డీఎంకేలో చేరిన పన్నీర్‌ సెల్వం | Expelled AIADMK Leader O Panneerselvam Joins DMK In Presence Of MK Stalin, Check More Details Inside | Sakshi
Sakshi News home page

డీఎంకేలో చేరిన పన్నీర్‌ సెల్వం

Feb 28 2026 5:24 AM | Updated on Feb 28 2026 1:38 PM

Expelled AIADMK leader O Panneerselvam joins DMK in presence of MK Stalin

మాతృ సంస్థలో చేరడం సంతోషంగా ఉందన్న నేత

సీఎం స్టాలిన్‌పై ప్రశంసల జల్లు 
 

చెన్నై: అసెంబ్లీ ఎన్నికలకు ముందు తమిళనాడు రాజకీయాల్లో సంచలనాత్మకమైన మార్పులు జరుగుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి, ఏఐఏడీ ఎంకే బహి ష్కృత నేత ఓ.పన్నీర్‌ సెల్వం (ఓపీఎస్‌) డీఎంకేలో చేరారు. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌ సమక్షంలో ఆయన డీఎంకే కండువాను కప్పుకొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డీఎంకేలో చేరడం తన సొంత ఇంటికి వచ్చినట్లుగా ఉందన్నారు. 

సీఎం స్టాలిన్‌ అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని, అన్నాదురై, కరుణానిధి చూపిన దారిలో ప్రతి ఒక్కరినీ కలుపుకొనిపోతూ పార్టీని, ప్రభుత్వాన్ని ఆదర్శంగా నడిపిస్తున్నారని కొనియాడారు. ‘దేశం మొత్తం స్టాలిన్‌ నాయకత్వాన్ని నిశితంగా గమనిస్తోంది. రాజకీయ పార్టీని ఎలా నడపాలో ఆయన కొత్త వ్యాకరణం నిర్దేశించారు. తమిళనాడు ప్రజలకు సమర్థవంతమైన, గొప్ప ప్రశంసనీయమైన పరి పాలనను అందిస్తున్నారు’అని కొనియాడారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement