ఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల సేవల్లో భారీ అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే 200 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 33 ఇండిగో విమానాలు రద్దు చేశారు. శంషాబాద్‌కు రావాల్సిన 27 ఇండిగో విమానాలు రద్దు అయ్యాయి.
ఢిల్లీ 30, బెంగళూరు ఎయిర్‌పోర్టులో 42 విమానాలు రద్దు అయ్యాయి. చాలా చోట్ల ఆలస్యంగా విమానాలు నడుస్తున్నాయి. దేశంలో 35 శాతానికి ఇండిగో సర్వీసులు పడిపోయాయి. సిబ్బంది కొరత కారణంగా ఇండిగో విమానాలు రద్దు కావడంతో విమానాశ్రయాల్లో గందరగోళం నెలకొంది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున విమాన రద్దయ్యాయి. గురువారం మొత్తం 170కి పైగా ఇండిగో ఫ్లైట్లు రద్దయ్యే అవకాశం ఉంది.
బుధవారం నాలుగు నగరాల్లో కలిపి 200 విమానాలు రద్దయ్యాయి. కార్యకలాపాలు గణనీయంగా దెబ్బతిన్నాయనిఅని ఇండిగో అంగీకరించింది. శీతాకాల షెడ్యూల్ మార్పులు, వాతావరణం, సాంకేతిక లోపాలు కారణమని ఇండిగో చెబుతోంది. కొత్త ఎఫ్‌డీటీఎల్ నిబంధనలతో పైలట్ల కొరత తీవ్రమైంది. షెడ్యూల్ సర్దుబాట్లు చేస్తూ కార్యకలాపాల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామని.. వచ్చే 48 గంటల్లో పరిస్థితి సాధారణ స్థితికి తేవడమే లక్ష్యం అని ఇండిగో ప్రకటించింది.
ఇదీ చదవండి: భారీ సంఖ్యలో విమానాల రద్దుకు కారణం ఏంటంటే..
నవంబరులో మొత్తం 1,232 ఇండిగో విమానాలు రద్దు అయ్యాయి. 755 ఫ్లైట్లు క్రూ/FDTL కారణంగా రద్దయ్యాయి. 258 విమానాలు ఎయిర్‌స్పేస్ పరిమితుల వల్ల రద్దయ్యాయి. 92 విమానాలు ATC వ్యవస్థ వైఫల్యంతో రద్దయ్యాయి. ఫైట్ల రాకపోకల్లో అంతరాయంపై ఇండిగోను డీజీసీఏ వివరణ కోరింది. ఇండిగో ఫైట్ల రాకపోకల్లో అంతరాయంపై దర్యాప్తు చేస్తున్నట్లు డీజీసీఏ తెలిపింది. ప్రస్తుత పరిస్థితికి కారణం ఏమిటో తెలియజేయాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. అలాగే విమాన సేవలను యథాతథంగా కొనసాగించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని సూచించినట్లు వివరించారు.


