వర్సిటీలో అక్రమ నియామకాలు రద్దు చేయాలి | - | Sakshi
Sakshi News home page

వర్సిటీలో అక్రమ నియామకాలు రద్దు చేయాలి

Mar 4 2026 7:19 AM | Updated on Mar 4 2026 7:19 AM

తూర్పు కాపు ఉద్యోగ సంఘాల

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ఎచ్చెర్లలోని డాక్టర్‌ బి. ఆర్‌.అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలో ఇటీవల జరిపిన అక్రమ నియామకాలు తక్షణమే రద్దు చేయా లని జిల్లా తూర్పు కాపు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. మంగళవారం శ్రీకాకుళం నగరంలోని ఇందిరా విజ్ఞాన్‌ భవన్‌లో జిల్లా తూర్పు కాపు ఉద్యోగ సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలు అంకడాల తవిటన్న, కిల్లారి నారాయణరావు, డాక్టర్‌ ఎం.రామజోగినాయుడు, వాల్తేటి సత్యనారాయణలు మాట్లాడుతూ విశ్వవిద్యాలయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైస్‌ చాన్సలర్‌ కె.ఆర్‌.రజని నియంతలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజల ద్వారా ఎన్నికై న ప్రజా ప్రతినిధులకు, ఉన్నత అధికారులకు, మంత్రులకు కనీసం గౌరవ మర్యాదలు లేకుండా ప్రవర్తిస్తూ.. జిల్లా పరువు ప్రతిష్టలు మంటగలుపుతున్నారని దుయ్యబట్టారు. వర్సిటీలో పనిచేస్తున్న తూర్పు కాపు ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. అవినీతికి, అవకతవకలకు, అక్రమాలకు నిలయమైన వీసీ వెంటనే డిస్మిస్‌ చేసి ఆమె హయాంలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.అభివృద్ధి పనులు పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని బహిరంగంగా దోచుకుంటున్న అక్రమార్కులపై ప్రభుత్వం శాసనసభ కమిటీని నియమించి సమగ్ర విచారణ జరిపించాని కోరారు. కాగా, ఇటీవల పదోన్నతులు పొందిన ముగ్గురు ఉద్యోగులను సంఘ నాయకులు సత్కరించారు. పదోన్నతులు పొందిన వారిలో టెక్కలి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ గొంటి తిరుపతిరావు, ఉపఖజానా శాఖ అధికారులు గార నిర్మల, బోర రవీంద్రలున్నారు. కార్యక్రమంలో తూర్పు కాపు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు శాసపు జోగినాయుడు, మక్కా శ్రీనివాస్‌, దాసరి రామచంద్రరావు, కర్ణం నరిసింగరావు, లావేటి సుందరరావు, దన్నాన మోహనరావు, కురిటి దుర్గారావు, నేతల అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

ప్రతినిధులు డిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement