ఖమ్మం జిల్లా: కొణిజర్ల సర్పంచ్ అభ్యర్థిగా అదే గ్రామానికి చెందిన గూదె పుష్పావతి పోటీలో నిలిచా రు. ఆమె ఎం.ఫార్మసీ చదివి కొద్దిరోజులు ఉద్యోగం చేశారు. కొణిజర్లకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి గూదె ఉపేందర్‌తో వివా హం జరిగింది. కొణిజర్ల పంచా యతీ రిజర్వేషన్ బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో సర్పంచ్‌గా పోటీలో నిలిచింది.
కూసుమంచిలో..
కూసుమంచి: మండలంలో పలువురు విద్యావంతులు సర్పంచ్, వార్డు స్థానాల్లో బరి లో దిగారు. నేలపట్ల గ్రా మానికి చెందిన అలవాల లింగయ్య ఆర్జేసీ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తుండగా ఆయన బీఆర్‌ఎస్ మద్దతుదారుడిగా నేలపట్ల సర్పంచ్ స్థానంలో బరిలో నిలిచారు. కూసుమంచి నుంచి కొండా కృష్ణవేణి కాంగ్రెస్ మద్దతుదారుగా సర్పంచ్ బరిలో దిగగా డిగ్రీ చదివిన ఆమె ఎంపీడీఓ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగం చేస్తున్నారు.
ఇదే పంచాయతీలో ఇంజనీరింగ్ కళాశాలలో ఫ్యాకలీ్టగా పనిచేస్తున్న గుండా ఉపేందర్‌రెడ్డి 8వ వార్డు నుంచి బీజేపీ మద్దతుదారుడిగా బరిలో దిగారు. సీపీఎం మద్దతుదారుగా డిగ్రీ చదివిన సల్వాది బేబీరాణి సర్పంచ్‌గా బరిలో ఉన్నారు. కూసుమంచి 12వ వార్డుకు బీఆర్‌ఎస్ తరఫున అర్వపల్లి ఉపేందర్ నామినేషన్ దాఖలు చేయగా ఆయన భార్య రేణుక నాలుగో వార్డు నుంచి బరిలో ఉన్నారు. గట్టుసింగారం గ్రామానికి చెందిన వాచేపల్లి హనుమారెడ్డి కాంగ్రెస్ తరఫున 2వ వార్డులో బరిలో నిలవగా అతడి భార్య స్వరూప 6వ వార్డు నుంచి నామినేషన్ దాఖలు చేశారు.


