ఆ ప్లంబర్‌ వేతనం ఏడాదికి రూ. 18 లక్షలా..! | Mumbai Plumbers Rs 18 Lakh Income Goes Viral | Sakshi
Sakshi News home page

ఆ ప్లంబర్‌ వేతనం ఏడాదికి రూ. 18 లక్షలా..!

Mar 17 2026 3:28 PM | Updated on Mar 17 2026 3:41 PM

Mumbai Plumbers Rs 18 Lakh Income Goes Viral

ఏఐ వచ్చేసింది ఇంకేముంది ఉద్యోగాలు ఉష్‌కాకి అంటూ మేధావులు, నిపుణులు పెద్ద ఎత్తున్న ఆందోళన వ్యక్తం చేశారు. కానీ ​నెట్టిట వైరల్‌ అవుతున్న ఈ విషయం గురించి తెలుసకున్నాక ఆ నిర్ణయం తప్పని ఒప్పుకుంటారు. ఎంత ఏఐ వచ్చినా..శ్రామిక జీవుల పనితనాన్ని ఎంతటి అత్యున్నత సాంకేతికత అయినా భర్తీ చేయలేదని తేటతెల్లమవుతుంది.

నెట్టింట 'ముంబైలో ఒక ప్లంబర్ రూ. 18 లక్షలు సంపాదిస్తున్నాడు' అనే క్యాప్షన్‌తో చేసిన పోస్ట్‌ అందర్నీ ఆలోచించేలా చేసింది. ఆ పోస్ట్‌ల ముంబై ప్లంబర్‌తో జరిగిన సంభాషణను షేర్‌ చేసుకున్నాడు. అతను తన టౌన్‌షిప్‌లోని సోసైటీలో ఒక ప్లంబర్‌తో మాటమంతి కలిపినట్లు తెలిపాడు. తాము చాలా విషయాలు మాట్లాడుకుంటూ..అతడి సంపాదన గురించి ఆరా తీశాడు. కాంట్రాక్టుల ద్వారా మొత్తం వార్షిక ఆదాయం రూ. 18 లక్షల దాక ఉంటుందని ప్లంబర్‌ చెప్పాడు. 

అయితే తాను తమాషాగా అంటున్నాడేమో అనుకున్నా..కానీ తర్వాత అతను సంపాదిస్తున్న మొత్త లెక్కించడంతో అప్పుడు అర్థమైంది. పైగా ఆ వ్యక్తికి హ్యుండాయ్ క్రెటా (2023 మోడల్) కారు ఉంది, ఇల్లు కూడా కట్టుకున్నాడట, ఓ పొలం కూడా కొన్నానని చెబుతున్నాడు. అతను రిచ్‌ ప్లంబర్‌ అని అప్పుడే నాకు తెలిసంది. అంటే తానెంతలా సంపాదించాలి అని ఆలోచిస్తు ఉండిపోయా అంటూ పోస్ట్‌లో రాసుకొచ్చాడు. 

ఈ పోస్ట్‌ని చూసి నెటిజన్లు సైతం ఏఐ బ్యూకాలర్‌ ఉద్యోగాలను అమాంత మిగిసింది అన్నది ఎవరూ అని ఒకరు, శారీరక శ్రమతో కూడిన ఉద్యోగాలకు ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది అని మరొకరు కామెంట్‌ చేస్తూ పోస్టులు పెట్టారు. 

(చదవండి: స్ట్రాంగెస్ట్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌ ఆమె..! ఏకంగా పదిమంది మగవాళ్లను..)
 

Advertisement
 
Advertisement
Advertisement