స్ట్రాంగెస్ట్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌ ఆమె..! ఏకంగా పదిమంది మగవాళ్లను.. | German Athlete Sina Ruppenthal Creates Guinness World Record By Lifting And Throwing 10 Men In 37 Seconds | Sakshi
Sakshi News home page

స్ట్రాంగెస్ట్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌ ఆమె..! ఏకంగా పదిమంది మగవాళ్లను..

Mar 17 2026 12:45 PM | Updated on Mar 17 2026 4:31 PM

Woman Creates Guinness World Record By Lifting And Throwing 10 Men

ఓ మహిళ ఎంత శక్తి స్వరూపిణి అని చెప్పే ఘటన ఇది. అందరు నిర్ఘాంతపోయేలా మగవాళ్లను చిటికెలో ఎత్తిపడేసింది. నిజానికి ఆమె శారీరక బలం, ఓర్పుకి సలాం అనాల్సిందే. అంతలా సులభంగా మగవాళ్లను ఎత్తిపడేసి గిన్నిస్‌ రికార్డు సృష్టించిందామె. ఎవరా ఆ మహిళ అంటే..

సినా రుప్పెంతాల్ అనే అథ్లెట్‌  ఈ ఘనతను సృష్టించింది. ఒక మహిళ ఎంత బలవంతురాలు అనేది చెప్పకనే చెప్పింది తన అసాధారణమైన సాహసంతో కేవలం 37.44 సెకన్లలో సుమారు 10 మంది పురుషులను ఎత్తి విసిరి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డుని నెలకొల్పింది. 

ఈ క్రీడాకారిణి తన అసాధారణమైన శక్తి, వేగం, సామర్థ్యాన్ని ప్రదర్శించింది. ఈ ఛాలెంజ్‌లో ఆ మహిళ ప్రతి ఒక్కర్ని ఎత్తి వారిని తన భుజంపై నుంచి వేగంగా ఒకరి తర్వాత ఒకరిని నిర్ధిష్ట సమయంలో విసిరి పూర్తి చేస్తింది. ఇక్కడ శారీరక బలం తోపాటు కచ్చితమైన సమన్వయం, ఓర్పు అవసరం. ఇక్కడ ఆమె ప్రతి ఒక్కరిని చాలా సురక్షితంగా ఎత్తి నియంత్రిత కదలికలతో విసిరింది. ఆమె అలా అలవోకగా అంతమంది మగవాళ్లను ఎత్తిపడేస్తున్న విధానం చూసి ప్రేక్షకులు సైతం విస్తుపోయారు. 

ఈ రికార్డు వాస్తవానికి  ఆగష్టు 2025లో మ్యూనిచ్‌లో జరిగిన 'డై గ్రోస్సే షో డెర్ వెల్ట్‌రికోర్డే' అనే టీవీ కార్యక్రమంలో నెలకొల్పింది సినా రుప్పెంతాల్. ఈ ఛాలెంజ్‌ సాంప్రదాయ స్ట్రాంగ్‌మ్యాన్‌ ఈవెంట్‌లను పోలి ఉంటుంది. అయితే ఇక్కడ అథ్లెట్లు బరువైన రాళ్లను ఎత్తడం, వాహనాలను లాగడం, భారీ బరువులను మోయడం, వంటి విన్యాసాలతో తమ బలాన్ని ప్రదర్శిస్తారు. కానీ సినా రుప్పెంతాల్ రికార్డు మాత్రం అత్యంత విలక్షణమైన రికార్డుగా వార్తల్లో నిలిచింది. 

ఎవరీ సినా రుప్పెంతాల్
సినా రుప్పెంతాల్ ఒక జర్మన్ స్ట్రాంగ్‌వుమన్. ఆమె ఉన్నత స్థాయి అథ్లెట్, స్పోర్ట్స్ సైంటిస్ట్. ఆమె ప్రపంచంలో నాల్గవ అత్యంత బలవంతురాలైన సహజ మహిళగా ర్యాంక్ పొందింది. అంతేగాదు స్ట్రెంత్ స్పోర్ట్స్‌లో అనేక జర్మన్ రికార్డులను కలిగి ఉంది. 

సింపుల్‌గా చెప్పాలంటే రుప్పెంతాల్ STRONGESTకు బ్రాండ్ అంబాసిడర్‌గా అభివర్ణించొచ్చు. అంతేకాదండోయ్‌..ఆమె మహిళా స్ట్రెంత్ అథ్లెట్లకు ఒక వేదికను అందించడానికి అంకితమైన లాభాపేక్షలేని సంస్థ స్ట్రాంగ్‌వుమెన్ జర్మనీ వ్యవస్థాపక సభ్యురాలు కూడా.

 

(చదవండి: ఎల్పీజీ గ్యాస్‌ కొరత..ఆ స్టవ్‌లకు పెరుగుతున్న డిమాండ్‌)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement