breaking news
Mojtaba Khamenei
-
మొజ్తబా పని అయిపోయినట్లే!.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇరాన్ సైనిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదని పేర్కొన్న ట్రంప్.. మొజ్తబా పరిస్థితి కూడా ఏమీ బాగోలేదని, ఆయన పని అయిపోయినట్లేనని వ్యాఖ్యానించారు.ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ సైనిక సామర్థ్యం తీవ్రంగా దెబ్బతిందని అన్నారు. "వారికి నౌకాదళం లేదు.. వైమానిక దళం లేదు.. గగనతల రక్షణ వ్యవస్థ కూడా ధ్వంసమైంది. వారి కీలక నాయకులంతా హతమయ్యారు" అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఖమేనీ కుటుంబం గురించి ప్రస్తావిస్తూ.. మేం జరిపిన దాడుల్లో అయతొల్లా ఖమేనీ చనిపోయారు. ఆ తర్వాత సుప్రీం లీడర్ అంటూ ఆయన వారసుడు మొజ్తబా ఖమేనీ వచ్చారు. ఆయన పరిస్థితి కూడా దారుణంగా ఉంది. ఆయన 90 శాతం దెబ్బతిన్నారు. ఆయన పని కూడా దాదాపు అయిపోయినట్లే అని అన్నారు. అయితే మొజ్తబా పరిస్థితిపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు ఎలాంటి ఆధారాలను అమెరికా విడుదల చేయలేదు. ఇరాన్ కూడా దీనిపై అధికారికంగా స్పందించలేదు.తండ్రి మరణం తర్వాత తెరపైకి.. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ పేరు ఒక్కసారిగా అంతర్జాతీయ చర్చల్లోకి వచ్చింది. ఇరాన్ రాజకీయ వ్యవస్థపై ప్రభావం ఉన్న వ్యక్తిగా మొజ్తబాను పరిగణిస్తుంటారు. అయతొల్లా మరణం తర్వాత సుప్రీం ఎవరు? అనే సమయంలో ఆయన పేరు పరిశీలనకు వచ్చింది. అయితే.. గతంలో ఆయనపై ఉన్న విమర్శలు, వివాదాలు, అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయనకు ఆ గౌరవం దక్కడంపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే మత పెద్దలు, ఐఆర్జీసీ మాత్రం ఆయన వైపే మొగ్గు చూపించింది. అయితే సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా మొజ్తబా ఇప్పటివరకు బహిరంగంగా కనిపించకపోవడం అనేక అనుమానాలకు దారితీసింది. ఫిబ్రవరి 28వ తేదీన అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో అయతొల్లా ఖమేనీ కుటుంబ సభ్యులు కొందరు మరణించారు. అయితే ఆ దాడిలో కొడుకు మొజ్తాబా మాత్రం తీవ్ర గాయాలతో బయటపడ్డారనే ప్రచారం ప్రచారం మాత్రం జోరుగా సాగింది. ముఖ్యంగా తన తండ్రి అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమాలకు కూడా మొజ్తబా హాజరు కాలేదు. టెహ్రాన్‌లో జరిగిన అంత్యక్రియల ప్రార్థనల్లో ఆయన సోదరులు మాత్రమే పాల్గొన్నారు. దేశ అత్యున్నత నాయకత్వ బాధ్యతలు చేపట్టిన వ్యక్తి ఇప్పటిదాకా కనిపించకపోవడం తీవ్ర చర్చకు కారణమైంది.త్వరలో ప్రజల ముందుకు వస్తారా?ఇటీవల మొజ్తబా ఖమేనీ త్వరలోనే ప్రజల ముందుకు రానున్నారనే ప్రచారం జరుగుతోంది. తన తండ్రి జ్ఞాపకార్థం నిర్వహించే భారీ స్మారక సభలో ఆయన పాల్గొనే అవకాశం ఉందని ఇరాన్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సభలో ఆయన ప్రత్యక్షమైతే.. సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇదే తొలి బహిరంగ కార్యక్రమం కానుంది. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి, నాయకత్వ సామర్థ్యంపై వస్తున్న ఊహాగానాలకు తెరపడుతుందని భావించారు.‘తండ్రి మరణానికి ప్రతీకారం’ అంటూ ప్రకటనలుఇరాన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి గాయపడిన మొజ్తబా అజ్ఞాతంలోనే కొనసాగుతున్నారు. సందేశాలు ఏమున్నా సరే.. అత్యంత గోప్యంగా ఆయనకు చేరవేస్తూ వస్తున్నారు. అలాగే ఆయన నుంచి బదులు కూడా అలాగే ప్రపంచానికి తెలియజేస్తున్నారు. తాజాగా తన తండ్రి అయతొల్లా అలీ ఖమేనీ మరణానికి ప్రతీకారం తప్పదంటూ మొజ్తబా కూడా ప్రకటన ఇచ్చినట్లు ఇరాన్ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. ఈ నేపథ్యంలో మొజ్తబా ఖమేనీ ప్రజల ముందుకు నిజంగానే వస్తారా?.. ట్రంప్ ప్రకటన ఉత్తదేనని తేలుస్తారా? అన్నది కీలకంగా మారింది.హర్ముజ్‌పై ట్రంప్ ప్రకటన.. భగ్గుమన్న ఇరాన్ఇదే సమయంలో ట్రంప్ హర్ముజ్ జలసంధిపై కూడా కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌పై సముద్ర దిగ్బంధనాన్ని తిరిగి అమలు చేస్తున్నట్లు ప్రకటించిన ఆయన.. హర్ముజ్ గుండా ప్రయాణించే కార్గో నౌకల నుంచి 20 శాతం రుసుము వసూలు చేయాలన్న ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. దీనిపై ఇరాన్ భగ్గుమంది. హర్ముజ్ విషయంలో అమెరికా జోక్యం సహించబోమని.. తమ నౌకలపై ఆధిపత్యం ప్రదర్శిస్తే బలప్రయోగానికి దిగుతామని హెచ్చరించింది. ఇటు అమెరికాకు సహకరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని గల్ఫ్ దేశాలను సైతం వారించింది. -
ప్రజల ముందుకు మోజ్తాబా ఖమేనీ.. నా తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటా
-
అజ్ఞాతం వీడనున్న మొజ్తబా ఖమేనీ.. త్వరలో తొలి బహిరంగ సభ
టెహ్రాన్: ఇరాన్ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి బహిరంగంగా ఎక్కడా కనిపించని మొజ్తబా ఖమేనీ వచ్చే వారంలో తొలిసారి ప్రజల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత ఫిబ్రవరి 28న జరిగిన దాడిలో అయాతొల్లా అలీ ఖమేనీ మరణించిన తర్వాత ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ ఇరాన్ అత్యున్నత నాయకునిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే, అప్పటి నుంచి ఆయన బయట ఎక్కడా కనిపించలేదు.తాజాగా తన తండ్రి అయాతొల్లా అలీ ఖమేనీ జ్ఞాపకార్థం జూలై 23న సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు టెహ్రాన్‌లో మొజ్తబా ఖమేనీ స్మారక సభను నిర్వహించనున్నట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ కార్యక్రమానికి ఆయన స్వయంగా హాజరవుతారా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అధికారిక ప్రకటనలో దివంగత నేతను ‘అమర ముజాహిద్ ఇమామ్’గా అభివర్ణించారు.తండ్రి అంత్యక్రియలకు దూరంఇటీవల జరిగిన అయాతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల ప్రార్థనలకు కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ హాజరుకాలేదు. టెహ్రాన్‌లోని ఇమామ్ ఖొమేనీ గ్రాండ్ మొసల్లాలో వేలాది మంది సమక్షంలో జరిగిన ఈ సభలో మొజ్తబా సోదరులు ముగ్గురు (మొస్తఫా, మేసమ్, మసౌద్ ఖమేనీ) మాత్రమే ప్రార్థనలు జరిపారు. అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో మరణించిన అయాతొల్లా అలీ ఖమేనీతో పాటు ఆయన కుమార్తె, అల్లుడు, కోడలు, 14 నెలల మనవరాలి శవపేటికలను ఈ అంత్యక్రియల్లో పక్కపక్కనే ఉంచారు. దేశంలోనే అత్యున్నత పదవిని చేపట్టినప్పటికీ, ఈ అంత్యక్రియల్లో మొజ్తబా కనిపించకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. -
హర్మూజ్ జలసంధిని మూసేస్తున్నాం : ఇరాన్
టెహ్రాన్ : ఇరాన్–అమెరికా పరస్పర దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. హర్మూజ్ జలసంధిలో గుర్తింపు లేని, అనధికారిక నౌకల రాకపోకలకు అనుమతి లేదని ఇరాన్ ముందునుంచే హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో, తాజాగా అనధికారికంగా ప్రయాణిస్తున్నట్లు పేర్కొన్న ఓ వాణిజ్య నౌకపై ఇరాన్ కాల్పులు జరిపింది. అనంతరం హర్మూజ్ జలసంధిని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఆ జలసంధి గుండా చమురు ట్యాంకర్లు సహా వాణిజ్య నౌకల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది.ఈ పరిణామాల మధ్య, కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘించిందని ఇరాన్ ఆరోపించింది. మూడో దఫా తమ భూభాగంపై అమెరికా దాడులకు పాల్పడిందని పేర్కొంటూ, దీనికి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించింది. హర్మూజ్ జలసంధి గుండా స్వేచ్ఛగా ప్రయాణించే వాణిజ్య నౌకలపై దాడులు చేస్తూ, ఇరాన్ సామర్థ్యాన్ని దెబ్బతీయాలనే ప్రయత్నాలు తీవ్ర పరిణామాలకు దారితీస్తాయని వెల్లడించింది.యుద్ధాన్ని ముగించేందుకు గత నెలలో కుదిరిన ఒప్పందాన్ని మరింత బలోపేతం చేసే చర్చలు హర్మూజ్ జలసంధి భద్రత లేకుండా ముందుకు సాగలేవని అమెరికా ఉన్నతాధికారులు గతంలో పేర్కొన్నారు. ఈ అంశంపై ఇరాన్ కూడా స్పష్టమైన బహిరంగ ప్రకటన చేస్తుందని తాము ఆశిస్తున్నట్లు వారు తెలిపారు.ఈ నేపథ్యంలో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేసింది. నిబంధనలను ఉల్లంఘించిన ఓ వాణిజ్య నౌకపై కాల్పులు జరిపామని, హర్మూజ్ జలసంధిని తాత్కాలికంగా మూసివేస్తున్నామని వెల్లడించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది.వాణిజ్య నౌకలపై ఇరాన్ చర్యలు, వాటికి అమెరికా ప్రతిస్పందనల నేపథ్యంలో యుద్ధ విరమణకు కుదిరిన తాత్కాలిక ఒప్పందానికి విఘాతం ఏర్పడింది. ఈ పరిస్థితులపై చర్చించేందుకు ఇరాన్, ఒమన్ విదేశాంగ మంత్రులు శనివారం సమావేశమైన అనంతరం ఈ ప్రకటనలు వెలువడ్డాయి.ఇదిలా ఉండగా, తన తండ్రి, ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కారణమని ఆరోపిస్తూ, ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ తీవ్ర హెచ్చరికలు జారీ చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. దీనికి ప్రతిస్పందించిన ట్రంప్, తనపై ఎలాంటి దాడికి ప్రయత్నించినా ఇరాన్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. -
నన్ను చంపితే ఇరాన్ భూస్థాపితం
దుబాయ్/వాషింగ్టన్: ఇరాన్ భూతలంపై అమెరికా.. అమెరికా మిత్రదేశాలపై ఇరాన్ బాంబులేస్తూ పశ్చిమాసియాలో రణజ్వాలల్ని కొనసాగిస్తుండగా శనివారం మాత్రం పరస్పర హెచ్చరికల పర్వానికి తెరలేపారు. తండ్రి మరణానికి కారణమైన ట్రంప్‌ను అంతమొందిస్తామని ఇరాన్ నూతన సుప్రీంనేత మొజ్తాబా ఖమేనీ ప్రతిజ్ఞచేసిన కొన్ని గంటలకే ట్రంప్ సైతం దీటైన హెచ్చరిక చేశారు. తనను చంపితే ప్రపంచపటంలో ఇరాన్ లేకుండా చేస్తామని, దారుణ వినాశనం సృష్టించేలా 1,000 క్షిపణులు దాడికి సిద్ధంగా ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌ను హెచ్చరించారు. ఈ మేరకు శనివారం ఆయన తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్‌లో ఒక పోస్ట్‌పెట్టారు. ‘‘ఇరాన్ ప్రభుత్వం గనక నన్ను చంపితే మరుక్షణమే ఇరాన్‌ను భూస్థాపితం చేసేందుకు 1,000 క్షిపణులు లోడ్ చేసి సిద్ధంగా ఉన్నాయి. అవి వినాశనం సృష్టించాక మిగతా భూమిని మరుభూమిగా మార్చేందుకు వేలాదిగా మిస్సైళ్లు వరసబెట్టి విరుచుకుపడతాయి. ఒకవేళ నన్ను చంపితే ఇరాన్‌పై ఎంతటి స్థాయిలో దాడిచేయాలో మా సైన్యానికి సమగ్రస్థాయిలో ఆదేశాలు ఇప్పటికే ఇచ్చేశా. ఇరాన్లో అంగుళం స్థలం కూడా వదలకుండా ఏడాది పొడవునా దాడులు చేయాలని గతంలోనే తగు ఆజ్ఞలు జారీచేశా’’అని ట్రంప్ హెచ్చరించారు. ప్రతీకారం తీర్చుకుంటాం: మొజ్తాబా అంతకుముందు శుక్రవారం దివంగత ఖమేనీ అంత్యక్రియల సందర్భంగా ఇరాన్ అధికార వార్తఛానల్లో మొజ్తాబా ఖమేనీ సందేశాన్ని ప్రసారంచేశారు. ‘‘ట్రంప్‌ను చంపాలనేది మా దేశ సంకల్పం. ఈ సంకల్పాన్ని సాధించి తీరతాం. అమరత్వం పొందిన మా నేత రక్తాన్ని చిందేలా చేసినందుకు ప్రతీకారం తీర్చుకుంటాం. ఘోరాలకు పాల్పడిన వాళ్లను వదలిపెట్టం. రెండు యుద్దాల్లో మా వాళ్లు అమరులయ్యేలా చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకుంటాం. నేరాలు చేసిన హంతకుల అంతుచూస్తాం’’అని మొజ్తాబా అన్నారు. హార్మూజ్‌ను తమ గుప్పిట పట్టామని ఇరాన్ చేసిన ప్రకటనను అమెరికా సీనియర్ ఉన్నతాధికారి తప్పుబట్టారు. ఇరాన్ తక్షణం హార్మూజ్‌ను తెరచి ఉంచామని ప్రకటన చేయాలని హెచ్చరించారు. హార్మూజ్ గుండా వెళ్లే నౌకలకు ఎలాంటి హానీ తలపెట్టొద్దని డిమాండ్‌చేశారు. గత రెండ్రోజుల్లో అమెరికా దాడుల్లో ఇరాన్లో 17 మంది చనిపోయారు. 115 మంది గాయపడ్డారని ఇరాన్ ఆరోగ్యశాఖ అధికార ప్రతినిధి హుస్సేన్ కెర్మాన్‌పూర్ తెలిపారు. మరోవైపు మధ్యవర్తి ఒమన్ దేశంతో చర్చల కోసం ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్అరాఘ్చీ సిద్ధమయ్యారు. తమ క్రూడ్, ఫ్యూయల్‌ను విక్రయించకుండా అమెరికా ఆంక్షలు విధించడం సబబుగా లేదు అని అరాఘ్చీ ఆగ్రహం వ్యక్తంచేశారు. -
తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటాను: ఖమేనీ స్ట్రాంగ్ వార్నింగ్
టెహ్రాన్: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తన తండ్రి అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల తర్వాత తొలి సందేశం విడుదల చేశారు. అల్ జజీరా కథనం ప్రకారం.. "నా తండ్రి రక్తం చిందేలా చేశారు.. నేను తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటాను. ఇది మా దేశం కోరిక కూడా" అని చెప్పారు.అంత్యక్రియలకు హాజరైన లక్షలాది మందికి మొజ్తబా ధన్యవాదాలు తెలిపారు. తన తండ్రికి నివాళులు అర్పించారు. భారీ సంఖ్యలో ప్రజలు హాజరుకావడం శత్రువుకు గట్టి దెబ్బగా అని, అది చరిత్రాత్మక ఘట్టమని చెప్పారు.ఇదిలా ఉంటే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ.. ఇరాన్ తనను హత్య చేయాలని ప్రయత్నిస్తే ఆ దేశం పూర్తిగా నాశనం అవుతుందని హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇరాన్ వైపు 1,000 క్షిపణులు ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్నాయని, అవసరమైతే వేలాది క్షిపణులను కూడా ప్రయోగిస్తామని పేర్కొన్నారు.ఇరాన్‌పై ట్రంప్‌నకు వైరం ఎప్పుడు మొదలైంది?ఈ వివాదం మూలాలు 2020 జనవరిలో ఉన్నాయి. అప్పట్లో ట్రంప్ తొలిసారి అమెరికా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇరాక్‌లోని బాగ్దాద్ విమానాశ్రయం సమీపంలో అమెరికా డ్రోన్ దాడిలో ఇరాన్ అత్యంత శక్తిమంతమైన సైనిక కమాండర్ ఖాసిం సోలేమానీ మరణించారు.ఆ సమయంలో సోలేమానీ మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రతిజ్ఞ చేసింది. ఆ తర్వాత అమెరికా సంస్థలు, ట్రంప్‌ను, ఆయన మాజీ అధికారులను ఇరాన్ లక్ష్యంగా చేసుకునే ప్రయత్నం చేయవచ్చని పలుసార్లు ప్రకటించాయి. అయితే, ఈ ఆరోపణలను ఇరాన్ ఎప్పటికప్పుడు ఖండిస్తోంది. ట్రంప్‌ను ఇరాన్ చంపేసే ప్రయత్నాలు చేస్తుందన్న వాదనలు ఇప్పటికీ ఉన్నాయి. నిపుణులు ఏమంటున్నారు? టెహ్రాన్ అప్లైడ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ మోస్తఫా ఖోష్చెష్మ్ మీడియాతో మాట్లాడుతూ.. హోర్ముజ్ జలసంధి ఎప్పటి నుంచో ఇరాన్ నియంత్రణలోనే ఉందని, యుద్ధం తర్వాత దానిపై నియంత్రణ వదులుకోవడాన్ని ఇరాన్ ప్రజలు అంగీకరించరని చెప్పారు.యుద్ధం సమయంలో హార్మూజ్ జలసంధి మూసివేయడంతో చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయని, అది ఇరాన్ చేతిలో అత్యంత శక్తిమంతమైన ఒత్తిడి సాధనంగా మారిందని చెప్పారు. దీనివల్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై దేశీయంగా ఒత్తిడి పెరిగిందని, సైనిక బలాన్ని ఉపయోగించినా హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవలేకపోయారని తెలిపారు. అమెరికాతో చర్చలు జరపడం వల్ల ఇరాన్‌కు ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదని, పైగా ఇంకా ఎక్కువ నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉందని ఆయన చెప్పారు. -
అమెరికా హెచ్చరికలకు ఇరాన్ కౌంటర్
టెహ్రాన్: అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి పీక్ స్టేజ్ చేరుకున్నాయి. యుద్ధ విరమణ ఒప్పందం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఇరాన్ కూడా గట్టిగా స్పందించింది. అమెరికా ఎలాంటి సైనిక చర్యలకు దిగినా తగిన ప్రతీకార చర్యలు తప్పవని ఇరాన్ కీలక నేతలు హెచ్చరించారు.ఇరాన్ పార్లమెంట్ స్పీకర్, చర్చల బృందానికి నేతృత్వం వహిస్తున్న మహమ్మద్ బాఘర్ ఘాలిబాఫ్ అమెరికాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై దాడి జరిగితే దానికి తగిన సమాధానం ఇస్తామని, ఒత్తిళ్లు, బెదిరింపులతో తమను వెనక్కి తగ్గించలేరని ఆయన హెచ్చరించారు. హార్మూజ్ జలసంధి తిరిగి సాధారణ స్థితికి రావాలంటే ఇరాన్ షరతులు, ఏర్పాట్లను పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని ఆయన పేర్కొన్నారు.ఇటీవల అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందం తర్వాత కూడా వివాదాలు పూర్తిగా చల్లారలేదు. ఇరు దేశాలు ఒకరిపై ఒకరు ఒప్పంద ఉల్లంఘనల ఆరోపణలు చేసుకుంటున్నాయి. అమెరికా వైపు నుంచి కొత్త హెచ్చరికలు రావడం, ఇరాన్ నుంచి ప్రతీకార చర్యల ప్రకటనలు రావడంతో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధి ఈ వివాదానికి కేంద్రంగా మారింది. ఈ మార్గం ద్వారా భారీ స్థాయిలో చమురు రవాణా జరుగుతుండటంతో అక్కడి పరిస్థితులు అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అమెరికా హార్మూజ్‌లో స్వేచ్ఛాయుత నౌకా రవాణాకు హామీలు కోరుతుండగా, ఇరాన్ మాత్రం తన ఆధిపత్యాన్ని కొనసాగించాలని చూస్తోంది.మరోవైపు దౌత్య మార్గాలు పూర్తిగా మూసుకుపోలేదు. ట్రంప్ చర్చలు కొనసాగించేందుకు ఇరాన్‌తో అంగీకారం కుదిరిందని చెబుతున్నప్పటికీ, కాల్పుల విరమణ ముగిసిందని కూడా స్పష్టం చేశారు. దీంతో ఒకవైపు చర్చలు, మరోవైపు సైనిక హెచ్చరికలు కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. తాజా పరిణామాలు కేవలం రెండు దేశాల మధ్య వివాదంగా కాకుండా, మధ్యప్రాచ్య భద్రత, ప్రపంచ చమురు సరఫరా, అంతర్జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపే అంశంగా మారాయి. -
ఖమేనీకి ఎదురుదెబ్బ.. అమెరికా షాక్ ట్రీట్మెంట్!
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి. హార్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగిన తాజా దాడుల నేపథ్యంలో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ టార్గెట్‌గా అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఖమేనీకి అనుబంధంగా పనిచేస్తున్నట్లు ఆరోపిస్తున్న ఆర్థిక నెట్‌వర్క్‌పై అమెరికా భారీ ఆంక్షలు విధించింది. ఈ చర్యలతో దుబాయ్‌కు చెందిన ప్రముఖ ఇరానీ వ్యాపారవేత్త, బ్యాంకర్ అలి అన్సారితో పాటు మొత్తం 14 మంది వ్యక్తులు, సంస్థలు అమెరికా ఆంక్షల జాబితాలో చేరాయి.కాగా, అలి అన్సారి ప్రపంచవ్యాప్తంగా పలు కంపెనీలు, బ్యాంకులు, పెట్టుబడి సంస్థల నెట్‌వర్క్‌ను నిర్వహిస్తున్నాడు. ఈ వ్యవస్థ ద్వారా ఇరాన్ ప్రభుత్వ నిధులను విదేశాలకు మళ్లించి, రియల్ ఎస్టేట్, హోటళ్లు, వాణిజ్య భవనాలు తదితర ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టినట్లు అమెరికా ఆరోపించింది. ఆ పెట్టుబడుల ద్వారా వచ్చే ఆదాయం మొజ్తబా ఖమేనీకి అనుబంధంగా ఉన్న ఆర్థిక వ్యవస్థకు, అలాగే ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కార్యకలాపాలకు ఉపయోగపడుతున్నట్లు పేర్కొంది.తాజా ఆంక్షల పరిధిలో ఇరాన్‌కు చెందిన మూడు కరెన్సీ ఎక్స్చేంజ్ సంస్థలు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, హాంకాంగ్‌లో నమోదైన పలు ఫ్రంట్ కంపెనీలు కూడా ఉన్నాయి. షెల్ కంపెనీల ద్వారా ప్రతి ఏడాది బిలియన్ల డాలర్ల విలువైన లావాదేవీలు నిర్వహిస్తూ అంతర్జాతీయ ఆంక్షలను తప్పించుకునేందుకు ఈ నెట్వర్క్ పనిచేస్తోందని అమెరికా ఆరోపించింది. ప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిలో ఇటీవల వాణిజ్య నౌకలపై జరిగిన దాడుల తర్వాత ఈ చర్యలు తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.లావాదేవీలు కట్.. అయితే, ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచి, దాని ఆర్థిక వనరులను దెబ్బతీయడమే తాజా ఆంక్షల ప్రధాన ఉద్దేశమని అమెరికా స్పష్టం చేసింది. ఈ ఆంక్షల కారణంగా జాబితాలో ఉన్న వ్యక్తులు, సంస్థలకు అమెరికాలో ఉన్న ఆస్తులు స్తంభించి పోనున్నాయి. అమెరికా పౌరులు, సంస్థలు వారితో ఎలాంటి ఆర్థిక, వాణిజ్య లావాదేవీలు నిర్వహించడానికి అనుమతి ఉండదు. అలాగే ఇతర దేశాల బ్యాంకులు లేదా కంపెనీలు వీరితో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తే ద్వితీయ స్థాయి ఆంక్షలను ఎదుర్కొనే అవకాశం ఉందని అమెరికా హెచ్చరించింది.ఇదిలా ఉండగా.. ఇరు దేశాల మధ్య పెరుగుతున్న సైనిక, దౌత్య విభేదాల నేపథ్యంలో తాజా ఆంక్షలు పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసే అవకాశముందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక, అమెరికా చేసిన ఆరోపణలను ఇరాన్ గతంలో పలుమార్లు ఖండించింది. తమపై విధిస్తున్న ఆంక్షలు రాజకీయ ఒత్తిడి కోసం చేస్తున్న చర్యలేనని, అవి అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని ఇరాన్ వాదిస్తోంది. తాజా ఆంక్షలపై ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. -
స్వస్థలంలో ఖమేనీ అంత్యక్రియలు పూర్తి
దుబాయ్: ఇరాన్న 37 ఏళ్లపాటు ఎదురులేకుండా పరిపాలించిన దివంగత సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు పూర్తయ్యాయి. స్వస్థలమైన మష్హద్ నగరంలో శుక్రవారం ఉదయం ఖమేనీ పార్థివదేహాన్ని ఖననం చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ చేపట్టిన సంయుక్త వైమానిక దాడుల్లో ఆయన మరణించిన సంగతి విదితమే. తర్వాత ఖమేనీ కుమారుడు మొజ్తబా ఖమేనీ నూతన సుప్రీంలీడర్‌గా నియమితులయ్యారు. పశ్చిమాసియాలో భీకర యుద్ధం కారణంగా అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలను వాయిదా వేశారు. ఇటీవల అమెరికా–ఇరాన్ మధ్య తాత్కాలిక ఒప్పందం కుదరడంతో అంత్యక్రియలు ప్రారంభించారు. గత వారం రోజులుగా ప్రజల సందర్శనార్థం ఖమేనీ భౌతికకాయాన్ని వేర్వేరు నగరాలకు తరలించారు. తమ అభిమాన నేతకు లక్షలాది మంది జనం కన్నీటి వీడ్కోలు పలికారు. ఆయన విగతజీవిగా ఉండడం చూసి చలించిపోయారు. షెడ్యూల్ ప్రకారం శుక్రవారం ఖననం పూర్తయ్యింది. మష్హద్ నగరంలో ఖననం జరిగిన ఇరాన్ రెండో పాలకుడు ఖమేనీ మాత్రమే. దాదాపు 11 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న తర్వాత హత్యకు గురైన నాదిర్ షాను 1747లో ఆ నగరంలోనే ఖననం చేశారు. -
ఖమేనీ అంత్యక్రియలకు భారీగా ఏర్పాట్లు
టెహ్రాన్: దివంగత సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలను నిర్వహించేందుకు ఇరాన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. 86 ఏళ్ల మత పెద్ద మరణానికి దారితీసిన విధ్వంసకర యుద్ధం తర్వాత, దేశం కోసం ప్రజలంతా ఏకమవ్వాలని కోరుతూ టెహ్రాన్ అంతటా బ్యానర్లు వెలిశాయి. శనివారం నుంచి మొదలయ్యే ఈ కార్యక్రమానికి లక్షలాదిగా జనం తరలివస్తారని భావిస్తున్నారు. 1989లో అప్పటి నేత అయతొల్లా రుహొల్లా ఖమేనీ అంత్యక్రియలకు భారీగా ప్రజలు హాజరైన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.టెహ్రాన్‌లోని గ్రాండ్ మొసల్లా వేదికపై ఖమేనీ భౌతిక కాయం ఉంచిన శవపేటికతోపాటు ఫిబ్రవరి 28వ తేదీన అమెరికా జరిపిన బాంబుదాడిలో ప్రాణాలు కోల్పోయిన ఆయన కుటుంబసభ్యుల మృతదేహాల శవపేటికలను కూడా అక్కడుంచారు. బాంబుదాడిలో ఖమేనీ అల్లుడు, ఆయన పెద్ద కుమార్తె, 14 నెలల మనవరాలు, ప్రస్తుతం సుప్రీం నేత మొజ్తబా భార్య చనిపోయారు. శుక్రవారం ఖమేనీ శవపేటిక వద్ద నివాళులరి్పంచిన ఇరాన్ నేతల్లో పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ ఘలీబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తదితరులున్నారు.ఈకార్యక్రమాల్లో ఇరాన్ టాప్ సైనిక నేత జనరల్ అహ్మద్ వాహిది కూడా పాల్గొన్నారు. ఫిబ్రవరి 8వ తేదీ నుంచి, అంటే యుద్ధం ప్రారంభంకాక ముందు నుంచే ఆయన ఎవరికీ కనిపించకుండాపోయారని పరిశీలకులు అంటున్నారు. కొత్త నేత మొజ్తబాకు ఆయన్ను అత్యంత సన్నిహితుడని చెబుతున్నారు. చర్చల్లో ఇరాన్ పైచేయి సాధించడంలో వాహిది కీలకమని చెబుతున్నారు. 5, 6, 7వ తేదీల్లో టెహ్రాన్, ఖోమ్ల్లో అంతిమ కార్యక్రమాలు జరుగుతాయి. 9వ తేదీన ఖమేనీ సొంతూరు మషాద్‌లో ఖననం చేయనున్నారు.నివాళులరి్పంచిన భారత ప్రతినిధులుఇరాన్ సుప్రీంనేత అయతొల్లా ఖమేనీకి భారత ప్రతినిధులు శుక్రవారం టెహ్రాన్‌లో నివాళుల రి్పంచారు. బిహార్ గవర్నర్ లెఫ్టినెంట్(రిటైర్డు) సయ్యద్ అతా హస్నైన్, విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్రా మార్ఘెరిటా ఉన్నారు. వేరుగా కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షిద్, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ కూడా నివాళులర్పించారు. అదేవిధంగా, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్ కూడా ఖమేనీకి టెహ్రాన్‌లో నివాళులరి్పంచారు. -
అలీ ఖమేనీ అంత్యక్రియలకు కొడుకు మొజ్తబా ఖమేనీ గైర్హాజరు!
ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ బహిరంగంగా హాజరయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంది. తీవ్ర భద్రతా ఆందోళనలే ఇందుకు కారణమని భారతదేశంలోని సుప్రీం లీడర్ ప్రతినిధి అయతొల్లా హకీమ్ ఎలాహీ తెలిపారు.ఓ ఇంటర్వ్యూలో అయతొల్లా హకీమ్ ఎలాహీ మాట్లాడుతూ.. అంత్యక్రియలకు ముందు ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ భద్రతా కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. "గత వారం నేను ఇరాన్లో ఉన్నాను. మొజ్తబాను కలిసిన నా స్నేహితులతో మాట్లాడాను. ఆయన బయటకు రావాలని, ప్రజలను కలవాలని కోరుకుంటున్నారని వారు చెప్పారు. కానీ, భద్రతా సిబ్బంది అందుకు అనుమతించడం లేదు. అది చాలా ప్రమాదకరమని, ఆయనకు భద్రత కల్పించడం సాధ్యం కాదని వారు చెప్పారు. ఆయన బయటకు రారని నేను భావిస్తున్నాను" అని ఎలాహీ చెప్పారు.కాగా, ఇప్పటికే ప్రపంచం నలుమూలల నుంచి వేలాది మంది ప్రముఖులు అయతొల్లా అలీ ఖమేనీకి తుది వీడ్కోలు చెప్పేందుకు టెహ్రాన్‌కు చేరుకుంటున్నారు. ఇరాన్‌కు ఇజ్రాయెల్, అమెరికాతో జరిగిన ఘర్షణల తర్వాత పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ అంత్యక్రియలు జరుగుతున్నాయి.ఇరాన్లో పరిస్థితుల గురించి ఎలాహీ మాట్లాడుతూ.. సుప్రీం లీడర్ మరణించినప్పటి నుంచి దేశమంతా సంతాపంలో ఉందని, ఆయనకు మద్దతు ఇచ్చే వారు ఈ నష్టాన్ని భర్తీ చేయలేనిదిగా భావిస్తున్నారని చెప్పారు. "వారికి ఇది చాలా పెద్ద నష్టం. తమ ఆత్మను, ప్రాణాన్ని కోల్పోయినట్టుగా వారు భావిస్తున్నారు. ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని వారు నమ్ముతున్నారు" అని చెప్పారు.ప్రస్తుతం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అంత్యక్రియలు జులై 4న టెహ్రాన్‌లో ప్రారంభం కానున్నాయి. అనంతరం జులై 7న ఖోమ్‌లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. చివరగా జులై 9న ఆయన స్వస్థలం మష్హద్లో అంత్యక్రియలు నిర్వహించి ఖననం చేస్తారు. అయితే, జులై 3న టెహ్రాన్‌లో జరిగే సంతాప కార్యక్రమానికి విదేశీ ప్రతినిధులు హాజరవుతారు. -
ప్రజల్లోకి మోజ్తాబా ఖమేనీ...?
-
ఖమేనీ అంత్యక్రియలపై ఉత్కంఠ.. మోజ్తాబా ఖమేనీ ఎక్కడ?
-
ఖమేనీ అంత్యక్రియలపై ఉత్కంఠ.. మొజ్తబా ఖమేనీ ఎక్కడ?
ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. జూలై 4 నుంచి 9 వరకు టెహ్రాన్, ఖోమ్, మష్హద్ నగరాల్లో నిర్వహించనున్న ఈ కార్యక్రమాలపై ప్రపంచ దృష్టి నెలకొంది. అయితే ఈ అంత్యక్రియల కంటే ఎక్కువగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అంశం.. ఇరాన్ ప్రస్తుత సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తొలిసారిగా బహిరంగంగా కనిపిస్తారా లేదా అన్నదే. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తర్వాత అత్యున్నత పదవిని చేపట్టిన ఆయన ఇప్పటివరకు ప్రజల ముందుకు రాకపోవడంతో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడిలో అలీ ఖమేనీ మరణానంతరం ఇరాన్ అత్యున్నత మతపరమైన సంస్థలు, రాజకీయ నాయకత్వం అత్యవసరంగా సమావేశమై మొజ్తబా ఖమేనీని కొత్త సుప్రీం లీడర్‌గా ప్రకటించాయి. అయితే బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఒక్క బహిరంగ సభలోనూ పాల్గొనలేదు. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రత్యక్ష ప్రసంగం చేయలేదు. ఆయన ఇప్పటివరకు ఒక్కసారి కూడా ప్రజల ముందుకు రాలేదు. వీడియో సందేశం, ఆడియో ప్రసంగం కూడా విడుదల చేయలేదు. దీంతో ఆయన ఆరోగ్యం, నాయకత్వ సామర్థ్యం, అధికార బదిలీపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు.. ఫిబ్రవరి 28న జరిగిన దాడిలో మొజ్తబా ఖమేనీ కూడా తీవ్రంగా గాయపడినట్లు ఇరాన్ అధికారులు గతంలో వెల్లడించారు. ముఖానికి తీవ్ర గాయాలు, కాలికి గాయాలైనట్లు సమాచారం. అప్పటి నుంచి ఆయన పూర్తిగా ప్రజలకు దూరంగా ఉండటంతో అంతర్జాతీయంగా చర్చ మొదలైంది.కాగా, జూలై 4న టెహ్రాన్‌లో ప్రారంభమయ్యే అంత్యక్రియల సందర్భంగా మొజ్తబా ఖమేనీ ప్రత్యక్షంగా హాజరవుతారా లేదా అన్నది ప్రస్తుతం ప్రధాన ప్రశ్నగా మారింది. ఒకవేళ ఆయన బహిరంగంగా కనిపిస్తే, కొత్త సుప్రీం లీడర్‌గా ఆయన అధికారాన్ని ప్రజలకు, ప్రపంచానికి చాటిచెప్పే తొలి సందర్భంగా భావిస్తున్నారు. మరోవైపు, ఆయన గైర్హాజరు అయితే ఆరోగ్య పరిస్థితి, అధికార నిర్వహణపై ఉన్న సందేహాలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.ప్రపంచ నేతలు హాజరు..ఇదిలా ఉండగా.. ఇరాన్ ప్రభుత్వం మాత్రం ఖమేనీ అంత్యక్రియలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. టెహ్రాన్‌లో ప్రారంభమయ్యే కార్యక్రమాల అనంతరం ఖోమ్‌లో మతపరమైన నివాళులు, ఆపై మష్హద్‌లోని పవిత్ర స్థలంలో ఖననం జరగనుంది. ఈ కార్యక్రమాలకు పలు దేశాల అధినేతలు, ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి రష్యా, చైనా, టర్కీ, ఖతర్, ఇరాక్, లెబనాన్ తదితర దేశాల ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అంత్యక్రియలు అత్యంత సున్నితమైన కార్యక్రమంగా మారాయి.ఇక అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్ ఇప్పటికే తన భద్రతా వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేసింది. కీలక ప్రభుత్వ భవనాలు, అణు కేంద్రాలు, సైనిక స్థావరాల వద్ద అత్యున్నత స్థాయి అప్రమత్తత కొనసాగుతోంది. అలీ ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ రాజకీయ, మతపరమైన నాయకత్వంలో చోటుచేసుకున్న మార్పులు మధ్యప్రాచ్య రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. -
ఇరాన్–అమెరికా శాంతి చర్చలకు బ్రేక్!
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు శాశ్వత తెర పడే ప్రయత్నాలకు విఘాతం కలిగింది. అమెరికా-ఇరాన్ మధ్య జరగాల్సిన శాంతి ఒప్పందం తాలుకా కీలక సమావేశం వాయిదా పడింది. శుక్రవారం స్విట్జర్లాండ్‌లోని బర్గెన్‌స్టాక్ పర్వత రిసార్ట్‌లో జరగాల్సిన ఈ భేటీ చివరి నిమిషంలో రద్దైనట్లు కథనాలు వెలువడుతున్నాయి. దీంతో.. తాత్కాలిక కాల్పుల విరమణ (ట్రూస్) భవిష్యత్తుపై భారీ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.శాంతి ఒప్పందానికి అవసరమైన పరస్సర అవగాహన ఒప్పందంపై అమెరికా, ఇరాన్ అధ్యక్షులు సంతకాలు కూడా చేశారు. అయితే ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం స్విట్జర్లాండ్‌లో ఇవాళ భేటీ జరగాల్సి ఉంది. దీనికి ఇరాన్-అమెరికా విదేశాంగ అధికారులతో పాటు పశ్చిమాసియా ప్రతినిధులు ఈ భేటీకి హాజరవుతారని అంతా భావించారు. అయితే.. ఇంతలోనే ట్విస్ట్ చోటుచేసుకుంది. ఏర్పాట్లలో సమస్యలు తలెత్తడంతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ స్విట్జర్లాండ్ పర్యటన రద్దు చేసుకున్నారు. మరోవైపు లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేస్తుండడంతోనే చర్చలు ఆగాయని ఇరాన్ ప్రకటించింది. దీంతో మరోసారి చర్చలకు బ్రేక్ పడింది. ఇప్పటికే ఇరాన్–అమెరికా మధ్య కుదిరిన తాత్కాలిక 60 రోజుల ఒప్పందాన్ని కుదిరింది. ఈ కాలంలోనే శాంతి చర్చలు పూర్తి కావాల్సి ఉంటుంది. అయితే ఒప్పందం అమలు చేసే దశలో కీలకమైన ఈ భేటీ రద్దు కావడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది.వైట్ హౌస్ ప్రకారం.. చర్చలను నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు, సమన్వయం, ప్రయాణాలు, షెడ్యూల్ వంటి విషయాలు(లాజిస్టిక్స్) అనూహ్యంగా మారడంతోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అలాగే అమెరికా అధికారులు మాత్రం ఈ ఒప్పందం ఇంకా పూర్తిగా రద్దు కాలేదని, భవిష్యత్తులో చర్చలు కొనసాగవచ్చని సంకేతాలు ఇచ్చారు. ఇదే సమయంలో ఇరాన్ మాత్రం అమెరికా ముందుగా ఒప్పందాన్ని అమలు చేయాలన్న స్పష్టమైన సంకేతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చర్చలకు షరతులు విధిస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ కూడా అమెరికా అధిక డిమాండ్లు చేస్తే ఒప్పుకోబోమని హెచ్చరించారు.ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం ఫిబ్రవరి 28న ప్రారంభమైన తర్వాత ఇప్పటివరకు వేలాది మంది మరణించగా, ఎనర్జీ ధరలు పెరిగి ప్రపంచ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. తాజా ఒప్పందం కింద ఇరాన్‌కు ఆర్థిక ఆంక్షల సడలింపు, ఆస్తుల విడుదల వంటి అంశాలు ఉన్నప్పటికీ, ఇజ్రాయెల్ ఈ చర్చల్లో భాగం కాకపోవడం వివాదంగా మారింది.అదే సమయంలో లెబనాన్‌లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. హెజ్బొల్లా లక్ష్యాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో కనీసం 16 మంది మరణించగా, పలు ప్రాంతాల్లో భీకర బాంబు దాడులు కొనసాగుతున్నాయి. అమెరికా–ఇజ్రాయెల్ మధ్య కూడా ఈ యుద్ధ విధానంపై అభిప్రాయ భేదాలు బయటపడుతున్నాయి. కొన్నిగంటల ముందు ఇజ్రాయెల్‌ను ఉద్దేశించి జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించిన ఈ యుద్ధ లక్ష్యాలు.. ఇరాన్ అణు సామర్థ్యాన్ని పూర్తిగా నిలిపివేయడం, ప్రాంతీయ దాడులను ఆపడం. అయితే ఈ రెండూ ఇప్పటివరకు పూర్తిగా సాధ్యం కాలేదని విశ్లేషకులు చెబుతున్నారు. అయినప్పటికీ కొత్త ఒప్పందంలో ఆర్థిక సడలింపులు, పునర్నిర్మాణ నిధులు వంటి అంశాలు ఉండటం చర్చలకు కొత్త మలుపు ఇచ్చాయి.చర్చలు ప్రస్తుతానికి రద్దు కావడంతో మిడిల్ ఈస్ట్‌లో శాంతి ఆశలు మరోసారి అనిశ్చితిలో పడిపోయాయి. రాబోయే రోజుల్లో ఇరాన్–అమెరికా మళ్లీ చర్చల టేబుల్‌కి వస్తాయా? అనేది ప్రపంచ రాజకీయాల్లో కీలక ప్రశ్నగా మారింది. -
మొజ్తాబా ఖమేనీ సంచలన వ్యాఖ్యలు
అమెరికా–ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందంపై ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ తొలిసారి స్పందించారు. ఇరాన్ ప్రయోజనాలు, "రెసిస్టెన్స్ ఫ్రంట్" హక్కులు కాపాడతామనే హామీతోనే తాను ఈ ఒప్పందానికి అంగీకరించానని అన్నారాయన. ఈ క్రమంలోనే ట్రంప్ తీరుపైనా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా–ఇరాన్ మధ్య అవగాహన ఒప్పందం (MoU) కుదిరిన తర్వాత ప్రజలను ఉద్దేశించి విడుదల చేసిన సందేశంలో మొజ్తబా ఖమేనీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఒప్పందం కోసం తామేమీ ప్రయత్నించలేదని.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే తీవ్రంగా ఆరాటపడ్డారని.. ఈ క్రమంలో "అన్ని రకాల ఒత్తిళ్లు, ఎత్తుగడలు" ఉపయోగించారని పేర్కొన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..తొలుత తాను ఈ ఒప్పందాన్ని సూత్రప్రాయంగా వ్యతిరేకించానని.. అయితే ఈ విషయంలో అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్, జాతీయ భద్రతా మండలి సభ్యులు తనను ఒప్పించారని అన్నారు. ఇరాన్ ప్రయోజనాలు దెబ్బతినవని హామీ ఇవ్వడంతోనే ఆమోదం తెలిపినట్లు చెప్పారు. "ఈ ఒప్పందం కోసం ఇరాన్ అధికారులు నిజాయితీగా కృషి చేశారు. కానీ దీనిని సాధించేందుకు అన్ని రకాల ఒత్తిళ్లు ఉపయోగించిన వ్యక్తి అమెరికా అధ్యక్షుడే. నిరాశతోనే ఈ డీల్‌ను ముందుకు తీసుకొచ్చాడు" అని ఖమేనీ వ్యాఖ్యానించారు.భవిష్యత్తులో అమెరికా ఒప్పంద పరిధిని దాటి అదనపు షరతులు విధించాలనుకుంటే వాటికి తాము లొంగబోమని అధ్యక్షుడు తనకు స్పష్టంగా చెప్పారని ఖమేనీ వెల్లడించారు. ఇరాన్ హక్కులు, స్వాతంత్ర్యం, గౌరవం విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. అలాగే భవిష్యత్తులో అమెరికాతో ముఖాముఖి చర్చలు జరగడం అంటే.. అమెరికా వైఖరిని అంగీకరించినట్లు కాదని కూడా ఆయన స్పష్టం చేశారు.ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ బలగాలు సంయుక్తంగా ఫిబ్రవరి 28వ తేదీన యుద్దం ప్రారంభించాయి. ఆ దాడుల్లో ఆనాడు ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఉన్న అయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. అదే దాడిలో తీవ్రంగా గాయపడిన మొబ్తాబా ఖమేనీ.. అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ మధ్యలో నాయకత్వ బాధ్యతలు ఇరాన్లో తీవ్ర చర్చలు జరిగాయి. చివరకు.. మత, భద్రతా వర్గాల మద్దతుతో మొజ్తాబానే కొత్త సుప్రీం లీడర్‌గా ఎన్నికయ్యారు. తాజాగా అమెరికా–ఇరాన్ శాంతి ఒప్పందంపై ఆయన చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి.ఖమేనీకి మద్దతుగా విదేశాంగ మంత్రిఖమేనీ ప్రకటనతో.. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఏకీభవించారు. సుప్రీం లీడర్ మార్గదర్శకాల ప్రకారమే చర్చలు కొనసాగుతాయని పేర్కొన్నారు. చర్చల తదుపరి దశలో దేశ ప్రయోజనాలు, గౌరవం, స్వాతంత్ర్యాన్ని కాపాడేందుకు తమ పూర్తి సామర్థ్యాన్ని వినియోగిస్తామని చెప్పారు. ఇదిలా ఉంటే.. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం ముగించే ఒప్పంద తాలుకా ఎంవోయూపై ఇరు దేశాల అధినేతలు డిజిటల్ సంతకాలు చేశారు. ఒప్పందం కుదిరిన వెంటనే తొలి చర్యలు ప్రారంభమయ్యాయి. హర్ముజ్ జలసంధి పరిసరాల్లో అమలు చేస్తున్న సముద్ర నిర్బంధ చర్యలను అమెరికా సెంట్రల్ కమాండ్ నిలిపివేసింది. ఇకపై ఇరాన్ నౌకాశ్రయాలకు వచ్చీపోయే వాణిజ్య నౌకలపై ఆంక్షలు ఉండవని ప్రకటించింది.మరోవైపు హర్ముజ్ జలసంధి గుండా వాణిజ్య రవాణాను పునరుద్ధరించేందుకు ఇరాన్ చర్యలు ప్రారంభించింది. వచ్చే 60 రోజుల పాటు నౌకలకు వేగవంతమైన అనుమతులు, జలసంధి రుసుముల మినహాయింపు కల్పిస్తామని వెల్లడించింది.ఒప్పందంలో అసలు ఏముంది?"ఇస్లామాబాద్ మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్" పేరుతో కుదిరిన ఈ తాత్కాలిక ఒప్పందం ప్రకారం ఇరు దేశాలు సైనిక చర్యలను నిలిపివేయాలి. హర్ముజ్ జలసంధిలో సాధారణ రవాణా పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలి. అలాగే 60 రోజుల వ్యవధిలో పూర్తి స్థాయి శాంతి ఒప్పందం కోసం చర్చలు జరపాలి. ఆ చర్చల్లో ఆంక్షల ఎత్తివేత, ఇరాన్ అణు కార్యక్రమం, ప్రాంతీయ భద్రత వంటి కీలక అంశాలు చర్చకు రానున్నాయి. ఇక..ఇటు స్విట్జర్లాండ్‌లో జరగాల్సిన కీలక సమావేశం యథాతథంగా జరగనుంది. అమెరిరా, ఇరాన్‌తో పాటు పశ్చిమాసియా ప్రతినిధులు ఈ భేటీకి హాజరు కానున్నారు. అవగాహన ఒప్పందం అమలుతో పాటు తుది ఒప్పందం విధివిధానాలపై చర్చించే అవకాశం ఉంది. -
ఆంక్షలతో అల్లాడిన జీవితాలు.. ఇరానీల మౌన వేదన
టెహ్రాన్ ‘విజయం’ అంటోంది.. కానీ ఇరాన్ ప్రజలు ‘ఉపశమనం’ అంటున్నారు. అమెరికాతో ఒప్పందాన్ని ప్రభుత్వం రాజకీయ గెలుపుగా చూపిస్తుండగా, సంక్షోభంలో కూరుకుపోయిన ప్రజలు మాత్రం తమ జీవితం మెరుగుపడుతుందా?.. ధరలు తగ్గుతాయా? ఉద్యోగాలు వస్తాయా? పిల్లల భవిష్యత్తు బాగుంటుందా? అనే దానిపైనే దృష్టి పెట్టారు. ఆర్థిక కష్టాలు, యుద్ధ భయాలే ఈ ఒప్పందానికి అసలు కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాధారణ ప్రజలు మాత్రం దాన్ని తమ జీవితాల్లో కొంత వెలుగు నింపే అవకాశంగా చూస్తున్నారు.గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ ఆంక్షలు ఇరాన్ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీశాయి. దేశ ప్రధాన ఆదాయ వనరైన చమురు ఎగుమతులపై పరిమితులు విధించడంతో విదేశీ మారక నిల్వలు తగ్గిపోయాయి. ఫలితంగా ఇరానియన్ రియాల్ విలువ క్షీణించింది. ద్రవ్యోల్బణం భారీగా పెరిగి నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకాయి. ఒకప్పుడు మధ్యతరగతికి అందుబాటులో ఉన్న అనేక వస్తువులు ఇప్పుడు విలాసంగా మారిపోయాయి.టెహ్రాన్‌కు చెందిన 45 ఏళ్ల ఉపాధ్యాయుడు అలీ రెజా మాటల్లో చెప్పాలంటే.. మాకు రాజకీయ విజయాలు అవసరం లేదు. మార్కెట్‌కు వెళ్లినప్పుడు సరుకులు కొనగలిగితే అదే విజయం.. ఈ భావన ప్రస్తుతం దేశవ్యాప్తంగా కనిపిస్తోంది. ప్రజల దృష్టిలో అమెరికాతో ఒప్పందం అంటే అంతర్జాతీయ రాజకీయాల్లో గెలుపు కాదు.. కుటుంబ ఖర్చులు తగ్గే అవకాశం అని భావిస్తున్నారు.ఆంక్షల అసలు ప్రభావం ప్రజలపైనే.. అమెరికా ఆంక్షల కారణంగా ఇరాన్లో కేవలం చమురు ఆదాయం మాత్రమే తగ్గలేదు. విదేశీ బ్యాంకింగ్ వ్యవస్థలతో సంబంధాలు దెబ్బతినడంతో మందులు, వైద్య పరికరాలు, పరిశ్రమలకు అవసరమైన ముడిసరుకుల దిగుమతులు కూడా కష్టతరమయ్యాయి. క్యాన్సర్, అరుదైన వ్యాధుల చికిత్సకు అవసరమైన మందులు దొరకక చాలా కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి.ఇరాన్ యువత పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంది. నిరుద్యోగం, తక్కువ వేతనాలు, విదేశాల్లో అవకాశాల కొరత కారణంగా వేలాది మంది యువకులు నిరాశలో ఉన్నారు. చాలా మంది ఉన్నత విద్య పూర్తిచేసినా సరైన ఉద్యోగాలు దొరకడం లేదు. ఆర్థిక ఆంక్షల కారణంగా విదేశీ పెట్టుబడులు తగ్గిపోవడంతో పరిశ్రమలు కూడా ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదు. అందుకే అమెరికాతో ఒప్పందం ద్వారా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటే కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయని యువత ఆశిస్తోంది.మహిళల ఆశలుఇటీవలి సంవత్సరాల్లో ఇరాన్లో మహిళల హక్కుల కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడితే సమాజంలో మరిన్ని సంస్కరణలు వస్తాయనే ఆశ కొంతమంది మహిళల్లో ఉంది. అయితే ఒప్పందం వల్ల రాజకీయ స్వేచ్ఛలు పెరుగుతాయా అనే విషయంలో మాత్రం సందేహాలు ఉన్నాయి. అలాగే ఇరాన్లో మహిళల విద్యా స్థాయి గణనీయంగా పెరిగినా, ఉద్యోగ అవకాశాలు మాత్రం పరిమితంగానే ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటే ప్రైవేట్ రంగంలో కొత్త అవకాశాలు వస్తాయని, మహిళల ఉపాధి పెరుగుతుందని చాలామంది భావిస్తున్నారు. ముఖ్యంగా యువతులు ఈ ఒప్పందాన్ని ఉపాధి, ఆర్థిక స్వావలంబన దిశగా ఒక అవకాశంగా చూస్తున్నారు. మరోవైపు, 2022లో జరిగిన Mahsa Amini protests తర్వాత మహిళల హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛల అంశాలు ఇరాన్లో ప్రధాన చర్చగా మారాయి. ఆర్థికంగా ప్రపంచంతో సంబంధాలు పెరిగితే సమాజంలో మరింత తెరవెనుకత, సంస్కరణలకు అవకాశం ఏర్పడుతుందనే ఆశ కొందరు మహిళల్లో ఉంది. ప్రజల్లో ఆందోళన..మరో ముఖ్యమైన అంశం యుద్ధ భయం. గత కొంతకాలంగా అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, ఇజ్రాయెల్‌తో పెరిగిన ఘర్షణలు ప్రజల్లో ఆందోళన పెంచాయి. మధ్యప్రాచ్యంలో యుద్ధం మరింత విస్తరిస్తే తమ జీవితాలపై తీవ్ర ప్రభావం పడుతుందని చాలామంది భావిస్తున్నారు. అందుకే ఈ ఒప్పందం ద్వారా ఉద్రిక్తతలు తగ్గితే అదే తమకు పెద్ద ఊరట అని చెబుతున్నారు. అయితే ఆశలతో పాటు అనుమానాలు కూడా ఉన్నాయి. గతంలో కూడా అమెరికా, ఇరాన్ మధ్య ఒప్పందాలు కుదిరినా తరువాత అవి నిలవలేదు. అందుకే ‘ఈసారి నిజంగా మార్పు వస్తుందా?’ అనే సందేహం చాలా మందిలో కనిపిస్తోంది. ఒప్పందం కుదిరిందనే వార్త కంటే, దాని ఫలితాలు తమ జేబుల్లో కనిపిస్తాయా లేదా అన్నదే వారికి ముఖ్యం.రాజకీయంగా చూస్తే టెహ్రాన్ దీనిని విజయగాథగా చెప్పుకోవచ్చు. కానీ సాధారణ ఇరానీయులకు ఇది విజయోత్సవాల విషయం కాదు. రోజురోజుకూ పెరుగుతున్న ధరలు తగ్గడం, ఉద్యోగ అవకాశాలు పెరగడం, యుద్ధ భయం తగ్గడం, పిల్లలకు మెరుగైన భవిష్యత్తు దొరకడం వారికి అసలైన విజయం అదే. అందుకే అమెరికాతో కుదిరిన ఈ ఒప్పందాన్ని ఇరాన్ ప్రజలు ‘గెలుపు’గా కాదు, ‘బతుకును నిలబెట్టే ఆశాకిరణం’గా చూస్తున్నారు. దీంతో, ఈ ఒప్పందం నిజంగా ఇరాన్ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువస్తుందా? లేక రాజకీయ ప్రచారానికే పరిమితమవుతుందా? అన్నది రాబోయే నెలల్లో తేలనుంది. -
యుద్ధానికి ముగింపు? కీలక ప్రకటన చేసిన ఇరాన్!
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు దారితీసిన అమెరికా-ఇరాన్ ఘర్షణ ముగింపుకు చేరువైనట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. రెండు దేశాల మధ్య ప్రాథమిక ఒప్పందం కుదిరే దశకు చేరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ఇప్పటిదాకా ట్రంప్ ప్రకటనలను ఖండిస్తూ వచ్చిన ఇరాన్.. ఈసారి కాస్త సానుకూలంగానే స్పందించింది. ప్రపంచ చమురు మార్కెట్లను కుదిపేసిన హర్ముజ్ జలసంధి మళ్లీ తెరుచుకోనున్న నేపథ్యంలో.. అసలు ఈ ఒప్పందంలో ఏం ఉండబోతోంది? యుద్ధం ముగిస్తే ఎవరు గెలిచినట్లు?.. అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ విరమణకు సంబంధించిన అవగాహన ఒప్పందం (MoU) ముసాయిదాపై ఇరు పక్షాలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అమెరికా పరిపాలనలోని ఓ సీనియర్ అధికారి వెల్లడించిన వివరాల ప్రకారం.. వచ్చే కొద్ది రోజుల్లో తొలి ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం ఉంది. మరోవైపు ఇరాన్ కూడా చిన్న చిన్న మార్పులు జరిగే అవకాశం ఉన్నప్పటికీ దాదాపు ఖరారైందని ప్రకటించింది.ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఖ్చీ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. చర్చలు తుది దశకు చేరాయని అన్నారు. "అమెరికాతో ఒప్పందం ఇంత దగ్గరగా ఎప్పుడూ రాలేదు" అని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఆ పోస్టును అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన సోషల్ మీడియా వేదికలో షేర్ చేయడం చర్చనీయాంశమైంది. అదే సమయంలో.. ట్రంప్ మరో ట్విస్ట్ ఇచ్చారు.ఇరాన్ మీడియా ప్రచురించిన 14 అంశాల అవగాహన ఒప్పందం వివరాలను ట్రంప్ ఖండించారు. ఇటు అసలు షరతులపై ఊహాగానాలు చేయొద్దని అరాఖ్చీ మీడియాను కోరారు. చర్చలు పూర్తయిన తర్వాతే పూర్తి వివరాలను వెల్లడిస్తామని తెలిపారు. మరోవైపు ఈ యుద్ధంలో తామే గెలిచినట్లు ఇరాన్ ప్రకటించుకోవడం.. ఈ మొత్తం ఎపిసోడ్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.అదే కీలకంఈ ప్రతిపాదిత ఒప్పందంలో.. అత్యంత కీలక అంశంగా హర్ముజ్ జలసంధి ఉండబోతోందని తెలుస్తోంది. ప్రపంచ చమురు, సహజవాయు సరఫరాల్లో దాదాపు ఐదో వంతు ఈ మార్గం గుండా రవాణా అవుతుంది. యుద్ధం తర్వాత ఇరాన్ మూసివేసిన ఈ జలసంధిని మళ్లీ తెరవడానికి అంగీకరించినట్లు సమాచారం. ప్రతిగా అమెరికా ఇరాన్‌పై విధించిన కొన్ని ఆర్థిక ఆంక్షలను సడలించడంతో పాటు, నిలిపివేసిన బిలియన్ల డాలర్ల ఆస్తులను విడదీయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.అణు ఒప్పందం.. ఆగాల్సిందే!అయితే అణు కార్యక్రమం అంశం మాత్రం ఇంకా పరిష్కారం కాలేదు. 60 రోజులపాటు ప్రత్యేక చర్చలు జరిపి దీనిపై నిర్ణయం తీసుకోవాలని ఒప్పందంలో ప్రతిపాదించినట్లు సమాచారం. అమెరికా వాదన ప్రకారం ఇరాన్ అధిక శుద్ధి చేసిన యురేనియం నిల్వలను తొలగించి, అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాల్సి ఉంటుంది. కానీ ఇరాన్ మాత్రం యురేనియాన్ని పూర్తిగా వదులుకునే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. దాన్ని తక్కువ శుద్ధి స్థాయికి మార్చే (డౌన్బ్లెండింగ్) మార్గానికే తాము సిద్ధమని అరాఖ్చీ ఓ అంతర్జాతీయ మీడియా ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించడం గమనార్హం.ఈ ఒప్పందంలో మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. యుద్ధ నష్టాలకు పరిహారం, అలాగే ఇరాన్ క్షిపణి కార్యక్రమంపై అమెరికా చాలా కాలంగా చేస్తున్న డిమాండ్లను పక్కన పెట్టే అవకాశాలపై కూడా చర్చ జరిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే అమెరికా అధికారులు ఈ అంశాలను ఖండిస్తున్నారు.ఇది ఇంకో ట్విస్ట్ఇక ఈ చర్చల్లో ఇజ్రాయెల్ భాగస్వామి కాకపోవడం మరో కీలక పరిణామం. అమెరికాతో కలిసి ఇరాన్‌పై సైనిక చర్యలకు దిగిన ఇజ్రాయెల్.. తుది ఒప్పందంలో భాగం కాదని ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే లెబనాన్‌లోని ఆక్రమిత ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ వైదొలుగుతుందని ఇరాన్ కోరుతున్నప్పటికీ, ఇజ్రాయెల్ రక్షణ శాఖ మాత్రం అలాంటి ఆలోచన లేదని ప్రకటించింది.ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. చమురు సరఫరాలపై భయాలు తగ్గడంతో బ్రెంట్ క్రూడ్ ధరలు రెండు నెలల కనిష్ఠానికి చేరాయి. ప్రపంచ స్టాక్ మార్కెట్లు కూడా లాభాల్లో ముగిశాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ ఒప్పందం తన ప్రధాన లక్ష్యాలను నెరవేర్చిందని చెబుతున్నప్పటికీ, ఒప్పంద నిబంధనలు ఇరాన్‌కు ఎక్కువ ప్రయోజనం చేకూర్చేలా ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు “యుద్ధంలో విజేత ఇరానే” అని టెహ్రాన్ ప్రకటించడం ఈ ఒప్పందం చుట్టూ మరింత రాజకీయ ఆసక్తిని పెంచుతోంది.ప్రస్తుతం ప్రపంచ దృష్టంతా ఒక్క విషయంపైనే ఉంది. నిజంగానే యుద్ధానికి ముగింపు పలికే చారిత్రాత్మక ఒప్పందం కుదురుతుందా? లేదంటే చివరి క్షణంలో మళ్లీ కొత్త మలుపులు తిరుగుతుందా?.. -
‘వాస్తవంలో బతకండి మిస్టర్ ట్రంప్’.. నీళ్లు చల్లిన టెహ్రాన్!
టెహ్రాన్: వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరిన వేళ, ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీతో భవిష్యత్తులో సమావేశం కావచ్చంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదనను ఇరాన్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇటువంటి భేటీ ఆశించడం ముమ్మాటికీ అవాస్తవికమని, అమెరికా అధ్యక్షుడు ఇకనైనా ‘వాస్తవంలో బతకడం’ అలవాటు చేసుకోవాలని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ట్రంప్ ఆశావాదం - ఇరాన్ తిరుగుబాటుఇరు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలు ముందుకు సాగితే, ఇరాన్ అగ్ర నాయకత్వంతో నేరుగా చర్చలు జరపవచ్చని డోనాల్డ్ ట్రంప్ ఇటీవల ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రాంతీయ భద్రత, ఇరాన్ అణు కార్యక్రమంపై విస్తృత ఒప్పందాన్ని కుదుర్చుకునే వ్యూహంలో భాగంగా, మొజ్తబా ఖమేనీతో చారిత్రాత్మక భేటీకి తాను సిద్ధమంటూ సంకేతాలు ఇచ్చారు. అయితే, ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు ట్రంప్ వ్యాఖ్యలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయని లెబనాన్ ఛానల్ ‘అల్ మయాదీన్’ ఇంటర్వ్యూలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ కొట్టిపారేశారు.అసలు ఎవరీ మొజ్తబా ఖమేనీ?2026 మార్చిలో అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన సైనిక దాడుల్లో అప్పటి ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించారు. ఆ తర్వాత ఆయన కుమారుడైన మొజ్తబా ఖమేనీ ఇరాన్ అత్యున్నత రాజకీయ, మతపరమైన పదవిని చేపట్టారు. బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ఆయన ప్రజల్లో ఎక్కువగా కనిపించకపోయినప్పటికీ, ఇరాన్ అంతర్గత, విదేశాంగ విధానాలను శాసించడంలో ఆయనే కీలక పాత్ర పోషిస్తున్నారని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. యుద్ధం నాల్గవ నెలలోకి ప్రవేశించిన ఈ తరుణంలో ఆయనతో భేటీ కావడం ట్రంప్‌కు ప్రతిష్టాత్మకంగా మారింది.కొనసాగుతున్న తీవ్ర విభేదాలుఅమెరికా ఎంతగా చర్చల ప్రతిపాదనలు ముందుకు తెస్తున్నా, ఇరు దేశాల మధ్య నమ్మకరాహిత్యం స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా విధిస్తున్న ఆర్థిక ఆంక్షలు, మధ్యప్రాచ్యంలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఘర్షణలు దౌత్యపరమైన పురోగతికి ప్రధాన అడ్డంకులుగా ఉన్నాయని ఇరాన్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. కేవలం బహిరంగ ప్రకటనల ద్వారా కాకుండా, ఆచరణాత్మక రాజకీయ పరిణామాల ఆధారంగానే భవిష్యత్తు చర్చలు ఉంటాయని ఇరాన్ గట్టిగా చెప్తోంది. నానాటికీ క్షీణిస్తున్న ఈ సంబంధాల నేపథ్యంలో, ఇరు దేశాల మధ్య సయోధ్య కుదరడం ఇప్పట్లో సాధ్యం కాదని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి.ఇది కూడా చదవండి: కరోనా నాటి ఘోర తప్పిదం.. నేడు వేలాది ప్రాణాలకు ముప్పు! -
‘నేను ఖమేనీని కలవాలనుకుంటున్నా..’
ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీని కలవాలని ఉందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ దగ్గర ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలు ఉండకూడదన్న ట్రంప్.. ఇందుకు ఇరాన్ కూడా అంగీకరించిందంటూ చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో తాను ఇరాన్ సుప్రీం లీడర్‌ను నేరుగా కలవాలనుకుంటున్నానంటూ ఆయన పేర్కొన్నారు. ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై ప్రతిష్టంభన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ట్రంప్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.యుద్ధాన్ని ముగించే ఒప్పందానికి సంబంధించిన చర్చల్లో ఖమేనీ భాగస్వామి అయ్యారని.. ఇరువురి మధ్య సంబంధాలు చాలా బాగున్నట్లు కనిపిస్తోందంటూ ట్రంప్ తెలిపారు. ఇరాన్ ప్రజలు, నాయకులకు ఆయనపై చాలా గౌరవం ఉందని నేను భావిస్తున్నాను.. అలాగే ఏదో ఒక సమయంలో తాను ఆయనను కలవాలనుకుంటున్నట్లు ట్రంప్ తెలిపారు.'పాడ్ ఫోర్స్ వన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. పరిణామాలు ఎలా సాగుతాయనే దాన్ని బట్టి.. మేము ఏదో ఒక సమయంలో సమావేశమవుతామని చెప్పారు. ఇరాన్ ఇప్పటికే అణు ఆయుధాన్ని కలిగి ఉండకూడదనే విషయానికి అంగీకరించిందని.. అది చాలా పెద్ద విషయం అంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు."మేము వారిని అణు ఆయుధాన్ని కలిగి ఉండనివ్వలేము. వారు అణు ఆయుధాన్ని కలిగి ఉండబోమని ఇప్పటికే అంగీకరించారు. వారు తమ నిర్ణయాన్ని మార్చుకోవచ్చు. ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు, శాంతి చర్చల్లో జాప్యం ఉన్నప్పటికీ ఇరాన్‌తో తమ మంచి సంబంధాల దిశగా సాగుతున్నాయని ట్రంప్ తెలిపారు.ఇదిలా ఉండగా.. ట్రంప్ గతంలో మొజ్తబా ఖమేనీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా మాత్రం ఆయనతో నేరుగా చర్చలకు సిద్ధమంటూ సానుకూల ధోరణితో మాట్లాడారు ఆయన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. -
రహస్య బంకర్లో మొజ్తబా ఖమేనీ.. వీడని దాడుల భయం!
టెహ్రాన్: ప్రస్తుతం ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ అత్యంత రహస్య ప్రదేశంలో తలదాచుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా- ఇజ్రాయెల్ దాడుల భయంతో ఆయన బయటి ప్రపంచంతో ఎటువంటి ప్రత్యక్ష సంబంధాలు లేకుండా పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. తన తండ్రి అయతొల్లా అలీ ఖమేనీ మరణానికి కారణమైన దాడుల తరహాలోనే, తనపై కూడా దాడులు జరుగుతాయని భావిస్తున్న మొజ్తబా ఖమేనీ, అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య రహస్య బంకర్లలో తలదాచుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.కూలీల వ్యవస్థతో సంక్షోభంఅమెరికా అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం, ఖమేనీని నేరుగా చేరుకోవడం ఎవరికీ సాధ్యం కావడం లేదు. ఆయనతో సంభాషించడానికి ఒక క్లిష్టమైన ‘కూలీల నెట్వర్క్’ను ఏర్పాటు చేశారు. ఈ పద్ధతి వల్ల ఇరాన్- అమెరికా మధ్య జరుగుతున్న దౌత్య చర్చల్లో తీవ్రమైన జాప్యం జరుగుతోంది. ఇరాన్ ప్రతినిధులు కూడా తమ సుప్రీం లీడర్‌ను నేరుగా సంప్రదించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనివల్ల పంపే ప్రతి సందేశానికి స్పందన రావడానికి చాలా సమయం పడుతోంది.అగ్రనేతలకే తెలియని ఖమేనీ ఆచూకీఅత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇరాన్ ప్రభుత్వంలోని అగ్రశ్రేణి అధికారులకు సైతం ఖమేనీ ఎక్కడ ఉన్నారో తెలియదు. తన భద్రత విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్న ఖమేనీ, తన ఆచూకీని బయటపడకుండా చూసుకుంటున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సంస్థలు ఇరాన్ అంతర్గత వర్గాల నుండి సేకరిస్తున్న సమాచారం వల్ల, ఇప్పటికే ఇరాన్‌కు చెందిన చాలా మంది కీలక నేతలు పట్టుబడ్డారు. ఇదే భయం ఇప్పుడు ఖమేనీని అజ్ఞాతంలోకి వెళ్లేలా చేసింది.ఒసామా బిన్ లాడెన్ తరహా వ్యూహంకొందరు విశ్లేషకులు ఖమేనీ అనుసరిస్తున్న ఈ అజ్ఞాత పద్ధతులను, గతంలో ఒసామా బిన్ లాడెన్ అనుసరించిన ‘ఆపరేషనల్ ఇన్విజిబిలిటీ’తో పోలుస్తున్నారు. మొజ్తబా ఖమేనీ గత ఫిబ్రవరి 28 నాటి దాడుల్లో గాయపడినప్పటి నుండి బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. ఇరాన్ నేతలు చాలా మంది వారాల తరబడి భూగర్భ బంకర్లకే పరిమితం కావడం, ఇరాన్ నాయకత్వంలో నెలకొన్న భయాందోళనలకు అద్దం పడుతోంది.ఇది కూడా చదవండి:కశ్మీర్లో ఎన్ఐఏ మెరుపు దాడులు -
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంలో కీలక పరిణామం
టెహ్రాన్: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. శత్రుదేశాలు దాడులకు తెగబడితే రెట్టింపు ప్రతి దాడులు చేయాలని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ ఆదేశాలు జారీ చేశారు.ఆదివారం మొజ్తాబా ఖమేనీతో ఇరాన్ ఖతం అల్ అన్బియా సెంట్రల్ హెడ్‌క్వార్టర్స్ చీఫ్ కమాండర్ అలీ అబ్దుల్లాహి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో వారిరువురి మధ్య పశ్చిమాసియా యుద్ధం, కాల్పుల విరమణ, అమెరికా-ఇజ్రాయెల్ దాడుల అంశాలపై చర్చ జరిగింది.ఈ సందర్భంగా అమెరికా-ఇజ్రాయెల్ దాడులపై ప్రతి దాడులు చేయాలని, శత్రువులను దృఢంగా ఎదుర్కొనేలా కొత్త మార్గదర్శకాలు జారీ చేసినట్లు ప్రముఖ మీడియా సంస్థ ఫార్స్ న్యూస్ తెలిపింది. ఇరాన్ సాయుధ దళాలు అమెరికా-ఇజ్రాయెల్ ఏ చర్యనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయని కమాండర్ అబ్దుల్లాహి పేర్కొన్నారు. శత్రువు ఏ తప్పు చేసినా ఇరాన్ ప్రతిస్పందన వేగంగా, తీవ్రంగా ఉంటుంది అని ఆయన హెచ్చరించినట్లు ఫార్స్ న్యూస్ హైలెట్ చేసింది. తాజా ప్రకటనతో గల్ఫ్ ప్రాంతంలో ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇరాన్ సైన్యం, ఐఆర్జీసీ తరచూ అమెరికా, దాని మిత్రదేశాలకు హెచ్చరికలు జారీ చేస్తూ వస్తున్నాయి. హర్మూజ్ జలసంధి వంటి కీలక చమురు మార్గాల భద్రతపై కూడా ఈ పరిణామాలు ప్రభావం చూపవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. -
తీవ్ర గాయాలతో అజ్ఞాతంలో ఇరాన్ సుప్రీం లీడర్?
వాషింగ్టన్: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కొనసాగుతున్న వేళ, ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ అదృశ్యం సంచలనంగా మారింది. గత ఫిబ్రవరిలో టెహ్రాన్‌పై జరిగిన భారీ దాడుల్లో తీవ్రంగా గాయపడిన ఆయన.. ప్రస్తుతం ఓ రహస్య ప్రాంతం నుంచి తన కార్యకలాపాలు సాగిస్తున్నట్లు అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు బాంబు పేల్చాయి. బహిరంగంగా ఎక్కడా కనిపించనప్పటికీ, తెరవెనుక కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఆయన యుద్ధాన్ని, శాంతి చర్చలను శాసిస్తున్నారనే వార్తలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్నాయి.తీవ్ర గాయాలతో ప్రాణాపాయం?తండ్రి అలీ ఖమేనీ మరణానంతరం సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన మొజ్తబా ఖమేనీ, ఫిబ్రవరి 28 దాడుల తర్వాత ఎక్కడా కనిపించలేదు. ఆయనకు తీవ్ర గాయాలయ్యాయని, చికిత్సలు అందుకుంటున్న స్థితిలో ఉన్నారని అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. అయితే ఇరాన్ అధికారులు ఈ వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆయన పూర్తి ఆరోగ్యంతో, సురక్షితంగా ఉన్నారని, కేవలం భద్రతా కారణాల దృష్ట్యానే బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని వాదిస్తున్నారు. ఈ విరుద్ధ ప్రకటనలతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎడతెగని మిస్టరీ కొనసాగుతోంది.ట్రాకింగ్ భయం.. టెక్నాలజీకి దూరంశత్రువుల కళ్లుగప్పేందుకు ఖమేనీ అత్యంత కఠినమైన భద్రతా నిబంధనలు పాటిస్తున్నట్లు సమాచారం. ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ వ్యవస్థలను ఆయన పూర్తిగా పక్కనబెట్టారు. తన ఉనికిని ఎవరూ పసిగట్టకుండా ఉండేందుకు, కేవలం అత్యంత నమ్మకస్తులైన వ్యక్తుల ద్వారా, భౌతిక సందేశాల రూపంలోనే ఆయన ఆదేశాలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా అమెరికా తదితర దేశాలతో నడుస్తున్న కాల్పుల విరమణ చర్చల సమయంలో, శత్రువులు తన జాడను ట్రాక్ చేయకుండా ఆయన ఈ పాతకాలపు పద్ధతిని ఎంచుకున్నట్లు నిఘా వర్గాలు విశ్లేషిస్తున్నాయి.అసలు ఇరాన్‌ను శాసిస్తున్నది ఎవరు?ఖమేనీ కనుమరుగైన నేపథ్యంలో, ఇరాన్ అధికార యంత్రాంగంలో చీలికలు వచ్చినట్లు తెలుస్తోంది. సుప్రీం లీడర్ కార్యాలయం పేరుకే పెద్దదైనా, క్షేత్రస్థాయిలో పాలన, కార్యకలాపాల నియంత్రణ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కమాండర్లు, ఇతర రాజకీయ నేతల చేతుల్లోకి వెళ్లినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. దౌత్య చర్చల వంటి వ్యవహారాల్లో మొజ్తబా ఖమేనీ నిర్ణయాలే అంతిమమని కొందరు అంటుంటే, మరికొందరు మాత్రం ఆయన పేరును సైనికాధికారులు కేవలం ప్రతీకాత్మకంగా వాడుకుంటున్నారని అనుమానిస్తున్నారు. రెండు నెలలు గడుస్తున్నా ఖమేనీ నుంచి ఎలాంటి బహిరంగ ప్రకటన రాకపోవడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది.ఇది కూడా చదవండి: ‘2026 తీర్పు’: పీఠం కదిలింది.. చరిత్ర మారింది! -
జలసమాధి చేస్తాం
టెహ్రాన్: శత్రువుల భారీ నుంచి గల్ఫ్‌ను కాపాడుతామని, ఈ ప్రాంతాన్ని సురక్షితంగా మారుస్తామని ఇరాన్ సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీ అన్నారు. జలమార్గంలో శత్రు మూకల దురాగతాలను అంతం చేస్తామని తీవ్రంగా హెచ్చరించారు. పర్షియన్ గల్ఫ్‌లో చిల్లర పనులు చేస్తున్న ‘గ్రహాంతరవాసులను’జలగర్భంలోకి పంపిస్తామని తేల్చిచెప్పారు. వారిని నీటిలోనే సమాధి చేస్తామని పరోక్షంగా స్పష్టం చేశారు. ఈ మేరకు ఖమేనీ విడుదల చేసిన లిఖిత సందేశాన్ని ఇరాన్ ప్రభుత్వ టీవీ చానల్లో గురువారం చదివి వినిపించారు. హార్మూజ్ జలసంధిలో ఇరాన్ ఓడరేవుల గుండా ప్రయాణించే నౌకలపై దిగ్బంధనాన్ని తక్షణమే ఎత్తివేయాలని ఇరాన్ డిమాండ్ చేయగా, అందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. ఈ నేపథ్యంలోనే మొజ్తబా ఖమేనీ హెచ్చరికలు జారీ చేశారు. గల్ఫ్‌తోపాటు హార్మూజ్‌కు సంబంధించి ఒక కొత్త అధ్యాయం రూపుదిద్దుకుంటోందని పేర్కొన్నారు. హార్మూజ్‌లో ‘నూతన నిర్వహణ’అన్ని గల్ఫ్ దేశాలకు శాంతి, పురోగతి, ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తుందని వెల్లడించారు. తద్వారా పొరుగు దేశాలకు చేరువయ్యే ప్రయత్నం చేశారు. పర్షియన్ గల్ఫ్‌లో అభద్రతకు అమెరికా ఇక్కడ తిష్టవేయడమే ముఖ్య కారణమని ఖమేనీ ఆక్షేపించారు. గల్ఫ్‌లో సొంత స్థావరాలను కాపాడుకొనే సామర్థ్యం అమెరికాకు లేదన్నారు. అలాంటప్పుడు ఈ ప్రాంతంలోని ఆశ్రితులకు భద్రత కల్పిస్తుందన్న ఆశ అసలే లేదని ఉద్ఘాటించారు. వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి అక్కడ దురాశ, దురుద్దేశంతో ప్రవర్తించే ఇరాన్ శత్రువులకు నీటి అడుగున తప్ప మరెక్కడా స్థానం లేదని హెచ్చరించారు. సముద్ర గర్భంలో శత్రువును దెబ్బకొట్టడానికి రహస్య అస్త్రం సిద్ధంగా ఉన్నట్లు ఇరాన్ సైన్యం ప్రకటించిన తర్వాత మొజ్తబా ఖమేనీ అమెరికాకు ఈ హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. అమెరికా ప్రమేయం లేకపోతేనే గల్ఫ్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆయన వెల్లడించారు. అమెరికాతో స్నేహం వదులుకోవాలని గల్ఫ్ దేశాలకు పరోక్షంగా సూచించారు. భయంకర భూతం అమెరికా ఇరాన్ అణు, క్షిపణి సామర్థ్యాలను జాతీయ ఆస్తిగా పరిరక్షించుకుంటామని మొజ్తబా ఖమేనీ ప్రకటించారు. ఈ విషయంలో కఠిన వైఖరి అవలంబించక తప్పదని తెలిపారు. దేశంలోనూ, వెలుపల ఉన్న 9 కోట్ల మంది ఇరానీయన్లు నానోటెక్నాలజీ, బయోటెక్నాలజీ నుంచి అణు, క్షిపణి సామర్థ్యాల వరకు తమ ఆధ్యాతి్మక, మానవ, శాస్త్రీయ, పారిశ్రామిక, సాంకేతిక సామర్థ్యాలన్నింటినీ జాతీయ సంపదలుగా భావిస్తారని స్పష్టంచేశారు. వారు దేశ జలాలను, భూమిని, గగనతలాన్ని ఎలాగైతే కాపాడుకుంటారో.. అలాగే వీటిని కూడా భద్రంగా కాపాడుకుంటారని పేర్కొన్నారు. అమెరికాను ‘గ్రేట్ సాతాను’గా ఖమేనీ అభివరి్ణంచారు. అదొక భయంకర భూతమని నిందించారు. పర్షియన్ గల్ఫ్‌లో అమెరికన్లకు ఏం పని అంటూ ప్రశ్నించారు. వారు ఇక్కడి వ్యవహారాలో జోక్యం చేసుకోవడం మానుకోవాలని హితవు పలికారు. హార్మూజ్ జలసంధిపై తమ నియంత్రణను వదులుకొనే ప్రసక్తే లేదన్నారు. హార్మూజ్‌పై ఇరాన్ నియంత్రణ ఉంటేనే గల్ఫ్ దేశాలు సురక్షితంగా ఉంటాయని స్పష్టంచేశారు. -
ఒక్కటైన గల్ఫ్ దేశాలు?.. ట్రంప్‌కు ఖమేనీ బిగ్ షాక్?
టెహ్రాన్: ఇరాన్‌పై అమెరికా యుద్ధంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. గల్ఫ్ దేశాలతో ఏకమై హర్మూజ్ జలసంధిలో అమెరికా చేస్తున్న ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ పిలుపునిచ్చారు. ఈ మేరకు గల్ఫ్ దేశాలకు తన స్వహస్త్రాలతో లేఖ రాసినట్లు రాయిటర్స్ కథనం తెలిపింది.గురువారం మొజ్తాబా ఖమేనీ రాసిన లేఖలో ఫిబ్రవరి 28న నుంచి అమెరికా,ఇజ్రాయెల్‌తో ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి గల్ఫ్,హర్మూజ్ జలసంధికి సంబంధించి కొత్త అధ్యాయం రూపుదిద్దుకుంటోంది.ఇరాన్ గల్ఫ్ దేశాల్ని సురక్షితం చేస్తుందని, హర్మూజ్ జలసంధిపై అమెరికా చేస్తున్న దుర్వినియోగాలను’నిర్మూలిస్తుందని అన్నారు. హర్మూజ్ జలసంధి కొత్త నిర్వహణ అన్ని గల్ఫ్ దేశాలకు శాంతి, పురోగతి, ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తుందని మొజ్తాబా కమేనీ రాసిన లేఖలో స్పష్టం చేశారు.గల్ఫ్ ప్రాంతంలో అమెరికా ఉనికిని అనవసరమని మొజ్తాబా ఖమేనీ పేర్కొన్నారు. భవిష్యత్తులో అమెరికా లేకుండా గల్ఫ్ ప్రాంతం మరింత శాంతి, అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. అంతేకాదు ఇరాన్ అణు, క్షిపణి సామర్థ్యాలను జాతీయ ఆస్తులుగా పరిరక్షిస్తామని ప్రకటించారు. పర్షియన్ గల్ఫ్‌లో అమెరికా ఉనికే ఆ ప్రాంతంలో అస్థిరతకు ప్రధాన కారణం. ఆ దేశానికి తన సొంత భద్రతను కాపాడుకునే సామర్థ్యం లేదు. అమెరికాను అభిమానించే వారికి, అమెరికా భద్రత కల్పిస్తుందనే ఆశ అసలు లేదు.ఇరాన్ శత్రువులకు దాని జలాల లోతుల్లో తప్ప మరెక్కడా స్థానం లేదు. వేలాది కిలోమీటర్ల దూరం నుంచి పర్షియన్ గల్ఫ్, ఒమన్ సముద్రంలో అల్లకల్లోలం సృష్టిస్తున్న శత్రువులకు అక్కడ మరెక్కడా స్థానం లేదని స్పష్టం చేశారు.ఖమేనీ రాసిన ఈ లేఖ, ఇరాన్ నేవీ కమాండర్ షెహరామ్ ఇరానీ టార్పిడో గురించి వివరిస్తూ అమెరికాను బెదిరించిన తర్వాత వెలువడింది. ఇరాన్ నేవీ తన ప్రకటనలో, శత్రు యుద్ధనౌకలను, జలాంతర్గాములను చీల్చగల సూపర్ జలాంతర్గామి ఆయుధాన్ని ఊహించమని పేర్కొంది. ‘హూట్’ (ఇరాన్ భాషలో హూట్ అంటే తిమింగళం) అనే పేరున్న ఈ సూపర్ వెపన్ దెబ్బకు శత్రువులు భయపడుతున్నారు. యుద్ధ సమయంలో ఇరాన్ నావికాదళం బలహీనపడినప్పటికీ, త్వరలోనే కొత్త ఆయుధంతో శత్రువుపై దాడి చేస్తామని ప్రకటించింది.‘ఏ క్షణమైనా కొత్త ఆయుధంతో శత్రువును ఢీకొంటాం. బహుశా వాళ్లకు హార్ట్ అటాక్ రాకపోవచ్చు’ అని వ్యాఖ్యానించారు. కాగా, హర్మూజ్ జలసంధి ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని.. ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయం గల్ఫ్ దేశాల భవిష్యత్తు రాజకీయ, ఆర్థిక పరిస్థితులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. -
ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఇప్పుడెలా ఉన్నారు?
న్యూఢిల్లీ: ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఆరోగ్యంపై వచ్చిన వదంతులను భారత్‌లోని ఆయన ఉప ప్రతినిధి డాక్టర్ మొహమ్మద్ హొస్సేన్ జియాయీనియా ఖండించారు. మొజ్తబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితి బాగుందని చెప్పారు.“మా సుప్రీం లీడర్ హజ్రత్ అయతొల్లా సయ్యిద్ మొజ్తబా ఖమేనీ పరిస్థితి దేవుని కృప వల్ల బాగుంది. కొన్ని రోజుల క్రితం మాకు అందిన సమాచారం ప్రకారం.. ఆయన పరిస్థితి బాగుంది” అని జియాయీనియా తెలిపారు. ఖమేనీ ఆరోగ్యంపై వస్తున్న ఊహాగానాల్లో వాస్తవాలు లేవని చెప్పారు. ఆయన ఆరోగ్యం బాగోలేదని, కొన్ని సమస్యలు ఉన్నాయని వస్తున్న వదంతులన్నీ నిజం కాదని పేర్కొన్నారు.పశ్చిమాసియా ఘర్షణపై ఇరాన్ వైఖరిని మరోసారి చెబుతూ.. “యుద్ధం ప్రారంభం నుంచే మా దివంగత సుప్రీం లీడర్ హజ్రత్ అయతొల్లా సయ్యిద్ అలీ ఖమేనీ చెప్పిన వాక్యాన్ని మేము చెబుతున్నాము. అమెరికన్లు, మా శత్రువులు ఈ యుద్ధాన్ని ప్రారంభించారు, కానీ ఈ యుద్ధాన్ని ముగించేది మాత్రం మేమే. ఈ యుద్ధం ఎలా ముగుస్తుందో మేమే నిర్ణయిస్తాము’’ అని చెప్పారు.గతవారం న్యూ యార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం.. ఫిబ్రవరి 28న జరిగిన వైమానిక దాడుల తర్వాత మొజ్తబా ఖమేనీ బహిరంగంగా ఎక్కడా కనపడలేదు. ఆ దాడులు మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ నివసించిన భవన సముదాయంపై జరిగాయి. ఆ ఘటనలో ఆయన భార్య, కుమారుడు మరణించారు.ఆ తర్వాత మొజ్తబా ఖమేనీ వద్దకు ఎవరినీ వెళ్లనివ్వడం లేదు. ప్రధానంగా వైద్య సిబ్బంది మాత్రమే ఆయనను చూసుకుంటున్నారు. దాడుల్లో గాయాల నుంచి ఆయన కోలుకుంటున్నారని న్యూ యార్క్ టైమ్స్ తెలిపింది.పశ్చిమాసియా ఘర్షణ ముగింపుకు ప్రయత్నాలు, రష్యా, చైనా, భారత్ పాత్రపై జియాయీనియా స్పందిస్తూ.. “ప్రతి దేశం పాత్ర పోషించవచ్చు, అది సానుకూలం లేదా ప్రతికూల పాత్ర కూడా కావచ్చు” అని చెప్పారు. ప్రతి ఒక్కరూ గ్యాస్, చమురు ధరల గురించి ఆందోళన చెందుతున్నారని.. కానీ, ప్రాణాలు కోల్పోతున్న ప్రజల జీవన విలువ గురించి ఎవరూ ఆందోళన చెందడం లేదని అన్నారు.ఇరాన్ ప్రజలు ఐక్యంగా ఉన్నారని, దేశంలో అంతర్గత ఉద్రిక్తతలపై వచ్చే నివేదికలు, సూచనలు ప్రభుత్వ వ్యవస్థ గురించి అవగాహన లేని వారు చెబుతున్నారని పేర్కొన్నారు. ఇరాన్ ప్రభుత్వ వ్యవస్థ ఒక వ్యక్తిపై ఆధారపడదని, అది రిపబ్లిక్ అని చెప్పారు. -
బాంబు దాడిలో తీవ్ర గాయాలు మోజ్డాబా ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ..
-
ఖమేనీ అజ్ఞాతవాసానికి కారణం ఇదేనా?
ఇరాన్ సుప్రీం నేత ముజ్తబా ఖమేనీ ఆరోగ్యంపై ఇరాన్ దాగుడు మూతలు ఆడుతోంది. పుకార్లను ఖండిస్తూ.. ఆయన క్షేమంగా ఉన్నారని మాత్రమే ప్రకటనలు ఇస్తోంది. ఫొటోలు, వీడియోలు, ఆఖరికి వాయిస్ రికార్డింగ్‌లు కూడా ఒక్కటి రిలీజ్ చేయలేదు. ఆయన ఆరోగ్యస్థితి ఏమాత్రం బాగోలేదని.. పైగా పాలన మొత్తం కరడుగట్టిన సైన్యం చేతుల్లోకి వెళ్లిపోయిందని వెస్ట్రన్ మీడియా కథనాలు ఇస్తోంది. ఈ క్రమంలో తాజాగా సంచలన విషయాలను పబ్లిష్ చేసింది. ‘ఖమేనీ సజీవంగానే ఉన్నారు. రహస్య ప్రదేశంలో ఆయనకు చికిత్స అందుతోంది. దాడుల్లో ఖమేనీ ముఖం, పెదవులు కూడా తీవ్రంగా కాలిపోయాయి. అందుకే మాట్లాడటం కూడా కష్టంగా మారింది. స్పృహలోనే ఉంటూ అన్నీ అర్థం చేసుకోగలుగుతున్నారు. ఆయనకు ఏదైనా చెప్పాలంటే రాసి చూపిస్తున్నారు. అలాగే.. ఆయనకు ఏదైనా సమాచారం చేరవేసేందుకు.. చేతితో రాసిన ఉత్తరాలను మాత్రమే వాడుతున్నారు. వాటిని ఖమేనీ ఉన్న ప్రాంతానికి బైక్‌లపై చేరవేస్తున్నారు. అక్కడి నుంచి బదులు కూడా అలాగే వస్తోంది. ఇజ్రాయెల్ నిఘాకు దొరకకుండా ఉండేందుకు ఇదంతా చేస్తున్నారు..దాడుల్లో కాలికి గాయం కావడంతో దానికి మూడుసార్లు ఆపరేషన్ జరిగింది. కృత్రిమ కాలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఆయన చేతికి కూడా సర్జరీ జరిగింది. ముఖానికి తీవ్ర గాయాలు కావడంతో ఆయనకు ప్లాస్టిక్ సర్జరీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శత్రు సైన్యం నుంచి తప్పించుకునేందుకు ఇదే ఉత్తమమైన మార్గం కూడా అని ఆయన అనుకుంటుఉన్నారు’’ అని ఆ కథనాలు సారాంశం.ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ బలగాలు సంయుక్తంగా దాడులకు దిగాయి. ఆనాటి దాడుల్లో మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ కుటుంబం మరణించింది. ఆయన తనయుడు ఖమేనీ గాయాలతో బయటపడ్డాడు. ఆ తర్వాత ఆయన్నే ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఎన్నుకున్నారు. అయితే అప్పటి నుంచి ఆయన అజ్ఞాతంలోనే ఉన్నారు. ఇరాన్ మంత్రులు, ఉన్నతాధికారులు కూడా ఆయన్ని కలవడానికి వెళ్లడం లేదు.పాలన చేజారిందంటూ.. దేశాన్ని నడిపేందుకు ముజ్తాబా ఖమేనీ ఓ బోర్డును ఏర్పాటు చేసినట్లు ఆ దేశ రాజకీయవేత్త అబ్దుల్‌రెజా దవారీ ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ బోర్డుకి ఖమేనీ డైరెక్టర్‌గా ఉండగా.. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ జనరల్స్ సభ్యులుగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. వారి సలహాలు, మార్గదర్శకాల పైనే ఖమేనీ ఎక్కువగా ఆధారపడుతున్నారని అన్నారాయన. అంతేకాదు అమెరికా-ఇజ్రాయెల్‌తో జరుగుతున్న యుద్ధం, దౌత్య ప్రయత్నాలు, జాతీయ భద్రత విషయాల్లో వారు సమష్టిగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అయితే..ఈ వ్యవహారంలో సుప్రీం లీడర్ పరిమితంగా వ్యవహరిస్తున్నారని న్యూయార్క్ టైమ్స్ ఓ సంచలన కథనం ఇచ్చింది. సుప్రీం లీడర్‌కి చేరుకోవడం కష్టమవడంతో.. నిర్ణయాధికారం ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) కమాండర్ల చేతుల్లోకి వెళ్లిందని.. వాళ్లే యుద్ధం, దౌత్యం, జాతీయ భద్రత వంటి కీలక అంశాలపై ఆధిపత్యం చెలాయిస్తున్నారని.. ఇది ఇరాన్ గత సుప్రీంల పాలనకు భిన్నంగా ఉందని ఆ కథనం పేర్కొంది. అంతేకాదు.. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి డమ్మీలుగా మారిపోయారని.. అమెరికాతో జరగాల్సిన చర్చలు కూడా సైనికాధికారుల వ్యతిరేకత కారణంగానే విఫలమయ్యాయని తెలిపింది. ఇంకోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖమేనీ జీవచ్ఛవంగా ఉండిపోయారని.. ఇరాన్లో “రెజీమ్ చేంజ్”(పాలన పగ్గాలు మారాయని) వ్యాఖ్యానించినప్పటికీ.. ఇరాన్ మీడియా మాత్రం ఆ కథనాలను ఖండిస్తూ వస్తోంది. -
ఇరాన్లో కుమ్ములాట… మొజ్తాబా ఖమేనీని సైడ్ చేసేశారా?
టెహ్రాన్: ఇరాన్ అంతర్గత అంతర్యుద్ధంతో కొట్టుమిట్టాడుతోంది. ఇరాన్‌పై అమెరికా యుద్ధంలో నిర్ణయాలు తీసుకునే అంశంపై ఓ వైపు సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ.. ఆయన్ని కాదని ఐఆర్జీసీ (ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్) చాపకింద నీరులా ప్రభుత్వంపై పట్టు బిగించే ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఈ అంతర్గత పోరాటం కారణంగా పాకిస్థాన్‌లో జరగాల్సిన అమెరికా- ఇరాన్ కాల్పుల విరమణ చర్చలు విఫలమయ్యాయి. ఫలితంగా ‘ఆపరేషన్ సక్సెస్ - పేషెంట్ డెడ్’ అన్న చందంగా ఇరాన్ వ్యవహారం మారింది. ప్రస్తుతం ఈ పరిణామం ప్రపంచ దేశాల్లో హాట్‌టాపిక్‌గా మారి, అంతర్జాతీయ వేదికలపై తీవ్ర చర్చలకు దారితీస్తోంది. అమెరికా సైతం చర్చలు విఫలమవడానికి, ఆలస్యం అవ్వడానికి కారణం ఇదేనని స్పష్టంగా చెబుతోంది. ఇంతకీ ఇరాన్లో ఏం జరుగుతోంది. ఇరాన్-అమెరికా శాంతి ఒప్పంద చర్చలు మరింత ఆలస్యమవుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ గైర్హాజరీ, ఆయన నిర్ణయాల్లో స్పష్టత లేకపోవడమేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం భావిస్తోంది.ఆరు వారాల క్రితం అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం నేత ఆయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఆయన వారసుడిగా మొజ్తాబా ఖమేనీ ఎన్నికయ్యారు. అయితే ఇప్పటివరకు ప్రజలు ఆయనను ప్రత్యక్షంగా చూడలేదు, ఆయన గొంతు వినలేదు. పశ్చిమాసియా యుద్ధంలో ఇరాన్ కీలక నేతలను కోల్పోవడం వల్ల భయాందోళనలో ఉన్నారని సమాచారం.అమెరికా మీడియా నివేదికల ప్రకారం, మొజ్తాబా ప్రత్యక్ష నిర్ణయాల్లో పాల్గొనకపోవడం వల్ల ఇరాన్ నాయకత్వంలో విభేదాలు పెరిగాయి. అణు కార్యక్రమంపై చర్చల్లో ఇరాన్ ప్రతినిధులకు ఎంత అధికారం ఇవ్వాలో స్పష్టత లేకపోవడం చర్చలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం ఇరాన్ వద్ద 60 శాతం శుద్ధి చేసిన యురేనియం 440 కిలోల నిల్వ ఉంది. ఇది 90 శాతం ఆయుధ స్థాయి కంటే తక్కువ అయినప్పటికీ, ఎనిమిది నుంచి పన్నెండు అణు బాంబులు తయారు చేయగల సామర్థ్యం ఉంది. ఈ అంశమే చర్చల్లో ప్రధాన అడ్డంకిగా మారింది.ఇంటర్నేషనల్ క్రైసిస్ గ్రూప్‌కి చెందిన అలీ వాయేజ్ ప్రకారం, మొజ్తాబా స్వయంగా చర్చలు జరిపే స్థితిలో లేరు. ఆయన కేవలం విస్తృత నిర్ణయాలకు ఆమోదం తెలుపుతున్నారని, చర్చల వ్యూహాల్లో ఆయన పాత్ర లేదని చెప్పారు. ఆయన గైర్హాజరీని ఇరాన్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చూపిస్తోందని, ఇది అంతర్గత విమర్శల నుంచి రక్షణగా పనిచేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి మొజ్తాబా ప్రత్యక్షంగా కనిపించకపోవడం ఇరాన్ పాలనకు సవాలుగా మారింది. ఆయన పేరుతో టీవీల్లో వార్తలు, సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్నాయి. కొన్నిసార్లు ఏఐ ద్వారా రూపొందించిన వీడియోలతో సందేశాలు పంపడం ఆయన ఆరోగ్యంపై, ఆయన ఎక్కడున్నారనే అనుమానాలను మరింత పెంచుతోంది.ఫిబ్రవరి 28న అమెరికా-ఇరాన్ దాడుల్లో మొజ్తాబా గాయపడ్డారని సీఎన్ఎన్ నివేదిక తెలిపింది. మరోవైపు, రాయిటర్స్ ప్రకారం ఆయన ఆడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమావేశాలు నిర్వహిస్తూ, యుద్ధం, అమెరికాతో చర్చల వంటి ప్రధాన అంశాలపై నిర్ణయాల్లో పాల్గొంటున్నారని సమాచారం.ఇరాన్ ప్రభుత్వంలో కుమ్ములాటఇరాన్లో ప్రస్తుతం పెద్ద రాజకీయ కుమ్ములాట జరుగుతోంది. ఐఆర్జీసీ (ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్) ప్రభుత్వంపై పట్టు బిగించింది. అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ నియామకాలను అడ్డుకోవడం, ముఖ్యంగా ఇంటెలిజెన్స్ మంత్రిని నియమించడాన్ని నిరోధించడం ద్వారా అధ్యక్షుడిని పూర్తిగా పక్కకు పెట్టిందన్న ఆరోపణలు సైతం ఉన్నాయి.మొజ్తాబా ఖమేనీ గైర్హాజరీ, ఆయన నిర్ణయాల్లో స్పష్టత లేకపోవడం వల్ల ఐఆర్జీసీ మరింత ఆధిపత్యం సాధించింది. ఆయన చుట్టూ భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసి, ప్రభుత్వ అధికారులకు ఆయనను కలిసే అవకాశం లేకుండా చేసింది. దీంతో పశ్చిమాసియాలో సంక్షోభ సమయంలో తీసుకునే నిర్ణయాలు ఆలస్యమవుతున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నప్పటికీ, అది ఎప్పుడు జరుగుతుందో స్పష్టత లేదు. మొజ్తాబా ఖమేనీ గైర్హాజరీ, ఆయన నిర్ణయాల్లో స్పష్టత లేకపోవడం, ఐఆర్జీసీ ఆధిపత్యం పెరగడం వల్లే శాంతి చర్చలు నిలిచిపోయాయని విశ్లేషకులు చెబుతున్నారు -
వార్ అప్డేట్స్: హర్ముజ్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం ఇంకా వీడలేదు. హర్ముజ్ జలసంధిలో అమెరికా దిగ్బంధనం కొసాగుతోంది. ఇరాన్ పోర్టులకు వచ్చిపోయే నౌకలపై నిఘా కొనసాగిస్తోంది. ఈ పరిణామాలు ఇరాన్‌కు సహించడం లేదు. మరోవైపు పాక్ వేదికగానే మరోసారి శాంతి చర్చలకు సన్నాహాలు జరుగుతున్నాయి. -
War Updates: అమెరికా, ఇరాన్ శాంతి చర్చల్లో కీలక పరిణామం
పశ్చిమాసియాలో యుద్ధం ఇంకా కొనసాగుతోంది. అమెరికా నౌకలు ఇప్పటికే హర్ముజ్‌ను తమ ఆధీనంలోకి తీసుకోగా.. తీవ్ర ప్రతిఘటన తప్పదని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు.. లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగిస్తోంది. -
మోజ్తాబా ఆరోగ్యంపై కీలక అప్డేట్
ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ ఆరోగ్యం విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఆయన ఏ పరిస్థితుల్లో ఉన్నాడనేది ఇప్పటివరకూ ఎవరికీ తెలియదు. ఇరాన్ సుప్రీంగా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి ఆయన పెద్దగా బయట కనిపించింది లేదు. కాగా తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితులపై కీలక సమాచారం ప్రచురితమయ్యింది..మోజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై ఇదివరకే చాలా సార్లు పలు కథనాలు ప్రచురితమయ్యాయి. అమెరికా జరిపిన దాడిలో ఆయన కోమాలోకి వెళ్లారని తీవ్రంగా గాయపడ్డారని వార్తలు వెలువడ్డాయి. ఒకానొక సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆయన అసలు బ్రతికి ఉన్నారా? అని ప్రశ్నించారు. ఈ అనుమానాలకు బలం చేకూర్చేలా మోజ్తాబా ఎప్పుడు బయిటకి రాలేదు. కేవలం వ్రాతపూర్వక కీలక సమయాల్లో కేవలం వ్రాతపూర్వక సందేశాలు మాత్రమే అందించారు.అయితే ప్రస్తుతం మోజ్తాబా వేగంగా కోలుకుంటున్నారని ఆయన సన్నిహితులు తెలిపినట్లు రాయిటర్స్ కథనం పేర్కొంది. మోజ్తాబా భౌతికంగా బయిటకి రానప్పటికీ యుద్ధానికి సంబంధించిన కీలక సమావేశాల్లో ఆయన ఆడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా పాల్గొంటున్నారని తెలిపింది. వాషింగ్టన్‌తో చర్చలు వంటి కీలక విషయాలలో వాయిస్ మెసేజ్ ద్వారా ఆదేశాలు ఇస్తున్నారని వెల్లడించింది.ఫిబ్రవరి 28న ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఇంటిపై జరిగిన దాడిలో ఆయన మరణించారు. ఆ దాడిలోనే మోజ్తాబాకు తీవ్ర గాయాలయ్యాయని ఆయన ముఖం తీవ్రంగా దెబ్బతిందని కథనాలు ప్రచురితమయ్యాయి. ఆ రోజు నుంచి నేటి వరకూ మెజ్తాబా ఎన్నడూ మీడియా ముందుకు రాలేదు. అప్పటి నుంచి భిన్న రీతిలో ఆయనపై వార్తలు వచ్చాయి. -
హర్మూజ్‌పై ఇరాన్ సుప్రీం లీడర్ సంచలన ప్రకటన
టెహ్రాన్: హర్మూజ్ నిర్వహణను కొత్త దశలోకి తీసుకువెళ్తామంటూ ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధంలో ఇప్పటివరకు మేమే విజయం సాధించాం. ఇరాన్ యుద్ధాన్ని కోరుకోవడం లేదు. అలాగని మా హక్కులను వదులుకోం. అలీ ఖమేనీతో పాటు ఇరాన్ అమరవీరుల కోసం ప్రతీకారం తీర్చుకుంటాం’’ అని ప్రభుత్వ మీడియా ద్వారా ఆయన హెచ్చరించారు.హోర్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్ తన వ్యూహాన్ని మార్చుకోబోతోందని మొజ్తబా ఖమేనీ సంకేతాలు ఇచ్చారు. ప్రపంచంలోని అత్యంత కీలకమైన జలమార్గాలలో ఒకటైన హోర్ముజ్ నిర్వహణలో ఇది ఒక ముఖ్యమైన అధ్యాయంగా ఆయన అభివర్ణించారు. అలాగే తమకు జరిగిన నష్టాలకు పరిహారం కోరాలని టెహ్రాన్ భావిస్తోందని కూడా స్పష్టం చేశారు.కాగా, హర్మూజ్ జలసంధిలో నౌకలపై ఇరాన్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. అయితే, కాస్తంత మెత్తబడిన ఇరాన్.. అంతర్జాతీయ సరుకు రవాణా నౌకలు హార్మూజ్ గుండా వెళ్లేందుకు తాత్కాలికంగా అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. రోజుకు 15 నౌకలను మాత్రమే అనుమతిస్తామన్న ఇరాన్.. పన్నులు కట్టిన నౌకలను మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేసింది. ఇరాన్ తీరును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా తప్పుబట్టారు. ఇరాన్ తప్పుడు నిర్ణయాలు తీసుకుందంటూ ట్రంప్ పోస్ట్ చేశారు. ‘‘ఇరాన్ చర్య అగౌరవమైనది. మన మధ్య ఉన్న ఒప్పందం ఇదికాదు. ఇరాన్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి’’ ట్రంప్ హెచ్చరించారు.ఇదిలా ఉండగా.. యుద్ధంవేళ అనుమతిలేకుండా హార్మూజ్ గుండా వెళ్లే నౌకలను నాశనంచేసేందుకు పర్షియన్ గల్ఫ్ జలాల్లో అమర్చిన సముద్ర మందుపాతరల జాడను వెల్లడిస్తూ ఇరాన్ తాజాగా ఒక చిత్రపటాన్ని విడుదల చేసింది. నలుపు, తెలుపురంగుల్లో ఉన్న ఈ చిత్రపటంలో పేర్కొన్న వృత్తాకార ప్రాంతం(డేంజర్ జోన్) నుంచి కాకుండా కాస్తంత దూరంగా జరిగి నౌకలు రాకపోకలు సాగించాలని ఇరాన్ ప్రకటించింది.చార్జ్ ప్రకారం చూస్తే సీమైన్స్‌ను ఇరాన్ తీరంవైపు కాకుండా ఆవలివైపునకు అత్యధికంగా అమర్చినట్లు స్పష్టమవుతోంది. ఇరాన్ తీరం వెంబడి దాడుల నుంచి తప్పించుకునేందుకు తీరానికి దూరంగా నౌకలు వెళ్తాయని ముందే ఊహించి, వాటి రాకపోకలను అడ్డుకునేందుకే ఇరాన్ ఇలాంటి ఎత్తుగడ వేసిందని స్పష్టమవుతోంది. -
మా వేళ్లు ఇంకా ట్రిగ్గర్‌పైనే ఉన్నాయి: ఇరాన్ సుప్రీం లీడర్
టెహ్రాన్: కాల్పుల విరమణ వేళ ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ కీలక ప్రకటన చేశారు. ఇది యుద్ధానికి ముగింపు కాదని, తమ వేళ్లు ఇంకా ట్రిగ్గర్‌పైనే ఉన్నాయని హెచ్చరించారు. సీజ్ఫైర్లో భాగంగా తక్షణమే కాల్పులు ఆపాలని చెప్పారు. శత్రుదేశాలు దురాక్రమణకు పాల్పడితే దీటుగా సమాధానం చెబుతామని అన్నారు. హార్మూజ్‌ను తెరిచేందుకు అంగీకరించామని చెప్పారు.ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ బ్రాడ్‌కాస్టింగ్ ద్వారా ఖమేనీ ఈ ప్రకటన చేశారు. "ఇది యుద్ధానికి ముగింపు కాకపోయినప్పటికీ, అన్ని సైనిక విభాగాలు సుప్రీం లీడర్ ఆదేశాలను పాటించి కాల్పులు నిలిపివేయాలి" అని ఆ ప్రకటనలో ఉంది. అమెరికా లేదా ఇజ్రాయెల్ ఏ విధమైన చర్యలకు పాల్పడినా తక్షణ ప్రతిస్పందనకు సిద్ధంగా ఉన్నామని ఇరాన్ స్పష్టం చేసింది. శత్రువు చిన్న తప్పు చేసినా పూర్తి స్థాయిలో ప్రతిస్పందిస్తామని చెప్పింది. అమెరికా ప్రకటించిన కాల్పుల విరమణ రెండు వారాల పరిమిత కాలానికి మాత్రమే. ట్రంప్ దీన్ని "డబుల్ సైడెడ్ (ద్వైపాక్షిక) యుద్ధ విరమణ"గా వివరించారు. ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా ఈ కాల్పుల విరమణను.. "యుద్ధం ముగిసిందన్న సూచనకాదు" అని స్పష్టం చేసింది. చర్చలు జరగేందుకు అవకాశం కల్పించడమే లక్ష్యంగా వచ్చిన వ్యూహాత్మక విరామం అని తెలిపింది. -
అపస్మారక స్థితిలో మొజ్తబా ఖమేనీ!
టెహ్రాన్: ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ(56) ప్రస్తుతం అపస్మారక స్థితికి చేరుకున్నారా? దేశానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారా? నిజమేనని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అమెరికా–ఇజ్రాయెల్ వైమానిక దాడిలో మొజ్తబా తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఖోమ్ సిటీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి చాలావరకు దిగజారినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 28న జరిగిన వైమానిక దాడిలో అప్పటి సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. అదే దాడిలో అయతొల్లా అలీ ఖమేనీ కుమారుడైన మొజ్తబా ఖమేనీ గాయాలపాలయ్యారు.తర్వాత ఆయనను నూతన సుప్రీంలీడర్‌గా ఎంపిక చేశారు. అత్యున్నత పదవిలో ఉన్నప్పటికీ నిస్సహాయ స్థితిలో ఉండిపోవాల్సి వస్తోందని యూఎస్–ఇజ్రాయెల్ నిఘా వర్గాలకు ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ పేర్కొంది. ప్రస్తుతం ఇరాన్‌కు సంబంధించిన కీలక నిర్ణయాల్లో మొజ్తబా ప్రమేయం ఉండడం లేదని వెల్లడించింది. ఆయన ఇప్పుడు ఎక్కడున్నారో అమెరికా, ఇజ్రాయెల్ నిఘా వర్గాలకు కచ్చితంగా తెలుసని స్పష్టంచేసింది. సుప్రీంలీడర్‌గా ఎంపికైన తర్వాత మొజ్తబా ఇప్పటిదాకా ఒక్కసారి కూడా బహిరంగంగా ప్రజలకు కనిపించలేదు. మీడియా ద్వారా ప్రకటనలు మాత్రం ఇచ్చారు. -
కోమాలో మోజాబా ఖమేనీ!
-
ట్రంప్ హెచ్చరిక.. ఇరాన్ ఆసక్తికర సందేశం విడుదల
టెహ్రాన్: ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. ఇక, తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్‌పై సంచలన కామెంట్స్ చేశారు. ఇరాన్లో విధ్వంసం జరిగిందని, ఇరాన్ ముఖ్య నేతలను అంతం చేసినట్టు చెప్పుకొచ్చారు. రెండు వారాల్లో ఇరాన్‌పై భీకర దాడులు చేస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ కీలక సందేశం విడుదల చేశారు. అలాగే, ఇరాన్ అధ్యక్షుడు బహిరంగ లేఖ ఆసక్తికరంగా మారింది. దీంతో, యుద్దం వేళ కొత్త చర్చ తెరపైకి వచ్చింది. ఇస్లామిక్ రిపబ్లిక్ డే, ఇరాన్ జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రజలను ఉద్దేశించి తాజాగా మొజ్తాబా ఖమేని సందేశం విడుదల చేశారు. ఈ సందర్భంగా అమెరికా-ఇజ్రాయెల్ తమపై అకారణంగా దాడులు చేస్తున్నాయని మండిపడ్డారు. ఇరాన్‌పై జరుగుతున్న దాడులు, నీచమైన దురాక్రమణలను ఖండించారు. ఈ దాడుల కారణంగా ఇరాన్లో మౌలిక సదుపాయాలతో పాటు పర్యావరణం కూడా దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలో ఇరాన్ ప్రజల ముందున్న లక్ష్యం ఒక్కటే. ప్రస్తుతం దేశ అంతర్గత అభివృద్ధిపై దృష్టిసారించాలి. అభివృద్ధిని విస్తరించడం, ఇరాన్ ఉజ్వల భవిష్యత్తుకు ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. మౌలిక సదుపాయాలను తిరిగి పునరుద్ధరించడానికి నడుం బిగించాలని ఆయన పిలుపునిచ్చారు.ఇదే సమయంలో ఇరాన్‌లోని మినాబ్ పాఠశాలపై జరిగిన దాడి గురించి మొజ్తాబా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ ఘటనలో 186 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరికి నివాళిగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న మొక్కలు నాటే కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని అన్నారు. యుద్ధంలో చనిపోయిన వారిని స్మరించుకుంటూ ఇరాన్ ప్రజలు మొక్కలు నాటనున్నట్లు తెలిపారు.మరోవైపు.. యుద్ధం కొనసాగుతున్న వేళ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా ప్రజలను ఉద్దేశిస్తూ మసూద్ బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా తమకు అమెరికన్లపై ఎలాంటి శత్రుత్వం లేదని స్పష్టంచేశారు. అనేకసార్లు ఒత్తిళ్లు, ఆంక్షలు ఎదురైనప్పటికీ.. తాము ఎన్నడూ యుద్ధానికి దిగలేదన్నారు. తమపై చేస్తోన్న దాడులను దృఢంగా, ధైర్యంగా తిప్పికొడుతున్నామన్నారు. అలాగే, ప్రస్తుత ట్రంప్ పాలనలో ‘అమెరికా ఫస్ట్’ అనే నినాదం కనిపిస్తోందా? అని ప్రశ్నించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
ట్రంప్‌కు ఝలక్ : ఇరాన్ సుప్రీం కొత్త సందేశం
ఇరాన్‌పై అమెరికా- ఇజ్రాయెల్ ప్రకటించిన యుద్ధం, ఇరన్ ప్రతిదాడులు భీకరంగా కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 28న జరిగిన వైమానిక దాడిలో అప్పటి ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించిన తర్వాత, ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ బాధ్యతలు చేపట్టారు. అయితే ఈ దాడిలో మోజ్తబా కూడా తీవ్రంగా గాయపడ్డాడని, అసలు ప్రాణాలతో లేడని ఇలా పలు ఊహాగానాలు చెలరేగాయి. దీనిపై ఇరాన్ మోజ్తబా గాయపడినా, ఆరోగ్యంగానే ఉన్నారని ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు ఆయన ప్రజల ముందుకు రాలేదు.కేవలం లిఖితపూర్వక ప్రకటనలు మాత్రమే విడుదల చేస్తూ వస్తున్నారు. తాజాగా మరో సందేశాన్ని విడుదల చేశారు. ప్రస్తుత యుద్ధంలో మద్దతుగా నిలిచినందుకు ఇరాక్ ప్రజలకు తమ నాయకుడు మొజ్తబా ఒక లిఖిత సందేశంలో కృతజ్ఞతలు తెలిపారని ఇరాన్ మీడియా మార్చి 29న తెలిపింది.మొజ్తబా ఖమేనీ స్వయంగా కనిపించకపోవడంతో, ఆయన ఆరోగ్య పరిస్థితి మరియు ఆచూకీపై తీవ్ర పుకార్లు చెలరేగాయి. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధాన్ని ఆపే అంశంపై గత వారం మాట్లాడుతూ, తాము ఇరాన్‌లోని ఒక ముఖ్య వ్యక్తితో చర్చలు జరుపుతున్నామనీ కానీ అది సుప్రీం లీడర్‌తో మాత్రం కాదు, ఆయన అసలు బతికి ఉన్నారో లేదో తెలియదని వ్యాఖ్యానించారు.ట్రంప్ ఈ వ్యాఖ్యల తర్వాత మొజ్తబా ఖమేనీ కొత్త సందేశంప్రాధాన్యతను సంతరించుకుంది. అమెరికా-ఇజ్రాయెల్‌తో జరుగుతున్న యుద్ధంలో ఇరాన్‌కు మద్దతుగా నిలిచినందుకు ఇరాక్ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ ఒక లేఖను విడుదల చేశారు. అలాగే ఇరాన్‌పై దురాక్రమణకు వ్యతిరేకంగా స్పష్టమైన వైఖరిని తీసు కున్నందుకు ఇరాక్ సుప్రీం మత పెద్ద గ్రాండ్ అయతుల్లా అలీ సిస్తానీకి, అక్కడి ప్రజలకు ఇరాన్ పట్ల వారు చూపుతున్న మద్దతుకు మొజ్తబా కృతజ్ఞతలు తెలిపారు.ఇదీ చదవండి: వైభవంగా ఐపీఎస్ జంట వెడ్డింగ్ : ప్రీ వెడ్డింగ్ షూట్ వైరల్మోజ్తబా ఖమేనీ బయట కనిపించకపోవడంతో ఆయన ప్రాణాలతో ఉన్నారా లేదా అనే సందేహాలు తలెత్తాయి. అయితే, ఆయన వైమానిక దాడిలో గాయపడ్డారని, ప్రస్తుతం కోలుకుంటున్నారని ఇరాన్ అధికారులు మరియు ప్రభుత్వ మీడియా పేర్కొన్నాయి. కాగా 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత రూహోల్లా ఖొమేనీ మరియు అలీ ఖమేనీల తర్వాత మోజ్తబా ఖమేనీ ఇరాన్‌కు మూడవ సుప్రీం లీడర్ అయ్యారు.ఇదీ చదవండి : రూ. 10 కోట్లు చూసి ఆమె షాక్ : నెటిజన్లు మాత్రం ఫిదా -
మొజ్తబా ఎక్కడ?
టెహ్రాన్: ఇరాన్ సుప్రీం నేత మొజ్తబా ఖమేనీ ప్రస్తుతం ఎక్కడ ఉన్నారన్న ప్రశ్న అమెరికా, ఇజ్రాయెల్లను వేధిస్తోంది. ఇరాన్ అగ్రనాయకత్వాన్ని దాదాపుగా అంతం చేసిన నేపథ్యంలో మొజ్తబా జాడ కోసం అవి తీవ్రంగా వెదుకుతున్నాయి. తండ్రి ఖమేనీ మరణానికి కారణమైన దాడిలో మొజ్తబా కూడా తీవ్రంగా గాయపడి రష్యాలో చికిత్స పొందుతున్నారని వార్తలు రావడం తెలిసిందే. ‘‘మొజ్తాబా క్షేమంగానే ఉండి ఉంటారు. ఇజ్రాయెల్‌కు తన జాడ తెలియొద్దనే బయటికి రావడం లేదు’’ అని ఇరాన్ వ్యవహారాల నిపుణుడు రజ్ జిమిత్ అభిప్రాయపడ్డారు. -
మోజ్తాబా ఖమేనీ ఎక్కడ?.. ట్రంప్ బ్రీఫింగ్‌లలో హాట్‌టాపిక్!
టెహ్రాన్: రోమ్ తగలబడుతుంటే నీరో ఫిడేలు వాయించినట్టే… ఇరాన్ యుద్ధంలో మోజ్తాబా మౌనం. దేశం రగులుతున్నా కొత్త సుప్రీం లీడర్ ఒక్క బహిరంగ ప్రకటన చేయలేకపోవడం ఇప్పుడు ట్రంప్ ఇంటెలిజెన్స్ బ్రీఫింగ్‌లలో హాట్‌టాపిక్‌గా మారిందిఅమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్లో పరిస్థితులు తీవ్రంగా మారాయి. ఫిబ్రవరి 28న జరిగిన క్షిపణి దాడుల్లో సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించడంతో ఆయన కుమారుడు మోజ్తాబా ఖమేనీ కొత్త సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టాడు. అయితే ఆయన ఆరోగ్యం, నాయకత్వ సామర్థ్యంపై అంతర్జాతీయ స్థాయిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.జెరూసలెం పోస్ట్ నివేదిక ప్రకారం, మోజ్తాబా తీవ్ర గాయాలతో బాధపడుతున్నారని, వాస్తవానికి ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ (IRGC) యుద్ధ వ్యూహాలను నడిపిస్తున్నాయని పేర్కొంది. అమెరికా నిఘా వర్గాల సమాచారం ప్రకారం, దాడుల్లో ఆయన ఒక కాలు కోల్పోయి, కాలేయం దెబ్బతిని ఆయన ఆరోగ్య పరిస్థి అంతంత మాత్రంగా ఉన్నట్లు తెలుస్తోంది.మోజ్తాబా మౌనంమరో అమెరికా మీడియా సంస్థ యాక్సియోస్ ..ఇరాన్‌పై ముప్పేటా దాడి,ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ అలీ లారిజానీని ముట్టుబెట్టడం,ఇరాన్‌పై పైచేయి సాధించేలా యుద్ధ వ్యూహాల్ని రచిస్తున్నా మోజ్తాబా మౌనం.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంటెలిజెన్స్ బ్రీఫింగ్‌ల సమయంలో చర్చనీయాంశంగా ఉంది. ఇరాన్ బాధ్యతలు ఎవరు నిర్వహిస్తున్నారో అమెరికా జాతీయ భద్రతా బృందం ఆరా తీస్తుందని ట్రంప్ వర్గంలోని ఓ కీలక వ్యక్తి చెప్పారని నివేదించింది మోజ్తాబా ఖమేనీ ఆరోగ్యం అంతంత మాత్రమే?అదే సమయంలో ఇజ్రాయెల్ ఇనిస్టిట్యూట్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ నిపుణుడు రజ్ జిమ్మ్ట్ మోజ్తాబా ఆచూకీపై మీడియా యాక్సియోస్‌తో మాట్లాడారు. కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ప్రస్తుత భద్రతా పరిస్థితుల కారణంగా ప్రజల ముందుకు రావడం అసాధ్యం.క్షిపణి దాడుల్లో ఆయన గాయపడిన తీరు అలాంటిది. ఓ వీడియో రికార్డు చేసి ప్రజలకు సైతం సందేశం పంపించ లేకపోతున్నారని చెప్పారు.వరుస ప్రాణాలు కోల్పోతున్న ఇరాన్ అగ్రనాయకులు ఇదే సమయంలో ఇజ్రాయెల్–అమెరికా దాడుల్లో ఇరాన్ అగ్రనాయకులు వరుసగా ప్రాణాలు కోల్పోతున్నారు. మార్చి 16న కమాండర్ ఘోలాంరెజా సోలేమానీ, మార్చి 17న భద్రతా వ్యూహకర్త అలీ లారిజానీ మరణించారు. ఈ పరిణామాలపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి స్పందిస్తూ.. ఓ వ్యక్తి ఉండటం,లేకపోవడం ఇరాన్ రాజకీయ, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపదు. మేము పోరాటాన్ని కొనసాగిస్తాం.సుప్రీం లీడర్ కూడా వీరమరణం పొందినా, వ్యవస్థ తన పనిని కొనసాగించింది’ అని పేర్కొన్నారు.ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రకారం, యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి 1270 మంది మరణించారు. అమెరికా స్థావరాలపై ప్రతిదాడులు జరిపిన ఇరాన్, హర్మూజ్ జలసంధిపై ఆంక్షలు విధించింది. ప్రపంచ చమురు, సహజ వాయువు సరఫరాలో ఐదవ వంతు ఈ మార్గం ద్వారా జరుగుతుంది. నౌకలు ప్రయాణించలేకపోవడంతో ఇంధన సరఫరా తీవ్రంగా దెబ్బతింది. ఈ పరిణామాలు ఇరాన్ అంతర్గత రాజకీయాలపై మాత్రమే కాకుండా, ప్రపంచ ఇంధన మార్కెట్లపై కూడా తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి. -
పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్.. అన్నదమ్ముల్లా కలిసి ఉండండి: ఖమేనీ పిలుపు
అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో నలిగిపోతున్న ఇరాన్.. పక్క దేశాల పంచాయితీని చక్కబెడతానని ముందుకొచ్చింది. ఆ దేశ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ 1405వ పర్షియన్ నూతన సంవత్సరం "నౌరూజ్" సందర్భంగా ఇచ్చిన సందేశంలో పొరుగు దేశాలైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ కలిసి ఉండాలని పిలుపునిచ్చారు.మా తూర్పు దేశాలు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మాకు అత్యంత సన్నిహితమైనవి.. ఇరు దేశాలు సోదరుల్లా మెలగండి.. ముస్లింల ఐక్యత కోసం పరస్పర సంబంధాలను మెరుగుపర్చుకోండి.. అవసరమైతే నేను మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. మొజ్తబా ఖమేనీ ఇరాన్ సుప్రీం లీడర్ అయ్యాక పాక్-ఆఫ్ఘన్ ఘర్షణలపై చేసిన తొలి బహిరంగ వ్యాఖ్యలు ఇవి. ఇటీవలికాలంలో ఇరాన్ విదేశాంగ మంత్రి పలుమార్లు ఇదే అంశాన్ని ప్రస్తావించినా, కాబూల్–ఇస్లామాబాద్‌వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. కాగా, గతకొంతకాలంగా పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య అనధికారిక య్దుదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లోని ఒమర్ డ్రగ్ రిహాబిలిటేషన్ సెంటర్‌పై పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడుల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సంఖ్యలో గాయపడ్డారు. ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారంతా వైద్య సాయం పొందుతున్న రోగులని ఆఫ్ఘనిస్తాన్ ప్రకటించింది.అయితే పాక్ మాత్రం ఈ ఆరోపణను తీవ్రంగా ఖండిస్తూ.. తాము కేవలం ఉగ్రవాద మౌలిక వసతులు మరియు సైనిక స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని వెల్లడించింది. ఈ ఘటన తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. అయితే, సౌదీ అరేబియా, ఖతార్, టర్కీ దేశాల విజ్ఞప్తి మేరకు ఇరు దేశాలు ఈద్ అల్-ఫితర్ సందర్భంగా తాత్కాలికంగా యుద్ధ విరమణకు అంగీకరించాయి. -
శత్రువు ఓడిపోయింది.. ఇరాన్ సుప్రీం లీడర్ సంచలన ప్రకటన
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ సంచలన ప్రకటన చేశారు. పర్షియన్ నూతన సంవత్సరం "నౌరూజ్" సందర్భంగా విడుదల చేసిన రాతపూర్వక సందేశంలో "శత్రువు ఓడిపోయిందంటూ.." ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికా–ఇజ్రాయెల్ దాడుల మధ్య ఇరాన్ ప్రజలు ఐక్యతను ప్రదర్శిస్తున్నారని ప్రశంసించారు. తన తండ్రి, ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మృతి తర్వాత మొజ్తబా ఖమేనీ మొదటిసారి ప్రజలకు రాతపూర్వక సందేశాన్ని విడుదల చేశారు.ఈ సందేశంలో ఖమేనీ ఇలా రాసుకొచ్చారు. మతపరమైన, సాంస్కృతిక, రాజకీయ భిన్నతలు ఉన్నప్పటికీ ప్రజలు ఒకటిగా నిలిచారు. ఈ ఐక్యత వల్లే శత్రువు ఓటమి చెందిందని పేర్కొన్నారు. అమెరికా–ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ ప్రజలను భయపెట్టి ప్రభుత్వాన్ని కూలదోయాలని భావించారు. ఇది వారు చేసిన భారీ తప్పిదమని త్వరలోనే తెలుసుకుంటారు.శత్రువులు ఇరాన్ నాయకత్వాన్ని హతమార్చడం ద్వారా ప్రజల్లో భయం, నిరాశ కలిగించి దేశాన్ని విభజించాలనుకున్నారు. ఇలా జరగకపోగా, శత్రువులలోనే విభేదాలు పుట్టాయి. ప్రాంతీయ పరిణామాలపై కూడా ఆయన స్పందించారు. టర్కీ, ఒమాన్‌పై జరిగిన దాడులకు ఇరాన్ బలగాలు బాధ్యులు కాదని తెలిపారు. అవి ఫాల్స్ ఫ్లాగ్ చర్యలు అని, పొరుగు దేశాల మధ్య విభేదాలు సృష్టించడమే శత్రువుల లక్ష్యమని అన్నారు.ఆఫ్ఘనిస్తాన్–పాకిస్తాన్ మధ్య జరుగుతున్న ఘర్షణలపై కూడా ఖమేనీ స్పందించారు. ఇరు దేశాల మధ్య సయోధ్యకు తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఆఫ్ఘనిస్తాన్-పాక్ సోదరుల్లా మెలగాలని.. ముస్లింలు ఐక్యతతో ఉండాలని పిలుపునిచ్చారు. కాగా, ఈద్ అల్-ఫితర్ సందర్భంగా ఆఫ్ఘనిస్తాన్-పాక్ తాత్కాలికంగా యుద్ధ విరమణకు అంగీకరించిన విషయం తెలిసిందే. -
త్వరలోనే మూల్యం చెల్లించుకుంటారు: ఖమేనీ
తమ కీలక సైనికాధికారి లారిజానీ హత్యపై ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తీవ్రంగా స్పందించారు. ప్రతి రక్తపు బొట్టుకు ఓ లెక్క ఉంటుంది, లారిజానీ హంతకులు త్వరలోనే భారీ మూల్యం చెల్లించుకుంటారని డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వ వర్గాలు లారిజానీ హత్యను ధృవీకరించిన ఒక రోజు తర్వాత మొజ్తబా ఖమేనీ ఓ ప్రజా ప్రకటన విడుదల చేశారు. ఇందులో ఇజ్రాయెల్, అమెరికాపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. లారిజానీ మరణ వార్త చాలా బాధించింది. అతను విలువలకు కట్టుబడి ఉన్న వ్యక్తి. ఇరాన్ రాజకీయ వ్యవస్థలో ప్రత్యేక స్థానమున్న నాయకుడు. అలాంటి వ్యక్తిని హత్య చేసి ఇజ్రాయెల్, అమెరికా చాలా పెద్ద తప్పు చేశాయి. లారిజానీ హత్య ఇస్లాం వ్యతిరేకుల ద్వేషాన్ని స్పష్టంగా చూపిస్తుంది. ప్రతి రక్తపు బొట్టుకు ఓ లెక్క ఉంటుంది. లారిజానీ హంతకులు త్వరలోనే భారీ మూల్యం చెల్లించుకుంటారని మొజ్తబా ఖమేనీ హెచ్చరించారు.కాగా, అలీ లారిజానీ దివంగత ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీకి కుడి భుజం లాంటి వ్యక్తి. కొద్ది గంటల ముందు ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో లారిజానీ సహా ఐఆర్‌జీసీకి చెందిన బసిజ్ పారామిలటరీ ఫోర్స్ కమాండర్ జనరల్ ఘోలమ్రెజా సులేమానీ మృతి చెందారు. వీరిద్దరి మరణాన్ని ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించింది. వీరిని హతమార్చాక ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక ప్రకటన చేశారు. లారిజానీ, సులేమానీని గ్యాంగ్‌స్టర్ (అయతొల్లా అలీ ఖమేనీ) అసిస్టెంట్లుగా పేర్కొన్నారు. -
ఆ చిన్నవాక్ మోజ్తబాని కాపాడింది : సంచలన ఆడియో
ఫిబ్రవరి 28న జరిగిన ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడి నుంచి ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ లిప్త పాటులో ప్రాణాలతో బయట పడినట్లు తెలుస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ కాంపౌండ్‌పై జరిగిన భయంకరమైన దాడి, ఖమేనీ తృటిలో ప్రాణాలతో బైటపడిన వైనం కొత్తంకథనం సంచలనంగా మారింది.తృటిలో తప్పిన ప్రమాదంది టెలిగ్రాఫ్ నివేదించిన లీకైన ఆడియో రికార్డింగ్ ప్రకారం, 56 ఏళ్ల ఖమేనా టెహ్రాన్‌లోని తన నివాసంపై క్షిపణులు దాడి చేయడానికి కొన్ని క్షణాల ముందు బయటకు వచ్చారు. ఫిబ్రవరి 28 ఉదయం 9:32 గంటలకు టెహ్రాన్‌లోని సుప్రీం లీడర్ నివాసంపై ఇజ్రాయెల్ 'బ్లూ స్పారో' బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది. ఆ సమయంలో మోజ్తబా ఏదో పని మీద నివాసం నుండి బయటకు వచ్చి ప్రాంగణంలోని ఖాళీ స్థలంలోకి వెళ్లారు. అదే సమయంలో క్షిపణులు భవనాన్ని తాకాయి. ఆయన తిరిగి లోపలికి వెళ్లేలోపే ఈ విధ్వంసం జరిగింది.అలీ ఖమేనీ కార్యాలయంలో ప్రోటోకాల్ విభాగాధిపతి మజాహెర్ హొస్సేనీ, మార్చి 12న టెహ్రాన్‌లోని ఖోల్హాక్ ప్రాంతంలో ఉన్నత మత పెద్దలను, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కమాండర్లను ఉద్దేశించి ప్రసంగించగా, లీకైన ఒక ఆడియో రికార్డింగ్ ద్వారా ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయని 'ది టెలిగ్రాఫ్' తెలిపింది.(బంగారం, డాలర్ కాదు : దీని దూకుడు మామూలుగా లేదు!)హొస్సేనీ ప్రకారం, ఒకేసారి పలు ప్రాంతాలపై దాడి చేసేలా ఈ దాడులు ప్లాన్ చేశారు.మోజ్తబా నివాసం, అతని బావమరిది మిస్బా అల్-హుదా బఘేరీ కనీ ఇల్లు, అతని సోదరుడు ముస్తఫా నివాసం ఇలా మూడు క్షిపణులతో దాడి చేశారు. ఈ దాడిలో మోజ్తబా ప్రాణాలతో బయటపడినప్పటికీ, తండ్రి మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ, తల్లి, ఆయన భార్య (హద్దాద్) కుమారుడు అక్కడికక్కడే మరణించారు. పలువురు ఉన్నత ఇరాన్ అధికారులు మరణించారు.సుప్రీం లీడర్ మిలిటరీ బ్యూరో చీఫ్ మహమ్మద్ షిరాజీ ఈ దాడిలో శరీర భాగాలు ఛిద్రమై అత్యంత దారుణంగా మరణించారు. చివరకు కొన్ని కిలోల మాంసం దొరికిందని హోస్సేని ఆ రికార్డింగ్‌లో చెప్పారు. క్షిపణుల తాకిడికి భవనాలు పూర్తిగా ధ్వంస మయ్యాయి.(కాల్పుల విరమణ ప్రసక్తే లేదు : ఇరాన్ సుప్రీం)ఖమేనీ ఆరోగ్యంపై పుకార్లు, షికార్లుఈ దాడి తరువాత మోజ్తబా ఖమేనీ కొత్త సుప్రీంగా ఎన్నికైనప్పటికీ బహిరంగంగా కనిపించలేదు. దీనితో ఆయన తీవ్రంగా గాయ పడ్డారని లేదా మరణించి ఉంటారనిఊహాగానాలకు ఆజ్యం పోసింది. తరువాత తీవ్రగాయాలతో, కాలు కోల్పోయి కోమాలో ఉన్నారనే వార్తలు వెలువడ్డాయి. అయితే కేవలం కాలికి చిన్న గాయం మాత్రమే అయ్యిందని అంతర్గత వర్గాల ఆడియో రికార్డింగ్ ద్వారా తెలుస్తోంది.ఇదీ చదవండి: సంచలన ఆరోపణలు : ట్రంప్‌నకు భారీ షాక్ -
కాల్పుల విరమణ ప్రసక్తే లేదు : ఇరాన్ సుప్రీం
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రయెల్ దాడులతో మొదలైన యుద్ధ ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఈ దశలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాల్పుల విరమణ ప్రతిపాదను మోజ్తబా తిరస్కరించినట్టు తెలుస్తోంది.అమెరికాతో ఉద్రిక్తతలను తగ్గించుకోవడానికి లేదా కాల్పుల విరమణకు సంబంధించి మధ్యవర్తి దేశాలు పంపిన ప్రతిపాదనలను ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా మొజ్తబా ఖమేనీ తిరస్కరించారని సమాచారం. అమెరికా ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకోవాలనే విషయంలో ఖమేనీ చాలా కఠినంగా ఉన్నారని ఇరాన్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అమెరికా, ఇజ్రాయెల్ తమ కాళ్లమీద పడి ఓటమిని అంగీకరించి, పరిహారం చెల్లించే వరకు శాంతి అనే మాటలు తావులేదని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం. ఇదీ చదవండి: ఇజ్రాయెల్ ప్రకటన : ఇరాన్‌కు మరో ఎదురుదెబ్బ?!ఇజ్రాయెల్ చేసిన దాడిలో ఇరాన్ సుప్రీం అయతుల్లా ఖమేనీ, అతని కుటుంబ సభ్యులు దారుణంగా హత్య గావించబడిన తరువాత ఆయన కుమారుడు మోజ్తబా సుప్రీంగా ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా ఇరాన్ ఎప్పటికీ వెనకడుగు వేయదని, పూర్తి శక్తితో ప్రతిఘటిస్తుందని, దివంగత అయతొల్లా అలీ ఖమేనీ మరణానికి మాత్రమే కాకుండా యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి పౌరుడికి ప్రతీకారం తీర్చుకుంటుందని, శత్రువు మూల్యం చెల్లించాల్సిందేనని మోజ్తాబా ప్రతిజ్ఞ చేసిన సంగతి తెలిసిందే.అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొండి వైఖరిమరోవైపు, ఇరాన్ యుద్ధాన్ని ముగించడానికి దౌత్యపరమైన చర్చలు ప్రారంభించాలని మధ్యప్రాచ్య మిత్రదేశాలు చేస్తున్న ప్రయత్నాలను ట్రంప్ ప్రభుత్వం తోసిపుచ్చినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది.ఇదీ చదవండి: బంగారం, డాలర్ కాదు : దీని దూకుడు మామూలుగా లేదు!ఖమేనీ మాస్కో ఆసుపత్రిలో కోలుకుంటున్నారా?ఫిబ్రవరి 28న తన తండ్రిని బలిగొన్న అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడిలో తీవ్రంగా గాయపడిన 56 ఏళ్ల ఖమేనీని వైద్య చికిత్స కోసం రష్యాకు తరలించి ఉండవచ్చని అంచనాలు వెలువడ్డాయి.కానీ అంచనాలను ధృవీకరించడానికి గానీ, ఖండించడానికి గానీ రష్యా నిరాకరించింది. -
అమెరికా-ఇజ్రాయెల్ మిసైళ్లు కళ్లుగప్పిన మొజ్తాబా
టెహ్రాన్: ఇజ్రాయెల్-అమెరికా సంయుక్తంగా నిర్వహించిన భారీ దాడిలో ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ మరణించారు. అమెరికా ఈ దాడిని ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’, ఇజ్రాయెల్ ‘ఆపరేషన్ రోర్ ఆఫ్ ది లయన్’ పేరుతో చేపట్టింది. ఖమేనీ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకున్న ఈ దాడుల్లో ఆయనతో పాటు పలువురు ఉన్నతాధికారులు, కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు.దాడి సమయంలో ఖమేనీ పక్కనే ఉన్న ఆయన రెండవ కుమారుడు, నూతన సుప్రీం లీడర్‌గా భావిస్తున్న మోజ్తాబా ఖమేనీ, అమెరికా,ఇజ్రాయెల్ క్షిపణులు,యుద్ధ విమానాలు జరిపిన దాడి నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. ఇరాన్ ప్రభుత్వంలోని ప్రముఖుల మధ్య జరిగిన ఒక అంతర్గత ఆడియో సంభాషణలో ఈ విషయం బయటపడిందని ది టెలిగ్రాఫ్ నివేదించింది.ఖమేనీ కార్యాలయ ప్రోటోకాల్ అధిపతి మజాహెర్ హొస్సేనీ ఆ ఆడియోలో మాట్లాడుతూ.. ‘మోజ్తాబా బయటికి వెళ్లిన సమయమే మిసైల్ దాడి జరిగింది. ఆయన ప్రాణాలతో బయటపడటానికి కారణం ఇదంతా దేవుని సంకల్పమే’ అని వివరించారు.టెలిగ్రాఫ్ నివేదిక ప్రకారం, ఇజ్రాయెల్ బాలిస్టిక్ మిసైళ్లు ఖమేనీ నివాస సముదాయంపై మూడు మిసైళ్లు దాడు ప్రయోగించబడ్డాయి. ఒకటి ఖమేనీ ఉన్న ప్రాంతాన్ని తాకగా.. మరొకటి మోజ్తాబా నివాసంపై అంతస్తును ఢీకొట్టింది. ఈ దాడి నుంచి మొజ్తాబా ప్రాణాలతో బయటపడ్డాడు. ఆయనకు కేవలం కాలి భాగంలో స్వల్ప గాయం మాత్రమే జరిగింది.ఇరాన్ సైనికాధికారి మహ్మద్ షిరాజీ ఈ దాడిలో మరణించారు. ఆయన శరీరం పూర్తిగా ఛిద్రమైంది. మరో మిసైల్ మోజ్తాబా మరిది మిస్బాహ్ అల్-హుదా బఘేరీ కానీ నివాసమే లక్ష్యంగా ధ్వంసం చేసింది. ఈ దాడిలో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఆడియో టేపులు వెలుగులోకి వచ్చిన తర్వాత మోజ్తాబా ఆరోగ్యంపై అనేక వదంతులు వ్యాపించాయి. ఆయన ఎక్కడా బహిరంగంగా కనిపించలేదు. ఈ క్రమంలో ఇరాన్ ప్రభుత్వ అధికార మీడియా ద్వారా ఆయన ఒక సందేశం పంపించారు. ‘మార్త్యుల రక్తానికి ప్రతీకారం తీర్చుకుంటాం’అని పేర్కొన్నారు.అమెరికా ప్రతిస్పందనఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మోజ్తాబా గురించి స్పష్టత లేదని తెలిపారు. కొందరు ఆయన తీవ్రంగా గాయపడ్డారని, మరికొందరు ఆయన మరణించారని చెబుతున్నారని పేర్కొన్నారు. ‘మేము ఆయనను ఇప్పటి వరకు చూడలేదు. ఆయన బ్రతికున్నాడో లేదో తెలియదు’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. -
మోజ్తబా ఖమేనీ ఆచూకీ : మరో బిగ్ ట్విస్ట్!
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ ఆచూకీ, ఆరోగ్యంపై కొనసాగుతున్న ఉత్కంఠకు ఇప్పట్లో తెరపడేనా? అసలు ఆయన బతికే ఉన్నాడా? ఉంటే ఎక్కడున్నాడు? రష్యా అద్యక్షుడు పుతిన్ నీడలో రక్షణ పొందుతున్నాడనే మరో వార్తహల్ చల్ చేస్తోంది. ఇరాన్ సుప్రీం మోజ్తబా ఖమేనీ సేఫ్టీపై అగ్రనేతలు ఏమంటున్నారు? ఈ విషయాలపై కథనం.అమెరికా, ఇజ్రాయెల్ , ఇరాన్ మధ్య యుద్ధం మూడవ వారంలోకి ప్రవేశించిన వేళ, ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ ఆచూకీ , ఆరోగ్యంపై కొనసాగుతున్న ఉత్కంఠకు ఇంకా తెరపడలేదు.మోజ్తబా ఖమేనీ ఉనికిపై ఊహాగానాలుఇరాన్పై ఫిబ్రవరి 28న మొదలు పెట్టిన అమెరికా -ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ అప్పటి సుప్రీంనేత అయతుల్లా అలీ ఖమేనీ ఇతర కుటుంబ సభ్యులు మరణించారు. తండ్రి మరణం తర్వాత, 56 ఏళ్ల మోజ్తబా ఖమేనీ ఇరాన్ నాయకత్వ బాధ్యతలు చేపట్టారు. అయితే, యుద్ధం ప్రారంభంలో జరిపిన దాడుల్లో మోజ్తబా కూడా తీవ్రంగా గాయపడ్డారని, ప్రస్తుతం కోమాలో ఉన్నారనే ఊహాగానాలు భారీగా వ్యాపించాయి. అయితే ఈ విషయాలను ఖండించిన ఇరాన్ మోజ్తబా గాయపడినప్పటికీ నాయకత్వ బాధత్యలను నిర్వహించే స్థితిలోనే ఉన్నారని ప్రకటించింది. రష్యాలో చికిత్స ?అయితే ఆయన రష్యాలో చికిత్స పొందుతున్నారని కువైట్ పత్రిక 'అల్-జరీదా' తెలిపింది. దీని ప్రకారం అమెరికా-ఇజ్రాయెల్ బాంబు దాడుల తర్వాత మోజ్తబాను అత్యంత రహస్యంగా ఒక రష్యన్ సైనిక విమానంలో మాస్కోకు తరలించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసంలోని ఒక ప్రైవేట్ వైద్య సదుపాయంలో ఆయనకు శస్త్రచికిత్స జరిగిందని, ప్రస్తుతం అక్కడే కోలుకుంటున్నారని సమాచారం. ఇరాన్లో దాడులు కొనసాగుతున్నందున భద్రతా కారణాల దృష్ట్యా ఆయన్ని రష్యాకు తరలించినట్లు తెలుస్తోంది.ఇరాన్‌లోనే ఉన్నారా?మరోవైపు 'ది సన్' పత్రిక కథనం మాత్రం మరోలా ఉంది మోజ్తబా ఇరాన్‌లోని సినా యూనివర్సిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దాడుల్లో ఆయన రెండు కాళ్లు కోల్పోయారని, కాలేయం లేదా కడుపు భాగం తీవ్రంగా దెబ్బతిన్నదని, ఆయన ప్రస్తుతం కోమాలో ఉన్నారని పేర్కొంది.ట్రంప్ , నెతన్యాహు ప్రకటనలుఅయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర అనుమానాలను రేకెత్తించాయి.ఆయన అసలు బతికే ఉన్నారో లేదో నాకు తెలియదు. ఇప్పటివరకు ఎవరూ ఆయన్ని చూడలేదు. ఆయన బతికే ఉంటే, తన దేశం కోసం శరణు కోరడం మంచిదని వ్యాఖ్యానించారు. అంతేకాదు మోజ్తబా సమాచారం కోసం అమెరికా 10 మిలియన్ డాలర్ల రివార్డును కూడా ప్రకటించడం గమనార్హం. మరోవైపు ఇరాన్ నేత మోజ్తబా ఆచూకీపై తమ వద్ద సమాచారం ఉందంటూనే "ఆయన ప్రాణాలకు నేను ఎలాంటి భరోసా (లైఫ్ ఇన్సూరెన్స్) ఇవ్వలేనునీ, అయితే ఖమేనీ ఉన్న ప్రదేశం గురించి ఇజ్రాయెల్‌కు నిఘా సమాచారం ఉందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వ్యాఖ్యానించడం ఈ ఊహాగానాలను మరింత సంక్లిష్టం చేసింది. ఇరాన్ సైనిక కమాండర్లకు కూడా తమ కొత్త నాయకుడి నుండి ఎటువంటి ఆదేశాలు అందడం లేదని, దీంతో ఇరాన్ అంతర్గత గందరగోళం నెలకొన్నట్టు తెలుస్తోంది. మోజ్తబా అందుబాటులో లేని కారణంగా యుద్ధంపై ఆయనకు ఎటువంటి నియంత్రణ లేదని, కమాండర్లకు కూడా ఆయన స్థితిగతులపై స్పష్టత లేదని 'ది టెలిగ్రాఫ్' నివేదించింది.(నెతన్యాహూ కాఫీ వీడియో : షాకింగ్ ‘డీప్‌ఫేక్’ చర్చ)ఖమేనీ పరిస్థితి గురించి సీనియర్ అధికారులు కూడా అనిశ్చితంగా ఉన్నారని ఇరాన్ అధికారి ఒకరు ది టెలిగ్రాఫ్‌తో అన్నారు. "మోజ్తాబా గురించి ఎవరికీ ఏమీ తెలియదు, అతను బతికే ఉన్నాడా లేదా చనిపోయాడా లేదా ఎంత తీవ్రంగా గాయపడ్డాడో. అతను గాయపడ్డాడని చెప్పారు. అతను ఇక్కడ లేనందున అతనికి యుద్ధంపై నియంత్రణ లేదు. మెజారిటీ కమాండర్లకు, లేదా మరింత సరిగ్గా చెప్పాలంటే, అన్ని కమాండర్లకు అతని గురించి ఎటువంటి సమాచారం లేదు." అని ఇరాన్ సీనియర్ అధికారిన ఉటంకిస్తూ టెలిగ్రాఫ్ వెల్లడించింది.అలాగే సుప్రీం లీడర్ పేరుతో విడుదలైన మొదటి ప్రకటన ఆయన రాసింది కాదని, భద్రతా మండలి కార్యదర్శి అలీ లారిజానీ రాసి ఉండవచ్చని కొందరు అనుమానిస్తున్నారు. ప్రస్తుతానికి మోజ్తబా ఖమేనీ ప్రాణాలతో ఉన్నారా లేదా అనేది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ పరిస్థితి ఇరాన్ రాజకీయ , సైనిక వ్యూహాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.ఇదీ చదవండి: అమ్మానాన్నకు సర్ప్రైజ్ గిఫ్ట్ : ఎమోషనల్ వీడియో -
మొజ్తబాకు నోపో కవచం
శత్రు శేషం, రుణ శేషం, వ్రణ శేషం, అగ్ని శేషం ఉండకూడదంటారు. ఇరాన్ నూతన సుప్రీం నేత మొజ్తబా ఖమేనీ విషయంలో అమెరికా కూడా ఈ సూత్రాన్నే పాటించే ప్రయత్నంలో ఉంది. తండ్రి అయతొల్లా అలీ ఖమేనీ మాదిరిగానే మొజ్తబాను కూడా అంతం చేయాలని చూస్తోంది. కానీ అదంత సులువు కాదని ఇరాన్ ధీమాగా చెబుతోంది. అందుకు కారణం ఒక్కటే. మొజ్తబా చుట్టూ ఉన్న అత్యున్నత రహస్య భద్రతా కమెండో విభాగం ‘నోపో’! ఏమిటీ నోపో? నోపో ఇరాన్ ప్రత్యేక రహస్య భద్రతా దళం. పార్సీ భాషలోని ‘నిరోయే విజేహ్ పాస్దరాన్ వేలాయత్’కు సంక్షిప్త రూపం. అంటే ‘పాలకులను కాపాడే ప్రత్యేక దళం’ అని చెప్పొచ్చు. ఇరాన్ పోలీస్ వ్యవస్థలో ఒక విభాగంగా నోపోను దశాబ్దాల క్రితం ఏర్పాటుచేశారు. మెరుపు వేగంతో పనిముగించే మెరికల్లాంటి కమెండోలు ఇందులో ఉంటారు. 1979లో ఇరాన్లో ‘ఇస్లామిక్ చైతన్యం’ తర్వాత తొలి సుప్రీం నేతగా ఆవిర్భవించిన అయతొల్లా రుహొల్లా ఖమేనీ కాలంలో తిరుగుబాటుదారుల నుంచి అగ్ర నేతల రక్షణ నిమిత్తం 28వ రొహల్లా డివిజన్ నుంచి నోపోను ఏర్పాటు చేశారు. ఇరాన్లో అత్యంత శక్తిమంతమైన, పలుకుబడి గల సాయుధ విభాగమైన రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ (ఐఆర్జీసీ)తో కూడా నోపోకు సంబంధం ఉండదు.కేవలం అగ్ర నేతల భద్రతపైనే ఇది దృష్టి సారిస్తుంది. వారిని అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుతుంది. నోపో కమెండోల పని పూర్తిగా గోప్యంగానే కొనసాగుతుంది. ప్రమాదాన్ని పసిగట్టి ముందస్తు వ్యూహాలు రచించి అమలు చేయడం, పరిస్థితి హఠాత్తుగా అదుపు తప్పితే స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్లడం ఈ దళం ప్రత్యేకత. నాలుగు నోపో బ్రిగేడ్లు మొజ్తబా రక్షణలో నిరంతరం నిమగ్నమైనట్టు తెలు స్తోంది. మహ్ షాద్, ఇస్ఫహాన్ అణుకేంద్రాల భద్రత కోసం మరో రెండు యూ నిట్లు పని చేస్తున్నట్టు సమా చారం. ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో పాల్గొనడం, బందీ లను విడిపించడం, ప్రభుత్వ భవనాలతోపాటు వ్యూహాత్మక ప్రదేశాలకు రక్షణ కలి్పంచడం వంటి విధులను కూడా నోపో చూస్తుందని యుద్ధ రంగ నిపుణులు చెబుతున్నారు. కఠిన శిక్షణ యుక్త వయసులో ఉండి శరవేగంగా స్పందించగల నైపుణ్యం, తెలివితేటలు, దేహదారుఢ్యం, సాంకేతికతపై పట్టు, గురిపెట్టి కాల్చే నైపుణ్యం... ఇలా పలు అర్హతలున్న వారిని అన్నిరకాలుగా వడపోసిన అనంతరం నోపోలోకి తీసుకుంటారు. సాధారణ పోలీస్ శిక్షణలో అత్యంత ప్రతిభ కనబర్చిన వాళ్లను నోపో కోసం ఎంపిక చేస్తారు. వారికి మళ్లీ కఠినమైన కమెండో శిక్షణ ఇస్తారు. నోపో మాజీ కమెండో హొస్సేన్ అమ్జాదియాన్ గతంలో ఒక ఇంటర్వ్యూలో ఈ వివరాలను వెల్లడించారు. ‘‘అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లోనూ అవలీలగా పని ముగించే తెగువ, నైపుణ్యం నోపో కమెండోల సొంతం. కఠినమైన కమెండో శిక్షణ పూర్తయ్యాక కూడా సభ్యుని ప్రవర్తనపై అనుమానముంటే తక్షణం విధుల నుంచి తప్పిస్తారు.స్వీయరక్షణ విద్యతో పాటు మార్షల్ ఆర్ట్స్ సైతం వచ్చి ఉండాలి. స్నైపర్ షూటింగ్లో నైపుణ్యముండాలి. పరిసరాలను డేగ కళ్లలో గమనిస్తుండాలి. అగ్ర నేతల రక్షణ కోసం ప్రాణత్యాగం చేసే తెగువ కావాలి’’ అని ఆయన చెప్పారు. 1999– 2022 మధ్య ఇరాన్లో సంక్షోభం లేవదీసేందుకు జరిగిన పలు ప్రయత్నాలను వమ్ము చేసేందుకు ఖమేనీ ప్రభుత్వం నోపో కమెండోలను విజయవంతంగా ఉపయో గించినట్టు గతంలో వార్తలొచ్చాయి. ‘‘దేశం పట్ల అత్యంత అంకితభావం చూపడమే నోపో సభ్యుల ప్రాథమిక లక్షణం’’ అని పారిస్ కేంద్రంగా పనిచేసే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫ్ ఇరాన్ (ఎన్సీఆర్ఐ) పార్టీ నేత అలీ సఫావీ చెప్పారు. నోపో అరాచకాలకు పాల్పడుతోందని, మానవహక్కులను హరిస్తోందని అమెరికా ఆరోపించింది. 2021లోనే నోపోపై ఆంక్షలు విధించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వీళ్లను పట్టిస్తే కోటీశ్వరులైపోవచ్చు.. ఏకంగా రూ.93 కోట్లు
వాషింగ్టన్: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ సహా ఆ దేశంలోని పలువురు ఉన్నతాధికారుల గురించి సమాచారం ఇచ్చిన వారికి 10 మిలియన్ డాలర్లు (రూ.92,47,48,000) బహుమతి ఇస్తామని అమెరికా ప్రకటించింది. యుద్ధం మరింత ముదురుతున్న పరిస్థితిలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రోత్సాహకాన్ని అమెరికా విదేశాంగ శాఖ నిర్వహించే “రివార్డ్స్ ఫర్ జస్టిస్” కార్యక్రమం ద్వారా ప్రకటించింది.రివార్డు ఉన్న వ్యక్తుల జాబితాలో మొజ్తబా ఖమేనీతో పాటు కీలక నేతలు, అధికారులు అలీ అస్గర్ హిజాజీ, యాహ్యా రహీమ్ సఫవి, అలీ లరిజాని, ఎస్మాయిల్ ఖతీబ్ ఎస్కందర్ మొమెని ఉన్నారు. ఈ నాయకులపై సమాచారం ఇచ్చే వారికి అమెరికా బహుమతి ప్రకటించింది.అమెరికా ఈ నాయకులకు వేర్వేరుగా కచ్చితమైన మొత్తాన్ని బహుమతిగా ప్రకటించలేదు. అమెరికా చెప్పింది ఒక్కటే.. ఎవరైనా తమకు ఇచ్చే సమాచారం ఉపయోగపడితే “గరిష్ఠంగా $10 మిలియన్ (సుమారు రూ.92-93 కోట్లు) వరకు” బహుమతి ఇవ్వవచ్చు.రివార్డ్స్ ఫర్ జస్టిస్ ప్రోగ్రాం అంటే అమెరికా మీద ఉగ్రదాడులు చేసినట్లు అనుమానించే వ్యక్తులను గుర్తించేందుకు సమాచారం ఇచ్చిన వారికి డబ్బు బహుమతి ఇచ్చే కార్యక్రమం. మొజ్తబా ఖమేనీ సహా పలువురు ఉన్నతాధికారులను “ఇరానియన్ టెర్రరిస్టులు”గా పేర్కొంటూ అమెరికా ఒక ప్రకటనలో వివరాలు తెలిపింది.“ఈ వ్యక్తులు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ)లో వివిధ విభాగాలను నడిపిస్తున్నారు. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉగ్ర చర్యలకు ప్రణాళికలు వేసి, అమలు చేస్తుంది” అని చెప్పింది.“ఈ ఐఆర్జీసీ నాయకులు లేదా దాని విభాగాలపై సమాచారం తెలిసినవారు ఆ విషయాన్ని టోర్ ఆధారిత టిప్‌లైన్ లేదా సిగ్నల్ ద్వారా మాకు పంపండి. సమాచారం ఇచ్చిన వారికి బహుమతి లభించే అవకాశం ఉంటుంది” అని తెలిపింది.టోర్ అంటే ఇంటర్నెట్లో గుర్తింపును దాచుతూ సమాచారాన్ని పంపే సాంకేతిక వ్యవస్థ. సిగ్నల్ అంటే గోప్యంగా సందేశాలు పంపే ఎన్క్రిప్షన్ ఆధారిత మెసేజింగ్ యాప్. -
తీవ్ర గాయాలతో కోమాలో ఖమేనీ? సంచలనంగా బ్రిటీష్ మీడియా కథనాలు
ఇరాన్ కొత్త అత్యున్నత నాయకుడు మోజ్తబా ఖమేనీ (Mojtaba Khamenei) ఆరోగ్య పరిస్థితిపైపలు అనుమానాలు హల్చల్ చేస్తున్నాయి. అంతర్జాతీయ మీడియాలో వస్తున్న భిన్నమైన కథనాల ప్రకారం శత్రు పక్షం దాడిలో మోజ్తాబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారని కాలు తీసేసారని, కోమాలో ఉన్నారని తెలుస్తోంది. దీనిపై అధికారిక ధృవీకరణఘేదీ లేనప్పటికీ ఇప్పటివరకు ప్రజల ముందుకు రాకపోవడం ఈ అనుమానాలను బలపరుస్తోంది.ది సన్ నివేదిక ప్రకారం, మొజ్తబా కూడా తీవ్రంగా గాయపడ్డారని బ్రిటీష్ పత్రిక 'ద సన్' (The Sun) నివేదించింది. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హత్యకు గురైన ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ 56 ఏళ్ల కుమారుడు మోజ్తాబా ఖమేనీ తీవ్రంగా గాయపడి ,ప్రస్తుతం టెహ్రాన్‌లో చికిత్స పొందుతున్నాడని నివేదించింది. తండ్రిమరణానికి దారి తీసిన దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఖమేనీకి ఒక కాలు (లేదా రెండు కాళ్లు) తొలగించారని, కాలేయం లేదా కడుపు భాగంలో తీవ్రమైన గాయాలయ్యాయని సమాచారం. ప్రస్తుతం ఆయన టెహ్రాన్‌లోని సినా యూనివర్సిటీ హాస్పిటల్లో కోమాలో ఉన్నట్లు ఆ వార్తలు పేర్కొంటున్నాయి.దీనికి తోడు ఇరాన్ సుప్రీంగా ఎన్నికైన తరువాత తొలిసారి మొజ్తబా ఖమేనీ పేరుతో ఒక ప్రకటన జారీ అయింది. ఈ కొత్త ఫోటోలను ఇరాన్ మీడియా విడుదల చేసినప్పటికీ, అవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) తో సృష్టించినవి లేదా పాత ఫోటోలను ఎడిట్ చేసినవనీ చాలా సంస్థలు అనుమానిస్తున్నాయి.అయితే ఏఐ ఫోటో అన్న ఆరోపణలను ఇరాన్ ప్రభుత్వ అధికారులు, అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ కుమారుడు యూసుఫ్ ఖండించారు. మొజ్తబా ఖమేనీ "సురక్షితంగా, ఆరోగ్యంగా" ఉన్నారని , భద్రతా కారణాల దృష్ట్యా రహస్య ప్రదేశంలో ఉన్నారని పేర్కొన్నారు. (ఇరాన్ వార్ : ట్రంప్ సరికొత్త వార్నింగ్)మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయంపై స్పందిస్తూ, ఖమేనా గాయపడి ఉండవచ్చు, కానీ ఏదో ఒక రూపంలో బ్రతికే ఉన్నారని భావిస్తున్నానంటూ వ్యాఖ్యానించడంతో అసలు మొజ్తబా ఖమేనీ సజీవంగా ఉన్నారా లేదా అనుమానాలు మరింతగా చెలరేగాయి. అయితే ఖమేనీ కోమాలో ఉన్నట్లు వస్తున్న వార్తలకు అదికారిక ధృవీకరణ ఏదీ లేదుకాగా ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో (Operation Epic Fury) మొజ్తబా ఖమేనీ తండ్రి అలీ ఖమేనీనికోల్పోయిన సంగతి తెలిసిందే. అలాగే తల్లి, భార్యను, కొడుకును, అక్కను, ఆమె భర్తను, వారి పిల్లలు కూడా ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు.ఇదీ చదవండి: మోజ్తాబా ఖమేనీని ఖతం చేస్తాం.. నెతన్యాహూ సంచలన వ్యాఖ్యలు -
మొజ్తాబా ఖమేనీ సంచలన ప్రకటన
-
కోమాలో మొజ్తాబా ?
దుబాయ్: తండ్రి అయతొల్లా ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ నూతన సుప్రీంనేత పీఠంపై కూర్చున్న మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యంగా నీలినీడలు తొలగిపోవట్లేదు. ఫిబ్రవరి 28నాటి దాడిలో తండ్రి, తల్లి, సోదరి, భార్య, కుమారుడు చనిపోగా మొజ్తాబా ఒక కాలును కోల్పోయారని గురువారం అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.బాంబుదాడిలో ఆయన పొత్తి కడుపు లేదా లివర్ తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆ కారణంగా ప్రస్తుతం కోమాలోకి వెళ్లిపోయారని ‘ది సన్’ వార్తాసంస్థ ఒక కథనం ప్రచురించింది. కోమాలోంచి ఆయన కోలుకోవడం కష్టమేనని విశ్వసనీయ వర్గాలు చెప్పాయని, ప్రస్తుతం టెహ్రాన్ నగరంలోని సినా విశ్వవిద్యాలయ ఆస్పత్రిలోని ఐసీయూలో ఆయన చికిత్స పొందుతున్నారని ఆ కథనంలో వెల్లడించింది. ఆస్పత్రిలోని వ్యక్తులు లండన్‌లోని తమ వర్గీయులకు పంపిన సందేశంలో ఈ సమాచారం లీక్ అయినట్లు భోగట్టా. -
మొట్టమొదటి మెసేజ్.. మొజ్తాబా ఖమేనీ సంచలన ప్రకటన
టెహ్రాన్: యుద్ధం వేళ ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ అయతొల్లా మొజ్తాబా ఖమేనీ మొట్టమొదటిసారి అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేశారు. హోర్ముజ్ జలసంధి మూసివేతను ఒత్తిడి పెంచే సాధనంగా ఉపయోగించాలని తమ అధికారులకు చెప్పారు. గల్ఫ్, అరబ్, పొరుగు దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు.మొజ్తాబా ఖమేనీ నియామకం తర్వాత ఆయన నుంచి వచ్చిన ఈ మొట్టమొదటి ప్రకటనను ఆ దేశ టెలివిజన్‌లో గురువారం చదివారు. ఖమెనీ కెమెరా ముందు కనిపించలేదు. యుద్ధం ప్రారంభంలో ఆయన గాయపడ్డారని ఇజ్రాయెల్ అంచనా వేసిన విషయం తెలిసిందే. ఖమేనీ ఇప్పుడు కూడా ఏ మాత్రం తగ్గకుండా గల్ఫ్, అరబ్ పొరుగు దేశాలపై దాడులు కొనసాగుతాయని చెప్పారు. అమెరికా సైనిక స్థావరాలను మూసివేయాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.మరోవైపు, ఇవాళ కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై పలు డ్రోన్ల దాడి జరిగింది. దీనిపై కువైట్ ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ప్రకటన చేసింది. భౌతిక నష్టాన్ని మాత్రమే కలిగించిందని చెప్పింది. పూర్తి సమన్వయంతో వ్యవహరించి సమస్యను అధికారులు పరిష్కరించారని చెప్పింది.అలాగే, బహ్రెయిన్, కువైట్, యూఏఈ, సౌదీ అరేబియాపై దాడులకు ఇరాన్ యత్నించింది. విదేశీ చమురు ట్యాంకర్లనూ లక్ష్యంగా చేసుకుంటోంది. దీంతో ఇరాక్ అప్రమత్తమై పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. చమురు పోర్టు కార్యకలాపాలను మూసివేసినట్లు ప్రకటించింది. చమురు ధరలపై ఇవాళ ఉదయం ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. త్వరలో చమురు బ్యారెల్ ధర 200 డాలర్లకు చేరుకుంటుందని, ప్రపంచం దానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. -
మొజ్తాబా నా మాట విను : డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసినట్లు అంతర్జాతీయ కథనాలు వెలుగులోకి వచ్చాయి. అమెరికా చేస్తున్న ప్రధాన డిమాండ్లలో ఇరాన్ తన అణ్వాయుధ కార్యక్రమాన్ని పూర్తిగా వదులుకోవాలి. ఆ డిమాండ్‌ను తిరస్కరిస్తే, కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీయే లక్ష్యంగా చేసే దాడులకు తాను మద్దతు ఇస్తానని ట్రంప్ స్పష్టంగా పేర్కొన్నారని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక తెలిపింది.37 ఏళ్ల పాటు ఇరాన్‌ను ఒంటిచేత్తో పాలించిన అయతుల్లా అలీ ఖమేనీ జీవితం విషాదాంతమైంది. ఫిబ్రవరి 28న టెహ్రాన్‌లో అత్యున్నత స్థాయి సమావేశం జరుగుతుండగా, ఇజ్రాయెల్ సైన్యం ‘బ్లూ స్పారో’ అనే ఖండాంతర క్షిపణిని ప్రయోగించి దాడి చేసింది. ఆ దాడిలో అయతుల్లా ఖమేనీ మరణించారు. ఇజ్రాయెల్ ఎలా మిలటరీ ఆపరేషన్ చేపట్టిందో, అదే తరహా చర్యలు మోజ్తబా ఖమేనీపై కూడా జరగవచ్చని అమెరికా అధికారులు హెచ్చరిస్తున్నారు.అలీ ఖమేనీ మరణం తర్వాత, ఆయన రెండవ కుమారుడు మోజ్తబా ఖమేనీని కొత్త సుప్రీం లీడర్‌గా ఎన్నుకోవడంపై ట్రంప్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోజ్తబా ఖమేనీ ప్రశాంతంగా జీవిస్తారని నేను నమ్మను’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. మోజ్తబా నియామకానికి ముందు, అమెరికా ఇరాన్ తదుపరి నాయకుడి ఎంపికలో కూడా తమకు పాత్ర ఉండాలని పట్టుబట్టింది. వెనిజువెలా పాలనా పరమైన అంశాల్లో అమెరికా జోక్యం చేసుకున్నట్లే, ఇరాన్లో కూడా అదే విధంగా ప్రభావం చూపాలని ట్రంప్ కోరుకున్నారు.అయితే, దివంగత అయతుల్లా ఖమేనీ తన వీలునామాలో మోజ్తబా తన వారసుడిగా రావాలని కోరుకోలేదని స్పష్టంగా పేర్కొన్నారు. కానీ శక్తివంతమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఒత్తిడితో మోజ్తబా ఎంపిక లాంఛనమైంది. ఇదే అంశంపై ఇరాన్ ప్రతిపక్ష గ్రూప్ ‘నేషనల్ యూనియన్ ఫర్ డెమోక్రసీ రీసెర్చ్’ డైరెక్టర్ ఖోస్రో ఇస్ఫహానీ మాట్లాడుతూ..‘ఖమేనీ తన కుమారుడిని వారసుడిగా కోరుకోలేదు. ఆయన వీలునామాలో మోజ్తబాను వారసుడిగా పేర్కొనవద్దని స్పష్టంగా రాశారు’ అని తెలిపారు. -
తుది దశకు యుద్ధం.. ట్రంప్ గుడ్‌న్యూస్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఇరాన్‌తో యుద్ధం ముగిస్తామని అన్నారు. ఇప్పటికే ఇరాన్‌లోని అన్ని లక్ష్యాలను ఛేదించామని తెలిపారు. ఇప్పుడు కొత్తగా టార్గెట్ చేయడానికి ఇరాన్ దగ్గర ఇంకేమీ మిగల్లేదని అన్నారు. తాను ఎప్పుడు అనుకుంటే అప్పుడు యుద్ధం ఆగుతుందని చెప్పారు.కాగా, ఇరాన్ నౌకాదళం పనిచేస్తున్న పోర్టుల దగ్గరకు వెళ్లవద్దని అమెరికా సైన్యం పౌరులను హెచ్చరించింది. ఆ ప్రాంతాల్లో భద్రతకు హామీ ఇవ్వలేమని తెలిపింది. యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ ఇరానీ డాక్ కార్మికులు, పరిపాలనా సిబ్బంది, వాణిజ్య నౌకల సిబ్బంది ఇరాన్ నేవీ నౌకలు దగ్గరికి, సమీప సైనిక ప్రాంతాల వద్దకు వెళ్లవద్దని సూచించింది. అమెరికా దళాలు ఇరాన్ నౌకాదళ ఆస్తులపై దాడులు కొనసాగిస్తున్న సమయంలో యూఎస్ ఈ హెచ్చరిక చేసింది. ఇప్పటివరకు సుమారు 60 ఇరానీ నౌకలు ధ్వంసం చేశామని అమెరికా తెలిపింది.మరోవైపు, ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ భీకరదాడులు చేసింది. దాడుల్లో కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ గాయపడినట్లు ప్రచారం జరుగుతోంది. ఖమేనీ కాలికి ఫ్రాక్చర్, ఎడమ కంటి వద్ద గాయాలైనట్లు సమాచారం. అయితే, గత ఏడాది జరిగిన హత్యాప్రయత్నంలోనే ఖమేనీ గాయపడ్డారని ఇజ్రాయెల్ అంటోంది. ఇప్పటి వరకు ప్రజల ముందుకు మొజ్తబా ఖమేనీ రాలేదు. -
ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఎంపికలో బిగ్ ట్విస్ట్!
టెహ్రాన్: ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్‌గా అయతుల్లా సయ్యద్ మొజ్తాబా ఖమేనీ ఎంపిక విషయంలో బిగ్‌ట్విస్ట్ చోటు చేసుకుంది. తన కుమారుడు తన వారసుడిగా కొనసాగడం తనకు ఇష్టం లేదని అయతుల్లా అలీ ఖమేనీ వీలునామా రాసినట్లు తెలుస్తోంది.అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన అయతుల్లా అలీ ఖమేనీ స్థానంలో మొజ్తాబాను ఇరాన్ నిపుణుల అసెంబ్లీ ఎన్నుకుంది. అయితే ఈ మొజ్తాబా ఎన్నికపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు పలువురు పెదవి విరిస్తున్నారు. తాజాగా, ట్రంప్ మాత్రమే కాదు మొజ్తాబా తండ్రి, మాజీ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీకి సైతం ఇష్టం లేదని ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. తన కుమారుడు మొజ్తాబా ఇరాన్ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టేందుకు అర్హతలు లేవని, గతంలో పలు మార్లు చెప్పిన ఆయతుల్లా వ్యాఖ్యల్ని ఊటంకిస్తూ తాజాగా, పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఆ కథనాల్లో తన వారసుడిగా మొజ్తాబా అనర్హుడంటూ గతంలో చెప్పిన విషయాన్ని తాజాగా న్యూయార్స్ టైమ్స్ కథనంలో పేర్కొంది. అయినప్పటికీ, వడ్డించే వాడు మనవాడయితే.. బంతి చివర్లో కూర్చున్నా కంచంలో అన్నీ వచ్చి చేరతాయని సామెత చందంగా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) ఒత్తిడి మేరకు మొజ్తాబా ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఎన్నుకోవడం అనివార్యమైంది.ఇరాన్‌లోని ప్రస్తుత ఇస్లామిక్ రిపబ్లిక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య మార్పు కోసం కృషి చేస్తున్న నేషనల్ యూనియల్ ఫర్ డెమోక్రసీ ఇన్ ఇరాన్ (ఎన్యూడీఐ) రీసెర్చ్ డైరెక్టర్ ఖోస్రో ఇస్ఫహానీ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఖోస్రో మాట్లాడుతూ.. మొజ్తాబాకు ఇరాన్‌ను నడిపించే శక్తి సామర్ధ్యాలు, అనుభవం, రాజకీయ అనుభవం లేదు. మొజ్తబా రాజకీయంగా ప్రభావం చూపలేకపోయాడు. చెప్పుకోదగ్గ విజయాలు సాధించిన దాఖలాలు లేవని పేర్కొన్నారు.ఇరాన్ నాయకత్వ వారసత్వాన్ని సాధారణంగా సుప్రీం నాయకుడిని ఎన్నుకునే బాధ్యత షియా మత పెద్దలతో కూడిన కమిటీ (అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్)కి ఉంది. మొజ్తాబా నియామకం అసెంబ్లీ ఎక్స్పర్ట్స్ కమిటీ నిబంధనలకు అనుగుణంగా ఎన్నిక జరగలేదు. బదులుగా, గత వారం ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్ ఎవరు అనే అంశంపై చర్చలు జరిగాయి. అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఆధ్వర్యంలో జరిగిన చర్చల్లో ఐఆర్జీసీ తరుఫు ప్రతినిధులు సైతం హాజరయ్యారు. వారే కమిటీ సభ్యులపై ఒత్తిడి తెచ్చి మొజ్తాబాను ఎన్నుకునేలా చేశారని చెప్పారు.ఇరాన్ ఇంటెలిజెన్స్ వర్గాలతో మాకు మంచి సంబంధాలున్నాయి. ఖమేనీ స్థానంలో మరొకరిని ఎంపిక చేయాల్సిన నిపుణుల సభ మొజ్తాబాకు ఓటు వేయలేదు. అతనిపై చాలా వ్యతిరేకత ఉంది. కానీ ఐఆర్జీసీ ఒత్తిడితో, అతన్ని వారసుడిగా పేర్కొన్నారు. సుప్రీం లీడర్ అంటే తాము చెప్పినట్లు నడుచుకునే నాయకుడే కావాలని ఐఆర్జీసీ చూస్తోంది. అందుకే మొజ్తాబాను ఎంచుకుంది. ఐఆర్జీసీ ఏది చెబితే అది చేసే మనస్తత్వం మొజ్తాబాది. ఐఆర్జీసీ ఆయన్ని ఓ తోలు బొమ్మలా చూస్తోందని’ ఆరోపించారు. -
కొత్త సుప్రీం మొజ్జబా ఖమేనీపై రగులుతున్న ఇరాన్
-
ట్రంప్‌నకు కోపం తెప్పించే పని చేసిన పుతిన్
టెహ్రాన్: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ అయతొల్లా మొజ్తబా ఖమేనీకి వ్యతిరేకంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాత్రం మొజ్తబా ఖమేనీకి మద్దతు ప్రకటించారు. కొన్ని రోజుల క్రితం అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో అలీ ఖమేనీ మరణించారు. అలీ ఖమేనీ కుమారుడే మొజ్తబా ఖమేనీ.మొజ్తబాకు పుతిన్ ఓ సందేశం పంపారు. “ఇరాన్‌కు మా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. ఇరాన్‌లోని మిత్రులతో ఐక్యంగా ఉంటాం. ఇరాన్‌కు రష్యా విశ్వసనీయ భాగస్వామిగా ఉంది. భవిష్యత్తులోనూ ఇలాగే ఉంటుంది. ఇరాన్ దాడులను ఎదుర్కొంటున్న ఈ సమయంలో మీ పదవీకాలంలో మీకు చాలా ధైర్యం, అంకితభావం అవసరం” అని తెలిపారు.తాజాగా, డొనాల్డ్ ట్రంప్ చేసిన కామెంట్లకు పుతిన్ వ్యాఖ్యలు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఖమేనీ కుమారుడు ఉండడం తనకు ఆమోదయోగ్యం కాదని అన్నారు. ఇరాన్లో సామరస్యం, శాంతిని తీసుకువచ్చే నేత కావాలని చెప్పారు. తమ ఆమోదం లేకపోతే అతను ఎక్కువ కాలం నిలవడని అన్నారు. అలాగే, ఏం జరుగుతుందో చూద్దామని వ్యాఖ్యానించడం గమనార్హం. యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదు..కాగా, ప్రజల ముందుకు మొజ్తబా ఖమేనీ అంతగా రారు. తన 56 సంవత్సరాల జీవితంలో అదే తీరును అవలంభించారు. అయితే, ఇరాన్లో చెలరేగిన నిరసనలను అణచివేయడంలో మొజ్తబా పాత్ర ఉంది. గత తొమ్మిది రోజులుగా కొనసాగుతున్న ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం ఇప్పట్లో ఆగే సూచనలు కనిపించడం లేదు. సోమవారం ఇజ్రాయెల్ సైన్యం ఇరాన్‌పై మళ్లీ దాడులు ప్రారంభించింది. బీరూట్‌లో హిజ్బుల్లా మౌలిక వసతులపై కూడా దాడి చేసింది.దీనికి ముందు రోజు టెహ్రాన్ చమురు నిల్వ కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇరాన్ ప్రతిగా ఇజ్రాయెల్‌పై, పశ్చిమాసియాలో అమెరికా సైనిక స్థావరాలు ఉన్న ప్రాంతాలపై దాడులు చేస్తోంది. ఆదివారం సౌదీ అరేబియాలోని ఓ నివాస ప్రాంతంలో ఒక ఆయుధం పడటంతో ఒక భారతీయుడు సహా ఇద్దరు విదేశీయులు మరణించారు.ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో మొజ్తబా తండ్రి అలీ ఖమేనీతో పాటు తల్లి, కుమారుడు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ మీడియా నివేదికల ప్రకారం.. మొజ్తబా భార్య పేరు జహ్రా హద్దాద్-అదెల్, ఆయన కుమారుల్లో ఒకరు దాడుల్లో మరణించారు. మొజ్తబాకు ఒక కుమార్తె కూడా ఉంది. మొత్తం ముగ్గురు పిల్లలు. -
ట్రంప్‌నకు హైబీపీ తెప్పించిన ఇరాన్!
ఇరాన్ అధికారికంగా మోజ్తాబా ఖమేనీని కొత్త సుప్రీం లీడర్‌గా ప్రకటించింది. ఆయన తండ్రి అయతుల్లా అలీ ఖమేనీ ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ దాడిలో మరణించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో.. తీవ్ర తర్జన భర్జనల తర్వాత (మార్చి 8–9, 2026) ఇరాన్ అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఆయన వారసుడిగా మోజ్తాబానే ఎన్నుకుంది.ఇరాన్ చరిత్రలో అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. ఆ దేశ అత్యున్నత మతపరమైన మండలి తమ కొత్త నాయకుడిగా ఖమేనీ తనయుడు సయ్యద్ మోజ్తాబాను (అలీ ఖమేనీ రెండవ కుమారుడు)ని ఎన్నుకుంది. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత మొదటిసారి సుప్రీం లీడర్ పదవి తండ్రి నుండి కుమారుడికి వారసత్వంగా వెళ్లడం ఇక్కడ ప్రముఖంగా చెప్పుకోదగ్గ విషయం.అయితే ఇరాన్లో సాధారణంగా సుప్రీం లీడర్‌ను మతపరమైన మండలి ఎన్నుకుంటుంది. కానీ ఈసారి తండ్రి నుండి కుమారుడికి పదవి రావడం హెరిడిటరీ సక్సెషన్ (వంశపారంపర్య వారసత్వం)పై విమర్శలు వెల్లువెత్తవచ్చని అంతా భావించారు. దీనికి తోడు.. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. మోజ్తాబా ఎంపిక అంశంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇరాన్లో వారసత్వ ఎంపిక ఏ రకంగానూ చెల్లదని, మోజ్తాబా ఒక మూర్ఖుడు అని, ఆ పదవికి అనర్హుడని, ఇరాన్ కొత్త నాయకుడిని ఆ దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జరపాలని, ఆ ఎంపికలో తమ దేశ ప్రమేయం(తనకు అనుకూలంగా ఉండాలనే..) ఉంటుందని ప్రకటించారు. వాషింగ్టన్ ఆమోదం లేకుండా ఇరాన్ గద్దెపై ఎవరు కూర్చున్నా, వారు ఎక్కువ కాలం నిలబడలేరని ఆయన హెచ్చరించారు.🚨 BREAKING: The Islamic regime of Iran just named Ali Khamenei's SON as the NEW SUPREME LEADER — Mojtaba KhameneiPresident Trump has already said he is an "UNACCEPTABLE" successor to Ali Khamenei"Everybody that seems to want to be a leader, they end up DEAD!"How long will… pic.twitter.com/2MiCYtXrxT— Eric Daugherty (@EricLDaugh) March 8, 2026కాగా, ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ చాలా తేలికగా తీసుకుంది. ప్రాంతీయ యుద్ధ పరిస్థితుల్లో.. మోజ్తాబా ఎంపికే సరైందని భావించింది. అయితే ఆ ప్రకటన తర్వాత ఇరాన్ అంతటా అనూహ్య పరిస్థితులు కనిపించాయి. వ్యతిరేకతకు బదులు.. ఇరాన్ ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆనందం వ్యక్తం చేశారు. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC), సైనిక ప్రధాన సిబ్బంది మోజ్తాబాకు మద్దతు ప్రకటించారు. ఇది అగ్రరాజ్యం, ఇజ్రాయెల్ ఏమాత్రం ఊహించిన ఉండకపోవచ్చు!.56 ఏళ్ల వయసున్న మోజ్తాబా ఖమేనీ గతంలో ఎన్నికైన పదవులు చేపట్టకపోయినా, తన తండ్రి కార్యాలయం ద్వారా సైనిక, భద్రతా వ్యవస్థలపై ప్రభావం చూపుతూ వచ్చారు. అలాగే హెజ్బొల్లా లాంటి అమెరికా-ఇజ్రాయెల్ వ్యతిరేక గుంపులతోనూ ఆయన సంబంధాలు కలిగి ఉన్నారు. అయితే మోజ్తాబా, డొనాల్డ్ ట్రంప్ మధ్య సంబంధం తీవ్ర ప్రతిస్పందనలతో నిండింది. మోజ్తాబాపై పలు రాజకీయ(ఎన్నికల్లో అవకతవకలు, అవినీతి సంబంధిత) విమర్శలు ఉన్నా.. కరడుగట్టిన ట్రంప్ వ్యతిరేకి అనే ముద్ర కూడా ఉంది. అందుకే ప్రస్తుత పరిస్థితుల్లో మోజ్తాబా నియామకమే సరైందని భావించి.. అమెరికాకు ప్రత్యక్ష సవాలు విసిరింది ఇరాన్.మొత్తంగా.. మోజ్తాబా నియామకంతో ఇరాన్ మతపరమైన నాయకత్వం “సమరాన్ని ఎంచుకుంది, రాజీని కాదు” అని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే ట్రంప్ మోజ్తాబాను “అంగీకరించలేని నాయకుడు” అని చెబుతున్నారు. కాబట్టి తాజా నిర్ణయం ఆయనకు మరింత మంట పుట్టించి తీవ్ర నిర్ణయం దిశగా అడుగులు వేయించే అవకాశం లేకపోలేదు. అదే సమయంలో ఉద్రిక్తతలకు ధీటుగానే స్పందించాలనే ధోరణిని మోజ్తాబా కొనసాగించే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్లో జరిగిన నాయకత్వ మార్పు .. మధ్య ప్రాచ్యంలో(మిడిల్ఈస్ట్లో) ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం కనిపిస్తోంది. -
ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఆయనే.. అధికారిక ప్రకటన
టెహ్రాన్: ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. అలీ ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్ ఎంపిక పూర్తయింది. దేశ తదుపరి సుప్రీంగా అయతుల్లా అలీ ఖమేనీ రెండో కుమారుడు 56 ఏళ్ల మొజ్తాబా ఖమేనీ (Ayatollah Ali Khamenei)ఎన్నికైనట్టు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. కాగా, ఇటీవల అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందిన విషయం తెలిసిందే. ముజ్తబాకు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (IRGC)తో బలమైన సంబంధాలు ఉన్నాయి.ముజ్తాబా గాయం? తండ్రి ఖమేనీని పొట్టన పెట్టుకున్న ఇజ్రాయెల్ దాడిలో ముజ్తాబా సైతం గాయాలపాలైనట్టు తాజాగా కథనాలు వెలువడ్డాయి. ఆ దాడిలో ఖమేనీతోపాటు పలువురు అగ్ర నేతలు, సైనిక జనరల్స్ చనిపోయారు. ఆ భేటీలో ముజ్తాబా సైతం ఉన్నట్టు చెబుతున్నారు. ఆయన భార్య జహ్రా హద్దద్ అదెల్ కూడా ఆ దాడిలో చనిపోయారు. ముజ్తాబా గాయపడ్డారన్న వార్తలను ఇరాన్ వర్గాలు ఖండించాయి. ఆ రోజు ఆయన టెహ్రాన్ నగరంలోనే లేరని పేర్కొన్నాయి. శక్తివంతమైన సాయుధ విభాగం ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్(ఐఆర్జీసీ)పై ముజ్తాబాకు పట్టుంది. ఆ పలుకుబడితో సుప్రీం నేతగా తననే ఎన్నుకునేలా ‘అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్’ మెజారిటీ సభ్యులతో ఆయన మంతనాలు జరిపినట్టు వార్తలొచ్చాయి. -
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్.. ఇతనే?
-
కాబోయే సుప్రీం మొజ్తబా ఖమేనీ..దిమ్మదిరిగే వ్యాపార సామ్రాజ్యం
ఇరాన్ (Iran) సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీకి కాబోయే వారసుడిగా ప్రచారంలో ఉన్న ఆయన రెండో కుమారుడు 56 ఏళ్ల ఈ మత గురువు మొజ్తబా ఖమేనీ (Mojtaba Khamenei) విదేశాల్లో విస్తరించిన ఆయన వ్యాపార సామ్రాజ్యం ఇపుడు నెట్టింట్ చర్చనీయాంశంగా మారింది. ఇరాన్ తన అణు కార్యక్రమం కారణంగా గత రెండు దశాబ్దాలుగా చరిత్రలోనే అత్యంత కఠినమైన ఆంక్షలను ఎదుర్కొంటున్నప్పటికీ, ఆ దేశ ఉన్నత వర్గాలు విదేశాలకు మూలధనాన్ని ఎలా తరలించగలిగాయో ఖమేనీ విదేశీ పెట్టుబడుల పోర్ట్‌ఫోలియో చూస్తే అర్థం అవుతుంది అంటోంది తాజా నివేదిక.ప్రముఖ పాశ్చాత్య గూఢచార సంస్థ అంచనా ప్రకారం ఉత్తర లండన్‌లోని "బిలియనీర్స్ రో" అని పిలువబడే వీధిలో, పొడవైన కంచెలు, మూసివేసిన గేట్ల వెనుక చాలా వరకు ఖాళీగా ఉన్న కొన్ని భవనాలు ఉన్నాయి. ది బిషప్స్ అవెన్యూలోని ఈ విలాసవంతమైన ఇళ్ల ముఖభాగాల వెనుక టెహ్రాన్ నుండి దుబాయ్ , ఫ్రాంక్ఫర్ట్ వరకు విస్తరించి ఉన్న ఒక నెట్వర్క్ ఉంది. అనేక బినామీ కంపెనీల ద్వారా, దీని అంతిమ యాజమాన్యం మధ్యప్రాచ్యంలోని అత్యంత శక్తివంతమైన వ్యక్తులలో ఒకరైన ఇరాన్ సర్వోన్నత నాయకుడి రెండవ కుమారుడు మొజ్తబా ఖమేనీదే అని చెబుతోంది.యువ ఖమేనీ తన ఆస్తులను తన సొంత పేరు మీద పెట్టడానికి ఇష్టపడకపోయినప్పటికీ, విస్తారమైన పెట్టుబడుల సామ్రాజ్యాన్ని నిర్మించారని, కొన్ని కనీసం 2011 నాటివి అని అంచనా. గ్లోబల్‌గా విస్తరించిన అతని ఆస్తులు విలువ పర్షియన్ గల్ఫ్ షిప్పింగ్ నుండి స్విస్ బ్యాంక్ ఖాతాలుదాకా విస్తరించి ఉన్నాయని భావిస్తున్నారు. 2019లో అతనిపై అమెరికా ఆంక్షలు విధించినప్పటికీ, ఈ సంస్థల నెట్వర్క్ మొత్తం కలిసి ఖమేనీకి నిధులను బిలియన్ల డాలర్లను పాశ్చాత్య మార్కెట్లలోకి మళ్లించారు.ముఖ్యమైన ఆస్తులుమొజ్తబా ఖమేనీ లండన్, దుబాయ్, జర్మనీ మరియు స్పెయిన్ వంటి దేశాల్లో వందల మిలియన్ డాలర్ల విలువైన విలాసవంతమైన భవనాలు, హోటళ్లు మరియు వ్యాపారాలను కలిగి ఉన్నారని బ్లూమ్‌బెర్గ్ పరిశోధనలో తేలింది. ఈ ఆస్తులేవీ నేరుగా ఆయన పేరు మీద లేవు. అలీ అన్సారీ అనే ప్రముఖ ఇరానియన్ వ్యాపారవేత్తను బినామీగా వాడుకుని, అనేక షెల్ కంపెనీల ద్వారా ఈ పెట్టుబడులు పెట్టారు. ప్రధానంగా ఇరాన్ చమురు అమ్మకాల ద్వారా వచ్చిన నిధుల నుంచే ఈ సంపద సమకూరినట్టు సమాచారం. ఇరాన్‌పై కఠినమైన అంతర్జాతీయ ఆర్థిక ఆంక్షలు ఉన్నప్పటికీ, గ్లోబల్ బ్యాంకింగ్ వ్యవస్థలోని లొసుగులను ఉపయోగించుకుని ఈ నిధులను విదేశాలకు తరలించారు.లండన్ (UK): లండన్‌లోని "బిలియనీర్స్ రో" (The Bishops Avenue) లో సుమారు రూ. 1,241 కోట్ల ($138 మిలియన్లు) విలువైన విలాసవంతమైన భవనాలున్నాయి. ఇందులో ఒక ఇల్లు 2014లో ఏకంగా రూ. 371.09కోట్లకు కొనుగోలు చేశారట.దుబాయ్‌లోని అత్యంత విలాసవంతమైన "ఎమిరేట్స్ హిల్స్" (దీనిని దుబాయ్ బెవెర్లీ హిల్స్ అంటారు) ప్రాంతంలో ఒక పెద్ద విల్లా ఉంది.ఫ్రాంక్ఫర్ట్ (జర్మనీ), మల్లోర్కా (స్పెయిన్) లాంటి నగరాల్లో ఫైవ్ స్టార్ హోటళ్లు (ఉదాహరణకు Hilton Frankfurt Gravenbruch) ఈ నెట్వర్క్ ఆధీనంలో ఉన్నట్లు గుర్తించారు. కెనాడాలోని టొరంటోలోని ఫోర్ సీజన్స్ ప్రైవేట్ రెసిడెన్స్‌లో ఒక పెంట్‌హౌస్‌ను సుమారు 7.7 మిలియన్ల డాలర్లకు విక్రయించినట్లు రికార్డులు చెబుతున్నాయి.మరికొన్ని ఆస్తులను నేరుగా మెజ్తబా పేరు మీద కాకుండా, Birch Ventures Ltd, Ziba Leisure Ltd, , A&A Leisure వంటి షెల్ కంపెనీల ద్వారా కొనుగోలు చేశారు. ఇవి సెయింట్ కిట్స్ అండ్ నెవిస్, ఐల్ ఆఫ్ మ్యాన్ వంటి దేశాల్లో రిజిస్టర్ అయ్యాయి. అంతేకాదు ఇరాన్లో చమురుకంపెనీల అమ్మకాల ద్వారా వచ్చిన డబ్బును దుబాయ్, స్విట్జర్లాండ్, లీచ్టెన్స్టెయిన్ బ్యాంకు ఖాతాల ద్వారా దారి మళ్లించి ఈ ఆస్తులను కొన్నారట."ఇరాన్ ప్రభుత్వం జర్మనీ ఆర్థిక వ్యవస్థలో పట్టు సాధించడానికి ప్రయత్నిస్తోంది" అని ఫ్రాంక్ఫర్ట్ డిప్యూటీ మేయర్, టెహ్రాన్‌లో జన్మించి ఇస్లామిక్ రిపబ్లిక్ నాయకత్వాన్ని తీవ్రంగా విమర్శించిన నర్గెస్ ఎస్కందారి-గ్రున్‌బర్గ్ అన్నారు. మన వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని వ్యాఖ్యానించడం గమనార్హం.ఎవరీ అన్సారీమొజ్తబా సామ్రాజ్యాన్ని నడపడంలో అలీ అన్సారీ (Ali Ansari) కీలక పాత్ర పోషించాడనే విమర్శలు భారీగానే ఉన్నాయి. ఇరాన్‌లోని అతిపెద్ద షాపింగ్ మాల్ (Iran Mall) యజమాని ,బ్యాంకర్. 1980ల చివరలో, ఇరాన్-ఇరాక్ యుద్ధం ముగిసే సమయానికి - యువ అన్సారీ సైన్యంలో చేరాడు. ఈ సమయంలోనే అతను మొదటిసారిగా మొజ్తబా ఖమేనీని కలిశాడు. ఆ తరువాత అన్సారీ లాభదాయకమైన ప్రభుత్వ కాంట్రాక్టులు , దిగుమతి లైసెన్సులను పొందాడు. నిర్మాణ రంగం, షిప్పింగ్ మరియు పెట్రోకెమికల్స్ రంగాలలోకి వేగంగా ప్రవేశించాడు. ఈ పరిశ్రమలు ప్రభుత్వ నిధులను విదేశాలకు తరలించడానికి మార్గాలుగా ఉపయోగపడ్డాయని సమాచారం. 1990- 2000లలో, అన్సారీ టెహ్రాన్‌లో ఒక వర్ధమాన పారిశ్రామికవేత్తగా ఎదిగాడు అతను 2009లో TAT బ్యాంక్‌ను స్థాపించాడు, ఇది తరువాత బ్యాంకు యాజమాన్యంలోని విలాసవంతమైన షాపింగ్ సెంటర్ అయిన ఇరాన్ మాల్‌ను నిర్మించే ప్లాన్ వేశాడు. 2013 నాటికి, ఒక విలీనం TAT బ్యాంక్‌ను అయందే బ్యాంక్‌గా మార్చింది. ఇది 2025లో కుప్పకూలింది. అంతర్గత రుణాల ఆరోపణలలో చిక్కుకుని, అప్పులు మరియు అధికారులతో ఉన్న సన్నిహిత రాజకీయ సంబంధాలపై వివాదాలతో కూరుకుపోయింది.బ్రిటన్ ఇతనిని "అవినీతిపరుడైన ఇరానియన్ వ్యాపారవేత్త"గా పేర్కొంటూ ఆంక్షలు విధించింది. అన్సారీపై UK ఆస్తులను స్తంభింపజేయడం వలన EU ఆంక్షలు విధించినట్లయితే నెట్వర్క్ యూరోపియన్ ఆస్తులను భారీగా విక్రయించే అవకాశం ఉందని మనీలాండరింగ్ దర్యాప్తు యూరోపియన్ అధికారి పేర్కొన్నారు.ఇదీ చదవండి: 78 ఏళ్లకు లవ్ ప్రపోజల్..39 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి!ఖమేనీ వారసుడిగామొజ్తబాతండ్రి 86 ఏళ్ల అలీ ఖమేనీ తర్వాత ఇరాన్ తదుపరి "సుప్రీం లీడర్" అయ్యేందుకు మెజ్తబా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ ఆస్తులు ఆయనకు రాజకీయంగా మరియు ఆర్థికంగా బలాన్ని ఇస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ ఇరాన్లో విప్లవం వచ్చి ప్రభుత్వం కూలిపోతే, విదేశాలకు పారిపోయి సుఖంగా జీవించడానికి ఈ భారీ సంపదను "రెయిన్ డే ఫండ్"గా సిద్ధం చేసుకున్నట్లు అనుమానాలు ఉన్నాయి.2025-26లో అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడంతో ఇరాన్‌పై ఒత్తిడి పెరిగింది. అలీ అన్సారీపై బ్రిటన్ ఆంక్షలు విధించడంతో, ఈ విదేశీ ఆస్తులను ఫ్రీజ్ (Freeze) చేసే అవకాశం ఉంది. మరోవైపు ఇరాన్లో ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతుంటే, పాలకుల కుటుంబం ఇలా కోట్లాది రూపాయల సంపదను విదేశాల్లో దాచుకోవడంపై ఇరాన్ ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.మరోవైపు ఇరాన్‌పై యుద్ధానికి సిద్ధమవుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరిన్ని యుద్ధనౌకలను తరలిస్తున్నామంటూ మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు ఇరాన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు, ఘర్షణల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ ప్రజలు పేదరికంతో అలమటిస్తుంటే, పాలకుల కుటుంబం ఇలా విదేశాల్లో విలాసవంతమైన ఆస్తులు కూడబెట్టడంపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. ఇరాన్ ప్రభుత్వం తమను తాము సామాన్య భక్తులుగా చెప్పుకున్నా, లోపల జరుగుతున్నది వేరని తాజా నివేదిక చెబుతోంది. ఈ నివేదికలోని పేర్కొన్న ఆస్తులపై అటు ఖమేనీ లేదా అన్సారీ స్పందించ లేదు.-తుమ్మలపల్లి సూర్యకుమారి -
ప్చ్.. ఖమేనీ వారసుడికి పగ్గాలు కష్టమే!
పశ్చిమాసియా ఉద్రిక్తతలు కొనసాగున్న వేళ.. మరోవైపు ఇరాన్ సుప్రీం అయాతుల్లా అలీ ఖమేనీ ఆరోగ్యం క్షీణించిందని, ఆయన కోమాలోకి కూడా వెళ్లారని, ఆయన వారసుడు మోజ్తాబా ఖమేనీ తదుపరి సుప్రీంగా బాధ్యతలు స్వీకరిస్తారని ప్రచారం తీవ్రతరమైంది. అయితే ఈ విషయంలో ఇప్పుడు ట్విస్ట్ చోటు చేసుకుంది.తాను ఆరోగ్యంగానే ఉన్నానంటూ సంకేతాలిస్తూ.. ఖమేనీ తాజాగా ఓ ఫొటో రిలీజ్ చేశారు. లెబనాన్ ఉన్న ఇరాన్ రాయబారి ముజ్తబా అమనిని కలుసుకున్నట్లు తన ఎక్స్ ఖాతాలో ఖమేనీ పోస్ట్ చేశారు. ఇటీవల లెబనాన్‌లో ఇజ్రాయెల్ జరిపిన పేజర్ దాడుల్లో ముజ్తబా అమని కూడా గాయపడ్డారు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఖమేనీ ఆరా తీసినట్లు సమాచారం.ఇక.. ఖమేనీ ఆరోగ్యం విషమించిందని, కోమాలోకి వెళ్లారని, ఆయన కుమారుడు మోజ్తాబా ఖమేనీ త్వరలోనే బాధ్యతలు స్వీకరిస్తారని.. ఇరాన్ ఇంటర్నేషనల్ కథనం వెలువడడం తీవ్ర చర్చనీయాంశమైంది. సెప్టెంబర్ 20వ తేదీన 60 మంది ఇరాన్ అసెంబ్లీ నిపుణులతో ఒక తీర్మానం కూడా ఖమేనీ చేయించాడన్నది ఆ కథనం సారాంశం. అయితే..ఆ తీర్మానాన్ని.. ఓటింగ్‌ను చాలామంది వ్యతిరేకించారని కూడా అదే కథనం పేర్కొంది. ఈ కథనం ఆధారంగా రకరకాల కథనాలు వండి వార్చాయి మిగతా మీడియా సంస్థలు. కానీ, ఖమేనీ తాజా పోస్టుతో మోజ్తాబాకు ఇరాన్ సుప్రీం పగ్గాలు ఇప్పట్లో పగ్గాలు అప్పజెప్పకపోవచ్చనే స్పష్టత వచ్చింది. ఇదే కాదు.. మెజ్తాబాకు ఆటంకాలు కూడా ఉన్నాయి. అయతొల్లా అలీకి ఆరుగరు సంతానం. మోజ్తాబా.. రెండో కొడుకు. 1969లో మషాబాద్లో పుట్టాడు. తన తండ్రి బాటలో నడుస్తూ.. మత పెద్దగా మారాడు. అలాగే 2005, 2009 ఇరాన్ ఎన్నికల్లో మహమూద్ అహ్మదీనెజాద్‌కు మద్దతు ఇచ్చి.. అతని విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాదు.. ఇరాన్ రిచ్చెస్ట్ మ్యాన్‌గానూ మోజ్తాబాకు పేరుంది.ఇరాన్ జీడీపీ 388 బిలియన్ డాలర్లు కాగా, ఖమేనీ కుటుంబం ఆస్తుల విలువ 200 బిలియన్ డాలర్లుగా ఉందని.. ఇందులో 90 బిలియన్ డాలర్లు మోజ్తాబా పేరిటే ఉందని అమెరికా నివేదికలు వెల్లడించాయి. అయితే.. ఇరాన్ రాజకీయాల్లో జోక్యం ద్వారా అలీపై విమర్శలే ఎక్కువగా ఉన్నాయి. 2009లో అహ్మదీనెజాద్ తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక.. చెలరేగిన నిరసనల అణచివేత మోజ్తాబా ఆధ్వర్యంలోనే కొనసాగింది. అయితే తర్వాతి కాలంలో ఈ ఇద్దరి మధ్య సంబంధాలు చెడాయి. ఈ క్రమంలో.. ప్రభుత్వ ఖజానా సొమ్మును దుర్వినియోగం చేశాడంటూ మోజ్తాబాపై అహ్మదీనెజాద్ సంచలన ఆరోపణలు చేశాడు. దీంతో ఇరాన్ అసెంబ్లీ నిపుణులు మెజ్తాబాకు ఇరాన్ సుప్రీం బాధ్యతలు వెళ్లనివ్వకుండా అడ్డుకునే అవకాశం లేకపోలేదు. అయతొల్లా వారసుడిగా సిద్ధాంతాలను పుణికి పుచ్చుకున్నప్పటికీ.. సుప్రీం కుర్చీ మాత్రం మెజ్తాబాకు చాలా దూరంగానే ఉందన్నది పలువురి వాదన.


