ఆ చిన్నవాక్‌ మోజ్తబాని కాపాడింది : సంచలన ఆడియో | US Israel attack A walk that saved Mojtaba Khamenei | Sakshi
Sakshi News home page

ఆ చిన్నవాక్‌ మోజ్తబాని కాపాడింది : సంచలన ఆడియో

Mar 17 2026 9:07 PM | Updated on Mar 17 2026 9:13 PM

US Israel attack A walk that saved Mojtaba Khamenei

ఫిబ్రవరి 28న జరిగిన ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడి నుంచి ఇరాన్  కొత్త సుప్రీం లీడర్‌ మోజ్తబా ఖమేనీ లిప్త పాటులో ప్రాణాలతో బయట పడినట్లు తెలుస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ కాంపౌండ్‌పై జరిగిన భయంకరమైన దాడి,  ఖమేనీ తృటిలో ప్రాణాలతో బైటపడిన వైనం కొత్తంకథనం సంచలనంగా మారింది.

తృటిలో తప్పిన ప్రమాదం
ది టెలిగ్రాఫ్ నివేదించిన లీకైన ఆడియో రికార్డింగ్ ప్రకారం, 56 ఏళ్ల  ఖమేనా టెహ్రాన్‌లోని తన నివాసంపై క్షిపణులు దాడి చేయడానికి కొన్ని క్షణాల ముందు బయటకు వచ్చారు. ఫిబ్రవరి 28 ఉదయం 9:32 గంటలకు టెహ్రాన్‌లోని సుప్రీం లీడర్ నివాసంపై ఇజ్రాయెల్ 'బ్లూ స్పారో' బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది. ఆ సమయంలో మోజ్తబా ఏదో పని మీద నివాసం నుండి బయటకు వచ్చి ప్రాంగణంలోని ఖాళీ స్థలంలోకి వెళ్లారు. అదే సమయంలో క్షిపణులు భవనాన్ని తాకాయి. ఆయన తిరిగి లోపలికి వెళ్లేలోపే ఈ విధ్వంసం జరిగింది.

అలీ ఖమేనీ కార్యాలయంలో ప్రోటోకాల్ విభాగాధిపతి  మజాహెర్ హొస్సేనీ, మార్చి 12న టెహ్రాన్‌లోని ఖోల్హాక్ ప్రాంతంలో ఉన్నత మత పెద్దలను, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కమాండర్లను ఉద్దేశించి ప్రసంగించగా, లీకైన ఒక ఆడియో రికార్డింగ్ ద్వారా ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయని 'ది టెలిగ్రాఫ్' తెలిపింది.

(బంగారం, డాలర్‌ కాదు : దీని దూకుడు మామూలుగా లేదు!)

హొస్సేనీ ప్రకారం, ఒకేసారి పలు ప్రాంతాలపై దాడి చేసేలా ఈ దాడులు ప్లాన్‌ చేశారు.మోజ్తబా నివాసం, అతని బావమరిది మిస్బా అల్-హుదా బఘేరీ కనీ ఇల్లు, అతని సోదరుడు ముస్తఫా నివాసం ఇలా మూడు క్షిపణులతో దాడి చేశారు. ఈ దాడిలో మోజ్తబా ప్రాణాలతో బయటపడినప్పటికీ, తండ్రి మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ, తల్లి, ఆయన భార్య (హద్దాద్) కుమారుడు అక్కడికక్కడే మరణించారు. పలువురు ఉన్నత ఇరాన్ అధికారులు మరణించారు.

సుప్రీం లీడర్ మిలిటరీ బ్యూరో చీఫ్ మహమ్మద్ షిరాజీ ఈ దాడిలో శరీర భాగాలు ఛిద్రమై అత్యంత దారుణంగా మరణించారు. చివరకు కొన్ని కిలోల మాంసం దొరికిందని హోస్సేని ఆ రికార్డింగ్‌లో చెప్పారు. క్షిపణుల తాకిడికి భవనాలు పూర్తిగా ధ్వంస మయ్యాయి.

(కాల్పుల విరమణ ప్రసక్తే లేదు : ఇరాన్‌ సుప్రీం)

ఖమేనీ ఆరోగ్యంపై పుకార్లు, షికార్లు
ఈ దాడి తరువాత  మోజ్తబా ఖమేనీ కొత్త సుప్రీంగా ఎన్నికైనప్పటికీ బహిరంగంగా కనిపించలేదు. దీనితో ఆయన తీవ్రంగా గాయ పడ్డారని లేదా మరణించి ఉంటారనిఊహాగానాలకు ఆజ్యం పోసింది. తరువాత తీవ్రగాయాలతో, కాలు కోల్పోయి కోమాలో ఉన్నారనే వార్తలు వెలువడ్డాయి. అయితే కేవలం కాలికి చిన్న గాయం మాత్రమే అయ్యిందని అంతర్గత వర్గాల ఆడియో రికార్డింగ్ ద్వారా తెలుస్తోంది.

ఇదీ చదవండి: సంచలన ఆరోపణలు : ట్రంప్‌నకు భారీ షాక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement