నిఫావైరస్‌ సోకిన నర్సు గుండెపోటుతో మృతి | Nurse infected with Nipah virus suffers heart attack | Sakshi
Sakshi News home page

నిఫావైరస్‌ సోకిన నర్సు గుండెపోటుతో మృతి

Feb 13 2026 7:14 AM | Updated on Feb 13 2026 8:48 AM

Nurse infected with Nipah virus suffers heart attack

ఇటీవల కోల్‌కతాలో  ప్రమాదకర నిఫా వైరస్ బారిన పడి కోలుకున్న వారిలో ఒక నర్సు నిన్న (గురువారం) గుండెపోటుతో మృతిచెందారు. అయితే మరోకరు మాత్రం ప్రస్తుతం కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు.

పూర్బబర్ధమాన్ జిల్లా కట్వాకు చెందిన ఒక నర్సు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. కాగా పలురకాల వైద్య పరీక్షలు నిర్వహించగా జనవరి 31 వతేదీన ఆ నర్సు నిఫా వైరస్ బారినపడినట్లు తేలింది. అయితే ఈ క్రమంలోనే మెరుగైన చికిత్స అందించగా నిఫా వైరస్ నుంచి ఆమె కోలుకున్నారు.

కాగా అప్పటినుంచి ఇతర అనారోగ్య కారణాలతో ఆమె కోమాలోనే ఉన్నారు. ఈ క్రమంలోనే  డాక్టర్లు ఆమెకు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఉపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌కు గురైన ఆనర్సు గురువారం మద్యాహ్నం తీవ్రమైన గుండెపోటుతో మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం ఆ నర్సు బరాసత్‌లోని ఓప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందినట్లు పేర్కొన్నారు. అయితే  డిసెంబర్‌లో నిఫా వైరస్‌ బారిన పడిన మరో పేషెంట్ మాత్రం ప్రస్తుతం కోలుకుంటున్నారని డాక్టర్లు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement