ఫ్లై ఓవర్‌పైకి అనధికార ప్రవేశం | - | Sakshi
Sakshi News home page

ఫ్లై ఓవర్‌పైకి అనధికార ప్రవేశం

Mar 1 2026 7:29 AM | Updated on Mar 1 2026 7:29 AM

ఫ్లై

ఫ్లై ఓవర్‌పైకి అనధికార ప్రవేశం

రెండు వాహనాలకు రు.40 వేల జరిమానా

రాయగడ: స్థానిక ఫ్లై ఓవర్‌పై అనధికారంగా ప్రవేశించిన రెండు భారీ వాహనాలకు రోడ్డు రవాణా శాఖ అధికారులు రూ.40 వేల జరిమానాను విధించారు. గత కొద్ది నెలలుగా ఫ్‌లైవర్‌ మరమ్మతులు చేపడుతున్న నేపథ్యంలో బ్రిడ్జిపై వాహన రాకపోకలను జిల్లా యంత్రాంగం నిషేధించిన విషయం తెలిసిందే. శనివారం రెండు భారీ వాహనాలు బ్రిడ్జి మీదుగా వెళ్లి రహదారి లేకపోవడంతో మధ్యలో నిలిపివేశారు. ఎటువంటి అనుమతులు లేకుండా భారీ వాహనాలు బ్రిడ్జిపై నిలిచి ఉండటం గమనించిన ఆర్టీఓ సిబ్బంది శుక్రవారం సాయంత్రం పోలీసులు బందోబస్తుతో చేరుకుని వాహనాల యజమానికి సంబంధించిన కాగితాలను పరిశీలించి రెండింటికీ జరిమానను విధించారు. రెండు భారీ వాహనాలు గుజరాత్‌ నుంచి జిల్లాలోని కాసీపూర్‌ సమితి టికిరి వద్ద గల ఆదిత్యా అలూమిన కార్మాగారం నిర్మాణంలో భాగంగా అందుకు సంబంఽధించిన యంత్రాలను తరలిస్తున్నట్లు సమాచారం. స్థానిక కపిలాస్‌ కూడలి వద్ద ఫ్‌లైఓవర్‌ మీదుకు ఎటువంటి వాహనాలు రాకపోకలు కొనసాగించకూడదని జిల్లా యంత్రాంగం హెచ్చరిక బోర్డులను సైతం ఏర్పాటు చేసినప్పటికీ ఈ రెండు భారీ వాహనాలు నియమాలను ఉల్లంఘించి బ్రిడ్జిపైకి వెళ్లాయి.

ఫ్లై ఓవర్‌పైకి అనధికార ప్రవేశం1
1/1

ఫ్లై ఓవర్‌పైకి అనధికార ప్రవేశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement