యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘పేరుగ‌ల్ల‌ పెద్దిరెడ్డి’ సాంగ్ | Social Media Trend Naga Durga New Peddi Reddy Song | Sakshi
Sakshi News home page

యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘పేరుగ‌ల్ల‌ పెద్దిరెడ్డి’ సాంగ్

Dec 4 2025 11:18 AM | Updated on Dec 4 2025 11:19 AM

Social Media Trend Naga Durga New Peddi Reddy Song

తెలంగాణ జానపదలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గాయని, నృత్యకారిణి నాగదుర్గ నుంచి తాజాగా విడుదలైన పాట ‘పేరుగ‌ల్ల‌ పెద్దిరెడ్డి’ ప్రస్తుతం యూట్యూబ్‌లో మరియు సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. తెలంగాణ ఫోక్ సాంగ్స్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాగదుర్గ, ఈ కొత్త పాటతో మరోసారి ప్రేక్షకులను ఆకర్షిస్తున్నారు. పేరుగ‌ల్ల‌ పెద్దిరెడ్డి అంటూ వ‌చ్చిన ఈ పాట తండ్రి మీద ప్రేమ‌తో కూతురు చెబుతున్న నేప‌థ్యంలో ఉంది. 

పల్లెటూరి వాతావరణాన్ని, జానపద లయను ప్రతిబింబిస్తూ ఈ పాట ఆక‌ట్టుకుంటుంది. ఎప్పటిలాగే, నాగదుర్గ ఈ పాటలో తనదైన శైలిలో చేసిన ఎనర్జిటిక్ డ్యాన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. శుక్రవారం విడుద‌లైన ఈ పాట కొద్ది గంట‌ల్లోనే యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌ను సాధిస్తూ ట్రెండింగ్‌లో నిలిచింది. పల్లె జానపద పాటల అభిమానుల మధ్య ఈ పాట క్రేజీ హిట్‌గా మారడంతో నాగదుర్గ ఖాతాలో మరో విజయవంతమైన జానపద పాట చేరింది. ఈ పాట‌కు బుల్లెట్ బండి ల‌క్ష్మణ్ సాహిత్యం అందించ‌గా.. మమత రమేష్ గానం చేశారు. సంగీతాన్ని మదన్ కే అందించారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement