వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ (మార్చి 4, బుధవారం) ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటించారు.
అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం రెండో కుమారుడు రేగం చాణుక్య వివాహ వేడుకకు, అలాగే విశాఖ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ కుమారుడు గోవింద్ సాకేత్ వివాహ రిసెప్షన్‌కు హాజరయ్యారు. నూతన వధూవరులను వైఎస్ జగన్ ఆశీర్వదించారు.


