రంగారెడ్డి కలెక్టరేట్‌లో ఏసీబీ సోదాలు | Acb Searches Residence Of Rangareddy District Land Record Ad Srinivas | Sakshi
Sakshi News home page

రంగారెడ్డి కలెక్టరేట్‌లో ఏసీబీ సోదాలు

Dec 4 2025 11:14 AM | Updated on Dec 4 2025 11:51 AM

Acb Searches Residence Of Rangareddy District Land Record Ad Srinivas

సాక్షి, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా ల్యాండ్‌ రికార్డ్‌ ఏడీ శ్రీనివాస్‌ నివాసంలో ఏసీబీ సోదాలు చేపట్టింది. శ్రీనివాసులపై ఆదాయం నుంచి ఆస్తుల కేసు నమోదైంది. ఆరు బృందాలతో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి మహబూబ్‌నగర్ జిల్లాలో సోదాలు కొనసాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో ఆరు చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

ల్యాండ్‌ రికార్డ్స్ ఈడీగా పెద్ద ఎత్తున అక్రమాస్తులు సంపాదించినట్లు గుర్తించారు. మహబూబ్‌నగర్‌లో ఒక రైస్ మిల్లును కూడా అధికారులు గుర్తించారు. పలు చోట్ల షెల్ కంపెనీల పేరుతో వ్యాపారాలు చేస్తున్నట్లు ఏసీబీ గుర్తించింది. రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంతో పాటు రాయ్ దుర్గ మై హోమ్ భూజలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement