breaking news
Odisha Latest News
-
ఆదాయ పన్ను సరళీకరణతో మేలు
రాయగడ: ఆదాయపు పన్ను 1961 చట్టం సరళీకరణ చేయడంతో సీనియన్ సిటిజన్లకు ఎంతగానో మేలు చేకూరుతుందని ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ బరాటం రాంప్రసాద్ అన్నారు. స్థానిక ఆదాయపుపన్ను కార్యాలయంలో బుధవారం ‘ఆదాయపు పన్ను చట్టంలో మార్పులు’ అనే అంశం సంబంధిత శాఖాధికారి టి.గంగరాజు ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటీఆర్ సమర్పించేందుకు ఈ నెల 15 వరకు గడువు పొడిగించినట్లు తెలిపారు. ఈక్విటీ పెట్టుబడులు, దీర్ఘకాలిక లాభాలు, మూలధన పొదుపుపై పన్ను స్లాబ్‌లను వివరించారు. అధిక ఆదాయం సంపాదిస్తున్న వారు సకాలంలో పన్నులు చెల్లిస్తే దేశ ఆర్థిక పురోగతి సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో బరంపురం ఆదాయపు పన్ను విభాగం అధికారి రూపేష్ కుమార్ దాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఒకే కుటుంబంలో ఆరుగురికి యావజ్జీవ శిక్ష
కొరాపుట్: ఒకే కుటుంబంలో ఆరుగురికి యావజ్జీవ శిక్ష పడింది. బుధవారం నబరంగ్‌పూర్ జిల్లా కేంద్ర కోర్టుల సముదాయంలో అడిషనల్ జిల్లా, సెషన్స్ జడ్జి బిష్టు ప్రసాద్ మిశ్రా ఈ తీర్పును వెలువరించారు. ఈ కేసులో ప్రభుత్వం తరఫున వాదించిన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంతోష్ మిశ్రా విలేకరులకు వివరాలు వెల్లడించారు. నబరంగ్‌పూర్ జిల్లా కొడింగా పోలీస్‌స్టేషన్ పరిధిలో బరమసి గ్రామంలో 2022 ఆగస్ట్ 9న పొలం పని చేసుకుంటున్న డొంబురు పూజారి (40) కుటుంబంపై అదే గ్రామానికి చెందిన అనంత పూజారి కుటుంబ సభ్యులు ఆయుధాలతో వచ్చి దాడికి పాల్పడ్డారు. పదలం పూజారి అనే వ్యక్తిని ట్రాక్టర్‌తో ఢీ కొట్టి చంపడానికి ప్రయత్నించారు. మహిళలు, పిల్లలపై కత్తులు, గొడ్డళ్లతో దాడి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు గాయపడ్డ డొంబురును నబరంగ్‌పూర్ జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కటక్‌లో ఎస్బీసీ మెడికల్ కాలేజికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ డొంబురు మృతి చెందాడు. మిగిలిన బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందారు. ఈ ఘటనకు కారకులైన అనంత పూజారి, శివశంకర్ పూజారి, చందన్ పూజారి, డుమర్ పూజారి, దాలింబు పూజారి, మైనర్ బాలుడికి యావజ్జీవ శిక్ష విధించారు. -
ఉత్కళ క్యాంపస్‌లో ఉద్రిక్తత
● గేట్లకు తాళం వేసి విద్యార్థుల నిరసన ● అనధికార వ్యక్తులు చొరబడితే సహించం: మంత్రిభువనేశ్వర్: స్థానిక ఉత్కళ విశ్వ విద్యాలయం గోపబంధు హాస్టల్లో మంగళవారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది. వార్డెన్ చర్యలకు వ్యతిరేకంగా పలువురు విద్యార్థులు గేట్లకు తాళం వేసి నిరసన తెలిపారు. విద్యార్థేతర వర్గాలు హాస్టల్ ఖాళీ చేయాలని వార్డెన్ ఆదేశించడంతో ఈ ఉద్రిక్తత ఏర్పడింది. విశ్వవిద్యాలయ ప్రాంగణం నుంచి మురికివాడలను తొలగించాలని విద్యార్థేతర వర్గాలు ఎదురు దాడికి దిగాయి. ఈ వర్గాలు ఉద్దేశపూర్వకంగా విశ్వవిద్యాలయంలోని హాస్టల్లకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగించారు. స్థానిక సాహిద్ నగర్ ఠాణా పోలీసులు, మీడియా చొరవని అడ్డుకుని ఆందోళన కొనసాగించారు. వాణీవిహార్ ఉత్కళ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో తలెత్తిన ఉద్రిక్తతని ప్రేరేపించిన పరిస్థితులపై అధికారులు, అనుబంధ వర్గాలతో చర్చలు జరుగుతున్నాయని భువనేశ్వర్, కటక్ జంట నగరాల పోలీస్ కమిషనర్ దేవదత్ సింగ్ తెలిపారు. అంతర్గత వ్యవహారాలతో ఈ ఉద్రిక్తత తలెత్తినట్లు ప్రాథమిక సమాచారం. పరిస్థితి అదుపు చేసేందుకు స్థానిక సాహిద్ నగర్ ఠాణా పోలీసుల బృందం ప్రవేశ ద్వారం వద్దకు చేరుకున్నారు. ఈ సమయంలో నిరసనకారులు రాళ్లు రువ్వడంతో ప్రాంగణం లోనికి ప్రవేశించలేకపోయారు. మురికివాడలు కూల్చండి.. ఉత్కళ క్యాంపస్‌లోనికి పరిసరాల్లో బీదలవాడ ప్రజలు అనధికారికంగా చొరబడి విద్యార్థులకు కేటాయించిన హాస్టలు గదుల్లో చొరబడ్డారు. వారందరినీ తక్షణమే ఖాళీ చేయాలని ఆదేశించడంతో బీదలవాడ వర్గీయులు భగ్గుమన్నారు. క్యాంపస్ పరిసరాల్లో మురికివాడ తొలగించిన తర్వాత ఆదేశాలు జారీ చేయాలని ఎదురు దాడికి దిగారు. పోస్టు గ్రాడ్యుయేషన్ విద్యార్థుల 3 యూనిట్ల హాస్టలు గదుల్లో బీదల వాడ ప్రజలు అనధికారికంగా చొరబడి తిష్ట వేశారు. వారంతా ఈ నెల 4న లేదా అంతకు ముందు తమ వస్తువులతో సహా గదులను ఖాళీ చేయాలని హాస్టల్ వార్డెన్ ఆదేశించారు. ఆదేశాల ఉల్లంఘనకు పాల్పడిన వారి వ్యతిరేకంగా కఠిన చర్యలు చేపడతామని స్పష్టంగా హెచ్చరించారు. మరో వైపు విద్యార్థి వర్గాలకు హాస్టలు వార్డెన్ ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేశారు. హాస్టలు గదులను ఇతరులకు అద్దెకు కేటాయించడం నిషేధమని, ఈ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన విద్యార్థుల రిజిస్ట్రేషను పూర్తిగా రద్దు చేసి క్యాంపస్ నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించారు. అనధికారిక చొరబాటులు సహించం.. విశ్వవిద్యాలయంతో సంబంధం లేని వారు క్యాంపస్‌లో అడుగుపెడితే సహించేది లేదని రాష్ట్ర ఉన్నత విద్యా విభాగం మంత్రి సూర్యవంశీ సూరజ్ స్పష్టం చేశారు. క్యాంపస్‌లో ఆరోగ్యవంతమైన విద్యా వాతావరణం పరిరక్షణ పట్ల వైస్ చాన్సలర్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మంత్రి ఆదేశించారు. బీదల వాడల ప్రజలు క్యాంపస్ లోనికి చొరబడడం తగదన్నారు.హద్దు మీరితే కఠిన చర్యలు చేపట్టడంలో వెనుకంజ వేసేది లేదని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ విద్యార్థులకు అనుకూలంగా, వారి భద్రత కోసం నిబద్ధతతో వ్యవహరిస్తుందని చెప్పారు. -
పాముకాటుతో బాలిక మృతి
మల్కన్‌గిరి: పాముకాటుతో బాలిక మృతి చెందింది. మల్కన్‌గిరి జిల్లా పోడియా సమితి రోడన్పల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకోగా.. బాలక భీమే సోడి (6) ప్రాణాలు కోల్పోయింది. గ్రామంలో మీర సోడి కుటుంబం నివసిస్తోంది. మంగళవారం రాత్రి భోజనాలు చేసిన తరువాత తల్లిదండ్రులతో కలిసి భీమే సోడి నిద్రపోయింది. అయితే విషసర్పం బాలిక కాలిపై కాటు వేసింది. దీంతో చిన్నారి కేకలు వేసి నిద్రపోయింది. బుధవారం తెల్లవారు జామున నాలుగు గంటల సమయంలోభీమే సోడి నోటివెంట చొంగ రావడంతోపాటు శరీరం అయిపోయినట్టు గమనించి తల్లి కుటుంబ సభ్యులకు చెప్పడంతో.. వెంటనే బాలికలను పోడియ ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అయితే పరీక్షించిన వైద్యులు అప్పటికే బాలిక చనిపోయినట్టు నిర్ధారించారు. పోడియ ఏఎస్సై అనిల్ మిశ్రో సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలింంచారు. -
గజపతి జిల్లాలో ప్రైవేటు మెడికల్ కళాశాల నిర్మించాలని వినతి
పర్లాకిమిడి: ఒడిశాలో వెనుకబడిన ఆదివాసీ బహుళ గజపతి జిల్లాలో మెడికల్ కళాశాల నిర్మించాలని రాష్ట్ర రవాణా, ఖనిజ శాఖ మంత్రి బిభూతీ జెన్నా ప్రముఖ పారిశ్రామిక వేత్త, హైటెక్ మెడికల్ కళాశాలల చైర్మన్ డాక్టర్ తిరుపతి పాణిగ్రాహినిని బుధవారం భువనేశ్వర్‌లో కోరారు. గజపతి జిల్లాలో అనేక మంది పేదరోగులు పొరుగున ఉన్న శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలకు సర్జరీలు కోసం వెళ్తు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో పర్లాకిమిడి ప్రాంతంలో ప్రైవేటు మెడికల్ కళాశాలను నిర్మించాలని రాష్ట్ర మంత్రి బిభూతీ జెన్నా కోరారు. అలాగే పవిత్ర మహేంద్రగిరి పర్యాటక ప్రాంతం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్లు మంజూరు చేయనున్నట్టు మంత్రి జెన్నా తెలియజేశారు. రాష్ట్ర మంత్రి జెన్నాతో పాటు మహేంద్రగిరి పరిరక్షణ సమితి అధ్యక్షులు భాస్కర తీర్ధ లక్ష్మీబాబా ఉన్నారు. జిల్లాలో ఆదివాసీ ప్రాంతాల్లో ఒక సంచార మెడికల్, అంబులెన్సు ఏర్పాటు చేయాలని భాస్కర తీర్ధ లక్ష్మీబాబా హైటెక్ మెడికల్ కళాశాల అధిపతి తిరుపతి పాణిగ్రాహిని కోరారు. రాష్ట్ర మంత్రి జెన్నా ప్రతిపాదనకు హైటెక్ మెడికల్ కళాశాల చైర్మన్ తిరుపతి పాణిగ్రాహి అంగీకరించారు. తప్పకుండా పర్లాకిమిడి లేదా పరిసర ప్రాంతంలో మెడికల్ కళాశాల నిర్మించడం జరుగుతోందని ఈ సందర్భంగా తిరుపతి పాణిగ్రాహి అన్నారు. -
శ్రీమందిరం పతాకంపై వాలిన డేగ..!
భువనేశ్వర్: పూరీ శ్రీమందిరం శిఖరాన నీలచక్రానికి అమర్చిన పతిత పావన పతాకంపై వాలిన డేగ కొద్ది సమయం నిలకడగా ఉండడం చర్చనీయాంశమైంది. ఇదో అసాధారణ ఘటనగా భక్తలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇటువంటి దృశ్యం వీడియో వైరల్ అయి కలకలం రేపింది. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత.. శ్రీ జగన్నాథుని ఆలయ శిఖరంపై శ్రీమహా విష్ణువు వాహనం డేగ వాలడం రక్షణతో కూడిన హెచ్చరికగా పరిగణించాలని ఆధ్యాత్మిక వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ప్రపంచానికి ఎదురు కానున్న సవాళ్ల గురించి ఇది ముందస్తు హెచ్చరిక. అలాగే దైవిక సంరక్షకత్వం ఉందని కూడా భరోసా ఇస్తుందని వివరించారు. జగన్నాథ ఆలయ శిఖరంపై డేగ ఉనికి అశుభం కాదు. అప్రమత్తంగా ఉండటం, భగవంతుని పట్ల విశ్వాసంతో లోతుగా ప్రార్థించడం, జగన్నాథుడు పర్యవేక్షిస్తూ రక్షిస్తున్నాడని విశ్వసించేందుకు సానుకూల శకునంగా కొంతమంది పేర్కొన్నారు. -
440 కిలోల గంజాయి పట్టివేత
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా బలిమెల పోలీసులు ఖోయిర్‌పూట్ సమితి సుననగార్ గ్రామ అడవిలో ముందస్తు సమాచారంతో దాడులు చేపట్టి 440 కిలోల గంజాయిని మంగళవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం మధ్యాహ్న సమయంలో పోలీసులకు గంజాయి అక్రమ రవాణపై అజ్ఞాత వ్యక్తుల నుంచి ఫోన్ సమాచారం వచ్చింది. దీంతో బలిమెల ఐఐసీ దీరాజ్ పట్నాయక్ ఎస్ఐ అజిత్‌తో పాటు ఓ బృందం సుననగార్ గ్రామానికి చేరుకున్నారు. సమాచారం ప్రకారం పోలీసులు గాలించగా ఓ చోట 18 సంచుల్లో గంజాయి దొరికింది. పోలీసుల రాకను గమణించిన మాఫీయా అక్కడ నుంచి పరారైంది. పట్టుబడ్డ గంజాయిని బలిమెల పోలీసుస్టేషన్‌కు తరలించారు. బుధవారం తూకం వేయగా 440 కిలోలు ఉందని.. దీని విలువ సుమారు రూ. 30 లక్షలు ఉంటుందని ఐఐసి దీరాజ్ పట్నాయక్ చెప్పారు. కేసు నమోదు చేసి పరారీలో ఉన్నవారి కోసం గాలిస్తున్నామన్నారు. -
వైభవంగా వినాయక కల్యాణోత్సవం
రాయగడ: వినాయక ఉత్సవాల్లో భాగంగా స్థానిక ఎద్దు వీధిలో బుధవారం వినాయక కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. సిద్ధి బుద్ధి సమేత వినాయకున్ని పట్టు వస్త్రాలతో ప్రత్యేకంగా అలంకరించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య కల్యాణం జరిపించారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ముత్తయిదువులకు అక్షింతలు అందించారు. బ్రహ్మాది రుషులు మునులు దంపతులను ఆశీర్వదించేలా ఏర్పాటు చేసిన బ్యానర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఏడో తేదీన మజ్జిగౌరి మందిరం మూసివేత రాయగడ: చంద్ర గ్రహణం కారణంగా ఈ నెల ఏడో తేదీన మజ్జిగౌరి మందిరాన్ని మూసి వేస్తున్నట్లు మందిర కమిటీ బుధవారం ఓ ప్రకటలో తెలియజేసింది. ఆ రోజున ఉదయం 11 గంటల వరకు మాత్రమే అమ్మవారి దర్శన భాగ్యం ఉంటుందని.. అనంతరం మందిరాన్ని మూసివేస్తామన్నారు. తిరిగి సొమవారం తెల్లవారుజామున తెరుస్తామన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. భక్తి శ్రద్ధలతో ఏకాదశి పూజలు రాయగడ: స్థానిక బాలాజీనగర్‌లోని కళ్యాణ వేంకటేశ్వర ఆలయంలో బుధవారం పార్శ్వ ఏకాదశి పూజలను భక్తి శ్రద్దలతో నిర్వహించారు. ఆలయ అర్చకులు రాంజీ ఆచార్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన పూజల్లో అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భాద్రపద శుక్ల ఏకాదశిని పరివర్తన ఏకాదశిగా పిలుస్తారు. ఈ రోజున మన ప్రకృతిలో మార్పులు సంభవిస్తాయని.. అందుకే ఈ ఏకాదశిని పార్శ్వ ఏకాదశి లేదా పరివర్తన ఏకాదశిగా పిలుస్తారని ఆచార్యులు భక్తులకు వివరించారు. పాఠశాల గోడను ఢీకొట్టిన వ్యాన్ ● డ్రైవర్‌కు గాయాలు రాయగడ: స్థానిక గోవిందచంద్ర దేవ్ ఉన్నత పాఠశాల గోడను ఒక వ్యాన్ అదుపుతప్పి ఢీకొట్టింది. దీంతొ వ్యాన్ ఒక వైపు పూర్తిగా ఒరిగిపోయింది. బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఈ ఘటనలో డ్రైవరు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఫ్లైఓవర్ బ్రిడ్జి మీదుగా వచ్చిన వ్యాన్ పాత బస్టాండు వైపు వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వ్యాన్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. రైలు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి రాయగడ: రైలు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. జిల్లాలోని కాసీపూర్ సమితి టికిరి రైల్వే స్టేషన్‌లోని మూడో నంబర్ ప్లాట్ఫారం వద్ద బుధవారం తెల్లవారున ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడుకి 55 ఏళ్ల వయసు ఉంటుందని.. అతని వివరాలు తెలియాల్సి ఉందని రైల్వే పోలీస్ వర్గాలు తెలిపాయి. ఇది ప్రమాదవశాత్తు జరగిన ఘటనా.. లేక ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలొ రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
పూరీలో త్వరలో క్యూలైన్ దర్శనం
● పార్లమెంటులో రథ చక్రాల ప్రదర్శన ● 14 ఉప సంఘాలు ఏర్పాటు ● శ్రీ మందిరం పాలక మండలి తొలి సమావేశంలో పలు నిర్ణయాలుసమావేశమైన శ్రీ మందిరం కొత్త పాలక మండలిభువనేశ్వర్: కొత్తగా ఏర్పడిన పూరీ శ్రీ మందిర్ కమిటీ పాలక మండలి తొలి సమావేశం బుధవారం జరిగింది. పూరీలోని నీలాద్రి భక్త నివాస్ సమావేశం హాలులో గజపతి మహా రాజా దివ్య సింగ్ దేవ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా గతంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో తీర్మానాల్ని ఆమోదించినట్లు ప్రకటించారు. భారత పార్లమెంట్ భవనం ఆవరణలో జగన్నాథ రథ చక్రాల ప్రదర్శనకు పాలక మండలి ఆమోదం తెలిపింది. ఉప కమిటీల ఏర్పాటు, భక్తుల కోసం క్యూ వ్యవస్థను అమలు చేయడం, రత్న భాండాగారంలో విలువైన ఆభరణాలు, నగలు, పాత్రలు తదితర అమూల్య సంపద నిర్వహణ, ధృవీకరణ వంటి అనేక కీలక అంశాలపై చర్చించారు. ఆలయ పాలన, భద్రత, ఆచారాలు సజావుగా సాగడానికి సంబంధించిన ఇతర ముఖ్యమైన విషయాలను చర్చించారు. వరుస దర్శనం.. శ్రీమందిరం రత్నవేదికపై కొలువుదీరిన చతుర్థామూర్తుల్ని భక్తుల్ని దర్శించుకునేందుకు వరుస దర్శనం(క్యూలైన్) వ్యవస్థ ప్రతిపాదనకు కొత్త పాలక మండలి ఆమోదించింది. శ్రీ మందిరం లోపల నాట్య మండపం ప్రాంగణంలో దీని కోసం ప్రత్యేక వ్యవస్థ ప్రవేశ పెడతారు. తొలి దశలో లాంఛనంగా ఈ విధానం ప్రవేశ పెట్టాలని తీర్మానించారు. కలెక్టర్, ఎస్పీ, ఒడిశా వంతెనల నిర్మాణం సంస్థ, భారత పురావస్తు శాఖ నుంచి సమగ్రంగా ఐదుగురు సభ్యులతో కూడిన ప్రతినిధి బృందం వరుస దర్శన విషయాన్ని సమీక్షిస్తుంది. శ్రీ మందిర్ అభివృద్ధికి, భక్తులకు సజావుగా దర్శనం కల్పించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తామని ఆలయ పాలక మండలి సభ్యుడు సిద్ధేశ్వర్ మహాపాత్రో ఆశాభావం వ్యక్తం చేశారు. ● ఆలయంలోని వివిధ పనుల కోసం 14 ఉపకమిటీలను ఏర్పాటు చేశారు. వాటిలో కలెక్టర్ అధ్యక్షతన సంస్థాగత, జగన్నాథ్ తత్వ పరిశోధన, ప్రచురణ ఉప సంఘం, జగన్నాథ ఆలయ పెన్షన్ ట్రస్ట్ బోర్డు ఉప సంఘాలు, ఆలయంలో కళాత్మక శిల్పాల పరిశీలన కోసం సాంస్కృతిక ప్రాజెక్ట్ ఉప సంఘం, భూమి, ఆర్థిక, సేవలు, రత్న భాండాగారం, అప్పీల్ ఉప కమిటీలు ప్రధానమైనవిగా పేర్కొన్నారు. గిరీష్ చంద్ర ముర్ము చైర్మన్ అధ్యక్షతన ఆలయ రక్షణ కోసం తొలిసారిగా ఏర్పాటు చేసిన కొత్త ఉపసంఘంలో స్థానిక జిల్లా కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్, సేవాయత్‌లు సభ్యులుగా ఉంటారు. దివ్యాంగుల సౌలభ్యానికి ఉత్తర ద్వారం వద్ద ర్యాంప్‌ల ఏర్పాటు కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. సమావేశంలో శ్రీ మందిరం ప్రధాన పాలన అధికారి డాక్టరు అరవింద కుమార్ పాఽఢి, పూరీ జిల్లా కలెక్టర్ దివ్య జ్యోతి పరిడా, పోలీసు సూపరింటెండెంట్ ప్రతీక్ సింగ్‌తో పాటు పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. -
కార్యకర్తల అభిప్రాయాలకే పెద్దపీట
● ఏఐసీసీ పరిశీలకుడు కుసుం కుమార్కొరాపుట్: కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తల అభిప్రాయాలకే పెద్ద పీట వేస్తామని ఏఐసీసీ పరిశీలకుడు జెట్టి కుసుం కుమార్ (హైదరాబాద్) ప్రకటించారు. బుధవారం నబరంగ్‌పూర్ జిల్లా డాబుగాం, కొసాగుమ్డ, పపడాహండి సమితి కేంద్రాలలో పార్టీ కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించి మాట్లాడారు. కిందిస్థాయి నుంచి ప్రతి కార్యకర్త అభిప్రాయం పరిగణనలోనికి తీసుకోవడానికే రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖార్గేలు తనను పంపించారన్నారు. పార్టీ అధిష్టానం కిందిస్థాయి కార్యకర్తలకు పెద్ద పీట వేస్తుందన్నారు. అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా కార్యకర్తల వద్దకే వెళ్లి సమితి అధ్యక్షులు, జిల్లా అధ్యక్షుడు పదవుల ఎంపిక చేస్తున్నామన్నారు. కార్యకర్తలు ఎటువైపు మెగ్గు చూపితే వారే అధ్యక్షులు అవుతారన్నారు. ఇందులో ఎటువంటి లాభీలు గానీ, సిఫార్స్‌లు గాని చెల్లవన్నారు.అధ్యక్షులు అయ్యే వారి గత చరిత్ర కూడా పరిగణలోనికి తీసుకుంటున్నామన్నారు. కొత్త అధ్యక్షులు రానున్న మూడంచెల పంచాయతీ ఎన్నికలు, తర్వాత పురపాలక ఎన్నికలో సత్తా చూపాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే ఎన్నికలను ఎదుర్కొనే సత్తా ఉన్నవారికే అధిక ప్రాధాన్యం ఇస్తామని కుసుం కుమార్ ప్రకటించారు. మూడు సభలలో కార్యకర్తలతో విడివిడిగా మాట్లాడారు. వారితో కలసి సహపంక్తి భోజనాలు చేశారు. తనదైన శైలిలో పార్టీలో గతంలో జరిగిన సంఘటనలు వెలికి తీశారు. ఈ సమావేశాల్లో మాజీ ఎంఎల్ఏ భుజబల్ మజ్జి, నాయకులు క్రుష్ట కులదీప్, గెంబలి సాయిరాజ్ పాల్గొన్నారు. -
పురుగు మందు తాగి వివాహిత ఆత్మహత్య
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి టిగల్ పంచాయతీ కటమెట్ల గ్రామానికి చెందిన రామే మాడ్కమి (50) అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. కనిమెట్లలో నివాసం ఉంటున్న పెంట మాడ్కమి భార్య మంగళవారం రామే మాడ్కమి రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసింది. అందరూ నిద్రపోయిన తరువాత వ్యవసాయం కోసం తెచ్చిన పురుగు మందును తాగింది. నిద్ర మధ్యలో లేచిన భర్త చూసి కిందపడి ఉన్న భార్యను చూశాడు. వెంటనే కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం మృతి చెందింది. ఎం.వి–79 పోలీస్ ఐఐసీ కృష్ణకాంత్ తండి ఆరోగ్య కేంద్రానికి చేరుకొని కేసు నమోదు చేశారు. భర్తను విచారించగా.. ఎందుకు ఇలా జరిగిందో తెలియదన్నాడు. ఆమె మృతిపై దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని ఐఐసీ తెలిపారు. -
యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా రమేష్
కొరాపుట్: జయపూర్ విధాన సభ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎ.రమేష్ రావు (చిన్ను) నియమితులయ్యారు. బుధవారం ఆ పార్టీ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రంజిత్ పాత్రో కొన్ని జిల్లాలకు సంబంధించి విధాన సభ యువజన కాంగ్రెస్ అధ్యక్షులను నియమించారు. అందులో రమేష్ పేరు కూడా ప్రకటించారు. గత 15 సంవత్సరాలు జయపూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీలో రమేష్ సేవలు అందిస్తున్నారు. రమేష్‌ను జయపూర్ ఎమ్మెల్యే తారా ప్రసాద్ బాహీణిపతి, కొరాపుట్ జిల్లా ఐఎన్టీయూసీ ప్రెసిడెంట్ భగవాన్ భాహీణిపతి అభినందించారు. ఉప్పొంగిన గుమ్మగెడ్డ పర్లాకిమిడి: గత వారం రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలకు రాణిపేట రోడ్డులో గల గుమ్మగెడ్డ పొర్లి పొంగుతోంది. పర్లాకిమిడి నుంచి గుమ్మగెడ్డ వరదనీరు ఆంధ్రప్రదేశ్‌లోని పాతపట్నం మండలంలో గల బైదలాపురం, రోంపివలస, అనంతగిరి గ్రామాలకు ప్రవహిస్తోంది. గజపతి జిల్లాలో వంశధార, మహేంద్రతనయ నదులు కూడా వరదనీరుతో నిండడంతో రైతులు ఉభాలకు సిద్ధమవుతున్నారు. సహాయక చర్యల్లో ఎలైట్ కే9 స్క్వాడ్ భువనేశ్వర్: రాష్ట్ర అగ్నిమాపక విభాగం సహాయక చర్యల్లో ఎలైట్ కే9 స్క్వాడ్ మోహరించారు. శోధన, రక్షణ వంటి కీలక కార్యకలాపాల్లో పోలీసులు, అగ్నిమాపక, అత్యవసర సిబ్బందికి సహాయకంగా కే9 జాగిలాల ప్రత్యేక బృందం గుర్తింపు పొందింది. ఆదిత్యుని సన్నిధిలో ప్రభాస్ శ్రీను అరసవల్లి: ప్రసిద్ధ సూర్యనారాయణ స్వామివారిని సినీ నటుడు పీరు శ్రీనివాస్ (ప్రభాస్ శ్రీను) బుధవారం మధ్యాహ్నం దర్శించుకున్నారు. హైదరాబాద్‌లోని తన స్నేహితులతో పాటు నరసన్నపేటలో వినాయక చవితి మహోత్సవాలకు హాజరైన ప్రభాస్ శ్రీను.. ఆదిత్యున్ని దర్శించుకొని ఆలయ విశేషాలను స్నేహితులకు వివరించారు. ఈ సందర్భంగా వీరికి ఆలయ సిబ్బంది ప్రత్యేక స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. ఆలయ అర్చకులు ఇప్పిలి రంజిత్ శర్మ, సాందీప్శర్మల బృందం వారికి వేదాశీర్వచనాన్ని, ప్రసాదాలను అందజేశారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి శ్రీకాకుళం అర్బన్: జిల్లాలోని అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.కల్యాణి, డి.సుధలు కోరారు. శ్రీకాకుళం 80 అడుగుల రోడ్డులోని ఐసీడీఎస్ కార్యాలయంలో బుధవారం ఐసీడీఎస్ పీడీ ఐ.విమల అధ్యక్షతన జిల్లాలోని 16 ప్రాజెక్టుల అధ్యక్ష, కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని 16 ప్రాజెక్టుల పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో నెలకొన్న సమస్యలను పీడీ విమల దృష్టికి తీసుకొచ్చారు. పీడీ విమల మాట్లాడుతూ.. తన పరిధిలోని సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని, రాష్ట్రస్థాయి సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నారు. అంగన్వాడీ ఉద్యోగులు సక్రమంగా పనిచేయాలని, అంగన్వాడీ కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచాలని, ప్రీస్కూల్ పిల్లల శాతం పెంచాలని సూచించారు. అలాగే అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీరు పరిశుభ్రంగా ఉన్నదీ.. లేనిదీ సమీప సచివాలయాల్లో పరీక్ష చేయించి, ఆ నివేదికలను ప్రతివారం తనకు ఇవ్వాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల పరిధిలోని లబ్ధిదారులందరికీ సక్రమంగా పౌష్టికాహారం పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ల నాయకులు కె.సుజాత, పి.లతాదేవి, జె.కాంచన, బి.శాంతమణి, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు పాల్గొన్నారు. పారిశ్రామికవేత్తలుగా అభివృద్ధి చెందాలి సోంపేట: స్వయం శక్తి సంఘాల మహిళలు పారిశ్రామికవేత్తలుగా అభివృద్ధి చెందాలని డీఆర్డీఏ పీడీ కిరణ్‌కుమార్ అన్నారు. మండలంలోని మూలపొలం గ్రామంలో సముద్రపు నాచు పెంచే విధానంపై మత్స్యశాఖ, సెర్ప్, డీఆర్డీఏ ఆధ్వర్యంలో బుధవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ సముద్రపు నాచుతో అధిక ఆదాయం పొందవచ్చునని తెలియజేశారు. గతంలో చేపల పెంపకం నిర్వహిస్తున్న మహిళలు, ప్రస్తుతం సముద్రపు నాచు పెంపకంపై దృష్టి పెట్టాలన్నారు. -
భద్రం బీ కేర్ ఫుల్ బ్రదరూ..!
● రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు ● ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో మోసాలు ● అప్రమత్తంగా లేకుంటే ఖాతాలు ఖాళీ రూ.2 లక్షలు, రూ.3 లక్షలు.. ఇలా వేస్తూనే ఉన్నాడు.. విత్‌డ్రా ఆప్షన్లో డబ్బులు అదనంగా కనిపిస్తుండడం తన అకౌంట్లో యాడ్ అవుతున్నట్లు ఆశ పుట్టింది. అలా ఒక రూ.15 లక్షల వరకు వేశాడు. డబ్బులైతే ఆప్షన్లో కనిపించి విత్ డ్రా అవ్వకపోవడంతో అపరిచిత వ్యక్తిని అడగగా.. మీరు కడుతుంటే ఒకేసారి వస్తాయనడంతో రూ.37 లక్షల వరకు కట్టేశాడు. కానీ అప్పటికీ విత్ డ్రా అవ్వకపోవడంతో పాటు అపరిచిత వ్యక్తికి ఫోన్‌చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. గ్రూపులో కూడా వైద్యుడిని రిమూవ్వ్ చేసేశారు. ఇక చేసేదేమీలేక వైద్యుడు పోలీసులను ఆశ్రయించాడు. ● ఇదే తరహాలో కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్‌లో ఆర్మీకి చెందిన ఒక వ్యక్తి రూ.కోటికి పైగా సైబరాసురుల చేతిలో నష్టపోయానని ఫిర్యాదు చేయడంతో భారీ అమౌంట్ కావడంతో విచారణ చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నా.. ఇప్పటివరకు కేసు అయితే నమోదు చేయలేకపోయారు. ● రణస్థలం మండలం కొచ్చెర్ల గ్రామానికి చెందిన దుంప కృష్ణ చిత్తూరు జిల్లా మెట్టూరు ఎస్బీఐలో ఒప్పంద ఉద్యోగిగా చేస్తున్నాడు. వాట్సాప్ ద్వారా వచ్చే వీడియోలు చూసి సబ్‌స్క్రైబ్ చేసుకున్న కృష్ణకు సైబర్ కేటుగాళ్లు టెలిగ్రామ్ ద్వారా లింకులు పంపించి గేమ్‌లు ఆడించారు. బహుమతులు, డబ్బులొస్తున్నట్లు ఆన్లైన్లో చూపించడంతో కృష్ణ రూ.11.50 లక్షల వరకు ట్రేడింగ్ చేశాడు. చివరికి డబ్బులు ఎంతకీ అకౌంట్లో పడకపోవడంతో జేఆర్‌పురం పోలీసులకు ఫిర్యాదు చేయగా జీరో అఫైర్ నమోదు చేసి చిత్తూరు జిల్లా మెట్టూరుకు కేసు బదిలీ చేశారు. కేసులు నమోదు చేయలేని స్థితి ఈ తరహానే కాకుండా వివిధ సైబర్ మోసాలపై జిల్లాలో భారీస్థాయిలో కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. ఒక్కో స్టేషన్లో 4 నుంచి 6 వరకు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. మోసం చేసే కేటుగాళ్లు వివిధ రాష్ట్రాలు, దేశాలు వారు కావడంతో అక్కడికి వెళ్లి ఆ అధికారులతో సమన్వయం చేసుకుని నోటీసులిచ్చేవరకే చేయగలుగుతున్నారు. ఈలోగా దారి ఖర్చులు, వసతి ఖర్చులు అన్నీ వీరిపైనే భారంగా పడుతున్నాయి. పోనీ కోర్టు వరకు నేరస్తులు వస్తున్నారంటే అదీ లేదు. ఒకట్రెండు సార్లు వచ్చీ ఆ తర్వాత వారి జాడే కనిపించనంతగా మాయమవుతున్నారు. దీంతో ఇటువంటి కేసులు కట్టాలంటేనే తమకు తలనొప్పిగా మారుతున్నాయంటూ కొంతమంది పోలీసు అధికారులే చెబుతుండడం శోచనీయం. శ్రీకాకుళం క్రైమ్: పెరుగుతున్న సాంకేతికతతో పాటు రోజురోజుకీ సైబర్ మోసాలు పెచ్చుమీరుతున్నాయి. రోజుకో మోసంతో సైబరాసురులు రూ.కోట్లలో భారీగా సొమ్ము కొల్లగొడుతున్నారు. కొన్నేళ్ల క్రితం వరకు పట్టిపీడించిన ఆన్లైన్ ట్రేడింగ్ మోసాలే ప్రస్తుతం ట్రెండింగ్‌లో నిలుస్తున్నాయి. ప్రముఖ వైద్యులు, ఉపాధ్యాయ, రాజకీయ, వ్యాపారవర్గాలు, ఇంజినీర్లు సైతం సైబర్ కేటుగాళ్ల వలలో చిక్కుకొని దారుణంగా మోసపోతున్నారు. మోసపోయాక పరువు పోతుందేమోనని కొందరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయకపోయినా.. మరికొందరు భారీ అమౌంట్లు కావడంతో నేరుగా జిల్లా ఉన్నతాధికారి వద్దకు వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు. అయినప్పటికీ లెక్కకు మించి సైబర్ కేసులు వివిధ స్టేషన్లలో పెండింగ్‌లోనే ఉంటున్నాయి. మరికొన్ని స్టేషన్లలో అయితే కనీసం కేసు కట్టడానికి సాహసించలేని స్థితిలో ఉండడం గమనార్హం. నమ్మారో.. నట్టేటా మునిగినట్లే.. ● శ్రీకాకుళం సబ్ డివిజన్ కేంద్రంగా ఇటీవల ఒక ప్రముఖ వైద్యుడు ఆన్లైన్ ట్రేడింగ్ పేరిట రూ.37.50 లక్షలు మోసపోయాడు. ఎప్పటినుంచో స్టాక్ మార్కెట్లోనే కాకుండా వివిధ మార్గాల్లో ఆన్లైన్ ట్రేడింగ్ చేస్తున్న ఆ వైద్యుడికి ఒక ఆపరిచిత వ్యక్తి వాట్సాప్ కాల్చేసి చిట్కాలు చెబుతాననడంతో సరే అన్నాడు. ముందుగా ఓ గ్రూపు క్రియేట్ చేసి అందులో సభ్యులను పరిచయం చేశాడు. రూ.10 లక్షలు పెడితే అదనంగా మరో రూ.10 లక్షలు వస్తుందని, రూ.20 లక్షలు పెడితే రూ.20 లక్షలు, రూ.30 లక్షలు పెడితే రూ.30 లక్షలు వస్తుందని మాయమాటలు చెప్పాడు. తన చిట్కాల ద్వారా గ్రూపులో సభ్యులకొస్తున్న అమౌంట్ స్క్రీన్షాట్లు తీసి వైద్యుడికి పెట్టసాగాడు. నమ్మకం కుదిరాక వైద్యుడు పలుమార్లు ప్రస్తుతం సైబర్ నేరాలు జిల్లాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. ప్రజలు అత్యాశతో వారి వలలో పడుతున్నారు. ఆన్లైన్ ట్రేడింగ్, డిజిటల్ అరెస్టు వంటి మోసాలకు ఎక్కువగా చదువుకున్నవారే బలవుతున్నారు. ఎస్పీ మహేశ్వరరెడ్డి ఆదేశాలతో గతంలో కంటే ఇప్పుడు కేసులు ఎక్కువగా నమోదు చేస్తున్నాం. క్షణాల్లో సైబర్ సెల్ నంబర్ 1930కు ఫిర్యాదు చేసి పోలీసులను, బ్యాంకు ప్రతినిధులను సంప్రదిస్తే మంచిది. – డీఎస్పీ వివేకానంద, శ్రీకాకుళం -
రామనగుడలో కలెక్టర్ పర్యటన
రాయగడ: జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి రామనగుడలో బుధవారం పర్యటించారు. సమితి పరిధిలో గల వివిధ అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. ఇందులో భాగంగా సమితి పరిధిలోని కొరడ గ్రామంలో మహిళా సంఘాలు నిర్వహిస్తున్న చింతపండు ప్రక్రియకరణ కేంద్రాన్ని పరిశీలించారు. వారితో కాసేపు మాట్లాడారు. దీని ద్వారా వారు పొందుతున్న లాభాలు గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఖంబాగుడలో పర్యటించిన ఆయన స్వయం సహాయక బృందాలకు చెందిన మహిళలు సాగు చేస్తున్న గులాబీ తోటలను పరిశీలించారు. మహిళల ఆర్థిక సార్ధికారతకు తోడ్పడుతున్న వీటిని చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. రామనగుడలో ఈ– లైబ్రరీ, గొసాయి గులుముండలో ఇండ్రస్ట్రియల్ పార్క్‌ను సందర్శించారు. కుజేంద్రి గ్రామీణ పార్క్‌లో కాసేపు గడిపి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎమాడింగొలో నిర్మితమవుతున్న వంతెనను పరిశీలించారు. పనులపై సంబంధిత శాఖ అధికారులతో చర్చించారు. త్వరితగతిన పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. రామనగుడ బీడీఓ ప్రద్యుమ్న కుమార్ మండ్, తహసీల్దార్ ప్రాణకృష్ణ పాణిగ్రహి, సమితి అధ్యక్షుడు రవినారాయణ గొమాంగొ, తదితరులు పాల్గొన్నారు. -
అండర్ పాసేజ్‌తో అవస్థలు
వజ్రపుకొత్తూరు: నందిగాం మండలంలోని కవిటి అగ్రహారం గ్రామానికి చెందిన ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వే అండర్ పాసేజ్‌లోకి వరద నీరు ఆరు అడుగుల మేర చేరిపోవడంతో గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో గ్రామస్తులు, పాఠశాల విద్యార్థులు స్థానిక రైల్వే ట్రాక్ వద్ద బుధవారం ధర్నా చేపట్టారు. తమ గ్రామానికి వెళ్లేందుకు పాత లెవిల్ క్రాసింగ్ రహదారిని పునరుద్ధరించాలని నినాదాలు చేశారు. రైల్వేశాఖ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే సమస్య పరిష్కరించకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. అండర్ పాసేజ్ నిర్మాణం పూర్తిగా ఫెయిల్ అయిందని, ముందుచూపు లేకుండా నిర్మించారని మండిపడ్డారు. వర్షాకాలం వస్తే ఇదే పరిస్థితి ఉంటోందని, చిన్నపాటి వర్షానికే అండర్ పాసేజ్ నిండిపోయి రాకపోకలు నిలిచిపోవడం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలకు రైలు ట్రాక్ దాటి చిన్నారులు వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని, దీనివలన ప్రమాదాలు జరుగుతున్నాయని వాపోయారు. విషయం తెలుసుకున్న ఆర్పీఎఫ్ పోలీసులు, రైల్వే శాఖ అధికారులు ధర్నా చేస్తున్న ప్రాంతానికి వచ్చి గ్రామస్తులతో చర్చలు జరిపారు. మూడు రోజుల్లో సమస్య పరిస్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు ధర్నా విరమించారు. పెద్ద మోటార్లు తీసుకొచ్చి అండర్ పాసేజ్లో నీటిని తోడే ప్రయత్నాలు రైల్వేశాఖ అధికారులు ముమ్మరం చేశారు. -
ఆహార కమిషన్ సభ్యుల పర్యటన
పర్లాకిమిడి: ఒడిశా ప్రభుత్వ ఆహార కమిషన్ సభ్యులు జిల్లాలోని గుమ్మ, మోహనా సమితి కేంద్రాల్లోని పలు గ్రామాల్లో ఆశ్రమ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను బుధవారం సందర్శించారు. ఈ ఆహార కమిషన్ బృందంలో సభ్యులుగా ప్రియబ్రత సామంతరే, అక్షయ కుమార్ బెహరా, దయానిధి దాస్ ఉన్నారు. వీరు గుమ్మాలో అంగన్వాడీ కేంద్రం, ఆశ్రమ పాఠశాల, బరుంసింగిలో అంగన్వాడీ, భుబునీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సెరంగోలో పుట్టగోడుగుల తయారీ కేంద్రాన్ని పరిశీలించకారు. జాతీయ ఆహార భద్రత, రాష్ట్ర ఆహార భద్రత పథకంలో ఎస్సీ, ఎస్టీ ఆశ్రమ పాఠశాలల్లో మధ్యా హ్న భోజన పథకం అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఆహార భద్రత పథకం కింద ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు మిడ్ డే మీల్ అందించటంలో అధికారులు ముందుండాలని సూచించారు. ఈ బృందం పర్యటనలో సబ్ కలెక్టర్ అనుప్ పండా, జిల్లా సంక్షేమ శాఖ అధికారిని మనోరమా దేవి, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి బిష్ణుచరణ్ పరిడా, అదనపు సీఎస్ఓ సుమాన్ భోంయి, సవ్యసాచి బోస్తియా, గుమ్మా సమితి చైర్మన్ సునేమీ మండల్, బ్లాక్ స్థాయి అధికారులు పాల్గొన్నారు. -
ఎరువుల దుకాణాల్లో తనిఖీలు
జయపురం: జయపురం సబ్ డివిజన్ కొట్పాడ్లో నకిలీ ఎరువులు అమ్ముతున్నారని రైతులు చేస్తున్న ఆరోపణలపై అధికారులు స్పందించారు. రంగులు వేసిన, మట్టి కలిపిన ఎరువులు అమ్ముతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. రైతులు కొందరు అలా రంగులు వేసిన ఎరువులను చూపించారు. జిల్లా కలక్టర్, జిల్లా వ్యవసాయ అధికారుల దృష్టికి ఈ విషయాన్ని రైతులు తీసుకెళ్లారు. లైసెన్స్‌లు లేకుండా నకిలీ ఎరువులు అమ్ముతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. నకిలీ ఎరువులు అమ్ముతున్న దుకాణాదారులను గుర్తించి వారిపై తక్షణ చర్యలు తీసుకుంటామని కలెక్టర్, వ్యవసాయ అధికారులు హామీ ఇచ్చారు. ఆరోపణలు ఉన్న దుకాణాలపై బుధవారం అధికారులు దాడులు నిర్వహించారు. నకిలీ ఎరువులు అమ్ముతున్న వ్యాపారులపై కేసులు నమోదు చేసి షాపులు సీజ్ చేశారు. ఇది ఇలా ఉండగా కొద్ది రోజుల కిందట బొరిగుమ్మ, తదితర ప్రాంతాల్లో తహసీల్దార్, వ్యవసాయ అధికారులు నకిలీ ఎరువులు అమ్ముతున్న దుకాణాలపై దాడులు నిర్వహించారని, మూసి ఉన్న షాపులకు తాళాలు వేశారని, వ్యాపారుల గొదాములపై దాడులు జరపలేదని రైతులు ఆరోపిస్తున్నారు. షాపులతోపాటు గొదాముల్లో దాడులు జరిపి ఎరువులను పరీక్షించాలని, నకిలీ ఎరువులు బయట పడితే ఆయా గిడ్డంగుల యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
ఆచూకీ కోసం దర్యాప్తు ముమ్మరం
నరసన్నపేట: స్థానిక లక్ష్మున్నపేటకు చెందిన వ్యాపారి వెంకట పార్వతీశం గుప్త ఆచూకీ కోసం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. టెక్కలి డీఎస్పీ లక్ష్మణరావు నరసన్నపేట సీఐ ఆఫీస్‌లో మకాం వేసి దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. బుధవారం ఉదయం నుంచీ డీఎస్పీ నరసన్నపేటలోనే ఉన్నారు. వినాయక చవితి ముందు రోజు ఈనెల 26వ తేదీన ఇంటి నుంచి వెళ్లిన గుప్త ఇంతవరకూ ఇంటికి రాలేదు. దీంతో నరసన్నపేట పోలీసులకు గుప్త సోదరుడు మన్మథరావు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మొదట్లో కేసు నమోదు చేయడంలో స్థానిక పోలీసులు జాప్యం చేశారు. ఆ తర్వాత మాత్రం కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. సీఐ ఎం.శ్రీనివాసరావు, నరసన్నపేట, పోలాకి ఎస్ఐలు సీహెచ్ దుర్గాప్రసాద్, రంజిత్‌లతో పాటు సిబ్బంది దర్యాప్తులో భాగస్వాములయ్యారు. సీసీ ఫుటేజీ పరిశీలన జాతీయ రహదారిపై, టోల్గేట్లు వద్దనున్న సీసీ టీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. అదేరోజు సాయంత్రం 2 గంటల నుంచి 4 గంటల సమయంలో తిరుగు ప్రయాణం అయినట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. మడపాం టోల్గేట్ వద్దకు వచ్చేసరికి కారులో డ్రైవర్ తప్ప గుప్త లేరని సమాచారం. ఈ మేరకు మడపాం టోల్గేట్ సీసీ ఫుటేజీతో పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే గుప్తను నరసన్నపేటలో దించానని డ్రైవర్ చెప్తుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతో డ్రైవర్‌ను అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. బంగారు ఆభరణాలు తీసుకురావడానికి కారులో విశాఖ వెళ్లిన గుప్త, కేజీకి పైగా బంగారు ఆభరణాలు తీసుకొని తిరుగు ప్రయాణమయ్యారని తెలుస్తోంది. తిరుగు ప్రయాణంలో గుప్త ఏమయ్యారో.. బంగారు ఆభరణాలు ఏమయ్యాయి అనేది తెలియడం లేదు. -
వేరుశనగ రైతులకు డబ్బులు చెల్లించాలి
జయపురం: జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడ సమితి మండీలో వేరుశనగ కాయలు (చీనా బాదమ్) విక్రయించి మూడు నెలలు గడచినా లేంప్స్వారు డబ్బులు చెల్లించ లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను కొరాపుట్ ఎమ్మెల్యే రఘునాథ్ మచ్చ తెలియజేశారు. లేంప్ కార్యాలయానికి ఎమ్మెల్యే బుధవారం వెళ్లారు. వేరుశనగ రైతులకు వెంటనే డబ్బులు చెల్లించాలని, లేకపోతే లేంపు కార్యాలయానికి తాళాలు వేస్తామని అధికారులను హెచ్చరించారు. బొయిపరిగుడ సమితి బొదాపుట్, దసమంతపూర్ పంచాయతీల్లో వందలాది మంది రైతులు వేరుశనగ పంట పండిస్తున్నారు. వేరుశనగ పంట పండిన తరువాత మూడు నెలల కిందట బొయిపరిగుడ లేంప్స్ మండీలో అమ్మారు. మండీలో అమ్మిన 24 గంటలలో రైతుల బ్యాంక్ ఖాతాలలో డబ్బులు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలున్నాయి. బొయిపరిగుడ లేంప్స్ అధికారులు మూడు నెలలు గడచినా డబ్బులు వేయలేదు. రైతులు ఎన్ని పర్యాయాలు లేంప్స్ అధికారులను కలిసి డబ్బులు చెల్లించాలని విజ్ఞప్తులు చేసినా వినిపించుకోవటం లేదని ఆరోపించారు. గత కలెక్టర్ నిర్వహించిన వినతుల శిబిరంలో ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. కుసపార, పకులి, పొడా, బారువ, పొట్రగుడ, దొరాగుడ తదితర గ్రామాల రైతులు తమ సమస్యలను కలెక్టర్‌కు విన్నవించుకున్నా నేటివరకు లేంప్స్ వారు రైతులుకు డబ్బులు చెల్లంచలేదు. ఆఖరికి కొరాపుట్ ఎమ్మెల్యే బొయిపరిగుడ లేంప్స్ కార్యాలయానికి వచ్చి ఎండీ రబినారాయణ మిశ్రను కలిశారు. ఏ జిల్లాలో కూడా ఇటువంటి సమస్య లేదని, ఎందుకు బొయిపరిగుడ సమితిలో రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఎండీని ఎమ్మెల్యే ప్రశ్నించారు. వెంటనే రైతులుకు వారి ఖాతాల్లో డబ్బులు వేయాలని, లేకపోతే లేంప్స్ కార్యాలయానికి తళాలు వేస్తామని హెచ్చరించారు. -
పార్టీ పటిష్టతకు కృషి చేసినవారికే పగ్గాలు
రాయగడ: కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కృషి చేసినవారికే డీసీసీ పగ్గాలు అప్పగించేందుకు అధిష్టానం యోచిస్తోందని బెంగుళూర్ శివాజీనగర్ ఎమ్మెల్యే, ఏఐసీసీ పరిశీలకుడు రిజ్వాన్ అర్షద్ స్పష్టం చేశారు. రాయగడలో మంగళవారం పర్యటించిన ఆయన ఈ మేరకు స్థానిక మున్సిపాలిటీ టౌన్ హాల్లో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌కు కంచుకోటగా నిలిచే రాయగడ వంటి జిల్లాలో పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే నాయకుడికే డీసీసీ పగ్గాలను అధిష్టానం ఇస్తుందన్నారు. ఈ మేరకు అధిష్టానం ఆదేశాల మేరకు ఈ జిల్లాలో తాను ఆరు రోజుల పాటుగా పర్యటించి కార్యకర్తలతో సమావేశమై తుది నివేదికను అధిష్టానానికి సమర్పించనున్నట్లు పేర్కొన్నారు. రానున్న ఎన్నికల దృష్ట్యా పార్టీని పటిష్టపరచాలనే ఉద్దేశంతో అధిష్టానం తనను జిల్లాలో పర్యటించేందుకు అదేశించిందని వివరించారు. జిల్లాలోని 11 సమితుల్లో పర్యటించి కార్యకర్తల మనోభావాలను తెలుసుకుంటానన్నారు. సత్తా చాటుతాం ఒడిశా రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపాలిటీ, పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతుందని అర్షద్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందన్నారు. ప్రతీ జిల్లాలో పార్టీ పటిష్టతకు వ్యూహాత్మకంగా పార్టీ ముందుకెళ్తుందని పేర్కొన్నారు. గడిచిన రెండు దశాబ్ధాలకు పైగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేడీతో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. ప్రస్తుతం అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం తీరు కూడా అలాగే ఉందని ఎద్దేవా చేశారు. ఆయనతో పాటు పీసీసీ పరిశీలకులు చిన్మయ్ సుందర్ దాస్, అఖిల్ భొత్ర తదితరులు పాల్గొన్నారు. సమష్టిగా పనిచేయండి కాంగ్రెస్ పార్టీ విజయానికి అందరూ సమష్టిగా పనిచేయాలని కార్యకర్తలకు రిజ్వాన్ పిలుపునిచ్చారు. అంతకుముందు జరిగిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. వ్యక్తిగత విమర్శలకు తావివ్వకుండా పార్టీ అభివృద్ధికి సైనికుల్లా పనిచేయాలని సూచించారు. గత సాధారణ ఎన్నికల్లో రాయగడ జిల్లాలో మూడు అసెంబ్లీ స్థానాలతో పాటు కొరాపుట్ లోక్‌సభ స్థానం కూడా కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేయడం శుభసూచికమని పేర్కొన్నారు. సమావేశంలో డీసీసీ తాత్కాలిక అధ్యక్షుడు దుర్గాప్రసాద్ పండ, రాయగడ ఎమ్మెల్యే అప్పలస్వామి కడ్రక, గుణుపూర్ ఎమ్మెల్యే సత్యజీత్ గొమాంగో తదితరులు పాల్గొన్నారు. ఏఐసీసీ పరిశీలకుడు రిజ్వాన్ అర్షద్ -
దోపిడీ కేసులో ఏడుగురు అరెస్టు
రాయగడ: సదరు పోలీస్‌స్టేషన్ పరిధి రఫ్కొన కూడలిలో సోమవారం జరిగిన దోపిడీ కేసులో ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఆరు సెల్ఫోన్లు, రూ.2.83 లక్షల నగదుతో పాటు దోపిడీకి వినియోగించే బొలేరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు మంగళవారం సదరు పోలీస్‌స్టేషన్ ప్రాంగణంలో ఏఎస్పీ అమూల్య కుమార్ దళ్, ఐఐసీ ప్రసన్న కుమార్ బెహరలు నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఇదీ విషయం.. గజపతి జిల్లా గారబంద పోలీస్‌స్టేషన్ పరిధి లాబయగడ గ్రామానికి చెందిన టి.ఉమారెడ్డి అనే వ్యక్తి తన ఇద్దరు మిత్రులతో కలిసి కారులో జయపురం నుంచి రాయగడకు రూ.9 లక్షల నగదుతో సోమవారం వస్తున్నాడు. ఆ సమయంలో రఫ్కొన కూడలిలో సునితా నాయక్ అనే మహిళ హోంగార్డు దుస్తుల్లో కారు ఎదురుగా నిలబడి ఆపింది. కారులో ప్రయాణిస్తున్న వారితో మాట్లాడుతున్న సమయంలో ఒక బొలేరోలో మరో ఏడుగురు వ్యక్తులు అక్కడికి చేరుకున్నారు. వారిలో నలుగురు హోంగార్డు దుస్తులతో ఉన్నారు. వీరంతా బాధితుడు ఉమారెడ్డిని బెదిరించి ఇంత మొత్తం నగదు ఎక్కడికి తీసుకెళ్తున్నారని ప్రశ్నించారు. వెంటనే ఎస్పీ కార్యాలయానికి రమ్మని చెప్పి తమ వెంట తీసుకొచ్చిన బొలేరోలొ ఉమారెడ్డిని కొంతదూరం వరకు తీసుకెళ్లారు. అనంతరం ఒక ప్రాంతంలో సునీత అనే మహిళను దింపేసి, తర్వాత ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అతడిని బెదిరించి, రూ.9 లక్షల నగదుతో పాటు 40 గ్రాముల బంగారు చైన్‌ను లాక్కొని అక్కడే ఉమారెడ్డిని విడిచిపెట్టి పరారయ్యారు. దీంతో బాధితుడు సదరు పోలీస్‌స్టేషన్‌లో సోమవారం సాయంత్రం ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ మేరకు దర్యాప్తు చేసి ఏడుగురిని అరెస్టు చేశారు. అరైస్టెనవారిలో జిల్లాలోని బిసంకటక్ బడసాహికి చెందిన హోంగార్డు ఇంద్రమణి కరకరియా, కల్యాణ సింగుపూర్ పల్లిగాం గ్రామానికి చెందిన హోంగార్డు దిలిప్ గరడియా, బడ గ్రామానికి చెందిన తమన ప్రస్కా, హిరా నాయక్ గరాడియా, టికిరి పోలీస్‌స్టేషన్ పరిధిలోని తోటాగుడ గ్రామానికి చెందిన సింహాచల్ మాఝి, రాధిక హల్వ అలియాస్ సునితా హల్వ, ముకేష్ నాగ్లు ఉన్నారు. -
ఎరువుల గోదాములపై ఆకస్మిక దాడులు
రాయగడ: బిసంకటక్‌లోని నాలుగు ఎరువుల గోదాముల్లో అధికారులు ఆకస్మిక దాడులను నిర్వహించారు. ప్రభుత్వ నిర్ధారిత ధర కన్నా అధికంగా వ్యాపారులు విక్రయిస్తూ రైతులను మోసగిస్తున్నారనే ఆరోపణల మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు అధికారులు పేర్కొన్నారు. దాడుల్లో భాగంగా ముగ్గురు గోదాముల నిర్వాహకులకు నోటీసులను జారీ చేశారు. బిసంకటక్ తహసీల్దార్ కె.వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో బిసంకటక్ సమితి వ్యవసాయ శాఖ అధికారి ఘనస్యామ్ హుయిక, పోలీసులతో ఏర్పాటైన ప్రత్యేక స్క్వాడ్ ఈ మేరకు సోమవారం దాడులను చేపట్టింది. గోదాముల్లో నిల్వ ఉంచిన ఎరువుల వివరాలను సేకరించిన అధికారులు అందుకు సంబంధించిన అనుమతి పత్రాలను తనిఖీ చేశారు. సూర్య నారాయణ త్రిపాఠి మృతి కొరాపుట్: ప్రతిపక్ష బిజూ జనతా దళ్ వ్యవస్థాపక సభ్యుడు, పార్టీ సీనియర్ నాయకుడు సూర్య నారాయణ త్రిపాఠి(72) మృతి చెందారు. మంగళవారం రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లో అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. అనంతరం మృతదేహాన్ని స్వస్థలం నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రానికి తరలించారు. పాతికేళ్ల క్రితం జనతా దళ్ నుంచి విడిపోయి బిజూ జనతా దళ్ పార్టీ ఆవిర్భవించింది. దీంతో ఆరోజుల్లో నబరంగ్‌పూర్ జిల్లాలో పార్టీ అభివృద్ధికి సూర్య నారాయణ ఎంతోకృషి చేశారు. న్యాయవాదిగా ప్రజా సమస్యలపై లేఖాస్త్రాలతో పోరాటంలో చేయడంలో పేరు సంపాదించారు. మృతదేహానికి బీజేడీ రాజ్యసభ ఎంపీ మున్నా ఖాన్, మాజీ మంత్రి రమేష్ చంద్ర మజ్జి, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు జడేశ్వర్ ఖడంగా, ప్రకాష్ మిశ్ర తదితరులు నివాళులర్పించారు. సెంచూరియన్‌లో అవగాహన సదస్సు పర్లాకిమిడి: పట్టణానికి సమీపంలోని ఆర్.సీతాపురం సెంచూరియన్ వర్సిటీలో మానసిక ఆరోగ్యం, ఆత్మహత్యల నివారణపై అవగాహన సదస్సును ఎస్పీ జ్యోతింద్ర పండా ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిల భారత ప్రజాస్వామ్య మహిళా సమాఖ్య అధ్యక్షురాలు తపస్తా ప్రహరాజ్ మాట్లాడుతూ.. సున్నితమైన యువత మానసికంగా కృంగిపోయి ఆత్మహత్యలకు పాల్పడకుండా పెద్దలు, విద్యాసంస్థలు, అధికారులు మద్దతు ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ డా.అనితా పాత్రో తదితరులు పాల్గొన్నారు. పట్టుబడిన మహిళా దొంగలు భువనేశ్వర్: రైలులో ప్రయాణికుల నుంచి నగలు, నగదు దోచుకున్న మహిళా దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. బీహార్‌కు చెందిన ముగ్గురు మహిళలు ఈ దొంగతనానికి పాల్పడ్డారు. జార్ఖండ్ నుంచి పూరీకి ప్రయాణిస్తున్న ఒక కుటుంబం నుంచి రూ.17,000ల నగదుతో పాటు 2 మంగళ సూత్రాలు, 3 లాకెట్లను దొంగిలించారు. రైలులో గందరగోళం సృష్టించి వ్యానిటీ బ్యాగ్‌లో దాచుకున్న ఈ సొత్తుని దొంగిలించినట్లు గుర్తించి రైల్వే రక్షక దళం (ఆర్పీఎఫ్) వర్గాలకు సమాచారం అందజేశారు. ప్రభుత్వ రైల్వే పోలీసులతో (జీఆర్పీ) కలిసి వీరు రంగంలోకి దిగి సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గాలించి అదుపులోకి తీసుకుని విచారణ జరిపిన మేరకు అరెస్టు చేశారు. వారి నుంచి దొంగిలించిన నగదు, ఆభరణాలు స్వాధీనపరచుకుని బాధిత వర్గానికి అందజేశారు. -
చెరువులో మునిగి ఒకరు మృతి
జయపురం: ఒక వ్యక్తి దహన సంస్కారాలకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో చెరువులో మునిగి యువకుడు మృతి చెందిన ఘటన జయపురం సబ్ డివిజన్ బొయిపరిగుడ సమితి దశమంతపూర్ పంచాయతీ పండ్రిపొడ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన ఒక వ్యక్తి మరణించడంతో గ్రామస్తులు శ్మశానవాటికకు తీసుకెళ్లారు. వారితో పాటు గుప్త నాయిక్(35) కూడా వెళ్లాడు. దహన సంస్కారాలు అనంతరం గుప్త నాయిక్ ఇంటికి బయల్దేరాడు. అయితే అతడు సాయంత్రం అయినా ఇంటికి రాలేదు. కొడుకు ఇంటికి రాకపోవడంతో అతడి తల్లి పరిసర ప్రాంతాల్లో వెదికింది. గ్రామ సమీపంలోని ఒక చెరువు వద్ద తన కుమారుడి చెప్పులు కనిపించాయి. అనుమానంతో ఆమె గ్రామ ప్రజలకు తెలిపింది. గ్రామ ప్రజలు చెరువులో ఎంత గాలించినా జాడ తెలియలేదు. దీంతో బొయిపరిగుడ అగ్నిమాపక విభాగానికి తెలియజేశారు. అగ్నిమాపక సిబ్బంది చెరువులో మృతదేహాన్ని బయటకు తీశారు. బొయిపరిగుడ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. గుప్త నాయిక్ చెరువులో స్నానానికి దిగి ప్రమాదవశాత్తు మరణించి ఉంటాడనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
బీసీల సమస్యలు పరిష్కరించాలి
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): జిల్లా, నియోజకవర్గాల, మండల కమిటీలు ఏర్పాటు చేసి గ్రామగ్రామాన ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం జెండా ఎగిరేలా కృషి చేయాలని సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 130 బీసీ కులాల అవసరాలు, ఆకాంక్షలు నెరవేర్చి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. బీసీ విద్యార్థుల వసతి గృహాల సమస్యల నుంచి జాతీయస్థాయిలో జనగణన, కుల గణన చేసేవరకు అనేక సమరశీల పోరాటాలు చేసి విజయాలు సాధించగలిగామన్నారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పైడి చందు బీసీ విద్యార్థుల సమస్యల పరిష్కారమే ధ్యేయమన్నారు. సమావేశంలో ఏపీ బీసీ సంక్షేమ సంఘ ఉత్తరాంధ్ర అధ్యక్షుడు కొమ్ము రమణమూర్తి, జిల్లా నాయకులు రత్నాల మురళీమోహన్రావు, బగాది రమణమూర్తి, రాయల రాము, రాజమహంతి భానుచందర్, గానుగుల గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం
టెక్కలి రూరల్: సంత బొమ్మాళి మండలం వడ్డివాడ సమీపంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మురపాల రెయ్యమ్మ(45) అనే మహిళ మృతిచెందింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తంగి రామారావు, మురపాల రెయ్యమ్మలు కలసి ద్విచక్ర వాహనంపై బోరుభద్ర నుంచి సంతబొమ్మాళి వైపు వెళ్తుండగా అదే సమయంలో ముందు వెలుతున్న మరో ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో రెయ్యమ్మ, రామారావులతో పాటు మరో బైకుపై ఉన్న నెయ్యల రామకృష్ణకు సైతం గాయాలయ్యాయి. ముగ్గురినీ కోటబొమ్మాళి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రెయ్యమ్మ మృతిచెందింది. సంతబొమ్మాళి ఎస్ఐ సింహాచలం మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గంజాయి నేరస్తులపై నిఘా శ్రీకాకుళం క్రైమ్ : గంజాయి నేరస్థులపై ప్రత్యేక నిఘా పెట్టాలని, ప్రతి పోలీస్‌స్టేషన్‌లో నమోదైన, పెండింగ్‌లో ఉన్న గంజాయి కేసుల దర్యాప్తు వేగవంతం చే యాలని ఎస్పీ మహేశ్వరరెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయం నుంచి డివిజన్లు, సర్కిళ్లు, స్టేషన్ల వారీగా అధికారులతో సమీక్షించారు. గంజాయి కేసుల దర్యాప్తు, నాన్ బెయిలబుల్ వారెంట్స్ అమలు, పెండింగ్ కారణాలపై ఆరా తీశారు. ఎస్పీతోపాటు డీసీఆర్బీ సీఐ శ్రీనివాసరావు, సైబర్ సెల్ సీఐ శ్రీనివాస్, ఎస్ఐ గోవిందరావు పాల్గొన్నారు. హోంగార్డు కుమారుడికి అభినందనలు.. పాతపట్నం సర్కిల్ కార్యాలయంలో హోంగార్డు చక్క వాసుదేవరావు కుమారుడు శశిధర్‌నాయుడు నీట్ ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఎంబీబీఎస్ సీటు పొందడంతో ఎస్పీ అభినందించారు. అధికార లాంఛనాలతో ఏఎస్ఐ అంత్యక్రియలు నరసన్నపేట: అనారోగ్యంతో మృతి చెందిన పోలాకి ఏఎస్ఐ పి.ఆదినారాయణకు మంగళవారం నరసన్నపేటలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఎస్పీ మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు పోలాకి ఎస్ఐ రంజిత్ తెలిపారు. నరసన్నపేట, పోలాకి పోలీసుస్టేషన్ల సిబ్బంది పాల్గొన్నారు. రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం తిలారు–కోటబొమ్మాళి రైల్వేస్టేషన్ల మధ్య మంగళవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వయస్సు 40 ఏళ్లు పైబడి ఉంటుందని, చేతిపై శ్రీను అనే పచ్చబొట్టు ఉందని తెలిపారు. రైలు నుంచి జారి పడి మృతిచెందాడా.. మరేదైనా కారణం ఉందా అనేది తెలియడం లేదు. వివరాలు తెలిసిన వారు జీఆర్పీ పోలీసులను సంప్రదించాలని జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ సోమేశ్వరరావు పేర్కొన్నారు. అండర్–23 క్రికెట్ జట్టులో హరీష్ హిరమండలం: అండర్–23 విభాగంలో ఓ సంస్థ నిర్వహించే టీ–20 క్రికెట్ మ్యాచ్‌లు ఆడేందుకు టీమిండియాలో గొట్టా గ్రామానికి చెందిన బత్తుల హరీష్ చోటు సంపాదించాడు. నేపాల్‌లో డిసెంబర్ నుంచి జరగనున్న అంతర్జాతీయ టోర్నీలో హరీష్ దేశం తరఫున ప్రాతినిధ్యం వహించనున్నాడు. దీంతో హరీష్‌ను గ్రామపెద్దలతో పాటు గ్రామస్తులు అభినందించారు. గొంతు కోసుకొని వ్యక్తి ఆత్మహత్యాయత్నం పలాస: పలాస కాశీ బుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డుకు చెందిన కోరాడ గవరయ్య (35) మంగళవారం ఉదయం పదునైన చాకుతో గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళం జిల్లా ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు కుటుంబ కలహాలే కారణమని తెలుస్తోంది. లక్ష్మమ్మకు సత్కారం వజ్రపుకొత్తూరు: సుమారు 50 ఏళ్లగా ఎంతోమందికి పురుడు పోసిన అంబటి లక్ష్మమ్మ సేవలు వెలకట్టలేనివని విశ్రాంత ఆర్మీ అధికారి కొయిరి ప్రసాదరావు అన్నారు. మంగళవారం వజ్రపుకొత్తూరు మండలం కొత్తపేటలోని చిన్న వీధిలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా లక్ష్మమ్మ సేవలను గుర్తించి ఘనంగా సన్మానించారు. వైద్యం అందుబాటులో లేని సమయంలో ఉద్దాన, తీర ప్రాంత గ్రామాల్లో ప్రసవ వేదనలో ఉన్న ఎంతో మంది గర్భిణులకు అండగా నిలిచి ప్రతికూల పరిస్థితుల్లో తల్లీబిడ్డల ప్రాణాలను కాపాడారని కొనియాడారు. గ్రామపెద్దలు గాత ముకుందరావు, కె.కొర్లయ్య, కాంతారావు, దాలయ్య, సాధు పాల్గొన్నారు. -
పాడి రైతులను ప్రోత్సహించాలి
● గవర్నర్ కంభంపాటి హరిబాబు భువనేశ్వర్: పాడి రైతులకు ప్రోత్సాహమివ్వాలని గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి సూచించారు. మంగళవారం కటక్ అరిలో ప్రాంతం గోవింద్‌పూర్‌లోని ఓంఫెడ్ మెగా డైరీ ప్లాంట్‌ను సందర్శించిన సందర్భంగా ఆయన అనుబంధ వర్గాలతో ఈ విషయమై లోతుగా చర్చించారు. పాడిరైతు సంక్షేమంతో ముడిపడిన పలు రైతాంగ పథకాలు అమలు చేయడంలో ఎటువంటి అడ్డంకి లేకుండా సత్వర చర్యలు చేపట్టేందుకు సదా అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. రాష్ట్రంలో పాల ఉత్పత్తిని గణనీయంగా పెంపొందించేందుకు ప్రభుత్వ పథకాల అమలు, కార్యాచరణతో రైతాంగానికి ప్రోత్సహించేందుకు బ్యాంకులు ముందడుగు వేయాలని కోరారు. ఇది పాల ఉత్పత్తి మరియు అవసరాల మధ్య అంతరాన్ని పూరించడంతో పెరుగుతున్న అవసరాలను తీర్చడంలో దోహదపడుతుందన్నారు. రైతులకు మద్దతు ఇచ్చే ముఖ్యమంత్రి కామధేను యోజన లబ్ధి పొందడంలో అనుబంధ రైతాంగం ఇబ్బంది పడకుండా పలు వెసులుబాటు సూచనలను గవర్నర్ తెలియజేశారు. ప్రధానమంత్రి ముద్ర యోజన (పీఎంఎంవై)కి అనుసంధానించి బ్యాంకు రుణాలు మంజూరుతో వ్యాపారాలను ప్రారంభించడం, విస్తరించడానికి రైతాంగానికి బలమైన ఆర్థిక వనరుగా ఆయా సంస్థలు చురుకై న పాత్ర పోషించాలన్నారు. లబ్ధిదారుల జాబితాను అందించాలి ముఖ్యమంత్రి కామధేను యోజన కింద లబ్ధిదారుల వివరణాత్మక జాబితాను బ్యాంకులకు అందించాలని గవర్నర్ ఓంఫెడ్ అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో ఏవైనా సమస్యలు తలెత్తితే ఓంఫెడ్ అధికారులు తనను నేరుగా సంప్రదించవచ్చని తెలియజేశారు. గవర్నర్ తన పర్యటనలో భాగంగా ఓంఫెడ్ ప్లాంట్‌లో ప్రయోగశాల, నెయ్యి విభాగం మరియు ఉత్పత్తుల గ్యాలరీతో సహా వివిధ విభాగాలను సందర్శించారు. ఓంఫెడ్ అధికారులు ప్లాంట్ కార్యకలాపాలు, నిర్వహణ, మార్కెటింగ్ వ్యూహాలు మరియు ఉత్పత్తి శ్రేణిపై వివరణాత్మక పవర్ పాయింట్‌ను సమర్పించారు. నగర ప్రాంతాల్లో ఓంఫెడ్ పాలు మరియు ఇతర ఉత్పత్తులను ఇంటి ముంగిటకు చేర్చే విధానాన్ని అమలు చేయాలని గవర్నర్ ప్రోత్సహించారు. మత్స్య, పశు వనరుల అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సురేష్ కుమార్ వశిష్ట్, ఓంఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ విజయ అమృత్ కులంగే, కటక్ జిల్లా కలెక్టర్ దత్తాత్రయ భౌసాహెబ్ షిండే తదితరులు హాజరయ్యారు. -
ఎరువుల దుకాణాల్లో విజిలెన్స్ తనిఖీలు
గార : రామచంద్రాపురం పరిధిలోని నవజ్యోతి, దుర్గా ఎంటర్ప్రైజెస్ ఎరువుల దుకాణాల్లో విజిలెన్స్ అధికారులు మంగళవారం తనిఖీలు చేపట్టారు. దుర్గా షాపు లైసెన్సు రెన్యువల్ ఇంకా జరగకపోవడాన్ని గుర్తించారు. నిల్వ ఉన్న 5.50 మెట్రిక్ టన్నుల డీఏపీ, ఎంవోపీ, సాయిల్ కండీషనర్ ఎరువుల అమ్మకాలు చేపట్టవద్దని ఆదేశాలు జారీచేశారు. ఈ సందర్భంగా విజిలెన్సు సీఐ డి.వి.వి.సతీష్‌కుమార్, వ్యవసాయాధికారి డి.పద్మావతిలు మాట్లాడుతూ ఎరువులు అధిక ధరలకు అమ్మినా, అదనపు ఎరువులతో లింక్పెట్టినా చర్యలు తప్పవని హెచ్చరించారు. -
రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ పోటీల్లో జిల్లాకు పతకాలు
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరిగిన ఫెన్సింగ్ పోటీల్లో జిల్లాకు చెందిన క్రీడాకారులు పతకాలు దక్కించుకున్నారు. గత నెల 30,31 తేదీల్లో ప.గో జిల్లా భీమవరంలో జరిగిన పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచి విజయనగరం జిల్లా కీర్తి ప్రతిష్టలను చాటిచెప్పారు. అంతర్ జిల్లాల పోటీల్లో కె.హిమశ్రీ, పి.తేజస్విని, టి. యమున సిల్వర్ మెడల్స్ సాధించగా..వి.కేసరి డి.ధరహాసిని, టి.భానుమతి బ్రాంజ్ మెడల్స్ దక్కించుకున్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన క్రీడాకారులను కోచ్ డీవీ చారిప్రసాద్, ఫెన్సింగ్ అసోసియేషన్ సభ్యులు దాలిరాజు, పిల్లా శ్రీనివాస్, వెంకటేష్, సతీష్‌కుమార్‌లు అభినందించారు. -
భూగర్భ జలాల స్థాయి జిల్లాలో పెరగాలి
● కలెక్టర్ డాక్టర్ బీఆర్అంబేడ్కర్విజయనగరం అర్బన్: జిల్లాలో భూగర్భ జలాల స్థాయిని పెంచే మార్గాలపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో భూగర్భ జలాల స్థాయిలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూగర్భ జలాల పెంపునకు దోహద పడే ఉపాధి హామీ పథకం ద్వారా చెక్ డ్యాంలను, ఫారం పాండ్స్‌ను వెంటనే చేపట్టాలని అధికారులకు సూచించారు. అందుకు అవసరమయ్యే మంజూరులను తీసుకుని ప్రతిపాదనలను పంపాలని చెప్పారు. జిల్లాలో 3 మీటర్ల లోపల 17 మండలాల్లో, 3 నుంచి 8 మీటర్లలోపు 9 మండలాల్లో, 8 మీటర్ల లోతులో 2 మండలాల్లో భూగర్భజలాల స్థాయి ఉందన్నారు. అయితే జిల్లా సరాసరి 3.80 మీటర్లలోపు ఉంటుందన్నారు. రాష్ట్రంలో బాపట్ల సరాసరి 3.7 మీటర్ల లోతులో ఉంటూ మొదటి స్థానంలో ఉందని, విజయనగరం 2వ స్థానంలో ఉందన్నారు. జిల్లాలో 215 గ్రామాల్లో భూగర్భ నీటి స్థాయి తక్కువగా ఉన్నట్లు గుర్తించామని ఈ గ్రామాల్లో భూగర్భ నీటిస్థాయిని పెంచడానికి వెంటనే ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు. జలవనరుల శాఖ ద్వారా మైనర్ ఇరిగేషన్ ట్యాంక్‌లను క్లీనింగ్ చేయాలని వచ్చే 4 రోజుల్లో 174 చెరువులను పరిశుభ్రం చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో డ్వామా పీడీ శారదాదేవి, ఇరిగేషన్ ఈఈ రమణ, గ్రౌండ్ వాటర్ డీడీ దినకర్ తదితరులు పాల్గొన్నారు. నేడు జిందాల్ సమస్యలపై గ్రామసభ జిందాల్ రైతుల సమస్యల పరిష్కారం కోసం ఎస్.కోట మండలం మూల బొడ్డవర గ్రామంలో బుధవారం కేఆర్ఆర్సీ డిప్యూటీ కలెక్టర్ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ బీఆర్అంబేడ్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు తమ వద్ద నున్న డాక్యుమెంట్ల ఆధారాలతో గ్రామ సభకు హాజరు కావాలని సూచించారు. న్యాయపరంగా రికార్డు పరంగా కచ్చితంగా ఉన్న వారికి అక్కడికక్కడే పరిష్కారం చేయనున్నట్లు తెలిపారు. లేని వారికి కారణాలను తెలియజేయనున్నామని పేర్కొన్నారు. ఈ గ్రామ సభకు తహసీల్దార్‌తో పాటు రెవెన్యూ అధికారులు రికార్డులతో హాజరవుతారని అదేవిధంగా జిందాల్ కంపెనీ వారు కూడా రికార్డులతో హాజరవుతారని కలెక్టర్ తెలిపారు. -
ప్రభుత్వ పాలనపై గుర్రుగా జనసైనికులు
పార్వతీపురం రూరల్: ఎన్నికల సమయంలో తామంతా ఒక్కటే. తమ ఎజెండా ఒక్కటే అంటూ కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చి తీరా ఏడాదిన్నర గడవక ముందే జనసేన నాయకులు బహిరంగంగా విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేసి మరీ స్థానిక టీడీపీ ఎమ్మెల్యే, జిల్లాస్థాయి అధికారుల తీరుపై ప్రజల తరఫున జనసేన ప్రశ్నిస్తుందంటూ ఎండగడుతున్నారు. ఈ మేరకు మంగళవారం పార్వతీపురం నియోజకవర్గం జనసేన ఇన్చార్జ్ ఆదాడ మోహనరావు ఆ పార్టీ అధినేత జన్మదినాన్ని పురస్కరించుకుని కొన్ని కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ స్థానిక నియోజకవర్గ పాలకుల తీరుపై మండిపడ్డారు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల కంటే పార్వతీపురంలో అత్యంత అవినీతి పాలన సాగుతోందని నివేదికలు చెబుతున్నాయన్నారు. ఆరు నెలల క్రితం బడిదేవరకొండ అనుమతులు రద్దుచేయాలని తాము పోరాటం చేస్తే ఆరు నెలల తరువాత స్థానిక ఎమ్మెల్యేకు బడిదేవరకొండ సమస్య గుర్తుకురావడం విడ్డూరంగా ఉందన్నారు. కంపెనీ యాజమాన్యంతో ఇంతవరకు సఖ్యంగా ఉన్న స్థానిక ఎమ్మెల్యే విజయచంద్రకు ఇప్పుడు స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు గుర్తుకురావడం మరింత ఆశ్చర్చకరమన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలం పార్వతీపురంలో చెరువులు అక్రమాలకు గురైతే ఎన్నోమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పత్రికా ముఖంగా నిలదీశారు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో పాలకులు, అధికారులు విఫలమయ్యారన్నారు. జిల్లా కేంద్రంలో మున్సిపాల్టీ ప్రజలకు తాగునీటిని సక్రమంగా సరఫరా చేయలేని దుస్థితిలో జిల్లా యంత్రాంగం, పాలకులు ఉన్నారన్నారు. ఏడాదిన్నరలో మంజూరైన నిధులు ఏం చేశారో తెలియడం లేదని ఆశ్చర్యం వెలిబుచ్చారు. ఇకమీదట పార్టీ అధినేత ఆదేశాలకోసం ఎదురుచూడమని, ఇకనుంచి దోపిడీ పాలనపై ప్రశ్నిస్తామని మోహనరావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో పార్వతీపురంలోనే ఎక్కువ అవినీతి బడిదేవర కొండపై స్థానిక ఎమ్మెల్యే తీరు విడ్డూరం విలేకరుల సమావేశంలో ఎండగట్టిన జనసేన ఇన్చార్జ్ ఆదాడ -
నిరుద్యోగుల నిరీక్షణ
● ఇంటికో ఉద్యోగం లేదా నిరుద్యోగ భృతి ఇస్తామన్న చంద్రబాబు ● ఇంకా అమలు కాని హామీ ● ఆశగా ఎదురు చూస్తున్న యువత రామభద్రపురం: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు ప్రతి ఇంటికో ఉద్యోగం, లేదా నిరుద్యోగులకు రూ.3వేల భృతి ఇస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలో బాగంగా సూపర్ సిక్స్‌లో పథకాల్లో నిరుద్యోగ భృతిని మొదటి హామీగా పేర్కొన్నారు. రోజులు గడుస్తున్నా..ఈ హామీ ఇంకా అమలు కాలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతి ఇంట్లో నిరుద్యోగులు చంద్రబాబు ఇచ్చిన హామీ ఎప్పుడు అమలు చేస్తారా? అసలు చేస్తారా? చేయరా? చేస్తే ఎప్పటి నుంచి అమలు చేస్తారు? ఇంటికో ఉద్యోగం ఇస్తారా? ఒకవేళ నిరుద్యోగ భృతి ఎంత ఇస్తారు? వంటి సందేహాలతో యువత సతమతమవుతున్నారు.అసలు ఎప్పుడు వస్తుందోనని ఆశతో ఎదురుచూస్తున్నారు. సందిగ్ధంలో నిరుద్యోగులు.. 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న టీడీపీ అప్పడు కూడా ఎన్నికల ప్రచారంలో జాబు కావాలంటే..బాబు రావాలి,ఇంటికో ఉద్యోగం లేదంటే ప్రతి నెల రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీలిచ్చింది. కానీ ఎక్కడా ఆ హామీ కార్యరూపం దాల్చలేదు.ఇంటికో ఉద్యోగం మాట దేవుడెరుగు కనీసం నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మొండిచేయి చూపారు. గత అనుభవంతో ఈ సారైనా హామీ అమలు చేస్తారా? లేదా మొండి చెయ్యి చూపిస్తారా? అనే సందిగ్ధంలో నిరుద్యోగులు ఉన్నారు.గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సచివాలయాల వ్యవస్థ ఏర్పాటుతో సుమారు 5 లక్షల మంది నిరుద్యోగులకు కార్యదర్శులు, వలంటీర్లుగా నియమించిన విషయం తెలిసిందే. మరి చంద్రబాబు ప్రభుత్వం ఏమేరకు ఉద్యోగాలు కల్పిస్తుందోనని యువత ఆశగా ఎదురు చూస్తున్నారు. బొబ్బిలి నియోజకవర్గంలో వేలాది మంది ఉన్నత చదువులు అభ్యసించారు. నిరుద్యోగ భృతి కోసం ఎదురుచూస్తున్నారు.కూటమి ప్రభుత్వం నేటికీ స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొంది. -
బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం
● జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి కృష్ణప్రసాద్డెంకాడ: బాల్య వివాహాలు చేయడం నేరమని, చేసిన వారిపై చట్టరీత్యా కేసులు నమోదు చేస్తారని జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్ అన్నారు. ఈ మేరకు డెంకాడ మండలంలోని పెదతాడివాడ గ్రామంలో యూత్‌క్లబ్ బెజ్జిపురం స్వచ్ఛంద సేవా సంస్థ ఏర్పాటు చేసిన న్యాయ అవగాహన సదస్సులో జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ సమాజం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నా బాల్య వివాహాల కేసులు నమోదు కావడం దురదృష్టకరమన్నారు. బాల్య వివాహాల వల్ల అనేక అనర్థాలు ఉన్నాయన్నారు. బాల్య వివాహాలు చేసిన వారికి, చేయించిన వారిపై కూడా కేసులు నమోదు చేస్తారని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ బాల్య వివాహాల నిర్మూలనకు తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. న్యాయ సహాయం కోసం పేదలు జిల్లా న్యాయ న్యాయసేవా అధికార సంస్థను సంప్రదించాలని సూచించారు. బాలలు పాఠశాలలో ఉండాలని, వారిని పనిలో ఉంచితే బాలకార్మిక చట్టాల ప్రకారం నేరమన్నారు. వీటిపై కూడా కేసులు నమోదు చేస్తారని చెప్పారు. పెదతాడివాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్‌లపై బాలికలకు అవగాహన నిర్వహించారు. కార్యక్రమాల్లో బెజ్జిపురం యూత్‌క్లబ్ కోఆర్డినేటర్ ఝాన్సీ, సచివాలయ కార్యదర్శి అప్పలనాయుడు, వివిధ విభాగాల అధికారులు, గ్రామపెద్దలు, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
సర్వేయర్ ఆత్మహత్య
సీతంపేట: మండలంలోని కొత్తగూడ పంచాయతీ వంబరెల్లి నాయుడుగూడ గ్రామానికి చెందిన సర్వేయర్ సవర బలరాం (31) ఆర్థిక ఇబ్బందులు తాళలేక జీడిచెట్టుకు ఉరివేసుకుని మంగళవారం ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు, గ్రామస్తులు తెలిపారు. గొయిది గ్రామ సర్వేయర్‌గా పనిచేస్తున్న ఆయనకు జూలైలో భామిని మండలం బత్తిలి వన్ గ్రామ సచివాలయానికి బదిలీ అయ్యింది. ఇటీవల ఆర్థికపరమైన సమస్యలు రావడంతో మనస్తాపానికి గురై ఇంటిపక్కనే ఉన్న జీడితోటలోకి వెళ్లి ఉరివేసుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మృతునికి భార్య దేవి, ఇద్దరు కుమార్తెలు అనీష, చారుమతి ఉన్నారు. కుటుంబ పెద్ద మృతితో గుండెలవిసేలా కుటుంబసభ్యులు రోదిస్తున్నారు. బలరాం బలవన్మరణానికి పాల్పడడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుని భార్య ఫిర్యాదు మేరకు ఎస్సై వై.అమ్మన్నరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వింతవ్యాధితో లక్షకు పైగా కోళ్లు మృతి ● నమూనాలు విజయవాడ ల్యాబ్‌కు తరలింపు కొత్తవలస: వింత వ్యాధులతో దేశవాళీ, ఫారం కోళ్లు మృత్యవాత పడుతున్నాయని పశు సంవర్థక శాఖ సహాయ సంచాలకులు కన్నంనాయుడు మంగళవారం తెలిపారు. కొత్తవలస పశు సంవర్థక శాఖ సబ్‌డివిజన్ పరిధిలోని కొత్తవలస, లక్కవరపుకోట మండలాల పరిధిలో నేటి వరకు లక్ష వరకు కోళ్ల మృతి చెందినట్టు వెల్లడించారు. రెండు మండలాల్లో 80కి పైగా కోళ్ల ఫామ్‌లు ఉన్నాయని, గత నెల రోజుల నుంచి వరుసగా కోళ్లు చనిపోవడం ప్రారంభమైందన్నారు. కోళ్లఫామ్‌ల యజమానులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారని, కోళ్లకు సోకిన వ్యాధి నిర్ధారణకు నమూనాలను విజయవాడ ప్రత్యేక ల్యాబ్‌కు పంపించామన్నారు. చనిపోయిన కోళ్లను ఆరుబయట వేయకుండా గొయ్యితీసి పాతిపెట్టాలని సూచించారు. ల్యాబ్ ఫలితాలు వస్తేగాని వ్యాధి నిర్ధారణ చేయలేమన్నారు. చంపావతిలో ఇసుక అక్రమ తవ్వకాలు నెల్లిమర్ల: చంపావతి నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. నెల్లిమర్ల మండలంలోని రామతీర్థం, మొయిద గ్రామాలకు వెళ్లే రహదారుల్లో చంపావతినదిపై ఉన్న వంతెనలు, తాగునీటి పథకాల సమీపంలో ఇసుక తవ్వకాలు సాగుతున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. ఇసుక అక్రమ తవ్వకాలు ఇలాగే కొనసాగితే వంతెనలు, తాగునీటి పథకాలకు ముప్పుతప్పదని ఈ ప్రాంతీయులు ఆందోళన చెందుతున్నారు. ఇసుక అక్రమతవ్వకాలను కట్టడి చేయాలని కోరుతున్నారు. -
శాంతిభద్రతల పరిరక్షణలో సేవలు శ్లాఘనీయం
విజయనగరం క్రైమ్: జిల్లా పోలీసు శాఖలో హోంగార్డులుగా సుదీర్ఘ కాలం సేవలందించి, ఉద్యోగ విరమణ చేసిన వారికి ఎస్పీ వకుల్ జిందల్ మంగళవారం ’ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఎస్పీ హోంగార్డుల సేవలను కొనియాడి, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పోలీసుశాఖలో బాధ్యతాయుతంగా, క్రమ శిక్షణతో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ చేసిన హోంగార్డులు కె.సూర్యనారాయణ, ఎం.వెంకట రామకృష్ణారావులను పోలీసుశాఖ తరఫున ఎస్పీ వకుల్ జిందల్ మనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. ఉద్యోగ విరమణ తరువాత ఇకపై ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఉద్యోగ విరమణ చేసిన హోంగార్డులకు ఎస్పీ సూచించారు. అనంతరం, ఉద్యోగ విరమణ చేసిన గార్డుల దంపతులను జిల్లా పోలీసుశాఖ తరఫున ప్రత్యేకంగా అభినందించి, శాలువాలు కప్పి పూలమాలలతో ఘనంగా సత్కరించి, జ్ఞాపికలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఆర్.రమేష్ కుమార్, ఇనార్జ్ హెచ్‌సీ రాజు, హోంగార్డ్స్, వారి కుటుంబ సభ్యులు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
● నివాసాలుగా ప్రభుత్వ భవనాలు
ఈ చిత్రాలు చూశారా... లక్కవరపుకోట మండలం గంగుబూడి గ్రామ సచివాలయం పరిధిలో లక్షలాది రూపాయల ఖర్చుతో గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నిర్మించిన డాక్టర్ వైఎస్సార్ విలేజ్ హెల్త్‌క్లినిక్, రైతుభరోసా కేంద్రాలివి. భవనాలు ప్రారంభించే సమయానికి ప్రభుత్వం మారడంతో ఇవి అందుబాటులోకి రాలేదు. దీనినే అనువుగా చేసుకుని ఓ రెండు కుటుంబాలు ఏకంగా భవనాల్లో కాపురం పెట్టేశాయి. ప్రభుత్వ భవనాలను సొంతిల్లుగా వాడుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య పాలనకు ఈ భవనాలే నిలువెత్తు సాక్ష్యంగా కనిపిస్తున్నాయి. స్థానికులకు వైద్యసేవలు, రైతులకు సాగు సేవలందించేందుకు నిర్మించిన భవనాలను వినియోగంలోకి తేవడంలో కూటమి ప్రభుత్వం అలక్ష్యం చేస్తోందని, సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యానికి తూట్లు పొడుస్తోందంటూ స్థానికులు విమర్శిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి భవనాలను వినియోగంలోకి తేవాలని, ఉద్యోగుల విధులకు కేటాయించాలని కోరుతున్నారు. – లక్కవరపుకోట రైతుభరోసా కేంద్రంలో నివసిస్తున్న ఓ కుటుంబం -
పుష్పాలంకరణలో పైడితల్లి
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు మంగళవారం చదురుగుడి, వనంగుడిలలో పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఏడిద రమణ ఆధ్వర్యంలో వేకువజామునుంచి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, తాళ్లపూడి ధనుంజయ్, నేతేటి ప్రశాంత్‌లు శాస్త్రోక్తంగా పూజాదికాలు చేశారు. మహిళలు అమ్మవారిని దర్శించి పసుపు, కుంకుమలను సమర్పించి మొక్కుబడులు చెల్లించారు. కార్యక్రమాలను ఆలయ ఈఓ కె.శిరీష పర్యవేక్షించారు.త్రుటిలో తప్పిన ప్రమాదంబొండపల్లి: మండలం కేంద్రంలో జాతీయ రహదారి 26పై మంగళవారం మధ్యాహ్నం విశాఖపట్నం నుంచి రాయ్‌పూర్ ఐరన్ ఓర్ లోడుతో వెళ్తున్న లారీ వేగంగా వెళుతూ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అదృష్టవశాత్తు ఎవరికీ ఎటువంటి పెద్దప్రమాదం జరగక పోవడంతో స్థానికులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. వట్టిగెడ్డలో గల్లంతైన రైతు మృతిసాలూరు రూరల్: మండలంలోని దుద్ది సాగరం గ్రామానికి చెందిన మంచాల రామయ్య (45) వట్టిగెడ్డలో సోమవారం సాయంత్రం గల్లంతైన విషయం తెలిసిందే. అయితే మంగళవారం రూరల్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గెడ్డలో గాలించగా గ్రామ సమీపంలోని తుప్పల్లో మృతదేహం దొరికిందని రూరల్ ఎస్సై నరసింహమూర్తి తెలిపారు. గెడ్డలో పడి వ్యక్తి మృతి పాలకొండ: నగరపంచాయతీ పరిధిలోని కొండవీధికి చెందిన కారంగి రమేష్(42) గెడ్డలో పడి మృతిచెందాడు. మండలంలోని గోపాలపురం గ్రామ సమీపంలోని గెడ్డలో చేపల వేటకు వెళ్లిన రమేష్ ప్రమావశాత్తు కాలు జారి నీటిప్రవాహంలో కొట్టుకుపోయాడు. సోమవారం రాత్రి సయమంలో ప్రమాదం జరగడంతో గమనించిన సహచరులు బయటకు తీసి మరణించినట్లు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై ప్రయోగమూర్తి సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. లాటరీ విధానంలో బార్ కేటాయింపుపార్వతీపురం రూరల్: లాటరీ విధానంలో సాలూరులోని ఒక బార్‌ను కేటాయించారు. నాలుగు దరఖాస్తులు రావడంతో బార్ కేటాయింపునకు కలెక్టర్ చాంబర్లో కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ సమక్షంలో మంగళవారం లాటరీ తీశారు. బార్‌ను సాలూరుకు చెందిన రుంకాన నరేష్ దక్కించుకున్నట్టు ఎకై ్సజ్ అధికారి బి.శ్రీనాథుడు తెలిపారు. సమాచార శాఖ ఎ.డిగా గోవిందరాజులువిజయనగరం అర్బన్: జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ సహాయ సంచాలకుడిగా పి.గోవిందరాజులు నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా డీపీఆర్ఓగా, డివిజనల్ పీఆర్ఓగా, ఇన్చార్జ్ డీపీఆర్ఓగా కూడా పనిచేస్తున్నారు. తాజాగా ఇక్కడికి పదోన్నతిపై రానున్నారు. త్వరలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. -
గంజాయి కేసుల్లో దర్యాప్తు వేగవంతం
● ఎస్హెచ్ఓలతో ఎస్పీ జూమ్ కాన్ఫరెన్స్విజయనగరం క్రైమ్: గంజాయి కేసుల్లో దర్యాప్తు వేగవంతంగా పూర్తి చేయాలని ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా స్టేషన్ హౌస్ ఆఫీసర్స్‌తో ఎస్పీ మంగళవారం జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించి ఆదేశాలను జారీ చేశారు. అన్ని పోలీస్ స్టేషన్లలో ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం నమోదై, దర్యాప్తులో ఉన్న గంజాయి కేసులపై ఎస్పీ వకుల్ జిందల్ సమీక్ష చేశారు. దర్యాప్తులో ఉన్న కేసుల పురోగతిని అడిగి తెలుసుకుని కేసుల దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసేందుకు అధికారులకు దిశానిర్దేశం చేశారు. పెండింగ్‌లో ఉన్న కేసుల్లో నిందితులను వెంటనే అరెస్టు చేయాలని పరారీలో ఉన్న నిందితుల గురించి సమాచారం సేకరించాలని, వారి ఆచూకీని గుర్తించేందుకు సాంకేతికతను వినియోగించాలని సూచించారు. అవసరమైతే ఆయా కేసుల్లో ప్రెసిడెన్సీ పాస్‌పోర్టు తీసుకుని, ఇతర రాష్ట్రాలకు పోలీసు బృందాలను పంపాలని అధికారులను ఆదేశించారు. తరచూ ఇదే తరహా నేరాల్లో అరెస్టు అవుతున్న నిందితులపై హిస్టరీ షీట్లు ప్రారంభించి, వారి కదలికలపై నిఘా పెట్టాలని చెప్పారు. నిందితులు ఇతర ప్రాంతాలకు చెందిన వారైతే వారి హిస్టరీ షీట్లను సంబంధిత పోలీస్స్టేషన్లకు బదిలీ చేయాలన్నారు. ఎన్డీపీఎస్కు అనుకూలంగా ఉన్న కేసుల్లో అనుమతులు పొంది నిందితులను ముందస్తుగా అరెస్టు చేయాలన్నారు. నిందితుల ఆస్తులు అటాచ్ చేయాలి గంజాయి వ్యాపారంతో అక్రమంగా సంపాదించిన వారి ఆస్తులను గుర్తించి, ఫైనాన్షియల్ ఇన్విస్టిగేషన్ పూర్తి చేసి, వారి అక్రమ ఆస్తులను అటాచ్ చేయాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు. గంజాయితో పట్టుబడిన కేసుల్లో గంజాయి రవాణాకు పాల్పడిన వ్యక్తులతోపాటు, వారికి గంజాయిని సరఫరా చేసిన వ్యక్తులు, విక్రయించిన వ్యక్తులను, ఇతర ప్రధాన నిందితులను కూడా ఆయా కేసుల్లో నిందితులుగా చేర్చాలని తెలిపారు. నాన్ బెయిలబుల్ వారంట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, వాటిని ఎగ్జిక్యూట్ చేసేందుకు సిబ్బందిని నియమించాలని చెప్పారు. రాబోయే లోక్ అదాలత్‌లలో ఎక్కువ కేసులు డిస్పోజ్ అయ్యే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. పెండింగులో ఉన్న గంజాయి కేసుల్లో దర్యాప్తు పూర్తి చేసి, నిందితులపై అభియోగ పత్రాలను దాఖలు చేయాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు.ఈ జూమ్ కాన్ఫరెస్సులో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు, బొబ్బిలి డీఎస్పీ జి.భవ్య రెడ్డి, చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులు, పలువురు సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. -
అర్జీదారుల సమస్యలు అర్థం చేసుకోవాలి
● కలెక్టర్ డాక్టర్ బీఆర్అంబేడ్కర్ ● పీజీఆర్ఎస్ నోడల్ అధికారులతో సమీక్షవిజయనగరం అర్బన్: తమ సమస్యలు, బాధలు తీరుతాయనే అర్జీదారులు పీజీఆర్ఎస్కు వస్తారని, వాటిని అర్థం చేసుకుని వారి సమస్యలను పరిష్కరించడమే నిజమైన సేవ అని కలెక్టర్ డాక్టర్ బీఆర్అంబేడ్కర్ పేర్కొన్నారు. అర్జీదారుల పట్ల సానుకూలంగా వ్యవహారం ఉండాలని దరఖాస్తులో వాస్తవికత ఉంటే పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో పీజీఆర్ఎస్ నోడల్ అధికారులతో అర్జీల పరిష్కారంపై కలెక్టర్ సమీక్షించారు. ఒక ప్రభుత్వ ఉద్యోగిగా అర్జీల పరిష్కారం ద్వారా ఒకరి సమస్య తీర్చడమే నిజమైన సేవగా భావించాలని హితవు పలికారు. అర్జీలకు సమాధానాలు రాసేటప్పుడు స్వీకింగ్ అర్డర్ మాదిరి ఉండాలని ఏది అడిగారో దానికోసమే సమాధానం రాయాలని అయితే సమాధానం రాసిన తర్వాత అర్జీదారు సంతృప్తి చెందేలా ఉండాలని ఎట్టి పరిస్థితిల్లోనూ రీ ఓపెన్ కాకూడదని తెలిపారు. బాధ్యత గల ఉద్యోగిని కలెక్టరేట్‌కు పంపాలి అర్జీలను ఎలా పరిష్కరించాలో జిల్లా అధికారులు వారి స్టాఫ్‌కు ప్రతి సమావేశంలోనూ అవగాహన కలిగించాలన్నారు. అర్జీల పరిష్కారానికి ప్రతి కార్యాలయం నుంచి ఒక బాధ్యత గల ఉద్యోగిని డిజిగ్నేట్ చేసి వారిపేరును కలెక్టరేట్‌కు పంపాలని సూచించారు. ఆర్జీల కోసం ప్రతి రోజు లాగిన్‌లో చూడాలని అలాగే సాయంత్రం వెళ్లేటప్పుడు కూడా చూడాలని తెలిపారు. ఏ టైమ్‌లో నైనా చూడకుండా ఉన్న అర్జీలు సున్నా కనపడాలని స్పష్టం చేశారు. అర్జీ అందగానే అర్జీదారుతో ముందు మాట్లాడాలని తన సమస్య ఏంటో తెలుసుకుని సమాధానం రాయాలన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నారని పీజీఆర్ఎస్కు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. నిర్లక్ష్యంగా ఉంటే ఆ అధికారి సీఆర్‌లో నెగటివ్‌గా రాయనున్నట్లు హెచ్చరించారు. సమావేశంలో అధనపు ఎస్పీ సౌమ్యలత, కేఆర్ఆర్సీ డిప్యూటీ కలెక్టర్ మురళి, జిల్లా అధికారులు, పీజీఆర్ఎస్ నోడల్ అధికారులు పాల్గొన్నారు. -
భక్తిశ్రద్ధలతో పూజలు
రాయగడ: ఉత్కళాంధ్రుల ఆరాధ్య దైవం మజ్జిగౌరి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన మంగళవారం రోజున నువాఖాయి సందర్భంగా విశేష పూజలను నిర్వహించారు. ఆలయ పూజారి తరణి బెరుకో ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. పూజలు సందర్భంగా గంట సమయం వరకు భక్తుల దర్శనాలను నిలిపివేశారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తిరిగి దర్శనాలు యథావిధిగా కొనసాగాయి. ప్రతీ ఏడాది నువాఖాయి సందర్భంగా అమ్మవారికి ఈ పూజలను నిర్వహిస్తామని పూజారి తెలిపారు. కొత్తగా పండించిన ధాన్యం పాయసం, అదేవిధంగా కొత్తగా పండిన కూరగాయలను అమ్మవారి చెంత ఉంచి పూజలను నిర్వహించారు. అమ్మవారి ఆశీర్వాదంతో పంటలు సంమృద్ధిగా పండాలని, అదేవిధంగా అంతా సుభిక్షంగా ఉండాలని ఈ పూజలను నిర్వహిస్తారని ప్రతీతి. -
మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ
పర్లాకిమిడి: మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని జిల్లా అటవీశాఖ అధికారి కె.నాగరాజు అన్నారు. గుమ్మా బ్లాక్ జామి గ్రామంలో మొక్కలను మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గజపతి జిల్లాలోని ఏడు సమితి కేంద్రాలు, 149 గ్రామ పంచాయతీల్లో ఈనెల 17న ‘సింగిల్ డే మాస్ ప్లాంటేషన్ డ్రైవ్’ను చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఏక్ పేడ్ మా కే నామ్ 2.0ను జిల్లాలో ఏడు ఫారెస్టు రేంజ్ ఆధీనంలో చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రత్యేక సమితిల్లో సర్పంచ్‌లు, బీడీవోలు, సమితి సభ్యులు పాల్గొంటారన్నారు. -
వ్యక్తిపై మారణాయుధాలతో దాడి
రాయగడ: పాత కక్షలతో ఒక వ్యక్తిపై గుర్తు తెలియని దుండగులు మరణాయుధాలతో దాడి చేసిన ఘటన స్థానిక రెల్లివీధి కూడలి వద్ద మంగళవారం చోటు చేసుకుంది. ఈ దాడిలో రెల్లివీధికి చెందిన రాజాన జేమ్స్ (53 ) అనే వ్యక్తి తీవ్రగాయాలకు గురయ్యాడు. సమాచారం తెలుసుకున్న బాధితుడి కుటుంబీకులు రక్తపు మడుగులో పడి ఉన్న జేమ్స్‌ను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు సదరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మంగళవారం ఉదయం 11.30 గంటల సమయంలో డైలీ మార్కెట్ నుంచి బైకుపై ఇంటికి వస్తున్న సమయంలో రెల్లివీధి కూడలి వద్ద అప్పటికే కాపుకాసి ఉన్న ముగ్గురు దుండగులు అతని బైకు ఆపి తగాదా పడ్డారు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో పథకం ప్రకారం ముందుగానే తీసుకొచ్చిన పదునైన కత్తి, గొడ్డలితో దాడి చేశారు. దీంతో రెండు కాళ్లుకు తీవ్రగాయాలవ్వడంతో పాటు కడుపులో కత్తితో పొడిచి దుండగులు పారిపోయారు. స్థానిక హాస్పిటల్లో చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం బాధితుడిని విజయనగరం తరలించినట్లు సమాచారం. విరిగిపడిన కొండ చరియలు కొరాపుట్: ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు కొండ చరియలు విరిగి పడ్డాయి. మంగళవారం కొరాపుట్ జిల్లా నారాయణపట్న సమితి తెంతులి పొదర్ గ్రామ పంచాయతీ కుకడా సీల్ గ్రామ వద్ద రాళ్లు జారీ రోడ్డు మీదకి దొర్లుతూ వచ్చాయి. ఈ మార్గంలో తుల రంగ పానీ, ఉప్పర్ రంగ పానీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారత అల్యూమినియ కేంద్రం (నాల్కో) పరిధిలోని గనుల గ్రామాలు కావడంతో ప్రభావం చూపించింది. ఏనుగుల గుంపు సంచారం కొరాపుట్: నవరంగ్పూర్లో జిల్లాలోకి అటవీ ఏనుగుల గుంపు ప్రవేశించింది. మంగళవారం ఉమ్మర్‌కోట్ సమితి కొహరా, కుర్సి గ్రామ పంచాయతీల్లోని మొక్కజొన్న పంటల్లో ఏనుగులు సంచరించడం గిరిజనులు గమనించారు. సమీప చత్తీస్ఘఢ్ రాష్ట్రం నుంచి ఇవి తరలివచ్చాయి. వాటిలో నాలుగు ఏనుగులను గిరిజనులు గుర్తించారు. ఈ ప్రాంతంలో మొక్కజొన్న పంట విస్తారంగా పండింది. దీంతో అటవీ శాఖ సిబ్బంది చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
ఎరువుల కోసం కదంతొక్కిన రైతులు
మల్కన్‌గిరి: జిల్లాలోని కలిమెల సమితి ల్యాంప్ కార్యాలయం వద్ద ఎరువుల కోసం రైతులు కదం తొక్కారు. మోటు, పుసుగూడ కలిమెల గ్రామాలకు చెందిన 800 మంది రైతులు ఎరువుల కోసం రోడ్డెక్కారు. ఒక లారీ ద్వారా 65 బస్తాల ఎరువులు వస్తే, వేలాడి మంది రైతులకు ఎలా సర్దుబాటు చేస్తారని మండిపడ్డారు. రైతుల ఆందోళనతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మల్కన్‌గిరి కలిమెల, మోటు రహదారిలో వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. వెంటనే అధికారులు స్పందించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. -
చట్టాలపై అవగాహన అవసరం
జయపురం: విద్యార్థులకు చట్టాలపై అవగాహన అవసరమని జిల్లా జడ్జి, జిల్లా న్యాయసేవా ప్రదీకరణ జయపురం అధ్యక్షులు ప్రదీప్ కుమార్ మహంతి అన్నారు. స్థానిక మున్సిపల్ బాలికోన్నత పాఠశాలలో చట్టాలపై అవగాహన శిబిరం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయ సచేతన ప్రదీకరణ జిల్లా కార్యదర్శి ప్రద్యోమయ సుజాత మాట్లాడుతూ.. మహిళలపై దాడులను అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు. యాసిడ్ దాడి బాధితులకు ఉచిత వైద్యం, రూ.3 లక్షల నష్ట పరిహారంతో పాటు కేసు దర్యాప్తు జరిపి బాధితులకు న్యాయం చేసేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వీసీఎస్ ఏర్పాటు చేశాయని వివరించారు. శిబిరంలో విజిలెన్స్ కోర్టు స్పెషల్ పీపీ డాక్టర్ బి.గాయత్రీదేవి, కొరాపుట్ జిల్లా ఇన్చార్జి వైద్యాధికారి డాక్టర్ సుసంధ్య దేవదర్శిణి, మున్సిపల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ప్రియదర్శిణి పొరిడ తదితరులు పాల్గొన్నారు. -
ఘాట్ రోడ్డులో భారీ వాహనం బోల్తా
రాయగడ: సదరు సమితికి సమారు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న గుమ్మ ఘాటి మలుపులో మంగళవారం వేకువజామున కొరాపుట్ నుంచి వస్తున్న ఒక భారీ వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న కుంభికోట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వాహనాన్ని తొలగించే పనుల్లో నిమగ్నమయ్యారు. దీంతో రాయగడ నుంచి కొరాపుట్ అటు కాసీపూర్, టికిరి ప్రాంతాలకు వాహన రాకపోకలు నిలిచిపోయాయి. రాయగడ మీదుగా కొరాపుట్, నారాయణపట్నం వెళ్లే బస్సులు సైతం ట్రాఫిక్‌లో చిక్కుకున్నాయి. ఫలితంగా ప్రయాణికులు అవస్థలు పడ్డారు. అనంతరం పోలీసులు ట్రాఫిక్ పునరుద్ధరణ చేపట్టారు. -
కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ
● ఏఐసీసీ పరిశీలకుడు జెట్టి కుసుంకుమార్ కొరాపుట్: దేశానికి కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అని ఏఐసీసీ పరిశీలకుడు జెట్టి కుసుం కుమార్ జోస్యం చెప్పారు. నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలోని మెయిన్ రోడ్డులో ఉన్న జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ప్రసంగించారు. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే నేతృత్వంలో పార్టీ మరింత బలోపేతం చేసే కార్యక్రమం జరుగుతోందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఒడిశాలో డీసీసీ అధ్యక్ష పదవి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైందని తెలియజేశారు. సమితి స్థాయిలో కార్యకర్తల అభిప్రాయాలు తీసుకుంటామన్నారు. జిల్లాలో 10 సమితులు, రెండు పురపాలక సంఘాల్లో సమీక్ష సమావేశాలు జరుపుతామన్నారు. అధ్యక్ష పదవి కోసం అందరికీ దరఖాస్తులు ఇస్తామని వెల్లడించారు. నెలాఖరులోపు డీసీసీ అధ్యక్ష ఫలితాలు వెల్లడవుతాయన్నారు. అనంతరం సమితి అధ్యక్ష, మిగతా కార్యవర్గాలను నియమించనున్నట్లు స్పష్టం చేశారు. కాంగ్రెస్ ముందుంటుంది దేశ ప్రజలకు మేలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని కుసుం కుమార్ అన్నారు. అధికారంలో ఉన్నా.. లేకపోయినా ప్రజల కోసమే పని చేస్తుందన్నారు. ప్రస్తుతం ఓట్ చోరీపై పోరాటం చేస్తున్నట్లు వెల్లడించారు. రాహుల్ చేసిన భారత్ జోడో యాత్రతో ప్రజలు వాస్తవాలు గ్రహించారన్నారు. నాడు కొరాపుట్, నబరంగ్‌పూర్ పార్లమెంటరీ స్థానాలు కాంగ్రెస్‌కి కంచుకోటలని గుర్తు చేశారు. మరలా నబరంగ్‌పూర్‌లో పార్టీ పటిష్టతకి చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు భుజబల్ మజ్జి, సదానా నాయక్, డీసీసీ మాజీ అధ్యక్షుడు మున్నా త్రిపాఠి, కాంగ్రెస్ నాయకులు జి.సాయిరాజు, నాగరత్నం, శివరామరాజు, దిలిప్ బెహరా, కెమరాజ్ బాగ్ తదితరులు పాల్గొన్నారు. -
ఫిర్యాదు దారులకు కారణాలు తెలియజేయాలి
● కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్విజయనగరంఫోర్ట్: ప్రతి వారం నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ కార్యక్రమానికి వచ్చే వినతులకు సంపూర్ణ న్యాయం చేయాలని కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ అన్నారు. అర్జీదారులు సంతృప్తి చెందేవిధంగా అర్జీలకు పరిష్కారం చూపించాలని సూచించారు. కలెక్టరేట్లోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కలెక్టర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 188 వినతులు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్కు సంబంధించి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని జిల్లాలో నిర్వహిస్తామని తెలిపారు. అసలైన ఫిర్యాదుదారులకు న్యాయం చేకూర్చేవిధంగా అధికారులు వ్యవహరించాలన్నారు. సమస్య పరిష్కరించలేని పక్షంలో దానికి కారణాలు అర్జీదారులకు తెలియజేయాలని స్పష్టం చేశారు. వినతుల పరిష్కారం పట్ల చిత్తశుద్ధి చూపాలని చెప్పారు. ఐటీ శాఖ వెబ్సైట్లో అన్ని శాఖలు వారివారి ముఖ్యమైన శాఖ మెమోలు, ప్రభుత్వ ఉత్తర్వుల కాపీలు వచ్చే గురువారంలోగా అప్లోడ్ చేయాలని ఆదేశించారు. ఫిర్యాదుదారులకు చట్టపరిధిలో చర్యలు విజయనగరం క్రైమ్: ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు నిర్వహించే ’ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని ఎస్పీ వకుల్ జిందల్ సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫిర్యాదు దారుల నుంచి వినతులను స్వీకరించి, వారి సమస్యలను శ్రద్ధగా విని, సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడి, సమస్యలను వివరించారు. కార్యక్రమంలో భాగంగా ఎస్పీ 28 ఫిర్యాదులను స్వీకరించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, డీసీఆర్బీ సీఐ బి.సుధాకర్, ఎస్సై రాజేష్, సిబ్బంది పాల్గొన్నారు. -
బావిలో పడి వ్యక్తి ఆత్మహత్య
కొమరాడ: మండలంలోని విక్రంపురం గ్రామానికి చెందిన తూతిక స్వామేశ్వరరావు(60)ఆదివారం అర్ధరాత్రి దిగువ వీధిలో ఉన్న మంచి నీటి బావిలో పడి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై కె.నీలకంఠం తెలిపారు. దీనిపై పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కిడ్నీ సంబంధిత వ్యాధి కారణంగా బాధపడుతున్న సోమేశ్వర రావుకు పార్వతీపురం జిల్లా అస్పత్రిలో డయాలసిస్ చేసినప్పటికీ నడుము నొప్పి ఎక్కువ ఉన్నందున బాధ తట్టులేక మానసికంగా కుంగిపోయి బావిలో పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భర్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయనగరంలో యువకుడు.. విజయనగరం క్రైమ్: రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి కొండకరకాం గ్రామానికి చెందిన పి.గంగరాజు(20) సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక అప్పులు చేసి, తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడని రూరల్ ఎస్సై అశోక్ తెలిపారు. మృతుని అన్నయ్య సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
కామర్స్ అధ్యాపక పోస్టు భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
సాలూరు: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కామర్స్ అధ్యాపక పోస్టును భర్తీ చేయడానికి గెస్ట్ లెక్చరర్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా.కె.ఉషశ్రీ ఓ ప్రకటనలో తెలిపారు. పీజీ అర్హత కలిగి ఉండాలని, నెట్,సెట్, పీహెచ్డీ అర్హత కలిగిన వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అర్హత గల అభ్యర్థులు ఈ నెల 8వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని, ఈ నెల10న కళాశాలలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయి భజన పోటీలు రేపుపాలకొండ: పట్టణంలోని ఏలాం సెంటర్లో ఏర్పాటు చేసిన వినాయ మంటపం వద్ద బుధవారం జిల్లా స్థాయి భజన పోటీలు నిర్వహిస్తామని నిర్వహకులు తెలిపారు. పోటీలో గెలుపొందిన భజన బృందాలకు మొదటి బహుమతిగా రూ.6వేలు, రెండవ బహుమతి రూ.5వేలు, మూడవ బహుమతి రూ.4 వేలు అందిస్తామని వివరించారు. అలాగే బెస్ట్ సింగర్, బెస్ట్ డోలక్, బెస్ట్ హర్మోనిస్టులను ఎంపిక చేసి బహుమతులు అందిస్తామన్నారు. ఆసక్తి ఉన్న భజన బృందాలు నేరుగా తమ కమిటీ సభ్యులను సంప్రదించాలని సూచించారు. నలుగురు జూదరుల అరెస్టులక్కవరపుకోట: మండలంలోని సంతపేట గ్రామం సమీపంలో పేకాట ఆడుతున్న వ్యక్తులపై ఎస్సై నవీన్‌పడాల్ నేతృత్వంలో పోలీసులు సోమవారం దాడి చేశారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.18,860 నగదు, రెండు జతల పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లా కేంద్రంలో గంజాయి కలకలం● 24కేజీల గంజాయితో ఏడుగురి అరెస్ట్ పార్వతీపురం రూరల్: జిల్లా కేంద్రంలో సోమవారం ఒడిశా, ఉత్తర ప్రదేశ్‌లకు చెందిన ముఠానుంచి ఓ ప్రైవేట్ లాడ్జిలో 24కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ ఎస్సై గోవింద తెలిపారు. ఒడిశాకు చెందిన రామ్ఖిల, రమేష్ కోరా, సంతోష్, ప్రశాంత్‌లు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆకాష్, వినయ్, ప్రతాప్‌లకు లాడ్జి వద్ద గంజాయిని అందజేస్తున్న క్రమంలో ఒక సూట్‌కేస్, మరో బ్యాగ్‌లో అప్పజెప్పేందుకు ఉంచిన గంజాయితో పాటు వారిని పట్టుకున్నట్లు ఎస్సై తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఏడుగురు వ్యక్తులతో పాటు వారు ఉపయోగించిన కారును, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు.వట్టి గెడ్డలో రైతు గల్లంతు?సాలూరు రూరల్: మండలంలోని దుద్దిసాగరం గ్రామానికి చెందిన మంచాల రామయ్య (45) సోమవారం వట్టి గెడ్డలో గల్లంతయ్యాడు. వట్టిగెడ్డ దాటి ఉన్న తన పొలం పనులకు రామయ్య సోమవారం ఉదయం వెళ్లి తిరిగి సాయంత్రం 5.30గంటల సమయంలో వస్తుండగా వట్టి గెడ్డలో దిగి వస్తుండగా గల్లంతయ్యాడని గ్రామస్తులు చెబుతున్నారు.అయితే వట్టిగెడ్డ ప్రవాహం ఉధృతంగా ఉండడంతో కొట్టుకుపోయాడని గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో గాలింపు చర్యలు చేపట్టారు. విజయనగరం టౌన్: హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు 161వ జయంత్యుత్సవం ఆదిభట్ల నారాయణదాసు ఆరాధనోత్సవ సంఘం ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్లో సోమవారం వైభవంగా నిర్వహించారు. శ్రీ అన్నమాచార్య కళాపీఠం పొద్దుటూరుకి చెందిన హరికథా భాగవతులు యడ్లవల్లి రమణయ్య భాగవతార్‌కు విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి చేతుల మీదుగా హరికథా చూడామణి బిరుదును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా శ్రావణి మాట్లాడుతూ కళలకు కాణాచిగా ప్రసిద్ధికెక్కిన విద్యలనగరంలో సాహితీ సంస్థల కృషి ఎనలేనిదన్నారు. పురస్కార గ్రహీత యడ్లవల్లి మాట్లాడుతూ విజయనగరంలో పురస్కారం పొందడం తన పూర్వజన్మసుకృతమన్నారు. అనంతరం యడ్లవల్లి చేసిన భక్త మార్కండేయ కథాగానం ఆద్యంతం ఆహుతులను ఆకట్టుకుంది. కార్యక్రమానికి ముందు హరికథా చూడామణి కాళ్ల నిర్మల భాగవతారిణి నిర్వహించిన సుందరకాండ హరికథ ఆహుతుల కరతాళధ్వనులందుకుంది. సంఘ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎ.గోపాలరావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉత్సవ సంఘ అధ్యక్షుడు పి.వి.నరసింహరాజు (బుచ్చిబాబు), సభాధ్యక్షుడు ఎ.రంగారావు దొర, ప్రతినిధులు సోమయాజులు, వై.బాబూరావు, ఎం.సుధాకర్, కోలపల్లి ధర్మ శ్రీరామబాబా, భోగరాజు సూర్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
సాగునీటి సరఫరాపై నిర్లక్ష్యం చేస్తే ఉద్యమిస్తాం
● తోటపల్లి ఆయకట్టు రైతులు వెల్లడి వంగర: తోటపల్లి ప్రాజెక్టు కుడి ప్రధాన పాత కాలువ నుంచి వంగర మండలంలోని అన్ని గ్రామాల పంట భూములకు సాగునీటిని సరఫరా చేయకపోతే ఉద్యమిస్తామని రైతులు స్పష్టంచేశారు. మండలంలోని కె.కొత్తవలస, మద్దివలస, ఎం.సీతారాంపురం, కొప్పరవలస, బంగారువలస, రుషింగి, తలగాం గ్రామాలతో పాటు పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం పెద్దింపేట, పోలినాయుడువలస గ్రామాలకు చెందిన రైతులు మాకుమ్మడిగా ట్రాక్టర్లు, సైకిళ్లు, మోటారు సైకిళ్ల సహాయంతో కాలువ ఎగువ ప్రాంతంలోని కొత్తూరు వద్ద ఆందోళన చేశారు. సాగునీరు విడుదల చేసి 50 రోజులు గడస్తున్నా ఇంత వరకు వంగర మండలంలోని చాలా గ్రామాల భూములకు సరఫరాకాలేదన్నారు. రాజులగుమ్మడ సమీపంలో కాలువకు అడ్డంగా ఉన్న అడ్డుకట్టను రైతులు తొలగించారు. సాగునీరు అందక రైతులు ఇబ్బంది పడుతున్నా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. డబ్బులు ఎత్తుబడి చేసుకుని కాలువలో జంగిల్, పూడికలు తొలగించినా సాగునీరు అందడంలేదని వాపోయారు. వంగర మండలంలో తోటపల్లి ఆయకట్టు 9వేల ఎకరాలకు సాగునీటి ఎద్దడి ఉందని, అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. -
సకాలంలో స్పందించిన 108 సిబ్బంది
● తీవ్ర గాయాలపాలైన వ్యక్తిని సీహెచ్‌సీకి తరలింపు ● తప్పిన ప్రాణాపాయంతెర్లాం: 108 వాహన సిబ్బంది సకాలంలో స్పందించి ఆస్పత్రికి తీసుకువెళ్లి ఓ వ్యక్తిని ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడారు. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. తెర్లాం మండలంలోని చుక్కవలస గ్రామానికి చెందిన ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ దత్తి వాసు వ్యక్తి సోమవారం ఉదయం విద్యుత్ స్తంభం ఎక్కి పనిచేస్తుండగా షాక్‌కు గురై కింద పడిపోయాడు. తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు తెర్లాం 108 వాహనానికి సమాచారం అందించారు. 108 వాహన ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ బోను వెంకటరమణ, పైలట్ పుప్పాల గౌరీశంకర్‌లు సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా గాయపడిన వ్యక్తికి ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్య సేవల కోసం రాజాం సీహెచ్‌సీకి తరలించారు. విద్యుత్ షాక్‌కు గురైన వ్యక్తిని సకాలంలో ఆస్పత్రికి తీసుకురావడంతో ప్రాణాపాయ స్థితి తప్పిందని వైద్యులు 108 వాహన సిబ్బందిని మెచ్చుకున్నారు. గ్రామానికి చెందిన ఎలక్ట్రీషియన్‌ను వ్యక్తిని కాపాడిన 108 వాహన టెక్నీషియన్, పైలట్‌ను కుటుంబ సభ్యులు, చుక్కవలస గ్రామస్తులు అభినందించారు. -
వినతులపై తక్షణమే స్పందించాలి
● కలెక్టర్ ఎ. శ్యామ్ప్రసాద్పార్వతీపురం రూరల్: పీజీఆర్ఎస్కు వచ్చిన సమస్యలకు సంబంధించిన వినతులపై తక్షణమే సంబంధిత అధికారులు స్పందించాలని కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు సబ్‌కలెక్టర్ ఆర్.శాలి, డీఆర్ఓ హేమలత, ఎస్డీసీ పి.ధర్మచంద్రారెడ్డి, డీఆర్డీఏ పీడీ ఎం.సుధారాణిలు అర్జీదారుల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు. జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన అర్జీదారుల నుంచి వినతులను స్వీకరించిన కలెక్టర్ వారు తెలిపిన ప్రతి సమస్యను సావధానంగా విని తగిన పరిష్కారం చూపించాలని అధికారులను ఆదేశించారు. వచ్చిన వినతుల్లో కొన్ని.. సీతంపేట మండలం పొడిదుమ్ము నుంచి దారబంద వరకు రహదారి సౌకర్యం ఏర్పాటు చేయాలి. కురుపాం మండలం పిరంగూడ నుంచి అడ్డాయిగూడ వరకు బీటీ రోడ్డు నిర్మాణం చేయాలి. గుమ్మలక్ష్మీపురం మండలం గొరడ నుంచి వల్లాడ వరకు సీసీ రోడ్డు మంజూరు చేయాలి. కురుపాం మండలం పట్టాయి గెడ్డలో అంగన్వాడీ బిల్డింగ్ నిర్మాణం పూర్తిచేయాలి. గతేడాదిలో ఎంపికై న డీలర్లకు నియామక పత్రాలు మంజూరు చేయాలని తదితర సమస్యలపై పీజీఆర్ఎస్ కార్యక్రమంలో 73 వినతులు అందినట్లు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ, ఉద్యానవన, పంచాయతీ, వైద్య ఆరోగ్యశాఖాధికారులు కె.రాబర్ట్‌పాల్, వై.క్రాంతికుమార్, టి. కొండలరావు, డా.ఎస్.భాస్కరరావు, ఐసీడీసీ, డ్వామా పీడీలు టి. కనకదుర్గ, కె.రామచంద్రరావు, జిల్లా గ్రామీణ నీటి సరఫరా ఇంజినీరింగ్ అధికారి ఒ.ప్రభాకరరావు, సీపీఓ ఎస్ఎస్ఆర్కె పట్నాయిక్, ఇతర జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ఫిర్యాదుల పరిష్కారానికి ఎస్పీ ఆదేశాలు పార్వతీపురం రూరల్: జిల్లా పోలీస్‌శాఖ కార్యాలయంలో ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి తన వద్దకు వచ్చిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి, పరిష్కరించేందుకు సంబంధిత స్టేషన్ అధికారులకు ఫోన్లో ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు తన కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్కు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించి, వారితో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకొని, వారి ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించారు. వచ్చిన ఫిర్యాదుల్లో ప్రధానంగా కుటుంబకలహాలు, సైబర్ మోసాలు, తల్లిదండ్రులు వేధింపులు, భర్త/అత్తారింటి వేధింపులు, భూ–ఆస్తి వివాదాలు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీలు, ఆన్లైన్ మోసం, ప్రేమ పేరుతో మోసం, ఇతర సమస్యలపై ఫిర్యాదుదారులు స్వేచ్ఛగా విన్నవించుకోగా, వారి సమస్యలపై సంబంధిత పోలీసు అధికారులతో ఎస్పీ ఫోన్లో మాట్లాడి ఫిర్యాదు అంశాలను పరిశీలించి, వాటి పూర్వాపరాలపై విచారణ చేసి, చట్ట పరిధిలో తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో 7 ఫిర్యాదులు అందాయి. డీసీఆర్బీ సీఐ ఆదాం తదితర సిబ్బంది పాల్గొన్నారు. ఐటీడీఏ గ్రీవెన్స్‌సెల్‌కు 55 అర్జీలు సీతంపేట: ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు వివిధ శాఖల సెక్టోరియల్ అధికారులు హాజరు కాకపోతే మెమోలు ఇవ్వాలని ఐటీడీఏ పీఓ పవర్ స్వప్నిల్ జగన్నాథ్ అన్నారు. ఈ మేరకు సోమవారం స్థానిక ఎస్ఆర్ శంకరన్ సమావేశమందిరంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించారు. అధికారులు సమయపాలన పాటించాలని, పీజీఆర్‌కు ఎవరెవరు వచ్చారో సంతకాలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.అందరూ బాధ్యతగా పనిచేసి వచ్చిన అర్జీలను తక్షణ పరిష్కారం చూపాలన్నారు. మొత్తం 55 అర్జీలు వివిధ సమస్యలపై వచ్చాయి. ఓండ్రుజోలలో జీపీఎస్ చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు వినతి ఇచ్చారు. తాగునీటి బోరు మంజూరు చేయాలని జరడగూడ గ్రామానికి చెందిన ఆరిక చిన్నారావు, తల్లికి వందనం డబ్బులు తమ పిల్లలు ఇద్దరికి రాలేదని పోలిష్కోటకు చెందిన బిడ్డిక బెన్నయ్య విన్నవించారు. భాషావలంటీర్ను నియమించాలని జన్నిగూడ గ్రామస్తులు కోరారు. ఆయిల్ ఇంజిన్ మంజూరు చేయాలని పోలవరానికి చెందిన ఊయక బోడమ్మ విన్నవించింది. కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీఓ చిన్నబాబు, డిప్యూటీ ఈవో రామ్మోహన్రావు, ఎంపీడీవో సత్యం, డిప్యూటీ డీఎంహెచ్‌వో విజయపార్వతి తదితరులు పాల్గొన్నారు. -
వెయిట్ లిఫ్టింగ్‌లో అజేయుడు
నెల్లిమర్ల రూరల్: వారిది నిరుపేద కుటుంబం. కుటుంబ పోషణకు వ్యవసాయ పనులు చేస్తూ వచ్చిన కొద్దిపాటి కూలి డబ్బులతో సర్దుకుపోయే దుస్థితి. గ్రామీణ సంప్రదాయబద్ధ క్రీడల పట్ల ఆసక్తి ఆయనను అంచెలంచెలుగా ఎదిగేలా చేసింది. పెద్దగా చదువుకోకపోయినప్పటికీ నమ్ముకున్న క్రీడ ప్రస్తుతం ఉన్నత స్థాయిలో నిలబెట్టింది. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పదుల సంఖ్యలో పతకాలు సాధించి దేశ, రాష్ట్ర, జిల్లా కీర్తిని ఖండతరాల్లో ఇనుమడింపజేశారు. ఆయనే విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం కొండవెలగాడ గ్రామానికి చెందిన సీనియర్ వెయిట్‌లిఫ్టర్ వల్లూరి శ్రీనివాసరావు. 1997లో శిక్షణ ప్రారంభించిన ఆయన పలు రాష్ట్రాల్లో జరిగిన చాంపియన్ షిప్ పోటీల్లో వరుస బంగారు పతకాలు కై వసం చేసుకున్నారు. ఇండియన్ ఆర్మీలో సిఫాయి స్థాయి నుంచి జేఏఓ కేడర్ వరకు ఎదిగి ప్రస్తుతం రిటైర్ అయ్యారు. గ్రామంలోనే ఉంటూ మరికొంత మంది క్రీడాకారులను తయారు చేస్తున్నారు. వల్లూరి శ్రీనివాసరావు పెద్ద కుమారుడు అజయ్ బాబు తండ్రి సాధించిన విజయాలను స్ఫూర్తిగా తీసుకుని తన 8వ ఏట నుంచే వెయిట్ లిఫ్టింగ్‌లో శిక్షణ ప్రారంభించాడు. 2021లో జాతీయస్థాయి చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొని యూత్ విభాగంలో తొలి స్వర్ణం సాధించాడు. 2022 జూలైలో ఉజెబికిస్తాన్, 2022 అక్టోబర్‌లో బహ్రెయిన్, 2023లో యూపీ(ఇండియా), 2024 డిసెంబర్లో ఖతర్, ఉజెబికిస్తాన్, అదే ఏడాది సెప్టెంబర్‌లో ఫిజ్జి దేశాల్లో వివిధ విభాగాల్లో జరిగిన పోటీల్లో సత్తా చాటాడు. ప్రస్తుతం పాటియాలాలోని ఓ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. తండ్రిని ఆదర్శంగా తీసుకున్న అజయ్‌బాబు వరుస విజయాలు సాధిస్తూ మరికొందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇండియన్ ఆర్మీలో ఉద్యోగం వెయిట్ లిఫ్టింగ్ క్రీడలో రాణించేందుకు అజయ్ బాబు ప్రస్తుతం పాటియాలాలోని ఓ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. శిక్షణకు సంబంధించి అకాడమీ ఖర్చులు భరిస్తున్నప్పటికీ అదనంగా నెల కు రూ.40వేలు ఖర్చు అవుతున్నట్లు తండ్రి శ్రీని వాసరావు చెబుతున్నారు. గేమ్స్‌లో రాణించడమే తన కుమారుడి లక్ష్యమని లక్ష్య సాధనకు ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి ఈ స్థాయికి వచ్చినట్లు తెలిపారు. వెయిట్‌లిఫ్టింగ్‌లో రాణిస్తున్న అజయ్ బాబు ఆ కోటాలో ఇటీవల ఇండియన్ ఆర్మీలో జేఏఓ కేడర్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. మరో నె ల రోజుల్లో బాధ్యతలు కూడా స్వీకరించనున్నాడు. స్కాట్లాండ్లో జరగనున్న పోటీలకు ఎంపిక ఇటీవల గుజరాత్ రాష్ట్రంలో జరిగిన కామన్వెల్త్ చాంపియన్‌షిప్ పోటీల్లో అజయ్‌బాబు స్వర్ణ పతకం సాధించడంతో 2026 జూలై 23 నుంచి స్కాట్లాండ్లో జరగనున్న అంతర్జాతీయ గేమ్స్‌కు అర్హత సాధించాడు. ఆ పోటీల్లో తన కుమారుడు తప్పనిసరిగా స్వర్ణం సాధిస్తాడడని తండ్రి శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు. తండ్రి బాటలో రాణిస్తున్న తనయుడు కామన్వెల్త్ చాంపియన్ షిప్లో స్వర్ణం స్కాట్లాండ్లో జరగనున్న గేమ్స్‌కు ఎంపిక స్పోర్ట్స్ కోటాలో ఆర్మీలో ఉద్యోగం ప్రతిష్టాత్మక గేమ్స్‌లో స్వర్ణంపైనే గురి -
ఏనుగుల సంచార ప్రాంత పరిశీలన
భామిని: మండలంలోని తాలాడ సమీప ఐలమ్మ తోటలో ఏనుగులు సంచరించిన ప్రాంతాలను విశాఖ ఫారెస్ట్ కన్జర్వేటర్ శాంతిప్రియ పాండే, జిల్లా పారెస్ట్ ఆదికారి జీఏపీ ప్రసూనల బృందం సోమవారం పరిశీలించింది, ఐలమ్మ తోట పక్కనే గల వంశధార నది తీరాన్ని కూడా సందర్శించారు. గడిచిన మూడేళ్లుగా వంశధార నదీ తీరంలో ఏనుగుల గుంపు ఎలా గడిపిందని మాత్రమే పరిశీలించారు. కూటమి నాయకులు చెబుతున్నట్లు గత మూడేళ్లుగా ఏనుగుల గుంపుతో రైతుల పడుతున్న ఇబ్బందులు తొలగించడానికి కాని, కుంకి ఏనుగులు తెచ్చి తరలించేందుకు చర్యలు తీసుకోవడం కోసం కానీ ఫారెస్టు అధికారులు చర్చించలేదని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం ఏనుగుల బెడద లేకపోయినా వాతావరణం మారగానే తిరిగి వస్తాయని స్థానికులు వాపోతున్నారు. ఈ ప్రాంతంలో ఏనుగుల గుంపు ఎందుకు నివాసముంటోందనని ఆలస్యంగా ఆటవీ శాఖాదికారులు పరిశీలించడం ఆశ్చర్యం కలిగించింది. కన్జర్వేటర్ శాంతి ప్రియ పాండేకు ఎలిఫెంట్ రేంజర్ మణికంఠేశ్వరరావు ఏనుగుల జాడలు వివరించారు. పాలకొండ రేంజర్ రామారావు,కొత్తూరు సెక్షన్ అధికారులు దాలినాయుడు, రామకృష్ణ, కేశవ, ట్రాకర్స్ ఉన్నారు. -
ట్రాక్టర్ మీదపడి యువకుడి మృతి
తెర్లాం: మండలంలోని పెరుమాళి గ్రామంలో ట్రాక్టర్ మీదపడడంతో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. పెరుమాళి గ్రామానికి చెందిన పొడ్ల రాము(23) సోమవారం మధ్యాహ్నం ట్రాక్టర్‌ను కడిగేందుకు స్థానికంగా ఉన్న ఓ చెరువుకు తీసుకువెళ్లాడు. ట్రాక్టర్ కడగడం పూర్తవడంతో దాన్ని పైకి తెచ్చేందుకు డ్రైవింగ్ చేస్తుండగా ట్రాక్టర్ బురదలో కూరుకుపోయి ఇంజిన్ భాగం పైకి లేచిపోయింది. దీంతో ట్రాక్టర్ బోల్తాపడిపోతుందని గమనించిన డ్రైవర్ రాము వెంటనే కిందకు దూకేశాడు. దూకేసిన రాముపై ట్రాక్టర్ పడిపోవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. కొన ఊపిరి ఉందన్న అనుమానంతో కుటుంబ సభ్యులు రాజాంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లగా వైద్యులు పరీక్షించి ప్రమాదం జరిగిన వెంటనే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ సంఘటనపై తెర్లాం ఎస్సై సాగర్‌బాబు వద్ద ప్రస్తావించగా దీనికి సంబంధించి ఇంతవరకు ఎటువంటి సమాచారం రాలేదని తెలిపారు. లారీ కింద పడి యువకుడు.. విజయనగరం క్రైమ్: నగరంలోని జేఎన్టీయూ జంక్షన్ వద్ద సొమవారం జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఇందుకు సంబంధించి వన్ టౌన్ సీఐ ఆర్వీఆర్కే చౌదరి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మధుపాడకు చెందిన ఎర్రయ్య (21) తన స్నేహితుడితో కలిసి బైక్‌పై వెళ్తుండగా జేఎన్టీయూ వద్ద ఆగి ఉన్న లారీని ఢీ కొట్టాడు. ఈ ఘటనలో ఎర్రయ్య స్నేహితుడు ముందు పడిపోగా బైక్ నడుపుతున్న ఎర్రయ్య లారీ వెనక చక్రం వద్ద పడ్డాడు. ఆగి ఉన్న లారీ అప్పుడే బయలుదేరడంతో లారీ చక్రాలు ఎర్రయ్య మీద నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సీఐ చౌదరి ఆదేశాలతో ఎస్సై లక్ష్మునాయుడు మృతదేహాన్ని ప్రభుత్వ సర్వజన హాస్పిటల్‌కు పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వ్యాన్ ఢీకొని వృద్ధురాలు.. నెల్లిమర్ల రూరల్: మండలంలోని సారిపల్లి గ్రామంలో ఇంటిబయట కుర్చీలో కూర్చుని సేదదీరుతున్న వృద్ధురాలిని వ్యాన్ ఢీకొట్టడంతో మృతి చెందింది. ఈ ఘటనపై ఎస్సై గణేష్, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మజ్జి అన్నపూర్ణ(65) ఆదివారం రాత్రి పాన్ షాపు వద్ద కుర్చీలో కూర్చుని సేదదీరుతోంది. అదే సమయంలో నెల్లిమర్ల నుంచి వచ్చిన ఓ వ్యాన్ ఆ వృద్ధురాలిని బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన ఆమెను జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. వ్యాన్‌ను నిర్లక్ష్యంగా నడపడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. మృతురాలి అల్లుడు గురునాయుడు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
ఆగి ఉన్న లారీని ఢీ కొన్న ఆటో
బొండపల్లి: మండలంలోని చందక పేట గ్రామానికి సమీపంలో జాతీయ రహదారి 26పై ఆగి ఉన్న లారీని వేగంగా వస్తున్న ఆటో ఢీ కొనడంతో ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సోమవారం వేకువ జామున జరి గిన ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలి లా ఉన్నాయి. విజయనగరం నుంచి గజపతినగరం వైపు మిరపకాయలు లోడుతో వెళ్తున్న ఆటో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని బలంగా ఢీ కొట్టడంతో శ్రీకాకుళానికి చెందిన డ్రైవర్ చంద్రరావుకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన డ్రైవర్‌ను జిల్లా కేంద్ర సర్వజన ఆస్పత్రికి చికిత్స కోసం తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆక్రమణల చెరలో ‘పోర్టుల్యాండ్’..?
● పట్టనట్లు వ్యవహరిస్తున్న రెవెన్యూ సిబ్బంది ● గాలికొదిలేసిన పోర్టు అథారిటీస్ పోలాకి: ఒకప్పుడు వెలుగు వెలిగిన కళింగపట్నం ఓడరేవు ఆ తర్వాత కాలంలో నౌకల రవాణా నిలిచిపోవడంతో సదరు ఓడరేవుకు సంబంధించిన భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. మండలంలో ప్రస్తుతం నిరుపయోగంగా కేవలం రెవెన్యూ రికార్డుల్లో మాత్రమే మిగిలిపోయిన పోర్ట్ల్యాండ్పై కొందరి కన్నుపడింది. అంపలాం పంచాయతీ పరిధి నందిగాం రెవెన్యూలో సర్వే నంబర్–77లో 31.45 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ భూములు ఇప్పుడు విలువైనవిగా మారడంతో కొందరు పెద్దలు అక్కడ గ్రద్దల అవతారం ఎత్తారు. గతంలో టీడీపీ హయాంలో(2014–19 మధ్యలో) అక్కడ మత్స్యకారుల విశ్రాంతి భవనం, వలలు, చేపలు నిల్వ గోదాముల నిర్మాణం చేపట్టిన సందర్భంలో సైతం పోర్టు అథారిటీస్ నుంచి ఎలాంటి క్లియరెన్స్‌లు ఇవ్వకపోయినా, అప్పటి నాయకత్వం ముందుకు వెళ్లడం వెనుక వేరే ఉద్దేశాలు ఉన్నాయనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఇదిలా ఉండగా గత నాలుగేళ్ల నుంచి ఈ భూముల్లో ఉపాధి హామీ పథకం ద్వారా పనులు సైతం నిర్వహించడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. వేరే ప్రభుత్వ సర్వే నంబరుతో వర్క్ ఐడీ క్రియేట్ చేసి పోర్టు భూముల్లో ఉపాధి పనులు చేపడుతూ ప్రజావేదిక ఆడిటింగ్ సమయంలో మేనేజ్ చేస్తూ వస్తున్నారన్న ఆరోపణలు వున్నాయి. హక్కులు కల్పించాలని వినతి పోర్ట్‌ల్యాండ్ మొత్తం తమకే చెందుతుందని హక్కులు కల్పించాలని కోరుతూ ఇటీవల ఒక వ్యక్తి పోలాకి రెవెన్యూ కార్యాలయానికి వినతిపత్రం అందించిన నేపథ్యంలో ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. వినతి పత్రం వెనుక ఉన్నది ఎవరు అనే విషయంపై కూటమి పార్టీల నాయకుల్లో అంతర్గత చర్చ జరుగుతున్నట్లు సమాచారం. మరోపక్క పోర్టు భూముల్లో ఇప్పటికే ప్రైవేటు కార్యకలాపాలు జరుగుతున్నాయని సర్వే నిర్వహించి భూముల వివరాలు, వాస్తవ విస్తీర్ణంపై హద్దులతో సైతం ప్రజలకు తెలియజేయాలని మత్స్యకారులు, తీరప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ సిబ్బంది మాత్రం ఆక్రమణలపై ఎందుకో నిద్ర నటిస్తోంది. మరోపక్క తమ హక్కులను సైతం పోర్టు అథారిటీస్ గాలికొదిలేసింది. కనీసం తమ భూముల్లో ఫెన్సింగ్ వేసి భవిష్యత్ అవసరాలకు వినియోగించుకునే ఆలోచన కూడా చేయడం లేదు. ఇదే కొనసాగితే రూ.కోట్లు విలువ చేసే పోర్టుల్యాండ్‌లో అక్రమార్కులు లంగరు వేసే పరిస్థితి మరెంత దూరంలో లేదని స్థానికులు చర్చించుకుంటున్నారు. రెవెన్యూ రికార్డుల్లో పోర్టుల్యాండ్ వివరాలు స్పష్టంగా ఉన్నాయి. నందిగాం రెవెన్యూలో ఎస్ఎల్ఆర్లో ఫోర్టు అథారిటీస్‌కు 31.45 ఎకరాల భూములు ఉన్నట్లు వివరాలు ఉన్నాయి. ఆక్రమణలపై ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. పోర్టు అథారిటీస్ వారు వచ్చి హద్దులు కోరితే చూపించేందుకు సిద్ధంగా ఉన్నాం. – పి.శ్రీనివాసరావు, తహసీల్దార్, పోలాకి -
వినతుల వెల్లువ
పర్లాకిమిడి: గజపతి కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ సెల్, గ్రామ ముఖిపరిపాలనకు అధిక స్పందన లభించింది. కలెక్టర్ మధుమిత, ఎస్పీ జ్యోతింద్రకుమార్ పండా, జిల్లా పరిషత్ సీడీఎం శంకర కెరకెటా, జిల్లా అటవీశాఖ అధికారి కె.నాగరాజు వినతులు స్వీకరించారు. మొత్తంగా 75 వినతులు అందాయి. వాటిలో రెండింటిని అక్కడికక్కడే పరిష్కరించారు. వ్యక్తిగతం 58, గ్రామ సమస్యలకు సంబంధించినవి 17 వినతులు వచ్చాయి. ముగ్గురు నిస్సహాయులుకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.70 వేల ఆర్థిక సహాయాన్ని కలెక్టర్ అందజేశారు. సీడీఎంఓ డాక్టర్ ఎం.ఎం.ఆలీ, సబ్ కలెక్టర్ అనుప్ పండా, గుసాని బీడీఓ గౌరచంద్ర పట్నా యక్, తదతరులు పాల్గొన్నారు. వినతుల స్వీకరణ.. రాయగడ: స్థానిక డీఆర్డీఏ సమావేశం హాల్లో సోమవారం జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి వినుత ల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి 77వినతులు వచ్చాయి. ఇందులో 69 వ్యక్తిగతం, 8 గ్రామ సమస్యలుగా గుర్తించారు. ఆరుగురికి రూ.70 వేల సహాయం.. వినతుల స్వీకరణలో భాగంగా ఆరుగురుకి కలెక్టర్ వైద్య ఖర్చుల నిమిత్తం రెడ్ క్రాస్ నిధుల నుంచి రూ.70 వేలను మంజూరు చేశారు. వారి ఆర్థిక పరి స్థితుల దృష్ట్యా సీడీఎంఓ సిఫారసు మేరకు ఆర్థిక సహాయాన్ని అందించారు. మౌలిక సౌకర్యాలు కల్పించండి.. రాయగడలోని సాయిప్రియ నగర్లో గల పలు వీధుల్లో మౌలిక సౌకర్యాలు కల్పించాలని ఆ ప్రాంత వాసులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. కొత్తగా ఏర్పాటైన ఈ ప్రాంతం గత పదేళ్లలో ఎంతొ అభివృద్ధి చెందిందన్నారు. ఇటు పంచాయతీ పరిధిలోకి చెందక, అటు మున్సిపాలిటీ పరిధిలోని లేక అభివృద్ధికి దూరం ఉందన్నారు. గతకొద్ది ఏళ్లుగా సాయిప్రియ నగర్లో దొంగతనాలు అధికమయ్యాయన్నా రు. భద్రతను దృష్టిలో పెట్టుకుని పోలీస్ అవుట్ పో స్టును ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై స్పందించిన కలెక్టర్ వెంటనే మున్పిపాలిటీ కార్యనిర్వాహక అధికారి కులదీప్కుమార్తో చర్చించారు. సమస్య లపై సమగ్ర నివేదికను సమర్పించాలని ఆదేశించా రు. సమస్యలను సంబంధితశాఖ అధికారులు పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. డీఎఫ్ఓ అన్నా సాహేబ్, సబ్ కలెక్టర్ రమేష్ చంద్ర జెన్నా, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి అక్షయకుమార్ ఖెముండొ, వివిధ శాఖల కు చెందిన అధికారులు పాల్గొన్నారు. గ్రీవెన్స్‌సెల్‌కు 45 వినతులు మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా మద్మాగిరి పంచాయతీలో సోమవారం గ్రీవెన్స్‌సెల్‌ను అధికారులు నిర్వ హించారు. కలెక్టర్ సోమేశ్ ఉపాధ్యాయ్ హాజర య్యారు. ఈ సందర్భంగా 45 వినతులు స్వీకరించా రు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వినతులను క్షుణ్ణంగా పరిశీలించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని వివిధశాఖల అధికారుల ను ఆదేశించారు. జిల్లాలో రైతులకు యురియా సమస్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దీనిపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. జిల్లా ఎస్పీ వినోద్ పాటేల్, జిల్లా అభివృద్ధిశాఖ అధికారి నరేశ్ కుమార్ సభరో పాల్గొన్నారు. -
వృక్ష సంపదే జీవరాశి మనుగడకు మూలాధారం
జయపురం: వృక్ష సంపదే జీవరాశి మనుగడకు, పర్యావరణ పరిరక్షణకు మూలాధారమని జయపురం రోటరీ క్లబ్ కరస్పాండెంట్ నిశాన్ పట్నాయక్ అన్నారు. సోమవారం జయపురం రోటరీ క్లబ్, విక్ర మదేవ్ విశ్వ విద్యాలయ ఎన్.సి.సి కేడర్ సంయుక్తంగా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. జయపురం విశ్వవిద్యాలయ ప్రాంగణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 100కు పైగా వివిధ రకాల మొక్కలను నాటినట్లు జయపురం రోటరీ క్లబ్ అధ్యక్షుడు ఆర్.టి.ఎన్.అమర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ కార్యదర్శి నారస్ నిశంఖ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, సీనియర్ సభ్యులు పాల్గొన్నారు. -
నేటి నుంచి జాతీయ ఆహార భద్రతా కమిషన్ పర్యటన
పర్లాకిమిడి: గజపతి జిల్లాకు ఒడిశా రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు (భువనేశ్వర్) మంగళవారం నుంచి వరుసగా మూడు రోజులు గుమ్మా, మోహనా, గుసాని సమితుల్లో పర్యటించనున్నారు. జాతీయ ఆహార భద్రత పథకం కింద బి.పి.ఎల్, దిగువ తరగతి ప్రజలకు రేషన్ సక్రమంగా అందుతున్నది, లేనిదీ తనిఖీలు చేయనున్నారు. ఈ ఫుడ్ కమిషన్‌లో సభ్యులుగా ప్రియబ్రత సామంతరే, అక్షయ కుమార్ బెహ రా, దయానిధి దాస్ ఉన్నారు. 2వ తేదీ ఉద యం గుమ్మా బ్లాక్ రోడ్ ప్రయాణంలో ఐ.సి.డి.ఎస్ ఆధీనంలో ఉన్న మధ్యాహ్నన భోజన పథకం, ట్రైబల్ పి.డి.ఎస్, ఎస్.ఎన్.పిలు, షెడ్యూ ల్డు కులాల ఆశ్రమ పాఠశాలలు, సేవాశ్రమాల ను తనిఖీ చేపట్టనున్నారు. మధ్యాహ్నం గుమ్మాబ్లాక్ అధికారులతో సమావేశం అవుతా రు. 3న ఉదయం 9 గంటలకు జిల్లాలో మోహ నా బ్లాక్, మధ్యాహ్నం 3 గంటలకు గుసాని సమితిలో పలు ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేపట్టానున్నా రు. 4న జిల్లా కలెక్టరేట్లో పాలనాఽధికారి, జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష చేపట్టనున్నారని జిల్లా కలెక్టర్ మధుమిత తెలియజేశారు. రాయగడ: ప్రాథమిక చికిత్సపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ప్రముఖ సమాజ సేవకుడు, విశ్రాంత హోమియో వైద్యుడు లక్ష్మీనారాయణ సాహు అన్నారు. స్థానిక లయన్స్ క్లబ్ సమావేశం హాల్లో సొమవారం లేడీస్ క్లబ్ ద్వారా నిర్వహించిన ప్రాథమిక చికిత్స శిక్ష ణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యా రు. ఈ సందర్భంగా డాక్టర్ సాహు మాట్లాడుతూ.. గుండెపోటు వంటి ప్రమాదకర పరిస్థితు లు ఎదురైనప్పుడు ఎలా స్పందించాలి, తీసుకోవాల్సిన ప్రాథమిక చర్యలను వివరించారు. సీపీఆర్‌పై శిక్షణ ఇచ్చారు. పాము, కుక్క కాట్లకు గురైనప్పుడు ఎలా స్పందించాలి, ఎటువంటి ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలి, ఎటువంటి ప్రాథమిక చికిత్స చేపట్టాలో అవగాహన కల్పించారు. క్లబ్ అధ్యక్షురాలు కస్తూరి సాహు, సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సాహుని సత్కరించారు. శ్రీకాకుళం క్రైమ్: పెళ్లికి యువతి నిరాకరించిందనే కారణంతో ఆత్మహత్య చేసుకుంటానని యువకుడు సెల్‌ఫోన్ టవర్ ఎక్కిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సోమవారం వేకువజామున 3.30 గంట ల సమయంలో శ్రీకాకుళం నగరంలోని పాత దీప మహాల్ సమీప టవర్ మీదకు ఒక యువ కుడు అవలీలగా ఎక్కాడు. ఉదయమయ్యేసరి కి అటుగా వెళ్లే ప్రజలు గమనించారు. ల్యాప్‌టాప్ పట్టుకుని సిగ్నల్స్ దొరకక అక్కడ కూర్చు ని ఉన్నాడని అనుకున్నారు. అయితే ఎంతకీ దిగకపోవడంతో ఆత్మహత్య చేసుకుంటాడేమోనన్న ఆందోళనతో ఒకటో పట్టణ ఎస్ఐ ఎం.హరికృష్ణకు సమాచారమిచ్చారు. సరిగ్గా ఉదయం 8 గంటలకు అగ్నిమాపక కార్యాలయానికి కూడా కాల్ వెళ్లింది. అంతే క్షణాల్లో ఘ టనా స్థలానికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. 8.45 గంటలకు ఎస్ఐ హరికృష్ణ చొరవతో అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ పూర్తి చేసి యువకుడిని కిందికి దించగలిగారు. ఇదీ విషయం... పొందూరు మండలంలోని కింతలి గ్రామానికి చెందిన విభూది శివకుమార్ (30) అనే యువ కుడు ఎచ్చెర్ల మండలం ఇబ్రహీంబాద్‌కు చెందిన ఒక యువతిని గత ఐదేళ్లుగా ప్రేమిస్తున్నాని.. ప్రేమకు అంగీకరించిన యువతి వివాహానికి నిరాకరించిందని పోలీసుల వద్ద చెప్పాడు. దీనికి కారణం వారి పెద్దలేనని.. భరించలేకే ఇలా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డానని పేర్కొన్నాడు. ఈ ఘటనపై ఎస్ఐ ఎం.హరికృష్ణ మాట్లాడుతూ గ్రామ పెద్దలు, తల్లిదండ్రుల సమక్షంలో చట్ట పరిధిలో ఇటువంటి వ్యవహా రం పరిష్కరించుకోవాలని సూచించారు. అప్పటికీ పరిష్కారం కాకపోతే చట్టప్రకారం తాము న్యాయం చేస్తామని యువకుడికి హామీ ఇచ్చి రిమ్స్‌కు పంపించారు. -
పఽథకం ప్రకారమే రాజశేఖర్ హత్య
● నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు ● ఆగస్టులో కత్తి కొనుగోలు చేసిన నిందితుడుజి.సిగడాం: స్నేహితుడి చేతిలో గత నెల 24న హత్యకు గురై, చికిత్స పొందుతూ గెడ్డకంచరాం గ్రామానికి చెందిన పుక్కళ్ల రాజశేఖర్ మృతి చెందిన కేసులో ముద్దాయి దమరసింగి గొల్లబాబు అలియాస్ శంకర్‌ను పోలీసులు సోమవారం అరెస్టు చేసి పొందూరు కోర్టుకు తరలించారు. ముద్దాయికి రిమాండ్ నిమిత్తం శ్రీకాకుళం జైలుకు తరలించారు. స్థానిక పోలీసుస్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జేఆర్‌పురం సీఐ ఎం.అవతారం కేసు వివరాలు వెల్లడించారు. ఇంటి నుంచి కత్తి తీసుకొచ్చి మండలంలోని గెడ్డకంచరాం – బాతువ కూడలి వద్ద పుక్కళ్ల రాజశేఖర్ (35)ను గొబ్బూరు గ్రామానికి చెందిన దమరసింగి గొల్లబాబు(శంకర్) పథకం ప్రకారమే హత్య చేశాడని సీఐ తెలిపారు. గెడ్డ కంచరాం గ్రామంలో తోటి స్నేహితుడు మేసీ్త్ర అప్పన్న ఇంట్లో ఒక శుభ కార్యానికి రాజశేఖర్, శంకర్ అనే వ్యక్తితో కలిసి వెళ్లాడు. అక్కడ స్నేహితుడు ఇచ్చిన మద్యం సేవించారు. ముద్దాయి గొల్లబాబు ఆలస్యంగా వెళ్లి మద్యం అడగగా.. వారు అప్పటికే మద్యం అంతా తాగేశామని చెప్పడంతో మద్యం విషయంలో ఇద్దరూ గొడవకు దిగారు. ఈ గొడవను అవకాశంగా తీసుకుని ముద్దాయి శంకర్ తన ఇంటి వద్ద భద్రపరుచుకున్న కత్తిని తీసుకొచ్చి రాజశేఖర్‌కు ఫోన్ చేశాడు. ఆయన లిఫ్ట్ చేయకపోవడంతో లక్ష్మణ్ అనే వ్యక్తికి ఫోన్‌చేసి రాజశేఖర్ ఎక్కడ ఉన్నాడని అడిగాడు. అయితే గొడవలు వద్దని లక్ష్మణ్ సూచించాడు. అనంతరం మృతుడు రాజశేఖర్, లక్ష్మణలు నడిచి వస్తుండగా గెడ్డకంచ రాం గ్రామ కూడలి వద్ద మృతుడు రాజశేఖర్, ముద్దాయి గొల్లబాబు ఘర్షణ పడ్డారు. ఈ సమయంలో రాజశేఖర్ కడుపులో పదునైన కత్తితో గొల్లబాబు పొడిచాడు. దీంతో వెంటనే లక్ష్మణ్ తన బైక్‌తో జి.సిగడాం ఆరోగ్య కేంద్రానికి చికిత్స నిమి త్తం తీసుకెళ్లాడు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమించడంతో శ్రీకాకళం రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆగస్టు 25న మృతి చెందాడు. మృతుడు భార్య హరిప్రియ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. మారణాయుధాలు స్వాధీనం మృతుడు రాజశేఖర్‌తో గత కొన్ని రోజులుగా ముద్దాయి శంకర్‌కు గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఆగస్టు నెలలోనే హత్య చేసేందుకు ఆన్లైన్ ద్వారా పదునైన కత్తిని కొనుగోలు చేశాడు. దీంతో హత్యకు ఉపయోగించిన కత్తిని ఎస్ఐ మధుసూదనరావు స్వాధీనం చేసుకున్నారు. రెవెన్యూ సిబ్బంది సహకారంతో ముద్దాయి ఇంటి చుట్టూ తనికీ చేశా రు. హత్య జరిగిన వారం రోజుల్లోనే ముద్దాయితో పాటు ఆయుధాలను సేకరించి, సోమవారం అరెస్టు చేసి కోర్టులో హజరు పరచడంపై జేఆర్‌పురం సీఐ ఎం.అవతారం జి.సిగడాం ఎస్ఐ వై.మధుసూదనరావును అభినందించారు. -
స్వాతంత్య్ర సమరంలో అవిభక్త కొరాపుట్‌పై చర్చ
జయపురం: దేశ స్వాతంత్య్ర సమరంలో అవిభక్త కొరాపుట్ భూమికపై జయపురం పూజ్య పూజా సంసద్ విభాగం ఆధ్వర్యంలో మాసిక సాహితీ సమావే శం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా స్వాతంత్య్ర పోరాటంలో కొరాపుట్ భూమికపై సాహితీ ప్రియులు చర్చించారు. పూజ్య పూజా సంసద్ ఉపాధ్యక్షులు తపనకిరణ త్రిపాఠీ అధ్యక్షతన జరిగిన చర్చా వేదికకు సాహితీవేత్త, జయపురం సాహిత్య పరిషత్ మాజీ అధ్యక్షులు హరిహర కరసు ధా పట్నాయక్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కవియిత్రులు భావచంద్రికా దేవి, అనంత బిజయ ధీవర్ అతిథులుగా పాల్గొన్నారు. అనసూయ సామంతరాయ్, ప్రమోద్ కుమార్ రౌళో, జానకీ పాణిగ్రహి, భగవాన్ సాబత్, నారాయణ సాగర్, ఝున్ను పండ, సంధ్యా రాణి సాహు. ప్రతీత సాహు పాల్గొని చర్చించారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరంలో ఎరుపెక్కిన కొరాపుట్‌లో స్వాతంత్య్ర యోధుల భూమికపై కవితలు వినిపించారు. అనంతరం పూజ్యపూజా సంసద్ అధ్యక్షులు ఉదయ శంఖర జాని ఆధ్వర్యంలో కవితా పఠన కార్యక్రమంలో పలువురు ఔత్సాహిక రచయితలు స్వాతంత్య్ర పోరాటంలో అవిభక్త కొరాపుట్ లో జరిగిన ఘట్టాలపై తమతమ స్వీయ రచనలను చదివి వినిపించారు. కవితలను పూజ్యపూజ సంసద్ సాధారణ కార్యదర్శి బైరాగీ చరణ సాహు సమీక్షించారు. సంసద సహాయ కార్యదర్శి మృత్యంజయ సాహు ధన్యవాదాలు తెలియజేశారు. -
సొంత నిధులతో కల్వర్టు నిర్మాణం
జయపురం: కుండపోత వర్షాలకు జయపురం సబ్ డివిజన్ బొయిపరిగుడ సమితి దొండాబడి పంచా యతీ పనసపుట్ గ్రామ సమీప రోడ్డులో కల్వర్టు కొట్టుకుపోయిన విషయం పాఠకులకు విదితమే. దొండాబడి– చికాపూర్ మధ్య గల కల్వర్టు కొట్టుకుపోవటం వలన ఆ పంచాయతీలో 25 గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దొండాబడి పంచా యతీ సర్పంచ్ చెండియ ఖిలో ఈ విషయాన్ని అధికారు దృష్టికి తీసుకువెళ్లారు. పంచాయతీ ప్రజల ఇబ్బందులను వివరించి, వెంటనే కల్వర్టును బాగు చేయాలని కోరారు. అధికారులు పట్టంచుకోలేదు. సర్పంచ్ తన సొంత డబ్బుతో కల్వర్ట్ను బాగు చేసేందుకు నడుం బిగించారు. ప్రధాన మంత్రి గ్రామ షడక్ యోజనలో మూడేళ్ల కిందట నిర్మించిన కల్వర్టు గతంలో వర్షాలకు రెండు పర్యాయాలు కూలిపోయింది. అధికారులు పట్టించుకోకపోవటంతో ఆ రెండు సార్లు సర్పంచ్ ఖిళో తన సొంత డబ్బు తో బాగు చేయించారని ప్రజలు తెలిపారు. నేడు కూడా వర్షాలకు కొట్టుకుపోయిన కల్వర్టును సొంత డబ్బులు ఖర్చు పెట్టి బాగు చేయిస్తున్నారు. సర్పంచ్‌కు పంచాయతీలోని 9వ వార్డు మెంబర్ అభి గౌడ సహకరిస్తున్నారు. -
100 కిలోల గంజాయి పట్టివేత
మల్కన్‌గిరి: గంజాయి రవాణా గుట్టురట్టయింది. కారులో తరలిస్తున్న వంద కిలోల గంజాయని మల్కన్‌గిరి జిల్లా పోలీసులు ఆదివారం అర్ధరాత్రి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న ముగ్గురిని అరెస్టు చేశారు. మల్కన్‌గిరి సమితి చంపాకారి గ్రామ చెక్‌పోస్టు వద్ద పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా సబ్ఇన్సెక్టర్ సర్వేశ్వర్ బోయి మల్కన్‌గిరి నుంచి జయపురం వైపు వేగంగా వస్తున్న కారును ఆపి తనిఖీలు చేశారు. అందులో నాలుగు బస్తాల్లో గంజాయి ఉన్నట్టు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉన్న ముగ్గుర్ని అరెస్టు చేశారు. సోమవారం నిందితులను విచరించారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన లాలా యాదవ్, గోలాక్ భీశ్వస్, బీహర్‌కు చెందిన లాలాజీ రాజ్‌భర్ కలిసి గంజాయిని ఛతీస్‌గఢ్ తరలించేందుకు కారులో వచ్చి బలిమెల ప్రాంతంలోని కొనుగోలు చేసి తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. పట్టుబడ్డ గంజాయిని తూకం వేయగా వంద కిలోలు ఉందని.. దీని విలువ సుమారు రూ. 25 లక్షలు ఉంటుందని ఐఐసీ రీగాన్‌కీండో తెలిపారు. పట్టుబడిన వారి నుంచి ఏడు వేల రూపాయల నగదు, మూడు సెల్ఫోన్లు, ఆధార్‌కార్డులు స్వాధీనం చేసుకొని కోర్టుకు తరలించాలన్నారు. -
శ్రమ కోడ్‌ను రద్దు చేయాలి
జయపురం:కార్మికులపై కేంద్ర ప్రభుత్వం విధించినచిన శ్రమ కోడ్‌ను రద్దు చేయాలని ఆల్ ఇండియా యునైటెడ్ ట్రేడ్ యూనియన్ కాంగ్రేస్ (ఏఐయూటీయూసీ)డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం ఏఐయూటీయూసీ కొరాపుట్ జిల్లా శాఖ జయపురం సబ్‌డివిజన్ బొయొపరిగులో స్థానిక సమస్యలపై ఆందోళన నిర్వహించారు. యూనియన్ జిల్లా కార్యదర్శి సూర్యనారాయణ బిశాయి నేతృత్వంలో కార్యకర్తలు ప్లకార్డులు చేత బట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బిశాయి నాయకత్వంలో దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఉద్దేశించిన 25 డిమాండ్లతో కూడిన మెమోరండాన్ని బొయిపరిగుడ సమితి బీడీవోకు సమర్పించారు. కార్మికుల ప్రయోజనాలను హక్కులను కాలరాసేలా ఉన్న శ్రమ కోడ్‌ను వెంటనే రద్దు చేయాలని, వ్యవసాయ ఉత్పత్తులకు సరైన మద్దతు ధరలు ప్రకటించాలని, నిత్యావసర, అత్యవసర సరుకుల ధరలు నియంత్రించాలని, కార్మికులకు నెలకు కనీస వేతనం 26 వేల రూపాయలు చేయాలని, నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పించాలని, లేదా వారికి పెన్షన్ చెల్లించాలని కోరారు. ఈ సందర్బంగా సూర్యనారాయణ బిశాయి ప్రసంగిస్తూ.. కేంద్రంలో మోదీ ప్రభుత్వ, రాష్ట్రంలో మోహణ మఝి ప్రభుత్వాలు కార్మిక, రైతు, ప్రజల ప్రయోజనాలను కాల రాస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తుండటంతో దేశంలో నిరుద్యోగులు పెరుగుతున్నారని దుయ్యబట్టారు. రోజు రోజుకు నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలను అంటుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయన్నారు. ధరలను నియంత్రించటంలో బీజేపీ ప్రభుత్వాలు విఫలం కావటంతో ప్రజలు కొనుగోలు శక్తిని కోల్పోతున్నారన్నారు. దేశంలో పేదరికం పెరుగుతుండగా ధనవంతులు మరింత ధనవంతులు అవుతున్నారన్నారు. అందుకు ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వ విదానాలేనని నిందించారు.అందుచేత శ్రామికులు, రైతులు, ప్రజలు తమ హక్కుల సాధనకు పోరాటమే సరైన మార్గం అన్నారు. -
పికప్ వ్యాన్‌ను ఢీకొన్న ట్యాంకర్
రాయగడ: పికప్ వ్యాన్‌ను ట్యాంకర్ ఢీకొన్న ఘటనలో వ్యాన్ డ్రైవర్‌తో సహా రెండు పశువులు మృతి చెందిన ఘటన జిల్లాలోని అంబొదల పోలీస్ స్టేషన్ పరిధిలో గల బొడొమంజూరికుపా సమీపంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. ప్రమాదంలో మృతి చెందిన పికప్ వ్యాన్ డ్రైవర్‌ను పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా ప్రశాంతిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని జగన్నాథపురం గ్రామానికి చెందిన చందాక పవన్ కుమార్ (29)గా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేశారు. పశువుల లోడుతో పికప్ వ్యాన్ జిల్లాలోని అంబొదల నుంచి మునిగుడ వైపు వెళ్తున్న సమయంలో ఎదురుగా వచ్చిన డీజిల్ ట్యాంకర్ అదుపు తప్పి పికప్ వ్యాన్‌ను ఢీకొంది. ప్రమాదం అనంతరం ట్యాంకర్ డ్రైవర్, హెల్పర్లు పరారైనట్లు సమాచారం. -
సెప్టెంబరు 5న మాజీ మంత్రి ఎన్.రఘువీరా రెడ్డి రాక
పర్లాకిమిడి: మాజీ మంత్రి ఎన్.రఘువీరా రెడ్డి సెప్టెంబరు 5న గజపతి జిల్లాలో పర్యటించనున్నట్టు డీసీసీ అధ్యక్షులు, మోహన నియోజకవర్గం ఎమ్మెల్యే దాశరథి గోమాంగో విలేకరులకు తెలియజే శారు. గజపతి జిల్లాలో శ్రీయాన్ అభియాన్ కార్యక్రమం పర్లాకిమిడి నుంచి ప్రారంభం కానుంది. దీనికి ఏఐసీసీ తరఫున సీడబ్ల్యూసీ సభ్యులు మాజీ మంత్రి ఎన్.రఘువీరా రెడ్డిని అఖిల భారత కాంగ్రెస్కమిటీ ఒడిశా పపర్యవేక్షకునిగా నియమించారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున చిన్నయి బెహరా, శ్రీకృష్ణచంద్ర పతి, నిరుపమా పాత్రోలను గజపతి జిల్లా కాంగ్రెస్ పర్యవేక్షకులుగా నియమించారని తెలియజేశారు. ఈ సందర్భంగా స్థానిక పీడబ్ల్యూడీ బంగళాలో డీసీసీ అధ్యక్షులు దాశరథి గోమాంగో ఆధ్వర్యంలో ముందస్తు సమావేశాన్ని జరిపారు. ఈ సమావేశంలో గజపతి జిల్లాలో రెండు నియోజికవర్గాలు పర్లాకిమిడి, మోహన నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. మాజీ వైస్ చైర్మన్ సంజయ్ కుమార్ అధికారి, మహిళా నేత్రి జాస్మిన్ షేక్, సంతు రోథో తదితరులు పాల్గొన్నారు. -
ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన
భువనేశ్వర్: రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ సోమవారం 4 రోజుల ఢిల్లీ పర్యటనకు బయల్దేరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి న్యూ ఢిల్లీలో జరగనున్న ద్రవ్య, సేవా పన్ను (జీఎస్టీ) మండలి 56వ సమావేశానికి హాజరు కానున్నారు. ఈ నెల 3, 4వ తేదీల్లో వరుసగా 2 రోజులపాటు ఈ సమావేశం కొనసాగుతుంది. ఢిల్లీ ప్రయాణానికి ముందుగా జీఎస్టీ మండలి సమావేశంలో చర్చనీయాంశ అంశాలపై అధికారులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ సమావేశానికి రాష్ట్రం పలు కీలక ప్రతిపాదనల్ని ప్రవేశ పెట్టే యోచనతో అడుగులు వేస్తుంది. ద్రవ్య, సేవా పన్ను కుదింపు ద్రవ్య, సేవా పన్ను వ్యవస్థలో కొనసాగుతున్న 4 స్థాయిల పన్ను వడ్డన వ్యవస్థని సంస్కరించాలని ముఖ్యమంత్రి ప్రతిపాదించనున్నారు. ఈ ప్రతిపాదన ప్రకారం ద్రవ్య సేవా పన్ను 4 స్థాయిల నుంచి 2 స్థాయిలకు పరిమితం చేయాలని యోచిస్తున్నారు. ప్రస్తుతం 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం ద్రవ్య, సేవా పన్ను రేటు వ్యవస్థ కొనసాగుతుంది. దీన్ని 2 స్థాయిల విధానానికి మార్చడంతో ద్రవ్య, సేవా పన్ను వ్యవస్థ సరళీకృతం చేసేందుకు మార్గం సుగమం అవుతుందని ప్రతిపాదించనున్నారు. ఈ లెక్కన నిత్య అవసర ద్రవ్యాలు, సేవలకు 5 శాతం పన్ను, అత్యవసర ద్రవ్య, సేవలకు 18 శాతం పన్ను వ్యవస్థని ప్రతిపాదించనున్నారు. విలాసవంతమైన కార్లు, పొగాకు తదితర వర్గీయ ద్రవ్యాలు, సేవలకు 40 శాతం పన్ను ప్రవేశ పెట్టాలని మండలి సమావేశంలో చర్చనీయాంశంగా ప్రవేశ పెట్టనున్నారు. ఈ నెల 2 నుంచి 4వ తేదీ వరకు న్యూ ఢిల్లీ యశోభూమిలో జరిగే సెమికాన్ ఇండియా 2025 కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంతో పాటు పలు ఇతర కార్యక్రమాల్లో ఆయన పాల్గొనే అవకాశం ఉంది. రాష్ట్ర సెమీకండక్టర్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడంపై చర్చలకు కూడా ఆయన హాజరయ్యే అవకాశం ఉంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులు, కేంద్ర నాయకులతో ముఖ్యమంత్రి సమావేశాలు ఉంటాయని భావిస్తున్నారు. రాష్ట్రంలో సంస్థాగత ఏర్పాటుతో సహా వివిధ విషయాలను చర్చించనున్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మంత్రి పదవులు మరియు కార్పొరేషన్ చైర్పర్సన్ పదవులను భర్తీ చేయడం గురించి కూడా చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి తన పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చలు జరిపితే, రాష్ట్ర మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణ, విస్తరణపై ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసే అవకాశం ఉంది. రాష్ట్రంలో 6 మంత్రి పదవులు, వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్ పదవులు ఏడాదికి పైగా ఖాళీగా ఉన్నాయి. వాటి భర్తీ పట్ల సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. -
సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాలి
రాయగడ: మన భాష, సంస్కృతి, ఆచార వ్యవహారాలు, కళలు, సంప్రదాయాలపై యువత అవగాహన కలిగి ఉండాలని స్థానిక అటానమస్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ ప్రసన్నకుమార్ గంతాయిత్ అన్నారు. వినాయక ఉత్సవాల్లో భాగంగా స్థానిక రామక్రిష్ణనగర్లో ఆదివారం రాత్రి చిన్నారుల మధ్య పాటలు, నృత్య పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. మన రాష్ట్రం భిన్న సంస్తృతులు, కళలకు పుట్టినిళ్లన్నారు. వాటిపై యువతకు అవగాహన కలిగేలా ఇటువంటి తరహా కార్యక్రమాలను నిర్వహిస్తుండాలని అన్నారు. అయితే నేటి యువత ఆధునిక పోకడలకు బానిసై మన సంస్తృతులకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం వివిధ పోటీల్లొ గెలుపొందిన చిన్నారులకు బహుమతులను అందజేశారు. ఉపాధ్యాయుడు అమరేంద్ర జెన్న, నృత్య శిక్షకురాలు ఆర్. ఇందిరాలు పోటీలకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. మంటల్లో చిక్కుకున్న విద్యుత్ వాహనం భువనేశ్వర్: స్థానిక నయాపల్లి ప్రాంతంలోని ఫ్లై ఓవర్‌పై సోమవారం విద్యుత్ వాహనం (స్కూటీ) మంటల్లో చిక్కుకుంది. అదృష్టవశాత్తు స్కూటీ రైడర్ సురక్షితంగా ప్రాణాలతో బయటపడగలిగాడు. ఫ్లై ఓవర్‌పై స్కూటీపై యువకుడు ప్రయాణిస్తుండగా వాహనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ పరిస్థితి గమనించిన మరుక్షణమే స్కూటీని ఆపి కిందకు దిగడంతో ప్రాణ హాని తప్పింది. రోడ్డుపై ఉన్న జనం చూస్తుండగా కాసేపటికే స్కూటీ దగ్ధమైంది. ఈ ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భావిస్తున్నారు. పులి చర్మాలు స్వాధీనం రాయగడ: జిల్లాలోని కొలనార ఎన్‌హెచ్ రోడ్డు సమీపంలో డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, ముంబై జోనల్ యూనిట్ అధికారులు ఆదివారం రాత్రి నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో రెండు పులి చర్మాలతో పాటు నలుగురిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన ప్రభాకర్ నాయక్, రాజ్ కుమార్ గుప్తా, రాయగడ జిల్లా గునుపూర్లోని మఛకుంటి ప్రాంతానికి చెందిన మహేష్ హుయిక, పుటాసింగి ప్రాంతానికి చెందిన జిసయ్య గొమాంగోలు ఉన్నారు. వీరి నుంచి స్వాధీనం చేసుకున్న పులి చర్మాలతో పాటు నిందితులను రాయగడ అటవీ శాఖ రేంజ్ అధికారి కామేశ్వర్ ఆచారికి అధికారులు అప్పగించారు. అనంతరం వారిపై కేసు నమోదు చేసి నిందితులను కోర్టుకు తరలించారు. చైన్నెలో వలస కార్మికుడు మృతి పర్లాకిమిడి: గజపతి జిల్లా గుమ్మాసమితి పరిడా గ్రామానికి చెందిన వలస కార్మికుడు బాలకృష్ణ ఘంట (32) చైన్నెలో శనివారం మూడంతస్తుల భవనం నుంచి జారిపడి మృతి చెందాడు. పరిడా గ్రామానికి చెందిన బాలకృష్ణ ఘంట పొట్టకూటి కోసం చైన్నె వెళ్లి భవన నిర్మాణంలో రాజమేసీ్త్ర వద్ద మేసీ్త్రగా పని చేస్తున్నాడు. ఆదివారం సాయంత్రం ఒక ప్రైవేటు భవంతిలో పనిచేస్తుండగా మూడోఅంతస్తు వద్ద కాలుజారి పడిపోయి మృత్యువాత పడ్డాడు. ఈ సమాచారం అందుకున్న పరిడా గ్రామస్తులు చైన్నె వెళ్లి బాలక్రిష్ణ ఘంట పనిచేస్తున్న రాజమేసీ్త్రని సంప్రదించి శవాన్ని ఒడిశాలో గజపతి జిల్లాలో పరిడా స్వగ్రామానికి సోమవారం తీసుకువచ్చారు. -
సీఎంను కలిసిన శ్రీ మందిరం కొత్త పాలక మండలి సభ్యులు
భువనేశ్వర్: పూరీ శ్రీ జగన్నాథ ఆలయం కొత్త పాలక మండలి సభ్యుల బృందం రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝితో లోక్ సేవా భవన్లో సోమవారం భేటీ అయింది. పూరీని దేశంలోనే అత్యుత్తమ మతపరమైన, పర్యాటక కేంద్రంగా పూరీ శ్రీ క్షేత్రాన్ని తీర్చిదిద్దడంలో ప్రభుత్వం ప్రక్రియను ప్రారంభించింది. శ్రీ జగన్నాథుని సేవలు, శ్రీ మందిరం బహుముఖాభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా మద్దతును అందిస్తూనే ఉంటుందని ముఖ్యమంత్రి అభయం ఇచ్చారు. శ్రీ క్షేత్రానికి విచ్చేసే భక్తులు, యాత్రికులు, పర్యాటకుల కోసం పూరీ నగరంలో అనేక సౌకర్యాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తెలిపారు. శ్రీ మందిరంలో నిత్య దైనందిన సేవాదులతో ఉత్సవాలు, పండగ పబ్బాలు వంటి ప్రత్యేక సందర్భాల్లో ఆలయ విఽధివిదానాలు, ఉత్సవాల నిర్వహణ క్రమబద్ధీకరణతో పూరీ పట్టణ ప్రాంతదం అభివృద్ధిని వేగవంతం చేయడంపై పాలక మండలి సభ్యులు ముఖ్యమంత్రితో చర్చించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి పాలక మండలి సభ్యులకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. శ్రీ మందిరం కొత్త పాలక మండలి నుంచి కృష్ణచంద్ర సామంతరాయ (సువార్వర్గం ప్రతినిథి), రఘుబీర్ దాస్ (మఠాధీష్), రామనారాయణ గొచ్ఛికర్ (ప్రతిహారి నియోగ్), మధుసూదన్ సింఘారి (పుష్పాలక్ నియోగ్), జగన్నాథ్ పూజాపండాతో కూడిన ప్రతినిధి బృందం ముఖ్యమంత్రిని కలిసింది. -
ఐఎఫ్ఎస్ అధికారుల సమావేశం
మంగళవారం శ్రీ 2 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025గవర్నర్, సీఎంతో ..భువనేశ్వర్: 2000, 2001 బ్యాచ్‌లకు చెందిన భారతీయ విదేశీ సేవలు (ఐఎఫ్ఎస్) అధికారుల బృందం సోమవారం రాజ్ భవన్లో గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి, లోక్ సేవా భవన్లో రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝిని కలిశారు. ఈ సందర్భంగా స్థానిక కళింగ స్టేడియంను సందర్శించారు. ఈ ఐఎఫ్ఎస్ అధికారుల బృందంలో రొమేనియాకు భారత రాయబారి డాక్టర్ మనోజ్ కుమార్ మహాపాత్రో, రిపబ్లిక్ ఆఫ్ స్లోవేనియాకు భారత రాయబారి అమిత్ నారంగ్, రిపబ్లిక్ ఆఫ్ మాల్టాకు భారత హైకమిషనర్ గ్లోరియా గ్యాంగ్టే ఉన్నారు. సమావేశంలో, అధికారులు ముఖ్యమంత్రితో రాష్ట్రంలో పాలన, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రపంచవ్యాప్తంగా భారత దేశం దౌత్యపరమైన సంబంధాల పటిష్టత దిశలో కార్యాచరణ తదితర అంశాలపై అధికారుల బృందం ముఖ్యమంత్రితో సంభాషించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు. విదేశాలలో భారత దేశ ప్రయోజనాలను ప్రాతినిధ్యం వహించడంలో కీలక పాత్రధారులుగా న్యాయం చేసే దిశలో నిరంతరం కృషి చేయాలని అధికారుల్ని ప్రోత్సహించారు. ఈ ఏడాది రాష్ట్రంలో ప్రవాసీ భారతీయ దివస్‌ను విజయవంతంగా నిర్వహించడంపై అధికారులు ప్రశంసలు కురిపించారు. ఇది ప్రపంచ భారతీయులు, ముఖ్యంగా ఒడియాలు రాష్ట్రంతో మరింత అనుసంధానం కావడానికి ప్రోత్సహించిందని కొనియాడారు. యూరప్ దేశాల్లో నైపుణ్యం కలిగిన యువతకు పెరుగుతున్న డిమాండ్‌ను రాయబారులు వివరించారు. రాష్ట్ర యువతకు తగినంత అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకునివెళ్లారు. నైపుణ్య కార్యక్రమాల ద్వారా ఒడిశా తన యువతను సన్నద్ధం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చురుకై న చర్యలు చేపడుతుందని ముఖ్యమంత్రి వివరించారు. స్కిల్డ్ ఇన్ ఒడిశా చొరవ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన బ్రాండ్‌గా మారింది. రాష్ట్ర యువతకు ఉజ్వల భవిష్యత్ ప్రసాదిస్తుందన్నారు. యూరోప్ దేశాలలో ఒడిశా సాంస్కృతిక వారసత్వం మరియు హస్తకళలను ప్రోత్సహించడం వల్ల రాష్ట్రానికి ప్రపంచ శ్రేణి గుర్తింపు లభిస్తుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ బృందం అధికారులు కళింగ స్టేడియంను సందర్శించారు. ఈ సందర్భంగా క్రీడా విభాగం కార్యదర్శి, డైరెక్టర్ ఇతర సీనియర్ అధికారులతో సంభాషించారు. ఒడిశా సమగ్ర పర్యావరణ వ్యవస్థ, అట్టడుగు అభివృద్ధిపై అధికారుల బృందం దృష్టి సారించింది. ఒడిశా క్రీడా నైపుణ్యం ప్రపంచ గుర్తింపును సాధించిందని అధికారులు ప్రశంసించారు. -
అదుపుతప్పి.. ఇంట్లోకి దూసుకుపొయి..
● ఇద్దరికి గాయాలు రాయగడ: జిల్లాలోని టికిరి పోలీస్‌స్టేషన్ పరిధి సనోమట్టికొన గ్రామంలో కారు అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న ఓ ఇంట్లోకి దూసుకుపొయింది. ఈ ఘటనలో కారు డ్రైవర్‌తో సహా అందులో ప్రయాణిస్తున్న ఒకరు గాయపడ్డారు. చంద్రమణి నాయక్ అనే మహిళ ఇల్లు దెబ్బతింది. సమాచారం తెలుసుకున్న టికిరి పోలీసులు సంఘటన స్థలానికి చేరకుని ప్రమాదంలో గాయపడిన వారిని టికిరిలోని ఉషాపాడు ఆస్పత్రికి తరలించారు. ఆదివారం అర్ధరాత్రి కంసారిగుడ నుంచి టికిరికి వస్తున్న కారు అదుపుతప్పి ఇంటిలొకి దూసుకుపొవడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంటిని నష్టపోయిన బాధిత కుటుంబానికి పరిహారం చెల్లించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. కారు డ్రైవర్, గాయపడిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. ఆఫ్ఘన్ మృతులకు గవర్నర్ సంతాపం భువనేశ్వర్: ఆఫ్ఘనిస్తాన్‌లో సంభవించిన వినాశకరమైన భూకంపం తీవ్ర విషాదకరం. ఈ విషాద సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి సంతాపం ప్రకటించారు. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. -
త్వరలో అధిక లగేజీకి అదనపు చార్జీలు
భువనేశ్వర్: అధిక లగేజీతో తోటి ప్రయాణికులకు అసౌకర్యం నివారించేందుకు రైల్వే శాఖ చర్యలు చేపడుతోంది. టికెట్ లేని ప్రయాణం సామాజిక నేరం తరహాలో అధిక లగేజీ అదనపు భారం నినాదంతో ఆంక్షలు విధిస్తోంది. విమానయానం తరహాలో ప్రయాణ శ్రేణి ప్రామాణికంగా రైలు ప్రయాణికులకు లగేజీ పరిమితం చేసేందుకు రంగం సిద్ధం చేసింది. అదనపు లగేజీకి అదనపు చార్జీలు వడ్డించే యోచనతో రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. ప్రముఖ రైల్వే స్టేషన్లలో తొలుత ఈ చర్యను చేపట్టి అంచెలంచెలుగా దేశవ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లకు విస్తరిస్తారు. అపరిచిత లగేజీపై అదనపు చార్జీలు వడ్డించడంతో అసౌకర్యవంతమైన భారీ లగేజీ తొలగిస్తారు. అదనపు లగేజీ చార్జీలు పరిమితి మించిన లగేజీకి అదనపు చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. సాధారణ బుకింగ్ కంటే ఒకటిన్నర (1.5) రెట్లు ఎక్కువ లెక్కింపుతో జరిమానా విధిస్తారు. కనీస చార్జీ రూ. 30గా పరిగణనలోకి తీసుకుంటారు. కోచ్‌లలో అధిక స్థలాన్ని ఆక్రమించే భారీ బ్యాగులకు కూడా జరిమానాలు విధించే యోచన పరిశీలనలో ఉంది. ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలతో లగేజీ బరువు తూకం వేస్తారు. -
ఘనంగా స్వపరిపాలన దినోత్సవం
పర్లాకిమిడి: అఖిల భారత స్వపరిపాలన దినోత్సవం సందర్భంగా స్థానిక పురపాలక సంఘం కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ నిర్మలా శెఠి జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా పురపాలక సంఘం అధ్యక్షురాలు మాట్లాడుతూ, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఒడిషాలో అతి పురాతన, రెండో అతిపెద్ద పురపాలక సంఘం పర్లాకిమిడి అని అన్నారు. పురపాలక సంఘం పరిధిలో అనేక అభివృద్ధి పనులు జరిగాయని, ఇంకా అనేక పథకాలకు నిధులు ఖర్చుపెట్టి సర్వాంగ సుందరంగా తీర్చుదిద్దుతామని అన్నారు. అనంతరం పురపాలక సంఘం పరిధిలో పనిచేస్తున్న అత్యుత్తమ సేవలు అందించిన సిబ్బందికి అవార్డులను చైర్మన్ నిర్మల అందజేశారు. ఉత్తమ ఇళ్ల పన్నులు వసూలు చేసిన అలియా శోబోరో, మనోజ్ శతపతికి అవార్డులను చైర్మన్ నిర్మలా అందజేశారు. అంతకు ముందు కొత్త బస్టాండు వద్ద అంబేడ్కర్ విగ్రహానికి వార్డు నంబర్ 1 కౌన్సిలరు అలిజింగి అమ్ములమ్మ పూలమాలలు వేసి వందనం సమర్పించారు. అలాగే పురపాలక సంఘం కార్యాలయం, పాత బస్టాండు పార్కు వద్ద మహారాజా కృష్ణచంద్ర గజపతికి విగ్రహానికి పూలమాలలు సమర్పించి వందనాలు సమర్పించారు, కార్యక్రమంలో మున్సిపల్ ఉపాధ్యక్షులు లెంక మధు, కౌన్సిలర్లు బాలకృష్ణ పాత్రో, బబునా బెహారా, త్రిపాఠి, అమ్ములమ్మ పురపాలక ఈఓ, లక్ష్మణ ముర్ము తదితరులు పాల్గొన్నారు. రాయగడలో.. రాయగడ: పట్టణ ప్రజలకు మౌలిక సౌకర్యాలు క ల్పించడంతో పాటు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ అశుతొష్ కులకర్ణి అన్నారు. స్థానిక మున్సిపాలిటీ ఆడిటోరియంలొ ఆదివారం నాడు మున్సిపాలిటీ యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన స్వపరిపాలన దినొత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన కలెక్టర్ రాష్ట్రంలో ఉత్తమ మున్సిపాలిటీగా అన్ని రంగాల్లో ముందడుగు వేసేలా అధికారులు, పాలకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలను దృష్టిలో పెట్టుకుని వాటిని సకాలంలో పరిష్కరించేందుకు పాటుపడాలని అన్నారు. రహదారుల నిర్మాణం, పరిశుభ్రత పాటించడంపై యంత్రాంగం శ్రద్ధ వహించాలని హితవు పలికారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థుల మధ్య నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విజేతలకు కలెక్టర్ బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహక అధికారి అక్షయ కుమార్ ఖెముండొ, మున్సిపాలిటీ చైర్మన్ మహేష్ కుమార్ పట్నాయక్, వైస్ చైర్మన్ శుభ్రా పండ, కార్యనిర్వాహక అధికారి కులదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గుణుపూర్‌లో.. స్వపరిపాలన దినొత్సవాన్ని పురష్కరించుకుని జిల్లాలోని గుణుపూర్ మున్సిపాలిటీ యంత్రాంగం నిర్వహించిన సమావేశంలో గుణుపూర్ బీడీఓ స్వస్థిక్ జమాదర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మున్సిపాలిటీ చైర్మన్ మమత గౌడొ, వైస్ చైర్మన్ శివ కుమార్ గౌడొ, కార్యనిర్వాహక అధికారి సంతొష్ కుమార్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ గౌడొ మాట్లాడుతూ అందరి సహకారంతొ గుణుపూర్ని అభివృద్ధి పరచాలని ఆకాంక్షించారు. -
సెంచూరియన్ యూనివర్సిటీతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం
కొరాపుట్, పర్లాకిమిడి: సెంచూరియన్ యూనివర్సిటీ ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంతో చారిత్రక ఒప్పందం కుదుర్చుకుంది. ఉత్తర ప్రదేశ్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ వర్సిటీల మధ్య ఈ నెల 29న ఎంఓయూ కుదిరింది. లక్నోలో జరిగిన సమావేశంలో ఈ మేరకు ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ద్వారా పరిశోధనాత్మక, న్యాయ సంబంధిత, సాంకేతిక అంశాల్లో రెండు సంస్థలు పరస్పరం సహకారం అందించుకుంటాయి. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ డీఐజీ రాజీవ్ కృష్ణతో సెంచూరియన్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ ముక్తికాంత్ మిశ్రా సమాలోచనలు చేశారు. డీఐజీ మాట్లాడుతూ ఈ రెండు సంస్థల కలయిక పరిశోధన రంగంలో నూతన మార్పులు తీసుకువస్తుందని తెలిపారు. సెంచూరియన్ వర్సిటీ ప్రెసిడెంట్ ముక్తి కాంత్ మిశ్రా మాట్లాడుతూ తాము 2016లోనే గుజరాత్ ఫోరెన్సిక్ విభాగంతో పనిచేశామని, ఇప్పుడు ఈ కొత్త ఒప్పందంతో ఫోరెన్సిక్ సేవలు సమాజానికి ఉపయోగపడతాయన్నారు. ఈ ఒప్పందంపై ఉత్తర్ ప్రదేశ్ ఏడీఐజీ నవీన్ ఆరోరా, సెంచూరియన్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ సుప్రియ పట్నాయిక్ సంతకాలు చేశారు. కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ లక్నో లోని స్టేట్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కి చెందిన డాక్టర్ సుధీర్ కుమార్, సెంచూరియన్ యూనివర్సిటీ అంతర్జాతీయ, ప్రభుత్వ సంబంధాల డైరెక్టర్ మెనాలిసా ఘోష్, డాక్టర్ రీనా, సి.జమాతానీ తదితరులు పాల్గొన్నారు. -
గణేష్ మండపాల సందర్శన
పర్లాకిమిడి: గుసాని సమితిలోని సర్దాపురం, గురండి, జాజిపురం గ్రామాల్లో నెలకొల్పిన వినాయక చవితి పెండాళ్లను పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి ఆదివారం సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆయనతో గుసాని సమితి చైర్మన్ ఎన్.వీర్రాజు, పలువురు సర్పంచులు, సమితి సభ్యులు ఉన్నారు. ‘అత్యాచారాలు అరికట్టాలి’ జయపురం: దేశంలో మహిళలు, బాలికలపై లైంగిక దాడులు కలవరపరుస్తున్నాయని నారీ నిర్జాతన విరోధి నాగరిక కమిటీ కన్వీనర్ ఇంద్రాణీ దాస్ ఆవేదన వ్యక్తం చేసారు. ఆదివారం స్థానిక సరోజినీ భవనంలో నారీ నిర్జాతన విరోధీ నాగరిక కమిటీ నిర్వహించిన కన్వెన్షన్‌లో ఆమె వక్తగా పాల్గొన్నారు. ఒడిశాలో రోజూ 180కిపైగా మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నాయని, అత్యాచారాలు నియంత్రించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కోల్‌కతాలో పీజీ చేస్తున్న డాక్టర్‌ను హత్య చేశారని, ఉత్తరప్రదేశ్‌లో 19 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్ జరిగిందని, ఉన్నావో వద్ద మైనర్‌ను హత్య చేశారని తెలిపారు. అవిభక్త కొరాపుట్ జిల్లా జయపురంలో నర్సింగ్ చదువుతున్న విద్యార్థిని ఈ వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకుందని, మల్కన్గిరిలోనూ సామూహిక లైంగిక దాడి జరిగిందని తెలిపారు. ప్రజలు వీటిపై చైతన్యం పెంచుకోవాలని సూచించారు. బీహారీ మద్యం తయారీ కేంద్రంపై గిరిజనుల దాడి కొరాపుట్: బీహారీ మద్యం తయారీ కేంద్రంపై గిరిజనులు సామూహికంగా దాడి చేశారు. ఆదివారం నబరంగ్‌పూర్ జిల్లా చందాహండి సమితి వంతెబెడ గ్రామ పంచాయతీ నువాపెడ గ్రామానికి చెందిన స్థానికులు ఈ దాడిలో పాల్గొన్నారు. ప్రభుత్వ అనుమతితో ఉన్న ఈ సారా తయారీ కేంద్రం వద్ద గిరిజనులు మ ద్యంకు బానిసలైపోతున్నారని ఆరోపించారు. కేంద్రాన్ని ఎత్తివేయాలని అధికారులను కోరినా పట్టించుకోలేదన్నారు. దీంతో మూకుమ్మడిగా దాడి చేసి ధ్వంసం చేశారు. ఆలస్యంగా చేరుకున్న చందాహండి పోలీసులు గిరిజనులకు నచ్చజెప్పి అక్కడి నుండి తరలించారు. కార్పొరేషన్‌గా ప్రకటించాలని డిమాండ్ జయపురం: జయపురం మున్సిపాలిటీని కార్పొరేషన్ (మహానగర్)గా ప్రకటించాలని జయపురం మున్పిపల్ మాజీ చైర్మన్లు, మాజీ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. స్వయం పాలన దినోత్సవం సందర్భంగా కమిటీని ఏర్పాటు చేశారు. పట్టణంలోని పెద్దలతోపాటు మాజీ కౌన్సిలర్లు ఆదివారం సమావేశమయ్యారు. మహానగరంగా ప్రకటించాలని తీర్మానించారు. జయపురం పట్టణాన్ని అభివృద్ధి చేయాలన్నారు. కార్పొరేషన్‌గా ప్రకటించకపోతే ఆందోళనలు చేస్తామన్నారు. మున్సిపల్ మాజీ చైర్మన్, మాజీ మంత్రి రబినారాయణ నందో, మాజీ కౌన్సిలర్లు బాలా రాయ్, బినోద్ మహాపాత్రో, డాక్టర్ సురేష్ దాస్, మాజీ వైస్ చైర్మన్ సూర్యనారాయణ రథ్, మాజీ చైర్మన్ ఆర్.పద్మ, మాజీ వైస్ చైర్మన్లు దుర్గా ప్రసాద్ శర్మ, వి.ప్రసాద రావు, మాజీ కౌన్సిలర్లు శశి పట్నాయక్, ఎ.శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. -
కాశీనగర్‌లో ప్రాజెక్టుల రూపకల్పన
పర్లాకిమిడి: గజపతి జిల్లాలోని కాశీనగర్ నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద స్థానిక సంస్థల స్వపరిపాలన దినోత్సవాన్ని ఆదివారం వైభవంగా ని ర్వహించారు. చైర్మన్ మేడిబోయిన సుధారాణి జాతీయ జెండాను ఎగురవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాశీనగర్ నగరపాలక సంస్థలో అభివృద్ధి ప్రాజెక్టుల కోసం రూపకల్పన చేశామని చెప్పారు. ఈ సందర్భంగా ఎన్ఏసీ చైర్మన్ సుధారాణిని ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి సత్కరించారు. కార్యక్రమంలో పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, జిల్లా పరిషత్ అధ్యక్షులు గవర తిరుపతి రావు, సబ్‌కలెక్టర్ అనుప్ పండా, వైస్ చైర్మన్ రఘురాం సాహు, కాశీనగర్ సమితి చైర్మన్ బల్ల శాయమ్మ, కాశీనగర్ ఎన్ఏసీఈవో భాగవత్ సాహు, తహసీల్దార్ సుధీర్ నందో, పలువురు వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
బారంగ్‌లో తొలి అంధుల విశ్వవిద్యాలయం
● 30 ఎకరాల స్థలం గుర్తింపుభువనేశ్వర్: దృష్టి లోపం ఉన్న వారి కోసం దేశంలోనే మొట్టమొదటి విశ్వవిద్యాలయం బారంగ్ గంగేశ్వర్ మౌజాలో నిర్మిస్తున్నారు. దీని కోసం భూమి గుర్తింపు ప్రక్రియ పూర్తయింది. దివ్యాంగుల సామాజిక భద్రత, సాధికారత (ఎస్ఎస్ఈపీడీ) తుది ఆమోదం కోసం వేచి ఉంది. గంగేశ్వర్ మౌజాలో ఈ విశ్వవిద్యాలయం కోసం 29.75 ఎకరాల భూమిని గుర్తించారు. కటక్ నగరంలో విశ్వవిద్యాలయాన్ని నిర్మించడానికి అనుకూలమైన స్థలం లభ్యం కాకపోవడంతో జంట నగరాల మధ్య బారంగ్ ప్రాంతంలో సుమారు 40 ఎకరాల స్థల సేకరణకు ఎంపిక చేశారు. తదుపరి దశలో విశ్వవిద్యాలయం కోసం సుమారు 30 ఎకరాల భూమిని ఖరారు చేశారు. ఈ భూమిని ఎస్ఎస్ఈపీడీ పేరుకు బదలాయించేందుకు ఇప్పుడు ప్రక్రియ ప్రారంభమైంది. దీని కోసం, జిల్లా సామాజిక భద్రతా అధికారికి సమన్వయ బాధ్యత అప్పగించారు. భూ కేటాయింపు ప్రక్రియను పూర్తి చేసే బాధ్యతను ఆ శాఖకు అప్పగించారు. ప్రతిపాదిత తొలి అంధుల విశ్వ విద్యాలయానికి భీమ భొయ్ సెంట్రల్ యూనివర్సిటీ ఫర్ ది బ్లైండ్ పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేయడం గమనార్హం. గతంలో, స్థలం ఎంపిక సమయంలో కేంద్ర ప్రతినిధి బృందం కటక్, భువనేశ్వర్‌లోని వివిధ ప్రదేశాలను సందర్శించింది. అయితే, ఈ విద్యా సంస్థ యొక్క జాతీయ ప్రాముఖ్యత దృష్ట్యా కటక్, భువనేశ్వర్ మధ్య ప్రాంతాన్ని ఎంపిక చేశారు. మరోవైపు, ప్రస్తుతం రాష్ట్రంలో అంధుల కోసం దాదాపు 26 పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు యూనివర్సిటీ ఫర్ ది బ్లైండ్ నుంచి మరింత ప్రయోజనం పొందగలరని జిల్లా సామాజిక భద్రతా అధికారి మనోజ్ కుమార్ రథ్ అన్నారు. -
బొరిగుమ్మలో హర్షాతిరేకాలు
కొరాపుట్: రాష్ట్ర స్వయం పరిపాలన దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి మొహన్ చరణ్ మాఝి రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత గుర్తించిన మున్సిపాలిటీలు, ఎన్ఏసీల జాబితా ప్రకటించారు. అందులో బొరిగుమ్మ పంచాయతీ కేంద్రానికి ఎన్ఏసీ హోదా కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో పార్టీలకు అతీతంగా ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. అధికార బీజేపీకి చెందిన గౌతం శాంత్ర నేతృత్వంలో కార్యకర్తలు బొరిగుమ్మ మెయిన్ రోడ్డులో ర్యాలీ నిర్వహించారు. ముఖ్య జంక్షన్లో ప్రజలకు మిఠాయి పంచి పెట్టారు. కాంగ్రెస్‌కు చెందిన జయపూర్ ఎమ్మెల్యే తారా ప్రసాద్ బాహిణీపతి మీడియాతో మాట్లాడుతూ ఇది బొరిగుమ్మ ప్రజల పోరాట ఫలితమన్నారు. బీజేడీకి చెందిన మాజీ మంత్రి రబి నారాయణ నందో మాట్లాడుతూ గతం లోనే మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నయక్ బొరిగుమ్మ ని ఎన్ఏసీగాగా ప్రకటించిన విషయం గుర్తు చేసారు. -
సమస్యలతో సతమతం
ఎచ్చెర్ల : ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ యూనివర్సిటీని కూటమి పాలకులు గాలికొదిలేశారు. మౌలిక సదుపాయాలు, ఇతర సమస్యలతో సతమతమవుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. ఎవరు ముందుకు వస్తే ఎవరినెత్తిన భారం పడుతుందోనని కూటమి పాలకులు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఇక్కడ ప్రతి ఏడాది మహిళా విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. దీనికి అనుగుణంగా మహిళా వసతి గృహాలు లేవు. ప్రస్తుతానికి రెండు వసతి గృహాలు అవసరమున్నా ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. దీనికితోడు విద్యుత్, మైదానం వంటి సమస్యలు వేధిస్తున్నాయి. పాలకమండలి సమావేశాలకు మోక్షమెప్పుడో? వర్శిటీ పాలకమండలి సమావేశాలను ఆరు నెలలకు ఒకసారి నిర్వహించాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కసారి కూడా సమావేశాలను నిర్వహించలేదు. ఈ సమావేశానికి రాష్ట్ర ఉన్నత విద్యామండలి అనుమతి ఇవ్వాలి. ఇప్పటి వరకూ ఈ సమావేశాలకు ఎటువంటి ఆదేశాలను ఉన్నత విద్యామండలి జారీ చేయకపోవటంతో సమావేశాలు నిర్వహించలేదు. పాలక మండలి సమావేశం జరిగితే వర్శిటీ సమస్యలపై చర్చించి వాటిని పరిష్కరించే దిశగా చర్యలను చేపట్టేందుకు ఆస్కారముంటుంది. వేధిస్తున్న విద్యుత్, వసతి సమస్యలు.. వర్సిటీలో ముఖ్యంగా విద్యుత్, వసతి సమస్యలు వేధిస్తున్నాయి. విద్యార్థినులకు రెండు వసతి గృహాలు అవసరం కాగా కనీసం ఒక్కటైనా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. వర్శిటీకు ప్రత్యేకంగా విద్యుత్ సరఫరా లైన్ లేదు. ఎచ్చెర్లలో కరెంట్ పోతే వర్శిటీలో కూడా విద్యుత్ ఉండటం లేదు. దీంతో కంప్యూటర్లు కోర్సు చదివే విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా ఆన్లైన్ పరీక్షలను నిర్వహించడానికి కూడా వీలులేకుండా పోతోంది. అందుకే స్థానికంగా ఉన్న ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో ఆన్లైన్ పరీక్షలను నిర్వహిస్తున్నారు. 11 కె.వి.స్మాల్ సబ్‌స్టేషన్‌ను వర్శిటీలో ఏర్పాటు చేయాల్సి ఉంది. అప్పట్లో ఎచ్చెర్ల ఎమ్మెల్యేగా ఉన్న కళావెంకటరావు ఇక్కడ సబ్‌స్టేషన్ ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చినా ఆ తర్వాత మర్చిపోయారు. విద్యార్థులకు సరిపడా మైదానం లేదు. ట్రాక్, పోల్స్ లేవు. ఆటలు ఆడుకునేందుకు వీలుగా మైదానం లేక విద్యార్థులు క్రీడలకు దూరమవుతున్నారు. ముఖం చాటేస్తున్న స్థానిక నేతలు.. అంబేద్కర్ వర్శిటీలో చేపడుతున్న కార్యక్రమాలకు స్థానికుల నాయకులకు ఆహ్వానం పంపిస్తున్నా వారు గైర్హాజరు అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ సమావేశాలకు హాజరైతే వర్శిటీ సమస్యలు తమ దృష్టికి తీసుకొస్తారని, వాటిని పరిష్కరించాల్సి వస్తుందని హాజరుకావడం లేదని సమాచారం. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో స్థానిక నేతలు వర్శిటీ సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరై సమస్యలను పరిష్కరించే వారు. ఇప్పుడా పరిస్థితి లేదు. -
సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలి
● రాయగడ ఎమ్మెల్యే అప్పలస్వామి కడ్రక రాయగడ: పాత్రికేయులు గ్రామీణ ప్రాంత సమస్యలను వెలుగులోకి తీసుకురావాలని రాయగడ ఎమ్మెల్యే అప్పలస్వామి కడ్రక అన్నారు. స్థానిక లయన్స్ క్లబ్ సమావేశం హాల్లో ఆదివారం రాయగడ జిల్లా వెబ్ మీడియా అసోసియేషన్ ప్రథమ వార్షికోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రసంగించారు. జిల్లాలో ఎన్నో గ్రామాల్లో సమస్యలు విలయతాండవం చేస్తున్నాయన్నారు. పాత్రికేయులు తమ కర్తవ్యాన్ని నిస్వార్ధంగా నిర్వహించడంతోపాటు అధికారులకు, ప్రజలకు మధ్య వారధిగా పని చేయాలన్నారు. నేడు సామాజిక మాధ్యమాల ప్రాధాన్యత పెరిగిందన్నారు. రాయగడ వంటి జిల్లాలో కొండలు, కొనల నడుమ ఎంతో మంది ఆదివాసీలు తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారని, ఇప్పటికీ వారిలో చైతన్యం కొరవడడంతో సామాజిక, ఆర్థిక రంగాల్లో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందన్నారు. ఆయా ప్రాంతాల్లో గల సమస్యలను పాత్రికేయులు వెలికితీయాలన్నారు. వెబ్ మీడియా అసోసియేషన్ కార్యదర్శి గురుప్రసాద్ సాహు అసోసియేషన్ వార్షిక నివేదికను చదివి వినిపించారు. అనంతరం గౌరవ అతిథులుగా పాల్గొన్న జీఐఏసీఆర్ ఇంఇనీరింగ్ కళాశాల అధినేత గొవింద ప్రసాద్ రథో, సెంచూరియన్ విశ్వవిద్యాలయం డైరెక్టర్ రాజేష్ కుమార్ పాడీలు పాత్రికేయుల విలువలు గురించి ప్రసంగించారు. అనంతరం జిల్లాలోని కొంతమంది సీనియర్ పాత్రికేయులను సన్మానించారు. -
రాష్ట్ర కార్యక్రమాల సంచాలకుడిగా సునీల్ శర్మ
శ్రీకాకుళం కల్చరల్: సేవ్ టెంపుల్స్ భారత్ రాష్ట్ర కార్యక్రమాల సంచాలకుడిగా నగరానికి చెందిన తెన్నేటి సునీల్ శర్మను నియమితులయ్యారు. ఈమేరకు విశాఖలో జరిగిన 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో సునీల్ శర్మకు అధ్యక్షుడు కేశినేని శ్రీనివాస్ (గజల్) నియామక ఉత్తర్వులు జారీ చేశారు. పురాతన దేవాలయాల జీర్ణోద్ధరణ, గోరక్షణ, మఠాలు, పీఠాలు, సాధువులు, సంతుల పరిరక్షణకు అనుగుణంగా కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ఆపదలో అండగా.. కంచిలి: సోంపేట పట్టణానికి చెందిన పొట్నూ రు సాయిరోహిత్ కాలేయం పాడవ్వడంతో శస్త్రచికిత్సకు పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం ఏర్పడింది. విషయం తెలుసుకున్న కంచిలి పట్టణ కళింగ కోమటి సంఘం సభ్యులు రూ.1,65,211 సాయాన్ని ఆదివారం అందించారు. అంతకుముందు కూడా కొంత మొత్తాన్ని అందజేశామని తెలిపారు. కార్యక్రమంలో సాయిరోహిత్ తల్లిదండ్రులు, సంఘ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. చెట్టుకొమ్మ విరిగిపడి ట్రాఫిక్‌కు అంతరాయం జలుమూరు: సురవరం పంచాయతీ దొంపాక వద్ద ఆదివారం వేకువజామున ఎల్.కె.రోడ్డుపై మర్రి చెట్టుకొమ్మ విరిగిపడటంతో ఉదయం పది గంటల వరకూ ట్రాఫిక్ నిలిచిపోయింది. గతంలో కూడా ఇదే రోడ్డు మీద ఓ చెట్టు కొమ్మ విరగడంతో అప్పుడు కూడా ట్రాఫిక్ సమస్య తలెత్తింది. తరచూ ఇదే చెట్టు నుంచి కొమ్మలు పడటంతో వాహన చోదుకులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ రోడ్డు మీదుగా వందలాది ద్విచక్ర వాహనాలు, పాదచారులు, పొలం పనులకు వెళ్లే రైతులు రాకపోకలు సాగిస్తుంటారు. సత్ప్రవర్తనతో మెలగాలి శ్రీకాకుళం క్రైమ్ : రౌడీషీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలని.. భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, ఇరత ఆర్థిక లావాదేవీలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని శ్రీకాకుళం ఒకటో పట్టణ ఎస్ఐ ఎం.హరికృష్ణ హెచ్చరించారు. ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. పేకాట, బెట్టింగ్, గంజాయి సేవనం, క్రయ విక్రయాలు, బహిరంగంగా మద్యం సేవించి న్యూసెన్సు చేయడం, వినాయక ఉత్సవాల్లో వర్గ విభేదాలు సృష్టించి అల్లర్లకు పాల్పడటం వంటివి తన దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆనందరావుకు సత్కారం టెక్కలి: వసతి గృహం సంక్షేమాధికారిగా సత్తారు ఆనందరావు చేసిన సేవలు ఎనలేనివని వెనుకబడిన తరగతుల సహాయ సంక్షేమాధికారి టి.త్రినాథరావు కొనియాడారు. సంతబొమ్మాళి మండలం నౌపడ వసతి గృహం సంక్షేమాధికారిగా పనిచేస్తూ ఉద్యోగ విరమణ పొందిన సత్తారు ఆనందరావు, అరుణకుమారి దంపతులను ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ఓవైపు వసతి గృహం సంక్షేమానికి కృషి చేస్తూ మరో వైపు అసోషియేషన్ బాధ్యతల్లో కీలకంగా పనిచేస్తూ అందరి మన్ననలను పొందిన వ్యక్తి ఆనందరావు అని కొనియాడారు. అనంతరం ఆనందరావు, అరుణకుమారి దంపతులను సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో వసతి గృహం సంక్షేమాధికారుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె.గురువులు, వార్డెన్లు డి.రామారావు, గ్రామపెద్దలు కె.విష్ణుమూర్తి, వి.కృష్ణారావు, కెప్టెన్ ఎం.మన్మధరావు, ఎస్.కరుణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగులకు ఉత్తమ సేవలతో గుర్తింపు
విజయనగరం: విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించడం ద్వారా ఉద్యోగులకు గుర్తింపు లభిస్తుందని, ప్రతి ఉద్యోగి తన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహించి ప్రజలకు మంచి సేవలందించాలని జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు సూచించారు. మెంటాడ మండల ఎంపీడీఓగా బాధ్యతలు నిర్వహించి ఉద్యోగ విరమణ చేసిన బీఎస్కేఎన్ పట్నాయక్ ఉద్యోగ విరమణ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగ విరమణ పొదిన పట్నాయక్ దంపతులను దుశ్శాఽలువ, పుష్పగుచ్ఛంతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించడం తోటి ఉద్యోగులకు ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు జిల్లా, మండల పరిషత్ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు -
ఆటల్లేవ్..ఆడుకోవడాల్లేవ్..!
పార్వతీపురం రూరల్: విద్యార్థుల్లో చురుకుదనాన్ని, ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని నింపేందుకు ఎంతగానో దోహదపడేవి క్రీడలు, వ్యాయామం. ఇంటర్ విద్యనుంచి క్రీడలు, వ్యాయామం ప్రతి విద్యార్థికి అవసరం. విద్యార్థుల్లో ఆసక్తి ఉన్నా ఆడించేందుకు గురువులు కరువయ్యారు. సాధన చేయలేక, మెలకువలు చెప్పేవారే లేక, విద్యార్థులు ఉదాసీనంగా మిగిలిపోతున్నారు. ఇంటర్మీడియట్ రెండేళ్లలో ఉత్సాహంగా ఉన్న విద్యార్థులు క్రీడా జీవితాన్ని కోల్పోతున్నారు. ప్రభుత్వం పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్న 14 జూనియర్ కళాశాలల్లో వ్యాయామ అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయకపోవడంతో విద్యార్థులు ఆటలకు నోచుకోవడం లేదు. ఈ పోటీ ప్రపంచంలో రాణించాలంటే కళాశాల విద్యార్థులకు చదువుతోపాటు ఇతర అంశాల్లో ప్రతిభ చాటితే కచ్చితమైన ఉజ్వల భవిష్యత్‌కు ఉపయోగకరంగా ఉంటుంది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకుండా పోయింది. నష్టపోతోంది పేద విద్యార్థులే పల్లె, పట్టణ ప్రాంతాల్లో దిగువ, మధ్యతరగతి కుటుంబాలకుచెందిన విద్యార్థులు ప్రధానంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతారు. నేటి పోటీ ప్రపంచంలో వారికున్న అవకాశాలను వినియోగించుకుని భవిష్యత్‌లో ఉన్నత స్థానానికి చేరుకునేందుకు కలలు కంటారు. విద్యతోపాటు మరో నైపుణ్యం కలిగి ఉండాల్సిన తప్పనిసరి పరిస్థితులు నేడు సంతరించుకున్న నేపథ్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వ్యాయామ అధ్యాపకులు లేక జిల్లా వ్యాప్తంగా 15 మండలాల్లో 15 కళాశాలల్లోని 5,800మంది విద్యార్థులు క్రీడలకు దూరమవుతున్నారు. అలాగే క్రీడలకు, వ్యాయామానికి సంబంధించిన పరికరాలు కొనుగోలు చేసేందుకు కూడా ప్రభుత్వం ఒక్క రూపాయి కేటాయించలేదు. ఏ విద్యార్థి అయినా తనకు ఉత్సాహంగా ఉండి క్రీడల్లో రాణించాలని కోరిక ఉన్నప్పటికీ సొంతంగా సాధన చేసేందుకై నా అవకాశం లేని పరిస్థితులు జూనియర్ కళాశాలల్లో వేలెత్తి చూపుతున్నాయి. దీంతో క్రీడల్లో ప్రోత్సాహం కరువై క్రమంగా విద్యార్థులకు ఆటలపై ఆసక్తి తగ్గుతోంది. రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించేవారికి క్రీడా కోటా కింద రిజర్వేషన్ వర్తిస్తుంది. చదువుకు ఇది అదనపు అర్హతగా గుర్తింపునిస్తుంది. అయితే ప్రస్తుతం ప్రభుత్వ నిర్లక్ష్యంతో జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్ధులు ఈ అవకాశాలు కోల్పోతున్నారు. 15 కళాశాలలకు ఒకే పీడీ ఆటలకు దూరమవుతున్న ఇంటర్ విద్యార్థులు జిల్లావ్యాప్తంగా ఇంటర్ విద్యార్థులు 5,800 మంది ఆటలాడించే గురువే కరువు వ్యాయామం, క్రీడలకు దూరమవుతున్న విద్యార్థులు -
శారీరక దృఢత్వంతో ఆరోగ్యం
● ఎస్పీ ఎస్వీ మాధవ్‌రెడ్డి ● జిల్లా కేంద్రంలో ఫిట్ ఇండియా సైక్లింగ్ ఆన్ సండే పార్వతీపురం రూరల్: జిల్లా కేంద్రంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా సైక్లింగ్ ఆన్ సండే కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమాన్ని ఎస్పీ ఎస్వీ మాధవ్‌రెడ్డి జెండా ఊపి సైక్లింగ్ ర్యాలీని ప్రారంభించి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శారీరక ధృడత్వంతోనే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చునని తెలిపారు. ప్రజలకు ఈ మేరకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రస్తుతం మన జీవన శైలిలో ప్రతీ రోజు ద్విచక్ర వాహనాలు, కార్లలో ప్రయాణిస్తూ ఆధునిక సౌకర్యాలతో జీవనం సాగిస్తున్నప్పటికీ శారీరక చురుకుదనం లేకపోవడంతో అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందన్నారు. ఈ మేరకు సైక్లింగ్ సాధారణ ఆరోగ్య పరిరక్షణ కోసం ఒక సరళమైన, సురక్షితమైన మార్గంతో పాటు పర్యావరణాన్ని కొంతమేరకు కాపాడుకొనేందుకు ఆస్కారం ఉంటుందని ఎస్పీ అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ జిల్లా కేంద్రం మీదుగా వెళ్లి మళ్లీ మైదానానికి చేరుకుంది. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి, ఆర్ఐలు రాంబాబు, నాయుడు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు తదితర సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
‘టోల్’ ఊరట..!
పార్వతీపురం రూరల్: మండలంలోని వెలగవలస సమీపంలో ఉన్న బడిదేవరమ్మ చెరువులో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు శనివారం మధ్యాహ్నం చెరువులో గల్లంతైన పాడి బంగారి దొర(45) మృతదేహం అర్ధరాత్రి 1గంట ప్రాంతంలో లభ్యమైంది. ఈ మేరకు పార్వతీపురం రూరల్ ఎస్సై బి. సంతోషికుమారి తెలిపారు. రెస్క్యూ బృందం సహాయంతో గాలించి జేసీబీ సాయంతో గట్టు తొలగించి నీరు మళ్లించిన అనంతరం బంగారి దొర మృతదేహం ఆచూకీ తెలిసిందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రాస్పత్రికి మృతదేహాన్ని తరలించామని చెప్పారు. మోటారు వాహన చట్టాలను వ్యతిరేకించండి బొబ్బిలి: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన మోటారు వాహన చట్టాలను వ్యతిరేకించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పొట్నూరు శంకరరావు, ఆటో వర్కర్ల సంఘ నాయకులు ఎల్లంనాయుడు తదితరులు పిలుపునిచ్చారు. ప్రభుత్వం కఠిన చట్టాలు తెచ్చి జరిమానాలు, జైలుశిక్షలను వేధిస్తోందన్నారు. దేశంలోని రవాణా రంగాన్ని ప్రైవేటుకు అప్పగించే కుట్రకు కేంద్రం దారులు తెరిచిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్, బ్రేక్, ఫిట్నెస్ తదితర ధ్రువపత్రాల పేరిట భారీ చలానాలు విధించి మోటారు కార్మికుల కష్టాన్ని దోచుకుంటోందన్నారు. ఇది సరిపోక ఉచిత బస్సు పేరిట ఆటో కార్మికులను వీధిన పడేసిందన్నారు. వారందరినీ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ఆటో నడుపుకుని కుటుంబాన్ని పోషించుకునేందుకు కూడా కనీసం అవకాశం లేకుండా చేసిందన్నారు. వీరందరినీ ఆదుకోవాలని కోరుతూ సెప్టెంబర్ 4న ఉదయం 9 గంటలకు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద భారీ ప్రదర్శన నిర్వహించనున్నట్టు తెలిపారు. అక్కడి నుంచి ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి వినతిపత్రం సమర్పిస్తామన్నారు. ఆటో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. భోగాపురం: జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. నాలుగు చక్రాల వాహనాలు సహా ఆపై పెద్ద వాహనాలు నడిపే వారంతా టోల్గేట్ దాటినప్పుడల్లా టోల్ చార్జీ చెల్లించకుండా ఉండేలా కొత్తగా టోల్‌పాస్ విధానాన్ని తీసుకువచ్చింది. ఇదివరకు మనం వెళ్లే దారిలో ఎన్నిసార్లు మనం వాహనంతో టోల్‌గేటు దాటితే అన్నిసార్లు టోల్‌చార్జీ కట్టాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ కొత్త విధానం ద్వారా రూ.3 వేలకు ఫాస్టాగ్ టోల్‌పాస్ జారీ చేస్తారు. దీంతో ఏడాది కాలం పాటు గానీ 200 ట్రిప్పుల వరకు గానీ టోల్‌గేటు గుండా ఫ్రీ(ఉచితం)గా ప్రయాణం చేయవచ్చు. వీటిలో ఏది ముందు అయిపోతే దానిని పరిగణనలోకి తీసుకుని, ఆ తర్వాత పాస్ రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా 1,087 టోల్గేట్లుదేశవ్యాప్తంగా సుమారు 1,087 వరకు టోల్ గేట్లు ఉన్నాయని అంచనా. విజయనగరం జిల్లాలో నాతవలస, జొన్నాడ, గంట్యాడ, శ్రీకాకుళం జిల్లాలో చిలకలపాలెం, మండపం, తర్లువాడ, విశాఖపట్నం జిల్లాలో అనకాపల్లి, అగన్పూడి వద్ద టోల్ గేట్లు కనిపిస్తాయి. పాస్ పొందే విధానం ఇప్పటికే ఫాస్టాగ్ ఉన్న వాహన యాజమానులు తమ ఖాతా నుంచి ఫాస్టాగ్ పాస్ పొందవచ్చు. ఆగస్టు 15 నుంచి పెద్ద ఎత్తున వీటిని వాహనదారులు కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ పాస్ సొంత కార్లు, వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. బస్సులు, లారీలు, ట్యాక్సీలు, రవాణా వాహనాలకు చెల్లదు. ట్రావెల్స్‌కు వినియోగించే కార్లకు, జీపులు, వ్యాన్లకు కూడా వర్తించదు. ఈ ఫాస్టాగ్ ఏడాది పాస్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహించే జాతీయ రహదారులు, జాతీయ ఎక్స్‌ప్రెస్ రహదారులలోని అన్ని టోల్ ప్లాజాలలో పని చేస్తుంది. డిజిటల్ రూపంలోనూ..ఫాస్టాగ్ ఏడాది పాస్‌ను డిజిటల్‌గా తీసుకోవచ్చు. రాజమార్గ్ యాత్ర యాప్నుసెల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని పొందవచ్చు. లేదా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్సైట్ ద్వారా కూడా లభిస్తుంది. దీని కోసం రూ.3 వేలు చెల్లించాలి. సంబంధిత వాహనానికి చెల్లుబాటు అయ్యే ఫాస్టాగ్ ఉండాలి. బ్లాక్ లిస్టులో ఉండకూడదు. సంబంధిత వాహన రిజిస్ట్రేషన్ నంబర్ వివరాలు నమోదు చేయాలి. రూ3 వేలు చెల్లించిన తర్వాత ఏడాది పాస్ సంబంధిత వాహన ప్రసుత్త ఫాస్టాగ్ ట్యాగ్‌కు లింక్ అవుతుంది. గుమ్మలక్ష్మీపురం: అంతర్ జిల్లా ఫెన్సింగ్ పోటీల్లో మండలంలోని కన్నయ్యగూడకు చెందిన విద్యార్థినులు తోయక యమున, తోయక భానుమతిలు ప్రతిభ కనబరిచారు. ఆగస్టు 30వ తేదీన భీమవరంలో జరిగిన 11వ క్యాడెట్ అండర్–17 అంతర్ జిల్లా బాలబాలికల ఫెన్సింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొని, ఇప్పీ టీమ్ విభాగంలో యమున వెండి పతకం, ఫోయిల్ టీమ్ విభాగంలో భానుమతి రజ త పతకం సాధించినట్లు కోచ్ బాలరాజు ఆదివారం తెలిపారు. ఈ మేరకు ఇరువురు బాలికలను గ్రామస్తులు, ఉపాధ్యాయులు అభినందించారు. రూ.3 వేలతో ఫాస్టాగ్ టోల్ పాస్ ఏడాది కాలం లేదా 200 ట్రిప్పులకు చెల్లుబాటు ఆగస్టు 15 నుంచి అమలులోకి.. సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్న కేంద్రంట్రిప్పులు ఇలా లెక్కిస్తారు.. గతంలో మనం రహదారులపై ప్రయాణించేటప్పుడు ఎన్నిచోట్ల టోల్గేట్లు వస్తే అన్నిచోట్లా టోల్‌చార్జీలు చెల్లించి, ముందుకు వెళ్లాల్సి వచ్చేది. ఇలా వెళ్లేటప్పుడు ఒక్కో ట్రిప్పుకు ఇరువైపులా రూ.90 నుంచి రూ.200 వరకు చెల్లించాల్సి ఉండేది. ఇప్పుడు ఆ భారం లేకుండా ఎన్‌హెచ్(జాతీయ రహదారి) అధికారులు పాస్ విధానం అమలులోకి తెచ్చారు. ఆగస్టు 15వ తేదీ నుంచి అమలులోకి వచ్చిన ఈ విధానం కార్లు, జీపులు, వ్యాన్లు తదితర వాణిజ్యేతర వాహనాలకు వర్తిస్తుంది. ఒకసారి రూ.3 వేలు పెట్టి పాస్ తీసుకుంటే సంవత్సరం వరకు లేదా 200 ట్రిప్పుల వరకు ఉచితంగా టోల్‌గేటు గుండా వెళ్లవచ్చు. అయితే ఒకసారి టోల్‌గేటు దాటితే ఒక ట్రిప్పుగా పరిగణిస్తారు. -
జాప్యమెందుకో?
స్పోర్ట్స్ కోటా అమల్లో.. ● ఇంజినీరింగ్, ట్రిపుల్ ఐటీ అడ్మిషన్లలో కానరాని కోటా ● శాప్ అధికారుల తీవ్ర నిర్లక్ష్యం ● ప్రభుత్వం స్పందించాలని క్రీడాసంఘాల విజ్ఞప్తి శ్రీకాకుళం న్యూకాలనీ: స్పోర్ట్స్ కోటా అమలు రెండు అడుగులు ముందుకు.. నాలుగు అడుగులు వెనుక్కి అన్న చందంగా తయారైంది. రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ కోటాను పక్కాగా అమలు చేస్తున్నామని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు కాక వందలాది మంది క్రీడాకారులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే ఇంజినీరింగ్, ట్రిపుల్ ఐటీ క్లాసులు మొదలైపోయాయి. అయినా, స్పోర్ట్స్ కోటా ద్వారా భర్తీ కావాల్సిన సీట్లను సంబంధిత శాఖాధికారులు జాప్యం చేస్తుండటంతో విద్యార్థులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. జిల్లాలో పదుల సంఖ్యలో క్రీడాకారులు.. విద్యార్థులు ఎంసెట్, ట్రిపుల్ఐటీ సీట్ల రేసులో ఉన్నారు. వీరంతా ఇప్పటికే వివిధ క్రీడాంశాల్లో రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో రాణించి జిల్లా కీర్తిని చాటిచెప్పారు. పతకాలు సాధించి సత్తాచాటారు. అయితే ఉన్నత చదువుల్లో అమలు కావాల్సిన స్పోర్ట్స్‌కోటాను అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో విద్యాసంవత్సరం కోల్పోయే పరిస్థితులు దాపరించాయి. డీఎస్సీపైనే ఫోకస్.. స్పోర్ట్స్ కోటా భర్తీ చేపట్టాలని ప్రభుత్వం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్)కు ఆదేశించింది. అయితే శాప్ అధికారులు కేవలం డీఎస్సీ ఉద్యోగాలపై మాత్రమే ప్రస్తుతం ఫోకస్ చేస్తున్నారు. మిగిలిన ఉన్నత, ప్రొఫెషనల్, వృత్తివిద్యా కోర్సుల ప్రవేశాల సందర్భంగా స్పోర్ట్స్‌కోటా ద్వారా విద్యార్థుల భర్తీని విస్మరించారు. దీంతో ఎంసెట్, ట్రిపుల్ ఐటీ వంటి ఉన్నత చదువుల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు నష్టపోతున్నారు. ఇప్పటికై న ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని జిల్లాలోని క్రీడా విద్యార్థులు మొరపెట్టుకుంటున్నారు. విద్యార్థుల భవితవ్యాన్ని దృష్టిలో ఉంచుకుని స్పోర్ట్స్ కోటా భర్తీకి వెంటనే చర్యలు చేపట్టాలని ఒలింపిక్ సంఘ నాయకులు, క్రీడాసంఘాల ప్రతినిధులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
లారీలను ఢీకొట్టిన టిప్పర్
గంట్యాడ: ఆగిఉన్న రెండు లారీలను ఓ టిప్పర్ ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాల య్యాయి. ఈ ఘటనపై స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గంట్యాడ మండలంలోని రామవరం జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో రెండు లారీలు ఆగి ఉన్నాయి. విశాఖపట్నం పోర్టు నుంచి బొగ్గులోడుతో బొబ్బిలి వెళ్తున్న టిప్పర్ ఆగిఉన్న ఆ రెండులారీలను బలంగా ఢీకొట్టడంతో ఒకలారీ కిందికి బోల్తాపడింది. దానిముందు ఉన్న లారీని ఢీకొట్టడంతో టిప్పర్ క్యాబిన్ నుజ్జునుజ్జయింది. దీంతో క్లీనర్ క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. పోలీసులు క్రేన్ సహాయంతో అతన్ని బయటకు తీశారు. అయితే అప్పటికే క్లీనర్ కోన వెంకటరమణ మృతి చెందాడు. ఈ ఘటనలో డ్రైవర్ గాయాలపాలయ్యాడు. మృతుడిది అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం కింతాడ పంచాయతీ పరిధిలోని గొల్లలపాలెం గ్రామం. మృతుడికి భార్య భవాని, కుమార్తె, కుమారుడు ఉన్నారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయనగరం క్రైమ్: కోరుకొండ అలమండ రైల్వే స్టేషన్ ల మధ్య రైలు పట్టాల పై గుర్తుతెలియని మృతదేహాన్ని జీఆర్పీ సిబ్బంది ఆదివారం కనుగొన్నారు. మృతుడి వయస్సు 35 నుంచి 40 మధ్య ఉంటుందని సమారు 5 అడుగుల 5 అంగుళాల పొడవుతో ఛామనఛాయ రంగు కలిగి నలుపు రంగు, చిన్న,చిన్న తెలుపురంగు పవ్వుల గల ఫుల్ హ్యాండ్స్ షర్ట్, నీలం రంగు షార్ట్ ధరించి ఉన్నాడని జీఆర్పీ ఎస్సై బాలాజీ రావు తెలిపారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు ఫోన్ 919490617089, 6301365605 నంబర్లకు కానీ ల్యాండ్‌లైన్ నంబర్ 08912883218కు కానీ ఫోన్ చేసి చెప్పాలని కోరారు. క్లీనర్ మృతి, డ్రైవర్‌కు గాయాలు -
బీజేడీ యువ నాయకుడు రాజు మృతి
కొరాపుట్: నబరంగ్‌పూర్ జిల్లా ప్రతిపక్ష బీజేడి యువ విభాగ పట్టణ కార్యదర్శి ఆనాల రాజు (పురుషోత్తం) (24) అనారోగ్యంతో మృతి చెందారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజును మెరుగైన వైద్య చికిత్స కోసం ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరికి వెళ్లారు. చికిత్సపొందుతూ ఆదివారం చనిపోయారు. రాజు మృతిపై రాజ్యసభ సభ్యుడు మున్నా ఖాన్, డాబుగాం ఎమ్మెల్యే మనోహర్ రంధారి, జెడ్పీ ప్రెసిడెంట్ మొతిరాం నాయక్, మాజీ ఎంపీలు రమేష్ మజ్జి, ప్రదిప్ మజ్జి, మాజీ ఎమ్మెల్యే సదాశివ ప్రధాని, బీజేడీ నాయకుడు తపస్ త్రిపాఠి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. -
అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం కావాలి
● జయపురం మున్సిపల్ చైర్మన్ నరేంద్ర కుమార్ మహంతిజయపురం: జయపురం పట్టణ అభివృద్ధికి, పారిశుద్ధ్య నిర్వహణకు కౌన్సిల్ కట్టుబడి ఉందని మున్సిపల్ చైర్మన్ నరేంద్ర కుమార్ మహంతి స్పష్టం చేశారు. ఆదివారం స్వయం పాలన దినోత్సవం సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు. పారిశుద్ధ్యం మెరుగుపర్చడంలో ప్రజలు సహకరించాలని కోరారు. తమ కౌన్సిల్ వచ్చిన తరువాత అనేక అభివృద్ధి పనులు చేపట్టామని, మరికొన్ని పనులు త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా వైస్ చైర్మన్ బి.సునీత, కార్యనిర్వాహక అధికారి పూజా రౌత్ పాల్గొన్నారు. ఇంజినీర్ చైతన్య బక్షీ, ప్రతాప్ కుమార్ ఆచార్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉత్తమ పారిశుద్ధ్య శ్రామికులు, ఇతర ఉద్యోగులకు వస్త్రాలు, బహుమతులు అందించి సన్మానించారు. జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మేఘమల్లి తోట ఉద్యాన వనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. గోశాలలను ప్రారంభించారు. జయపురం సబ్‌కలెక్టర్ అక్కవరం శొశ్యారెడ్డి, కార్యనిర్వాహక అధికారి, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. -
శ్రీమద్రమారమణ గోవిందా..హరి!
విజయనగరం టౌన్: హరికథా పితామహుడికి విజయనగర వాసులు ఘనంగా నీరాజనం పలికారు. శ్రీమదజ్జాడాదిభట్ల నారాయణదాస 161వ జయంతి మహోత్సవాలను పురస్కరించుకుని శ్రీ ఆదిభట్ల నారాయణదాస ఆరాధనోత్సవ సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎ.గోపాలరావు నేతృత్వంలో ఆదివారం ఉదయం కానుకుర్తివారి వీధిలో ఉన్న ఆదిభట్ల గృహంలో పూజలు నిర్వహించారు. అనంతరం వెన్లాక్ పార్కు, సంగీత కళాశాలలో ఉన్న ఆదిభట్ల విగ్రహానికి పుష్పమాలలు అలంకరించి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం లయన్స్ కమ్యూనిటీ హాల్లో కపిలేశ్వరపురం శ్రీ సర్వారాయ హరికథా పాఠశాల విద్యార్థినులు నిర్వహించిన హరికథా గానామృతం ఆద్యంతం ప్రేక్షలకులను కట్టిపడేసింది. ఎం.వీరసత్య (అమలాపురం) శ్రీరామ జననం రక్తికట్టించింది. ఎం.సిరివల్లి (గుంటూరు) విశ్వామిత్ర యాగ సంరక్షణం హరికథ ఆకట్టుకుంది. సాయంత్రం 6గంటలకు ఆదిభట్ల రవిభాగవతార్తో, 7 గంటలకు హరికథా చూడామణి వై.శిఖామణి భాగవతారిణితో శ్రీరామపాదుకా పట్టాభిషేకం, హరికథలు ఆహూతులను అలరించాయి. కార్యక్రమంలో ఆరాధనోత్సవ సంఘం ప్రతినిధులు పీవీ.నరసింహరాజు(బుచ్చిబాబు) అధిక సంఖ్యలో సభ్యులు, హరికథా కళాకారులు పాల్గొన్నారు. నేడు హరికథా చూడామణి బిరుదు ప్రదానం ఆదిభట్ల జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని రెండోరోజు సోమవారం ఉదయం 10 గంటలకు ఆర్.గీత (కర్ణాటక) సీతా కల్యాణం, 11 గంటలకు మండా వరలక్ష్మి భాగవతారిణి హరికథ, సాయంత్రం హరికథాచూడామణి కాళ్ల నిర్మల సుందరకాండ హరికథ ఉంటాయి. అనంతరం నిర్వహించే సభా కార్యక్రమంలో ప్రొద్దుటూరు శ్రీ అన్నమాచార్య కళాపీఠంకి చెందిన యడ్లవల్లి రమణయ్య భాగవతార్‌కు హరికథా చూడామణి బిరుదు ప్రదానం చేయనున్నారు. డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి చేతుల మీదుగా పురస్కార ప్రదానం నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. రాత్రి పురస్కార గ్రహీత భక్త మార్కండేయ కథాగానాలాపన చేస్తారన్నారు. సాహితీవేత్తలు, అభిమానులు హాజరుకావాలని కోరారు. హరికథా పితామహుడికి..ఘనంగా నీరాజనం భక్తిశ్రద్ధలతో ఆదిభట్ల 161వ జయంతి మహోత్సవాలు ఆకట్టుకున్న ‘సర్వారాయ’ విద్యార్థినుల గానామృతం -
సాఫ్ట్‌బాల్ పోటీల్లో జిల్లాకు ప్రథమస్థానం
బొబ్బిలిరూరల్: గుంటురు జిల్లా సత్తెన పల్లి లయోలా కళాశాలలో శని, ఆదివారాల్లో జరిగిన 12వ అంతర్జిల్లా మహిళా సాఫ్ట్‌బాల్ టోర్నమెంట్లో జిల్లాకు చెందిన మహిళల జట్టు ప్రథమ స్థానం సాధించిందని పారాది జెడ్పీహెచ్ఎస్ పీడీలు నల్ల వెంకటనాయుడు, సత్యనారాయణ తెలిపారు. ఈసందర్భంగా రాష్ట్రంలో ప్రథమ స్థానం కై వసం చేసుకున్న జట్టుకు, శిక్షణ ఇచ్చిన పీడీలకు సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే బేబినాయన అభినందనలు తెలిపారు. రంగరాయపురంలో చేతబడి కలకలంలక్కవరపుకోట: మండలంలోని రంగరాయపురం, జమ్మాదేవిపేట గ్రామాల్లో చేతబడి కలకలం రేపింది. శనివారం రాత్రి గ్రామంలో ఓ ఇంటి ముందు ముగ్గులు వేసి మనిషి ఆకారంలో బొమ్మను తయారు చేసి మధ్యలో పెట్టి నిమ్మకాయలకు పసుపు, కుంకం రాసి కనిపించడంతో గ్రామస్తులు భయాందోళనకు లోనయ్యారు. ఈ విధంగానే గత వారంలో కూడా ఒక వీధిలో చేశారని గ్రామస్తులు తెలిపారు. మరో ఇంటి వద్ద తాము లేని సమయంలో ద్వారబంధాల వద్ద నువ్వులు, నిమ్మకాయలను వేశారని ఆ ఇంటి యజమాని తెలిపారు. అలాగే జమ్మాదేవిపేట గ్రామంలో ఒక వ్యక్తి నూతనంగా ఇల్లు నిర్మించుకుని గృహప్రవేశం చేసేందుకు ముహూర్తం పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు ఇంటిలోని ద్వారబంధాల వద్ద నల్ల నువ్వులను సుమారు 3కేజీలకు పైగా పోసి ఉన్నట్లు గుర్తించామని ఇంటి యజమానులు వాపోయారు. మండలంలో వరుసగా ఇటువంటి ఘటనలు జరగడంతో ప్రజలు భీతిల్లుతున్నారు. ఈ తరహా వ్యక్తులపై పోలీసులు నిఘా పెట్టాలని కోరుతున్నారు. పశువుల వ్యాన్ల సీజ్దత్తిరాజేరు: మండలంలోని మరడాం కూడలి వద్ద అక్రమంగా తరలిస్తున్న రెండు పశువుల వ్యాన్లు పట్టుకుని సీజ్ చేసినట్లు ఎస్. బూర్జవలస ఎస్సై జి.రాజేష్ ఆదివారం తెలిపారు. రాత్రి వేళల్లో వారపు తనిఖీల్లో భాగంగా ఆండ్ర ఎస్సై సీతారాం తనిఖీలలో భాగంగా పట్టుకున్నట్లు చెప్పారు.సరైన పత్రాలు లేకుండా పశువులను అక్రమ రవాణా చేస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. భవనంపై నుంచి పడి కార్మికురాలి మృతికొమ్మాది(విశాఖ): జీవీఎంసీ 8వ వార్డులో నిర్మాణంలో ఉన్న ఓ భవనం పైనుంచి జారిపడి ఓ కార్మికురాలు మృతి చెందింది. ఆదివారం జరిగిన ఈ సంఘటనపై పీఎం పాలెం సీఐ జి. బాలకృష్ణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా, గుర్ల మండలం, గొలగాం గ్రామానికి చెందిన చందక సత్యాలు (48), భర్త సింహాచలంతో కలిసి మూడేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం విశాఖ వచ్చారు. వారు ఆరిలోవలోని తోటగరువు వద్ద నివాసం ఉంటూ భవన నిర్మాణ కూలీలుగా పనిచేస్తున్నారు. రుషికొండలోని తారకరామ లేఅవుట్లో గల ఆదిత్య అపార్ట్మెంట్ వెనుక నిర్మాణంలో ఉన్న ఒక భవనం వద్ద వారు కూలి పనులు చేస్తున్నారు. ఆదివారం మూడో అంతస్తులో శ్లాబ్ నిర్మాణం జరుగుతుండగా, పనిలో భాగంగా పైనున్న సత్యాలు కళ్లు తిరిగి మొదటి అంతస్తు శ్లాబ్‌పై పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆమె తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందింది. భర్త సింహాచలం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పాత్రికేయుని ఇంటిలో చోరీ
రాయగడ: స్థానిక గౌతం నగర్ రెండో వీధిలో నివసిస్తున్న పాత్రికేయుడు ఇప్పిలి సర్వేశ్వరరావు ఇంటిలో దొంగతనం జరిగింది. శనివారం రాత్రి ఇంటిలో అంతా నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి ఇంటి వెనుక నుంచి చొరబడిన దుండగుడు ఇంటిలో గల గదుల్లో నిద్రిస్తున్న వారి తలుపులకు గడియ పెట్టి అనంతరం పూజా గదిలోకి ప్రవేశించి అక్కడ గల వెండి పూజా సామగ్రితో పాటు ఇత్తడి వస్తువులు దొంగిలించాడు. తెల్లవారి లేచి చూసేసరికి గది తలుపు బయట నుండి గడియపెట్టి ఉండటంతో మిత్రునికి ఫోన్ చేసి తలుపు తెరిపించాడు. పూజా గదిలోకి వెళ్లి చూడగా సామాన్లు కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం అందజేశారు. సంఘటన స్థలానికి ఆదివారం చేరుకున్న పోలీసులు ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నారు. సమీపంలో గల ఒక ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా దుండగుడిని గుర్తించారు. -
రిమ్స్‌లో కొరవడిన నిఘా!
● 650 పడకలకే సెక్యూరిటీ కాంట్రాక్టర్ ఒప్పందం ● ఆస్పత్రిలో ఉన్న పడకల సంఖ్య 930 ● పర్యవేక్షణ లేక తరచూ దొంగతనాలు శ్రీకాకుళం : నగరంలోని రిమ్స్ సర్వజన ఆస్పత్రిలో నిఘా కొరవడుతోంది. నిత్యం ఏదో ఒక వార్డులో రోగులు, రోగుల సహాయకులకు సంబంధించిన సెల్ఫోన్లు, డబ్బులు, మోటారు సైకిళ్లు చోరీకి గురికావడం పరిపాటిగా మారింది. దొంగతనాలకు సంబంధించి ఔట్ పోస్ట్ పోలీసులకు ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో కొందరు రోగులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కూడా పాఠకులకు తెలిసిందే. తాజాగా జరిగిన ఓ సంఘటన ప్రమాదవశాత్తు జరిగినట్లు చెబుతున్న అది కూడా ఆత్మహత్య అని రిమ్స్ వర్గాల నుంచే వినిపిస్తోంది. కారణం ఏదైనప్పటికీ నిఘా కొరవడంతోనే ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇదేం లెక్క? రిమ్స్ సర్వజన ఆసుపత్రి 930 పడకల స్థాయిలో ఉన్నప్పటికీ రాష్ట్రస్థాయిలో జరిగిన సెక్యూరిటీ ఒప్పందం మాత్రం 650కు మాత్రమే జరిగింది. రాష్ట్రస్థాయిలో ఉన్న లెక్కల ప్రకారం ఈ ఒప్పందం జరిగినట్లు కొందరు రిమ్స్ అధికారులు చెబుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో తొలుత 650 పడకలకు సెక్యూరిటీ ఒప్పందం జరిగినా అటు తర్వాత మరో వంద పడకలకు పెంచుతూ కాంట్రాక్టర్‌తో ఒప్పందం చేసుకున్నారు. ఈ లెక్కన రాష్ట్రస్థాయిలో 750 పడకలకు లెక్కలు ఉండాలి. ఇందుకు భిన్నంగా 650 పడకలకే లెక్కలు ఉన్నట్లు చెబుతూ ఆ మేరకే ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. 2024 ఎన్నికల సమయంలో రిమ్స్ పడకల స్థాయి 930కి చేరింది. ఈ కారణంగానే అప్పట్లో 930 స్థాయికి సెక్యూరిటీని పెంచలేకపోయారు. అటు తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం 930కి కాకపోయినా గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లు 750 పడకలకు కూడా సెక్యూరిటీ ఒప్పందాన్ని కల్పించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పర్యవేక్షణ గాలికి.. రిమ్స్‌లో నిఘా సిబ్బంది సక్రమంగా పర్యవేక్షణ చేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పడకల స్థాయి కంటే సిబ్బంది తక్కువగా ఉన్నప్పటికీ వారితో సైతం సక్రమంగా విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోలేకపోతున్నారు. నిఘాను పర్యవేక్షించాల్సిన అధికారి తరచూ విధులకు గైర్హాజరవుతుండటంతో ఇటువంటి పరిస్థితి నెలకొంది. పర్యవేక్షణ అధికారి తన జాబ్ జార్టును వదిలి ఇతర రిమ్స్ అధికారుల విధుల్లో తలదూర్చడానికి ప్రాధాన్యత ఇస్తుంటారని రిమ్స్ వైద్యులే బహిరంగంగా చెబుతున్నారు ఇప్పటికై నా జిల్లా అధికారులు దృష్టి సారించి సక్రమంగా నిఘా అమలయ్యేలా చూడాలని పలువురు కోరుతున్నారు. -
పీడీలు లేరు..భోజనానికి బిల్లులులేవు
జిల్లాలో గల ప్రభుత్వ 14 జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ విద్యార్థులకు పీడీలు లేకపోవడం దారుణం. విద్యార్థులు కోల్పోతున్న క్రీడాజీవితం పాపం ప్రభుత్వానిదే. అలాగే విద్యార్థులకు సంబంధించిన మధ్యాహ్న భోజనాల బిల్లులను ప్రభుత్వం నేటికీ చెల్లించలేదు. భోజనానికి బిల్లులు సమయానికి చెల్లించకపోవడానికి ప్రధాన కారణం జిల్లా విద్యాశాఖాధికారి నిర్లక్ష్యమే. నెలల తరబడి బిల్లుల బకాయిలు చెల్లింపులు జరగకపోతే నిర్వహణ ఎలా జరుగుతుంది? ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పీడీల(వ్యాయామ అధ్యాపకులు)ను నియమించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇంటర్ విద్యార్థులకు ఈ దశలో వ్యాయామం, క్రీడలు చాలా అవసరం. – పాలక రంజిత్ కుమార్, గిరిజన సంక్షేమసంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి -
గజగజ
ఆదివారం శ్రీ 31 శ్రీ ఆగస్టు శ్రీ 2025● ఒడిశాలో దేశంలోనే అత్యధికంగా ఏనుగుల మరణాలు ● విద్యుత్ షాక్‌తో ఎక్కువ దుర్ఘటనలుభువనేశ్వర్: రాష్ట్రంలో గజరాజులకు విద్యుత్ షాక్ తగులుతోంది. తరచూ ఈ విచారకర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పెద్ద సంఖ్యలో ఏనుగులు దుర్మరణం పాలవుతున్నాయి. ఈ సంఖ్య జాతీయ స్థాయిలో అత్యధికంగా కొనసాగుతోంది. సంబల్పూర్, కటక్, గజపతి, ఢెంకనాల్, అంగుల్, కెంజొహర్ వంటి జిల్లాల్లో విద్యుదాఘాతం కారణంగా పెద్ద సంఖ్యలో ఏనుగులు చనిపోతున్నాయి. కొన్ని సార్లు వేటగాళ్లు పన్నిన విద్యుత్ షాక్ వ్యూహంతో మరికొన్ని సందర్భాల్లో విభాగం నిర్లక్ష్యపు చర్యలతో వేలాడిన విద్యుత్ తీగల తాకిడితో గజరాజులు కుప్ప కూలుతున్నాయి. ప్రతి సంవత్సరం ఈ సంఖ్య పెరుగుతోంది. గత 6 సంవత్సరాల గణాంకాలు పరిశీలిస్తే రాష్ట్రంలో 104 ఏనుగులు విద్యుదాఘాతం కారణంగా మరణించాయి. 2019–20లో 9 ఏనుగులు మరణించగా, 2020–21లో 8 ఏనుగులు, 2021–22లో 13, 2022–23లో 26, 2023–24లో 15 మరియు 2024–25లో 33 ఏనుగులు మరణించాయి. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇంత పెద్ద సంఖ్యలో ఏనుగులు చనిపోలేదని సమాచారం. మానవ, గజరాజుల సంఘర్షణ రాష్ట్రంలో ఏనుగుల దుర్మరణం తరహాలో మానవులు, ఏనుగుల సంఘర్షణలో అవాంఛనీయ సంఘటనలు అధికంగా కొనసాగుతున్నాయి. 2019–20, 2024–25 మధ్య రాష్ట్రంలో మానవ, ఏనుగుల ఘర్షణల్లో అత్యధిక ఏనుగులను కోల్పోయింది. ఒడిశాలో 144 ఏనుగులు మరణించగా అస్సోం (113), తమిళనాడు (79), కర్ణాటక (67), పశ్చిమ బెంగాల్ (45), ఛత్తీస్‌గఢ్ (43) మరియు జార్ఖండ్ (39)లలో ఇది తక్కువగా ఉంది. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ డైరెక్టర్ రమేష్ కుమార్ పాండే ప్రకారం, మానవ–ఏనుగుల ఘర్షణలు ఇప్పుడు మొత్తం దేశానికి ఆందోళన కలిగించే అంశంగా మారాయి. ఏనుగులు ప్రధానంగా విద్యుదాఘాతం, రైలు ప్రమాదాలు, విష ప్రయోగం, వేట కారణంగా మరణిస్తున్నాయి. ఈ నాలుగు కారణాల వల్ల ఏనుగులు ప్రధానంగా మరణిస్తుండగా, ఒడిశాలో విద్యుదాఘాతం అత్యంత ఆందోళనకరంగా ఉంది. పశ్చిమ, దక్షిణ, మధ్య ఒడిశాలో విద్యుదాఘాతం కారణంగా అధికంగా ఏనుగులు మరణిస్తున్నాయి. రైలు ప్రమాదాలు అదుపులో ఉన్నాయి. గత 6 ఆర్థిక సంవత్సరాల్లో, ఒడిశాలో వరుసగా 1, 4, 3, 3, 5, 3 ఏనుగులు రైలు ప్రమాదాల్లో మరణించాయి. అయితే, గత 6 సంవత్సరాలలో విష ప్రయోగం కారణంగా ఏనుగుల మరణాలు నమోదు కానట్లు ఆయన స్పష్టం చేశారు. వేటగాళ్ల కారణంగా కొన్ని ఏనుగులు ప్రాణాలు కోల్పోయాయి. ఆరేళ్లలో.. రాష్ట్రంలో మానవ మరణాలలో కూడా ఒడిశా అగ్రస్థానంలో ఉంది. గత 6 ఏళ్లలో 2021–22 ఆర్థిక సంవత్సరం మినహా మిగతా అన్ని సంవత్సరాల్లో ఒడిశాలో ఏనుగుల దుర్మరణాలు దేశంలో అగ్ర స్థానంలో నిలిచాయి. 2019–20లో ఒడిశాలో 117 మంది ప్రాణాలు కోల్పోగా, 2020–21లో 93 మంది, 2021–22లో 112 మంది, 2022–23లో 148 మంది, 2023–24లో 154 మంది, 2024–25లో 143 మంది మరణించారు. 2021–22లో జార్ఖండ్‌లో 133 మంది ప్రాణాలు కోల్పోయారని, ఇది 2024–25లో 81కి తగ్గిందని పాండే తెలిపారు. ఈ పరిస్థితి నివారణకు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వివరించారు. -
రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి
రాయగడ: విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న కానిస్టేబుల్ మాధవ సొబొరొ (36) రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందిన ఘటన జిల్లాలోని గుణుపూర్‌లో ఘ టన చోటు చేసుకుంది. గుణుపూర్ బైపాస్ రోడ్డు నిర్మాణంలో భాగంగా విద్యుత్ స్తంభాన్ని బైకుతో ఢీకొనడంతో తీవ్రగాయాల పాలయ్యాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, స్థానికులు గుణుపూర్ సబ్ డివిజన్ హాస్పిటల్‌కు చికిత్స కోసం తరలించారు. అయితే పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం బరంపురం తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇదిలా ఉండగా బైపాస్ రోడ్డు పనులు ఎక్కడబడితే అక్కడే గుంతలు చేసి పనులు నత్తనడకన కొనసాగిస్తుండడంతో తరచూ ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన చేపట్టారు. దీంతో గుణుపూర్ ఆదర్శ పోలీస్‌స్టేషన్ ఐఐసీ కేకేబీకే కుహరో సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళనకారులకు నచ్చజెప్పారు. -
● హోంగార్డు సాహసం
కొరాపుట్: హోంగార్డు ధైర్య సాహసంతో పెద్ద అగ్ని ప్రమాదం తప్పింది. నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రం మెయిన్ రోడ్డులోని మా బండారు ఘరణి శక్తి పీఠం వెనక రోడ్డులో పూజా హోటల్లో పెద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. ఇది గమనించిన హోటల్లో ఉన్న ప్రజలు బయటకు పరుగులు తీశారు. వంట గది నుంచి మంటలు ఎగబడి మెదటి అంతస్తుకి పాకాయి. మెదటి అంతస్తులోని గదిలో గ్యాస్ సిలెండర్లు ఉన్నాయని సిబ్బంది కేకలు వేశారు. దాంతో స్థానికులు కూడా భయపడి ఆ ప్రాంతానికి దూరంగా వెళ్లిపోయారు. ఇది గమనించిన ఆ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న హోం గార్డు ఎ.మహేష్ సంఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పడానికి ప్రయత్నించాడు. అంతలో అగ్ని మాపక సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. అప్పటికే సిలెండర్లు ఉన్న గదికి మంటలు అంటుకున్నాయి. దీంతో మహేష్ తన ప్రాణాలు లెక్క చేయకుండా గది తలుపులు తీసి అగ్ని మాపక సిబ్బందిని లోపలకు తీసుకెళ్లి సిలిండర్ల వరకు మంటలు వ్యాపించకుండా చేశాడు. ప్రాణాలు ఫణంగా పెట్టి ప్రమాదం తప్పించిన మహేష్‌ని జిల్లా వాసులు అభినందనలతో ముంచెత్తారు. -
రైతులకు ఎరువులు అందడం లేదు
సోంపేట: మండలంలో రైతులకు సకాలంలో రసాయన ఎరువులు అందడం లేదని జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ అన్నారు. వ్యవసాయ సహాయ సంచాలకులు భవానీ శంకరరావు, వ్యవసాయాధికారి బి.నర్సింహమూర్తితో మండల పరిషత్ కార్యాలయంలో శనివా రం సమీక్ష నిర్వహించారు. మండలంలోని రైతులకు ఎరువులు అందడం లేదని సర్పంచ్ లు, ఎంపీటీసీలు చెబుతున్నారని పేర్కొన్నా రు. అఽధికారులు స్పందించి ఎరువులు అందజేయాలని కోరారు. వ్యవసాయాధికారులు మా ట్లాడుతూ ఎరువులు వచ్చే వారంలో మండలానికి అవసరమైనంత చేరుకుంటాయని తెలియజేశారు. ఎంపీపీ డాక్టర్ నిమ్మన దాస్ తదితరులు ఉన్నారు. అరసవల్లి: జిల్లాలో దోమల వ్యాప్తి నియంత్రణలో భాగంగా నీటితో నిండిన చెరువుల్లో దోమల ఉత్పత్తి కేంద్రాలైన లార్వాలను తినేసే గంబూషియా చేపలను విడిచిపెట్టనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఆయన శనివారం ఉదయం అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో ఇంద్ర పుష్కరిణిలో డీఎంహెచ్ఓ డాక్టర్ కె.అనితతో కలిసి గంబూషియా చేపలను విడిచిపెట్టారు. అనంతరం మాట్లాడుతూ జిల్లాలో 5 లక్షల గంబూషియా చేపలను సిద్ధం చేశామని, జిల్లాలో మొత్తం 165 టీమ్‌లతో అన్ని చెరువుల్లోనూ వీటిని విడిచిపెట్టేలా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ కెఎన్‌వీడీవీ ప్రసాద్, డీఎంహెచ్ఓ అనిత, జిల్లా మలేరియా నియంత్రణ అధికారి పీవీ సత్యనారాయణ, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సుధీర్, అరసవల్లి యూపీహెచ్సీ వైద్యురాలు డాక్టర్ బి.సాయిదివ్య తదితరులు ఉన్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ముమ్మరం శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో గల 6,51,717 పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్తగా క్యూ ఆర్ కోడ్ ఆధారిత రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ఆగస్టు 25 నుంచి ప్రారంభమైందని, ఈ పంపిణీ సెప్టెంబర్ 15 వరకు కొనసాగుతుందని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ శనివారం ఓ ప్రకటనలో తెలిపా రు. సంబంధిత కార్డుదారులు తమ రేషన్ షాప్ పరిధిలోని సచివాలయ సిబ్బంది లేదా రేషన్ డీలర్ ద్వారా బయోమెట్రిక్ విధానంలో కార్డు లు తీసుకోవాలని సూచించారు. ఈ–కేవైసీ చే యించుకోకుంటే ఇతర ప్రభుత్వ పథకాలు వర్తించవని ఆయన స్పష్టం చేశారు. అలాగే వాణిజ్య అవసరాలకు తప్పనిసరిగా వాణిజ్య గ్యాస్ సిలిండర్లను మాత్రమే వాడాలని సూచించారు. రుషికొండపై చేసిన విమర్శలు గుర్తున్నాయా..? ● నరసన్నపేట: ప్రజా సమస్యలు పట్టించుకోకుండా కూటమి నాయకులు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, విశాఖ వచ్చిన కూటమి నాయకులు మరోసారి దీన్ని రుజువు చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను విభాగాలుగా విభజించి ప్రైవేటీకరణ చేస్తున్నారని, దీనిపై కూటమి నాయకులు స్పందించలేదని తెలిపారు. స్టీల్‌ప్లాంట్‌పై ఎన్నికల ముందు అనేక హామీలిచ్చిన నాయకులు ఇప్పుడు పెదవి విప్పాలన్నారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ ఎప్పుడూ ఒకే విధానంపై ఉందని గుర్తు చేశా రు. ఆనాడే అసెంబ్లీలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేశామన్నారు. విశాఖ ప్రజలు కూటమి నాయకులను నిలదీయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రుషికొండ భవనాలపై విషం కక్కిన నాయకులు ఇప్పుడు వాటిని వాడుకోవడానికి పోటీ పడుతున్నారని తెలిపారు. అప్పట్లో జగన్ ప్యాలెస్ అంటూ దుష్ప్రచారం చేసి, ఇప్పుడు భవనాల వద్ద ఫొటోలు దిగుతున్నారని విమర్శించారు. జగన్ ప్యాలెస్ అన్న నాయకులు జీఓలో ఎందుకు అలా పెట్టలేదని ప్రశ్నించారు. -
గంగమ్మ చెంతకు గణనాథులు
రాయగడ: వినాయక నిమజ్జనాలు ప్రారంభమయ్యాయి. గంగమ్మ ఒడిలోకి గణనాథులు చేరుకుంటున్నారు. స్థానిక బాలాజీనగర్‌లోని కల్యా ణ వేంకటేశ్వర ఆలయంలొ ఉత్కళ బ్రాహ్మణ సేవా సమాజం ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక ఉత్సవాలు శనివారంతో ముగిశా యి. ఈ సందర్భంగా గణనాథుని ఊరేగింపు గా తీసుకెళ్లిన సభ్యులు స్థానిక నాగావళి నదిలో నిమజ్జనం చేశారు. అలాగే పట్టణంలోని పలు ప్రాంతాల్లో మూడు రాత్రులు పూజలను నిర్వహించిన గణనాథులకు నిమజ్జనాలు చేస్తున్నారు.ఇళ్లలోకి మురుగు, వర్షం నీరు జయపురం: జయపురం పట్టణంలో వర్షపు నీరు, మురుగునీరు ఇళ్లలోకి పారుతోందని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏమైందని పట్టణ ప్రజలు అధికారులను ప్రశ్నిస్తున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీపై కలెక్టర్ దృష్టి సారించటం లేదని, ముఖ్యమంత్రి మోహన్ మఝి ప్రత్యేక దృష్టి సారించాలని సీనియర్ పాత్రికేయుడు, సమాజ సేవకుడు నరశింగ చౌధురి సీఎంకు లేఖ రాశారు. జయపురం మున్సిపాలిటీలో పర్మినెంట్ కార్యనిర్వాహక అధికారి లేకపోవటం వల్ల తాత్కాలిక అధికారులు అండర్ గ్రౌండ్ డ్రైనేజీపై దృష్టి సారించడం లేదన్నారు. 2009లో బీజేడీ, బీజేపీ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న సమయంలో జయపురం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం రూ.2 కోట్లు మంజూరు చేశారని, ఆ డబ్బు సరిపోదని జయపురం మున్సిపాలిటీకి సెవెరేజ్ బోర్డు రిటన్ చేసిందని, తర్వాత ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో పనులు ఆగిపోయాయన్నారు. వానలకు పరిస్థితి అధ్వానంగా మారుతోందని అండర్ గ్రౌండ్ డ్రైనేజీపై దృష్టి సారించాలని కోరారు.విజిలెన్స్ కేసులో జూనియర్ ఇంజినీర్‌కు జైలుశిక్ష పర్లాకిమిడి: గజపతి జిల్లాలో గ్రామీణ తాగునీరు, శానిటేషన్ డివిజన్లో జూనియర్ ఇంజినీర్‌గా పనిచేసిన అరున్ జెన్నా రెండేళ్ల కిందట విజిలెన్స్ అధికారుల వలలో పడ్డాడు. ఆయనకు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్టు గుర్తించిన విజిలెన్స్ అధికారులు కేసు పెట్టారు. ప్రస్తుతం ఆయన మయూర్భంజ్ జిల్లా సర్వశిక్షా అభియాన్‌లో జిల్లా ప్రాజెక్టు కోఆర్డినేటరుగా పనిచేస్తున్నారు. ఆయనపై ఉన్న విజిలెన్సు కేసులు విచారించిన బరిపద విజిలెన్సు స్పెషల్ జడ్జి రెండేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.పదివేల జరిమానా విధిస్తున్నట్టు తీర్పు చెప్పారు. అరుణ్ కుమార్ జెన్నాను ప్రభుత్వ విధుల నుంచి బహిష్కరించాలని సంబంధిత ప్రభుత్వ శాఖకు విజిలెన్స్ అధికారులు సిఫారసు చేశారు. ఈ కేసులో విజిలెన్స్ అధికారి బాలసోర్ నరేంద్ర బెహారా అప్పట్లో కేసు ఫైల్ చేయగా, స్పెషల్ పీసీ బరిపద సంతును దాస్ ప్రాసిక్యూషన్ చేశారు. చెట్టును ఢీకొన్న బైక్ మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా పోడియా–కలిమెల సమితి మధ్య రహదారిలో శనివారం ఓ యువకుడు బైక్‌తో చెట్టును ఢీకొని మృతి చెందాడు. కలిమెల సమితి ఉండ్రుకొండ పంచాయతీలో ఏదో పని మీద వచ్చి తిరిగి ఎంవీ 58 గయరామాం గ్రామానికి వెళ్తున్న నరేష్ సర్దార్ అనే యువకుడు బైక్‌తో చెట్టును ఢీకొన్నాడు. స్థానికులు చూసి ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలో మృతి చెందాడు. కలిమెల పోలీసులు విషయం తెలుసుకుని ఆరోగ్య కేంద్రం వద్దకు చేరుకుని ఐఐసీ ముకుందోమేల్క కేసు నమోదు చేసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. -
కాశీనగర్‌లో న్యాయ చట్టాలపై అవగాహన
పర్లాకిమిడి: కాశీనగర్‌లో వారణాసి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం ఉదయం జిల్లా న్యాయ సేవా ప్రాధికరణ ఆధ్వర్యంలో దైనందిన చట్టాలు, వాటి అమలుపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమాన్ని జిల్లా కోర్టు డీఎల్ఎస్ఏ కార్యదర్శి బిమల్ రవుళో ప్రారంభించగా, బార్ అసోసియేషన్ సభ్యులు న్యాయవాది గుమ్ముడు చిట్టిబాబు, అసిస్టెంటు బ్లాక్ విద్యాధికారి నర్మదా దాస్, వారణాసి ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఆర్.దిలీప్‌కుమార్ తదితరులు హాజరయ్యారు. విద్యార్థులకు చట్టాలు, వాటి అమలు, యుక్త వయస్సు వచ్చిన విద్యార్థినులు ఎదుర్కొనే సమస్యలు, సమాజంలో చట్టాలు వాటి పరిధిని కూలంకషంగా వివరించారు. -
ఎరువుల సరఫరా ఏకపక్షం
● కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులు ● రైతన్నకు తప్పని ఎరువు కష్టాలు రైతులకు ఎరువులు అందించడంలో ప్రభుత్వం విఫలమైంది. అధికార పార్టీ నాయకులు తమ ఇళ్లలో ఎరువులు ఉంచు కుని వారికి కావాల్సిన వారికే ఇచ్చారు. అధికారులు కూడా వారికి వంత పాడారు. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారు లు స్పందించాలి. – చింతాడ రవికుమార్, ఆమదాలవలస వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయ కర్త ఆమదాలవలస రూరల్: అన్నదాతకు అందాల్సిన ఎరువులు పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎరువుల సరఫరా ఏకపక్షంగా జరుగుతోందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నాయకుల చేతుల్లోకి ఎరువులు చేరడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలకే పూర్తిగా ఎరువులు అందే పరిస్థితి ఏర్పడింది. దీనిపై జిల్లా అధికారులు కూ డా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. తొలిదశలో రైతు సేవా కేంద్రాల ద్వారా కొంత సరఫరా చేసినా ఆ తర్వాత మొత్తం ఎరువులు వ్యాపారులకు అందించటంతో ఎరువు కరువుగా మారింది. గగ్గోలు పుట్టిస్తున్న ధరలు ఎరువుల వ్యాపారులు అధికార పార్టీ నాయకులు అండదండలతో కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తున్న సంగతి చాలా చోట్ల బయటపడింది. ఒక యూరియా బస్తాపై రూ. 100 నుంచి రూ.150 వరకు అదనంగా తీసుకుంటున్నారు. కాంప్లెక్స్ ఎరువులపైనా ఇదే స్థాయిలో దోపిడీ జరుగు తోంది. ముఖ్యంగా ఆమదాలవలసలో రైల్వేగూడ్స్ షెడ్ ఉండటం, ఇందుకు దగ్గరలో గోదాంలు కూడా ఉన్నందున వ్యాపారుల వ్యాపారం మూడుపువ్వు లు ఆరు కాయలుగా కొనసాగుతోంది. ఇంత అక్రమాలు జరుగుతున్నా ఇక్కడ అధికారులు కనీసం తనిఖీ చేసేందుౖకైనా ముందుకు రావడం లేదు. నిఘా విభాగం సైతం నిద్ర నటిస్తోంది. తప్పని నిరీక్షణ బూర్జ: మండలంలో గల నీలాదేవిపురం (నీలంపేట) గ్రామ రైతు సేవా కేంద్రానికి ప్రభుత్వం నుంచి శనివారం 222 బస్తాల యూరియా వచ్చింది. నీలాదేవిపురంతో పాటు వావాం, ఉవ్వపేట, బూర్జ నుంచి రైతులు రావడంతో తోపులాట జరిగింది. అధికారులు పోలీసు సహాయం కోరడంతో ఎస్ఐ ఎం.ప్రవల్లిక సిబ్బందితో రైతులను క్యూలో నిలబెట్టారు. రైతులకు ఎరువుల కొరత రావటం చాలా బాధాకరం. చాలా గ్రామాల్లో ఇప్పటికీ ఎరువులు లేక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. – బొడ్డేపల్లి కృష్ణారావు, రైతు, ఇసకలపేట గ్రామం, ఆమదావలస మండలం టెక్కలిపట్నం గ్రామ సచివాలయం వద్ద యూరియా కోసం బారులు తీరిన రైతులు -
అవస్థలు డబుల్!
అండర్ పాసేజ్‌లు ఎవరి కోసం నిర్మించారో అర్ధం కావడం లేదు. రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన వీటి వల్ల కష్టాలు రెట్టింపయ్యాయి. వర్షం పడిన ప్రతిసారి రోజుల తరబడి చిక్కాలవలస వద్ద రాకపోకలు నిలిచిపోతున్నాయి. తప్పని పరిస్థితుల్లో వాహనాలను రైల్వే ట్రాక్ పైనుంచే తీసుకెళ్లాల్సి వస్తోంది. రైల్వే అధికారులు పట్టించుకోవడం లేదు. – ఎం. లక్ష్మునాయుడు, చిక్కాలవలస వర్షం పడిన ప్రతిసారీ ఇబ్బందులు పడుతున్నాం. వాహనాలు నడపలేకపోతున్నాం. ఇరువైపులా రాకపోకలు నిలిచిపోతున్నాయి. అయినా రైల్వే శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రజలను ఇలా కష్టాలకు వదిలేయడం అన్యాయం. మంత్రి రామ్మోహన్నాయుడు స్పందించి రైల్వే అధికారులతో మాట్లాడి నీరు నిల్వ లేకుండా చూడాలి. – కింతలి విశ్వనాథం, దాసరివానిపేట కష్టాలు రెట్టింపయ్యాయంటున్న వాహనచోదకులు రైల్వే అండర్ పాసేజ్‌లలో నిలిచిపోతున్న వర్షపు నీరు రోజుల తరబడిన స్తంభించిపోతున్న వాహనాల రాకపోకలు పట్టించుకోని రైల్వే అధికారులు -
వలస కార్మికుల ఆచూకీ తెలపండి
రాయగడ: ఉపాధి కోసం పొరుగు రాష్ట్రం వెళ్లిన ఇద్దరి వలస కార్మికుల ఆచూకీ తెలపాలని బాధిత కుటుంబాలు జిల్లాలోని టికిరి పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కాసీపూర్ సమితి టికిరి పంచాయతీ పరిధిలోని తుటిబార్ గ్రామానికి చెందిన రునా మాఝి, అభి జొడియా, గోరఖ్‌పూర్ గ్రామానికి చెందిన నాభి మాఝి, పితాజొడి గ్రామానికి చెందిన తసీల్ మాఝి, దొరాగుడ గ్రామానికి చెందిన భాస్కర జొడియాలు ఈనెల 21వ తేదీన పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లికి ఉపాధి కోసం వెళ్లారు. ఈ క్రమంలో అనకాపల్లిలోని ఒక కెమికల్ ఫ్యాక్టరీలో పనులకు చేరారు. కంపెనీలో కెమికల్స్ కారణంగా తాము అనారోగ్యానికి గురవుతున్నామని అంతా కలిసి తిరిగి స్వగ్రామానికి చేరుకునేందుకు పయనమయ్యారు. అయితే వీరిలో రునా మాఝి, తసీల్ మాఝిలు రాయగడ స్టేషన్లో దిగి ఎటువెళ్లారో తెలియకపోవడంతో తోటి స్నేహితులు తమ గ్రామానికి వెళ్లి విషయాన్ని తెలియజేశారు. దీంతో బాధిత కుటుంబీకులు ఈ మేరకు వారి ఆచూకీ తెలపాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. -
ఉత్సాహంగా స్వపరిపాలన దినోత్సవం
● అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలురాయగడ: జిల్లాలోని గుణుపూర్ మున్సిపాలిటీ యంత్రాంగం ఆధ్వర్యంలో స్వపరిపాలన దినోత్సవాన్ని రెండు రోజులుగా ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం పథోత్సవాల పేరిట నిర్వహించిన వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను అలరించాయి. మెయిన్ రోడ్డు వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికలో ఆదివాసీ సంస్కృతికి అద్దం పట్టే నృత్యాలు, ఒడిస్సీ నృత్య ప్రదర్శనలతో పాటు చిన్నారులతో కరాటే విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఆదివారం జరగనున్న స్వపరిపాలన దితోత్సవ వేదికలను కొత్త బస్టాండు వద్ద ఘనంగా జరుపుకునేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మమత గౌడో, వైస్ చైర్మన్ శివకుమార్ గౌడవ, సబ్ కలెక్టర్ దుదూల్ అభిషేక్ అనిల్ పాల్గొన్నారు. -
మారుమూల ప్రాంతాల్లో అధికారి పర్యటన
రాయగడ: జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి అక్షయ కుమార్ ఖెముండొ జిల్లాలోని మునిగుడ సమితి మునిఖాల్ పంచాయతీలోని అత్యంత మారుమూల ప్రాంతాల్లో శుక్రవారం పర్యటించారు. పంచాయతీ పరిధిలో గల బొడొడెంగుని, శకట తదితర గ్రామాల్లో పర్యటించారు. సరైన రహదారులు లేని ఈ గ్రామాల్లో ఆయన కొంత దూరం కాలినడకన మరికొంత దూరం బైక్‌పై ప్రయాణించి ప్రజలతో కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఈ గ్రామాల్లో మౌలిక సౌకర్యాలు గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా ఎంతమందికి ఇళ్లు మంజూరయ్యాయి. వాటిని ఎంతమంది లబ్ధిదారులు పొందారు అన్న వివరాలను ఆయన సంబంధిత శాఖ అధికారులను తన వెంట తీసుకుని వెళ్లి వివరాలను సేకరించారు. అంతకు ముందు మునిఖొల్ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్, సమితి సభ్యులు, పంచాయతీ అధికారి తదితరులతో సమవేశమై పంచాయితీలొ జరగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించి సమీక్షించారు. -
అదృశ్యమైన వ్యక్తి శవమై తేలాడు..
టెక్కలి రూరల్: స్థానిక అక్కపు వీధికి చెందిన మోనింగి శ్రీనివాసరావు(42) శనివారం తన ఇంటి సమీపంలోని రాతి బావిలో శవమై తేలాడు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. శ్రీనివాసరావుకు భార్య స్వాతి, ఇద్దరు పిల్లలు. మసాల పౌడర్ల వ్యాపారం చేస్తుండేవాడు. మూడు రోజుల క్రితం పెళ్లిరోజు రావడంతో బయటకు వెళ్దామని భార్య చెప్పింది. అందుకు ఒప్పుకోకపోవడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మనస్థాపానికి గురైన శ్రీనివాసరావు గురువారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దీంతో కుంటుబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. శనివారం ఉదయం శ్రీనివాసరావు ఇంటి సమీపంలో ఉన్న బావి వద్ద వ్యక్తి మృతదేహం తేలడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ రాము బావిలో మృతదేహాన్ని బయటకు తీయించగా మృతుడు శ్రీనివాసరావుగా గుర్తించారు. శ్రీనివాసరావు తండ్రి మోనింగి ప్రభాకరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
20 మంది విద్యార్థులకు స్కాలర్షిప్ అందజేత
పర్లాకిమిడి: హైటెక్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి మణిపూర్ రాష్ట్రం తోబాల్ జిల్లాలో పర్యటించి అక్కడ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా 20 మంది ఇంజినీరింగ్, మెడికల్ విద్యార్థులకు స్కాలర్షిప్పులు అందజేశారు. 2025–26 విద్యా సంవంత్సరంలో 50 మెడికల్ సీట్లు ప్రభుత్వ ఆదేశాలతో పెంచి ఉచిత విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించినట్టు తెలియజేశారు. అనంతరం రెండు రోజుల పాటు మణిపూర్‌లో ఉచిత వైద్య శిబిరం ప్రారంబించి అనేక మంది రోగులకు ప్రాథమిక చికిత్స అందజేశారు. కార్యక్రమంలో పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి కూడా పాల్గొన్నారు. మణిపూర్ గ్రామస్థులు అక్కడ పండిస్తున్న వివిధ రకాల పండ్లు, మొక్కలను హైటెక్ చైర్మన్ తిరుపతి పాణిగ్రాహికి అందజేశారు. విద్యాసంస్థల డైరెక్టర్లు రాకేష్ పాణిగ్రాహి, ధృత్తిమోక్ష పాణిగ్రాహిలు ఉన్నారు. -
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
శ్రీకాకుళం అర్బన్: ఆర్టీసీలో రిటైరైన, చనిపోయిన ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యుటీ, లీవ్ ఎన్ క్యాష్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఏపీపీటీడీ (ఆర్టీసీ) ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు డిమాండ్ చేశారు. శనివారం శ్రీకాకుళంలోని రెవెన్యూ భవన్లో ఈయూ జిల్లా అధ్యక్షుడు జి.త్రినాథ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిటైర్డు ఉద్యోగులకు వైద్యసౌకర్యాలు, ఆర్టీసీ ఆసుపత్రుల్లో మందులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 11వ పీఆర్సీ బకాయిలు, ఎన్నికల హామీ మేరకు ఐఆర్ ప్రకటించి 12వ పీఆర్సీ కమిషన్ నియమించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి పి.భానుమూర్తి మాట్లాడుతూ సీ్త్రశక్తి ఉచిత బస్సు పధకం విజయవంతం కావాలంటే కనీసం 3000 కొత్త బస్సులు కొనుగోలు చేయాలని, 10 వేల పోస్టులను భర్తీ చేయాలని చెప్పారు. సమావేశంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి పి.నానాజీ, ఏపీజేఏసీ అమరావతి శ్రీకాకుళం జిల్లా కంచరాన శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి సీపాన వెంకటరమణ, జోనల్ అధ్యక్షులు కె.జే.శుభాకర్, జోనల్ కార్యదర్శి బాసూరి కృష్టమూర్తి, కోశాధికారి జి.తాతాలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా కె.దశరథుడు (టెక్కలి డిపో), జిల్లా కార్యదర్శిగా గూనాపు త్రినాథ్ (శ్రీకాకుళం–1 డిపో), వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బి.టి.వి.శ్రీనివాస్ (పలాస), చీఫ్ వైస్ ప్రెసిడెంట్‌గా బత్తిన అప్పారావు (శ్రీకాకుళం– 2 డిపో), కోశాధికారిగా పి.వి.ఆర్.లలితకుమారి (శ్రీకాకుళం–1 డిపో), జాయింట్ సెక్రటరీగా బి.మురళిమోహన్, ప్రచార కార్యదర్శిగా వై.కె.కుమార్, ఉపాధ్యక్షుడిగా ఎస్.జోగారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా డి.వనజాక్షి, ఎం.సురేష్, అసిస్టెంట్ సెక్రటరీలుగా వి.డి.రావు, సి.ఎస్.కుమార్ తదితరులు నియమితులయ్యారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఈయూ నాయకులు కె.బాబూరావు, ఎస్వి రమణ, కె.గోవిందరా తదితరులు పాల్గొన్నారు. -
జర్నలిస్ట్‌పై హత్యాయత్నం
కొరాపుట్: మద్యం మత్తులో జర్నలిస్ట్‌పై హత్యాయత్నం జరిగింది. శనివారం వేకువజామున నబరంగ్‌పూర్ జిల్లా పపడాహండి సమితి కేంద్రంలో ఒక టీవీ చానల్ జిల్లా ప్రతినిధి సుమిత్ కుమార్ గంటోపై అదే గ్రామానికి చెందిన హరేకృష్ణ బెహరా కత్తితో దాడి చేశాడు. దీంతో ప్రాణ భయంతో సుమిత్ పరుగులు తీశాడు. ఇది చూసిన స్థానికులు నిందితుడు హరేకృష్ణను బంధించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సుమిత్‌ను పపడాహండి సమితి కేంద్ర ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో నబరంగ్‌పూర్ జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. శరీరం లోపల రక్తస్రావం ఎక్కువగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు విశాఖపట్నంలోని ప్రైవేట్ ఆస్పత్రి తరలించారు. మరోవైపు స్థానికుల దాడితో నిందితుడు హరేకృష్ణ తీవ్రంగా గాయపడడంతో పోలీసులు అతడిని కూడా ఆస్పత్రిలో చేర్పించారు. నిందితుడు గత కొద్దిరోజులుగా మతిస్థిమితం లేకుండా మద్యం మత్తులో గొడవలకు దిగుతున్నాడని స్థానికులు పేర్కొన్నారు. -
బార్లకు ముగిసిన డ్రా
● ఐదు బార్లకు లైసెన్సులు కేటాయింపు ● దరఖాస్తులు ఎక్కువగా పడక వెలవెలబోయిన అంబేడ్కర్ ఆడిటోరియంశ్రీకాకుళం క్రైమ్ : ఎకై ్సజ్ శాఖ బార్ పాలసీలో భాగంగా జిల్లాలో ఐదు బార్లకు లాటరీ పద్ధతిన లైసెన్సుదారులను అధికారులు నిర్ణయించారు. శనివారం ఉదయం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశాలతో డీఆర్ఓ ఎం.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ ఆడిటోరియంలో టోకెన్ డ్రా పద్ధతిన లాటరీ ప్రక్రియ ప్రారంభమైంది. సంబంధిత విభాగం నుంచి జిల్లా డిప్యూటీ కమిషనర్ దోసకాయల శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా ఎ కై ్సజ్ అధికారి సీహెచ్ తిరుపతినాయుడు దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ శ్రీకాకుళం కార్పొరేషన్, పలాస–కాశీబుగ్గ, ఆమదాలవలస, ఇచ్ఛాపురం మున్సిపాలిటీ పరిధిలో జనరల్ కేటగిరీలో 17 బార్లకు గాను, రిజర్వ్ కేటగిరీలో (గీతకులాలవారికి) 2 బార్లకు గాను దరఖాస్తులు కోరగా 22 దరఖాస్తులే వచ్చాయన్నారు. ఆమదాలవలస, ఇచ్ఛాపురంలో ఒక్క దరఖాస్తు కూడా పడకపోగా, శ్రీకాకుళంలో 3 జనరల్ కేటగిరీ, ఒక రిజర్వ్ కేటగిరీ (శ్రీశయన)కి, పలాస–కాశీబుగ్గలో ఒక రిజర్వ్ (సొండి) కేటగిరీకి దరఖాస్తులు వచ్చాయన్నారు. ఈ విధంగా చూసుకుంటే శ్రీకాకుళంలో 16 దరఖాస్తులు రాగా, పలాసలో ఆరు వచ్చాయని, ఒకే వ్యక్తి నాలుగు దరఖాస్తులు వేసిన సందర్భాలు రెండు చోట్ల ఎదురయ్యాయన్నారు. వెలవెలబోయిన ఆడిటోరియం.. బార్ల లైసెన్సు డ్రాలో దరఖాస్తుదారులకంటే ఎకై ్సజ్ సిబ్బందే ఎక్కువ ఉండటం గమనార్హం. కూటమి పార్టీలకు చెందిన మ ద్యం సిండికేట్ ముందస్తుగా వేసుకున్న ప్రణాళికతోనే టెండర్లు వేయకుండా బ్లాక్‌మెయిలింగ్‌కు దిగాయని పలువురు చర్చించుకుంటున్నారు. అందుకే ఆమదాలవలస, ఇచ్ఛాపురం, కాశీబుగ్గల్లో జనరల్‌లో ఒక్క అప్లికేషన్ కూడా రాలేదన్నారు. పడని వాటికి తర్వాత మళ్లీ నోటిఫికేషన్ ఇస్తామని అధికారులు చెబు తున్నా టీడీపీ నాయకులు టెండర్లు వేయకుండానే తక్కువ డిపాజిట్లతో దక్కించుకోవాలన్న కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. -
● కొట్టుకుపోయిన కల్వర్టు
జయపురం: జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడ సమితిలో కుండపోత వర్షాలకు ఒక కల్వర్టు కొట్టుకు పోయింది. సమితిలో 25 గ్రామాల ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వారు కొట్టుకుపోయిన కల్వర్టు ప్రాంతంలో కొన్ని ఇనుప పైపులను వేసి వాటిపై వెళ్తున్నారు. ఆ కల్వర్టు మూడేళ్ల కిందట బొయిపరిగుడ సమితి దండాబడి నుండి చికాపూర్ వరకు ప్రధాన మంత్రి షడక్ పథకంలో వేశారు. అయితే గత కొద్ది దినాలుగా ఎడతెరిపి లేకుండా కుండపోతగా వర్షాలు పడటంతో కల్వర్టు కొట్టుకుపోయిందని ప్రజలు తెలిపారు. నిర్మాణంలో నాణ్యత లేకపోవడం వల్ల కల్వర్టు కొట్టుకుపోయిందన్నారు. ఈ విషయం దొండాబడి సర్పంచ్ చెండియ ఖిళో దృష్టికి కొంత మంది జర్నలిస్టులు తీసుకువెళ్లగా గతంలో రెండు సార్లు కల్వర్టు డ్యామేజ్ అయిందని, తాను సొంత డబ్బుతో మరమ్మతు చేయించానని వెల్లడించారు. అనేక సార్లు ఆర్డీ అధికారులకు తెలిపినా పట్టించుకోవటం లేదని వెల్లడించారు. -
చోరీలకు యత్నించిన ఐదుగురు అరెస్టు
జయపురం: పట్టణంలో ధనవంతుల ఇళ్లను, దారిన పోయే వాహనదారులను దోచుకొనేందుకు సన్నద్ధమవుతున్న ఐదుగురు దుండగులను జయపురం పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఐదు పెద్ద కత్తులు, ఒక ఇనుప రాడ్డు, కారంపొడి, టార్చ్లైట్లు, మూడు మోటారుబైక్‌లు సీజ్ చేసినట్లు పట్టణ పోలీసు అధికారి ఉల్లాస్ చంధ్ర రౌత్ శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. శుక్రవారం రాత్రి పట్టణ పోలీసు సబ్ఇన్స్పెక్టర్ సిద్ధాంత కుమార్ బెహర నేతృత్వంలో ఏఎస్ఐ లు డి.పిపండా, ఎస్.బి.నాయక్, పోలీసులు మోహన పాత్రో,ఎ.నాయిక్, ఒడిశా ఆర్మడ్ పోలీసు ఎల్.ప్రధాన్,ఎస్.ముదులిలు పెట్రోలింగ్ జరుపుతున్న సమయంలో జయనగర్ సమీప భూతనాద్ మందిరంలో కొంతమంది వ్యక్తులు దోపిడీలు, దొంగతనాలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని వారి వద్ద మారణాయుదాలు ఉన్నట్లు విశ్వాసనీయ వర్గాల ద్వారా సమాచారం అందిందని పోలీసు అధికారి వెల్లడించారు. వెంటనే పెట్రోలింగ్ సిబ్బంది అక్కడకు చేరుకొని ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసి.. వివిధ వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. అరెస్టయిన వారిలో జయపురం గోపబందునగర్ వాసి శివ సున, ఒడియ మేదరి వీధికి చెందిన సునీల్ పొరజ ఉరఫ్ లల్లు, జయనగర్ వాసి సురేష్ హరిజన్, ఒడియా మేదరి వీధికి చెందిన హరి నాయిక్, ప్రసాదరావుపేట వాసి టి.మణికంఠ, జముణగుడ వాసి కార్తీక కుడ ఉన్నట్టు వివరించారు. -
మజ్జిగౌరి మందిరానికి మహర్దశ
● రూ.26 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారంరాయగడ: ఉత్కళాంధ్రుల ఆరాధ్య దైవంగా పూజలందుకుంటున్న మజ్జిగౌరి మందిరం రూపురేఖలు మారనున్నాయి. సుమారు రూ.26 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు శుక్రవారం భూమిపూజ జరిగింది. మందిర ప్రధాన అర్చకుడు చంద్రశేఖర్ బెరుకొ, రాజపురోహితుడు బీరంచి నారాయణ దాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజా కార్యక్రమాల్లో మందిరం మేనేజింగ్ ట్రస్టీ రాయి సింగి బిడిక, సభ్యులు ఇప్పిలి సన్యాసిరాజు, బాబు దలాయి, పెద్దీన వాసుదేవరావు, మందిరం సూపరింటెండెంట్ జానకీ వల్లభ్ మహాంతితో పాటు మందిరాభివృద్ధికి టెండర్లు దక్కించుకున్న బరంపురానికి చెందిన ప్రముఖ కాంట్రాక్ట్ సంస్థ కాసీకంచన్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేతలు పాల్గొన్నారు. బీజేడీ హయాంలో నిధులు మంజూరు మజ్జిగౌరి అమ్మవారి దర్శనం కోసం ఇటు తెలుగు రాష్ట్రాల భక్తులతో పాటు అటు చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన భక్తులు అధిక శాతంలో వస్తుంటారు. ప్రతి ఆది, మంగళ, బుధవారాల్లొ వీరి సంఖ్య గణనీయంగా ఉంటుంది. కేవలం ఆదివారం నాడు సుమారు 50 వేల నుంచి 60 వేల మందికి పైగా భక్తులు అమ్మవారి దర్శనం కోసం వస్తుంటారు. వచ్చే భక్తులు ఇక్కట్లు పడుతుండటం గమనించిన అప్పటి బీజేడీ ప్రభుత్వం మందిరం అభివృద్ధి కోసం రూ.36 లక్షల నిధులను కేటాయించింది. అనంతరం అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఈ మేరకు మొదటి దశలో రూ.26 కోట్ల నిధులు మంజూరు చేయడంతో పాటు పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భక్తులకు మెరుగైన సౌకర్యాలు మందిరం అభివృద్ధి కార్యక్రమాల కోసం మంజూరైన రూ.26కోట్లతో పనులు చేపట్టనున్నట్లు మందిరం మేనేజింగ్ ట్రష్టీ రాయిసింగి బిడిక తెలియజేశారు. అమ్మవారి దర్శనం కోసం విరివిగా వస్తున్న భక్తుల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని నిర్మాణం పనులకు శ్రీకారం చుట్టామని అన్నారు. ముఖ్యంగా యాత్రికుల నివాసం, క్యూలైన్, షాపింగ్ కాంప్లెక్స్, అన్ని సౌకర్యాలతో గల సౌచాలయం, కేశఖండన శాల వంటివి ప్రాథమిక దశలో నిర్మాణం పనులు ప్రారంభిస్తామని వివరించారు. దశల వారీగా నిధులు మంజూరు కానున్న నేపథ్యంలో రెండొ దశలో ప్రభుత్వం మంజూరు చేసే నిధులతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటికే అభివృద్ధికి సంబంధించి మాస్టర్ ప్లాన్ కూడా సిద్ధమైందని తెలిపారు. -
3న శ్రీమందిరం పాలక మండలి సమావేశం
భువనేశ్వర్: పూరీ శ్రీ మందిరం పాలక మండలి సమావేశం సెప్టెంబర్ మూడో తేదీన జరుగుతుంది. ఇది కొత్తగా ఏర్పడిన పాలక మండలి తొలి సమావేశం విశేషం. పూరీ గజపతి మహారాజా దివ్య సింగ్ దేవ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించనున్నారు. సమావేశంలో కొత్త పాలక మండలి సభ్యులను స్వాగతించి, కొత్త ఉప కమిటీలను ఏర్పాటు చేస్తారు. వర్షాలకు జయపురంలో భారీ నష్టం జయపురం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జయపురంలో భారీ నష్టం వాటిళ్లిందని అధికారులు తెలియజేశారు. మొత్తం 28 ఇళ్లు పూర్తిగా, పాక్షికంగా దెబ్బతిన్నట్లు వెల్లడించారు. నష్టపోయిన కుటుంబాలకు సాయం అందించి ఆదుకోవా లని జయపురం తహసీల్దార్ సవ్యసాచి జెన రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. అలాగే ఇళ్లు నష్టం జరిగిన ప్రాంతాలను అధికారులు సందర్శించి అంచనా వేస్తున్నారు. బాధితులకు సాయం అందజేయనున్నట్లు తెలియజేశారు. యువ న్యాయవాది ఆత్మహత్య భువనేశ్వర్: నగరం శివార్లు పండర ప్రాంతంలో ఉంటున్న యువ న్యాయవాది ఆత్మాహుతిలో దహనం అయ్యాడు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. గురువారం అర్ధరాత్రి ఈ విచారకర సంఘటన జరిగింది. మంటల్లో ఆహుతి అయి ప్రాణాలు కోల్పోయిన న్యాయవాది 46 సంవత్సరాల దీపక్ కుమార్ సాహుగా గుర్తించారు. ఈ ప్రాంతంలో ఆయన సివిల్ న్యాయవాదిగా సుపరిచితులు. పెట్రోల్ పోసుకుని తనకు తాను నిప్పంటించుకున్నట్లు భావిస్తున్నారు. ఘటనా స్థలంలో ఖాళీ పెట్రోలు సీసాను పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోలీసులు స్వాధీనపరచుకుని పంచనామా కోసం స్థానిక క్యాపిటలు ఆస్పత్రికి తరలించారు. ఇంటి డాబాపైనే దీపక్ కుమార్ సాహు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. గంజాయి పట్టివేత జయపురం: జయపురం మీదుగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు వెళ్లే ప్రభుత్వ బస్సులో పట్టణ పోలీసులు 5 కేజీల గంజాయి పట్టుకున్నారు. బస్సులో ఒక బ్యాగ్ ఉందని వచ్చిన సమాచారం మేరకు పోలీసులు బస్టాండ్‌కు వెళ్లి బ్యాగ్‌ను తనిఖీ చేయగా అందులో ఒక ఫ్యాంట్, షర్టుతో పాటు గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గురువారం సాయంత్రం జయపురం ప్రభుత్వ బస్టాండ్‌లో విజయవాడ వెళ్లనున్న బస్సులో బ్యాగ్ పడిఉంది. దీనిని ఒక మహిళా ప్రయాణికురాలు తెరిచి చూడగా అందులో గంజాయి ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించింది. దీంతో పోలీసులు సమాచారం అందించగా, పోలీసులు వెళ్లి స్వాధీనం చేసుకున్నారని పట్టణ పోలీసు అధికారి ఉల్లాస చంద్రరౌత్ తెలియజేశారు. సీసీ కెమెరాల ఫుటేజీ ద్వారా దర్యాప్తు జరుపుతున్నామని వెల్లడించారు. ఇంతకీ ఆ బ్యాగ్ ఎవరు విడిచిపెట్టారు అనేది తెలియాల్సి ఉంది. ఆలయంలో అగ్నిప్రమాదంభువనేశ్వర్: పూరీ జిల్లా బ్రహ్మగిరి పోలీస్ ఠాణా పరిధి కంద్గోడ గ్రామంలోని ఒక ఆలయంలో గురువారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆలయంలో నిత్య పూజలందుకుంటున్న జగన్నాథుడు, ఆయన తోబుట్టువులు బలభద్రుడు, దేవి సుభద్ర విగ్రహాలు ధ్వంసమయ్యాయి. ఆలయ అర్చకులు యథాతథంగా గురువారం రాత్రి 8 గంటల ప్రాంతంలో సంధ్యా హారతి, రోజువారీ సంకీర్తన తర్వాత తలుపులు మూసివేశారు. ఆలయ ద్వారాలు మూసి వేసిన సుమారు గంట తర్వాత ఆలయం నుంచి పొగలు కమ్ముతున్నట్లు కొంతమంది దృష్టిలో పడింది. ఈ విషయం ఆలయ అర్చకులకు తెలియడంతో తక్షణమే అర్చక వర్గంతో స్థానికులు ఆలయానికి పరుగెత్తుకుంటూ వచ్చి తలుపు తెరిచిన తర్వాత మంటలను గమనించారు. మంటలను నివారించి పరిశీలించగా అగ్ని ప్రమాదంలో జగన్నాథుడు, బలభద్రుడు, దేవి సుభద్ర విగ్రహాలతో పాటు కొన్ని పూజా సామగ్రి దగ్ధమైనట్లు గుర్తించారు. అగ్ని ప్రమాదానికి కచ్చితమైన కారణం ఇంకా తెలియనప్పటికీ ఆలయం లోపల ఉన్న మట్టి దీపం వల్ల మంటలు చెలరేగి ఉండవచ్చని భావిస్తున్నారు. స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరి విచారణ చేపట్టారు. ఇదిలా ఉండగా కొంతమంది స్థానికులు ఆలయ సేవకుల నిర్లక్ష్యంతో అగ్ని ప్రమాదం జరిగిందని ఆరోపించారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. -
క్రీడలపై అవగాహన ర్యాలీ
రాయగడ: జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం స్థానిక సద్భావన స్పొర్ట్స్ కాంప్లెక్స్ నుంచి నిర్వహించిన అవగాహన ర్యాలీని జిల్లా కలక్టర్ అశుతోష్ కులకర్ణి జెండా ఊపి ప్రారంభించారు. క్రీడాకారులకు ప్రభుత్వం సమకూరుస్తున్న సౌకర్యాల గురించి ఈ సందర్భంగా వివరించారు. క్రీడల్లొ రాణించాలని క్రీడాకారులనేద్దేశించి మాట్లాడారు. ర్యాలీలో క్రీడాకారులు, యువతీ, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం స్థానిక జీసీడీ వాకర్స్ క్లబ్ సభ్యులతో సమావేశమైన కలెక్టర్ ఆరోగ్యానికి నడక ఎంతో అవసరమన్నారు. దీనిని ఈ క్లబ్ సభ్యులు వివిధ సందర్భాల్లో నడక గురించి చేపడుతున్న చైతన్య, అవగాహన కార్యక్రమాలను ప్రశంసించారు. క్లబ్ అధ్యక్షులు చిన్నారి విజయమోహన్, సభ్యులు కలెక్టర్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. -
ఎస్సీ, ఎస్టీల సంక్షేమంపై సమాలోచనలు
భువనేశ్వర్: షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల సంక్షేమంపై పార్లమెంటు, రాష్ట్ర అసెంబ్లీల కమిటీల అధ్యక్షుల జాతీయ సమావేశాన్ని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా విచ్చేసిన లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర శాసన సభ స్పీకర్ సురమా పాఢి, స్థానిక లోక్ సభ సభ్యురాలు అపరాజిత షడంగి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీ బిర్లా ఒక ప్రదర్శనను ప్రారంభించి, ఒక సావనీర్‌ను కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన లోక్ సభ స్పీకరు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల సంక్షేమం, అభివృద్ధి, సాధికారతలో పార్లమెంటరీ, శాసనసభ కమిటీల పాత్ర శీర్షికతో ఈ సదస్సు వరుసగా 2 రోజులపాటు నిరవధికంగా కొనసాగుతుందన్నారు. ఈ సందర్భంగా 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించడానికి సంక్షేమ విధానాల అమలులో జవాబుదారీతనం నిర్ధారించడంలో పార్లమెంటరీ, రాష్ట్ర శాసన సభ కమిటీల ముఖ్యమైన పాత్రపై ఈ సదస్సులో లోతుగా చర్చిస్తారని వివరించారు.షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల సంక్షేమ కమిటీ అధ్యక్షుల మొదటి సమావేశం 1976లో న్యూఢిల్లీలో జరిగింది. తరువాత 1979, 1983, 1987, 2001లో వరుసగా ఈ సమావేశాలు జరిగాయి. ఢిల్లీ వెలుపల ఈ సమావేశం జరగడం ఇదే మొదటిసారి. ఆ అవకాశం రాష్ట్రానికి లభించడం మరో విశేషం. రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి, ఉప ముఖ్యమంత్రులు కనక వర్ధన్ సింగ్ దేవ్, ప్రభాతి పరిడా, కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జుయెల్ ఓరం, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాజ్య సభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్, షెడ్యూల్డ్ కులాలు, తెగల సంక్షేమంపై పార్లమెంటరీ కమిటీ చైర్మన్ డాక్టర్ ఫగ్గన్ సింగ్ కులస్తే ఈ కార్యక్రమానికి హాజరై ప్రముఖులను ఉద్దేశించి ప్రసంగించారు. పార్లమెంట్, రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీలలో షెడ్యూల్డ్ కులాలు, తెగల సంక్షేమంపై పార్లమెంటరీ కమిటీ చైర్మన్ మరియు సభ్యులు, ఒడిశా ప్రభుత్వ మంత్రులు, ఒడిశా శాసన సభ సభ్యులు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు పార్లమెంటు, రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీల షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల సంక్షేమ కమిటీల అధ్యక్షులు మరియు సభ్యులు సహా 200 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు.ఈ నెల 30న రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరి బాబు కంభంపాటి ముగింపు ప్రసంగంతో ఈ సదస్సు ముగుస్తుంది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల సాధికారత కోసం రాజ్యాంగ రక్షణలను బలోపేతం చేయడం, సామాజిక, ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించడం, ఉత్తమ పద్ధతులను అవలంభించడంపై ప్రముఖులు ప్రసంగంలో పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులు, శాసన సభ కమిటీ చైర్మన్, 4 మంది ఎమ్మెల్యేలతో 5 మంది సభ్యులు, ఎస్సీ–ఎస్టీ అభివృద్ధిపై పార్లమెంటరీ కమిటీలోని 30 మంది సభ్యులు హాజరయ్యారు. జాతీయ సదస్సు ఆరంభానికి ముందుగా లోక్‌సభ ఎస్సీ/ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ ఫగ్గన్ సింగ్ కులస్తే మరియు కమిటీ సభ్యులు స్థానిక రాష్ట్ర అతిథి గృహంలో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీని మర్యాదపూర్వకంగా కలిశారు. -
ముగిసిన ఎఫ్డీపీ ప్రోగాం
పర్లాకిమిడి: స్థానిక ఆర్.సీతాపురం సెంచూరియన్ వర్సిటీలో ‘రాబోవు తరంలో వైర్లెస్ కమ్యూనికేషన్ మరియు హార్వేస్టింగ్ టెక్నాలజీ’పై రెండు వారాల పాటు జరిగిన ఫ్యాకల్టీ డవలప్మెంట్ ప్రోగ్రాం (ఎఫ్డీపీ) విజయవంతంగా శుక్రవారంతో ముగిసింది. ఈనెల 18 నుంచి 29 వరకు సదస్సు జరిగింది. ఈ ముగింపు సమావేశానికి సెంచూరియన్ వర్సిటీ ఉపాధ్యక్షుడు ఆచార్య డీఎన్ రావు, అకడమిక్ డీన్ డా.ప్రఫుల్ల పండా, రిజిస్ట్రార్ డా.అనితా పాత్రోలు పాల్గొనగా.. ప్రభాత్‌కుమార్ పట్నాయక్, డా.ప్రగ్యా పరిమితా ప్రధాన్‌లు సమన్వయకర్తలుగా వ్యవహరించారు.వైర్లెస్ కమ్యూనికేషన్, యాంటెన్నా డిజైన్, ఆర్ఎఫ్ ఎనర్జీ హార్వేస్టింగ్ టెక్నాలజీస్‌లో తాజా పరిజ్ఞానాన్ని అందించడం ద్వారా భవిష్యత్‌కు అవసరమైన సంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి దోహదపడుతుందని డా.ప్రఫుల్ల పండా అన్నారు. ఒడిశా ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగం, ఐసీటీ అకాడమీ, నిట్ సహకారంతో ఈ ఫ్యాకల్టీ డవలప్మెంట్ ప్రోగ్రాం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రొ.గణపతి పండా, డా.శైలేంద్ర కుమార్ (బిలాయి ఐఐటీ), డా.నిశాంత్ కుమార్ (జోద్పూర్ ఐఐటీ), డా.అర్నాబ ఘోష్ (రౌర్కెలా ఐఐటీ), పికాన్ మజుందార్ (మెట్‌లాబ్ నిపుణుడు), డా.రాజేశ్వరీ ప్రధాన్ (బుర్లా వీఎస్‌ఎస్‌యూటీ) తదితరులు పాల్గొన్నారు. -
హత్య కేసులో పోలీసుల సీన్ రీ క్రియేషన్
రాయగడ: ఈ నెల 27వ తేదీన స్థానిక మహిళా కళాశాల వెనుక గల హరిజన వీధికి చెందిన రొహిత్ థప్పా హత్య కేసుకు సంబంధించి ఆ పోలీసులు నిందితులను పట్టుకునేందుకు శుక్రవారం నాడు సీన్ రిక్రియేషన్ చేశారు. హత్య కేసుకు సంబంధించి నూతన్ నాయక్, మహేష్ నాయక్‌లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని పట్టుకుని రోహిత్‌ను ఎలా హత్య చేశారు. ఎవరెవరు హత్య చేశారు, ఎలాంటి మరణాయుధాలను వినియోగించారు. మిగతా నిందితులను పట్టుకునే ప్రయత్నంలో భాగంగా ఈ సీన్ రిక్రియేషన్ చేసిన పోలీసులు స్థానిక అగ్నిమాపక కేంద్రం కార్యాలయం వెనుక గల మైదానంలో ఈ తరహా ప్రదర్శన నిర్వహించారు. హత్య చేసిన సమయంలో ఉన్న నిందితులు ఎలా దాడి చేశారు, అదేవిధంగా హత్య చేసిన అనంతరం నిందితులు ఎలా పారిపోయారు అన్న విషయమై పోలీసుల అదుపులో ఉన్న ఇద్దరు నిందితుల ద్వారా పోలీసులు తెలుసుకున్నారు. సీన్ రీ క్రియేషన్‌కు సంబంధించి నిందితులను వెంట తీసుకున్న పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. హత్య కేసులో భాగంగా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ఈ తరహా సీన్ రీ క్రియేషన్ చేయడం గమనార్హం. అయితే ఇప్పటికే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు హత్యకు సంబంధించిన మిగతా నిందితులను పట్టుకునేందుకు గాలిస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. -
నిమజ్జనం..జరభద్రం!
● మొదలైన గణనాథుని అనుపోత్సవం ● చెరువులు, గెడ్డలు, సముద్రం వద్ద జాగ్రత్తలు తప్పనిసరి ● మద్యానికి దూరంగా ఉండాలంటున్న అధికారులు టెక్కలి : వినాయక విగ్రహాల నిమజ్జనోత్సవాలు మొదలయ్యాయి. పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో వినాయక చవితి ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన అనుపోత్సవంలో పాల్గొనేందుకు యువకులు పోటీపడుతుంటారు. ఈ సమయంలో కొందరు అత్యుత్సాహంతో వ్యవహరిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. నిమజ్జనం సమయంలో మద్యం సేవించి చెరువుల్లో, కాలువల్లో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. పొంచి ఉన్న ప్రమాదం.. ఇటీవల కురుస్తున్న వర్షాలకు దాదాపు అన్ని చెరువులు, సాగు నీటి కాలువలు నీటితో కళకళలాడుతున్నాయి. ఉపాధి పనులు జరగడంతో చాలావరకు లోతుగా ఉన్నాయి. అది గమనించకుండా రాత్రి సమయాల్లో నిమజ్జనాల్లో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా సముద్రతీరంలో నిమజ్జనాలు మరింత ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. చిన్నారులను చెరువులు, సాగునీటి కాలువలు, సముద్రతీరాల వద్దకు తీసుకువెళ్లకపోవడం ఉత్తమం. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు దృష్టిలో ఉంచుకుని వినాయక నిమజ్జనాల్లో జాగ్రత్తలు పాటించాలని యువకులకు అధికారులు సూచిస్తున్నారు. ఈ విషయంలో ఆయా ఉత్సవ కమిటీ సభ్యులే భాద్యత వహించాలని ఆదేశాలు చేస్తున్నారు. నిమజ్జనాల్లో కొన్ని రకాల జాగ్రత్త చర్యలు, ఆంక్షలపై టెక్కలి డీఎస్పీ లక్ష్మణరావు, సీఐ విజయకుమార్ తదితరులు ఉత్సవ కమిటీ సభ్యులతో ఇటీవల సమావేశం నిర్వహించి సూచనలు అందజేశారు. జాగ్రత్తలు తప్పనిసరి.. ● పోలీసులు సూచించిన మార్గంలోనే నిమజ్జన ఊరేగింపు చేయాలి. విగ్రహాన్ని తరలించే వాహనాల సమాచారం ముందస్తుగా అందజేయాలి. డీజే కు అనుమతి తీసుకోవాలి. ● నిమజ్జనం సమయంలో విద్యుత్ తీగల ప్రభావం లేకుండా చూసుకోవాలి. ● నిమజ్జన ఊరేగింపులో వేషధారణలపై ముందస్తుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ● మద్యం సేవించి నిమజ్జనాల్లో పాల్గొనేవారిపై కఠినమైన చర్యలు చేపట్టే విధంగా ఆదేశాలు ఉన్నాయి ● పోలీసులు గుర్తించిన సురక్షితమైన ప్రదేశాల్లో మాత్రమే విగ్రహాలను నిమజ్జనం చేయాలి. ● నిమజ్జనాల్లో చిన్న పిల్లలు లేకుండా చూసుకోవాలి. అలా చేస్తే చర్యలు.. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా మద్యం సేవించి తగాదాలకు పాల్పడినా, నిమజ్జనాల సమయంలో మద్యం సేవించినా చర్యలు చేపడతాం. మద్యానికి దూరంగా ఉంటూ నిమజ్జనాలు చేస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఈ విషయంలో నిబంధనలు అతిక్రమిస్తే ఉత్సవ కమిటీ సభ్యులే బాధ్యులవుతారు. – డి.లక్ష్మణరావు, డీఎస్పీ, టెక్కలి -
ఎరువుల కోసం రైతుల ఆందోళన
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా మత్తిలి సమితి ల్యాంప్ ఎరువుల కోసం రైతులు శుక్రవారం ఆందోళనకు దిగారు. వారం రోజుల క్రితం చేసిన ఆందోళన సందర్భంగా శుక్రవారం ఎరువులను సరఫరా చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. దీంతో రైతులంతా సంబంధిత కార్యాలయం వద్దకు చేరుకున్నారు అయినప్పటికీ ఎరువులను పంపిణీ చేయకపోవడంతో ఆగ్రహంతో ఆందోళనకు దిగారు. అందుబాటులో 1200 బస్తాల ఎరువు అందుబాటులో ఉన్నప్పటికీ ఇవ్వడం లేదంటూ కదం తొక్కారు. ల్యాంప్ అధికారులు కూడా తమకు స్వష్టత ఇవ్వడం లేదంటూ ఆందోళన చేశారు. పోలీసులు, సమితి అధికారులు రైతులను శాంతింపచేయడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకూండా పోయింది. సాయంత్రం వరకూ రైతులు రోడ్డుపై బైఠాయించడంతో మల్కన్‌గిరి–మత్తిలి రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. -
పల్లెల్లో నువాఖాయ్ వేడుక
కొరాపుట్: కొరాపుట్, నబరంగ్‌పూర్ జిల్లాల్లో నువాఖాయ్ బెట్గాట్ ఘనంగా జరుగుతోంది. చేతికి అందిన కొత్త ధాన్యంతో ఉత్సవం ప్రారంభమవుతుంది. కొత్త బియ్యంతో చేసిన వంటలతో పండగ చేసుకుంటారు. తమ ఇష్టమైన ఆరాధ్య దేవతలను పూజలు చేస్తూ సంబరాలు చేసుకుంటూ విందు వినోదాలలో మునుగుతారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి నిత్యానంద గోండో సహచర గిరిజనులతో కలసి గిరిజన సాంస్కృతిక వాయిద్యాలు వాయిస్తూ ఆనందంగా గడిపారు. మాజీ మంత్రి రమేష్ చంద్ర మజ్జి తన స్వగృహం నబరంగ్‌పూర్ జిలా చందాహండి సమితి దండాబడిలో బంధుమిత్రులు, బీజేడీ కార్యకర్తలలో గడిపారు. నబరంగ్‌పూర్ ఎంపీ బలబద్ర మజ్జి తన స్వగ్రామం నబరంగ్‌పూర్ జిల్లా చందాహండి సమితి పటికి లో వ్యవసాయ క్షేత్రాలలో పర్యటించారు. నబరంగ్‌పూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి నందాహండి సమితి లో గిరిజనులతో సహ పంక్తి భోజనాల్లో పాల్గొన్నారు. -
రసాభాసగా మున్సిపల్ సమావేశం
● అధికారుల వైఖరికి నిరసనగా వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ల వాకౌట్ పలాస: పలాస–కాశీబుగ్గ మున్సిపల్ సాధారణ సమావేశం రసాభాసగా మారింది. పోలీసు పహారా మధ్య మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు అధ్యక్షతన శుక్రవారం జరిగిన ఈ సమావేశం నుంచి వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు వాకౌట్ చేశారు. గత సమావేశంలో తెలిపిన అంశాలపై తగిన వివరణ ఇవ్వకుండా ఎలా ఈ సమావేశమవుతారని మున్సిపల్ వైస్ చైర్మన్ మీసాల సురేష్‌బాబు, కౌన్సిలర్లు దుర్గాప్రసాద్ పండా, బెల్లాల శ్రీనివాసరావు, పప్పల ప్రసాదరెడ్డి, పిచ్చుక అజయ్, కర్రి మాధవరావు, సవర సోమేశ్వరరావు, బోర చంద్రకళ, దున్న నిర్మల, శార్వాన గీతరవి, దువ్వాడ సత్యవతి, అంబటి మాధురి, పోతనపల్లి ఉమాకుమారి, బల్ల రేవతి, కోఆప్సన్ సభ్యుడు బమ్మిడి సంతోస్‌కుమార్ తదితరులు ప్రశ్నించారు. తగిన సమాధానం రాకపోవడంతో వారంతా పోడియం ముందు బైఠాయించి నిరసన తెలియజేశారు. అయినప్పటకీ కమిషనర్ ఎన్.రామారావు నుంచి తగిన సమాధానం రాకపోవడంతో బయటకు వెళ్లి బైఠాయించారు. అప్పటికే సభలో 8మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. సమావేశానికి ముందుగా ఈ విషయం తెలియక ముగ్గురు వైఎస్సార్ సీపీ సభ్యులు శిస్టు బృందావతి, జోగి సతీస్‌కుమార్, బోనెల చంద్రమ్మలు రిజిస్టరు పుస్తకంపై సంతకాలు చేశారు.దీంతో మొత్తం 11 మంది సభ్యులు ఉన్నారని కోరం సరిపోయిందని కమిషనరు సమావేశం తూతూమంత్రంగా ముగించేశారు. 37 అంశాలను ఏకగ్రీవంగా ఆమోదించినట్టు తీర్మానాలు చేసుకున్నారు. వార్డుల్లో తమకు సంబంధం లేకుండా పనులు జరగుతున్నాయని వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
దీర్ఘాశిలో చైన్‌స్నాచింగ్
పోలాకి: దీర్ఘాశి గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో దొంగలు హల్చల్ సృష్టించారు. మెండ గడ్డెమ్మ(63) అనే వృద్ధురాలు పశువులకు దాణా పెడుతుండగా వెనక నుంచి వచ్చిన అగంతకుడు బంగారు తాడు (సుమారు పావు తక్కువ మూడు తులాలు) లాక్కొని అక్కడే బైక్‌పై ఉన్న ఇంకో వ్యక్తి సహాయంతో పరారయ్యారు. తాడు లాగే సమయంలో తన నోటిని గట్టిగా మూసివేసినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఎస్ఐ రంజిత్ నేతృత్వంలో చైన్‌స్నాచర్స్ కోసం వేట ముమ్మరం చేశారు. కొందరు అనుమానితులను గుర్తించి విచారిస్తున్నట్లు సమాచారం. నిత్యం రద్దీగా వుండే పోలాకి–నరసన్నపేట రహదారిలో చైన్‌స్నాచర్లు పరారైనట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. కార్మికులకు అండగా.. శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): శ్రమదోపిడీకి గురవుతున్న కార్మికులకు కార్మికశాఖ ఉప కార్మిక కమిషనర్ డి.దినేష్‌కుమార్ అండగా నిలిచారు. ప్రత్యేక తనిఖీలు నిర్వహించి శుక్రవారం కార్మికులకు రూ.45514 వేతనాన్ని యాజమాన్యాల నుంచి వసూలు చేసి డి.డి.రూపంలో తిరిగి అందజేశారు. ఈ సందర్భంగా డీసీఎల్ మాట్లాడుతూ ఈజ్ ఆఫ్ డూయింగ్ ప్రకారం ఆన్లైన్లో తనిఖీ నిర్వహించాలని వచ్చిన దరఖాస్తుల్ని పరిశీలించగా.. అందులో నలుగురు కార్మికుల వేతనాల్లో తేడాల్ని గమనించామన్నారు. సంబంధిత యజమానుల వద్ద నుంచి తేడా వేతనాన్ని రికవరీ చేసి కార్మికులకు అందించామని చెప్పారు. దీంతో కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు. చెరువులో పడి వ్యక్తి మృతి టెక్కలి రూరల్: పెద్దరోకళ్లపల్లి పంచాయతీ రామనగరం గ్రామానికి చెందిన బొడ్డు రామన్న (37) అనే వ్యక్తి చెరువులో పడి మృతిచెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామన్న తన పొలంలో ఎరువులు వేసిన తర్వాత గ్రామ సమీపంలోని చెరువులో స్నానానికి దిగుతుండగా ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో మునిగిపోయాడు. కొద్దిసేపటి తర్వాత స్థానికులు గుర్తించి చెరువులో తేలుతున్న రామన్నను బయటకు తీసి టెక్కలి జిల్లాఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. రామన్నకు భార్య లత, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. లత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేశారు. మా సొమ్ము ఎప్పుడు చెల్లిస్తారు? ఇచ్ఛాపురం: తాము కష్టపడి సంపాదించుకున్న సొమ్మును తిరిగి చెల్లించాలని, లేనిపక్షంలో ఆందోళన తప్పదని ఇచ్ఛాపురం పోస్టాఫీసు వద్ద ఖాతాదారులు స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం పోస్టాఫీసును పరిశీలించేందుకు వ చ్చిన పోస్టల్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్‌ను కలిసి తమ గోడు వినిపించారు. స్కామ్ జరిగి నెలరోజులైనా పోస్టల్ సిబ్బంది పట్టించుకోకపోవడం తగదని ఖాతాదారులు బాలరాజు, సీహెచ్ లోహిదాస్, శ్రీను తదితరులు వాపోయారు. జాతీయ పోటీలకు కోచ్‌గా అర్జున్‌రావు రెడ్డి శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ బాస్కెట్‌బాల్ కోచ్ గాలి అర్జున్‌రావు రెడ్డి జాతీయ పోటీలకు కోచ్‌గా నియమితులయ్యారు. పంజాబ్‌లో సెప్టెంబర్ 2 నుంచి జరగనున్న 75వ ఆలిండియా జూనియర్స్ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్–2025 పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ బాలికల జట్టుకు కోచ్‌గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు శాప్ నుంచి ఉత్తర్వులు అందుకున్నారు. ఈయన నియామకం పట్ల శ్రీకాకుళం జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేషన్ చైర్మన్ ఎమ్మెస్సార్ కృష్ణమూర్తి, డీఎస్డీఓ డాక్టర్ కె.శ్రీధర్‌రావు, కోచ్‌లు, సీనియర్ క్రీడాకారులు సంతోషం వ్యక్తం చేశారు. 7న సంపూర్ణ చంద్రగ్రహణం అరసవల్లి: సెప్టెంబర్ 7వ తేదీన భాద్రపద శుద్ధ పౌర్ణమి ఆదివారం రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ప్రసిద్ధ సూర్యక్షేత్రం అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయం మధ్యాహ్నం 2 గంటల నుంచి మూసివేస్తున్నట్లుగా ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ, ఈఓ కెఎన్‌వీడీవీ ప్రసాద్‌లు తెలియజేశారు. ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారం 7వ తేదీ రాత్రి వేళలో గ్రహణ సమయం కావడంతో ఆదివారం ఉదయం 6 గంటల నుంచి మద్యాహ్నం 12.30 గంటల వరకు సర్వదర్శనాలకు అవకాశమిచ్చి.. అనంతరం భోగసమయం దాటాక అంటే మధ్యాహ్నం 2 గంటలకే ఆలయ ప్రధాన ద్వారాలు మూసివేయనున్నామని వారు వివరించారు. గ్రహణానంతరం ఆలయంలో సంప్రోక్షణ, శుద్ధి కార్యక్రమాల అనంతరం మరుసటి రోజు అనగా 8వ తేదీ సోమవారం ఉదయం 7.30 గంటల నుంచి సర్వదర్శనాలకు అనుమతివ్వనున్నట్లుగా వారు శుక్రవారం ప్రకటించారు. భక్తులు గమనించి గ్రహణ నియమాలను పాటించాలని కోరారు. -
బస్సులు లేవు.. రైళ్లు రావు!
● ప్రయాణికులకు నరకయాతన ● ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వేస్టేషన్లలో గంటల తరబడి పడిగాపులు శ్రీకాకుళం అర్బన్/కంచిలి: సరిపడా బస్సులు లేక, సకాలంలో రైళ్లు రాక జిల్లా ప్రయాణికులు శుక్రవారం నరకయాతన అనుభవించారు. విజయనగరం వద్ద గూడ్స్ రైలు ప్రమాదం జరగడంతో అటు విశాఖపట్నం నుంచి వచ్చే రైళ్లు, ఇటు భువనేశ్వర్ నుంచి వచ్చే రైళ్లు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌కు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇచ్ఛాపురం, సోంపేట, పలాస, ఆమదాలవలస తదితర అన్ని బస్స్టేషన్లతో పాటు జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం కాంప్లెక్స్ కూడా ప్రయాణికులతో రద్దీగా కనిపించింది. దీంతో ఉదయం 9గంటలకు ప్రారంభమైన రద్దీ సాయంత్రం వరకూ కొనసాగింది. వచ్చిన బస్సులు నిండిన వెంటనే వెళ్లిపోవడంతో మిగిలిన ప్రయాణికులు బస్సుల కోసం పడిగాపులు కాశారు. ముఖ్యంగా దూరప్రాంతమైన విశాఖపట్టణం వెళ్లేందుకు అవస్థలు పడ్డారు. మరోవైపు బరంపురం–విశాఖపట్నం, భువనేశ్వర్–విశాఖపట్నం ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. సోంపేట రైల్వేస్టేషన్లో ఉదయం 8.26 గంటలకు వచ్చిన ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ 11.30 గంటల వరకు నిలిచిపోయింది. ఆ రైలు కదిలిన తర్వాత అదే ప్లాట్‌ఫాం మీదకు ఇక్కడ స్టాపేజీ లేని షాలిమర్–వాస్కోడిగామా ఎక్స్‌ప్రెస్ వచ్చింది. ఇది కూడా మధ్యాహ్నం 3 గంటల వరకు నిలిచిపోయింది. ఉదయం 9.20 గంటలకు రావల్సిన కోల్కత్తా– చైన్నె మెయిల్ మధ్యాహ్నం 3–50 గంటలకు వచ్చింది. ఇక భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే విశాఖ ఎక్స్‌ప్రెస్ ఉదయం 11.45కి రావల్సి ఉండగా.. సాయంత్రం 4.20 గంటలకు వచ్చిందని సోంపేట రైల్వేస్టేషన్ మేనేజర్ సత్యనారాయణ బెహరా తెలిపారు. -
ఆటో, మ్యాక్సీ డ్రైవర్లను ఆదుకోవాలి
రణస్థలం: ఉచిత బస్సు పథకం వల్ల ఉపాధి కోల్పో తున్న ఆటో, మ్యాక్సీ డ్రైవర్లకు భృతి ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని ఏఐటీయూ ఏపీ ఆటో, ట్యాక్సీ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జి.వామనమూర్తి, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవా రం రణస్థలం రామతీర్థం జంక్షన్ నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. అనంతరం ధర్నా నిర్వహించి తహసీల్దార్ సనపల కిరణ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు కిరాయి లేక తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. ఫైనాన్స్ కట్టలేక, అప్పులు తీర్చలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. డ్రైవర్లకు భారమైన థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్, రోడ్ ట్యాక్సీ, టోల్ ఫీజులు 30శాతానికి తగ్గించాలని డిమాండ్ చేశారు. విడి భాగాలపై జీఎస్టీ, వ్యాట్, సెస్ పన్నులు రద్దు చేసి డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. చంద్రబాబు ఆధికారంలోని వస్తే బ్యాడ్జీ కలిగిన డ్రైవర్లకు సంవత్సరానికి రూ. 15వేలు ఆర్ధిక సహాయం చేస్తామని, పీఎఫ్, ఈఎస్ఐతో కూడిన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, అనారోగ్యంతో చనిపోతే రూ.5లక్షలు, ప్రమాదంలో చనిపోతే 10లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారని, వాటిని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. లైసెన్సు కలిగిన ప్రతి ఆటో డ్రైవర్‌కు ఏటా రూ.25వేలు ఆర్థిక సహాయం అందించాలని కోరారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు కె.శివ, సీఐటీయూ నాయకులు వెలమల రమణ, ఎస్.లక్ష్మణరావు, బి.రామకృష్ణ, బొంతు లక్ష్మణరావు, చిరంజీవి, ఎం.రాముడు, జగదీష్, జి.కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
భువనేశ్వర్ మహిళలకు అత్యంత సురక్షితం
భువనేశ్వర్: భువనేశ్వర్ భారతదేశంలోని మహిళలకు అత్యంత సురక్షితమైన నగరాల్లో ఒకటిగా ఎంపికై ంది. జాతీయ వార్షిక నివేదిక, మహిళా భద్రత సూచిక (ఎన్ఏఆర్ఐ – నారి) ఈ ఏడాది విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. జాతీయ మహిళా కమిషను ఈ నివేదికని ఆవిష్కరించింది. సురక్షితమైన నగరాల అగ్ర శ్రేణిలో భువనేశ్వర్‌తో పాటు కోహిమా (నాగాలాండ్), విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్), ఐజ్వాల్ (మిజోరాం), గ్యాంగ్టాక్ (సిక్కిం), ఇటానగర్ (అరుణాచల్ ప్రదేశ్) ఉన్నాయి. విధాన సంస్కరణలు, అట్టడుగు స్థాయి చొరవల ద్వారా మహిళలకు సురక్షితమైన వాతావరణాలను సృష్టించడంలో ఈ నగరాలు స్థిరమైన మెరుగుదలలను ప్రదర్శించాయి. జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయ కిశోర్ రహత్కర్ విడుదల చేసిన నివేదిక ఈ విషయం పేర్కొంది. మరోవైపు ఈ దిశలో రాంచీ, శ్రీనగర్, కోల్‌కతా, ఢిల్లీ, ఫరీదాబాద్, పాట్నా అత్యల్ప స్కోరు సాధించాయి. 31 నగరాల్లో 12,770 మంది మహిళలపై నిర్వహించిన సర్వే ఆధారంగా దేశవ్యాప్త సూచికని విడుదల చేశారు. -
బొరిగుమ్మను ఎన్‌ఏసీగా ప్రకటించాలి
జయపురం: సబ్ డివిజన్ పరిధి బొరిగుమ్మను ఈనెల 31వ తేదీలోగా నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్(ఎన్ఏసీ)గా ప్రకటించకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించారు. ఈ మేరకు బొరిగుమ్మలో శుక్రవారం ఆయన మాట్లాడారు. బీజేడీ హయాంలో దాదాపు ఆ ప్రభుత్వాన్ని 21సార్లు అసెంబ్లీలో ప్రశ్నించడం జరిగిందన్నారు. అనంతరం బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా 5 పర్యాయాలు ప్రశ్నించానని గుర్తు చేశారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకునీరెత్తనట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం 7 జిల్లాల్లో 12 నోటిఫైడ్ కౌన్సిల్లు ప్రకటించిందని, అయితే వాటిలో బొరిగుమ్మను చేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బొరిగుమ్మను ఎన్‌ఏసీగా ప్రకటించేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆయనతో పాటు బొరిగుమ్మ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అశోక్ గంతాయిత్, కొరాపుట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ప్రతినిధి రామచంద్ర పాఢీ, భాను దొర, లాలు గుప్త, నారాయణ సాహు తదితరులు ఉన్నారు. -
బీజేడీది మొసలి కన్నీరు
● బీజేపీ రాష్ట్ర కార్యవర్గ శాశ్వత సభ్యుడు గౌతమ్ సామంతరాయ్ జయపురం: ఎరువుల సమస్యలపై రైతులు జరుపుతున్న ఆందోళనను సమర్థిస్తూ బీజేడీ మొసలి కన్నీరు కారుస్తుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ శాశ్వత సభ్యుడు గౌతమ్ సామంతరాయ్ అన్నారు. బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రెండు, మూడు రోజుల్లో రైతులకు ఎరువులు అందజేస్తామని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందేనని, అయినా బీజేడీ కుత్రిమ ఆందోళన చేపడుతుందని దుయ్యబట్టారు. రైతులకు ఎరువులు వెంటనే సమకూర్చాలని బీజేడీ నేతలు, ఆ పార్టీ శ్రేణులు ఇటీవల జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయాన్ని ఘేరావ్ చేయటాన్ని తప్పుబట్టారు. బీజేడీ పాలనలో చేసిన తప్పులను కప్పి పుచ్చుకోవటానికే ఎరువుల డ్రామా ఆడుతుందన్నారు. ప్రభత్వం రైతుల సమస్యలు పరిష్కరించేందుకు కట్టుబడి ఉందని, ఈ విషయం రైతులు అర్థం చేసుకోవాలని సామంతరాయ్ రైతులకు విజ్ఞప్తి చేశారు. వంతెనకు అడ్డంగా పడిన చెట్టు పర్లాకిమిడి: గత కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం కాశీనగర్ సమితి బి.సీతాపురం పంచాయతీ దేవుదళ గ్రామంలో వంతెనకు అడ్డంగా చెట్టుపడింది. దీంతో గుణుపురం పర్లాకిమిడి మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి. సర్పంచ్ కె.తేజ, యువకులు దిలీప్, ప్రణయమిశాల్ తదితరులు పాల్గొని వంతెనకు అడ్డంగా ఉన్న చెట్టును తొలగించారు. -
కోట్లు కొల్లగొడుతున్న కేటుగాళ్లు
పార్వతీపురం రూరల్: రోజురోజుకూ సైబర్ నేరాలు పెరుగుతూ కోట్ల రూపాయల డబ్బుపై అనేక రకాలుగా ఆశ చూపించి సైబర్ నేరగాళ్లు కొల్లగొడుతున్నారు. ఒక్క పార్వతీపురానికి సంబంధించి గత జనవరిలోనే అక్షరాలా కోటి రూపాయలపై చిలుకు నగదును సైబర్ నేరగాళ్లు నాలుగు కేసులకు సంబంధించి కొల్లగొట్టారంటే ఏ స్థాయిలో సైబర్ వలలో ప్రజలు పడుతున్నారో తేటతెల్లమవుతుంది. ముందుగా సామాజిక మాధ్యమాల్లో గుర్తింపు ఉన్న బ్యాంకు నమూనాలతో లింకులు పంపించి అలాగే మతపరమైన లింకులు పంపించి ఆ లింకులు తెరిస్తే, తెరిచిన వారి వాట్సాప్, టెలిగ్రామ్ అకౌంట్లను ఆధీనంలోకి తెచ్చుకుని వారి కాంటాక్ట్‌లకు కూడా లింకులు పంపించి ప్రత్యేకంగా గ్రూపులు క్రియేట్ చేస్తూ ఈజీ రిటర్న్స్’ ప్రామాణికంలో డబ్బులు వస్తాయని ఎర చూపుతున్నారు. ఈ మేరకు పార్వతీపురం పట్టణంలో ముగ్గురు, రూరల్ పరిధిలో ఒకరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసలు ఇటీవల కేసులు నమోదు చేశారు. ఇద్దరు ఉద్యోగుల నుంచి రూ.96లక్షలు పట్టణంలోని ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని సైబర్ వలలో పడి ఏకంగా రూ.46లక్షలు పోగొట్టుకున్నారు. అలాగే ఓ మెడికల్ సూపర్వైజర్గా పనిచేస్తున్న వ్యక్తి దగ్గర నుంచి రూ.48లక్షలు ఆన్లైన్ ద్వారా దోచుకున్నారు. ఇంకా ఇటీవల పార్ట్‌టైమ్ ఉద్యోగం, ఈజీ రిటర్న్స్ పేరిట ఓ మహిళ నుంచి రూ.4,30,000 లు కాజేశారు. రూరల్ పరిధిలో ఏకంగా ఓ పోలీసు ఉద్యోగికి రూ.60వేలు ఆశ చూపించి దోచేశారు. అయితే ముందుగా గ్రూప్‌లో యాడ్అయిన అనంతరం కొంతమొత్తాన్ని పెట్టుబడిగా పెడితే అనతికాలంలోనే పెట్టుబడికి కలిపి మరికొంత డబ్బును ఖాతాలో జమచేసి ఎరవేస్తారు. అనంతరం లక్షల మేర డిపాజిట్లు చేస్తున్నప్పుడు ఆయా సాఫ్ట్‌వేర్‌లో బాధితులకు లక్షల రూపాయలు వచ్చినట్లు చూపిస్తూ ప్రస్తుతానికి బాధితుల ఖాతానుంచి తీయడం కుదరదంటూ మరికొంత డబ్బులను జమచేస్తేనే ఖాతాలో లక్షల రూపాయలు క్రెడిట్ అవుతాయని ఆశ చూపించి ఎరవేస్తారు. బాధితులు తమ వద్ద మరి డబ్బులు లేవని తెలిపే సమయానికి మొత్తం గ్రూపును డిలీట్చేస్తూ వారి అసలు రూపాన్ని చూపిస్తారు. ఈ తరహాలోనే మోసాలకు పాల్పడుతూ కోట్ల రూపాయలు కొల్ల గొడుతున్నారు. పట్టణ పరిధిలో జనవరి నుంచి రూ.కోటి మేరకు లూటీ సామాజిక మాధ్యమాల్లో లింకులతో ఎర ఇద్దరు ఉద్యోగుల నుంచి 94లక్షలు కాజేసిన నేరగాళ్లుఅవగాహనతోనే అరికట్టవచ్చుఎప్పటికప్పుడు అనేక కార్యక్రమాల ద్వారా సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నాం. అయినప్పటికీ ఉద్యోగులు, చదువుకున్న వ్యక్తులు ఈ విధంగా మోసాలకు గురవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అసలు గుర్తుతెలియని వ్యక్తులు సులువు పద్ధతిలో డబ్బులు ఇస్తామని చెబితే ఎలా నమ్ముతున్నారో అర్ధం కావడం లేదు. ఇప్పటికే జరిగిన కేసులకు సంబంధించి సైబర్ నేరగాళ్లు ఇతర రాష్ట్రాలైన బీహార్, రాజస్థాన్, తదితర రాష్ట్రాలకు చెందిన వారిగా ప్రాథమిక సమాచారం ఉంది. ఎస్పీ ఆదేశాలతో సామాజిక మాధ్యమాల్లో, బహిరంగ ప్రదేశాల్లో, కళాశాలల్లో, వివిధ కూడళ్లలో శాఖాపరంగా అవగాహన కల్పిస్తున్నాం. ప్రజలు అవగాహన కలిగి ఉండి ఆన్లైన్ కాల్స్‌ను నిర్ధారించకుండా తమకు తెలిసిన వారని చెప్పినా అది నిజమో, అబద్ధమో నిర్ధారణ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఆఫర్లు అంటూ, పార్ట్‌టైం ఉద్యోగాంటూ వచ్చిన లింకులను తెరవకూడదు. – కె. మురళీధర్, పార్వతీపురం పట్టణ సీఐ -
తొమ్మిది ఎకరాల జొన్న పంట ధ్వంసం
● లబోదిబో మంటున్న రైతులు ● పట్టించుకోని అటవీశాఖ అధికారులు కొమరాడ: మండలంలోని గుమడ గ్రామానికి చెందిన చిప్పాడ గౌరునాయుడు, గరుగుబిల్లి శంకరరావులకు చెందిన తొమ్మిది ఎకరాల్లోని జొన్న, పత్తి పంటలను ఇటీవల కోటిపాం పరిసరాల్లో సంచరిస్తున్న గజరాజుల గుంపు మంగళవారం అర్ధరాత్రి ధ్వంసం చేయడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ వేలాది రూపాయలు పెట్టబడి పెట్టి పంట చేతికి వచ్చిన సమయంలో ఇలా నాశనం అయితే మేము ఏం చేయాలో అర్థం కావడం లేదుని ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో దిక్కు లేదుంటూ లబోదిబో మంటున్నారు. ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. 2018లో వచ్చిన ఏనుగుల గుంపు వేలాది ఎకరాల్లో పంటనష్టంతో పాటు ప్రాణనష్టం జరుగుతున్నటికీ ప్రభుత్వం తూతూమంత్రంగా చర్యలు చేపట్టి చేతులు దులుపుకుంటోంది. కూటమి ప్రభుత్వం కుంకీ ఏనుగులను తీసుకువచ్చి అడవి ఏనుగులను తరలించే ప్రకియ చేపడతామని మాటలు చెబుతోందే కానీ కనీసం పట్టించుకోవడం లేదని ఈ ప్రాంత ప్రజలు, రైతులు వాపోతున్నారు. -
నిందితులను అరెస్టు చేయాలి
రాయగడ: స్థానిక మహిళా కళాశాల వెనుక నివసిస్తున్న రొహిత్ థప్ప హత్య కేసుకు సంబంధించిన నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ బా ధిత కుటుంబీకులు, బస్తీ వాసులు గురువారం ఆందోళన చేపట్టారు. సదరు పోలీస్ స్టేషన్‌ను ఘెరావ్ చేయడంతోపాటు ఫ్లై ఓవర్ వద్ద రాస్తారోకో చేశారు. బుధవారం రోహిత్ థప్ప అనే యువకుడిని కొందరు దుండగులు అగ్నిమాపక కేంద్ర కార్యాలయం వద్ద గల మైదానంలో దాడి చేసి హత్య చేశారు. ఈ హత్యకు కారకులైన వారిని పట్టుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని బాధితులు ఆరోపించారు. రస్తారోకో కారణంగా వాహనాల రాకపోకలు సుమారు మూడు గంటల పాటు నిలిచిపోయాయి. పోలీసులు చోరవ తీసుకుని నిందితులను పట్టుకుంటామని హామీ ఇవ్వడంతో బాధితులు ఆందోళనను విరమించారు. -
మరో విద్యుత్ పోరాటానికి సిద్ధం
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): విద్యుత్ పోరాటంలో అమరవీరుల స్ఫూర్తితో మరో విద్యుత్ పోరాటానికి సిద్ధం కావాలని వామపక్ష నాయకులు పిలుపునిచ్చారు. 2000లో చంద్రబాబు నాయుడు తెచ్చిన విద్యుత్ సంస్కరణకు వ్యతిరేకంగా విద్యుత్ పెంపుదలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో బషీర్‌బాగ్ కాల్పుల్లో అమరులైన రామకృష్ణ, విష్ణువర్ధన్‌రెడ్డి, బాలస్వామికి గురువారం నివాళులర్పించారు. అనంతరం విద్యుత్ అమరవీరుల ప్రతిజ్ఞ దినం శ్రీకాకుళం అంబేద్కర్ జంక్షన్ వద్ద నిర్వహించారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లు, ట్రూఅప్ చార్జీలు, సర్దుబాటు చార్జీలు రద్దు చేయాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, సీపీఐఎంఎల్ న్యూ డెమొక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్, సీపీఎం నాయకులు బి.కృష్ణమూర్తి, కె.మోహనరావు, పి.తేజేశ్వరరావు, ఆర్.ప్రకాష్‌రావు, ఎం.గోపి, కె.సూరయ్య, పాణి గ్రహి, ఎం.లక్ష్మి, శ్రీదేవి, డి.గణేష్, ఎస్.కృష్ణవేణి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. -
రైలు ఢీకొని వృద్ధుడు మృతి
టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్రాపురం రైల్వే స్టేషన్ సమీపంలో బండిపేట వద్ద రైలు పట్టాలపై వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. తల చితికిపోయి గుర్తు పట్టనివిధంగా మారింది. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్న మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు కోటబొమ్మాళి మండలం సరియా బొడ్డపాడు గ్రామానికి చెందిన చాప రాములు(67)గా గుర్తించారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా.. ఆత్మహత్య అనే విషయమై దర్యాప్తు చేస్తున్నట్లు జీఆర్పీ పోలీసులు తెలిపారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని మహిళ మృతి రణస్థలం: రణస్థలం మండల కేంద్రంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో బుడుమూరు శిరీష(22) అనే మహిళ మృతి చెందింది. జె.ఆర్.పురం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి 10.15 గంటల సమయంలో సూర్క స్కూల్ జంక్షన్లో ఆటో మలుపు తిప్పుతుండగా డివైడర్‌ను ఢీకొట్టి ఆటో బోల్తాపడింది. అందులో కూర్చున్న శిరీష బయటకు తుళ్లిపడగానే విశాఖపట్నం వైపు నుంచి శ్రీకాకుళం వైపు వెళుతున్న గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినది. శిరీష తన భర్తతో గొడవల నేపథ్యంలో మధ్యాహ్నం పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేద్దామని వచ్చింది. ఈ క్రమంలో జె.ఆర్.పురం పంచాయతీ వెంకటేశ్వర కాలనీలో అమ్మమ్మ ఇంటి వద్ద మాట్లాడి తిరిగి స్వగ్రామం లావేరు మండలం పాతకుంకాం వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆటోలో ఉన్న మరో ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఎస్సై ఎస్.చిరంజీవి ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి రణస్థలం: జె.ఆర్.పురం పంచాయతీ సీతంవలస సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు యువకుడు కేటీఎం బైక్‌పై జే.ఆర్.పురం థియేటర్ వైపు నుంచి సీతంవలస మీదుగా లావేరు వెళ్తుండగా శ్మశానం మలుపు వద్ద గురువారం రాత్రి 9 గంటల సమయంలో అదుపుతప్పి పడిపోయారు. బైక్ నడుపుతున్న వనుము ప్రభాస్(20) బైక్ ముందు పెట్రోల్ ట్యాంక్‌ను బలంగా ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న రాంబాబు తుప్పల్లోకి తుళ్లిపోయి గాయాలతో బయటపడ్డాడు. మృతుడు ప్రభాస్ది లావేరు మండలం సుభద్రాపురం. తల్లిదండ్రులు చిట్టిబాబు, సత్యవతి, సోదరుడు ఉన్నాడు. గాయపడిన రాంబాబు స్వగ్రామం మురపాక. ఇద్దరూ గంజాయి మత్తులో ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలాన్ని ఎస్సై ఎస్.చిరంజీవి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎచ్చెర్ల : బుడగట్లపాలెం సముద్రతీర ప్రాంతంలో ఏర్పాటు చేయనున్న ఫిషింగ్ హార్బర్ స్థలాన్ని గురువారం సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కోస్టల్, ఇంజినీరింగ్ ఫర్ ఫిషరీ (సీఐసీఈఎఫ్) బెంగళూరు బృందం సాధారణ పరిశీలన చేపట్టింది. కాకినాడ వద్ద ఉప్పాడ ఫిషింగ్ హార్బర్‌ను తనిఖీకి వచ్చిన వీరు బుడగట్లపాలెం హార్బర్‌ను కూడా పరిశీలించారు. గతంలో చేసిన ప్రతిపాదనల్లో మార్పులు చేపడుతూ డబ్ల్యూ.ఏపీ.సీవోసీ పంపిన ప్రతిపాదనలకు అనుగుణంగా ఇక్కడ పనులకు సంబంధించి స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు నూతన ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కార్యక్రమంలో సీఐసీఈఎఫ్ డైరెక్టర్ ఎన్.రవిశంకర్, డాక్టర్ బెలియప్ప, ఏపీ మేరీ టైంబోర్డ్ ఎస్ఈ నగేష్, మత్స్యశాఖ డీడీ వై.సత్యనారాయణ, ఏఫ్డీవో రవికుమార్, సర్పంచ్ అల్లుపల్లి రాంబాబు, ఎంఎఫ్‌సీఎస్ సొసైటీ ప్రెసిడెంట్ సీహెచ్ శ్రీరాములు, వైస్ ప్రెసిడెంట్ యు.అప్పన్న, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ కార్యకర్త హత్యకేసులో.. ముగ్గురికి రిమాండ్ శ్రీకాకుళం క్రైమ్ : గతేడాది ఎచ్చెర్ల మండలం ఫరీద్‌పేటలో వైఎస్సార్సీపీ కార్యకర్త కూన ప్రసాద్‌ను టీడీపీ మద్దతుదారులు దారి కాచి దాడిచేయడంతో మరణించిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి అప్పట్లో ఎచ్చెర్ల పోలీసులు ఎఫ్ఐఆర్లో తొమ్మిది మందిని చేర్చి నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తాజాగా మరో ముగ్గురు శీపాన శివకుమార్, కొత్తకోట సాయి, జమ్మి వేణులను బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎచ్చెర్ల ఎస్ఐ వి.సందీప్ పేర్కొన్నారు. -
వేడుకగా నువా ఖాయి
భువనేశ్వర్: రాష్ట్ర వ్యవసాయ ప్రాధాన్య పండగ నువా ఖాయి వేడుకని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి దంపతులు గురువారం రాజ్ భవన్లో సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పశ్చిమ ఒడిశా ఆరాధ్య దైవం సమలేశ్వరి దేవికి ప్రత్యేక పూజాదులు నిర్వహించారు. నువా ఖాయి పురస్కరించుకుని సమలేశ్వరి మాతకు ఈ సీజను సాగు తొలి పంట బియ్యం నవాన్నంగా సమర్పించడం ఆచారం. ఆచారం ప్రకారం పూర్తి స్థానిక సంప్రదాయాలతో నవాన్న నివేదన పూజాదుల్లో గవర్నరుతో ఆయన సతీమణి జయశ్రీ కంభంపాటి భక్తి శ్రద్ధలతో పాలుపంచుకున్నారు. పూజాదులు ముగిసిన తర్వాత గవర్నర్ రాజ్ భవన్ అధికారులు, సిబ్బందికి ప్రసాదం పంపిణీ చేశారు. గవర్నర్ కమిషనర్, కార్యదర్శి రూపా రోషన్ సాహు తదితర రాజ్ భవన్ అధికారులు, సిబ్బంది ఈ పూజా కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ నువా ఖాయి కృతజ్ఞతపూర్వక వేడుకగా పేర్కొన్నారు. రైతాంగం, ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చే ఈ సంప్రదాయాన్ని అందరితో కలిసి మెలిసి జరుపుకోవడంపై గవర్నర్ దంపతులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ శుభ సందర్భంగా ఒడిశా ప్రజలందరికీ శ్రేయస్సు, ఆనందం, ఉన్నత ఆరోగ్యం సిద్ధించాలని గవర్నర్ శుభాకాంక్షలు తెలియజేశారు. -
ఇనుపకుర్తి ‘బిముగ్ద సమ్మాన్’తో సత్కారం
పర్లాకిమిడి: ప్రముఖ వాగ్గేయకారుడు, సెక్సోఫోన్లో ఏ–గ్రేడ్ సంపాదించిన పర్లాకిమిడి వాసి ఇనుపకుర్తి మన్మధరావుకు భువనేశ్వర్‌లో భంజమండపంలో బుధవారం ‘బిముగ్ద సమ్మాన్’ ఆవార్డుతో ఒడిశా సంగీత నాటక అకాడమి, గజపతి జిల్లాకు చెందిన పదామృత నృత్యాయన సంస్థ తరఫున కార్యదర్శి చంద్రశేఖర హోత్తా సన్మానించారు. మన్మధరావుకు అవార్డు కింద నగదు బహుమతి రూ.5వేలు, తామ్రపత్రం, దుశ్శాలువతో సన్మానించినట్టు సంగీత దర్శకులు రఘునాథ పాత్రో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పదామృత నృత్యాయన అకాడమి అధ్యక్షుడు నృసింహా చరణ్ పట్నాయక్, శుభశ్రీ ముఖర్జీ, గురు ధనేశ్వర స్వయిం, సీతాకాంత జెన్నా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఒడిస్సీ కళాకారులు ప్రీతిప్రియా, బింధుప్రియాలు నృత్యం చేసి పలువురిని అలరించారు. -
గణాధీశాయ ధీమహి
రాయగడ: వినాయక ఉత్సవాలు బుధవారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక లారీ యజమానుల సంఘం తిరుమల తిరుపతి తరహా పెండాల్ను ఏర్పాటు చేశారు. అదేవిదంగా టెలిఫొన్ ఎక్స్ంజ్ వద్ద జంగిల్ గాయ్స్ ఆధ్వర్యంలో గేట్‌వే ఆఫ్ ఇండియా పెండాల్, తుంబిగుడ వద్ద గొల్డెన్ టెంపుల్ తరహా ఏర్పాటు చేసిన పూజా పెండాళ్లు ఆకట్టుకుంటున్నాయి. బుదరావలసలొ 2001 కొబ్బరి కాయలతొ 25 అడుగుల వినాయకుడు ప్రత్యేకంగా నిలిచాడు. గాంధీనగర్ లొ దశావతారాలతొ పాటు క్షీరసాగరమధనంను తలపించే విధంగా కళ్లకు కట్టినట్లుగా వినాయక అవతారాలను ఏర్పాటు చేశారు. జయపురం: కుండపోత వానలోనూ గణేష్ చవితి ఉత్సవాలు ఘనంగా జరిగింది. జయపురంలో పెద్ద పెద్ద పూజామండపాల్లో ప్రతిష్టించిన వినాయక విగ్రహాల్లో అత్యధికం స్థానిక కళాకారులు తయారు చేసినవే కావడం గమనార్హం. పర్లాకిమిడిలో.. పర్లాకిమిడి: గణేష్ చతుర్థి సందర్భంగా పర్లాకిమిడిలో పలు కూడళ్ల వినాయక మండపాలు ఏర్పాటు చేశారు. రేఖానా వీధిలో బాలరాముడు, వినాయకుడు విగ్రహం చూపరులకు ఆకర్షిస్తోంది. కొరాపుట్‌లో.. కొరాపుట్: కొరాపుట్, నబరంగ్‌పూర్ జిల్లాల్లో గణేష్ నవరాత్రులు ప్రారంభమయ్యాయి. నవరాత్రులు తర్వాత గ్రహణం ఉన్న నేపథ్యంలో ఈ ఏడాది ఉత్సవాలు తొమ్మిది రోజులకే ముగియాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
మృతుడి ఆచూకీ లభ్యం
కొత్తవలస: ఈ నెల 26న మండలంలోని కొత్తసుంకరపాలెం గ్రామం సమీపంలోని చెరువులో గుర్తు తెలియని మృతదేహాన్ని పోలీసులు కనుగొని ఎస్‌కోట సీహెచ్‌సీకి తరలించిన విషయం తెలిసిందే. కాగా ప్రధాన ప్రతికల్లో వచ్చిన కథనాలు, ఫొటోలను మృతుడి భార్య, కుమారుడు గుర్తించి పోలీసులను సంప్రదించారు. ఈ మేరకు చెరువులో కలువ పూలకోసం దిగి మృతి చెందిన వ్యక్తిని శ్రీకాకుళం జిల్లా బాతువ గ్రామానికి చెందిన అలుగోలు తవుడు(48)గా గుర్తించారు. ఈ ఘటనపై కుటుంబసభ్యులు, సీఐ షణ్ముఖరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా నుంచి బతుకు తెరువు కోసం కొత్తవలస సమీపంలో గల కుమ్మరిబంజరి ప్రాంతానికి అలుగోలు తవుడు కుటుంబసభ్యులు వచ్చారు. టైలరింగ్, కూలి పనులకు వెళ్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. తవుడికి మద్యం తాగే అలవాటు ఉంది. సమీపంలో గల ఆటో డ్రైవర్, మరో వ్యక్తితో కలిసి తరచూ మద్యం తాగేవాడు. ఈ క్రమంలో వారు ముగ్గురూ ఈ నెల 25న మద్యం తాగి కొత్తసుంకరపాలెం గ్రామం సమీపంలో గల చెరువులో గల కలువ పువ్వులను ఏరి వినాయక చవితికి అమ్ముకుందామన్న ఉద్దేశంతో ఆటోలో వెళ్లారు. చెరువులోకి దిగిన తవుడికి లోతు తెలియక చాలా సేపు కనిపించక పోవడంతో ఆయనతో పాటు వెళ్లిన ఆటో డ్రైవర్, మరో వ్యక్తి అక్కడినుంచి పారిపోయారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
గిరిజన మత్స్యకారుడి గల్లంతు
● గజఈతగాళ్లతో గాలింపు ● లభ్యం కాని ఆచూకీ ● రోదిస్తున్న కుటుంబసభ్యులుపాచిపెంట: గిరిజన మత్స్యకారుల బతుకు చిత్రం ప్రతిక్షణం ప్రమాదకరంగా ఉంటోంది. వర్షాలు పడుతున్నా ప్రాణాలకు తెగించి వలవిసరక తప్పదు. లేకుంటే ఇంటిల్లిపాది పిల్లాపాపలతో పస్తులు ఉండాల్సిన పరిస్థితి. వినాయక చవితి సందర్భంగా వర్షం కురుస్తోంది. జలాశయానికి నీటి ఉధృతి పెరుగుతుందని తెలుసు, కానీ పొట్టకూటి కోసం చేపలవేటకు వెళ్లిన పాచిపెంట మండలంలోని కోడికాళ్ల వలస గ్రామానికి చెందిన మత్స్యకారుడు పెద్ద గెడ్డ జలాశయంలో గల్లంతయ్యాడు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కోటికిపెంట పంచాయతీ, కోడికాళ్లవలస గ్రామానికి చెందిన జన్ని బాలరాజు(37) వత్తిరీత్యా పెద్దగడ జలాశయానికి చేపల వేటకు వెళ్తూ జీవనం సాగిస్తూ ఉంటాడు. రోజులాగానే బుధవారం ఉదయం పెద్దగెడ్డ జలాశయానికి చేపలవేటకు వెళ్లాడు. వల తీస్తున్న సమయంలో వరద ఉధృతికి నాటు పడవ బోల్తా పడడంతో జలాశయంలో గల్లంతయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే పోలీసులు అందుబాటులో ఉన్న గజ ఈతగాళ్లతో రెండు రోజులుగా గాలింపు చర్యలు చేపట్టారు. అలాగే డ్రోన్ వినియోగించి గల్లంతైన వ్యక్తి కోసం గాలించినప్పటికీ ఆచూకీ లభ్యం కాలేదు. బాలరాజు గల్లంతైన వార్త విని కోడికాళ్లవలస గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబసభ్యులు తీవ్రంగా రోదిస్తున్నారు. గల్లంతైన వ్యక్తికి భార్య జన్ని బుజ్జి, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. -
పారా జాతీయ స్థాయి పోటీలకు పయనం
విజయనగరం: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ వేదికగా ఈనెల 29 నుంచి 31 వరకు జరుగబోయే 15 వ పారా జూనియర్, సబ్ జూనియర్స్ జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్–2025 పోటీలకు ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి క్రీడాకారులు పయనమయ్యారు. వాంరందరికీ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కె.దయానంద్ అల్ ది బెస్ట్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారా రాష్ట్రస్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచడంతో ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి 13 మంది క్రీడాకారులు జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు. గతం కంటే ఈసారి దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో క్రీడాకారులు హాజరువుతున్నారని, జాతీయస్థాయి పోటీలలోనూ బాగా రాణించి క్రీడల్లో జిల్లా కీర్తి, ప్రతిష్టలు మరింతగా పెంచాలని పిలుపునిచ్చారు. -
పెన్సిల్‌తో ఆకర్షణీయంగా కలెక్టర్ చిత్రం
పార్వతీపురం: పార్వతీపురంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నతపాఠశాలలో డ్రాయింగ్ టీచర్‌గా పనిచేస్తున్న రుగడ శ్రీనివాసరావు కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ చిత్రాన్ని పెన్సిల్తోవేసి తన ప్రతిభను కనబరిచి కలెక్టర్ నుంచి ప్రశంసలు అందుకున్నాడు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ చిత్రాన్ని పెన్సిల్‌తో ఆయన ఆకర్షణీయంగా చిత్రీకరించారు. ఈ మేరకు గురువారం కలెక్టర్‌ను కలిసి పెన్సిల్‌తో వేసిన చిత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా పెన్సిల్‌తో వేసిన చిత్రాన్ని చూసిన కలెక్టర్, శ్రీనివాసరావును ప్రత్యేకంగా అభినందించారు. గరుగుబిల్లి మండలం, రావివలస గ్రామానికి చెందిన శ్రీనివాసరావు చిన్నతనం నుంచి చిత్రాలు వేసి ఈప్రాంతీయుల అభిమానాన్ని చొరగొంటున్నారు. -
యువకుడి దుర్మరణం
రామభద్రపురం: పండగ పూట బొబ్బిలి మండలం పారాది గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తగరపువలసలోని దివిస్ ఫార్మా కంపెనీలో చిరు ఉద్యోగం చేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటూ వినాయక ఉత్సవాలకు గ్రామానికి వచ్చిన ఒక్కగానొక్క కొడుకును లారీ రూపంలో మృత్యువు కబళించడంతో ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీంగా ఉంది. ప్రమాదంలో దుర్మరణం చెంది రోడ్డు పక్కన పడి ఉన్న కొడుకును చూసి ఆతల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని బొబ్బిలి స్మార్ట్ సిటీ సమీపంలో ద్విచక్రవాహనాన్ని లారీ ఢీ కొట్టడంతో యువకుడు పువ్వల బాలాజీ(21) మృతిచెందాడు. బొబ్బిలి మండలంలోని పారాది గ్రామానికి చెందిన బాలాజీ తన ద్విచక్రవాహనంపై వినాయక చవితి పండగ పనుల నిమిత్తం రామభద్రపురం వస్తున్నాడు. సరిగ్గా స్మార్ట్ సిటీ సమీపంలోకి వచ్చిన సమయానికి రామభద్రపురం నుంచి బొబ్బిలి వైపు ఎదురుగా వెళ్తున్న లారీ ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. దీంతో బాలాజీ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ప్రమాద సమాచారాన్ని తెలుసుకున్న ఎస్సై వి.ప్రసాదరావు సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని, లారీని స్వాధీనం చేసుకున్నారు.పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బాడంగి సీహెచ్‌సీకి తరలించారు.తండ్రి వెంకటరమణ ఫిర్యాదు మేరకు ఎస్సై ప్రసాదరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.పండగ విషాదం బైక్‌ను లారీ ఢీకొనడంతో ప్రమాదం వినాయక ఉత్సవాలకు వచ్చి అనంతలోకాలకు గుండెలవిసేలా రోదిస్తున్న తల్లిదండ్రులు -
రైలు ఢీకొని రైల్వే ఉద్యోగి..
జియ్యమ్మవలస రూరల్: (45) రైల్వే ట్రాక్ మెయింటనెన్స్ నాలుగవ తరగతి ఉద్యోగి, మండలంలోని సింగనాపురం పంచాయతీ తుమ్మల దత్తవలస గ్రామానికి చెందిన బంకపల్లి సత్యనారాయణ రైలు ఢీకొని మృతి చెందాడు. ఈనెల 26న కాకినాడ జిల్లా సామర్లకోట రైల్వే బైపాస్ లైన్ క్యాబిన్ వద్ద విధులు నిర్వహిస్తుండగా ఆ సమయంలో వస్తున్న ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయన గతంలో మిలట్రీలో పనిచేసి ఉద్యోగ విరమణ అనంతరం రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్నారు. దుర్ఘటన అనంతరం మృతుని కుటుంబానికి సమాచారం అందించి మృతదేహానికి పెద్దాపురం ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బుధవారం ఆయన స్వగ్రామమైన తుమ్మల దత్తవలసకు రైల్వేసిబ్బంది తరలించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మృతుడికి భార్య సంధ్యారాణి, కుమారుడు నాని, కుమార్తె శశితో పాటు తండ్రి బంకపల్లి రాములు, తల్లి రేగాలమ్మ ముగ్గురు అక్కచెల్లెళ్లు ఉన్నారు. కుటుంబ పెద్ద సత్యనారాయణ మృతితో కుటుంబమంతా తీవ్ర మనస్థాపానికి గురైంది. సీతానగరం: మండలంలోని జాతీయ రహదారిపై మరిపివలస జంక్షన్ వద్ద రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఆర్టీసీబస్సు ఢీకొట్టడంతో జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 13 మంది గాయాల పాలయ్యారు. ఈ మేరకు గురువారం స్థానిక పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బుధవారం ఉదయం సుమారు 5 గంటల సమయంలో సీతానగరం మీదుగా రాజమహేంద్రవరం నుంచి పార్వతీపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సు మరిపివలస జంక్షన్ వద్ద ఉన్న చెట్టును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బస్సుకు ఎడమ భాగాన సీట్లో కూర్చున్న బొబ్బిలి మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన ఎ.శ్రీను(41) మృతి చెందగా బస్పులో ఉన్న 13 మంది ప్రయాణికులు గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను పార్వతీపురంలోని ప్రైవేట్, ప్రభుత్వాస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై రాజేష్ మాట్లాడుతూ శ్రీను మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించినట్లు తెలియజేశారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. బొబ్బిలి: మున్సిపాలిటీ పరిధి యాతవీధి లో నివాసముంటు న్న గొంప దాడిబా బు(27) విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. దీనిపై ఎస్సై ఎల్. రమేష్ తెలియజేసిన వివరాల ప్రకారం బుధవారం ఇంటి పక్కనే ఉన్న పూరిపాకలో నిద్రించాడని, దాడిబాబు ఇంటి నుంచి పాకలో ఉన్న ఫ్యాన్‌కు విద్యుత్ కనెక్షన్ ఇవ్వగా ఆ వైరు అక్కడక్కడా తెగి ఉండడంతో ప్రమాదవశాత్తు తగిలి షాక్‌కు గురై మృతి చెందాడని తెలిపారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం వారికి అప్పగించామని తెలిపారు.మృతుడు దాడిబాబుకు భార్య రాధ ఉంది.కొమరాడ: మండలంలోని గంగరేగువలస గ్రామానికి చెందిన దాసరి తిరుపతి(50) పాము కాటుతో మృతి చెందాడు. బుధవారం రాత్రి వినాయక నిమజ్జనం చేసుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో రహదారిపై తిరుపతిని పాము కాటు వేసింది. దీంతో గ్రామస్తులు ఓ ప్రైవేట్ అస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణం విడిచాడు. మృతుడికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. -
బాల్య వివాహాలు నేరం
విజయనగరం లీగల్: బాలబాలికలకు 18 సంవత్సరాల లోపు వివాహం చేయడం చట్టరీత్యా నేరమని, రెండు సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా ఉంటాయని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణ ప్రసాద్ అన్నారు. ఈ మేరకు బాల్య వివాహాలపై ఆయన బాబా మెట్టలో గల కేంద్రియ విద్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన న్యాయ అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అనేక కారణాలవల్ల చిన్న వయసులోనే బాలికలకు వివాహాలు చేయడం సరైనది కాదన్నారు. చిన్న వయసులోనే వివాహాలు చేయడం వల్ల అనేక అనేక అనారోగ్య సమస్యలు, శారీరక సమస్యలు ఏర్పడతాయని చెప్పారు. బాల్య వివాహాల రద్దు చట్టం గురించి బాల బాలికలకు అర్థమయ్యే రీతిలో తెలియజేశారు ఒకవేళ ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా బాల్య వివాహం జరిగినట్లు లేదా చేస్తున్నట్లు తెలియవస్తే వెంటనే చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నంబర్ 1098కు లేదా జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ 15100కు ఫోన్ చేసి తెలియజేయవలసిందిగా కోరారు. ఇప్పటికీ అనేకచోట్ల బాల్యవివాహాలు ఇంకా నమోదవుతున్నాయన్నారు. అనేక స్వచ్ఛంద సంస్థలు ఇచ్చిన నివేదికల ఆధారంగా హైకోర్టు ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రతి గ్రామం, విద్యాసంస్థల్లో బాల్యవివాహాల నిషేధం పట్ల అవగాహన సదస్సు ఏర్పాటు చేసి ప్రజల్లో చైతన్యవంతులను చేయాలన్నారు. అవగాహన సదస్సులో కేంద్రియ విద్యాలయం ప్రిన్సిపాల్ దిలీప్ మోడీ, బెజ్జిపురం యూత్ క్లబ్ స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్ ఝాన్సీలక్ష్మి అధిక సంఖ్యలో బాల, బాలికలు పాల్గొన్నారు. -
జారిపడి పెయింటర్ మృతి
పార్వతీపురం రూరల్: జిల్లా కేంద్రంలోని గణేష్ నగర్ కాలనీకి చెందిన బి.చినరాము (40) ప్రమాదవశాత్తు రెండతస్తుల బిల్డింగ్ పై నుంచి జారిపడి గురువారం అక్కడికక్కడే మృతిచెందాడు. పట్టణంలోని గూడ్షెడ్రోడ్డులో నివాసం ఉంటున్న చినరాము పెయింటర్‌గా పనిచేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు బిల్డింగ్ పై నుంచి జారిపడి మృతిచెందినట్లు అందిన ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్సై గోవింద కేసు నమోదు చేశారు. విద్యార్థుల కొట్లాటపై కేసు నమోదుపట్టణంలో ఓ ప్రైవేట్ కళాశాల విద్యార్థులు నెలరోజుల క్రితం కళాశాలలో వాగ్వాదం జరిగి గొడవపడిన నేపథ్యంలో బుధవారం పట్టణంలోని నెహ్రూమార్కెట్ ఎదుట లస్సీషాపు వద్ద మళ్లీ ఇరువర్గాలు పడిన ఘర్షణ కొట్లాటకు దారితీయడంతో నలుగురు యువకులపై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై గోవింద తెలిపారు. -
గర్భిణి మృతిపై విచారణ
పాలకొండ: స్థానిక ఏరియా ఆస్పత్రిలో బుధవారం గర్భిణి మృతి చెందడంపై డీసీహెచ్ఎస్ నాగభూషణ్ గురువారం విచారణ చేపట్టారు. ఇందుకు సంబంధించి ఆస్పత్రి సూపరింటెండెంట్ చిరంజీవి అందించిన వివరాల మేరకు మండలంలోని తంపటాపల్లి గ్రామానికి చెందిన బొమ్మాళి పధ్మ మూడవ కాన్పు కోసం ఏరియా ఆస్పత్రిలో ఉదయం 9గంటలకు ఆసుపత్రిలో చేరింది. అప్పటికే తీవ్ర రక్తసావ్రం కావడంతో ఆమెను అక్కడ ఉన్న సిబ్బంది పరిశీంచారు. ఇంతలో ఆమె ఆస్పత్రిలో ఉదయం 11 గంటల సమయంలో మరణించింది. అప్పటికే విధుల్లో ఉండాల్సిన వైద్యులు లేక పోవడంతోనే పద్మ మృతిచెందిందని కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. అనంతరం గ్రామ పెద్దలు సర్ది చెప్పడంతో మృతదేహాన్ని తీసుకుని వెళ్లిపోయారు. దీనిపై ఫిర్యాదు రావడంతో డీసీహెచ్ఎస్ ఏరియా ఆస్పత్రిని సందర్శించి విచారణ చేపట్టారు. గ్రామంలోని ఆశవర్కర్, ఏఎన్ఎం, ఎంల్హెచ్పీల నుంచి వివరాలు తీసుకున్నారు. రక్తస్త్రావం ఎక్కువగా అవడంతోనే మృతి చెందినట్లు వారంతా చెప్పారు. ఆస్పత్రికి తీసుకురావడం ఆలస్యమైందని సూపరింటెండెంట్ వివరించారు. హెల్మెట్ వాడకం తప్పనిసరి● ఎస్పీ వకుల్ జిందల్ విజయనగరం క్రైమ్: రహదారి భద్రత, ప్రమాదాల నివారణలో భాగంగా పలు పోలీసు స్టేషన్ల పరిధిలోని బ్లాక్ స్పాట్స్, హైవేలపై, ప్రధాన జంక్షన్ల వద్ద విస్తృతంగా తనిఖీలు చేపట్టి ‘హెల్మెట్ ధారణ’ పై అవగాహన కల్పిస్తున్నామని ఎస్పీ వకుల్ జిందల్ గురువారం స్పష్టం చేశారు. హెల్మెట్ ధరించని వాహనదారులపై కేసులు నమోదు చేశామని ఎస్పీ వకుల్ జిందల్ చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 18 నుంచి 24 వరకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి, 452 కేసులు నమోదు చేసి, ఈ చలానాగా రూ.4,75,725/లను విధించామన్నారు. స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్స్టేషన్ల పరిధిలోని బ్లాక్ స్పాట్స్ వద్ద వాహన తనిఖీలు చేపట్టామని తెలిపారు. రహదారి భద్రత నియమాలను అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పనని వాహనదారులను ఎస్పీ హెచ్చరించారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌ను మూడు సబ్ వివిజన్లలో విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు, బొబ్బిలి డీఎస్పీ జి.భవ్యా రెడ్డి, చీపురుపల్లి డీఎస్‌పీఎస్.రాఘవులు పర్యవేక్షించారన్నారు. -
తీరప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
పూసపాటిరేగ: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో భారీగా వర్షాలు కురుస్తున్నందున తీరప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి పి.అచ్యుతకుమారి సూచించారు. మండలంలోని తీర ప్రాంతాలైన కోనాడ, బొడ్డుగురయ్యపేట, తిప్పలవలస, మత్సవానిపాలెం గ్రామాల్లో గురువారం ఆమె పర్యటించి, ఆయా గ్రామాల్లోని వైద్య శిబిరాలను సందర్శించారు. అనంతరం తుపాను సహాయక చర్యలపై ఆరాతీశారు. ప్రజలకు వైద్యారోగ్య సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండాలని, ఎవరైనా జ్వర లక్షణాలతో బాధపడితే వారికి వెంటనే వైద్యం అందేలా చూడాలన్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యంపై అవగాహన కల్పించాలన్నారు. తాగునీటి వనరుల్లో క్లోరినేషన్ చేపట్టి, జనానికి పరిశుభ్రమైన తాగునీరు అందేలా చూడాలన్నారు. ప్రసవానికి దగ్గరగా ఉన్న గర్భిణులను దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించి, సాధారణ ప్రసవం అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. అక్కడి నుంచి పూసపాటిరేగ పీహెచ్‌సీకి వెళ్లి, వైద్య సిబ్బంది పనితీరు, మందుల నిల్వలు, కుక్క, పాముకాటుల వ్యాక్సిన్లు పరిశీలించారు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని తెలిపారు. ఆమె వెంట వైద్యాధికారి ప్రమీలాదేవి ఉన్నారు. విజయనగరం అర్బన్: పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని కేంద్రియ గిరిజన యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జితేంద్రమోహన్ మిశ్రా కోరారు. జిల్లాలోని అదే యూనివర్సిటీలో టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ విభాగం ఆధ్వర్యంలో సుస్థిర పర్యాటకం–ఉపాధి అవకాశాలకు మూలం అనే అంశంపై నిర్వహిస్తున్న రెండు రోజుల వర్క్‌షాపును గురువారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ పండగలు, జాతరలు, తిరునాళ్లు వంటి సామూహిక వేడుకలను పర్యావరణ హితంగా జరుపుకోవాలని సూచించారు. ఈ వర్క్‌షాపులో భాగంగా పట్టణంలోని సహజ పరిసరాలను విద్యార్థులు సందర్శించి, ప్రజలను కలిసి పర్యావరణకు వారు పాటుపడేలా చైతన్యం చేయాలన్నారు. అలాగే సంప్రదాయ కళలు, హస్తకళల రక్షణను ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో ప్రొగ్రాం కో–ఆర్డినేటర్ దీపక్ త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు. నేడు భీమసింగిలో జాబ్మేళాజామి: ఆంధ్రప్రదేశ్ నైపుణ్యభివృద్ధి సంస్థ, భీమసింగి బాలాజీ డిగ్రీ కాలేజీ సంయుక్త ఆధ్వర్యంలో భీమసింగి బాలాజీ కళాశాలలో శుక్రవారం జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ప్లేస్మెంట్ అధికారి భాస్కరరావు ఒక ప్రకటనలో తెలిపారు.ఈ మేళాకు 17 బహుళజాతి కంపెనీలు హాజరై అర్హత కలిగిన అభ్యర్థులను ఎంపిక చేస్తాయని పేర్కొన్నారు. ఎస్ఎస్సీ, ఇంటర్, ఐటీఐ, డిప్లమో, బీటెక్, ఏదైనా పీజీలో ఉత్తీర్ణత సాధించి 18నుంచి 35 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు ఉదయం 9గంటలకు బాలాజీ కళాశాలకు హాజరుకావాలని కోరారు. -
విద్యార్థులు సాంకేతికతను అందిపుచ్చుకోవాలి
డెంకాడ: విద్యార్థులు సాంకేతికతను అందిపుచ్చుకుని, కొత్త ఆవిష్కరణల వైపు అడగులు వేయాలని లెండి ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వీవీ రామారెడ్డి ఆకాంక్షించారు. మండలంలోని జొన్నాడ వద్ద ఉన్న లెండి ఇంజినీరింగ్ కళాశాలలో హ్యాకథాన్ కార్యక్రమం గురువారం నిర్వహించారు. లెండి కళాశాల ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సెల్, అమరావతి క్వాంటమ్ వ్యాలీ–2005 సమన్వయంతో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని, విద్యార్థులను ఉద్దేశించి కాసేపు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో నేర్పే ప్రతి అంశం క్షుణ్నంగా నేర్చుకుని, భవిష్యత్‌లో అభివృద్ధి చెందేందుకు ఉపయోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
శ్రీ మందిరం శిఖరంపై డ్రోన్ చక్కర్లు
భువనేశ్వర్: పూరీ శ్రీ మందిరం శిఖరంపై డ్రోన్ సంచలనం వివాదాలు రేపుతోంది. బొడొ దండొ మార్కెట్ చౌరస్తా నుంచి శ్రీ మందిరం వరకు డ్రోన్ చక్కర్లు కొట్టిన దృశ్యంతో వీడియో ప్రసారం దుమారం రేపతుంది. ప్రధాన ఆలయ శిఖర ప్రాంగణం డోలమండపం మీదుగా ఎగిరి మార్కెట్ చౌరస్తా వైపు చక్కర్లు కొట్టినట్లు ఈ వీడియో స్పష్టం చేస్తోంది. ఈ సంఘటనపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. డ్రోన్ నిరోధక వ్యవస్థ ప్రవేశ పెట్టినట్లు స్వామి రథ యాత్ర పురస్కరించుకుని రాష్ట్ర పోలీసు డైరెక్టరు జనరల్ ప్రకటంచిన విషయం తెలిసిందే. మరో వైపు శ్రీ మందిరం ప్రాంగణం నో ఫ్లై జోన్‌గా ప్రకటించిన పరిస్థితుల్లో తరచూ డ్రోన్ సంచారం శ్రీ మందిరం భద్రతా వ్యవస్థకు పెను సవాలుగా నిలుస్తోంది. -
రైతన్నలకు ఆర్థిక సాయం
పర్లాకిమిడి: జిల్లాలోని రైతులుకు నువాఖయి పండగ సందర్భంగా స్థానిక గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం హాల్లో పీఎం కిసాన్ ఆర్థిక సహాయ కార్యక్రమాన్ని రాష్ట్ర వాణిజ్య, రవాణా, ఖనిజశాఖ మంత్రి బిభూతి జెన్నా ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కిసాన్ పథకమే ప్రధానమంత్రి కిసాన్ రైతు బంధు పథకంగా అమలు చేస్తున్నట్టు మంత్రి జెన్నా అన్నారు. కౌలు రైతులుకు, తక్కువ భూమి ఉన్న రైతన్నలకు 2025–26లో రూ.6 వేల చొప్పున ఏడాదికి రెండు సార్లు నువాఖయి పండగ సందర్భంగా నేరుగా రైతుల అక్కౌంట్లలో వేస్తున్నామని మంత్రి అన్నారు. గజపతి జిల్లాలో మొత్తం 64,905 వేల మంది రైతులకు రూ.6 వేల ఆర్థిక సహాయం అందజేస్తున్నామని మంత్రి అన్నారు. గత ఏప్రిల్ నెలలో అక్షయ తృతీయ పండగ సందర్భంగా రూ.6 వేలను రైతన్నలకు వారి ఖాతాలకు అందజేశామని, విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారిక మందుల కొనుగోలుకు ఉపయోగపడతాయన్నారు. తమ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మోహనా ఎమ్మెల్యే దాశరథి గోమాంగో, అదనపు కలెక్టర్ మునీంద్ర హానగ, ఎస్పీ జ్యోతింద్ర కుమార్ పండా, ఏడీఎం ఫల్గుని మఝి, జిల్లా ముఖ్యవ్యవసాయ అధికారి రవీంద్ర కుమార్ హదక్, జిల్లా పరిషత్ సీడీఓ శంకర కెరకెటా, సబ్ కలెక్టర్ అనుప్ పండా తదితరులు పాల్గొన్నారు. -
యువకుడి దారుణ హత్య
రాయగడ: పాత కక్షలతో ఒక యువకుడిని దారుణంగా హత్య చేసిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. మృతుడు స్థానిక మహిళా కళాశాల వైనుక ఉన్న హరిజన వీధికి చెందిన రోహిత్ థప్ప(25)గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. స్థానిక అగ్నిమాపక కేంద్రం సమీపంలోని మైదానంలో ఉన్న రోహిత్‌పై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. అనంతరం అపస్మారక స్థితిలో ఉన్న రోహిత్‌ను వదిలి పారిపోయారు. తీవ్రగాయాలకు గురై రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న అతడిని అటువైపుగా వెళ్తున్న కొంతమంది చూసి కుటుంబీకులకు, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే తలకు బలమైన గాయమవ్వడంతో అప్పటికే మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే పాత కక్షల కారణంగానే దుండగులు రోహిత్‌ను హతమార్చారని పోలీసులు భావిస్తున్నారు.