ఇండో–నేపాల్‌ సరిహద్దు మూసివేత | Indo Nepal Border Closed Due To Elections | Sakshi
Sakshi News home page

ఇండో–నేపాల్‌ సరిహద్దు మూసివేత

Feb 28 2026 7:10 AM | Updated on Feb 28 2026 7:10 AM

Indo Nepal Border Closed Due To Elections

బహ్రైచ్‌(యూపీ): నేపాల్‌లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా మార్చి 2 అర్ధరాత్రి నుంచి 5 అర్ధరాత్రి వరకు భారత–నేపాల్‌ సరిహద్దు మూసివేయనున్నారు. ఈ మేరకు నేపాల్‌ హోం మంత్రిత్వ శాఖ గురువారం అధికారిక ప్రకటన జారీ చేసింది. భారత్‌కు ఆనుకుని ఉన్న బాంకే జిల్లా అంతటా సరిహద్దు అవుట్‌ పోస్టులు మార్చి 2 నుంచి 5వరకు మూసివేయనున్నట్లు తెలిపింది.

ఈ కాలంలో వస్తువుల దిగుమతులు, ఎగుమతులు కూడా నిలపివేస్తారు. అత్యవసరమైన మందులు, కీలక వస్తువుల రవాణా మాత్రం కొనసాగనుందని సశస్త్ర సీమా బల్‌ 42వ బెటాలియన్‌ కమాండెంట్‌ గంగా సింగ్‌ ఉదావత్‌ తెలిపారు. తప్పనిసరి అయితే తప్ప నిషేధిత కాలంలో సరిహద్దు దాటకుండా ఉండాలని రెండు దేశాల పౌరులకు సూచించారు. ఉపాధి, వ్యాపార ప్రయోజనాల కోసం భారత్‌లో ఉన్న నేపాలీ ఓటర్లు, తీవ్ర అనారోగ్యంతో ఉన్న రోగులు, అవసరమైన వస్తువులను మాత్రం భద్రతా దళాల పర్యవేక్షణలో సరిహద్దు దాటి అనుమతించనున్నట్లు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement