Liquor Scam Case మోదీ, అమిత్‌షా కుట్ర : కేజ్రీవాల్‌ | Delhi Liquor Scam Case Fake case in the name of scam Arvind Kejriwal | Sakshi
Sakshi News home page

మోదీ, అమిత్‌షా కుట్ర : అరవింద్‌ కేజ్రీవాల్‌

Feb 27 2026 4:37 PM | Updated on Feb 27 2026 4:53 PM

Delhi Liquor Scam Case Fake case in the name of  scam Arvind Kejriwal

న్యూఢిల్లీ:  ఢిల్లీ ప్రభుత్వ మాజీ ఎక్సైజ్ (లిక్కర్) విధానానికి సంబంధించిన  స్కాంలో  మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా భారీ ఊరట లభించింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు అవినీతి కేసులో సహా నిందితులందరినీ విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆప్‌నేత కేజ్రీవాల్‌ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. 

లిక్కర్‌ స్కాం కేసులో నిర్దోషిగా విడుదలైన తర్వాత, కేజ్రీవాల్ బీజేపీపై తన దాడిని ఎక్కుపెట్టారు. తనపై తప్పుడు కేసులు బనాయించి,తనను ఆమ్‌ ఆద్మీ పార్టీని అంతం చేయాలని ప్రధాని మోదీ, అమిత్‌ షా ద్వయం కుట్ర  పన్నిందని  ఆరోపించారు. లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలకు స్పందిస్తూ, తనపై, తన పార్టీపై వచ్చిన అన్ని ఆరోపణలు నిరాధారమైనవని  తేలిందని  కేజ్రీవాల్ అన్నారు. ఈ కేసులో సీబీఐ ,ఈడీ ఛార్జ్ షీట్లు దాఖలు చేసినప్పటికీ, ప్రాసిక్యూట్ చేయడానికి తగిన ఆధారాలు ఉన్నాయా లేదా అనే దానిపై తుది నిర్ణయం కోర్టుదేనని  స్పష్టం చేశారు. కేసును క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత, కేసును కొనసాగించ డానికి ఖచ్చితమైన ఆధారాలు లేవని కోర్టు తేల్చిందని కేజ్రీవాల్ అన్నారు. 

ఇదీ చదవండి: లిక్కర్‌ కేసులో కే​‍జ్రీవాల్‌కు ‍క్లీన్‌ చిట్‌, మాజీ సీఎం భావోద్వేగం

కేజ్రీవాల్‌కు క్లీన్‌ చిట్‌ రావడంతో అటు ఆప్‌ శ్రేణులు, ఇటు ఆయన భార్య సునీత ఆనందంలో మునిగి తేలారు. భర్తను ఆలించగనం చేసుకొని ఆమె  కన్నీళ్లు పెట్టుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement