breaking news
Amit Shah
-
అమిత్‌షాపై మహువా సంచలన వ్యాఖ్యలు
సాక్షి,న్యూఢిల్లీ: కేంద్రహోంమంత్రి అమిత్‌షాపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా వివాదాస్పద వ్యాఖ్యాలు చేశారు. లక్షలాది మంది భారత్‌లో చొరబడుతున్నారు. మన భూమిని ఆక్రమించుకుంటున్నారు. భారత సరిహద్దులు రక్షించలేకపోతే, మహిళల గౌరవం దెబ్బతింటే, కేంద్ర హోం మంత్రి అమిత్ షా బాధ్యత వహించాల్సిందే. అందుకు అమిత్ షా తల నరికించి టేబుల్‌పై పెట్టాలి’ అని వ్యాఖ్యానించారు. ఆమె బంగ్లాదేశ్ నుండి అక్రమంగా భారత్‌లోకి చొరబడుతున్న వలసదారుల విషయంపై మాట్లాడుతుండగా చేశారు. Shameful and disgraceful!How can an elected MP like Mahua Moitra stoop so low as to use violent language against Shri Amit Shah ji?Such statements are not just an insult to democracy but also a dangerous encouragement of hatred and violence in public life.We strongly condemn… pic.twitter.com/X9XS5IA9zW— Lakshmi Singh (@LakshmiSinghBJP) August 29, 2025 -
‘ఏమాత్రం సిగ్గున్నా క్షమాపణలు చెప్పాల్సిందే’
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బిహార్‌లో చేపట్టిన ఓటర్ అధికార్ యాత్రలో కొందరు ప్రధాని మోదీ (PM Modi), మోదీ తల్లి హీరాబెన్ని దూషిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారని బీజేపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఓ వ్యక్తిని అరెస్ట్ కూడా చేశారు. ఈ పరిణామంపై బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్రంగా స్పందించారు.నరేంద్రమోదీని, మోదీ తల్లిని దూషించిన ఘటనను అమిత్ షా తీవ్రంగా ఖండించారు. శుక్రవారం అసోం గువాహటి రాజ్‌భవన్‌లో బ్రహ్మపుత్రా వింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో షా మాట్లాడుతూ.. ‘‘రాహుల్ గాంధీకి ఏమాత్రం సిగ్గున్నా.. మోదీకి, ప్రాణాలతో లేని ఆయన తల్లికి, ఈ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని క్షమాపణలు చెప్పాలి’’అని డిమాండ్ చేశారు. ‘‘రెండు రోజుల కిందట జరిగిన ఘటన..ప్రతీ ఒక్కరినీ బాధించింది. మోదీ తల్లి ఒక పేద కుటుంబంలో విలువలతో బిడ్డలను పెంచింది. అలాంటి తల్లి జీవితాన్ని అవమానించడాన్ని భారతీయలెవరూ సహించలేరు. రాజకీయ జీవితంలో ఇంతకన్నా దిగజారుడు తనం ఇంకొటి లేదు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. రాహుల్ గాంధీకి ఏ కొంచెం సిగ్గు మిగిలి ఉన్నా క్షమాపణలు చెప్పాలి’’ అని అమిత్ షా డిమాండ్ చేశారు.బీహార్‌లో తన యాత్ర ద్వారా రాహుల్ గాంధీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ రాజకీయాలు అట్టడుగుస్థాయికి చేరాయి. ప్రతి కాంగ్రెస్ నాయకుడు మోదీపై అవమానకరమైన పదాలు ఉపయోగిస్తున్నారు. రాజకీయాల్లో ద్వేష సంస్కృతిని వ్యాప్తి చేస్తోంది కాంగ్రెస్సే. కాంగ్రెస్ ఎంత ఎక్కువ దూషణలు చేస్తే.. బీజేపీ అంత మంచిది.. అంత ఎక్కువగా గెలుస్తుంది కూడా’’ అని అమిత్ షా వ్యాఖ్యానించారు.బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాహుల్, ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ యాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రెండ్రోజుల కిందట దుర్భంగా పట్టణంలో నిర్వహించిన సభలో కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు మోదీ, ఆయన తల్లిని దూషిస్తూ వ్యాఖ్యలు చేశారని బీజేపీ ఆరోపించింది. దీనికి సంబంధించి ఆ పార్టీ నేతలు పట్నాలోని కొత్వాలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. ఈ ఘటనకు సంబంధించిన కొన్ని వీడియోలు పలు అనధికారిక ఖాతాల్లో అప్లోడ్ అయ్యాయి. అందులో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు మోదీని హిందీలో దూషిస్తున్నట్టుగా చూపుతున్న వీడియో క్లిప్పులు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఈ పరిణామంపై కాంగ్రెస్ ఇప్పటిదాకా స్పందించలేదు. -
కొత్త చట్టం అధికారపార్టీకి చుట్టమైతే?
నాగుపామును ఆడించే మంత్రగాడు అదే పాము కాటుకు గురయ్యాడని సామెత. మన రాజకీయ నేతలు చేసే కొన్ని విన్యాసాలు భవిష్యత్తులో వారికే తలనొప్పిగా మారతాయన్నది వారు విస్మరిస్తుంటారు. తాజాగా కేంద్రం తీసుకు వస్తున్న చట్టం కూడా అదే తరహాలో ఉందా అనిపిస్తోంది. వినడానికి మాత్రం ఇది బాగుందే అనిపించవచ్చు. కాని పరిశీలిస్తే ఇందులో ఏదో మతలబు ఉందన్న సంగతి అర్థమవుతుంది.ప్రధాని లేదా ముఖ్యమంత్రి, లేదా మంత్రులు ఎవరైనా ముప్పై రోజులు జైలులో ఉండవలసి వస్తే వారి పదవి ఆటోమాటిక్‌గా పోయే విధంగా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం చట్టం తీసుకువస్తోంది. ఈ చట్టాన్ని సడన్‌గా ఎందుకు తీసుకు వస్తున్నారన్న దానిపై రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. బీజేపీయేతర పక్షాలు ముఖ్యమంత్రులు, మంత్రులను పదవి నుంచి తప్పించి ప్రభుత్వాలను అస్థిర పరచడానికి ఇది ఒక ఆయుధం అవుతుందన్న సందేహాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు. తమ మిత్రపక్షాలలో ఎవరైనా తోక ఝాడిస్తున్నారన్న అనుమానం వచ్చినా వారిపై కూడా ఈ అస్త్రం ప్రయోగించవచ్చన్న అభిప్రాయాన్ని విపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి.ప్రత్యేకించి కేంద్రంలో పూర్తి మెజార్టీ లేని నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బీహారు ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌లను కట్టడి చేయడానికి కూడా దీన్ని వాడవచ్చని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ఈ బిల్లుపై టీడీపీ, జేడీ(యూ)లు కూడా మథన పడుతున్నట్లుగా కనిపిస్తుంది. ఈ చట్టాన్ని కేంద్రం చిత్తశుద్దితోనే చేస్తుంటే ఎవరికి అభ్యంతరం ఉండదు.కాని మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటీవలికాలంలో పెడదోరణులు ప్రబలిపోయాయి.తమ ప్రత్యర్దులను ఎలాగైనా అణచివేయాలని, తద్వారా శాశ్వతంగా తామే అధికారంలో ఉండాలన్న తాపత్రాయం మన నాయకులలో అధికంగా కనిపిస్తోంది. ప్రజాస్వామ్యయుతంగా ఎంతకాలం పాలనలో ఉన్నా ఫర్వాలేదు. అలా కాకుండా నియంతృత్వ ధోరణిలో వ్యవహరిస్తుండడమే ఇబ్బందిగా మారుతోంది. గతంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో న్యాయస్థానం ఒక తీర్పు ఇచ్చింది. ఎవరైనా ప్రజాప్రతినిధి రెండేళ్లు జైలు శిక్షకు గురైతే వెంటనే అతను పదవికి అనర్హుడవుతాయన్నది దాని సారాంశం. దానివల్ల అనర్థాలు రావచ్చని తలంచిన మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఆ తీర్పును రివర్స్ చేస్తూ ఒక ఆర్డినెన్స్ తీసుకు వచ్చింది.కానీ అప్పట్లో రాహుల్ గాంధీ అవగాహనా రాహిత్యంతో ఆ ఆర్డినెన్స్ కాపీని బహిరంగంగానే చించివేశారు. ఒక రకంగా ఇది తన ప్రభుత్వాన్ని తానే అవమానించుకున్నట్లు కాదా! పైగా ఆనాటి ప్రదాని మన్మోహన్ సింగ్ పై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. అలాంటి వ్యక్తి నేతృత్వంలో వచ్చిన ఆ ఆర్డినెన్స్ పూర్వాపరాలు ఆలోచించకుండా అనుచితంగా ప్రవర్తించడంతో ఆ తీర్పు అమలులోనే ఉంది. దాని ఫలితంగా కొందరు తమ పదవులు కోల్పోయారు. ఉదాహరణకు లాలూ ప్రసాద్ యాదవ్‌కు శిక్ష పడడంతో రాజ్యసభ సభ పదవి పోయింది. ఆ తర్వాత కాలంలో రాహుల్ గాంధీనే ఒక కేసులో రెండేళ్లకు పైగా శిక్షకు గురి కావడం, ఆ తర్వాత ఆయన లోక్‌సభ సభ్యత్వం రద్దు కావడం జరిగిపోయింది. తదుపరి ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లి పునరుద్దరించుకోగలిగారు. అది వేరే సంగతి.రాహుల్ ఈ ఉదంతంలో తాను చేసిన తప్పుకు తానే బలైనట్లే కదా! ఇప్పుడు బీజేపీ కూడా అదే తరహా ప్రయోగం చేస్తోందా? ఒకవేళ వేరే ప్రభుత్వం కేంద్రంలో వస్తే ,అప్పుడు ఇదే చట్టం బీజేపీ ప్రభుత్వాల మెడకు కూడా చుట్టుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎవరు అధికారంలో ఉంటే వారు సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారన్నది వాస్తవం. ప్రధాని నరేంద్ర మోడీ ఒక సభలో మాట్లాడుతూ నేరగాళ్లు జైలు నుంచి పరిపాలించాలా? అని ప్రశ్నించారు. కొంతకాలం క్రితం ఢిల్లీలో లిక్కర్ స్కామ్ అంంటూ హడావుడి చేసి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను, కొందరు మంత్రులను అరెస్టు చేశారు. డిల్లీలో పోలీస్ వ్యవస్థ కేంద్రం చేతిలోనే ఉంటుందన్న సంగతి తెలిసిందే.కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేయకుండా జైలులో ఉంటూనే ప్రభుత్వ విషయాలపై ఆదేశాలు ఇస్తుండేవారు. అలాగే తమిళనాడుకు చెందిన ఒక మంత్రిని ఈడి అరెస్టు చేసింది. ఆయన కూడా పదవికి రాజీనామా చేయకుండా కేబినెట్లో కొనసాగారు. ఈ రెండు రాష్ట్రాలు బీజేపీకి అనుకూలంగా లేనివి. ఢిల్లీలో ఎన్నికలకు ముందు ఎలాగైనా ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించాలన్న లక్ష్యంతో బీజేపీ నాయకత్వం లిక్కర్ స్కామ్ పేరుతో కేజ్రీవాల్ ను జైలులో పెట్టిందని అప్పట్లో ప్రతిపక్షం తీవ్రంగా విమర్శించేది. ఇలా కొద్దిమందిని దృష్టిలో ఉంచుకుని ఈ చట్టం తెస్తుండడం కరెక్టేనా అన్న చర్చ ఉంది.నిజంగానే మోడీకి అవినీతి వ్యవహారాలపై చిత్తశుద్ది ఉంటే ఏపీలో టీడీపీతో పొత్తు ఎలా పెట్టుకున్నారన్న ప్రశ్న వస్తుంది. ఎందుకంటే మోడీని అవినీతిపరుడని, టెర్రరిస్టు అని.. ఇంకా చాలాచాలా మాటలు టీడీపీ అధినేత, 2019 ఎన్నికలకు ముందు కూడా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు విమర్శించేవారు. మోడీ స్వయంగా ఏపీలో ఎన్నికల ప్రచారంలో చంద్రబాబుపై పలు అవినీతి ఆరోపణలు చేశారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇస్తుంటే చంద్రబాబు దానిని తనకు ఏటీఎం గా మార్చుకున్నారని ఆరోపించారు. ఎన్నికలలో చంద్రబాబు ఓటమి తర్వాత ఆయన పీఎస్ ఇంటిలో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు జరపగా వివిధ కాంట్రాక్టు వ్యవహారాలలో రెండువేల కోట్ల అక్రమాలు జరిగాయని తేలినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అదే కాదు. స్కిల్ స్కామ్ లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా అవినీతికి పాల్పడ్డారని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అరెస్టు చేసింది.అప్పటికే కేంద్రానికి చెందిన ఈడీ అదే కేసులో పలువురిని అరెస్టు చేసింది. చంద్రబాబు వరకు కేసును ఈడీ తీసుకు రాలేదు.ఈలోగా టీడీపీతో మళ్లీ బీజేపీ జత కట్టింది. మరి ఇప్పుడు ఆ ఆరోపణలు సంగతేమిటి? అసలు ఆ కేసులలో నిజానిజాలు ఏమిటి? అన్యాయంగా చంద్రబాబు మీద ఆ ఆరోపణలు చేశారా?లేక వాస్తవం ఉందా? అన్నది ప్రజలకు తెలియనవసరం లేదా? తన ప్రభుత్వ ఓటమి తర్వాత చంద్రబాబు ఈ పరిణామాలను ఊహించే తెలివిగా బీజేపీ పెద్దలతో రాజీ చేసుకున్నారన్నది చాలా మంది భావన. ఆ తర్వాత బతిమలాడి బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారన్నది బహిరంగ రహస్యమే.ఇలాంటివాటి గురించి మోడీ జవాబు ఇచ్చే పరిస్థితి ఉందా? ఇప్పుడు కూడా బీజేపీయేతర పార్టీల ప్రభుత్వాలను ఇరుకున పెట్టడానికి, తమ మిత్రపక్షాలైన టీడీపీ, జేడీ(యూ)లను తమ అదుపులో ఉంచుకోవడానికి ఇలాంటి చట్టం తెస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ వ్యాఖ్యానించారు.దానికి తగినట్లుగానే టీడీపీ లోక్‌సభ పక్ష నేత లావు కృష్ణదేవరాయలు ఈ బిల్లును సమర్థిస్తూనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, లోపాలను సరిదిద్దాలని, జాయింట్ పార్లమెంటరీ కమిటీలో చర్చ జరుగుతుందని అన్నారు. అంటే ఈ బిల్లుపై వారు లోపల భయపడుతున్నట్లు తెలుస్తూనే ఉంది. జేడీ(యూ) నేత త్యాగి కూడా అదే తరహాలో స్పందించారు. కాంగ్రెస్ చేస్తున్న వ్యాఖ్యలలో నిజం ఉన్నా, లేకపోయినా, చంద్రబాబు విషయంలో బీజేపీ అనుసరించిన ద్వంద్వ విధానం సహజంగానే ఈ సందేహాలకు తావిస్తుంది.ఇండియా కూటమి లోనే అవినీతిపరులు ఉన్నట్లు తమ పక్షంలో ఎవరూ లేనట్లు మోడీ మాట్లాడినా జనం ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. బీజేపీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలలో అవినీతి ఆరోపణలు వచ్చినా ఎందరిపై కేసులు పెడుతున్నారు? దేశ ప్రధాని మీద కేసు పెట్టే పరిస్థితి ఉందా? అలాగే ముఖ్యమంత్రి మీద కూడా రాష్ట్ర స్థాయిలో కేసులు పెట్టడం తేలిక కాదు. కాకపోతే న్యాయ వ్యవస్థను అడ్డు పెట్టుకుని కేంద్రం లోని అధికార పార్టీ తమ వ్యతిరేక పార్టీల సీఎం లను ఇబ్బంది పెట్టే అవకాశం ఉండవచ్చు.మరో ఉదాహరణ చూద్దాం. దశాబ్దాల కిందట కేంద్రం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తెచ్చింది. అయినా దాని అమలు ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం. ఇదే మోడీ ప్రభుత్వం ఇందులో ద్వంద ప్రమాణాలు పాటించడం లేదా? సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ జేడీ(యూ) పార్టీకి దూరం అయ్యారు. ఆ క్రమంలో ఆయనపై అనర్హత వేటు వేయాలని నితీష్ కుమార్ నాయకత్వంలోని జేడీ(యూ) కోరింది.దానిని ఆఘమేఘాల మీద ఆమోదించి అనర్హత వేటు వేసేశారు. తమ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఉల్లంఘనలకు పాల్పడ్డారని, ఆయనను అనర్హుడిని చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ లోక్ సభ స్పీకర్ ను కోరింది. మొత్తం టర్మ్ పూర్తయ్యింది కాని, ఆ పిటిషన్‌ను తేల్చలేదు. ఇంకా పలు ఉదాహరణలు ఇలాంటివి ఉన్నాయి. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? 2014-19 మధ్యకాలంలో ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీ 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను లాక్కోవడమే కాకుండా, వారిలో నలుగురికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టింది. అయినా ఆనాటి స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఒక్కరిపై కూడా చర్య తీసుకోలేదు. ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పది మంది కాంగ్రెస్‌లోకి ఫిరాయించారు. వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ అటు శాసన వ్యవస్థలోను, ఇటు న్యాయ వ్యవస్థలోను పోరాడుతోంది. ఇంతవరకు అదేమీ తేలలేదు. అలాగే అంతకుముందు టర్మ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పలువురు బీఆర్ఎస్లోకి ఫిరాయించారు. వారిపై అప్పటి స్పీకర్ చర్య తీసుకోలేదు.పైగా వారంతా బీఆర్ఎస్లో విలీనమైనట్లు ప్రకటించారు. కేంద్రంలోను, వివిధ రాష్ట్రాలలోను పరిస్థితులు ఇలాఉంటే ఇప్పుడు కేంద్రం తీసుకువస్తున్న ఈ కొత్త చట్టం ఎలాంటి దుష్పరిణామాలకు దారి తీస్తుందా అన్న భయం అందరిలో ఉంది.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
అనారోగ్య కారణాలతోనే ధనఖడ్ రాజీనామ చేశారు : అమిత్
-
ధన్‌ఖడ్ రాజీనామాపై అమిత్ షా స్పందన.. రాజ్యాంగ సవరణపై ఇలా..
ఢిల్లీ: మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా అంశం, 130వ రాజ్యాంగ సవరణ బిల్లు సహా పలు అంశాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత అనారోగ్య సమస్యల కారణంగానే ధన్‌ఖడ్ రాజీనామా చేశారని చెప్పుకొచ్చారు. అలాగే, రాజ్యాంగ సవరణ బిల్లును ఉద్దేశించి.. ప్రధానమంత్రి అయినా జైలు నుంచే పరిపాలన చేయడం మంచి విషయమేనా? అని ప్రశ్నించారు.ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ‘ఏఎన్ఐ’కి అమిత్ షా ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ రాజ్యాంగ పదవిలో కొనసాగారు. ఆయన పదవీకాలంలో ఎన్నో మంచి పనులు చేశారు. వ్యక్తిగత అనారోగ్య సమస్యల కారణంగా ఇప్పుడు రాజీనామా చేశారు. ఈ విషయాన్ని మరీ ఎక్కువగా లాగొద్దు. కేవలం ప్రతిపక్షాల ఆరోపణల ఆధారంగా దీనిపై ఓ అంచనాకు రావడం సరికాదు’ అంటూ క్లారిటీ ఇచ్చారు. అనంతరం, ఉపరాష్ట్రపతి ఎన్నికపై మాట్లాడుతూ.. రాష్ట్రపతిని తూర్పు భారతం నుంచి ఎన్నుకున్నాం. ఇప్పుడు ఉపరాష్ట్రపతి దక్షిణాది నుంచి ఉండాలని అనుకున్నాం. దీనికి, తమిళనాడు ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదు అని అన్నారు.#WATCH | On opposition raising questions about the resignation of former VP Jagdeep Dhankhar, Union HM Amit Shah says, "...'Baat ka batangad nahi banana chahiye' (don't make a fuss about it). Dhankhar ji was on a constitutional post and during his tenure, he did good work… pic.twitter.com/jJGRMogynf— ANI (@ANI) August 25, 2025ఇదే సమయంలో 130వ రాజ్యాంగ సవరణపై మాట్లాడుతూ.. ప్రధానమంత్రి అయినా జైలు నుంచే పరిపాలన చేయడం మంచి విషయమేనా?. మన ప్రజాస్వామ్యానికి అది మర్యాదపూర్వకంగా ఉంటుందా? అంటూ విపక్షాలపై మండిపడ్డారు. జైలు నుంచే ప్రభుత్వాలను నడిపే పరిస్థితి మన దేశంలో రాకూడదు. ప్రధాని గానీ, ముఖ్యమంత్రి లేదా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న ఏ నేత అయినా సరే.. ఏదైనా కేసులో అరెస్టయితే 30 రోజుల్లో బెయిల్ పొందాలి. లేదంటే తమ తమ పదవులకు రాజీనామా చేయాలి. అలా చేయకపోతే.. చట్టమే వారిని తప్పించేలా 130వ రాజ్యాంగ సవరణను తీసుకొస్తున్నాం. చట్టమేదైనా ప్రభుత్వం, ప్రతిపక్షానికి ఒకేలా అమలవుతుంది. ఈ నిబంధన ప్రధాని పదవికి కూడా వర్తించేలా స్వయంగా మోదీనే దీన్ని సవరణలో చేర్చారు. ఆయనకు కూడా ఇది వర్తిస్తుంది. ప్రధాని జైలుకెళ్తే ఆయనైనా రాజీనామా చేయాల్సిందే. ఎన్నికైన ప్రభుత్వం రాజ్యాంగ సవరణను తీసుకొస్తే దానిపై అభ్యంతరాలు లేవనెత్తే హక్కు అందరికీ ఉంటుంది. అంతేగానీ, పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు కూడా అవకాశం లేకుండా ఆందోళనలు చేస్తే ఎలా?. బిల్లు కచ్చితంగా పార్లమెంట్లో ఆమోదం పొందుతుంది అని వ్యాఖ్యలు చేశారు. -
అమిత్ షా వ్యాఖ్యలు కరెక్ట్ కాదు.. రిటైర్డ్ న్యాయమూర్తుల బృందం సీరియస్
ఢిల్లీ: ప్రతిపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి అయిన మాజీ జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను రిటైర్డ్ న్యాయమూర్తుల బృందం ఖండించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు సహా 18 మంది రిటైర్డ్ న్యాయమూర్తుల బృందం బహిరంగంగా ఓ ప్రకటన విడుదల చేసింది.ఈ సందర్బంగా 18 మంది రిటైర్డ్ న్యాయమూర్తుల బృందం.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు దురదృష్టకరం. సుప్రీంకోర్టు తీర్పును పక్షపాతంతో తప్పుగా అర్థం మాట్లాడటం సరైంది కాదు. ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు ఇటువంటి ప్రకటనలు చేయడం న్యాయ స్వాతంత్ర్యంపై ప్రభావం చూపుతాయి. కోర్టు తీర్పు స్పష్టంగా లేదా పరోక్షంగా నక్సలిజానికి మద్దతు ఇవ్వలేదని చెప్పింది. ముఖ్యంగా ఉపరాష్ట్రపతి వంటి రాజ్యాంగ పదవుల కోసం జరిగే ప్రచారాల సమయంలో, సైద్ధాంతిక చర్చలలో, రాజకీయ నాయకులు అవమానాలు చేయకుండా గౌరవాన్ని కాపాడుకోవాలి అని కోరారు. ఈ మేరకు ఉమ్మడి ప్రకటనపై వారంతా సంతకాలు చేశారు.BIG MONDAY MORNING DEVELOPMENT :Seven former Supreme Court judges, three former High Court chief justices and eight former High Court judges issue a public statement criticising Home Minister Amit Shah for misinterpreting Supreme Court's 2011 Salwa Judum judgement and…— Nagendar Sharma (@sharmanagendar) August 25, 2025న్యాయమూర్తుల బృందంలో ఉన్నది వీరే.. మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు.. కురియన్ జోసెఫ్, మదన్ బీ లోకూర్, జె.చలమేశ్వర్, ఏకే పట్నాయక్, అభయ్ ఓకా, గోపాల గౌడ, విక్రమ్‌జిత్ సేన్ ఉన్నారు. మాజీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు.. గోవింద్ మాథుర్, ఎస్. మురళీధర్, సంజీబ్ బెనర్జీ ఉండగా.. సంజయ్ హెగ్డే, ప్రొఫెసర్ మోహన్ గోపాల్ వంటి ఇతర సీనియర్ న్యాయవాదులు కూడా ఉన్నారు.అమిత్ షా విమర్శలకు స్పందన.. ఇక, అంతకుముందు.. సాయుధ సల్వాజుడుం వ్యవస్థను సుప్రీంకోర్టు వ్యతిరేకించడం వల్లే నక్సలిజం ఇంకా ఉనికిలో ఉందని, దీనికి పరోక్షంగా సుదర్శన్‌రెడ్డి కారణమని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా అమిత్ షా వ్యాఖ్యలను విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్‌రెడ్డి విభేదించారు. అనంతరం, ఆయన స్పందిస్తూ.. సిద్ధాంతాలకు అతీతంగా ప్రజలందరి ప్రాణాలు, ఆస్తులు కాపాడే హోం మంత్రి అమిత్ షాతో నేరుగా వాగ్వాదం పెట్టుకోదల్చుకోలేదు. 2011 డిసెంబర్లో సల్వాజుడుంను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వగా ఆ తీర్పు కాపీని నేనే రాశాను. కానీ ఆ అభిప్రాయం నాది కాదు. అది సుప్రీంకోర్టు అభిప్రాయం. తీర్పు పూర్తిపాఠం అమిత్ షా చదవి ఉండకపోవచ్చు. అందుకే ఆయన నన్ను విమర్శిస్తున్నారు. 40 పేజీల ఆ తీర్పు మొత్తాన్నీ చదివితే సుప్రీంకోర్టు తీర్పు సారాంశం ఆయనకు ఖచ్చితంగా అవగతమవుతుంది. ఇంతకు మించి నేనేమీ చెప్పదల్చుకోలేదు. ఇంతటితో ఈ అంశంపై చర్చ ముగిస్తే బాగుంటుంది’’అని వ్యాఖ్యానించారు.నక్సలిజాన్ని అంతంచేయాలనే ఏకైక లక్ష్యంతో ఆనాటి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం గిరిజన యువతకు తుపాకులిచ్చి సల్వా జుడుం(కోయ కమెండోలు) పేరితో సాయుధ వ్యవస్థను అమలుచేయగా, ఇది చట్టవిరుద్ధమని ఈ సాయుధ పౌర మిలటరీ వ్యవస్థను వెంటనే నిర్విర్యంచేయాలని సుప్రీంకోర్టు ఆనాడు చరిత్రాత్మక తీర్పు చెప్పింది. ఈ ధర్మాసనంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉన్నారు. దీంతో నక్సలిజం పట్ల సుదర్శన్ రెడ్డికి సానుభూతి ఉందని, అందుకే అలా తీర్పిచ్చారని అమిత్ షా శుక్రవారం ఆరోపించడం తెలిసిందే. -
అర్థవంతమైన చర్చలు లేకుంటే... సభలు జీవచ్ఛవాలే!: అమిత్ షా
సాక్షి, న్యూఢిల్లీ: చట్టసభల్లో ప్రజా సమస్యలపై అర్థవంతమైన చర్చలు జరగాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆకాంక్షించారు. ‘‘సభల్లో అలజడి సృష్టించడం ప్రతిపక్షాలకు పరిపాటిగా మారింది. ఇది మంచి పరిణామం కాదు. సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం పార్లమెంటు, అసెంబ్లీ కార్యకలాపాలను అడ్డుకోవడం సరికాదు’’ అన్నారు. సభాపతులు తమ పనితీరుతో ఆ పదవి ఔన్నత్యం పెంచాలని పిలుపునిచ్చారు. ‘‘ప్రజా సమస్యలపై చర్చకు నిష్పాక్షిక వేదికగా సభలను తీర్చిదిద్దాల్సిన, వాటిలో పక్షపాతానికి తావులేకుండా చూసుకోవాల్సిన బాధ్యత వారిదే. లేదంటే సభలు జీవచ్ఛవాలతో సమానమే’’ అన్నారు. అఖిల భారత స్పీకర్ల సదస్సును ఆదివారం ఢిల్లీ అసెంబ్లీలో ఆయన ప్రారంభించారు. స్పీకర్లు, శాసన మండళ్ల చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్లను ఉద్దేశించి ప్రసంగించారు. సభల్లో అర్థవంతమైన సంవాదాలు జరగకపోతే దేశానికి తీరని నష్టమన్నారు. ‘‘చర్చలకు ఉద్దేశపూర్వకంగా అంతరాయం కలిగించడం సహించరానిది. విపక్షాలు సంయమనం పా టించాలి. కార్యకలాపా లు సజావుగా సాగేలా సహకరించాలి’’ అని సూచించారు. ద్రౌపదికి జరిగిన అవమానం నిండుసభలో ద్రౌపదికి జరిగిన అవమానం ఎన్నో విపరిణామాలకు దారితీసిందని అమిత్ షా గుర్తుచేశారు. ‘‘సభా గౌరవం దిగజారితే దేశంలో కూడా అలాంటి దుష్పరిణామాలు తప్పవు. స్పీకర్ సారథ్యంలో జరిగే చర్చలతో దేశానికి ఎనలేని మేలు జరుగుతుంది. చట్టసభల భవనాలు జీవం పోసుకుంటాయి. స్పీకర్ అంటే సంరక్షకుడు, సేవకుడు. సమస్యల పరిష్కారానికి మేధోమథనమే ఉత్తమ మార్గం. ‘‘ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్‌భాయి సోదరుడు, స్వాతంత్య్ర యోధుడు విఠల్‌భాయి పటేల్ వందేళ్ల క్రితం సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. మన దేశంలో శాసనసభ చరిత్ర అప్పుడే మొదలైంది. అలాంటి విఠల్‌భాయి చరిత్ర ఇన్నాళ్లూ మరుగున పడింది’’ అని ఆవేదన వెలిబు చ్చారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ తదితరులు సదస్సులో మాట్లాడారు. -
ఆ తీర్పు నా ఒక్కడిది కాదు
న్యూఢిల్లీ: సాయుధ సల్వాజుడుం వ్యవస్థను సుప్రీంకోర్టు వ్యతిరేకించడం వల్లే నక్సలిజం ఇంకా ఉనికిలో ఉందని, దీనికి పరోక్షంగా సుదర్శన్‌రెడ్డి కారణమని కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌షా చేసిన విమర్శలపై విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్‌రెడ్డి విభేదించారు. శనివారం పీటీఐకిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు అంశాలపై సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి మాట్లాడారు. ‘‘సిద్ధాంతాలకు అతీతంగా ప్రజలందరి ప్రాణాలు, ఆస్తులు కాపాడే హోం మంత్రి అమిత్ షాతో నేరుగా వాగ్వాదం పెట్టుకోదల్చుకోలేదు. 2011 డిసెంబర్లో సల్వాజుడుంను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వగా ఆ తీర్పు కాపీని నేనే రాశాను. కానీ ఆ అభిప్రాయం నాది కాదు. అది సుప్రీంకోర్టు అభిప్రాయం. తీర్పు పూర్తిపాఠం అమిత్ షా చదవి ఉండకపోవచ్చు. అందుకే ఆయన నన్ను విమర్శిస్తున్నారు. 40 పేజీల ఆ తీర్పు మొత్తాన్నీ చదివితే సుప్రీంకోర్టు తీర్పు సారాంశం ఆయనకు ఖచ్చితంగా అవగతమవుతుంది. ఇంతకు మించి నేనేమీ చెప్పదల్చుకోలేదు. ఇంతటితో ఈ అంశంపై చర్చ ముగిస్తే బాగుంటుంది’’అని సుదర్శన్ రెడ్డి వ్యాఖ్యానించారు. నక్సలిజాన్ని అంతంచేయాలనే ఏకైక లక్ష్యంతో ఆనాటి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం గిరిజన యువతకు తుపాకులిచ్చి సల్వా జుడుం(కోయ కమెండోలు) పేరితో సాయుధ వ్యవస్థను అమలుచేయగా, ఇది చట్టవిరుద్ధమని ఈ సాయుధ పౌర మిలటరీ వ్యవస్థను వెంటనే నిర్విర్యంచేయాలని సుప్రీంకోర్టు ఆనాడు చరిత్రాత్మక తీర్పు చెప్పింది. ఈ ధర్మాసనంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉన్నారు. దీంతో నక్సలిజం పట్ల సుదర్శన్ రెడ్డికి సానుభూతి ఉందని, అందుకే అలా తీర్పిచ్చారని అమిత్ షా శుక్రవారం ఆరోపించడం తెల్సిందే. ప్రజాస్వామ్యంలో లోటు ‘‘రాజ్యాంగం సవాళ్లను ఎదుర్కొంటోంది. సవాళ్లతో సతమతమవుతున్న ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తా. పార్లమెంట్లో సభ్యుల నిరసన కారణంగా సభా కార్యకలాపాలకు తరచూ అంతరాయం కలగడం సహజం. నిరసన అనేది అత్యావశ్యకం. కానీ అదే పనిగా నిరసన తెలపడం అనేది సమస్యాత్మకంగా మారుతుంది. గతంలో వాణిజ్యలోటు గురించి జనం మాట్లాడుకునేవాళ్లు. ఇప్పుడు మన ప్రజాస్వామ్యంలో సైతం లోటు కన్పిస్తోంది. మొదట్నుంచీ భారత్ రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యంగా పరిఢవిల్లినప్పటికీ నేడు కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇలాంటి సందర్భాల్లో రాజ్యాంగంపై దాడి అనే అంశంపై ఖచ్చితంగా చర్చించాల్సిందే. ప్రజాస్వామ్యం అంటే వ్యక్తుల మధ్య పోటీ కాదు. సిద్ధాంతాల మధ్య పోటీ మాత్రమే. ఎప్పుడైనా సరే ప్రభుత్వం, విపక్షం మధ్య సఖ్యత చెడిపోకూడదు. జాతి ప్రయోజనాల దృష్ట్యా అది చాలా ముఖ్యం. విపక్షాలు ఏకగ్రీవంగా ఉపరాష్ట్రపతి అభ్యరి్థని ఎన్నుకోవడం నిజంగా నాకు దక్కిన గొప్ప గౌరవం. నా ఎంపిక అనేది మూడు అంశాలను స్పష్టంచేస్తుంది. ఒకటి వైవిధ్యం. విపక్షంలోని వివిధ పారీ్టలు నన్ను ఎన్నుకున్నాయి. రెండో ఏకగ్రీవ ఎన్నిక. ఇక మూడోది దీటైన ఓటింగ్ సామర్థ్యం. ఒకరంగా విశ్లేషిస్తే దేశ జనాభాలో దాదాపు 63 శాతం జనాభాకు ఈ పారీ్టలు ప్రాతినిధ్యంవహిస్తున్నాయి. ఇంతకుమించిన గౌరవం ఏముంటుంది’’అని ఆయన సంతృప్తి వ్యక్తంచేశారు. ‘‘ఉపరాష్ట్రపతి పదవికి దేశంలో ఎలాంటి పోటీ లేకుండా ఎకగ్రీవంగా ఎన్నిక పూర్తవ్వాలి. కానీ రాజకీయాల్లో విబేధాలు సహజం. అందుకే అధికార, విపక్షాల మధ్య ఇలా పోటీ అనివార్యమైంది’’అని అన్నారు. ‘‘కులగణనకు మద్దతిస్తా. ఎందుకంటే ఎవరైతే వెనుకబడ్డారో, అభ్యున్నతికి నోచుకోలేదో వాళ్లను గుర్తించి ఎదిగేందుకు సాయపడాలంటే కులగణన చేయాల్సిందే’’అని ఆయన వ్యాఖ్యానించారు. -
ఆయన నక్సలైట్ల మద్దతుదారుడు
కొచ్చి/తిరునల్వేలి: నక్సలైట్లకు గట్టి మద్దతుదారుడైన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డిని విపక్ష ‘ఇండియా’ కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసుకుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తప్పుపట్టారు. ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్లపై పోరాటానికి గిరిజన యువకులతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘సల్వాజుడుం’ చట్టవ్యతిరేకం, రాజ్యాంగ విరుద్ధం అంటూ 2011లో జస్టిస్ సుదర్శన్‌రెడ్డి తీర్పు ఇచ్చారని గుర్తుచేశారు. శుక్రవారం కేరళలో ఓ కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడారు. నక్సలైట్ల ఉద్యమానికి మద్దతు ఇవ్వడానికి సుప్రీంకోర్టును జస్టిస్ సుదర్శన్‌రెడ్డి వాడుకున్నారని ఆరోపించారు. ఆయన ఆ తీర్పు ఇవ్వకుంటే, సల్వాజుడుం అమల్లో ఉంటే నక్సలైట్ల ఉద్యమం 2020 నాటికే అంతమయ్యేదని అన్నారు. నక్సలైట్ల సిద్ధాంతంతో స్ఫూర్తి పొందిన జస్టిస్ సుదర్శన్‌రెడ్డి సల్వాజుడుంకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారని మండిపడ్డారు. వామపక్షాల ఒత్తిడి మేరకే కాంగ్రెస్ పార్టీ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డిని ఎంపిక చేసుకుందని ధ్వజమెత్తారు. కేజ్రీవాల్ రాజీనామా చేసి ఉంటే... ఢిల్లీ మద్యం కుంభకోణంలో అప్పటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైల్లో ఉండగానే పదవికి రాజీనామా చేసి ఉంటే.. రాజ్యాంగ(130 సవరణ) బిల్లు–2025ను తీసుకురావాల్సిన అవసరం ఉండేది కాదని అమిత్ షా అన్నారు. 30 రోజులపాటు జైల్లో ఉన్న వారిని పదవుల నుంచి తొలగించే బిల్లును ప్రతిపక్షాలు వ్యతిరేకించడం సరైంది కాదని పేర్కొన్నారు. రాజ్యాంగ విలువలను అన్ని రాజకీయ పారీ్టలూ పాటించాలని సూచించారు. ఏ ముఖ్యమంత్రి అయినా జైలులో ఉండి ప్రభుత్వాన్ని నడపాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారా? అని ప్రశ్నించారు. జైల్లో ఉంటూ కూడా పరిపాలన సాగిస్తారని మన రాజ్యాంగ రూపకర్తలు ఊహించలేదని, అందుకే ఈ అంశాన్ని రాజ్యాంగంలోని చేర్చలేదని స్పష్టంచేశారు. జైల్లో ఉన్న నేతలను పదవుల నుంచి తొలగించడంలో తప్పేమీ లేదన్నారు. సోనియా, స్టాలిన్ కలలు నెరవేరవు రాజ్యాంగ(130 సవరణ) బిల్లును ‘నల్ల బిల్లు’ అనే హక్కు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు లేదని అమిత్ షా తేల్చిచెప్పారు. శుక్రవారం తమిళనాడులోని తిరునల్వేలిలో బీజేపీ బూత్ కమిటీల సమావేశంలో ప్రసంగించారు. చీకటి పనులు చేసిన చరిత్ర స్టాలిన్‌కు ఉందన్నారు. డీఎంకే ప్రభుత్వం దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వమని ఆరోపించారు. స్టాలిన్ పాలనలో ఎన్నో కుంభకోణాలు జరిగాయని విమర్శించారు. కుమారుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకోవడం సోనియా గాంధీ ఎజెండా, కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ను ముఖ్యమంత్రిని చేసుకోవడం స్టాలిన్ ఎజెండా అని దుయ్యబట్టారు. వారి కలలు నెరవేరే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. 2026లో తమిళనాడులో ఎన్డీయే అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడుకు చెందిన అబ్దుల్ కలాంను అప్పట్లో రాష్ట్రపతిని చేసింది, నేడు అదే తమిళనాడు బిడ్డ సీపీ రాధాకృష్ణన్‌ను ఉపరాష్ట్రపతి పదవికి ఎంపిక చేసింది ఎన్డీయే ప్రభుత్వమేనని వ్యాఖ్యానించారు. -
‘ఆనాడు కేజ్రీవాల్ రాజీనామా చేసుంటే.. ఈ బిల్లు వచ్చేది కాదు’
న్యూఢిల్లీ: రాజకీయ నాయకులు తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటూ వరుసగా నెల రోజులు జైల్లో ఉంటే వారు తమ పదవులకు రాజీనామా చేయాల్సిందేనని బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. బిల్లును విపక్షాలు వివాదాస్పద బిల్లు అని అంటుంటే, కేంద్రం మాత్రం దాన్ని సమర్ధించుకుంటుంది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పైబడినా ఈ తరహా బిల్లును ఎవరూ తీసుకురాలేదని, దీన్ని తీసుకొచ్చినందుకు ఎన్డీఏ ప్రభుత్వం గర్విస్తుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. బిల్లులకు చట్ట సవరణలు చేయాలా? వద్దా? అని అమిత్ షా ప్రశ్నించారు. ఈ బిల్లుకు చట్ట సవరణ వద్దు అని విపక్షాలు పట్టుబట్టినా దాన్ని తాము ముందుకు తీసుకెళ్లామన్నారాయన. పీఎం నుంచి సీఎం, మంత్రులు ఇలా వెవరైనా తీవ్ర నేరాలకు పాల్పడి ఆ అభియోగాలపై 30 రోజుల పాటు జైల్లో ఉంటే రాజీనామా చేయాలనే బిల్లును తీసుకొస్తే తప్పేముందని ఓ ఇంటర్వ్యూలో అమిత్ షా ప్రశ్నించారు. ఇది ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కారణంగానే తీసుకొచ్చిన బిల్లు అనే చర్చకు కూడా ఆయన పుల్‌స్టాప్ పెట్టారు. లిక్కర్ కేసులో జైలు పాలైన అరవింద్ కేజ్రీవాల్ అప్పుడే రాజీనామా చేసి ఉంటే ఈ బిల్లు వచ్చి ఉండేది కాదేమో అని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పుకొచ్చారు అమిత్ షా. ఎక్కడైనా నైతికత అనేది చాలా ముఖ్యమైనదని, దాన్ని తుంగలో తొక్కి మళ్లీ పదవులు అలంకరిస్తామంటే కుదరదన్నారు. తీహార్ జైలు నుంచే కేజ్రీవాల్ పరిపాలన సాగించిన విషయాన్ని అమిత్ షా ఉదహరించారు. ప్రజాస్వామ్యంలో నైతికతకు ప్రతీ ఒక్క రాజకీయ పార్టీ బాధ్యత తీసుకోవాలనేది తమ విధానమన్నారు. ఈ క్రమంలోనే బిల్లును సవరించామన్నారు. ‘ఈ దేశంలోని ప్రజలు.. ఏ రాష్ట్ర సీఎం అయినా జైల్లో ఉండి పరిపాలించాలని కోరుకుంటారా?, ఇదేంటో అర్థం కావడం లేదు. ఇక్కడ ఎవరి వైపు నుంచి చూసినా నైతికత అనేదే ముఖ్యం’ అని కేరళలోని మనోరమా న్యూస్ కాంక్లేవ్‌లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. People of the nation have to decide whether they want a PM, CM, or minister to run government from jail. pic.twitter.com/a8yiTYXM5T— Amit Shah (@AmitShah) August 22, 2025 కాగా, గతేడాది ఢిల్లీ సీఎంగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ మద్యం పాలసీ కేసులో జైలు శిక్షను అనుభవించారు. జైలు నుంచి పరిపాలన కొనసాగించారు. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఎన్నికల్లో ఓటమి సంగతి అటుంచితే.. లిక్కర్ కేసులో అరెస్టయిన కేజ్రీవాల్ రాజీనామా చేయలేదు. -
సమాఖ్య వ్యవస్థకు తూట్లు!
రాజకీయ అవినీతిని అంతం చేయటానికి, దేశంలో రాజ్యాంగ నైతికతను నెలకొల్పటానికి అని చెబుతూ లోక్‌సభలో బుధవారం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 130వ రాజ్యాంగ సవరణ బిల్లు, అందుకు సంబంధించిన మరో రెండు బిల్లులపై దేశవ్యాప్తంగా సకారణంగానే నిరసనలు వ్యక్త మవుతున్నాయి. లోక్‌సభలో అయితే తీవ్ర వాగ్వివాదాలు, పరస్పర ఆరోపణలు వెల్లువెత్తాయి. బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తొలి వరస నుంచి మూడో వరసకు వెళ్లి ప్రసంగించాల్సి వచ్చిందంటే... ఆయనకు రక్షణ వలయంగా పార్లమెంటరీ భద్రత సేవలో ఉండే 12 మంది గార్డులు మోహరించాల్సి వచ్చిందంటే... బిల్లు ప్రతులు చించి పడేశారంటే... సభలో ఆగ్రహావేశాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రధాని మొదలుకొని ముఖ్యమంత్రులూ, మంత్రులూ అవినీతి ఆరోపణలపై అరెస్టయి, 30 రోజుల్లోగా బెయిల్‌పై విడుదల కాని పక్షంలో వెనువెంటనే పదవుల నుంచి తప్పించేందుకు ఉద్దేశించామని చెబుతున్న ఈ బిల్లులు చట్టాలైతే ప్రకటిత లక్ష్యాలను నిజంగా నెరవేరుస్తాయా అన్నది ప్రశ్నార్థకం. ఏ వ్యవస్థలోనైనా నేర న్యాయచట్టాలు పాలకుల అధికారాన్నీ, వారి రాజకీయ స్వప్రయోజనాలనూ ప్రతిఫలించినంతగా... న్యాయాన్ని ప్రతిబింబించవు. ఆచరణ సంగతి చెప్పనవసరమే లేదు. ఎక్కడి దాకానో ఎందుకు, ఆంధ్రప్రదేశ్‌లో తమ ఎన్డీయే కూటమి పాలన ప్రత్యర్థుల్ని వెంటాడి వేటాడి వేధిస్తున్న వైనం, తప్పుడు కేసులు బనాయిస్తున్న తీరు తెలియదా? కేవలం నిందగా, రుజువుకాని నేరంగా, ఒక ఆరోపణగా మాత్రమే ఉన్న దశలో బెయిల్ రాలేదన్న కారణంగా పదవులకు అనర్హులవుతారని చెప్పడం అంటే ప్రజల దృష్టిలో వారిని శాశ్వతంగా నేరం చేసిన వారుగా ముద్ర వేయటమే అవుతుంది. నేరం చేశారో లేదో తేలకుండా, శిక్షేమీ పడకుండా... విచారణ ప్రక్రియ దానికదే శిక్షగా మారటం మన దేశంలో కళ్లముందు కనబడుతున్న సత్యం. ఈ విషయంలో సీబీఐ, ఈడీ సంస్థలు అనేకసార్లు న్యాయస్థానాలతో చీవాట్లు తింటున్న వైనం తెలియంది కాదు. అలాంటపుడు ఈ సవరణ ద్వారా రాజ్యాంగాన్నే ఆయుధంగా మార్చాలని చూడటం ఎవరి ప్రయోజనాల కోసం?ఈ బిల్లులు కొందరంటున్నట్టు త్వరలో జరగబోయే బిహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇప్పుడున్న ‘వోట్ చోరీ’ నినాదాన్ని వెనక్కినెట్టి ‘అవినీతి నిర్మూలన’ ఎజెండాను అగ్రభాగాన నిలబెట్టి తాము మాత్రమే సచ్ఛీలురమనీ, ప్రత్యర్థులంతా అవినీతిపరులనీ ముద్రేయటానికా? నిజమే కావొచ్చు. ఆ మాటెలావున్నా ఇది దేశ ఫెడరల్ వ్యవస్థ అమరికను తీవ్రంగా దెబ్బ తీస్తుంది. రాష్ట్రాల్లో ఎన్డీఏ యేతర పక్షాల ప్రభుత్వాలను ఎన్నికల ముందు పడగొట్టడానికి ఈ చట్టాలను ఎడాపెడా దుర్వినియోగం చేసే వీలుంది. న్యాయసమీక్షకు అవకాశం ఉందనేది అర్థరహిత తర్కం. పెండింగ్ కేసులతో సతమతమవుతున్న న్యాయస్థానాల్లో కేసుల విచారణ పూర్తికావటానికి ఎంత సమయం పడుతున్నదో అందరికీ తెలుసు. సారాంశంలో నేరం రుజువయ్యేవరకూ ప్రతి ఒక్కరినీ నిర్దోషిగా పరిగణించాలన్న న్యాయశాస్త్ర సిద్ధాంతానికి ఇది తూట్లు పొడుస్తోంది.అవినీతి ప్రక్షాళనకు తొలి అడుగు వేయదల్చుకుంటే ముందు సీబీఐ, ఈడీ వంటి సంస్థలకు స్వతంత్ర ప్రతిపత్తినీయాలి. ఆ సంస్థల విశ్వసనీయతను పెంచాలి. అందుకోసం ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం చేసిందేమిటి? యూపీఏ హయాంలో సీబీఐకి ‘కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ అనే ముద్రపడింది. సాక్షాత్తూ సర్వోన్నత న్యాయస్థానమే ‘పంజరంలో చిలుక’గా సంస్థను అభివర్ణించింది. గత పదకొండేళ్ల పాలనలో ఈ అపప్రథను తొలగించటానికి తీసుకున్న చర్యలేమిటో ఎన్డీఏ చెప్పగలదా? మొన్న మే నెలలో తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్‌పై ఈడీ దాడి చేసిన కేసులో ఆ సంస్థ అన్ని హద్దుల్నీ ఉల్లంఘించిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ కటువుగా వ్యాఖ్యానించారు. నాలుగు నెలల క్రితం కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌధరి రాజ్యసభలో వెల్లడించిన గణాంకాలు దిగ్భ్రాంతిపరుస్తాయి. గత పదేళ్లలో ఈడీ 193 మంది రాజకీయ నాయకులపై కేసులు నమోదు చేయగా, వారిలో కేవలం ఇద్దరికి శిక్ష పడింది. ఆప్ సర్కారులో మంత్రిగా ఉండి అరెస్టయిన సత్యేంద్ర జైన్‌పై సీబీఐ నాలుగేళ్లు దర్యాప్తు జరిపి చివరకు అంతా సవ్యంగానే ఉన్నట్టు తేల్చి కేసును మూసేస్తున్నట్టు న్యాయస్థానానికి తెలిపింది. కానీ ఈలోగా ఆయన ఏడాదిన్నరపాటు జైల్లో మగ్గాల్సి వచ్చింది. అవినీతిని వ్యతిరేకించటమూ, ఈ బిల్లుల్ని సమర్థించటమూ ఒకటి కాదు. పార్లమెంటులో మూడింట రెండొంతుల మెజారిటీ లేకుండా ఈ బిల్లులు తీసుకురావటం గమనిస్తే ఇది కేవలం విపక్షాలను అవినీతిపరులుగా ముద్రేయటానికే అని అర్థమవుతుంది. పాలకులెవరైనా దుర్వినియోగానికి విస్తృతంగా అవకాశమున్న ఈ బిల్లుల్ని సంయుక్త పార్లమెంటరీ సంఘానికి (జేపీసీకి) పంపటం కాదు... పూర్తిగా వెనక్కి తీసుకోవాలి. -
నింద మాటున ప్రభుత్వాలు కూల్చేస్తారా?
న్యూఢిల్లీ: నేరం రుజువుకాకపోయినా కేవలం నిందారోపణలు ఉన్నాయన్న సాకుతో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన విపక్షపాలిత ప్రభుత్వాలను పడగొడతారా? అంటూ పార్లమెంట్ సాక్షిగా మోదీ ప్రభుత్వంపై విపక్ష పార్టీలు ముప్పేటదాడి చేశాయి. విపక్షపాలిత రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరిచే కుట్రతో ఈ మూడు బిల్లులను రూపొందించారని విపక్ష సభ్యులు లోక్‌సభలో ధ్వజమెత్తారు. బిల్లులను తక్షణం ఉపసంహరించుకోవాలని నినాదాలతో హోరెత్తించారు. అయితే బిల్లులను సమర్థిస్తూ అధికార పార్టీ సభ్యులు సైతం దీటుగా స్పందించడంతో లోక్‌సభలో ఒక్కసారిగా మాటల మంటలు రాజుకున్నాయి. అధికార, విపక్ష సభ్యుల వాగ్వాదం మధ్య వివాదాస్పద మూడు బిల్లులను ప్రభుత్వం సంయుక్త పార్లమెంటరీ కమిటీకి సిఫార్సుచేసింది. తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటూ ఏకధాటిగా 30 రోజులుగా కస్టడీలో గడుపుతున్న ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, కేంద్ర, రాష్ట్రమంత్రులను పదవి నుంచి తొలగించేందుకు ఉద్దేశించిన మూడు బిల్లులను లోక్‌సభలో కేంద్రం ప్రవేశపెట్టింది. వెనువెంటనే విపక్ష పార్టీలపాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలదోసేందుకే మోదీ సర్కార్ ఇలా అత్యంత వివాదాస్పద మూడు బిల్లులను తీసుకొచ్చిందంటూ బుధవారం లోక్‌సభలో విపక్షపార్టీల ఎంపీలు తీవ్ర ఆందోళనకు దిగారు. ఒకదశలో బిల్లు ప్రతులను చింపేసి ఆ ముక్కలను హోంమంత్రి అమిత్‌షా వైపు విసిరేశారు. ఐదేళ్లు, అంతకంటే ఎక్కువ శిక్ష పడే తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటూ అరెస్టయి, కస్టడీలో ఏకధాటిగా 30 రోజులుగా ఉన్న సందర్భాల్లో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, కేంద్ర, రాష్ట్ర మంత్రులను పదవి నుంచి తొలగించేందుకు ఉద్దేశిస్తూ ‘గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్(సవరణ)బిల్లు, 2025, రాజ్యాంగం(130వ సవరణ)బిల్లు, 2025, జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ(సవరణ)బిల్లు, 2025’బిల్లులను అమిత్‌షా లోక్‌సభలో ప్రవేశపెట్టగానే గొడవ మొదలైంది. అమిత్, వేణుగోపాల్ మధ్య మాటల యుద్ధం బిల్లు ప్రవేశపెట్టగానే అమిత్‌షానుద్దేశిస్తూ కాంగ్రెస్ సీనియర్ సభ్యుడు కేసీ వేణుగోపాల్ మాటలతో విరుచుకుపడ్డారు. ‘‘రాజ్యాంగ మౌలికసూత్రాలను ఈ బిల్లులు ఉల్లంఘిస్తున్నాయి. 2010లో సోహ్రబుద్దీన్ షేక్ నకిలీ ఎన్కౌంటర్ కేసులో ఆనాడు రాష్ట్ర హోం మంత్రిగా పదవి వెలగబెడుతూనే అమిత్‌షా అరెస్టయ్యారు. సీబీఐ అరెస్ట్‌తో మూడు నెలలు జైళ్లోనే గడిపారు. మరి ఈ నైతికత ఆనాడు మీకు లేదా?’’అని వేణుగోపాల్ సూటి ప్రశ్న వేశారు. దీనికి ఇతర సభ్యులు గొంతు కలిపారు. దీంతో అమిత్‌షా దీటుగా బదులిచ్చారు. ‘‘అదొక తప్పుడు కేసు. అయినాసరే అరెస్టయిన వెంటనే పదవికి త్యజించి నా నైతికతను నిరూపించుకున్నా. పదవికి రాజీనామా చేశా. కేసులో నిర్దోషిగా బయటపడేదాకా ఎలాంటి చట్టబద్ద పదవిని చేపట్టలేదు’’అని అన్నారు. మధ్యాహ్నం సభ రెండుగంటలకు మళ్లీ మొదలయ్యాక ఈ మూడు బిల్లులను సంయుక్త పార్లమెంట్ కమిటీకి సిఫార్సుచేస్తూ తీర్మానం చేసి మూజువాణి ఓటుతో ఆమోదించిన సందర్భంలో విపక్షసభ్యులు మళ్లీ లేచి నిలబడి నినాదాలుచేశారు. అప్పటికే ఈ మూడు బిల్లుల ప్రతులను కాంగ్రెస్ ఎంపీలు జ్యోతిమణి, ప్రణీత షిండే తోటి ఎంపీలకు పంచారు. తమ చేతికొచ్చిన బిల్లుల ప్రతులను తృణమూల్ కాంగ్రెస్ నేత కళ్యాణ్ బెనర్జీసహా పలువురు విపక్షసభ్యులు చింపేసి అమిత్‌షా వైపు విసిరేశారు. కొన్ని షా సీటు వద్ద పడ్డాయి. షా ముందున్న మైక్రోఫోన్‌ను లాగిపడేసేందుకు బెనర్జీ విఫలయత్నంచేశారు. దీంతో షాకు రక్షణగా కేంద్ర మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టూ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజులు షా సీటు వద్దకు వచ్చి అడ్డుగా నిలబడ్డారు. వెల్‌లోకి దూసుకొచ్చిన టీఎంసీ మహిళానేత మహువా మొయిత్రాసహా విపక్షనేతల నినాదాలతో సభ మార్మోగింది. కొందరు బీజేపీ సభ్యులు సైతం వెల్‌లోకి దూసుకొచ్చి విపక్షసభ్యులతో వాగ్వాదానికి దిగారు. వీరిని బీజేపీ సభ్యుడునిషికాంత్ దూబే వారించి తమతమ సీట్ల వద్దకు పంపించారు. వివాదాస్పద బిల్లులను ప్రవేశపెట్టడాన్ని తీవ్రంగా తప్పుబడుతూ ఎంఐఎ నేత అసదుద్దీన్ ఒవైసీ, కాంగ్రెస్ నేత మనీశ్ తివారీ, ఆర్ఎస్పీ నేత ఎన్కే ప్రేమచంద్రన్, కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్, ఎస్పీ నేత ధర్మేంద్ర యాదవ్ మాట్లాడారు. తర్వాత సభ మూడు గంటలకు మొదలయ్యాక అమిత్ షాకు రక్షణగా పార్లమెంట్ సెక్యూరిటీ సరీ్వస్ నుంచి 12 మంది మార్షల్స్ వచ్చి పక్కనే నిలబడ్డారు. అయినాసరే విపక్షసభ్యులు బిల్లుల వ్యతిరేక నినాదాలను కొనసాగించారు. యావత్ ఘటనపై స్పీకర్ తీవ్రవిచారం వ్యక్తంచేశారు. ఇలాంటి ఉదంతాలు సభ గౌరవాన్ని తగ్గిస్తున్నాయని ఓం బిర్లా ఆవేదన వ్యక్తంచేశారు. ఎల్లవేళలా తెలుపురంగు టీ–షర్ట్ ధరించే లోక్‌సభలో విపక్షనేత రాహుల్‌గాంధీ మూడు బిల్లులను వ్యతిరేకిస్తూ అందుకు నిరసనగా నలుపురంగు టీ–షర్ట్ ధరించారు. ఎవరేమన్నారంటే.. పోలీస్ రాజ్యంగా మారుస్తున్నారు ‘‘ఇలా మూడు అక్రమ చట్టాలను తెచ్చి భారత్‌ను పోలీస్ రాజ్యంగా మార్చాలనుకుంటున్నారు. సీబీఐ, ఈడీ వంటి ఏజెన్సీలు ఇష్టారీతిన అరెస్ట్చేసేందుకు మోదీ సర్కార్ మరింత స్వేచ్చనిస్తోంది. ఈ ఏజెన్సీలే జడ్జీలుగా, కార్యనిర్వాహక వ్యవస్థలుగా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ పోకడ ఎన్నికల ద్వారా కొలువుతీరిన ప్రభుత్వాలకు మరణశాసనం వంటిది. ఈ మూడు బిల్లులు హిట్లర్ పాలనలో నాజీ సైన్యం అధికారిక రహస్య పోలీస్ విభాగాన్ని గుర్తుకుతెస్తున్నాయి. విపక్షాలపాలిత రాష్ట్రప్రభుత్వాలను అస్థిరపరిచేందుకే బిల్లులను తెచ్చారు’’ – ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ రాజ్యాంగ మౌలికస్వరూపాన్ని నాశనంచేస్తున్నారు. ‘‘రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని సర్వనాశనం చేసేలా ఈ మూడు బిల్లులను తీసుకొచ్చారు. సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను ప్రభుత్వం ఇప్పటికే దుర్వినియోగపరుస్తోంది. ఇక ఈ మూడు బిల్లులు చట్టాలుగా మారితే ఈ రాజకీయ దురి్వనియోగ వరదకు గేట్లు ఎత్తినట్లే అవుతుంది. ఈ ధోరణిని ఇప్పటికే సర్వోన్నత న్యాయస్థానం సైతం తూర్పారబట్టింది. కొత్త బిల్లులు రాజ్యాంగపరిరక్షణ అ్రస్తాలను నిర్వీర్యంచేస్తున్నాయి’’ – కాంగ్రెస్ నేత మనీశ్ తివారీ ‘జైలు’పాలనపై నిర్ణయం ప్రజలదే ‘‘తమ పీఎం, సీఎం, మంత్రులు తీవ్ర నేరారోపణలతో అరెస్టయి జైలు ఉండి అక్కడి నుంచే పరిపాలించడం ఎంతవరకు సబబో ప్రజలే నిర్ణయించుకోవాలి. ప్రజాజీవితం గడిపే పాలకుల్లో తగ్గుతున్న నైతికతకు చెక్‌పెట్టేందుకే ఈ మూడు బిల్లులన తెచ్చాం. రాజకీయాలకు మళ్లీ సమగ్రత తేవడమే బిల్లుల లక్ష్యం. భవిష్యత్తులో పాలకులు తీవ్రనేరాలతో జైలుపాలైనా అక్కడి నుంచే పరిపాలిస్తారని రాజ్యాంగ నిర్ణేతలు ఆనాడు రాజ్యాంగ రచన సమయంలో ఊహించి ఉండరు’’ – బీజేపీ అగ్రనేత అమిత్ షా మధ్యయుగాలకు మోసుకెళ్తాయి ఈ మూడు బిల్లులు మళ్లీ దేశాన్ని మధ్యయుగాల నాటి దురవస్థకు తీసుకెళ్తాయి. ఈ బిల్లులు చట్టాలుమారితే ఖచ్చితం మనం మధ్యయుగాలకు వెళ్తాం. అక్కడ రాజు తనకు నచ్చని వ్యక్తులను పదవుల నుంచి పక్కకు తప్పిస్తాడు. ఆ పదవిలోని వ్యక్తి ముఖం కూడా నచ్చలేదంటే ఈడీ రంగప్రవేశంచేసి అరెస్ట్చేస్తుంది. నేరారోపణ రుజువుకాకపోయినా కేవలం 30 రోజులుగా జైళ్లో ఉన్నాడన్న కారణం చూపి.. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన వ్యక్తి ప్రభుత్వాన్ని కూలదోస్తారు’’ – లోక్‌సభలో విపక్షనేత రాహుల్‌గాంధీ అంత తొందరెందుకు? ‘అత్యున్నత పదవుల్లోని నేతలను తొలగించేందుకు ఉద్దేశించిన ఇంతటి కీలకమైన బిల్లులను ఎందుకు హడావిడిగా ప్రవేశపెడుతున్నారు? బిల్లుల గురించి ముందస్తు సమాచారం లేదు. హడావిడిగా బిల్లుల ప్రతులను సభలో నామామాత్రం కొద్దిమందికి పంపిణీ చేసి వెంటనే బిల్లులను లోక్‌సభ ముందుకు తెచ్చారు. సభా నిబంధనలను ఈ బిల్లుల విషయంలో అస్సలు పాటించలేదు’’ – ఆర్ఎస్పీ పార్టీ సభ్యుడు, ఎంపీ ఎన్కే ప్రేమ్‌చంద్రన్ ప్రజాస్వామ్యశకానికి పాతరేసే కుట్ర ‘‘భారత్‌లో ప్రజాస్వామ్య శకానికి ముగింపు పలికే దురుద్దేశంతో ప్రభుత్వం ఈ మూడు బిల్లులు తెచ్చింది. బిల్లులను తేవడం చూస్తుంటే సూపర్ ఎమర్జెన్సీ పీడకలను ప్రభుత్వ పెద్దలు సాకారంచేసుకునేందుకు వేసిన తొలి అడుగులా తోస్తోంది. దేశ న్యాయవ్యవస్థ స్వతంత్రను కాలరాసేందుకు ఈ బిల్లులను తెచ్చారు. ప్రజాస్వామ్యం, సమాఖ్య స్ఫూర్తిని సర్వనాశనంచేసే కుట్ర ఇది. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎంతకైనా తెగించి ఈ బిల్లులు చట్టాలుగా మారకుండా అడ్డుకుందాం’’ – టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ ఇది ఇంగిజ్ఞానానికి సంబంధించింది ‘‘మీరు 30రోజులపాటు కస్టడీలో ఉండి కూడా మంత్రిగా పదవిలో కొనసాగుతానని వాదించడం ఎంత వరకు సమర్థనీయం? ఇది పూర్తిగా ఇంగితజ్ఞానానికి సంబంధించిన విషయం. ఈ మూడు బిల్లుల్లో నాకైతే ఎలాంటి తప్పు కనిపించట్లేదు. ఈ అంశం మినహా బిల్లుల్లో లోతైన అంశాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా సంయుక్త పార్లమెంట్ కమిటీలో చర్చించాల్సిందే. దేశ ప్రయోజనకర అంశాలు ఉన్నాయో లేదో తేల్చాలి’’ – తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ -
లక్షల ఉద్యోగాలకు ముప్పు!!
న్యూఢిల్లీ: రియల్ మనీ గేమ్స్ అన్నింటిపైనా నిషేధం విధించే బిల్లుపై పరిశ్రమ వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. దీనివల్ల లక్షల కొద్దీ ఉద్యోగాలు, వేల కోట్ల పెట్టుబడులకు విఘాతం ఏర్పడుతుందని తెలిపాయి. కోట్ల మంది యూజర్లు చట్టవిరుద్ధమైన విదేశీ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ప్లాట్‌ఫాంల వైపు మళ్లే ప్రమాదం ఉందని పేర్కొన్నాయి. ఈ బిల్లు విషయంలో అత్యవసరంగా జోక్యం చేసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి విజ్ఞప్తి చేశాయి. యూజర్లు, పరిశ్రమను పరిరక్షిస్తూ బాధ్యతాయుతమైన గేమింగ్‌కి తోడ్పడే పరిష్కార మార్గాలపై చర్చించేందుకు, తమ అభిప్రాయాలను కూడా తెలిపేందుకు సమావేశమయ్యే అవకాశం కల్పించాలని కోరాయి.ఆలిండియా గేమింగ్ ఫెడరేషన్ (ఏఐజీఎఫ్), ఈ–గేమింగ్ ఫెడరేషన్ (ఈజీఎఫ్), ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫ్యాంటసీ స్పోర్ట్స్ (ఎఫ్ఐఎఫ్ఎస్) ఈ నెల 19న సంయుక్తంగా ఆయనకు లేఖ రాశాయి. దీని ప్రకారం .. దాదాపు రూ. 2 లక్షల కోట్ల వేల్యుయేషన్, రూ. 31,000 కోట్ల వార్షికాదాయంతో ఆన్లైన్ స్కిల్ గేమింగ్ పరిశ్రమ ఇప్పుడిప్పుడే ఎదుగుతోంది. ప్రభుత్వానికి ప్రత్యక్ష, పరోక్ష పన్నుల రూపంలో ఏటా రూ. 20,000 కోట్ల ఆదాయం సమకూరుస్తోంది.20 శాతం వార్షిక వృద్ధి రేటుతో 2028 నాటికి పరిశ్రమ రెట్టింపు స్థాయికి చేరనుంది. 2022 జూన్ వరకు పరిశ్రమలోకి రూ. 25,000 కోట్ల వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) వచ్చాయి. దీనితో ప్రత్యక్షంగా, పరోక్షంగా రెండు లక్షల మందికి పైగా ఉపాధి లభిస్తోంది. దేశీయంగా 2020లో 36 కోట్లుగా ఉన్న ఆన్లైన్ గేమర్స్ సంఖ్య 2024 నాటికి 50 కోట్లకు చేరింది. వేల కొద్దీ స్టార్టప్‌లు, యువ ఇంజనీర్లు, కంటెంట్ క్రియేటర్లు ఈ వ్యవస్థపై ఆధారపడి ఉన్నారు. యూజర్లకు కూడా హాని.. చట్టబద్ధమైన, పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమపై గంపగుత్తగా నిషేధం విధించడం వల్ల దేశీ యూజర్లకు, పౌరులకు పెను హాని జరుగుతుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. నిషేధం వల్ల పెట్టుబడులు నిల్చిపోయి, ఇన్వెస్టర్ల సెంటిమెంటు దెబ్బతింటుందని.. 400 పైగా కంపెనీలు మూతబడే ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశాయి. డిజిటల్ ఆవిష్కర్తగా భారత్ స్థానం కూడా బలహీనపడుతుందని వివరించాయి. ‘ఈ బిల్లు ఆమోదం పొందితే యూజర్లు, పౌరులకు తీవ్ర హాని జరుగుతుంది. నియంత్రణల పరిధిలో కార్యకలాపాలు సాగిస్తున్న, బాధ్యతాయుత దేశీ ప్లాట్‌ఫాంలను మూయించి, కోట్ల మంది ప్లేయర్లను చట్టవిరుద్ధ మట్కా నెట్‌వర్క్‌లు, ఆఫ్‌షోర్ గ్యాంబ్లింగ్ వెబ్సైట్లు, రాత్రికి రాత్రి పారిపోయే మోసపూరిత ఆపరేటర్ల వైపు మళ్లించినట్లవుతుంది‘ అని పేర్కొన్నాయి. ప్రజలకు రూ. 20 వేల కోట్ల నష్టం: ప్రభుత్వ అంచనాలు ప్రభుత్వ అంచనాల ప్రకారం ఆన్లైన్ రియల్ మనీ గేమింగ్ వల్ల, ఏటా 45 కోట్ల మంది దాదాపు రూ. 20,000 కోట్లు నష్టపోతున్నారని అధికారిక వర్గాలు తెలిపాయి. సమాజానికి ఇది పెను సమస్యగా మారిందని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఆదాయాన్ని కోల్పోయినా సరే ప్రజలకు మేలు చేసే ఉద్దేశంతోనే రియల్ మనీ గేమింగ్ని నిషేధించాలన్న నిర్ణయం తీసుకుందని వివరించాయి.గత మూడున్నరేళ్లుగా పరిశ్రమను నియంత్రించేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా, రియల్ మనీ గేమింగ్ సంస్థలు వాటిని పట్టించుకోవడం లేదని పేర్కొన్నాయి. అయితే, ఆన్లైన్ గేమ్స్ అన్నింటిపైనా నిషేధం ఉండదని .. ఈస్పోర్ట్స్, ఆన్లైన్ సోషల్ గేమ్స్‌ని ప్రమోట్ చేసేలా బిల్లులో ప్రతిపాదనలు ఉన్నాయని ఒక అధికారి చెప్పారు. ఇందుకోసం ప్రత్యేకంగా బడ్జెట్, స్కీములు మొదలైనవి ఉంటాయని వివరించారు. దీనితో ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమలో ఉద్యోగావకాశాలు వస్తా యని పేర్కొన్నారు. -
లోక్‌సభలో కీలక బిల్లులు ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి అమిత్ షా
-
ఆన్లైన్ గేమింగ్ బిల్లుపై కేంద్ర హోం మంత్రికి లేఖ
రియల్ మనీ గేమ్స్‌పై నిషేధం విధించే విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ భారత ఆన్లైన్ గేమింగ్ సంస్థలు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశాయి. ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్లు-2025ను బుధవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న తరుణంలో ఈమేరకు లేఖ రాయడం గమనార్హం. ఇప్పటికే ఈ బిల్లును కేంద్ర మంత్రివర్గం మంగళవారం ఆమోదించింది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న ఈ బిల్లులో ఆన్లైన్ గేమింగ్ రంగాన్ని నియంత్రించడానికి ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేశారు.ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ (ఏఐజీఎఫ్), ఈ-గేమింగ్ ఫెడరేషన్ (ఈజీఎఫ్), ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఫాంటసీ స్పోర్ట్స్ (ఎఫ్ఐఎఫ్ఎస్) సంయుక్తంగా కేంద్రం హోం మంత్రికి ఇచ్చిన వినతిపత్రంలో ఆసక్తికర అంశాలు తెలిపారు. ఆన్లైన్ స్కిల్ గేమింగ్ విభాగం ఒక ట్రిలియన్ డాలర్ల డిజిటల్ ఎకానమీని సృష్టిస్తుందని చెప్పారు. ‘భారతదేశపు డిజిటల్ గేమింగ్ రంగంలో పనిచేస్తున్న లక్షలాది మంది యువ పారిశ్రామికవేత్తలు, డెవలపర్లు, నిపుణులు కొత్త ఆన్లైన్ గేమింగ్ బిల్లు వల్ల తీవ్రంగా ప్రభావితం చెందుతారు. ఇందులోని నిషేధ నియమాలు చట్టబద్ధమైన, ఉద్యోగాలను సృష్టించే పరిశ్రమను దెబ్బ తీస్తుంది’ అని తెలిపారు.ప్రస్తుతం ఈ పరిశ్రమ రూ.2 లక్షల కోట్లకు పైగా ఎంటర్ప్రైజ్ వాల్యుయేషన్‌ను, రూ.31,000 కోట్ల వార్షిక ఆదాయం, ప్రత్యక్ష, పరోక్ష పన్నుల రూపంలో రూ.20,000 కోట్లకు పైగా ఆదాయాన్ని సమకూరుస్తోందని సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. 20 శాతం సీఏజీఆర్‌తో వృద్ధి చెందుతున్న ఈ రంగం 2028 నాటికి రెట్టింపు అవుతుందని అంచనా. భారతదేశంలో ఆన్లైన్ గేమర్లు 2020లో 36 కోట్ల నుంచి 2024లో 50 కోట్లకు పెరిగారు. జూన్ 2022 వరకు రూ.25,000 కోట్లకు పైగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆ రంగం ఆకర్షించింది. ఈ పరిశ్రమ ప్రత్యక్షంగా, పరోక్షంగా 2 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. గేమింగ్, టెక్నాలజీ, డిజిటల్ ఎంటర్టైన్మెంట్లో ప్రపంచానికి నాయకత్వం వహించే అవకాశం భారత్‌కు ఉందని, నిషేధానికి బదులు ప్రగతిశీల నియంత్రణను అవలంబించాలని లేఖలో ప్రభుత్వాన్ని కోరారు.ఇదీ చదవండి: బంగారం ధరలు యూటర్న్!ఈ-స్పోర్ట్స్, ఎడ్యుకేషనల్ గేమ్స్, సోషల్ గేమింగ్‌తో సహా ఆన్లైన్ గేమింగ్ రంగాన్ని ప్రోత్సహించడానికి, కొన్ని అంశాల్లో నియంత్రించడానికి, వ్యూహాత్మక అభివృద్ధి, నిరంతర పర్యవేక్షణ కోసం ఒక అథారిటీని ఏర్పాటు చేసేలా వీలు కల్పించే బిల్లును బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ఆన్లైన్ గేమ్స్, ఈ-స్పోర్ట్స్ మధ్య స్పష్టమైన విభజన సూచించేలా బిల్లును రూపొందించారు. నిబంధనల్ని ఉల్లంఘించి ఆన్లైన్ గేమ్స్ అందిస్తున్నవారికి మూడేళ్ల వరకు జైలుశిక్ష, లేదా రూ.కోటి వరకు జరిమానా, లేదా ఆ రెండూ విధించాలని బిల్లులో ప్రతిపాదించారు. సంబంధిత అడ్వర్టయిజ్మెంట్లలో భాగం పంచుకున్నవారికి గరిష్ఠంగా రెండేళ్ల జైలుశిక్ష, రూ.50 లక్షల వరకు జరిమానా విధిస్తారు. వీటి ఆర్థిక లావాదేవీల్లో ప్రమేయం ఉన్నవారికీ గరిష్ఠంగా మూడేళ్ల శిక్ష, రూ.కోటి వరకు జరిమానా వేస్తారు. -
మరో ‘అమృత్ భారత్’కు పచ్చజెండా.. ఎక్కడి నుంచి? సమయాలేమిటి?
న్యూఢిల్లీ: దేశంలో నేటి(శుక్రవారం) నుంచి మరో అమృత్ భారత్ రైలు పరుగులు తీయనుంది. బీహార్‌లోని సీతామర్హిని ఢిల్లీకి అనుసంధానించే ఈ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును కేంద్ర హోంమంత్రి అమిత్ షా జెండా ఊపి ప్రారంభించనున్నారు. అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు బీహార్‌లో రైలు కనెక్టివిటీని మెరుగుపరచనుంది. అలాగే మధ్యతరగతి వర్గానికి ఆధునిక రైల్వే సేవల అనుభవాన్ని అందించనుంది.సీతామర్హి-ఢిల్లీ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీతామర్హిలోని పునౌరా ధామ్ నుండి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జెండా ఊపి ప్రారంభించనున్నారని తూర్పు మధ్య రైల్వే జోన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఢిల్లీ-సీతామర్హి అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు 20 గంటల 45 నిమిషాల్లో దాదాపు 1,100 కి.మీ దూరాన్ని కవర్ చేస్తుంది. ఇది గంటకు గరిష్టంగా 130 కి.మీ వేగంతో పరుగుల తీయగలదు. ఈ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ వారానికి ఒకసారి నడుస్తుంది.ఇది శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు ఢిల్లీ నుండి బయలుదేరి, ఆదివారం ఉదయం 10.45 గంటలకు సీతామర్హి చేరుకుంటుంది. ఆదివారం రాత్రి 10.15 గంటలకు సీతామర్హి నుండి బయలుదేరి, సోమవారం రాత్రి 10.40 గంటలకు ఢిల్లీకి తిరిగి వస్తుంది. ఢిల్లీ-సీతామర్హి అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌కు 13 స్టాప్‌లున్నాయి. అవి ఘజియాబాద్, తుండ్ల, కాన్పూర్, లక్నో, గోండా, బస్తీ, గోరఖ్‌పూర్, కప్తాన్‌గంజ్, సిస్వా బజార్, బాగహా, సిక్తా, నర్కటియాగంజ్, రక్సౌల్ బైర్గానియా. -
మోదీ, అమిత్ షా అడ్డుకున్నారు
సాక్షి, న్యూఢిల్లీ: బీసీ రిజర్వేషన్ల బిల్లుల విషయంలో కాంగ్రెస్‌కు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అపాయింట్మెంట్ ఇవ్వకుండా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు అడ్డుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇస్తే 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులపై సానుకూల నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని భావించే మోదీ, అమిత్ షా అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. గురువారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో టీపీసీసీ అధ్యక్షుడు, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.ప్రభుత్వం మొత్తం ఢిల్లీకి వచ్చినా..‘బీసీ రిజర్వేషన్ల బిల్లులు, ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌కు సంబంధించి పది రోజుల ముందే రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరాం. అయితే కాంగ్రెస్ నేతలు అపాయింట్మెంట్ కోరాక మోదీ, అమిత్‌షాలు రాష్ట్రపతితో భేటీ అయ్యారు. వారు ఏం మాట్లాడుకున్నారో తెలియదు.కానీ, రాష్ట్రపతి మా వినతిని వింటే రిజర్వేషన్లు ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడుతుందని భావించి ఆమె అపాయింట్మెంట్ రాకుండా మోదీ, అమిత్ షా అడ్డుకున్నట్టుగా మా మంత్రివర్గ సహచరులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓ నిర్ధారణకు వచ్చారు. 5, 6, 7 తేదీల్లో ఢిల్లీలో అందుబాటులో ఉంటామని రాష్ట్రపతికి తెలియజేసినా అపా యింట్మెంట్ ఇవ్వలేదు. ప్రభుత్వం మొత్తం ఢిల్లీకే వచ్చినా, రాష్ట్రపతి అపాయింట్మెంట్ దొరక్కపోవడం శోచనీయం, బాధాకరం, అవమానకరం..’ అని సీఎం పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ బీసీ ద్రోహులు..‘బీజేపీ, బీఆర్ఎస్ నేతలు బీసీ వ్యతిరేకులుగా మారారు. 42 శాతం రిజర్వేషన్లకు బీఆర్ఎస్ కనీస నైతిక మద్దతు తెలపడం లేదు. రిజర్వేషన్లు 50 శాతానికి మించుతాయంటూ బీజేపీ అడ్డుకుంటోంది. బీజేపీది తొలి నుంచీ బీసీ వ్యతిరేక వైఖరే. మండల్ కమిషన్ సిఫార్సులను అడ్డుకునేందుకు కమండల్ యాత్రను ప్రారంభించింది. మన్మోహన్సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సెంట్రల్ యూనివర్సిటీలు, ఐఐటీలు, ఐఐఎంల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించినప్పుడు యూత్ ఫర్ ఈక్వేషన్ పేరుతో వాటిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది.బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో బీజేపీతో అంటకాగుతూ బీఆర్ఎస్ శిఖండిలా వ్యవహరిస్తోంది. విధ్వంసకర పాత్ర పోషిస్తోంది. పది రోజుల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను, మూడు రైతు వ్యతిరేక బిల్లులను ఆమోదించిన బీజేపీకి బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లును ఆమోదించడం ఒక్క రోజు పని అని. కానీ చిత్తశుద్ధి లేనందునే బిల్లులు ఆమోదించడం లేదు..’ అని రేవంత్ ధ్వజమెత్తారు.గల్లీ లీడర్లా కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు‘బీసీ రిజర్వేషన్ల పెంపుపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెట్టుకింద ప్లీడర్లా, గల్లీ లీడర్లా మాట్లాడుతున్నారు. సామాజిక న్యాయ శాఖ మంత్రిని కిషన్‌రెడ్డి హైదరాబాద్‌కు తీసుకొని వస్తే ఆయనకు కావల్సిన వివరాలన్నీ అందిస్తాం. లేకుంటే ఆయన సమయం చెబితే మేమే ఢిల్లీలో అన్ని గణాంకాలు అందజేస్తాం. ముస్లింలు ముఖ్యమంత్రులు కావద్దనేలా కిషన్‌రెడ్డి మాట్లాడడం సరికాదు. ముస్లింలను తొలగిస్తే రిజర్వేషన్లు పెంచుతామని బీజేపీ నాయకులు అంటున్నారు. ఎలా తొలగిస్తారో.. ఎలా పెంచుతారో వాళ్లు చేసి చూపాలి. రిజర్వేషన్ల పెంపు, ఇతర విషయాల్లో కిషన్‌రెడ్డి అబద్ధాలు చెప్పినంత కాలం నేను నిజాలు చెబుతా..’ అని ముఖ్యమంత్రి అన్నారు. మోదీని కుర్చీ దింపడమే పరిష్కారం‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకు అన్ని ప్రయత్నాలు చేశాం. ఇక ముందు ఏం చేయాలనే దానిపై రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ)తో భేటీ అవుతాం. మంత్రులు, పీఏసీతో చర్చించిన తర్వాత త్వరలో భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తాం. బీసీ రిజర్వేషన్ల పెంపు, ఇతర సమస్యలన్నింటికీ పరిష్కారం మోదీని కుర్చీ నుంచి దింపడమే. ఇప్పటికైనా రాష్ట్రపతి, మోదీ బీసీ బిల్లులను ఆమోదించాలి..’ అని రేవంత్ కోరారు. అందుకే రాహుల్ రాలేదు..‘రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఇందిరా భవన్లో 4 గంటల పాటు తెలంగాణ కుల సర్వే, బీసీ రిజర్వేషన్ల పెంపు గురించి సావధానంగా విన్నారని.. వంద మంది ఎంపీలకు వివరించారని సీఎం చెప్పారు. శిబుసోరెన్ అంత్యక్రియలు.. ఓ కేసు విషయమై జార్ఖండ్ వెళ్లినందునే రాహుల్ జంతర్ మంతర్ సదస్సుకు హాజరుకాలేదని వివరించారు. ఓడిపోవడమే కేసీఆర్‌కు పెద్ద శిక్షవిలేకరుల సమావేశం అనంతరం ముఖ్యమంత్రి మీడియాతో చిట్‌చాట్ చేశారు. ‘కాళేశ్వరం కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో చర్చకు పెడతాం. అక్కడేం నిర్ణయిస్తారో చూద్దాం. ఈ విషయంలో ప్రతీకార చర్యలేవీ ఉండవు. కేసీఆర్‌ను కొత్తగా జైల్లో పెట్టాల్సిన అవసరం లేదు. చర్లపల్లి జైలుకు, ఆయన ఫాంహౌస్‌కు పెద్దగా తేడా లేదు. ఆయన ఇప్పటికే స్వీయ నిర్బంధంలో ఉన్నారు. అక్కడా అదే నాలుగు గోడలు.. పోలీసు పహారా..ఫాంహౌస్‌లోనూ అదే పహారా. ఎన్నికల్లో ఓడిపోవడమే ఆయనకు పడిన పెద్ద శిక్ష.. ’ అని సీఎం వ్యాఖ్యానించారు.ఓటర్ల జాబితాలో అక్రమాలు నిజమే..ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ లేవనెత్తిన ఓటరు జాబితా అక్రమాలపై ముఖ్యమంత్రి స్పందించారు. ‘ఓటర్ల జాబితాలో అక్రమాలు నిజమే. 2018లో కొడంగల్‌లోనే 15 వేల ఓట్లు తొలగించారు. నేను 8 వేల ఓట్ల తేడాతో ఓడిపోయా..’ అని అన్నారు. చిట్‌చాట్ అనంతరం కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ఇండియా కూటమి పక్షాల విందుకు రాహుల్‌గాంధీ ఆహ్వానం మేరకు రేవంత్ కూడా హాజరయ్యారు. విలేకరుల సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, వివేక్, జూపల్లి కృష్ణారావు, ఎంపీలు మల్లు రవి, అనిల్ యాదవ్, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, బలరాం నాయక్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
అమిత్‌షా అరుదైన ఘనత.. ఎల్కే అద్వానీ రికార్డు బద్దలు
సాక్షి,న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అరుదైన ఘనతను సాధించారు. ఆగస్టు 5 నాటికి దేశంలో ఎక్కువ కాలం కేంద్ర హోంమంత్రిగా సేవలందించిన నేతల జాబితాలో గుర్తింపు పొందారు. ఆయన 2,258 రోజులు పదవిలో కొనసాగుతూ.. బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ రికార్డును (2,256 రోజులు) రికార్డును బద్దలు కొట్టారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక అమిత్‌షా 2019లో కేంద్ర హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత జరిగిన 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చింది. దీంతో అమిత్ షా వరుసగా రెండోసారి కూడా హోంశాఖ బాధ్యతలనే స్వీకరించారు.ఫలితంగా బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ రికార్డును అమిత్ షా అదిగమించారు. 1998-1999, 1999-2004 వరకూ ఎల్కే అద్వానీకేంద్ర హోం మంత్రిగా దాదాపు 2,193 రోజులు ఈ పదవిలో కొనసాగారు. ఇక కేంద్ర హోం శాఖ బాధ్యతలు చేపట్టిన అమిత్ షా తన హయాంలో ఆర్టికల్ 370 రద్దు, కొత్త న్యాయ చట్టాల ప్రవేశం, పౌరసత్వ సవరణ చట్టం, నక్సలిజం నిర్మూలన లక్ష్యం, ఉత్తర తూర్పు శాంతి ఒప్పందాలు, నార్కోటిక్స్ వ్యతిరేక కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించారు. -
రాష్ట్రపతితో ప్రధాని, హోంమంత్రి భేటీ
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వేర్వేరుగా భేటీ అయ్యారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో ఇరువురు నేతలు గంటల వ్యవధిలోనే రాష్ట్రపతితో భేటీ అయ్యారు. అయితే భేటీకి కారణాలు, చర్చించిన అంశాల గురించి వివరాలు బయటికి తెలియలేదు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా.. రాష్ట్రపతిని ఆదివారం కలిశారని రాష్ట్రపతి భవన్ ఎక్స్ ఖాతాలో పేర్కొంది. పార్లమెంట్ సమావేశాలు, ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో జరిగిన ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. -
కాంగ్రెస్ ధారాదత్తం చేసింది
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్‌పై రాజ్యసభలో 16 గంటల చర్చకు ప్రభుత్వం తరఫున సమాధానంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రసంగిస్తూ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ పాపం కాంగ్రెస్‌దే అని ధ్వజమెత్తారు. ‘‘ దేశ భద్రత అనేది కాంగ్రెస్ ప్రాధాన్యతాంశాల్లో అస్సలు లేదు. ఓటు బ్యాంక్, బుజ్జగింపు రాజకీయాలు మాత్రమే కాంగ్రెస్ అజెండా. వీటిపై మాత్రమే కాంగ్రెస్ దృష్టిపెట్టి జాతీయభద్రత వంటి మిగతా కీలకాంశాలను గాలికొదిలేసింది. దీంతో ఉగ్రవాదం విపరీతంగా విస్తరించింది. దీనికి ఏకైక కారణం కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలు, పేలవమైన రాజకీయ విధానాలు. కాంగ్రెస్ ఘోర తప్పిదాల కారణంగానే కశ్మీర్లో కొంతభాగం మన చేజారింది. అలా కాంగ్రెస్సే పాకిస్తాన్‌కు పీఓకేను అప్పగించింది. వాళ్లు ఇచి్చన పీఓకేను మేం తిరిగి తీసుకొస్తాం. ఘటన జరిగాక సమీక్ష జరపడం కాంగ్రెస్ విధానం. అసలు అలాంటివి సంభవించకుండా ముందే అప్రమత్తంగా ఉండటం మా నైజం’’ అని అమిత్ షా అన్నారు. ‘‘పహల్గాం పాశవిక హత్యాకాండలో అమాయకులు చనిపోయారు. వాళ్ల తలకు గురిపెట్టి మరీ ఉగ్రవాదులు తూటాలు పేల్చారు. అదే తీరులో ఆపరేషన్ మహాదేవ్లో పహల్గాం ఉగ్రవాదుల తలల్లోకి మేం కూడా తూటాలు దించాం. పహల్గాం బాధిత కుటుంబాలు కోరుకున్నది మేం నెరవేర్చాం. ఆపరేషన్ మహదేవ్లో అంతమైన ముగ్గురు ఉగ్రవాదులకు లష్కరే తోయిబాతో సంబంధాలున్నట్లు ఆర్మీ దర్యాప్తులో స్పష్టమైంది. మహిళలు, చిన్నారుల ఎదుట నీ మతమేంటి? అని అడిగిమరీ అమాయకుల ప్రాణాలు తీసిన పహల్గాం వంటి హేయమైన ఘటన గతంలో ఎన్నడూ జరగలేదు’’ అని అమిత్ షా అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ స్వయంగా వచ్చి మాట్లాడాలని విపక్షసభ్యులు పట్టుబట్టారు. ఆయన బదులు నేను మాట్లాడుతున్నానని అమిత్ షా సర్దిచెప్పే ప్రయత్నంచేసినా విపక్షసభ్యులు వినిపించుకోకుండా నిరససగా వాకౌట్ చేశారు. తర్వాత అమిత్ షా తన ప్రసంగాన్ని కొనసాగించారు. -
రాజాసింగ్ రీ ఎంట్రీకి ప్రయత్నిస్తున్నారా..?
సాక్షి, హైదరాబాద్: గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తిరిగి కమలం గూటికి చేరడానికి ప్రయత్నిస్తున్నారా? బీజేపీ జాతీయ నాయకత్వం ఆహా్వనిస్తే కలవడానికి సిద్ధమవుతున్నారా.. అంటే ఆయన వ్యాఖ్యలను బట్టి చూస్తే అవుననే అనిపిస్తోంది. పార్టీ అధిష్టానంపై ధిక్కార స్వరం వినిపించి బహిష్కరణ వేటుకు గురైన రాజాసింగ్ మళ్లీ కాషాయతీర్థం పుచ్చుకునే దిశగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. హైకమాండ్ పిలిస్తే రాజీనామా చేయడానికి గల కారణాలు, రాష్ట్ర పార్టీ నాయకుల తీరు గురించి వివరించేందుకు సిద్ధంగా ఉన్నానంటూ రాజాసింగ్ ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు. ‘నా వైపు నుంచి కూడా కొన్ని తప్పులు దొర్లాయి. అధిష్టానానికి కొందరు నాపై తప్పుడు సమాచారం చేరవేశారు’అని తాజాగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అన్నారు. ఈ వ్యాఖ్యలను పరిశీలిస్తే ఆయన మనసు మార్చుకునేందుకు, తిరిగి బీజేపీ గూటికి చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. పార్టీకి మాత్రమే రాజీనామా చేశా.. ‘ఉప ఎన్నిక వస్తుందని కొంత మంది పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని అంటున్నారు. నేను పార్టీకి మాత్రమే రాజీనామా చేశాను. ఎమ్మెల్యే పదవికి కాదు. స్పీకర్‌కు లేఖ ఇవ్వలేదు. బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరితే అక్కడెక్కడా ఉప ఎన్నిక రాలేదు. గోషామహల్లో ఎలా వస్తుందో నాకు తెలియడంలేదు. మరో మూడేళ్లు నేనే ఎమ్మెల్యేగా ఉంటాను. ఉప ఎన్నిక ప్రసక్తే రాదు’అని రాజాసింగ్ స్పష్టం చేశారు. పార్టీలో మిత్రులతోపాటు శత్రువులు ఉన్నారని, వాళ్లే మీడియాకు లీకులిస్తూ, వాటిని ఢిల్లీలో ఫిర్యాదు చేస్తారని, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనకు ఫోన్ చేశారంటూ సామాజిక మాద్యమాల్లో జరిగిన తప్పుడు ప్రచారంతో నా రాజీనామాను అధిష్టానం ఆమోదించిందని పేర్కొన్నారు. ఎలాంటి పరిస్థితుల్లో రాజీనామా ఇచ్చాననేది వివరణ ఇచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నానని చెబుతున్నారు. తెలంగాణలో బీజేపీకి ఎవరి వల్ల నష్టం జరుగుతుంది, ఇతర పారీ్టల నుంచి వచి్చన వారికి ఎలాంటి అవమానాలు జరుగుతున్నాయనే అంశాలను వివరిస్తానని రాజాసింగ్ పేర్కొన్నారు. -
ఆ ముగ్గురూ పహల్గాం ముష్కరులే
న్యూఢిల్లీ: వేలాది మంది విచారణ. అనుమా నితులపై నిరంతర నిఘా. ఆశ్రయమిచ్చిన వారి నిర్బంధం. గత ఏప్రిల్ 22న పహల్గాంలో పాశవిక దాడికి పాల్పడి 26 మంది అమాయక పర్యాట కులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదుల కోసం ‘ఆపరేషన్ మహదేవ్’లో భాగంగా భద్రతా దళాలు నెలల తరబడి వేటాడిన తీరిది. శాటిలైట్ ఫోన్ సిగ్నల్స్ సాయంతో ఆనుపానులు చిక్కడంతో ఎట్టకేలకు వారి పాపం పండింది. సోమవారం జమ్మూ కశ్మీర్లో భద్రతా దళాల చేతుల్లో హతమ య్యారు. ఆ ముగ్గురూ పహల్గాం దాడిలో పాల్గొన్న ముష్కరు లేనని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. వారిని గుర్తించేందుకే నెలల సమయం పట్టిందని వెల్ల డించారు. సాంకేతికత, మానవ నిఘా సాయంతో ఉగ్రవాదులను కదలి కలను కనిపెట్ట గలిగినట్టు వివరించారు. ఆపరేషన్ సిందూర్‌పై మంగళవా రం లోక్‌సభలో ప్రత్యేక చర్చలో ఆ యన ప్రసంగించారు. ఆ పాశవిక దాడితో గాయ పడ్డ దేశ ప్రజల హృద యాలకు సాంత్వన చేకూ ర్చిన ఆపరేషన్ మహదేవ్ తాలూకు వివరాలను సభకు వెల్లడించారు. హతులైన ముగ్గురిని సులే మాన్ అలియాస్ ఫైజల్, అఫ్గాన్, జిబ్రాన్‌గా గుర్తించారు. వారంతా ఏ గ్రేడ్ ఉగ్రవాదులేనని తెలిపారు. సైన్యం తాలూకు 4 పారా మిలిటరీ బలగాలు, సీఆర్పీఎఫ్ జవాన్లు, జమ్మూ కశ్మీర్ పోలీసులు కలసి కట్టుగా ఆపరేషన్‌లో పాలుపంచుకున్నట్టు వివరించారు. పహల్గాం దాడికి పాల్పడ్డ ముష్కరులను ఏరివేసి జాతికి ఊరట కల్పించామని చెప్పారు. ‘‘ఇంత మంచి వార్త విని అధికార పక్షంతో పాటు విపక్షాలు ఆనందిస్తాయని ఆశించా. కానీ వారి ముఖాలన్నీ కళతప్పి కనిపిస్తున్నాయి’’ అంటూ ఎద్దేవా చేశారు.కాంగ్రెస్ తప్పిదమే ‘పాక్’!ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమవుతూ వస్తోందని అమిత్ షా ఎద్దేవా చేశారు. దేశ సమస్యలన్నింటికీ కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణమంటూ తూర్పారబట్టారు. పాక్ ఆక్రమిత భూభాగాలను స్వాధీనం చేసుకునేందుకు వచ్చిన అవకాశాలన్నింటినీ కాంగ్రెస్ ఎప్పటికప్పుడు కాలదన్నుతూ వచ్చిందని ఆరోపణలు గుప్పించారు. అలాంటి పార్టీకి మోదీ ప్రభుత్వం పాక్‌పై పూర్తిస్థాయిలో నిర్ణాయక చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించే నైతిక అర్హత కూడా లేదన్నారు. పహల్గాం దాడిలో పాక్‌కు క్లీన్చిట్ ఇచ్చేందుకు ఎక్కడ లేని ఉత్సాహమూ చూపిన చరిత్ర ఆ పార్టీది అంటూ మండిపడ్డారు. పహల్గాం దాడికి పాల్పడింది స్థానిక ఉగ్రవాదులే కావచ్చని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ హోం మంత్రి పి.చిదంబరం ఇటీవల కూడా వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. పీఓకేను స్వాధీనం చేసుకునే అవకాశం చేతికందిన వేళ సైనిక చర్యను కేంద్రం నిలిపేసిందా అంటూ కాంగ్రెస్ సభ్యుడు గౌరవ్ గొగొయ్ సభలో ప్రశ్నించడంపై అమిత్ షా మండిపడ్డారు. ‘‘వాళ్లు ఏం నిరూపించాలని అనుకుంటున్నారు? ఎవరిని కాపాడాలనుకుంటున్నారు? ఇదంతా పాక్‌ను కాపాడేందుకు స్పష్టమైన కుట్రే’’ అంటూ తూర్పారబట్టారు. స్వాతంత్య్రం వచ్చిన వేళ దేశ విభజనను కాంగ్రెస్ వ్యతిరేకించి ఉంటే జమ్మూ కశ్మీర్లో అసలు ఉగ్ర భూతం జడలు విప్పేదే కాదన్నారు. ఉగ్రవాదానికి పాక్ తల్లివేరుగా మారిందంటూ దుయ్యబట్టారు. ఆ దేశం ఏర్పాటును కాంగ్రెస్ తాలూకు తప్పిదంగా అభివర్ణించారు. పాక్‌కు బుద్ధి చెప్పేందుకు వచ్చిన ప్రతి అవకాశాన్నీ కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగానే జారవిడిచిందని ఆరోపించారు. ‘‘1948లో పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను మన సైన్యం పూర్తిగా విముక్తం చేసే సమయంలో నాటి కాంగ్రెస్ ప్రధాని నెహ్రూ ఏకపక్షంగా కాల్పుల విమరణ ప్రకటించారు. 1962 యుద్ధం వేళ అస్సాంను చైనా దఖలు పరుస్తున్నట్టు బాహాటంగా ప్రకటన చేశారు. పైగా ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వ హోదా అవకాశాన్నీ కాలదన్నారు. 1971లో 90,000 మంది పాక్ సైనికులు భారత్‌కు లొంగిపోయారు. ఆ సంఖ్య నాటి పాక్ సైన్యంలో ఏకంగా 42 శాతం. అంతేగాక 15 వేల చదరపు కి.మీ. పాక్ భూభాగం కూడా మన అదుపులోకి వచ్చింది. అయినా పీఓకేను వెనక్కు తీసుకునేందుకు నాటి కాంగ్రెస్ ప్రధాని ఇందిరాగాంధీ ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. సరికదా, ఆ యుద్ధంలో స్వాధీనం చేసుకున్న పాక్ భూభాగాన్ని కూడా పువ్వుల్లో పెట్టి వెనక్కిచ్చారు. ఇలాంటి చరిత్ర ఉన్నవాళ్లు, పహల్గాం దాడికి పాల్పడ్డవారిని ఎందుకు పారిపోనిచ్చారని నన్ను అడుగుతున్నారు. వారిని తుదముట్టించడం ద్వారా ఈ ప్రశ్నకు నా తరఫున భద్రతా దళాలే బదులిచ్చాయి. 1986లో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాక్‌కు పారిపోయింది కూడా కాంగ్రెస్ ప్రధాని రాజీవ్ హయాంలోనే. 1993లో ఉగ్రవాదులు సయీద్ సలాహుద్దీన్, టైగర్ మెమన్, అనీస్ ఇబ్రహీం కస్కర్, 2007లో రియాజ్ భత్కల్, 2010లో ఇక్బాల్ భత్కల్ దేశం వీడి పారిపోయినప్పుడు కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెసే. వీళ్లందరినీ ఎందుకు పారిపోనిచ్చారో విపక్ష నేత రాహుల్‌గాంధీ నుంచి తెలుసుకోవాలని అనుకుంటున్నా’’ అని అన్నారు. -
లోక్‌సభలో ఆపరేషన్ సిందూర్‌పై చర్చ..
-
చిదంబరం అడిగిన ప్రూఫ్ ఇదిగో: అమిత్‌షా
ఢిల్లీ: ఆపరేషన్ సిందూర్‌పై లోక్‌సభలో రెండో రోజు చర్చ సాగుతోంది. ఆపరేషన్ మహాదేవ్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. పాక్ రెచ్చిపోయి సరిహద్దులో హిందూ ఆలయాలు, సామాన్యులను టార్గెట్ చేసిందని.. ఆపరేషన్ మహాదేవ్‌తో పహల్గామ్ ఉగ్రదాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టామని ఆయన వెల్లడించారు.పహల్గామ్లో కుటుంబ సభ్యుల ముందే చంపేశారు. టెర్రరిస్టులు ఉగ్రదాడి తర్వాత పాక్ వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ సరిహద్దు దాటేందుకు అవకాశం ఇవ్వలేదు. నిన్న జమ్మూకశ్మీర్‌లో ఆపరేషన్ మహాదేవ్ జరిగింది. ఆపరేషన్ మహాదేవ్లో సులేమాన్ మూసా హతమయ్యాడు. ముగ్గురిలో ఒకరు ఎల్ఈటీ ఉగ్రవాది సులేమాన్గా గుర్తించాం. ఈ సులేమాన్ పహల్గాం ఉగ్రదాడి కీలక సూత్రధారి’’ అని అమిత్ షా పేర్కొన్నారు.‘‘చిదంబరం ప్రూప్ ఏంటి అని అడుగుతున్నారు. ఆపరేషన్ మహాదేవ్లో హతమైన ముగ్గురు పాక్‌కు చెందిన వారు. ఉగ్రవాదులు దగ్గర పాక్‌లో తయారైన చాకెట్లు దొరికాయి. ఆ ముగ్గురి ఉగ్రవాదుల ఓటర్ వివరాలూ ఉన్నాయి. చిదంబరం పాక్‌కు క్లీన్చిట్ ఎందుకుఇచ్చారు?’’ అంటూ అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు.పహల్గామ్ టెర్రిస్టులను మట్టుబెడితే విపక్షాలు సంతోషిస్తాయని అనుకున్నా.. కానీ చూస్తుంటే విపక్షాలు హ్యాపీగా లేవనిపిస్తోంది. పాక్‌ను రక్షిస్తే చిదంబరానికి వస్తుంది? అంటూ అమిత్‌షా మండిపడ్డారు.కమ్యూనికేషన్ డివైజ్‌ను ట్రాక్ చేయడంద్వారా ఉగ్రగుట్టును పసిగట్టాయి. జమ్మూకశ్మీర్ ోలీసులు, సీఆర్పీఎఫ్, పారామిలటరీ కలిసి ఈ ఆపరేషన్ చేపట్టాయి. ఇది మోదీ సర్కార్ ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదు. యూపీఏ హయాంలో తప్పించుకున్న ఉగ్రవాదులను హతమార్చాం. ఉగ్రవాదులు ప్రాణాలతో దేశం వెళ్లరని ఆ మరుసటి రోజే చెప్పాం’’ అని అమిత్‌షా గుర్తు చేశారు. -
సభలో సిందూరం
న్యూఢిల్లీ: పహల్గాం ఉదంతం, ఆపరేషన్ సిందూర్‌పై తక్షణం చర్చ జరపాలన్న విపక్షాల డిమాండ్లకు తలొగ్గి సోమవారం వివరణలతో చర్చను మొదలెట్టిన అధికార పక్షం, ప్రభుత్వ వివరణను తీవ్రంగా తప్పుబడుతూ విపక్షసభ్యులు చేసిన నినాదాలతో పార్లమెంట్ ఉభయసభలు దద్దరిల్లాయి. ప్రభుత్వం తరఫున రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌లు లోక్‌సభలో సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వాదనను బలంగా వినిపించారు. ఇదేసమయంలో జైశంకర్ ప్రసంగాన్ని విపక్ష సభ్యులు అడ్డుకోవడం, అడ్డుకున్నందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా జోక్యంచేసుకుని కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించడంతో సభలో ఆగ్రహావేశాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఓవైపు ఆపరేషన్ సిందూర్‌పై చర్చ జరుగుతుండగానే బిహార్‌లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణపైనా చర్చ జరపాలని విపక్ష సభ్యులు రాజ్యసభలో పట్టుబట్టారు. దీంతో సభ పలుమార్లు వాయిదాపడి చివరకు అర్థాంతరంగా ముగిసి మంగళవారానికి వాయిదాపడింది.పాక్ కాళ్లబేరానికి వచ్చిందితొలుత లోక్‌సభలో ఆపరేషన్‌సిందూర్‌పై చర్చపై రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు. ‘‘ ఆపరేషన్ సిందూర్ అనేది ముమ్మాటికీ చరిత్రాత్మకమైన సైనిక చర్య. ఉగ్రవాదంపై అత్యంత ప్రభావవంతమైన భారత విధానాన్ని ఈ ఆపరేషన్ ప్రపంచానికి చాటింది. యుద్ధరంగంలో తమ ధైర్యసాహసాలను ప్రదర్శించిన ధైర్యవంతులైన సైనికులందరికీ నా సెల్యూట్. పాక్ పౌరులకు, వారి ఆస్తులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా పక్కా ప్రణాళికతో ఈ ఆపరేషన్‌కు పథకరచన చేశారు. కేవలం ఉగ్రవాదులకే భారీ నష్టం చేకూర్చాం. కేవలం 22 నిమిషాల్లో 9 కీలక ఉగ్రస్థావరాలపై మెరుపుదాడి చేసి మన సత్తా చాటాం. ఊహించని మెరుపుదాడితో చేష్టలుడిగిన పాక్ డైరెక్టర్స్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్(డీజీఎంఓ) స్వయంగా ఫోన్ చేసి తమకు ఉద్రిక్తతలను పెంచే ఉద్దేశ్యంలేదని స్పష్టంచేశారు. ఆలోపు పాక్ జరిపిన డ్రోన్, క్షిపణి దాడులను మన ఎస్–400 గగనతల రక్షణ వ్యవస్థలు విజయవంతంగా నిర్వీర్యంచేశాయి. మన దాడులకు ప్రతీగా పాక్ జరిపిన దాడుల్లో భారత్‌లో ఏ ఒక్క కీలక స్థావరం, ఆయుధాగారం దెబ్బ తినలేదు. ఉగ్రవాదుల స్థావరాలు, వాళ్లకు మద్దతిచ్చేవాళ్లను అంతంచేసేందుకే ఆ ఆపరేషన్. లక్ష్యం నెరవేరిన కారణంగానే ఆపరేషన్ సిందూర్‌ను ఆపేశాం. ఇందులో ఎవరి బలవంతం, ప్రోద్బలం, ప్రమేయం లేవు. బయటిశక్తుల (అమెరికా, ట్రంప్) కారణంగానే పాక్‌పై మనం దాడులను ఆపేశామనడంలో వాస్తవం లేదు. భారత వాయుసేన అసాధారణ దాడులు, సరిహద్దు వెంట ఆర్మీ దీటైన జవాబుకు తోడు నావికాదళం దాడులకు దిగొచ్చన్న భయాలతో పాక్ కాళ్లబేరానికొచ్చింది’’ అని రాజ్‌నాథ్ స్పష్టంచేశారు. ‘‘మమ్మల్ని విపక్షాలు అడగదల్చుకుంటే ఆపరేషన్ సిందూర్ విజయవంతమైందా? అని ఒక్కటే ప్రశ్న వేయాలి. అందుకే మేం అవును అని సూటి సమాధానం చెప్తాం. పాక్ దాడుల్లో మన సైనికులెవరూ వీరమరణం పొందలేదు. ఏ పరీక్షలోనైనా ఫలితమే ముఖ్యం. పరీక్ష రాసేటప్పుడు పెన్సిల్ విరగడము, కలం కనిపించకుండా పోవడమూ సాధారణం. పరీక్షలో ఉత్తీర్ణత సాధించడమే ముఖ్యం. ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలను సైనికదళాలు 100 శాతం కచ్చితత్వంతో సాధించాయి. పాక్తోగానీ మరే ఇతర దేశంతోగానీ ఎప్పుడూ విజయవంతమైన ప్రభుత్వాల సారథ్యంలో స్నేహాన్నే భారత్ కోరుకుంటోంది. గతంలో భారత్ ‘లాహోర్ బస్సు యాత్ర’ బాషలో మాట్లాడితే ధూర్త పాక్‌కు బోధపడలేదు. వాళ్లకు అర్థమయ్యేలా ఈసారి మేం ‘బాలాకోట్ దాడి’ భాషలో మాట్లాడాం. భారత్ ఏ దేశంతోనైనా కరచాలనం కోసం స్నేహహస్తమే అందిస్తుంది. చేతిని మెలిపెట్టాలని చూస్తేమాత్రం ఆ చేతినే విరిచేస్తుంది. పౌరుల ప్రాణాలకు హాని తలపెట్టాలని చూస్తే భారత్ ఏ స్థాయిలో విరుచుకుపడుతుంతో ఆపరేషన్ సిందూర్ కళ్లకుకట్టింది. భారత్‌ను ఏనాటికీ ఓడించలేమని పాక్ పాలకులకు అర్థమైంది. అందుకే ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్నారు. కానీ అది వాళ్లనే మింగేస్తోంది. అమాయక పాక్ ప్రజలనూ చంపేస్తోంది. ఆపరేషన్ ముగియలేదు. పాక్ మళ్లీ తోక జాడిస్తే మళ్లీ సిందూర్ మొదలవుతుంది’’ అని రాజ్‌నాథ్ అన్నారు.వాణిజ్య అంశాల్లో సిందూర్ ప్రస్తావన రాలేదు: జైశంకర్‌ఆపరేషన్ సిందూర్‌పై లోక్‌సభలో చర్చ సందర్భంగా విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ మాట్లాడారు. ‘‘ఆపరేషన్ సిందూర్ వేళ ట్రంప్, మోదీ మధ్య ఎలాంటి ఫోన్ సంభాషణ జరగలేదు. అమెరికాతో వాణిజ్యానికి, ఈ ఆపరేషన్‌కు సంబంధం లేదు. ది రెసిస్టెంట్ ఫ్రంట్‌ను అంతర్జాతీయ ఉగ్రసంస్థగా ప్రకటించడంలో విజయంసాధించిన భారత దౌత్యానికి కృతజ్ఞతలు చెప్పాల్సిందే. మనం పాక్ నడిబొడ్డులోని బహావల్పూర్, మురిద్కేలోని స్థావరాలను నేలమట్టంచేయగలమని ఎవరైనా ఊహించారా?. పహల్గాం దాడిని బ్రిక్స్, క్వాడ్ కూటములేకాదు ఎన్నో దేశాలు ఖండించాయి. పాక్‌పై దాడిచేశాక దాడులను ఆపాలని పాక్ నుంచే అభ్యర్థన వచ్చింది. కానీ మేం పాక్ డైరెక్టర్స్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్(డీజీఎంఓ) నుంచి అభ్యర్థన వస్తేనే ఆపుతామని చెప్పాం’’ అన్నారు. ప్రతిపక్షాలపై అమిత్ షా ఆగ్రహం..విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రసంగిస్తుంటే విపక్ష సభ్యులు పదేపదే అడ్డుత గిలారు. హోం మంత్రి అమిత్ షా జోక్యంచేసుకుని కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ‘‘ఆపరేషన్ సిందూర్‌పై మంత్రి జైశంకర్ చేసిన ప్రకటనను కాంగ్రెస్ సభ్యులు అస్సలు విశ్వసించట్లేరు. బయటివాళ్లు (ట్రంప్) చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌కు నమ్మకం ఎక్కువ. మీ పార్టీలో విదేశీయుల అభిప్రాయాలకు ఎంతటి విలువుందో ఇప్పుడే తెలుస్తోంది. మీ అభిప్రాయాలను పార్లమెంట్‌పై రుద్దకండి. విదేశీయులను నమ్మినందుకే మీరు విపక్షంలో కూర్చున్నారు. ట్రంప్ వంటి విదేశీయుల మాటలను ఇలాగే నమ్ము తూ పోతే మీరు ఇలాగే మరో 20 సంవత్సరాలు విపక్షంలోనే ఉండిపోతారు’’ అని వ్యాఖ్యానించారు.ప్రశ్నలు కురిపించిన కాంగ్రెస్చర్చలో కాంగ్రెస్ తరఫున లోక్‌సభలో ఉపనేత గౌరవ్ గొగోయ్ మాట్లాడుతూ ప్రభుత్వంపై ప్రశ్నలు సంధించారు. ‘‘ పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకునే ఉద్దేశం మోదీ సర్కార్‌కు లేనట్లుంది. నిజంగా తిరిగి హస్తగతం చేసుకునే ఆలోచనే ఉంటే హఠాత్తుగా ఆపరేషన్ సిందూర్‌ను ఎందుకు ఆపాల్సి వచ్చింది?. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు పీఓకేను స్వాధీనంచేసుకుంటాం?. పాక్, భారత్ పరస్పర సైనిక చర్యలకు ముగింపు పలికింది తానేనని ట్రంప్ 26 సార్లు ప్రకటించుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది?. భారత్, పాక్ యుద్దం ఆపితేనే వాణిజ్యం కొనసాగి స్తానని ట్రంప్ అమెరికా వాణిజ్య కత్తిని చూపి బెదిరించారా?. ఇంట్లో చొరబడి మరీ చంపుతామని ఇప్పటికి ఎన్నోసార్లు మోదీ అదే డైలాగ్‌లు కొడుతున్నారు. మరి సిందూర్ పరిసమాప్తంకాలేదని, పాక్ దాడిచేస్తే మళ్లీ మొదలవుతుందని వాళ్లే చెబుతున్నారు. అలాంటప్పుడు సిందూర్ విజయవంతమైందని ఎలా అంటారు? యుద్ధం చేయడం తమ విధానం కాదంటారు? మరి సిందూర్వేళ చేసిందేంటి? వాళ్ల అధీనంలోని భూభాగాన్ని స్వాధీనంచేసుకోవడానికి సిందూర్ చేయలేదంటున్నారు. మరి దేని కోసం చేసినట్లు? సిందూర్ వేళ ఎన్ని యుద్ధవిమానాలను కోల్పోయాం?’’ అని గొగోయ్ ప్రశ్నించారు. డిప్యూటీ ఛైర్మన్‌కు 26 నోటీసులుబిహార్ ఓటర్ల జాబితా అంశంతోపాటు ఇతర రాష్ట్రాల్లో బెంగాళీ వలసకూలీలు వివక్షను ఎదుర్కొనే పలు అంశాలపై రాజ్యసభలో చర్చించాలంటూ డిప్యూటీ చైర్మన్ హరివంశ్‌కు మొత్తం 26 వాయిదా తీర్మానాలు వచ్చాయి. వీటన్నింటినీ ఆయన తోసిపుచ్చారు. జోరీఅవర్ సెషన్‌ను మొదలుపెట్టాలని నామినేటెడ్ సభ్యురాలు సుధామూర్తిని హరివంశ్ కోరగానే విపక్షసభ్యులు ఆందోళన పెంచారు. ఓటు చోరీని ఆపాలి అని నినాదాలుచేశారు. దీంతో మధ్యాహ్నం సెషన్‌లోపే సభ రెండుసార్లు వాయిదాపడింది. తర్వాత సభ మొదలైనా మళ్లీ ఇదే పునరావృతమైంది. దీంతో సభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదావేశారు. తర్వాత సభ మొదలైనా విపక్షసభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలిస్తూ సభ జరక్కుండా అడ్డుకున్నారు. దీంతో చేసేదిలేక సభను మంగళవారానికి వాయిదావేశారు. ó డీ చర్చ -
కేంద్రంపై రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు
-
వారికి నెలకు రూ. 50 వేల చొప్పున ఆర్థిక చేయూత
న్యూఢిల్లీ: భారత్ 2036 ఒలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యమిచ్చేందుకు సిద్ధంగా ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఆ విశ్వక్రీడల నాటికి భారత్ పతకాల పట్టికలో టాప్–5లో నిలవడమే లక్ష్యమని చెప్పారు. ప్రపంచ పోలీస్–ఫైర్ క్రీడల్లో పతకాలతో సత్తా చాటిన భారత బృంద సభ్యులను కేంద్ర మంత్రి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన అమిత్ షా పతక విజేతలకు నజరానా అందజేశారు. అనంతరం మాట్లాడుతూ ‘2036 విశ్వక్రీడల ఆతిథ్య హక్కులు దక్కించుకునేందుకు ప్రాథమిక బిడ్డింగ్‌లో పాల్గొన్నాం. ఒలింపిక్స్‌ను నిర్వహించే సత్తా భారత్‌కు ఉంది. అలాగే ఈ పోటీల కోసం ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. పతకాలు గెలవగలిగే 3000 మంది ప్రతిభావంతుల్ని గుర్తించి వారికి నెలకు రూ. 50 వేల చొప్పున ఆర్థిక చేయూతతో విశ్వక్రీడలకు దీటుగా తయారుచేస్తాం’ అని అన్నారు.ఇదీ చదవండి: భారత్ శుభారంభంసొలో (ఇండోనేసియా): ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత్ శుభారంభం చేసింది. శుక్రవారం జరిగిన తొలి పోరులో 110–69 పాయింట్ల తేడాతో శ్రీలంకపై ఘనవిజయం సాధించింది. గ్రూప్ ‘డి’లో శుక్రవారం జరిగిన టీమ్ ఈవెంట్ మ్యాచ్‌ల్లో భారత్ పది మ్యాచ్‌లు గెలిచి క్లీన్‌స్వీప్ చేసింది.మిక్స్డ్ డబుల్స్‌లో విష్ణు కోడె–రిషిక జోడీ 11–5తో కెనెత్ అరుగొడ–ఇసురి అటనాయకె జంటపై గెలుపొందగా, మహిళల సింగిల్స్‌లో గాయత్రి–మానస రావత్ 11–9తో సితుమి డిసిల్వా–ఇసురి అటనాయకెలపై గెలిచారు. సింగిల్స్‌లో తన్వీ శర్మ 11–7తో సితులి రణసింఘేపై గెలిచింది. మిగతా మ్యాచ్‌ల్లోనూ భారత షట్లర్లే గెలుపొందడంతో గరిష్ట 110 పాయింట్లతో భారత్ జయకేతనం ఎగురవేసింది. శనివారం జరిగే తమ రెండో లీగ్ మ్యాచ్‌లో భారత బృందం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో తలపడుతుంది. -
కేరళలో బుజ్జగింపు రాజకీయాలు
తిరువనంతపురం: కేరళలోని అధికార సీపీఎం సారథ్యంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం, ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌లపై బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోం మంత్రి తీవ్రంగా ధ్వజమెత్తారు. ఈ రెండు పక్షాలు రాష్ట్రంలో అవినీతిని, బుజ్జగింపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నా యన్నారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) వంటి దేశ వ్యతిరేక శక్తులకు కేరళను సురక్షితమైన ప్రాంతంగా మార్చాయని మండిపడ్డారు. శనివారం ఆయన తిరువనంతపురంలో జరిగిన పార్టీ సమావేశంలో ప్రసంగించారు. పీఎఫ్ఐ అనుబంధ సంస్థలను కేంద్రం 2022లో చట్టవ్యతిరేక సంస్థలుగా ప్రకటించింది. కేరళలో పీఎఫ్ఐ సంస్థపై నిషేధం విధించే అధికారం ఉన్నా ఇప్పటి వరకు ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోలేదని, ఆ సంస్థ నేతలను ఎందుకు అరెస్ట్ చేయలేదని ఈ సందర్భంగా వామపక్ష ప్రభుత్వాన్ని అమిత్ షా ప్రశ్నించారు. ‘రాష్ట్రాభివృద్ధి బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏతో మాత్రమే సాధ్యం. దక్షిణాది రాష్ట్రాలు అభివృద్ధి చెందకుండా వికసిత్ భారత్ సాధ్యం కాదు. వికసిత్ కేరళమ్ మాత్రమే వికసిత్ భారత్‌కు మార్గమని చెప్పారు. అందుకే, బీజేపీ లక్ష్యం ఇక నుంచి వికసిత్ కేరళమ్’ అని ఆయన పేర్కొన్నారు. కేరళలో పార్టీకి చెందిన ముఖ్యమంత్రి ఉండటం కంటే రాష్ట్రాన్ని వికసిత్కు కేంద్రంగా మార్చడం ముఖ్యమైన విషయమని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన వికసిత్ కేరళమ్ మిషన్ లోగోను ఆవిష్కరించారు. బీజేపీ, సీపీఎంలకు పార్టీ కేడర్ ఉన్నప్పటికీ ప్రధానమైన తేడా ఒకటుందని చెబుతూ ఆయన..బీజేపీ కేడర్ రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేస్తే, సీపీఎం కేడర్ అభివృద్ధి కోసమే పనిచేస్తుందని వ్యాఖ్యానించారు. 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కేరళలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుందని ప్రకటించారు. ఈ సందర్భంగా అమిత్ షా బీజేపీ రాష్ట్ర కమిటీ కార్యాలయం మరార్జీ భవన్‌ను ప్రారంభించారు. -
పొలిటికల్ రిటైర్మెంట్.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు
బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల నుంచి విరమణ అనంతరం తన భవిష్యత్ ప్రణాళికపై ఆయన ఓ క్లారిటీ ఇచ్చారు. గుజరాత్ అహ్మదాబాద్ వేదికగా ఆయన ఈ ప్రకటన చేశారు.న్యూఢిల్లీ: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా(60) కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ విరమణ అనంతరం అనంతరం భవిష్యత్ ప్రణాళికపై ఆయన ఓ క్లారిటీ ఇచ్చారు. వేదాలు, ఉపనిషత్తులు చదవడంతోపాటు ప్రకృతి వ్యవసాయంపై దృష్టిపెడతానని అన్నారాయన. గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల సహకార సంఘాల మహిళలతో బుధవారం అహ్మదాబాద్‌లో జరిగిన 'సహకార్ సంభాద్' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రిటైర్మెంట్ తర్వాత వేదాలు, ఉపనిషత్తులు చదవడంతోపాటు, ప్రకృతి వ్యవసాయానికే సమయాన్ని కేటాయించాలని నిర్ణయించుకున్నా. రసాయన ఎరువులతో పండించే పంటలతో వివిధ ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ప్రకృతి వ్యవసాయం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. శరీరాన్ని వ్యాధులకు దూరంగా ఉంచడంతోపాటు వ్యవసాయ ఉత్పాదకతను పెంచుతుంది అని అన్నారాయన. సహకార శాఖ మంత్రిగా తన ప్రయాణం ఎంతో అద్భుతంగా ఉందని అమిత్ షా పేర్కొన్నారు. ‘‘హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ముఖ్యమైన శాఖ ఇచ్చారని అందరూ అన్నారు. కానీ, సహకారశాఖ మంత్రి బాధ్యతలు అప్పగించినప్పుడు మాత్రం.. హోంశాఖ కంటే పెద్ద శాఖ ఇచ్చారని నేను భావించా. ఎందుకంటే ఈ శాఖ దేశంలోని రైతులు, పేదలు, గ్రామాలు, పశుసంపద కోసం పనిచేస్తుంది’’ అని షా సంతోషంగా చెప్పారు. అయితే రిటైర్మెంట్ ఎప్పుడనేది మాత్రం ఆయన చెప్పలేదు. సహకార శాఖ మంత్రిగా.. 2021లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహకార మంత్రిత్వ శాఖకు అమిత్ షా తొలి మంత్రిగా నియమితులయ్యారు. సహకార్ సే సమృద్ధి అనే నినాదంతో ఈ శాఖ గ్రామీణ అభివృద్ధికి దోహదం చేస్తోంది. ఈ శాఖ ఏర్పాటునకు ముందు వ్యవసాయ శాఖ సహకార సంఘాల కార్యకలాపాలను చూసుకునేది. అమిత్ షా రాజకీయ ప్రస్థానం.. 1980లలో RSS (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) ద్వారా సామాజిక సేవలోకి ప్రవేశించారు. 1983లో ABVP (RSS విద్యార్థి విభాగం)లో చేరారు. 1987లో భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరారు. యువజన విభాగమైన బారతీయ జనతా యువ మోర్చాలో కీలక పాత్ర పోషించారు. 1997లో గుజరాత్‌లోని సర్కేజ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచారు. గుజరాత్లో 2002–2010 మధ్య హోం, న్యాయ, ట్రాన్స్పోర్ట్, జైలు, నిషేధం వంటి పలు శాఖల మంత్రిగా పనిచేశారు.నరేంద్ర మోదీతో షాకు బలమైన అనుబంధం ఉంది. గుజరాత్ రాజకీయాల్లో మోదీకి అత్యంత విశ్వసనీయుడిగా ఎదిగారు. మోదీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎదిగే దారిలో కీలక పాత్ర పోషించారు. 2014లో BJP జాతీయ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆయన వ్యూహాలతోనే BJP అనేక రాష్ట్రాల్లో విజయం సాధించింది. 2014 & 2019 లోక్‌సభ విజయాల్లో కీలక పాత్ర పోషించారు. యూపీలో 2019 ఎన్నికల్లో 303 సీట్లు గెలవడమూ(2014లో 71 సీట్లు) అమిత్ షా వ్యూహాత్మక నాయకత్వ ఫలితమే. 2019లో హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆర్టికల్ 370 రద్దు, CAA వంటి కీలక నిర్ణయాల్లో కీలక భూమిక పోషించారు. 2021లో కేంద్రం కొత్తగా తెచ్చిన సహకార మంత్రిత్వ శాఖకు తొలి మంత్రిగా నియమితులయ్యారు. -
పని సంస్కృతిలో సాంకేతికత, అవసరాలు భాగం కావాలి: అమిత్ షా
ఆనంద్: సహకార రంగం విజయవంతం కావాలంటే పారదర్శకత, సాంకేతికత వినియోగం, సభ్యుల అవసరాలను పని సంస్కృతిలో భాగంగా మార్చుకోవడం ఎంతో అవసరమని కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పారు. ప్రఖ్యాత అమూల్ డెయిరీ ప్రాంగణంలో ఆదివారం ఏర్పాటైన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సహకార సంస్థలు ఈ మూడు సూత్రాలను తమ పని సంస్కృతిలో విడదీయరాని భాగాలుగా చేసుకుని జమ్మూ కశీ్మర్ నుంచి అస్సాం వరకు, దేశంలోని ప్రతి గ్రామానికి వాటిని ప్రచారం చేయాలని సూచించారు. ప్రధాని మోదీ సారథ్యంలో దేశంలో 2 లక్షల ప్రాథమిక సహకారం పరపతి సంఘాలు(పీఏసీఎస్‌లు), మొట్టమొదటి జాతీయ సహకార యూనివర్సిటీ త్రిభువన్, డెయిరీ రంగంలో మూడు జాతీయ సహకార సంఘాలు ఏర్పాటు వంటి కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయన్నారు. సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటైన నాలుగేళ్లలోని 60కి పైగా కార్యక్రమాలను కొత్తగా ప్రారంభించామన్నారు. అమూల్ పాల సహకార వ్యవస్థ వార్షిక టర్నోవర్ ప్రస్తుతమున్న రూ.80వేల కోట్ల నుంచి వచ్చే ఏడాదికల్లా రూ.లక్ష కోట్లకు చేరుకోనుందని అమిత్ షా ప్రకటించారు. గుజరాత్ సహకార పాల మార్కెటింగ్ సమాఖ్యకే అమూల్ అని పేరు. ఈ సంస్థ నిత్యం 36 లక్షల రైతుల నుంచి 3.20 కోట్ల లీటర్ల పాలను సేకరిస్తుంది. -
సాగే కాదు.. ఎగుమతులు కూడా
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన పసుపు బోర్డుకు అనుబంధంగా పసుపు ఎగుమతుల పెంపు లక్ష్యంతో ‘భారత్ ఆర్గానిక్ కోఆపరేటివ్ లిమిటెడ్’ను ఏర్పాటు చేసి దాని ఆధ్వర్యంలో ఆర్గానిక్ పసుపు పండించే విషయమై స్థానికంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (ఆర్అండ్డీ) సెంటర్‌ను ఏర్పాటు చేస్తామన్న కేంద్ర సహకార, హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రకటనతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. అదేవిధంగా కో ఆపరేటివ్ ఎక్స్పోర్ట్ ఓరియంట్ యూనిట్ ఏర్పాటుకు సైతం కేంద్రం సన్నాహాలు చేస్తుండటంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.దీని ద్వారా పసుపు బ్రాండింగ్–మార్కెటింగ్–ఎక్స్పోర్ట్ పాలసీతో వచ్చే ఐదేళ్లలో ఒక బిలియన్ డాలర్ల (రూ.8 వేల కోట్లు) ఎగుమతులు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘ఇందూరు బ్రాండ్’ పేరిట తామే పసుపు సేద్యం చేయడంతో పాటు ఎగుమతులు చేసేందుకు కూడా అవకాశాలు లభిస్తాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎగుమతులు భారీగా పెరిగితే ప్రస్తుతం ఉన్న క్వింటాల్ పసుపు ధర రూ.15 వేల నుంచి రూ.50 వేలకు పెరుగుతుందని చెప్పడంతో రైతుల్లో ఉత్సాహం వెల్లువెత్తుతోంది. తమ ప్రాంతానికి అంతర్జాతీయ ఖ్యాతి దక్కుతుందంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.విత్తనం నుంచి ఎగుమతుల వరకు అండగా..కొంతకాలం క్రితం వరకు సుగంధ ద్రవ్యాల బోర్డు కింద ఉన్న పసుపు పంటను విడదీసి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పసుపు బోర్డు ఏర్పాటు చేయడమే కాకుండా దీన్ని నిజామాబాద్‌లో నెలకొల్పింది. ప్రత్యేక బోర్డుతో రైతులకు అభివృద్ధి చేసిన, తెగుళ్లు తట్టుకునే కొత్త వంగడాలు అందుబాటులోకి వస్తాయి. విత్తనాలు మొదలు పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్, మార్కెటింగ్ వరకు రైతులకు సహకారం లభిస్తుంది. అవసరాన్ని బట్టి పసుపు బోర్డు రైతులకు విత్తనం అందించి పంటను బై బ్యాక్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. మరోవైపు రాయితీలు సైతం పెరుగుతాయి. పసుపు తవ్వకం, ఆర బెట్టడం, ఉడక బెట్టడం, ఎండబెట్టడం, పాలిష్ చేయడానికి అవసరమైన యంత్రాలను రాయితీపై అందిస్తారు. కొత్త వంగడాల అభివృద్ధితో పాటు పసుపు పంట విత్తిన తర్వాత సాగుకు శాస్త్రీయ, సాంకేతిక పద్ధతులు అవలంబించే విషయంలో శాస్త్రవేత్తలు సలహాలు, సూచనలు ఇస్తారు.తద్వారా దిగుబడి పెరడమే కాకుండా పంటలో నాణ్యతకు అవకాశం ఉంటుంది. ఇక పసుపు పంట మార్కెటింగ్ కోసం అంతర్జాతీయ కంపెనీలను తీసుకువచ్చే బాధ్యత సైతం బోర్డు తీసుకుంటుంది. ఎఫ్‌పీవోలు (రైతు ఉత్పత్తిదారుల సంఘాలు) ద్వారా పసుపు ఆరబెట్టి, ఉడకబెట్టి, పాలిష్ చేసి, పౌడర్ చేసి, ప్యాకెట్లు చేసి ప్రత్యేక బ్రాండ్ల ద్వారా నేరుగా ఎగుమతులు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు కూడా కేంద్రమంత్రి ప్రకటించారు. తదుపరి దశలో ఇక్కడ పసుపు శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేసేందుకు కూడా కేంద్రం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు జిల్లాకు పసుపు శుద్ధి కర్మాగారాలు తరలి వస్తాయని, దీంతో ఈ ప్రాంతంలో ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని స్థానికులు చెబుతున్నారు. సాగు పెంచేలా ప్రణాళికలుపసుపు బోర్డు నేపథ్యంలో పసుపు సాగు విస్తీర్ణాన్ని 2008లో మాదిరిగా లక్ష ఎకరాలకు పైగా పెంచేలా ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు కేంద్రం ప్రణాళికలు తయారు చేస్తోంది. నిజామాబాద్ మార్కెట్‌కు గతంలో 12 లక్షల క్వింటాళ్లకు పైగా పసుపు వచ్చేది. రానురాను విస్తీర్ణం తగ్గడంతో పంట ఉత్పత్తి సైతం భారీగా తగ్గుతూ వస్తోంది. గత సీజన్లో రాష్ట్రంలో 40 వేల ఎకరాల లోపే పసుపు సాగు చేశారు. తాజాగా ముగిసిన సీజన్లో నిజామాబాద్ మార్కెట్‌కు 8 లక్షల క్వింటాళ్ల పసుపు మాత్రమే వచ్చింది. రాష్ట్రంలో మొత్తం పసుపు సాగులో 65 శాతం ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే ఉండటం గమనార్హం. తదుపరి స్థానాల్లో జగిత్యాల, నిర్మల్, వికారాబాద్, మహబూబాబాద్ జిల్లాలు ఉన్నాయి.రైతులకు ఎగుమతి అవకాశాలుపసుపు బోర్డు ఏర్పాటుతో తెలంగాణలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతుంది. భారత్ ఆర్గానిక్ కోఆపరేటివ్ లిమిటెడ్ పేరిట పసుపు ఎగుమతులు చేసేందుకు నేరుగా రైతులకే అవకాశం లభిస్తుంది. విలువ ఆధారిత పంట ఉత్పత్తులను రైతులే అంతర్జాతీయ స్థాయిలో ఎగుమతి చేసే అవకాశం కలుగుతుంది. దీంతో రైతులకు మరింత లబ్ధి చేకూరుతుంది. – పాట్కూరి తిరుపతిరెడ్డి, పసుపు రైతు, ఎఫ్‌పీవో చైర్మన్, మనోహరాబాద్పోరాటానికి దక్కిన గౌరవంపసుపు బోర్డు సాధన కోసం ఏళ్ల తరబడి అనేక పోరాటాలు చేశాం. ఈ క్రమంలో మాపై అనేక కేసులు అయ్యాయి. వీటికి సంబంధించి ఇప్పటికీ కోర్టుకు తిరుగుతున్నాం. పసుపు బోర్డు రావడంతో మా పోరాటా నికి గౌరవం దక్కింది. 9 నెలల పాటు సాగు చేసే ఈ పంటకు బోర్డుతో మద్దతు ధర దక్కడంతో పాటు ఎగుమతులు సైతం చేసుకునే అవకాశం కలుగుతుందని ఆశిస్తున్నాం. – చింతలపల్లి గంగారెడ్డి, పసుపు రైతు, మునిపల్లి -
కాంగ్రెస్‌కు ఏటీఎం: అమిత్‌షా
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతోందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా ఆరోపించారు. రేవంత్‌రెడ్డి సర్కార్ ఢిల్లీలో కాంగ్రెస్ నాయకత్వానికి ఏటీఎంలా మారిందని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లే రోజులు వచ్చాయని అన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కాళేశ్వరం, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, సింగరేణి నియామకాల వంటి వాటి ద్వారా రాష్ట్రాన్ని భారీగా లూటీ చేసి, ఏటీఎంలా మార్చి దోచేసుకుందని ఆరోపించారు. ఆదివారం నిజామాబాద్‌లో పసుపు బోర్డు కార్యాలయాన్ని కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, ఎంపీ అర్వింద్, బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డిలతో కలిసి అమిత్‌షా ప్రారంభించారు. పసుపు రైతులతో మాట్లాడారు. పసుపు బోర్డు లోగోను ఆవిష్కరించారు. రైతు మహా సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు.అధికారం మారినా అవినీతి మారలేదు‘రాష్ట్రంలో అధికారం మారినప్పటికీ అవినీతి మారలేదు. బీఆర్ఎస్ చేసిన అవినీతిపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కేసులు నమోదు చేయడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి మించి అవినీతికి పాల్పడుతోంది. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు నాయకులు, కార్యకర్తలు సంకల్పం తీసుకోవాలి. ఆపరేషన్ సిందూర్‌కు ఆధారాలు చూపించాలంటూ రాహుల్‌బాబా ఏవేవో పిచ్చి ప్రశ్నలు వేస్తున్నాడు. మోదీ ప్రభుత్వం గత పదేళ్లలో పాకిస్తాన్‌కు భారత్ తడాఖా ఏంటో చూపించింది. పదేళ్లలో మూడుసార్లు ఆ దేశంపై దాడి చేసింది. సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్ చేశాం. యూరి, పుల్వామా, పహల్గామ్ దాడులకు ధీటైన బదులు ఇచ్చాం. ఆపరేష¯న్ సిందూర్ ద్వారా పాకిస్తాన్ గడ్డపైకి వెళ్లి దాడి చేశాం. అక్కడి ఉగ్రవాదుల స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది. కీలక టెర్రరిస్టులను మట్టుబెట్టింది. కానీ గతంలో కాంగ్రెస్ సర్కార్.. పాకిస్తాన్ విషయంలో మెతక వైఖరి అవలంబించింది..’ అని అమిత్‌షా విమర్శించారు. 2026 మార్చిలోగా నక్సల్స్ ఏరివేత‘దేశ భద్రతను మోదీ ప్రభుత్వం పటిష్టం చేçస్తోంది. దేశంలో అశాంతికి కారణమైన నక్సల్స్ ఏరివేతకు అపరేషన్ కగార్ చేపట్టాం. (ఆపరేషన్ కగార్ చేయాలా.. వద్దా అని సభికులను ప్రశ్నించారు) దశాబ్దాలుగా నక్సల్స్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. లొంగిపోవాలని గతంలోనే హెచ్చరించినా లొంగిపోలేదు. అందుకే కగార్ చేపట్టాం. 2026 మార్చిలోగా దేశంలో నక్సల్స్ లేకుండా చేసి ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకుంటాం. మావోయిస్టులు వెంటనే హత్యాకాండను విడిచి లొంగిపోవాలి..’ అని కేంద్ర హోంమంత్రి విజ్ఞప్తి చేశారు. పసుపు పంటకు రాజధానిగా ఇందూరు‘తెలంగాణ రైతులకు ఇచ్చిన హామీ మేరకు మోదీ ప్రభుత్వం జాతీయ పసుపు బోర్డును నిజామాబాద్‌లో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. భారతీయ సంప్రదాయాల్లో, ఔషధాల తయారీలో వినియోగించే పసుపు పంటను నిజామాబాద్ జిల్లా రైతాంగం అధికంగా సాగు చేస్తోంది. అందుకే ఈ ప్రాంత రైతుల ఆకాంక్షను గౌరవిస్తూ ప్రధాని మోదీ నిజామాబాద్‌లో పసుపు బోర్డును నెలకొల్పారు. ఇప్పుడు నిజామాబాద్ పసుపు పంటకు రాజధాని నగరంగా మారింది. నిజామాబాద్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తుంది. అనేక దశాబ్దాలుగా ఈ పంట పండిస్తున్నప్పటికీ రైతులకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా లాభాలు సమకూరడం లేదు. ప్రస్తుతం బోర్డు ఏర్పాటుతో పసుపు రైతులకు ఇప్పుడు అందుతున్న మద్దతు ధర కంటే రానున్న రెండు మూడు సంవత్సరాల్లో క్వింటాలుకు అదనంగా కనీసం రూ.7 వేల వరకు ఎక్కువ ధర దక్కుతుంది. ఎగుమతులు భారీగా పెరిగితే ధర కూడా భారీగా పెరిగిపోతుంది. పసుపు బోర్డు ద్వారా రైతులకు నాణ్యమైన పంటను సాగు చేసేలా శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు ప్యాకింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్, ఎగుమతుల వరకు దళారుల ప్రమేయం లేకుండా చేయడం జరుగుతుంది. 2030 వరకు అంతర్జాతీయ స్థాయిలో ఒక బిలియన్ డాలర్ల విలువ చేసే పసుపు ఉత్పత్తులను ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం భారత్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్, ఆర్గానిక్ పంటను ప్రోత్సహించేందుకు రీసెర్చి అండ్ డెవలప్మెంట్ సెంటర్లను నెలకొల్పుతోంది..’ అని అమిత్‌షా వెల్లడించారు.స్థానిక రైతుల పోరాటం ఫలించింది: తుమ్మలతెలంగాణ పసుపు రైతుల చిరకాల వాంఛను గుర్తించి పసుపు బోర్డును ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలిపారు. బోర్డు ఏర్పాటుతో ఈ ప్రాంత రైతుల పోరాటం ఫలించినట్లయిందని అన్నారు. బోర్డు ద్వారా అధునాతన సాగు విధానాలు, యాంత్రీకరణ, సరికొత్త పరిశోధనలు, మెరుగైన మార్కెటింగ్, ఎగుమతుల వంటి వసతులతో పసుపు రైతులకు ప్రయోజనం కలిగేలా కేంద్రం పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతుల సంక్షేమమే పరమావధిగా పాలన చేస్తోందని, తీవ్ర ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ రైతాంగ ప్రయోజనాల కోసం ఏడాది కాలంలోనే రూ.లక్ష కోట్ల వరకు ఖర్చు చేశామని చెప్పారు. బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ.. పసుపు బోర్డును ఏర్పాటు చేసినందుకు ప్రధాని మోదీకి, అమిత్‌షాకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో బోర్డు కార్యదర్శి భవానిశ్రీ, ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, డాక్టర్ ఆర్.భూపతిరెడ్డి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, సీపీ సాయిచైతన్య, కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి, సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్‌రెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు. -
‘అందరికీ ఇచ్చారు అవకాశం.... ఈసారి బీజేపీకి ఇవ్వండి అధికారం’
నిజామాబాద్: వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం ఇవ్వాలని కేంద్ర మంత్రి, ఎంపీ బండి సంజయ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రైతును రాజును చేయడమే మోదీ సర్కారు లక్ష్యమని, అందుచేత బీజేపీకి అధికారం ఇవ్వాలని బండి సంజయ్ విన్నవించారు. నిజామాబాద్‌లో పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి అమిత్‌షా ప్రారంభించారు. దీనిలో భాగంగా ఇందూరు రైతు మహా సమ్మేళన సభలో బండి సంజయ్ ప్రసంగించారు. ‘ రైతును రాజును చేయడమే మోదీ సర్కారు లక్ష్యం. పసుపు బోర్డు సాధించుకున్న ఇందూర్ రైతులు హీరోలు. ధర్మపురి అరవింద్ పసుపు అరవింద్ అయ్యారు’ అని బండి సంజయ్ పేర్కొన్నారు.బండి సంజయ్న ప్రసంగానికి ఆహ్వానించిన క్రమంలో సభ చఘ్పట్లతో దద్దరిల్లింది. ప్రజా స్పందనను ఆస్వాదిస్తూ బండి సంజయ్ ప్రసంగాన్ని ఆలకించారు అమిత్ షా. దేశ ప్రజల ఆరోగ్యంలో పసుపు రైతులది కీలక పాత్ర: అమిత్ షా -
పసుపు రైతుల 40 ఏళ్ల కలను నెరవేర్చాం: అమిత్ షా
-
దేశ ప్రజల ఆరోగ్యంలో పసుపు రైతులది కీలక పాత్ర: అమిత్ షా
సాక్షి, నిజామాబాద్: పసుపు రైతుల దశాబ్దాల కల అయిన పసుపు బోర్డు జాతీయ కార్యాలయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ తదితరులు హాజరయ్యారు. పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం అనంతరం పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో పసుపు ఉత్పత్తులను అమిత్ షా పరిశీలించారు.కిసాన్ సమ్మేళన్(రైతు సమ్మేళనం) బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడుతూ.. దేశ ప్రజలను ఆరోగ్యంగా ఉంచడంలో పసుపు రైతులు కీలక పాత్ర వహిస్తున్నారన్నారు. పసుపు రైతులకు ప్రధాని మోదీ ఇచ్చిన హామీ నెరవేరిందన్నారు. ఈ సందర్భంగా దేశంలోని పసుపు రైతులకు ఆయన అభినందనలు తెలిపారు. పసుపు బోర్డు వల్ల ప్రపంచంలోనే పలు దేశాలకు నిజామాబాద్ పసుపు వెళ్తుందన్న అమిత్ షా.. కొనుగోలు, రవాణా, ఎగుమతి అన్నీ పసుపు బోర్డు చూసుకుంటుందన్నారు. పసుపును ప్రపంచం అద్భుత ఔషధంగా చూస్తుందని అమిత్ షా అన్నారు.‘‘ఒక బిలియన్ డాలర్లు విలువ చేసే పసుపును ఎగుమతి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాం. రైతులకు మంచి ధర రావాలన్నదే మా లక్ష్యం. నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, మెట్పల్లిలో పసుపును అధికంగా పండిస్తారు. రైతులకు బోర్డు ద్వారా నూతన సాగు విధానంపై శిక్షణ ఇస్తాం. పసుపు రైతుల సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉంది. తెలంగాణకు పసుపు బోర్డు ఇవ్వడమే కాకుండా బోర్డు ఛైర్మన్‌గా తెలంగాణ వ్యక్తినే నియమించాం. పసుపు బోర్డు కోసం బీజేపీ ఎంపీలు ఎంతో పోరాడారు’’ అని అమిత్ షా ప్రశంసించారు.‘‘ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పాం. పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి ఉగ్రవాదులను హతమార్చాం. ఆపరేషన్ సిందూర్‌పై రాహుల్ ఆధారాలు అడుగుతున్నారు. పాకిస్థాన్ మాట రాహుల్ గాంధీ నోట వినపడుతోంది. గత కాంగ్రెస్ సర్కార్ పాక్ విషయంలో మెతుక వైఖరి అవలంబించింది. మోదీ సర్కార్ ఈ పదేళ్లలో మూడుసార్లు పాక్‌కు భారత్ తడాఖా ఏంటో చూపింది.ఆపరేషన్ కగార్ చేయాలా? వద్దా..?. లొంగిపోవాలని హెచ్చరించినా లొంగిపోలేదు.. కాబట్టే ఆపరేషన్ కగార్ చేపట్టాం. 2026 నాటికి మావోయిస్ట్ ముక్త్ భారత్. బీఆర్ఎస్ సర్కార్ ఎలాంటి అవినీతికి పాల్పడిందో మీకు తెలుసు. కాళేశ్వరం బీఆర్ఎస్కు ఏటీఎం అయితే.. ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఢిల్లీకి ఏటీఎంగా తయారైంది. తెలంగాణా జనం బీఆర్ఎస్ జెండా పీకి పారేశారు. ఇక్కడ కాంగ్రెస్‌కు కూడా నూకలు చెల్లే రోజు వస్తోంది’’ అని అమిత్ షా వ్యాఖ్యానించారు. -
‘మేం కూడా స్నేహితులమే.. మరి మీరు తమిళం నేర్చుకోండి’
చెన్నై: హిందీ భాష అనేది ఎవరికీ శత్రువు కాదని, ఆ భాషను స్నేహపూర్వకంగా దక్షిణాది రాష్ట్రాలు చూడాలన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు డీఎంకే ఎంపీ కనిమొళి పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. తాము హిందీ నేర్చుకోవడం సంగతిని కాసేపు పక్కన పెట్టి, ఉత్తరాది వారు తమిళం నేర్చుకుంటే బాగుంటుందని కనిమొళి స్పష్టం చేశారు. అలాగైనా తమిళ భాష జాతీయ స్థాయిలో గుర్తింపు ఇచ్చినట్లు అవుతుందని ఆమె పేర్కొన్నారు. ‘మేం(తమిళులం) కూడా ఎవరికీ శత్రువులం కాదు.. మేం కూడా స్నేహితులమే. మా భాష కూడా అంతా నేర్చుకోవచ్చు. ప్రత్యేకంగా నార్త్ ఇండియన్స్ తమిళం నేర్చుకంటే బాగుంటుంది’ అని అమిత్ షా పేరును ప్రస్తావించకుండానే తనదైన శైలిలో పేర్కొన్నారు.అంతకుముందు అమిత్ షా మాట్లాడుతూ.. హిందీ భాషను దేశంలోని ప్రతీ ఒక్కరు నేర్చుకోవాలన్నారు. హిందీని ఎవరూ శత్రువుగా భావించొద్దని, అది ఏ భాషకు శత్రువు కూడా కాదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకురాబోతున్న ‘త్రిభాషా పాలసీ’లో హిందీని తప్పనిసరి చేయడానికి చూడటాన్ని కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇందులో తమిళనాడుతో పాటు పలు రాష్ట్రాలు హిందీ భాషను తమ రాష్ట్రాల్లో రుద్దడాన్ని ఒప్పుకోవడం లేదు. ఈ క్రమంలోనే తమిళనాడు సీఎం స్టాలిన్ సైతం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమకు తమిళం ఉండగా హిందీ ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ రాజకీయ దురుద్దేశాలతోనే హిందీని తమిళనాడులో పాతాలని చూస్తున్నారని ఇప్పటికే ఎన్నోసార్లు ధ్వజమెత్తారు. ఇప్పుడు అదే పార్టీకి చెందిన ఎంపీ కనిమొళి సైతం హిందీ భాషను తమ రాష్ట్రంలోకి తీసుకు రావడాన్ని ఖండించారు. -
29న పసుపు బోర్డు ప్రారంభం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఈ నెల 29న నిజా మాబాద్‌లో పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభిస్తారని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. అదే రోజు జరిగే రైతు సమ్మేళనం బహిరంగసభలో కూడా పాల్గొంటారని చెప్పారు. గురు వారం నిజామాబాద్ పర్యటనకు వచ్చిన కిషన్‌రెడ్డి ఎంపీ ధర్మపురి అర్వింద్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు.40 ఏళ్ల రైతుల ఆకాంక్ష, అనేక పోరాటాలు, ఉద్యమాల ఫలితంగా కేంద్రం నిజామాబాద్‌కు పసుపు బోర్డు ప్రకటించిందన్నారు. ఎంపీ అర్వింద్ కృషితో రాష్ట్ర, జాతీయ పార్టీ నిర్ణయం, ప్రధాని మోదీ ఆశీ స్సులతో పసుపు బోర్డు ఏర్పడిందని చెప్పారు.సీనియర్ నేత, దివంగత ధర్మపురి శ్రీనివాస్ విగ్రహాన్ని అమిత్‌షా ఆవిష్కరించనున్నట్టు కిషన్‌రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలన్నారు.రేవంత్‌రెడ్డి టీపీసీసీ చీఫ్‌గా ఉన్న సమయంలో ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ పోలీసులపై తెలంగాణ పోలీసులే దర్యాప్తు చేస్తే న్యాయం జరగదన్నారు. సమావేశంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. -
మావోయిస్టులను నిద్రపోనివ్వను
రాయ్‌పూర్: మావోయిస్టులు సాధారణగా వర్షాకాలంలో విశ్రాంతి తీసుకుంటారని, కానీ ఈ వర్షాకాలంలో కూడా మావోయిస్టులను నిద్రపోనివ్వనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. వర్షాకాలంలో కూడా ప్రభుత్వ ఆపరేషన్ కొనసాగుతుందని హెచ్చరించారు. చర్చల ప్రసక్తే లేదన్న మంత్రి.. అడవుల్లో ఉన్న మావోయిస్టులంతా ఆయుధాలు వదిలి జన జీవన స్రవంతిలో కలిసిపోవాలని, అభివృద్ధికి కలిసి రావాలని పిలుపునిచ్చారు. చత్తీస్‌గఢ్‌లోని నవా రాయ్‌పూర్ అటల్ నగర్లో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ(ఎన్ఎఫ్ఎస్యూ)కి ఆదివారం మంత్రి శంకుస్థాపన చేశారు. అలాగే సెజ్బహార్లోని ఎన్ఎఫ్ఎస్యూ ట్రాన్సిట్ క్యాంపస్‌ను, ఛత్తీస్‌గఢ్‌లోని ఐ–హబ్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం షా మాట్లాడుతూ వచ్చే ఏడాది మార్చి చివరికల్లా నక్సలిజాన్ని అంతం చేస్తామని పునరుద్ఘాటించారు. ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలిసిపోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను కూడా అమలు చేస్తామన్నారు. అవసరమైతే అంతకన్న ఎక్కువ సహాయ, సహకారాలు అందిస్తామని తెలిపారు. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియంలను పూర్తిగా అమలుతో మన దేశ నేర న్యాయ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత ఆధునిక, వేగవంతమైన, శాస్త్రీయ న్యాయ వ్యవస్థగా మారుతుందని షా అన్నారు. నవ రాయ్‌పూర్‌లోని ఎన్ఎఫ్ఎస్యూ క్యాంపస్‌కు రూ. 145 కోట్లు, సీఎఫ్ఎస్ల్కు రూ. 123 కోట్లు ఖర్చవుతుందని, ఇవి మూడు సంవత్సరాలలో అందుబాటులోకి వస్తాయన్నారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికత ఆవిష్కరణ, మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక, ఆర్థిక పురోగతిపైనే కాకుండా సకాలంలో న్యాయం అందించడంపైనా దృష్టి పెడుతుందని చెప్పారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి, ఉప ముఖ్యమంత్రులు అరుణ్ సావో, విజయ్ శర్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
‘సింధు ఒప్పందం’పై పాక్‌కు కంగుతినిపించిన అమిత్ షా
న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాక్- భారత్ మధ్య ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. ఈ నేపధ్యంలోనే భారత్.. పాక్‌తో సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. అయితే ఈ పరిణామంతో కంగుతిన్న పాక్ తిరిగి సింధు జలాల ఒప్పందం పునరుద్ధరణకు వేడుకుంటోంది. దీనిపై హోంమంత్రి అమిత్ షా మరోమారు ఈ విషయంలో భారత్ వైఖరిని స్పష్టం చేశారు.ఇస్లామాబాద్‌తో సింధు జలాల ఒప్పందాన్ని భారతదేశం ఎప్పటికీ పునరుద్ధరించబోదని, పాకిస్తాన్‌కు ప్రవహించే సింధు నీటిని భారత అంతర్గత వినియోగం కోసం మళ్లించనున్నామని హోంమంత్రి అమిత్ షా టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. కాశ్మీర్లో చోటుచేసుకున్న ఉగ్రదాడిలో 26 మంది మృతిచెందిన అనంతరం సింధు నదీ వ్యవస్థ వినియోగాన్ని నియంత్రించే 1960 ఒప్పందంలో భారతదేశం తన భాగస్వామ్యాన్ని నిలిపివేసింది. ఈ ఒప్పందం కింద భారతదేశంలోని మూడు నదుల నీటిని పాకిస్తాన్‌లోని 80శాతం పొలాలకు అందించేందలా నాడు ఒప్పందం కుదిరింది.ఈ ఒప్పందం రద్దుపై తాజాగా స్పందించిన అమిత్ షా.. ఒక కాలువ నిర్మించడం ద్వారా పాకిస్తాన్‌కు ప్రవహిస్తున్న నీటిని రాజస్థాన్‌కు మళ్లిస్తామని, అప్పుడు పాకిస్తాన్‌కు నీటి కొరత ఏర్పడుతుందని అన్నారు. షా చేసిన వ్యాఖ్యలు.. భవిష్యత్తులో ఈ ఒప్పందంపై చర్చల కోసం తపిస్తున్న ఇస్లామాబాద్ ఆశలను నీరుగార్చాయి. అయితే అంతర్జాతీయ చట్టం ప్రకారం ఈ ఒప్పందాన్ని నిలిపివేయాలనే భారతదేశ నిర్ణయాన్ని చట్టపరంగా సవాలు చేయాలని ఇస్లామాబాద్ యోచిస్తున్నదని సమాచారం.ఇది కూడా చదవండి: భయంతో బంకర్లో ఇరాన్ ఖమేనీ... వారసుల రేసులో ముగ్గురు? -
ఇంగ్లీషులో మాట్లాడేవారు సిగ్గుపడే రోజులొస్తాయ్: అమిత్ షా
ఢిల్లీ: మన దేశ భాషలే మన సంస్కృతికి రత్నాలని.. భాషలు మనుగడలో లేకుంటే నిజమైన భారతీయులుగా ఉండలేమంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా నొక్కి చెప్పారు. మాజీ సివిల్ సర్వెంట్ ఐఏఎస్ అశుతోష్ అగ్నిహోత్రి రచించిన ‘మెయిన్ బూంద్ స్వయం, ఖుద్ సాగర్ హూన్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.భారతీయ భాషలు దేశ గుర్తింపుకు ఆత్మ వంటివన్న అమిత్ షా.. భారతదేశ భాషా వారసత్వాన్ని తిరిగి పొంది, మాతృభాషల పట్ల గర్వంతో ప్రపంచానికి నాయకత్వం వహించాల్సిన సమయం వచ్చిందన్నారు. ఈ దేశంలో ఇంగ్లీష్ మాట్లాడేవారు త్వరలోనే సిగ్గుపడతారు.. అటువంటి సమాజం ఏర్పడటం ఎంతో దూరంలో లేదు. దృఢ సంకల్పం ఉన్నవారు మాత్రమే మార్పు తీసుకురాగలరు. మన దేశ భాషలు మన సంస్కృతికి రత్నాలు అని నేను నమ్ముతున్నాను.’’ అంటూ అమిత్ షా చెప్పుకొచ్చారు.మన దేశాన్ని, మన సంస్కృతి, చరిత్ర, మతాన్ని అర్థం చేసుకోవడానికి ఏవిదేశీ భాష కూడా సరిపోదని అమిత్ షా వ్యాఖ్యానించారు. పూర్తి భారతదేశ ఆలోచనను విదేశీ భాషల ద్వారా ఊహించలేం. ఈ యుద్ధం ఎంత కష్టమో నాకు పూర్తిగా తెలుసు, కానీ భారత సమాజం దానిని గెలుస్తుందని కూడా నాకు పూర్తిగా నమ్మకం ఉంది. మరోసారి ఆత్మగౌరవంతో, మన దేశాన్ని మన స్వంత భాషలలో నడుపుతాం. ప్రపంచాన్ని కూడా నడిపిస్తాం’’ అని అన్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రూపొందించిన 'పంచ ప్రాణ్' (ఐదు ప్రతిజ్ఞలు) గురించి వివరిస్తూ.. ఈ ఐదు ప్రతిజ్ఞలు దేశంలోని 130 కోట్ల మంది ప్రజల సంకల్పంగా మారాయని అమిత్ షా అన్నారు. అమృత్ కాల్ కోసం మోదీ జీ 'పంచ ప్రాణ్' (ఐదు ప్రతిజ్ఞలు)కు పునాది వేశారు. 2047 నాటికి మనం శిఖరాగ్రంలో ఉంటామని.. ఈ ప్రయాణంలో మన భాషలు ప్రధాన పాత్ర పోషిస్తాయి" అని అమిత్ షా చెప్పారు. -
ఇది 20 ఏళ్ల కల.. కొడుకుతోపాటే కానిస్టేబుల్ జాబ్ కొట్టాడు
అతనికి పోలీస్ కావాలనే కల. చదువుకునే టైంలో కష్టపడ్డప్పటికీ ఆ కలను నెరవేర్చుకోలేకపోయాడు. ఈలోపు కుటుంబం ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా.. ఆర్మీ ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. కట్ చేస్తే.. ఇరవై ఏళ్ల తర్వాత తన కన్నకొడుకుతో కలిసి పోలీస్ ఎగ్జామ్‌కు ప్రిపేర్ అయ్యాడు. కఠోర శ్రమ తర్వాత కొడుకుతో పాటే కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఉత్తర ప్రదేశ్‌లో రెండేళ్ల కిందట(2023 డిసెంబర్లో) 60 వేల కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఆ పరీక్షలో యశ్పాల్ అనే రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి(41) ఎంపికయ్యాడు. అయితే ఇదే నోటిఫికేషన్లో ఆయన కొడుకు శేఖర్(21)కు కూడా ఉద్యోగం వచ్చింది. అందుకే లక్నో జరిగిన ఈవెంట్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేతుల మీదుగా ఇద్దరికీ అపాయింట్మెంట్ లెటర్లు ఇప్పించారు ఈ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యానాథ్. అందుకు ప్రత్యేకంగా కారణం ఉంది.యశ్పాల్ స్వస్థలం హపూర్ జిల్లా ధౌలానా తాలుకా ఉదయ్‌పూర్ ఉదయ్‌రాంపూర్ నంగ్లా గ్రామం. రెండు దశాబ్దాల కిందట కానిస్టేబుల్ పరీక్షకు ప్రిపేర్ అయ్యాడు. రెండు అటెంప్ట్‌లలో జాబ్ కొట్టలేకపోయాడు. ఆపై 2003లో ఆర్మీలో చేరాడు. 16 ఏళ్ల సర్వీస్ తర్వాత వలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని.. ఢిల్లీ ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్లో పని చేస్తూ వచ్చారు. ఈలోపు యూపీలో మెగా కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదలదైంది. అప్పటికి ఇంటర్ పూర్తి చేసిన యశ్ పాల్ పెద్ద కొడుకు శేఖర్ ఈ పరీక్షకు ప్రిపేర్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. భోజనాల దగ్గర తరచూ ఈ మాట ఆ తండ్రి చెవిన పడింది. తనకు పరీక్షకు ప్రిపేర్ అవ్వాలని ఉందని మనసులో మాట బయటపెట్టాడు. ఆ మాటతో భార్య అనిత సంతోషించింది. రిటైర్ట్ ఆర్మీ ఉద్యోగులకు వయోపరిమితి సడలింపుతో ఇలాంటి ఉద్యోగాలకు అనుమతిస్తారని తెలుసు కదా. అలా ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని యశ్పాల్ భావించాడు. మొత్తం 60 వేల ఉద్యోగాలకు.. 48 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. మొదట్లో శేఖర్ తన తండ్రితో కలిసి పరీక్షకు ప్రిపేర్ అవ్వడానికి ఇబ్బంది పడ్డాడు. అయితే యశ్‌పాల్‌కు జీకేతో పాటు పలు సబ్జెక్టులలో విపరీతమైన నాలెడ్జ్ ఉంది. అది గమనించి తండ్రి నుంచి తన అనుమానాలను నివృత్తి చేసుకునేవాడట. అలాగే తన తండ్రికి లాజికల్, న్యూమరికల్ రీజనింగ్ సాయం చేస్తూ.. ఇద్దరూ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయ్యారు. లోకల్‌గా ఉన్న లైబ్రరీకి కలిసి వెళ్లి చదువుకునేవాళ్లు. అలా రెండేళ్ల ప్రిపరేషన్‌తో.. యూపీ కానిస్టేబుల్ పరీక్షతో పాటు సీడీఎస్, ఎస్సై ఎగ్జామ్‌లు కూడా రాశారు. 2024 ఆగష్టులో రాతపరీక్ష జరిగింది. ఈలోపు పేపర్‌లీక్ వ్యవహారంతో ఈ తండ్రీకొడుకుల నెత్తిన పిడుగుపడ్డట్లు అయ్యింది. అయితే తమ శ్రమనే నమ్ముకున్న ఆ తండ్రీకొడుకులు.. తమ ప్రిపరేషన్‌ను మాత్రం ఆపలేదు. అదే ఏడాది చివర్లో ఫిజికల్ టెస్టులూ జరిగాయి. ఫలితాల్లో.. కొడుకుతో పాటే ఆ తండ్రీ కూడా జాబ్ కొట్టాడు. దీంతో భార్యాపిల్లలు మాత్రమే కాదు.. వాళ్లు ఉంటున్న వాడంతా సంబురాలు చేసుకుంది. లక్నోలో తాజాగా(జూన్ 15వ తేదీన) జరిగిన గ్రాండ్ ఈవెంట్లో అమిత్‌షా చేతుల మీదుగా ఆ తండ్రీకొడుకులు అపాయింట్మెంట్ లెటర్ అందుకున్నారు. శిక్షణ కోసం షాహ్‌జహాన్‌పూర్‌కు యశ్పాల్, బరేలీకి శేఖర్ వెళ్లారు. రెండు దశాబ్దాల తర్వాత తన కల నెరవేరినందుకు యశ్పాల్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. -
మహా విషాదం.. 265 మంది దుర్మరణం
అహ్మదాబాద్: మాటలకందని పెనువిషాదం. భారత విమానయాన చరిత్రలోనే అత్యంత దారుణమైన ఘటన. గురువారం గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లబాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1.39 గంటలకు లండన్ బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 787–8 డ్రీమ్‌లైనర్ ఏఐ171 విమానం టేకాఫైన 39 సెకన్లలోనే కుప్పకూలింది. కేవలం 625 అడుగుల ఎత్తుకు వెళ్లగానే విమానంలో అనూహ్య సమస్య తలెత్తింది. దాంతో అది శరవేగంగా కిందికి దూసుకొచ్చింది. చూస్తుండగానే రన్‌వే సమీపంలో మేఘానీనగర్‌లోని బీజే మెడికల్ కాలేజీ, సిటీ సివిల్ హాస్పిటల్ సముదాయంపై పడి ఒక్కసారిగా పేలిపోయింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ దారుణంలో విమాన ప్రయాణికుల్లో ఒక్కరు మినహా 241 మందీ దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. 230 మంది ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు కాగా 53 మంది బ్రిటన్వాసులు, ఏడుగురు పోర్చుగల్‌వాసులు, ఒకరు కెనడా పౌరుడు. వీరితో పాటు ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బంది ఉన్నారు. బ్రిటన్‌లో స్థిరపడ్డ రమేశ్ విశ్వాస్‌కుమార్ బుచర్వాడ (38) అనే ప్రయాణికుడు గాయాలతో బయటపడి ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. విమానం తొలుత మెడికల్ కాలేజీ క్యాంటీన్‌పై పడి పేలిపోయింది. ముక్కలై మంటల్లో కాలిపోతూనే పక్కనున్న బాయ్స్ హాస్టల్ భవనంపైకి దూసుకెళ్లింది. దాంతో రెండు భవనాలూ తీవ్రంగా ధ్వంసమయ్యాయి. వాటితో పాటు పరిసరాల్లోని పలు బహుళ అంతస్తుల భవనాలు కూడా మంటలంటుకుని కాలిపోయాయి. ప్రమాద సమయంలో క్యాంటీన్లో చాలామంది వైద్య విద్యార్థులు, రెసిడెంట్ డాక్టర్లు మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. వారితో పాటు హాస్టల్‌వాసుల్లో కూడా పలువురు ప్రమాదంలో గాయపడ్డారు. వారిలో కనీసం 25 మంది మరణించినట్టు చెబుతున్నారు! ఒక వైద్యుడు, నలుగురు ఎంబీబీఎస్ విద్యార్థులు, వైద్యుని భార్య మృతిని ఆస్పత్రి వర్గాలు ధ్రువీకరించాయి. ‘‘60 మందికి పైగా వైద్యులు, వైద్య విద్యార్థులు గాయపడ్డారు. వారిలో 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది’’ అని ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా మెడికల్ అసోసియేషన్ పేర్కొంది. వారందరినీ హుటాహుటిన ఆస్పత్రులకు తరలించారు. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగేలా ఉంది. ఇద్దరు ఎంబీబీఎస్ మూడో సంవత్సరం విద్యార్థులు, ఒక వైద్యుని తాలూకు ముగ్గురు బంధువుల ఆచూకీ తెలియడం లేదని కాలేజీ డీన్ డాక్టర్ మీనాక్షీ పారిఖ్ వెల్లడించారు. విమాన శకలాలు, ధ్వంసమై కాలిపోయిన భవనాలు, కార్లు, చెట్లు తదితరాలతో ప్రమాదస్థలి భీతావహంగా మారింది. విమానాశ్రయ, అగ్నిమాపక, ఎన్డీఆర్ఎఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, సైనిక, స్థానిక సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద ధాటికి దాదాపుగా విమానంలోని వారంతా కాలిపోయి తీవ్రగాయాల పాలయ్యారు. వారిని బయటికి తీసి ఆ ప్రాంగణంలోనే ఉన్న సిటీ సివిల్ ఆస్పత్రికి తరలించారు. ఈ దారుణంపై భారత్‌తో పాటు ప్రపంచ దేశాలన్నీ దిగ్భ్రాంతికి లోనయ్యాయి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బ్రిటన్ రాజు చార్లెస్–3, ప్రధాని యిర్ స్టార్మర్, పలువురు దేశాధినేతలు, రాజకీయ తదితర రంగాల ప్రముఖులు సంతాపం వెలిబుచ్చారు. జరిగింది మాటలకందని దారుణమని మోదీ అన్నారు. శుక్రవారం ఆయన ఘటనాస్థలిని సందర్శించనున్నారు. హాస్టల్లోకి చొచ్చుకెళ్లిన విమానం పైలట్ ‘మే డే’ అలర్ట్ విమానం మధ్యాహ్నం 1.39కి టేకాఫ్ అయింది. 600 అడుగుల పై చిలుకు ఎత్తుకు వెళ్లిందో లేదో సమస్య తలెత్తింది. దాంతో మరింత పైకి వెళ్లాల్సిన విమానం కాస్తా కిందకు రాసాగింది. అప్పటికింకా కనీసం లాండింగ్ గేర్ కూడా పూర్తిస్థాయిలో మూసుకోలేదు! దాంతో తీవ్ర ప్రమాదాన్ని సూచిస్తూ పైలట్ వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు ‘మే డే’ కాల్ చేశారు. ‘‘ఏటీసీ తక్షణం స్పందించి తిరిగి కాల్ చేసినా అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. పైలట్ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు’’ అని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఒక ప్రకటనలో పేర్కొంది. చుట్టుపక్కల వాళ్లంతా చూస్తుండగానే క్షణాల్లో ఘోరం జరిగిపోయింది. ప్రమాదం తాలూకు వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరలైంది. విమానం తాలూకు జంట ఇంజన్లలో టేకాఫ్‌కు అవసరమైన పూర్తిస్థాయి థ్రస్ట్ లోపించడమే ప్రమాదానికి కారణమని వైమానిక నిపుణులు భావిస్తున్నారు. లేదంటే ఇంజన్లను పక్షులు ఢీకొట్టి ఉండొచ్చని కూడా చెబుతున్నారు. ప్రమాదం నేపథ్యంలో అహ్మదాబాద్ విమానాశ్రయంలో కార్యకలాపాలు సాయంత్రం దాకా నిలిచిపోయాయి. ‘‘విమానం చాలా తక్కువ ఎత్తులో ఎగురుతూ మెడికల్ కాలేజీలో డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది నివాస క్వార్టర్లపై కూలిపోయింది. వాటికి మంటలు అంటుకుని లోపలున్న చాలామంది గాయపడ్డారు’’ అని హరేశ్ షా అనే ప్రత్యక్ష సాక్షి చెప్పుకొచ్చాడు. విమాన ప్రమాదంలో కుటుంబ సభ్యుడిని కోల్పోవడంతో గుండెలవిసేలా రోదిస్తున్న మహిళలు ప్రమాద సమయంలో విమానంలో 1.25 లక్షల లీటర్ల ఇంధనం! ఎవరినీ కాపాడలేకపోయాం: అమిత్ షా ప్రమాద సమయంలో ఎయిరిండియా విమానంలో 1.25 లక్షల లీటర్ల ఇంధనం ఉన్నట్టు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ‘‘అదంతా ఒక్కసారిగా అంటుకోవడంతో తీవ్రమైన మంటలు చెలరేగి భరించలేనంత వేడి పుట్టుకొచ్చింది. దాంతో ఎవరినీ కాపాడే అవకాశం లేకుండా పోయింది’’ అని చెప్పారు. డీఎన్ఏ పరీక్షల ద్వారా మృతదేహాలను గుర్తించిన అనంతరం మృతుల సంఖ్యపై అధికారిక ప్రకటన వెలువడుతుందన్నారు. ‘‘డీఎన్ఏ శాంపిళ్లను ఇప్పటికే సేకరించారు. గుజరాత్‌లోని ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ, నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ వర్సిటీ డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తాయి’’అని తెలిపారు. సెకెనుకు 4 లీటర్ల ఇంధనం విమాన ఇంధనాన్ని జెట్ ఫ్యూయల్ లేదా జెట్ ఏ1 అని పిలుస్తారు. బోయింగ్ 747 విమానం నడవాలంటే భారీగా ఇంధనం కావాలి. సెకెనుకు 4 లీటర్లు ఖర్చవుతుంది. అంటే నిమిషానికి 240 లీటర్లు, గంటకు 14,400 లీటర్లు కావాలన్నమాట. అహ్మదాబాద్ నుంచి లండన్‌కు సుమారు 6,859 కి.మీ. దూరానికి 9 గంటలపైనే ప్రయాణం. ఎయిరిండియా విమానంలో అంత భారీగా ఇంధనం ఉండటానికి అదే కారణం. విమానం వేగంగా, బలంగా నేలను తాకగానే అంత ఇంధనం ఒకే మండిపోయింది. దాంతో భారీగా మంటలు చెలరేగి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదానికి కారణం తేలాల్సి ఉంది. విమానం బ్లాక్ బాక్స్ కోసం అన్వేషిస్తున్నారు. మెడికల్ కాలేజీలో హృదయ విదారక దృశ్యాలు విమాన కుప్పకూలిన బీజే మెడికల్ కాలేజీలో హృదయ విదారక దృశ్యాలు మనసులను మెలిపెడుతున్నాయి. కుప్పకూలిన హాస్టల్ భవనాలు తదితరాల కింద చాలామంది వైద్య విద్యార్థులు, ఆస్పత్రి సిబ్బంది తదితరులు చిక్కుకుని ఉంటారని ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా మెడికల్ అసోసియేషన్ (ఎఫ్ఏఐఎంఏ) తెలిపింది. వారిని వెలికితీసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. ఇప్పటిదాకా 265 మృతదేహాలను సిటీ సివిల్ ఆస్పత్రికి తరలించినట్టు డీఎస్పీ కనన్ దేశాయ్ వెల్లడించారు. మృతుల సంఖ్య భారీగా పెరగవచ్చని ఎఫ్ఏఐఎంఏ జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ దివ్యాన్‡్ష సింగ్ అన్నారు. వెలికితీసిన మృతదేహాలన్నీ పూర్తిగా కాలిపోయి ఉన్నాయని చెప్పారు. -
మోదీ 11 ఏళ్ల పాలన స్వర్ణయుగం
న్యూఢిల్లీ: కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వానికి సోమవారంతో 11 ఏళ్లు పూర్తయ్యాయి. అలాగే మూడో టర్మ్‌లో మొదటి ఏడాది పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో మోదీ పాలనపై పలువురు కేంద్ర మంత్రులు ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన నాయకత్వ పటిమను కొనియాడారు. ఈ 11 ఏళ్లు ప్రజాసేవలో స్వర్ణయుగం అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అభివరి్ణంచారు.మోదీ నాయకత్వంలో నవ భారతదేశం సంస్కరణల శక్తి, మార్పుతో అభివృద్ధి, స్వయం సమృద్ధి దిశగా శరవేగంగా దూసుకెళ్తోందని ఉద్ఘాటించారు. ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడం ద్వారా ప్రతి రంగంలో మన దేశాన్ని నంబర్ వన్‌గా నిలపాలన్న లక్ష్యంతో మోదీ సర్కారు పని చేస్తోందని వెల్లడించారు. ఈ అభివృద్ధి ప్రయాణం ఆగదని స్పష్టంచేశారు. 11 ఏళ్ల ఈ చరిత్రాత్మక ప్రయాణం సేవా ప్రయాణమని వివరించారు. ఈ మేరకు అమిత్ షా సోమవారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. నాయకత్వం శక్తివంతంగా, సంకల్పం బలంగా, ఉద్దేశాలు స్పష్టంగా ఉంటే ప్రజాసేవ, భద్రత, సుపరిపాలనలో కొత్త రికార్డులు సృష్టించవచ్చని మోదీ ప్రభుత్వం నిరూపించిందని తెలియజేశారు. మోదీ 2014లో తొలిసారిగా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో దేశం అచేతనావస్థలో ఉందని, ఎటు చూసినా కుంభకోణాలు తప్ప అభివృద్ధి కనిపించని పరిస్థితి ఉందని గుర్తుచేశారు. మోదీ అధికారంలోకి వచ్చాక 11 ఏళ్లలో దేశ ముఖచిత్రం పూర్తిగా మారిపోయిందన్నారు. ప్రధాని మోదీ దేశంలో బుజ్జగింపు రాజకీయాలకు చరమగీతం పాడేశారని, అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని అమిత్ షా హర్షం వ్యక్తంచేశారు. రైతులు, మహిళలు, వెనుకబడిన తరగతులు, దళితుల సాధికారతే మోదీ సర్కారు ధ్యేయమని తేలి్చచెప్పారు. దేశ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతను కాపాడడంలో మోదీ ప్రభుత్వం తిరుగులేని అంకితభావం ప్రదర్శిస్తోందని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. దేశానికి మోదీ సర్కారు బలమైన రక్షణ కవచంగా మారిందన్నారు. దృఢమైన, గర్వకారణమైన ఐక్య భారత్ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రపంచంలో మొదటి ఐదు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో భారత్ కూడా చేరిందన్నారు. మోదీ తీసుకుంటున్న నిర్ణయాలతో రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధిస్తున్నామని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. మోదీ సర్కారు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో బడుగ బలహీన వర్గాలకు ఎనలేని లబ్ధి చేకూరుతోందన్నారు. మానవ వనరుల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ ‘న్యూ ఇండియా’కు మోదీ ప్రభుత్వం పునాది వేసిందన్నారు. ప్రపంచ వేదికపై సమున్నత భారత్: గడ్కరీ నరేంద్ర మోదీ దార్శనికత పాలనలో దేశంలో చరిత్రాత్మక మార్పులు సంభవిస్తున్నాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వివరించారు. సుపరిపాలన, సమగ్రాభివృద్ధిని కళ్లారా చూస్తున్నామని వ్యాఖ్యా నించారు. దేశం ఎవరూ అందుకోలేనంత వేగంతో ఆర్థిక ప్రగతి సాధిస్తోందన్నారు. బలమైన నాయకత్వం, స్వయం సమృద్ధ ఆర్థిక వ్యవస్థ, ప్రజలకే తొలి ప్రాధాన్యం ఇస్తున్న పాలనతో ప్రపంచ వేదికపై సగర్వంగా, సమున్నతంగా నిలుస్తోందని వివరించారు. ఆర్థిక ప్రగతి, సామాజిక న్యాయం, సాంస్కృతిక వైభవం, జాతీయ భద్రత విషయంలో మోదీ పాలన నూతన శకమని కేంద్ర మంత్రి, లోక్‌జనశక్తి పార్టీ అగ్రనేత చిరాగ్ పాశ్వాన్ అన్నారు.సువర్ణాక్షరాలతో లిఖించాలి: నడ్డాదేశంలో గత 11 ఏళ్లలో మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులు సువర్ణాక్షరాలతో లిఖించదగనవని కేంద్ర మంత్రి జె.పి.నడ్డా చెప్పారు. మోదీ సర్కారుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాహుల్‌కు దేవుడు మంచి బుద్ధిని ప్రసాదించాలని భగవంతుడిని వేడుకుంటున్నట్లు చెప్పారు. -
బెంగాల్, తమిళనాడుల్లో ఎన్డీఏ ప్రభుత్వాలే
మదురై: తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే విజయం తథ్యమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం తమిళనాడులోని మదురైలో బీజేపీ ఆఫీసు బేరర్ల సమావేశలో అమిత్ షా మాట్లాడారు. అవినీతిమయమైన అధికార డీఎంకేకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. టాస్మాక్ కుంభకోణంలో ప్రభుత్వ పెద్దలు దోచేసిన సొమ్ముతో రాష్ట్రంలో ప్రతి పాఠశాలలో కనీసం రెండు తరగతి గదులు నిర్మించవచ్చన్నారు. గత పదేళ్లలో తమిళనాడుకు కేంద్రం రూ.6.8 లక్షల కోట్లు ఇచ్చిందన్నారు. -
ముస్లిం ఓట్ల కోసమే బుజ్జగింపు రాజకీయాలు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిప్పులు చెరిగారు. ముస్లిం ఓటు బ్యాంకు కోసం బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేవలం ముస్లింల ఓట్ల కోసమే ఆపరేషన్ సిందూర్‌ను, వక్ఫ్ సవరణ బిల్లును గుడ్డిగా వ్యతిరేకిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆదివారం కోల్‌కతాలో బీజేపీ నేతలు, కార్యకర్తల సమావేశంలో అమిత్ షా ప్రసంగించారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మమతా బెనర్జీ శకం 2026లో ముగుస్తుందని తేల్చిచెప్పారు. ఆపరేషన్ సిందూర్‌ను వ్యతిరేకిస్తున్న ముఖ్యమంత్రికి మహిళలు తగిన గుణపాఠం నేర్పడం ఖాయమని పేర్కొన్నారు. ఉగ్రవాదులను నరేంద్ర మోదీ ప్రభుత్వం అణచివేయడాన్ని మమతా బెనర్జీ భరించలేపోతున్నారని విమర్శించారు. ఓటు బ్యాంక్‌ను కాపాడుకొనేందుకు ఎంతకైనా దిగజారుతున్నారని ఆక్షేపించారు. పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో పశి్చమబెంగాల్ వ్యక్తులు కూడా మరణించారని, అయినప్పటికీ మమతా బెనర్జీ నోరెత్తలేదని తప్పుపట్టారు. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌లోని ముర్షీదాబాద్‌లో జరిగిన హింసాకాండ వెనుక తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ హస్త ఉందని అమిత్ షా ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతోనే బంగ్లాదేశ్ నుంచి బెంగాల్లోకి అక్రమ వలసలు కొనసాగుతున్నాయని చెప్పారు. వసలదార్ల కోసం సరిహద్దులు తెరిచేశారని విమర్శించారు. పశి్చమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు కేవలం రాష్ట్ర భవిష్యత్తుతోనే కాకుండా.. దేశ భద్రతతో ముడిపడి ఉన్నాయని అమిత్ షా స్పష్టంచేశారు. బంగ్లాదేశ్ నుంచి వలసలను ఆపే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని తేల్చిచెప్పారు. ఎన్నికల్లో హింసను ఆశ్రయించకుండా డిపాజిట్లు అయినా తెచ్చుకోలగరా? అని మమతా బెనర్జీకి సవాలు విసిరారు. ఇదిలా ఉండగా, అమిత్ షా ఆరోపణలను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆదివారం ఖండించింది. సరిహద్దుల రక్షణ కేంద్ర హోంశాఖ పరిధిలోనే ఉంటుందని గుర్తుచేసింది. బంగ్లాదేశ్ నుంచి వలసదార్లు రాకుండా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. -
మావోయిజం అంతం? గణాంకాలివే..
న్యూఢిల్లీ: దేశంలోని మావోయిజాన్ని నిర్మూలించే దిశగా ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. 2026 మార్చి నాటికి ఈ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Home Minister Amit Shah) పదేపదే చెబుతూ వస్తున్నారు. ఈ నెల ప్రారంభంలో ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో అగ్ర నేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజుతో సహా 27 మంది మావోయిస్టులు మృతి చెందడంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరిందనే మాట వినిపిస్తోంది.1967లో ప్రారంభమైన మావోయిస్టు ఉద్యమాన్ని అంతం చేసే లక్ష్యానికి ప్రభుత్వం, భద్రతా దళాలు చేరువయ్యాయని ఎన్డీటీవీ యాక్సెస్ చేసిన డేటాలో వెల్లడవుతోంది. 2010లో 1,936 మావోయిస్టు హింసాత్మక సంఘటనలు జరిగాయని, ఇది 2024కి 374కి తగ్గిందని, అంటే ఏకంగా 81శాతం మేరకు తగ్గిందని హోం మంత్రిత్వ శాఖ డేటా చెబుతోంది. మావోయిస్టు ప్రభావిత జిల్లాల సంఖ్య కూడా చాలా వరకూ తగ్గింది. 2013లో 126 ఉండగా, అది 2021నాటికి 70కి తగ్గింది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి 18కి చేరింది.మావోయిస్టులు సాగించిన హింసాత్మక ఘటనల్లో(violent incidents) పౌరుల మృతులను చూసుకుంటే 2010లో ఈ సంఖ్య 720గా ఉంది. 2019లో ఇది 150కి తగ్గింది. గత ఏడాది 131గా ఉండగా, 2023లో 106గా ఉంది. ఈ ఏడాది మార్చిలో ఈ తరహాలో 19 మరణాలు చోటుచేసుకున్నాయి. పౌరులు, భద్రతా దళాల సిబ్బంది మొత్తం మరణాలను పరిగణనలోకి తీసుకుంటే, ఈ సంఖ్య 2010లో 1,005గా ఉండగా, గత సంవత్సరం 85శాతానికి తగ్గి, 150కి చేరుకుంది.కొన్నేళ్లుగా మావోయిస్టులు రైల్వే ఆస్తులు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగ యూనిట్లు, టెలిఫోన్ ఎక్స్ఛేంజీలు, మొబైల్ టవర్లు, రోడ్లు , పాఠశాలలు లాంటి మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఈ తరహా ఘటనలు 2010లో 365 నుండి 2017లో 75కి తగ్గాయి. 2024లో కేవలం 25గా ఉన్నాయి. ఈ ఏడాది మొదటి నెలల్లోనే 150 మందికి పైగా మావోయిస్టులు మృతిచెందారు. ఈ సంఖ్య 2017లో 136గా ఉంది. 2023లో 380గా ఉండగా, గత ఏడాది ఇది 290గా ఉంది.ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్‌లో జరిగిన ఎన్కౌంటర్ అనంతరం హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ గడచిన మూడు దశాబ్దాల్లో ఒక సీపీఐ మావోయిస్టు ప్రధాన కార్యదర్శి హతం కావడం ఇదే తొలిసారని అన్నారు. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ పూర్తయ్యాక ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మహారాష్ట్రలలో 54 మంది నక్సలైట్లను అరెస్టు చేశామని, 84 మంది నక్సలైట్లు లొంగిపోయారని ఆయన అన్నారు. 2026 మార్చి 31 లోపు దేశంలోని మావోయిజాన్ని నిర్మూలించాలని మోదీ ప్రభుత్వం నిశ్చయించుకున్నదని అమిత్ షా పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: ‘నమస్తే’కు రెండేళ్లు.. చేతులతో మలం ఎత్తడానికి ముగింపు పలుకుతూ.. -
118 పాక్ ఫార్వర్డ్ పోస్టులు, నిఘా వ్యవస్థలు తుత్తునియలు
పూంఛ్: ఆపరేషన్ సిందూర్ సమయంలో బీఎస్ఎఫ్ బలగాలు పాకిస్తాన్‌కు చెందిన 118 ఫార్వర్డ్ పోస్టులతోపాటు సమాచార, నిఘా వ్యవస్థను తుత్తునియలు చేశాయని హోం మంత్రి అమిత్ షా తెలిపారు. తీవ్రంగా నష్ట పోయిన శత్రుదేశం తిరిగి కోలుకునేందుకు నాలుగైదు ఏళ్లు పడుతుందని వ్యాఖ్యానించారు. నాలుగు రోజుల ఉద్రిక్తతల సమయంలో పౌర ఆవాసాలతోపాటు, మన సరిహద్దులపైకి దాడులకు పాల్పడిన పాక్‌కు గట్టిగా బుద్ధి చెప్పిన బీఎస్ఎఫ్ బలగాలను ఆయన ప్రశంసించారు. పరిస్థితులు ప్రశాంతంగా ఉన్న సమయంలో సైతం ఇంటెలిజెన్స్ వ్యవస్థలను అప్రమత్తం చేస్తూ, ముందుగానే కచ్చితమైన సమాచారంతో విజయవంతంగా దాడులను పూర్తి చేయగలమని బీఎస్ఎఫ్ రుజువు చేసిందన్నారు. ఎడారులు, పర్వతప్రాంతాలు, అడవులు, కఠినమైన, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సైతం అచంచలమైన అంకిత భావంతో పనిచేస్తూ దేశానికి మొదటి రక్షణ శ్రేణిగా సేవలందిస్తోందన్నారు. ఆపరేషన్ సిందూర్ అనంతరం జమ్మూ ప్రాంతంలో గురు, శుక్రవారాల్లో మంత్రి పర్యటించారు. ఇందులో భాగంగా ఆయన అమర్నాథ్ యాత్రకు చేపట్టిన ఏర్పాట్లు, జమ్మూకశ్మీర్‌లో భద్రతా పరిస్థితిపై ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్ష జరిపారు. ఇటీవల పాక్ కాల్పులతో పూంఛ్ జిల్లాలో నష్టపోయిన సరిహద్దు ప్రాంతాల వాసులతో మాట్లాడారు. జవాన్లతో స్వయంగా ముచ్చటించారు. -
పూంచ్ బాధితులకు హోం మంత్రి పరామర్శ
శ్రీనగర్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah) పహల్గామ్ ఉగ్ర దాడిని ఖండించారు. ‘మతపరమైన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని, పాకిస్తాన్ దాడులకు తెగబడుతోంది. ఇది పిరికితనంతో కూడిన చర్య. పాక్ దాడులలో పలువురు భారత పౌరులు గాయపడ్డారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. వారికి సంఘీభావం ప్రకటిస్తోంది’ అని హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు.ఈరోజు (శుక్రవారం) హోంమంత్రి పూంచ్ జిల్లాను సందర్శించి పాకిస్తాన్ దాడుల బారినపడిన బాధిత కుటుంబాలను కలుసుకున్నారు. బాధిత కుటుంబాల్లోని యువకులకు అమిత్ షా ఉద్యోగ నియామక పత్రాలను అందించారు. దాడుల సమయంలో పూంచ్ పౌరులు, అధికారులు చూపిన ధైర్యం, జమ్ముకశ్మీర్ ప్రజల దేశభక్తి దేశానికి మరింత బలాన్నిచ్చాయని అమిత్ షా పేర్కొన్నారు. మనం చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌తో పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమయ్యాయి. భారత ప్రజల సంకల్పం, ప్రధానమంత్రి మోదీ(Prime Minister Modi) నిర్ణయాత్మక నాయకత్వం, ఖచ్చితమైన నిఘా సమాచారం, మన సాయుధ దళాల అసమానమైన దాడి కారణంగా పాక్‌పై బలమైన ప్రతీకారం తీర్చుకోగలిగమని షా అన్నారు. #WATCH | Poonch | Union Home Minister Amit Shah distributes appointment letters to the families of those affected by Pakistan's shelling during Operation Sindoor. pic.twitter.com/kNyRq4Epfm— ANI (@ANI) May 30, 2025మన సైనికులు వందలాది మంది ఉగ్రవాదులను తరిమికొట్టారు. ఈ సమయంలో ఒక్క భారత ఆర్మీ పోస్టు కూడా దెబ్బతినలేదు. ఏ పాకిస్తానీ పౌరుడికి కూడా హాని జరగలేదు. మనం ఉగ్రవాద స్థావరాలను మాత్రమే ధ్వంసం చేశాం. అయితే పాకిస్తాన్ మన దేశంలోని పూంచ్‌కు తీవ్ర నష్టం కలిగించింది. భారత సైన్యం తొమ్మిది పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై దాడులు చేసింది. దీంతో పాకిస్తాన్ దిగివచ్చిందని అమిత్ షా పేర్కొన్నారు. ఏప్రిల్ 6 తర్వాత అమిత్ షా జమ్ముకశ్మీర్‌లో జరిపిన మూడవ పర్యటన ఇది. ఇది కూడా చదవండి: ఐఎన్ఎస్ విక్రాంత్‌ను సందర్శించిన రక్షణమంత్రి రాజ్‌నాథ్ -
రాహుల్ గాంధీపై నాన్ బెయిలబుల్ వారెంట్
చైబాసా: కాంగ్రెస్ నేత రాహుల్‌గాందీకి పరువు నష్టం కేసులో జార్ఖండ్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. జూన్ 26వ తేదీన స్వయంగా న్యాయస్థానంలో హాజరు కావాలని ఆదేశించింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ రాహుల్ లాయర్ చేసిన వినతిని తోసిపుచ్చింది. 2018లో కాంగ్రెస్ ప్లీనరీ సమావేశంలో అప్పటి బీజేపీ చీఫ్ అమిత్ షాకు వ్యతిరేకంగా రాహుల్..‘హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు సైతం బీజేపీ అధ్యక్షుడవుతారు’అంటూ వ్యాఖ్యానించారు. దీంతో రాహుల్ గాంధీ బీజేపీ కార్యకర్తలందరి మనోభావాలను దెబ్బతీశారంటూ ఆ పార్టీ నేత ప్రతాప్ కటియార్ చైబాసాలోని చీఫ్ జ్యుడీషియల్ మేజి్రస్టేట్ కోర్టులో ఫిర్యాదు చేశారు. జార్ఖండ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఎంపీ/ఎమ్మెల్యేలపై కేసులను విచారించే ప్రత్యేక న్యాయస్థానానికి ఈ పిటిషన్ బదిలీ అయ్యింది. విచారణ చేపట్టిన మేజిస్ట్రేట్ రాహుల్ గాం«దీకి పలుమార్లు సమన్లు పంపారు. వీటిని ఆయన పట్టించుకోకపోవడంతో బెయిలబుల్ వారెంట్లు జారీ చేశారు. దీంతో, రాహుల్ స్టే కోసం జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌ను 2024 మార్చిలో న్యాయస్థానం కొట్టివేసింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ వేసిన పిటిషన్‌ను సైతం చైబాసా కోర్టు తిరస్కరించింది. తాజాగా, మరింత కఠినమైన నాన్ బెయిలబుల్ వారెంట్లు పంపింది. -
రాజధాని రైతులకు ఇక్కట్లు నిజమే
సాక్షి, న్యూఢిల్లీ: ‘రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులు కొంత ఇబ్బంది పడటం నిజమే. అయినా వారి త్యాగం ఊరికే పోదు. 29 వేల మంది రైతులు 34 వేల ఎకరాలను స్వచ్ఛందంగా ఇచ్చిన చరిత్ర అమరావతిది. ఎన్ని ఎకరాల్లో అయినా రాజధానిని కడతాం. ఎన్ని ఎకరాల్లో నిర్మిస్తే నీకు (మాజీ సీఎం వైఎస్ జగన్‌ను ఉద్దేశించి) వచ్చిన నష్టం ఏమిటి?’ అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఆయన పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. అనంతరం జన్‌పథ్–1లోని అధికారిక నివాసంలో ఎంపిక చేసుకున్న మీడియాతో మాట్లాడారు. రాజధాని నిర్మాణం విషయంలో వైఎస్ జగన్ అవగాహనారాహిత్యంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం రావాలని, అలా రాకపోతే ఎలా.. అంటూ మీడియాను ఎదురు ప్రశ్నించారు. రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ చట్ట సవరణ చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కోరినట్లు చెప్పారు. ఏపీలో 72 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలని, రూ.28,346 కోట్ల విలువైన గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఇవ్వాలని కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కోరినట్లు తెలిపారు. సూర్యఘర్ అమలుకు మద్దతు ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని చెప్పారు. రక్షణ పరికరాల తయారీ, ఏరోస్పేస్ ఆవిష్కరణల్లో రాష్ట్రం దేశానికి ప్రధాన కేంద్రంగా ఎదగడానికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కోరినట్లు తెలిపారు. జగ్గయ్యపేట–డోలకొండ క్లస్టర్లో 6 వేల ఎకరాలు అందుబాటులో ఉందని, ఇక్కడ క్లస్టర్‌ను మిస్సైల్ అండ్ అమ్యూనేషన్ ప్రొటెక్షన్ కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరామన్నారు. విశాఖను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. పోలవరం–బనకచర్ల ప్రతిపాదన రూ.80 వేల కోట్లు ఖర్చయ్యే పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదనలను కేంద్రానికి అందించినట్లు చంద్రబాబు తెలిపారు. ఈ మేరకు కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి వివరించానని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును 2027లోపు పూర్తి చేస్తామని చెప్పారు. షార్, లేపాక్షి వద్ద స్పేస్ సిటీల అభివృద్ధి విషయంపై కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్‌ను కలసి మాట్లాడానని తెలిపారు. ‘ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ ఎకోసిస్టమ్’ పురోగతిలో ఆంధ్రప్రదేశ్ పోషించగల పాత్రను వివరిస్తూ కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు నివేదిక సమర్పించానని చెప్పారు. కాగా, నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్‌ల పేర్లను ఈడీ ప్రస్తావించిన విషయంపై చంద్రబాబును మీడియా ప్రశ్నించగా.. ‘అవునా? ఎప్పుడు? ఏమో మరి.. నాకు దాని గురించి తెలియదు’ అంటూ దాటవేశారు. ఏపీ లిక్కర్ స్కామ్ విషయంపై కూడా తాను మాట్లాడనని స్పష్టం చేశారు. కాగా, సీఎం చంద్రబాబు శనివారం నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కానున్నారు. -
పాక్–ఉగ్రవాదం లంకె.. సిందూర్‌తో బట్టబయలు: షా
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్ర దాడికి ప్రతిగా భారత వైమానిక దళం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్‌కు ఉగ్రమూకలతో అంటకాగుతున్న విషయం మరోసారి బట్టబయలైందని హోం మంత్రి అమిత్ షా చెప్పారు. మన బలగాలు పాక్‌తోపాటు పీవోకేలో 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశాక ఆ దేశం కొన్ని పౌర, సైనిక లక్ష్యాలపై మాత్రం దాడి చేయగలిగిందన్నారు. అనంతరం, మన ఆర్మీ సరిహద్దుల ఆవల 100 కిలోమీటర్ల దూరం చొచ్చుకెళ్లి పాక్ వైమానిక సామర్యా్ధన్ని తీవ్రంగా దెబ్బతీయగలిగిందని చెప్పారు. సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు. -
మార్చికి ముందే మావోయిస్టుల అంతం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: దేశాన్ని 2026 మార్చి 31 నాటికి మావోయిస్టు విముక్తి ప్రాంతంగా మారుస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చెప్పారని, కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అంతకుముందే మావోయిస్టుల నిర్మూలన జరిగే అవకాశం ఉందని ఛత్తీస్‌గఢ్ డీజీపీ అరుణ్‌దేవ్ గౌతమ్ అన్నారు. అబూజ్‌మఢ్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మరణించడంతో దేశానికి మంచిరోజులు వచ్చాయని వ్యాఖ్యానించారు. మావోయిస్టుల కారణంగా ఎంతోమంది అమాయక ప్రజలు మృత్యువాత పడ్డారని అన్నారు. నంబాల మృతదేహంతో పాటు ఎన్కౌంటర్లో మరణించిన మొత్తం 27 మంది మృతదేహాలను గురువారం నారాయణపూర్ జిల్లా కేంద్రానికి తీసుకొ చ్చారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన డీజీపీ ఎన్కౌంటర్ జరిగిన తీరుతెన్నుల గురించి స్థానిక పోలీసులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మావోయిస్టులకు భారీ నష్టం కేంద్ర కమిటీకి చెందిన అగ్రనాయకులు ఉన్నారనే పక్కా సమాచారంతో మే 19 నుంచి ఆపరేషన్ చేపట్టామని డీజీపీ చెప్పారు. నంబాల వంటి అగ్రనేత మృతి మావోయిస్టు పార్టీకి తీరని నష్టం చేకూరుస్తుందని అన్నారు. ఛత్తీస్‌గఢ్ పోలీసులకు ఇదో గొప్పరోజని వ్యాఖ్యానించారు. ఎదురుకాల్పుల్లో ఒక జవాన్ మరణించాడని, మరికొందరు గాయపడినా ప్రాణాపాయం లేదని తెలిపారు. మరికొందరు మావోయిస్టులు కూడా తీవ్రంగా గాయçపడి తప్పించుకున్నారని, వారిని పట్టుకునేందుకు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నామని చెప్పారు. మృతుల్లో కాయ్ –7కి చెందినవారే ఎక్కువ ఎన్కౌంటర్లో మొత్తం 27 మంది చనిపోగా అందులో 13 మంది పురుషులు 14 మంది మహిళలు ఉన్నారు. మృతుల్లో నంబాల కేశవరావుతో పాటు స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు, జంగ్ పత్రిక నిర్వాహకుడు, సెంట్రల్ కమిటీ, సెంట్రల్ రీజనల్ బ్యూరో స్టాఫ్‌గా ఉన్న నవీన్ అలియాస్ మధు అలియాస్ పజ్జా వెంకట నాగేశ్వరరావు, సీవైపీసీ కమాండర్ రోషన్ అలియాస్ టిప్పు ఉన్నారు. కేశవరావు, మధు, టిప్పును మినహాయిస్తే మిగిలిన వారంతా సుప్రీం కమాండర్‌కు రక్షణ కల్పించే దళమైన కాయ్ –7కి చెందినవారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మృతుల్లో నంబాల కేశవరావు, జంగు నవీన్ అలియాస్ మ«ధు, రోషన్ అలియాస్ టిప్పు (సీవైపీసీ ఇన్చార్జ్/కమాండర్) కీలక నేతలుగా ఉన్నారు. వీరితో పాటు నంబాలకు రక్షణ కల్పించే కాయ్–7 కంపెనీకి చెందిన సునీల్, కుర్సం విజా, రవి, సూర్య అలియాస్ సంతు, తెల్లం రాజేశ్, గుడ్డు అలియాస్ ఉంగా, ఓయం రాజు, కోసా హోడి, వివేక్ అలియాస్ ఉగేంద్ర, ఓది భద్రు, బుచ్చి అలియాస్ రామే, భీమే ఆలియాస్ మడావి, భూమిక, లక్ష్మీ అలియాస్ కమ్ల, పొడియం జమున, గీతా, సోమ్లీ అలియాస్ సజ్జంతి, రేష్మా పొడియం, రాగో, సంగీత, సరిత అలియాస్ మాంకో, హిడిమే, అవలం కల్పన, మడావి క్రాంతి మరణించినట్లు పోలీసులు ప్రకటించారు. నంబాలతో పాటు నవీన్ ఏపీకి చెందిన వారు కాగా వివేక్ (30)తో పాటు భూమిక, సంగీత తెలంగాణ ప్రాంతానికి చెందిన వారని తెలిపారు. కేశవరావు మృతదేహం హెలికాప్టర్ ద్వారా.. కేశవరావు మృతదేహాన్ని గురువారం ఉదయం హెలికాప్టర్ ద్వారా నారాయణపూర్ జిల్లా కేంద్రానికి తరలించారు. అక్కడ పోలీస్ లైన్స్‌లో మిగతా అందరి మృతదేహాలతో పాటు ఎన్కౌంటర్లో స్వా«దీనం చేసుకున్న ఆయుధాలను ప్రదర్శించారు. ఎన్కౌంటర్లో చనిపోయిన ఇతర మావోల మృతదేహాలకు తెల్లని కవర్లు చుట్టగా కేశవరావుకు మాత్రం నల్లని కవర్ చుట్టారు. గురువారం సాయంత్రం పోస్టుమార్టం నిర్వహించారు. -
మావోలకు పెద్ద దెబ్బ
విస్తీర్ణంలో చాలా దేశాలతో పోలిస్తే ఎంతో పెద్దదైన మధ్య భారతంలో కొన్ని దశాబ్దాలుగా సాగు తున్న వామపక్ష తీవ్రవాదం క్షీణిస్తున్న జాడలు గత కొన్నేళ్లుగా కనబడుతుండగా... మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు బుధవారం తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో మరణించారు. అబూజ్‌మఢ్ అడవుల్లో జరిగిన ఆ ఎన్కౌంటర్లో ఆయనతోపాటు మరో 26 మంది నక్సలైట్లు చనిపోయారని, వారిలో పలువురు కీలక నేతలు ఉండొచ్చని అధికారిక ప్రకటన చెబుతోంది. ఇరుపక్షాల మధ్యా జరిగిన కాల్పుల్లో భద్రతా బలగాల్లోని ఒక జిల్లా రిజర్వ్ గార్డ్ (డీఆర్జీ) కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోగా, మరికొంతమంది గాయపడ్డారని అధికారిక కథనం. ప్రధాన కార్య దర్శి స్థాయి నేత మరణించటం మావోయిస్టు పార్టీకి నిస్సందేహంగా కోలుకోలేని దెబ్బ. అందుకే కావొచ్చు... ఈ ఎన్కౌంటర్ గర్వించదగ్గ విజయమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆదివాసీల హక్కుల కోసం, దోపిyీ నిరోధానికీ ఆయుధం పట్టామని చెబుతున్న మావోయిస్టులు ఇన్ని దశాబ్దాల పోరాటంలో తమ చర్యల పర్యవసానాలనూ, వాటి నిరర్థకతనూ గమనించి సరిచేసుకోలేకపోయారని అర్థమవుతుంది. నక్సలైట్ ఉద్యమం పూర్వాపరాలు గమనిస్తే అదెప్పుడూ పడుతూ లేస్తూనే సాగింది. కానీ తమ పోరాటాలపై రాజ్యం ప్రతిసారీ ఎందుకు పైచేయి సాధించ గలుగుతున్నదన్న అంశంపై వారు దృష్టి పెట్టినట్టు లేదు. అంతకుముందు దేశంలో చెదురుమదురుగా జరిగిన సాయుధ పోరాటాలు అంతరించాయనుకుంటున్న తరుణంలో 1967లో పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లా సిలిగుడి డివిజన్లో మారుమూల గ్రామమైన నక్సల్బరీలో రాజు కున్న ఉద్యమం వేగంగా విస్తరించి సీపీఐ(ఎంఎల్) ఆవిర్భావానికి దారితీసింది. మూడేళ్ల లోపునే పోలీసులు ఆ ఉద్యమాన్ని అణిచేయగలిగారు. దానివెంబడే అప్పటి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో వెల్లువెత్తిన ఉద్యమం సైతం ఎన్కౌంటర్ల పరంపర తర్వాత మూడేళ్లకే సద్దుమణిగింది. తిరిగి మరో ఆరేళ్లకు ఉత్తర తెలంగాణలో తలెత్తి విస్తరించిన ఉద్యమం ఒక్కటే దీర్ఘకాలం సాగిందనుకోవాలి. ఈ మూడు చోట్లా ఒకేవిధంగా మొదట్లో మధ్యతరగతి, మేధావి, విద్యార్థి వర్గాలను ఆకర్షించిన ఉద్యమాలు అనంతర కాలాల్లో ఆ వర్గాలకు ఎందుకు దూరమయ్యాయన్న విశ్లేషణను మావోయిస్టులు చేసుకోలేదని వారి ఆచరణ తీరు గమనిస్తే అర్థమవుతుంది. మరోపక్క నక్సల్ ఉద్యమం చీలికలూ, పేలికలూ అయింది. సీపీఐ (ఎంఎల్) భిన్నవర్గాలుగా విడిపోయింది. లిబరేషన్ వంటి పార్టీలు పార్ల మెంటరీ పంథాకు మళ్లి చెప్పుకోదగ్గ విజయాలు సాధిస్తున్నాయి. పాలకులెవరైనా ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయటానికీ, ప్రభుత్వ విధా నాలు సక్రమంగా లేవనుకుంటే ప్రజల్ని కూడగట్టి ఉద్యమించటానికీ ఎప్పుడూ అవకాశాలుంటాయి. 2014లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడ్డాక భూసేకరణ చట్టం సవరించినప్పుడూ, అనంతర కాలంలో సాగు చట్టాలు తీసుకొచ్చినప్పుడూ రైతాంగం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. చివరకు కేంద్రం ఆ చర్యల్ని వెనక్కి తీసుకోక తప్పలేదు. మావోయిస్టు పార్టీ వీటిని గమనంలోకి తీసుకుందా? అంతక్రితం 1977 తర్వాత ఉద్యమాల్లోకి ప్రజల్ని కూడగట్టడంలో విజయం సాధించినా అటుపై ఆ ఉద్యమాలకు తోడు సాయుధ చర్యలు కూడా మొదలయ్యాయి. పర్యవసానాలు తెలియని యువ తను మొదట్లో ఇవి ఆకర్షించివుండొచ్చు. కానీ ప్రభుత్వ బలగాలు పకడ్బందీ వ్యూహాలు అమలు చేయటం ప్రారంభించాక ఆ సాయుధ చర్యలు వ్యతిరేక ఫలితాలిస్తాయి. సమస్యలెన్నివున్నా ప్రజలు మౌలికంగా శాంతియుత జీవనాన్ని కోరుకుంటారు. నిత్యం ఉద్రిక్త తల నడుమ అనిశ్చితిలో బతికే స్థితి ఉన్నప్పుడు దాన్నుంచి సాధ్యమైనంత త్వరగా బయటపడటా నికి ప్రయత్నిస్తారు. ప్రభుత్వాలు అణచివేత చర్యలతోపాటు వారి ప్రశాంతతకు హామీ ఇచ్చిన ప్పుడు సహజంగానే ఉద్యమాల వైపు మొగ్గు తగ్గుతుంది. మొదట్లో ఉన్నత చదువులు చదివినవారు భద్రమైన జీవితాన్నీ, బంగారు భవిష్యత్తునూ వదులుకుని ఆ ఉద్యమాల వైపు వెళ్లిన మాట వాస్తవం. అందుకు నిరుద్యోగం, ప్రభుత్వ వ్యవస్థల్లో పెరిగిన అవినీతి వంటివి కారణం అయ్యాయి. కానీ 1990వ దశకం చివరిలో ప్రపంచీకరణ తర్వాత మన దేశంలో పెట్టుబడులు వెల్లువలా రావటం, యువతకు మెరుగైన అవకాశాలు ఏర్పడటం మొదలయ్యాక ఉద్యమాల పట్ల విముఖత ఏర్పడింది. ఈ తరం విద్యార్థులు అటువైపు వెళ్లటం మాట అటుంచి, వారిలో అత్యధికులకు ఆ ఉద్య మాలపై కనీస అవగాహన కూడా లేదు. మావోయిస్టు ఉద్యమంలో కొత్త రిక్రూట్మెంట్ గణనీయంగా తగ్గి పోయిందని గణాంకాలు చెబుతున్నాయి. ఉద్యమంలో మధ్యతరగతి వర్గానికి బదులు ప్రస్తుతం ఆదివాసీల ప్రాబల్యం గతంతో పోలిస్తే పెరిగింది. కానీ దానికి సమాంతరంగా ఆదివాసీలను తమవైపు తిప్పుకోవటంలో భద్రతా బలగాలు సైతం విజయం సాధించగలిగాయి. నంబాల కేశవరావు తదితర ఉద్యమ నేతలు ఎన్కౌంటర్లలో మరణించటం ఆ పర్యవసానమే! వర్తమానంలో విస్తృతంగా అభివృద్ధి చెందిన సాంకేతికత సైతం బలగాలకు అందివచ్చింది. నక్సలిజాన్ని వచ్చే ఏడాది మార్చి ఆఖరుకల్లా అంతం చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తరచూ చెబుతున్నారు. జరుగుతున్న పరిణామాలు గమనిస్తే అది సాధ్యమేనన్న అభిప్రాయం కలుగుతుంది. ఏదేమైనా ఈ సమస్య హింసకు తావులేకుండా శాంతియుతంగా పరిష్కారమైతే సమాజం సంతోషిస్తుంది. అందుకు మావోయిస్టులు తమ పంథా మార్చుకుని సహకరించాలి. వారు పునరాలోచించుకునేందుకు కేంద్రం కూడా వ్యవధినివ్వాలి. -
నంబాల ఎన్కౌంటర్.. 27 మంది మృతి
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ సుప్రీం కమాండర్, జాతీయ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు (71) మృతి చెందారు. ఈ ఎదురుకాల్పుల్లో పలువురు కీలక నేతలు సహా మొత్తం 27 మంది మావోయిస్టులు కూడా మరణించారు. ఛత్తీస్‌గఢ్ లోని నారాయణపూర్–బీజాపూర్ జిల్లా సరిహద్దు అబూ జ్‌మఢ్ అడవుల్లో ఇంద్రావతి నది పరీవాహక ప్రాంతంలో బుధవారం ఉదయం ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ డీఆర్జీ జవాను కూడా మృతి చెందగా పలువురు గాయపడినట్లు ఛత్తీస్‌గఢ్ సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. కేశవరావు మరణాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ధ్రువీకరించారు. జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న ఓ మావోయిస్టు నేత ఎదురుకాల్పుల్లో మరణించడం ఇదే మొదటిసారని తెలిపారు. ప్రధాని మోదీ కూడా ఎన్‌కౌంటర్‌పై స్పందించారు. ‘ఇదో అసాధారణ విజయం’ అని పేర్కొన్నారు. కేశవరావు తలపై కోటిన్నర రూపాయల రివార్డు ఉన్నట్లు సమాచారం. కాగా మావోయిస్టు ఉద్యమానికి వెన్నెముక గా ఉన్న నంబాల మృతి మావోయిస్టు పారీ్టకి పెద్ద ఎదురుదెబ్బని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జి ల్లాలో జని్మంచిన కేశవరావు వరంగల్ ఆర్ఈసీ (ఇప్పటి నిట్)లో ఎంటెక్ చదువుతూ అజ్ఞాతంలోకి వెళ్లారు. పక్కా సమాచారంతో.. అబూజ్‌మఢ్ అడవుల్లో ఇంద్రావతి నది సమీపాన మావోయిస్టు అగ్రనేత షెల్టర్ తీసుకున్నారని, పార్టీ కేంద్ర కమిటీ, పొలిట్‌బ్యూరో సభ్యులతో పాటు మాడ్ డివిజన్ సీనియర్ కేడర్, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ) సభ్యులు సైతం ఉన్నారని పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో సీఆర్పీఎఫ్, కోబ్రా బలగాలకు తోడు నారాయణపూర్, దంతెవాడ, బీజాపూర్, కొండగావ్ జిల్లాల డీఆర్జీ దళాలు మంగళవారం రాత్రి సెర్చ్ ఆపరేషన్ మొదలెట్టాయి. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున ఇరువర్గాల మధ్య మొదలైన కాల్పులు ఉదయం 11గంటల వరకు కొనసాగాయి. ఈ కాల్పుల్లో మధు, నవీన్ అనే డివిజన్ స్థాయిæ నేతలు కూడా మరణించినట్లు తెలుస్తోంది. మధు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు కాగా, నవీన్ మావోయిస్టు పార్టీ పత్రిక ‘జంగ్’ బాధ్యతలు చూస్తున్నట్లు సమాచారం. ఆపరేషన్ జరిగిన తీరుతెన్నులు, ఇతర మృతుల వివరాలను పోలీసులు ప్రకటించలేదు. అయితే 27 మంది మావోయిస్టుల మృతదేహాలతో పాటు పెద్ద సంఖ్యలో ఆయుధాలు స్వా«దీనం చేసుకున్నట్లు సమాచారం. కాగా మావోయిస్టుల కోసం గాలింపు ఇంకా కొనసాగుతోందని పోలీసులు చెప్పారు. ల్యాప్‌టాప్‌లు, కీలక డాక్యుమెంట్లు ఆధారంగా.. గతనెల 18న నారాయణ్‌పూర్ జిల్లాలో జరిగిన ఆపరేషన్‌లో మావోయిస్టులకు సంబంధించిన డంప్‌ను భద్రతా దళాలు కనుగొన్నాయి. ఇందులో కీలక డాక్యుమెంట్లు, పుస్తకాలతో పాటు 11 ల్యాప్‌టాప్‌లు లభించాయి. వాటిలో లభించిన వివరాల ఆధారంగానే ఏప్రిల్ 21న తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రిగుట్టల్లో ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ భారీ స్థాయిలో మొదలైందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే కర్రిగుట్టల ఆపరేషన్‌తో భారీ ఫలితం రాబోతుందని ఛత్తీస్‌గఢ్ పోలీసులు ప్రకటించారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఆపరేషన్ ముగిసేసరికి వేర్వేరు ఎన్కౌంటర్లలో 31 మంది సాధారణ స్థాయి మావోయిస్టులు చనిపోగా డంప్‌లు, ఆయుధ తయారీ పనిముట్లను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. మళ్లీ విశ్లేషించుకుని..‘వారి’ నుంచి సమాచారం తెప్పించుని.. డంప్‌లో లభించిన ల్యాప్‌టాప్‌లు, డాక్యుమెంట్లలో లభించిన సమాచారాన్ని విశ్లేషించుకోవడంలో జరిగిన పొరపాటు కారణంగానే కర్రిగుట్టలో ఆశించిన విజయం దక్కలేదని భావించిన దళాలు మరింత జాగ్రత్తగా సమాచారాన్ని విశ్లేషించుకున్నట్లు సమాచారం. అందులో భాగంగా నంబాల కేశవరావుకు రక్షణ కల్పించే 7వ నంబర్ కంపెనీలో పనిచేసి లొంగిపోయిన కొందరు మావోయిస్టుల నుంచి మరోసారి సమాచారం తెప్పించుకున్నట్టు తెలుస్తోంది. ఈ రెండింటినీ కచ్చితత్వంతో డీకోడ్ చేయడం ద్వారా నంబాల ఎక్కడున్నాడనే అంశాన్ని భద్రతా దళాలు పసిగట్టి మెరుపుదాడి చేసినట్టు తెలుస్తోంది. అంత ఈజీగా ఎలా? సాధారణంగా కేంద్ర కమిటీ సభ్యులకు మూడంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది. ఈ వలయాన్ని ఛేదించుకుని వారి దగ్గరికి చేరుకోవడం చాలా కష్టంతో కూడుకున్న పని. అయినా స్వల్ప నష్టంతోనే పోలీసులు నంబాల దగ్గరికి ఎలా చేరుకున్నారనేది మిస్టరీగా మారింది. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. ఏడాది క్రితం వరకు నంబాల కేశవరావుకు 70 మందితో కూడిన కంపెనీ రక్షణ కల్పించేది. ఇందులో కనీసం 40 మంది వద్ద ఏకే 47 లాంటి అత్యాధునిక ఆయుధాలు ఉంటాయని, తన చుట్టూ ఉన్న బృందం ఆధునిక ఆయుధాలతో ఉంటే నంబాల తన చేతిలో ఎప్పుడూ ల్యాప్‌టాప్‌తో ముందుకు సాగుతారని తెలుస్తోంది. తాగునీరు, ఆహారం విషయంలోనూ ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తారని, రాత్రి వేళ సైతం రెండు, మూడు గంటల కంటే ఎక్కువ నిద్రించరని సమాచారం. అయితే ఇటీవల పెరిగిన నిర్బంధం కారణంగా భద్రతను 28 మందికి కుదించినట్టు తెలుస్తోంది. -
మావోయిస్టులపై ఇది ఘన విజయం: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ, సాక్షి: ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌పై దేశ ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) స్పందించారు. మావోయిస్టులపై ఇప్పటిదాకా సాధించిన ఇది అతిపెద్ద ఘన విజయం అని అన్నారాయన. ఈ క్రమంలో భదత్రా బలగాలకు ఆయన అభినందనలు తెలిపారు.మావోయిస్టుల(Maoists)పై ఇది ఘన విజయం. నక్సల్స్ పై పోరాటంలో ఇదో మైలురాయి. భద్రతా బలగాలు సాధించిన విజయం చూసి గర్వంగా ఉంది. మా ప్రభుత్వం శాంతి, అభివృద్ధికి కట్టుబడి ఉంది. అందుకే మావోయిజాన్ని మూలాలను చెరిపేస్తున్నాం. మావోయిజాన్ని అంతమొందించేందుకు కట్టుబడి ఉన్నాం’’ అని అన్నారాయన. ఛత్తీస్‌గఢ్ నారాయణపూర్ అబూజ్మడ్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. అందులో మావోయిస్టు చీఫ్ నంబాల కేశవరావు(Nambala Keshava Rao) ఉండడంతో కేంద్రం ఇలా స్పందిస్తోంది. అంతకు ముందు.. హోం శాఖ మంత్రి అమిత్ షా ఈ ఎన్‌కౌంటర్‌పై ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయగా.. ప్రధాని మోదీ ఆ పోస్ట్‌కు పైవిధంగా స్పందించారు.ఇదీ చదవండి: నక్సలిజానికి వెన్నెముక.. నంబాల! -
మావోయిస్టు అగ్రనేత నంబాల మృతి: అమిత్ షా అధికారిక ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ: మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు(Nambala Keshava Rao) బుధవారం ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందారు. నంబాల మృతిని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ వివరాలను ఆయన తెలియజేశారు. నారాయణపూర్‌లో ఇప్పటిదాకా జరిగిన ఎన్కౌంటర్లో 27 మంది మృతి చెందారు. ఇందులో సీపీఐ మావోయిస్ట్ జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావు కూడా ఉన్నారు. నక్సల్స్ ఉదమ్యానికి నంబాల వెన్నెముకగా నిలిచారు. నక్సలిజాన్ని అంతమొందించడంలో ఇది కీలక ముందడుగు. ముప్పై ఏళ్ల పోరాటంలో ఇంత పెద్ద నాయకుడ్ని మట్టుబెట్టడం ఇదే తొలిసారి’’ అని ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారాయన. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ తర్వాత 54 మందిని అరెస్ట్ చేశాం. మరో 84 మంది లొంగిపోయారు. 2026 ఏడాది మార్చి చివరికల్లా నక్సలిజాన్ని అంతమొందదిస్తాం’’ అని షా ఎక్స్ వేదికగా ప్రకటించారు. నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు అలియాస్ గంగన్నగా ఆయన ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. 2010లో ఛత్తీస్‌గఢ్‌లో 76 మంది జవాన్ల మృతి ఘటనకు ఈయన ప్రధాన సూత్రధారి. కేంద్ర కమిటీ సభ్యుడైన నంబాలపై కోటిన్నర రివార్డు ఉంది.కాల్పులు ఇలా.. నారాయణపూర్‌లోని అబూజ్మడ్ అడవుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కీలక సమావేశం ఏర్పాటు చేశారన్న సమాచారంతో భద్రత బలగాలు కూంబింగ్ చేపట్టాయి. దంతెవాడ, బీజాపూర్ జిల్లాలకు చెందిన డీఆర్జీ జవాన్లు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో.. భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. ఇంజనీరింగ్ చదివి.. నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు స్వస్థలం ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా. ఆయన తండ్రి ఉపాధ్యాయుడు. నంబాల వరంగల్(తెలంగాణ) ఆర్ఈసీలో ఇంజినీరింగ్ చదివారు. 1984లో ఎంటెక్ చదువుతూ పీపుల్స్ వార్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడు అయ్యారు. 2018లో గణపతి రాజీనామాతో మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బసవరాజు కొనసాగుతూ వచ్చారు. -
‘కగార్’పై జనాంతిక ఆలోచనలు
కొన్ని విషయాలు సున్నితంగా ఉంటాయి. విషయాలు పూర్తి బహిరంగమైనవే. అందు గురించిన చర్చలు హోరాహోరీగా సాగినవే. కానీ పరిస్థితులు ఒక దశ నుంచి ఒకానొక దశకు మారినపుడు అంతా సున్నితం అవు తుంది. ‘ఆపరేషన్ కగార్’ సందర్భంగా ఆపరేషన్ విషయాలు కాదుగానీ నక్సలైట్ల గురించి, నక్సలిజం గురించిన చర్చ సున్నితంగా మారింది. పక్షం రోజులకు పైగా సాగుతున్న కర్రె గుట్టల ఉదంతం, ఎప్పటినుంచో జరుగుతున్న ఆ చర్చకు ఒక తక్షణ లక్షణాన్ని తీసుకు వచ్చింది. ఇది సున్నితం కావటానికి కారణం ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం తన ‘ఆపరేషన్’ను ఒక భీషణ సమరంగా మార్చటం కాదు. అందుకు నేపథ్య పరిస్థితులు ఇదమిత్థంగా ఫలానా అప్పటి నుంచి మొదలయ్యాయని చెప్పలేముగానీ, సుమారు మూడు దశాబ్దాలుగా కావచ్చు. అవి, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినాక మాత్రం తీవ్రం కావటం మొదలైంది.ప్రస్తుత ప్రభుత్వం తన నక్సలైట్ వ్యతిరేక చర్యలకు ‘ఆపరేషన్ కగార్’ అనే పేరు పెట్టింది. ‘కగార్’ అనే హిందీ మాటకు నిఘంటు అర్థం ‘అంచు’ లేదా ‘చివరి స్థితి’, ‘చివరి దశ’ అని. రాజకీయ అర్థం ‘అంతిమ దాడి’ అని! ఇది ఇతరుల నిర్వచనం కాదు. నక్సలైట్లను, నక్సలిజాన్ని 2026 మార్చ్ చివరి నాటికి అంతం చేసి తీరగలమని హోంమంత్రి అమిత్ షా పదేపదే ప్రకటిస్తున్నారు. అది సాధ్యమా కాదా అన్నది కాదు ఇక్కడ చేస్తున్న ఆలోచన. ఈ సందర్భాన్ని పురస్క రించుకుని, సుమారు 57 సంవత్సరాలుగా సాగుతున్న నక్సలైట్ ఉద్యమాన్ని పలువురు సమీక్షిస్తుండవచ్చు. అందులో భాగంగా, పైన ప్రస్తావించిన ఇటీవలి మూడు దశాబ్దాల కాలాన్ని కూడా. అంటే నక్సలిజం బలహీనపడుతూ వస్తున్న మూడు దశాబ్దాలను!ఎముకలు మెడలో వేసుకోని కాంగ్రెస్సూటిగా చెప్పుకోవాలంటే, మొదటి సగకాలం బలంగా సాగిన ఉద్యమం, తర్వాత సగకాలం నుంచి బలహీనపడుతూ వస్తున్నది. ఆ బలహీనతలు నాలుగు విధాలు. ఒకటి – సైద్ధాంతికంగా. రెండు – నాయకత్వ పరంగా. మూడు – ఉద్యమ నిర్వహణలో. నాలుగు – జనాదరణ విషయమై! ప్రభుత్వ అణచివేతలు ఎప్పుడూ ఉన్నవే. అణచివేతకు ఆరంభం తెలంగాణ రైతాంగ పోరాట కాలంలోనే జరిగినపుడు నక్స లిజం తర్వాతి కాలంలో అంతకు భిన్నంగా ఉండగల ఆస్కారమే లేదు. పైగా 1948కి 1968కి మధ్యకాలం 20 సంవత్సరాలు మాత్రమే. అప్పటినుంచి మరో 20 ఏండ్లు గడిచేసరికి నక్సలైట్ ఉద్యమ క్షీణతకు అంకురార్పణ జరిగింది. గమనించదగినదేమంటే, ఆ కాలమంతా పాలించింది బీజేపీ కాదు... కాంగ్రెస్. కొన్ని రాష్ట్రాలలో ఇతర పార్టీలు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి, రాజ్యాంగం రాసుకుని, చట్టాలు చేసుకుని, ప్రణాళికలు రూపొందించుకుని, ఎన్నికల మేనిఫెస్టోలు ప్రకటించుకున్నప్పటి నుంచి అన్నీ కపటమైన రీతిలో అరకొరగానే అమలయ్యాయి. అందుకే 1947 నుంచి 20 ఏండ్లయే సరికి నక్సలైట్లు అవతారమెత్తారు. అన్ని మలుపులూ 20–20–20 గానే కనిపిస్తు న్నాయి. అదొక విచిత్రం. ‘ఆపరేషన్ కగార్’ తరహా మాటలను కాంగ్రెస్ ఉపయోగించ లేదు, బీజేపీ ఉపయోగిస్తున్నది. చేతలు అవే, మాటలు వేరు. మాటలు వేరవటానికి మంచి కారణాలే ఉన్నాయి. కాంగ్రెస్‌కు 1885 నుంచి సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అందులో సామాజిక సమ్మిళితత్వం, ఉదారవాద మధ్యే మార్గం, కొంత అభ్యుదయ ధోరణి, దేశ వ్యాప్తమైన జాతీయత వంటివి ఉన్నాయి. అవి కాలం గడిచినకొద్దీ బలహీనపడుతూ అనేక అవలక్షణాలు ప్రవేశించినా, కనీసం ఎము కలను మెడలో వేసుకునే ధోరణి ఇంకా రాలేదు. ఆ కారణంగా, నక్సలిజం వెనుక పేదరికం ఉన్నమాట నిజమనీ, అది కేవలం శాంతి భద్రతల సమస్య కాదనీ, పేదల అభివృద్ధికి, సంక్షేమానికి కృషి చేయ గలమనీ మాటలు, ప్రకటనల రూపంలో చెప్పటం ఎన్నడూ మాన లేదు. అణచివేతలకు సాయుధబలాల ఉపయోగమైతే యథావిధిగా సాగించారు గాని, ‘కగార్’ తరహా ‘అంతిమ దాడి’ అనకుండా జాగ్రత్తపడ్డారు. పౌరహక్కుల సంస్థలను అనేక ఇబ్బందులకు గురిచేసినా, వారికి ‘అర్బన్ నక్సల్స్’ అనే ముద్ర వేయలేదు.నాగరిక, ప్రజాస్వామిక, ఆధునిక సమాజాలలో ఉదారవాద, ప్రగతిశీల భావనల సంప్రదాయం గురించి తెలిసిందే. ముఖ్యంగా రినైజాన్స్, ఫ్రెంచ్ విప్లవం, పారిశ్రామిక విప్లవం, బ్రిటన్‌లో రాజ్యాంగ ఆవిర్భావ కాలాల నుంచి ఉన్నత తరగతులపై, మధ్యతరగతిపై ఈ ప్రభావాలు మొదలయ్యాయి. ఈ వర్గాలు ప్రగతిశీలమైనవేగానీ, వ్యవస్థలో సంస్కరణలను కోరటం మినహా వ్యవస్థలను కూలదోయా లనేవి కావు. ఆ పరిమితులను తెలిసినందువల్లనే ఇక్కడ పౌర హక్కుల సంస్థల పాత్రను కాంగ్రెస్ ప్రభుత్వాలు కనీసం ఒక మేర గౌరవించటం, ఒకోసారి వారిని సంప్రదించటం చేస్తుండేవి. ఆ ధోరణి గత పదేళ్లుగా ఎట్లా మారిందో కనిపిస్తున్నదే. ఇది అంతి మంగా వ్యవస్థకు మేలు చేసేది కాదని ప్రభుత్వం గ్రహించవలసిందే తప్ప ఎవరూ చెప్పగల స్థితి కనిపించటం లేదు.మారిన సమాజ ధోరణులుఉద్యమాలకు ఎగుడు దిగుడులు సహజమేగానీ, నక్సలైట్ ఉద్యమం పైన చెప్పిన నాలుగు బలహీనతలలో దేని నుంచి కూడా నిజమైన అర్థంలో బయటకు రాలేక పోయింది. లేనట్లయితే, వారు కర్రె గుట్టల సందర్భంలో ఈ విధంగా చిక్కుకు పోవటం, చర్చల కోసం పది రోజుల్లో నాలుగుసార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేయటం, తెలంగాణ ప్రభుత్వాన్ని కోరటం, పౌర హక్కుల సంస్థలను కదలించేందుకు ఇంతగా ప్రయత్నించటం వంటి పరిస్థితులు ఏర్పడేవి కావు. ఇంత జరుగుతున్నా సమాజం నుంచి ఒకప్పటివలె స్పందనలు లేవు. ప్రస్తుత తరాలు వివిధ కారణాల వల్ల మారిపోయాయి. వారి దృష్టి ఇప్పుడు తమ కెరీర్‌పై, ఇతర అంశాలపై ఉంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఒకప్పుడు ఉద్యమానికి పెద్ద బలం. ఇపుడు కొద్ది ప్రాంతాలలోని కొంతమంది ఆదివాసీలు మాత్రం స్థానిక పరి స్థితులనుబట్టి నక్సలైట్లతో కదులుతున్నారు. స్వయంగా ఆదివాసీలైన ప్రజాప్రతినిధులు గతంలో కన్నా ఎక్కువగా స్వప్రయోజనాల కోసం రాజకీయ పార్టీల వెంట ఉంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే, వెనుకటి తరాలకు ఉద్యమం పట్ల గురి తప్పి నిరాశ ఏర్పడగా, కొత్త తరాలకు ఒక అగాథం వచ్చి కొత్త ప్రపంచంలో తమ జీవితాలను వెతుక్కుంటున్నారు. ఒకపుడు మధ్యతరగతిలో గణనీయమైన భాగానికి ఆదర్శవాదాలు ఉండేవి. అది సోవియెట్ యూనియన్‌కు, ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీలకు, విప్లవకారులకు, సాహిత్య–కళాకార్యకలాపా లకు పచ్చని కాలం. ఆ తరహా మధ్యతరగతి ఇపుడు పిడికెడుగా మిగిలింది. వామ పక్షాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.నక్సలైట్లకు కొత్త రిక్రూట్మెంట్లు తగ్గటం ఎప్పటినుంచో ఉన్నది. ఎన్కౌంటర్లలో ఒకపుడు ఒకరు చనిపోయినా వార్తలు, ప్రజలలో చర్చలు ఉండేవి. ఇపుడు చాలామంది చనిపోవటం వరుసగా జరిగితే తప్ప వార్తలు, చర్చలు కనిపించటం లేదు. మరొకవైపు సిద్ధాంతాలు, పోరాట పద్ధతులు, సంస్థ నిర్మాణాలు, నాయకత్వాలు ప్రస్తుత ఆధునికమైన, బలమైన ప్రభుత్వ వ్యవస్థలను ఎదుర్కొనగల విధంగా ఉన్నాయనే అభిప్రాయం వారి సానుభూతిపరులలోనైనా ఉందా అన్నది అనుమానమే. పౌరహక్కుల సంఘాల స్పందనలు సైతం స్వీయ సంశయాల మధ్య మందకొడిగానే కనిపిస్తున్నాయి. నక్సలైట్లు, నక్స లిజం భవిష్యత్తు అగమ్యగోచరం కావటానికి వెనుక ఈ పరిస్థితులు, దీర్ఘకాలిక పరిణామాలు అన్నీ ఉన్నాయి.విషయాన్ని జనాంతికంగా చర్చించుకోవటం ఎందుకంటే, ఒక వైపు పేదరికం, పీడన కొనసాగుదల, ధనిక–పేద తారతమ్యాల పెరుగుదల అనే వాస్తవ స్థితి ఎంత కనిపిస్తున్నదో, ఆ పరిస్థితులను మార్చే సంస్కరణల కోసం లేదా కొత్త వ్యవస్థ ఆవిష్కరణ కోసమని చెప్పేవారు విఫలం కావటం కూడా అంత కనిపిస్తున్నది. ఈ విష యాలు ముఖ్యంగా ‘కగార్’ వంటి సందర్భంలో దాపరికం లేకుండా మాట్లాడటం సున్నితమైనదే!టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
అన్ని రాష్ట్రాల సీఎంలతో అమిత్ షా అత్యవసర సమావేశం
-
యుద్ధ సన్నద్ధతపై కేంద్ర హోంశాఖ కీలక సమీక్ష
-
కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు YSRCP ఎంపీ గురుమూర్తి లేఖ
-
పుణ్యక్షేత్రాల్లో భద్రత వైఫల్యాలు.. అమిత్ షాకు ఎంపీ గురుమూర్తి ఫిర్యాదు
సాక్షి, తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమైన దేవాలయాల్లో భద్రత వైపల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని తిరుపతి వైఎస్సార్సీపీ ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి తెలిపారు. ఏపీలోని పుణ్యక్షేత్రాల్లో పరిపాలనా లోపాలు, భద్రతా వైఫల్యాల వల్ల తరచూ జరుగుతున్న దుర్ఘటనలపై వెంటనే సమగ్ర విచారణ చేపట్టాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు గురువారం లేఖ రాసినట్లు ఎంపీ వెల్లడించారు.ఈ సందర్భంగా ఎంపీ గురుమూర్తి.. ‘విశాఖపట్నం జిల్లా సింహాచలం దేవాలయంలో చందనోత్సవం సందర్భంగా గోడ కూలి ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. గోడ నిర్మాణంలో సరైన ఇంజనీరింగ్ పద్ధతులు పాటించకపోవడం, నాణ్యత లేని మెటీరియల్ ఉపయోగించడమే ఈ దుర్ఘటనకు కారణం. శ్రీకాకుళం జిల్లాలోని శ్రీ కూర్మనాథ స్వామి ఆలయంలో భక్తులు పవిత్రంగా భావించే అరుదైన నక్షత్ర తాబేళ్లు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించాయి. పోస్టుమార్టం చేయకుండానే వాటిని దహనం చేశారు.తిరుమలలో భద్రతా వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. జనవరి 8న తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టికెట్ కౌంటర్ల క్యూ లైన్లలో తొక్కిసలాటి జరిగి భక్తులు ప్రాణాలు కోల్పోయిన తర్వాత కూడా టీటీడీ పరిపాలనలో ఎలాంటి మార్పు రాలేదు. ఇటీవల మూడంచెల భద్రత వ్యవస్థను దాటి కొంతమంది భక్తులు పాదరక్షలతో తిరుమల శ్రీవారి ఆలయ సింహద్వారం వరకు వెళ్లారు. టీటీడీ గోశాలలో 100కు పైగా గోవులు మరణించాయి. గోశాల నిర్వహణలో నిర్లక్ష్యం, నాణ్యతలేని దాణా అందించడం, వైద్యసేవల లోపం వల్లే ఈ దారుణం జరిగింది.’ అని లేఖలో పేర్కొన్నారు. -
ఎవరినీ వదిలిపెట్టం!
న్యూఢిల్లీ: ప్రతి ఉగ్రవాద చర్యకూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారత్ తగిన సమాధానం ఇస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తేల్చిచెప్పారు. పిరికిపందల్లా దాడులకు పాల్పడి అదే గొప్ప విజయంగా భావిస్తూ పొంగిపోవద్దని ఉగ్రవాదులకు హితవు పలికారు. ఇది నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత్ అనే సంగతి గుర్తుపెట్టుకోవాలని చెప్పారు. ఒకరి తర్వాత ఒకరిపై వరుసగా ప్రతీకారం తీర్చుకుంటామని ఉగ్రవాదులను ఘాటుగా హెచ్చరించారు. దేశంలో ఉగ్రవాదాన్ని ప్రతి మూల నుంచీ అంతం చేస్తామని పునరుద్ఘాటించారు. ఒక్క అంగుళం భూభాగంలోనూ ఉగ్రవాదం అనేది లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.అనుకున్నది సాధించి తీరుతామని ప్రతిజ్ఞ చేశారు. ఆయన గురువారం ఢిల్లీలో ఓ కార్యక్రమంలో ప్రసంగించారు. ఉగ్రవాదంపై తాము ప్రారంభించిన పోరాటానికి అంతర్జాతీయ సమాజం మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ పోరాటంలో 140 కోట్ల మంది భారతీయుల మద్దతే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అందరి మద్దతు కావాలని చెప్పారు. ఉగ్రవాదాన్ని నామరూపాల్లేకుండా చేయడానికి ప్రపంచమంతా ఒక్కతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. మనమంతా చేతులు కలిపి పనిచేస్తే ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించి వేయొచ్చని తెలిపారు.ఇండియాలో దాడులకు పాల్పడి, ప్రజల ప్రాణాలను బలితీసుకున్న ముష్కరులకు తగిన శిక్ష విధించడం తథ్యమని అన్నారు. ఉగ్రవాదం పూర్తిగా అంతమయ్యే దాకా తమ పోరాటం ఆగదని వెల్లడించారు. పహల్గాంలో దాడికి పాల్పడిన ప్రతి ఒక్క ముష్కరుడినీ వేటాడుతామని అమిత్ షా స్పష్టంచేశారు. వారు శిక్ష నుంచి ఎప్పటికీ తప్పించుకోలేరని అన్నారు. మోదీ ప్రభుత్వం ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోదని చెప్పారు. 26 మందిని హత్య చేసి, గెలిచామనుకుంటే అది పొరపాటే అవుతుందని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదుల అరాచకాలను సహించే ప్రసక్తే లేదన్నారు. -
ఇది మోదీ సర్కార్.. ఏ ఒక్క ఉగ్రవాదిని వదలం: అమిత్ షా
న్యూఢిల్లీ, సాక్షి: పహల్గాం ఉగ్రదాడి ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తొలిసారి స్పందించారు. దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని.. ఏ ఒక్క ఉగ్రవాదిని వదిలే ప్రసక్తే లేదని అన్నారాయన. గురువారం న్యూఢిల్లీలో బోడో సామాజిక వేత్త ఉపేంద్రనాథ్ బ్రహ్మ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా ప్రసంగిస్తూ.. కొందరు దాడి చేసి విజయం సాధించామని అనుకుంటే అది పొరపాటే. ఇది మోదీ సర్కార్. మోదీ సర్కార్ ఎవరినీ వదిలి పెట్టదు. ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా వెతికి పట్టుకుని శిక్షిస్తాం. ఉగ్రవాదులకు సరైన సమాధానం చెప్పడం ఖాయం. ఇప్పటికే కశ్మీర్ లో ఉగ్రవాద చర్యలకు గట్టి సమాధానం ఇస్తున్నాం. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంటాం. పహల్గాం అమాయకుల చావులకు కారణమైన ప్రతి ఒక్కరూ మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఉగ్రవాదాన్ని తుదముట్టించడమే మా ప్రభుత్వ సంకల్పమని, దానిని సాధించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని అన్నారాయన. -
అధ్యక్షుడి కోసం.. నిరీక్షణ తప్పదా?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికకు ఇంకా కొన్నిరోజులు సమయం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణ అధ్యక్షుడితో పాటు ఏపీ తదితర రాష్ట్రాల అధ్యక్షులు అలాగే, జాతీయ అధ్యక్షుడి ఎన్నిక జరగాల్సి ఉండగా..ఎప్పటికప్పుడు వాయిదా పడుతోంది. తాజాగా కశ్మీర్లో ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో ఈ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. పహల్గాంలో 28 మంది పర్యాటకులు చనిపోవడం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని.. పాలనా పరంగా, రాజకీయంగానూ కుదిపేసింది.ప్రభుత్వంలో, పార్టీలో కీలకమైన ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పూర్తిగా..పహల్గాం ఉగ్రదాడి తదనంతరం పరిణామాలపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఈ నేపథ్యంలో పార్టీ సంస్థాగత అంశాలు, రాజకీయపరమైన విషయాలను ఇప్పట్లో పట్టించుకునే అవకాశం లేదని, కొత్త జాతీయ అధ్యక్షుడి విషయంలో మరి కొంతకాలం వేచిచూడక తప్పదని బీజేపీ నేతలు అంటున్నారు. జాతీయ అధ్యక్షుడి ఎన్నికతో తెలంగాణ అధ్యక్షుడి ఎన్నిక కూడా ముడిపడి ఉన్నందున, రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక కూడా ఆలస్యం అవుతుందని చెబుతున్నారు. కొత్త అధ్యక్షుడికి అన్నీ సవాళ్లే..! రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరు నియమితులైనా సంస్థాగతంగా, రాజకీయంగానూ కొన్ని సమస్యలను ఎదుర్కోక తప్పదనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమౌతోంది. ఈ బాధ్యతలు చేపట్టగానే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీంతో ఎన్నికల ప్రక్రియపైనే పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుందని అంటున్నారు. పార్టీలో గ్రూపులు పెరగడంతో.. సొంత ముద్రతో క్యాడర్‌ను తమ వైపు తిప్పుకోవడమూ సవాళ్ళతో కూడుకున్నదేననే చెబుతున్నారు. మరోవైపు వచ్చే అసెంబ్లీ ఎన్నికల కల్లా (2028) పార్టీని సంస్థాగతంగా, రాజకీయంగా బలోపేతం చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ అగ్ర నాయకత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధించడం ద్వారా పార్టీ బలాన్ని చాటడం కొత్త అధ్యక్షుడికి పెద్ద సవాల్‌గానే నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేడర్‌లో నిరాసక్తత! రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి ఎన్నిక జరగకపోవడం, పార్టీ కార్యక్రమాలు పెద్దగా లేకపోవడంతో.. పైకి బాగానే కనిపిస్తున్నా కేడర్‌లో లోలోపల నిరాసక్తత, నిర్లిప్తత చోటు చేసుకుందని అంటున్నారు. నిరుద్యోగ యువత, మహిళలు, రైతులు ఇతర వర్గాల సమస్యలపై అడపాదడపా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసేలా పెద్దగా కార్యాచరణ ఏదీ లేదని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నా.. రాజకీయ కార్యకలాపాలు జోరుగా సాగడం లేదనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు ఎవరికి వారు తమ సొంత ఇమేజీని పెంచుకోవడంపైనే దృష్టి పెడుతున్నారనే విమర్శలు విన్పిస్తున్నాయి. -
ఢిల్లీ: అన్ని రాష్ట్రాల సీఎంలకు అమిత్ షా ఫోన్
-
పాక్ పౌరులను తక్షణమే వెనక్కి పంపించండి
న్యూఢిల్లీ, సాక్షి: పాకిస్థాన్ పౌరుల విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు శుక్రవారం ఫోన్ చేశారు. పాక్ పౌరుల్ని గుర్తించి తక్షణమే వెనక్కి పంపాలని ఆదేశించినట్లు సమాచారం.పహాల్గం ఉగ్రదాడి తర్వాత పాకిస్థానీయుల వీసాలు కేంద్రం రద్దు చేసిన సంగతి తెలిసిందే. వారం లోపు దేశం విడిచిపోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే తాజాగా రాష్ట్రాలను కేంద్ర హోం శాఖ మరోమారు అప్రమత్తం చేసింది. మరోవైపు వివిధ రాష్ట్రాల్లో ఉన్న పాకిస్థానీయులపై పోలీసులు నజర్ వేశారు. పాక్ పౌరులకు సంబంధించిన వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్‌లో 208 మంది పాకిస్తానీయులు నమోదు అయినట్లు తెలుస్తోంది. వీరిలో లాంగ్ టర్మ్ వీసా ఉన్నవాళ్లు 156 మంది.. షార్ట్ టర్మ్ వీసా కలిగిన వారు 13 మంది ఉన్నట్లు తేలింది. వీళ్లను రెండు రోజుల్లో వెళ్లిపోవాలని పోలీసులు సూచించినట్లు సమాచారం.నల్లరిబ్బన్లతో నమాజ్‌కు..పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ.. మృతుల కుటుంబాలకు సంఘీభావం తెలుపుతూ మక్కా మసీదులో నల్ల రిబ్బన్లతో ముస్లింలు నమాజ్‌కు హాజరయ్యారు. మరోవైపు.. శాస్త్రిపురంలోని ఒక మసీదులో ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ నమాజ్ కోసం వచ్చిన వాళ్లకు నల్లటి రిబ్బన్ పంపిణీ చేశారు. -
Maoists Peace Talks ఇరువురి అజెండా ఒకటవ్వాలి!
వామపక్ష తీవ్రవాదమైన నక్సలిజాన్ని 2026 మార్చి నాటికి సమూలంగా అంతం చెయ్యాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా హోం మంత్రి అమిత్ షా ప్రకటించి, ఆ లక్ష్యం నెర వేరేలాగా పోలీసు యంత్రాంగాన్ని నడిపిస్తున్నారు. సాధార ణంగా బీజేపీ ప్రతిపాదిత విధా నాలను వ్యతిరేకించడమే విధానంగా ఉన్న ప్రతిపక్ష పార్టీలు నక్సలిజంపై యుద్ధం విషయంలో మాత్రం అమిత్ షా కి అనుకూలంగా ఉన్నాయి. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, కేరళ సీఎం పినరయి విజయన్లు కూడా మావోయిస్టుల ఏరివేతలో తాము భాగస్వాములేనని ప్రకటించారు. దాదాపుగా జాతీయ ఏకాభిప్రాయంతో మావోయిస్టుల ఏరివేత జరుగుతున్నదనేది వాస్తవం. వేల సంఖ్యలో ఉన్న పారామిలిటరీ బలగాలను ఎదుర్కోవటం మావో యిస్టులకు కుదరడం లేదు. ఈ స్థితిలో మావోయిస్టులు తెల్ల జెండా ఎత్తి లొంగిపోకుండా మేము చర్చలకు సిద్ధం అని ప్రకటించారు. అయితే ఈ చర్చల ప్రకటన కొత్తదేమీ కాదు. నక్స లిజం పుట్టిన తర్వాత చర్చల ప్రస్తావన ఒకసారి కన్నా ఎక్కువ సార్లే వచ్చింది. 2004లో ఆంధ్ర ప్రదేశ్‌లో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం చర్చలు జరిపినా అవి విఫల మయ్యాయి. ముందుగా ఆయుధాలు, అడవులను వదిలి బయటకు రావాలని ప్రభుత్వం చర్చలకు నిబంధన పెడితే... రక్షణ బలగాలను ముందుగా ఉపసంహ రించుకోండి అంటున్నారు మావోయిస్టులు. చుట్టు ముట్టిన ప్రతిసారీ చర్చల ప్రతిపాదన పెట్టి కొత్త స్థావరాలను సృష్టించుకున్నారు మావోయిస్టులు అనేది ప్రభుత్వ వర్గాల వాదన. చర్చల పేరుతో బయటకు రప్పించి తమ ఆనవాళ్ళను తెలుసుకుని దాడులుపెంచుతున్నారనేది మావోయిస్టుల ఆరోపణ. ఎవరి వాదనలు ఎలా ఉన్నా అడవుల్లో పోరాటం సాగుతున్నది. మావోయిస్టులు, భద్రతా దళాల సభ్యులు నేలకొరుగుతున్నారు. కొత్త తరం మావో యిజం పట్ల ఆకర్షించబడటం లేదు. అడవిబాట పట్టి తమ జీవితాలను వృథా చేసుకునే ఆలోచన నేటి యువతకు లేదు. అయినా కొందరు యువకులు మావోయిస్టులుగా మారుతున్నారంటే వారి గ్రామీణ ప్రాంతాలలో నెలకొన్న పెత్తందారీ వ్యవస్థలో బలిపశు వులు కావటమే. అలాంటి పెద్దలను వ్యక్తిగా వ్యతిరేకించలేక, పోరాడే మార్గం కనబడక నక్సల్స్ సహాయం కోసం అడవుల్లోకి వెళుతున్నారు. తమ వ్యక్తిగత కక్షను నక్సల్స్ ద్వారా తీర్చుకున్న తర్వాత వారికి ఆ ఉద్యమంతో అవసరం లేదు. కానీ అప్పటికే పోలీసులు లిస్టులోకి ఎక్కి ఉన్న ఆ యువతీయువకులు అడవులు, ఆయుధాలను వదలలేక అక్కడే ఉంటున్నారు. ఇటీవల కాలంలో లొంగిపోయి జనజీవన స్రవంతిలోకి వస్తున్న మావోయిస్టుల కథలు ఇటువంటివే. నక్సల్ ఉద్యమం పుట్టిన నాటికి ఉన్న సామాజిక పరిస్థితులు నేడు లేవు. భూమి మీద పెత్తనం బడా భూస్వాముల చేతిలో లేదు. పలు రాష్ట్రాలలో అమలైన భూసంస్కరణలు కేంద్రం, రాష్ట్రాలు అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు చాల వరకు మార్పును తెచ్చాయి. ఆర్థిక సంస్కరణల అమలు తర్వాత ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు వచ్చాయి. జీతాలు పెరిగాయి. యువతలో సైద్ధాంతిక రాద్ధాంతం కన్నా కెరీర్ ముఖ్యం అనే అభిప్రాయం పెరిగింది. అందుకే నక్సల్ ఉద్యమంవైపు కొత్తవారు వెళ్లడం లేదు. ఒకనాటి సైద్ధాంతిక నేతలు వయసుమళ్లి మరణించారు. కొందరు అనారో గ్యంతో చివరి దశకి చేరారు. బయటి సమాజంలోఉండే అవలక్షణాలు అడవుల్లోని మావోయిస్టుల్లోనూ ఉన్నాయి. శ్రమదోపిడీ, లైంగిక దోపిడీ, కుల అహంకా రాలు, అధికారాలు ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు మాజీ మావోయిస్టుల నోటి వెంట వచ్చాయి. మరోవైపు నవీన ఆయుధాలు, సాంకేతికతను భద్రతా బలగాలు ప్రయోగిస్తున్నాయి. అడవిలో ఏ మూల నక్కిన నక్సలైట్నైనా పట్టకలిగిన సాంకేతికత వచ్చింది. గురిచూసి వారిని చంపేసే డ్రోన్స్ వచ్చాయి. ప్రభుత్వాలు గిరిజన ప్రాంతాల్లో రహదారులు, ఆసు పత్రులు, పాఠశాలలను నిర్మించారు. కమ్యూనికేషన్ టవర్లు, బ్యాంకులు ఏర్పాటు చేశారు. అభివృద్ధి ఫలా లను గిరిజనులు అనుభవించి, మావోయిస్టులకు మద్దతు తగ్గించారు. ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో గిరిజనులు 2024 ఎన్నికల్లో భారీగా ఓటింగ్‌లో పాల్గొనడం అందుకు నిదర్శనం. చదవండి: ఉద్యోగం కోసం వెళ్లి, 42 ఏళ్లు అక్కడే మగ్గిపోయాడు...చివరికిఅయితే ప్రభుత్వ అభివృద్ధి నమూనాను మావో యిస్టులు తిరస్కరిస్తున్నారు. అటవీ, ఖనిజ సంపదను బడా కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు, ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతూ అభివృద్ధి ముసుగులో దోచుకుంటున్నారు అనేది వారి ఆరోపణ. రహదారులనిర్మాణం, గనుల ఏర్పాటుకు, ముడి సరుకు రవాణాకు తప్పించి ఆ ప్రాంత అభివృద్ధికి పనికి రాదన్నది మావోయిస్టుల మాట. ఎవరి వాదన వారిది. వాస్తవం ఆ రెండింటి మధ్యలో ఎక్కడో ఉంటుంది. గిరిజనుల జీవితాలు మెరుగవ్వాలంటే వారిని నలిపేస్తున్న ఇరుపక్షాలలోనూ మార్పులు రావాలి. ముందుగా ప్రభుత్వం సమాజంలో ఉన్న ఆర్థిక అవక తవకల తొలగింపునకు కూడా ఒక నిర్దిష్ట ప్రణాళికను ప్రకటించాలి. గిరిజనుల సమస్యల పరిష్కారానికి ఒక స్పష్ట యోజనను ప్రకటించాలి. ఆర్థిక సంస్కరణల తర్వాత దేశంలో ఆర్థిక అసమానతలు పెరిగాయి. అధికారంలో ఉన్నవారి ఆదరణతో పారిశ్రామికవేత్తలు లక్షల కోట్ల సంపద సమకూర్చుకున్నారు. అదే సమ యంలో సామాన్య వర్గాలు ఆర్థికంగా చితికి పోతు న్నాయి. అధిక ధరలు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అధికార యంత్రాంగం అవినీతి పెరుగుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే నక్సల్స్ ఉద్యమం మళ్లీ బలపడుతుంది. అవినీతి, సామాజిక, ఆర్థిక అసమాన తలను తొలగించే విధానాల అమలు మాత్రమే ప్రజ లందరినీ ఏకం చేసి, సవ్య అభివృద్ధి అజెండాకి కట్టు బడి ఉండేలా చేస్తాయి. అడవి బాట పట్టినవారిదీ, అధి కారంలో ఉన్న వారిదీ ఒకే తరహా అజెండా కాగలిగితే ఘర్షణ వాతావరణం పోయి, సమాజం ప్రశాంతంగా ఉంటుంది.-పి. వేణుగోపాల్ రెడ్డి ఏకలవ్య ఫౌండేషన్ వ్యవస్థాపకులుpvg2020@gmail.com -
రాష్ట్రపతితో అమిత్ షా, జై శంకర్ కీలక భేటీ
న్యూఢిల్లీ: కశ్మీర్లో అమాయక పర్యాటకులపై ఉగ్రవాదుల మెరుపుదాడి నేపథ్యంలో క్షీణించిన భారత్, పాక్ సత్సంబంధాలు, జమ్మూకశ్మీర్‌లో తాజా పరిస్థితి తదితరాలపై తాజా వివరాలు అందించేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌లు గురువారం ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో భేటీ అయ్యారు. సింధూ నదీజలాల ఒప్పందాన్ని భారత్ పక్కనబెట్టడం, సిమ్లా ఒప్పందం నుంచి పాకిస్తాన్ వైదొలగడంతో మారిన పరిణామాలపై రాష్ట్రపతి ముర్ముతో మంత్రులిద్దరూ మాట్లాడారు. రాష్ట్రపతితో అమిత్ షా, జైశంకర్ భేటీ ఫొటోను రాష్ట్రపతి భవన్ కార్యాలయం తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేసింది. నేతలిద్దరూ రాష్ట్రపతికి ఉగ్రదాడి సంబంధ అంశాలు, తదనంతర పరిణామాలను వివరించినట్లు తెలుస్తోంది. -
ఉగ్రవాదానికి భారత్ తలవంచదు
శ్రీనగర్/న్యూఢిల్లీ: ఉగ్రవాదానికి భారత్ ఏనాడూ తలవంచదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. అమాయక పర్యాటకులపై ఉగ్రపంజా విసిరిన వారిని వదిలిపెట్టేదిలేదని ఆయన స్పష్టంచేశారు. బుధవారం ఆయన బైసారన్ ఉగ్రదాడి మృతులకు శ్రీనగర్‌లోని పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద నివాళులర్పించారు. 26 మంది బాధితుల మృతదేహాల వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి అంజలి ఘటించారు. అక్కడే ఉన్న మృతుల కుటుంబ సభ్యులు, బంధువులను ఓదార్చారు. దారుణదాడికి తెగబడిన వారిని చట్టం ముందు నిలబెడతామని వారికి హామీ ఇచ్చారు. జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సైతం మృతులకు నివాళులర్పించారు. తర్వాత అమిత్‌షా అనంత్‌నాగ్‌లోని ప్రభుత్వ వైద్య బోధనాస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కలిసి పరామర్శించారు. తర్వాత అమిత్‌షా ఘటనాస్థలికి చేరుకుని అక్కడి పరిసరాలను పరిశీలించారు. దాడి జరిగిన తీరును అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. తర్వాత కొద్దిసేపు హెలికాప్టర్లో ఏరియల్ వ్యూలో పాల్గొన్నారు. ‘‘పహల్గాంఉగ్రదాడి బాధితులకు భారమైన హృదయంతో తుది వీడ్కోలు పలికా. ఉగ్రవాదానికి భారత్ తలవంచదని పునరుద్ఘాటిస్తున్నా. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన వారిని వదిలిపెట్టబోమని బాధిత కుటుంబాలకు, యావత్ భారతావనికి మాట ఇస్తున్నా’’ అని తర్వాత తన సామాజిక మాధ్యమ ఖాతా ‘ఎక్స్’లో అమిత్‌షా ఒక పోస్ట్‌పెట్టారు. ‘‘తమ వాళ్లను కోల్పోయిన బాధిత కుటుంబాల బాధను యావత్ భారతదేశం అనుభవిస్తోంది. ఇంతటి విషాదాన్ని మాటల్లో వర్ణించలేం’’ అని ఆయన మరో పోస్ట్ పెట్టారు. దాడి జరిగిన కొన్ని గంటల్లోపే అమిత్ షా కశ్మీర్‌కు చేరుకోగా జమ్మూకశ్మీర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నళిని ప్రభాత్, ఆర్మీ 15 కోర్ లెఫ్టినెంట్ జనరల్ ప్రశాంత్ శ్రీవాస్తవ తాజా పరిస్థితిని ఆయనకు వివరించారు. వెంటనే ఆయన లెఫ్టినెంట్ గవర్నర్‌తో కలిసి భద్రతా సమీక్ష సమావేశాన్ని ఏర్పాటుచేశారు.మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్గ్రేషియామృతుల కుటుంబాలకు జమ్మూకశ్మీర్ ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులకు తలో రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.1లక్ష పరిహారం ఇస్తున్నట్లు తెలిపింది. స్థానిక పోలీసులకు దర్యాప్తులో సాయపడేందుకు ఐజీ నేతృత్వంలోని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) బృందం ఢిల్లీ నుంచి కశ్మీర్‌కు బయల్దేరింది. దారుణదాడిని మూకుమ్మడిగా ఖండిస్తూ సంతాప సూచికగా కశ్మీర్ లోయ అంతటా బంద్ పాటించారు. ఇలా కశ్మీర్ అంతటా బంద్ పాటించడం గత 35 ఏళ్లలో ఇదే తొలిసారి. అధికార నేషనల్ కాన్ఫరెన్స్సçహా పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ, పీపుల్స్ కాన్ఫరెన్స్, అప్నీ పార్టీలు ఈ బంద్‌కు పిలుపు నిచ్చాయి. కశ్మీర్లో ప్రచురితమయ్యే ప్రధాన దినపత్రికలన్నీ తమ ఫ్రంట్పేజీలను నల్లరంగులో ముద్రించాయి. అమానవీయ చర్యను వ్యా పార సంఘాలు, నేతలు, మీడియా సహా పౌర సమాజం మొత్తం ఖండిస్తోందంటూ పదునైన హెడ్డింగ్లతో పతాక శీర్షికలను ఎరుపు రంగులో ప్రింట్ చేశాయి. పలు చోట్ల శాంతియుత ర్యాలీలు జరిగాయి. దాడి నేపథ్యంలో కశ్మీర్ సందర్శనను పర్యాటకులు హఠాత్తుగా రద్దుచేసుకుని వెనుదిరిగే పక్షంలో శ్రీనగర్ రూట్లో విమానచార్జీలను ఒక్కసారిగా పెంచకూడదని విమానసంస్థలను పౌరవిమాన యాన శాఖ హెచ్చరించింది. -
ఉగ్రదాడికి ప్రతీకారం.. భారత్ భారీ ఆపరేషన్
-
కాల్పులు జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన అమిత్ షా
-
ఉగ్రవాదానికి భారత్ తలొగ్గదు: అమిత్ షా
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయినవారికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులర్పించారు. బుధవారం ఉదయం శ్రీనగర్‌కు చేరుకున్న అమిత్ షా.. పుష్పగుచ్ఛం సమర్పించి వారికి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఎక్స్ ఖాతాలో ఆయనొక పోస్ట్ ఉంచారు.భారమైన హృదయంతో పహల్గాం ఉగ్రదాడి మృతులకు నివాళులు. భారత్ ఉగ్రవాదానికి తలొగ్గదు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని వదిలిపెట్టబోం. బాధితుల ఆవేదనను ప్రతీ భారతీయుడు అనుభవిస్తున్నాడు అని ట్వీట్ చేశారాయన.With a heavy heart, paid last respects to the deceased of the Pahalgam terror attack. Bharat will not bend to terror. The culprits of this dastardly terror attack will not be spared. pic.twitter.com/bFxb2nDT4H— Amit Shah (@AmitShah) April 23, 2025పహల్గాం ఉగ్రదాడి సమాచారం అందుకున్న వెంటనే మంగళవారమే అమిత్ షా జమ్ము కశ్మీర్ చేరుకున్నారు. బుధవారం ఉదయం మృతులకు నివాళులర్పించిన అనంతరం.. బాధిత కుటుంబాలను కలిసి పరామర్శించారు. ఆ సమయంలో బాధిత కుటుంబాలు కన్నీళ్లతో షాను వేడుకుంటున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఈ సందర్భంగా.. ఘటన వెనక ఉన్నవారిని వదిలిపెట్టబోమని బాధిత కుటుంబాలతో అమిత్ షా స్పష్టం చేశారు. ఆపై కాల్పులు జరిగిన ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహించిన ఆయన.. అధికారుల నుంచి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు.#WATCH | Union Home Minister Amit Shah meets the families of the victims of the Pahalgam terrorist attack in Srinagar, J&K pic.twitter.com/z7XvMMcadE— ANI (@ANI) April 23, 2025 #WATCH | Srinagar | Union Home Minister Amit Shah and J&K LG Manoj Sinha meet the families of Pahalgam terror attack victims pic.twitter.com/vJ73eeRyVC— ANI (@ANI) April 23, 2025 -
పహల్గామ్ ఉగ్రదాడి స్పాట్ కు అమిత్ షా.. ఉగ్రవాదులకు గట్టి హెచ్చరిక
-
పహల్గాం ఉగ్రదాడి: జమ్ములో 56 మంది విదేశీ ఉగ్రవాదులు
పహల్గాం ఉగ్రదాడి.. కేంద్రం సీరియస్.. అప్డేట్స్భారత్లో ఉన్న పాక్ పౌరులు వెంటనే వెళ్లిపోవాలి: విక్రమ్ మిస్రీవిదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీడియా సమావేశంపాక్ పౌరులను భారత్‌లోకి అనుమతించేది లేదుపహల్గాం దాడివెనుక పాక్ హస్తం ఉందిమా దగ్గర పూర్తి ఆధారాలున్నాయిఉగ్రదాడిని తీవ్రంగా పరిగణిస్తున్నాంఇండస్ వాటర్ ఒప్పందాన్ని నిలిపేస్తున్నాంఅటారీ-వాఘా సరిహద్దు చెక్‌పోస్టును మూసివేస్తున్నాంపాక్ తీవ్రవాద స్థావరాలపై భారత్ దాడికి దిగే అవకాశం?“పాక్ ఆక్రమిత్ కాశ్మీర్” (పిఓకే) లో పాక్ తీవ్రవాద స్థావరాలపై భారత్ దాడికి దిగే అవకాశం?“పాక్ ఆక్రమిత కాశ్మీర్” లో 110 నుంచి 125 మంది క్రియాశీలకంగా ఉన్న తీవ్రవాదులుసుమారు 42 “లాంచ్ పాడ్స్” (తీవ్రవాద స్థావరాలు) క్రియాశీలకంగా ఉన్నట్లు సమాచారంఉత్తర కాశ్మీర్ లో క్రియాశీలకంగా ఉన్న 35 మంది తీవ్రవాదులుజమ్మూలో కూడా క్రియాశీలకంగా ఉన్న సుమారు 100 మంది తీవ్రవాదులు. పహల్గాం ఉగ్రదాడిపై ప్రధాని సీరియస్‌సౌదీ పర్యటన కుదించుకుని వచ్చేసిన ప్రధాని మోదీపాక్ గగనతలంలోకి వెళ్లకుండా మరో మార్గంలో ప్రయాణం. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్లో ఉన్న దృశ్యాలతో వెల్లడైన విషయం పాక్ నుంచి ముప్పు ఉండొచ్చనే అనుమానాల నడుమ దారి మళ్లింపు ఎయిర్ పోర్టులోనే కీలక సమావేశం నిర్వహణకేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో భేటీప్రధాని అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ మరికాసేపట్లో ఉగ్రదాడిలో నేవీ అధికారి మృతి.. కలచివేస్తోన్న నవవధువు కన్నీటి వీడ్కోలు పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన నేవీ అధికారి వినయ్ నర్వాల్ వారం క్రితం వివాహం చేసుకుని భార్యతో కలిసి హనీమూన్‌కి వచ్చిన అధికారి ఉగ్రదాడిలో మృతి చెందిన ఆయనకు ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు కలచి వేస్తోన్న నవ వధువు రోదన Indian Navy Lieutenant Vinay Narwal's wife bids an emotional farewell to her husband, who was killed in the #Pahalgam terror attackThe couple got married on April 16. 💔💔 pic.twitter.com/a83lpg3A40— Venisha G Kiba (@KibaVenisha) April 23, 2025జమ్ములో అత్యధికంగా ఎల్ఈటీ ఉగ్రవాదులు! జమ్ము కశ్మీర్లో 56 మంది విదేశీ ఉగ్రవాదులు అత్యధికంగా లష్కరే తాయిబా(LeT) సభ్యులు ఉన్నారన్న నిఘా వర్షాలు పహల్గాం దాడులు తమ పనేనని ప్రకటించుకున్న ఎల్ఈటీ విభాగం అసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబు తల్హా గుర్తింపు ప్రధాన సూత్రధారి సైఫుల్లా సాజిద్? ముజాహిదీలు కశ్మీర్లో దాడి చేస్తారని తరచూ ప్రకటించిన సాజిద్ సాయంత్రం కేబినెట్ కీలక సమావేశంపహల్గాం నుంచి ఢిల్లీకి బయల్దేరిన కేంద్ర హోం మంత్రి అమిత్ షాసాయంత్రం ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్ సమావేశంకేబినెట్ భేటీలో కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం పహల్గాం ఘటనకు దీటుగా జవాబిస్తాం: రాజ్‌నాథ్ సింగ్ పహల్గాం ఉగ్రదాడి ఘటనపై మీడియాతో మాట్లాడిన కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పిరికిపంద చర్యగా అభివర్ణించిన రాజ్‌నాథ్ ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు : రాజ్‌నాథ్‌ఉగ్రవాదాన్ని తుదిముట్టించాలనేది భారత్ విధానం : రాజ్‌నాథ్‌ఉగ్రదాడికి పాల్పడిన దోషులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోం.: రాజ్‌నాథ్‌పహల్గామ్ ఘటనకు దీటుగా జవాబిస్తాం: రాజ్‌నాథ్#WATCH | #PahalgamTerrorAttack | Delhi: Raksha Mantri Rajnath Singh says, "Yesterday, in Pahalgam, targeting a particular religion, terrorists executed a cowardly act, in which we lost many innocent lives... I want to assure the countrymen that the government will take every… pic.twitter.com/VhNHD0kO2E— ANI (@ANI) April 23, 2025 ఉగ్ర రక్కసిపై గళమెత్తిన కశ్మీర్.. ఆరేళ్లలో తొలిసారి బంద్! పహల్గాం దాడిని ఖండిస్తూ వీధుల్లోకి వచ్చిన జనం శ్రీనగర్ సహా కశ్మీర్‌లోని అనేక ప్రాంతాల్లో స్వచ్ఛందంగా బంద్ గతంలో సర్వసాధారణంగా ఉండగా.. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్లో తొలిసారి బంద్ ఉగ్రదాడి.. పాకిస్థాన్ హైకమిషన్ వద్ద భద్రత కట్టుదిట్టం పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం పాకిస్థాన్ హైకమిషన్ వద్ద గట్టి సెక్యూరిటీ పక్షపాత రాజకీయాలకు ఇది సమయం కాదు: ఖర్గే పహల్గాం ఉగ్రదాడి మన దేశ ఐక్యత, సమగ్రతపై ప్రత్యక్ష దాడిగా పేర్కొన్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించివేసేందుకు కేంద్రంతో సహకరించేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని ట్వీట్ జమ్మును వీడుతున్న పర్యాటకులుపహల్గాం దాడి నేపథ్యంలో జమ్ము కశ్మీర్‌ను వీడుతున్న పర్యాటకులుఉదయం నుంచి 20 విమానాల్లో పైగా తిరుగు ప్రయాణం కిక్కిరిసిపోతున్న రైల్వే స్టేషన్లుకాట్రా నుంచి ప్ర త్యేక రైళ్లుఆరు గంటల్లో కశ్మీర్‌ను వీడిన 3,300 మంది పర్యాటకులుపర్యాటకులు వీడుతుండడంపై ఆవేదన వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాIt’s heartbreaking to see the exodus of our guests from the valley after yesterday’s tragic terror attack in Pahalgam but at the same time we totally understand why people would want to leave. While DGCA & the Ministry of Civil Aviation are working to organise extra flights,… pic.twitter.com/5O3i5U1rBh— Omar Abdullah (@OmarAbdullah) April 23, 2025 భద్రతా బలగాల అదుపులో పలువురు అనుమానితులు ఉగ్రవాదుల్లో ఇద్దరు కశ్మీరీలే!పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల గుర్తింపుఇద్దరు కశ్మీరీలేనని అనుమానిస్తున్న భద్రతా ఏజెన్సీలు2018లో కశ్మీర్‌ను వదిలి పాక్ వెళ్లిపోయిన అదిల్ గురి, అషన్‌ఇటీవలే మరో నలుగురితో కలిసి కశ్మీర్లో చొరబడినట్లు అనుమానంఅదిల్, అషన్ గురించి సమాచారం సేకరిస్తున్న భద్రతా బలగాలుపాక్ మద్దతుదారుల నుంచి వీళ్లకు మందు గుండు సామాగ్రి, ఏకే 47లునిల్వ ఆహారం, డ్రైఫూట్స్ ఉంచుకున్నట్లు అనుమానాలుమతాలవారీగా టూరిస్టులను వేరు చేసిన ఉగ్రవాదులుపాయింట్ బ్లాక్ రేంజ్లో టూరిస్టులను కాల్చేసిన టెర్రరిస్టులుహెల్మెట్ మౌంటెడ్ బాడీ కేమ్‌లతో రికార్డు చేసి పాక్‌కు చేరవేసి ఉండొచ్చనే అనుమానాలు పాక్ కవ్వింపు చర్యలుపాక్ దొంగ నాటకాలుపహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ కవ్వింపు చర్యలుసరిహద్దు వెంట భారీగా సైన్యం మోహరింపుకశ్మీర్ సరిహద్దులకు యుద్ధ విమానాల తరలింపుకరాచీ నుంచి లాహోర్, రాల్పిండికి యుద్ధ విమానాలుపహల్గాం దాడితో తమకేం సంబంధం లేదని ప్రకటించిన పాక్ ప్రభుత్వందాడి ఘటనను ఖండిస్తూ.. మరణించినవారి కుటుంబాలకు సానుభూతి ప్రకటనమమ్మల్ని నిందించొద్దు అంటూ పాక్ రక్షణ మంత్రి వ్యాఖ్యలుభారత్‌లో పలు రాష్ట్రాల్లో గొడవలు జరుగుతున్నాయని.. అంతర్గత తిరుగుబాటులే పహల్గాం దాడికి కారణమంటూ ప్రకటనఉగ్రవాదులకు సాయం చేసింది పాక్ ఐఎస్ఐనే పరిహారం ప్రకటించిన జమ్ము ప్రభుత్వంపహల్గాం ఉగ్రదాడి బాధితులకు పరిహారం ప్రకటించిన జమ్ము కశ్మీర్ ప్రభుత్వంమృతులకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడినవాళ్లకు రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వాళ్లకు రూ.1 లక్షదాడికి నిరసనగా కశ్మీర్ బంద్‌కు పిలుపు ఇచ్చిన ప్రజా సంఘాలు పహల్గాం ఊచకోతను ఖండిస్తూ సుప్రీం కోర్టు ఏకగ్రీవ తీర్మానంపహల్గాం ఉగ్రఘటన.. సుప్రీం కోర్టు న్యాయమూర్తుల నివాళి మతిలేని చర్యగా అభివర్ణించిన సర్వోన్నత న్యాయస్థానంఉగ్రదాడి మృతులకు సంతాపంగా మౌనం పాటించిన సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బంది ఈ దారుణ ఘటనను ఖండించిన సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ ఉగ్రవాదుల ఏరివేతకు కేంద్రం ఆపరేషన్?కశ్మీర్, పీవోకేలో ఉగ్రవాదుల ఏరివేతకు కేంద్రం ఆపరేషన్?ప్రధాని మోదీ, రక్షణ మంత్రి వరుస సమావేశాలుహోం మంత్రి అమిత్ షా క్షేత్రస్థాయి పర్యటనకశ్మీర్ పరిస్థితులను ప్రధాని మోదీకి వివరించిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో త్రివిధ దళాధిపతుల సమావేశంకేంద్రం ఆదేశాల అమలుకు సిద్ధమంటున్న త్రివిధ దళాధిపతులుపహల్గాం ఉగ్రదాడి ప్రధానాంశంగా.. సాయంత్రం కేంద్ర కేబినెట్ సమావేశంసమావేశం అనంతరం కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం పహల్గాంలో కూంబింగ్‌పహల్గాంలో కొనసాగుతున్న కూబింగ్‌ఉగ్రవాదుల కోసం కొనసాగుతున్న వేటఒకవైపు.. క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్న బలగాలుమరోవైపు డ్రోన్ల సాయంతో కొనసాగుతున్న గాలింపుఉగ్రవాదుల ఊహా చిత్రాలు విడుదలపహల్గాం దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల ఊహా చిత్రాలు విడుదలముగ్గురి చిత్రాలను విడుదల చేసిన కేంద్రంఅందులో అసిఫ్ అనే ఉగ్రవాదిబాడీ క్యామ్ ధరించి దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదులుమొత్తం ఏడుగురు దాడికి పాల్పడినట్లు చెబుతున్న ప్రత్యక్ష సాక్షులుకానీ, దాడికి పాల్పడింది ముగ్గురి నుంచి నలుగురే?దాడులకు పాల్పడింది తామేనంటూ ప్రకటించిన లష్కరే తోయిబా విభాగం ది రెసిస్టెంట్ ఫ్రంట్ పహల్గాం దాడిపై కేంద్రం సీరియస్‌రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశంప్రస్తుత పరిస్థితిని వివరించిన త్రివిధ దళాధిపతులుప్రతిచర్యకు సిద్ధమని ప్రకటనసాయంత్రం ఆరు గంటలకు కేబినెట్ కీలక సమావేశంమరోవైపు భద్రతా ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ భేటీ పలు నగరాల్లో హైఅలర్ట్‌దేశవ్యాప్తంగా పలు నగరాల్లో హైఅలర్ట్ కశ్మీర్ పహల్గాం దాడితో అప్రమత్తమైన కేంద్రంఢిల్లీ, ముంబై సహా పలు నగరాలకు భద్రతాపరమైన హెచ్చరికలు జారీ చేసిన హోం శాఖ బైసరన్‌కు అమిత్ షాపహల్గాం బైసరన్‌కు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకాల్పులు జరిపిన ప్రాంతంలో పర్యటించిన షాప్రతి చర్య తప్పదని, ఉగ్రవాదులపై కఠిన చర్యలు ఉంటాయని బాధిత కుటుంబాలకు హోం మంత్రి హామీ నేటి ఐపీఎల్ మ్యాచ్‌లో సంఘీభావంపహల్గాం ఉగ్రదాడికి సంఘీభావం తెలుపుతున్న ప్రముఖులుఐపీఎల్ క్రికెటర్ల సంఘీభావంఇవాళ హైదరాబాద్ ఉప్పల్‌లో ఐపీఎల్ మ్యాచ్‌దాడికి సంఘీభావంగా నల్ల బ్యాడ్జీలు ధరించనున్న ప్లేయర్స్‌ఒక నిమిషం మౌనం పాటించనున్న ఆటగాళ్లుచీర్‌గర్ల్స్ ఉండబోరని ప్రకటించిన బీసీసీఐ రంగంలోకి ఎన్‌ఐఏపహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో రంగంలోకి దిగిన జాతీయ దర్యాప్తు సంస్థ బృందంహోటల్స్, లాడ్జిలను జల్లెడ పడుతున్న అధికారులుదాడి తర్వాత అడవుల్లోకి పరారైనట్లు చెబుతున్న ప్రత్యక్ష సాక్షులుఅయినప్పటికీ పహల్గాంను అదుపులోకి తీసుకుని తనిఖీలు చేపడుతున్న భద్రతా బలగాలుప్రత్యక్ష సాక్షులను ప్రశ్నిస్తున్న ఎన్ఐఏ టీం పలు రాష్ట్రాల్లో పాక్ వ్యతిరేక నిరసనలుపహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ దేశవ్యాప్త నిరసనలు రోడ్డెక్కిన ప్రజలుపాక్, ఉగ్రవాద వ్యతిరేక నినాదాలతో ర్యాలీలుఉగ్రవాదం నశించాలంటూ ఫ్లకార్డులతో ప్రదర్శన పహల్గాం ఉగ్రదాడిలో((Pahalgam Terror attack) మరణించిన మృతులకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నివాళులర్పించారు. బుధవారం ఉదయం శ్రీనగర్ కంట్రోల్ రూంలో సైనిక గౌరవ వందనం నడుమ మృతదేహాలపై పుష్ప గుచ్ఛాలను ఉంచారాయన. అనంతరం దాడిలో గాయపడి అనంత్‌నాగ్ ఆస్పత్రిలో క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. #WATCH | Union Home Minister Amit Shah pays tributes to the victims of the Pahalgam terror attack, in Srinagar, J&K pic.twitter.com/tPRSj4ewUg— ANI (@ANI) April 23, 2025మంగళవారం రాత్రే శ్రీనగర్‌కు చేరుకున్న హోం మంత్రి అమిత్ షా(Amit Shah).. వివిధ భద్రతా బలగాల ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించిన సంగతి తెలిసిందే. ఈ సమీక్షలో జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్‌సిన్హా కూడా పాల్గొన్నారు. ఈ ఉదయం మృతదేహాలకు ఆయన నివాళి అర్పించిన అనంతరం.. ప్రత్యేక విమానాల్లో మృతదేహాలను స్వస్థలాలకు తరలించనున్నారు. మరోవైపు.. పహల్గాం ఘటనకు కారకులైన ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. అడవుల్లోకి పారిపోయిన ముష్కరుల కోసం డ్రోన్లతో భద్రతా బలగాలు గాలిస్తున్నాయి.జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో మంగళవారం ఉగ్రవాదులు తెగబడ్డారు. ప్రకృతి అందాలను చూసి పరవశిస్తోన్న వారిపై పాశవికంగా దాడి చేసి 28 మందిని పొట్టన పెట్టకున్నారు. ఈ ఉగ్రవాద దాడి ఘటనపై ప్రపంచం మొత్తం స్పందించింది. అమాయకులపై జరిగిన ఈ హేయ చర్యను ప్రపంచ నాయకులు ఖండించారు. అమెరికా నుంచి రష్యా వరకు, ఇటలీ నుంచి ఇజ్రాయెల్ వరకు ప్రధాన నేతలు ఈ దాడిని తీవ్రంగా తప్పుబడుతూ, భారత్‌కు బలమైన సంఘీభావాన్ని ప్రకటించారు. -
ఢిల్లీ చేరుకున్న మోదీ.. ఎయిర్‌పోర్టులోనే ధోవల్‌తో సమీక్ష!
సాక్షి, ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ చేరుకున్నారు. కాశ్మీర్లో ఉగ్ర దాడి నేపథ్యంలో ప్రధాని మోదీ.. సౌదీ అరేబియా పర్యటన అర్థాంతరంగా ముగించుకుని భారత్‌కు పయనమయ్యారు. విమానాశ్రయంలో ప్రధాని మోదీని కలిసి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ ప్రస్తుత పరిస్థితి వివరించారు. ఉగ్రవాదులకు బుద్ధి చెప్పేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ చర్చించనున్నారు. ఇక, ఢిల్లీ చేరుకున్న వెంటనే ప్రధాని మోదీ.. ఎయిర్‌పోర్టులోనే కశ్మీర్ ఉగ్రదాడిపై సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమీక్ష సమావేశానికి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. నేడు పహల్గాంకు అమిత్ షాఘటనాస్థలాన్ని సందర్శించాలన్న ప్రధాని మోదీ ఆదేశంతో హోంమంత్రి అమిత్ షా హుటాహుటిన మంగళవారం రాత్రి శ్రీనగర్‌కు చేరుకున్నారు. భద్రతా సంస్థల ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితులను సమీక్షించారు. ఆయన వెంట జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్‌సిన్హా కూడా ఉన్నారు. బుధవారం అమిత్ షా పహల్గాంకు వెళ్లనున్నారు. ఉగ్రవాదుల దుశ్చర్యపై భారత పర్యటనలో ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ. వాన్స్ సహా పలువురు నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. Prime Minister Narendra Modi arrives in Delhi after cutting short his Saudi Arabia visit in view of the #PahalgamTerroristAttack in Kashmir.NSA Ajit Doval accompanies him. (Source - ANI/DD) pic.twitter.com/PeA7CWRAes— ANI (@ANI) April 23, 2025 -
నన్ను చంపేందుకు కుట్రలు.. కేంద్రమంత్రి సంచలన ఆరోపణలు
ఛండీగఢ్: తన హత్యకు ఖలిస్థానీలు కుట్రలు చేస్తున్నారని కేంద్రమంత్రి రవనీత్ సింగ్ బిట్టూ సంచలన ఆరోపణలు చేశారు. రాడికల్ ప్రచారకుడు, ఎంపీ అమృత్‌పాల్ సింగ్ నడిపిస్తున్న ‘వారిస్ పంజాబ్ దే’ సంస్థతో సంబంధమున్న ఖలిస్థానీ మద్దతుదారులే తన హత్యకు ప్లాన్ చేశారని చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి.తాజాగా, రైల్వేశాఖ సహాయ మంత్రి రవనీత్ సింగ్ బిట్టు మాట్లాడుతూ.. పంజాబ్‌లోని రాజకీయ నాయకులకు ఖలిస్థానీ మద్దతుదారుల నుంచి ప్రమాదం పొంచి ఉంది. పలువురు నేతల హత్యకు వారు ప్లాన్ చేస్తున్నారు. ఖలిస్తానీల ప్లాన్ గురించి సోషల్ మీడియాలో లీకైన కొన్ని స్క్రీన్ షాట్ల ద్వారా ఈ విషయం నాకు తెలిసింది. ఎంపీ అమృత్‌పాల్ సింగ్ నడిపిస్తున్న ‘వారిస్ పంజాబ్ దే’ సంస్థతో సంబంధమున్న ఖలిస్థానీ మద్దతుదారులే ఇందులో ఉన్నారు. నాతో పాటుగా మరికొంతమంది రాజకీయ నాయకుల ప్రాణాలకు కూడా ఖలిస్థానీయుల నుంచి ముప్పు పొంచి ఉంది’ అంటూ వ్యాఖ్యలు చేశారు.ఇదే సమయంలో.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై కూడా వారిస్ పంజాబ్ దే నాయకులు కక్ష పెంచుకున్నారని ఆరోపించారు. జాతీయ భద్రతా చట్టం కింద అమృత్‌పాల్ నిర్బంధం మరో ఏడాది పొడిగించడమే ఇందుకు కారణమని చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోందని వెల్లడించారు. అందుకే ఈ గ్రూపుతో సంబంధం ఉన్న ఖలిస్తానీ శక్తులను పంజాబ్ ప్రభుత్వం వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.అయతే, గతంలో దిబ్రుగఢ్ జైలులో ఉన్న అమృత్‌పాల్ సింగ్ సహచరులను పంజాబ్‌కు తరలించినట్లు ఆయన తెలిపారు. ఇది ప్రధాన కుట్రదారుడిగా అమృత్‌పాల్ పాత్రపై అనుమానాలను మరింత బలపరుస్తుందంటూ వ్యాఖ్యలు చేశారు. రాజకీయ కార్యకర్తలుగా మారువేషంలో ఉన్న నేరస్థుల పట్ల పంజాబ్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కోరారు. -
6 గంటల నిద్ర, 2 గంటల వ్యాయామం
న్యూఢిల్లీ: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తన ఆరోగ్య రహస్యాన్ని వివరించారు. సరైన ఆహారం, రోజులో ఆరు గంటల నిద్ర, రెండు గంటలపాటు వ్యాయామం అనే సూత్రాలను తు.చ. తప్పక పాటించడం వల్లే ఫిట్‌గా ఉన్నట్లు వెల్లడించారు. లివర్ డే సందర్భంగా శనివారం ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్‌లో జరిగిన కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడారు. 2020 నుంచి పాటిస్తున్న ఆరోగ్య సూత్రాల వల్లే బరువు తగ్గానన్నారు. ‘కంటి నిండా నిద్ర, నీరు, సరైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం అనే నియమాలను పాటిస్తున్నా. వీటి ఫలితంగానే ఎలాంటి ఇంగ్లిష్ మందులను వాడాల్సిన అవసరం నాకు ఇప్పటివరకు రాలేదు. డయాబెటిస్ వంటి వ్యాధుల బారిన పడలేదు’అని ఆయన వివరించారు. నేటి యువతరం కూడా ఇటువంటి నియమాలను పాటించి, మరో 40–50 ఏళ్ల ఆయుర్దాయం పెంచుకోవాలని, దేశాభివృద్ధికి తోడ్పాటు అందించాలని ఆయన పిలుపునిచ్చారు. ‘శారీరక ఆరోగ్యం కోసం రోజులో రెండు గంటలను వ్యాయామం కోసం కేటాయించండి, మెదడు ఆరోగ్యం కోసం ఆరుగంటలపాటు నిద్రపోండి. ఇది చాలా అవసరం. ఇదే నా అనుభవం’అని ఆయన పేర్కొన్నారు. అనంతరం, అమిత్ షా పాటిస్తున్న ఆరోగ్య సూత్రాలను ప్రధాని మోదీ ఎక్స్‌లో కొనియాడారు. ‘ఆహారంలో నూనెలను తగ్గించుకోవడం వంటి చిన్నచిన్న మార్పులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఒబెసిటీపై అవగాహన కల్పిద్దాం. ఆరోగ్య భారతాన్ని నిర్మిద్దాం’అంటూ ఆయన పిలుపునిచ్చారు. -
కత్తులతోనే పొత్తు పొడుపు!
అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది వ్యవధి ఉండగానే తమిళనాడులో ప్రత్యర్థి పార్టీల మధ్య చిట పటలు మొదలైపోయాయి. ఈసారి ఎలాగైనా నిలదొక్కుకుని పార్టీ జెండా రెపరెపలాడించాలని బీజేపీ కృతనిశ్చయంతో ఉన్నట్టు కనబడుతోంది. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌పై విమర్శల జోరుపెంచారు. స్టాలిన్ కూడా అంతే దీటుగా బదులిస్తున్నారు. రెండేళ్ల క్రితం తమను వీడివెళ్లిన అన్నా డీఎంకేతో బీజేపీ చెలిమిని ఖరారు చేసుకుంది. అందుకోసం అమిత్ షా చెన్నై రావటాన్ని చూస్తే రాబోయే పోరులో తమది కీలకమైన పాత్రని ఆ పార్టీ చెప్పదల్చుకున్నట్టు అర్థమవుతుంది. అయితే ఈ సాన్నిహిత్యం ఏమంత సజావుగా లేదని జరుగుతున్న పరిణామాలు చెబుతున్నాయి. కేవలం ఈ చెలిమి కోసం బీజేపీ అన్నామలైని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించి ఆ స్థానంలో నయనార్ నాగేంద్రన్ను నియ మించింది. అన్నామలై గత రెండేళ్లుగా డీఎంకే సర్కారుపైకి దూకుడుగా పోతున్నారు. నిరుడు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి ఆధిపత్య కులాల వోట్లు రాబట్టడంలో, యువతను సమీకరించటంలో ఆయన విజయం సాధించారు. సీట్లయితే రాలేదుగానీ... బీజేపీ వోటు శాతం 11.24 శాతా నికి చేరుకుంది. కానీ ఆ దూకుడు పొత్తు రాజకీయాల్లో చిచ్చు పెడుతుందన్న భయం బీజేపీ అధిష్ఠా నంలో వుంది. ఎందుకంటే లోక్‌సభ ఎన్నికల సందర్భంగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం పళనిస్వామిపై అన్నామలై తీవ్ర విమర్శలు చేశారు. అవి వ్యక్తిగత స్థాయికి వెళ్లి పోయాయి. అందుకే ఎన్నికల వరకూ పొత్తు సజావుగా వుండాలంటే అన్నామలైని తప్పించటమే మంచిదని కేంద్ర నాయకత్వం భావించింది. నాగేంద్రన్ అన్నాడీఎంకే నుంచి వచ్చినవారే. జయ సర్కారులో పళని స్వామి, ఆయనా సహచరులు కూడా. 2016లో జయ మరణం తర్వాత నాగేంద్రన్ బీజేపీ కండువా కప్పుకున్నారు. ఆ మాటెలావున్నా రెండు పార్టీలకూ ఇది ఇష్టం లేని పొత్తే. కొన్ని సీట్లయినా సాధించుకోగలిగితే ద్రవిడ కోటలో పాగా వేశామన్న అభిప్రాయం కలిగించ వచ్చని బీజేపీ ఆశిస్తోంది. అటు అన్నాడీఎంకే పరిస్థితీ ఏమంత బాగోలేదు. జయ మరణంతో అది అనాథగా మారింది. అంత ర్గత కీచులాటల మధ్య 2021 వరకూ ప్రభుత్వం మనుగడ సాగించినా తర్వాత అది మూడు ముక్క లైంది. పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకేకు అసెంబ్లీ ఎన్నికల్లో 66 స్థానాలొచ్చాయి. కానీ గత లోక్‌సభ ఎన్నికల్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. మొత్తం 39 స్థానాలనూ డీఎంకే కూటమి గెల్చుకుంది. అందుకే అటు బీజేపీకి, ఇటు అన్నాడీఎంకేకు ప్రస్తుత పొత్తు ప్రాణావసరమైంది.సమస్యేమంటే రెండు పార్టీల మధ్యా పొత్తు ఏర్పడినా, అది ఎన్డీయే కూటమిగా ఉంటుందని అమిత్ షా చెప్పినా ఈ చెలిమితో ఇరుపక్షాలూ ఇబ్బంది పడుతున్న వైనం కనబడుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే లేకుండానే తాము 11.24 శాతం వోట్లు రాబట్టుకోగలిగామని బీజేపీ ధీమాగా వుంది. కానీ ఆ పరిస్థితి అన్నాడీఎంకేలో లేదు. అధికారంలో పాలుపంచుకుంటామో, లేదో ఎన్నికల తర్వాతే చెబుతామని షా అంటే... ఎన్నికల్లో పోటీవరకే పొత్తులని పళనిస్వామి ప్రక టించారు. తమిళనాడు రాజకీయ ధోరణులు గమనిస్తే అక్కడ కూటమి ప్రభుత్వాలు ఎప్పుడూ లేవు. పొత్తులున్నా రాష్ట్ర మంత్రివర్గంలో ఏనాడూ జాతీయ పార్టీలకు చోటీయలేదు. ఇప్పుడు కూడా అదే కొనసాగుతుందనుకుంటే తప్ప తమిళ వోటర్లు కనికరించరని పళనిస్వామి, అమిత్ షాలు అనుకుని వుండొచ్చు. అయితే డీఎంకేపై విరుచుకుపడటానికి తగిన ఆయుధాలు లేకపోవటం ఎన్డీయే కూటమికున్న ప్రధాన సమస్య. కాశీకి ప్రత్యేక రైలు నడపటం, కొత్త పార్లమెంట్ భవనంలో సెంగోల్, వీణ పెట్టడం ద్రవిడ రాజకీయ ప్రాబల్యంగల తమిళనాడును అంతగా ఆకర్షించినట్టు లేదు. స్టాలిన్ అమ్ములపొదిలో చాలా అస్త్రాలున్నాయి. ముఖ్యంగా ఆయన తమిళుల ఆత్మగౌరవంఅంశాన్ని ముందుకు తెచ్చారు. తమిళులు అనాగరికులని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యా నించటం, అనంతరం క్షమాపణ చెప్పటం ప్రస్తావిస్తున్నారు. బలవంతంగా హిందీ రుద్దాలని చూస్తు న్నారని ఆరోపిస్తున్నారు. ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి సీఎం నవీన్ పట్నాయక్‌కు సన్నిహి తుడైన తమిళ ఐఏఎస్ అధికారి వీకే పాండ్యన్‌పై బీజేపీ రేపిన దుమారాన్ని గుర్తుచేస్తున్నారు. ఒడిశా ప్రజలపై తమిళులు పెత్తనం ఎలా చేస్తారని ప్రశ్నించటాన్ని ఎత్తిచూపుతున్నారు. గత పదేళ్లలో తమిళ నాడుకు కేంద్ర నిధులు మూడు రెట్లు పెరిగినా కొందరికి ఏడవటం అలవాటైపోయిందన్న ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలనూ ఆయన తనకు అనుకూలంగా మలుచుకున్నారు. తమ వంతు వాటా అడగటం తమ హక్కని, అందుకు ఏడవటం లేదా బానిసత్వం చేయటం చేతకాదని స్టాలిన్ జవాబి చ్చారు. 234 స్థానాలుగల అసెంబ్లీలో గత ఎన్నికల్లో డీఎంకే సొంతంగా 133, మిత్రులతో కలిసి 159 గెల్చుకుంది. 46 శాతం వోట్లు రాబట్టింది.ఇప్పటికైతే తమిళనాట సామాజిక న్యాయం, రాష్ట్రాల హక్కులు, ఆత్మగౌరవం ప్రధానాంశాలు. గవర్నర్ ఆర్ఎన్ రవి అసెంబ్లీ ఆమోదించిన పది బిల్లుల్ని దీర్ఘకాలం పెండింగ్‌లో ఉంచటం, సుప్రీంకోర్టు ఆయన్ను మందలించటంతోపాటు వాటిని ఆమోదించినట్టుగా భావించాలని చెప్పటం స్టాలిన్‌కు మరింత శక్తినిచ్చింది. అవినీతి పెరిగిందని, వేలకోట్ల ప్రజాధనాన్ని డీఎంకే నేతలు దోచు కుంటున్నారని, శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని బీజేపీ చేస్తున్న ఆరోపణలు ప్రజల్ని ఎంతవరకూ కదలించగలవో చూడాలి. అంతకన్నా ముందు అసెంబ్లీ ఎన్నికలు జరిగే వచ్చే ఏప్రిల్‌నాటికైనా తమ పొత్తు విషయంలో ఆత్మవిశ్వాసాన్ని కనబర్చటం అవసరమని ఎన్డీయే గుర్తించాలి. -
‘అమిత్ షానే కాదు.. ఏ షా వచ్చినా మాకేం కాదు.. అది డీఎంకే పవర్’
చెన్నై: ఇటీవల అన్నా డీఎంకేతో బీజేపీ పొత్తు పెట్టుకున్న తర్వాత డీఎంకే పార్టీ తీవ్రంగా స్పందిస్తోంది. గత వారం అదొక ‘అవినీతి కూటమి’ అంటూ వ్యాఖ్యానించిన డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు సీఎం స్టాలిన్.. వారి పొత్తుపై మరొకసారి ఘాటు వ్యాఖ్యాలు చేశారు. తమిళనాడుకొచ్చి బీజేపీ ఏదో చేద్దామని కలలు కంటుందని, అది వారి వల్ల కాదని స్టాలిన్ నేరుగా విమర్శలు చేశారు. తమిళనాడుకు అమిత్ షానే కాదు.. ఏ షా వచ్చినా తమకేమీ కాదంటూ విమర్శించారు. అన్నా డీఎంకేతో పొత్తు పెట్టుకునే సందర్భంలో తమిళనాడుకు సంబంధించి ఏ ఒక్క విషయంలోనూ బీజేపీ పెద్దలు క్లారిటీ ఇవ్వలేదని ధ్వజమెత్తారు. అవకతవకలు జరిగిన నీట్ ఎగ్జామ్స్ కు సంబంధించి రాష్ట్ర విద్యార్థులకు ఎటువంటి మినహాయింపును బీజేపీ ఇవ్వలేదన్నారు. అదే సమయంలో హిందీని తమిళనాడులో రుద్దమనే విషయంలో కూడా వారు ఏమీ స్పష్టత ఇవ్వలేదని, ఇక డీలిమిటేషన్ అంశంపై కూడా ఏమీ పెదవి విప్పలేదని బీజేపీని కార్నర్ చేశారు స్టాలిన్.తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవి తమ ప్రభుత్వం పట్ల వ్యవహరించిన తీరును సుప్రీంకోర్టు తప్పుబట్టిన విషయాన్ని స్టాలిన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇది కేంద్ర ప్రభుత్వానికి ఒక చెంపు పెట్టులాంటి తీర్పని స్టాలిన్ వ్యాఖ్యానించారు. వ్యవస్థలను వ్యక్తులను అడ్డుపెట్టుకుని పెత్తనం చేయాలని ఎన్డీఏ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. తాను ఇక్కడ ఒక విషయం మాత్రం దేశ ప్రజలకు చెప్పదలుచుకున్నానని, తమ పోరాటం కేవలం తమిళనాడుకి, తమిళ ప్రజలకు సంబంధించినది మాత్రమే కాదని, యావత్ దేశ ప్రజల తరఫున చేస్తున్న పోరాటంగా స్టాలిన్ అభివర్ణించారు. ఇది డీఎంకే బలమంటూ బీజేపీ, అన్నాడీఎంకేల పొత్తును దెప్పిపొడిచారు. అందుచేత తమిళనాడు ఎవరు వచ్చినా తమను ఏం చేయలేరని స్టాలిన్ వ్యాఖ్యానించారు. -
కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై తమిళనాడు సీఎం ఘాటు వ్యాఖ్యలు
-
తమిళనాడులో అమిత్ షా రూల్ చెల్లదు: స్టాలిన్
చెన్నై, సాక్షి: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపై డీఎంకే చీఫ్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా రూల్ తమిళనాడులో చెల్లదంటూ ప్రత్యక్షంగా విమర్శలు గుప్పించారు. విభజించు పాలించు సిద్ధంతం ఇక్కడ పని చేయదు. తమిళనాడు ఏనాటికీ ఢిల్లీ నియంత్రణలోకి వెళ్లబోదు అంటూ వ్యాఖ్యానించారు. నీట్, జాతీయ విద్యా విధానం విషయంలో కేంద్రానికి, తమిళనాడు ప్రభుత్వానికి మధ్య నడుస్తున్న వైరం సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. తాజాగా అక్కడి రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీజేపీతో అన్నాడీఎంకే చేతులు కలపడంతో వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ఆధునిక టెక్నాలజీతో యమునా నది ప్రక్షాళన
న్యూఢిల్లీ: కాలుష్యమయంగా మారిన యమునా నదిని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాల్సిందేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ అంశంపై ఆయన గురువారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాతోపాటు స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. నది ప్రక్షాళన కోసం చేపట్టాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రక్షాళన క్రతువులో ఢిల్లీ ప్రజలను తప్పనిసరిగా భాగస్వా ములను చేయాలని ప్రధానమంత్రి సూచించారు. రియల్–టైమ్ డేటా, స్పేస్ టెక్నాలజీ వంటి ఆధునిక సాంకేతికతల సాయంతో నదిని పరిశుభ్రంగా మార్చాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కాలుష్యానికి తావులేకుండా యమునా నదిలో ఛాత్ పూజలు నిర్వహించుకొనే అవకాశం కల్పించాలని అన్నారు. నది పట్ల మరింత గౌరవం పెంచేలా చూడాలన్నారు. పవిత్ర యుమునతో ప్రజల అనుబంధం మరింత పెరగాలని ఆకాంక్షించారు. -
సహకారోద్యమాన్ని దెబ్బ తీసింది
భోపాల్: గత కాంగ్రెస్ ప్రభుత్వాల నిష్క్రియాపరత్వం కారణంగా దేశంలో సహకార ఉద్యమం తీవ్రంగా దెబ్బ తిందని హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వం నిర్ణయాత్మక చర్యలు తీసుకునే సమయానికి సహకార ఉద్యమం దాదాపు మృతదశలో ఉందన్నారు. సహకార రంగాన్ని బలోపేతం చేసేందుకు గత ప్రభుత్వాలు ఎన్నడూ ప్రయతి్నంచలేదని ఆరోపించారు. అవసరమైన చట్టాలు చేయలేదని తెలిపారు. భోపాల్‌లో ఆదివారం జరిగిన ఓ సదస్సులో అమిత్ షా ప్రసంగించారు. ఈ రంగంలో సానుకూల మార్పును తీసుకువచ్చేందుకు ప్రధాని మోదీ సహకార శాఖను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారన్నారు. -
ఔరంగజేబ్ ఓటమిపాలై సమాధి అయ్యిందిక్కడే
రాయ్‌గఢ్: జగజ్జేత(అలంగీర్)నని చెప్పుకున్న మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ జీవితమంతా మహారాష్ట్రలో మరాఠాలతో పోరాటంతోనే గడిపి, ఓటమిపాలై ఈ గడ్డపైనే సమాధి అయ్యాడని హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ ధైర్యసాహసాలను ఆయన ప్రశంసించారు. శివాజీ 345 వర్ధంతి సందర్భంగా ఆయన శనివారం రాయ్‌గఢ్ కోటలో ఆయనకు నివాళులరి్పంచారు. 100వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకునే నాటికి సూపర్ పవర్‌గా ఎదగాలన్న భారతదేశం లక్ష్యానికి శివాజీ మహారాజే స్ఫూర్తి అని అమిత్ షా పేర్కొన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్‌ను మహారాష్ట్రకు మాత్రమే పరిమితం చేయవద్దని ప్రజలకు ఆయన విజŠక్షప్తి చేశారు. శివాజీ దీక్ష, పట్టుదల, సాహసం దేశానికే ఆదర్శమని, సమాజంలోని అన్ని వర్గాలను వ్యూహాత్మకంగా ఆయన ఏకం చేశారని చెప్పారు. మారాఠా సామ్రాజ్యానికి రాజధానిగా ఉన్న రాయ్‌గఢ్ కోటలోని శివాజీ సమాధి భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిస్తుందని తెలిపారు. సంభాజీనగర్ జిల్లా ఖుల్టాబాద్‌లో ఉన్న 17వ శతాబ్దం నాటి మొఘల్ చక్రవర్తి సమాధిని మరో చోటుకు తరలించాలన్న డిమాండ్లు ఇటీవల ఎక్కువైన నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
ఆపరేషన్ 2026 ఎలక్షన్స్ ... అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తు
-
సరిహద్దుల్లో ఎలక్ట్రానిక్ నిఘా వ్యవస్థ
జమ్మూ: దేశ సరిహద్దుల పరిరక్షణకు ఎలక్ట్రానిక్ సర్వైలెన్స్ సిస్టమ్‌ను మోహరిస్తున్నట్లు హోం మంత్రి అమిత్ షా తెలిపారు. జమ్మూకశ్మీర్‌లోకి ఉగ్రవా దుల అక్రమచొరబాట్లను తిప్పికొట్టేందుకు, సరిహ ద్దుల్లో అండర్‌గ్రౌండ్ టన్నెళ్లను గుర్తించేందుకు సాంకేతికతను వినియోగిస్తున్నామన్నారు. సరిహ ద్దుల కు ఆవలి వైపు ఎలాంటి అనుమా నాస్పద కదలి కలున్నా ఈ నిఘా వ్యవస్థ కనిపెట్టి తక్షణమే స్పందిస్తుందన్నారు. జమ్మూకశ్మీర్‌లో మూడు రోజుల పర్యటనకు సోమవారం ఇక్కడికి ఆయన చేరుకు న్నారు. ఈ సందర్భంగా కథువా జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దుల్లో ఉన్న ‘వినయ్’ బోర్డర్ పో స్టును సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడున్న బీఎస్ఎఫ్ జవాన్లతో మాట్లాడారు. అత్యంత సవాళ్లతో కూడిన పరిస్థితుల మధ్య విధులను సమర్థమంతంగా నిర్వహిస్తున్న జవా న్లను ఆయన ప్రశంసించారు. వానలు, భీకరమైన చలి, ఎండలను సైతం లెక్కచేయకుండా 365 రోజు లూ బోర్డర్ పోస్టుల్లో విధులు కొనసాగిస్తూ శత్రువుల కదలికలపై ఓ కన్నేసి ఉంచుతున్నారంటూ ప్రశంసించారు. ఇక్కడికి వచ్చి చూసిన వారికే జవాన్ల కష్టం ఏమిటో తెలుస్తుందంటూ వ్యాఖ్యానించారు. అమరుల సంతానానికి ఉద్యోగాలుఅనంతరం మంత్రి అమిత్ షా రాజ్‌భవన్‌లో ఉగ్రవాదులతో పోరాటంలో నేలకొరిగిన 10 మంది పోలీసులు, ఒక ఇంజనీర్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారికి సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా కారుణ్య ప్రాతిపదికన మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. ఇటీవల కథువా జిల్లాలో పాక్ ఉగ్రవాదులతో జరిగిన పోరులో నేలకొరిగిన నలుగురు పోలీసు కుటుంబాల వారు కూడా వీరిలో ఉన్నారు. వీరమరణం పొందిన జశ్వంత్ సింగ్ కుమారుడు 12 ఏళ్ల యువరాజ్ సింగ్ కూడా కారుణ్య నియామక పత్రం అందుకున్నాడు. మేజర్ అయ్యాక ఇతడి నియామ కానికి అనుకూలమైన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి కోరారు. -
ఆ రాష్ట్రాలపై బీజేపీ గురి.. రంగంలోకి అమిత్ షా
న్యూఢిల్లీ: ఇప్పుడు బీజేపీ దృష్టి బీహార్, పశ్చిమ బెంగాల్, తమిళనాడులపైనే ఉంది. ఈ రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు (Assembly elections) జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఈ రాష్ట్రాల్లో ఎన్నికల సన్నాహాలను పటిష్టం చేయడానికి, కార్యకర్తలను సమాయత్తం చేయడానికి, స్థానిక నాయకులతో సమన్వయం కుదుర్చుకునేందుకు పక్కా ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందుకోసం కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రతి నెలా రెండు రోజుల పాటు ఈ మూడు రాష్ట్రాల్లో పర్యటనలు చేపట్టనున్నారు. ఈ పర్యటనలు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ప్రారంభమై, ఎన్నికలు ముగిసే వరకు కొనసాగనున్నాయి. పటిష్ట వ్యూహం (Strong strategy)తో బీజేపీ ఈ మూడు రాష్ట్రాల్లో తన ఓటు బ్యాంకును పెంచుకునేందుకు, ప్రత్యర్థి పార్టీలను ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతోంది.బీహార్‌లో బీజేపీ వ్యూహంబీహార్లో అసెంబ్లీ ఎన్నికలు 2025 (Assembly elections in Bihar) అక్టోబర్-నవంబర్‌లో జరగనున్నాయి. ఈ రాష్ట్రంలో బీజేపీ జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ)లో కీలక భాగస్వామిగా ఉంది. ఇందులో నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతా దళ్ (యునైటెడ్), చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్), ఇతర చిన్న పార్టీలు ఉన్నాయి. అమిత్ షా ఏప్రిల్ 30,మే 1 తేదీల్లో బీహార్‌లో పర్యటించనున్నారు. ఈ సమయంలో ఆయన పట్నా, గయ,భాగల్పూర్ తదితర నగరాల్లో సమావేశాలు నిర్వహించి, బూత్ స్థాయి కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించనున్నారు. బీహార్‌లో అధికారాన్ని నిలబెట్టుకోవడంతో పాటు, రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం అయిన రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ), కాంగ్రెస్ కూటమిని ఎదుర్కొనేందుకు బీజేపీ ఈ పర్యటనలను చేపడుతోంది. గత ఎన్నికల్లో బీజేపీ 74 సీట్లు గెలుచుకున్నప్పటికీ, ఈసారి సీట్ల సంఖ్యను 100కి పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. షా ఈ పర్యటనల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లను ఆకర్షించేందుకు కేంద్ర పథకాలైన ఆయుష్మాన్ భారత్, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి వంటివాటిని హైలైట్ చేయనున్నారు.టీఎంసీకి సవాలు విసిరేందుకు..పశ్చిమ బెంగాల్లో 2026 మార్చి-ఏప్రిల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రంలో బీజేపీ అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కి ప్రధాన ప్రత్యర్థిగా ఉంది. 2021 ఎన్నికల్లో టీఎంసీ 215 సీట్లతో ఘన విజయం సాధించగా, బీజేపీ 77 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. అమిత్ షా ఏప్రిల్ 14-15 తేదీలలో కోల్‌కతా, హౌరా, ముర్షిదాబాద్ జిల్లాల్లో పర్యటించనున్నారు. బీజేపీ ఈ రాష్ట్రంలో తన ఓటు శాతాన్ని 40 శాతం నుంచి 50శాతానికి పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పర్యటనలో అమిత్‌షా స్థానిక నేతలతో ఎన్నికల ప్రచార వ్యూహాలను రూపొందించడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారించనున్నారు.తమిళనాడులో కొత్త ఒరవడితమిళనాడులో 2026 మార్చి-ఏప్రిల్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించింది. ఈ రాష్ట్రంలో బీజేపీ గతంలో ఎన్నడూ గణనీయమైన విజయం సాధించలేదు. కానీ ఇప్పుడు అధికార డీఎంకే-ఇండియా కూటమి(ruling DMK-India alliance)ని ఎదుర్కొనేందుకు ఏఐఏడీఎంకేతో మళ్లీ పొత్తు కుదుర్చుకునే ప్రయత్నాలు చేస్తోంది. అమిత్ షా ఏప్రిల్ 10-11 తేదీల్లో చెన్నై, కోయంబత్తూర్, మధురైలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఏఐఏడీఎంకే నేత ఎడప్పాడి పళనిస్వామితో సమావేశమై, కూటమి ఒప్పందంపై చర్చలు జరపనున్నారని సమాచారం. 2021 ఎన్నికల్లో ఈ రెండు పార్టీల కూటమి 66 సీట్లు గెలిచినప్పటికీ, తర్వాత విడిపోయాయి. ఈసారి బీజేపీ తమిళనాడులో కనీసం 50 సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. షా పర్యటనల్లో రామేశ్వరం తదితర ఆధ్యాత్మిక కేంద్రాల్లో హిందుత్వ ఎజెండాను ప్రచారం చేయడంతో పాటు, డీఎంకే ద్రవిడ రాజకీయాల ఆధిపత్యంపై విమర్శించే అవకాశం ఉంది. అలాగే కేంద్ర ప్రాజెక్టులైన పంబన్ వంతెన, రైల్వే ఆధునీకరణలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేయనున్నారు.ఇది కూడా చదవండి: ట్రంప్ టారిఫ్ దడ.. షాపింగ్ మాల్స్ ముందు లాక్డౌన్ దృశ్యాలు -
ఆయుధం వీడి.. అభివృద్ధిలో భాగస్వాములు కండి
దంతెవాడ(ఛత్తీస్‌గఢ్): మావోయిస్ట్ పార్టీ శ్రేణులకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్నేహ హస్తం చాపారు. ఆయుధాలను వదిలేసి, జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని అమిత్ షా వారికి పిలుపునిచ్చారు. నక్సలైట్ చనిపోతే ఎవరూ హర్షించరన్న ఆయన.. 2026 మార్చి కల్లా వామపక్ష తీవ్రవాదాన్ని రూపుమాపాలని కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు. బస్తర్ ప్రాంత గిరిజనుల అభివృద్ధిని అడ్డుకోగల సత్తా మావోయిస్టులకు నేడు లేదని పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘బస్తర్ పాండుమ్’ఉత్సవం ముగింపు కార్యక్రమంలో శనివారం మంత్రి షా ప్రసంగించారు. ‘బస్తర్‌లో తుపాకీ కాల్పులు, బాంబుల మోతలు వినిపించే రోజులు పోయాయి. ఇకనైనా ఆయుధాలను విడనాడి, ప్రధాన జనజీవన స్రవంతిలో కలవాలని మావోయిస్ట్ సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా. మీరూ ఈ దేశ పౌరులే. నక్సలైట్ చనిపోతే ఎవరూ సంతోషపడరు. మీ ఆయుధాలను అప్పగించండి. ఆయుధాలు చూపి బస్తర్ ప్రాంత గిరిజన సోదరసోదరీమణుల పురోభివృద్ధిని ఆపలేరు’అని ఆయన స్పష్టం చేశారు. లొంగిపోయి అభివృద్ధి ప్రక్రియలో పాలుపంచుకునే మావోయిస్ట్‌లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి భద్రత కల్పిస్తాయని మంత్రి భరోసా ఇచ్చారు. ‘బస్తర్ గత 50 ఏళ్లుగా ఎంతో వెనుకబాటుకు గురైంది. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇందుకోసం అవసరమైనవన్నీ సమకూర్చేందుకు ప్రధాని మోదీ సిద్ధంగా ఉన్నారు. ఇవన్నీ సుసాధ్యం కావాలంటే బస్తర్ ప్రజలు తమ గ్రామాలను నక్సలైట్ రహితంగా మార్చాలని నిర్ణయించుకోవాలి. ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆరోగ్య బీమా సమకూర్చడంతోపాటు చిన్నారులు స్కూలుకు వెళ్లగలిగి, ఆరోగ్య కేంద్రాలు పనిచేసినప్పుడే అభివృద్ధి సాధ్యం’అని అమిత్ షా అన్నారు. మావోయిస్ట్ విముక్త గ్రామాలకు రూ. కోటి నక్సలైట్లు లొంగుబాట పట్టేలా కృషి చేసి, మావోయిస్ట్ రహితంగా ప్రకటించుకునే గ్రామాలకు రూ.కోటి చొప్పున అందజేస్తామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని అమిత్ షా గుర్తు చేశారు. రూ.కోటి అందుకునేందుకు ప్రతి గ్రామం తీవ్రంగా కృషి చేయాలని కోరారు. నక్సలిజాన్ని తుదముట్టించేందుకు ద్విముఖ వ్యూహాన్ని అమలు చేస్తున్నామంటూ ఆయన...‘అభివృద్ధికి ఆయుధాలు, గ్రనేడ్లు, మందుపాతరలతో అవసరం లేదు, కంప్యూటర్లు, పెన్నులు ఉంటే సరిపోతుందని అర్థం చేసుకునే వారు లొంగిపోయారు. 2024లో 881 మంది, 2025లో ఇప్పటివరకు మొత్తం 521 మంది మావోయిస్ట్‌లు ఆయుధాలను అప్పగించారు. లొంగిపోయిన వారు జన జీవన స్రవంతిలో కలుస్తారు, మిగిలిన వారి పనిని భద్రతా బలగాలు చూసుకుంటాయి. వచ్చే ఏడాది మార్చి కల్లా రెడ్ టెర్రర్ నుంచి దేశానికి విముక్తి కలుగనుంది’అని అమిత్ షా అన్నారు. -
మావోయిస్టులకు అమిత్ షా సవాల్
ఛత్తీస్‌గఢ్: దంతేవాడ జిల్లాలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటించారు. దంతేశ్వరి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. పాండుం ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ తాను దంతేశ్వరి మాత ఆశీస్సులు పొందానని.. వచ్చే నవరాత్రి నాటికి ఎర్ర బీభత్సం అంతం కావాలన్నారు. బస్తర్ గొప్ప గిరిజన సంస్కృతిని దేశానికి, ప్రపంచానికి చాటి చెప్పే పాండుం ముగింపు కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని అమిత్ షా అన్నారు.ఇదే వేదికపై నుంచి మావోయిస్టులకు ఆయన గట్టి సవాలు విసిరారు. బస్తర్ గిరిజనుల అభివృద్ధిని మావోయిస్టులు ఆపలేరన్నారు. ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవాలని మావోయిస్టులకు అమిత్‌షా పిలుపునిచ్చారు.మోదీ నుంచి తానొక సందేశం తెచ్చా.. వచ్చే ఏడాది దేశంలోని ప్రతీ గిరిజన జిల్లా నుంచి కళాకారులను ఒకే పేరుతో బస్తర్ పాండుం ఉత్సవాలకు తీసుకొస్తాం’’ అని అమిత్ షా ప్రకటించారు. బస్తర్ పాండుంకు అంతర్జాతీయ హోదా ఇవ్వడానికి బీజేపీ ప్రభుత్వం ప్రపంచం నలుమూలల నుంచి రాయబారులను బస్తర్‌కు తీసుకువస్తుందంటూ ఆయన చెప్పుకొచ్చారు.#WATCH | Dantewada, Chhattisgarh: Union Home Minister Amit Shah says, "Now the time has gone when bullets were fired and bombs exploded here. I have come to request all those people who have weapons in their hands, all the Naxalite brothers, to give up their weapons. No one is… pic.twitter.com/A2j2oOC7El— ANI (@ANI) April 5, 2025 -
జమ్ము కశ్మీర్లో ఎల్జీ సిన్హా Vs సీఎం ఒమర్.. కేంద్రానికి వార్నింగ్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ పరిపాలనా సర్వీస్(జేకేఏఎస్)కు చెందిన 48 మంది అధికారులను లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ)మనోజ్ సిన్హా బదిలీ చేయడం వివాదాస్పదంగా మారింది. పరిపాలనా సంబంధమైన అంశాల్లో ఇప్పటికే రాజ్‌భవన్, ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం మధ్య కొనసాగుతున్న విభేదాలకు ఇది ఆజ్యం పోసినట్లయింది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న సీఎం అబ్దుల్లా కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఎల్జీ సిన్హా, చీఫ్ సెక్రటరీ అటల్ దుల్లూకు లేఖలు రాశారు. అందులో పలు అంశాలను ప్రస్తావించారు.ఈ సందర్బంగా లేఖలో.. ఎన్నికైన ప్రభుత్వ అధికారాన్ని కాదని ఎల్జీ జారీ చేసిన ఉత్తర్వులకు ఎలాంటి చట్టబద్ధత లేదని అందులో పేర్కొన్నారు. ట్రాన్సాక్షన్ ఆఫ్ బిజినెస్ రూల్స్‌కు వెంటనే ఖరారు చేయాలని కోరారు. అధికారులను ఏకపక్షంగా బదిలీ చేయడంపై సమీక్ష చేపట్టాలని ఎల్జీకి రాసిన లేఖలో సీఎం ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. సీఎం అనుమతి లేకుండా అఖిల భారత సర్వీసేతర అధికారులను బదిలీ చేయవద్దని చీఫ్ సెక్రటరీని కోరారు. ఈ అంశంపై చర్చించేందుకు శుక్రవారం డిప్యూటీ సీఎం సురీందర్ చౌదరి నివాసంలో జరిగిన అత్యవసర భేటీలో సీఎం ఒమర్‌తోపాటు ఎన్సీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా పాల్గొన్నారు. హోం మంత్రి అమిత్ షా పర్యటన వేళ ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం.ఈ క్రమంలోనే ‘ఇప్పటికే అనేకసార్లు చెప్పాం. ఇదే చిట్టచివరి విజ్ఞప్తి. ఇక మా సహనాన్ని పరీక్షించొద్దు’అని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ)ప్రతినిధి, ఎమ్మెల్యే జడిబల్ తన్వీర్ సాదిఖ్ అనంతరం మీడియా ఎదుట వ్యా ఖ్యానించారు. తమ సహకార వైఖరిని, మౌ నాన్ని బలహీనతగా భావించరాదని పేర్కొ న్నారు. ఈ సమావేశంలో వక్ఫ్ బిల్లును పార్లమెంట్ ఆమోదించడాన్ని ఖండిస్తూ తీర్మానించిందని, అదేవిధంగా, ప్రజలిచ్చిన తీర్పును గౌరవించాలంటూ ఎల్జీకి హితవు పలుకుతూ మరో తీర్మానం చేసిందని ఆయన తెలిపారు. పరిధిని అతిక్రమించలేదు: ఎల్జీ అధికార పార్టీ ఎమ్మెల్యేల అత్యవసర సమావేశం చేసిన తీర్మానంపై ఎల్జీ సిన్హా దీటుగా స్పందించారు. ‘జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని 2019లో పార్లమెంట్ ఆమోదించింది. ఈ చట్టం పరిధిని అతిక్రమించి నేను ఎలాంటి చర్యలు తీసుకోలేదనే విషయాన్ని స్పష్టం చేయదల్చుకున్నా. నా పరిధి, నా పరిమితులు నాకు బాగా తెలుసు. అంతకుమించి ఎన్నడూ ఏమీ చేయలేదు’అని న్యూస్18కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన స్పష్టం చేశారు. -
పంతం నెగ్గించుకున్న ఎన్డీయే
ఎవరు ఎంతగా వ్యతిరేకించినా వక్ఫ్ సవరణ బిల్లు చట్టంగా మారబోతోంది. అంతా సవ్యంగా ఉన్నప్పుడు ఎవరైనా స్వోత్కర్షలకు పోవచ్చు. కానీ క్లిష్ట సమయాలే ఎవరేమిటన్నది నిగ్గుదేలుస్తాయి. బిల్లు పార్లమెంటులో గట్టెక్కడం మాట అటుంచి టీడీపీ ఇన్నాళ్లుగా వేస్తున్న సెక్యులర్ వేషాలకు తెరపడింది. టీడీపీ, జేడీ(యూ)ల మద్దతు లేనిదే కేంద్రంలో ప్రభుత్వాన్నే నడపటం సాధ్యం కాని దీనస్థితిలోవున్న ఎన్డీయే సర్కారు... ఇప్పుడు వక్ఫ్ బిల్లుపై సునాయాసంగా తన పంతం నెగ్గించు కోవటం ఎలా సాధ్యమైందో అందరికీ తేటతెల్లమైంది. వీరితోపాటు మొదట వీరావేశంతో మాట్లాడిన ఒడిశాకు చెందిన బీజేడీ ఆఖరి నిమిషంలో స్వరం మార్చి పార్టీ ఎంపీలకు స్వేచ్ఛనిస్తున్నట్టు ప్రకటించటం ప్రభుత్వానికి కలిసొచ్చింది. నిరుడు ఆగస్టులో ఈ బిల్లు ప్రవేశపెట్టి ఆదరా బాదరాగా ఆమోదింపజేసుకోవాలని ప్రభుత్వం తహతహలాడినా విపక్షాలు తీవ్రంగా ప్రతిఘటించటంతో దీన్ని సంయుక్త పార్లమెంటరీ సంఘం (జేపీసీ) పరిశీలనకు పంపక తప్పలేదు. ఎన్డీయే సర్కారు ఏర్పాటైన పదేళ్లలో ఒక బిల్లు జేపీసీకి వెళ్లటం అదే ప్రథమం. రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల అనంతరం పెరిగిన బలం వల్లనైతేనేమి, ఏపీకి చెందిన కొందరు దిగజారుడు ఎంపీలతో రాజీనామాలు చేయించటం వల్లనైతేనేమి అప్పటితో పోలిస్తే ఇప్పుడు రాజ్యసభలో ఎన్డీయే బలం పెరిగింది. అందుకే వక్ఫ్ బిల్లు సునాయాసంగా గట్టెక్కుతుందని అధికారపక్షం నిర్ణయానికొచ్చింది. వక్ఫ్ ఆస్తులకు సంబంధించి సమస్యలు లేవని ఎవరూ అనరు. ఎన్నడో 1954లో వచ్చిన తొలి వక్ఫ్ చట్టం అవసరాలకు అనుగుణంగా లేదన్న ఉద్దేశంతో 1995లో దాని స్థానంలో మరో చట్టం తీసుకొచ్చారు. 2013లో సవరణలు చేశారు. అయినా మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం వున్నదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. వక్ఫ్‌కు సంబంధించిన ఆస్తుల్లో దాదాపు సగంవరకూ వాటి యాజమాన్యం లేదా నిర్వహణకు సంబంధించి సమస్యలున్నాయి. అవినీతి ఉన్నదనీ, అక్రమాలు చోటుచేసుకుంటున్నాయనీ ఆరోపణలు రావటం కూడా వాస్తవం. పారదర్శకత పాటించటంలేదన్న విమర్శ కూడా ఉంది. వీటిని సరిదిద్దాలంటే ముస్లిం పండితులతో, నిపుణులతో, ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వంటి సంస్థలతో మాట్లాడాలి. ఎలావుంటే బాగుంటుందన్న అంశంలో సూచనలూ, సలహాలూ తీసుకోవాలి. కానీ ఇవేమీ చేయకుండా బిల్లు తీసుకురావటంతో ముస్లిం వర్గాల్లో సంశయాలకు అవకాశం ఏర్పడింది. ముస్లింల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ బిల్లు తీసుకొచ్చినట్టు ప్రభుత్వం చెప్పటం బాగానేవున్నా ఆచరణ అందుకు విరుద్ధంగా ఉంది.బుజ్జగింపు ధోరణితో, ఓటుబ్యాంకు రాజకీయాలపై దృష్టితోనే బిల్లును వ్యతిరేకిస్తున్నారని విపక్షాలపై ఆరోపణలు చేస్తున్న ప్రభుత్వం తాను చేసిందేమిటో ఆలోచించిందా? నిజంగా చిత్తశుద్ధి వుంటే బిల్లు రూపకల్పనకు ముందు ఆ వర్గాలతో చర్చించటానికి అభ్యంతరమేమిటి? ముస్లిమేతరులకు వక్ఫ్ బోర్డులు, కౌన్సిళ్లలో స్థానం ఎందుకు కల్పించారన్న విషయమై ప్రభుత్వం ఇచ్చిన సంజా యిషీ ఏమాత్రం సంతృప్తికరంగా లేదు. మసీదుల నిర్వహణ లేదా మతపరమైన ఇతర అంశాలకు సంబంధించి వక్ఫ్ కౌన్సిళ్లు జోక్యం చేసుకోబోవని, కేవలం వక్ఫ్ ఆస్తుల వ్యవహారాలనే చూస్తాయని కేంద్రమంత్రులు అమిత్ షా, కిరణ్ రిజుజు చెబుతున్నారు. కానీ మౌలికంగా వక్ఫ్ ఆస్తి అంటే సంపన్న ముస్లింలు భక్తిభావనతో మతపరమైన అవసరాల కోసం, ఆ వర్గాల అభ్యున్నతి కోసం దానం చేసే ఆస్తి. అటువంటప్పుడు ఆ ఆస్తుల నిర్వహణలో అన్యులకు చోటీయటం అసమంజసం కాదా? ఇతర మతాలకు సంబంధించిన ధార్మిక ఆస్తుల నిర్వహణలో కూడా ముస్లింలకు అవకాశం ఇస్తారా? ఒకవేళ అలా ఇచ్చినా అందుకు ఆ మతస్తులు అంగీకరిస్తారా? ఇంతకాలం ముస్లిమేతరులు సైతం తమ ఆస్తిని కారుణ్య భావనతో వక్ఫ్‌కు ఇవ్వొచ్చన్న నిబంధన ఉండేది. కానీ తాజా సవరణ ప్రకారం అయిదేళ్లపాటు ఇస్లామ్‌ను ఆచరిస్తేనే అందుకు అర్హత వస్తుంది. అయితే ఇస్లామ్ ఆచరణే మిటో బిల్లు వివరించలేదు. 2013లో ఆ మరుసటి సంవత్సరం జరిగే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో వుంచుకుని ఆదరా బాదరాగా వక్ఫ్ చట్టానికి అప్పటి యూపీఏ ప్రభుత్వం సవరణలు తెచ్చిందని, అందువల్ల ఒక్క ఢిల్లీలోనే అనేక ఆస్తులు వక్ఫ్ ఆస్తులుగా మారాయని ప్రభుత్వం చెబుతున్నది. కానీ ఆ సవరణలను నాటి బీజేపీ నేతలు ఎల్కే అడ్వాణీ, సుష్మాస్వరాజ్ సమర్థించారు. సవరణలు పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించటంలో తోడ్పడ్డారు. వక్ఫ్ బిల్లు తీసుకొచ్చిన ఉద్దేశంపై దేశవ్యాప్తంగావున్న 20 కోట్లమంది ముస్లింలలో ఎన్నో సంశయాలున్నాయి. బిల్లులోని నిబంధనలు ఆ సంశయాలను మరింత పెంచేవిగా ఉన్నాయి. వక్ఫ్ ఆస్తుల్ని ఆర్నెల్లలోపు డేటా బేస్‌లో నమోదు చేయనిపక్షంలో వాటికి సంబంధించిన వివాదాలపై న్యాయస్థానాల మెట్లెక్కటం అసాధ్యమని బిల్లు చెప్పటం సమంజసంగా అనిపించదు. వివాదంలో పడిన వక్ఫ్ ఆస్తులపై ప్రభుత్వ ఉన్నతాధికారి నిర్ణయం అంతిమం కావటం కూడా సమస్యాత్మకం. ఏ ఉన్నతాధికారైనా ప్రభుత్వ ప్రయోజనాలకు విరుద్ధంగా నిర్ణయం తీసుకోవటం సాధ్యమేనా? ఇది అనుమానాలు రేకెత్తించే అవకాశం లేదా? మొత్తానికి తెలుగుదేశం వంటి పక్షాలు బిల్లుకు ఓటేసి, ఆపైన సవరణలు తీసుకొచ్చామంటూ లీకులిస్తూ, తమ సవరణలతో బిల్లు పకడ్బందీగా వచ్చింద నడం హాస్యాస్పదం. అందులోని డొల్లతనం ఏమిటో ఈ నిబంధనలే చెబుతున్నాయి. క్లిష్ట సమయాల్లో తటస్థత వహించటం ద్రోహంతో సమానం. తటస్థత మాట అటుంచి నిస్సంకోచంగా బిల్లును సమర్థించి టీడీపీ తన నైజాన్ని బయట పెట్టుకుంది. ఇందుకు మూల్యం చెల్లించక తప్పదు. -
బిహార్‌లో బీజేపీ ఎన్నికల నగారా
గోపాల్‌గంజ్: హోం మంత్రి అమిత్ షా ఆదివారం బిహార్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగించారు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏకి తిరిగి అధికారం కట్టబెట్టడం ద్వారా ప్రధాని మోదీని బలపర్చాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతిపక్ష ఆర్జేడీకి గట్టిపట్టున్న గోపాల్ గంజ్‌లో జరిగిన బహిరంగ సభలో మంత్రి అమిత్ షా ప్రసంగించారు. గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల అనంతరం అమిత్ షా పాల్గొంటున్న మొదటిసారి సభ ఇదే కావడం గమనార్హం. ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్డీదేవి అధికారం చెలాయించిన 15 దశాబ్దాల కాలంలో బిహార్‌లో జంగిల్ రాజ్ నడిచిందని, కిడ్నాప్‌లు, హత్యలు, దోపిడీలు ఒక పరిశ్రమగా మారాయని నిప్పులు చెరిగారు. ‘రాష్ట్రంలో రక్షణ కొరవడటంతో ముఖ్యమైన వ్యాపారవేత్తలంతా ఆ సమయంలో రాష్ట్రాన్ని వీడారు. దాణా కుంభకోణానికి పాల్పడిన లాలు ప్రసాద్ యాదవ్ పేరు ప్రపంచ దేశాల్లోనే మారుమోగింది, బిహార్‌కు ఆయన తీరని కళంకం తెచ్చారు’అని అమిత్ షా ఆరోపించారు. ‘కుటుంబ రాజకీయాలు చేసే లాలు.. భార్యను సీఎం పీఠంపై కూర్చోబెట్టారు. కుమార్తెను పార్లమెంట్‌కు పంపారు. ఆయన ఇద్దరు కుమారులు ఇప్పుడు సీఎం అవ్వాలనుకుంటున్నారు’అని ఎద్దేవా చేశారు. ‘అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా చెప్పుకునే లాలు.. దాణా కూడా బొక్కేశారు. అటువంటి వ్యక్తి రికార్డు స్థాయిలో స్కాములే తప్ప, పేదలకు చేసేదేమీ లేదు’అని మండిపడ్డారు. సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలో జేడీయూ, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాకే పరిస్థితులు మెరుగుపడ్డాయని చెప్పారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న వరదల సమస్యకు చెక్ పెట్టామని చెప్పారు. లాలు–రబ్డీల జంగిల్ రాజ్ కావాలో, మోదీ, నితీశ్‌ల అభివృద్ధి కావాలో తేల్చుకునే సమయం ఇప్పుడు వచ్చిందని షా అన్నారు. ‘మరికొద్ది నెలల్లో అసెంబ్లీ జరిగే ఎన్నికల్లో కమలం గుర్తు బటన్‌నే మీరు నొక్కుతారని, బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏకే ఓటేస్తారని నాకు తెలుసు. మోదీ అంటే బిహార్ ప్రజలు ఎప్పుడూ అభిమానం చూపుతూనే ఉన్నారు. ఆయన్ను మళ్లీ మీరు బలపరుస్తారని ఆశిస్తున్నా’అని అమిత్ షా తెలిపారు. బిహార్ అసెంబ్లీకి వచ్చే అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. -
కేంద్రంలో మరో 20 ఏళ్లు బీజేపీనే
న్యూఢిల్లీ: కేంద్రంలో బీజేపీ కనీసం 30 ఏళ్లపాటు అధికారంలో ఉంటుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తంచేశారు. స్థిరమైన పనితీరు కనబరుస్తున్న తమ పార్టీ పట్ల ప్రజాదరణ చెక్కుచెదరదని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ పార్టీ విజయమైనా కష్టపడి పనిచేసే లక్షణంపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. సొంత బాగు కోసం కాకుండా దేశం కోసం పనిచేస్తే విజయం కచ్చితంగా సొంతమవుతుందని వెల్లడించారు. కేంద్రంలో బీజేపీ రాబోయే 30 ఏళ్లపాటు అధికారంలో ఉంటుందని తాను పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చెప్పానని గుర్తుచేశారు. గత పదేళ్లుగా అధికారంలో కొనసాగుతోందని, మరో 20 ఏళ్లపాటు పార్టీకి ఢోకా లేదని తేల్చిచెప్పారు. శుక్రవారం రాత్రి ‘టైమ్స్ నౌ’సదస్సులో అమిత్ షా మాట్లాడారు. చక్కటి పరిపాలన అందించిన పార్టీకి ప్రజాదరణ లభిస్తుందని, తద్వారా ఎన్నికల్లో విజయం సాధిస్తామన్న ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అన్నారు. ప్రజలు మెచ్చే పాలన అందించలేని పార్టీలకు ఇలాంటి ఆత్మవిశ్వాసం లభించదని స్పష్టంచేశారు. పదేళ్లలో 16,000 మంది లొంగుబాటు దేశంలో అంతర్గత భద్రతకు ప్రస్తుతం వచ్చిన ముప్పేమీ లేదని అమిత్ షా స్పష్టంచేశారు. నక్సలైట్ల హింసాకాండ, జమ్మూకశీ్మర్‌లో ఉగ్రవాదం, ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రవాదం అనే మూడు సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ మూడు అంశాలకు సంబంధించి గత పదేళ్లలో 16,000 మంది యువత లొంగిపోయారని వెల్లడించారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో శాంతి నెలకొల్పాల్సిన బాధ్యత హోంమంత్రిగా తనపై ఉందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు నరేంద్ర మోదీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఆరాధన స్థలాల చట్టం–1991పై ఇప్పుడు తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేనని పేర్కొన్నారు. ఈ అంశం కోర్టు పరిధిలో ఉండడంతో మనం మాట్లాడడం సరైంది కాదన్నారు. కోర్టులో ప్రభుత్వం తరఫున అఫిడవిట్ దాఖలు చేస్తామన్నారు. ఈ చట్టంపై సుప్రీంకోర్టు సరైన నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నట్లు చెప్పారు. కోర్టు ఆదేశాలను తప్పనిసరిగా పాటిస్తామన్నారు. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ వలసదార్లను ఓటుబ్యాంకుగా మార్చుకుంటోందని అమిత్ షా మండిపడ్డారు. పొరుగు దేశం నుంచి వచ్చినవారిని ఓటర్లుగా చేర్పిస్తున్నారని ఆరోపించారు. తృణమూల్ కాంగ్రెస్ ఆటలు సాగనివ్వబోమని హెచ్చరించారు. ప్రభుత్వ కార్యకలాపాల్లో ఆర్ఎస్ఎస్ జోక్యం లేదు ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ)పై అమిత్ షా స్పందించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలన్నీ ఒకదాని వెంట ఒకటి యూసీసీని ప్రవేశపెట్టబోతున్నాయని వెల్లడించారు. ఉత్తరాఖండ్‌లో యూసీసీపై చట్టం తీసుకొచ్చారని, గుజరాత్‌లోనూ దీనిపై కమిటీ ఏర్పాటు చేశారని తెలిపారు. బీజేపీ ఏర్పాటైనప్పటి నుంచి పార్టీ ఎజెండాలో యూసీసీ అనేది అత్యంత కీలకమైన అంశమని ఉద్ఘాటించారు. దేశంలో యూసీసీని అమలు చేస్తామంటూ హామీ ఇచ్చామని తెలిపారు. అది జరిగి తీరుతుందని స్పష్టంచేశారు. యూసీసీని తీసుకురావాలన్నది రాజ్యాంగ సభ నిర్ణయమని పేర్కొన్నారు. ఆ విషయం కాంగ్రెస్ పార్టీ మర్చిపోయినప్పటికీ బీజేపీ మర్చిపోలేదన్నారు. చెప్పినట్లుగానే ఆర్టికల్ 370ని రద్దు చేశామని, అయోధ్యలో రామమందిరం నిర్మించామని, ఇక యూసీసీని అమలు చేయడం తథ్యమని వివరించారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో నోట్ల కట్టలు దొరికిన ఘటనపై త్రిసభ్య కమిటీ ఇచ్చే నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. కమిటీ విచారణకు ప్రభుత్వం సహకరిస్తోందని అన్నారు. మోదీ ప్రభుత్వ కార్యకలాపాల్లో ఆర్ఎస్ఎస్ జోక్యం చేసుకుంటోందన్న విమర్శల్లో ఎంతమాత్రం వాస్తవం లేదని వెల్లడించారు. సంఘ్ గత వందేళ్లుగా దేశభక్తులను తయారు చేస్తోందని ప్రశంసించారు. -
అక్రమవలసలపై మోదీ ఉక్కుపాదం
-
Amit Shah: భారతదేశం ధర్మశాల కాదు
న్యూఢిల్లీ: భారతదేశం ధర్మశాల కాదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తేల్చిచెప్పారు. దేశానికి ముప్పు కలిగించేవారు ఇక్కడికి వచ్చి తిష్ట వేస్తామంటే సహింబోమని హెచ్చరించారు. విదేశాల నుంచి పర్యాటకులుగా లేదా విద్య, వైద్యం, వ్యాపారం, పరిశోధనల కోసం ఎవరైనా వస్తామంటే సాదరంగా ఆహా్వనించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కానీ, దేశంలో విధ్వంసం సృష్టించడానికి వచ్చేవారిపై కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. దేశంలోకి అక్రమంగా చొరబడేవారిపై కన్నేసి ఉంచుతామన్నారు. కీలకమైన ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లు–2025 గురువారం లోక్‌సభలో మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. ఈ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా అమిత్ షా మాట్లాడారు. ప్రమాదకరమైన ఉద్దేశాలతో దేశానికి వచ్చేవారిని కచి్చతంగా అడ్డుకుంటామని తెలిపారు. అందరికీ ఆశ్రయం ఇవ్వడానికి ఇది ధర్మశాల కాదన్నారు. జాతీయ భద్రతకు ముప్పుగా మారిన వారిని అనుమతించబోమన్నారు. దేశ అభివృద్ధిలో భాగస్వాములుగా మారడానికి వచ్చేవారిని స్వాగతిస్తామన్నారు. ప్రతిపాదిత ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ చట్టంతో దేశ భద్రత మరింత పటిష్టంగా మారుతుందని అమిత్ షా వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థకు, వ్యాపార రంగానికి మేలు జరుగుతుందని పేర్కొన్నారు. మన దేశాన్ని సందర్శించే ప్రతి ఒక్కరి సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఈ చట్టం అవసరమని తెలియజేశారు.బెంగాల్‌పై ధ్వజంపశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అక్రమ చొరబాటుదార్లను ముద్దు చేస్తోందని అమిత్ షా ధ్వజమెత్తారు. చట్టవిరుద్ధంగా దేశంలోకి ప్రవేశించినవారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. బెంగాల్ ప్రభుత్వం భూమిని అప్పగించకపోవడం వల్ల భారత్–బంగ్లాదేశ్ సరిహద్దులో 450 కిలోమీటర్ల మేర కంచె నిర్మాణం నిలిచిపోయిందని చెప్పారు. అక్కడ కంచె నిర్మించడానికి ప్రయత్నాలు జరిగినప్పుడల్లా తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు అలజడి సృష్టిస్తున్నారని, మతపరమైన నినాదాలు చేస్తున్నారని విమర్శించారు. చొరబాటుదార్లపై తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రేమాభిమానాలు ప్రదర్శిస్తుండడం వల్లే కంచె నిర్మాణం పెండింగ్‌లో ఉండిపోయిందని అన్నారు. ఏమిటీ బిల్లు? → ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లు–2025 ప్రకారం.. నకిలీ పాస్‌పోర్టు లేదా నకిలీ వీసాతో ఇండియాలోకి ప్రవేశించినా, ఇక్కడ నివసిస్తున్నా, బయటకు వెళ్లిపోయేందుకు ప్రయత్నించినా ఏడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.10 లక్షల దాకా జరిమానా విధించవచ్చు. → తమ వద్ద బస చేస్తున్న విదేశీయుల వివరాలను హోటళ్లు తప్పనిసరిగా ప్రభుత్వానికి అందజేయాలి. విద్యాసంస్థలు, హాస్పిటళ్లు, నర్సింగ్ హోమ్‌లలో కూడా విదేశీయులు ఉంటే ఆ సమాచారాన్ని యాజమాన్యాలు ప్రభుత్వానికి తెలియపర్చాలి. → చెల్లుబాటు అయ్యే పాసుపోర్టు లేదా ట్రావెల్ డాక్యుమెంట్ లేకుండా ఇండియాలోకి ప్రవేశిస్తే ఐదేళ్ల దాకా జైలు శిక్ష లేదా రూ.5 లక్షల దాకా జరిమానా విధించవచ్చు. ఒక్కోసారి ఈ రెండు శిక్షలు కలిపి విధించవచ్చు. -
అమిత్ షాపై సభా హక్కుల నోటీసు తిరస్కరణ
న్యూఢిల్లీ, సాక్షి: కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ సమర్పించిన సభా హక్కుల ఉల్లంఘన నోటీసులను గురువారం రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ తిరస్కరించారు. ఆయన వ్యాఖ్యలను పరిశీలించాను. అందులో అతిక్రమణ ఏదీ కనిపించలేదని చెబుతూ నోటీసులను తిరస్కరించారు. విపత్తుల నిర్వహణ బిల్లు 2024పై రాజ్యసభలో మంగళవారం జరిగిన చర్చలో అమిత్‌షా మాట్లాడుతూ ‘‘కాంగ్రెస్ హయాంలో ప్రధానమంత్రి సహాయనిధి కేవలం ఒక కుటుంబం గుప్పిట్లో ఉండేదని, ప్రధానమంత్రి సహాయనిధిని ప్రభుత్వం ఏర్పాటు చేసినా అందులో కాంగ్రెస్ అధ్యక్షులు సభ్యులుగా ఉండేవారు’’ అని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలు పరోక్షంగా సోనియా గాంధీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేవిగా ఉన్నాయని, హోం మంత్రి సభ్యులను తప్పుదోవ పట్టించారని, ఇది సభా హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని పేర్కొంటూ జైరాం రమేశ్ ప్రివిలేజ్ నోటీసు రాజ్యసభ చైర్మన్‌కు అందించారు. -
వైవిధ్య వైరుద్ధ్యాలు
ఒక కుటుంబం నుంచి, సమాజం నుంచి, ఒక దేశం వరకు వైవిధ్యాలు అనేకం ఉంటాయి. వాటిని వైరుద్ధ్యాలుగా మారకుండా చూసుకోవటంలోనే విజ్ఞత ఉంటుంది. ఆ విధంగా చూసినపుడు, లోక్‌సభ నియోజక వర్గాల పునర్విభ జనపై తలెత్తిన వివాదం ఒక వైవిధ్య స్థితి నుంచి వైరుద్ధ్య స్థాయికి చేరుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఈ అంశంపై ఈ నెల 22న చెన్నైలో జరిగిన సమావేశం దేశానికంతా ఒక హెచ్చరిక వంటిదని చెప్పాలి. నియోజక వర్గాల పునర్విభజనతో ముడిపడి మరొక రెండు అంశాలు కూడా ఉన్నాయన్నది గుర్తించవలసిన విషయం. ఒకటి – హిందీ భాషను హిందీయేతర రాష్ట్రాలపై బలవంతంగా రుద్దుతున్నారనే ఫిర్యాదు. ఈ విషయం చెన్నైలో చర్చకు రాలేదు. కానీ ఎప్పటినుంచో ఉన్నదే. రెండవది – దక్షిణ–ఉత్తర భారతాల మధ్య సాధారణ రూపంలోనే ఉన్నాయనే విభేదాలు. ఈ భావన నియోజక వర్గాల పునర్విభజనకు, హిందీ భాషకు పరిమితమైనది కాదు. ఇటువంటి భావనలకు గల చరిత్ర మూడు దశలలో కనిపిస్తుంది. ఒకటి– ఉత్తరాది వారికి దక్షిణాది వారిపట్ల ఎప్పుడూ చిన్నచూపేనన్నది. రెండు – దాక్షిణాత్యుల రంగురూపులు, భాషా సంస్కృతులు, ఆహార విహారాల పట్ల స్వాతంత్య్రానికి ముందు నుంచే ఉన్నదనే ఈసడింపు దృష్టి. మూడవది–ఈ రెండింటికన్నా ప్రమాదకరమైనది, ప్రాచీనమైనది. అది ఆర్య–ద్రవిడ వాదనలు. వివాదాలకు ఆస్కారం ఇచ్చేలా...మరే దేశంలోనూ లేనంతటి వైవి«ధ్యాలు ఇక్కడ ఉన్నాయి. సాంస్కృతికంగా, విశ్వాసాలపరంగా ఒక ఏక రూపత, కనీసం స్థూలమైన విధంగా, అనాదిగా ఉండిన ప్పటికీ, బ్రిటిష్ వలస పాలన ముగిసినాక చరిత్రలో మొదటిసారిగా మొత్తం నాలుగు చెరగులకూ కలిపి భౌగోళికంగా, రాజకీయంగా దేశానికి ఏకరూపత సిద్ధించింది. వైవిధ్యాలను సరిహద్దులు చెరిపివేసి ఒకటి చేసే ప్రయత్నాలు 1885లో కాంగ్రెస్ వ్యవస్థాపన కాలం నుంచి మొదలై, 1947లో స్వాతంత్య్ర సాధన, 1950 నుంచి రాజ్యాంగం అమలు, 1951–52లో మొదటి సార్వత్రిక ఎన్నికలతో ఒక రూపానికి వచ్చాయి. వైవిధ్యాలు వైరు ద్ధ్యాలుగా మారగల అవకాశాలకు ఆ విధంగా ముగింపు పలికినట్లయింది. కనీసం అందుకు ఒక బలమైన ప్రాతిప దిక సూత్రరీత్యా ఏర్పడింది. దానిని అదే ప్రకారం స్థిర పరచి మరింత పటిష్ఠం చేయవలసిన బాధ్యతను చరిత్ర పాలకులకు అప్పగించింది. అందుకు పునాదుల స్థాయిలో భంగపాట్లు జరిగాయని అనలేముగానీ, వేర్వేరు సాయుల్లో జరుగుతూ వస్తున్న దాని పర్యవసానమే ప్రస్తుత వివాదాలు.ఇటువంటి వివాదాలకు కేంద్ర ప్రభుత్వం ఆస్కార మివ్వనట్లయితే చెన్నై సమావేశపు అవసరమే ఉండేది కాదు. ఆ సమావేశం దరిమిలా కేంద్ర హోంమంత్రిఅమిత్ షా ఏమీ స్పందించలేదుగానీ, దక్షిణాదికి చెందిన ముగ్గురు బీజేపీ మంత్రులు మాట్లాడుతూ, విభజనకు సంబంధించి ఇంకా నిర్ణయం జరగలేదు, విధివిధానాలు రూపొందలేదు, ప్రకటనేమీ వెలువడలేదు, అటువంటపుడు ఈ సమావేశాలు, విమర్శలు ఎందుకని ప్రశ్నించారు. విధివిధానాల రూపకల్పన, ప్రకటన జరగక పోవచ్చు. కానీ నష్టపోతా మనుకునే రాష్ట్రాలకు స్థూలమైన అభిప్రాయాలు కలగకుండా ఎట్లా ఉంటాయి? వారు ఆ విషయమై మాట్లాడకుండా ఎట్లా ఉంటారు?ఇటువంటి విషయాలలో చర్చలు ఒక ప్రజాస్వామిక రాజకీయ వ్యవస్థలో ముందునుంచే జరుగుతాయి తప్ప, అంతా ముగిసిపోయే వరకు ఆగవు. విషయం వివాదాస్పదమవుతున్న సూచనలు కనిపించినప్పుడు చర్చలు మరింత అవసరం. కానీ అమిత్ షా అదేమీ చేయకుండా, దక్షిణాదికి ఎటువంటి నష్టం ఉండ దనీ, అక్కడి స్థానాలు ఇప్పటికన్నా పెరుగుతాయనటం మొదలుపెట్టారు. ఇందులో ఒక చాతుర్యం ఉంది. ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలు రెండింటికీ స్థానాలు ఇప్పటికన్న పెరిగినా, దక్షిణాదికన్న ఉత్తరాదికి పెరిగేవి చాలా ఎక్కువని, ఆ విధంగా రెండు ప్రాంతాల మధ్య గల ప్రస్తుత వ్యత్యాసం బాగా ఎక్కువవుతుందని అంచనా. అమిత్‌షా ఈ కోణాన్ని దాచిపెడుతున్నారు. అట్లాగాక ఏ వ్యత్యాసమూ, నష్టమూ ఉండదనుకుంటే ఆయన ఆ మాటను దక్షిణ రాష్ట్రాలను సమావేశపరచి వివరించాలి.సమావేశం అవసరం!చెన్నైలో జరిగిన సంయుక్త కార్యాచరణ కమిటీ సమావేశానికి పార్టీ తేడాలు లేకుండా పలువురు హాజరయారంటేనే, విభజన ప్రతిపాదనలు ఎటువంటి అనుమానాలను కలిగిస్తున్నాయో అర్థమవుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పాల్గొనటం. ఎందుకంటే, దేశమంతటాగల ఆ పార్టీ ఇటువంటి వైఖరి తీసుకుంటే వారికి ఉత్తరాదిన వ్యతిరేకత రాగలదనీ, ఆ భయంతో వారు హాజరు కాకపోవచ్చుననీ బీజేపీ అంచనా వేసింది. కానీ విభజనకు వ్యతిరేకంగా పార్టీ అధ్యక్షుడు ఖర్గే ముందుగానే మాట్లాడారు.ఇందులో రెండవవైపున చూస్తే, విభజనకు అనుకూలించటం వల్ల బీజేపీ దక్షిణాదిన నష్టపోగలదనే అభిప్రాయం ఉన్నా, ఆ పార్టీ అదే వైఖరికి కట్టుబడి ఉంటున్నది. దీనిని బట్టి ఇరువురూ, ఆయా ప్రాంతాలలో ప్రజాభిప్రాయాలు ఎట్లున్నా తమ వైఖరులను మార్చుకోదలచలేదని అర్థమవుతున్నది. దాని పర్యవసానాలు ఏమిటన్నది తర్వాతి విషయం. అది సూత్రబద్ధమైన వైఖరి అనుకుంటే మాత్రం ఆ మేరకు వారిని మెచ్చుకోవాలి.ఈ వైవిధ్యాలన్నీ వైరుద్ధ్యాలుగా మారి తీవ్ర స్థాయికి వెళ్ళకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, పార్టీలను సమావేశపరచాలి. ఈ విషయమై తమ అభిప్రాయాన్ని ఒక తీర్మానంగా ఆమోదించిన చెన్నై సమావేశం, ఆ తీర్మాన ప్రతిని ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల కాలంలోనే ప్రధాని మోదీకి అందజేయగలమని ప్రకటించింది. ఆయన ఆ సందర్భాన్ని అవకాశంగా తీసుకుని ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయటం మంచిదవుతుంది. చెన్నైలో తీర్మానించినట్లు విభజనను 25 సంవత్సరాల వరకు గాక, దక్షిణాదికి ఆమోదయోగ్యమయే ప్రత్యామ్నాయాన్ని కనుగొనే వరకు నిరవధికంగా వాయిదా వేయటం మంచిది.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
అణచివేతే పరిష్కారమా?!
చాన్నాళ్లుగా ఘర్షణాత్మక ప్రాంతంగా ముద్రపడిన ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యంలో మరోసారి మావోయిస్టులకూ, భద్రతా బలగాలకూ మధ్య గురువారం రెండు వేర్వేరు చోట్ల జరిగిన కాల్పుల్లో 30 మంది మావోయిస్టులూ, ఒక డీఆర్జీ జవాను మరణించారు. ఈ ఏడాది ఇంతవరకూ 113మంది నక్సలైట్లు మరణించారు. నిరుడు ఇదేకాలంలో 29 మంది ఎదురుకాల్పుల్లో చనిపోయారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం రాజ్యసభలో చేసిన ప్రసంగం ప్రభుత్వ దృఢ సంక ల్పాన్ని తెలియజెబుతుంది. మావోయిస్టులను వచ్చే ఏడాది మార్చి 31 నాటికి పూర్తిగా తుడిచి పెడతామని ఆయన ప్రకటించారు. ఈ ఏడాది ఇంతవరకూ 104 మందిని అరెస్టు చేశామని,164 మంది లొంగిపోయారని తెలిపారు. ఛత్తీస్‌గఢ్ ఒకప్పుడు మావోయిస్టుల కంచుకోట.ముఖ్యంగా 3,900 చదరపు కిలోమీటర్ల వైశాల్యంగల దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మఢ్ అటవీప్రాంతంలోకి మావోయిస్టులు మినహా అన్యులు ప్రవేశించటం అసంభవమన్న అభిప్రాయంవుండేది. అక్కడే మావోయిస్టు శిక్షణ శిబిరాలు, భారీ ఆయుధ డంప్‌లు, ఆహారపదార్థాల గోడౌన్ లుండేవి. పల్లెసీమల్లో వారికి గట్టి పట్టుండేది. ఇప్పుడక్కడ దాదాపు 300 వరకూ కేంద్ర బలగాల స్థావరాలున్నాయి. ఇవిగాక సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ దళాల శిబిరాలున్నాయి. బస్తర్ అడవుల్లోఅత్యంత మారుమూల ప్రాంతం కావటంవల్ల, చుట్టూ వున్న ఎత్తయిన కొండలు, వాటిపై దట్టంగా విస్తరించిన వృక్షాలుండటంవల్ల మావోయిస్టులకు అది రక్షణ కవచంగా ఉండేది. దాన్ని ‘విముక్త ప్రాంతం’గా పరిగణించేవారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఉండటంవల్లే వారి అణచివేత వేగం పుంజుకుందన్న అభిప్రాయం పాక్షిక సత్యం మాత్రమే. యూపీయే ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ మావోయిస్టులను ‘జాతీయ భద్రతకు పెనుముప్పు’గా ప్రకటించారు. తదనుగుణంగా అనేక చర్యలు మొదలయ్యాయి. అప్పటి హోంమంత్రి చిదంబరం ‘ఆపరేషన్ గ్రీన్ హంట్’ పేరుతో నక్సల్స్ ఏరివేతకు చర్యలు తీసుకున్నారు. అదిప్పుడు ‘ఆపరేషన్ కగార్’ అయింది. ఈ క్రమంలోనే మావోయిస్టులపై భద్రతా బలగాలు క్రమేపీ పైచేయి సాధించాయి. కేంద్రంలో ఎవరున్నా నక్సల్స్ అణచివేతలో ఛత్తీస్‌గఢ్‌కు పూర్తి సహకారం అందింది.రాజ్యానికుండే ఆయుధ సంపత్తి, దాని సుశిక్షిత భద్రతా బలగాల ముందు ఎవరూ సరి పోరన్నది వాస్తవం. ఆ అంబులపొదిలో ఇప్పుడు ఆధునిక సాంకేతికత చేరింది. అందువల్లే కావొచ్చు... దట్టమైన అరణ్యాల్లో సైతం మావోయిస్టు దళాల కదలికలను వెంటనే నిఘా వర్గాలు గుర్తించగలుగుతున్నాయి. అబూజ్‌మÉŠ అరణ్యంలో ఏం జరుగుతున్నదో ఎప్పటికప్పుడు ఆరా తీయగలిగేలా నిఘా డ్రోన్లు సంచరిస్తున్నాయి. ఇప్పటికేవున్న భద్రతా బలగాలకు అదనంగా గత నెలలో మరో 2,500 మంది జవాన్లను తరలించినట్టు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వర్గాలు ప్రకటించాయి. జిల్లా రిజర్వ్ గార్డ్(డీఆర్జీ) పేరిట ఏర్పాటు చేసిన బలగాలు కేంద్ర దళాల చేతుల్లో తిరుగు లేని ఆయుధం. ఎందుకంటే డీఆర్జీలో దాదాపు అందరూ ఆదివాసీ తెగలవారు. మావోయిస్టుల్లో పనిచేసినవారు. వీరికి ఆ ప్రాంతం కొట్టిన పిండి. ఎక్కడున్నామో, ఎటుపోతున్నామో తెలియని దుర్గ మారణ్యాల్లో వీరు సునాయాసంగా చొచ్చుకెళ్లగలుగుతున్నారు. ఒకప్పుడు మావోయిస్టుల్లో పనిచేసి వెలుపలికొచ్చినవారినీ, ఇతరులనూ ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ‘సల్వాజుడుం’ పేరిట సమీకరించి ఆయు ధాలిచ్చి, వారిద్వారా మావోయిస్టుల్ని అణచడానికి ప్రయత్నించింది. ఇలా ప్రైవేటు సైన్యాలను రూపొందించటం రాజ్యాంగ విరుద్ధమని, దాన్ని తక్షణమే రద్దు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. దురదృష్టమేమంటే భద్రతా బలగాలకూ, మావోయిస్టులకూ మధ్య జరిగే పోరుతో సంబంధంలేని సాధారణ ఆదివాసీ ప్రజానీకం సైతం భయంతో బతకాల్సి వస్తున్నది. ఘర్షణ జరిగే ప్రాంతాల్లో ఎక్కడైనా ఇదే పరిస్థితి. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ జిల్లాల్లో, ఏజెన్సీప్రాంతాల్లో నక్సల్స్‌కు సహకరిస్తున్నారన్న అనుమానంతో సాధారణ పౌరులను పోలీసులు వేధించే వారన్న అభిప్రాయం వుండేది. అలాగే నక్సల్స్ సైతం ఇన్ఫార్మర్ల పేరిట అనేకుల్ని హతమార్చిన ఉదంతాలు ఉండేవి. ఇప్పుడు ఛత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్లలో పదులకొద్దీమంది మరణిస్తున్నారు. కానీ వారంతా మావోయిస్టులేనా? ఆ ఉదంతాలు జరిగాక హక్కుల సంఘాలు చేసే ప్రకటనలు తప్ప అక్కడికి మీడియా వెళ్లి జరిగిందేమిటో చెప్పే పరిస్థితులు లేవు. అటు మావోయిస్టులు సైతం ఛత్తీస్‌గఢ్‌లో ఇన్ఫార్మర్ల పేరిట కొందరిని హతమారుస్తున్న ఉదంతాలు వెల్లడవుతున్నాయి.వచ్చే ఏడాదికల్లా మావోయిస్టుల్ని అంతం చేస్తామన్న అమిత్ షా ప్రకటనలు నెరవేరే అవకాశం ఉండొచ్చని వరస ఉదంతాలు గమనిస్తే అర్థమవుతుంది. 2013లో తొమ్మిది రాష్ట్రాల్లోని 126 జిల్లాలు నక్సల్స్ ప్రభావంలోవుంటే నిరుడు ఆ సంఖ్య 38కి పడిపోయింది. రహదారుల నిర్మాణం కూడా జోరందుకుంది. కానీ ఇవి మాత్రమే తిరుగుబాటునూ, అసంతృప్తినీ అంతర్థానం చేస్తాయని భావించటం పొరపాటు. ఆదివాసీ సంస్కృతినీ, అక్కడి సహజవనరులనూ పరిరక్షించటానికి చర్యలు తీసు కుంటేనే... ఆ ప్రాంతానికి స్వయంప్రతిపత్తి కల్పించి, రాజ్యాంగం పూచీపడిన హక్కులు సక్రమంగా అమలు చేస్తేనే సమస్య పరిష్కారమవుతుంది. ఇందిరాగాంధీ హయాంలో బీడీ శర్మ వంటి అంకిత భావంతో పనిచేసిన ఐఏఎస్ అధికారులు బస్తర్ ప్రాంత అభివృద్ధికీ, ఆదివాసీల సంక్షేమానికీ ఎన్నో పథకాలు అమలు చేశారు. ఆ నమూనాను ఆదర్శంగా తీసుకోవాలి. -
ఆ రోజులు పోయాయి.. ఉగ్రవాదంపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
సాక్షి, ఢిల్లీ: కశ్మీర్లో ఉగ్రవాద దాడులు తగ్గిపోయాయని.. సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తెలిపారు. శుక్రవారం ఆయన రాజ్యసభలో హోం శాఖ పనితీరుపై జరిగిన చర్చలో సమాధానం ఇస్తూ.. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానం అనుసరిస్తున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు ఓటు బ్యాంక్ రాజకీయాలతో కశ్మీర్‌ను నాశనం చేశాయంటూ ఆయన మండిపడ్డారు. దేశంలో శాంతి భద్రతలు కాపాడటంపైనే తాము ప్రధానంగా దృష్టి పెట్టినట్లు అమిత్ షా వెల్లడించారు.కశ్మీరీ యువకులు ఇప్పుడు ఉద్యోగాలు కూడా చేసుకుంటున్నారన్న అమిత్ షా.. గతంలో జరిగినట్లు ఉగ్రవాదులకు సానుభూతిగా ఆందోళనలు జరగడం లేదన్నారు. కశ్మీర్లో ఉగ్రవాదులను దేశ భక్తులుగా కొనియాడే రోజులు పోయాయంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు కశ్మీర్లో సినిమా ధియేటర్లు కూడా నిండుతున్నాయని అమిత్ షా అన్నారు.‘‘మా ప్రభుత్వ హయాంలో నక్సలిజాన్ని దాదాపుగా రూపుమాపాం. 2026 మార్చికల్లా నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తాం. ఉగ్రవాదాన్ని జీరో టోలరెన్స్ విధానంతో కఠినంగా అణిచివేశాం కశ్మీర్లో రాళ్లురువ్వే సంఘటనలు పూర్తిగా నిలిచిపోయాయి. కాంగ్రెస్ హయాంలో పోలిస్తే మా హయాంలో కాశ్మీర్లో ఉగ్రవాద దాడులు చాలా వరకు తగ్గిపోయాయి. వేర్పాటు వాదానికి ఆర్టికల్ 370 మూల కారణం. పిఎఫ్ఐ నెట్‌వర్క్‌ను పూర్తిగా నిర్మూలించాం. బింద్రే సానుభూతిపరులను జైలు ఊచలు లెక్కబెట్టించాము’’ అని అమిత్ షా వివరించారు. -
Amit Shah : నక్సల్స్‌కు అమిత్‌షా వార్నింగ్
ఢిల్లీ : కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నక్సల్స్‌కు హెచ్చరికలు జారీ చేశారు. లొంగిపోయేందుకు మావోయిస్ట్‌లకు కేంద్రం అవకాశం ఇస్తుంది. కాదు కూడదు అంటే వారి పట్ల కేంద్రం కఠినంగా వ్యవహరిస్తోందన్నారు. వచ్చేడాది మార్చి నెల లోపు నక్సలిజాన్ని అంతచేస్తామని పునరుద్ఘాటించారు.గురువారం, ఛత్తీస్ ఘడ్ దండకారణ్యంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు జరిపిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో 22మంది (అమిత్‌షా ట్విట్ చేసే సమయానికి)మావోయిస్టులు మృతి చెందారు.ఈ ఎన్‌కౌంటర్‌పై అమిత్‌షా ఎక్స్ వేదికగా స్పందించారు. ‘నక్సల్ భారత్ ముక్త్ అభియాన్’ భారత సైనికులు మరో విజయం సాధించారు. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం బిజాపుర్,కంఖేర్ రెండు వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహించిన కూంబింగ్‌లో 22మంది నక్సల్స్ మరణించారు. కేంద్రం నక్సల్స్ లొంగిపోయేందుకు అవకాశం ఇస్తుంది. కాదు కూడదు అంటే.. వారిపట్ల కేంద్రం కఠినంగా వ్యవహరిస్తోందని హెచ్చరించారు. వచ్చే ఏడాది మార్చి లోపు నక్సల్స్ రహిత దేశంగా భారత్‌ను తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ‘नक्सलमुक्त भारत अभियान’ की दिशा में आज हमारे जवानों ने एक और बड़ी सफलता हासिल की है। छत्तीसगढ़ के बीजापुर और कांकेर में हमारे सुरक्षा बलों के 2 अलग-अलग ऑपरेशन्स में 22 नक्सली मारे गए।मोदी सरकार नक्सलियों के विरुद्ध रुथलेस अप्रोच से आगे बढ़ रही है और समर्पण से लेकर समावेशन की…— Amit Shah (@AmitShah) March 20, 2025 -
బోడో ఒప్పందంతో శాంతి, అభివృద్ధి
గౌహతి/కొక్రాఝర్: బోడో ఒప్పందాన్ని అమలు చేసి ఈ ప్రాంతంలో శాంతిని, అభివృద్ధిని సుసాధ్యం చేశామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. బోడోలాండ్ టెరిటోరియల్ రీజియన్(బీటీఆర్)లోని యువత నేడు తుపాకులకు బదులుగా త్రివర్ణ పతాకాన్ని ధరించారని ఆయన తెలిపారు. 2020లో బోడో ఒప్పందం కుదరడం వల్లే ఇది సాధ్యమైందని మంత్రి ప్రకటించారు. ఆదివారం ఆయన అస్సాంలోని కొక్రాఝర్ జిల్లా దొట్మాలో ఆల్ బోడో స్డూటెండ్స్ యూనియన్(ఏబీఎస్‌యూ) 57వ వార్షిక భేటీని ఉద్దేశించి ప్రసంగించారు.ఒప్పందం విషయంలో ఏబీఎస్‌యూ చూపిన చొరవ ఫలితంగానే నేడు శాంతియుత పరిస్థితులు సాధ్యమయ్యాయని చెప్పారు. లేకుంటే, బీటీఆర్‌లో శాంతి లేదు, బోడో ఒప్పందం ఒక జోక్ అంటూ కాంగ్రెస్ ఎద్దేవా చేసి ఉండేదని ఆయన అన్నారు. ఒప్పందంలోని 82 శాతం షరతులను ఇప్పటికే అమలు చేశామని, వచ్చే రెండేళ్లలో 100 శాతం పూర్తవుతుందని చెప్పారు. ఈ ప్రాంతాన్ని సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం(ఏఎఫ్ఎస్పీఏ) నుంచి పూర్తిగా మినహాయించామని వివరించారు.మూడేళ్లలోనే ఎన్డీఎఫ్బీ సభ్యులు 4,881 మంది లొంగిపోయారని, వీరి పునరావాసానికి రూ.287 కోట్లు వెచ్చించామని ఇందులో 90 శాతం కేంద్రమే సమకూర్చిందని వివరించారు. 2020 జనవరి 27న ఏబీఎస్‌యూ, ఎన్డీఎఫ్బీ తదితర బోడో గ్రూపులతో కేంద్రం బోడో శాంతి ఒప్పందం కుదుర్చుకోవడం తెల్సిందే. నేర చట్టాల అమలుపై అమిత్ షా సమీక్ష కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం కొత్తగా అమల్లోకి వచి్చన నేర చట్టాలు బీఎన్ఎస్, బీఎన్ఎస్ఎస్, బీఎస్ఏ చట్టాలు ఈశాన్య రాష్ట్రాల్లో అమలుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన ఉండటంతో ఆ రాష్ట్రం తరఫున గవర్నర్ అజయ్ భల్లా హాజరయ్యారు. ఆయా రాష్ట్రాల సీఎంలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతోపాటు డీజీపీలు హాజరయ్యారు. -
మిజోరాం ‘వండర్ కిడ్’కు గిటార్
ఐజ్వాల్: ‘మా తుఝే సలాం’ పాటతో శ్రోతలను మంత్రముగ్ధులను చేసిన మిజోరాం ‘వండర్ కిడ్’ ఎస్తేర్ లాల్దుహామి హ్నామ్టేకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా గిటార్ బహుమతిగా ఇచ్చారు. 2021లో ఆమె పాడిన ‘మా తుఝే సలాం’ పాట వైరలై దేశమంతటి దృష్టినీ ఆకర్షించింది. ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో ఉన్న అమిత్ షా ఆదివారం ఐజ్వాల్‌లో ఆమెను రాజ్‌భవన్‌కు ఆహ్వనించారు. తనకు గిటార్ అందజేసిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇదొక మైమరపించే అనుభవంగా ఆయన అభివర్ణించారు. ‘భారత్ పట్ల ప్రేమే మనందరినీ ఏకం చేస్తుంది.ఎస్తేర్ వందేమాతరం పాట విని చలించిపోయాను. దేశంపై ఆమెకున్న ప్రేమ పాటలో ప్రతిఫలించింది’ అంటూ ప్రశంసించారు. దీనిపై ఆమె తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. దక్షిణ మిజోరంలోని లుంగ్లీ పట్టణానికి చెందిన హ్నామ్టే 2016 జూన్ 9న జన్మించింది. మూడేళ్ల వయసులోనే పాడటం ప్రారంభించింది. ఆమె ‘మా తుఝే సలాం’ మ్యూజిక్ వీడియోను యూట్యూబ్‌లో వారం రోజుల్లోనే 30 లక్షల మంది చూశారు. ఈ సంఖ్య ప్రస్తుతం 4.7 కోట్లకు చేరింది. ఆమె జీవితంపై తీసిన ‘ఎ స్టార్ ఈజ్ బోర్న్’కు 2023లో ఈశాన్య చలన చిత్రోత్సవంలో ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డు వచి్చంది. -
మిజోరం వండర్ కిడ్కి అమిత్ షా స్పెషల్ గిఫ్ట్
మిజోరాం: ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. ఓ చిన్నారికి గిటార్‌ను బహుమతిగా ఇచ్చారు. శనివారం మిజోరాంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఏడేళ్ల చిన్నారి ఎస్తేర్ లాల్దుహవ్మి హనామ్టే వందేమాతరాన్ని పాడింది. ఆ చిన్నారిని అభినందిస్తూ గిటార్‌ను బహుమతిగా ఇచ్చారు. ఆ చిన్నారిని "వండర్ కిడ్"గా అభివర్ణించిన అమిత్ షా.. భారత్‌పై ప్రేమ మనల్ని ఏకం చేసిందన్నారు. ‘‘చిన్నారి ఎస్తేర్ వందేమాతరాన్ని పాడి నా హృదయాన్ని కదిలించింది.. ఏడేళ్ల చిన్నారికి దేశంపై ఉన్న ప్రేమ తన పాటలో కనిపించింది’ అంటూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆ చిన్నారి పాట వీడియోను కూడా ఆయన పంచుకున్నారు. కాగా, 2020లో ‘మా తుజే సలామ్’ పాట వీడియోతో అందరి దృష్టిని ఆకర్షించిన ఎస్తేర్.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆమె అనేక అవార్డులను కూడా అందుకుంది.Love for Bharat unites us all.Deeply moved to listen to Mizoram's wonder kid Esther Lalduhawmi Hnamte, singing Vande Mataram in Aizawl today. The seven-year-old's love for Bharat Mata poured out into her song, making listening to her a mesmerizing experience.Gifted her a… pic.twitter.com/7CLOKjkQ9y— Amit Shah (@AmitShah) March 15, 2025 -
అస్సాంలో అశాంతికి కాంగ్రెసే కారణం
దెర్గావ్జ్వాల్: అస్సాంలో శాంతియుత వాతావరణం నెలకొల్పి, మౌలిక వనరులను అభివృద్ధి చేసింది ప్రధాని మోదీయేనని హోం మంత్రి అమిత్ షా చెప్పారు. యువతకు ఉపాధి అవకాశాలను కల్పించిందని తెలిపారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు రాష్ట్రంలో శాంతి నెలకొనకుండా అడ్డుకున్నాయని ఆయన ఆరోపించారు. అప్పట్లో రాష్ట్రానికి ఎటువంటి గ్రాంట్లు అందకపోవడంతో ఆందోళనలు, హింసాత్మక కార్యక్రమాలకు, వెనుకబాటుకు మారుపేరుగా మారిందని విమర్శించారు.శనివారం మంత్రి అమిత్ షా గోలాఘాట్ జిల్లా దెర్గావ్లోని లచిత్ బార్‌పుకాన్ పోలీస్ అకాడెమీ పునరుద్ధరణ మొదటి దశ పనులను ప్రారంభించడంతోపాటు రెండో దశ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘అస్సాంలో 10 వేల మందికి పైగా యువకులు ఆయుధాలు వదిలేసి జనజీవన స్రవంతిలో కలిశారు. దీంతో గత పదేళ్లుగా రాష్ట్రంలో శాంతి నెలకొంది. ఆందోళనలు, హింస, వేర్పాటువాదానికి పేరున్న అస్సాంలో నేడు రూ.27 వేల కోట్లకు పైగా పెట్టుబడితో అత్యాధునిక సెమీ కండక్టర్ పరిశ్రమ నడుస్తోంది. ఇది అస్సాం భవిష్యత్తునే మార్చనుంది’అని అన్నారు.ఇటీవల ముగిసిన అడ్వాంటేజ్ అస్సాం 2.0లో మరో రూ.3 లక్షల కోట్ల విలువైన పెట్టుబడుల ప్రతిపాదనలు అందాయి. ఇవి ఏర్పాటైతే యువతకు ఎన్నో అవకాశాలు అందుబాటులోకి వస్తాయి’అని మంత్రి చెప్పారు. మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్‌లతో ఉన్న సరిహద్దు వివాదాలను పరిష్కరించామన్నారు. విద్యార్థిగా ఉండగా అస్సాంకు వచ్చినప్పుడు జరిగిన పరిణామాలను ఆయన గుర్తు చేసుకుంటూ.. ‘అప్పట్లో కాంగ్రెస్ నేత హితేశ్వర్ సైకియా సీఎంగా ఉండేవారు. ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. అరెస్టయిన వారిలో నేనూ ఉన్నా. అస్సాం జైలులో వారం పాటు నన్ను ఉంచారు’అని తెలిపారు.అప్పటి కాంగ్రెస్ హయాంతో, ఇప్పటి బీజేపీ పాలనతో పోల్చుకుంటే అస్సాంలో గుర్తు పట్టలేనన్ని మార్పులు సంభవించాయన్నారు. వచ్చే ఐదేళ్లలో లచిత్ బార్‌పుకాన్ పోలీస్ అకాడెమీ దేశంలోనే అగ్రగామిగా మారనుందని చెప్పారు. అనంతరం అమిత్ షా మిజోరం రాజధాని ఐజ్వాల్‌లో అస్సాం రైఫిల్స్ క్యాంప్‌లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. మిజోరంలో అభివృద్ధి పనుల పురోగతిపై స్వయంగా ప్రధాని మోదీయే సమీక్ష చేస్తున్నారని ఆయన అన్నారు.అస్సాం రైఫిల్స్ క్యాంప్‌ను ఐజ్వాల్ వెలుపలికి మార్చడం కీలక పరిణామంగా పేర్కొన్నారు. మిజో ప్రజల అభీష్టానికి అనుగుణంగా కేంద్రం పనిచేస్తుందనడానికి ఇదే ఉదాహరణ అని ఆయన తెలిపారు. 2014కు పూర్వం ప్రధానమంత్రులంతా కలిసి ఈశాన్య రాష్ట్రాలకు వచ్చింది 21 సార్లు మాత్రమే రాగా, ప్రధాని మోదీ ఈ ప్రాంతంలో 78 పర్యాయాలు పర్యటించారని అమిత్ షా చెప్పారు. -
LKG విద్యార్థి Phd హోల్డర్‌కు ఉపన్యాసం ఇచ్చినట్టుంది: కేంద్రంపై స్టాలిన్ సెటైర్లు
సాక్షి, చెన్నై: తమిళనాడులో హిందీ(Hindi) భాష విషయమై రాజకీయం పీక్ స్టేజ్‌కు చేరుకుంది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్((MK Stalin), కేంద్రమంత్రుల మధ్య విమర్శలు చోటుచేసుకుంటున్నాయి. స్టాలిన్ వ్యాఖ్యలకు తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కౌంటరిచ్చారు. తమిళ భాషకు కేంద్రం తగిన గుర్తింపు ఇస్తుందన్నారు. తమిళం విషయంలో స్టాలిన్ రాజకీయం సరికాదన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తమిళనాడు(Tamil Nadu)లోని రాణిపేటలో పర్యటిస్తున్నారు. శుక్రవారం సీఐఎస్ఎఫ్ కార్యక్రమానికి అమిత్ షా హాజరయ్యారు. ఈ సందర్బంగా అమిత్ షా మాట్లాడుతూ..‘ఇంజనీరింగ్, మెడికల్ విభాగాల్లో ఉన్నత విద్య కోసం తమిళ భాషలోనే సిలబస్ తీసుకొస్తాం. వీలైనంత త్వరగా చర్యలు చేపడతాం. తమిళ భాష అభివృద్ధి, సంస్కృతికి కట్టుబడి ఉన్నాం. దేశంలో ప్రాంతీయ భాషలు అన్నింటినీ గౌరవిస్తాం. ఇప్పటివరకు సీఏపీఎఫ్(CAPF) నియామకంలో మాతృభాషకు స్థానం లేదు. ఈ నేపథ్యంలో యువతకు నష్టం జరుగుతోందని ప్రధాని మోదీ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నారు. అన్ని భాషలతో పాటు తమిళంలో కూడా సీఏపీఎఫ్ పరీక్షలు నిర్వహించాలని మోదీ నిర్ణయించారు. ఇప్పటికైనా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను సీఎం స్టాలిన్ మానుకోవాలి’ అని కామెంట్స్ చేశారు.#WATCH | Arakkonam, Tamil Nadu: Union Home Minister Amit Shah says, "... Till now, there was no place for mother tongue in the CAPF recruitment... PM Narendra Modi decided that our youth will now be able to write their CAPF exam in all languages in the eight list, including… pic.twitter.com/Q8pXv1IzZ4— ANI (@ANI) March 7, 2025అంతకుముందు, కేంద్రంపై సీఎం స్టాలిన్ విరుచుకుపడ్డారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై ఆయన విమర్శలు చేశారు. స్టాలిన్ ట్విట్టర్ వేదికగా..‘విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎప్పటికీ గెలవని యుద్ధం మొదలుపెట్టారు. చెట్టు ప్రశాంతంగా ఉండాలని అనుకున్నా.. గాలి రాకుండా మాత్రం ఉండదు కదా!. అలాగే.. భాష విషయంలో ఆయన మమ్మల్ని రెచ్చగొడుతున్నారు. అందుకే ఆయనకు వరుసగా లేఖలు రాస్తున్నాం. ఎన్ఈపీని తిరస్కరిస్తున్న తమిళనాడు.. ఇప్పటికే విద్యావిధానంలో అనేక లక్ష్యాలను సాధించింది.త్రిభాష విషయంలో.. ఎల్కేజీ విద్యార్థి పీహెచ్డీ హోల్డర్‌కి ఉపన్యాసం ఇచ్చినట్లు ఉంది ఆయన తీరు. మేం ఢిల్లీ ఆదేశాలను తీసుకోం. త్రిభాషా విధానంపై బీజేపీ సర్కారు చేస్తున్న సంతకాల ప్రచారం హాస్యాస్పదంగా ఉంది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ అంశాన్నే ప్రధాన అజెండాగా చేసుకొని బరిలో దిగాలని సవాల్ విసురుతున్నా. పథకాల దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఇచ్చే అవార్డుల వరకు అన్నింటికీ హిందీ పేర్లను పెట్టారు. దేశంలో అధికంగా ఉన్న హిందీయేతర ప్రజలను ఇది ఉక్కిరిబిక్కిరి చేస్తుంది’ అని స్టాలిన్ చెప్పుకొచ్చారు. 🎯 "The tree may prefer calm, but the wind will not subside." It was the Union Education Minister who provoked us to write this series of letters when we were simply doing our job. He forgot his place and dared to threaten an entire state to accept #HindiImposition, and now he… pic.twitter.com/pePfCnk8BS— M.K.Stalin (@mkstalin) March 7, 2025 -
త్వరలో ల్యాండ్ గ్రాబింగ్ ప్రొవిజన్ బిల్లు
సాక్షి, న్యూఢిల్లీ: త్వరలో రాష్ట్రంలో ‘ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొవిజన్’ బిల్లును తీసుకురానున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌తో ఆయన వేర్వేరుగా భేటీ అయ్యారు. అనంతరం ఎంపిక చేసుకున్న మీడియాతో సీఎం సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఐదేళ్లలో అనేక భూములు కబ్జాకు గురయ్యాయని ఆరోపించారు. ప్రతి పది కేసుల్లో ఆరు భూ వివాదాలకు సంబంధించినవే అన్నారు. భూముల కంప్యూటరీకరణలో సరైన విధానం లేక సమస్యలు ఎదురవుతున్నట్లు చెప్పారు. ప్రైవేటు భూములను బలవంతంగా 22ఏలో చేర్చారని.. అటవీ భూములను అధికారులతో కలిసి ఆక్రమించారని ఆరోపించారు. గుజరాత్లో ల్యాండ్ గ్రాబింగ్ బిల్లు విజయవంతంగా అమలవుతోందని, దాని అమలును ఏపీలో కూడా అనుమతించాలని కోరినట్లు చెప్పారు. డీలిమిటేషన్ నిరంతర ప్రక్రియనియోజకవర్గాల పునర్విభజన అనేది నిరంతర ప్రక్రియ అని.. దీనిపై సమయానుకూలంగా స్పందిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. గతంలో జనాభా నియంత్రణను ప్రోత్సహించానని, ఇప్పుడు జనాభాను పెంచాలనే విషయం అర్థమై పిలుపునిస్తున్నట్లు చెప్పారు.పోలవరం 2027 కల్లా పూర్తిగత ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల బకాయిలను వదిలిపెట్టిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలకు తెలిపినట్లు చంద్రబాబు చెప్పారు. రాయలసీమ వంటి కరువు ప్రాంతాలకు నీరందించేందుకు.. సముద్రంలో కలిసే జలాలను వినియోగించుకుంటామని కేంద్రం దృష్టికి తీసుకెళ్లామన్నారు. పోలవరంను 2027 కల్లా పూర్తి చేస్తామని తెలిపారు. 189 కి.మీ. మేర అమరావతి ఔటర్ఎనిమిది లైన్లతో 189 కి.మీ. మేర అమరావతి ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చర్చించినట్లు చంద్రబాబు చెప్పారు. శ్రీశైలం ఆలయం వద్ద ట్రాఫిక్ రద్దీని పరిష్కరించేందుకు రోడ్డును విస్తరించాలని, వినుకొండ–అమరావతి తదితర ప్రాజెక్టులపై చర్చించినట్లు తెలిపారు. డీపీఆర్‌లు సిద్ధం చేసిన తర్వాత టెండర్లు పిలుస్తామని గడ్కరీ చెప్పారని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రానికి రూ.6.5 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయన్నారు. మిర్చి క్వింటాకు రూ.11,781 మద్దతు ధర ఇచ్చేందుకు కేంద్రం ఒప్పుకొందన్నారు. కాగా, ఎమ్మెల్యేల కోటాలో ఖాళీ అవుతున్న 5 ఎమ్మెల్సీ స్థానాల సర్దుబాటుకే చంద్రబాబు ఢిల్లీ వచ్చారని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. -
శాశ్వత శాంతిని పునరుద్ధరించండి
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి పాలనలో ఉన్న మణిపూర్‌లో శాశ్వత శాంతిని పునరుద్ధరించేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఉన్నతాధికారులను ఆదేశించారు. మార్చి 8 నుంచి మణిపూర్‌లోని అన్ని రహదారులపై ప్రజలు స్వేచ్ఛగా రాకపోకలు సాగించేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించాలని సూచించారు. శాంతిని పునరుద్ధరించే విషయంలో అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అమిత్ షా దిశానిర్దేశం చేశారు. మణిపూర్ భద్రతా పరిస్థితిపై శనివారం న్యూఢిల్లీలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా పలు కీలక ఆదేశాలు చేశారు. ఈ సమావేశంలో మణిపూర్ గవర్నర్, అజయ్‌కుమార్ భల్లా, కేంద్ర హోం కార్యదర్శి గోవింద్ మోహన్, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, ఆర్మీ డిప్యూటీ చీఫ్, తూర్పు కమాండ్ ఆర్మీ కమాండర్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్), అస్సాం రైఫిల్స్ డైరెక్టర్ జనరల్స్, మణిపూర్ భద్రతా సలహాదారు సహా పలువురు ఉన్నతస్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో మణిపూర్‌లో శాశ్వత శాంతిని పునరుద్ధరించడానికి అవసరమైన పూర్తి సహాయాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అమిత్ షా పేర్కొన్నారు. అంతేగాక దోపిడీకి సంబంధించిన అన్ని కేసులలో కఠినమైన చర్యలు తీసుకోవడం కొనసాగించాలని... మణిపూర్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఏర్పాటు చేసిన ఎంట్రీ పాయింట్లకు ఇరువైపులా కంచె వేయడం వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కేంద్ర హోంమంత్రి సూచించారు. మణిపూర్‌ను మాదకద్రవ్య రహితంగా మార్చేందుకు, మాదకద్రవ్య వ్యాపారంలో పాల్గొన్న మొత్తం నెట్‌వర్క్‌ను నిర్మూలించాలని ఆదేశించారు. -
మణిపూర్ సంక్షోభం.. కేంద్రం కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: సంక్షోభంలో ఉన్న మణిపూర్‌కు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. జనసంచారంపై ఉన్న ఆంక్షలను ఎత్తేయాలని.. మార్చి 8వ తేదీ నుంచి ఆ రాష్ట్రంలో సాధారణ స్థితి నెలకొల్పాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇవాళ జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో హోం శాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) సంబంధిత ఆదేశాలను జారీ చేశారు.మార్చి 8వ తేదీ నుంచి మణిపూర్(Manipur)లో అన్ని రోడ్లపై ప్రజలు స్వేచ్ఛగా తిరగాలి. ఎవరైనా జనసంచారానికి ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకోండి అని అమిత్ షా మణిపూర్ అధికార యంత్రాంగానికి సూచించారు. మణిపూర్‌లో రాష్ట్రపతి విధింపు తర్వాత.. అక్కడి శాంతి భద్రతలపై జరిగిన తొలి సమీక్షా సమావేశం ఇదే కావడం గమనార్హం.ఈ సమావేశానికి మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా(Ajay Kumar Bhalla), ఇతర ఉన్నతాధికారులు, సైన్యం.. పారామిలిటరీ తరపున ప్రతినిధులు హాజరయ్యారు. 2023 మే నుంచి ఈ ఈశాన్య రాష్ట్రంలో తెగల వైరంలో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొనేలా ప్రయత్నాలను కేంద్రం ఇప్పుడు ముమ్మరం చేసింది.దాదాపు రెండేళ్లుగా జాతుల మధ్య వైరంతో రగులుతున్న మణిపుర్లో కల్లోల పరిస్థితుల నేపథ్యంలో.. ఇటీవల ఫిబ్రవరి 13వ తేదీన సీఎం బీరెన్ సింగ్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ రాష్ట్రపతి పాలన విధించిన కేంద్ర ప్రభుత్వం అధికారాలన్నింటినీ అక్కడి గవర్నర్‌కు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కల్లోల పరిస్థితులను ఆసరాగా చేసుకుని భద్రతా బలగాలకు చెందిన ఆయుధాలను కొందరు ఎత్తుకెళ్లారు. ఈ నేపథ్యంలో.. అక్కడి ప్రజలకు గవర్నర్ అజయ్ కుమార్ భల్లా కీలక విజ్ఞప్తి చేశారు. తమ వద్ద ఉన్న అక్రమ ఆయుధాలు, పేలుడు పదార్థాలను ఏడు రోజుల్లోగా అప్పగించాలని అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిర్ణీత సమయంలోగా ఆయుధాలను తిరిగి ఇస్తే ఎలాంటి చర్యల ఉండవని.. లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
ఉత్తరాఖండ్ ఘటనపై అమిత్ షా
-
పునర్విభజన పేచీ తేల్చేదెలా?
ఎప్పటినుంచో చర్చకొస్తున్న నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ అంశంపై ఎట్టకేలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నోరువిప్పారు. ఈ ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగబోదని హామీ ఇచ్చారు. దీనిపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని కూడా అన్నారు. ఏ విషయమైనా వివాదాస్పదమైనప్పుడు వెంటనే వివరణనిచ్చి సందేహాలను తొలగించటం ప్రభుత్వాల బాధ్యత. 2023 సెప్టెంబర్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా డీఎంకే నాయకురాలు కనిమొళి దీన్ని ప్రస్తావించారు. జనాభా ప్రాతిపదికన పునర్విభజన ప్రక్రియ అమలు చేస్తే దక్షిణాదికి, ముఖ్యంగా తమిళనాడుకు అన్యాయం జరుగుతుందని ఆమె తెలిపారు. ఆ సమస్యే తలెత్తదని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఇప్పుడు అమిత్ షా అయినా, గతంలో మోదీ అయినా అన్యాయం జరగబోదని వాగ్దానం చేస్తున్నారు. మంచిదే. మరైతే పునర్వి భజన ఎలా ఉండబోతోంది? ఏ ప్రాతిపదికన చేస్తారు? అది చెప్పనంత కాలమూ ఈ సంశయాలు సమసిపోవు. జనాభా ప్రాతిపదికనే తీసుకుంటే అన్యాయం జరుగుతుందన్నది దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న సందేహం. అందుకు ఇతరత్రా ప్రాతిపదికలు తీసుకోబోతున్నామని తేటతెల్లం చేసినప్పుడే అందరికీ స్పష్టత వస్తుంది. దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాది రాష్ట్రాలు చాలా అంశాల్లో సాపేక్షంగా వెనకబడి వున్నాయి. విద్య, వైద్యం, ఆర్థికం వగైరాల్లో దక్షిణాదిదే ముందంజ. ఇదంతా జనాభాను అదుపు చేయటం వల్లనే సాధ్యమైంది. 2011 జనాభా లెక్కల ప్రకారం బిహార్‌లో జనాభా పెరుగుదల రేటు 25 శాతంగావుంటే, కేరళలో అది 5 శాతం మాత్రమే. ఎన్నికలు జరిగినప్పుడల్లా బీజేపీ ‘డబుల్ ఇంజన్ సర్కారు’ను తెరపైకి తెస్తుంది. ఆ సంగతెలా వున్నా దేశానికి ‘గ్రోత్ ఇంజన్’ దక్షిణాది అని చెప్పవచ్చు. అందుకే పునర్విభజనపై ఉన్న సందేహాలను పారదోలటం అవసరం.జనాభా లెక్కల సేకరణ జరిగి గణాంకాలు వెల్లడైనప్పుడల్లా ఆ ప్రాతిపదికన నియోజకవర్గాల హద్దులు, చట్టసభల్లో స్థానాల సంఖ్య మార్చాలని రాజ్యాంగం నిర్దేశిస్తోంది. దానికి అనుగుణంగా 1951, 1961, 1971 సంవత్సరాల జనాభా లెక్కల ప్రాతిపదికన లోక్‌సభ, రాజ్యసభ, రాష్ట్రాల అసెంబ్లీల్లోని స్థానాల సంఖ్య మారుతూ వచ్చింది. నియోజకవర్గాల పరిధులు కూడా మారాయి. కానీ 1976లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దీనికి బ్రేక్ వేశారు. ఆత్యయిక స్థితి కొనసాగుతున్న వేళ 42వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి 2001 వరకూ పునర్విభజన ప్రక్రియను స్తంభింపజేశారు. అధిక జనాభా ఉన్న రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసి జనాభా పెరుగుదలను అరికడితే ఏ రాష్ట్రమూ స్థానాల సంఖ్యను కోల్పోకుండా ఉంటుందని ఆమె ప్రభుత్వం భావించింది. కానీ ఎప్పటిలా దక్షిణాది రాష్ట్రాలే జనాభా అదుపులో ముందున్నాయి. 2001లో తప్పనిసరై పునర్విభజన ప్రక్రియ మొదలెట్టినా అది కేవలం నియోజకవర్గాల పరిధుల్లో మార్పులకే పరిమితమైంది. స్థానాల సంఖ్య యథాతథంగా ఉండిపోయింది. దక్షిణాది రాష్ట్రాల ఆందోళనను దృష్టిలో ఉంచుకునే ఆ పనిచేశారు.జనాభా పెరుగుదల రేటులో అసమతౌల్యం చాలా సమస్యలకు దారితీస్తోంది. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్‌లో ఒక ఎంపీ సగటున 30 లక్షలమంది జనాభాకు ప్రాతినిధ్యం వహించాల్సి వుంటుంది. అదే తమిళనాడులో అయితే దాదాపు 18 లక్షలమంది జనాభాకు ప్రతినిధిగా ఉంటారు. అంటే పునర్విభజన ప్రక్రియ ప్రాతిపదిక అన్ని అంశాల్లోనూ సమతుల్యతను సాధించాల్సి వుంటుంది. 1977 నాటి లోక్‌సభలో ప్రతి ఎంపీ సగటున 10.11 లక్షల జనాభాకు ప్రాతినిధ్యంవహించారు. అయితే అన్ని నియోజకవర్గాలూ ఈ చట్రంలో ఇమిడే అవకాశం ఉండదు గనుక కాస్త అటూ ఇటూగా నిర్ణయించారు. జనాభా లెక్కల సేకరణలో ఇప్పటికే మనం నాలుగేళ్లు వెనకబడి వున్నాం. కానీ కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ అంచనా ప్రకారం ప్రస్తుత జనాభా దాదాపు 143 కోట్లు. ఈ జనాభాకు 1977 నాటి ప్రాతిపదికన ఎంపీ స్థానాలు నిర్ణయించాల్సివస్తే వాటి సంఖ్య ఇంచుమించు 1,400కు చేరుతుంది. దీని ప్రకారం యూపీ స్థానాల సంఖ్య (ఉత్తరాఖండ్ కలుపు కొని) 85 నుంచి మూడురెట్లు పెరిగి 250కి చేరుతుంది. బిహార్‌కు (జార్ఖండ్ కలుపుకొని) ప్రస్తుతం ఉన్న 25 స్థానాలూ 82కు చేరుతాయి. తమిళనాడుకు దాదాపు రెట్టింపు సీట్లు పెరిగి 39 నుంచి 76 అవుతాయి. కేరళకు మాత్రం ప్రస్తుతం ఉన్న 20 కాస్తా 36 అవుతాయి. నియోజకవర్గానికి 20 లక్షల జనాభా ఉండాలనుకుంటే మొత్తం స్థానాలు 707 అవుతాయి. కానీ అలా జరిగితే తమిళనాడు స్థానాల సంఖ్య ఇప్పుడున్న మాదిరే ఉండిపోతుంది. కేరళ మాత్రం రెండు స్థానాలు కోల్పోతుంది. యూపీ మాత్రం 126కు చేరుతుంది. మన నూతన పార్లమెంటు భవనం 888 మంది ఎంపీలు ఆసీనులు కావటానికి వీలుగా నిర్మించారు. ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగకుండా, ఉన్న స్థానాలు కోల్పోకుండా పునర్విభజన ఉంటుందని అమిత్ షా చెప్పటం ఊరట కలిగిస్తుంది. కానీ జమ్మూ, కశ్మీర్లో జరిగిందేమిటి? అక్కడ అసెంబ్లీ స్థానాలు (లద్దాఖ్ మినహా) 83 నుంచి 90కి చేరు కున్నాయి. కొత్తగా పెరిగిన 7 స్థానాల్లో హిందువులు అధికంగా వున్న జమ్మూకు 6 వస్తే, ముస్లింల ప్రాబల్యంవున్న కశ్మీర్‌కు ఒక్కటి మాత్రమే పెరిగింది. అందుకే కేవలం అన్యాయం జరగదన్న హామీ మాత్రమే సరిపోదు. పునర్విభజన ప్రక్రియకు ఇక ఎంతో సమయం లేదు గనుక దానికి అనుసరించే ప్రాతిపదికలేమిటో తేటతెల్లం చేయటం అవసరం. అది చేయనంత కాలమూ సందేహాలు ఉత్పన్నమవుతూనే ఉంటాయి. వాటిని అబద్ధాలుగా కొట్టిపారేసినంత మాత్రాన సమసిపోవు. -
డీలిమిటేషన్‌తో ఒక్క సీటూ తగ్గదు
కోయంబత్తూరు: దామాషా విధానంలో చేపట్టే పునర్వ్యవస్థీకరణ వల్ల లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్య తగ్గదని హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. తమిళనాడుకే కాదు, ఏ ఒక్క దక్షిణాది రాష్ట్రానికి కూడా నష్టం జరగదని ఆయన కుండబద్దలు కొట్టారు. డీలిమిటేషన్ విషయంలో దక్షిణాది రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రధాని మోదీ వ్యవహరిస్తారని చెప్పారు. ఒక్క సీటు కూడా నష్టపోనివ్వరని మంత్రి హామీ ఇచ్చారు. పునర్వ్యవస్థీకరణ కారణంగా దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగదంటూ మోదీ ప్రభుత్వం ఇప్పటికే పార్లమెంట్లో ప్రకటించిందని ఆయన గుర్తు చేశారు. ఈ విషయంలో తమిళనాడు సీఎం స్టాలిన్ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. డీలిమిటేషన్ వల్ల తమిళనాడు లోక్‌సభ సీట్ల సంఖ్య 39 నుంచి 31కి తగ్గిపోతుందని సోమవారం సీఎం స్టాలిన్ వ్యాఖ్యానించడం, దీనిపై చర్చించేందుకు 5న అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేశామనడం తెల్సిందే. తమిళనాడుకు నిధుల మంజూరు విషయంలో కేంద్రం అన్యాయం చేస్తోందంటూ సీఎం ఎంకే స్టాలిన్ చేసిన ఆరోపణలను మంత్రి తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే స్టాలిన్ డీలిమిటేషన్‌తో నష్టం జరుగుతుందని చెబుతున్నారని ధ్వజమెత్తారు. బుధవారం అమిత్ షా కోయంబత్తూరులో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. తిరువణ్ణామలై, రామనా థపురంలలో పార్టీ కార్యాలయాలను వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా కా ర్యకర్తలు, ప్రజలనుద్దేశించి మంత్రి ప్రసంగించారు. దేశ వ్యతిరేక ధోరణి పెరిగిందిరాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటంలో విఫలమైందంటూ అధికార డీఎంకేపై అమిత్ షా విరుచుకుపడ్డారు. తమిళనాడులో జాతి వ్యతిరేక ధోరణి గరిష్ట స్థాయికి చేరుకుందంటూ వ్యాఖ్యానించారు. 1998 బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు, ప్రధాన సూత్రధారి ఎస్ఏ బాషా అంతిమ యాత్రకు తమిళనాడు ప్రభుత్వం భద్రత కల్పించిందని విమర్శించారు. ‘రాష్ట్రంలో డ్రగ్స్ విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. మైనింగ్ మాఫియానే ఇక్కడ రాజకీయాలను నడిపిస్తోంది. శాంతిభద్రతల పరిస్థితి అధ్వానంగా ఉన్న రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఉంది. అవినీతిలో డీఎంకే మంత్రులంతా మాస్టర్స్ డిగ్రీ చేశారు. డీఎంకే నేతలపై ఉద్యోగాలను అమ్ముకున్న కేసులు, మనీలాండరింగ్ ఆరోపణలు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు, రూ.6 వేల కోట్ల కుంభకోణం కేసులున్నాయి. వీటిన్నిటినీ చూస్తే అవినీతికి పాల్పడిన వారికే డీఎంకే సభ్యత్వం ఇచ్చినట్లుగా కనిపిస్తోంది’అని అమిత్ షా వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతుండగా వాటిని పరిష్కరించడం మానేసిన సీఎం, ఆయన కుమారుడు ఉదయనిధి వారి దృష్టిని మళ్లించేందుకు ఇతర అంశాలను తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు.నిధులపై వాస్తవ గణాంకాలివీ..కేంద్రం నుంచి అందిన నిధులపై చేతనైతే సీఎం స్టాలిన్ వాస్తవాలను వెల్లడించాలని అమిత్ షా సవాల్ విసిరారు. ‘మోదీ ప్రభుత్వ హయాంలో పదేళ్ల వ్యవధిలో తమిళనాడుకు రూ.5,08,337 లక్షల కోట్ల నిధులందాయి. వీటికి తోడు, మౌలిక వనరుల అభివృద్ధి కోసం మరో 1.43 లక్షల కోట్లను అందజేశాం. అదే, యూపీఏ హయాంలో 2004–14 సంవత్సరాల మధ్య కాలంలో తమిళనాడుకు కేవలం రూ.1.52 లక్షల కోట్లే దక్కాయి. అయితే, మోదీ ప్రభుత్వం అన్యాయం చేసిందని మీరంటున్నారు. వాస్తవానికి రాష్ట్రానికి యూపీఏ హయాంలో, అప్పటి ప్రభుత్వం మీరు కూడా భాగస్వాములుగా ఉండగానే అన్యాయం జరిగింది’అని షా చెప్పారు. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో విద్యార్థినులకు భద్రత కరువైందని ఆరోపించారు. అక్రమ సారాయి విక్రయాలను వ్యతిరేకించిన కాలేజీ విద్యార్థులు దారుణ హత్యకు గురవుతున్నారన్నారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులో ఎన్డీయే ఘన విజయం సాధిస్తుందని, మహారాష్ట్ర, హరియాణాల్లో బీజేపీ సాధించిన గెలుపు కంటే ఇది మిన్నగా ఉంటుందన్నారు. -
జగన్ ప్రాణాలకు ముప్పు కేంద్రానికి ఎంపీ సంచలన లేఖ
-
ప్రధాని, హోంమంత్రులకు వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి లేఖ
సాక్షి, ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు వైఎస్సార్సీపీ లోక్‌సభ పక్ష నేత మిథున్ రెడ్డి లేఖ రాశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్ జగన్‌కు రక్షణ కల్పించడంలో ఏపీ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని.. గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ పర్యటనకు వెళ్ళిన వైఎస్ జగన్‌కు పోలీసులు రక్షణ కల్పించలేదు. జగన్ పర్యటనలో తీవ్రమైన భద్రత వైఫల్యం తలెత్తింది’’ అని లేఖలో మిథున్‌రెడ్డి వివరించారు.జెడ్ ప్లస్ సెక్యూరిటీ కేటగిరిలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు వెంటనే కేంద్ర బలగాలతో రక్షణ కల్పించండి. ఇటీవల వైఎస్ జగన్ నివాసం వద్ద కొన్ని ఘటనలు జరిగాయి. ఇవి భారీ ఎత్తున పన్నిన కుట్రలో భాగంగా జరుగుతున్న ఘటనలు. వైఎస్ జగన్ ప్రాణాలకు ముప్పు తెచ్చే విధంగా భద్రత వైఫల్యం కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం విధానాల వల్ల మాజీ ముఖ్యమంత్రి ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. ప్రజాస్వామ్య విధానాలకు తూట్లు పొడిచేలా ప్రమాదకర ధోరణికి తెరలేపుతోంది’’ అని లేఖలో మిథున్‌రెడ్డి పేర్కొన్నారు.ఇదీ చదవండి: జనం గుండెల్లో జగన్.. కూటమి గుండెల్లో రైళ్లుకాగా.. మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ గుంటూరు పర్యటనలో అడుగడుగునా భద్రతా వైఫల్యం కనిపించింది. మాజీ సీఎం పర్యటనలో భద్రత కల్పనపై ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఈ వైఫల్యంపై వైఎస్సార్సీపీ నేతలు గురువారం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. -
అమిత్ షా కొడుకు పేరుతో వసూళ్లు.. మోసగాడి అరెస్ట్
డెహ్రాడూన్:కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు,ఐసీసీ ఛైర్మన్ జై షాపేరుతో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరాఖండ్‌కు చెందిన ప్రియాంషు పంత్ (19) జై షా పేరు చెప్పి ఇక్కడి ఎమ్మెల్యే ఆదేశ్ చౌహాన్‌కు ఫోన్ చేశాడు.తనను అమిత్ షా కుమారుడు జై షాగా పరిచయం చేసుకొని పార్టీ కోసం రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.అనుమానం వచ్చిన ఎమ్మెల్యే ప్రశ్నించగా తమ మధ్య జరిగిన సంభాషణను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు.దీంతో ఎమ్మెల్యే మోసగాడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాలింపు మొదలు పెట్టిన పోలీసులు మోసానికి పాల్పడుతున్న ప్రియాంశు పంత్‌ను ఢిల్లీలో అరెస్టు చేశారు. అయితే నిందితుడు మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కూడా జై షా పేరుతో ఫోన్ చేసి డబ్బులిస్తే మంత్రి పదవులు ఇప్పిస్తానని చెప్పినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.విలాసవంతమైన జీవితం గడిపేందుకే పంత్ ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడ్డట్టు పోలీసులు తెలిపారు. -
మేఘాలయలో కలుద్దాం!
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో అలరించిన జాతీయ క్రీడలు అట్టహాసంగా ముగిశాయి. తదుపరి మేఘాలయ జాతీయ క్రీడల ఆతిథ్యానికి సిద్ధం కానుంది. 2027లో అక్కడ 39వ నేషనల్ గేమ్స్ జరుగనున్నాయి. శుక్రవారం మేఘాలయ ముఖ్యమంత్రి కొంగ్‌కల్ సంగ్మా క్రీడాజ్యోతి అందుకోవడంతో దీనికి సంబంధించిన లాంఛన ప్రకియ కూడా ముగిసింది. 18 రోజుల పాటు విజయవంతంగా నిర్వహించిన తాజా జాతీయ క్రీడల్లో సర్వీసెస్ 121 పతకాలతో ఓవరాల్ చాంపియన్‌షిప్ గెలుచుకుంది. సర్వీసెస్ క్రీడాకారులు 68 స్వర్ణాలు, 26 రజతాలు, 27 కాంస్యాలు గెలిచారు. మహారాష్ట్ర అత్యధికంగా 198 పతకాలు గెలిచినప్పటికీ పసిడి వేట (54 స్వర్ణాలు)లో వెనుకబడిపోవడంతో రెండో స్థానంలో నిలిచింది. 71 రజతాలు, 73 కాంస్యాలు మరాఠా క్రీడాకారులు చేజిక్కించుకున్నారు. హరియాణా 153 పతకాలు (48 పసిడి, 47 రజతాలు, 58 కాంస్యాలు) మూడో స్థానంలో నిలువగా, ఆతిథ్య ఉత్తరాఖండ్ 24 స్వర్ణాలు, 35 రజతాలు, 44 కాంస్యాలతో మొత్తం 103 పతకాలు సాధించి ఏడో స్థానంలో నిలిచింది. తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ (14 పతకాలు) 18వ స్థానంలో, తెలంగాణ (18 పతకాలు) 26వ స్థానంలో నిలిచాయి. 2036 ఒలింపిక్స్‌కు సిద్ధం: అమిత్ షా జాతీయ క్రీడల ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విశ్వక్రీడల నిర్వహణకు భారత్ సిద్ధంగా ఉందని చెప్పారు. ‘క్రీడల్లో భారత్‌కు బంగారు భవిష్యత్తు ఉంది. 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చేందుకు రెడీగా ఉంది. ఉత్తరాఖండ్ అంటేనే దేవభూమిగా ప్రసిద్ధి. అయితే తాజా ఈవెంట్ నిర్వహణ ద్వారా ఖేల్ భూమి అయ్యింది. కేవలం క్రీడల నిర్వహణే కాదు. ఆటగాళ్లు రాటుదేలిన తీరు సాధించిన ప్రగతి రాష్ట్ర ప్రభుత్వం క్రీడారంగంలో చేసిన విశేష కృషికి నిదర్శనం. గత జాతీయ క్రీడల్లో ఉత్తరాఖండ్ 21వ స్థానంలో నిలిచింది. తాజా క్రీడల్లో ఏడో స్థానానికి ఎగబాకింది. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం వల్లే క్రీడారంగంలో ఆ రాష్ట్రం ఇంతలా ఎదిగింది. ఇదే జోరు ఇకమీదటా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నా’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి, కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ, భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలు పీటీ ఉష, మేఘాలయ ముఖ్యమంత్రి కొంగ్‌కల్ సంగ్మా తదితరులు పాల్గొన్నారు. పీటీ ఉష మాట్లాడుతూ ‘ఈ మహత్తర ప్రయాణం ఇక్కడితో ముగిసేది కాదు. ఎల్లప్పుడు దిగి్వజయంగా సాగేది. భారత క్రీడల ప్రగతిని చాటేది’ అని ఆమె కితాబిచ్చారు. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ ‘2036 విశ్వక్రీడల్లో టాప్–10లో నిలిచేందుకు ఇదొక గొప్ప ఆరంభం. దేశంలో క్రీడాసంస్కృతి పెరుగుతుందనడానికి ఇదో నిదర్శనం’ అని అన్నారు. -
ఢిల్లీ సీఎం ఎంపికలో సర్ప్రైజింగ్ నిర్ణయం!
దేశ రాజధాని రీజియన్‌లో దాదాపు.. మూడు దశాబ్దాల తర్వాత బీజేపీ అధికారం కైవసం చేసుకుంది. అయితే ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో తొందరపాటు పనికి రాదని భావిస్తోంది. ఇందుకు గత అనుభవాలతో పాటు ప్రస్తుత సామాజిక పరిస్థితులు కారణాలుగా తెలుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ ప్యాకేజీల సర్ప్రైజ్లను ఇవ్వబోతుందని సంకేతాలు అందుతున్నాయి.ఢిల్లీకి 1991లో పాక్షిక రాష్ట్ర హోదా దక్కింది. 1993లో జరిగిన ఢిల్లీ తొలి ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. అయితే.. ఐదేళ్ల కాలంలో రాజకీయ ఒత్తిళ్లు, ప్రజల అసంతృప్తి నడుమ ముగ్గురు ముఖ్యమంత్రులను(మదన్ లాల్ ఖురానా, షాహిబ్ సింగ్ వర్మ, సుష్మా స్వరాజ్) మార్చాల్సి వచ్చింది. ఆపై అధికారం కోసం మళ్లీ ఇన్నేళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది. ఈ తరుణంలో.. సుదీర్ఘ కాలం తర్వాత దక్కిన అధికారాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలనుకుంటోంది.సర్ప్రైజ్ తప్పదా?ఈ మధ్య గెలిచిన రాష్ట్రాల్లో సీఎం అభ్యర్థుల ఎంపిక విషయంలో బీజేపీ నిర్ణయాలు రాజకీయ వర్గాల అంచనాలను సైతం బోల్తా కొట్టించాయి. మధ్యప్రదేశ్‌కు మోహన్ యాదవ్, రాజస్థాన్‌కు భజన్ లాల్ శర్మ, ఛత్తీస్‌గఢ్‌కు విష్ణుదేవ్ సాయ్‌లను ఎంపిక చేయడమే ఇందుకు నిదర్శనం. ఇందులో.. రాజస్థాన్ విషయంలో ఏకంగా తొలిసారి ఎమ్మెల్యేగా నెగ్గిన భజన్ లాల్‌కు సీఎం పగ్గాలు ఇవ్వడం అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో ఢిల్లీ విషయంలోనూ ఇలాంటి సర్ప్రైజ్ నిర్ణయం వెలువడే అవకాశం లేకపోలేదు. అదే ఫార్ములా!ఢిల్లీ కోసం ఇద్దరు డిప్యూటీ సీఎంల ఫార్ములాను బీజేపీ తెరపైకి తెస్తోంది. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్‌లలో ఇదే పద్ధతిని అవలంభిస్తోంది. అలాగే.. ఢిల్లీని బీజేపీ మినీ ఇండియాగా భావిస్తోంది. బీజేపీ విజయంలో పంజాబీలు, సిక్కులు, పూర్వాంచలీస్, ఉత్తరాఖండీస్, వైశ్యాస్, జాట్.. ఇలా అన్ని వర్గాల ప్రజలు భాగమయ్యారని బీజేపీ భావిస్తోంది. కాబట్టి డిప్యూటీ సీఎంల ఎంపికలోనూ సామాజిక సమీకరణను ప్రముఖంగా పరిగణనలోకి తీసుకోవాలని భావిస్తోంది.రేసులో ఎవరంటే..ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేష్ వర్మ పేరు ఈ రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది. ఢిల్లీ బీజేపీ మాజీ ఛీప్‌లు విజేందర్ గుప్తా, సతీష్ ఉపాధ్యాయలతో పాటు సీనియర్ నేతలు మంజిదర్ సింగ్ సిర్సా, పవన్ శర్మ, అశిష్ సూద్ మహిళా నేతలు రేఖా గుప్తా, శిఖా రాయ్ పేర్లు ప్రస్తావనకు వస్తున్నాయి. ఇక.. కొత్తగా ఎమ్మెల్యేలుగా నెగ్గిన కర్ణెయిల్ సింగ్, రాజ్‌కుమార్ భాటియా పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే.. హ్యాట్రిక్ ఎంపీ మనోజ్ కుమార్ తివారీ(సింగర్), కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా పేరును సైతం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో జాతీయ నాయకత్వం ఇప్పటికే ఢిల్లీ బీజేపీ వర్గాలతో సంప్రదింపులు జరుపుతోంది. సీఎం రేసుతో పాటు కేబినెట్ కోసం పలువురి పేర్లతో కూడిన జాబితాను పరిశీలిస్తోంది. అవినీతి ప్రభుత్వంగా పేర్కొంటూ ఆప్‌ను బీజేపీ గద్దె దించింది. ఈ క్రమంలో సీఎం అభ్యర్థి విషయంలో కుల సమీకరణాలతో పాటు ‘క్లీన్ ఇమేజ్’ను పరిగణనలోకి తీసుకుంటోందని సమాచారం. ప్రస్తుతం బీజేపీ అగ్రనేత, ప్రధాని మోదీ విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన తిరిగి రాగానే బీజేపీ అగ్రనేతలతో సమావేశమై ఈ అంశంపై చర్చించనున్నారు. అలాగే.. సోమ, లేదంటే మంగళవారాల్లో బీజేఎల్పీ సమావేశం జరగనుంది. ఆ భేటీ తర్వాత సీఎం ఎవరనేదానిపై స్పష్టమైన ప్రకటన వెలుడే అవకాశం ఉంది. ఈ నెల 19 లేదంటే 20వ తేదీ ఢిల్లీ నూతన సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగే అవకాశాలు ఉన్నాయన్నది తాజా సమాచారం. -
ఢిల్లీ సీఎంపై జోరుగా కసరత్తు
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ దంగల్‌లో ఆప్‌ను చిత్తు చేసిన బీజేపీ నూతన ముఖ్యమంత్రి ఎంపికపై కసరత్తు ముమ్మరం చేసింది. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. కొత్త సీఎం ఎంపికపై వారిద్దరూ చర్చించారు. ముఖ్యమంత్రి రేసులో పర్వేశ్ వర్మ ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది. సతీశ్ ఉపాధ్యాయ, విజేందర్ గుప్తా, ఆశిష్ సూద్, పవన్ శర్మతో పాటు పార్టీ ఎంపీ మనోజ్ తివారీ పేరు కూడా చక్కర్లు కొడుతోంది. జాట్ నేత అయిన పర్వేశ్ ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించి సంచలనం సృష్టించడం తెలిసిందే. ఆయనే సీఎం అవుతారని ప్రచారం జరుగుతున్నా రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా మాదిరిగా కమలనాథులు అనూహ్య నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యం లేదంటున్నారు. పూర్వాంచల్ నేపథ్యమున్న నేతను, లేదా మహిళను, లేదంటే సిక్కు వర్గం నాయకుడిని సీఎం ఎలా చేస్తే ఎలా ఉంటుందన్న దానిపైనా బీజేపీ పెద్దలు సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణాలు, భవిష్యత్తు అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లో పెద్దగా పేరు ప్రఖ్యాతుల్లేని నేతలను ముఖ్యమంత్రులుగా బీజేపీ నియమించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఏం చేస్తారన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. కొత్త సీఎం ఎంపికపై తుది నిర్ణయం అధిష్టానానిదేనని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా పునరుద్ఘాటించారు. తమ కొత్త ఎమ్మెల్యేలందరికీ సీఎంగా రాణించగల సత్తా ఉందన్నారు. అతిశీ రాజీనామా ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీ రాజీనామా చేశారు. ఆదివారం లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె.సక్సేనాకు రాజీనామా లేఖ సమర్పించారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరేదాకా కొనసాగాలని ఆయన కోరారు. మరోవైపు ఫలితాల నేపథ్యంలో ఢిల్లీ అసెంబ్లీని ఎల్జీ రద్దు చేశారు. ఈ నిర్ణయం శనివారం నుంచే అమల్లోకి వచి్చంది. అతిశీ గతేడాది సెపె్టంబర్లో అరవింద్ కేజ్రీవాల్ రాజీనామాతో సీఎంగా ఆతిశీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం తెలిసిందే. తాజా ఫలితాల్లో కేజ్రీవాల్ ఓడినా ఆమె మాత్రం నెగ్గారు. పథకాలను బీజేపీ ఆపకుండా చూస్తాం: ఆప్22 మంది ఆప్ కొత్త ఎమ్మెల్యేలతో పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం సమావేశమయ్యారు. ప్రజల కోసం పనిచేయాలని, వారి సమస్యలను పరిష్కరించాలని వారిని కోరారు. తమ పార్టీ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని అనంతరం ఆతిశీ మీడియాకు చెప్పారు. ‘‘మార్చి 8 నుంచి మహిళలకు బీజేపీ నెలకు రూ.2,500 కచ్చితంగా ఇవ్వాలి. ప్రజలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్తు, ఇతర సౌకర్యాలు కల్పించాలి. పదేళ్లుగా ఆప్ అమలు చేసిన ఉచిత సేవలు, పథకాలను నిలిపేయకుండా మేం చూస్తాం’’ అన్నారు.మోదీ అమెరికా నుంచి తిరిగి వచ్చాకే! ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్, అమెరికా దేశాల్లో పర్యటించనున్నారు. 13వ తేదీన ఆయన తిరిగొస్తారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారం ఆ తర్వాతే జరిగే అవకాశముందని బీజేపీ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. సీఎం ఎంపిక కూడా మోదీ వచ్చాకే జరగవచ్చని తెలిపాయి. -
ఎరుపెక్కిన ఇంద్రావతి!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/చర్ల: ఛత్తీస్‌గఢ్ అడవులు మరోసారి ఎరుపెక్కాయి. అక్కడి ఇంద్రావతి నేషనల్ పార్క్‌లో ఆదివారం ఉదయం జరిగిన భారీ ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టులు మరణించారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు కూడా చనిపోగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. చనిపోయిన మావోయిస్టుల వివరాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ఐజీ సుందర్రాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇంద్రావతి నేషనల్ పార్కులో మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ, ఇంద్రావతి ఏరియా కమిటీలు ఒకేచోట సంచరిస్తున్నట్టుగా పోలీసులకు సమాచారం అందింది. దీనితో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్, బస్తర్ ఫైటర్స్, స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌లకు చెందిన జవాన్లు కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం 8 గంటలకు బలగాలు, మావోయిస్టులు ఎదురుపడటంతో ఎన్కౌంటర్ జరిగింది. అనంతరం ఘటనా స్థలంలో 31 మంది మావోయిస్టుల మృతదేహాలు లభించాయి. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు చనిపోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ప్రత్యేక హెలికాప్టర్లో రాయ్‌పూర్ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలం నుంచి ఏకే 47, ఇన్సాస్, ఎస్ఎల్ఆర్ రైఫిళ్లను, పేలుడు పదార్థాలను భద్రతా దళాలు స్వా«దీనం చేసుకున్నాయి. మృతుల్లో తెలంగాణ నేతలు? ఛత్తీస్‌గఢ్ – మహారాష్ట్ర సరిహద్దుల్లోని ఇంద్రావతి నేషనల్ పార్కులో మావోయిస్టు తెలంగాణ స్టేట్ కమిటీ షెల్టర్ తీసుకోగా, ఇంద్రావతి ఏరియా కమిటీ రక్షణగా ఉందని పోలీసులకు సమాచారం అందింది. దీనితో వివిధ భద్రతా దళాలకు చెందిన 650 మందికిపైగా జవాన్లు వేర్వేరు దిశల నుంచి శుక్రవారం రాత్రి కూంబింగ్ చేపట్టారు. శనివారం రాత్రికల్లా మావోయిస్టులు బస ప్రదేశాన్ని భద్రతా దళాలు చుట్టుముట్టాయి. ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో బలగాలను గమనించిన మావోయిస్టులు కాల్పులు జరపడంతో జవాన్లు ఎదురుకాల్పులు ప్రారంభించారు. ఎన్కౌంటర్ మృతుల్లో ఎక్కువ మంది జనమిలీషియా సభ్యులే ఉన్నట్టు సమాచారం. వారితోపాటు తెలంగాణ కమిటీకి చెందిన కీలక నేత కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. మృతదేహాల గుర్తింపు ప్రక్రియ మొదలైతే ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశముంది. టార్గెట్ చేసి.. రెండో సారి.. భద్రతా దళాలు కొన్ని నెలలుగా మావోయిస్టు తెలంగాణ కమిటీ టార్గెట్‌గా పనిచేస్తున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణ– ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని పూజారీ కాంకేర్ అడవులను జల్లెడపట్టడం మొదలుపెట్టాయి. ఈ క్రమంలో జనవరి 16న జరిగిన ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు చనిపోగా.. మిగిలినవారు తప్పించుకున్నారు. ఆ ఘటనలో తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి దామోదర్ అలియాస్ బడే చొక్కారావు మృతి చెందినట్టు ప్రచారం జరిగింది. కానీ దామోదర్ సురక్షితంగానే ఉన్నారని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఈ క్రమంలో రెండోసారి తెలంగాణ కమిటీ లక్ష్యంగా ఇంద్రావతి నేషనల్ పార్క్‌లో భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. దండకారణ్యంపై భద్రతా దళాల పట్టు మావోయిస్టులు స్థాపించిన జనతన సర్కారుకు దండకారణ్యమే కేంద్ర బిందువుగా నిలిచింది. కానీ గడిచిన ఏడాదిలో భద్రతా బలగాలు దండకారణ్యాన్ని క్రమంగా తమ ఆ«దీనంలోకి తెచ్చుకుంటున్నాయి. గత ఏడాది చివరిలో కొండపల్లిలో భద్రతా దళాల క్యాంపు ఏర్పాటైన తర్వాత.. దండకారణ్యం తమకు సురక్షితం కాదని మావోయిస్టులు నిర్ణయానికి వచ్చారు. అక్కడున్న వివిధ కమిటీలు, దళాలకు చెందిన కీలక నేతలు సమీపంలో ఉన్న టైగర్ రిజర్వ్ ఫారెస్టులకు తరలివెళ్లినట్టు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. టైగర్ రిజర్వ్‌లపై ఫోకస్ ఇంద్రావతి నేషనల్ పార్క్ 2,779 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంది. దీన్ని 1983లో టైగర్ రిజర్వ్‌గా ప్రకటించారు. మావోయిస్టుల అడ్డాలైన అబూజ్మడ్, దండకారణ్యం మధ్య ఈ అడవి వారధిగా నిలిచింది. ఇందులో సగానికిపైగా మావోయిస్టుల ఆ«దీనంలోనే ఉంది. ఫారెస్టు గార్డులు కూడా అక్కడ కాలు పెట్టలేని పరిస్థితి ఉందని అంటారు. ఇలా టైగర్ రిజర్వులలో షెల్టర్ తీసుకుంటున్న మావోయిస్టులపై కొన్నేళ్లుగా భద్రతా దళాలు ఫోకస్ చేశాయి. ఇంతకుముందు ఉదంతి – సీతానది టైగర్ రిజర్వ్‌లో భాగంగా ఉన్న ఘరియాబండ్ అడవుల్లో జనవరి 24న జరిగిన ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి సహా 16 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇప్పుడు ఇంద్రావతి రిజర్వు ఫారెస్ట్‌లో ఏకంగా 31 మంది మృతి చెందారు. గడువు కంటే ముందే మావోయిస్టుల అంతం: అమిత్షామావోయిస్టు ముక్త భారత్ లక్ష్యంగా సాగుతున్న ఆపరేషన్‌కు ‘ఇంద్రావతి’తో భారీ విజయం దక్కిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. గడువుగా పెట్టుకున్న 2026 మార్చి కంటే ముందే దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామన్నారు. ఎన్కౌంటర్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు దేశం రుణపడి ఉంటుందని చెప్పారు. ఆ జవాన్ల కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న భద్రతా దళాలకు ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్‌సాయ్ అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ వల్లే యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ వేగంగా జరుగుతున్నాయన్నారు.40 రోజుల్లో 81 మంది మృతిఛత్తీస్గఢ్లో ఈ ఏడాది మొదలైన 40 రోజుల్లో 81 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లలో చనిపోయారు. అందులో 65 మంది బస్తర్‌లో జరిగిన ఘటనల్లో కన్నుమూశారు. గతేడాది ఛత్తీస్‌గఢ్‌లో 217 మంది మావోయిస్టులు చనిపోయినట్టు పోలీసులు తెలిపారు. -
భారీ ఎన్‌కౌంటర్‌పై అమిత్ షా కీలక ప్రకటన
న్యూఢిల్లీ:ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్ జిల్లాలో ఆదివారం(ఫిబ్రవరి 9) జరిగిన భారీ ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టులు మరణించారు.ఈ ఎన్‌కౌంటర్‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎక్స్(ట్విటర్)లో స్పందించారు. దేశాన్ని నక్సల్స్ రహితంగా మార్చే క్రమంలో భద్రతాదళాలు భారీ విజయాన్ని సాధించాయన్నారు. వచ్చే ఏడాది మార్చినాటికి నక్సలిజాన్ని పూర్తిగా రూపుమాపుతామని తెలిపారు.‘ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పుల్లో 31 మంది మావోయిస్టులను భద్రతాబలగాలు మట్టుబెట్టాయి. ఈ ఆపరేషన్లోనే పెద్దఎత్తున ఆయుధాలు,మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. నక్సలిజాన్ని అంతం చేసే క్రమంలో ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు జవాన్లనూ కోల్పోయాం.ఆ అమరవీరులకు దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది. 2026 మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తాం’ అని అమిత్ షా పేర్కొన్నారు. -
మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ రాజీనామా
ఇంఫాల్ : ఈశాన్య రాష్ట్రాల్లో రత్నాల భూమిగా, సిట్జర్లాండ్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన మణిపూర్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మణిపూర్ సీఎం ఎన్ బీరెన్ సింగ్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్‌కు బీరెన్ సింగ్ సమర్పించారు. మణిపూర్ అల్లల్లు. రెండు జాతుల మధ్య రేగిన వైరం. ఎంతటి హింసకు దారి తీసిందో అంతా చూశాం. ఇప్పటికీ ఇదే విషయంలో మణిపూర్ రగులుతూనే ఉంది. ఈ హింసకు మూల కారణమైన కుకీ, మైతేయ్ తెగల మధ్య వైరం ఇప్పుడు యావత్ ప్రపంచం దృష్టి నిలిపేలా చేసింది. అయితే, ఈ అల్లర్ల వెనుక సీఎం బీరేన్ సింగ్ ఉన్నారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ తరుణంలో ఇటీవల బీరేన్ సింగ్.. హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు. భేటీ అనంతరం, కొద్ది సేపటి క్రితం బీరేన్ సింగ్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనా చేశారు. -
కయ్యాలతో కాలం గడిపిన ఆప్
న్యూఢిల్లీ: దేశంలో గత పదేళ్లలో డబుల్ ఇంజిన్ బీజేపీ ప్రభుత్వమున్న కొన్ని రాష్ట్రాలు అభివృద్ధి బాటలో ముందుకు సాగుతుండగా, కేంద్ర ప్రభుత్వంతో ఆప్ కయ్యాలు పెట్టుకుంటూ ఢిల్లీని వెనుకబాటుకు గురి చేసిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. జంగ్పురలో సోమవారం జరిగిన బీజేపీ ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు. ఆప్ చీఫ్ కేజ్రీవాల్, ఆ పార్టీ నేత మనీశ్ సిసోడియా బడే మియా–చోటే మియా మాదిరిగా ఢిల్లీని దోచుకున్నారంటూ ఎద్దేవా చేశారు. మద్యం కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవించిన ఏకైక విద్యావంతుడు ఈయన మాత్రమేనంటూ సిసోడియానుద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. తరగతిగదుల పేరుతో కుంభకోణానికి పాల్పడిన సిసోడియా ఢిల్లీ చిన్నారుల భవిష్యత్తును నాశనం చేశారన్నారు. అబద్ధాలతో మభ్యపెడుతున్న కేజ్రీవాల్.. చెత్తాచెదారం, విష జలం, అవినీతిని మాత్రమే ఢిల్లీ ప్రజలకిచ్చారన్నారు. ఆప్ తరఫున ఎన్నికైన వారిలో ప్రస్తుతం సగం మంది మాత్రమే మిగిలి ఉన్నారని, ఆ పార్టీ మునిగిపోయే ఓడ అని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిగా ఢిల్లీ మార్చే సత్తా ఉన్న ఏకైక పార్టీ బీజేపీయేనని చెప్పారు. -
చేజారుతున్న కర్రిగుట్టలు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఆపరేషన్ కగార్ ఫలితంగా.. దండకారణ్యంలో తమకు పట్టున్న ఒక్కొక్క ప్రాంతాన్ని మావోయిస్టులు (Maoists) కోల్పోతున్నారు. ఈనెల 16న జరిగిన ఎన్‌కౌంటర్‌తో తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రిగుట్టలు ప్రాంతం సైతం మావోయిస్టుల చేజారిపోతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.జాయింట్ టాస్క్ ఫోర్స్ ..కర్రిగుట్టలు కేంద్రంగా మావోయిస్టులు తెలంగాణలో మళ్లీ ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ గతేడాది జూలై 4న సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) కేంద్ర హోంమంత్రి అమిత్‌షా (Amit Shah) దృష్టికి తీసుకెళ్లారు. మావోయిస్టుల దూకుడుకు అడ్డుకట్ట వేసేలా.. ఈ గుట్టలకు సరిహద్దుగా ఉన్న ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాక, భద్రాద్రి జిల్లా చర్ల మండలం కొండవాయిలో సీఆర్పీఎఫ్ (CRPF) జాయింట్ టాస్క్ ఫోర్స్ క్యాంపులు ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం జూలై 19న కర్రిగుట్టల్లోకి స్పెషల్ పార్టీ పోలీసులు కూంబింగ్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు చనిపోగా.. మిగిలిన దళ సభ్యులు తప్పించుకున్నారు. దీంతో గాలింపు ఉధృతం చేసే లక్ష్యంతో అదనపు బలగాలు ఈ గుట్టల్లోకి వెళ్లాయి. ఆ సమయాన వర్షాల కారణంగా పొంగిన వాగులు, వంకలతో స్పెషల్ పార్టీ పోలీసులంతా అడవిలో చిక్కుకుపోయారు. వీరికి వాయుమార్గంలో సాయమందించడం వీలు పడలేదు. దీంతో ప్రతికూల పరిస్థితుల నడుమ సుమారు 60 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ తెలంగాణ సరిహద్దుకు.. తెలంగాణ పోలీసులు చేరుకోగా.. చివరకు వారిని హెలీకాప్టర్ సాయంతో కాపాడారు.కర్రిగుట్టల్లో భద్రతా దళాలు కర్రిగుట్టల్లో ఛత్తీస్‌గఢ్ వైపు పూజారి కాంకేర్ – మారేడుబాక అటవీ ప్రాంతంలోని మావోయిస్టులు, భద్రతా దళాల నడుమ ఈనెల 16న ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో అధికారిక లెక్కల ప్రకారం 12 మంది మావోయిస్టులు చనిపోగా.. మిగిలిన వారు తప్పించుకుని సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. ప్రస్తుతం కర్రిగుట్టల్లో సుమారు రెండు వేల మందికి పైగా సంయుక్త భద్రతా దళాల జవాన్లు కూంబింగ్ చేస్తూ.. ఈ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తెచ్చుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. వచ్చే వేసవి చివరి నాటికి ఈ ప్రాంతంలో మావోయిస్టుల ఉనికి నామమాత్రం చేయాలని భద్రతా దళాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇప్పటికే ఈ దాడిలో మావోయిస్టుల ఆయుధాల తయారీ కేంద్రాన్ని భద్రతా దళాలు కనుగొన్నాయి. అయితే, ఇప్పటికీ మావోయిస్టు శిబిరాలు భద్రతా దళాలకు చిక్కకపోవడం.. ఈ గుట్టల్లో నెలకొన్న సంక్లిష్టతను చెబుతోంది.మావోయిస్టుల అడ్డా బస్తర్ దేశంలోనే మావోయిస్టులకు బస్తర్ ప్రాంతం అడ్డాగా ఉంది. ఇక్కడి నుంచే బస్తరేతర ప్రాంతాలకు చెందిన వివిధ రాష్ట్ర, డివిజన్, ఏరియా కమిటీలు పని చేస్తున్నట్టు సమాచారం. బస్తర్‌కు చెందిన కీలక కమిటీలైన దండకారణ్య స్పెషల్ జోనల్, దక్షిణ బస్తర్ జోన్ వంటి కమిటీలు సంచరిస్తూ పని చేస్తుంటాయి. కానీ, బస్తర్ బయటి ప్రాంతాలకు చెందిన కమిటీలు ఎక్కువగా శిబిరాల్లోనే షెల్టర్ తీసుకుంటాయి. ఈ కమిటీలకు చెందిన వివిధ దళాలు.. అప్పుడప్పుడు తమ సంబంధిత ప్రాంతాలకు వెళ్లి తిరిగి షెల్టర్ జోన్లకు చేరుకుంటున్నా యి. అందులో భాగంగానే తెలంగాణతో పాటు ఇతర డివిజన్, ఏరియా కమిటీలు కర్రిగుట్టలు కేంద్రంగా షెల్టర్ తీసుకున్నట్టు తెలుస్తోంది. పాల్వంచ – మణుగూరు, ఏటూరునాగారం – మహదేవపూర్ ఏరియా కమిటీల సభ్యులు కర్రిగుట్టల నుంచి తెలంగాణకు వచ్చి గతేడాది జరిగిన ఎన్కౌంటర్లలో 15 మంది చనిపోయారు.రాష్ట్రాలకు సహజ సరిహద్దుగా..తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు సహజ సరిహద్దుగా కర్రిగుట్టలు ఉన్నాయి. మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దులో.. ఇంద్రావతి నది గోదావరిలో కలిసే చోటునుంచి ప్రారంభమయ్యే కర్రిగుట్టలు.. చర్ల మండలంలో తాలిపేరు వాగు గోదావరిలో కలిసే వరకు ఇంచుమించు 100 కిలోమీటర్ల పొడవుతో వ్యాపించి ఉంటాయి.చదవండి: వరుస ఎదురుదెబ్బలు.. మావోయిస్టుల సంచలన నిర్ణయం గుట్టలకు ఆవలి వైపు బీజాపూర్ జిల్లా ఉండగా.. తెలంగాణ వైపు ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం మండలాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో కొద్ది భాగం ఉంటాయి. ఈ గుట్టల మధ్య పుష్కలమైన జలవనరులు ఉన్నాయి. దీంతో ఏళ్ల తరబడి ఈ ప్రాంతం మావోయిస్టులకు షెల్టర్ జోన్‌గా ఉపయోగపడుతోంది. తెలంగాణలో పట్టు కోసం మావోయిస్టులు ఇక్కడి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు. -
‘కేజ్రీవాల్.. ఆ విషం పేరేంటో చెప్పు’
ఢిల్లీ : అసెంబ్లీ ఎన్నికల తరుణంలో యమునా (yamuna) నదిపై రాజకీయ రంగు పులుముకుంది. ఢిల్లీకి జీవనాడి యమునాపై బీజేపీ (bjp) విషం కక్కుతోందంటూ ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (arvind kejriwal) వ్యాఖ్యలపై కేంద్ర హోమంత్రి అమిత్‌షా ఎదురుదాడికి దిగారు. కేజ్రీవాల్ చిల్లర రాజకీయాలు చేసే బదులు ఆ విషం పేరేంటే బయట పెట్టాలని సూచించారు. గురువారం రోహిణిలో బీజేపీ ఎన్నికల ర్యాలీ నిర్వహించింది.ఈ ర్యాలీలో అమిత్ షా మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో ఓటమి ఖాయమని కేజ్రీవాల్‌కు అర్ధమైంది. అందుకే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే యమునా వాటర్‌లో విషం కలిపారని ఆరోపిస్తున్నారు. యమునా నదిలో విషం ఉందన్న ల్యాబ్ రిపోర్టును విడుదల చేయాలి. అబద్ధాల పుట్టఎన్నికల్లో గెలవాలంటే అబద్ధాలు చెప్పడం మానేయమని కేజ్రీవాల్‌కు చెప్పాలనుకుంటున్నాను. ఢిల్లీ ప్రజలను ఇబ్బంది పెట్టేందుకు హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం యమునా నీళ్లలో విషం కలిపిందని అంటున్నారు. యమునాలో విషం కలిపితే ఏ విషం కలిపారు? విషయం ఉన్నట్లు లేబొరేటరీలో గుర్తించారు. అంతేకాదు, ఆప్ ప్రభుత్వం మద్యం దుకాణాలను మూసివేస్తామని హామీ ఇచ్చిందని, బదులుగా ఆలయాలు,స్కూల్ పరిసర ప్రాంతాల్లో తెరిచారు. కోట్ల విలువైన మద్యం కుంభకోణంలో జైలు పాలయ్యారు’ అని అమిత్ షా ఆరోపించారు.తనను తాను నిజాయితీ పరుడినని చెప్పుకుని తిరిగే కేజ్రీవాల్ మద్యం కుంభకోణం, జల్ బోర్డులో రూ. 28400 కోట్ల కుంభకోణం, రేషన్ పంపిణీలో రూ. 5,400 కోట్ల కుంభకోణంలో ప్రమేయం ఉందన్నారు. -
యమున నీటిని తాగే దమ్ముందా?
న్యూఢిల్లీ: యమునా నది నీరు విషపూరితంగా మారుతున్న సంగతి నిజమేనని, ఈ నీటిలో అమ్మోనియం స్థాయి ఇటీవల విపరీతంగా పెరుగుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వినర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. ఢిల్లీలోని నీటి శుద్ధి కేంద్రాలు సక్రమంగా పనిచేయకుండా కొందరు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. నది నీటిలో అమ్మోనియా స్థాయి 7 పీపీఎం ఉందన్నారు. ఇది కచ్చితంగా విషంతో సమానమేనని అన్నారు. కేజ్రీవాల్ బుధవారం మీడియాతో మాట్లాడారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీలకు యమునా నది నీటిని ప్రజల సమక్షంలో బహిరంగంగా తాగే దమ్ముందా? అని సవాలు విసిరారు. ఎగువ రాష్ట్రంలో హరియాణాలో ఈ నదిలో విషపదార్థాలు కలుస్తున్నాయని మరోసారి ఆరోపించారు. అక్కడి బీజేపీ ప్రభుత్వం నదిని విషతుల్యం చేస్తోందన్నారు. కేజ్రీవాల్‌కు హరియాణా కోర్టు సమన్లుయమున నదిలో విషం కలుపుతున్నారంటూ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై హరియాణా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హరియాణా ప్రభుత్వంపై ఆయన చేసిన ఆరోపణలను తప్పుపట్టింది. ఫిబ్రవరి 17వ తేదీన తమ ఎదుట హాజరు కావాలని ఆదేశిస్తూ బుధవారం కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసింది. ఆరోపణలపై వివరణ ఇవ్వాలని పేర్కొంది. యమునా నదిని హరియాణా ప్రభుత్వం విషతుల్యం చేస్తున్నట్లు ఆధారమేంటో చెప్పాలని, నివేదిక సమర్పించాలని స్పష్టంచేసింది. -
కుంభమేళా తొక్కిసలాట ఘటన.. యోగికి మోదీ, అమిత్ షా కాల్
-
అలిగిన లోకేష్..!సన్నిహితుల వద్ద తీవ్ర ఆవేదన
సాక్షి,విజయవాడ:డిప్యూటీ సీఎం పదవి రాకపోవడంతో మంత్రి నారా లోకేష్ అలకబూనినట్లు ప్రచారం జరుగుతోంది. లోకేష్ డిప్యూటీ సీఎం ఆశలపై బీజేపీ అగ్రనేత,కేంద్ర హెం మంత్రి అమిత్‌షా నీళ్లు చల్లినట్లు తెలుస్తోంది. తనను డిప్యూటీ సీఎం చేయడానికి అమిత్ షా ఒప్పుకోలేదని లోకేష్ సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. లోకేష్,పవన్‌కల్యాణ్ మధ్య జరిగిన పోరులో లోకేష్ పరాజయం పాలయ్యారని కూటమి వర్గాలు అంతర్గతంగా చర్చించుకుంటున్నాయి. ఇందుకే లోకేష్ అలిగి పార్టీ పదవి వదులుకున్నట్లు చెబుతున్నారు. చంద్రబాబునే టార్గెట్ చేసి లోకేష్ పార్టీ పదవిని వదులుకున్నట్లు తెలుస్తోంది.లోకేష్ ప్రభుత్వంలో పార్టీలో సూపర్‌పవర్‌గా ఉండాలని చంద్రబాబు భావించారు. అయితే తమ ప్లాన్ పారకపోవడంతో వారు తీవ్ర ఆవేదన చెందుతున్నట్లు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇటీవల దావోస్ పర్యటనలోనూ చంద్రబాబు లోకేష్‌ను ఆకాశానికెత్తిన విషయం తెలిసిందే.కాగా, ఇటీవల లోకేష్‌ను సీఎం చేయాలంటూ టీడీపీలో సీనియర్లతో పాటు ముఖ్యనేతలంతా ప్రెస్మీట్లు పెట్టి మరీ డిమాండ్ చేశారు. లోకేష్ యువగళం వల్లే పార్టీ అధికారంలోకి వచ్చిందని పొగడ్తలు కురిపించారు. వీటికి కౌంటర్‌గా అటు జనసేన నేతలు తమ నేత పవన్‌కల్యాణ్‌ను సీఎం చేయాలని మాట్లాడే దాకా వెళ్లారు.దీంతో కూటమిలో టీడీపీ, జనసేనల మధ్య లోకేష్ డిప్యూటీ సీఎం అంశం చిచ్చుపెట్టేదాకా వెళ్లింది. చివరికి అమిత్‌షా మోకలడ్డడంతో లోకేష్‌కు అసంతృప్తి మిగిలి పవన్‌దే పైచేయి అయిందన్న ప్రచారం జరుగుతోంది. -
Delhi Elections: 7 రోజులు.. 100 సమావేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అధికారపీఠంపై ఇరవై ఆరేళ్ల తర్వాత పార్టీ జెండా ఎగురవేయాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. చివరి నిమిషంలో తన ప్రచారాన్ని హోరెత్తించేలా ప్రణాళికలు రచించింది. వచ్చే వారం రోజుల పాటు బూత్ స్థాయి వరకు పార్టీ హామీలపై ప్రచారం జరిగేలా పార్టీ జాతీయ స్థాయి నేతల నుంచి పార్టీ విస్తారక్ల వరకు అందరినీ కదనరంగంలోకి దించనుంది. 29 నుంచి ప్రధాని మోదీ తన ప్రచారాన్ని మొదలుపెట్టనున్నారు. బీజేపీపాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేంతా నియోజకవర్గాల వారీగా ప్రచార బాధ్యతలు అప్పగించారు. ఈ నియోజకవర్గాల్లో 100కు పైగా సమావేశాలు, ర్యాలీల్లో భాగస్వాములు కానున్నారు. అసెంబ్లీకి 20వేల ఓట్లు అదనం గడిచిన 2015 అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లలో బీజేపీ 32 శాతం ఓట్లను సాధించింది. మొత్తం 70 స్థానాలకు గానూ కేవలం మూడు చోట్ల నెగ్గింది. 2020 ఎన్నికల్లో 38.51 శాతం ఓట్లతో 8 సీట్లు సాధించింది. ఈ సారి కనీసంగా 50 శాతం ఓట్లు సాధించాలనే లక్ష్యంగా ముందుకెళుతోంది. గతంలో గెలిచిన స్థానాలతో పాటు పోటీ చేసిన అన్ని స్థానాల్లో గతంలో వచ్చిన ఓట్ల కన్నా కనీసంగా 20 వేల ఓట్లు అధికంగా సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీని కోసం ప్రతి బూత్ స్థాయిలో పోలయ్యే ఓట్లలో 50శాతం ఓట్లు సాధించేలా మైక్రో మేనేజ్మెంట్ వ్యూహాన్ని అమలు చేస్తోంది. కొన్ని నెలలుగా బీజేపీ ఓటర్ల జాబితాలను బూత్‌ల వారీగా తెప్పించి బీజేపీ అనుకూల, ప్రతికూల, స్ధిరమైన ఓటర్లను గుర్తించింది. ఢిల్లీలో అందుబాటులో లేని ఓటర్లను వివిధ మార్గాల ద్వారా సంప్రదింపుల ప్రక్రియ పూర్తి చేసింది. ప్రతి బూత్‌లోని ఓటర్ల సామాజిక ప్రొఫైల్‌లను గుర్తించి స్థానిక పార్టీ నేతలు, సామాజికవర్గ నేతలను రంగంలోకి దించి వారికి దగ్గరయ్యే ప్రయత్నాలు చేసింది. ఢిల్లీలోని వివిధ ప్రాంతాలకు బీజేపీ క్లస్టర్లను ఏర్పాటు చేసి ప్రతి క్లస్టర్‌కు ఒక్కో ముఖ్య నేతను ఇంచార్జ్‌గా నియమించింది. మురికివాడలు, అనధికార కాలనీలతోపాటు వీధి వ్యాపారులనూ ఆకట్టుకునే పనిలో పడ్డారు. ఇందుకు ఆర్ఎస్ఎస్ నేతలు కూడా సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర రాష్ట్రాలవాసులు ఎక్కువ మంది ఉండే ప్రాంతాల్లో ఆ రాష్ట్రాలకు చెందిన నేతలనే ఇంఛార్జిలుగా నియమించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలు సుమా రు 3లక్షల మంది ఉన్నారు. వీళ్లు అత్యధికంగా ఉండే ఆర్కేపురం, పాండవ నగర్, కరోల్‌భాగ్ ప్రాంతాలకు రాష్ట్రానికి చెందిన ఎంపీలు ధర్మపురి అరవింద్, డీకే అరుణ వంటి నేతలకు ప్రచార బాధ్యతలు కట్టబెట్టారు. ఉత్తర ప్రదేశ్, బిహార్, ఉత్తరాఖండ్, పంజాబ్ ప్రజలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఆయా రాష్ట్రాల మంత్రులు, ఎంపీలు పనిచేస్తున్నా రు. ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో విస్తృతంగా ప ర్యటిస్తూ స్థానిక మోర్చాలను కలుసుకోవడం, స మావేశాలను నిర్వహించడం, పథకాలపై అవగాహ న కల్పించడం వంటివి చేస్తున్నారు. కేంద్రం తెచ్చిన బేటీ బచావో– బేటీ పఢావో ప్రచారంతో పాటు, జన్‌ధన్ ఖాతా, ఉజ్వల గ్యాస్ పథకం, ఉచిత గృహాలు, మరుగుదొడ్లు, ముస్లిం మహిళలకు ట్రిపుల్ తలాక్ నుండి స్వేచ్ఛ, స్వయం సహాయక సంఘాలకు రుణాలు, మహిళా రిజర్వేషన్లు, హిందూ ఆలయాల పునరి్నర్మాణం వంటి అనేక పథకాలపై అవగాహన కల్పించే పనిని అప్పగించారు. ముఖ్యంగా యువ ఓటర్లు లక్ష్యంగా దేశ సమగ్రత, సనాతన ధర్మ పరిరక్షణ, 2047 నాటికి వికసిత్ భారత్ దిశగా అడుగులు, మేక్ ఇన్ ఇండియాతో యువతకు పెరిగిన ఉపాధి వంటి అవకాశాలపై ప్రేరణ కల్పించేలా ప్రణాళికలు రూపొందించారు. రేపటి నుంచి మోదీ, షా, యోగి.. ఇక ప్రధాని నరేంద్ర మోదీ సహా పార్టీ కీలక నేతలంతా బుధవారం నుంచి ప్రచార పర్వంలో క్రియాశీలక పాత్ర పోషించనున్నారు. ప్రధాని మోదీ 29వ తేదీన కర్కర్దామా, 31వ తేదీన యమునా ఖాదర్, ఫిబ్రవరి రెండో తేదీన ద్వారాకా ప్రాంతాల్లో బహిరంగ సభలు, ర్యాలీల్లో పాల్గొననున్నారు. ఢిల్లీ ప్రధాన ప్రాంతాల్లో భారీ ర్యాలీలు జరిపేలా ప్రణాళికలున్నాయి. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షా సైతం ఆరు బహిరంగ సభలు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ యోగి దాదాపు 10 బహిరంగ సభలు, ర్యాలీల్లో పాల్గొనేలా ప్రణాళికలు సిద్ధంచేశారు. డజన్ల కొద్దీ కేంద్ర మంత్రులు, జాతీయ పార్టీల నేతలు, బీజేపీపాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, పొరుగు రాష్ట్రాల మంత్రులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిపి మొత్తంగా 100కు పైగా సభలకు ప్లాన్ చేశారు. ప్రచార అంశాలను పర్యవేక్షించడానికి ప్రతి కేంద్ర మంత్రికి రెండు అసెంబ్లీ నియోజకవర్గాలను కేటాయించారు. -
మోదీ, అమిత్ షా, కుంభమేళాపై ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు
ఢిల్లీ: బీజేపీ నేతలు, మహా కుంభమేళాపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే(Mallikarjun Kharge) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నో తప్పులు చేసిన బీజేపీ నేతలు కుంభమేళాలోని గంగా నీటిలో మునిగితే విముక్తి కలగదు అన్నారు. ఇదే సమయంలో మోదీ, అమిత్ షా కచ్చితంగా నరకానికే వెళ్తారు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఖర్గే వ్యాఖ్యలకు బీజేపీ నేతలు కౌంటరిస్తున్నారు.కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే సోమవారం మీడియాతో మాట్లాడుతూ..‘గంగా నదిలో స్నానం చేయడం వల్ల పేదరికం తొలగిపోతుందా?. అది ఆహారాన్ని అందిస్తుందా?. నేను ఎవరి విశ్వాసాన్ని దెబ్బతీయాలని అనుకోవడం లేదు. నా మాటలు ఎవరినైనా బాధపెట్టి ఉంటే నేను క్షమాపణలు కోరుతున్నాను. కానీ, పిల్లలు ఆకలితో చనిపోతున్నప్పుడు, పాఠశాలకు వెళ్లలేకపోతున్నప్పుడు, కార్మికులకు జీతం అందనప్పుడు, బీజేపీ నాయకులు గంగలో స్నానం చేయడానికి పోటీ పడుతున్నారు. వారు టీవీల్లో పబ్లిసిటీ కోసమే ఇదంతా చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తుల నుండి దేశం ప్రయోజనం పొందదు. అలాగే.. ప్రధాని మోదీ(Modi), అమిత్ షా(Amit Shah) ఎన్నో తప్పులు చేశారు. అలాంటి వ్యక్తులు కుంభమేళాలో స్నానాలు చేస్తే విముక్తి రాదు. మోదీ, అమిత్ షా కచ్చితంగా నరకానికి వెళ్తారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఈ నేపథ్యంలో ఖర్గే వ్యాఖ్యలకు బీజేపీ నేతలు కౌంటరిస్తున్నారు. తాజాగా బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా స్పందిస్తూ ఖర్గే వ్యాఖ్యలను సనాతన ధర్మంపై దాడిగా అభివర్ణించారు. ఆయన మరే ఇతర మతం గురించి అలాంటివి చెప్పగలరా? అలాంటి ప్రకటనలు ఖండించదగినవి. దీనిపై కాంగ్రెస్ పార్టీ వివరణ ఇవ్వాలి. ఖర్గే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా అంటూ కామెంట్స్ చేశారు.#WATCH | Indore, MP | Congress National President Mallikarjun Kharge says, "On one hand Narendra Modi salutes the Constitution and on the other, he does everything against it... Don't be fooled by Narendra Modi's false promises. Does taking a dip in Ganga alleviate poverty?...… pic.twitter.com/lgCJW4HYtY— ANI (@ANI) January 27, 2025మరోవైపు.. ఖర్గే వ్యాఖ్యలపై అమిత్ మాలవీయా స్పందిస్తూ.. కుంభమేళాపై ఖర్గే చేసిన వ్యాఖ్యలు ఆయనవి కాదు. ఆ మాటలు గాంధీ కుటుంబానికి చెందినవి. కాంగ్రెస్ హిందువులను ఎందుకు అంతగా ద్వేషిస్తుంది?. మహా కుంభామేళా 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ప్రజల నమ్మకాలను కాంగ్రెస్ అవమానిస్తోంది. కాంగ్రెస్ నేతలు కావాలనే కుంభమేళాను అవమానిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇదిలా ఉండగా.. ఈరోజు కేంద్రహోం మంత్రి అమిత్ షా కుటుంబ సభ్యులు మహా భమేళాలో పవిత్ర స్నానాలు చేశారు. ఆ తర్వాత ప్రయాగ్‌రాజ్‌లో త్రివేణి సంగమానికి అమిత్ షా అర్చన చేసి గంగా హారతి ఇచ్చారు. ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాలో ఇది 15వ రోజు. ఇప్పటికే కుంభమేళాకు 13 కోట్లకుపైగా భక్తులు హాజరయ్యారు. ఫిబ్రవరి 5వ తేదీన మహాకుంభమేళాకు ప్రధాని మోడీ రాబోతున్నారు. దానికి ముందే ఇవాళ ప్రయాగ్‌రాజ్‌కు అమిత్ షా రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు ఈ కుంభమేళాకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. ప్రపంచ దేశాల నుంచి ప్రయాగ్‌రాజ్‌లో పుణ్యస్నానాలు చేస్తున్నారు. రష్యా, ఉక్రెయిన్, అమెరికా, జపాన్, జర్మనీ, నెదర్లాండ్, కెనడా, స్విట్జర్లాండ్, స్వీడన్, సహా 73 దేశాల దౌత్యవేత్తలు సైతం ఫిబ్రవరి 1న కుంభమేళాలకు వస్తున్నారు.बोल खड़गे जी रहे हैं, पर शब्द गांधी परिवार के हैं। आखिर कांग्रेस को हिंदुओं से इतनी नफरत क्यों है? 144 साल में एक बार महाकुंभ आता है, लेकिन कांग्रेस के नेता इस तरह बौखला गए हैं कि हिंदुओं को कोस रहे हैं। पहले कांग्रेस के हुसैन दलवी ने कुंभ को बुरा-भला कहा, और अब स्वयं कांग्रेस… pic.twitter.com/UAqLNMVLzZ— Amit Malviya (@amitmalviya) January 27, 2025 -
ఢిల్లీ బీజేపీ తుది మేనిఫెస్టోలో కీలక హామీలివే..
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల మూడో విడత మేనిఫెస్టోను బీజేపీ ప్రకటించింది. శనివారం(జనవరి25) కేంద్రమంత్రి అమిత్ షా మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా షా మాట్లాడుతూ ‘బీజేపీ మేనిఫెస్టోలో బూటకపు వాగ్దానాలు లేవు. ఢిల్లీలో చేపట్టాల్సిన పనుల జాబితా మాత్రమే ఉంది. ఢిల్లీకి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఆప్ ప్రభుత్వం విఫలమైంది.కలుషితమైన యుమునా నదిని శుభ్రం చేయించలేదు. ప్రజలకు సరైన తాగునీటి సౌకర్యం కల్పించలేదు. దేశ రాజధానిని కాలుష్య రహితంగా మార్చలేదు. గత ప్రభుత్వంలో కేజ్రీవాల్ నేతృత్వంలో ఢిల్లీలో అవినీతి మరింతగా పెరిగిపోయింది. ఢిల్లీలో రోడ్ల నిర్మాణానికి రూ. 41 వేల కోట్లు, రైల్వే లైన్ల కోసం రూ. 15 వేల కోట్లు, ఎయిర్‌పోర్టుకు రూ. 21 వేల కోట్లను కేంద్రం అందించింది. పేదల సంక్షేమ పథకాలను నిలిపివేయం. చేసిన వాగ్దానాలను కచ్చితంగా మా పార్టీ అమలు చేస్తుంది. బీజేపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో యుమునా నదిని పూర్తిగా శుభ్రం చేయిస్తాం. గిగ్ వర్కర్ల కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తుంది. 1,700 అనధికార కాలనీలలో కొనుగోలు, అమ్మకంతో పాటు నిర్మాణం, యజమానులకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తాం. రూ. 10 లక్షల ఆరోగ్య బీమా, రూ.5 లక్షల ప్రమాద బీమా అందిస్తాం’ అని అమిత్‌షా హామీ ఇచ్చారు. కాగా, ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. 8వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. బీజేపీ తన మేనిఫెస్టోలో ప్రధానంగా మహిళలకు రూ.2500 నగదు, సబ్సిడీపై రూ.500కే గ్యాస్ సిలిండర్లు లాంటి కీలక హామీలిచ్చింది. ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ బీజేపీ, ఆప్ మధ్యే ఉండనుంది. -
కేజ్రీవాల్ హత్యకు కేంద్రం కుట్ర: ఆప్ సంచలన ఆరోపణలు
ఢిల్లీ: తమ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)ను అంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులు కుట్ర పన్నారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) సంచలన ఆరోపణలు చేసింది. ఢిల్లీ సీఎం అతిషి, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మీడియాతో మాట్లాడుతూ.. ఆ కుట్రలో భాగంగానే కేజ్రీవాల్ రక్షణ కోసం పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చిన భద్రతా బృందాన్ని బీజేపీ సారథ్యంలోని కేంద్ర సర్కార్ ఉపసంహరించిందంటూ వ్యాఖ్యలు చేశారు.కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే ఈ అంశంపై స్పందించాలని.. కేజ్రీవాల్‌కు పంజాబ్ ప్రభుత్వం కల్పించిన భద్రతను పునరుద్ధరించాలన్నారు. కేజ్రీవాల్ ప్రాణాలకు ముప్పు కలిగించడానికి ఇప్పటి వరకు జరిగిన దాడులపై విచారణ జరిపించాలని అప్ సీఎంలు డిమాండ్ చేశారు.కేంద్ర హోంమంత్రి అమిత్ షా కనుసన్నల్లో ఢిల్లీ పోలీసులు పనిచేస్తున్నారని అతిషి, భగవంత్ మాన్ మండిపడ్డారు. కేజ్రీవాల్‌పై పదేపదే దాడులు జరుగుతున్నా కానీ వారు పట్టించుకోవడం లేదని.. అందుకే వారిపై తమ పార్టీకి నమ్మకం లేదంటూ వారు చెప్పుకొచ్చారు. దీనిపై తాము కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ కూడా రాశామని పేర్కొన్నారు.ఇదీ చదవండి: బీజేపీ నుంచి సీఎం ఆఫర్ వచ్చింది.. సిసోడియా సంచలన వ్యాఖ్యలు -
యోగీ జీ.. అమిత్ షాకు కాస్త చెప్పండి: కేజ్రీవాల్
ఢిల్లీ: ఢిల్లీలో లా అండ్ ఆర్డర్ బాలేదన్న యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్(Yogi Adityanath) వ్యాఖ్యలతో ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) ఏకీభవించారు. ఢిల్లీ నగరంలో లా అండ్ ఆర్డర్ అనేది కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతిలో ఉందని, ఆ విషయాన్ని ఆయనకే మీరు కాస్త కూర్చొని చెప్పండని కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు. ఢిల్లీ నగరంలో లా అండ్ ఆర్డర్‌ను ఎలా మరుగుపరుచాలో అమిత్ షాకు కాస్త దిశా నిర్దేశం చేయండి యోగీ జీ అంటూ కేజ్రీవాల్ సెటైర్లు వేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు(Delhi assembly election 2025) ఫిబ్రవరి 5వ తేదీన జరుగనున్న నేపథ్యంలో ఇటు ఆప్, అటు బీజేపీలు తమ ప్రచార జోరును కొనసాగిస్తున్నాయి. కౌంటర్‌కు రీ కౌంటర్ అన్నట్లు సాగుతోంది ఇర పార్టీల ప్రచారం. దీనిలోభాగంగా యోగీ ఆదిత్యానాథ్ మాట్లాడిన మాటలకు కేజ్రీవాల్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మీరు చెప్పింది నిజమే యోగీ జీ..‘ నిన్న( గురువారం) యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఒక మంచి విషయం చెప్పారు. దీనికి ఢిల్లీ ప్రజల కూడా మద్దతుగా నిలుస్తారు. ఢిల్లీలో లా అండ్ ఆర్డర్ బాలేదని యోగి అన్నారు. దాంతో ఢిల్లీ ప్రజలు వంద శాతం ఏకీభవిస్తారు. ఢిల్లీలో గ్యాంగ్స్టర్లు చాలా ఫ్రీగా తిరుగుతున్నారు. ఢిల్లీలో చాలా గ్యాంగ్‌స్టర్ గ్రూపులున్నాయి. వీరంతా ఢిల్లీ నగరాన్ని విభజించి వారి వారి కార్యకలాపాల్ని ఎంతో స్వేచ్ఛగా చేసుకుంటున్నారు. ఇక్కడ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లని బెదిరించి వారి అరాచకాల్ని సాగిస్తున్నాయి గ్యాంగ్‌స్టర్ గ్రూపులు. ప్రధానంగా ఇక్కడ వ్యాపారాలు చేస్తున్న బడా వ్యాపారస్తులకు ఏ రోజు సుఖం లేదు. రోజూ ఏదొక గ్యాంగ్స్టర్గ్రూప్ నుంచి వారు బెబెదిరింపు కాల్స్ రిసీవ్ చేసుకుంటూనే ఉన్నారు. వారి కుటుంబాల్ని చంపేస్తామంటూ మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయల్ని గ్యాంగ్‌స్టర్ గ్రూపులు వసూలు చేస్తూ ఉంటాయి. ఢిల్లీలో జరిగే గ్యాంగ్ వార్స్‌కి అక్కడి రోడ్లే సాక్ష్యం. ఢిల్లీలో మహిళలు ఇళ్లు ాదాటి బయటకు రావాలంటే చాలా భయానక పరిస్థితులు ఉన్నాయి. ఢిల్లీ నగరంలో చిన్న పిల్లలు, మహిళలు తరచు కిడ్నాప్‌లకు గురౌవుతుంటారు. ఇక్కడ గ్యాంగ్స్టర్లకు కత్తుల్ని వారి వద్దనున్న మారణాయుధాల్ని చాలా బహిరంగంగా వాడుతుంటారు. హత్యలు, చైన్ స్నాచింగ్‌లు, దొంగతనాలు నిత్యం ఏదో మూలన జరుగుతూనే ఉంటాయి. ఢిల్లీ ప్రజలు చాలా భయాందోళన మధ్య బ్రతుకుతున్నారనేది నిజం’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.ఢిల్లీలో శాంతి భద్రతల బాధ్యత అమిత్ షాదే..‘యూపీలో లా అండ్ ఆర్డర్ అనేది ఎంతో అమోగంగా ఉందన్నారు. ఒక ఫిక్స్డ్ లా అండ్ ఆర్డర్ యూపీలో ఉందన్నారు. యూపీలో గ్యాంగ్‌స్టర్ గ్రూపులను కట్టడి చేశామని చెప్పారు యోగీ జీ. అక్కడ లా అండ్ ఆర్డర్ బాగుందా.. బాలేదా అనేది నాకైతే తెలీదు. ఢిల్లీలో లా అండ్ ఆర్డర్ మాత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) చేతుల్లో ఉంది. మరి మీరు(యోగీ ఆదిత్యానాథ్) యూపీలో లా అండ్ ఆర్డర్ ఏదైతే మెరుగైందని చెప్పారో అదే విషయాన్ని అమిత్ షాకు కూడా చెప్పి ఢిల్లీ నగరంలో శాంతి భద్రతల్ని మెరుగుపర్చండి. ఢిల్లీలో గ్యాంగ్స్టర్లకు ఎలా అడ్డుకట్ట వేయాలో కాస్త అమిత్ షా జీకి చెప్పండి యోగీ జీ’ అని కేజ్రీవాల్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. -
బీజేపీ నాకు తల్లిలాంటిది.. మారే ఆలోచన లేదు
సాక్షి,బళ్లారి: బీజేపీ తనకు తల్లిలాంటిదని, రాజకీయంగా ఎదగడానికి ఎంతో తోడ్పాటును అందించిందని, ప్రస్తుతం పార్టీని వీడే ఆలోచన లేదని, ఒక వేళ పార్టీని వీడే సందర్భమే ఏర్పడితే ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లి తగిన నిర్ణయం తీసుకుంటానని మాజీ మంత్రి బీ.శ్రీరాములు పేర్కొన్నారు. ఆయన గురువారం నగరంలోని తన నివాస గృహంలో విలేకరులతో మాట్లాడుతూ గాలి జనార్దనరెడ్డిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. సండూరు ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమికి తాను కారణమని పేర్కొనడంలో అర్థం లేదన్నారు. తాను నిజాయితీగా పార్టీ అభ్యర్థి గెలుపునకు శ్రమించానన్నారు. తల్లిలాంటి పార్టీకి తాను ఎన్నటికీ ద్రోహం చేయబోనన్నారు. తనను రాజకీయంగా ముగించేందుకు కొందరు ఎత్తులు వేస్తున్నారని మండిపడ్డారు. ఏ ఒక్కరి శక్తి, సహకారంతో రాజకీయాల్లో రాణించలేదన్నారు. ఉద్ధండులతో పోరాడి పైకెదిగా కష్టపడి, ఎందరో ఉద్ధండులకు వ్యతిరేకంగా పోరాడి ముందుకు వచ్చానన్నారు. తనను ఎన్నికల్లో గెలిపించానని గాలి జనార్దనరెడ్డి వ్యాఖ్యానించడంపై ఆయన స్పందిస్తూ, ఆయనేమైనా మ్యాజిక్ చేస్తారా? అని ప్రశ్నించారు. ప్రజలు తన వెంట ఉండటం వల్లనే గెలిచానని, రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజమేనన్నారు. గాలి జనార్దనరెడ్డి అబద్ధాలు చెబుతూ రాజకీయ కోటను నిర్మించుకోవాలని చూస్తున్నారన్నారు. ఏ ఒక్కరి ఆశీర్వచనంతో తాను రాజకీయాల్లో రాణించలేదన్నారు. 40 ఏళ్లుగా ఎన్నో కష్టాలు, ఒడిదొడుకులు పడుతూ రాజకీయాల్లో పైకెదిగానన్నారు. తనకు ఏకకాలంలో మొళకాల్మూరు, బాదామి రెండు అసెంబ్లీ సీట్లు బీజేపీ కేటాయించిందన్నారు. తన శక్తి ఏమిటో పార్టీ అగ్రనేతలకు తెలుసన్నారు. తన సమాజానికి చెందిన వారు, ఇతర కులాలకు చెందిన వారి సహకారం తనకు ఎంతో ఉందన్నారు. ఆయన అబద్ధాలు చెబితే వినడానికి నేనేమి చిన్న పిల్లవాడిని కాదన్నారు. ప్రజలు చాలా మేధావులు ప్రజలు కూడా చాలా బుద్ధివంతులని, ఆయన మాటలను వినే పరిస్థితిలో లేరన్నారు. కోర్ కమిటీ సమావేశంలో పార్టీ ఇన్‌ఛార్జి తనపై తీవ్ర ఆరోపణ చేశారన్నారు. సండూరులో పార్టీ ఓటమికి తానే కారణమని పేర్కొనడంతో తాను సంజాయిషీ ఇచ్చానన్నారు. పార్టీ అధ్యక్షుడు విజయేంద్ర తన గురించి ఎందుకు స్పందించలేదో తెలియదన్నారు. సదానంద గౌడ మినహా తనకు మద్దతుగా ఎవరూ మాట్లాడలేదన్నారు. గాలి జనార్దనరెడ్డి అబద్ధాలు చెప్పడం మానుకోవాలన్నారు.› ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి వారి స్వశక్తి ఉంటుందన్నారు. తన వల్ల అంతా రాజకీయంగా ముందుకు వెళుతున్నారనే భ్రమను ఆయన వీడాలన్నారు. 1999 లోక్‌సభ ఎన్నికల్లో అప్పట్లో పార్టీ అగ్రనాయకురాలు దివంగత సుష్మాస్వరాజ్ గెలుపు కోసం ఎంతో కష్టపడ్డామన్నారు. అప్పటి నుంచి తాను బీజేపీలో తనదైన ముద్ర వేసుకుని కష్టపడి పని చేసి ముందుకు వచ్చానన్నారు. పలువురు శ్రీరాములు అభిమానులు పాల్గొన్నారు. -
మరో దాడి.. అది వాళ్ల పనే : కేజ్రీవాల్
ఢిల్లీ : మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ కన్వినర్ అర్వింద్ కేజ్రీవాల్ (arvind kejriwal) కారుపై మరోసారి దాడి జరిగింది. గురువారం హరినగర్‌లో అగంతకులు తన కారుపై దాడి చేశారని కేజ్రీవాల్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.‘నా కారుపై దాడి జరిగింది. ఇది ప్రత్యర్థి పార్టీ నేతల మద్దతు దారుల పనే. ఢిల్లీ పోలీసులే దాడికి పాల్పడ్డ నిందితుల్ని నా బహిరంగ సభలోకి ప్రవేశించేందుకు అనుమతించారు. దాడి వెనుక కేంద్ర హోంమంత్రి అమిత్ షా (amit shah) హస్తం ఉంది. ఢిల్లీ పోలీసులను బీజేపీ వ్యక్తిగత సైన్యం’గా ఉపయోగించుకుంటుంది. ‘ఈరోజు హరి నగర్లో జరిగిన పార్టీ బహిరంగ సభలోకి ప్రవేశించడానికి విపక్షాల అభ్యర్థులను పోలీసులు అనుమతించారు. నా కారుపై దాడి చేశారు’ అని ట్వీట్లో తెలిపారు. ఇదంతా అమిత్ షా ఆదేశాల మేరకే జరుగుతోంది. అమిత్ షా ఢిల్లీ పోలీసులను బీజేపీకి వ్యక్తిగత సైన్యంగా మార్చారు. ఇలాంటి దాడులపై ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతోందని విమర్శించారు. ఒక జాతీయ పార్టీ, జాతీయ అధ్యక్షుడు, దాని నాయకులపై నిరంతరం దాడులు జరుగుతున్నాయని.. అయినప్పటికీ ఎన్నికల సంఘం చర్యలు తీసుకోకపోవడంపై ప్రశ్నలు గుప్పించారు. आज हरि नगर में विपक्षी उम्मीदवार के लोगों को पुलिस ने मेरी जनसभा में घुसने दिया और फिर मेरी गाड़ी पर हमला करवाया। ये सब अमित शाह जी के आदेश पर हो रहा है। अमित शाह जी ने दिल्ली पुलिस को बीजेपी की निजी आर्मी बना दिया है। चुनाव आयोग पर बड़े सवाल उठ रहे हैं कि एक राष्ट्रीय पार्टी…— Arvind Kejriwal (@ArvindKejriwal) January 23, 2025జనవరి 18న న్యూ ఢిల్లీ నియోజకవర్గంలో అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో ఆయన వాహనంపై బీజేపీ మద్దతు దారులు దాడి చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆరోపించారు. కేజ్రీవాల్ ప్రచారం చేస్తున్న సమయంలో బీజేపీ నేత పర్వేష్ వర్మ మద్దతు దారులు తమ పార్టీ అధినేత కారుపై కర్రలు ఇటుకలు, రాళ్లతో దాడి చేశారని ఆ పార్టీ పేర్కొంది. ఆ ఆరోపణలను వర్మ ఖండించారు. ‘అరవింద్ కేజ్రీవాల్ వాహనం ఇద్దరు యువకులను ఢీకొట్టింది. ఆప్ ప్రభుత్వం తమకు చేసిన అభివృద్ది ఏంటో చెప్పాలని స్థానికులు ప్రశ్నించారు. ఆ సమయంలో స్థానికుల్ని ఏ మాత్రం పట్టించుకోకుండా కేజ్రీవాల్ కారు ముందుకు సాగింది. కేజ్రీవాల్ కారు ఢీ కొని ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. కేజ్రీవాల్‌కు ఓటమి భయం పట్టుకుంది. అందుకే ఇలా మాట్లాడుతున్నారు. ఆస్పత్రిలో గాయపడ్డ యువకుల్ని పరమర్శించేందుకు నేను ఇప్పుడే వెళ్తున్నాను’ అంటూ బీజేపీ నేత పర్వేష్ వర్మ మీడియాతో మాట్లాడారు. -
జమ్ము మిస్టరీ మరణాలపై కేంద్రం ప్రకటన
మిస్టరీగా మారిన జమ్ము కశ్మీర్ వరుస మరణాల(Mysterious Deaths)పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. అంతుచిక్కని అంటువ్యాధితో మరణిస్తున్నారనే వాదనను కేంద్రం తోసిపుచ్చింది. అయితే విషపూరిత పదార్థాల వల్లే వరుస మరణాలు సంభవించాయని, ఈ వ్యవహారంపై కుట్ర కోణం సహా అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోందని గురువారం ప్రకటించింది.రాజౌరీ(Rajouri) జిల్లాలోని ఓ గ్రామంలో నెలవ్యవధిలో 17 మంది వరుసగా ఒకే తరహా లక్షణాలతో జబ్బుపడి మరీ చనిపోయారు. చనిపోయిన వాళ్లలో చిన్నపిల్లలే(13) ఎక్కువగా ఉన్నారు. వాళ్ల మరణాలకు విషపూరిత పదార్థాలే కారణమని కేంద్రం నిర్ధారించింది. అయితే ఆ టాక్సిన్ ఏంటన్నదానిపై మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉందని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర సైన్స్&టెక్నాలజీ మంత్రి(స్వతంత్ర) డాక్టర్ జితేంద్ర సింగ్ గురువారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు.‘‘లక్నోలోని సీఎస్ఐఆర్(CSIR) ల్యాబ్ నిర్వహించిన ప్రాథమిక పరీక్షల్లో.. ఇది వైరల్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షనో కాదని తేలింది. మృతదేహాల నుంచి సేకరించిన నమునాల్లో విషపదార్థాలు ఉన్నట్లు తేలింది. అయితే ఆ విషపదార్థాలు ఏంటన్న దానిని నిర్ధారించుకునే పనిలో శాస్త్రవేత్తలు ఉన్నారు. వారం, పదిరోజుల్లో దీనిపై స్పష్టమైన ప్రకటన రానుంది’’ అని ఆయన తెలిపారు. ఇక అన్నికోణాల్లో ఈ అంశంపై దర్యాప్తు జరుగుతోంది. ఇందులో ఏదైనాకుట్ర ఉందని తేలితే.. బాధ్యులెవరైనా వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అని అన్నారాయన. ఇదిలా ఉంటే.. ఐటీఆర్ (టాక్సికాలజీ రీసెర్చ్) నిర్వహించిన విశ్లేషణలోనూ ఇంతకు ముందు విషపూరిత పదార్థాలు ఉన్నట్లు గుర్తించింది.డిసెంబర్ 7 నుంచి జనవరి 19వ తేదీల మధ్యలో రాజౌరీలోని బధాల్ అనే కుగ్రామంలో ఈ వరుస మరణాలు(Serial Deaths) సంభవించాయి. జ్వరం, ఒళ్లు నొప్పులు, అలసట, విపరీతంగా చెమటలు పోయడం, స్పృహ కోల్పోవడం తదితర లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరారు. పైగా మూడు కుటుంబాలకే చెందిన వ్యక్తులు వరుసగా జబ్బు చేసి మరణించడం గమనార్హం. పైగా ఆ కుటుంబాలకు చెందిన బంధువులు చుట్టుపక్కల నాలుగు గ్రామాల్లో విస్తరించి ఉన్నారు. అయితే అనూహ్యంగా వాళ్లలో కూడా కొందరు ఇదే రీతిలో జబ్బు పడ్డట్లు సమాచారం. అందులోనూ కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.దీంతో బుధవారం అక్కడి అధికారులు బధాల్ గ్రామాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. సుమారు 40 మందిని ఐసోలేషన్‌కు తరలించారు. ఇక ప్రజల్లో ఆందోళన నెలకొన్న దృష్ట్యా.. బహిరంగా జనం గుమిగూడటంపై ఆంక్షలు అమలు చేస్తున్నారు. వరుస మరణాలతో జమ్ము కశ్మీర్లో హెల్త్ ఎమర్జెన్సీ(Health Emergency) ప్రకటిస్తారనే వదంతులు చక్కర్లు కొట్టాయి. అయితే వైద్య ఆరోగ్య అధికారులు మాత్రం వాటిని కొట్టిపారేశారు. ఆ అవసరం లేదని స్పష్టత ఇచ్చారు. నమునాల్లో న్యూరోటాక్సిన్స్ ఉన్నట్లు తేలడంతో.. కుట్ర కోణం తెర మీదకు వచ్చింది. నిజాలు నిగ్గుతేల్చేందుకు కశ్మీర్ పోలీస్ శాఖ సిట్‌ను ఏర్పాటుచేసింది. మంగళవారం బధాల్కు వెళ్లిన ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా.. త్వరలోనే అన్ని నిజాలు బయటకు వస్తాయని ప్రకటించారు. మరోవైపు.. వరుస మరణాల నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసేందుకు 11 మందితో కూడిన ప్రత్యేక బృందాన్ని కశ్మీర్‌కు పంపింది. -
వరుస ఎన్ కౌంటర్లతో మావోయిజాన్ని ఆపలేరు
-
ఏపీలో బడా నేతల కాలక్షేపం కబుర్లు!
ఇద్దరు ప్రజా ప్రతినిధులు.. అది కూడా పెద్ద స్థాయి వారు కలిస్తే ఏం మాట్లాడుకోవాలి? ప్రజలకు ఎలాంటి మేలు చేయాలి? ఇచ్చిన వాగ్ధానాల అమలు ఎలా? ఆ క్రమంలో వస్తున్న ఇబ్బందులను అధిగమించడం ఎలా? వంటివని మనం అనుకుంటాం. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం దీనికి భిన్నంగా జరుగుతోంది. ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇటీవల అమరావతికి వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృష్ణా కరకట్టపై నిర్మించిన అక్రమ భవనంలో భేటీ అయ్యారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌లు కూడా హాజరైన ఈ సమావేశంలో వాళ్లు మాట్లాడుకున్న విషయాలు తెలిస్తే సామాన్యులు విస్తు పోవాల్సిందే. తెలుగుదేశం మీడియా చెప్పిన దాని ప్రకారమే.. ఈ సమావేశంలో ప్రధాన చర్చ మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు ఉన్న భవనాలపై సాగింది! అంత పెద్ద నేతలు ఇంత చీప్‌గా టైమ్‌పాస్ మాటలు మాట్లాడుకుంటారా? అబద్ధాల ముచ్చట్లు పెట్టుకుంటారా?. జగన్ భవనాల గురించి ఇప్పుడు చర్చించుకోవాల్సిన అవసరం ఏమిటన్న అనుమానం మీకూ రావచ్చు. అయితే ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా జగన్‌పై బురద చల్లడమే లక్ష్యంగా పనిచేస్తున్న పచ్చ బ్యాచ్‌కు మాత్రం ఈ సందేహం రాలేదు. అందుకే టీడీపీ జాకీ మీడియా ఆ సొల్లు పురాణాన్ని పతాక శీర్షికలకు ఎక్కించి సంతోషించింది. ‘‘జగన్ జల్సా భవన్లు’’లపై ఆరా తీసిన అమిత్ షా అంటూ ఆనందపడింది. టీడీసీ,జనసేన, బీజేపీల కూటమి అధికారంలోకి వచ్చి ఏడున్నర నెలలు కావస్తున్నా ఈ పచ్చ మూక జగన్‌పై విమర్శలు మినహా సాధించిందేమీ లేదన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో కూటమి పెద్దలు ఇలా డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబు నివాసాన్ని చూస్తూ, ‘‘నది పక్కన మీ ఇల్లు చాలా బాగుంది’’ అని అమిత్ షా మెచ్చుకున్నారట. పనిలో పనిగా జగన్ పాలెస్ల గురించి ఆరా తీసినట్లు తెలిసిందని ఈ జాకీ మీడియా రాసింది. అది చూస్తే ఒకటి మాత్రం స్పష్టం అవుతుంది. అమిత్ షా మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇంటి గురించి అడిగి ఉండే అవకాశం లేదు. ఎందుకంటే అది అక్కడ టాపిక్ కాదు. కానీ.. విజయవాడలో ప్రకృతి వైపరీత్యానికి కారణమైన చంద్రబాబు ఇంటి గురించి హోం మంత్రి అడిగారన్న సమాచారమే బయటకు వెళితే అది తమకు ఇబ్బంది అవుతుంది కనుక టీడీపీ నేతలు పనిగట్టుకుని ఇలా అబద్ధాలు ప్రచారం చేసి ఉండాలి. హైదరాబాద్‌లో జగన్‌కు వంద గదలు ప్యాలెస్ ఉందని టీడీపీ నేతలు చెబితే అమిత్ షా చెవిలో పువ్వు పెట్టుకుని విన్నారన్నమాట!. ఈ సోది రాసిన పత్రిక వారికి నిజం తెలియదా? నాలుగు బెడ్ రూమ్‌ల ఇల్లు ఉంటే వంద రూమ్లని వీళ్లు రాస్తారా? కడుపునకు అన్నం తినేవారు ఎవరైనా ఇంత చెత్తగా వార్తా కథనాలు ఇచ్చి పాఠకులను మోసం చేస్తారా?. జగన్ ఇంటి గురించి నిజంగానే సమాచారం కావాలంటే నిమిషాలలో తెప్పించుకునే శక్తి అమిత్ షా కు ఉండదా? బెంగుళూరులో ఇల్లు ఉంది, తాడేపల్లిలో ఇల్లు ఉందని చెప్పారట. ఈ రోజుల్లో కాస్త మధ్యతరగతి, ఉన్నతాదాయ వర్గాలవారు సైతం ఆయా ముఖ్యమైన నగరాలలో రెండు, మూడు ఇళ్లు కలిగి ఉంటున్నారు. అందులోను హైదరాబాద్‌తోపాటు ఏపీలోని సొంత ప్రాంతంలో కూడా ఇళ్లు ఉంటాయి. దానిని భూతద్దంలో చూపి జగన్ పై దుష్ప్రచారం చేయడానికి వీరు చూపిన శ్రద్ద రాష్ట్ర సమస్యలను వివరించడంపై పెట్టి ఉంటే బాగుండేది. పోనీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లకు హైదరాబాద్ లో ఇళ్లు లేవా? ఏపీలోని అమరావతి ప్రాంతంలో ఇళ్లు లేవా? అవి ఎంత భారీగా ఉన్నాయో తెలియదా? అవి ప్యాలెస్‌లు కాదా? కృష్ణ కరకట్టపై అక్రమంగా నిర్మించిన ఇంటిలో చంద్రబాబు నివాసం ఉండడం లేదా? ఆ ప్యాలెస్ ప్రభుత్వానిది అని ఒకసారి, లింగమనేని రమేష్ ది అని మరోసారి మాటలు మార్చలేదా? ఆ ఇల్లు మునిగిపోకుండా చూడడానికి బుడమేరు లాకులను ఎత్తివేసిన ఫలితంగానే విజయవాడ మునిగిందన్న సంగతి నిజం కాదా? హోం మంత్రి అమిత్ షా కు పర్యావరణం, ప్రకృతి వైపరీత్యాల నివారణలపై ఏమాత్రం శ్రద్ద ఉన్నా ముందుగా చేయవలసిన పని ఏమిటి? చంద్రబాబు కృష్ణానది ఒడ్డున కోస్టల్ రెగ్యులేషన్ చట్టాన్ని అతిక్రమించిన కట్టిన ఇంటిలో ఎలా ఉంటున్నావని హోం మంత్రి ప్రశ్నించాలి కదా? ఆ పని చేయలేదా? చేసినా దాని గురించి ప్రచారం చేయకుండా జగన్ పై కట్టుకధలు వ్యాప్తిలోకి తెచ్చారా? చంద్రబాబుకు జూబ్లిహిల్స్ లో ఉన్నది ఎంత పెద్ద పాలెస్సో ఆ రోడ్డులోకి వెళ్లి చూసిన వారందరికి తెలుస్తుంది. ఆ భవన నిర్మాణానికి ఏ,ఏ దేశాల నుంచి వస్తువులు తెప్పించింది ఆ రోజుల్లో పలు వార్తలు వచ్చాయి కదా? అయినా ఆయన చాలా సింపుల్ గా ఉన్నట్లు అనుకోవాలి. తాజాగా.. అమరావతి సుమారు ఐదెకరాల విస్తీర్ణంలో ఇల్లు కట్టుకుంటున్నారని చెబుతున్నారు కదా. ఇది కాకుండా కుప్పంలో కూడా గృహ నిర్మాణం చేస్తున్నారు కదా? వీటి గురించి ఏమి చెబుతారు? ఇక్కడ ఒక సంగతి చెప్పాలి. ఉమ్మడి ఏపీ విభజన తర్వాత ఆ రాష్ట్ర రాజధాని అమరావతిలో ఇల్లు కట్టుకున్న ఏకైక నేత వైఎస్ జగన్. అంతేకాదు. సతీసమేతంగా పూర్తిగా అక్కడే నివసిస్తున్న నేత కూడా ఆయనే. చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లు పూర్తిగా అక్కడే ఉంటున్నారా? చంద్రబాబు కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోనే నివసిస్తుంటారు కదా! ఇది తప్పని చెప్పడం లేదు. కాని ఎదుటి వ్యక్తిమీద మాత్రం బురద వేసి సంతోషపడుతుండడమే దారుణమనిపిస్తుంది. అమిత్ షా కు మరో విషయం గుర్తుకు రాలేదా? ఈ మధ్య కాలంలో ఏడిఆర్ నివేదిక ఒకటి వచ్చింది కదా? అందులో చంద్రబాబు రూ.931 కోట్ల ఆస్తితో అత్యంత ధనికుడైన సీఎం అని వెల్లడైంది కదా? దానిపై హోం మంత్రి వివరాలు తెలుసుకునే యత్నం చేయలేదా? ప్రధాని మోదీతో పాటు అమిత్ షా కూడా 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబును ఉద్దేశించి అవినీతిపరుడు అని తీవ్ర స్థాయిలో విమర్శించారు కదా! మళ్లీ పొత్తు కుదరగానే నీతిమంతుడు అయిపోయారా? అలాగే చంద్రబాబు కూడా వీరిద్దరిని ఎన్ని మాటలు అన్నారు. జనం ఇవేవి గుర్తుకు తెచ్చుకోరాదన్న ఉద్దేశంతో జగన్ పై డైవర్ట్ చేస్తుంటారు.అమిత్ షా మరుసటి రోజు ఎన్డీఆర్ఎఫ్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఏపీకి మూడు లక్షల కోట్ల రూపాయల మేర కేంద్రం సాయం చేసిందని ప్రకటించారు. అది నిజమా? కాదా? దానిని ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి కాస్త మార్చి రాశాయి. ఏపీకి మూడులక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని అమిత్ షా అన్నట్లు ఈనాడు మార్చేసింది. హిందూ పత్రికలో మాత్రం మూడు లక్షల కోట్ల ఆర్థిక సాయం చేసినట్లు అమిత్ షా చెప్పారని పేర్కొన్నారు. అమరావతి రాజధాని కోసం రూ.15 వేల కోట్ల గ్రాంట్ ఇచ్చారని చంద్రబాబు తన ప్రసంగంలో చెబితే, అమిత్ షా మాత్రం దానిని రుణంగానే చెప్పారన్న సంగతి తెలుస్తుంది. హడ్కో, వరల్డ్ బ్యాంకు ద్వారా రూ.27 వేల కోట్ల రుణం ఇప్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. వక్రీకరించి వార్తలు రాసి పాఠకులను టీడీపీ జాకీ మీడియా మోసం చేస్తోందని పదే,పదే రుజువు చేసుకుంటున్నాయి. కేంద్రం నిజంగానే రూ.మూడు లక్షల కోట్లు సాయం చేసి ఉంటే ఆ డబ్బంతా ఏమైపోయిందో అర్థం కాదు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా, పెద్దగా అభివృద్ది పనులు ఏమీ చేపట్టకుండా ఆ నిధులు ఎటు మళ్లిస్తున్నారో ప్రభుత్వం వివరించాలి. ఇవి చాలక ఇప్పటికే రూ.70 వేల కోట్ల అప్పులు తీసుకు వచ్చారు. కరెంటు ఛార్జీల రూపంలో రూ.15 వేల కోట్ల మేర బాదారు. ఈ విషయాల గురించి కానీ విభజన హామీల గురించి ప్రస్తావించకుండా అమిత్ షా భజన చేయడానికే చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు అధిక సమయం కేటాయించినట్లు ఉంది. కేంద్రం మద్దతుతో వెంటిలేటర్ నుంచి బయటపడ్డామని, ఇప్పటికీ పేషంటే అని చంద్రబాబు చెబుతున్నారు. యథాప్రకారం రూ.పది లక్షల కోట్ల అప్పు అని అదని, ఇదని గత ప్రభుత్వానికి సంబంధించి అబద్దాలు చెప్పి అమిత్ షాను మోసం చేస్తే ఏమి లాభం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగైతే సూపర్ సిక్స్ హామీలను చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదో తెలపాలి కదా! అమిత్ షా తో తమ సూపర్ సిక్స్, ఎన్నికల ప్రణాళిక హామీల అమలు తీరు గురించి మాత్రం చర్చించలేదు. జగన్ ఇళ్ల గురించి ఇంత కీలక నేతలు మాట్లాడుకున్నారంటే ప్రజల పట్ల వీరికి ఉన్న చిత్తశుద్ది ఏమిటో తెలియడం లేదా! పోచికోలు కబుర్లు చెప్పుకోవడానికి వీరికి ఇంత ఖాళీ టైమ్ ఉంటుందా!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
నక్సలిజం కొన ఊపిరితో ఉంది: కేంద్ర హోంమంత్రి అమిత్ షా
ఛత్తీస్‌గఢ్–ఒడిశా సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో 14 మంది నక్సలైట్లు మృతిచెందడం మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘నక్సలిజానికి మరో పెద్ద ఎదురుదెబ్బ. దేశాన్ని నక్సల్ రహితం చేయాలన్న లక్ష్యం దిశగా భద్రతాబలగాలు పెద్ద విజయం సాధించాయి. సీఆర్పీఎఫ్, ఒడిశా స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్, ఛత్తీస్‌గఢ్ పోలీసు బలగాలు చేపట్టిన సంయుక్త ఆపరేషన్‌లో 14 మంది నక్సలైట్లు మృతి చెందారు. నక్సల్స్ లేని భారత్ దిశగా ఇదొక ముందడుగు. దేశంలో నక్సలిజం కొన ఊపిరితో ఉంది..’ అని అమిత్ షా పేర్కొన్నారు.2026 నాటికి అంతం చేస్తాం: ఛత్తీస్‌గఢ్ సీఎంకేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉన్న డబుల్ ఇంజన్ సర్కారు నక్సలిజం అణచివేతను విజయవంతంగా కొనసాగిస్తోందని ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ పేర్కొన్నారు. ‘2026 మార్చి నాటికి నక్సలిజం అంతం చేస్తాం. ఆ దిశగా భద్రతా దళాలు ముందుకెళుతున్నాయి’ అని ఆయన తెలిపారు. -
మావోయిజం చివరి దశలో ఉంది: అమిత్ షా
-
ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌పై అమిత్ షా ట్వీట్
సాక్షి, ఢిల్లీ: ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. నక్సలిజం చివరి దశలో ఉందన్న అమిత్.. మావోయిస్టులను ఏరివేసే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. త్వరలోనే మనం మావోయిస్టులు లేని ఇండియాను చూస్తామంటూ ట్వీట్లో పేర్కొన్నారు.మన భద్రతాదళాలు సాధించిన గొప్ప విజయంగా పేర్కొన్న అమిత్‌షా.. నక్సలిజానికి ఇది గట్టి ఎదురుదెబ్బ అన్నారు. నక్సల్స్ లేని భారత్ దిశగా ఇది కీలక అడుగని.. దేశంలో నక్సలిజం కొన ఊపిరితో ఉందన్నారు.ఛత్తీస్‌గఢ్-ఒడిశా సరిహద్దులో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎదురు కాల్పుల్లో 19 మంది మావోయిస్టులు మృతిచెందారు. మావోయిస్టుల కీలక నేతలు కూడా మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు చలపతి, మనోజ్ ఉన్నారు. గతంలో వారిపై ప్రభుత్వం కోటి రూపాయలు రివార్డ్ ప్రకటించింది. ఇదీ చదవండి: భారీ ఎన్కౌంటర్.. మావోయిస్ట్ కీలక నేత చలపతి మృతిమావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా సరిహద్దు జిల్లాలైన గరియాబంద్, నౌపాడలో ఛత్తీస్‌గఢ్, ఒడిశా పోలీసులు, సీఆర్పీఎఫ్ సిబ్బంది కలిసి ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జరిగిన ఎన్కౌంటర్లో నిన్న ఇద్దరు మావోయిస్టులు మృతి చెందగా.. తెల్లవారుజామున జరిపిన గాలింపులో మరో 14 మంది మృతదేహాలు లభ్యం కాగా, ఇవాళ మధ్యాహ్నానికి 19కి పెరిగింది. భారీస్థాయిలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఈ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.Another mighty blow to Naxalism. Our security forces achieved major success towards building a Naxal-free Bharat. The CRPF, SoG Odisha, and Chhattisgarh Police neutralised 14 Naxalites in a joint operation along the Odisha-Chhattisgarh border. With our resolve for a Naxal-free…— Amit Shah (@AmitShah) January 21, 2025 -
పరువు నష్టం కేసులో రాహుల్‌కు ఊరట
న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాందీకి ఊరట లభించింది. ట్రయల్ కోర్టు విచారణపై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది. 2019లో లోక్‌సభ ఎన్నికల సమయంలో జార్ఖండ్‌లోని చైబాసా పట్టణంలో బహిరంగ సభలో రాహుల్ మాట్లాడుతూ అమిత్ షాపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన హంతకుడు అని మండిపడ్డారు. రాహుల్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ నాయకుడు నవీన్ ఝా 2019లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమిత్ షా పరువుకు నష్టం కలిగించేలా రాహుల్ మాట్లాడారని ఆరోపించారు. రాహుల్‌పై పరువునష్టం కేసు పెట్టారు. ఈ కేసు విచారణలో భాగంగా తమ ఎదుట వ్యక్తిగతంగా హాజరుకావాలని రాహుల్ గాం«దీని రాంచీలోని మెజిస్టీరియల్ కోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వు జారీ చేసింది. ఈ ఉత్తర్వును సవాలు చేస్తూ ఆయన తొలుత జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. కింది కోర్టు ఉత్తర్వులో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించింది. దీంతో రాహుల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. జార్ఖండ్ ప్రభుత్వానికి, బీజేపీ నేత నవీన్ ఝాకు నోటీసు జారీ చేసింది. రాహుల్ దాఖలు పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా కింది కోర్టులో రాహుల్‌పై విచారణ నిలిపివేయాలని తేల్చిచెప్పింది. రాహుల్ తరఫున సీనియర్ అడ్వొకేట్ అభిõÙక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. -
అమిత్ షా అన్నదొకటి చిన్నమ్మ చెప్పిందొకటి
-
అమిత్‌షా పర్యటనతో ఏం ఒరిగింది: పోతిన మహేష్
సాక్షి,విజయవాడ:అమిత్‌షా ఆంధ్రప్రదేశ్‌కు వస్తే వరాల జల్లు కురిపిస్తారని అందరూ ఊహించారని, అయితే అది జరగలేదని వైఎస్సార్సీపీ సీనియర్ నేత పోతినమహేష్ విమర్శించారు. మహేష్ సోమవారం(జనవరి20) ఈ విషయమై మీడియాతో మాట్లాడారు.‘అమిత్ షా రాకను చంద్రబాబు ఏ విధంగా ఉపయోగించుకున్నారో చెప్పాలి. ఆంధ్రప్రదేశ్,కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉంది. అమిత్ షాతో రాష్ట్రానికి రావాల్సిన నిధులపైన చర్చించి ప్రకటన చేయించి ఉంటే బాగుండేది. తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన విద్యుత్ బకాయిలు 8వేల కోట్లు ఉన్నాయి. వీటిని తీసుకురావడానికి వైఎస్ జగన్ కృషి చేశారు. కృష్ణా జలాల అంశంపై కనీసం మాట్లాడలేదు. రాష్ట్రానికి రావాల్సిన అంశాలపై మాట్లాడడంపై మానేసి వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని తక్కువ చేసే విధంగా మాట్లాడారు.విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్యాకేజీపై కార్మికసంఘాలు,ప్రజలకు అనుమానాలున్నాయి. స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ నిలపివేస్తున్నామని,సెయిల్ లో కలుపుతున్నామని అమిత్‌షాతో ఎందుకు ప్రకటన చేయించలేకపోయారు. అమిత్ షా పర్యటనతో రాష్ట్రానికి ఒరిగింది ఏంటి? చంద్రబాబు నివాసం అక్రమనిర్మాణం కాదా? వరదల్లో మునిగిపోలేదా?ఇటువంటి విషయాలు అమిత్ షాకి చూపించాల్సింది.వైఎస్ జగన్‌పై అబద్దపు ప్రచారాం ఎంతకాలం చేస్తారు. ఇది మంచిపద్దతి కాదు. చంద్రబాబు హైదరాబాద్‌లో కట్టుకున్న ప్యాలెస్‌లోకి ఏ కార్యకర్తనైనా తీసుకుని వెళ్లాడా?కనీసం ప్రవేశం ఉందా? వైఎస్ జగన్ తాడేపల్లి ఇంట్లోనే పార్టీ కార్యక్రమాలు,సమావేశాలు జరుగుతున్నాయి. దేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ అంశంపై అమిత్ షా స్పందించలేదు. అమరావతిలో 5ఎకరాలు భూమి కొన్నారు.ఈ అంశంపై అమిత్ షా మాట్లాడడలేదు.రుషికొండ భవనాలపై విష ప్రచారం చేస్తున్నారు. పవన్‌కి ఒక్కడికే బాబు ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. వైఎస్జగన్ సామాజిక న్యాయం చేసి బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనారిటీలకు ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. చంద్రబాబు ఇప్పుడు లోకేష్‌కే కాదు.బీసీ,ఎస్సీ,ఎస్టీలకు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి. వైఎస్ జగన్ సామాజిక న్యాయం చేస్తే బాబు సామాజిక మోసం చేశారు.పవన్ కళ్యాణ్‌కు ఉపముఖ్యమంత్రి పదవి అమిత్ షా రెకమెండ్ చేస్తే ఇచ్చారని ట్విటర్లో పెట్టారు. బాబు సామాజిక మోసంపై తెలుగుదేశం,జనసేన కార్యకర్తలు మాట్లాడాలి. 30లక్షల మంది పేదవారికి సొంతింటి కలను నేరవేర్చాడం విధ్వంసకర పాలన అంటారా?ప్రజలకు పరిపాలన దగ్గర చేసేందుకు గ్రామవార్డు సచివాలయాలు పెట్టడం విధ్వంసకర పాలన అంటారా? విద్యా,వైద్య రంగాలను అభివృద్ది చేస్తే విధ్వంసకర పాలన అంటారా?హర్బర్లు,పోర్టులు,మెడికల్ కాలేజీలు పెట్టి అభివృద్ది చేయడం విధ్వంసకర పాలన అంటారా’అని మహేష్ ప్రశ్నించారు. -
అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలు.. CPI నేతలు సీరియస్ వార్నింగ్
-
2014 నుంచి 2019 వరకు ఏపీలో విధ్వంసం
సాక్షి, అమరావతి: ‘అపార సహజ వనరులు ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో 2014 నుంచి 2019 వరకు విధ్వంసం సృష్టించారు. అది మానవ తప్పిదాలతో సృష్టించిన విధ్వంసం (మ్యాన్ మేడ్ డిజాస్టర్). దాంతో ఆ ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. అభివృద్ధి పూర్తిగా అడుగంటింది’ అని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా(Amit Shah) స్పష్టం చేశారు. రాష్ట్రంలో 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో అమిత్ షా(Amit Shah) వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.గన్నవరం మండలం కొండపావులూరులోని ఆదివారం నిర్వహించిన ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అమిత్ షా(Amit Shah) తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్‌లో ఆ ఐదేళ్లలో జరిగిన విధ్వంసానికి మూడు రెట్లు అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. కాగా, అమిత్ షా(Amit Shah) హిందీ ప్రసంగాన్ని తెలుగులో అనువదించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మాత్రం చంద్రబాబు పట్ల స్వామిభక్తి ప్రదర్శించారు. అమిత్ షా(Amit Shah) ప్రసంగాన్ని తెలుగులోకి అనువదిస్తూ ‘2019 నుంచి ఐదేళ్లపాటు రాష్ట్రంలో జరిగిన విధ్వంసం’ అని మార్చి చెప్పారు. అమిత్ షా(Amit Shah) 2014 నుంచి 2019 వరకు అని స్పష్టంగా ప్రసంగిస్తే... పురందేశ్వరి మాత్రం 2019 నుంచి ఐదేళ్లపాటు అని అనువదించారు. కానీ అమిత్ షా(Amit Shah) ప్రసంగాన్ని అధికారికంగా విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వ సమాచార విభాగం ‘ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) మాత్రం అసలు విషయాన్ని వెల్లడించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘2014 నుంచి 2019 వరకు మానవ తప్పిదం సృష్టించిన విధ్వంసంతో ఆంధ్రప్రదేశ్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది’ అని అమిత్ షా(Amit Shah) ప్రసంగించినట్టు ఆ ప్రకటనలో అధికారికంగా పేర్కొంది.మరోవైపు అమిత్ షా(Amit Shah) నేరుగా హిందీలో చేసిన ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మోదీ మనసులో ఉన్న మాటనే అమిత్ షా(Amit Shah) చెప్పారని పలువురు వ్యాఖ్యానించారు. అంటే చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో విధ్వంసం సృష్టించిందని, అది మానవ తప్పిదంతో జరిగిన విధ్వంసమేనని అమిత్ షా(Amit Shah) చెప్పారని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. -
ప్రజల భద్రతకు ఎన్డీఆర్ఎఫ్ భరోసా
సాక్షి, అమరావతి: విపత్తులు సంభవించినప్పుడు ప్రజల భద్రతకు భరోసానిస్తూ జాతీయ విపత్తు స్పందన దళం(ఎన్డీఆర్ఎఫ్) నిరుపమాన సేవలు అందిస్తోందని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) అన్నారు. గన్నవరం మండలం కొండపావులూరులో ఆదివారం నిర్వహించిన ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్, దక్షిణ క్యాంపస్ భవనాలను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని చెప్పారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం మూడింతల అభివృద్ధి సాధిస్తుందన్నారు. ఆరు నెలల్లోనే రాష్ట్రానికి రూ.3 లక్షల కోట్ల విలువైన సహకారం అందించామని తెలిపారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు రూ.11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించడంతోపాటు రాజధాని అమరావతి నిర్మాణానికి హడ్కో ద్వారా రూ.27 వేల కోట్ల సహాయం అందిస్తున్నామని చెప్పారు. 2028 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ అమిత్ షా(Amit Shah) మనిషిలా కాకుండా మెషిన్లా పని చేస్తున్నారని, ఆయన పనితీరు చూస్తుంటే అసూయ కలుగుతోందన్నారు. పీపీపీ విధానంలో ‘గోదావరి – బనకచర్ల’ అనుసంధానానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు.ఈ బృహత్తర కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలని కోరారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ విపత్తులను తక్షణం ఎదుర్కొనేందుకు గ్రామ స్థాయిలో కూడా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, బండి సంజయ్, భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత తదితరులు పాల్గొన్నారు. అనంతరం అమిత్ షా(Amit Shah) గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని, ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరారు. తొక్కిసలాట ఘటనపై దృష్టి తిరుపతిలో ఇటీవల చోటు చేసుకున్న తిరుమల శ్రీవారి భక్తుల తొక్కిసలాట ఘటనపై కేంద్ర హోమ్ శాఖ సైతం దృష్టి సారించిందని ఆ శాఖ మంత్రి అమిత్‌షా వీహెచ్‌పీ నేతల భేటీలో వెల్లడించారు. అధికారిక కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఆయనతో ఆదివారం ఉదయం వీహెచ్‌పీ జాతీయ ఉపాధ్యక్షుడు గోకరాజు గంగరాజు నేతృత్వంలో సంఘ ప్రముఖ్‌లు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇటీవల విజయవాడలో వీహెచ్‌పీ నిర్వహించిన హైందవ శంఖారావం సభ గురించి వారు అమిత్‌షాకు వివరించారు. దేశవ్యాప్తంగా ఆలయాలను ప్రభుత్వ పరిధి నుంచి పూర్తిగా తప్పించి, స్వయం ప్రతిపత్తి క ల్పించేందుకు కేంద్రం తగిన చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా తిరుపతి తొక్కిసలాట అంశం వారి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. ఈ ఘటనపై కేంద్ర హోం శాఖ కూడా పరిశీలిస్తోందని కేంద్ర మంత్రి వీహెచ్‌పీ నేతలకు వివరించారని తెలిసింది. ప్రజలు ఏమనుకుంటున్నారు.. రాష్ట్రంలో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలు ఎలాంటి భావంతో ఉన్నారని అమిత్ షా(Amit Shah).. రాష్ట్ర బీజేపీ నేతలను అడిగి తెలుసుకున్నారు. ఆదివారం ఉదయం ఆయన బస చేసిన హోటల్లో రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, కేంద్ర సహాయ మంత్రి భూపతి శ్రీనివాసవర్మ, రాష్ట్ర పార్టీ సంఘటన కార్యదర్శి మధుకర్‌లతో కొద్దిసేపు సమావేశమై రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం అందిస్తున్న సహాయ సహకారాలపై పెద్ద ఎత్తున ప్రజలకు వివరించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని నేతలకు సూచించారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని దిశా నిర్దేశనం చేశారు. నామినేటెడ్ పదవులు పంపకం సహా కూటమి పారీ్టల మధ్య సమన్వయం ఎలా ఉందన్న దానిపై కూడా ఈ భేటీలో చర్చ జరిగింది. -
అమిత్‌షా ఏం మాట్లాడారో మాకు తెలుసు: అంబటి రాంబాబు
సాక్షి,తాడేపల్లి:అందితే జుట్టు అందకపోతే కాళ్లు అనేది చంద్రబాబుకు తెలిసిన విద్య అని మాజీ మంత్రి,వైఎస్సార్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ఆదివారం(జనవరి19) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.‘నాడు తిరుమల దర్శనానికి వచ్చినపుడు అమిత్‌షాపై రాళ్ల వర్షం కురిపించారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలున్నాయి. విభజన సమస్యలు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయి. ఇలాంటి సమయంలో చంద్రబాబు, పవన్‌కల్యాణ్ సమస్యల గురించి మాట్లాడకుండా విందులేంటో. సమస్యలన్నీ పక్కనపెట్టి వైఎస్ జగన్ ప్యాలెస్‌ల గురించి మాట్లాడుతున్నారు. అమిత్ షాతో చంద్రబాబు వైజాగ్ స్టీల్‌ప్లాంట్ విషయం మాట్లాడలేదు.లోకేష్‌ను అదుపులో పెట్టుకోమని అమిత్ షా వార్నింగ్..అమిత్‌షా ఏం మాట్లాడారో మాకు సమాచారం ఉంది. లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేస్తానని చంద్రబాబు అమిత్‌షాను అడిగారట. లోకేష్ అన్ని శాఖల్లో వేలు పెడుతున్నారని, ఆయనను ముందు అదుపులో పెట్టుకోవాలని అమిత్‌షా చంద్రబాబును హెచ్చరించారు. లోకేష్ వసూళ్ల కార్యక్రమంలో నిమగ్నమైనందున స్పీడ్ తగ్గించుకోవాలని అమిత్ షా బాబుకు సూచించారు.అమిత్ షా సలహాలు బయటికి రాకుండా కథలు వండి వారుస్తున్నారు. గత్యంతరం లేకే చంద్రబాబు పవన్‌కల్యాణ్‌ను డిప్యూటీ సీఎం చేశారు. చంద్రబాబు తప్పిదం వల్లే పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నది.వైఎస్ జగన్ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా జరిగాయి’అని అంబటి తెలిపారు.అంబటి రాంబాబు ఇంకా ఏమన్నారంటే..చంద్రబాబు అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకునే రకంరాష్ట్రంలో ఎన్నో సమస్యలున్నాయ్విభజన సమస్యలు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయిరాష్ట్రంలోని సమస్యలను వదిలేసి జగన్ ఆస్తుల గురించి అమిత్ షా అడిగారని ప్రచారం చేస్తున్నారుఆవు కథ మాదిరి వైఎస్ జగన్ పై బురదజల్లడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారుచంద్రబాబు నివాసముండేదే అక్రమ కట్టడంఅక్రమకట్టడంలోనే విందు ఇస్తున్నామని అమిత్ షాకు ఎందుకు చెప్పలేదుఆ ఇల్లు క్విడ్ ప్రోకోలో కొట్టేసిందని అమిత్ షాకు ఎందుకు చెప్పలేదుకృష్ణమ్మ వరద ముంచేసిన ఇంట్లోనే మీరు కూర్చున్నారని ఎందుకు చెప్పలేదుహైదరాబాద్లో ఇల్లు కట్టుకున్న చంద్రబాబు ఎవరికైనా చూపించాడాచంద్రబాబు మాదిరి జగన్ మోహన్ రెడ్డి క్విడ్ ప్రోకోలో ఇళ్లు తీసుకోలేదులోకేష్ ను ఉపముఖ్యమంత్రిగా చేయాలని అమిత్ షా ను చంద్రబాబు అడిగారుమీ అబ్బాయి లోకేష్ స్పీడ్ ను తగ్గించుకోమని అమిత్ షా చెప్పారుఎక్కడపడితే అక్కడ వేలు పెడుతున్నాడు...కొంచెం తగ్గమని చెప్పారువైఎస్ జగన్ ఇళ్ల గురించి పాతచింతకాయ పచ్చడి కథలెందుకుపోలవరం రెండవ డయాఫ్రమ్ వాల్ పనులు నిన్న ప్రారంభించారుడయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి చంద్రబాబు అవివేకంటీడీపీలో చేసిన తప్పిదమే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందిచంద్రబాబు,దేవినేని ఉమా , టీడీపీ తప్పిదాన్ని జగన్ పై నెట్టడం తప్పువైఎస్ జగన్ హయాంలోనే పోలవరం పనులు అద్భుతంగా జరిగాయిస్పిల్ వే , కాఫర్ డ్యామ్ లు జగన్ హయాంలోనే పూర్తి చేశారుతిరుపతి ఘటన మానవతప్పిదంతిరుపతికి ఇప్పుడు రమ్మని చెప్పండి ఎన్డీయేనుతిరుపతి పై ఈ ప్రభుత్వం పూర్తిగా పట్టు కోల్పోయిందిలడ్డూలో కల్తీ నెయ్యి కలిపారని మాపై అభాండాలు వేశారుఆ పాపమే ఇప్పుడు కూటమి పాలనను వెంటాడుతోందిచెప్పేటందుకే చంద్రబాబు నీతులుచంద్రబాబు, ఆయన కుమారుడు ఒక్కొక్కరినే కంటారుపేదలు మాత్రం ఇద్దరు ముగ్గురు కనమంటున్నారుఏపీలో అసమర్ధపాలన సాగుతోందిలోకేష్ భజన తగ్గించాడు...పవన్ చంద్రబాబు భజన మొదలు పెట్టాడుఅలా భజన చేస్తున్నాడు కాబట్టే బాగా లబ్ధి పొందుతున్నాడుమళ్లీ మీరే ఉంటారని గ్యారంటీ ఇవ్వాలని కంపెనీలు లోకేష్ ను అడుగుతున్నాయంటున్నారు ఈ ప్రభుత్వం మీద పారిశ్రామికవేత్తలకు నమ్మకం లేదువైఎస్ జగన్ మళ్లీ రావడం ఖాయమని పారిశ్రామికవేత్తలకు అర్ధమైపోయిందిజగన్ హయాంలోనే పెట్టుబడులు పెడదామని పారిశ్రామిక వేత్తలు ఎదురు చూస్తున్నారుచంద్రబాబు అనుభవజ్ఞుడే అవ్వొచ్చు ...కానీ అసమర్ధుడు -
అమిత్ షాపై చంద్రబాబు ఒత్తిడి.. తగ్గిన కేంద్రం
-
విజయవాడ: ‘గో బ్యాక్ అమిత్ షా’
విజయవాడ, సాక్షి: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏపీ పర్యటనలో నిరసన సెగ తగిలింది. అంబేద్కర్‌పై షా చేసిన వ్యాఖ్యల ఆధారంగా ‘‘ గో బ్యాక్ అమిత్ షా’’ నినాదాలతో నగరంలో ఆదివారం వామపక్షాలు నిరసన చేపట్టాయి. అంబేద్కర్‌ని అవమాన పరిచిన అమిత్ షా రాజీనామా చేయాలని, ఆయన వెంటనే వెనక్కి వెళ్లిపోవాలంటూ డిమాండ్ చేశారు వాళ్లు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.. ప్రధాని మోది అమిత్ షాకు మద్దతు ఇవ్వడం సిగ్గుమాలిన చర్య. రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడికి మీరు ఇచ్చిన గౌరవం ఇదేనా. అంబేద్కర్ ను అవమానించిన షా.. తన వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకోవాలి. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం’’ అని అన్నారు. ‘‘పార్లమెంట్ వేదికగా నిండు సభలో అవమానించారు. పైగా ఆయన తన వ్యాఖ్యల్ని సమర్ధించుకుంటున్నారు. అమిత్ షా ఆ వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకొని క్షమాపణ చెప్పాలి’’ అని సీపీఎం నేత ఉమా మహేశ్వరరావు అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో ఇతర వామపక్ష పార్టీల నేతలు పాల్గొన్నారు. కేంద్ర సాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లండి: అమిత్ షానగరంలోని నోవాటెల్ హోటల్లో ఏపీ బీజేపీ (BJP) నేతలతో ఆ పార్టీ అగ్రనేత అమిత్‌షా (Amit shah) సమావేశం ముగిసింది. సుమారు గంటన్నరపాటు ఈ భేటీ కొనసాగింది. కీలక అంశాలపై రాష్ట్ర భాజపా నేతలకు అమిత్‌షా దిశానిర్దేశం చేశారు.ఏపీకి కేంద్రం అందిస్తున్న సాయం, రాష్ట్ర అభివృద్ధికి చేపడుతున్న చర్యలు, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. అంతర్గత విభేదాలను పక్కన పెట్టి రాష్ట్రంలో భాజపా బలోపేతానికి అందరూ కృషి చేయాలన్నారు. ‘హైందవ శంఖారావం’ సభ విజయం పట్ల పార్టీ, వీహెచ్‌పీ నేతలకు అమిత్‌షా అభినందనలు తెలిపారు. తిరుమల తొక్కిసలాట ఘటనపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. దీనిపై కేంద్రహోంశాఖ దృష్టిపెట్టిందని అమిత్‌షా చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నేతలు ముందుకెళ్లాలని ఆయన సూచించారు. ఎన్డీఆర్ఎఫ్ వేడుకల్లో షా.. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం(NDRF) 20వ వ్యవస్థాపక దినోత్సవం వేడుకల్లో కేంద్ర మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. కృష్ణా జిల్లా కొండపావులూరులోని 10వ NDRF బెటాలియన్ వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ (NIDM) సౌత్ క్యాంపస్‌ను అమిత్ షా ప్రారంభించారు. అనంతరం ముగ్గురు మొక్కలు నాటారు. అంతకు ముందు.. నగరంలోని నోవాటెల్‌లో అమిత్ షాతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా పది నిమిషాలపాటు భేటీ అయ్యారు. అక్కడి నుంచి ఇద్దరూ కలిసి కొండపావులూరు చేరుకున్నారు. అంతకంటే ముందే పవన్ అక్కడికి చేరుకున్నారు. -
ఏపీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన
-
‘విష్ణుమాయ ముందు చంద్రమాయ భస్మం కాకతప్పదు’
తిరుపతి, సాక్షి: తిరుమలలో వరుస ఘటనలను తీవ్రంగా పరిగణించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దర్యాప్తునకు ఆదేశించింది. అయితే ఏం జరిగిందో ఏమోగానీ.. రాత్రికిరాత్రే ఈ ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది. ఈ పరిణామంపై టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్‌రెడ్డి(Bhumana Karunakar Reddy) స్పందించారు. ‘‘అధికారంలోకి వచ్చాక తిరుమలపై పాప ప్రక్షాళన చేస్తామని చంద్రబాబు(Chandrababu), పవన్ కల్యాణ్(Pawan kalyan) చెప్పారు. అయితే ఆలయ పవిత్రతను సర్వనాశనం చేశారు అని కేంద్రం స్పందించింది. తిరుమలలో రాష్ట్రం సరైన చర్యలు తీసుకొక పోవడంతోనే కేంద్రం చర్యలు చేపట్టింది. వరుస ఘటనలపై నిగ్గు తేల్చేందుకు అధికారిని కేంద్రం పంపుతామంది. కానీ, విజయవాడకు వచ్చిన అమిత్ షాను చంద్రబాబు, పవన్ బతిమిలాడారు. రాత్రికి రాత్రే నిర్ణయాన్ని నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ఒత్తిడి తెచ్చారు. హడావుడిగా ఇచ్చిన జీవోలో అధికారుల సంతకాలు లేవు’’ అని భూమన ఆరోపించారు. తిరుమలలో ఎన్నడూ లేని విధంగా వరుస దురాగతాలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరంతరం ఏదో ఒకటి జరుగుతోంది. అధికారుల అలసత్వంతో.. అవినీతితో విచ్చలవిడితనం కనిపిస్తోంది. బ్రహ్మాండనాయకుడి కొండపై మద్యం, బిర్యానీలు లభ్యమవుతున్నాయి. మాడ వీధుల్లో కూడా చెప్పులు వేసుకుని తిరుగుతున్నారు అంటే మీ పర్యవేక్షణ ఏవిధంగా ఉందో అర్థం పడుతోంది. తిరుమలలో ఈ మధ్యకాలంలో నాలుగుసార్లు ఎర్రచందనం దొరికింది. మిమ్మల్ని చూసుకుని సప్లై చేస్తున్న దొంగలు ఎవరు? అటవీశాఖ మంత్రిగా ఉన్న పవన్ ఏం చేస్తున్నారు?. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొండపై కొండపై అరాచకాలు పెరిగిపోయాయి. తిరుమల కొండపై అవినీతి ఏరులై పారుతోంది. టీడీపీ, జనసేన(Jana Sena) నాయకులు టికెట్లు అమ్ముకుంటూ సంపద సృష్టిస్తున్నారు. ఇది దైవానికి జరుగుతున్న ద్రోహంగా ప్రజలు భావిస్తున్నారు. సర్వ సాక్షి అయిన వేంకటేశ్వర స్వామిని మోసం చేయాలని చూస్తే శిక్ష తప్పదు. ఆరుగురి మరణానికి కారకులెవరూ?‘‘క్రౌడ్ మేనేజ్మెంట్కు సంబంధించి టీటీడీ నుంచి ప్రత్యేక బృందం అయోధ్య రామలయానికి పంపిన ఘనత మాది. మీ పాలనలో టీటీడీ పరువు తీశారు. వైకుంఠ దర్శనానికి వచ్చిన భక్తులను పశువుల దొడ్డిలో పడేశారు. తొక్కిసలాట(Stampede)లో ఆరుగురు భక్తులు మరణించడం బాధాకరం. ఆ మరణాలకు బాధ్యులు ఎవరు?. ప్రమాదానికి కారకులపై ఎందుకు చర్యలు తీసుకోలేదు. టీటీడీ ఈవో, అడిషనల్ ఈవో, కలెక్టర్‌పై చర్యలు తీసుకోకుండా.. తూతూమంత్రంగా ఎస్పీని సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు. పైగా మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూపాయి కూడా ఇవ్వలేదు. వైకుంఠ ఏకాదశి కు సునీత గౌడ అనే కర్ణాటక భక్తురాలు 70 లక్షలు ఖర్చు చేసి పుష్ప అలంకరణ చేస్తే బయట పెట్టేశారు. అక్షర మాయకు ఆ దేవుడే బదులిస్తాడుచంద్రబాబు పాపలపుట్ట కొండగా మారుతోంది. ఒక న్యూస్ చానల్ అధినేత బీఆర్ నాయుడు(BR Naidu)కు చైర్మన్ పదవి ఒక్కటే ప్రామాణికం కాదు. లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి అంటూ అసత్య ప్రచారం చేశారు. వైఎస్సార్సీపీపై బురద జల్లాలని ప్రయత్నించారు. లడ్డూ వ్యవహారంలో సిట్ ఏం తేల్చింది?. ఇప్పుడు నెపాన్ని మా మీద నెట్టేసే పరిస్థితులు కూడా దాటిపోయాయి. ఈ అపచారాలకు భగవంతుడు తప్పకుండా శిక్ష వేస్తాడు. చంద్రబాబు ఎల్లో మీడియా అక్షర మాయతో మాపై బురద చల్లితే.. విష్ణు మాయ ముందు చంద్రమాయ భస్మం కాక తప్పదు’’ అని భూమన అన్నారు.