప్రాథమిక చర్చలు సానుకూలంగా సాగాయి. జగన్నాథ సంస్కృతిపై మరింత పరిశోధన, చర్చల ద్వారా యావత్ ప్రపంచానికి అవగాహన కల్పించడం, భక్తులకు జగన్నాథుని మహాత్యం, ఆధ్యాత్మిక భావాల గురించి తెలియజేయడం, భక్తుల అనుభవాల ప్రతిస్పందన వంటి శీర్షికలతో ప్రసారం చేయడం ఈ చానెల్ ఏర్పాటు యోచన ప్రధాన లక్ష్యంగా మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ పేర్కొన్నారు. దీనిపై మరిన్ని చర్చలు జరిపి, పూర్తి ప్రొఫైల్‌ను సిద్ధం చేస్తామని ఆయన తెలిపారు. ఈ సమావేశానికి శ్రీ మందిరం ముఖ్య నిర్వాహకుడు (సీఏఓ) డాక్టర్ అరవింద్ కుమార్ పాఢి హాజరు అయ్యారు. -
ఏపీఈసెట్ ఫలితాల్లో 91 శాతం ఉత్తీర్ణత
శ్రీకాకుళం న్యూకాలనీ: ఏపీఈసెట్–2026 ఫలితాల్లో శ్రీకాకుళం జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. ఈ ఫలితాల్లో శ్రీకాకుళం జిల్లా విద్యార్థులు 90.97 శాతం ఉత్తీ ర్ణతను సాధించి మెరిశారు. పాలిటెక్నిక్ చదివి ఇంజినీరింగ్ కోర్సు ల్లో నేరుగా రెండే ఏడాది ప్రవేశా లు పొందేందుకుగాను రాష్ట్రప్రభుత్వ ఆదేశాల మేరకు జేఎన్టీయూ అనంతపురం ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీఈసెట్ పరీక్ష ఏప్రిల్ 23వ తేదీన రెండు సెషన్లగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఫలితాలు శుక్రవారం సాయంత్రం వెలువడ్డాయి. ఈసారీ బాలికలే టాప్.. ఎప్పటిలాగే సారి కూడా బాలికలే టాప్‌లేపే ఫలితాలు సాధించారు. శ్రీకాకుళం జిల్లా నుంచి 1389 మంది దరఖాస్తు చేసుకోగా.. పరీక్షకు 1340 మంది హాజరయ్యారు. వీరిలో 1219 మంది ఉత్తీర్ణత సాధించి అర్హత సాధించారు. ఇందులో 923 మంది బాలురుకుగాను 89.17 శాతం ఉత్తీర్ణతతో 823 మంది క్వాలిఫై అవ్వగా, 417 మంది బాలికలకుగాను 94.6 శాతం ఉత్తీర్ణతతో 396 మంది అర్హత పొందారు. వివిధ బ్రాంచీల్లో పలువురు విద్యార్థులు అదిరేటి ర్యాంకులు పొందారు. మెకానికల్ ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో పలాస మండల పరిధిలోని తాళ్లభద్ర గ్రామానికి చెందిన కుప్పిలి నిఖిల్‌కుమార్ స్టేట్‌లో 7వ ర్యాంకు సాధించాడు. లింగాలవలస విద్యార్థికి ఈసెట్‌లో 33 వ ర్యాంక్ జలుమూరు: లింగాలవలసకు చెందిన పంచిరెడ్డి పవన్ కల్యాణ్‌కు ఈసెట్‌లో 33వ ర్యాంక్ వచ్చింది. అలాగే ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ 973. ఒకటి నుంచి ఐదు వరకూ చల్లవానిపేట విజ్ఞాన దుర్గ, ఆరు నుంచి పది వరకూ కరవంజ ఆదర్శ పాఠశాలలో చదివాడు. తల్లి దండ్రులు జయలక్ష్మి, ప్రకాశరావు. ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీసు సాధనే తన లక్ష్యమని పవన్‌కల్యాణ్ తెలిపాడు. -
నిదురమ్మ ఎటు బోతివే..
స్మార్ట్ స్క్రీన్ల వెలుగులో ‘మెలటోనిన్’ హార్మోను రాను రానంటోంది. మొబైల్ ఫోన్ల మాయలో పడి ‘సెరొటోనిన్’ రావడమే మానేసింది. ఈ రెండూ లేకుంటే మనిషికి నిద్ర లేదు.. జీవికి ప్రశాంతత లేదు. రాత్రంతా కొరివి దెయ్యాల్లా కళ్లు ఎర్రగా మండేంత వరకు సెల్‌ఫోన్ చూడడం, నిశాచరుల్లా తిరగడం, ఇష్టానుసారం తినడంతో ఈ హార్మోన్ల అసమతుల్యత తప్పడం లేదు. ఒకప్పుడు టీవీ చూస్తూ ఆవులింతలు తీయడం, మాటలు వింటూ కునికి పాట్లు పడడం అన్నది ఈ తరానికి పూర్తిగా దూరమైపోయింది. అర్ధరాత్రి దాటినా చాలా మందిని నిద్ర కరుణించడం లేదు. దీని ఫలిత మే సవాలక్ష ఆరోగ్య సమస్యలు. శ్రీకాకుళం కల్చరల్: ఉరుకులు, పరుగులు, హడావుడి.. బతుకుంతా ఇలాగే మారిపోయింది. ఈ గజిబిజి జీవనంలో కంటి నిండా నిద్రపోయే అదృష్టానికి చాలా మంది నోచుకోవడం లేదు. ఫలితంగా ఎంతో మంది ఒత్తిడికి గురై వారి శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గి, హార్మోన్ల సమతుల్యత లోపించడం, మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులు ప్రబలుతున్నాయి. ప్రస్తుతం కుటుంబాల్లో మానసిక ఉల్లాసం కనిపించడం లేదు. నేటి పరిస్థితులలో జీవన సమస్యలు ఎదుర్కోవాలంటే భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి. విధులు ముగించుకొని ఇంటికి వచ్చాక, ఎవరి ఫోన్‌తో వారు కాలక్షేపం చేస్తున్నారు. కనీసం పిల్లల గురించైనా పట్టించుకోవడం లేదు. కుటుంబం అంతా కలిసి మాట్లాడుకునే పరిస్థితులు లేవు. కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఆహ్లాదకరమైన వాతావరణంలో గడపడం అంతకంటే లేదు. దీంతో మానసిక ఉల్లాసం కొరవడుతోందని నిపుణులు చెబుతున్నారు. సాయంత్రం పిల్లలతో కలిసి కాసేపు పార్కులకు వెళ్లి గడపడం వంటివి చేయాలని సూచిస్తున్నారు. నిద్ర పట్టకపోవడం. ఆకలి లేకపోవడం, ఎక్కువ తినాలనిపించడం. హార్మోన్ల సమతుల్యత లోపించడంతో మహిళలలో పీరియడ్స్ ఇబ్బందులు. ఒత్తిడి ఉన్న వారిలో హృద్రోగ సమస్యలు. వ్యాధి నిరోధక శక్తి తగ్గి ఇన్ఫెక్షన్లు సోకడం. నిద్రకు దూరమవుతున్న యువత చుట్టు ముడుతున్న ఆరోగ్య సమస్యలు గుండె పోట్లు, బ్రెయిన్ స్ట్రోక్‌లకు ఇదీ ఓ కారణం మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత రోజూ ఏడు గంటలకు తగ్గకుండా నిద్రపోవడం. ఒకే సమయానికి రోజూ నిద్రించడం అలవాటు చేసుకోవాలి. సమతుల ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. యోగా, మెడిటేషన్‌పై దృష్టి సారించాలి. సెల్‌ఫోన్ చూడడం మాని, పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకోవాలి. భావోద్వేగాలు, ప్రవర్తనలపై అదుపు కలిగి ఉండాలి. అసమానతలు, సమస్యలను ధైర్యంగా పరిష్కరించుకోవాలి. నిద్ర తగ్గితే ప్రాణ హాని కలుగుతుంది. శారీరక, మానసిక ఒత్తిడులు నిద్రలేమి వల్లనే కలుగుతాయి. వృత్తిపరమైన స్ట్రెస్, పర్సనల్ లైఫ్ సమస్య, ఎగ్జైట్మెంట్ వల్ల మానసిక వ్యాధులు వస్తాయి. పిల్లలైనా పెద్దవారైనా ప్రతి వారు శారీరక వ్యాయామం, ఆటపాటల వల్ల మంచి నిద్ర పట్టి, మానసిక ఒత్తిడి తగ్గుతుంది. – జి.రోష్మల్లికార్జున్, సీనియర్ మానసిక వైద్య నిపుణులు, శ్రీకాకుళం -
చిన్నారులను కాపాడుకుందాం
పర్లాకిమిడి: బాలబాలికలు సులభంగా సైబర్ నేరాలు బారిన పడటం, సోషల్‌మీడియా మాయలో చిక్కుకుని క్రిమినల్స్ చేతిలో హ్యాక్‌కు గురికావడం, కిడ్నాప్, క్రైం వంటి కేసుల్లో ఇరుక్కోవడం కోవిడ్ 2019 నుంచి ఎక్కువైందని, ఇలాంటి వారిని సంరక్షించడానికి ‘జువెటికా’ అనే అవుట్‌రీచ్ కార్యక్రమం ప్రారంభించామని ఆదర్శ పోలీసు స్టేషన్ ఐఐసీ ప్రశాంత భూపతి అన్నారు. స్థానిక ఆదర్శపోలీసు ష్టేషన్లో జువెటికా అవుట్‌రీచ్ కార్యక్రమాన్ని ఒడిషా డి.జి.పి. భుభనేశ్వర్ నుంచి వర్చువల్‌గా ప్రారంభించగా.. పర్లాకిమిడిలో జిల్లా ఎస్పీ (ఇన్చార్జి) సునీల్ కుమార్ మహాంతి ముఖ్య అతిథిగా హాజరై గజపతిలో ప్రారంభించారు. కార్యక్రమంలో డి.సి.పి.ఓ.అరుణ్ కుమార్ త్రిపాఠి, సబ్ డివిజనల్ పోలీసు అధికారి మాధవానంద నాయక్, సఖీ వన్‌స్టాప్ సెంటర్, అంగన్వాడీ వర్కర్లు, వివిధ ఎన్జీఓ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
బలియంత హత్యపై ఉన్నత స్థాయి దర్యాప్తు
భువనేశ్వర్: బలియంత దారుణ హత్యా ఘటనతో యావత్ రాష్ట్రం దిగ్భ్రాంతికి గురైంది. లైంగిక వేధింపుల ఆరోపణ కింద గ్రామస్తులు మూక దాడికి పాల్పడి యువకుడిని చావగొట్టారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు బృందం ఘటనా స్థలం చేరింది. రాష్ట్ర పోలీస్ డైరెక్టరు జనరల్, రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు సంఘటనా స్థలం ప్రత్యక్షంగా సందర్శించి విచారణ చేపట్టారు. డీజీపీ యోగేష్ బహదూర్ ఖురానియాతో నగర డీసీపీ జగ మోహన్ మీనా, బలియంత ఠాణా పోలీసులు సంఘటనా స్థలంలో విచారణ జరుపుతున్నారు. అదే విధంగా ఈ ఘటనపై విచారణ జరిపేందుకు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ శోభనా మహంతి బలియంత ప్రాంతంలో హత్య ఘటనా స్థలం సందర్శించారు. ఆ ప్రాంతంలో ప్రాథమిక విచారణ నిర్వహించారు. సంఘటనా స్థలాన్ని సందర్శించిన తర్వాత మహిళా కమిషన్ చైర్ పర్సన్ బాధితుడి ఇంటికి వెళ్లారు. ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారని కమిషన్ చైర్ పర్సన్ తెలిపారు. సమగ్ర విచారణ జరిపి నివేదిక దాఖలు చేయనున్నట్లు వివరించారు. దోషులపై చర్య తీసుకోవడం తథ్యమని హామీ ఇచ్చారు. ఈ హృదయ విదారక ఘటనలో పోలీసులు ఐదుగురు నిందితుల్ని అరెస్టు చేశారు. అందుబాటులో ఆధారాల వనరుల నుంచి మిగిలిన నిందితుల కోసం ప్రత్యేక బృందం గాలిస్తోంది. మృతుడు సౌమ్య రంజన్ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు గురు వారం రాత్రి పొద్దుపోయే వరకు బలియంత పోలీస్ ఠాణా బయట నిరసన చేపట్టారు. ఇలాంటి మూక దాడులు మళ్లీ జరగకుండా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను నెలకొల్పేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఒడిశా కానిస్టేబుల్ సిపాయి మహాసంఘ్ ప్రభుత్వవ రైల్వే పోలీసు (జీఆర్పీ) సూపరింటెండెంటుతో భేటీ అయింది. ఈ ఘటనకు కారణమైన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలని సిపాయి మహాసంఘ్ అభ్యర్థించింది. ఈ ఘటనపై సరైన దర్యాప్తు చేపట్టడంతో మృతుడు సౌమ్య రంజన్ కుటుంబానికి రక్షణ కల్పించాలని సంఘం ప్రతినిథులు కోరారు. -
కొండచరియలు పడకుండా ప్రత్యేక చర్యలు
రాయగడ: రైల్వే లైన్లలో వర్షా కాలంలో కొండచరియలు, బండరాళ్లు జారిపడటంతో రాకపోకలకు అంతరాయం కలుగుతున్న నేపధ్యంలో రైల్వే శాఖ అందుకు నివారణ చర్యలను చేపట్టింది. ముఖ్యంగా కొరాపుట్–రాయగడ (కే ఆర్) లైనులో కొండ చరియలు జారిపడుతుండటంతో ఆందోళన కలిగించే విషయంగా భావించిన రైల్వేశాఖ అందుకు అనుగుణంగా నివారణ చర్యలకు శ్రీకారం చుట్టింది. కొండచరియల నుంచి ఇటాలియన్ వైర్ మెస్ రక్షణ కల్పించేలా రక్షణ గోడను ఏర్పాటు చేస్తుంది. రాష్ట్రంలో మొదటిసారిగా రాయగడ జిల్లాలో దీనిని ప్రారంభించడం విశేషం. రాయగడలోని మజ్జిగౌరి మందిరానికి దగ్గరలో ఉన్న కొండలపై పనులను రైల్వే శాఖ ప్రారంభించింది. కొండపై డ్రిల్లింగ్ మెషిన్ సహాయంతో రంధ్రాలు చేసి ఆ రంధ్రంలో ఇనుపు ఊచలను ఏర్పాటు చేసి వైర్ మెస్‌ను నిర్మిస్తున్నారు. వర్షాకాలంలో కొండ ప్రాంతాల్లో జారిపడే కొండచరియల నుంచి ఈ మెస్ రక్షణ కల్పిస్తుంది. రాయగడ, కాసీపూర్ సమితుల్లో ఇటువంటి తరహా ఇటాలియన్ మెస్ రక్షణ గోడలను రైల్వే శాఖ నిర్మిస్తుంది. వర్షాకాలానికి ముందే ఈ పనులను పూర్తి చేయాలన్న సంకల్పంతో శరవేగంగా నిర్మిస్తున్నారు. స్థానిక మజ్జిగౌరి మందిరానికి సమీపంలో సుమారు 3 వేల కిలోల సామర్ధ్యం గల 230 మీటర్ల పొడవైన భద్రతా గోడను, అదేవిధంగా కాసీపూర్ సమితిలో 500 కిలోల సామర్ధ్యం గల సుమారు 70 మీటర్ల పోడవైన ఇటాలియన్ మెస్ రక్షణ గోడను నిర్మిస్తుండటం విశేషం. -
మోసాలపై అవగాహన
రాయగడ: జిల్లాలోని 16 పోలీస్ స్టేషన్లలో జువెన్టిక అవుట్‌రీచ్ విత్ అడాల్సెంట్ కార్యక్రమాలు శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి 6 గంటల వరకు కొనసాగాయి. యువతీ, యువకులను ఆహ్వానించి వారికి ఈ కార్యక్రమం పై అవగాహన కల్పించారు. డిజిటల్ మాధ్యమంలో యువత వివిధ మోసాలకు గురవుతున్న నేపథ్యంలో వారికి జరిగిన మోసాలకు సంబంధించి పోలీసుల దృష్టికి తీసుకువెళ్లేందుకు సంకోచించడం వల్ల తరచూ మోసాల బారిన పడుతున్నారు. అందువల్ల వారు పోలీసులకు సంప్రదించడంతో పాటు వారికి జరిగిన మోసాలకు సంబంధించి ధైర్యంగా పోలీసుల దృష్టికి తీసుకువెళితే తగిన న్యాయం చేకూరుతుందన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర పోలీస్ విభాగం నిర్వహించింది. శుక్రవారం నాడు జిల్లాలో జరిగిన వివిధ పోలీస్ స్టేషన్లలో యువతీ, యువకులను ఆహ్వానించిన పోలీసులు ఈ మేరకు వారిని చైతన్య పరిచారు. -
రెడ్‌క్రాస్ సేవలు స్ఫూర్తిదాయకం
మల్కన్‌గిరి: రెడ్‌క్రాస్ సంస్థ ద్వారా అందిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమని వక్తలు పేర్కొన్నారు. మల్కన్‌గిరి కళాశాల సమావేశ మందిరంలో శుక్రవారం ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం డాక్టర్ చిత్తరంజన్ బారిక్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మల్కన్‌గిరి జిల్లా అదనపు కలెక్టర్ సోమనాథ్ ప్రధాన్, కన్వీనర్ కార్యదర్శ రంజాన కుమార్ స్వాయి, జిల్లా యువ రెడ్‌క్రాస్ కన్వీనర్, కార్యదర్శి విఘ్నేశ్వర్, స్వచ్ఛంద సేవకులు శుభలక్ష్మీ సాహు, సునేలి మహారాణ, అంబికా ఖరా, సనతన్ కబసి, సురజ్ మల్లిక్, ఇస్పితా దాస్, జి.సరస్వతి తదితరులు పాల్గొన్నారు. -
నిత్యావసరాల పంపిణీ
రాయగడ: స్థానిక రైతుల కాలనీలో గల నవజీవన ట్రస్టు ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావ సర వస్తువులను శుక్రవారం పంపిణీ చేశారు. ప్రతి నెలా తమ ట్రస్టు తరఫున నిరుపేదలైన 40 మంది ఆదివాసీ వృద్ధ మహిళలకు బియ్యం, కందిపుప్పు, దుంపలు, నూనె, తదితర వస్తువులు పంపిణీ చేస్తున్నట్లు నిర్వాహకురాలు ఎం.నళిని తెలిపారు. తిరుపతికి చెందిన డాక్టర్ శ్రీధర్ ఆచార్య ఇక్కడ ట్రస్టును ఏర్పాటు చేశారన్నారు. ట్రస్టు ద్వారా పేదలైన ఆదివాసీ యువతులకు చదివించడంతోపాటు వారికి భోజన, వసతి సౌకర్యాలను ఉచితంగా అందజేస్తున్నామన్నారు. ఇలా దాదాపు వంద మందికి పైగా యువతులు ట్రస్టు ద్వారా సాయం పొందుతున్నారన్నారు. ఐటీడీఏ పీజీఆర్ఎస్కు 23 వినతులు మందస: స్థానిక ఎంపీడీఓ కార్యలయంలో శుక్రవారం గిరిజనుల సమస్యలపై పీజీఆర్ఎస్ కు 23 వినతులు అందా యి. కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ పవార్ స్వప్నిల్ జగన్నాథ్, ఆర్డీఓ ఎర్.అప్పలరాజు, తహసీల్దార్ మిస్క శ్రీకాంత్ పాల్గొన్నారు. కుసుమాల గ్రామంలో తాగునీటి వాటర్ ట్యాంకు మంజూరు, రోడ్డు పనులు వేగవంతం చేయాలని కోరారు. నువాగడ గ్రామానికి విద్యుత్ సమస్యను పరిష్కరించాలని, పట్టులోగాం గ్రామంలో రోడ్డును మరమ్మతు చేయాలని, సీసీ రోడ్డును మంజూరు చేయాలని కోరారు. కుడుమసాయి గ్రామానికి పాఠశాల మంజూరు చేయాలని, ఆంధ్ర–ఒడిశా సరిహద్దు గ్రామాలకు కనెక్టివిటీ రోడ్డు మంజూరు చేయాలని మరికొందరు కోరారు. సవర మధ్య గ్రామానికి వ్యవసాయ బావులకు త్రీ ఫేస్ విద్యుత్‌ను అందించాలని, ఒడిశా అధికారుల నుంచి ఎదురవుతున్న వేధింపుల నుంచి రక్షణ కల్పించాలని కోరారు. ‘వేధింపులు ఆపండి’ శ్రీకాకుళం అర్బన్: ఏపీఎస్ ఆర్టీసీ శ్రీకాకుళం రెండో డిపోలో ఉద్యోగులను యాజమాన్యం వేధింపులకు గురిచేస్తోందని, ఈ వేధింపులు తక్షణమే ఆపాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ శ్రీకాకుళం రెండో డిపో అధ్యక్ష, కార్యదర్శులు బీఎస్ బాబు, కె.బాబూరావులు అన్నారు. ఏపీఎస్ ఆర్టీసీ శ్రీకాకుళం 2వ డిపోలో ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కరించాలని కోరు తూ శుక్రవారం ఉద్యోగులంతా ఎర్రబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. ఆర్టీసీలో మహిళా ఉద్యోగుల సమస్యలు పట్టించుకోవడంలేదని, ఉద్యోగులపై పని భారం పెంచుతోందన్నారు. డబుల్ డ్యూటీలు చెయ్యమని ఆర్టీసీ అధికారులు ఒత్తిడి చేస్తున్నారని, దీని వల్ల సిబ్బంది అనారోగ్యం పాలవుతున్నారని అన్నారు. ఆర్టీసీ ఉన్నతాధికారులు దీనిపై స్పందించి సమస్యలు పరిష్కారానికి చొరవ చూపాలని వారు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఆర్టీసీ శ్రీకాకుళం రెండవ డిపో ఉద్యోగులు ఆనంద్, వై.దుర్గారావు, ఎస్.జోగారావు, ఎస్ఎస్ రావు, బి.సుభద్ర పాల్గొన్నారు. ఆమదాలవలస: శ్రీకాకుళం రోడ్డు(ఆమదాలవలస) రైల్వే స్టేషన్ సమీపంలో రైలు నుంచి జారిపడి ఒడిశా రాష్ట్రానికి చెందిన యువకుడు మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఈ ఘటనపై జీఆర్పీ ఎస్ఐ ఎస్.మధుసూదనరావు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా హతిగూడ ప్రాంతానికి చెందిన రాజేంద్ర పొలై (22) బరంపురం నుంచి అన్నవరం వైపు రైల్లో ప్రయాణిస్తున్నట్లు అతని వద్ద లభించిన రైల్వే టికెట్ ద్వారా గుర్తించినట్లు తెలిపారు. జనర ల్ బోగీలో ప్రయాణిస్తున్న రాజేంద్ర గుర్తుతెలియని రైలు నుంచి శ్రీకాకుళం రోడ్డు(ఆమదాలవలస) రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే ఇన్స్టిట్యూట్ వద్ద జారిపడడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం సర్వజన ఆస్పత్రికి తరలించినట్లు జీఆర్పీ పోలీసులు తెలిపారు. 25, 26న ఎస్బీఐ సమ్మె శ్రీకాకుళం అర్బన్: ఈ నెల 25వ తేదీ, 26న రెండు రోజులపాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సమ్మె చేసేందుకు నిర్ణయించిన ట్లు రీజినల్ సెక్రటరీ కేసీహెచ్ వెంకటరమణ తెలిపారు. శ్రీకాకుళంలోని జీటీరోడ్‌లోగల ఎస్బీఐ మెయిన్ బ్రాంచి ఎస్బీఐ ఉద్యోగులంతా శుక్రవారం మౌనదీక్ష వహించి నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ రెండు రోజులు పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు, ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సమ్మె చేసేందుకు సిద్ధమయ్యామన్నారు. సమ్మెకు దేశంలో ఉన్న అన్ని ట్రేడ్ యూనియన్స్ వారి మద్దతును తెలిపారని పేర్కొన్నారు. -
సైలెన్సర్లు ధ్వంసం
● రూ.1,27,500 జరిమానా వసూలు జయపురం: జయపురం పట్టణంలో శబ్ధ కాలుష్యం సృష్టిస్తున్న మోటారు బైక్‌ల సైలెన్సర్లను పట్టణ పోలీసులు ధ్వంసం చేశారు. కొరాపుట్ ఎస్పీ రోహిత్ వర్మ ఆదేశాల మేరకు శుక్రవారం జయపురం పట్టణం ప్రధాన కూడలి నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ మార్గంలో ద్విచక్రాల వాహనాలను, వాటి పత్రాలను తనిఖీ చేసినట్లు పోలీసు అధికారి అర్చన మిత్తల్ వెల్లడించారు. 85 మోటారు వెహికల్ కేసులు నమోదు చేసి, ఆయా వాహనాల డ్రైవర్ల నుంచి రూ.1,27,500 జరిమానా వసూలు చేసినట్లు తెలిపారు. పోలీసులు జప్తు చేసిన సైలెన్సర్లను రోలర్‌తో మట్టించి ధ్వంసం చేశామన్నారు. వాహనదారులు కొత్త సైలెన్సర్లు తెచ్చిన తరువాతనే వారికి వాహనాలు అప్పగించారు. మావో లేఖ విడుదల మల్కన్‌గిరి : కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు) ఉత్తర సమన్వయ కమిటీ శుక్రవారం ఓ మావో లేఖను విడుదల చేశారు. ఈ లేఖ విడుదలతో చత్తీస్‌గఢ్ పోలీసులు, కేంద్ర భద్రత సంస్థలు హై అలర్ట్ జారీ చేశాయి. లేఖలో సంస్థ ప్రస్తుతం నేరుగా ఎదురుకాల్పుల్లో నివారిస్తూ వ్యూహాత్మకంగా ముందుకు సాగాలని చూస్తున్నట్లు కూడా సంకేతాలు కనిపిస్తున్నాయి. లేఖలో చత్తీస్‌గఢ్, తెలంగాణలో చురుగ్గా పనిచేసిన ప్రముఖ నక్సల్ నాయకుడు దేవ్‌జీ లొంగుబాటు అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. అతడిని శత్రువుల ఏజెంట్‌గా అభివర్ణించారు. దేవ్‌జీ వంటి సీనియర్ నేతల లొంగుబాటు సంస్థకు పెద్ద దెబ్బగా మారింది. అందుకే లేఖ ద్వారా సంస్థ ముగిసిపోలేదనే సంకేతాన్ని పంపించారు. -
మట్టిలో మాణిక్యం..
రాయగడ: స్థానిక రాయగడ స్వయం ప్రతిపత్తి కళాశాల స్నాతక, స్నాతకోత్సవ ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. స్నాతక స్థాయి కళల (ఆర్ట్స్) విభాగం 12 శాఖల్లో తెలుగు శాఖకు చెందిన పచమట్ల వర్షిత 9.05 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. నిరుపేద కుటుంబంలో పుట్టిన వర్షిత పాఠశాల విద్య నుంచి ఉత్తమ ప్రతిభ కనబరిచేది. పిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన వర్షిత.. తల్లి, వదిన సంపాదన మీదే ఆధారపడింది. ఎలాగైనా ఉన్నత విద్యను అభ్యసించి అధ్యాపక వృత్తి చేపట్టానలన్నదే ధ్యేయంగా నిరంతరం కృషి చేసింది. వర్షిత సాధించిన ఈ విజయానికి కుటుంబ సభ్యులు, అధ్యాపకులు, తోటి విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. తెలుగు విద్యార్థులు వర్షితను స్ఫూర్తిగా తీసుకోవాలని అధ్యాపకులు అన్నారు. హెల్ప్‌లైన్ నంబర్ల విడుదల జయపురం: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జయపురం పట్టణ పోలీసు అధికారులు ప్రజల కోసం హెల్ప్‌లైన్ నంబర్లను శుక్రవారం విడుద ల చేశారు. ఈ కార్యక్రమానికి జయపురం సబ్‌డివిజన్ పోలీసు అధికారి అర్చిత మిత్తల్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పోలీసుల స హాయం కోసం 112, అంబులెన్స్‌కు 108, అగ్నిమాపక సేవలకు 101, సైబర్ నేరాల ఫిర్యాదులకు 1030, బాలల సహాయ సేవలకు 1098, మహిళల సహాయ సేవలకు 181 నంబర్లకు ఫోన్ చేయాలని ఎస్డీపీఓ అర్చిత మిత్తల్ వెల్లడించారు. ప్రజలు ఈ సేవలను సద్విని యోగ పరచుకోవాలని విజ్ఞప్తి చేశారు. జయపురం పట్టణ పోలీసు స్టేషన్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పట్టణ పోలీసు అధికారి ఉల్లాష్ చంద్ర రౌత్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కృషి ఉద్యోగ యోజనపై సమీక్ష పర్లాకిమిడి: ముఖ్యమంత్రి కృషి ఉద్యోగ యోజన ద్వారా రైతులు లాభసాటి వ్యవసాయం, రొయ్యల పెంపకం, లేయర్ఫార్మ్, ఉద్యానవనాలు పెంపకం ద్వారా ప్రయోజనం పొందవచ్చని జిల్లా ముఖ్య వ్యవసాయాధికారి ఎం.ప్రకాశరావు తెలిపారు. కలెక్టరేట్లో హాల్.2లో శుక్రవారం ఎం.కె.యు.వై. పథకంపై ఆగ్రో ఎంటర్‌ప్రైజర్స్, అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఫల్గుణీ మఝి, జిల్లా ముఖ్య ప్రాణి చికిత్సా అధికారి డాక్టర్ తుషారేందు నాయక్, అటవీ శాఖ రేంజర్ నిరోధచంద్ర నాయక్, డి.ఎం.ఆపికోల్ బిపిన్‌కుమార్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. పర్లాకిమిడి: ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని స్థానిక కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం ఉదయం జిల్లా అత్యవసరశాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఏడీఎం మునీంద్ర హానగ ముఖ్యఅతిథి గా విచ్చేశారు. ప్రముఖ మానవతావాది జీన్ హెన్రీ డమంట్ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతిని వెలిగించారు. మానవత్వంలో ఏకత్వం... ప్రపంచంలో ఎక్కడ విధ్వంసం, యుద్ధాలు, విపత్తులు జరిగి నా రెడ్ క్రాస్ సొసైటీ స్పందించటం అనేది రెడ్ క్రా స్ వాలంటీర్ల స్ఫూర్తి అని రెడ్ క్రాస్ నోడల్ అధికారి బినాయక్ చంద్రరౌళో అన్నారు. సబ్ డివిజనల్ పోలీసు అధికారి మాధవానంద నాయక్, జిల్లా శిశు సురక్షా అధికారి అరుణ్‌కుమార్ త్రిపాఠి, తదితరు లు హాజరయ్యారు. గజపతి జిల్లాలో ఒక్క రోడ్డు రవాణా సంస్థ, ఒక్కటే అత్యధిక మొత్తంలో రెడ్ క్రా స్ నిధులు సేకరిస్తుందని, ఇతర ప్రభుత్వ శాఖలు కూడా స్పందించి విరాళాలు సేకరించాలని ఏడీఎం మునీంద్ర హానగ కోరారు. గత ఏడాది జిల్లా వ్యా ప్తంగా ఇండియాన్ రెడ్‌క్రాస్ సంస్థ రూ.20.53 లక్షల సేకరించగా, దానిలో ఆర్.టి.ఓ. (గజపతి) రూ. 16.63 లక్షలు సేకరించిందని అందుకు ప్రతిగా ఆ శాఖకు మెమొంటో, ప్రశంపాపత్రాన్ని ఏడీఎం హాన గ అందజేశారు. అనంతరం ఎక్సైజ్‌శాఖ, మోహనా ప్రభుత్వ ఎస్.ఎస్.డి పాఠశాల, రక్తదానం చేసిన అత్యధికులకు కూడా ప్రశంసాపత్రాల్ని అందజేశారు. -
● అలా.. ఉమ్లింగ్లా వరకు
● ఉమ్లింగ్లా శిఖరాన్ని అధిరోహించిన కిశోర్ ● జిల్లా నుంచి బైక్‌పై సాహస యాత్ర చేసిన యువకుడు రణస్థలం: రణస్థలం మండలంలోని పతివాడపాలెం గ్రామానికి చెందిన పతివాడ కిశోర్ సాహస యాత్ర చేశాడు. ఉమ్లింగ్లా శిఖరాన్ని అధిరోహించాడు. ఇది ప్రపంచంలోనే ఎత్తైన మోటారు వాహనాలు తిరగగలిగే ప్రదేశం. లఢక్ ప్రాంతంలో ఉంటుంది. ఏప్రిల్ 18న కిశోర్ ఈ సాహస యాత్ర మొదలుపెట్టాడు. ఈ నెల 5వ తేదీన అక్కడకు క్షేమంగా చేరుకున్నాడు. లఢక్ ప్రాంతం నుంచి ఉమ్ లింగ్ లా చేరుకునేందుకు ఎన్నో అవాంతరాలు ఎదురైనా అన్నీ తట్టుకుని గమ్యస్థానం చేరుకున్నాడు. జిల్లా నుంచి మొట్టమొదటి సారిగా అంతదూరం సాహసయాత్ర చేసిన వ్యక్తిగా నిలిచాడు. కిశోర్ తల్లిదండ్రు లు పతివాడ కమల, పతివాడ నర్సింహమూర్తి వ్యవసాయ కూలీలు. కిశోర్ ఇంటర్ వరకు చదువుకున్నాడు. కొండములగాం గ్రామానికి చెందిన మేనమామ లారీతో డ్రైవింగ్ వెళుతుంటానని చెప్పారు. అలాగే అప్పుడప్పుడు సాహసయాత్రలకు వెళ్లడం అలవాటుగా మార్చుకున్నట్లు తెలిపారు. ఉమ్లింగ్ లా ఎందుకంత ప్రత్యేకం..? ఉమ్లింగ్ లా ప్రపంచంలోని అత్యంత ఎత్తైన మోటర్బుల్ రోడ్డుగా ప్రపంచ ఖ్యాతి గడించింది. 19,024 అడుగులు అంటే 5798 మీటర్ల ఎత్తులో అత్యంత ప్రమాదక బైక్ రైడింగ్ ప్రాంతమిది. ఎంతోమంది సాహస బైక్ రైడర్లు ఈ ప్రాంతానికి వెళ్లేందుకు సిద్ధమైన గడ్డకట్టే చలి, వాతావారణం అనుకూలించక సగంలోనే తిరుగు బాట పడుతుంటారు. పదిహేడు రోజుల్లోనే ఈ సాహస యాత్ర పూర్తి చేసినందుకు ఎంతో సంతోషంగా ఉందని కిశోర్ చెప్పారు. గిన్నిస్ వరల్డ్ రికార్డు వాళ్లు ఈ సాహస యాత్ర చేసినందుకు గుర్తింపు పత్రం అందజేశారు. -
నేటి నుంచి పీజీ సెట్
ఎచ్చెర్ల : రాష్ట్రంలో పలు యూనివర్శిటీలు, అనుబంధ కళాశాలల్లో ఆర్ట్స్, సైన్స్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 8 నుంచి నాలుగు రోజులపాటు ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం (తిరుపతి) నిర్వహిస్తున్న ఈ ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత పొందిన వారు వెబ్ ఆప్షన్స్ ద్వారా ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విశ్వ విద్యాలయంలో వివిధ కోర్సుల్లో సీట్లు పొందవచ్చు. ● ఆర్ట్స్ కళాశాలకు సంబంధించి ఎం.కాం, ఎం.ఎ (ఎకనామిక్స్), ఎం.ఎ (రూరల్ డెవలప్మెంట్), ఎంఈడీ, ఎం.ఎల్.ఐ.సీ (లైబ్రరీ సైన్స్), ఎం.ఎ(సోషల్‌వర్క్), ఎం.ఎ (ఇంగ్లీష్), ఎం.ఎ (తెలుగు), ఎం.జె.ఎం.సి (జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్) కోర్సులకు వెబ్ కౌన్సిల్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పరీక్ష రాసిన విద్యార్థులు ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. ● సైన్స్ కళాశాలకు సంబంధించి ఎం.ఎస్సీ (బయోటెక్నాలజీ), ఎం.ఎస్సీ (మైక్రో బయాలజీ), ఎం.ఎస్సీ (ఆర్గానిక్ కెమిస్ట్రీ), ఎం.ఎస్సీ (అనలైటికల్ కెమిస్ట్రీ), ఎం.ఎస్సీ (మేథమెటిక్స్), ఎం.ఎస్సీ (అప్లయిడ్ మేథమెటిక్స్), ఎం.ఎస్సీ (ఫిజిక్స్)లకు ఏపీపీీజీసెట్–2026 ద్వారా ప్రవేశాలు పొందవచ్చు. పూర్తి వివరాలకు సీఈటీఎస్.ఏపీఎస్సీహెచ్ఈ.ఎపీ.జీవోవి.ఇన్ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. అధునాతన వసతులు.. పీజీ ప్రవేశాలు పొందినవారికి అంబేడ్కర్ వర్శిటీ పలు వసతులు కల్పిస్తోంది. ఆధునిక సౌకర్యాలతో కూడిన హాస్టళ్లు, కిచెన్లు, గ్రంథాలయాలు, వ్యాయామశాలలు, ప్రయోగశాలలు, యోగా హాళ్లు, హెల్త్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. జీసీసీ కేఫ్, క్యాంటీన్, బ్యాంక్, వైఫై సదుపాయంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఉపకార వేతనాలకు విద్యార్థులు అర్హులేనని రిజిస్ట్రార్ బి.అడ్డయ్య తెలిపారు. -
జెమ్స్‌లో అంతర్జాతీయ స్థాయి వైద్యం
శ్రీకాకుళం రూరల్: రాగోలులోని జెమ్స్–హెచ్ ఆస్పత్రి వైద్య కళాశాల నుంచి ఇకపై అంతర్జాతీయ స్థాయి వైద్యసేవలు అందిస్తామని జెమ్స్–హెచ్ చీఫ్ పేట్రన్ బొల్లినేని భాస్కరరావు తెలిపారు. తమ కళాశాలకు దేశంలోనే తొలిసారిగా ఇంగ్లాండ్ రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్‌గా గుర్తింపు రావడంతో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రపంచ ప్రఖ్యాత శస్త్రచికిత్స సంస్థ రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇంగ్లాండ్ నుంచి జనరల్ సర్జరీ విభాగానికి ప్రతిష్టాత్మక గుర్తింపు వచ్చిందన్నారు. క్లిష్టమైన శస్త్రచికిత్సలు, రోగుల సంరక్షణపై శిక్షణ ఇచ్చే సీసీఆర్ఎల్ఎస్పీ ప్రొవైడర్ కోర్సును జెమ్స్ హెచ్ ఆస్పత్రిలోనే నెలకొల్పినట్లు వివరించారు. ప్రధానంగా సర్జికల్ విద్యకు సంబంధించిన మౌలిక వసతులు, అధ్యాపక బృందం, నాణ్యత ప్రమాణాలు, శిక్షణా విధానాలపై జరిగిన సమీక్షలో జెమ్స్ ఆస్పత్రికి ఈ అరుదైన అవకాశం దక్కిందన్నారు. ఆదిత్య ఎడ్యుకేషనల్ సొసైటీ వైస్ చైర్మన్, శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ పి.రఘురామ్ మాట్లాడుతూ సర్జరీ విద్యా ప్రమాణాల్లో అత్యుత్తమ నాణ్యతను గుర్తిస్తూ రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇంగ్లాండ్ ఈ గుర్తింపు ఇచ్చిందన్నారు. సీసీఆర్ఎల్ఎస్సీ కోర్సు డైరెక్టర్ జీఐ సర్జన్ డాక్టర్ ఎం.బి.వి.ప్రసాద్ మాట్లాడుతూ ఈ కోర్సును మే 7, 8 తేదీల్లో 16 మంది శస్త్ర చికిత్స శిక్షణార్థులకు అనస్తీషీ యా విభాగాలకు చెందిన నిపుణుల బృందం శిక్షణ అందిస్తోందన్నారు. సామర్థ్యాలను పెంపొందించేలా కోర్సు అందిస్తున్నట్లు చెప్పారు. -
క్షతగాత్రులపై ఎమ్మెల్యే ఔదార్యం
పర్లాకిమిడి: కాశీనగర్ బ్లాక్ కె.సీతాపురం పంచాయతీ సింగుపురం గ్రామం సమీపంలో ఒక రోడ్డు దుర్ఘటనలో పడి ఉన్న క్షతగాత్రునికి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి తన కారును ఆపి సాయం చేశారు. గజపతి జిల్లా కాశీనగర్ బ్లాక్ ఖండవ గ్రామానికి ఒక ప్రారంభోత్సవానికి పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి వెళుతుండగా ఈ సంఘటన గురువారం జరిగింది. సింగిపురం గ్రామ సమీపంలో స్టేట్ హైవే వద్ద ఒక మోటారు సైకిల్ పర్లాకిమిడి నుండి వస్తున్న కారును ఢీకొన్న సంఘటనలో ఒక యువకుడు తీవ్రగాయాలతో రోడ్డు పక్కన పడి ఉండటం చూసి తాగునీటిని అందజేశారు. అలాగే వెంటనే అంబులెన్స్ 108కి ఫోన్ చేసి పర్లాకిమిడి ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం పంపించారు. కె.సీతాపురం పంచాయతీ సర్పంచ్ తేజేశ్వరరావు కూడా క్షతగాత్రునికి సహకారం అందజేశారు. -
ఘనంగా ప్రభుదాన్ భొత్ర జయంతి
జయపురం: ప్రముఖ కవి, రచయిత, పత్రికా సందకుడు, విద్యాదాత, సమాజ సేవకుడు ప్రభుధాన్ భొత్ర జయంతి గురువారం ఘనంగా జరిగింది. భొత్ర స్థాపించిన స్థానిక ఫ్లోరెన్స్ నైటింగేల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ భాగృహంలో డాక్టర్ సుధాంశు శేఖర పట్నాయక్ అధ్యక్షతన జయంతి కార్యక్రమం నిర్వహించారు. భొత్ర చిత్రాలతో రచించిన ‘సంగరె సెల్ఫీ’ పుస్తకం ఆవిష్కరించి ప్రజలకు అంకితం చేశారు. ‘దండకారణ్య సమాచార్’ పత్రిక సంపాదకులు బినోద్ మహాపాత్రో ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. భొత్ర అవిభక్త కొరాపుట్‌లో అనేక రంగాల్లో పని చేశారన్నారు. పత్రికా సంపాదకుడిగా పాత్రికా రంగానికి ఎనలేని సేవలు అందించారని ప్రశంసించారు. ముఖ్యవక్తగా ఆల్ ఇండియ రేడియో విశ్రాంత అధికారి, స్థానిక పూజ్య పూజ సంసద్ అధ్యక్షుడు ఉదయ శంకర జాని, తదితరులు మాట్లాడుతూ.. ప్రభుదాన్ భొత్ర జీవన శైలి, వ్యక్తిత్వం, సమాజ సేవలను వివరించారు. పత్రికా సంపాదకులు బినోద్ మహాపాత్రను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పరిశోధకులు అలోక్ మహరాణ, భారతీ మల్లిక్, సమాజ సేవి బాలారాయ్, అశోక్ మహనందియ, అశోక్ మహరాణ, అభినాష్ పాత్రో, నారాయణ మహాపాత్రో, బిపిన్ మహానందియ, సుభాష్ మహాపాత్రో, డాక్టర్ సబిత శతపతి, డాక్టర్ శౌభాగిణి నందో, తదితరులు పాల్గొన్నారు. -
టమాటా రైతులకు పరిహారం అందించాలి
సోంపేట: మండలంలో గత నెల ఏడో తేదీన కురిసిన వర్షాలకు టమాట పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ, ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త సాడి శ్యాంప్రసాద్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టమాట రైతులను ఆదుకోవాలని కోరుతూ గురువారం సమన్వయకర్త శ్యాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. జింకిభద్రలో టమాటా పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా విజయ మాట్లాడుతూ గత నెలలో కురిసిన వర్షాలకు టమాటా రైతులు, కాయగూరల రైతులు తీవ్రంగా నష్ట పోయారన్నారు. వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం విస్మరించడం దారుణమన్నారు. శ్యాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ అకాల వర్షాల వలల్ల టమాట పంట నీట మునిగి రైతులు నిండా మునిగారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు సుమారు రూ.40 వేల పెట్టుబడి పెట్టగా.. వర్షాల వల్ల ఒక్క రూపాయి కూడా ఆదాయం రాలేదన్నారు. ప్రభుత్వాలు టమాట పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. మండలంలో 600 ఎకరాల్లో టమాట సాగు చేస్తే ఏప్రిల్ 7న కురిసిన వర్షాలకు పంట మొత్తం పోయిందన్నారు. నేటికీ పంటల బీమా గానీ, పంట పెట్టుబడి సహాయం గానీ అందలేదన్నారు. టమాట పంటకు వాతావరణ ఆధారిత బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్‌చేశారు. ఈ విషయంలో వ్యవసాయ శాఖ మంత్రి, ప్రభుత్వ విప్ చొరవ తీసుకోవాలన్నారు. ఎంపీపీ డాక్టర్ నిమ్మన దాస్ మాట్లాడుతూ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో టమాటా రైతులను ఆదుకోవాలని విన్నవించామని, అయినా ఇంతవరకు చర్యలు చేపట్టలేదన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి నర్తు నరేంద్రయాదవ్, పార్టీ నాయకులు ఇప్పిలి కృష్ణారావు, సల్ల దేవరాజు, గురాల శ్రీను, బతకల మోహనరావు, తామాడ పద్మావతి, పాతిన శేషగిరి, పిన్నింటి ఈశ్వరరావు పాల్గొన్నారు. -
రాయగడలో బీజేపీ జెండా ఎగురవేయాలి
రాయగడ: రానున్న పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికలతో పాటు భవిష్యత్‌లో రాయగడ జిల్లాలో బీజేపీ జెండా ఎగిరేలా కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మన్మోహన్ సామల్ అన్నారు. రాజధాని భువనేశ్వర్‌లో ఉన్న పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో బీజేపీ నాయకుడు కోడూరు నారాయణరావు నేతృత్వంలో రాయగడ జిల్లా నుంచి వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మన్మోహన్ సామల్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో ఇతర పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పేలా కార్యకర్తలు వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలని సూచించారు. ఇటీవల దేశంలో జరిగిన ఎన్నికల్లో భాగంగా మూడు రాష్ట్రాల్లో పార్టీ విజయ ఢంకా మోగించిందని గుర్తు చేశారు. రానున్న కాలంలో బీజేపీ ఇక తిరుగులేని పార్టీగా మారే అవకాశం ఉందన్నారు. పార్టీలో చేరిన ప్రతీ ఒక్క కార్యకర్త నిస్వార్థంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. చేరికల్లో భాగంగా బీజేడీ సీనియర్ నాయకుడు కాశీనాయుడు, కె.శ్రీధర్ తదితరులు బీజేపీ తీర్థం పుచ్చుకున్న ప్రముఖుల్లో ఉన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకుడు యాళ్ల కొండబాబు, కాళీరాం మాఝి, ఎస్డీసీ వైస్ చైర్మన్ మంజుల మినియాక, జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు శివకుమార్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
మల్కన్‌గిరి: జిల్లాలోని పంగం గ్రామం వద్ద బుధవారం రాత్రి గోవిందపల్లి నుంచి మల్కన్‌గిరికి వస్తున్న సమయంలో బైక్ అదుపుతప్పి పొలాల్లో పడిపోయి సంతోష్ కిర్సనీ (22) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. సంతోష్ తెలిసినవారిని గోవిందపల్లిలో దించడం కోసం వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాద జరిగింది. చాలా సమయం తర్వాత అటుగా వచ్చిన గ్రామస్తులు చూసి వెంటనే గ్రామంలో వారికి తెలియజేశారు. మల్కన్‌గిరికి చెందిన యువకుడిగా గుర్తించి తండ్రి అర్జున్ కీర్సనీకు సమాచారం ఇచ్చారు. ఆయన పోలీసు శాఖలో విధుల్లో ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే సంఘటన స్థలానికి వెళ్లగా అప్పటికే మృతిచెంది ఉన్నాడు. మృతదేహన్ని మల్కన్‌గిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహన్ని గురువారం కుటుంబ సభ్యులకు అప్పగించారు. సంతోష్ మృతితో మల్కన్‌గిరిలో విషదచాయలు అలుముకున్నాయి. -
నేటి నుంచి పలు జిల్లాల్లో వర్ష సూచన
భువనేశ్వర్: భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డీ) జారీ చేసిన సమాచారం ప్రకారం రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయి. ఈ నెల 12వ తేదీ వరకు ఈ వాతావరణ పరిస్థితి కొనసాగుతుందని ఐఎండీ సూచన. ఈ వ్యవధిలో మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎమ్‌డీ పసుపు హెచ్చరిక జారీ చేసింది. మయూర్భంజ్, కెంజొహర్, సుందర్‌గడ్, నవరంగపూర్, కలహండి, కంధమల్, నువాపడా, సంబల్పూర్, ఝార్సుగుడ, దేవ్గడ్, బర్గడ్, అంగుల్, బాలాసోర్, అంగుల్, బాలాసోర్, భద్రక్, జాజ్‌పూర్, కేంద్రాపడా, కటక్, జగత్సింగ్పూర్, పూరీ, ఖుర్దా, నయాగఢ్, ఢెంకనాల్, గంజాం, గజపతి, రాయగడ, కొరాపుట్, మల్కన్‌గిరి జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ముందస్తు సమాచారం జారీ చేసింది. ఆయా ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 50 కిలో మీటర్ల వరకు వేగం పుంజుకునే ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అంచనా. మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో ప్రజలు అప్రమత్తతో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండీ సూచించింది. ఉరుములతో కూడిన వర్షాలు సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ప్రదేశాలలో పనిచేసే వర్గాలు ఎత్తైన చెట్లు, లోహ నిర్మాణాలకు దూరంగా ఉండాలని ఐఎండీ కోరింది. రాయగడ: జిల్లాలోని గుణుపూర్‌లో ఫుడ్ సేఫ్టీ విభాగం, మున్సిపల్ సంబంధితశాఖ అధికారులు బుధవారం పలు హోటళ్లల్లో ఆకస్మిక దాడులను నిర్వహించారు. ఈ దాడుల్లో భాగంగా జరిమానా రూ పంలో రూ.58 వేలను వసూలు చేశారు. జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి జ్యోతిప్రకాష్ సోరేన్, మున్సిపాలిటీ కార్యనిర్వాహక అధికారి సంతోష్‌కుమార్ నాయక్ నేతృత్వంలో గుణుపూర్ పట్టణంలో గల వివిధ హోటళ్లలో దాడులను నిర్వహించారు. పాడైన ఆహా ర పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఆహార పదార్థాల తయారీలో కృత్రిమ రంగులు వినియోగించవద్దని హెచ్చరించారు. హోటళ్ల నిర్వహణకు సంబంధించిన అనుమతి పత్రాలను తనిఖీ చేశారు. ఎటువంటి అనుమతులు లేకుండా నిర్వహించే హో టళ్ల యజమానులపై చర్యలు తీసుకుంటామన్నా రు. హోటళ్లలో పాలిథిన్ వినియోగం, ట్రేడ్ లైసెన్స్ లేనివారిపై జరిమానాలు విధించారు. 14 హోటళ్ల లో అధికారులు దాడులను నిర్వహించి రూ.58 వేలు జరిమానా విధించారు.


