breaking news
Indigo flights
-
115 ఇండిగో విమానాలు రద్దు.. ఎయిర్ పోర్ట్ లో ప్రయాణికుల అవస్థలు
-
రంగంలోకి మోదీ మ్మోహన్ కు బిగ్ షాక్
-
ఇండిగో గందరగోళం.. అసలేం జరుగుతోంది?
దేశంలో విమాన సర్వీసుల్లో దాదాపు 60 శాతం వాటాతో అగ్రగామిగా ఉన్న ఇండిగో సంస్థలో సంక్షోభం నెలకొంది. ఇండిగో సంక్షోభంపై రంగంలోకి దిగిన ప్రధాని మోదీ.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడి పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. -
ఇండిగో తెచ్చిన సంక్షోభం
దేశీ పౌరవిమానయాన రంగంలో 66 శాతం వాటాతో దాదాపు గుత్తాధిపత్యం చెలాయిస్తున్న ఇండిగో సంస్థ... తమ జోలికెవరూ రాకూడదన్న రీతిలో వ్యవహరించిన తీరు వల్ల శుక్రవారం వెయ్యికి పైగా విమానాలు రద్దయ్యాయి. ఈ సంఖ్య మరింత ఎక్కువ ఉండవచ్చు కానీ.. నిర్దిష్టంగా ఎంతన్నది సంస్థ వెల్లడించలేదు. బుధ, గురు వారాల్లోనూ వెయ్యికి పైగా విమానాలు రద్దు కావటంతో దేశవ్యాప్తంగా ప్రయాణికుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. పైలట్ల డ్యూటీ, విశ్రాంతికి సంబంధించి పౌరవిమానయాన సంస్థ (డీజీసీఏ) ఇచ్చిన మార్గదర్శకాలను పాటించడం ఇష్టంలేక... విమానాలు రద్దుచేసి ప్రయాణికుల్ని ఇబ్బందులు పెట్టడం ద్వారా డీజీసీఏను దిగివచ్చేలా చేయాలన్న ఇండిగో వ్యూహం నెరవేరినట్లే అనుకోవాలి.వేల విమానాలు రద్దవుతుండటంతో చివరకు డీజీసీఏ దిగివచ్చింది. నిబంధనలను తాత్కాలికంగా సడలిస్తామని, విమానాలు పూర్తిస్థాయిలో తిరిగేలా చేయాలని ఇండిగోను అభ్యరి్థంచింది. ఇండిగో దీనికి ఒప్పుకుంటూనే... తాము మార్గదర్శకాలను లైట్ తీసుకున్నామని, అందుకే ఈ పరిస్థితి వచ్చిందని, డీజీసీఏ సడలింపులిచ్చింది కనక త్వరలో పరిస్థితి చక్కబడుతుందని అధికారికంగా ప్రకటించింది. ఏ రంగంలోనైనా ఒకటిరెండు సంస్థలే గుత్తాధిపత్యం చెలాయిస్తే ఏమవుతుందన్నది ఇండిగో ఉదంతం మరోసారి నిరూపించినట్లయింది. పైలట్ల విశ్రాంతి, డ్యూటీకి సంబంధించి... పైలట్లు్ల విరామంలేకుండా విమానాలను వేల కిలోమీటర్ల దూరాలు నడుపుతున్నారని, దీనివల్ల వారి ఆరోగ్యంతో పాటు ప్రయాణికులు సైతం రిసు్కలో పడుతున్నారని భావించి డీజీసీఏ కొన్ని నిబంధనలు తీసుకొచ్చింది. వీటిని 2024 జనవరిలోనే విడుదల చేసింది. మొత్తం 22 నిబంధనల్లో 15 నిబంధనలు ఈ ఏడాది జూలై నుంచి అమల్లోకి రాగా... పైలట్ల విశ్రాంతి, డ్యూటీకి సంబంధించిన మిగతా 7 నిబంధనలు ఈ నవంబరు 1 నుంచి అమల్లోకి వచ్చాయి. వారానికి 12 గంటలుగా ఉన్న పైలట్ల విశ్రాంతి సమయాన్ని 48 గంటలకు పెంచడం, రాత్రి వేళ ఏ పైలట్ కూడా రెండుకు మించి ఎక్కువ ల్యాండింగ్‌లు చేయకూడదని విధించిన నిబంధనలను పాటించటం వల్ల మరింతమంది సిబ్బంది కావాల్సి వస్తారని ఇండిగో భావించింది.అందుకే ఈ నిబంధనల్ని అడ్డం పెట్టుకుని నవంబరులో ఏకంగా 1,200పైగా విమానాలను రద్దు చేసింది. చాలా విమానాలు ఆలస్యమయ్యాయి కూడా. అయితే దేశవ్యాప్తంగా ఇండిగో నెలకు 60వేలకు పైగా సర్వీసులను నడిపిస్తోంది. కాబట్టి 1,200 రద్దుతో పెద్ద తేడా రాలేదు. కానీ ఈ నెల 3న ఒకేరోజు 500కు పైగా విమానాలు రద్దు కావటం... 4న అది కొనసాగటం...5న తీవ్రమవటంతో సంక్షోభం ఒక్కసారిగా బద్దలయింది. అయ్యప్పభక్తుల శబరిమల యాత్ర మొదలు శీతాకాల పర్యటనలకు వెళ్లే సందర్శకులు, అత్యవసర పనుల నిమిత్తం విమానప్రయాణాలను ఎంచుకునే లక్షలాది మంది జనం తాము ఎక్కే విమానం అసలు బయల్దేరుతుందో లేదో... రద్దయితే రిఫండ్ ఎప్పుడొస్తుందో తెలీక తీవ్ర అసహనానికి గురయ్యారు. ఇదే అదునుగా ఇతర కంపెనీలు అత్యధిక ధరల మోత మోగించడంతో ప్రయాణికులు గగ్గోలు పెట్టారు. దీంతో రంగంలోకి దిగిన కేంద్రం ఇండిగోకు ఈ నిబంధనల నుంచి తాత్కాలికంగా మినహాయింపునిచ్చింది. 10 రోజుల్లో పరిస్థితి అదుపులోకి! నిబంధనావళిని సడలించటంతో ఎక్కువ మంది పైలట్లు అందుబాటులోకి వచ్చి విమానాల రద్దుకు తెరపడుతుందని, మరో 10 రోజుల్లో అంతా సర్దుకుంటుందని, డిసెంబర్ 10–15 తేదీకల్లా సాధారణ స్థాయిలో విమానాల రాకపోకలు ఉంటాయని ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ శుక్రవారం ప్రకటించారు. నిబంధనలను తక్కువగా అంచనావేశాం. క్షమించమని కూడా కోరారాయన. శనివారం నుంచి పరిస్థితిలో మార్పురావొచ్చునన్నారు. ప్రధాన ఎయిర్‌పోర్ట్‌లలో అంతా గందరగోళంశుక్రవారం ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి షెడ్యూల్ చేసిన మొత్తం 235 దేశీ సర్విసులను ఇండిగో రద్దుచేసింది. దేశంలోని ప్రధాన విమానాశ్రయాలకు అప్పటికే వచ్చిన ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. కొన్ని ఎయిర్‌పోర్టుల్లో ఇండిగో కౌంటర్ల వద్ద సిబ్బంది కనిపించలేదు. ఇచ్చేసిన లగేజీలను వెనక్కి తెచ్చుకోవడం, మరో కంపెనీ విమానాన్ని బుక్ చేసుకోవడం, గత విమాన టికెట్ రీఫండ్ కోసం ప్రయతి్నంచడం ఇలా పలు రకాల బాధలు పడుతున్నారు.డిమాండ్ పెరగటంతో పోటీ సంస్థలు ధరలు పెంచేశాయి. ప్రధాన రూట్లలో ఒక్కో టికెట్ ధర ఏకంగా రూ.లక్ష దాటేసిందని సోషల్ మీడియా హోరెత్తింది. ధరలు అమాంతం పెరగకుండా చర్యలు చేపట్టాలని కేంద్రం, డీజీసీఏ చేసిన సూచనలను విమానయాన సంస్థలు పట్టించుకోలేదు. ఎయిర్‌పోర్టుల్లో తాము పడుతున్న అవస్థలను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేస్తుండటంతో నెటిజర్లు ఇండిగో తీరుపై మండిపడటం కనిపించింది. తప్పు ఇండిగోదే: ఆర్.శివరామన్ డైరెక్టర్లు, ఇండిపెండెంట్ డైరెక్టర్లతో ఇండిగోలో చాలా పెద్ద వ్యవస్థ ఉందని, వారిలో ఎవ్వరూ కూడా ఈ పరిస్థితిని ఊహించకపోవటం, దానిగురించి ముందుగా చర్చించకపోవటం అత్యంత దారుణమని మాజీ డీజీసీఏ ఆర్.శివరామన్ చెప్పారు. వారు తక్షణం రాజీనామా చేయాల్సి ఉందన్నారు. రెండేళ్ల కిందటనే నిబంధనలు వెలువరించినా... దాన్ని పాటించాల్సిన డెడ్‌లైన్ దగ్గర పడుతున్నా... అందుకు తగ్గ చర్యలను తీసుకోవటం ఇండిగో బాధ్యతారాహిత్యం తప్ప వేరేమీ కాదని ఆయన స్పష్టంచేశారు. ఇప్పటిదాకా దీన్ని గమనించకపోవటం, ఎప్పటికప్పుడు సమీక్షించకపోవటం డీజీసీఏ తరఫున తప్పిదాలేనని అంగీకరించారాయన. – సాక్షి, నేషనల్ డెస్క్ కీలక నిబంధనల సడలింపు ఇండిగోలోని ఏ320 రకం విమానాలకు సంబంధించిన ఎఫ్డీటీఎల్ నిబంధనలను డీజీసీఏ శుక్రవారం సడలించింది. ముఖ్యంగా అధిక విశ్రాంతి వెసులుబాటుతో విధుల నుంచి విరామం తీసుకున్న పైలట్లను వెంటనే విధులకు హాజరయ్యేలా డీజసీఏ తన నిబంధనలకు సడలింపునిచ్చింది. అంటే వారపు విరామంలో భాగంగా పైలట్లు సమరి్పంచే సెలవు అభ్యర్థనలను తిరస్కరిస్తారు. దీంతో ఎక్కువ మంది పైలట్లు అందుబాటులోకి వస్తారు. గతంలో వారానికి రెండు రోజులే నైట్ డ్యూటీలు వేసేవారు. ఇప్పుడు గరిష్టంగా ఆరు సార్లు నైట్‌డ్యూటీలు చేయొచ్చు.పైలట్లు అందుబాటులోకి వచ్చి రాత్రిపూట సైతం విమానాల రాకపోకలు పెరుగుతాయి. దీంతో విమానాల క్యాన్సిలేషన్ రేటు తగ్గుతుంది. వెనువెంటనే రెండురోజులు నైట్‌డ్యూటీలు చేయకూడదనే నిబంధననూ సడలించారు. ‘‘విమానాల రాకపోకలు కొనసాగేలా నిబంధనలను సడలించాం. అంతేగానీ భద్రతానిబంధనల్లో ఎలాంటి సడలింపు లేదు. సరిపడా పైలట్లను నియమించుకోవాలని ఇండిగోకు సూచించాం’’ అని కేంద్ర పౌరవిమానయాన శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.నిజాలు నిగ్గుతేల్చేందుకు విచారణ షురూ.. మొత్తం ఉదంతంలో నిజానిజాలను నిగ్గుతేల్చేందుకు జాయింట్ డైరెక్టర్ జనరల్ సంజయ్ బ్రాహ్మణి, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అమిత్ గుప్తా, ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్స్పెక్టర్ కెప్టెన్లు కపిల్ మాంగ్లిక్, రాంపాల్‌లతో డీజీసీఏ ప్యానెల్‌ను ఏర్పాటుచేసింది. సమస్యకు కారణాలను అన్వేషించి, కారకులెవరో నిగ్గుతేల్చి 15 రోజుల్లోపు డీజీసీఏకు ఈ ప్యానెల్ నివేదిక సమరి్పంచుంది.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలనూ ప్యానెల్ సూచించనుంది. అయితే నవంబర్ నుంచే సరిపడా పైలట్లను అందుబాటులో ఉంచుకోకపోవడం, నిర్వహణ, షెడ్యూలింగ్, ప్రణాళికా లోపాలు సైతం సమస్యను పెనువిపత్తుగా మార్చేశాయని ప్యానెల్ ప్రాథమికస్థాయిలో అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. శీతాకాల సెలవులు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో పెరిగిన రద్దీకి తగ్గట్లు పైలట్లు అందుబాటులో చూడాలని పైలట్ల సంఘాలకు సైతం డీజీసీఏ విజ్ఞప్తిచేసింది.మరోవైపు అధిక విమానాల రద్దుతో నడిచిన ఆ కొద్దీ విమానాలూ ఆలస్యంగా రాకపోకలు సాగిస్తుండటంతో వాటి సమయపాలనా రేటు (ఓటీపీ) గురువారం దారుణంగా 8.5 శాతానికి పడిపోయింది. మరోవైపు ఆకాశా ఎయిర్ 63 శాతం, ఎయిర్ఇండియా 61 శాతం, ఎయిర్ఇండియా ఎక్స్‌ప్రెస్ 58.6 శాతం, స్పైస్‌జెట్ 56.4, అలయన్స్ ఎయిర్ 56 శాతం ఓటీపీ సాధించడం గమనార్హం.డీజీసీఏ ఫెయిల్యూర్ కూడా...వాస్తవానికి నిబంధనలు విడుదల చేసిన డీజీసీఏ... దాన్ని పాటించడానికి తగ్గ ఏర్పాట్లు ఎయిర్‌లైన్స్ సంస్థలు చేసుకుంటున్నాయో లేదో ఎప్పటికప్పుడు సమీక్షించాలి. కానీ డీజీసీఏ అలాంటివేమీ చేయలేదు. చివరకు రెండునెలల కిందట ఆలిండియా పైలట్ల సంఘం నేరుగా డీజీసీఏను కలిసి... ఇండిగోలో ఎలాంటి ఏర్పాట్లూ చేయటం లేదని, నిబంధనలు గనక కఠినంగా అమల్లోకి తెస్తే సంక్షోభం రావచ్చని తెలియజేస్తూ వినతిపత్రం కూడా ఇచ్చింది. ఈ విషయాన్ని ఆ సంఘం అధ్యక్షుడు శామ్ థామస్ స్వయంగా చెప్పారు. కానీ డీజీసీఏ దీన్ని లైట్ తీసుకుంది. నిబంధనలు అమల్లోకి వస్తే అంతా సర్దుకుంటుందని భావించింది.దీన్ని గమనించిన ఇండిగో... నవంబరు నుంచి కొత్త నిబంధనలు పాటిస్తూ తన పైలట్లకు విశ్రాంతినివ్వటం ఆరంభించింది. కానీ వాళ్ల స్థానంలో వేరొకరిని డ్యూటీలో పంపలేదు. ఎందుకంటే అంతమంది పైలట్లు లేరు. దీంతో కొన్ని విమానాలు ఆలస్యంగా నడపటం... కొన్నిటిని రద్దు చేయటం ఆరంభించింది. చివరికి గడిచిన మూడురోజుల్లో ఈ రద్దుల పర్వం పతాక స్థాయికి చేరింది. ఇండిగో ఉద్దేశపూర్వకంగానే ఇలా చేసిందని, దానిపై క్రిమినల్ కేసులు పెట్టాలని శామ్ థామస్ వ్యాఖ్యానించటం ఈ సందర్భంగా గమనార్హం. -
కొనసాగుతున్న ‘ఇండిగో’ సంక్షోభం
ఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల సేవల్లో భారీ అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే 200 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 33 ఇండిగో విమానాలు రద్దు చేశారు. శంషాబాద్‌కు రావాల్సిన 27 ఇండిగో విమానాలు రద్దు అయ్యాయి.ఢిల్లీ 30, బెంగళూరు ఎయిర్‌పోర్టులో 42 విమానాలు రద్దు అయ్యాయి. చాలా చోట్ల ఆలస్యంగా విమానాలు నడుస్తున్నాయి. దేశంలో 35 శాతానికి ఇండిగో సర్వీసులు పడిపోయాయి. సిబ్బంది కొరత కారణంగా ఇండిగో విమానాలు రద్దు కావడంతో విమానాశ్రయాల్లో గందరగోళం నెలకొంది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున విమాన రద్దయ్యాయి. గురువారం మొత్తం 170కి పైగా ఇండిగో ఫ్లైట్లు రద్దయ్యే అవకాశం ఉంది.బుధవారం నాలుగు నగరాల్లో కలిపి 200 విమానాలు రద్దయ్యాయి. కార్యకలాపాలు గణనీయంగా దెబ్బతిన్నాయనిఅని ఇండిగో అంగీకరించింది. శీతాకాల షెడ్యూల్ మార్పులు, వాతావరణం, సాంకేతిక లోపాలు కారణమని ఇండిగో చెబుతోంది. కొత్త ఎఫ్డీటీఎల్ నిబంధనలతో పైలట్ల కొరత తీవ్రమైంది. షెడ్యూల్ సర్దుబాట్లు చేస్తూ కార్యకలాపాల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామని.. వచ్చే 48 గంటల్లో పరిస్థితి సాధారణ స్థితికి తేవడమే లక్ష్యం అని ఇండిగో ప్రకటించింది.ఇదీ చదవండి: భారీ సంఖ్యలో విమానాల రద్దుకు కారణం ఏంటంటే..నవంబరులో మొత్తం 1,232 ఇండిగో విమానాలు రద్దు అయ్యాయి. 755 ఫ్లైట్లు క్రూ/FDTL కారణంగా రద్దయ్యాయి. 258 విమానాలు ఎయిర్‌స్పేస్ పరిమితుల వల్ల రద్దయ్యాయి. 92 విమానాలు ATC వ్యవస్థ వైఫల్యంతో రద్దయ్యాయి. ఫైట్ల రాకపోకల్లో అంతరాయంపై ఇండిగోను డీజీసీఏ వివరణ కోరింది. ఇండిగో ఫైట్ల రాకపోకల్లో అంతరాయంపై దర్యాప్తు చేస్తున్నట్లు డీజీసీఏ తెలిపింది. ప్రస్తుత పరిస్థితికి కారణం ఏమిటో తెలియజేయాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. అలాగే విమాన సేవలను యథాతథంగా కొనసాగించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని సూచించినట్లు వివరించారు. -
రెండు విమానాలు అత్యవసర ల్యాండింగ్
విమానాశ్రయం (గన్నవరం): విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం ఇండిగో సంస్థకు చెందిన రెండు విమానాలు అత్యవసర ల్యాండింగ్ అయ్యాయి. హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో శనివారం మధ్యాహ్నం ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా విమానాల ల్యాండింగ్‌కు ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో సిలిగురి, బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చిన రెండు ఇండిగో విమానాలను విజయవాడ విమానాశ్రయానికి మళ్లించారు.ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) సూచన మేరకు అధికారులు అత్యవసర ల్యాండింగ్‌కు ఏర్పాట్లు చేయడంతో రెండు విమానాలు మధ్యాహ్నం 2.15 నుంచి 2.20 గంటల మధ్య సురక్షితంగా దిగాయి. గంటన్నర తర్వాత తిరిగి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరి వెళ్లాయి. హైదరాబాద్‌లో కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా విమానాలను ఇక్కడికి దారి మళ్లించినట్లు విమానాశ్రయం అధికారులు తెలిపారు. -
విమానం ముందు అద్దానికి పగుళ్లు
చెన్నై: విమానం ముందు అద్దానికి పగుళ్లు ఏర్పడిన విషయాన్ని ముందుగానే గుర్తించిన పైలట్.. సురక్షిత ల్యాండింగ్‌కు తగిన చర్యలు తీసుకోవడంతో పెను ప్రమాదం తప్పిన ఘటన ఇది. అధికార వర్గాల సమాచారం ప్రకారం, దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో విమానం శనివారం మదురై నుంచి 76 మంది ప్రయాణికులతో చెన్నైకి బయలుదేరింది. ల్యాండింగ్‌కు కొద్ది సేపటికి ముందు విమానం ముందు అద్దానికి పగుళ్లు ఏర్పడినట్లు పైలట్ గుర్తించారు. ఈ విషయాన్ని ఇక్కడి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కు సమాచారం ఇచ్చారు. సమాచారం అందిన వెంటనే విమానం సురక్షితంగా ల్యాండ్ కావడానికి ఎయిర్‌పోర్ట్‌లో తగిన ఏర్పాట్లు చేశారు. అనుకున్నది అనుకున్నట్లు జరగడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కాగా విండ్‌షీల్డ్ పగుళ్లకు కారణం తెలియలేదు. ఈ ఘటన కారణంగా మదురైకి విమానం తిరుగు ప్రయా ణం రద్దయ్యింది. ఇదిలావుండగా, ఘటనపై స్పందించిన ఇండిగో, ‘విండ్‌షిల్డ్ క్రాక్స్’ గురించి ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనార్హం. కేవలం ‘ల్యాండింగ్‌కు ముందు మెయింటెనెన్స్ అవసరాన్ని గుర్తించడం జరిగింది’’ అని మాత్రమే ఒక ప్రకటనలో పేర్కొంది. -
మరో 10 ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపులు
భారత్‌కు చెందిన విమానాలకు బాంబు బెదిరింపుల పర్వం ఆగడం లేదు. వరుసగా వస్తున్న ఈ బాంబు బెదిరింపు ఘటనలు అటు విమానయాన అధికారుల్లో, ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. గడిచిన 10 రోజుల్లో దాదాపు 100కుపైగా విమానాలకు బెదిరింపులు అందాయి. వీటిపై విమానయాన సంస్థలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. ఆగడం లేదు.తాజాగా మంగళవారం మరో 10 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లుగా ఇండిగో ఎయిర్‌లైన్స్ అధికారులు వెల్లడించారు. ప్రధానంగా అంతర్జాతీయ మార్గాల్లో ఈ బెదిరింపులు వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ బెదిరింపులు జెడ్డా, ఇస్తాంబుల్, రియాద్ వంటి ప్రధాన గమ్యస్థానాలకు వెళ్లే విమానాలను లక్ష్యంగా చేసుకుని వచ్చినట్లు తెలిపారు. అయితే వెంటనే అప్రమత్తమైన అధికారులు భద్రతా ప్రోటోకాల్‌లను అనుసరించింది, ప్రయాణీకులందరినీ సురక్షితంగా దింపి,తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు.మంగళూరు నుంచి ముంబైకి వెళ్లే విమానం, అహ్మదాబాద్ నుంచి జెద్దాకు వెళ్లే విమానం, లక్నో నుంచి పుణె, హైదరాబాద్ నుంచి జెడ్డా, ఇస్తాంబుల్ నుంచి ముంబై, ఢిల్లీ నుంచి డమ్మాం, బెంగళూరు నుంచి జెడ్డా, ఇస్తాంబుల్ నుంచి ఢిల్లీ, కోజికోడ్ నుంచి జెడ్డా, ఢిల్లీ నుంచి జెడ్డా వెళ్లే విమానాలకు ఈ బెదిరింపులు అందినట్లు అధికారులు తెలిపారు. తమ ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యానికి విచారం వ్యక్తం చేస్తూ... వారి భద్రతకు అత్యధిక ప్రాధాన్యతకు హామీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. -
మరో 2 విమానాలకు బాంబు బెదిరింపులు.. 3 రోజుల్లో 12 ఘటనలు
దేశంలో పలు విమానాలకు బాంబు బెదిరింపు ఘటనలు ఎక్కువయ్యాయి. గత మూడు రోజుల్లో అనేక విమానాలకు బాంబు బెదరింపు కాల్స్ రావడం తీవ్ర కలకలం రేపుతోంది. మంగళవారం ఏకంగా పలు సంస్థలకు చెందిన ఏడు విమానాలకు ఇలాంటి బెదిరింపులు వచ్చినన విషయం తెలిసిందే. మొత్తం గత 72 గంటల్లో 12 విమానాలకు ఈ బెదిరింపులు వచ్చాయి.తాజాగా బెంగళూరు వెళ్తున్న అకాశా ఎయిర్ ఫ్లైట్, ఢిల్లీకి వస్తున్న ఇండిగో విమానానికి గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు.ఆకాశా ఎయిర్‌లైన్ సంస్థకు చెందిన QP 1335 విమానం 184 మంది ప్రయాణికులు, సిబ్బందితో బుధవారం ఢిల్లీ నుంచి బెంగళూరుకు బయల్దేరింది. విమానం టేకాఫ్ అయిన వెంటనే బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని తిరిగి ఢిల్లీకి మళ్లించారు. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో మధ్యాహ్నం 2 గంటలకు సురక్షితంగా ల్యాండ్ చేశారు. అనంతరం విమానంలో అధికారులు తనిఖీలు చేపట్టారు.అదే విధంగా ముంబై నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానానికి కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. 6E 651 విమానం దాదాపు 200 మంది ప్రయాణికులు, సిబ్బందితో ముంబై నుంచి బయల్దేరగా.. సోషల్ మీడియా ద్వారా బెదిరింపు అలర్ట్ వచ్చింది. దీంతో పైలట్ విమానాన్ని అహ్మదాబాద్‌కు మళ్లించారు. అక్కడ విమానం సేఫ్‌గా ల్యాండ్ అయినట్లు ఇండిగో ప్రతినిధి ఒకరు తెలిపారు. అనంతరం విమానంలో తనిఖీలు చేపట్టగా బెదిరింపు కాల్స్ బూటకమని తేలింది.48 గంటల్లో 10 విమానాలకు బాంబు బెదిరింపులుమంగళవారం ఢిల్లీ-చికాగో ఎయిర్ ఇండియా విమానం, జైపూర్-బెంగళూరు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, దమ్మం-లక్నో ఇండిగో విమానం, దర్భంగా-ముంబై స్పైస్‌జెట్ విమానం, సిలిగురి-బెంగళూరు అకాశ ఎయిర్ విమానం, అలయన్స్ ఎయిర్ అమృత్సర్-డెహ్రాడూన్-ఢిల్లీ విమానం, మధురై నుంచి సింగపూర్ వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం సహా ఏడు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి.సోమవారం రెండు ఇండిగో, ఎయిరిండియా విమానాలకు ఇలాంటి నకిలీ బాంబు బెదిరింపులు వచ్చాయి. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీలు పోలీసులతో కలిసి బెదిరింపుల వెనుక ఉన్న నిందితులను కనిపెట్టడానికి పని చేస్తోంది. -
విజయవాడ: పొగమంచు ఎఫెక్ట్.. గాల్లో చక్కర్లు కొట్టిన విమానాలు
సాక్షి, విజయవాడ: గన్నవరం ఎయిర్‌పోర్టులో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. పొగమంచు కారణంగా విమానాలు ల్యాండ్ అయ్యేందుకు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ ,చెన్నైల నుంచి బయలుదేరిన ఇండిగో విమానాలు గన్నవరం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ కావాల్సి ఉంది. దట్టమైన పొగమంచు కారణంగా వాతావరణం అనుకూలించలేదు. దీంతో విమానాలు గాల్లో చక్కర్లు కొట్టాయి. 8 రౌండ్లు చక్కర్లు కొట్టిన తర్వాత సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి. ఢిల్లీని దట్టమైన పొగమంచు చుట్టుముట్టింది. విమానాశ్రయంలో విజిబిలిటీ సున్నాకి పడిపోయింది. దీంతో 50కి పైగా విమానాలపై ఎఫెక్ట్ పడింది. రైళ్లు , విమానాల రాకపోకలు ఆలస్యం కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులు లైట్లు వేసుకొని వాహనాలు నడుపుతున్నారు. కాగా, హైదరాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానం ల్యాండింగ్ సమయంలో ప్రయాణికులు భయాందోళనకు గురైన ఘటన మంగళవారం జరిగింది. ఇండిగో సంస్థకు చెందిన ఏటీఆర్ 72–600 విమానం హైదరాబాద్ నుంచి ప్రయాణికులతో ఉదయం 11 గంటలకు ఇక్కడికి చేరుకుంది. రన్ వేపై దిగేందుకు దగ్గరగా వచ్చిన సమయంలో పైలెట్లు ఒక్కసారిగా విమానాన్ని తిరిగి గాల్లోకి లేపడంతో ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు. ఐదు నిమిషాల వ్యవధిలో విమానాన్ని తిరిగి సురక్షితంగా రన్‌వేపై ల్యాండింగ్ చేయడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే రన్‌వేపై ల్యాండింగ్ అయ్యే ప్రాంతం కంటే ముందుకు విమానం రావడంతో పైలెట్లు భద్రత ప్రమాణాల్లో భాగంగా వెంటనే టేకాఫ్ తీసుకున్నట్లు ఎయిర్పోర్ట్ వర్గాలు పేర్కొన్నాయి. ఇదే విమానంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కూడా ఉన్నారు. ఇది చదవండి: ఢిల్లీ: 12 ఏళ్ల రికార్డులను దాటేసిన జనవరి చలి -
Indigo Flight Emergency Landing:పైలటే ప్రాణాలు కాపాడారు..
శంషాబాద్(హైదరాబాద్): షార్జా నుంచి హైదరాబాద్‌కు ఇండిగో ఎయిర్‌లైన్స్ 6ఈ–1406 విమానంలో బయల్దేరిన తమను పైలటే కాపాడారని ప్రయాణికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. శనివారం రాత్రి 10.50 గంటలకు బయల్దేరిన విమానం షెడ్యూల్ ప్రకారం శంషాబాద్ విమానాశ్రయానికి ఆదివారం తెల్లవారు జామున 4:10 గంటలకు చేరుకో వాల్సి ఉండగా విమానంలోని సాంకేతికలోపాన్ని గుర్తించిన పైలట్ పాకిస్తాన్‌లోని కరాచి విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేసిన సంగతి తెలిసిందే. తెల్లవారు జామున విమానాన్ని కరాచి విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేసిన అనంతరమే విమానంలో సాంకేతికలోపం తలెత్తిందన్న సమాచారాన్ని ఎయిర్‌లైన్స్ వెల్లడించిందని ప్రయాణికులు తెలిపారు. ఎనిమిది గంటల పాటు విమానంలోనే ఉన్న తర్వాత భోజన ఏర్పాట్లు చేశా రని వెల్లడించారు. తొలుత కరాచి నుంచి ప్రయాణికులను గుజరాత్‌లోని అహ్మదాబాద్ మీదుగా తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేసినప్పటికీ ఆ ప్రయత్నాన్ని రద్దు చేశారు. ప్రత్యేక విమానంలో కరాచి నుంచి నేరుగా శంషాబాద్‌కు తీసుకొచ్చారు. పైలట్ సాంకేతిక లోపం గుర్తించడంతోనే తాము ప్రాణాలతో బయటపడ్డామని, కరాచిలో విమానం ల్యాండయ్యాక మాత్రమే తమకు వివరాలు వెల్లడించారని ప్రయాణికులు తెలిపారు. కరాచి విమానాశ్రయంలో విమానం ల్యాండ్ చేశాక, సుమా రు ఎనిమిది గంటలకు పైగా విమానంలోనే ఉన్నాం. పైలట్ గుర్తించకపోతే పెద్ద ప్రమాదం జరిగేది. – ఓ ప్రయాణికుడు -
షార్జా నుంచి హైదరాబాద్‌కు ఇండిగో విమానం.. కరాచీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
కరాచీ: షార్జా నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానం పాకిస్థాన్‌లోని కరాచీ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడం వల్లే ఎమర్జెన్సీగా ల్యాండ్ చేసినట్లు తెలుస్తోంది. విమానంలోని ప్రయాణికులందరినీ మరో విమానంలో తరలించేందుకు ఇండిగో ఏర్పాట్లు చేసింది. 'షార్జా నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానం 6E-1406ను కరాచీ వైపు మళ్లించాం. సాంకేతిక సమస్య తలెత్తిందని గుర్తించి పైలట్ ఈ నిర్ణయం తీసుకున్నారు. విమానంలోని ప్రయాణికులను కరాచీ నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు మరో విమానాన్ని పంపిస్తాం.' అని ఇండిగో ప్రకటనలో తెలిపింది. రెండు వారాల వ్యవధిలోనే భారత్‌కు చెందిన రెండు విమానాలు కరాచీలో అత్యవసరంగా ల్యాండ్ కావడం గమనార్హం. జులై5న న్యూఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్తున్న స్పైస్ జెట్ విమానం కూడా సాంకేతిక సమస్య వల్ల కరాచీలోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. కొన్ని గంటల పాటు అక్కడే ఉంది. -
విమాన ప్రయాణికులపై 'క్యూట్ ఫీ'.. చిత్రాలు వైరలవటంతో..
దిల్లీ: విమాన టికెట్లోనే ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ ఫీ, యూజర్ డెవలప్మెంట్ ఫీ అంటూ వివిధ రకాల ఛార్జీలు వసూలు చేస్తారు. అయితే.. ఇటీవల ఇండిగో విమానంలో ప్రయాణించిన వారు తమ టికెట్లో 'క్యూట్ ఛార్జ్' అంటూ కనిపించటంపై ఆశ్చర్యానికి గురయ్యారు. అందంపై రుసుము వసూలు చేయటమేంటని తికమకపడ్డారు. శాంతాను అనే వ్యక్తి తన టికెట్ వివరాలను ట్విట్టర్లో షేర్ చేశారు. 'క్యూట్ ఛార్జ్' వివరాలతో కూడిన ఆ టికెట్ వైరల్‌గా మారింది. దీంతో పలువురు నెటిజన్లు దీనిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇండిగో సంస్థపై విమర్శలు గుప్పించారు. 'నా వయసుతో నేను చాలా అందంగా కనిపిస్తానని తెలుసు. కానీ దానికి నాపై ఇండిగో ఇలా ఛార్జ్ వసూలు చేస్తుందని ఎప్పుడూ ఊహించలేదు' అని పేర్కొన్నారు. I know I’m getting cuter with age but never thought @IndiGo6E would start charging me for it. pic.twitter.com/L7p9I3VfKX — Shantanu (@shantanub) July 10, 2022 శాంతాను షేర్ చేసిన చిత్రంలో టికెట్ ధరకు సంబంధించిన వివరాలను ఉంచారు. అందులో ఎయిర్‌ఫేర్ ఛార్జీలు, సీట్ ఫీ, సెక్యూరిటీ, కన్వీనియన్స్ ఫీజులతో పాటు క్యూట్ ఛార్జ్ అంటూ రూ.100 వసూలు చేశారు. ఇలాంటి ఫోటోనే మరో వ్యక్తి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. 'ఈ కొత్త ఛార్జీల కారణంగానే నేను ఇండిగోలో ప్రయాణించాలనుకోవట్లేదు. ఆ ఛార్జీలు నాకు రూ.20వేలు అవుతుంది. విమానం టికెట్ ధర కన్నా అది చాలా ఎక్కువ' అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. క్యూట్ ఫీ అంటే ఏమిటి? క్యూట్ అంటే 'కామన్ యూజర్ టెర్మినల్ ఈక్వీప్మెంట్' అని అర్థం. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ ఛార్జీలు వసూలు చేస్తుంది. ఎంపిక చేసిన విమానాశ్రయాల్లో మెటల్ డిటెక్టింగ్ మిషన్లు, ఎస్కలేటర్లు, ఇతర సామగ్రిని ఉపయోగిస్తున్నందుకు దీనిని వసూలు చేస్తారు. ట్విట్టర్లో క్యూట్ ఫీపై వైరల్‌గా మారిన క్రమంలో ఇండిగో సమాధానమిచ్చింది.'ఎంపిక చేసిన విమానాశ్రయాల్లో కామన్ యూజర్ టెర్మినల్ ఈక్వీప్మెంట్(క్యూట్) సేవలను ఉపయోగిస్తున్నందుకు ఈ ఛార్జీలను వసూలు చేస్తారని తెలుసుకోండి. మీకు సేవ చేసేందుకే మేము ఉన్నాం' అని ఓ నెటిజన్‌కు సమాధానమిచ్చింది. Ms. Waliya, please know that the CUTE charges are levied at select airports for the usage of Common User Terminal Equipment (CUTE) services. You may visit https://t.co/anjh8jarWV to know more. (1/2) — IndiGo (@IndiGo6E) July 10, 2022 ఇదీ చదవండి: 10 నెలలు.. 9 దేశాలు.. 6,500 కిలోమీటర్లు నడిచి 'హజ్' యాత్ర -
ఇండిగో ఘటనపై కేంద్రమంత్రి ఆగ్రహం.. స్వయంగా దర్యాప్తు చేస్తానని ట్వీట్
సాక్షి, న్యూఢిల్లీ: దివ్యాంగ చిన్నారిని ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానం ఎక్కనివ్వని ఘటనపై కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలాంటి ప్రవర్తనను ఎన్నటికీ సహించేది లేదని స్పష్టంచేశారు. ఏ వ్యక్తీకి ఇలాంటి అనుభవం కాకూడదని.. ఘటనపై స్వయంగా తానే దర్యాప్తు చేపడతానని ట్విటర్ వేదికగా తెలిపారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈమేరకు ఇండిగోను హెచ్చరిస్తూ ఆయన ట్వీట్ చేశారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే డీజీసీఏ దర్యాప్తు ప్రారంభించిందని, ఇండిగో సంస్థ నుంచి నివేదిక కోరిందని అధికార వర్గాలు వెల్లడించాయి. చదవండి👉 చిరుతతో పోరాటం.. అధికారులపై దాడి.. వైరల్ వీడియో There is zero tolerance towards such behaviour. No human being should have to go through this! Investigating the matter by myself, post which appropriate action will be taken. https://t.co/GJkeQcQ9iW — Jyotiraditya M. Scindia (@JM_Scindia) May 9, 2022 ఏం జరిగింది? హైదరాబాద్ వెళ్లేందుకు గత శనివారం దివ్యాంగ చిన్నారితో కలిసి ఓ కుటుంబం రాంచీ విమానాశ్రయానికి వచ్చింది. అయితే ఆ బాలుడు విమానం ఎక్కేందుకు ఇండిగో సిబ్బంది నిరాకరించారు. చిన్నారి భయాందోళనతో ఉన్నాడని.. దాని వల్ల ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందనే కారణంతో ఫ్లైట్ ఎక్కనివ్వలేదు. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులు కూడా ప్రయాణాన్ని విరమించుకున్నారు. ఈ ఘటన గురించి మనీషా గుప్తా అనే తోటి ప్రయాణికురాలు తన ఫేస్బుక్ అకౌంట్లో పోస్ట్ చేశారు. చిన్నారిని అడ్డుకున్న ఇండిగో సిబ్బంది అతడి తల్లిదండ్రులతో వాగ్వాదానికి దిగారని పేర్కొన్నారు. ఇది సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఇండిగో ఏమంటోంది? రాంచి ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన ఘటనపై ఇండిగో సంస్థ వివరణ ఇచ్చింది. భయంతో ఉన్న ఆ చిన్నారి స్థిమిమితపడితే విమానం ఎక్కించడానికి చివరి నిమిషం వరకూ గ్రౌండ్ సిబ్బంది వేచి చూశారని.. కానీ ఫలితం లేకపోయిందని తెలిపింది. ఆ కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా.. ఓ హోటల్లో వసతి సౌకర్యం కల్పించామని.. ఆదివారం ఉదయం వారు మరో విమానంలో గమ్యస్థానానికి చేరుకున్నారని వివరించింది. చదవండి👉🏻 రాష్ట్రపతి ఎన్నికల్లో తగ్గనున్న.. ఎంపీల ఓటు విలువ -
కృష్ణా జిల్లాలో భారీ వర్షం.. గాల్లో చక్కర్లు కొడుతున్న విమానం
-
విమానంలో పుట్టి.. బంపర్ ఆఫర్ కొట్టేశాడు!
న్యూఢిల్లీ : విమానంలో ప్రయాణిస్తున్న ఓ గర్భిణీ.. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బుధవారం ఇండిగో విమానంలో ఢిల్లీ నుంచి బెంగళూరుకు బయలుదేరిన ఓ గర్భిణీ మార్గమధ్యంలో ప్రసవించింది. తల్లి బిడ్డ ఆరోగ్యం క్షేమంగా ఉన్నట్లు ఇండిగో విమాన సంస్థ పేర్కొంది. బుధవారం సాయంత్రం ఢిల్లీ నుంచి బెంగళూరుకు బయలుదేరిన 6 ఈ 122(6E 122 ) అనే విమానంలో ఓ గర్భిణి పండంటి బిడ్డకు జన్మనిచ్చిందని, తమ సిబ్బంది ఆమెకు తోడుగా నిలిచారని ఇండిగో సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే రాత్రి 7.30 గంటలకు బెంగళూరులో విమానం ల్యాండ్ అయిన వెంటనే తల్లీ బిడ్డ ఇద్దరిని ఆసుపత్రికి తరలించినట్లు ఇండిగో పేర్కొంది. ఈ సందర్భంగా బెంగళూరు ఎయిర్‌పోర్టులో తల్లీబిడ్డలకు గొప్ప స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇండిగో సిబ్బంది తల్లీబిడ్డలతో దిగిన ఫొటోలను సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలల్లో షేర్ చేయగా.. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అలానే పుట్టిన బిడ్డకు ఇండిగో సంస్థ భారీ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. విమానంలో పుట్టాడు కాబట్టి అతనికి జీవితాంతం ఫ్లైట్ టికెట్ ఉచితంగా అందినట్లు సమాచారం. అయితే దీనిపై ఇండిగో సంస్థ నుంచి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. A baby boy was born in an IndiGo Delhi- Bangalore flight Both mother & child are doing fine #aviation pic.twitter.com/9hlCh0f9zy — Arindam Majumder (@ari_maj) October 7, 2020 -
గన్నవరానికి మార్చి 2 నుంచి ఇండిగో విమానాలు
సాక్షి, విమానాశ్రయం(గన్నవరం): ఇండిగో విమాన సంస్థ ఎట్టకేలకు గన్నవరం విమానాశ్రయానికి సర్వీసులు నడిపేందుకు ముందుకు వచ్చింది. వచ్చే ఏడాది మార్చి 2వ తేదీ నుంచి దేశంలోని మెట్రో నగరాలైన బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నుండి ఇక్కడికి రోజుకు పది విమాన సర్వీసులను నడపనుంది. ఈ మేరకు ప్రయాణ షెడ్యుల్‌ను విడుదల చేయడంతోపాటు టికెట్ బుకింగ్‌ను కూడా ప్రారంభించింది. ఇండిగో నూతనంగా కొనుగోలు చేసిన 74 సీటింగ్ కెపాసిటి కలిగిన ఏటీఆర్ 72–600 విమానాలను నడపనుంది. ఇక్కడి నుంచి సర్వీసులు నడిపేందుకు ఇండిగో సంస్థ గతేడాది కాలంగా సన్నాహాలు చేస్తుంది. వచ్చే ఏడాది జనవరిలోనే సర్వీసులు ప్రారంభించాల్సి ఉండగా, అనివార్య కారణాలతో వాయిదా వేసుకుంటూ వచ్చింది. ఈ నేపథ్యంలో సర్వీసులను నడిపేందుకు అధికారిక వెబ్సైట్లో వెల్లడించింది. ఇండిగో ఏటీఆర్ రాకతో గన్నవరం విమానాశ్రయానికి సర్వీసులు గణనీయంగా పెరగడంతోపాటు ప్రయాణికుల ఆదరణ కూడా పెరుగుతుందని ఎయిర్‌పోర్టు వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. సర్వీసుల వివరాలు హైదరాబాద్ నుంచి ఉదయం 7.35కు, మధ్యాహ్నం 13.50, రాత్రి 20.10కు విమానాలు ఇక్కడికి చేరుకుంటాయి. తిరిగి ఇక్కడి నుండి మధ్యాహ్నం 12.10, సాయంత్రం 18.45, రాత్రి 21.35కు హైదరాబాద్‌కు బయలుదేరతాయి. ఇక్కడి నుంచి ఉదయం 8 గంటలకు విమానం బయలుదేరి 9.35కు బెంగళూరు చేరుకుని, అక్కడి నుంచి 10.15కు బయలుదేరి 11.50కు ఇక్కడికి చేరుకుంటుంది. ఇక్కడి నుంచి ఉదయం 15.15కు విమానం బయలుదేరి 16.35కు చెన్నైకు చేరుకుంటుంది. తిరిగి చెన్నై నుంచి 16.55కు బయలుదేరి 18.25కు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటుందని ఇండిగో ప్రతినిధులు తెలిపారు. -
'గబ్బర్ సింగ్' దర్శకుడికి చేదు అనుభవం!
హైదరాబాద్: 'గబ్బర్ సింగ్' దర్శకుడు హరీశ్ శంకర్ కు చేదు అనుభవం ఎదురైంది. గురువారం డైరెక్టర్ హరీశ్ శంకర్, మరికొందరు మిత్రులతో కలిసి శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకి వెళ్లారు. అయితే కాస్త ఆలస్యం అయిందన్న కారణంగా ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బంది వారిని విమానంలోకి అనుమతించలేదని ట్విట్టర్ ద్వారా తెలిపారు. రెగ్యూలర్ గా ఇండిగో ఎయిర్ లైన్స్ విమానాలు మాత్రం ఆలస్యమవుతాయని పేర్కొన్న డైరెక్టర్.. ప్యాసింజర్స్ మాత్రం కాస్త ఆలస్యంగా వస్తే అనమతించడం లేదని ట్వీట్లో రాసుకొచ్చారు. ఇందుకు సంబంధించి ఓ తన ట్వీట్ లో ఇండిగో విమానం లేటయిన సమాచారం ఉన్న ఫొటోను ట్వీట్ చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


