
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దు అయ్యింది. ఈ నెల 6న గణేష్ నిమజ్జన ఉత్సవాల్లో పాల్గొంటారని ముందుగా షెడ్యూల్ విడుదలైంది. ఎల్లుండి(శనివారం) గణేష్ నిమజ్జనానికి ముఖ్య అతిథిగా ఆయన రావాల్సి ఉంది. అయితే, ఢిల్లీలో ముఖ్యమైన కార్యక్రమాల నేపథ్యంలో పర్యటనను ఆయన రద్దు చేసుకున్నారు.
ఉప రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఎంపీలతో అభ్యాస్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ నెల 9న ఉప రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఉప రాష్ట్రపతి ఎన్నికల సన్నాహకంలో భాగంగా అమిత్ షా పర్యటన రద్దు అయినట్లు టీబీజేపీ, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితికి అమిత్‌షా కార్యాలయం సమాచారం ఇచ్చింది.