జయపురం: స్థానిక విక్రమదేవ్ యూనివర్సిటీ మానవీయ అధ్యాయన విభాగం మూడవ సభాగృహంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో శాసీ్త్రయ వాతావరణంలో 5ఈ విద్యా బోధన పుస్తకాన్ని ఆవిష్కరించారు. యూనివర్సిటీ ఉపాధ్యాయ శిక్షణ విభాగాధిపతి, సహాయ ప్రొఫెసర్లు డాక్టర్ మనోరంజన్ ప్రధాన్, లోకేష్ ప్రధాన్‌లు సంయుక్తంగా రచించిన 280 పేజీల విలువైన పరిశోధనా గ్రంథం 5ఈ విద్యా బోధన’పుస్తకాన్ని విశ్వవిద్యాలయ రిజస్ట్రార్ మహేష్ చంద్రనాయక్, స్నాతకోత్సవం పరిషత్ అధ్యక్షులు డాక్టర్ ప్రశాంత కుమార్ సాహులు సంయుక్తంగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఇద్దరు రచయితలతో పాటు ప్రొఫెసర్ డాక్టర్ నరేంద్రకుమార్ మహారాణ పాల్గొన్నారు. రచయిత డాక్టర్ మనోరంజన్ ప్రధాన్ పుస్తకంలోని అంశాలను వివరించారు. గుణాత్మక విద్యా బోధనకు ఎలా ఉపయోగపడుతుందో తెలియ జేశారు. ముఖ్యఅతిథి మహేశ్వర్ చంద్రనాయక్ రచయితలను అభినందించారు. ఈ పుస్తకం బీఈడీఎ, ఎంఈడీ, ఆనర్స్ ఎంఏ విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో అధ్యాపకులు కస్తూరీ ఆచార్య, అనిత పట్నాయక్, అనుపమ మిశ్ర, పరిచితా మహాపాత్రో, సుజాతా బేజ్, స్థానిక ప్రభుత్వ మహిళా కళాశాల అధ్యాపకులు బందనా మహరాణ, శుభశ్రీ పట్నాయక్, సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ పుస్తకం ఆన్‌లైన్‌తోపాటు పుస్తక విక్రయ కేంద్రాల్లో లభ్యమవుతాయన్నారు.


