ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది, నాలుగు రోజులుగా మూసి ఉన్న వెజ్ బిర్యానీ దుకాణం ఫ్రీజర్‌లో 38 ఏళ్ల వ్యక్తి మృతదేహాన్ని గుర్తించడం స్థానికంగా కలకలం రేపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, లక్నోలోని GCRG కళాశాల ఎదురుగా ఉన్న బిర్యానీ దుకాణ యజమాని అజయ్ పాల్ కొనుగోలు కోసం బైటికి వెళ్లాడు నాలుగు రోజుల తర్వాత తిరిగి షాప్‌కు వచ్చి, డీప్ ఫ్రీజర్‌ను చెక్ తనిఖీ చేస్తుండగా లోపల డెడ్ బాడీని గుర్తించి ఒక్కసారిగా షాకయ్యాడు. వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలుసుai మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం మిత్తం తరలించారు.
మృతుడి జేబులో దొరికిన మొబైల్ ఫోన్ ,ఆధార్ కార్డు ఆధారంగా మృతుడిని బక్షి కా తలాబ్ (BKT)లోని కిషున్‌పూర్ గ్రామానికి చెందిన విజయ్ పాల్‌గా గుర్తించారు. ఈ దుకాణం మూడు వైపులా టిన్ షీట్‌లతో నిర్మించిన తాత్కాలిక నిర్మాణం అని, సరైన గేట్ లేదని సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు. మృతదేహం తీవ్ర గాయాలైన గుర్తులు లేవు. మరణానికి ఖచ్చితమైన కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదని, కుటుంబ సభ్యులను ఆరాతీస్తున్నామని వెల్లడించారు.పోస్ట్‌మార్టం నివేదిక తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తాయని చెప్పారు.
ఇదీ చదవండి: లిఫ్ట్‌లో షాకింగ్ యాక్సిడెంట్.. ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!
ప్రాథమిక దర్యాప్తులో అతని చెప్పుల్లో ఒకటి కళాశాలకు దగ్గరగా ఉన్న రోడ్డు మూలన, మరొకటి మరొకటి దుకాణం లోపల గుర్తించడం పలు అనుమానాలకు తావిస్తోంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మృతుడు దుకాణంలోకి ఎలా, ఎప్పుడు ప్రవేశించాడు, చివరిగా ఎప్పుడు తెరిచారు అనే విషయాలను కూపీ లాగుతున్నారు.
ఇదీ చదవండి: సంగీత్ వేడుకలో చిన్నారి స్టెప్పులు వైరల్, 82 లక్షల మంది ఫిదా!


