జాడ తీసే యత్నాల్లో ఇజ్రాయెల్
టెహ్రాన్: ఇరాన్ సుప్రీం నేత మొజ్తబా ఖమేనీ ప్రస్తుతం ఎక్కడ ఉన్నారన్న ప్రశ్న అమెరికా, ఇజ్రాయెల్‌లను వేధిస్తోంది. ఇరాన్ అగ్రనాయకత్వాన్ని దాదాపుగా అంతం చేసిన నేపథ్యంలో మొజ్తబా జాడ కోసం అవి తీవ్రంగా వెదుకుతున్నాయి. తండ్రి ఖమేనీ మరణానికి కారణమైన దాడిలో మొజ్తబా కూడా తీవ్రంగా గాయపడి రష్యాలో చికిత్స పొందుతున్నారని వార్తలు రావడం తెలిసిందే. ‘‘మొజ్తాబా క్షేమంగానే ఉండి ఉంటారు. ఇజ్రాయెల్‌కు తన జాడ తెలియొద్దనే బయటికి రావడం లేదు’’ అని ఇరాన్ వ్యవహారాల నిపుణుడు రజ్ జిమిత్ అభిప్రాయపడ్డారు.


