breaking news
Supreme Leader of Iran
-
నిత్యం డ్రగ్స్.. రోజంతా మత్తులోనే
టెల్ అవీవ్: ఇజ్రాయెల్ గూఢచార విభాగం మొస్సాద్ సంబంధ సోషల్ మీడియా ఖాతాలో ఇరాన్ సుప్రీం నేత అయెతొల్లా ఖమేనీ గురించి తీవ్ర వ్యాఖ్యలు వివాదం రేపుతున్నాయి. ఖమేనీ పాలనకు తగిన వ్యక్తి కారని, డ్రగ్స్‌కు బానిసై ఎప్పుడూ మత్తులోనే జోగుతుంటారని ఆరోపించింది. పర్షియన్ భాషలోని ఈ అకౌంట్‌ను @Mossad Spokesman గా గుర్తించారు. ఇది ‘మొస్సాద్ ఫార్సి’గా కూడా పేరుతెచ్చుకుంది. అచ్చు మొస్సాద్ అధికార చానెల్ అకౌంట్ మాదిరిగానే కనిపిస్తుంది. ఇరాన్ లక్ష్యంగా ఇందులో పలు వివాదాస్పద వ్యాఖ్యలు ప్రత్యక్షమవుతుంటాయి. ఇరాన్‌కు ఇబ్బంది కలిగించేలా ఆ దేశ ప్రభుత్వ రహస్య సమాచారం వంటివి ఇందులో కనిపిస్తుంటాయి. అంతేకాదు, పలువురు ముఖ్య నేతలు, అధికారుల గురించిన రహస్య క్విజ్ పోటీలను సైతం ఈ అకౌంట్ నిర్వహిస్తుంటుంది. శుక్రవారం @MossadSpokesman ఎక్స్ అకౌంట్లో..‘రోజులో సగం నిద్రకు, మరో సగం డ్రగ్స్‌కు బానిసై గడిపే వ్యక్తి దేశాన్ని ఎలా నడపగలరు?..నీళ్లు, కరెంటు, జీవితం’అంటూ పేర్కొంది. అయితే, ఇందులో ఖమేనీ పేరును మాత్రం ప్రస్తావించలేదు. ఇరాన్లో కనీస మౌలిక సదుపాయాలైన నీళ్లు, విద్యుత్ కొరతలతోపాటు నిత్యం కనిపించే ప్రజాందోళనలను పరోక్షంగా పేర్కొంది. ఈ పోస్టుకు 48 గంటల్లోనే 1.80 లక్షల మంది స్పందించారు. గత నెలలో ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య 12 రోజులపాటు కొనసాగిన సంక్షోభం సమయంలో ఈ అకౌంట్లో ఇరాన్ నూతన సైనిక కమాండర్ ఎవరో చెప్పాలంటూ సవాల్ విసరగా ఒక వ్యక్తి కచ్చితమైన పేరును వెల్లడించడం విశేషం. ఈ అకౌంట్లో గతంలోనూ ఇలాంటి రెచ్చగొట్టే పోస్టులే ఉండేవి. డ్రగ్స్ వాడే వారు నాయకత్వం వహించగలరా అంటూ ప్రశ్నించింది. ఇందులో ప్రత్యేకంగా అయెతొల్లా ఖమేనీ పేరును ప్రస్తావించనప్పటికీ ఆ తీవ్రత, కంటెంట్‌ను బట్టి ఇరాన్ సుప్రీం లీడరే టార్గెట్ అన్న విషయం తేలిగ్గా ఎవరికైనా అర్థమవుతుంది. పర్షియా భాషలో ఉన్న ఈ పోస్టులను ఆటో–ట్రాన్స్లేషన్తో అందరూ చదవొచ్చు. ఈ అకౌంట్ తమదేనంటూ ఇజ్రాయెల్ అధికారికంగా ఎటువంటి ప్రకటనా చేయలేదు. అయినప్పటికీ ఇరాన్ ప్రజలే లక్ష్యంగా మొస్సాద్ నిర్వహించే మెసేజింగ్ చానెల్గానే చెబుతుంటారు. ఆపరేషన్ రైజింగ్ లయన్ వేళ... గత నెలలో ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్ చేపట్టిన వేళ ఈ అకౌంట్ వచ్చిన ఒక పోస్టు తీవ్ర వివాదానికి కారణమైంది. ఇజ్రాయెల్ చేసిన మొట్టమొదటి దాడిలో ఇరాన్‌కు చెందిన ఘొలాం అలీ రషీద్ అనే మిలటరీ కమాండర్ చనిపోయారు. ఆ వెంటనే అలీ షాద్మానీ అనే ఆయన వారసుడు సైతం మృతి చెందారు. ఆయన స్థానంలో కొత్తగా నియమించిన కమాండర్ పేరును ఇరాన్ రహస్యంగా ఉంచింది. ఈ అంశంపై @Mossad Spokesman రెచ్చగొట్టే రీతిలో స్పందించింది. ఆ కమాండర్ ఎవరో తనకు తెలుసునంటూ, కొత్తగా నియమితులైన కమాండర్ పేరును తెలిస్తే చెప్పాలంటూ నెటిజన్లకు క్విజ్ పెట్టింది. ‘ఇరాన్ ప్రభుత్వం ఖతమ్ అల్ అన్బియాకు కొత్త కమాండర్‌ను నియమించింది. భద్రత కోసం ఆయన పేరును వెల్లడించలేదు. మాకు అతడెవరో తెలుసు, అతడితో ఉండే వారి పేర్లూ తెలుసు. దురదృష్టవశాత్తూ ఇటువంటి విషయాలను ఇరాన్ ప్రజలకు ప్రభుత్వం తెలియనివ్వడం లేదు. ఆ కొత్త కమాండర్ పేరు తెలిస్తే దయచేసి చెప్పండి’అని కోరింది. దీనికి 2,300 మంది స్పందించారు. ఖమేనీ కుమారుడు మొజ్తబా ఖమేనీ తదితర పేర్లను కొందరు ఊహించి చెప్పగా మరికొందరు మాత్రం తిట్టిపోశారు. తీవ్ర హెచ్చరికలు చేశారు. ఇరాన్ సోషల్ మీడియా యూజర్ బెహ్నమ్ గొలిపౌర్ మాత్రం కొత్త కమాండర్ పేరు అలీ అబ్దొల్లాహి అలియాబాది అంటూ కరెక్ట్‌గా గెస్ చేశారు. అతడి పేరును ప్రకటించిన మొస్సాద్ అకౌంట్..వ్యక్తిగతంగా తమను కలిసి, బహుమతి అందుకోవాలని కోరింది. -
చిక్కడు.. దొరకడు!
ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధం నానాటికీ తీవ్రరూపం దాలుస్తోంది. దాడులు, ప్రతిదాడులకు పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ యుద్ధంలోకి అమెరికా సైతం అడుగుపెట్టడం అగి్నకి ఆజ్యం పోసినట్లయ్యింది. ఇజ్రాయెల్‌తోపాటు అమెరికాపై కత్తులు నూరుతున్న అసలు కథానాయకుడు, ఇరాన్ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ఇప్పుడు ఎక్కడున్నారు? అనేది టాప్ సీక్రెట్‌గా మారింది. దశాబ్దాలుగా ఇరాన్‌ను మకుటం లేని మహారాజులా ఏలుతున్న 86 ఏళ్ల ఖమేనీ కోసం ఇజ్రాయెల్ నిఘా వర్గాలు వేట సాగిస్తున్నాయి. ఆయనకు విదేశాల్లోనే కాదు, సొంత దేశంలోనూ శత్రువులున్నారు. ఖమేనీ ఆచూకీ దొరికితే సజీవంగా బంధించి, చట్టప్రకారం శిక్షించడమో లేక అక్కడికక్కడే అంతం చేయడమో తథ్యమని పశ్చిమ దేశాల మీడియా అంచనా వేస్తోంది. ఇరాన్లో తమ కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ప్రతిష్టించాలంటే ఆయన ప్రాణాలతో ఉండడానికి వీల్లేదని ఇజ్రాయెల్, అమెరికా నిర్ణయానికి వచి్చనట్లు తెలుస్తోంది. ఖమేనీ భౌతికంగా లేకుండాపోతేనే ఈ యుద్ధం ముగస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేయడం గమనార్హం. ‘‘ఖమేనీ ఆధునిక హిట్లర్. అతడు బతికి ఉండడానికి వీల్లేదు’’ అని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి కట్జ్ సైతం అన్నారు. చావుకు భయపడే మనిషి కాదు ఇరాన్లో ఈ నెల 12న ఇజ్రాయెల్ సైన్యం హఠాత్తుగా దాడికి దిగింది. ఆ వెంటనే ఖమేనీ ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. గుర్తుతెలియని ప్రాంతంలో అత్యంత పటిష్టమైన భద్రత కలిగిన బంకర్లో ఆయన క్షేమంగా ఉన్నట్లు ఇరాన్ అధికార వర్గాలు చెబుతున్నాయి. సుశిక్షితులైన బాడీగార్డులు ఆయనకు రక్షణ కల్పిస్తున్నట్లు పేర్కొంటున్నాయి. ఖమేనీ కచి్చతంగా ఎక్కడున్నారో ఎవరికీ తెలియకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్జీసీ) అత్యున్నత స్థాయి అధికారులకు సైతం ఖమేనీ ఆచూకీ గురించి తెలియదని అంటున్నారు. ఇజ్రాయెల్ నిఘా వర్గాలకు ఏమాత్రం ఉప్పందకుండా ఇరాన్ సర్కారు అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఖమేనీని కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. ఉన్నత శ్రేణి భద్రతా దళం నిరంతరం ఆయనకు కాపలా కాస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఖమేనీ ప్రాణాలకు ఎవరూ హానీ తలపెట్టే అవకాశం లేకుండా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఖమేనీ చావుకు భయపడే మనిషి కాదని, ఇరాన్ భవిష్యత్తు కోసం ఆయన ప్రాణాలతో ఉండడం అవసరమని అన్నారు. అమెరికా దాడుల తర్వాత బంకర్లోకి.. సాధారణ పరిస్థితుల్లో ఖమేనీ సెంట్రల్ టెహ్రాన్‌లోని ఓ కాంపౌండ్‌లో ఉంటారు. అక్కడి నుంచి విధులు నిర్వర్తిస్తారు. మిలటరీ కమాండర్లు, అధికారులతో ప్రతివారం సమావేశమవుతారు. ప్రజలతో మాట్లాడాలన్నా ఇక్కడే. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లరు. ఇజ్రాయెల్ దాడులు మొదలైన వెంటనే ఖమేనీ బంకర్లోకి వెళ్లలేదని సమాచారం. బయటే ఉంటూ ప్రతిదాడికి వ్యూహాలు రచించినట్లు తెలుస్తోంది. ఈ నెల 21న అమెరికా సైన్యం యుద్ధరంగంలోకి అడుగుపెట్టిన తర్వాతే ఆయన బంకర్లోకి చేరుకున్నారు. మూడు ప్రధాన అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామం తర్వాత ఖమేనీ మరింత అప్రమత్తమయ్యారు. తన విశ్వాసపాత్రులైన అనుచరులు, సహాయకులతోనూ కమ్యూనికేషన్ తగ్గించుకున్నారు. ఫోన్లు ఉపయోగించడం ఆపేశారు. ఎలక్ట్రానిక్ పరికరాలకు దూరంగా ఉంటున్నారు. శత్రువులకు తన ఆచూకీ చిక్కకుండా ఉండడానికే ఈ జాగ్రత్త. శత్రువుల చేతికి చిక్కితే మరణాన్ని చేతులారా ఆహ్వానించినట్లేనని ఖమేనీని బాగా తెలుసు. ఆయనను ఖతం చేయడానికి ఇజ్రాయెల్ ఇప్పటిదాకా చేయని ప్రయత్నమే లేదు. ఇజ్రాయెల్ ప్రత్యేక ఆపరేషన్ల ద్వారా ఎంతోమందిని హత్య చేసింది. కొద్ది రోజుల క్రితమే పేజర్ బాంబులతో హెజ్»ొల్లా నాయకులను మట్టుబెట్టింది. ఖమేనీని మాత్రం కనీసం టచ్ చేయలేకపోయిందంటే ఆయన ఎంత సురక్షితంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ‘‘ఏదో ఒకరోజు ఇజ్రాయెల్ నన్ను చంపేయడం ఖాయం. దేశం కోసం వీరమరణం పొందడం నాకు సంతోషమే’’ అని కొన్నేళ్ల క్రితం ఖమేనీ వ్యాఖ్యానించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అయతొల్లా ఖమేనీ (ఇరాన్ సుప్రీం) రాయని డైరీ
అహంకారం మంచి విషయం. కానీ, ఎవరు అహంకరిస్తున్నారు అనే దానిని బట్టి అది మంచి విషయం అవునా కాదా అనేది ఉంటుంది! అహంకారం, జాతి రక్షకుడికి దేవుని అనుజ్ఞ. అదే అహంకారం, జాతులను తుడిచి పెట్టేందుకు సైతాను ఆజ్ఞ. ‘‘ఖమేనీ ఎక్కడున్నాడో మాకు తెలుసు. అతడిని కాపాడటం కూడా మా చేతుల్లోనే ఉంది...’’ అంటోంది అమెరికా! ఎంత అహంకారం?! ఎవర్ని ఎవరు కాపాడతారన్నది యుద్ధం చేతుల్లో ఉంటుందా? సర్వశక్తి సంపన్నుడైన అల్లాహ్ తలంపులో ఉంటుందా? ఎవరి దారిన వాళ్లుండేవాళ్లను నొప్పించే పనులే జరిగాయి ఈ లోకంలో ఇంతవరకు! ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ముస్లిం ప్రపంచం ప్రతి దేశంలోనూ గాయపడి ఉంది. ముస్లిములను షియాలుగా, సున్నీలుగా; ముస్లింలను అరబ్బులుగా, అరబ్బులు కానివారిగా వేరు చేసి, ఐక్యతను చెడగొట్టి యావత్ ముస్లిం జాతినే తుడిచిపెట్టేందుకు అగ్రరాజ్య సైతాన్, జెరూసలేంలో తిష్ఠవేసుకుని ఉన్న ‘జియోనిస్టు పిల్ల సైతాను’తో కలిసి ముస్లిం దేశాల మీదమీదకు వస్తోంది.పాలస్తీనా, లెబనాన్, యెమెన్, సిరియాలలో ఇరాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తోందనీ, ఆ ఉగ్రవాదుల నుంచి ప్రపంచాన్ని రక్షించే బాధ్యతను తన మీద వేసుకున్నాననీ అమెరికా చెబుతోంది! అసలు ఎవరి నుండి రక్షించుకోవడానికి ఇరాన్ ఈ ‘ఉగ్రవాద’ కవచాలను ఏర్పరచు కోవలసి వచ్చిందో, ముందు అది చెప్పాలి అమెరికా. అంతకన్నా ముందు, ‘ఉగ్రవాదులు’ అనటం మాని ‘ధర్మయుద్ధ సైనికులు’ అనటం అమెరికా నేర్చుకోవాలి.ఖమేనీ ఆధునిక హిట్లర్ అంటోంది జియోనిస్ట్ పిల్ల సైతాన్ ! తన పెదనాన్న పెద్ద సైతాన్ ను మించిన హిట్లర్ ఎవరున్నారు? గ్వాంటనామో, అబుగ్రై»Œ జైళ్లలో అమెరికా చేసిన నేరాలెన్ని! అక్కడి ఖైదీలకు చూపిన నరకాలెన్ని? స్వతంత్రంగా ఉన్న ఏ దేశాన్ని చూసినా బుసకొట్టకుండా ఉందా ఈ పెద్ద సైతాన్ ?! సిరియా అంతర్యుద్ధం మొదలైందీ, అంతం కాకుండా ఉన్నదీ ఎవరి వల్ల? ఈ రెండు సైతాన్ల వల్లనే కదా!‘‘తగాదా తీర్చటానికి తాను సిద్ధంగా ఉన్నాను’’ అని రష్యా అంటోంది! మిత్రులైన వాళ్లు కూడా సర్దుబాటు చేయటానికే చూస్తారేమిటి?! రష్యా పూర్తిగా ఇరాన్ వైపు ఉండలేదా, బహిరంగంగా. అయినా, దేవుడితో సైతాను తగాదా పడుతున్నప్పుడు అది దేవుడికి, సైతానుకు మధ్య తగాదా ఎలా అవుతుంది? సైతానును కదా రష్యా హెచ్చరించాలి, ‘‘నువ్వు నోరు తెరవకు. దేవుడితో ఘర్షణ పడితే నెత్తిపై ఒక్కటి పడుతుంది...’’ అని!పిల్ల సైతాను తల పైన కర్రతో కొట్టకుండా ఇరాన్ కు నచ్చచెబుతాననీ, ఆత్మరక్షణకు తప్ప మరి దేనికీ కర్రలను దగ్గర పెట్టుకోకుండా ఇరాన్ ను ఒప్పిస్తాననీ రష్యా అనటం మధ్యవర్తిత్వం అవుతుంది కానీ, స్నేహం అవుతుందా? చైనా రహస్యంగా కొన్ని ఆయుధాలు పంపింది. ఒకరికి సహాయం చేస్తే తెలియకూడదని అంటారు. స్నేహం కూడా ఎవరికీ తెలియకుండా చేయాలా? ఏమైనా, ఇరాన్ ఒంటరి పోరాటమే చేయాలి. వికారమైన ఆ పిల్ల సైతాన్ ని ఈ భూమి మీద లేకుండా చేసేంతవరకు అన్ని ఇస్లాం దేశాల తరపున, అల్లాహ్ పేరిట ఇరాన్ పోరాటం చేస్తూనే ఉంటుంది. ఆఖరి ఆయుధం వరకు, ఆఖరి ఆయుధం తర్వాత కూడా!బంకర్‌కు దగ్గర్లో భూమి బద్దలైనట్లుగా పెద్ద చప్పుడు! అమెరికా తన దుర్మార్గమైన యుద్ధాన్ని మొదలు పెట్టినట్లే ఉంది! సర్వజ్ఞుడైన అల్లాహ్‌కు సత్యమేమిటో తెలుసు. నా ప్రియమైన ఇరాన్‌కు అల్లాహ్ రక్షణ తప్పక ఉంటుంది.ఆయన ఇరాన్ చేయి విడువడు. నా ఆత్మ ఇరాన్ ను వీడదు. -
మహిళలపై నాడు అభ్యంతరకర పోస్టులు.. చిక్కుల్లో ఇరాన్ సుప్రీం
టెహ్రాన్: ఇజ్రాయెల్-ఇరాన్‌ల మధ్య ఘర్షణలు ఉధృతంగా కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి సంబంధించిన పాత వివాదాస్పద పోస్టులు మరోమారు వైరల్‌గా మారాయి. మహిళల గురించి, ఉదారవాదంపై ఆయన చేసిన చేసిన పోస్టులు తిరిగి ఇంటర్నెట్లో ప్రత్యక్షమయ్యాయి. ఈ పోస్ట్‌లలో ఖమేనీ మహిళల హక్కులపై స్పందించడమే కాకుండా, కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. Man has a responsibility to understand #woman’s needs and feelings and must not be neglectful toward her #emotional state— Khamenei.ir (@khamenei_ir) September 15, 2013ఈ పోస్టులలో కొన్ని దశాబ్దకాలం క్రితం నాటివి. ఇవి ఆయన వైఖరిని తెలియజేస్తున్నాయి. సోషల్ మీడియా యూజర్స్ ఈ పోస్ట్‌లను చూసి కంగుతింటున్నారు. మహిళలను ఉద్దేశించిన ఆయన చేసిన పోస్ట్‌లలో కొన్ని లైంగిక వాంఛల పరమైనవి ఉన్నాయి. మరికొన్ని ప్రేమను పెంపొందించే సలహాలతో కూడినవై ఉన్నాయి.‘పురుషుడు.. స్త్రీ అవసరాలను, భావాలను అర్థం చేసుకునే బాధ్యతను కలిగి ఉండాలి. ఆమె భావోద్వేగ స్థితి విషయంలో పురుషుడు నిర్లక్ష్యంగా ఉండకూడదు’ అని ఖమేనీ ఒక పోస్టులో పేర్కొన్నారు.Women are stronger than men. Women can completely control and influence men with their wisdom and delicacy. May 11, 2013— Khamenei.ir (@khamenei_ir) March 7, 20182013 నాటి ఒక పోస్ట్‌లో ఖమేనీ తన పాఠశాల రోజులను గుర్తుచేసుకున్నారు. ‘నేను మొదటి రోజున ప్రత్యేకమైన దుస్తులతో పాఠశాలకు వెళ్లాను. అయితే వాటిని ఇతర పిల్లల ముందు ధరించడం అసౌకర్యంగా అనిపించింది. కానీ సరదాగా ఉండటం ద్వారా ఆ పరిస్థితిని అధిగమించాను’ అని ఆయన రాశారు. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ రాసిన పుస్తకం తాను చదవడంపై కూడా ఖమేనీ వ్యాఖ్యానించారు. నెహ్రూ రాసిన ‘గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ’ని అధ్యయనం చేయముందు నాకు భారతదేశం గురించి తెలియదు.ఈ వలసరాజ్యం పలు ఎత్తుపల్లాలను చూసింది’ అని రాశారు.I went 2school w/a cloak since1st days;it was uncomfortable 2wear it in front f other kids,but I tried 2make up 4it by being naughty&playful— Khamenei.ir (@khamenei_ir) September 24, 2013ఖమేనీ ఈ తరహా వ్యాఖ్యలపై సోషల్ మీడియా యూజర్స్ స్పందించారు. ఒక యూజర్..‘క్షమించండి, అయతుల్లా ఖమేనీ.. మీ గేమ్‌ల గురించి నాకు తెలియదు’ అని అన్నారు. మరొక యూజర్ ‘ప్రేమికునిగా పుట్టి, సుప్రీం నేతగా ఉండవలసి వచ్చింది’ అని అన్నారు. Before studying "Glimpses of World History" by Mr. #Nehru I didn't know #India before colonization had undergone so many important #advances— Khamenei.ir (@khamenei_ir) August 6, 2013 ఇంకొకరు ‘పాత ట్వీట్లు మళ్లీ తెరపైకి వచ్చినా, వాటిని తొలగించని మొదటి వ్యక్తి అయతుల్లా ఖమేనీ’ అని అన్నారు. ఇజ్రాయెల్, యూఎస్‌లు ఒత్తిడిని పెంచుతున్నప్పటికీ, తాను లొంగిపోయేది లేదని ఖమేనీ స్పష్టం చేసిన తరుణంలో ఈ పోస్టులు వైరల్‌గా మారాయి.ఇది కూడా చదవండి: ట్రంప్-మునీర్ భేటీపై ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు -
ఖమేనీ అంతంతోనే యుద్ధం ముగింపు: నెతన్యాహు
జరూసలెం: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ సుప్రీం నేత ఆయతుల్లా అలీ ఖమేనీని అంతం చేస్తేనే యుద్ధం ముగుస్తుందని స్పష్టం చేశారు. ఖమేనీని హత్య చేసేందుకు వేసిన ప్లాన్‌ను ట్రంప్ వ్యతిరేకించారంటూ అమెరికా అధికారులు ధ్రువీకరించిన అనంతరం నెతన్యాహు ఈ వ్యాఖ్యలు చేశారు.ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న పరస్పర దాడులతో పశ్చిమాసియాలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు దేశాలూ క్షిపణులు, డ్రోన్లతో పరస్పరం విరుచుకుపడుతున్నాయి. ప్రపంచం ఈ ఘర్షణలను నిశితంగా గమనిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇరాన్ సుప్రీం నేత ఆయతుల్లా అలీ ఖమేనీని అంతం చేస్తేనే యుద్ధం ముగుస్తుందంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇజ్రాయేల్-ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం నాల్గవ రోజుకు చేరుకుంది. పౌరులను లక్ష్యంగా చేసుకుంటూ దాడులు జరుగుతున్నాయని విశ్లేషకులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపధ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్ ప్రభుత్వాలు తమ దేశ పౌరులు అప్రమత్తంగా మెలగాలని హెచ్చరికలు జారీ చేశాయి.కాగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులను ఒక రహస్య బంకర్‌కు తరలించారని సమాచారం. ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్జీసీ)ఆయనకు భద్రత కల్పిస్తున్నది. అయతుల్లా సురక్షితంగా ఉన్నారని, దేశపు రక్షణ చర్యలను అనుక్షణం పరిశీలిస్తూ, తగిన ఆదేశాలు జారీ చేస్తున్నారని అధికారులు తెలిపారు. కాగా ఖమేనీ హత్యకు ఇజ్రాయెల్ ప్లాన్‌ను ట్రంప్ వ్యతిరేకించారంటూ రాయిటర్స్ పేర్కొంది.ఇది కూడా చదవండి: బైక్‌పై యువజంట వికృత చేష్టలు.. రూ. 53,500 జరిమానా -
ప్చ్.. ఖమేనీ వారసుడికి పగ్గాలు కష్టమే!
పశ్చిమాసియా ఉద్రిక్తతలు కొనసాగున్న వేళ.. మరోవైపు ఇరాన్ సుప్రీం అయాతుల్లా అలీ ఖమేనీ ఆరోగ్యం క్షీణించిందని, ఆయన కోమాలోకి కూడా వెళ్లారని, ఆయన వారసుడు మోజ్తాబా ఖమేనీ తదుపరి సుప్రీంగా బాధ్యతలు స్వీకరిస్తారని ప్రచారం తీవ్రతరమైంది. అయితే ఈ విషయంలో ఇప్పుడు ట్విస్ట్ చోటు చేసుకుంది.తాను ఆరోగ్యంగానే ఉన్నానంటూ సంకేతాలిస్తూ.. ఖమేనీ తాజాగా ఓ ఫొటో రిలీజ్ చేశారు. లెబనాన్ ఉన్న ఇరాన్ రాయబారి ముజ్తబా అమనిని కలుసుకున్నట్లు తన ఎక్స్ ఖాతాలో ఖమేనీ పోస్ట్ చేశారు. ఇటీవల లెబనాన్‌లో ఇజ్రాయెల్ జరిపిన పేజర్ దాడుల్లో ముజ్తబా అమని కూడా గాయపడ్డారు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఖమేనీ ఆరా తీసినట్లు సమాచారం.ఇక.. ఖమేనీ ఆరోగ్యం విషమించిందని, కోమాలోకి వెళ్లారని, ఆయన కుమారుడు మోజ్తాబా ఖమేనీ త్వరలోనే బాధ్యతలు స్వీకరిస్తారని.. ఇరాన్ ఇంటర్నేషనల్ కథనం వెలువడడం తీవ్ర చర్చనీయాంశమైంది. సెప్టెంబర్ 20వ తేదీన 60 మంది ఇరాన్ అసెంబ్లీ నిపుణులతో ఒక తీర్మానం కూడా ఖమేనీ చేయించాడన్నది ఆ కథనం సారాంశం. అయితే..ఆ తీర్మానాన్ని.. ఓటింగ్‌ను చాలామంది వ్యతిరేకించారని కూడా అదే కథనం పేర్కొంది. ఈ కథనం ఆధారంగా రకరకాల కథనాలు వండి వార్చాయి మిగతా మీడియా సంస్థలు. కానీ, ఖమేనీ తాజా పోస్టుతో మోజ్తాబాకు ఇరాన్ సుప్రీం పగ్గాలు ఇప్పట్లో పగ్గాలు అప్పజెప్పకపోవచ్చనే స్పష్టత వచ్చింది. ఇదే కాదు.. మెజ్తాబాకు ఆటంకాలు కూడా ఉన్నాయి. అయతొల్లా అలీకి ఆరుగరు సంతానం. మోజ్తాబా.. రెండో కొడుకు. 1969లో మషాబాద్లో పుట్టాడు. తన తండ్రి బాటలో నడుస్తూ.. మత పెద్దగా మారాడు. అలాగే 2005, 2009 ఇరాన్ ఎన్నికల్లో మహమూద్ అహ్మదీనెజాద్‌కు మద్దతు ఇచ్చి.. అతని విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాదు.. ఇరాన్ రిచ్చెస్ట్ మ్యాన్‌గానూ మోజ్తాబాకు పేరుంది.ఇరాన్ జీడీపీ 388 బిలియన్ డాలర్లు కాగా, ఖమేనీ కుటుంబం ఆస్తుల విలువ 200 బిలియన్ డాలర్లుగా ఉందని.. ఇందులో 90 బిలియన్ డాలర్లు మోజ్తాబా పేరిటే ఉందని అమెరికా నివేదికలు వెల్లడించాయి. అయితే.. ఇరాన్ రాజకీయాల్లో జోక్యం ద్వారా అలీపై విమర్శలే ఎక్కువగా ఉన్నాయి. 2009లో అహ్మదీనెజాద్ తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక.. చెలరేగిన నిరసనల అణచివేత మోజ్తాబా ఆధ్వర్యంలోనే కొనసాగింది. అయితే తర్వాతి కాలంలో ఈ ఇద్దరి మధ్య సంబంధాలు చెడాయి. ఈ క్రమంలో.. ప్రభుత్వ ఖజానా సొమ్మును దుర్వినియోగం చేశాడంటూ మోజ్తాబాపై అహ్మదీనెజాద్ సంచలన ఆరోపణలు చేశాడు. దీంతో ఇరాన్ అసెంబ్లీ నిపుణులు మెజ్తాబాకు ఇరాన్ సుప్రీం బాధ్యతలు వెళ్లనివ్వకుండా అడ్డుకునే అవకాశం లేకపోలేదు. అయతొల్లా వారసుడిగా సిద్ధాంతాలను పుణికి పుచ్చుకున్నప్పటికీ.. సుప్రీం కుర్చీ మాత్రం మెజ్తాబాకు చాలా దూరంగానే ఉందన్నది పలువురి వాదన.