షార్జా నుండి కరాచీ వెళ్తున్న కె2 ఎయిర్‌వేస్ (K2 Airways) కు చెందిన బోయింగ్ 737 కార్గో విమానం (KTA1732) అదృశ్యమైంది. అరేబియా సముద్రం మీదుగా ప్రయాణిస్తుండగా కరాచీ సమీపంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు కోల్పోయింది. ఈ విమానంలో ఐదుగురు సిబ్బంది ఉన్నారు. నావిగేషన్ వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తినట్లు పైలట్ సమాచారం ఇచ్చిన కొద్ది నిమిషాలకే ఈ ఘటన చోటుచేసుకుంది. ఇది సముద్రంలో కూలిపోయి ఉండవచ్చని ఫ్లైట్‌రాడార్24 భావిస్తోంది. అయితే పాకిస్తాన్ అధికారులు దీనిని ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. ప్రస్తుతం పాకిస్తాన్ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ (PAA) తీర ప్రాంతంలో గాలింపు , రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరం చేసింది.
ఏమి జరిగింది?
పాకిస్థాన్ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ వెల్లడించిన వివరాల ప్రకారం పాకిస్తాన్ కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 9:18 గంటలకు విమానంలోని నావిగేషన్ సిస్టమ్‌లో సమస్య ఉన్నట్లు పైలట్ నివేదించారు. ఆ తర్వాత రాత్రి 9:21 గంటల సమయంలో విమానం ఒక్కసారిగా ఎత్తు కోల్పోతూ, వేగంగా దిశ మార్చుకున్నట్లు రాడార్‌లో కనిపించింది. కరాచీకి పశ్చిమంగా 155 నాటికల్ మైళ్ల దూరంలో విమానంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి.భయంకరమైన వేగంతో కిందకు పడిపోయింది.
ఇదీ చదవండి: కేతన్ హత్యకు నాలుగు నెలలముందే.. సీక్రెట్ మ్యారేజ్
ఫ్లైట్‌రాడార్24 (Flightradar24) డేటా ప్రకారం, విమానం నుండి చివరి సిగ్నల్ వచ్చేసరికి అది సముద్ర మట్టానికి కేవలం 1,100 అడుగుల ఎత్తులో ఉంది. అంతేకాదు, అది నిమిషానికి 22,400 అడుగుల అత్యంత వేగంతో కిందకు దూసుకుయింది. అదృశ్యమైన ఈ బోయింగ్ 737-400 విమానం 1999 నాటిది. మొదట ప్రయాణీకుల విమానంగా పనిచేసి, 2012లో కార్గో విమానంగా మారింది. 2024లోనే ఇది కె2 ఎయిర్‌వేస్ సంస్థలో చేరింది.
ఇదీ చదవండి: 42 ఏళ్ల నాటి అమ్మ దుప్పట్టా : కొత్త పెళ్లికూతురు అన్షులా ఎమోషనల్


