ఇండిగో విమానాలపై కోర్టుల్లో పిటిషన్లు | Indigo flight cancellation Row 7th Day Updates | Sakshi
Sakshi News home page

Live Updates

Cricker

ఇండిగో విమానాలపై కోర్టుల్లో పిటిషన్లు

ప్రయాణీకులు చూపిన సహనానికి ధన్యవాదాలు: ఇండిగో

  • కొన్ని రోజులుగా విమాన అంతరాయాలకు క్షమాపణలు చెబుతున్నామని ఇండిగో మరోసారి తెలిపింది.
  • ఈ పరిస్థితుల్లో ప్రయాణీకులు చూపిన సహనానికి ధన్యవాదాలు అని చెప్పింది.
2025-12-08 21:27:11

ఈ సమయంలో కచ్చితమైన కారణం గుర్తించడం సాధ్యం కాదు: ఇండిగో

  • ఇండిగో వైఫల్యం వెనుక అసలు కారణాన్ని కచ్చితంగా ఇప్పుడే గుర్తించడం సాధ్యం కాదని ఉన్నతాధికారులు డీజీసీఏకు తెలిపారు.
  • డీజీసీఏ షోకాజ్ నోటీసులపై పూర్తి రూట్ కాజ్ అనాలిసిస్ సమర్పించడానికి ఇండిగో మరింత సమయం కోరింది.
2025-12-08 20:09:43

సీఈఓ, సీఓఓను విచారించనున్న డీజీసీఏ ప్యానెల్‌

  • విమాన అంతరాయంపై దర్యాప్తు చేస్తున్న డీజీసీఏ నియమించిన ప్యానెల్ బుధవారం ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్, సీఓఓ ఇసిడ్రే పోర్క్వెరాస్‌లను పిలిపించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.
  • ఈ ఘటనపై నలుగురు సభ్యుల ప్యానెల్‌కు డీజీసీఏ కారణాలను గుర్తించే బాధ్యతను అప్పగించింది.
2025-12-08 18:37:12

‘విమానాల అంతరాయంపై జ్యుడీషియల్ విచారణ జరపాలి’

  • విమానాల అంతరాయానికి సంబంధించి మొత్తం సమస్యలపై జేపీసీ లేదా జ్యుడీషియల్ విచారణ చేయాలని పార్లమెంట్‌ సభ్యుడు జాన్ బ్రిటాస్ కోరుతూ ప్రధానికి లేఖ రాశారు.
  • విమానాలను రద్దు చేయడం సాధారణ విషయం కాదన్నారు.
  • ప్రభుత్వానికి, విమానయాన సంస్థలకు మధ్య ఒప్పందం కుదిరిందని విమర్శించారు.
  • ఇంత తీవ్ర పరిస్థితులున్నా ఎవరిపైనా చర్య తీసుకోకపోవడం ఆశ్చర్యకరమన్నారు.
2025-12-08 18:31:39

టిక్కెట్‌ ధరల రీఫండ్‌

3 డిసెంబర్ 2025, 15 డిసెంబర్ 2025 మధ్య రద్దు అయిన విమానాల టిక్కెట్‌ ధరలను ప్రయాణికులకు ఇప్పటికే ప్రాసెస్ చేశామని అని ఇండిగో తెలిపింది.

2025-12-08 18:27:14

ఏడాది ముందే తెలిసినా ఇంత నిర్లక్ష్యమా: మూడీస్‌

  • కొత్త ఎఫ్‌డీటీఎల్‌ నిబంధనలు దాదాపు ఏడాది ముందే తెలిసినా ఇండిగో అప్రమత్తం అవ్వలేదని ఈక్విటీ రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌ తెలిపింది.
  • ఇది ఇండిగో ప్రణాళికలు, పర్యవేక్షణలో గణనీయమైన లోపాలను సూచిస్తుందని పేర్కొంది.
2025-12-08 17:30:07

నవంబర్‌ నుంచి ప్రయాణికులకు రూ.827 కోట్లు రీఫండ్‌

  • డిసెంబర్ 1 నుంచి 7 వరకు 5,86,705 పీఎన్ఆర్‌లను రద్దు చేసి ఇండిగో ప్రయాణికులకు రూ.569.65 కోట్లు తిరిగి చెల్లించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
  • నవంబర్ 21 నుంచి డిసెంబర్ 7 వరకు మొత్తంగా 9,55,591 పీఎన్ఆర్‌లను రద్దు చేసి రూ.827 కోట్లు రీఫండ్‌ చేసినట్లు చెప్పింది.
2025-12-08 16:52:09

సిబ్బంది రోస్టర్‌, అంతర్గత ప్రణాళిక వల్లే సమస్య: కేంద్రమంత్రి

  • ఇండిగో సిబ్బంది రోస్టరింగ్, అంతర్గత ప్రణాళిక వ్యవస్థలో సమస్యల వల్ల అంతరాయాలు ఏర్పడాయని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పార్లమెంట్‌లో అన్నారు.
  • విమానాల ఆలస్యం, రద్దుల వల్ల ప్రభావితమైన ప్రయాణీకులను రక్షించడానికి కఠినమైన పౌర విమానయాన అవసరాలు (సీఏఆర్‌) అమలులో ఉన్నాయని చెప్పారు.
  • అన్ని విమానయాన సంస్థలు ఈ నిబంధనలను పాటించాలన్నారు.
2025-12-08 16:14:34

ఈ రోజు 500 విమాన సర్వీసులు రద్దు

  • ఇండిగో సోమవారం తన 138 గమ్యస్థానాల్లో 1,802 సర్వీసులు నడపాలని యోచిస్తోంది.
  • అయితే, సోమవారం 500 విమాన సర్వీసులు రద్దు అయినట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది.
  • ఇండిగో ఇప్పటివరకు 4,500 బ్యాగులను ప్రయాణికులకు పంపిణీ చేసినట్లు చెప్పింది.
  • మిగిలిన 4,500 బ్యాగులను రాబోయే 36 గంటల్లో తిరిగి ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది.
2025-12-08 16:07:33

డిసెంబర్ 1 నుంచి 7 వరకు 5.5 లక్షల టికెట్లు రద్దు

  • డిసెంబర్ 1 నుంచి 7 వరకు మొత్తం 5 లక్షలకు పైగా పీఎన్‌ఆర్‌లు రద్దు అయినట్లు మంత్రిత్వశాఖ తెలిపింది.
  • ప్రయాణికులకు మొత్తం రూ.569.65 కోట్లు రీఫండ్‌ చేసినట్లు చెప్పింది.
  • మొత్తం 9000 బ్యాగుల్లో 4500 బ్యాగులు వినియోగదారులకు పంపిణీ చేశారు.
  • రాబోయే 36 గంటల్లో అన్ని బ్యాగులను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది.
2025-12-08 15:32:41

కేంద్ర మంత్రిని వెంటనే విధుల నుంచి తొలగించాలి: కేఏ పాల్‌

  • విమానయాన రంగం ప్రస్తుత స్థితికి సంబంధించి పాలన, జవాబుదారీతనంపై కేఏ పాల్ ఆందోళన వ్యక్తం చేశారు.
  • ఈ సంఘటలకు బాధ్యత వహించిన విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును వెంటనే విధుల నుంచి తొలగించాలని పిలుపునిచ్చారు.
  • భారతీయ ప్రయాణికులకు మెరుగైన సర్వీసులు అందేలా సంస్థల మధ్య పోటీ నిర్ధారించడానికి అంతర్జాతీయ విమానయాన సంస్థలను భారత్‌లోకి ఆహ్వానించాలని కోరారు.

2025-12-08 15:27:34

ఇండిగో గుత్తాధిపత్యం వల్ల తీవ్ర ఇబ్బందులు: కాంగ్రెస్ ఎంపీ

  • ఇండిగో విమాన సర్వీసుల రద్దు వల్ల కలిగే అంతరాయాన్ని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ లోక్‌సభలో లేవనెత్తారు.
  • విమానయాన రంగంలో ఇండిగో గుత్తాధిపత్యం చలాయిస్తుందని చెప్పారు.
  • దీనివల్ల సాధారణ పౌరులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
2025-12-08 14:42:47

ఇండిగో సంక్షోభంపై మమతా బెనర్జీ మండిపాటు

  • ఇండిగో సంక్షోభంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపాటు
  • దేశవ్యాప్తంగా ఏర్పడిన విమాన గందరగోళంపై కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా విమర్శలు
  • సంస్థలను ఎలా స్వాధీనం చేసుకోవాలో మాత్రమే బీజేపీ పట్టించుకుంటుంది.
  • విమానాశ్రయాల్లో వేలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. వారు మానసికంగా హింసకు గురవుతున్నారు
  • దీనిని పరిష్కరించడానికి ప్రభుత్వం ఒక ప్రణాళికను రూపొందించాలి
2025-12-08 14:24:54

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో సూట్‌కేస్‌ సునామీ

  • ఇండిగో విమానాల రద్దు , ఆలస్యం కొనసాగడంతో ఢిల్లీ ఐజీఐ విమానాశ్రయం టెర్మినల్ 1 వద్ద పేరుకుపోయిన ప్రయాణికుల సామాను
  • ఢిల్లీ ఎయిర్‌ పోర్ట్‌ను సూట్‌కేస్‌ సునామీ ముంచెత్తిందంటూ సోషల్‌ మీడియాలో వీడియో పోస్ట్‌
2025-12-08 13:08:53

రామ్మోహన్ నాయుడు భారత్‌ పరువు తీసేస్తున్నారు: మాజీ ఎంపీ మార్గాని భరత్

  • విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రపంచ స్థాయిలో భారత దేశ పరువును తీసేస్తున్నారు
  • రోజూ వందలాది సర్వీసులు రద్దు అవుతున్నాయి
  • అసలు విమానయాన శాఖ పీరియాడిక్ రివ్యూలు ఎప్పుడు నిర్వహించారు
  • నిబంధన ప్రకారం ఇండిగోకు మరో 900 మంది పైలెట్లు అదనంగా ఉండాలి
  • క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎందుకు సమీక్షించలేదు?
  • ఇండిగో నిబంధనలను పట్టించుకోనప్పుడు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఏమి చేస్తోంది?
  • తెలుగువారి ఆత్మగౌరవాన్ని రామ్మోహన్ నాయుడు మంట గలిపారు.
     
2025-12-08 12:31:36

ఇండిగోపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్

  • వందలాది ఇండిగో విమానాలను రద్దు చేయడంపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు
  • బాధితులకు ఉపశమనం కలిగించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరిన పిటిషనర్‌
  • పిటిషన్‌ను బుధవారం విచారించనున్నట్లు తెలిపిన ఢిల్లీ హైకోర్టు
2025-12-08 11:46:40

ఇండిగోపై పిటిషన్ తిరస్కరించిన సుప్రీం కోర్టు

  • ఇండిగో విమాన రద్దులు, జాప్యంపై దాఖలైన పిటిషన్ ను అత్యవసరంగా విచారించేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు
  • గత మంగళవారం నుంచి ఇప్పటి వరకు 4,500 ఇండిగో విమానాలను రద్దు చేశారు.
  • పెద్ద ఎత్తున ప్రయాణీకులకు అసౌకర్యం ఉన్నందున అత్యవసర విచారణ కోరిన పిటిషనర్‌
  • కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ సమస్యను గుర్తించిందన్న ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్
  • జోక్యం చేసుకోవడానికి తక్షణ అత్యవసరం లేదని తేల్చిన సుప్రీంకోర్టు
2025-12-08 11:20:31

ప్రయాణికుల లగేజీ మాయం

  • శంషాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌లో దారుణ పరిస్థితులు
  • డంపింగ్‌ యార్డ్‌లా మారిన లగేజీ లాంజ్‌
  • విలువ వస్తువులు మాయం కావడంతో ప్రయాణికుల లబోదిబో
2025-12-08 10:40:58

బెంగళూరు నుంచి 127 విమానాలు రద్దు

  • సోమవారం బెంగళూరు విమానాశ్రయం నుండి 127 విమానాలను రద్దు చేసిన ఇండిగో
  • వీటిలో 65 రావాల్సినవి, 62 బయలుదేరాల్సినవి ఉన్నాయి.
2025-12-08 10:28:24

హైదరాబాద్‌ నుంచి 54 ఇండిగో విమానాలు క్యాన్సిల్‌

  • శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి వివిధ రాష్ట్రాలకు వెళ్ళాల్సిన 54 ఇండిగో విమానాల రద్దు..
  • వివిధ రాష్ట్రాల నుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు రావాల్సిన 58 ఇండిగో విమానాలను రద్దు చేసిన ఎయిర్ లైన్స్ అధికారులు..
  • మొత్తం 112 విమానాలను రద్దు చేసినట్టు ప్రకటించిన ఇండిగో ఎయిర్ లైన్స్ 
2025-12-08 10:24:15

ఢిల్లీలో 134 విమానాలు రద్దు

  • ఢిల్లీ విమానాశ్రయంలో ఈరోజు మొత్తం మొత్తం 134 ఇండిగో విమానాలు రద్దు
  • ఇందులో డిపార్చర్లు 75, అరైవల్స్‌ 59
2025-12-08 09:28:57

విమాన ఛార్జీలపై ఎయిర్ ఇండియా పరిమితులు

  • పౌర విమానయాన శాఖ ఆదేశాలకు అనుగుణంగా తన రిజర్వేషన్ వ్యవస్థలలో కొత్త నిర్దేశిత ఛార్జీలను ప్రారంభించిన ఎయిర్ ఇండియా గ్రూప్
  • అమలును పూర్తి చేసిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్
  • క్రమంగా ఛార్జీల పరిమితులను వర్తింపజేస్తోన్న ఎయిర్ ఇండియా
  • ఈ ప్రక్రియలో థర్డ్ పార్టీ సిస్టమ్ ప్రమేయం ఉంటున్న నేపథ్యంలో దశలవారీగా అమలు
  • ఈ మార్పుల సమయంలో ఎకానమీ క్లాస్ లో ఎయిర్ ఇండియా విమానాలను బుక్ చేసుకున్నవారికి నిర్ణీత పరిమితులకు మించిన ఛార్జీలు రిఫండ్‌ పొందొచ్చు.

 

2025-12-08 08:58:00

శంషాబాద్‌లో 77 విమానాలు రద్దు..

  • ఏడో రోజు కొనసాగుతున్న ఇండిగో విమానాల రద్దు
  • కొనసాగుతున్న ప్రయాణికుల కష్టాలు
  • శంషాబాద్‌కు రావాల్సిన 38 విమానాలు రద్దు
  • శంషాబాద్ నుండి వివిధ ప్రాంతాలకు వెళ్లవలసిన 39 విమానాలు రద్దు
  • కేంద్ర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఫెయిల్యూర్‌పై నిరసనల వెల్లువ
2025-12-08 08:21:17

ఢిల్లీ ఎయిర్‌పోర్టు కీలక ప్రకటన..

  • ఢిల్లీ ఎయిర్‌పోర్టు కీలక ప్రకటన..
  • ఇండిగో విమాన సర్వీసుల్లో సమస్యలు కొనసాగవచ్చు: ఢిల్లీ ఎయిర్‌పోర్టు
  • ఈ మేరకు ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేసిన ఢిల్లీ ఎయిర్‌ పోర్టు
2025-12-08 07:58:36

టికెట్ల ధరలపై పరిమితి: ఎయిర్‌ ఇండియా

  • టికెట్ల ధరలపై పరిమితి: ఎయిర్‌ ఇండియా
  • పౌర విమానయాన శాఖ మార్గదర్శకాలను అమలు చేస్తున్నట్లు ఎక్స్‌ వేదికగా ప్రటించిన ప్రకటించిన ఎయిర్‌ ఇండియా
  • దీంతో ఎకానమీ క్లాస్‌ టికెట్ల ధరలపై పరిమితి
     
2025-12-08 07:58:36

ఇండిగో ఎఫెక్ట్‌.. ప్రత్యేక రైళ్లు ఏర్పాటు..

  • ఇండిగో ఎఫెక్ట్‌.. ప్రత్యేక రైళ్లు ఏర్పాటు..
  • విమానాల రద్దు, ఆలస్యం నేపథ్యంలో ప్రత్యేక రైళ్లు నడుపుతున్న రైల్వే శాఖ 
  • ఢిల్లీ సహా పలు రైల్వే స్టేషన్ల నుంచి నడుస్తున్న ప్రత్యేక సర్వీసులు 
2025-12-08 07:17:43

ప్రయాణికులకు 610 కోట్లు రీఫండ్‌

  • రద్దయిన, ఆలస్యంగా నడిచిన విమానాలకు సంబంధించి ప్రయాణికులకు 610 కోట్లు రీఫండ్‌ 
  • బ్యాగేజీని కూడా వెనక్కి ఇచ్చినట్లు తెలిపింది. 
  • టిక్కెట్ల సొమ్మును ఆదివారం రాత్రి 8 గంటలకల్లా పూర్తిగా చెల్లించాలని ఇండిగోను ఆదేశించిన కేంద్ర ప్రభుత్వం
  • బ్యాగేజీని 48 గంటల్లోగా అందజేయాలని పేర్కొంది. 
  • సంక్షోభంపై వివరణ ఇవ్వడానికి ఇండిగో సీఈఓ పీటర్‌ ఎల్‌బెర్స్, అకౌంటబుల్‌ మేనేజర్‌ ఇసిడ్రో పోర్కిరస్‌కు మరికొంత సమయం ఇవ్వాలని డీజీసీఏ నిర్ణయించింది. 
  • సోమవారం సాయంత్రంకల్లా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.  
2025-12-08 07:18:03

కొనసాగుతున్న ఇండిగో కష్టాలు

  • కొనసాగుతున్న ఇండిగో కష్టాలు 
  • ముంబై విమానాశ్రయంలో ప్రయాణికుల పడిగాపులు
  • విమానాల ఆలస్యం, రద్దుపై ఆగ్రహం 
  • టికెట్‌ రద్దు లేదా విమానం షెడ్యూల్‌ అయ్యే వరకు వేచి ఉండాలని చెప్పడంతో ఆవేదన 
2025-12-08 07:11:03
Advertisement
 
Advertisement
Advertisement