కోల్‌కతాలో భారీ భూకంపం, వణికిపోయిన జనం | Strong Earthquake Hits Kolkata And Bangladesh Registers 5.5 Magnitude, Watch Videos Inside | Sakshi
Sakshi News home page

Earthquake: కోల్‌కతాలో భారీ భూకంపం, వణికిపోయిన జనం

Feb 27 2026 2:48 PM | Updated on Feb 27 2026 4:16 PM

Massive earthquake jolts Kolkata, tremors felt across city

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ రాజధాని నగరం కోల్‌కతాలో శుక్రవారం మధ్యాహ్నం భారీ భూకంపం సంభవించింది. కోల్‌కతా, దాని పరిసర జిల్లాల్లో భూకంపాలు సంభవించాయి. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) ప్రకారం, భూకంపం రిక్టర్ స్కేలుపై 5.5 తీవ్రతతో నమోదైంది. 10 కి.మీ లోతులో సంభవించిన ఈ భూకంపం నైరుతి బంగ్లాదేశ్‌లో కేంద్రంగా ఉంది. 

భారతదేశం-బంగ్లాదేశ్ సరిహద్దుకు సమీపంలోని పరిసర జిల్లాల్లో కూడా భూకంపం సంభవించింది. దీని తీవ్రతను రిక్టర్‌ స్కేల్‌పై 5.4గా గుర్తించారు. ఇది 35 కి.మీ (21.75 మైళ్ళు) లోతులో సంభవించిందని యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) తెలిపింది. 

 

కోల్‌కతా నగరం, పరిసర  ప్రాంతాల్లో  కొన్ని సెకన్ల పాటు ఈ ప్రకంపనలు కొనసాగాయి. ఎత్తైన నివాస సముదాయాలు, రద్దీగా ఉండే మార్కెట్‌లలో భూమి కంపించడంతో అందరూ ఆందోళనకు గురయ్యారు. తాజా సమాచారం  దీని వలన ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టంగా జరగలేదు. స్థానికుల ప్రకారం ప్రకంపనల సమయంలో సీలింగ్ ఫ్యాన్లు ఊగడం, ఫర్నిచర్ కంపించడం, కిటికీలు కొట్టుకోవడం లాంటివి సంభవించాయి. బహుళ అంతస్తుల భవనాలలో దీని ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఈ ఘటనకు సంబంధించిన సోషల్‌ మీడియాలో అనేక వీడియోలు వైరల్‌గా మారాయి.

కోల్‌కతాలో భారీ భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు

Advertisement
 
Advertisement
Advertisement