ఆమెతో వివాహేతర సంబంధం : విజయ్‌కు విడాకుల నోటీసులు | TVK Chief And Actor Vijay Wife Sangeeta Files For Divorce, States That Extramarital Affairs Are The Reason | Sakshi
Sakshi News home page

ఆమెతో వివాహేతర సంబంధం : విజయ్‌కు విడాకుల నోటీసులు

Feb 27 2026 5:03 PM | Updated on Feb 27 2026 6:43 PM

TVK chief and actor Vijay wife files for divorce,accuses him of infidelity

చెన్నై:  తమిళ నటుడు, టీవీకే చీఫ్‌కు విజయ్‌కు భారీ షాక్‌ తగిలింది. పాతికేళ్లకు పైగా వివాహం బంధం తర్వాత ఆయన భార్య సంగీత సోర్నలింగం విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఒక నటితో విజయ్ వివాహేతర సంబంధమే విడాకులకు కారణమంటూ పిటిషన్‌లో పేర్కొనడం సంచలనం రేపుతోంది.

సంగీత దాఖలు చేసిన పిటిషన్ ప్రకారం, విజయ్ ఒక నటితో వివాహేతర సంబంధంలో ఉన్నాడని సంగీత ఆరోపించింది. 2021లో ప్రతివాదికి నటితో అక్రమ సంబంధం ఉందని ఆమె పేర్కొంది. అయితే సంబంధాన్ని ముగించాలని హామీ ఇచ్చిన తర్వాత కూడా విజయ్‌లో మార్పులేదని పాత ధోరణే కొన సాగుతోందనేది సంగీత ప్రధాన అరోపణ. అదే భర్తనుంచి చట్టబద్ధంగా విడిపోవాలనే తన నిర్ణయానికి పునాది వేసింది. ప్రత్యేక వివాహ చట్టంలోని సెక్షన్ 27(1)(a) మరియు 27(1)(d) కింద సంగీత విడాకులకు దరఖాస్తు చేసింది. 

జీవిత భాగస్వామి వివాహేతర సంబంధంలో ఉన్నట్టు లేదా అవతలి వ్యక్తి పట్ల క్రూరంగా ప్రవర్తించినట్లు తేలితే, ప్రత్యేక వివాహ చట్టం, 1954 విడాకులకు అనుమతిస్తుంది. సంగీత పిటిషన్ ఈ రెండు చట్టపరమైన కారణాలను విచారిస్తోంది. ఈ విషయం ప్రస్తుతం జిల్లా కోర్టు ముందు ఉంది. 

కాగా విజయ్,సంగీత  తమ విభేదాలను బహిరంగంగా అంగీకరించనప్పటికీ గత రెండేళ్లుగా విజయ్ నుండి విడిగా నివసిస్తున్న సంగీత ఫిబ్రవరి 24న చెంగల్పట్టు మహిళా కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకుంది. కోర్టు ఆమె విజ్ఞప్తిని అంగీకరించి కేసును కుటుంబ సంక్షేమ కమిటీకి బదిలీ చేసింది.వారి సుదీర్ఘ మౌనం అభిమానులు, మీడియాలో నిరంతర ఊహాగానాలకు ఆజ్యం పోసింది. 1999 ఆగస్టులో ప్రేమవివాహం చేసుకున్న ఈ జంటకు జాసన్ సంజయ్ (25) , దివ్య షాషా (20) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.  

విజయు ఎఫైర్ ఉంది.. విడాకులు కోరిన దళపతి భార్య

సినిమా నటుడు నుంచి రాజకీయ నాయకుడిగా ఎంట్రీ ఇచ్చి ఇటీవల తమిళగ వెట్రి కజగం(TVK) పార్టీని ప్రారంభించిన విజయ్‌ కెరీర్, ప్రజా జీవితంలో ఈ పరిణామం కీలకమైంది అంటున్నారు విశ్లేషకులు. మరోవైపు విజయ్ బృందం లేదా సంగీత ఈ విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

ఇదీ చదవండి: పట్టపగలే భార్య ప్రియుడి హత్య, భార్యకు వార్నింగ్‌,షాకింగ్‌ వీడియో

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement