పర్లాకిమిడి: గజపతి జిల్లా ఆర్.ఉదయగిరి, మోహ న, అడవ ప్రాంతాల్లో సెల్‌ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు సబ్ డివిజనల్ పోలీసు అధికారి రాకేష్ కుమార్ సాహు శుక్రవారం ఉదయం ప్రత్యేక మొబై ల్ మేళాలో అందజేశారు. మొబైల్స్ పోగొట్టుకున్న బాధితులు తమ ఫోన్లు తిరిగి దొరికినందుకు సంతో షపడ్డారు. ఎవరివైనా మొబైల్స్‌పోగొట్టుకున్న వారు వెంటనే సమీప పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదుచేస్తే ట్రా క్ చేసి పట్టుకుంటామని ఎస్‌డీపీఓ రాకేష్ కుమార్ సాహు అన్నారు. ఆర్.ఉదయగిరి పోలీసు ష్టేషన్‌లో మొత్తం 43 మొబైళ్లను ట్రాక్‌చేసి పట్టుకుని బాధితులకు అందజేశారు. ఈ మొబైల్ మేళాలో ఆర్.ఉదయగిరి పోలీసుష్టేషన్ ఐఐసి కల్పలతా ప్రధాన్, అడవ పోలీసు స్టేషన్ అధికారి సంతోష్‌కుమార్ బిశోయి, మోహాన పి.యస్. ఐఐసి ఓంప్రకాష్ పా త్రో, రామగిరి స్టేషన్ ఐఐసి రావు పాల్గోన్నారు.


